సాక్షి, హైదరాబాద్ : బాబ్రీ మసీదు–అయోధ్య వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు పై రాజ్యాంగం పరిధిలోనే మాట్లాడానని, కేసులకు భయపడేది లేదని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని దారుస్సలాంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజ్యాంగ బద్ధంగా అభిప్రాయం వ్యక్తం చేసే హక్కు తనకు ఉందని, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లను సంతోష పెట్టేలా మాట్లాడలేనని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ మాట్లాడే హక్కు ఉందని తేల్చి చెప్పారు. ‘నాపై ఎంత మాట్లాడుతారో మాట్లాడండి. అది మీ హక్కు. ఎంత అసహనం వెల్లగక్కుతారో వెల్లగక్కండి. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లకు భయపడేది లేదు’అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment