Wanaparthy District Latest News
-
ఇంటింటికి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్
వనపర్తి: మహాత్మాగాంధీ అహింసావాదాన్ని, అంబేడ్కర్ ఆశయ సాధన, రాజ్యాంగ పీఠికను పరిరక్షించుకునే అవసరం ఎంతైనా ఉందని భావించి కాంగ్రెస్‌పార్టీ చేపట్టిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం గడప గడపకు తీసుకెళ్లి ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో నిర్వహించిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పార్లమెంట్ సాక్షిగా జై భీమ్ పదాన్ని అవమానపరుస్తూ బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ, రాజ్యాంగాన్ని కాపాడాలని భావించి కాంగ్రెస్‌పార్టీ అది నాయకత్వం జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి తీసుకు వెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. సామాజిక మాధ్యమం వేదికగా కాంగ్రెస్‌పార్టీపై విష ప్రచారం చేసే వారికి బుద్ధి చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని ఇంటింటికి చేరవేయాలని సూచించారు. నియోజకవర్గంలో ఒకేరోజు రూ.వెయ్యి కోట్ల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టామని.. మరికొద్ది రోజుల్లో మరో రూ.వెయ్యి కోట్ల అభివృద్ధి పనులు తీసుకురాబోతున్నామని చెప్పారు. అంతకుముందు రాజీవ్‌గాంధీ చౌరస్తా మీదుగా అంబేడ్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి కేశం నాగరాజుగౌడ్, జాన్, మహ్మద్ నసీర్, సంజీవ్, గౌరీ సతీష్, డీసీసీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, పెబ్బేరు మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమోదినిరెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షులు చీర్ల విజయచందర్, పీసీసీ సభ్యుడు శంకర్‌ప్రసాద్, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు కోట్ల రవి తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం కేటాయింపుపై టాస్క్‌ఫోర్స్ విచారణ
వనపర్తి: నిబంధనలకు విరుద్ధంగా బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న రైస్‌మిల్లుకు అధికారులు ధాన్యం కేటాయించారంటూ ఈ నెల 24న ‘సాక్షి’ దినపత్రికలో ‘అధికారుల లీలలు..’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఇందుకు టాస్క్‌ఫోర్స్ అధికారులు స్పందించి సోమ, మంగళవారం జిల్లాకేంద్రంలోని డీఎస్ఓ కార్యాలయం, పెబ్బేరులో పర్యటించారు. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి పెబ్బేరు మండలం తోమాలపల్లి శివారులో ఉన్న ఓ బాయిల్ట్ మిల్కు ధాన్యం కేటాయింపు, కేటాయించిన ధాన్యాన్ని పక్కనే ఉన్న జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం ఎర్రవల్లి శివారులో ఉన్న ఓ గోదాంలో నిల్వ చేయడంపై సమగ్ర విచారణ చేపట్టారు. డీఎస్ఓ బ్లాక్ లిస్ట్‌లో ఉంచాలని సిఫారస్ చేసిన మిల్లర్‌కు డీఎం పౌరసరఫరాలశాఖ కార్పొరేషన్ ఏ అధికారంతో ధాన్యం కేటాయించేందుకు దస్త్రం సిద్ధం చేస్తారనే కోణంలో విచారణ చేసినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో మరో అధికారి, మిల్లు యజమాని కీలకపాత్ర పోషిస్తున్నట్లు టాస్క్‌ఫోర్స్ అఽధికారుల విచారణలో తేలినట్లు చర్చ జరుగుతోంది. ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం -
రిజర్వాయర్‌కు గ్రీన్‌సిగ్నల్.. అంతలోనే..
రిజర్వాయర్లు నిర్మిస్తే తప్ప పూర్తిస్థాయిలో ఆయకట్టుకు నీరందే పరిస్థితి లేదని ఆర్డీఎస్ ఆయకట్టు రైతులు మొరపెట్టుకున్నారు. స్పందించిన కాంగ్రెస్ ప్రభుత్వం మూడు రిజర్వాయర్లలో రూ.520 కోట్ల వ్యయంతో 1.2 టీఎంసీల సామర్థ్యంతో మల్లమ్మకుంట నిర్మాణానికి మాత్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తుమ్మిళ్ల లిఫ్ట్‌లో కీలకమైన ఈ రిజర్వాయర్ నిర్మాణానికి అధికారులు చేపట్టిన భూసర్వేకు అడుగడుగునా అడ్డంకులు ఎదురయ్యాయి. మొత్తం 567 ఎకరాలు అవసరమని అధికారులు నివేదికలు రూ పొందించారు. పెగ్ మార్కింగ్ పనులు నిర్వహిస్తున్న క్రమంలో రైతులు అడ్డుకున్నారు. పూర్తి నష్టపరిహారం ఇచ్చి.. న్యాయం చేశాకే పనులు మొదలుపెట్టాలని ఆందోళనలకు దిగారు. ● ఈ నేపథ్యంలో నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లురవి కలెక్టర్‌కు లేఖ రాయడం ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మాణం వల్ల 250 మంది దళిత రైతులు భూములు కోల్పోతారని.. దాన్ని రద్దు చేయాలని ఆయన గద్వాల కలెక్టర్ బీఎం సంతోష్‌కు లేఖ రాయడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చినట్లయింది. ఈ మేరకు ఆయన నీటిపారుదల శాఖ ఎస్ఈకి లేఖ రాయడం.. ఆ అధికారి పైఅధికారికి నివేదికలు సమర్పించడం.. కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించడం హాట్‌టాపిక్‌గా మారింది. మల్లమ్మకుంట రిజర్వాయర్‌పై నీలినీడలు కమ్ముకోగా.. ఆయకట్టు రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. -
నేడు మంత్రి పొంగులేటి రాక
వనపర్తి: రాష్ట్ర రెవెన్యూ, సమాచార, పౌరసంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బుధవారం జిల్లా పర్యటనకు వస్తున్నారని.. విజయవంతం చేసేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్ సమీపంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్, మంత్రి పర్యటించే ప్రాంతాలను పరిశీలించిన అనంతరం తన చాంబర్లో అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో నిర్మించిన పీజీ విద్యార్థుల వసతి భవనం, అధ్యాపకుల భవనం, ఎంపీడీఓ కార్యాలయ సముదాయ ప్రాంగణంలో నిర్మించిన నమూనా ఇందిరమ్మ ఇంటిని ప్రారంభిస్తారని చెప్పారు. అక్కడే రేవల్లి, ఏదుల, శ్రీరంగాపూర్ తహసీల్దార్ కార్యాలయ భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన చేయడంతో పాటు కేడీఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వెనుక భాగంలో ఆధునికీకరించిన బీసీ బాలుర కళాశాల వసతిగృహం, డా. బీఆర్ అంబేడ్కర్ చెరువు సుందరీకరణను ప్రారంభిస్తారని తెలిపారు. అనంతరం కల్యాణసాయి గార్డెన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించే భూ భారతి అవగాహన సదస్సు, మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీని చేపడుతారని వెల్లడించారు. ఆయా కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు సంబంధిత శాఖల అధికారులు బాధ్యతగా విధులు నిర్వర్తించాలని సూచించారు. సమావేశంలో ఇన్చార్జ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, రోడ్లు, భవనాలశాఖ కార్యనిర్వాహక ఇంజినీర్ దేశ్యానాయక్, ఆర్డీఓ సుబ్రమణ్యం, తహసీల్దార్ రమేశ్‌రెడ్డి, జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి ఇందిర, హౌసింగ్ పీడీ పర్వతాలు తదితరులు పాల్గొన్నారు. ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ ఆదర్శ్ సురభి పర్యటనను విజయవంతం చేయాలని అధికారులకు ఆదేశం -
నిబద్ధతతో పనిచేస్తే ఉత్తమ ఫలితాలు
వనపర్తిటౌన్: నిబద్ధత, అంకిత భావంతో పని చేసే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సంతోష్‌కుమార్ అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని డిపో ఆవరణలో మహబూబ్‌నగర్ రీజియన్ త్రైమాసిక ప్రగతి చక్రం అవార్డు (ఉత్తమ ఉద్యోగుల అభినందన) సభ నిర్వహించగా.. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రతిభ కనబర్చిన సిబ్బందికి ప్రగతి చక్రం అవార్డులు అందజేసి శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిభ చాటిన సిబ్బందిని సన్మానించడంతో మరింత ఉత్సాహంతో పని చేస్తారని, తోటి సిబ్బంది కూడా తాము కూడా గుర్తింపు పొందాలని కష్టపడి పని చేస్తారని, దీంతో సంస్థ అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ రీజనల్ మేనేజర్లు భవానీ ప్రసాద్, లక్ష్మీధర్మ, వనపర్తి డిపో మేనేజర్ వేణుగోపాల్, వివిధ డిపోల మేనేజర్లు, సూపర్వైజర్లు, ట్రాఫిక్, మెకానికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం వనపర్తి: షెడ్యూల్డ్ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం లిమిటెడ్, వనపర్తి ఆధ్వర్యంలో ఎస్సీ యువతకు మూడు నెలల పాటు ఉచిత వృత్తి శిక్షణకు ఎస్సీ కార్పొరేషన్, నేషనల్ అకాడమీ నిర్మాణ సంస్థ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకుడు మల్లికార్జున్ మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. ఎలక్ట్రికల్ హౌజ్ వైరింగ్‌కు 18 ఏళ్ల నుంచి 35 ఏళ్లలోపు వయసు ఉండి 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు, ప్లంబింగ్, ఫాల్సీలింగ్కు 45 ఏళ్లలోపు వయసు ఉండి 5వ తరగతి చదివినవారు, టైలరింగ్ కొరకు 45 ఏళ్లలోపు వయసు ఉండి 5వ తరగతి చదివిన మహిళలు అర్హులన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు మే నెల 14 వరకు దరఖాస్తులను జిల్లాకేంద్రంలోని పాత మున్సిపాలిటీ దగ్గర ఉన్న నేషనల్ అకాడమీ నిర్మాణ సంస్థ కార్యాలయంలో సమర్పించాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు సెల్‌నంబర్ 99853 75692 సంప్రదించాలని సూచించారు. బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యత వనపర్తిటౌన్: బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యతని, ప్రతి ఒక్కరూ నియంత్రణకు పాటుపడాలని ఆర్డీఎస్ స్వచ్ఛందసంస్థ అధ్యక్షురాలు చిన్నమ్మ థామస్ పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని చింతల హనుమాన్ ఆలయం, రావూస్ జూనియర్ కళాశాల ఎదురుగా ఉన్న మసీదులో బాల్య వివాహాల నిర్మూలన వాల్‌పోస్టర్లను ఆవిష్కరించి.. అర్చకులు, పాస్టర్లు, ముల్లాలకు అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించారు. బాల్య వివాహాలు చేయడం, అందుకు సహకరించడం చట్టరీత్యా నేరమన్నారు. కార్యక్రమంలో యాక్సిస్ టు జస్టిస్ వనపర్తి జిల్లా కో–ఆర్డినేటర్ ఎడ్విన్ థామస్, గద్వాల జిల్లా కో–ఆర్డినేటర్ కొమ్మ చంద్రశేఖర్, మహబూబ్‌నగర్ జిల్లా కో–ఆర్డినేటర్ విశ్వకాంత్, ఆర్డీఎస్ సీనియర్ సిబ్బంది శ్రీలక్ష్మి, హరికృష్ణ, కన్నన్ కుమార్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆయిల్‌పాం కష్టాలు తీరేనా!
నర్వ: దేశంలో నూనె గింజల ఉత్పత్తి తగ్గడం.. నూనెల వినియోగం గణనీయంగా పెరగడం వంటి కారణాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్‌పాం సాగును ప్రోత్సహిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఆయిల్‌పాం సాగుకు అనువైన నేలలు ఉండటంతో రైతులు ఆసక్తి చూపుతున్నారు. ప్రారంభంలో కాస్త వెనకబడినా.. ప్రభుత్వాలు అందిస్తున్న రాయితీలతో ఏటా సాగు విస్తీర్ణం పెరుగుతోంది. అయితే ఆయిల్‌పాం పరిశ్రమ లేకపోవడంతో పంట విక్రయానికి వ్యయ ప్రయాసలకు గురవుతున్నారు. ● 2020–21 సంవత్సరం ప్రారంభంలో ఉమ్మడి జిల్లా పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక కాగా.. 430 ఎకరాల్లో రైతులు ఆయిల్‌పాం సాగుకు శ్రీకారం చుట్టగా.. అధికారులు 4,60,000 మొక్కలను దిగుమతి చేసుకున్నారు. అప్పటి నుంచి క్రమంగా సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 28,999 ఎకరాల్లో ఆయిల్‌పాం సాగవుతోంది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. ఉమ్మడి జిల్లాలో ఆయిల్‌పాం పరిశ్రమ అందుబాటులో లేకపోవడంతో రైతులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు ఆయిల్‌పాం గెలలను తరలించాల్సి వస్తోంది. పంట కోతలు ప్రారంభం.. ఉమ్మడి జిల్లాలో పంట కోతలు ప్రారంభమయ్యాయి. నారాయణపేట జిల్లాలో 130 టన్నులు, వనపర్తిలో 600, గద్వాల జిల్లాలో 300, మహబూబ్‌నగర్ జిల్లాలో 260 టన్నుల దిగుబడి రాగా.. నాగర్‌కర్నూల్ జిల్లాలో ఇప్పడిప్పుడే పంట కోత ప్రారంభమైంది. ఈ ఏడాది ఆయిల్‌పాం ధర పెరిగింది. గతేడాది టన్ను రూ.11 వేల నుంచి రూ.14 వేల వరకు ఉండగా.. ప్రస్తుతం రూ.20 వేల నుంచి రూ. 21 వేల వరకు ధర పలుకుతోంది. ఏడాది పాటు కాపు కాస్తుండటంతో రైతులు గెలలను విక్రయించేందుకు అవస్థలు పడాల్సి వస్తోంది. అయితే ప్రతి 30 కి.మీ. ఒక సేకరణ కేంద్రం ఏర్పాటు చేస్తామని.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని అధికారులు చెబుతున్నారు. పరిశ్రమలు ఉంటేనే ప్రయోజనం.. పంట కోతలు ప్రారంభమైన నేపథ్యంలో కత్తిరించిన గెలలను గంటల వ్యవధిలోనే పరిశ్రమలో ప్రాసెసింగ్ చేస్తే ఎక్కువ స్థాయిలో నూనె వస్తుంది. జిల్లాలో తెంపిన గెలలను అశ్వారావుపేటకు తీసుకెళ్లేందుకు కనీసం ఒక రోజు సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో స్థానికంగానే పరిశ్రమలు అందుబాటులో ఉంటే ప్రయోజనం కలుగుతోందని రైతులు అంటున్నారు. కాగా.. ఇటీవల నారాయణపేట జిల్లాలో ఆయిల్‌ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి పర్యటించి.. రూ. 300 కోట్లతో ఆయిల్‌పాం పరిశ్రమను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. పరిశ్రమ ఏర్పాటుపై జాప్యం చేయవద్దని రైతులు కోరుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఆయిల్‌పాం కోతలు ప్రారంభం పంట విక్రయానికి అశ్వారావుపేటకు వెళ్లాల్సిందే.. ఉమ్మడి జిల్లాలో 28,999 ఎకరాల్లోపంట సాగు -
కొనుగోలు కేంద్రాల్లో వసతులు కల్పించాలి
మదనాపురం: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కనీస వసతులు కల్పించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆదేశించారు. మంగళవారం మండలంలోని అజ్జకొలులో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి గోదాములకు తరలించాలన్నారు. తాలు, మట్టి తొలగింపు విధానాన్ని రైతులకు వివరించాలని చెప్పారు. ధాన్యం రవాణాలో ఆలస్యం చేయవద్దని.. అలా చేస్తే బరువు తగ్గి రైతులు నష్టపోతారన్నారు. అనంతరం మండల కేంద్రంలో ధాన్యం నిల్వకు ఏర్పాటు చేసిన మార్కెట్ గోదామును పరిశీలించారు. ఆయన వెంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లెపాగ ప్రశాంత్, మాజీ సర్పంచ్ శేఖర్‌రెడ్డి, తహసీల్దార్ అబ్రహం లింకన్, మార్కెట్ వైస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, పాపయ్య గారి కృష్ణారెడ్డి, సాయిబాబా, ఏపీఎం తిరుపతిరెడ్డి తదితరులు ఉన్నారు. -
‘చిన్నోనిపల్లి’ లింక్‌కు నో..
ఈ వివాదం నడుస్తున్న క్రమంలో ఆర్డీఎస్ కెనాల్‌కు చిన్నోనిపల్లి రిజర్వాయర్‌కు లింక్ చేసే ప్రతిపాదనలను ఎంపీ తెరపైకి తీసుకొచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. కృష్ణానీటిపై ఆధారపడి గట్టు మండలంలో చిన్నోనిపల్లె రిజర్వాయర్ తెరపైకి వచ్చింది. తుంగభద్ర నీటి ఆధారంగా వడ్డేపల్లి మండలం తనగల సమీపంలో మల్లమ్మకుంట నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. తుంగభద్ర నదికి వరదలు వచ్చినప్పుడే కాకుండా వర్షపు నీటితో కూడా ఆధారపడి నిర్మించే ఈ రిజర్వాయర్‌లో నీరు నిల్వ చేసుకుంటే తమకు ప్రయోజనం ఉంటుందని అలంపూర్ నియోజకవర్గానికి చెందిన రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తుంగభద్ర నదిలో నీరు లేని సమయంలోనూ ఆర్డీఎస్ కెనాల్ ద్వారా వడ్డేపల్లి, మానవపాడు, ఉండవెళ్లి, అలంపూర్,రాజోళి మండలాల్లోని చివరి ఆయకట్టు భూములకు సాగు నీరందే అవకాశం ఉంటుందని.. చిన్నోనిపల్లి ద్వారా ఇది సాధ్యం కాదని.. తాము ఒప్పుకునేది లేదని చెబుతున్నారు. మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మిస్తే అలంపూర్ నియోజకవర్గంలోని 55 వేల ఎకరాల ఆయకట్టుకు, పదివేల ఎకరాల నాన్ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరందుతుంది. అలంపూర్ సస్యశ్యామలమవుతుంది. దీన్ని రద్దు చేయడం వల్ల కేవలం 400 ఎకరాల రైతులకు మాత్రమే మేలు జరుగుతుంది. మల్లమ్మకుంట రిజర్వాయర్ రద్దు మంచిది కాదు. నష్టపోతున్న రైతులకు మార్కెట్ ధర ప్రకారం ఎకరాకు రూ.25 లక్షలు చెల్లించాలి. సాటి రైతులు కూడా అడ్డుకునే పరిస్థితి ఉండదు. – సీతారామిరెడ్డి, ఆర్డీఎస్ మాజీ చైర్మన్, రిజర్వాయర్ రద్దు మంచిది కాదు.. -
మత్తు నిర్మూలన అందరి బాధ్యత
వనపర్తి: జిల్లాలో మత్తు పదార్థాల నిర్మూలన అందరి బాధ్యతని.. డ్రగ్స్, గంజాయి నియంత్రణపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మత్తు పదార్థాల నిర్మూలన అవగాహన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. మాదక ద్రవ్యాలు, డ్రగ్స్, గంజాయితో సమాజంలో యువశక్తి విచ్ఛిన్నమవుతుందని, దాడులు, నేరాలు పెరుగుతున్నాయన్నారు. దేశ సంపద, దేశ భవిష్యత్ యువతపై ఆధారపడి ఉందని.. విద్యార్థులు, యువతలో మార్పు రావాలని కోరారు. డ్రగ్స్ వినియోగంతో శరీరంలో శక్తి తగ్గుతుందని, మంచి భవిష్యత్‌ను కోల్పోతారని, సమాజంలో చెడు పేరు వస్తుందని వివరించారు. డ్రగ్స్ వినియోగం, రవాణా తీవ్రమైన నేరమని.. డ్రగ్స్‌కు అలవాటు పడిన వారి సమాచారమిస్తే కౌన్సెలింగ్ ఇచ్చి మార్పునకు కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యదర్శి శ్రీరాములు, జిల్లా వైద్యాధికారి, జిల్లా రెడ్‌క్రాస్ చైర్మన్ డా. డా. శ్రీనివాసులు, సీఐ కృష్ణ, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, రెడ్‌క్రాస్ వైస్ చైర్మన్ అమర్, పాలకవర్గ సభ్యులు, అహ్మద్, జిల్లా కో–ఆర్డినేటర్ ఆర్.రాజేందర్‌కుమార్, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ సూపర్వైజర్ మహేష్, సభ్యుడు గోవింద్ తదితరులు పాల్గొన్నారు. పోలీసు ప్రజావాణికి 9 వినతులు వనపర్తి: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఎస్పీ రావుల గిరిధర్ పాల్గొని ఫిర్యాదుదారుల నుంచి స్వయంగా వినతులు స్వీకరించారు. వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకొని చట్టప్రకారం పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా, ఎలాంటి పైరవీలు లేకుండా స్వచ్ఛందంగా పోలీసు సేవల్ని వినియోగించుకోవాలని సూచించారు. శాంతిభద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్‌శాఖ పని చేస్తుందని చెప్పారు. డ్రగ్స్, గంజాయి వినియోగంతో జీవితం నాశనం ఎస్పీ రావుల గిరిధర్ -
మోత మోగితే.. వేటు!
శబ్ద కాలుష్యం కలిగించే వాహనాలపై పోలీసుల కొరడా ●సామాన్యులకు ఇబ్బందులు కలగొద్దని.. ద్విచక్ర వాహనాలకు అతి శబ్ధం వచ్చే సైలెన్సర్లు బిగించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఎస్పీకి అందిన ఫిర్యాదుల మేరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాం. జిల్లాకేంద్రంలో 20 రోజుల్లో 66 ద్విచక్ర వాహనాల సైలెన్సర్లు తొలగించాం. ఇతర ప్రాంతాల్లో మరో ఆరు తొలగించినట్లు తెలుస్తోంది. భవిష్యత్‌లో శబ్ధ కాలుష్యంతో పాటు రాష్ డ్రైవింగ్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తాం. సామాన్యులకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తప్పవు. – సురేందర్, ట్రాఫిక్ ఎస్ఐ, వనపర్తి వనపర్తి: జిల్లావ్యాప్తంగా నెల రోజులుగా జిల్లా పోలీసుశాఖ శబ్ద కాలుష్యంపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. జిల్లాకేంద్రంలో రిజర్వ్ ఎస్ఐ సురేందర్ నేతత్వంలో ప్రారంభమైన శబ్ద కాలుష్యంపై కఠినంగా వ్యవహరిస్తూ 66 ద్విచక్ర వాహనాలు, మిగతా ప్రాంతాల్లో మరో ఆరు బుల్లెట్లకు ప్రత్యేకంగా బిగించిన సైలెన్సర్లను గుర్తించి తొలగించారు. కంపెనీ నుంచి వచ్చిన సైలెన్సర్లను పక్కనబెట్టి బయట మార్కెట్లో అతి శబ్ధం వచ్చే ప్రత్యేక సైలెన్సర్లను బిగించి ప్రజలు, వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు.. ఎస్పీ రావుల గిరిధర్ స్పెషల్ డ్రైవ్‌కు ఆదేశించారు. జిల్లాకేంద్రంలో ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను రాష్ట్ర పోలీసులకు పంపడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు రిజర్వ్ ఎస్ఐతో ఆరుగురు సిబ్బందిని నియమించారు. వీరు నిత్యం రద్దీ ప్రాంతాల్లో పర్యటిస్తూ ట్రాఫిక్‌ను నియంత్రించడంతో పాటు శబ్ద కాలుష్యానికి పాల్పడుతున్న వాహనాల సైలెన్సర్లను తొలగించారు. ఎంత వత్తిడి వచ్చినా జిల్లా పోలీస్‌బాస్ ట్రాఫిక్ సిబ్బంది విధులకు అడ్డుతలగకుండా తాజాగా ద్విచక్ర వాహనాలకు సంబంధించిన 66 సైలెన్సర్లను జిల్లాకేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల ఎదుట రోడ్డుపై రోడ్ రోలర్‌తో తొక్కించేశారు. అలాగే ఆయా వాహనాలకు రూ.వెయ్యి చొప్పున జరిమానాలు సైతం విధించడంతో పాటు కంపెనీ నుంచి వచ్చిన సైలెన్సర్లు బిగించాలని ట్రాఫిక్ ఎస్ఐ సురేందర్ వివరించారు. సైలెన్సర్లను రోడ్డు రోలర్‌తో తొక్కిస్తున్న అధికారులు (ఫైల్) జిల్లాకేంద్రంలో 66.. వేర్వేరు ప్రాంతాల్లో ఆరు ద్విచక్ర వాహనాల సైలెన్సర్లు తొలగింపు.. ఒక్కో వాహనానికి రూ.వెయ్యి జరిమానా ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించినా చర్యలు తిరిగి వినియోగించకుండా.. అతి శబ్దం వచ్చే వాహనాల సైలెన్సర్లు తొలగించిన పోలీసులు వాటిని యజమానులకు అప్పగించకుండా, మరోమారు వినియోగించకుండా, వాహనదారులకు అవగాహన కల్పించే విధంగా బహిరంగంగా రోడ్డు రోలర్‌తో తొక్కించారు. ఈ ఘటనతో జిల్లాకేంద్రంలో శబ్ధ కాలుష్యం, ర్యాష్ డ్రైవింగ్ చేసేవారిలో భయం మొదలైందని చెప్పవచ్చు. ప్రధాన కూడళ్లలో నిఘా.. ట్రాఫిక్ నిబంధనకు విరుద్ధంగా ప్రధాన కూడళ్లలో వాహనాలను ఇష్టారీతిగా తిరుగుతుండటంతో ఎస్పీ ప్రత్యేక చొరవతో ఎక్కడి వాహనాలు అటువైపు వెళ్లేలా రోడ్డు మధ్యలో ప్లాస్టిక్ స్తంభాలతో డివైడర్లను ఏర్పాటు చేయించారు. ఇన్నాళ్లు కూడళ్లలో ఇష్టానుసారంగా పర్యటించిన వాహనదారులు సైతం ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తున్న ట్రాఫిక్ సిబ్బంది తెలిపారు. -
గోపాల్పేట పీఏసీఎస్ పేరు మార్పు
గోపాల్పేట: మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) ఇక నుంచి రైతు ఉత్పత్తి కేంద్రంగా మారనుందని జిల్లా సహకార సంఘం ఆడిట్ అధికారి ప్రసాదరావు తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం కార్యాలయంలో అధికారులతో సమావేశమై మాట్లాడారు. రాష్ట్రంలో 929 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉండగా.. ఇప్పటి వరకు 310 సంఘాలను రైతు ఉత్పత్తి కేంద్రాలుగా మార్చామని, జిల్లాలో 15 ఉండగా ఆరింటి పేర్లు మార్చామని.. త్వరలో మిగతా వాటి పేర్లు మారుస్తామని చెప్పారు. రైతులకు సాంకేతికతను పరిచయం చేస్తూ మద్దతు ధరలు కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం రైతు ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేస్తోందని చెప్పారు. క్లస్టర్ల వారీగా నిర్వహణ బాధ్యతను సహకార సంఘాలకు అప్పగించిందని చెప్పారు. కార్యక్రమంలో అసిస్టెంట్ రిజస్ట్రార్ శ్రీనివాసులు, సీనియర్ ఇన్స్పెక్టర్లు మహబూబ్అలీ, బిక్యానాయక్, జూనియర్ ఇన్స్పెక్టర్ రాజునాయక్, గోపాల్పేట సహకార సంఘం సీఈఓ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. రూ.18.04 లక్షలు పలికిన తైబజార్ వనపర్తిటౌన్: జిల్లాకేంద్రంలోని తైబజార్, వారాంతపు సంత, జంతు వధశాలకు సంబంధించి 2025–26 ఆర్థిక సంవత్సరానికిగాను సోమవారం జిల్లాకేంద్రంలోని పుర కార్యాలయంలో బహిరంగ వేలం నిర్వహించారు. తైబజార్‌ను రూ.18.04 లక్షలకు డి.శ్యామ్, వారాంతపు సంతను రూ.1.82 లక్షలకు ఆర్.తిరుపతయ్య, జంతు వధశాల (స్లాటర్ హౌజ్)ను రూ.1.21 లక్షలకు గొర్ల జగన్నాథం దక్కించుకున్నట్లు పుర కమిషనర్ వెంకటేశ్వర్లు వివరించారు. వేలంలో శానిటరీ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. డీసీసీబీ రుణ లక్ష్యం రూ.600 కోట్లు ఉప్పునుంతల: ఈ ఆర్థిక సంవత్సరంలో డీసీసీబీ ద్వారా రూ.600 కోట్ల రుణాలు ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక పీఏసీఎస్‌లో చైర్మన్ సత్తు భూపాల్‌రావుతో కలిసి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. సంఘ సభ్యులు తమ పూర్తి సహకారాన్ని అందజేసి రైతులకు పంట, ఇతర రుణాలు అందించేలా చూడాలని సూచించారు. అలాగే స్థానిక పీఏసీఎస్‌లో సాఫ్ట్వేర్ సమస్యలతో ఓటీఎస్ ద్వారా రైతుల నుంచి కొంత అధికంగా రుణ బకాయిలు వసూలు చేశామని.. జరిగిన పొరపాటును సరిచూసుకున్న వెంటనే వసూలు చేసిన ఎక్కువ డబ్బులను మార్చిలోనే తిరిగి వారి సొంత ఖాతాలో జమ చేశామని, ఎలాంటి అక్రమాలు చోటుచేసుకోలేదని వివరించారు. నాబార్డ్, టెస్కాబ్ రుణాలు పొందాలంటే రుణ రికవరీ శాతం పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇందుకోసం డీసీసీబీకి రూ.21 కోట్లు నష్టం వాటిల్లినా.. ఓటీఎస్ ద్వారా మొండి బకాయిలు వసూలు చేసినట్లు చెప్పారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న 78 సహకార పరపతి సంఘాల్లో 39 సంఘాలు మాత్రమే 50 శాతం మేర రుణాలను రికవరీ చేసేవని.. ఓటీఎస్‌తో మరో 16 సంఘాలు రుణ రికవరీ శాతం 50 శాతం దాటిందని వివరించారు. సమావేశంలో డీసీసీబీ సీఈఓ పురుషోత్తం, అచ్చంపేట డీసీసీబీ మేనేజర్ రవికుమార్, పీఏసీఎస్ సీఈఓ రవీందర్రావు పాల్గొన్నారు. ఆర్ఎన్ఆర్ రూ.2,201 దేవరకద్ర: దేవరకద్ర మార్కెట్ యార్డులో జరిగిన ఈ టెండర్లలో ఆర్ఎన్ఆర్ ధాన్యం క్వింటాల్‌కు గరిష్టంగా రూ.2,201, కనిష్టంగా రూ.1,862 ధరలు లభించాయి. అలాగే హంస ధాన్యం గరిష్టంగా రూ.1,829, కనిష్టంగా రూ.1,650, ఆముదాలు క్వింటాల్ రూ.5,969 ఒకే ధర వచ్చింది. -
కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించాలి
వనపర్తి: కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించిన వరి ధాన్యాన్ని ఎప్పటికప్పుడు కేటాయించిన రైస్‌మిల్లులు, గోదాములకు తరలించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం ఉదయం కలెక్టరేట్లోని తన చాంబర్లో వ్యవసాయ, కో–ఆపరేటివ్, పౌరసరఫరాలశాఖ, మార్కెటింగ్‌శాఖ అధికారులతో ధాన్యం తరలింపుపై సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలకు వచ్చిన వరి ధాన్యం ఎంత.. మిల్లులు, గోదాములకు తరలించింది ఎంత.. ఇంకా కేంద్రాల్లోనే తరలింపునకు సిద్ధంగా ఉన్న ధాన్యం ఎంత అనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు పడకుండా రవాణా కాంట్రాక్టర్లు ఎప్పటికప్పుడు లారీలు పంపించాలని, అలసత్వం ప్రదర్శిస్తే అనుమతి రద్దుచేసి ఇతరులకు ఇవ్వాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లును ఆదేశించారు. గోపాల్పేట, పెద్దమందడి, పొల్కెపాడు కేంద్రాల్లో ధాన్యం తరలింపునకు సిద్ధంగా ఉందని.. వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి మిల్లు, గోదాంకు సన్న, దొడ్డురకం ధాన్యం 60:40 నిష్పత్తిలో పంపించాలని.. ప్రతి కేంద్రంలో రైతులకు కనీస మౌలిక వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్‌నాయక్, జిల్లా కో–ఆపరేటివ్ అధికారి బి.రాణి, పౌరసరఫరాలశాఖ అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి ప్రజావాణికి 80 వినతులు.. ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు, ఆర్డీఓ సుబ్రమణ్యంతో కలిసి దరఖాస్తుదారుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణి ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ దరఖాస్తుదారులకు తగిన సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ముఖ్యమంత్రి, మంత్రి, జిల్లా ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. సోమవారం జరిగిన ప్రజావాణికి 80 ఫిర్యాదులు వచ్చినట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు. అనంతరం రెడ్‌క్రాస్ సొసైటీ రూపొందించిన యాంటీ డ్రగ్స్ అవగాహన వాల్‌పోస్టర్‌ను వైద్యసిబ్బందితో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
రైతు ప్రయోజనాలకే ‘భూ భారతి’
అమరచింత/ఆత్మకూర్: రైతు ప్రయోజనాల కోసమే రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకొచ్చిందని కలెక్టర్ ఆదర్శ్ సురభి, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. సోమవారం అమరచింత మండలం నాగల్‌కడ్మూర్, ఆత్మకూర్ మండలం జూరాల గ్రామ రైతువేదికల్లో భూ భారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సుకు వారు ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. ప్రపంచంలో రైతుకు, భూమికి ఉన్న సంబంధాన్ని ఎవరూ విడదీయలేరన్నారు. ఒక చిన్న వ్యాపారి తన వ్యాపారంలో నష్టం వస్తే మానేస్తారని.. కాని భూమిని నమ్ముకొని వ్యవసాయం చేస్తున్న రైతు మాత్రం పంట నష్టం కలిగినా తిరిగి అప్పు చేసి పంటలు సాగు చేస్తారని కొనియాడారు. రైతు తన భూమి భద్రత విషయంలో నిశ్చింతగా ఉంచడానికి తీసుకొచ్చిందే భూ భారతి చట్టమన్నారు. 2020లో తెచ్చిన ధరణి రైతులను గందరగోళానికి గురి చేసి అనేక సమస్యలకు కారణమైందని.. పట్టాదారు పాసు పుస్తకంలో పేరు, భూ విస్తీర్ణంలో తేడాలుంటే ఏళ్ల తరబడి కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరిగేవారని చెప్పారు. ఇలాంటి సమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మేధావులు, కలెక్టర్లతో 14 నెలలు చర్చించి రైతులు సులువుగా తమ భూ వివరాలు తెలుసుకునేలా భూ భారతి చట్టం తీసుకొచ్చిందని వివరించారు. భూ భారతితో రైతు దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లోపు సమస్య పరిష్కరించే అవకాశం ఉందని.. గడువు ముగిస్తే నేరుగా అర్జిదారునికే చెల్లుబాటు అయ్యేలా సాఫ్ట్వేర్ ధ్రువీకరిస్తుందని తెలిపారు. తప్పులకు పాల్పడితే తహసీల్దార్లపై వెంటనే చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. అమరచింతలో జరిగిన కార్యక్రమంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, తహసీల్దార్ రవికుమార్ యాదవ్, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి కేశం నాగరాజుగౌడ్, అమ్మాపురం సంస్థానదీశులు రాజా శ్రీరాంభూపాల్, డీసీసీ ప్రధానకార్యదర్శి అయ్యూబ్‌ఖాన్, మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆస్పత్రి నిర్మాణానికి స్థల పరిశీలన.. ఆత్మకూర్ శివారు పీజేపీ క్యాంపు వద్ద 50 పడకల ఆస్పత్రి భవన నిర్మాణానికి ఎమ్మెల్యే, కలెక్టర్ సోమవారం స్థల పరిశీలన చేశారు. త్వరలోనే ప్రతిపాదనలు పంపించి ఆస్పత్రి నిర్మాణానికి మార్గం సుమగం చేస్తామని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, తహసీల్దార్ చాంద్‌పాషా, ఎంపీడీఓ శ్రీపాద్, కల్లు గీత కార్మిక విభాగం చైర్మన్ కేశం నాగరాజుగౌడ్, గంగాధర్‌గౌడ్, రహ్మతుల్లా, పరమేష్, తులసిరాజ్, శ్రీను, రామలక్ష్మారెడ్డి, రఫీక్, నాగేష్, రైతులు పాల్గొన్నారు. -
‘సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి’
వనపర్తి రూరల్: కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మే 20న దేశవ్యాప్తంగా చేపట్టే సార్వతిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని జిల్లా కార్యాలయంలో నాయకులతో కలిసి సమ్మెకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేసి మాట్లాడారు. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తూ.. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను ముందుకు తెచ్చిందన్నారు. వీటికి వ్యతిరేకంగా ఐదేళ్లుగా కార్మికవర్గం చేస్తున్న ఆందోళనలు చేస్తున్నా.. వాటిని అమలుచేసి కార్మిక హక్కులను పూర్తిగా హరించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. సార్వత్రిక సమ్మెలో అన్నిరంగాల కార్మికులు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు గంధం మదన్, నందిమళ్ల రాములు, రత్తయ్య, రవి, విజయ్‌కుమార్, రామచంద్రయ్య, చిన్ననాగన్న తదితరులు పాల్గొన్నారు. ‘స్థానిక’ పోరులో సత్తా చాటుదాం : బీజేపీ అమరచింత: గ్రామాల్లో పార్టీని బలోపేతం చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పని చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు బంగ్లా లక్ష్మీకాంత్‌రెడ్డి కోరారు. ఆదివారం మండలంలోని కిష్టంపల్లిలో జరిగిన మండలస్థాయి బూత్ కమిటీల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గ్రామాల్లో ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం ఉచితంగా అందిస్తున్న ఘనత కేంద్రానిదేనన్న విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని సూచించారు. నియోజకవర్గంలోని అమరచింత, ఆత్మకూర్, మక్తల్ పురపాలికలు బీజేపీ కై వసం చేసుకునేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షురాలు మంగ లావణ్య, నాయకులు మేర్వ రాజు, హరీశ్, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎస్‌డబ్ల్యూఎఫ్ కార్యవర్గం ఎన్నిక వనపర్తి టౌన్: జిల్లాకేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం వనపర్తి డిపో ఎస్డౠ్ల్యఎఫ్ (సీఐటీయూ) కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు గౌరవ అధ్యక్షుడు పుట్టా ఆంజనేయులు తెలిపారు. అధ్యక్షుడిగా ఏజీ కృష్ణ, ఉపాధ్యక్షులుగా నర్సింహ, నారాయణ, కార్యదర్శిగా నాగేశ్వర్, సహాయ కార్యదర్శిగా శేఖర్, కోశాధికారిగా కురుమయ్య, ప్రచార కార్యదర్శిగా గోవర్ధన్, మహిళా కన్వీనర్‌గా జానకి, సభ్యులుగా రాములు, శాంతన్న, శేఖరయ్య, చంద్రశేఖర్ ఎన్నికయ్యారు. అంతకుముందు నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు వీరాంజనేయులు మాట్లాడుతూ.. ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్ లేకపోవడంతో యాజమాన్యం కార్మికుల హక్కులను హరిస్తోందని, పని గంటలు పెంచి, సింగిల్ క్రూ డ్యూటీ పెంచి నామమాత్రపు ఓవర్‌టైం ఇస్తూ కార్మికుల శ్రమ, శక్తిని హరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కార్మికుల చట్టాలను తుంగలో తొక్కుతున్నాయని, కార్మికులంతా కలిసి ఐక్య పోరాటాలతో ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రీజియన్ ప్రచారకార్యదర్శి క్రాంతికుమార్, సహాయ కార్యదర్శి ఎండీ ఖయ్యూం, ప్రజా నాట్యమండలి జిల్లా అధ్యక్షుడు రాములు తదితరులు పాల్గొన్నారు. ‘బీసీలకు 42 శాతం టికెట్లు కేటాయించాలి’ జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు 42 శాతం టికెట్లు కేటాయించాలని అఖిల భారత బీసీ సంఘటన సమితి జాతీయ అధ్యక్షుడు మెట్టుకాడి శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ బీసీ మహాసభ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన బీసీ ప్రముఖుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మహబూబ్‌నగర్ మేయర్ సీటును బీసీ మహిళకు రిజర్వు చేయాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే విశ్వకర్మ, రాజు యువశక్తి, ముద్ర వంటి సంక్షేమ పథకాలను అందిపుచ్చుకోవాలన్నారు. -
ఒత్తిళ్లకు తలొగ్గి..
ప్రైవేట్ కళాశాలల సూచనలతో డిగ్రీ సెమిష్టర్ పరీక్షలు వాయిదా ● 9 రోజులపాటు నిలిపివేయడంతో పీజీసెట్, లాసెట్పై ప్రభావం ● అప్లియేషన్, ర్యాటిఫికేషన్ ప్రక్రియపై పట్టింపులేని వైఖరి ● ఆదేశాలను బేఖాతరు చేస్తున్న యాజమాన్యాలు ● పీయూ అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలుమహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో వింత ధోరణి నడుస్తోంది. ప్రైవేట్ కళాశాలలను నియంత్రించాల్సిన యూనివర్సిటీ అధికారులు.. ఏకంగా వారి ఒత్తిళ్లకే తలొగ్గి పనిచేయాల్సిన దుస్థితికి చేరుకున్నారు. ఈ నెల 28 నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు 2, 4, 6 నిర్వహిస్తున్నట్లు గతంలో సర్క్యులర్‌ను కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ బ్రాంచ్ విడుదల చేయగా.. ఈ నెల 25న వాటిని వాయిదా వేస్తున్నట్లు మరో సర్క్యులర్ జారీ చేశారు. దీనికి కారణం ‘ప్రైవేట్ కళాశాలల విజ్ఞప్తి మేరకు’ మాత్రమే వాయిదా వేసినట్లు అందులో పేర్కొనడం గమనార్హం. సాధారణంగా పరీక్షలు వాయిదా వేయాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివిధ పోటీ పరీక్షలు, సెలవుల దృష్ట్యా మాత్రమే వాయిదా వేస్తారు. కానీ, ఇక్కడ మాత్రం ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఒత్తిళ్లతో వాయిదా వేస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. కేవలం ప్రైవేట్ కళాశాలలకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వనందుకే ఈ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయన్న చర్చ జరుగుతోంది. విద్యార్థులకు తీవ్రనష్టం.. పీయూ పరిధిలో యూజీ, పీజీ, బీఈడీ తదితర అన్ని కళాశాలలు కలిపి 102 ఉండగా.. వీటిలో సుమారు 22 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. డిగ్రీ పూర్తయిన వెంటనే పీజీలో పీజీ సెట్, లా సెట్, ఎంబీఏ వంటి కోర్సులలో ప్రవేశాలకు విద్యార్థులు సిద్ధం కావాల్సి ఉంది. ఎంట్రెన్స్‌లకు చదివేందుకు కనీసం 15 రోజుల సమయం కూడా సరిపోదని విద్యార్థులు పేర్కొంటున్నారు. ఇప్పుడు పరీక్షలు వాయిదా వేయడం వల్ల ఫలితాలు, మెమోల జారీ వంటి ప్రక్రియ కూడా ఆలస్యమయ్యే అవకాశాలున్నాయని.. ఇలా చేయడం వల్ల విద్యార్థులకు తీవ్రనష్టం జరుగుతుందని వాపోతున్నారు. యథావిధిగా షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అయితే వాయిదా వేసిన డిగ్రీ పరీక్షలను అధికారులు వచ్చే నెల 6 నుంచి నిర్వహించనున్నారు. ర్యాటిఫికేషన్ కోసం.. పీయూ పరిధిలోని అన్ని ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ర్యాటిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇందుకోసం ఈ నెల 23 చివరి తేదీ కాగా.. 24 నుంచి 30 వరకు అన్ని కళాశాలల యాజమాన్యాలు టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది వివరాలను అధికారులకు సమర్పించాలని ఈ నెల 7న యూనివర్సిటీ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. వీటితోపాటు కళాశాలల్లో వసతులపై ఇన్స్పెక్షన్ చేయించుకోవాలని సూచించింది. అయితే అధికారుల సూచనల ప్రకారం కొన్ని కళాశాలలు మాత్రమే దరఖాస్తు చేసుకోగా.. మరికొన్ని కళాశాలలు వాటిని పట్టించుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కళాశాలల అప్లియేషన్ చివరిసారిగా 2022లో నిర్వహించగా.. తర్వాత గత వీసీ హయాంలో ప్రైవేటు కళాశాలలు అప్లియేషన్, ర్యాటిఫికేషన్ వంటి వాటి జోలికి వెళ్లలేదు. ప్రస్తుతం కొత్త వీసీ వచ్చాక పరిస్థితిలో మార్పు వస్తుందని భావించినా.. గతంలో మాదిరిగానే వాటిని మూలకు పెట్టినట్లు తెలుస్తోంది.ఇబ్బందులు రానివ్వం.. ప్రైవేటు కళాశాలలకు ఎట్టి పరిస్థితిలోనూ ర్యాటిఫికేషన్, అప్లియేషన్ ఇన్స్పెక్షన్ చేపడతాం. వీటికోసం ఈ నెల 23 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించాం. అలా చేస్తేనే దోస్త్‌లో అడ్మిషన్లు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. సమస్యలు ఉన్న కారణంగా వాయిదా వే సిన పరీక్షలను వచ్చేనెలలో నిర్వహిస్తాం. వి ద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం. – రమేష్‌బాబు, పీయూ రిజిస్ట్రార్ షెడ్యూల్ ప్రకారమే.. అసలు యూనివర్సిటీ అధికారులు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలకు ఎందుకు తలొగ్గి.. పరీక్షలు వాయిదా వేశారు. ఇలా చేయడం వల్ల విద్యార్థులకు నష్టం కలుగుతుంది కాబట్టి కచ్చితంగా వాటిని షెడ్యూల్ ప్రకారమే నిర్వహించాలి. అలాగే ర్యాటిఫికేషన్, ఇన్స్పెక్షన్ వంటి ప్రక్రియలు వెంటనే పూర్తిచేయాలి. – రాము, యూనివర్సిటీ ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు ఉద్యమం చేపడుతాం.. ప్రైవేటు కళాశాలలకు రీయింబర్స్మెంట్ రాకుంటే పరీక్షలు వాయిదా వేసి విద్యార్థులకు నష్టం చేస్తారా.? పీయూ అధికారుల ఈ తీరు హాస్యాస్పదంగా ఉంది. ప్రైవేటు కళాశాలల్లో వసతులు మెరుగుపడాలంటే ర్యాటిఫికేషన్, ఇన్స్పెక్షన్ వంటివి చేపట్టాల్సిందే. పీయూ అధికారులు తీరు మార్చుకోకుంటే ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడుతాం. – నాగేష్, యూనివర్సిటీ ఏబీవీపీ అధ్యక్షుడు -
అకాల వర్షం.. అపార నష్టం
ఆత్మకూర్: అకాల వర్షం అపార నష్టం తెచ్చిపెట్టింది. ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో వర్షం దంచి కొట్టింది, దీంతో కల్లాలు, మార్కెట్యార్డులోఆరబోసిన ధాన్యం తడిసి పోవడంతో పాటు వరద నీటిలో కొట్టుకుపోయింది. చెట్లు విరిగి రోడ్లు, తీగలపై పడటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అమరచింత–ఆత్మకూర్ మధ్యలో 33 కేవీ విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. సకాలంలో ధాన్యం కొనుగోళ్లు చేయక, కొనుగోలు చేసిన ధాన్యం తరలించకపోవడంతో కష్టాలు తప్పడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వరి పంటలు నేలకొరగగా.. మామిడి కాయలు రాలిపోయాయి. మండల కేంద్రంలో రహదారులన్నీ జలమయమయ్యాయి. గాంధీచౌక్‌లో వర్షపు నీరు నిలువడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సంతలో కూరగాయలు కొట్టుకుపోయాయి. తడసిన ధాన్యం.. నిలిచిన విద్యుత్ సరఫరా -
క్రీడా శిక్షణకు వేళాయె..
30 రోజుల శిక్షణ.. జిల్లాలో మే నెల 1 నుంచి 31 వరకు విద్యార్థులకు వివిధ క్రీడల్లో ఉచితంగా శిక్షణ ఇస్తున్నాం. ఇప్పటికే శిక్షకులకు అన్నిరకాల సూచనలు చేశాం. 14 ఏళ్లలోపు బాలలు శిక్షణలో పాల్గొనే అవకాశం ఉంది. శిబిరంలో ఎంతమంది విద్యార్థులైనా పాల్గొనవచ్చు. శిక్షకులకు రూ.4 వేల గౌరవ వేతనం చెల్లిస్తూ విద్యార్థులకు తర్ఫీదునిచ్చేలా ప్రోత్సహిస్తున్నాం. – సురేందర్‌రెడ్డి, డీవైఎస్ఓ అమరచింత: ప్రభుత్వం వేసవి సెలవుల్లో బడిఈడు పిల్లలు చెడుదారి పట్టకుండా వారికి క్రీడలపై మక్కువ పెంచేందుకు నచ్చిన ఆటలను పరిచయం చేస్తూ వాటిలో తర్ఫీదునిచ్చేందుకు వేసవి క్రీడా శిబిరాలను నిర్వహిస్తోంది. ఈ శిబిరాలు మే నెల 1 నుంచి నెలాఖరు వరకు కొనసాగనున్నాయి. వాలీబాల్, ఫుట్‌బాల్, హాకీ, కబడ్డీ తదితర క్రీడల్లో నైపుణ్యాలు గల శిక్షకుల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి శిక్షణ కేంద్రాలు మంజూరు చేశారు. ఇప్పటికే కేంద్రాల కేటాయింపు ప్రక్రియ పూర్తయిందని.. క్రీడా శిక్షకులకు ప్రతి నెల ప్రభుత్వం రూ.4 వేల గౌరవ వేతనం ఇవ్వనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఆసక్తిగల 14 ఏళ్లలోపు విద్యార్థులు తమ పేర్లు నమోదు చేసుకొని శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు సూచిస్తున్నారు. జిల్లాలో 10 కేంద్రాలు.. జిల్లాలోని మదనాపురం, గోపాల్పేట, ఏదుట్ల, వీపనగండ్ల, ఖిల్లాఘనపురం, పాన్‌గల్, కొత్తకోట, ఆత్మకూర్, మూలమళ్లతో పాటు జిల్లాకేంద్రంలో అధికంగా క్రీడా శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆయా మండలాల్లోని పీఈటీల ప్రోత్సాహంతో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి మొత్తంగా 10 శిబిరాలు వేసవిలో కొనసాగిస్తున్నారు. క్రీడాసామగ్రి పంపిణీ.. వేసవి క్రీడా శిబిరాలకు ప్రభుత్వమే ఉచితంగా క్రీడా సామగ్రిని అందిస్తుందని జిల్లా క్రీడలు, యువజనశాఖ అధికారి తెలిపారు. వాలీబాల్, ఫుట్‌బాల్, క్రికెట్ కిట్లు, అథ్లెటిక్స్ సామగ్రిని ఆయా కోచ్‌లకు జిల్లాకేంద్రంలో అందిస్తున్నట్లు చెప్పారు. శిక్షణకు వచ్చే విద్యార్థులు వీటిని వినియోగించుకొని కోచ్ వద్ద భద్రపర్చుకోవాలని సూచించారు. ప్రథమ చికిత్స కిట్ల కొనుగోలుకుగాను జిల్లాకు రూ.5 వేలు మంజూరయ్యాయని తెలిపారు. జిల్లాలో మే నెల 1 నుంచి తరగతులు ప్రారంభం జిల్లావ్యాప్తంగా 10 శిబిరాలు ఏర్పాటు శిక్షకులకు గౌరవ వేతనం చెల్లింపు 14 ఏళ్లలోపు విద్యార్థులకు అవకాశం శిక్షణతో ప్రయోజనం.. 30 రోజుల క్రీడా శిక్షణతో విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. పాఠశాల స్థాయిలో నిర్వహించే ఆటల పోటీలతో పాటు డివిజన్, జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు. వేసవి సెలవులు వృథా కాకుండా రోజు ఉదయం ఎనిమిది వరకు, సాయంత్ర ఐదు నుంచి ఆరు వరకు శిక్షణ ఇవ్వనున్నారు. -
చలో వరంగల్..
బీఆర్ఎస్ శ్రేణుల్లో రజతోత్సవ సందడి సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘గులాబీ’ శ్రేణుల్లో రజతోత్సవ సందడి నెలకొంది. బీఆర్ఎస్ ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తికానున్న సందర్భంగా వరంగల్ జిల్లా ఎల్కతుర్తి మండలం చింతలపల్లిలో ఆదివారం నిర్వహిస్తున్న రజతోత్సవ సభను ఉమ్మడి పాలమూరుకు చెందిన ఆ పార్టీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ మేరకు భారీ జనసమీకరణకు ఇదివరకే సన్నాహాలు మొదలుపెట్టిన నేతలు.. తాము రూపొందించుకున్న ప్రణాళికలకు అనుగుణంగా ముందుకుసాగుతున్నారు. నేడు ఊరూరా పార్టీ జెండావిష్కరణలను పండుగ వాతావారణంలో నిర్వహించి.. అనంతరం వాహనాల్లో సభకు తరలేలా తగిన ఏర్పాట్లు చేశారు. జడ్చర్ల నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో శనివారం సైతం పార్టీ జెండాలు ఆవిష్కరించారు. అదేవిధంగా ఫ్లెక్సీలు, పార్టీ బ్యానర్లతో మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాకేంద్రాల్లో పలు కూడళ్లు గులాబీమయంగా మారాయి. సెగ్మెంట్‌కు 300 వాహనాలు.. 3 వేల మంది జనసమీకరణ వరంగల్ జిల్లాలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీగా పార్టీ శ్రేణులను తరలింపు కోసం ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డితోపాటు ఎమ్మెల్సీ, అలంపూర్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు ఇప్పటికే సమీక్ష సమావేశాలు నిర్వహించారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు నియోజకవర్గానికి 300 వాహనాల వరకు సిద్ధం చేసి.. సుమారు మూడు వేల మంది కార్యకర్తలను సభకు తరలించేలా ఏర్పాట్లు చేశారు. రజతోత్సవ సభకు ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారని, ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల నుంచి దాదాపు 50 వేల మందిని తరలించనున్నట్లు మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వెల్లడించారు. పర్యవేక్షణకు ఇన్చార్జీల నియామకం.. వరంగల్‌కు సుదూర ప్రయాణం చేయాల్సి ఉన్నందున ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కోసం పార్టీ నేతలకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ప్రతి వాహనానికి ఓ ఇన్చార్జితో పాటు భోజనం, తాగునీటి వసతుల పర్యవేక్షణకు విడివిడిగా ఇన్చార్జీలను నియమించారు. అదేవిధంగా సభకు వెళ్లే ప్రతి వాహనానికి సంఖ్య, ఇన్చార్జి పేరు, సెల్ నంబర్‌తో స్టిక్కర్ ఏర్పాటు చేయనున్నారు. ఆయా ఇన్చార్జీలు నియోజకవర్గ ఇన్చార్జితో సమన్వయం చేసుకోనున్నారు. వాహనాలు ఎక్కడి నుంచి బయలు దేరాయి.. ఎక్కడ భోజనాలు చేశారు.. ఎప్పుడు సభకు వచ్చారు.. ఎ ప్పుడు వెళ్లారు.. ఇలా సురక్షితంగా ఇంటికి చేరుకునే వరకు ఆయా నియోజకవర్గాల ఇన్చార్జీలు ప ర్యవేక్షించేలా పార్టీ నాయకత్వం ఏర్పాట్లు చేసింది. పాలమాకుల లేదంటే శంషాబాద్ నుంచి ఓఆర్ఆర్కు.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి వాహనాలు పాలమాకుల దాటిన తర్వాత లేదా శంషాబాద్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పైకి చేరుకుని.. నేరుగా ఘట్కేసర్ వద్ద వరంగల్ హైవేలో దిగుతాయి. ఈ క్రమంలో ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో భోజనాలు ఏర్పాటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. జోన్–2లో పార్కింగ్.. రజతోత్సవ సభకు తరలివెళ్లే ఉమ్మడి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తమ తమ వాహనాలను జోన్–2లో పార్కింగ్ చేసుకోవాలి. వరంగల్ జాతీయ రహదారిలో కరుణాపురం వద్ద ఎన్‌హెచ్–163 బైపాస్‌లో టోల్గేట్ నుంచి దేవన్నపేట, మేడిపల్లి, అనంతసాగర్ మీదుగా పార్కింగ్ స్థలానికి చేరుకోవాల్సి ఉంటుంది. వాహనాలను అక్కడ పార్కింగ్ చేసి నేరుగా సభావేదిక స్థలానికి వెళ్లాల్సి ఉంటుంది. వరంగల్ సభకు భారీగా తరలుతున్న పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఉమ్మడి పాలమూరు నుంచి సుమారు 50 వేల మంది తరలింపు బస్సులు, కార్లు ఇతర ప్రైవేట్ వాహనాలను సమకూర్చిన నేతలు పట్టణాలతో పాటు ఊరూరా పండుగలా పార్టీ జెండావిష్కరణలు ఫ్లెక్సీలు, బ్యానర్లతో గులాబీమయమైన పలు కూడళ్లు -
హైదరాబాద్ తరహాలో తయారు..
18 ఏళ్ల నుంచి క్లాక్‌టవర్‌లో ‘హైదరాబాద్ ఫలుదా సెంటర్’ నడుపుతున్నాను. హైదరాబాద్‌లో తరహాలో ఫలుదా తయారు చేస్తున్న. దీంతో ఫలుదా తాగడానికి చాలా మంది ఇష్టపడుతున్నారు. లస్సీని కూడా ప్రత్యేకంగా తయారు చేసి వినియోగదారులకు అందిస్తున్నాం. జిల్లాకేంద్రంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఇక్కడికి వచ్చి ఫలుదా ఇష్టంగా ఆరగిస్తున్నారు. – మహ్మద్ షబ్బీర్‌అలీ, ఫలుదా, లస్సీ సెంటర్, మహబూబ్‌నగర్ సొంత పొలం నుంచే.. 20 ఏళ్ల నుంచి జిల్లా కేంద్రంలో చెరుకు రసం కేంద్రాన్ని నడుపుతున్నాం. మా సొంత పొలంలో పండించిన చెరుకు గడలనే వాడుతున్నాం. విని యోగదారుల నుంచి మంచి స్పందన లభిస్తుంది. ఆరోగ్యపరంగా లాభాలు ఉన్న చెరు కు రసాన్ని వేసవితో సంబంధం లేకుండా ఏ డాది పొడువునా సెంటర్‌ను నడుపుతున్నాం. – లక్ష్మణ్‌నాయక్, మహబూబ్‌నగర్ లస్సీ.. ఇష్టంగా తాగుతా.. లస్సీ అంటే చాలా ఇష్టం. వేసవి కాలంలో లస్సీని ఎక్కువగా తాగుతా. ఎండలో తిరిగే సమయంలో లస్సీ తాగడం శరీరానికి చల్లటి ఉపశమనం లభిస్తుంది. ధర కూడా అందరికీ అందుబాటులో ఉంటుంది. – సాయికుమార్, మహబూబ్‌నగర్ ● -
‘వక్ఫ్ సవరణ చట్టంతో నష్టమేమి లేదు’
వనపర్తి టౌన్: వక్ఫ్ సవరణ చట్టంతో దర్గా, మసీదు, మదర్సా ఆస్తులకు నష్టమేమి లేదని బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు అప్సర్‌పాషా అన్నారు. శనివారం జిల్లా అధ్యక్షుడు నారాయణ అధ్యక్షతన నిర్వహించిన వక్ఫ్ సవరణ వర్క్‌షాపులో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రపంచంలో పూర్తిగా ముస్లింలు ఉన్న దేశాలు ఆఫ్ఘనిస్తాన్, సిరియా, సౌదీఅరేబియా, ఇరాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ తదితర దేశాల్లో వక్ఫ్ చట్టాలు లేవని, మొత్తం ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటాయని చెప్పారు. ఇక్కడ మాత్రం కాంగ్రెస్ పార్టీకి మైనార్టీ ఓటు బ్యాంక్ కోసమే బిల్లు ఏర్పడిందని ఆరోపించారు. రక్షణ, రైల్వే శాఖల తర్వాత అత్యధిక భూములు వక్ఫ్ ఆధీనంలో ఉన్నాయని, 2013 ముందు వక్ఫ్ ఆధీనంలో వేల ఎకరాలు ఉంటే.. 2013 తర్వాత అధికారం కోల్పోతామని గ్రహించిన కాంగ్రెస్ పార్టీ ముస్లింల ఓట్ల కోసం బిల్లు తీసుకొచ్చి లక్షలాది ఎకరాలను ధారాదత్తం చేసిందన్నారు. అక్రమాలను సరిచేయడానికి ప్రయత్నిస్తున్న నరేంద్రమోదీపై ముస్లింలలో వ్యతిరేకత తీసుకొస్తున్నారని దుయ్యబట్టారు. నాయకుడు పోతుగంటి భరత్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ ముస్లిం మత పెద్దలు, వివిధ వర్గాల ప్రతినిధులు, అధికారులు, రాజకీయ నాయకులతో సుదీర్ఘ చర్చల అనంతరం వక్ఫ్ సవరణ బిల్లు తీసుకొచ్చారని చెప్పారు. ఈ బిల్లు ద్వారా దేశంలోని ముస్లింలకు పూర్తిగా అవగాహన కల్పించడానికి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పిలుపుమేరకు త్వరలోనే జిల్లా, మండల స్థాయిలో వర్క్‌షాపులు నిర్వహించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో నాయకులు వెంకట్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, శ్రీశైలం, హేమారెడ్డి, రామన్‌గౌడ్, సీతారాములు, సుమిత్రమ్మ, విష్ణువర్ధన్‌రెడ్డి, కల్పన, పెద్దిరాజు, మనివర్ధన్, ప్రవీణ్‌కుమార్, అశ్విని రాధ, రాఘవేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు కొత్తకోట/ మదనాపురం: రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ రవీంద్రనాయక్ అన్నారు. శనివారం ఆయన కొత్తకోట, మదనాపురంలోని పీహెచ్‌సీలను ఆకస్మికంగా తనిఖీ చేసి.. రోగులకు అందిస్తున్న వైద్యసేవల గురించి ఆరాతీశారు. అనంతరం ఆయన సిబ్బందితో మాట్లాడుతూ ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించడంతోపాటు వారితో మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. అనంతరం ఆస్పత్రి వార్డుల్లో ఉన్న రోగులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు. ఆస్పత్రిలోని రికార్డులు, గర్భిణుల కోసం ఏర్పాటు చేసిన వెయిటింగ్ గది, అక్కడ ఉన్న పేషెంట్ వార్డులు, వ్యాక్సిన్లను పరిశీలించారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయా లేదా ఆరా తీశారు. ఆయా కార్యక్రమాల్లో డీఎంహెచ్ఓ శ్రీనివాసులు, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ సాయినాథ్‌రెడ్డి, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి పరిమళ, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ ఝాన్సీ, ఆయా పీహెచ్‌సీల వైద్యాధికారులు ఆసియాబేగం, భవాని, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఫ్రిజ్‌లకు గిరాకీ
వేసవిలో ఇంట్లో అడుగుపెట్టే చల్లని నేస్తం ఫ్రిజ్. కూల్‌వాటర్‌తో పాటు వేసవిలో తిండిపదార్థాలు చెడిపోకుండా ఉండడానికి ఇది చాలా అవసరం. ఈ నేపథ్యంలో పలువురు వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఇన్వెర్టర్లపైనా నడిచే ఫ్రిజ్‌లు కూడా అందుబాటులోకి వచ్చాయి. రూ.12,500 నుంచి రూ.30 వేల వరకు ధరలు అందుబాటులో ఉన్నాయి. సింగిల్, డబుల్, త్రిపుల్ డోర్ ఫ్రిజ్‌లు కొనుగోలు చేస్తుండగా.. సామాన్య, మధ్య తరగతి ప్రజలు బేసిక్ మోడళ్ల ఫ్రిజ్‌లు తీసుకుంటుండటంతో వ్యాపారం ఊపందుకుంది. ఉమ్మడి జిల్లాలో దాదాపు 100 వరకు ఫ్రిజ్‌ల షాపులు ఉండగా ఈ వేసవి సీజన్లో రూ.20 కోట్ల నుంచి రూ.30 కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉంది. ● ఒకప్పుడు టేబుల్ ఫ్యాన్లు, ఆ తర్వాత సీలింగ్ ఫ్యాన్ల హవా నడిచింది. ఇప్పుడు కూలర్లు, ఏసీల గాలి వీస్తోంది. ఒకప్పుడు ఉన్నత, మధ్య తరగతి ఇళ్లకే పరిమితమైన కూలర్లు ఇప్పుడు తక్కువ ధర, చిన్న సైజుల్లోనూ లభిస్తుండడంతో అందరికీ అందుబాటులోకి వచ్చేశాయి. లోకల్‌మేడ్ కాకుండా బ్రాండెడ్ కూలర్లు సైతంలో మార్కెట్లో ఉన్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వేసవిలో రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల మేర వీటి వ్యాపారం నడుస్తుంది. -
ఆరోగ్యవంతులే అసలైన సంపన్నులు
వనపర్తి టౌన్: ఆరోగ్యానికి మించిన సంపద లేదని, ప్రతి ఒక్కరు ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చొరవ తీసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత అన్నారు. వనపర్తి న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో యశోద ఆస్పత్రి సహకారంతో శనివారం జిల్లా న్యాయస్థానంలో ఉచిత వైద్య శిబిరాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరోగ్య పరిరక్షణలో తగిన జాగ్రత్తలు, సరైన చికిత్స సకాలంలో తీసుకోకపోతే అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని, తద్వారా జీవిత మనుగడపై, కుటుంబ పోషణకు భారం కావడంతోపాటు కుటుంబ సభ్యుల్లో ఆనందం లోపిస్తుందన్నారు. పరిపూర్ణ ఆరోగ్యంగా ఉన్నవారే అసలైన సంపన్నులు అన్నారు. సేవా దృక్పథంతో ఆస్పత్రి యాజమాన్యం ఉచిత వైద్య సేవలకు ముందుకు రావడం శుభపరిణామమని ప్రశంసించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు రజని, జానకి, రవికుమార్, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కిరణ్‌కుమార్, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. -
వేసవి కాలం.. చల్లని నేస్తం
ఉక్కపోత నుంచి ఉపశమనానికి ప్రజల పరుగులు స్టేషన్ మహబూబ్‌నగర్: రోజురోజుకూ ఎండలు ముదురుతున్నాయి. దీంతో భరించలేని ఉక్కపోతతో ఇళ్లలో ఉండలేని పరిస్థితి. ఫ్యాన్లు ఉన్నోళ్లు కూలర్లు, కూలర్లు వాడుతున్న వారు ఏసీలు కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇంకా వేసవి సీజన్ ప్రారంభం కావడంతో వ్యాపారులు కొత్త మోడళ్లను అందుబాటులోకి తీసుకురాగా కొనుగోలుదారులతో దుకాణాలు కిక్కిరిశాయి. ఇవే కాకుండా పళ్ల రసాలు, జ్యూస్‌లు, ఐస్‌క్రీమ్ పార్లర్లు సైతం కిటకిటలాడుతున్నాయి. ● ఏసీలు, ఫ్రిజ్‌ల కొనుగోళ్లతో షాపుల్లో రద్దీ ● పండ్ల జ్యూస్‌లు, లస్సీ, ఐస్‌క్రీమ్‌లకు భలే గిరాకీ ● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రూ.కోట్లలో సీజనల్ వ్యాపారం -
రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు
కొత్తకోట రూరల్: వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా.. కనీస మౌలిక వసతులు కల్పించాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం పెద్దమందడి మండలంలోని అల్వాల, జగత్పల్లి, చిన్నమందడి, పెద్దమందడి, మనిగిళ్ల గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రానికి ధాన్యం తెచ్చిన రైతులు సేదతీరేందుకు టెంట్, మంచినీరు వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని, లేకపోతే సెంటర్‌ను మూసివేస్తామని హెచ్చరించారు. రైతులు ఇబ్బందులు పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత కొనుగోలు కేంద్రాల నిర్వాహకులదేనని స్పష్టం చేశారు. అలాగే తేమ వచ్చిన వెంటనే కొనుగోలు చేసి ధాన్యాన్ని గోదాంలకు తరలించాలని ట్రాన్స్‌ఫోర్ట్ కాంట్రాక్టర్లను ఆదేశించారు. లారీలు పెట్టడంలో ఆలస్యం చేయవద్దని, అలా చేస్తే బరువు తగ్గి రైతులు నష్టపోతారన్నారు. అనంతరం వెల్టూరు, మదనాపూర్ గోదాంలు పరిశీలించారు. -
మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు
వనపర్తి: జిల్లాలో డ్రంకెన్ డ్రైవ్, మైనర్లు డ్రైవింగ్ చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని, అలాంటి వారి మీద చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని పట్టణ పోలీస్‌స్టేషన్ ఆవరణలోని ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో ట్రాఫిక్ కౌన్సెలింగ్ సెంటర్‌ను ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రంకెన్ డ్రైవ్, మైనర్ డ్రైవింగ్‌లో పట్టుబడిన మైనర్లు, వారి తల్లదండ్రులకు ప్రతి శనివారం కౌన్సెలింగ్ నిర్వహించి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. కౌన్సెలింగ్ ద్వారా వారి ప్రవర్తన మార్చుకోవడానికి, తిరిగి బాధ్యత గల పౌరులుగా మారే అవకాశం కల్పిస్తున్నామన్నారు. మైనర్లు బైక్ నడుపుతూ పట్టుబడితే తల్లిదండ్రులకు శిక్షలు కఠినంగా ఉంటాయని, లైసెన్స్ సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ఇక ముందు మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే మైనర్లు, తల్లిదండ్రులు లేదా యజమానిని మోటార్ వాహనాల చట్టం–2019 199ఏ ప్రకారం సంబంధిత కోర్టులో హాజరుపరుస్తామన్నారు. వాహన యజమానికి మూడేళ్ల జైలుశిక్ష, రూ.25 వేల జరిమానా వరకు విధిస్తారన్నారు. కార్యక్రమంలో వనపర్తి సీఐ కృష్ణ, పట్టణ ఎస్ఐ హరిప్రసాద్, ట్రాఫిక్ ఎస్ఐ సురేందర్, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
పీహెచ్‌సీల్లో సాధారణ ప్రసవాలు పెంచాలి
పాన్‌గల్: పీహెచ్‌సీల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచేందుకు వైద్యసిబ్బంది కృషి చేయాలని జిల్లా మాత, శిశు సంరక్షణ అధికారి డా. ఝాన్సీ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని పీహెచ్‌సీని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. వైద్యసిబ్బంది తమ సబ్‌సెంటర్ల పరిధిలోని గర్భిణులు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకునేలా అవగాహన కల్పించాలని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులు చేయించుకుంటే ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను వివరించాలన్నారు. గర్భిణులు 102, 108 వాహన సేవలు సద్వినియోగం చేసుకునేలా చూడాలని కోరారు. పీహెచ్సీలో జరిగిన ప్రపంచ మలేరియా నివారణ దినోత్సవ అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొని మలేరియా నిర్మూలనకు ప్రతి ఒక్కరు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యాధికారి డా. చంద్రశేఖర్, సీహెచ్ఓ రామయ్య, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. -
లారీలు రావడం లేదు
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి 10 రోజులు దాటుతుంది. లారీలు కొరత ఉందని వడ్లు కాంటా చేయట్లేదు. దీంతో రోజుల తరబడి ధాన్యంతో పాటు కొనుగోలు కేంద్రాల్లో మేము ఉండాల్సి వస్తోంది. దీనికి తోడు ఈదురు గాలులు, అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోతుంది. – పెంటయ్య, చిన్నమందడి ఈదురు గాలులతో ఆందోళన అకాల వర్షాలు, ఈదురు గాలులతో తేమ శాతం వచ్చిన వడ్లు కూడా తడిసిపోవడంతో తిరిగి ఎండబెట్టాల్సి వస్తోంది. దీంతో కూలీల ఖర్చు పెరుగుతుంది. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు స్పందించి వడ్లు కాంటా త్వరగా చేపట్టాలి. – రాంరెడ్డి, పాంరెడ్డిపల్లి కార్పొరేషన్ త్వరలోనే సమస్య పరిష్కారం.. జిల్లావ్యాప్తంగా శుక్రవారం వరకు సుమారు నాలుగు వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రాల్లో తూకం చేసి తరలింపునకు సిద్ధంగా ఉంది. లారీలు, హమాలీల కొరత కారణంగా తరలింపునకు బ్రేక్ పడింది. వెల్టూరు గోదాములో ధాన్యం నిల్వ చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తరలింపును రెండ్రోజుల్లో పూర్తి చేస్తాం. ట్యాబ్ ఎంట్రీల విషయంపై దృష్టి సారిస్తాం. కొన్న ధాన్యాన్ని ఎప్పటికప్పుడు ట్యాబ్ ఎంట్రీ చేయించి ట్రక్‌షీట్ తయారు చేసేలా చర్యలు తీసుకుంటాం. – జగన్మోహన్, డీఎం, జిల్లా పౌరసరఫరాలశాఖ ● -
మిల్లర్లు ధాన్యాన్ని వెంటనే దించుకోవాలి
ఖిల్లాఘనపురం: రైస్‌మిల్లర్లు కేంద్రాల నుంచి వచ్చిన వరి ధాన్యాన్ని వెంటనే లారీల నుంచి దించుకొని ట్రక్‌షీట్లపై సంతకం చేసి తిప్పి పంపాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం మండలంలోని సోళీపురం గ్రామంలో ఉన్న సింధు ట్రేడర్స్ రైస్‌మిల్లును ఆయన ఆకస్మికంగా తనిఖీచేసి ధాన్యం బస్తాలతో ఉన్న వాహనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుతం జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో పెద్దఎత్తున ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయని.. కేంద్రాల నుంచి ధాన్యం తరలిస్తున్నామని, మిల్లర్లు వెంటనే దించుకొని పంపాలన్నారు. ఎక్కడైనా ఆలస్యమవుతుందని ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అదేవిధంగా మిల్లులో ధాన్యాన్ని మర ఆడించి సకాలంలో ఎఫ్‌సీఐకి బియ్యం అప్పగించాలని సూచించారు. ఎక్కడ ఎలాంటి పొరపాట్లు జరగకుండా మండలస్థాయిలో అధికారులు పర్యవేక్షణ చేయాలని కోరారు. -
అవగాహనతోనే మలేరియా నిర్మూలన
వనపర్తి విద్యావిభాగం: అవగాహనతోనే మలేరియాను నిర్మూలించవచ్చనని జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాసులు అన్నారు. ప్రపంచ మలేరియా నిర్మూలన దినం సందర్భంగా శుక్రవారం జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాసులు, జిల్లా ప్రోగ్రాం అధికారి డా. సాయినాథ్‌రెడ్డి సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా మలేరియా మరణాలు సంభవిస్తున్నాయన్నారు. దోమ కాటుతోనే మలేరియా వస్తుందని.. నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ప్రతి శుక్రవారం డ్రైడే పాటించడంతో దోమల వృద్ధిని నివారించవచ్చన్నారు. కార్యక్రమంలో డా. పరిమళ, ఇమ్యునైజేషన్ అధికారి డా. మారుతి, క్షయ వ్యాధి వైద్యాధికారి డా. నందన్‌గౌడ్, జిల్లా మలేరియా నివారణ ఇన్చార్జ్ అధికారి డా. శ్రీనివాస్‌జీ, రవీంద్రగౌడ్, ఆరోగ్య విస్తరణ అధికారి నరసింహారావు, ఆరోగ్య పర్యవేక్షకుడు రాము, గంధం రాజు తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యమాల ద్వారానే ఉద్యోగ భద్రత
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: అధ్యాపకులు ఉద్యమించడం ద్వారా ఉద్యోగ భద్రత సాధ్యపడుతుందని పాలమూరు అధ్యయన వేదిక అధ్యక్షుడు రాఘవాచారి పేర్కొన్నారు. పీయూలో కొన్ని రోజులుగా కాంట్రాక్టు అధ్యాపకులు చేస్తున్న సమ్మెకు ఆయన శుక్రవారం మద్దతు తెలిపి, మాట్లాడారు. అధ్యాపకులు మరింత ఉత్సాహంగా ఉద్యమం చేయాలని, వారికి పౌర సమాజం పూర్తి మద్దతు ఇస్తుందన్నారు. ఉన్నతవిద్యలో విశ్వవిద్యాలయం అధ్యాపకులు సమాజానికి మార్గదర్శకులుగా పనిచేస్తున్నారని, అలాంటి వారు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని టెంట్ కింద కూర్చోవడం సభ్య సమాజానికి తలవంపులు తెస్తుందన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా పీయూ అధ్యాపకులను వెంటనే రెగ్యులరైజేషన్ చేయాలని డిమాండ్ చేశారు. అధ్యాపకులుకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తుందని, న్యాయమైన డిమాండ్లను నెరవేర్చేందుకు తమవంతు సహకారం ఉంటుందన్నారు. -
సంగమేశ్వరా.. దారి చూపవా..
కృష్ణాతీరంలోని సంగమేశ్వరుడి దర్శనానికి సరిహద్దు పంచాయితీ ● ఏపీ పరిధిలోని ఆలయం చెంతకు తెలంగాణ బోట్లను రానివ్వకుండా అడ్డుపడుతున్న ఏపీ జాలర్లు ● స్వామి దర్శనానికి వ్యయప్రయాసలతో కష్టాలు పడుతున్న భక్తులు ● ఏడాదిలో నాలుగు నెలలు మాత్రమే సంగమేశ్వరుడి దర్శనం సాక్షి, నాగర్‌కర్నూల్: ఏడాదిలో నాలుగు నెలలు మాత్రమే ఆలయం తెరచుకుని ఉంటుంది. మిగతా కాలమంతా నీటిలోనే మునిగి ఉంటుంది. ఏడు నదులు ఒక చోట కలిసే సంగమేశ్వర క్షేత్రంలో స్వామిని దర్శనం చేసుకునేందుకు భక్తులకు ప్రయాసలు తప్పడం లేదు. కృష్ణాతీరానికి ఇరువైపులా ఉన్న స్థానిక గ్రామాల జాలర్లు, బోట్ల నిర్వాహకుల మధ్య వివాదం, ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య సరిహద్దు పంచాయితీని తీసుకువచ్చింది. ఫలితంగా సంగమేశ్వరుడి దర్శనం కోసం వస్తున్న భక్తులు, పర్యాటకులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సప్త నదుల సంగమం, ఏడాదిలో నాలుగు నెలలే దర్శనం.. కృష్ణానది ఒడ్డున ఉన్న సంగమేశ్వర ఆలయం శ్రీశైలం రిజర్వాయర్ నిర్మాణ సమయంలో బ్యాక్‌వాటర్‌లో మునిగిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లోని కొత్తపల్లి మండల పరిధిలో ఉన్న సంగమేశ్వర ఆలయం ప్రతి ఏటా వేసవిలో శ్రీశైలం ప్రాజెక్ట్ నీటి మట్టం తగ్గాక ఆలయం కనిపిస్తుంది. మార్చి నుంచి జూన్ వరకు రిజర్వాయర్‌లో నీరు లేని సమయంలోని భక్తుల దర్శనానికి అందుబాటులో ఉంటుంది. మిగతా ఏడాదంతా నీటిలోనే మునిగి ఉంటుంది. కృష్ణ, వేణి, తుంగ, భద్ర, మలాపహారిణి, భీమారథి, భవనాశిని నదులు ప్రవహించే ఏడు నదుల సంగమ క్షేత్రంగా సంగమేశ్వరాన్ని పేర్కొంటారు. ఆలయంలో శివలింగాన్ని పాండవుల్లో ఒకరైన భీముడు రాయితో కాకుండా వేపధారు(చెక్క)తో ప్రతిష్ఠించడం ఇక్కడి ప్రత్యేకత. ఇరు రాష్ట్రాల జాలర్ల మధ్య సరిహద్దు వివాదం.. సంగమేశ్వర ఆలయాన్ని దర్శించుకునేందుకు హైదరాబాద్, ఇతర జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు నాగర్‌కర్నూల్ జిల్లాలోని కృష్ణాతీరంలో ఉన్న సోమశిలకు చేరుకుంటారు. అక్కడి నుంచి బోటులో సంగమేశ్వర ఆలయానికి చేరుకోవాల్సి ఉంటుంది. అయితే ఆలయం ఏపీ పరిధిలో ఉండటంతో సంగమేశ్వరం, సిద్దేశ్వరం గ్రామాలకు చెందిన జాలర్లు, బోట్ల నిర్వహకులు తెలంగాణ నుంచి వచ్చే బోట్లను అడ్డుకుంటున్నారు. తమకు ఆదాయం రావడం లేదని అభ్యంతరం చెబుతుండటంతో తరచుగా వివాదం చెలరేగుతోంది. దీంతో కొన్ని రోజులుగా సంగమేశ్వర దర్శనం కోసం వస్తున్న భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. మొదట తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా సోమశిల నుంచి బోటులో బయలుదేరితే ఏపీ పరిధిలోని సిద్దేశ్వరం తీరం వద్ద బోటును నిలిపివేస్తున్నారు. అక్కడి నుంచి 3 కి.మీ. దూరంలోని సంగమేశ్వరం వరకు ఆటోలో ప్రయాణించి ఆలయాన్ని చేరుకుంటున్నారు. దర్శనం తర్వాత ఆటోలో సిద్దేశ్వరం వరకు వచ్చి, అక్కడి కృష్ణానదిలో ఏపీకి చెందిన జాలర్ల బోట్లలో సోమశిలకు చేరుకోవాల్సి వస్తోంది. ఇందుకోసం ఒక్కో చోట రూ.వంద చొప్పున.. ఒక్కొక్కరికి మొత్తం రూ.300 ఖర్చు అవుతుంది. బోటు నుంచి ఆటో, ఆటో నుంచి మళ్లీ బోటుకు మారి ప్రయాణించేందుకు కనీసం 2 నుంచి 3 గంటల సమయం పడుతోంది. ఇరు రాష్ట్రాల జాలర్ల సరిహద్దు వివాదంతో పర్యాటకులు, భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు.. కొల్లాపూర్ మండలం, నాగర్‌కర్నూల్ జిల్లా) సోమశిల వద్ద కృష్ణాతీరం వద్దకు హైదరాబాద్, ఇతర ప్రాంతాల నుంచి నిత్యం పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. సంగమేశ్వరుడి దర్శనం కోసం కృష్ణానదిలో బోటులో వెళ్లాల్సి ఉండగా, ఏపీకి చెందిన సిద్దేశ్వరం, సంగమేశ్వర గ్రామాల జాలర్లు బోట్లను రానివ్వడం లేదు. కొద్ది దూరం బోటులో, తర్వాత ఆటోలో, మళ్లీ బోటులో ప్రయాణిస్తూ కష్టాలు పడుతున్నారు. పర్యాటకులు, భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలి. – రామ్మోహన్, సోమశిల -
కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీల ఆందోళన
వనపర్తి రూరల్: రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు ప్రకటించడంతో పాటు ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలంటూ శుక్రవారం జిల్లాకేంద్రంలో సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీ ఉపాధ్యాయులు, ఆయాలు ఆందోళన చేపట్టారు. ముందుగా మర్రికుంట నుంచి భారీ ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకొని గేటు ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీల సంఘం జిల్లా అధ్యక్షురాలు శారద మాట్లాడుతూ.. కర్ణాటక రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాలకు రెండు నెలలు వేసవి సెలవులు ప్రకటించారని, తెలంగాణలోనూ వేసవి సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ఉద్యోగ భద్రతతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, కనీస వేతనం రూ.26 వేలు చెల్లిస్తూ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. అనంతరం రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లుకు డిమాండ్ల వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు బొబ్బిలి నిక్సన్, ఆర్యన్ రమేష్, మద్దిలేటి, రాములు, జ్యోతి, సుమతి, సంధ్య, రేణుక, లత, నిర్మల, కృష్ణవేణి, సరళ, నిర్మల, డీవైఎఫ్ఐ నాయకుడు కొప్పుల మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఉగ్రవాదాన్ని రూపుమాపాలి
వనపర్తి: కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని డీపీఆర్ఓ సీతారాం కోరారు. కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా శుక్రవారం జిల్లాకేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో వనపర్తి వర్కింగ్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన కొవ్వొత్తుల ప్రదర్శనతో ఆయన పాల్గొని దాడిలో మరణించిన వారికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్‌లో అన్ని మతాలు, కులాల వారు ఐక్యమత్యంతో జీవిస్తున్నారని, కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నారని తెలిపారు. భారత ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దుచేసి కశ్మీర్‌ను అభివృద్ధి చేస్తోందని, కొన్నేళ్లుగా పర్యాటకరంగం ఊపందుకుందన్నారు. ఇది ఓర్వలేని వారు ఉగ్రవాదులను ప్రేరేపించి అలజడి సృష్టించేందుకు దాడి చేయించారని తెలిపారు. సీనియర్ జర్నలిస్ట్ రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ.. భారతదేశం శాంతిని కోరుకుంటుందని అలా అని మన పౌరులపై దాడి చేసి చంపేస్తే ప్రతిఘటన కూడా తీవ్రంగా ఉండాలన్నారు. మరో సీనియర్ జర్నలిస్ట్ కొండన్న మాట్లాడుతూ.. దేశంలో ఎప్పుడు ఉగ్రదాడి జరిగినా దాయది పాకిస్తాన్ హస్తం ఉందని తేటతెల్లమవుతుందని.. ఉగ్రవాదాన్ని తరాలుగా పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌కు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. -
బ్యాంకర్లు, అధికారులు సమన్వయంతో పనిచేయాలి
వనపర్తి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువవికాసం పథకం వంద శాతం గ్రౌండింగ్ చేసేలా బ్యాంకర్లు, సంక్షేమ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ యాదయ్య అన్నారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కార్పొరేషన్ ద్వారా యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందన్నారు. ఈ పథకం కింద రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు సబ్సిడీ రుణాలు అందించి నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించడం జరుగుతుందన్నారు. ఈ పథకంలో 70 నుంచి 100 శాతం వరకు ప్రభుత్వ సబ్సిడీ ఉంటుందని, మిగిలిన మొత్తం మాత్రమే బ్యాంకు ద్వారా రుణాలు ఇవ్వాలన్నారు. జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2,495 యూనిట్లు మంజూరు కాగా 6,085 దరఖాస్తులు వచ్చాయని, ఎస్టీ కార్పొరేషన్లో 1,328 యూనిట్లకు 2,677 దరఖాస్తులు, మైనార్టీ కార్పొరేషన్లో 445 యూనిట్లకు 2,130 దరఖాస్తులు, క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్లో 29 యూనిట్లకు 64 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఇప్పటికే ప్రభుత్వం ద్వారా ఇవ్వాల్సిన సబ్సిడీ నిధులు కేటాయించినందున యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్డీఓ ఉమాదేవి, లీడ్ బ్యాంక్ మేనేజర్ శివకుమార్, అసిస్టెంట్ ఎల్డీఎం సాయి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మల్లికార్జున్, బ్యాంకర్లు తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు విస్తరణ కొలతలు అడ్డుకున్న వ్యాపారులు
వనపర్తి టౌన్: జిల్లాకేంద్రంలోని కర్నూలు రోడ్డును విస్తరించేందుకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గురువారం అధికారులు పాలిటెక్నిక్ రోడ్డుకు రెండు వైపుల ఎంత మేరకు విస్తరించాలో మార్కింగ్ ప్రక్రియ చేపట్టారు. ఈ మార్కింగ్ ప్రక్రియను చేపట్టేందుకు మున్సిపల్, రెవెన్యూ, ఆర్అండ్బీ అధికారులతో కలిపి మొత్తం 10 మంది కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఇప్పటికే పానగల్ రోడ్డును రెండు వైపులా సెంటర్ పాయింట్ నుంచి 35 అడుగుల మేర విస్తరించేందుకు సర్వే పూర్తి చేశామని వెల్లడించారు. కర్నూలు రోడ్డులో ప్రస్తుతం ఉన్న కొత్తకోట రోడ్డు మధ్య నుంచి 45 అడుగులు ఉండటంతో అదే రీతిలో పాలిటెక్నిక్ రోడ్డు విస్తరణకు మార్కింగ్ చేసేందుకు గురువారం చర్యలు చేపట్టారు. అయితే సుమారు 30 దుకాణాలకు మార్కింగ్ ఇచ్చిన వెంటనే మిగతా దుకాణాలకు మార్కింగ్ ఇవ్వకుండా స్థానిక వ్యాపారులు అడ్డుకోవడంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఎలా మార్కింగ్ చేస్తారని కొందరు వ్యాపారులు అధికారులను అడ్డుకున్నారు. ప్రభుత్వ స్థలాల వైపు, రాజాగారు వదిలిన లాన్ మార్గంలో కొందరు దుకాణాలు నిర్మించారని, వాటిని తొలగించి అప్పుడు రోడ్ల విస్తరణకు మార్కింగ్ చేయాలని పట్టుబట్టారు. ప్రస్తుతం ఉన్న రోడ్డును సెంటర్ పాయింట్‌గా తీసుకొని విస్తరించడం సరికాదన్నారు. ఏళ్ల తరబడి ఉన్న ఆస్తులకు నష్టపరిహారం ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఈ మేరకు అక్కడి నుంచే మున్సిపల్ కమిషనర్‌తో వ్యాపారులు ఫోన్లో మాట్లాడారు. దీంతో స్పందించిన మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు ఈ విషయమై శుక్రవారం సమావేశం నిర్వహిద్దామని చెప్పడంతో వ్యాపారులు అంగీకరించారు. దీంతో అధికారులు మార్కింగ్ ఇచ్చే ప్రక్రియను నిలిపివేసి వెనుదిరిగారు. -
ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలి
వనపర్తి రూరల్: దేశంలో ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ, సీపీఐ పట్టణ కార్యదర్శి రమేష్ అన్నారు. కాశ్మీర్‌లోని పహల్గాం వద్ద భారతీయ పర్యాటకులు 27 మందిని ఉగ్రవాదులు కాల్చి చంపడంపై సీపీఐ ఆధ్వర్యంలో గురువారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఉగ్రవాదం నశించాలి.. మత సామరస్యం వెల్లివిరియాలి అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యాటకులపై ఉగ్రవాదులు దాడికి పాల్పడి క్రూరంగా చంపడం పిరికి పంద చర్య అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దేశంలో నక్సలైట్లను చంపించే పనిపై ఉన్న దృష్టి ఉగ్రవాదులను మట్టుబెట్టడంలో లేదన్నారు. మా దేహం ముక్కలైనా.. దేశాన్ని ముక్కలు కానీయబోమన్నారు. పార్టీలు ఎన్ని ఉన్నా దేశం శాంతి సామరస్యాన్ని కాపాడటంలో ఏకమవుతామన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు కళావతమ్మ, ఎర్ర కుర్మయ్య, శిరీష, వెంకటమ్మ, జ్యోతి, చిన్నకుర్మయ్య పాల్గొన్నారు. -
ధాన్యం వివరాలు తప్పక నమోదు చేయాలి
కొత్తకోట/ కొత్తకోట రూరల్: వరిధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చిన వెంటనే వివరాలు రిజిష్టర్‌లో నమోదు చేసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. గురువారం మండలంలోని పాలెం వరి కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రంలో టెంట్, వడ్లు తూర్పు పట్టే ఫ్యాన్ లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే టెంట్ వేయించాలని, తాలు తొలగించేందుకు ఫ్యాన్ పెట్టించి ఉపయోగించాలని సూచించారు. కొనుగోలు కేంద్రంలో వచ్చిన వడ్లు తేమ శాతం, నిర్వహిస్తున్న రిజిష్టర్లను పరిశీలించారు. సెంటర్ ఇన్చార్జ్ని పలు వివరాలు అడగగా.. ఆయన నీళ్లు నమలడంతో వెంటనే మార్చాల ని ఆదేశించారు. అలాగే ప్రతి సెంటర్లో శిక్షణ పొందిన వారిని మాత్రమే ఇన్చార్జ్గా నియమించాలన్నారు. వడ్లలో తాలు, గడ్డి అధికంగా కనిపించడంతో పెడస్టల్ ఫ్యాన్, పాడి క్లీనర్ ద్వారా శుభ్రం చేయాలని, దొడ్డు రకం, సన్న రకం కొనుగోలు కేంద్రాలు వేర్వేరుగా చేపట్టాలని చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వర్లు ఉన్నారు. ప్రభుత్వ ఆస్పత్రి ఆకస్మిక తనిఖీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. పట్టణంలోని పీహెచ్‌సీని ఆకస్మికంగా సందర్శించి.. ఏఎన్సీ, ఈడీడీ మందుల స్టాక్ రిజిష్టర్లను తనిఖీ చేశారు. ప్రస్తుతం ఉన్న మందులు, వాటి తుది గడువు తదితర వివరాలు తెలుసుకున్నారు. గర్భిణుల ఏఎన్సీ సకాలంలో నమోదు చేసి ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయాలని ఆదేశించారు. -
మహనీయుల అడుగుజాడల్లో నడవాలి
పెంట్లవెల్లి: కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జైబాపు, జైభీం, జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం మండలంలోని జటప్రోల్, గోప్లాపూర్ గ్రామాల్లో కొనసాగిన సంవిధాన్ పాదయాత్రలో మంత్రి జూపల్లి కృష్ణారావుతోపాటు రాష్ట్ర సాంస్కృతిక సారధి చైర్పర్సన్ వెన్నెల పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎంతో మంది నేతలు మన దేశం కనుమరుగు కాకూడదని ఎన్నో త్యాగాలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అన్నారు. కాంగ్రెస్ పార్టీని కనుమరుగు చేయాలని కొందరు చూస్తున్నారని, ప్రజలు దీనిని ఎప్పటికీ సహించరన్నారు. బీఆర్ అంబేద్కర్ దేశానికి రాజ్యాంగాన్ని అందించిన గొప్ప మహనేత అని, ఈ రోజు మనం ఇలా ఉన్నామంటే ఆ మహనీయుల కృషి ఫలితమే అన్నారు. ప్రతిఒక్కరూ మహనీయుల అడుగు జాడల్లో నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అనంతరం మండలంలోని జటప్రోల్లో వరి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు, చైర్పర్సన్ వెన్నెల ప్రారంభించారు. రైతులకు మద్దతు ధరతోపాటు బోనస్ అందుతుందా.. సకాలంలో ఇస్తున్నారా.. అని రైతులను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలులో రైతులను ఎలాంటి ఇబ్బందులకు గురిచేయవద్దని, తేడా వస్తే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్‌కు ఫోన్ చేసి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని, తూకాల్లో తేడాలు లేకుండా రెవెన్యూ అధికారులు చూడాలని సూచించారు. కార్యక్రమంలో గోవింద్‌గౌడ్, రామన్‌గౌడ్, భీంరెడ్డి, గోపాల్, ఖదీర్, కుమార్, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘ఈత సరదా విషాదంగా మారకూడదు’
వనపర్తి: విద్యాసంస్థలకు వేసవి సెలవులు ప్రకటించడంతో.. పిల్లలు, యువకులు సరదా కోసం, ఈత నేర్చుకోవడానికి చెరువులు, కాల్వలకు వెళ్తారని, ఈత సరదా విషాదం కారాదని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈత రానివారు బావులు, చెరువుల వద్దకు ఒంటరిగా వెళ్లకూడదని, తల్లిదండ్రుల సమక్షంలో నేర్చుకోవాలని, ఎవరి పర్యవేక్షణ లేకుండా చిన్నారులను ఈత కొట్టడానికి పంపించడం వల్ల ఏవైనా అనుకోని సంఘటనలు జరిగితే జరిగే నష్టాన్ని ఎవరూ పూడ్చలేరన్నారు. అలాగే వేసవికాలంలో జిల్లాలో ఈత కారణంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుశాఖ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల్లో అవగాహన కల్పించే విధంగా, ఈతకు వెళ్లినప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తామని, ప్రజలంతా పోలీసు శాఖకు ప్రజలంతా సహకరించాలని కోరారు. ● పోలీసు వ్యవస్థలో నిరంతరంగా సేవలందించి పదోన్నతి పొందిన ఖిల్లాఘనపూర్ ఏఎస్ఐ సుధాకర్ ఎస్ఐగా, వనపర్తి రూరల్ పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ రాజగౌడ్ హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందిన సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రావుల గిరిధర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. పదోన్నతి పోలీసులకు ఎస్పీ పదోన్నతి చిహ్నాలను అలంకరించి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో పదోన్నతులు మరింత బాధ్యత పెంచుతాయన్నారు. పదోన్నతులు పొందిన పోలీస్ సిబ్బంది రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు సేవ చేయాలన్నారు. కార్యక్రమంలో ఇంచార్జ్ ఏఎస్పీ మహేశ్వరరావు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
జూరాల.. భద్రమేనా?
జూరాల జలాశయంలో తెగిన 8 గేట్ల ఇనుప రోపులు జూరాల ప్రాజెక్టు గద్వాల: ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయినిగా పేరుగాంచిన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు భద్రమేనా..? 2009 సంవత్సరం మాదిరిగా మరోసారి వరద పోటెత్తితే ప్రాజెక్టు తట్టుకుంటుందా? అంటే.. ప్రాజెక్టులోని తెగిన గేట్ల రోప్‌లు, ధ్వంసమైన రబ్బర్ సీల్ నిర్మాణాలను చూస్తే నిస్సందేహంగా లేదనే మాటే వినిపిస్తోంది. ఉమ్మడి జిల్లాలోని భీమా, నెట్టెంపాడు, పాలమూరు– రంగారెడ్డి, కల్వకుర్తి, కోయిల్‌సాగర్ వంటి ప్రాజెక్టులకు సాగునీరందిస్తూ.. కీలకపాత్ర పోషిస్తున్న పెద్దన్నకు పెనుముప్పు తరుముకొస్తే.. అన్న ఆలోచన కూడా వెన్నులో వణుకు పుట్టిస్తోంది. నాలుగు దశాబ్దాలుగా పాలమూరుకు సాగు, తాగు నీరందిస్తున్న ప్రాజెక్టును.. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన అధికార యంత్రాంగం, పాలకులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండడం ఆందోళన కలిగిస్తుంది. రాష్ట్రంలోనే తొలి ప్రాజెక్టు.. కృష్ణాబేసిన్ పరిధిలో రాష్ట్రంలోనే తొలి ప్రాజెక్టుగా ఇందిరా ప్రియదర్శిని జూరాలను 1981లో రూ.550 కోట్లతో నిర్మించారు. జలాశయం నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. దీని కింద 1.20 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కుడికాల్వ పరిధిలోని గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో 37,700 ఎకరాలు, కుడి కాల్వ పరిధిలో ఆత్మకూరు, వనపర్తి, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో 63,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తోంది. జూలై నాటికి పూర్తి.. జూరాల ప్రాజెక్టు క్రస్ట్ గేట్లకు మరమ్మతు చేసేందుకు మూడేళ్ల కిందట రూ.11 కోట్ల నిధులు వచ్చాయి. అయితే 2022లో పనులు కొంతమేర వేగవంతంగా జరిగాయి. కానీ, 2023లో గ్యాంటీక్రేన్కు సమస్య తలెత్తడంతో పనులకు అడ్డంకిగా మారింది. ప్రస్తుతం గ్యాంటీక్రేన్ను పూర్తిస్థాయిలో రిపేరు చేశాం. శుక్రవారం నుంచి పనులు వేగవంతం చేసి జూలై నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం. – జుబేర్, ఈఈ, జూరాల డ్యాం62 రేడియల్ క్రస్ట్ గేట్లు.. జూరాల ప్రాజెక్టుకు మొత్తం 62 రేడియల్ క్రస్ట్ గేట్లు, 84 బ్లాకులు ఉన్నాయి. ప్రాజెక్టుకు వరద వచ్చినప్పుడు ఈ 62 రేడియల్ క్రస్ట్ గేట్లను ఆపరేట్(పైకెత్తడం) చేయడం ద్వారా నీటిని దిగువనకు విడుదల చేసేలా సులభతరమైన విధానంలో రేడియల్ క్రస్ట్‌గేట్లు ఏర్పాటు చేశారు. అర్ధ చంద్రాకారంలో ఉన్న గేట్లను పైకి, కిందికి ఆపరేట్ చేసేందుకు గేట్లకు ఇరువైపులా రెండు రబ్బర్ సీల్స్, అడుగు భాగాన ఒక రబ్బర్ సీల్ ఉన్నాయి. ఆపరేట్ చేసేందుకు అవసరమైన ఇనుప రోప్‌లు గేటుకు ఇరువైపులా, కింది భాగాన రెండు చొప్పున ఇనుప రోపుల నిర్మాణం ఉంటాయి. వీటి సాయంతోనే మొత్తం రేడియల్ క్రస్ట్ గేట్లను అవసరమైనప్పుడు పైకి ఎత్తడం, దించడం చేస్తారు. భారీ వరద వస్తే.. 2009 సంవత్సరం మాదిరి జూరాలకు భారీ వరద వస్తే దెబ్బతిన్న గేట్లు కొట్టుకుపోయే ప్రమాదం లేకపోలేదు. ఇటీవల కర్ణాటకలోని టీబీ డ్యాం గేటు కొట్టుకుపోవడం, తాజాగా విజయవాడలోని కృష్ణా బ్యారేజీ గేట్లు దెబ్బతినడం ఘటనలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఇప్పటికై నా అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వీడి మొత్తం గేట్లను పూర్తిస్థాయిలో మరమ్మతు చేసి భారీ వరదలు వచ్చినా ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా అవసరమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 18 చోట్ల రబ్బర్‌సీల్ దెబ్బతినడంతో లీకేజీలు మరమ్మతు నేపథ్యంలో నిలిచిన గ్యాంటీక్రేన్ సేవలు మూడేళ్లుగా 50 శాతం కూడా పూర్తికాని రిపేర్లు ఆందోళన కలిగిస్తోన్న అధికార యంత్రాంగం, పాలకుల వైఖరి -
కల్తీ కల్లు బాధితులే ఎక్కువ..
జనరల్ ఆస్పత్రిలోని మెడికల్ హెల్త్ సెంటర్‌కు కల్తీ కల్లు బాధితులు ఎక్కువగా వస్తున్నారు. కల్లులో మత్తుకోసం క్లోరో, ఆల్ఫ్రాజోలం, యాంటీ సైకోటిక్ పదార్థాలను కలుపుతుండటంతో తీవ్రమైన అనారోగ్యానికి గురవుతున్నారు. నిత్యం కల్తీకల్లు సేవించడం వల్ల బ్రెయిన్, లివర్, నాడీ సంబంధ సమస్యలకు లోనవుతున్నారు. చివరికి నోట మాటరాని పరిస్థితి ఎదురవుతోంది. – డాక్టర్ అంబుజ, సైకియాట్రిస్ట్, జిల్లా మెడికల్ హెల్త్ సెంటర్, నాగర్కర్నూల్కౌన్సెలింగ్ ద్వారా చికిత్స.. కల్తీకల్లు వినియోగంతో నరాల బలహీనత, ఫిట్స్, తిమ్మిర్లు రావడం, చేతు లు, కళ్లలో మంటలతో ఆస్పత్రులకు వస్తున్నారు. వారికి కౌన్సెలింగ్, మందులు ఇచ్చి పంపిస్తున్నాం. తీవ్రమైన కేసులు ఉన్నవారిని హైదరాబాద్‌కు పంపుతున్నాం. – డాక్టర్ రఘు, సూపరింటెండెంట్, జనరల్ ఆస్పత్రి, నాగర్‌కర్నూల్ ● -
తడిసిన ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
కొత్తకోట రూరల్: ఇటీవల కురిసిన అకాల వర్షాలకు వరి ధాన్యం తడిసి తేమశాతం పెరగడంతో కేంద్రాల నిర్వాహకులు కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని.. ప్రభుత్వం స్పందించి వెంటనే కొనుగోళ్లు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకుడు ఎండీ జబ్బార్ డిమాండ్ చేశారు. బుధవారం మండలంలోని కనిమెట్ట శివారులో తడిసిన ధాన్యాన్ని తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా జబ్బార్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఓ వైపు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెబుతున్నా క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యంతో కేంద్రాల నిర్వాహకులు కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. దొడ్డురకం ధాన్యానికి బోనస్ ప్రకటించాలని, కేంద్రాల్లో రైతులకు కనీస సౌకర్యాలు, మంచినీటి సౌకర్యం కల్పించాలన్నారు. చాలామంది రైతులకు రైతు భరోసా రాలేదని, త్వరగా మంజూరు చేయాలని కోరారు. అకాల వర్షాలతో మామిడి తదితర పండ్ల తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులకు నష్ట పరిహారం అందించాలన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు బాల్‌రెడ్డి, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నిక్సన్, చిరంజీవి, రైతులు వెంకటమ్మ, బాలమ్మ, సుశీల, సరోజ తదితరులు పాల్గొన్నారు. రైతు సంఘం రాష్ట్ర నాయకుడుఎండీ జబ్బార్ -
వేసవి సెలవుల్లో నైపుణ్యాలు పెంచుకోవాలి
వనపర్తిటౌన్: విద్యార్థులు వేసవి సెలవుల్లో మొబైల్ ఫోన్లతో సమయాన్ని వృథా చేయకుండా స్పోకెన్ ఇంగ్లీష్, డ్రాయింగ్, నాట్యం తదితర వాటిలో నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి వి.రజని అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని హరిజనవాడ ఉన్నత పాఠశాలలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించగా ఆమె ముఖ్యఅతిథిగా హాజరై పోక్సో, బాల్య వివాహాలు, బాల కార్మికుల వ్యవస్థ, మోటారు వెహికిల్, సైబర్ క్రైమ్ తదితర చట్టాలపై అవగాహన కల్పించారు. ఉచిత న్యాయ సలహాల కోసం హెల్ప్‌లైన్ నంబర్ 15100 సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ జి.ఉత్తరయ్య, ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సమయాన్ని వృథా చేయొద్దు : ఎస్పీ వనపర్తి: యువత తమ విలువైన సమయాన్ని వృథా చేయకుండా కఠోర సాధన చేస్తే అనుకున్నది సాధించవచ్చని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని కేడీఆర్ సరస్వతి శిశుమందిర్ ఉన్నత పాఠశాల 40వ వార్షికోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. 1967లో మొదటి సరస్వతి శిశుమందిరం నిర్మల్‌లో ప్రారంభమైందన్నారు. ఎస్ఎల్ఎన్ ఆచార్యులు ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి పాఠశాల ప్రారంభించగా.. పుర ప్రముఖులు, సంఘపెద్దలు పునాదిరాళ్లు వేశారని గుర్తు చేశారు. ప్రతి విద్యార్థికి ఉన్నత స్థానానికి ఎదగాలనే లక్ష్యం ఉండాలని.. ఒడిదుడుకులు అధిగమించి ముందుకుసాగితే అనుకున్నది సాధించగలమన్నారు. ప్రస్తుతం సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని.. ఇంట్లో తల్లిదండ్రులు, బంధువులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఆన్లైన్ ఆర్థిక మోసానికి గురైన బాధితులు ఆలస్యం చేయకుండా డయల్ 100కు సమాచారం ఇవ్వాలన్నారు. చదువుతో పాటు క్రమశిక్షణ కలిగి ఉండి తల్లిదండ్రులు, పెద్దలు, గురువులను గౌరవించాలని కోరారు. కార్యక్రమంలో ముఖ్య వక్త, వందేమాతరం ఫౌండేషన్ స్థాపకుడు రవీంద్ర, వనపర్తి సీఐ కృష్ణ, చైతన్యగౌడ్, కార్యదర్శి అరవింద్ ప్రకాష్, పాలమూరు విభాగ్ సహ కార్యదర్శి రాజమల్లేశ్, నాగిరెడ్డి, సూర్యనారాయణ, వనపర్తి జిల్లా విద్యా శాఖ ఏఎంఓ మహానంది, శ్రీనివాస్‌రెడ్డి, భాస్కర్, యుగేంధర్, శరత్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. పీసీసీ అబ్జర్వర్ల నియామకం సాక్షి, నాగర్‌కర్నూల్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జిల్లాల వారీగా అబ్జర్వర్లను నియమించింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఒక్కో జిల్లాకు ఇద్దరు చొప్పున పార్టీ అబ్జర్వర్ల జాబితాను ప్రకటించారు. మహబూబ్‌నగర్ జిల్లాకు దొమ్మటి సాంబయ్య, గజ్జి భాస్కర్ యాదవ్, నాగర్‌కర్నూల్‌కు టి.బెల్లయ్య నాయక్, దర్పల్లి రాజశేఖర్‌రెడ్డి, వనపర్తికి ఎ.సంజీవ్ యాదవ్, గౌరి సతీశ్, జోగుళాంబ గద్వాలకు దీపక్ జైన్, బి.వెంకటేశ్ ముదిరాజ్, నారాయణపేటకు ఎం.వేణుగౌడ్, బొజ్జ సంధ్యారెడ్డి పార్టీ అబ్జర్వర్లుగా కొనసాగనున్నారు. వీరు పార్టీ తరఫున ఆయా జిల్లాల్లో పార్టీ అధ్యక్షులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీకి చెందిన వివిధ విభాగాల ప్రతినిధులతో సమన్వయం చేయనున్నారు. ఎప్పటికప్పుడు పార్టీ నాయకుల పనితీరును అధిష్టానానికి నివేదించనున్నారు. నిబంధనలు పాటించాలి గోపాల్పేట: లబ్ధిదారులు ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని ప్రాజెక్టు డైరెక్టర్ పర్వతాలు అన్నారు. బుధవారం ఆయన మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో కొనసాగుతున్న నమూనా ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని పరిశీలించారు. నిర్మాణానికి ఎంత మేర సిమెంట్, కంకర, స్టీల్ వినియోగిస్తున్నారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. నాణ్యత లోపించకుండా చూడాలని ఎంపీడీఓ శంకర్‌నాయక్‌ను ఆదేశించారు. మండలంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. -
కల్తీ కల్లుతో బేజారు
కల్లుకు బానిసై తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతం ఏడాదిన్నర కిందట కల్తీ కల్లు సేవించి మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రానికి సమీపంలోని తిమ్మసానిపల్లి, కోయినగర్, దొడ్లోనిపల్లి గ్రామాలకు చెందిన 20 మంది ఒక్కసారిగా అస్వస్థతకు గురికావడం కలకలం రేపింది. జిల్లాకేంద్రంలోని జనరల్ ఆస్పత్రిలో చేరి వారం రోజుల పాటు చికిత్స తీసుకున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కల్తీ కల్లు వినియోగిస్తూ అనారోగ్య సమస్యలతో ఆస్పత్రుల్లో చేరుతున్న వారి క్రమంగా పెరుగుతోంది. ‘ఈ ఫొటోలోని వ్యక్తి పేరు లక్ష్మయ్య. నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలకేంద్రానికి చెందిన ఈయన కొన్నేళ్లుగా కల్తీ కల్లు తాగుతుండటంతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. మెదడు దెబ్బతిని నోటమాట రాని పరిస్థితికి చేరుకున్నాడు. జిల్లాకేంద్రంలోని జనరల్ ఆస్పత్రిలో మెంటల్ హెల్త్ విభాగంలో చికిత్స తీసుకుంటున్నాడు. గ్రామాల్లో విచ్చలవిడిగా కల్తీ కల్లు విక్రయాలు చేపడుతున్నారని, తనలాంటి బాధితులు ఎంతోమంది ఆస్పత్రుల్లో చేరుతున్నారని వాపోయాడు.’ -
ఆరోగ్య సమస్యల నుంచి ఆత్మహత్యల దాకా..
ఉమ్మడి జిల్లాలోని నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కల్తీకల్లు బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వ్యవసాయ కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, వృద్ధులు, మహిళలతో సహా కల్తీ కల్లుకు బానిస అవుతున్నారు. ఏళ్ల తరబడి కల్తీ కల్లు సేవిస్తుండటంతో ప్రధానం మెదడు, నాడీ వ్యవస్థ, లివర్ భాగాలు దెబ్బతిని తీవ్ర అనారోగ్యం బారిన పడుతున్నారు. చివరికి నోటి నుంచి మాటరాని పరిస్థితికి చేరుకుంటున్నారు. కల్తీకల్లులో వినియోగిస్తున్న మితిమీరిన మత్తు పదార్థాలతో పూర్తిగా బానిసై కల్లు మానేయలేని స్థితికి చేరుకుంటున్నారు. విపరీతమైన మత్తులో గొడవలు పడటం, కుటుంబ కలహాలు, మహిళలపై చేయి చేసుకోవడంతో పాటు క్షణికావేశంలో తమవారినే అంతమొందించేందుకు సిద్ధమవుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. మత్తులో డిప్రెషన్‌కు గురికావడం, తీవ్రమైన దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనలేక ఆత్మహత్యలకు సిద్ధమవుతున్నారు. -
‘భూ భారతి’ చారిత్రాత్మకం
వనపర్తి రూరల్: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి చట్టం చారిత్రాత్మకమని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. బుధవారం పెబ్బేరు మండలం కంచిరావుపల్లి రైతువేదిక, శ్రీరంగాపురం కామన్ కమ్యూనిటీ భవనంలో భూ భారతి–2025 చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయనతో పాటు కలెక్టర్ ఆదర్శ్ సురభి, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ సుబ్రమణ్యం, మండల ప్రత్యేక అధికారి సుధారాణి ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుత్వం 18 లక్షల ఎకరాల భూమిని మాయం చేసి తీసుకొచ్చిన మాయదారి ధరణిని ఎన్నికల హామీలో భాగంగా బంగాళాఖాతంలో వేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి భూ వివాదాల పరిష్కారానికి ఎంతగానో దోహదపడుతుందన్నారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ.. భూమి, భూ చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, ఏదైనా కొత్త చట్టం వచ్చినప్పుడు అందులోని ప్రతి అంశాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ప్రజలకు ఉంటుందని తెలిపారు. ధరణి చట్టంలో ఉన్న సమస్యల పరిష్కారానికి మేధావులతో చర్చించి పటిష్ట భూ భారతి తీసుకొచ్చినట్లు చెప్పారు. భూ రిజిస్ట్రేషన్ సమయంలో క్షేత్రస్థాయిలో సర్వేచేసి నాలుగు దిక్కుల హద్దులు నిర్ణయించుకొని పట్టాదారు పాసు పుస్తకంలో భూమి వివరాలతో పాటు పటం ముద్రిస్తారని.. దీంతో భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండదని వివరించారు. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, సక్సెషన్ సమయంలో తప్పు జరిగినట్లు భావిస్తే ఆర్డీఓకు అప్పిల్ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఆర్డీఓస్థాయిలో కూడా తప్పు జరిగితే కలెక్టర్‌కు అప్పీల్ చేసుకోవచ్చని తెలిపారు. అనంతరం శ్రీరంగాపురం మండల కేంద్రంలో పశువుల వెంకటయ్య, మంజుల ఇంట్లో కలెక్టర్, ఎమ్మెల్యే ప్రభుత్వం సరఫరా చేసిన సన్నబియ్యంతో వంటిన భోజనం చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్లు లక్ష్మి, మురళిగౌడ్, మార్కెట్ చైర్మన్ ప్రమోదిని, వైస్ చైర్మన్ విజయవర్ధన్‌రెడ్డి, ఎంపీడీఓలు రవీందర్, రవినారాయణ, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
‘ఉపాధి’ పని ప్రదేశాల్లో వసతులు కల్పించాలి
పాన్‌గల్: ప్రతి గ్రామపంచాయతీలో 150 మందికి తగ్గకుండా ఉపాధి కూలీలకు పని కల్పించాలని డీఆర్డీఓ ఉమాదేవి కోరారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఉపాధి సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. వేసవి దృష్ట్యా కూలీలతో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 వరకు మాత్రమే పని చేయించాలని, రోజు కూలి రూ.307 వచ్చేలా మార్కింగ్ ఇవ్వాలన్నారు. పని ప్రదేశాల్లో అన్ని వసతులు కల్పించాలని.. ఇందిరమ్మ కమిటీలతో సమావేశాలు నిర్వహించి అర్హులను ఎంపిక చేయాలని సూచించారు. ఎంపీడీఓ గోవిందరావు, ఎంపీఓ రఘురాములు, ఏపీఓ కుర్మయ్య, ఈసీ అంజన్‌రెడ్డి, ఉపాధి సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో వసతుల కల్పన వీపనగండ్ల: ప్రభుత్వం ఏర్పాటుచేసిన వరి కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పిస్తున్నట్లు డీఆర్డీఓ ఉమాదేవి తెలిపారు. బుధవారం గోవర్ధనగిరి, వీపనగండ్ల, కల్వరాల, సంగినేనిపల్లి, బొల్లారం, తూంకుంటలో మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను స్థానిక కాంగ్రెస్‌పార్టీ నాయకులతో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకొచ్చి సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆమె వెంట జిల్లా ప్రాజెక్టు మేనేజర్ అరుణ, నాగర్‌కర్నూల్ జిల్లా పర్యాటక అధికారి నర్సింహ, కాంగ్రెస్‌పార్టీ మండల అధ్యక్షుడు బీరయ్య యాదవ్, మండల రైతుబంధు సమితి మాజీ అధ్యక్షుడు నారాయణరెడ్డి, ఎత్తం కృష్ణయ్య పాల్గొన్నారు. -
జాతీయ స్థాయిలో సత్తాచాటాలి
వనపర్తి టౌన్: రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ అండర్–14 జట్టు మంగళవారం జిల్లాకేంద్రం నుంచి మహారాష్ట్రలో జరగనున్న జాతీయ స్థాయి ఫుట్‌బాల్ పోటీలకు తరలివెళ్లినట్లు డీవైఎస్ఓ సుధీర్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు క్రీడాకారులను అభినందించారు. ఫోన్లో క్రీడాకారులు ఎమ్మెల్యే మేఘారెడ్డి అభినందనలు తెలిపి, జాతీయ స్థాయిలో సత్తా చాటాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, స్కూల్ గేమ్స్ సెక్రటరీ సురేందర్‌రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, రాజేందర్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాకేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థి ప్రణీత్ జాతీయ స్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యాడని ఫిజికల్ డైరెక్టర్ కుమార్ తెలిపారు. -
ఇంటర్లో నిరాశజనక ఫలితాలు
వనపర్తిబుధవారం శ్రీ 23 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025వనపర్తి విద్యావిభాగం: ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్రవ్యాప్తంగా వనపర్తి జిల్లాకు మరోసారి నిరాశజనక ఫలితాలే వచ్చాయి. గతేడాదితో పోలిస్తే ఉత్తీర్ణత శాతం పెరిగినా అనుకున్న స్థాయిలో ఫలితాలు రాలేదు. ప్రథమ సంవత్సరానికి సంబంధించి జనరల్‌కు సంబంధించి 5,293 మంది పరీక్షకు హాజరు కాగా.. 58.62 శాతంతో 3,103 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 2,578 మంది విద్యార్థులు హాజరుకాగా.. 47.67శాతంతో 1,229 మంది, బాలికలు 2,715 మంది హాజరు కాగా.. 69.02 శాతంతో 1,874 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలురతో పోలిస్తే బాలికలు 21.35 శాతం అధికంగా ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరానికి సంబంధించి మొత్తం 4,748 మంది విద్యార్థులు హాజరు కాగా.. 67.35 శాతంతో 3,198 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలురు 2,236 మంది హాజరు కాదా.. 58.27 శాతంతో 1,303 మంది, బాలికలు 2,512 మంది హాజరు కాగా.. 75.44శాతంతో 1,895 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలుర కంటే బాలికలు 17.17 శాతం అధికంగా ఉత్తీర్ణత పొందారు. గతేడాదితో పోలిస్తే ఫస్టియర్‌లో 52.58 శాతంతో రాష్ట్రంలో 23వ స్థానంలో ఉన్న జిల్లా.. ఈ ఏడాది 18వ స్థానంలో నిలిచింది. సెకండియర్‌లో గతేడాది 64.75 శాతం ఉత్తీర్ణతతో 20వ స్థానంలో నిలవగా.. ఈ ఏడాది 22వ స్థానంలో నిలిచింది. ● మే 22వ తేదీ నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఈ నెల23 నుంచి 30వ తేదీ వరకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. వీటితోపాటు రీ కౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం కూడా ఈ నెల 30 వరకు ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలు 10లో u ఫస్టియర్‌లో 18, సెకండియర్‌లో 22వ స్థానం గతంతో పోల్చితే స్వల్పంగా పెరిగిన ఉత్తీర్ణత మరోసారి బాలికలదే పైచేయి -
నాణ్యమైన ధాన్యమే సేకరించాలి
కొత్తకోట రూరల్: ప్రభుత్వ నిబంధనల ప్రకారం నాణ్యమైన వరి ధాన్యం కొనుగోలు చేసి అప్పగించాల్సిన బాధ్యత కేంద్రాల నిర్వాహకులదేనని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. సోమవారం సాయంత్రం కొత్తకోట, రాజపేటలోని వరి కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీచేసి వచ్చిన ధాన్యం, తేమ శాతం, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. ధాన్యంలో తాలు, గడ్డి అధికంగా కనిపించడంతో పెడస్టల్ ఫ్యాన్, ప్యాడీ క్లీనర్‌తో శుభ్రం చేసి కొనుగోలు చేయాలని నిర్వాహకులను ఆదేశించారు. వచ్చిన ధాన్యం, తేమ శాతం తేదీల వారీగా నమోదు చేయాలని సూచించారు. వరి కోతలు సక్రమంగా జరిగేలా వ్యవసాయ విస్తరణ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. మిల్లర్ల నుంచి నాణ్యమైన బియ్యం అడుగుతున్నప్పుడు వారికి ధాన్యం కూడా అదేవిధంగా ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాజపేట కొనుగోలు కేంద్రంలో సరైన వసతులు లేకపోవడం, రిజిస్టర్లు సరిగా నిర్వహించకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దొడ్డు, సన్నరకం కేంద్రాలు వేర్వేరుగా నిర్వహించాలని, శిక్షణ పొందిన వారే ఇన్‌చార్జ్‌లుగా ఉండాలని ఆదేశించారు. అమరచింత కేంద్రం నుంచి రాజనగరంలోని రాఘవేంద్ర ఇండస్ట్రీకి ధాన్యం తరలించగా కలెక్టర్ రైస్‌మిల్లును సందర్శించారు. వరి ధాన్యాన్ని మరాడిస్తుండగా కలెక్టర్ పరిశీలించారు. క్వింటాకు ఎన్ని కిలోల బియ్యం వస్తున్నాయి.. సమస్యలు ఏమైనా ఉన్నాయా అని మిల్లు యజమానిని అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీ విశ్వనాథ్, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, పీఏసీఎస్ సీఈఓ బాలరాజు, సిబ్బంది తదితరులు ఉన్నారు. -
పంట కోతల్లో ప్రమాణాలు తప్పనిసరి
వనపర్తి: కోత యంత్రాల నిర్వాహకులు వరి కోతల సమయంలో ప్రమాణాలు పాటిస్తే నాణ్యమైన ధాన్యం చేతికందుతుందని రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు తెలిపారు. జిల్లాలో వరి కోతలు విస్తృతంగా కొనసాగుతున్న తరుణంలో సోమవారం మధ్యాహ్నం ఐడీఓసీ సమావేశ మందిరంలో కోత యంత్రాలు, వ్యవసాయ విస్తరణ అధికారులు, మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ఇటీవల కొనుగోలు కేంద్రాలను సందర్శించినప్పుడు చాలాచోట్ల ధాన్యంలో తాలు, మట్టి, గడ్డి ఎక్కువగా కనిపిస్తున్నాయని.. అందుకే సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పక్వానికి రాకముందే పంట కోతలు చేపడితే తాలు ఏర్పడుతుందని.. కోత యంత్రాల నిర్వాహకులు 19–20 ఆర్పీఎంతో బ్లోవర్ ప్రారంభించి గేర్ స్నాట్ ఏ2–బి1లో ఉంచి పంట కోతలు చేపట్టాలని ఆదేశించారు. నాసిరకం ధాన్యం కొనడం కష్టమని.. నాణ్యత పాటించాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే హార్వెస్టర్ యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు, హార్వెస్టర్ల నిర్వాహకులకు అవగాహన కల్పించాలని.. లేనిపక్షంలో డీటీఓకు ఫిర్యాదు చేస్తే యంత్రాలు సీజ్ చేస్తారన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ నాయక్, డీటీఓ మానస, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీవిశ్వనాథ్, డీఎం, వ్యవసాయ మండల, క్లస్టర్ అధికారులు పాల్గొన్నారు. -
అధికారులు పట్టించుకోవాలి..
కృష్ణా నది నుంచి ఇసుక తరలించడం మూలంగా సాగు నీటికి ఇబ్బందులు ఏర్పడుతాయి. దీంతోపాటు నదిలో రోడ్లు వేయడం వల్ల దిగువకు నీళ్లు రాకుండా పోతున్నాయి. ఉన్న కాస్త నీరు అక్కడే నిలుస్తోంది. పరిస్థితి ఇలా ఉంటే వేసవి చివరలో నీటి కొరత తీవ్రమయ్యే అవకాశం ఉంది. అధికారులు పట్టించుకోవాలి. – అంబ్రెష్. మాజీ సర్పంచ్, గుడెబల్లూరు, కృష్ణా నా దృష్టికి రాలేదు.. నది రోడ్లు వేసినట్లు నా దృష్టికి రాలేదు. త్వరలో ఆకస్మిక తనిఖీలు చేపడతాం. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు చేపట్టినా.. అనుమతుల్లేకుండా తరలిస్తున్నా.. చర్యలు తప్పవు. – వెంకటేష్. తహసీల్దార్, కృష్ణా ఇరిగేషన్ శాఖ దృష్టికి తీసుకెళ్లా.. మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలో మైనింగ్ సిబ్బంది కొరత ఉంది. అయినా నదిలో రోడ్డు వేసినట్లు మా దృష్టికి వచ్చిన వెంటనే.. పరిశీలించాలని సిబ్బందిని పంపించా. నీటిని మళ్లించేందుకు రైతులు వేసుకున్నట్లు చెప్పారు. ఈ అంశాన్ని ఇరిగేషన్ శాఖ దృష్టికి తీసుకెళ్లా. చర్యలు తీసుకోవాల్సింది వారు. – సంజయ్, ఏడీ, మైనింగ్ శాఖ, మహబూబ్‌నగర్ ● -
రైతులకు అండగా ప్రభుత్వం
వనపర్తి రూరల్: తడిసిన ధాన్యం గురించి రైతులు అధైర్యపడొద్దని.. ప్రభుత్వం అండగా ఉంటుందని, కేంద్రాల్లో చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి భరోసానిచ్చారు. సోమవారం మండలంలోని అంకూరులో సింగిల్‌విండో ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించి ధాన్యాన్ని పరిశీలించారు. కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చిన రైతుల వివరాలను నమోదు చేయాలని వారికి, తేమశాతం, తాలు పేరుతో రైతులను సతాయిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఆయన వెంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, ఉపాధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, తహసీల్దార్ రమేశ్‌రెడ్డి, మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి, ఆర్ఐ మధుసూదన్, కాంగ్రెస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు. వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం.. గోపాల్పేట: మండల కేంద్రంలోని కోదండ రామస్వామి ఆలయం వద్ద ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం తూకం చేసిన వెంటనే మిల్లులకు తరలించడం, రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావడం వెంటవెంటనే జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట ఉమ్మడి మండలాల ఇన్చార్జ్ సత్యశిలారెడ్డి, శివన్న, నాగశేషు, కొంకి వెంకటేష్, కొంకి రమేష్, కోటిరెడ్డి తదితరులు ఉన్నారు. బాధితుడికి పరామర్శ.. మండలంలోని లక్ష్మీదేవిపల్లిలో ఆదివారం సాయంత్రం పిడుగుపాటుతో 25 గొర్రెలు మృతి చెందాయన్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మేఘారెడ్డి సోమవారం ఉదయం గ్రామానికి చేరుకొని బాధితులను పరామర్శించారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం త్వరగా అందేలా చూడాలని తహసీల్దార్ తిలక్‌కుమార్‌రెడ్డి, పశుసంవర్థకశాఖ అధికారి వెంకటేశ్వర్లుకు సూచించారు. సరోజ అనే మహిళ గాయపడిందని తెలుసుకుని వెంటనే జిల్లా ఆస్పత్రిలో చూపించాలని చెప్పారు. తక్షణ ఆర్థిక సాయంగా రూ.20 వేలు అందించారు. -
ఈదురు గాలుల వర్షం
వీపనగండ్ల: మండలంలో ఆదివారం రాత్రి కురిసిన ఈదురు గాలుల వర్షానికి సుమారు వెయ్యి ఎకరాల మామిడి తోటలకు నష్టం వాటిల్లింది. గోవర్ధనగిరిలో 100 ఎకరాలు, వీపనగండ్లలో 200, కల్వరాలలో 200, సంగినేనిపల్లిలో 150, తూంకుంటలో 100, రంగవరంలో 50 ఎకరాలతో పాటు వివిధ గ్రామాల్లో చేతికొచ్చిన మామిడి కాయలు నేలరాలాయి. ఈ విషయమై మండల ఉద్యాన అధికారి కృష్ణ మాట్లాడుతూ.. 560 ఎకరాల మామిడి తోటలకు నష్టం వాటిల్లినట్లు అంచనా వేశామని, 290 మంది రైతులు నష్టపోయారని 33 శాతం నష్టం వాటిల్లిన తోటలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. మామిడి రైతులకు నష్టం -
గాలి, వాన బీభత్సం..
ఆత్మకూర్: మండలంలో ఆదివారం రాత్రి వీచిన ఈదురు గాలులకు పలు గ్రామాల్లో వరి పంటలు నేలవాలగా.. మామిడి కాయలు టన్నుల కొద్ది రాలిపోయాయి. ఆరేపల్లిలో రైతు దేవన్న మామిడితోటలో రెండు టన్నుల కాయలు రాలిపోవడంతో రూ.1.10 లక్షల నష్టం వాటిల్లింది. అలాగే రామచంద్రయ్య తోటలో 4 టన్నులు, వెంకటన్న తోటలో 5 టన్నులు, రామకృష్ణారెడ్డి తోటలో టన్ను, అడవి నర్సింహులు తోటలో టన్ను మామిడి కాయలు రాలిపోయాయి. అలాగే వరిపంట నేలకొరిగి ధాన్యం రాలిపోయిందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చెట్లు విరిగిపడటంతో గ్రామాల్లో గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
అస్తవ్యస్తం
వనపర్తిఆహార భద్రత..మంగళవారం శ్రీ 22 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025వివరాలు 8లో u●పొరపాట్లు వాస్తవమే.. కొత్త రేషన్ కార్డుల జారీలో కొన్నిచోట్ల పొరపాట్లు చోటు చేసుకున్న మాట వాస్తవమే. సాంకేతిక సమస్యల కారణంగా ఇలా జరిగి ఉండొచ్చు. ఈ విషయాన్ని ఇప్పటికే రాష్ట్రస్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. లబ్ధిదారుల అభ్యర్థన మేరకు తప్పులను సరిచేసే ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలు సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే పొరపాట్లను సరి చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. – కాశీవిశ్వనాథ్, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి ‘ఈ ఫొటోలో కనిపిస్తున్నది పాన్‌గల్‌కు చెందిన వీరస్వామి కుటుంబం. ఆయన ప్రజాపాలన గ్రామసభలో కొత్త రేషన్‌కార్డు కోసం భార్య, కుమారుడు, కుమార్తె నిత్యశ్రీ వివరాలతో దరఖాస్తు చేసుకున్నారు. కానీ అధికారులు మాత్రం తల్లి, తండ్రి, అన్న పేర్లను ఎగ్గొట్టి.. చిన్నారికి కార్డు మంజూరు చేశారు. తాజాగా ఏప్రిల్‌లో పాన్‌గల్‌లోని ఓ రేషన్ దుకాణానికి బియ్యం కోటా సైతం విడుదల చేశారు. జిల్లాలో ఇలాంటి ఘటనలు చాలానే ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.’ వనపర్తి: ఏళ్ల తర్వాత కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయన్న ప్రజల ఆశలను జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులు అడియాశలు చేశారు. ప్రజాపాలన గ్రామసభల్లో జిల్లావ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు, పేర్ల తొలగింపు, చేర్పుల కోసం 5,700 దరఖాస్తులు వచ్చాయి. పౌరసరఫరాలశాఖ అధికారులు దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి కొత్త కార్డుల జారీ, పేర్ల తొలగింపు, చేర్పులకు కసరత్తు చేపట్టారు. ఏప్రిల్ మొదటి వరకు 1,980 కార్డులు మంజూరుకాగా.. జారీ ప్రక్రియ అస్తవ్యస్తంగా మారింది. కుటుంబంలో కొందరికి ఒకచోట, మరికొందరికి మరో మండలం (వేరే ప్రాంతం)లో పేర్లు నమోదు చేస్తూ కార్డులు జారీ చేయడంతో ఒక్కసారిగా ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. జిల్లాలో పసిపిల్లల పేరుతో మంజూరైన ఘటనలూ చాలానే ఉన్నట్లు సమాచారం. అధికారులు గుట్టుచప్పుడు కా కుండా తప్పులను సరి చేసేందుకు ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. 5,700 దరఖాస్తులు.. రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చాక కొత్తగా మరో 5,700 దరఖాస్తులు వచ్చాయి. కార్డుల జారీ, పేర్ల తొలగింపు, చేర్పులను సైతం చేపడుతున్నట్లు ప్రకటించినా.. పూర్తిస్థాయిలో వివరాలు వెల్లడించేందుకు అధికారులు వెనుకాడుతున్నారు. ఇందుకు పెద్దమొత్తంలో తప్పులు దొర్లడమే కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఏళ్ల తర్వాత కొత్త కార్డులు వస్తున్నాయన్న సంతోషం దరఖాస్తుదారుల్లో లేకుండా పోయింది. న్యూస్రీల్పోలీసు ప్రజావాణికి మూడు వినతులు వనపర్తి: జిల్లా పోలీసు కార్యాలయములో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 3 వినతులు అందాయి. డీసీఆర్బీ డీఎస్పీ, ఇన్చార్జ్ అదనపు ఎస్పీ ఉమామహేశ్వరరావు ఫిర్యాదులు స్వీకరించి వారితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సంబంధిత పోలీస్‌స్టేషన్ అధికారులకు ఫోన్‌చేసి తక్షణమే పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ఫిర్యాదుదారులకు న్యాయం అందుతుందనే భరోసా కల్పించేలా పోలీసు వ్యవస్థ పని చేస్తోందని తెలిపారు. ఉపాధ్యాయులకు శిక్షణ : డీఈఓ వనపర్తి విద్యావిభాగం: ప్రాథమిక, ఉన్నత పాఠశాలల విద్యార్థులు వివిధ అంశాల్లో వెనుకబడి ఉన్నారని వివిధ సర్వేల్లో బహిర్గతం కావడంతో ఉపాధ్యాయుల్లో నైపుణ్యాలు పెంపొందించేందుకు వేసవి సెలవుల్లో శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించిందని జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ తెలిపారు. ఈ నెల 30 వరకు మండల, జిల్లాల పరిధిలో రిసోర్స్ పర్సనన్ల ఎంపిక ప్రక్రియ పూర్తిచేసి ఎన్సీఈఆర్టీకి జాబితా పంపుతామని.. రిసోర్స్ పర్సన్స్ ఎంపిక బాధ్యత కలెక్టర్, డీఈఓ, డైట్ అధ్యాపకులు, బీఎడ్ అధ్యాపకులు, యూనివర్సిటీ అధ్యాపకులు చేపడతారని చెప్పారు. ప్రతి మండలం నుంచి ప్రతి సబ్జెక్టులో ఇద్దరు ఎస్జీటీలు, జిల్లాల పరిధిలో స్కూల్ అసిస్టెంట్లను రిసోర్స్ పర్సన్స్‌గా ఎంపిక చేస్తామని చెప్పారు. ఎంపిక ప్రక్రియ పూర్తయిన తర్వాత మే నెలలో శిక్షణ కొనసాగుతుందన్నారు. 27న మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఖిల్లాఘనపురం: మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ పాఠశాలలో 2025–26 విద్యాసంవత్సరానికిగాను ప్రవేశాలకు ఈ నెల 27న అర్హత పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ ఉమాదేవి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 నుండి 12 గంటల వరకు 5వ తరగతి విద్యార్థులకు, మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష కొనసాగుతుందని చెప్పారు. విద్యార్థులు హాల్‌టికెట్లను ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవాలని.. సకాలంలో పరీక్షకు హాజరుకావాలని పేర్కొన్నారు. జిల్లాలో కొత్తగా 1,980 రేషన్‌కార్డులు మంజూరు కుటుంబసభ్యుల పేర్లు లేకుండానే మూడేళ్ల పాపకు కార్డు జారీ.. ఆందోళనలో లబ్ధిదారులు .. సరిచేస్తామంటున్న అధికారులు చిన్నంబావి మండలం పెద్దదగడకు చెందిన ఓ కుటుంబం కొత్త రేషన్‌కార్డు కోసం ఇదివరకు నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభలో దరఖాస్తు చేసుకుంది. కుటుంబ యజమానికి అదే గ్రామంలో రేషన్‌కార్డు మంజూరు చేసి భార్య, ఇద్దరు పిల్లలకు అదే మండలంలోని అమ్మాయిపల్లిలో ఇతరుల రేషన్‌కార్డులో పేర్లు చేర్చారు. సదరు యజమాని తహసీల్దార్ కార్యాలయ అధికారులను సంప్రదించి సమస్యను వివరించగా.. సాంకేతిక సమస్యలతో పొరపాటుగా నమోదై ఉండవచ్చని, సరిచేస్తామని బదులిచ్చారు. ఒకే కుటుంబంలోని వ్యక్తులకు వేర్వేరు ప్రాంతాల్లో రేషన్ బియ్యం కోటా విడుదలైంది. -
ప్రారంభమైన ఓపెన్ ఇంటర్, ఎస్సెస్సీ పరీక్షలు
వనపర్తి విద్యావిభాగం: జిల్లాలో ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షలు ఆదివారం ప్రారంభమయ్యాయి. జిల్లాకేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాల పరీక్ష సెంటర్–ఏలో 156 మంది విద్యార్థులకు గాను 133 మంది హాజరవగా 23 మంది గైర్హాజరయ్యారు. అలాగే సెంటర్–బీలో 192కి గాను 170 మంది హాజరు కాగా 22 మంది గైర్హాజరు, జెడ్పీహెచ్ఎస్ బాలుర కేంద్రంలో 223 మందికి విద్యార్థులకు 205 మంది హాజరు కాగా 28 మంది గైర్హాజరయ్యారని, జూనియర్ కళాశాలలో 229 మందికి గాను 203 మంది హాజరు కాగా 26 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు. రంగనాథాలయంలో న్యాయమూర్తి పూజలు వనపర్తి రూరల్: జిల్లాలోని శ్రీరంగాపురంలో ప్రసిద్ధిగాంచిన శ్రీరంగనాథ స్వామి ఆలయాన్ని ఖమ్మం జిల్లా న్యాయమూర్తి రాజగోపాల్ ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు స్వాగతం పలికారు. ఆలయ ప్రాముఖ్యతను వివరించి ప్రత్యేక అర్చన చేశారు. తీర్థ ప్రసాదాలను అందించి ఆశీర్వచనాలు అందించారు. -
సంవిధాన్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
కొల్లాపూర్ రూరల్: జై బాపు, జైభీమ్, జై సంవిధాన్ అభియాన్ నినాదాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలాని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం కొల్లాపూర్‌లోని క్యాంపు కార్యాలయంలో జై బాపు, జైభీమ్, జై సంవిధాన్ అభియాన్ కార్యకర్తలతో నిర్వహించిన సన్నాహక సమావేశం మంత్రి పాల్గొని మాట్లాడారు. నాగర్‌కర్నూల్ జిల్లాలోని అన్ని గ్రామాల్లో పాదయాత్రలు చేసే విధంగా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటికి వెళ్లి స్వాతంత్య్ర పోరాటంలో కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలు, చేసిన అభివృద్ధి, అదేవిధంగా రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు అందించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా రాజ్యాంగాన్ని అవమానపరుస్తుంది.. వ్యవస్థలను ఎలా నిర్వీర్యం చేస్తుంది.. అప్రజాస్వామిక నిర్ణయాలు, తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని కోరారు. అంబేడ్కర్‌ను స్ఫూర్తిగా తీసుకొని గ్రంథాలయాల అభివృద్ధికి కృషిచేస్తున్నానని చెప్పారు. ఇందులో భాగంగా రూ.5 కోట్ల నియోజకవర్గ నిధుల నుంచి రూ.2 కోట్లు గ్రంథాలయాలు, క్రీడల అభివృద్ధికి వెచ్చిస్తానని ప్రకటించారు. ప్రతి గ్రామానికి రూ.లక్ష చొప్పున గ్రంథాలయాలకు కేటాయించామన్నారు. అంబేడ్కర్, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, మహాత్మగాంధీ వంటి మహనీయుల జీవిత చరిత్ర, వారి ఆశయాలు, సిద్ధాంతాలు తెలిపే పుస్తకాలు గ్రంథాలయాల్లో అందుబాటులో ఉంచుతామన్నారు. -
27న ప్రవేశ పరీక్ష
కొత్తకోట రూరల్: మండలంలోని అమడబాకుల మోడల్ స్కూల్లో 6వ తరగతి ప్రవేశం కోసం ఈ నెల 27న అర్హత పరీక్ష, 7, 8, 9, 10 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీ కోసం ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ మల్లికార్జున్‌గౌడ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 6వ తరగతిలో ప్రవేశం కోసం పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుందని, అలాగే 7, 8, 9, 10 తరగతుల వారికి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుందన్నారు. సోమవారం నుంచి హాల్‌టికెట్లు ఆన్‌ౖలైన్‌లో డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. 20 మంది టీచర్లకు స్పౌజ్ బదిలీలు మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: 317 జీఓలో గతంలో ఇబ్బందులకు గురైన స్పౌజ్ ఉపాధ్యాయులకు త్వరలో బదిలీ చేయాలని ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. భార్య ఒక జిల్లాలో, భర్త మరో జిల్లాలో విధులు నిర్వహిస్తున్న వారు గతంలో తమకు బదిలీ చేయాలని దరఖాస్తులు చేసుకున్నారు. ఇటీవల మంత్రి వర్గ ఉపసంఘం ఈ అంశంపై నిర్ణయం తీసుకుని బదిలీలకు ఆమోదం తెలిపింది. మొత్తంగా మహబూబ్‌నగర్ జిల్లాకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి మొత్తం 20 మంది బదిలీపై రానున్నారు. పాత ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన రంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, గద్వాల జిల్లాల నుంచి మహబూబ్‌నగర్‌కు బదిలీ కానున్నారు. కాగా 8 మంది టీచర్లు ఇక్కడి నుంచి ఇతర జిల్లాలకు బదిలీ కానున్నారు. ఇటీవల డీఎస్సీ ద్వారా ప్రభుత్వం చాలా పోస్టులు భర్తీ చేసింది. ఖాళీలు ఎక్కువ లేని క్రమంగా మహబూబ్‌నగర్ జిల్లాకు వచ్చే ఉపాధ్యాయులకు బై పోస్టుల కింద భర్తీ చేయాలని ప్రభుత్వం సూచించింది. ఈ విషయంపై డీఈఓ ప్రవీణ్‌కుమార్‌ను వివరణ కోరగా.. 20 మంది ఉపాధ్యాయులకు అన్ని పరిశీలించి ఈ నెల 22లోగా బదిలీ ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. కబడ్డీ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక వనపర్తి టౌన్: జిల్లా కబడ్డీ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం జిల్లాకేంద్రంలో ఏకగ్రీవకంగా ఎన్నుకున్నారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ అడ్‌హక్ కమిటీ చైర్మన్, ఉమ్మడి మహబూబ్‌గర్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ కురుమూర్తిగౌడ్ పర్యవేక్షణలో జరిగిన ఎన్నికకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ సభ్యులు కె.జగదీశ్వర్‌యాదవ్, రాష్ట్ర కార్యదర్శి మహేందర్‌రెడ్డి హాజరు కాగా.. ఎన్నికల అబ్జర్వర్‌గా నర్సింహులు వ్యవహరించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ ప్రధాన కార్యదర్శిగా కుర్మయ్య, అధ్యక్షుడిగా పి.వెంకటేశ్వర్‌రెడ్డి, చైర్మన్‌గా పద్మజారెడ్డి, కోశాధికారిగా గోపాల్, ఉపాధ్యక్షులుగా దామోదర్, అశోక్, వెంకటయ్య, సురేష్, వెంకటేష్, సంయుక్త కార్యదర్శులుగా తిరుపతయ్య, చంద్రశేఖర్‌గౌడ్, కిషోర్, నాగరాజు, కమలాకర్, కార్య నిర్వాహక కార్యదర్శులుగా మద్దిలేటి, వెంకటరాములు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు నూతన కార్యవర్గాన్ని శాలువా, బొకేతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా సభ్యుడు బాల రాజయ్య, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అద్దె బస్సుల డ్రైవర్ల సమ్మె విరమణ అచ్చంపేట: అచ్చంపేట ఆర్టీసీ డిపో ఎదుట గత ఐదురోజులుగా అద్దె బస్సుల ప్రైవేట్ డ్రైవర్లు చేపట్టిన సమ్మె ఆదివారం ముగిసింది. కనీస వేతనాలు ఇవ్వాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, అద్దె బస్సుల యాజమాన్యం డ్రైవర్ల శ్రమ దోపిడీని అరికట్టాలని తదితర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ హయ్యర్ అద్దె బస్సు డ్రైవర్స్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) ఆధ్వర్యంలో సమ్మె చేపట్టారు. సమ్మెతో దిగివచ్చిన యాజమాన్యాలు డ్రైవర్లకు గతం కంటే రూ.3 వేలు ఎక్కువ ఇచ్చేందుకు అంగీకరించారు. జీతాలు పెరగడంతో డ్రైవర్లు సమ్మె విరమించి విధుల్లో చేరారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి శంకర్‌నాయక్, అద్దె బస్సు ప్రైవేట్ డ్రైవర్ల నియోజకవర్గ అధ్యక్షుడు సుధాకర్ మాట్లాడుతూ అద్దె బస్సు యాజమాన్యం చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించారని చెప్పారు. సమ్మె చేయడం వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు కలగడంతో ఆర్టీసీ డీఎం జోక్యం చేసుకొని యాజమాన్యాలతో చర్చలు జరపడం వల్ల వేతనాలు పెరిగాయన్నారు. కార్యక్రమంలో నాయకులు రాములు, శ్రీహరి, అనిల్, నాగరాజు, బాలయ్య, చంద్రయ్య, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
చురుగ్గా సాగుతున్న పనులు..
ఎండీసీఏ మైదానంలో టర్ఫ్ వికెట్ పిచ్ ఏర్పాటు చేయాలనే కల నెరవేరబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. గతే డాది హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్‌కు టర్ఫ్ వికెట్ కోసం విన్నవించగా వారు సానుకూలంగా స్పందించారు. మైదానంలో టర్ఫ్ వికెట్ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. క్రీడాకారులకు మెరుగైన క్రికెట్ శిక్షణ లభిస్తుంది. హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్‌కు కృతజ్ఞతలు – ఎం.రాజశేఖర్, ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ● -
ఎండీసీఏ మైదానంలో ‘టర్ఫ్ వికెట్’
మహబూబ్‌నగర్ క్రీడలు: మహబూబ్‌నగర్ జిల్లా క్రికెట్ సంఘం (ఎండీసీఏ) ఆధ్వర్యంలో టర్ఫ్ వికెట్ పిచ్‌లు సిద్ధం చేస్తున్నారు. జిల్లాకేంద్రం పిల్లలమర్రి సమీపంలోని ఈ మైదానంలో క్రీడాకారుల సౌకర్యార్థం చాలా వసతులు అందుబాటులోకి వస్తున్నాయి. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)కు ఉన్న ఏకై క క్రీడా మైదానమిది. ఇప్పటికే ఇక్కడ క్రీడాకారుల ప్రాక్టీస్ కోసం దాతల సహకారంతో నెట్, రెండు బౌలింగ్ యంత్రాలతో పాటు పెవిలియన్ భవనాన్ని ఏర్పాటు చేశారు. ● క్రికెట్లో టర్ఫ్ వికెట్(పిచ్)లకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. కేవలం మ్యాట్ల మీద క్రికెట్ ఆడే క్రీడాకారులకు టర్ఫ్ వికెట్‌పై ఆడాలంటే మెరుగైన ప్రాక్టీస్ ఉండాల్సిందే. చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఔత్సాహిక ఉమ్మడి జిల్లా క్రికెట్ క్రీడాకారులకు కల నెరవేరనుంది. గతేడాది ఎండీసీఏ మైదానంలో వేసవి క్రికెట్ శిక్షణ శిబిరం ప్రారంభోత్సవంలో పలువురు హెచ్‌సీఏ ప్రతినిధులు పాల్గొనగా మైదానంలో టర్ఫ్ వికెట్ ఏర్పాటు కోసం ఎండీసీఏ ప్రతినిధులు వారి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో హెచ్‌సీఏ రూ.60 లక్షలు కేటాయించగా.. కొన్ని రోజులుగా పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అదే విధంగా మైదానం మొత్తం పచ్చగడ్డి (గ్రీనరీ)ని ఏర్పాటు చేస్తున్నారు. మైదానంలో వర్షపు నీరు నిలువకుండా ఎత్తు పెంచి చుట్టూ అండర్‌గ్రౌండ్ పైప్‌లైన్ వేస్తున్నారు. త్వరలో ఎండీసీఏ మైదానంలో మూడు టర్ఫ్ వికెట్ పిచ్‌లు అందుబాటులోకి రానున్నాయి. ● టర్ఫ్ వికెట్ పిచ్‌పైనే జాతీయ, అంతర్జాతీయస్థాయిలో మ్యాచ్‌లు ఆడుతారు. ఇంతకాలం మ్యాట్‌పై ఆడే జిల్లా క్రీడాకారులు టర్ఫ్ వికెట్ అందుబాటులోకి వస్తే వారి ఆటతీరు మరింత మెరుగు పడే అవకాశం ఉంటుంది. హెచ్‌సీఏ రాష్ట్రస్థాయి టోర్నీల్లో జిల్లా క్రీడాకారులు మరింతగా రాణించవచ్చు. రంజీస్థాయిలో ఆడేలా జిల్లా క్రీడాకారులను తీర్చిదిద్దవచ్చు. ఎండీసీఏ మైదానంలో టర్ఫ్ వికెట్ ఏర్పాటయితే భవిష్యత్‌లో రాష్ట్రస్థాయి మ్యాచ్‌లతో పాటు రంజీ మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉంది. త్వరలో మూడు పిచ్‌లు అందుబాటులోకి.. మైదానం మొత్తం గ్రీనరీ ఏర్పాటు భవిష్యత్‌లో రంజీ మ్యాచ్‌లకు వేదిక కానున్న పాలమూరు -
ఈదురుగాలుల బీభత్సం
గోపాల్పేట/ మదనాపురం: జిల్లాలో ఆదివారం ఈదురుగాలులు, అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఉమ్మడి గోపాల్పేట మండలంలో ఆదివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో వీచిన భారీ గాలి, అకాల వర్షానికి తీవ్రనష్టం వాటిల్లింది. గోపాల్‌పేటలోని కోదండరామస్వామి ఆలయం వద్ద ఆరబోసిన వడ్లు, వాటిపై కప్పిన కవర్లు గాల్లోకి ఎగిరిపోయాయి. చాకల్‌పల్లి, లక్ష్మీదేవిపల్లి గ్రామాల మధ్యలో పిడుగుపడి మండ్ల విశ్వనాథం, బోయ రాములుకు చెందిన 25 గొర్రెలు మృత్యువాత పడగా.. ఇద్దరు వ్యక్తులు స్వల్పంగా గాయపడ్డారు. మృతిచెందిన గొర్రెల విలువ రూ.4 లక్షలు ఉంటుందని బాధితులు వాపోయారు. బుద్దారంలో చెట్టు విరిగి విద్యుత్ స్తంభంపై పడటంతో మూడు ముక్కలైంది. గోపాల్‌పేటలోని అంబేద్కర్ కాలనీలో హైమాస్ట్ లైట్ల పోల్ ఒరిగిపోయింది. మామిడి కాయలు పెద్దమొత్తంలో రాలిపోయాయి. మదనాపురం మండల కేంద్రంలోని కొత్తకోట రహదారిలో చెట్టు విరిగిపడి కొద్దిసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అలాగే ముందు షెడ్డు కూలిపడింది. దుప్పల్లిలో సోలార్ విద్యుత్ లైట్ కిందపడింది. పెద్దమందడి మండలంలోని పామిరెడ్డిపల్లిలో అకాల వర్షానికి వరిధాన్యం తడిసిముద్దయ్యింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షాలు గోపాల్పేట మండలంలో పిడుగుపడి 25 గొర్రెలు మృతి -
‘ప్రతి గింజను కొనుగోలు చేస్తాం’
పాన్‌గల్: రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకొని మద్దతు ధర పొందాలని డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్ అన్నారు. ఆదివారం మండలంలోని దావాజిపల్లి, మాందాపూర్, బుసిరెడ్డిపల్లి, కేతేపల్లి, తెల్లరాళ్లపల్లి గ్రామాల్లో సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను వారు ప్రారంభించి మాట్లాడారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని ధాన్యం సేకరణలో రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. సన్నరకం ధాన్యానికి మద్దతు ధరతోపాటు క్వింటాల్‌కు రూ.500 బోనస్ చెల్లిస్తామన్నారు. కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని రకాల వసతులు, గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బందులు కలిగిస్తే వారిపై చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో విండో వైస్ చైర్మన్ బాలయ్య, సీఈఓ భాస్కర్‌గౌడ్, రైతులు పాల్గొన్నారు. -
స్థాయికి మించి..
అన్నిరకాల వైద్యం అందిస్తున్న ఆర్ఎంపీలు, పీఎంపీలు ●అమరచింత: జిల్లాలో కొందరు అనుమతి లేని నర్సింగ్ హోంలు, ఇతరత్రా క్లినిక్‌లు కొనసాగిస్తున్నారు. బీఎంఎస్ చదివిన వారు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఎంబీబీఎస్‌గా అవతారం ఎత్తి స్థాయికి మించి వైద్యం చేస్తూ.. ప్రజల ప్రాణాలను హరిస్తున్నారు. గైనిక్‌లు లేకున్నా ప్రసూతి కేంద్రాలు నిర్వహిస్తూ.. తల్లీబిడ్డల చావులకు కారణమవుతున్నారు. ఇటీవల ఆత్మకూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నవజాత శిశువు మృతిచెందిన సంఘటన తెలిసిందే. అయితే ఇలాంటి ఘటనలపై ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఈ క్రమంలోనే డీఎంహెచ్ఓ ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్‌లు, డయాగ్నోస్టిక్ సెంటర్లపై ఆకస్మికంగా దాడులు నిర్వహించి ఓ నర్సింగ్‌హోంను సీజ్ చేశారు. అయితే జిల్లాలో ఈ చర్యలు పూర్తిస్థాయిలో అక్రమార్కులకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. అధునాతన వసతులతో.. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అధునాతన వసతులతో వైద్య సేవలు అందుబాటులో ఉన్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. మండల కేంద్రాల్లోనే కాకుండా పల్లెల్లో సైతం ప్రభుత్వ ఆస్పత్రులు ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు పేర్కొంటున్నారు. అలాగే ఆయా ఆస్పత్రుల్లో 156 రకాల మందులు సైతం అందుబాటులో ఉంచుతూ.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్థానికంగానే అన్నిరకాల వైద్యం అందిస్తున్నారు. గ్రామాల్లోని ఆశా వర్కర్‌తోపాటు ఏఎన్ఎంలు సైతం తమ క్లస్టర్ పరిధిలోని ప్రజలకు ఎలాంటి వైద్యం అందించాలో అన్న విషయాలను ముందస్తుగానే గుర్తించి వారిని ఆస్పత్రులకు తీసుకెళ్తూ వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి మండలానికి.. మాతాశిశు సంరక్షణ్ ఆధ్వర్యంలో ప్రతి మండలానికి ఒక ప్రత్యేక అంబులెన్స్‌ను ఏర్పాటు చేశారు. గర్భిణిగా ధ్రువీకరించినప్పటి నుంచి ప్రసూతి అయ్యే వరకు ఎప్పుడు ఎలాంటి వైద్య సేవలు అందించాలి అన్న విషయాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేస్తూ.. స్కానింగ్ పరీక్షల నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లే సదుపాయం కల్పించారు. దీంతో అంగన్వాడీ టీచర్ నుంచి ఏరియా ఆశ వర్కర్, ఏఎన్ఎంలు గర్భిణికి అన్నిరకాలుగా సహాయ, సహకారాలు అందిస్తున్నారు. కాన్పులకు ముందస్తుగా వైద్యుల సూచనలతో జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లి తల్లీబిడ్డ క్షేమంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా.. నోటీసులు ఇచ్చాం.. జిల్లాలో అనుమతులు లేకుండా ప్రైవేట్ ఆస్పత్రులు నిర్వహిస్తున్న వారికి నోటీసులు ఇచ్చాం. ఇప్పటికే జిల్లాకేంద్రంతోపాటు పెబ్బేరు, ఆత్మకూర్, అమరచింతలలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించాం. వీటిలో రెండు ప్రైవేట్ ఆస్పత్రులను సీజ్ చేశాం. అలాగే ప్రైవేట్ ఆస్పత్రులు నిర్వహిస్తున్న ప్రభుత్వ వైద్యులకు సైతం సూచనలు చేశాం. – శ్రీనివాసులు, డీఎంహెచ్ఓ జిల్లాలో యథేచ్ఛగా అనుమతి లేని ఆస్పత్రుల నిర్వహణ చదివింది బీఎంఎస్.. చేసేది ఎంబీబీఎస్ వైద్యం ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని దందా పూర్తిస్థాయిలో అరికట్టలేకపోతున్న అధికార యంత్రాంగం జిల్లాలోని 255 గ్రామాల్లో సుమారు 770 కిపైగా ఆర్ఎంపీ, పీఎంపీలు క్లినిక్‌లు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. వీరు కేవలం తమ వద్దకు వైద్యం కోసం వచ్చిన వారికి ఎలాంటి వైద్యం కావాలో గ్రహించి వారిని సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లమని సలహా ఇవ్వాలి. కానీ, నిబంధనలకు విరుద్ధంగా వారే నేరుగా ఇంజెక్షన్లు, మాత్రలు ఇవ్వడం, కొన్ని సందర్భాల్లో అంతకు మించి వైద్యం చేస్తున్నారనే ఫిర్యాదులు లేకపోలేదు. గ్రామీణ ప్రాంత ప్రజల అమాకత్వాన్ని ఆసరాగా చేసుకుని తమ దందా సాగిస్తున్నారు. కొందరు ప్రభుత్వ వైద్యులు సైతం ప్రైవేట్‌గా ఆస్పత్రులు నిర్వహిస్తున్నారు. -
లేబర్ కోడ్ చట్టాలను రద్దు చేయాలి
నాగర్‌కర్నూల్ రూరల్: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్ చట్టాలను రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయలక్ష్మి అన్నారు. జిల్లాకేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి శివశంకర్ అధ్యక్షతన నిర్వహించిన సార్వత్రిక సమ్మె సన్నాహక సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కార్మికులు సాధించుకున్న 44 చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లుగా విభజించేందుకు ప్రయత్నంచిందని, ఇది సరికాదన్నారు. కార్మిక సంఘాలు పెట్టుకునే హక్కు లేకుండా, ప్రభుత్వాలను ప్రశ్నించకుండా ఈ లేబర్ కోడ్లు ఉపయోగపడతాయన్నారు. దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టి కేంద్ర ప్రభుత్వం విధానాన్ని ఎండగడతామన్నారు. ప్రభుత్వ రంగాలను నిర్వీర్యం చేస్తూ పెట్టుబడిదారులకు అప్పగిస్తే సామాన్యుడికి రిజర్వేషన్ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేవారు. దేశంలో ప్రజలను చైతన్యవంతులుగా చేసి మోదీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపే దాకా ప్రజా ఉద్యమాలు చేపడుతామన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీనివాసులు, సహాయ కార్యదర్శి పర్వతాలు, నాయకులు ఈశ్వర్, దశరథం, రామయ్య, సత్యం, బాలపీరు, శ్రీనివాసులు పాల్గొన్నారు. -
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ సంకల్పం
అమరచింత: ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి అనేక పథకాలు అమలు చేస్తోందని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. రూ.3.44 కోట్లతో చేపట్టే మండలంలోని ధర్మాపురం, నందిమళ్ల బీటీ రహదారి పనులకు శనివారం ఆయన బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ సీతాదయాకర్‌రెడ్డితో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీటీ పనులు త్వరగా ప్రారంభించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అదేవిదంగా నందిమళ్ల క్రాస్‌రోడ్డు నుంచి మిట్టనందిమళ్ల వరకు ఉన్న రహదారిని బీటీగా మార్చేందుకు రూ.4.44 కోట్లు మంజూరు చేసినట్లు వివరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రహదారుల గురించి పట్టించుకోకపోవడంతో ఆధ్వానంగా మారాయని.. సీఎం రేవంత్‌రెడ్డి గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నారని, రహదారులు, తాగునీటి వ్యవస్థ, వైద్యం, విద్యపై ప్రత్యే దృష్టి సారించి అడిగిన వెంటనే నిధులు మంజూరు చేస్తున్నారని వెల్లడించారు. అనంతరం ఈర్లదిన్నెలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగంతోనే తాను ఈరోజు ఎమ్మెల్యేగా మీముందు ఉన్నానన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతికి ఎన్నో చట్టాలు రూపొందించారని గుర్తుచేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చుకుంటామని ప్రకటనలు చేస్తోందని.. భవిష్యత్ తరాలకు మార్గదర్శిగా అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని దేశ, విదేశాల ప్రజలు ప్రశంసిస్తున్నారని తెలిపారు. పీఆర్ ప్రవీణ్, ఏఈ నరేష్, తహసీల్దార్ రవికుమార్, ఎంపీడీఓ చెన్నమ్మ, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి కేశం నాగరాజుగౌడ్, డీసీసీ నారాయణపేట అధ్య క్షుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, డీసీసీ ప్రధానకార్యదర్శి అయ్యూబ్‌ఖాన్, శ్రీనివాస్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, అరుణ్‌కుమార్, ఆశిరెడ్డి, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. -
పంటలకు నీటిని విడుదల చేయలేం
వనపర్తి: జూరాల జలాశయంలో నీటిమట్టం పడిపోయినందున తాగునీటి అవసరాలకు తప్ప సాగుకు ప్రస్తుతం నీటిని విడుదల చేయలేమని, కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి కొంత నీటిని జలాశయానికి వదిలేలా చూడాలని రాష్ట్ర మంత్రులను కలెక్టర్ ఆదర్శ్ సురభి కోరారు. శనివారం మధ్యాహ్నం మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీతక్క అన్ని జిల్లాల కలెక్టర్లతో వరి ధాన్యం కొనుగోలు, సన్నరకం బియ్యం పంపిణీ, తాగునీటి సరఫరాపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలో సీఎంఆర్ చెల్లింపుల్లో నిబంధనలు పాటించని మిల్లర్లపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2023–24 సీజన్‌కు సంబంధించి మిల్లర్ల నుంచి 72 శాతం, ఈ ఏడాది వానాకాలం సీజన్లో సైతం 50 శాతం వసూలు చేసినట్లు వివరించారు. ప్రస్తుతం 19 మిల్లులతో అగ్రిమెంట్లు కుదుర్చుకున్నట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు జి.వెంకటేశ్వర్లు, యాదయ్య, పౌర సరఫరాలశాఖ అధికారి కాశీవిశ్వనాథ్, ఇరిగేషన్ అధికారులు, మార్కెటింగ్ అధికారి స్వరణ్‌సింగ్, కో–ఆపరేటివ్ అధికారి బి.రాణి తదితరులు పాల్గొన్నారు. -
తాలు పేరిట తరుగు.. రోడ్డెక్కిన అన్నదాత
వనపర్తి రూరల్: అకాల వర్షాలతో రైతులు నష్టపోగా.. చేతికందిన ధాన్యాన్ని విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లగా తేమశాతం, తాలు పేరిట కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లు కోత విధిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని కిష్టగిరి, పెద్దగూడెంతండాలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ నెల 17న కిష్టగిరిలోని కేంద్రంలో 721 బస్తాల వరి ధాన్యం తూకం చేసి లారీలో శ్రీరంగాపురం మండలం శేరుపల్లి వద్ద ఉన్న సప్తగిరి రైస్‌మిల్లుకు తరలించారు. అక్కడ మిల్లర్లు ధాన్యంలో తాలు ఉందని.. బస్తాకు రెండు కిలోల చొప్పున తరుగు తీసేందుకు ఒప్పుకుంటేనే దించుకుంటామని రైతులకు చెప్పగా వారు అందుకు అంగీకరించలేదు. దీంతో లారీలోని ధాన్యాన్ని దించకుండా నిలిపివేశారు. తాలు పేరిట మోసం చేస్తున్నారంటూ శనివారం ఉదయం పెద్దగూడెంతండా, కిష్టగిరి రైతులు వనపర్తి రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తడంతో వనపర్తి రూరల్ ఎస్ఐ జలంధర్‌రెడ్డి సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడగా వారు ఒప్పుకోలేదు. దీంతో ఎస్ఐ పౌరఫరాలశాఖ అధికారి కాశీవిశ్వనాథ్‌తో మాట్లాడి అక్కడికి పిలిపించారు. 10 రోజల కిందట ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకొస్తే నిర్వాహకులు తాలు పేరిట కొనుగోలు చేయడం లేదని రైతులు ఆయనకు వివరించారు. అలాగే కిష్టగిరి రైతులు సప్తగిరి రైస్‌మిల్లు యాజమాన్యం ధాన్యం దించుకోవడం లేదని తెలుపడంతో జిల్లా పౌరసరఫరాల అధికారి మిల్లరుతో ఫోన్లో మాట్లాడి ప్రభుత్వ నిబంధనలు పాటించాలని సూచించారు. వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ● రైతులు తేమశాతం, తాలు చూసుకొని ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకురావాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తరుగు తీస్తారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. కావాలని ఎవరైనా కోత విధిస్తే చర్యలు తీసుకుంటాం. – కాశీ విశ్వనాథ్, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి ● నేను 82 బస్తాల ధాన్యం విక్రయించగా.. తాలు పేరిట 4 బస్తాల తరుగు తీస్తామని మిల్లరు చెబుతున్నారు. ధాన్యం కొనుగోలు సమయంలో తేమశాతం, తా లు చూసే కొనుగోలు చేశారు. ఇప్పుడు త రుగు విధిస్తామంటే ఎలా ఒప్పుకుంటాం. – కృష్ణా, రైతు, కిష్టగిరి ● నేను 215 బస్తాల ధాన్యాన్ని విక్రయించగా.. శ్రీరంగాపురం మండలం శేరుపల్లి వద్ద ఉన్న సప్తగిరి రైస్‌మిల్లుకు తరలించారు. అక్కడ తాలు పేరిట 14 బస్తాల ధాన్యం తరుగు ఇస్తే అన్లోడ్ చేసుకుంటామని చెప్పారు. అంత ధాన్యం పోతే మాకేం మిగులుతుంది. – కుర్మయ్య, రైతు, కిష్టగిరి ● రైతులతో మాట్లాడిన జిల్లా పౌరఫరాలశాఖ అధికారి, ఎస్ఐ అధికారుల హామీతో శాంతించిన రైతులు -
బాదేపల్లి యార్డుకు పోటెత్తిన మొక్కజొన్న
జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి మార్కెట్ యార్డుకు శనివారం మొక్కజొన్న దిగుబడులు పోటెత్తాయి. 4,579 క్వింటాళ్ల మొక్కజొన్న విక్రయానికి రాగా.. క్వింటాల్‌కు గరిష్టంగా రూ.2,260, కనిష్టంగా రూ.1,521 ధరలు లభించాయి. వేరుశ నగ గరిష్టంగా రూ.6, 100, కనిష్టంగా రూ.4,816, పెబ్బర్లు గరిష్టంగా రూ.4, 957, కనిష్టంగా రూ.4,617, రాగులు గరిష్టంగా రూ.2, 611, కనిష్టంగా రూ.2,511, జొన్నలు రూ.3,907, ధాన్యం హంస గరిష్టంగా రూ.1,969, కనిష్టంగా రూ.1,806, ఆర్ఎన్ఆర్ గరిష్టంగా రూ.2,209, కనిష్టంగా రూ.1,80 6, ఆముదాలు గరిష్టంగా రూ.6,278, కనిష్టంగా రూ.5,62 9, పత్తి రూ.5,389, శనగలు రూ.5,250 ధరలు లభించాయి. దేవరకద్ర లో ఆర్ఎన్ఆర్ ధాన్యం క్వింటాల్‌కు గరిష్టంగా రూ.2, 209, కనిష్టంగా రూ.1,701, హంస ధాన్యం గరిష్టంగా రూ.1,809, కనిష్టంగా రూ.1,639గా, ఆముదాలు గరిష్టంగా రూ.5,981గా ఒకే ధర వచ్చింది. -
రేపటి ప్రజావాణి రద్దు
వనపర్తి: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 17 నుంచి 26 వరకు జిల్లా అధికారులు భూ భారతి–2025 చట్టంపై మండలాల్లో రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. దీంతో సోమవారం కలెక్టరేట్లో జరిగే ప్రజావాణిని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి కలెక్టరేట్‌కు ఎవరూ రావద్దని కోరారు. నర్సింగ్‌హోం సీజ్ ఆత్మకూర్: ప్రైవేట్ ఆస్పత్రుల్లో స్థాయికి మించిన వైద్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాసులు హెచ్చరించారు. శనివారం పట్టణంలోని శ్రీసాయినర్సింగ్హోంను ఆయన తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. అమరచింత మండలం చంద్రగఢ్‌కు చెందిన గర్భిణి ప్రసవానికి వస్తే అనెస్తేషియా వైద్యుడు లేకుండానే శస్త్రచికిత్స చేసినట్లు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిర్ధారించినట్లు వివరించారు. దీంతో తల్లి క్షేమంగా ఉన్నప్పటికీ శిశువు మృతిచెందిందని, కలెక్టర్ ఆదేశాల మేరకు పూర్తిస్థాయిలో విచారణ చేసి నర్సింగ్‌హోంను సీజ్ చేయడంతో పాటు రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయనున్నట్లు వెల్లడించారు. పీయూలో కాంట్రాక్టు అధ్యాపకుల సమ్మె మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం నుంచి నిరవధిక సమ్మె బాట పట్టారు. ఈ మేరకు పీయూ ప్రధాన గేట్ వద్ద మోకాళ్లపై నిలబడి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా సంఘం నాయకులు భూమయ్య, శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ.. నెట్, సెట్, పీహెచ్డీ వంటి అర్హతలు ఉన్న అధ్యాపకులను ఎలాంటి షరతులు లేకుండా నేరుగా రెగ్యులరైజ్ చేయాలని, జీఓ నంబర్ 21ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు అధ్యాపకుల సమ్మెకు నాన్ టీచింగ్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రామ్మోహన్, బుర్రన్న సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమంలో రవికుమార్, సుదర్శన్‌రెడ్డి, విజయభాస్కర్, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, ఈశ్వర్‌కుమార్, ప్రదీప్ కుమార్, సురేశ్, మొయినుద్దీన్ పాల్గొన్నారు. -
అంతర్రాష్ట్ర బండలాగుడు పోటీలు
ఖిల్లాఘనపురం: మండలంలోని సోళీపురం గ్రామంలో శ్రీలక్ష్మీనర్సింహ యోగానందస్వామి ఉత్సవాల్లో భాగంగా శనివారం అంతర్రాష్ట్ర బండలాగుడు పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో నాగర్‌కర్నూల్ జిల్లా యాదిరెడ్డిపల్లికి చెందిన అఖిలేష్‌రెడ్డి వృషభాలు ప్రథమస్థానంలో నిలిచాయి. మొదటి బహుమతిగా రూ.40 వేల నగదు నిర్వాహకులు అందజేశారు. అదేవిధంగా చిన్నంబావి మండలం పెద్దదగడకు చెందిన గోపాలకృష్ణ ఎద్దులు రెండో స్థానంలో నిలవగా రూ.30 వేలు, మూడోస్థానంలో నిలిచిన నల్లగొండ జిల్లా కొప్పోల్ సత్యనారాయణ ఎద్దులకు రూ.20 వేలు, నాలుగో స్థానంలో నిలిచిన పెబ్బేరు ఎం.బాలరాజు ఎద్దులకు రూ.15 వేలు, ఐదోస్థానంలో నిలిచిన పాన్‌గల్ మండలం దావాజిపల్లికి చెందిన ఉనిద్యాల విష్ణు ఎద్దులకు రూ.10 వేలు, ఆరోస్థానంలోని పెబ్బేర్ మండలం గుమ్మడం గ్రామానికి చెందిన నీతుల నరసింహనాయుడు ఎద్దులకు రూ.5 వేల నగదు అందజేశారు. పోటీలను ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పూజలు చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో మండల నాయకులు రవీందర్‌రెడ్డి, క్యామ వెంకటయ్య, వెంకటేశ్వర్రావు, సాయిచరణ్‌రెడ్డి, బాలకృష్ణారెడ్డి, క్యామ రాజు, శేఖర్‌రెడ్డి, ఆగారం ప్రకాష్, రవినాయక్, బాల్‌రెడ్డి, రమేష్‌గౌడ్, ఖలీల్, వివిధ గ్రామాల నాయకులు, భక్తులు పాల్గొన్నారు. రామన్‌పాడులో తగ్గుతున్న నీటిమట్టం మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో శనివారం పూర్తిస్థాయి నీటిమట్టం 1,015 అడుగులు ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వలో 270 క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా.. సమాంతర కాల్వలో నీటి సరఫరా లేదని చెప్పారు. ఇదిలా ఉండగా జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 36 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వకు 34 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని వివరించారు. -
పేదవాడి చుట్టంలా ’భూ భారతి’
నాగర్‌కర్నూల్: పేదల భూ సమస్యలు తీర్చే చట్టమే భూ భారతి అని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని సమీకృత కార్యాలయాల సముదాయానికి హెలికాప్టర్లో చేరుకోగా ఎంపీ మల్లు రవి, రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక, సాంస్కతికశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి, కలెక్టర్ బదావత్ సంతోష్ పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం జిల్లాకేంద్రం సమీపంలోని గగ్గలపల్లిలో ఉన్న ఓ ఫంక్షన్హాల్లో భూ భారతి చట్టం–2025పై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రైతుల కన్నీరు తుడవడానికి తీసుకొచ్చిన చట్టమే భూ భారతి అని, ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికచేసి చట్టాన్ని అమలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం ఒక చట్టం రూపొందిస్తే అది పేదవాడికి చుట్టంలాగా ఉండాలని.. భూ భారతి చట్టం వందేళ్లకు సరిపడే విధంగా ఉందని తెలిపారు. ఆధార్ తరహాలో భూధార్ నంబర్ త్వరలో ఇవ్వబోతున్నామని చెప్పారు. రైతులు తమ భూ సమస్యల పరిష్కారానికి చెప్పులు అరిగేలా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగారని.. ఇప్పుడింకా ఆ అవసరం లేదని, అధికారులే రైతుల వద్దకు వచ్చి సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు. రాష్ట్ర ఎకై ్సజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా ప్రతిపక్షాలు అవాస్తవాల్ని వాస్తవాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాయని, ప్రజలు గుర్తించి పేదల అభ్యున్నతికి పాటుపడే ఇందిరమ్మ ప్రభుత్వాన్ని దీవించాలని కోరారు. ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంలో రూపొందించిన భూ భారతి చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుందని తెలిపారు. భూ సమస్యల పరిష్కారానికి ఎవరి దగ్గరకు పైరవీలకు వెళ్లాల్సిన అవసరం లేదని.. పోర్టల్‌లో అన్ని ఆప్షన్లు ఉన్నాయన్నారు. ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ.. భూ భారతి చట్టంతో రైతులందరికీ న్యాయం జరుగుతుందని తెలిపారు. కలెక్టర్ బదావత్ సంతోష్ భూ భారతి చట్టం గురించి వివరిస్తూ కొత్త ఆర్వోఆర్ చట్టం విధి విధానాలను రైతులకు తెలియజేశారు. ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి మాట్లాడుతూ.. భూ భారతి చట్టంపై అవగాహన కల్పించేందుకే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని, రైతులు సమగ్ర వివరాలు తెలుసుకోవాలని సూచించారు. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ.. ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామన్న హామీతో అధికారంలోకి వచ్చిన ప్రజా ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుందని, భూ సమస్యలు లేని రాష్ట్రాన్ని చూడబోతున్నామని వివరించారు. సదస్సుకు అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్, రెవెన్యూ అదనపు కలెక్టర్ అమరేందర్, నాగర్‌కర్నూల్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రమణారావు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. ఆధార్‌లాగే త్వరలోనే భూధార్ నంబర్ రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి -
సుమారు 25 కి.మీ.లు పయనించి..
కర్ణాటక రాష్ట్రంలో యాద్గిర్ ఫారెస్ట్ డివిజన్లో హోరంచ, అష్‌నాల్, ఎర్గోల, మినాస్‌పూర్ బ్లాక్‌లు ఉన్నాయి. మొత్తం 28,868.55 హెక్టార్ల పరిధిలో అడవులు విస్తరించినట్లు అటవీ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. జింకలు, దుప్పులు, ఎలుగుబంట్లు, చిరుతపులులు, పెద్దపులులకు ఆవాసంగా ఉన్న ఈ అడవిలో కొన్నేళ్లుగా చిరుతల సంతతి గణనీయంగా పెరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో నీరు, ఆహారం కోసం చిరుతలు ఇతర ప్రాంతాలకు వలసబాట పట్టినట్లు తెలుస్తోంది. ప్రధానంగా మినాస్‌పూర్ బ్లాక్ నుంచి సుమారు 25 కిలోమీటర్ల దూరం ప్రయాణించి నారాయణపేట జిల్లాలోకి వస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. -
సమస్యల పరిష్కారానికి డెడ్‌లైన్
సాక్షి, నాగర్‌కర్నూల్: భూ సమస్యలపై తీసుకువచ్చిన భూభారతి చట్టం–2025పై ప్రజలకు క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ధరణికి బదులుగా తీసుకువచ్చిన కొత్త రెవెన్యూ చట్టంపై ప్రజలకు అర్థమయ్యేలా వివరించేందుకు అవగాహన సదస్సులను నిర్వహిస్తోంది. గత రెవెన్యూ చట్టాలకు భిన్నంగా ఈసారి కొత్త చట్టంలో భూసమస్యల పరిష్కారానికి నిర్దేశిత గడువును విధించింది. భూరికార్డుల్లో తప్పుల సవరణ పరిష్కారం 60 రోజుల్లో పూర్తి కావాలని నిర్దేశించింది. వారసత్వ భూముల్లో హక్కుదారులను 30 రోజుల్లోగా నిర్ణయించాలని, లేకపోతే దరఖాస్తు ఆమోదించాల్సి ఉంటుందని పేర్కొంది. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సాదాబైనామా దరఖాస్తులను పరిష్క రించేందుకు సైతం చర్యలు తీసుకోగా, ఇందుకోసం గరిష్టంగా 90 రోజుల గడువు విధించింది. ఇష్టారీతిగా భూ రికార్డుల్లో మార్పులు చేయడం, మోసపూరితంగా భూమి హక్కులు, పట్టాలను పొందితే వాటిని వెంటనే రద్దు చేయనున్నారు. ప్రభుత్వ, భూదాన్, అసైన్డ్, వక్ఫ్, దేవాదాయ భూములను ఎవరైనా పట్టాలుగా పొందితే ఆ భూములన్నీ రద్దు కానున్నాయి. ఈ భూములు అన్యాక్రాంతం అయినట్టుగా అనుమానాలున్నా ప్రజలు నేరుగా సీసీఎల్ఏకు ఫిర్యాదు చేయవచ్చని భూభారతి చట్టం పేర్కొంది. ● గ్రామాల్లో ఎక్కువగా ఆబాదీ భూముల్లో ఇళ్లు నిర్మించుకుని ఉంటున్నారు. గ్రామకంఠం, ఆబాదీ భూముల్లో ఇళ్లు ఉన్నవారికి సరైన చట్టబద్ధమైన భూ హక్కులు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇళ్లస్థలాలు, ఆబాదీ, వ్యవసాయేతర భూములకు హక్కుల రికార్డులను పక్కాగా నిర్వహిస్తారు. ప్రతి భూ యజమానికి ఆధార్ తరహాలో భూధార్ కార్డులను జారీ చేస్తారు. భూభారతి పోర్టల్‌లో ఉన్న హక్కుల రికార్డు ఆధారంగా తహసీల్దార్లు భూధార్ కార్డులను జారీ చేయనున్నారు. ● కొత్త రెవెన్యూచట్టంలో సాదా బైనామా దరఖాస్తులను సైతం పరిష్కరించాలని నిర్ణయించడంతో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల్లో కదలిక రానుంది. ఈ దరఖాస్తుల పరిష్కారం కోసం విచారణకు రావాలని సంబంధిత ఆర్డీఓ నోటీసులు ఇస్తారు. ఆ తర్వాత దరఖాస్తుదారుడు అఫిడవిట్ సమర్పించాలి. ఆర్డీఓ క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి సాదాబైనామా దరఖాస్తుపై నిర్ణయం తీసుకుంటారు. వీటిలో అసైన్డ్, సీలింగ్, షెడ్యూల్ ఏరియా భూములు ఉంటే వాటిపై భూ హక్కులు ఉండవు. దరఖాస్తు సక్రమంగా తేలితే ఆర్డీఓ సర్టిఫికెట్‌ను జారీ చేస్తారు. ఈ ప్రక్రియ మొత్తం 90 రోజుల్లోగా పూర్తికావాలని చట్టంలో నిర్దేశించారు. ఉమ్మడి జిల్లాలో నేడుమంత్రి పొంగులేటి పర్యటన.. భూభారతి చట్టంపై ప్రజలకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించేందుకు నిర్వహించే అవగాహన సదస్సునకు హాజరయ్యేందుకు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శనివారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. జోగుళాంబ గద్వాలతో పాటు నాగర్‌కర్నూల్ జిల్లాల్లోని సదస్సుల్లో పాల్గొంటారు. శనివారం ఉదయం 8.50 గంటలకు జోగుళాంబ గద్వాల జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌కు హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారు. ధరూర్ మండలకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించే భూ భారతి చట్టం –2025 అవగాహన సదస్సుల్లో పాల్గొంటారు. అనంతరం 11.30 గంటలకు నాగర్‌కర్నూల్ జిల్లాకేంద్రం సమీపంలోని గగ్గలపల్లిలో ఉన్న తేజ కన్వెన్షన్ హాల్లో నిర్వహించే అవగాహన సదస్సుకు హాజరవుతారు. అనంతరం 2 గంటలకు హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్‌కు తిరుగుపయనమవుతారు. మోసపూరితంగా పట్టాలు పొందితే చర్యలు.. భూభారతిపై అవగాహన కల్పించేందుకు సిద్ధమైన ప్రభుత్వం 60 రోజుల్లో సమస్యలకు పరిష్కారం చూపేలా కొత్త రెవెన్యూ చట్టం సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు నేడు గద్వాల, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో పర్యటించనున్న మంత్రి పొంగులేటి -
త్వరగా ఖాతాలు ఇవ్వాలి..
త్రిఫ్ట్ ఫండ్ కోసం విచారించి ఎంపిక చేశారు. అధికారుల సూచన మేరకు బ్యాంకులో ఆర్డీ–1, 2 ఖాతాలు తెరిచేందుకు అమరచింత యూనియన్ బ్యాంకులో దరఖాస్తు చేసుకున్నాం. కానీ, అధికారులు ఇప్పటి వరకు ఖాతాలు తెరిచి ఇవ్వడం లేదు. విషయాన్ని జౌళీ శాఖ అధికారులకు విన్నవించినా ఫలితం లేదు. – నాగరాజు, నేత కార్మికుడు, అమరచింత వాటాధనం పెంచడం సంతోషం.. నేతన్నకు పొదుపు పథకం ద్వారా మగ్గానికి ఇద్దరే అంటూ ఎంపిక చేశారు. వీటితోపాటు గతంలో చెల్లించే వాటా ధనం కంటే అధికంగా చెల్లించాలని చెప్పారు. ప్రధాన కార్మికుడు రూ.1,200, అనుబంధ కార్మికుడికి రూ.800 చెల్లించాలని నిర్ణయించడం సంతోషంగా ఉంది. దీంతో తాము చెల్లించే వాటా ధనంకు రెండింతలు ప్రభుత్వం చెల్లించడం జరుగుతుంది. – గంజి కృష్ణయ్య, నేత కార్మికుడు, అమరచింత పారదర్శకంగా సర్వే.. నేతన్నకు పొదుపు పథకం కోసం మగ్గానికి ఇద్దరినే ఎంపిక చేయాలన్న ప్రభు త్వ ఆదేశాలతో పూర్తిస్థాయి లో పారదర్శకంగా సర్వే చేపట్టి లబ్ధిదారులను ఖరారు చేశాం. ప్రస్తు తం 600 మంది మాత్రమే వీటికి అర్హులుగా గుర్తించాం. అనుబంధ కార్మికుల గురించి ఇంకా ప్రభుత్వం నుంచి సమాచారం రాలేదు. బ్యాంకు ఖాతాల ప్రక్రియ 78 శాతం పూర్తయింది. త్వరగా నేతన్నల ఖాతాలో వాటాధనం జమ చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. – గోవిందయ్య, జౌళిశాఖ ఏడీ● -
‘నల్లమల’కు తరలిస్తున్నాం..
నారాయణపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో చిరుతల సంచారం పెరిగిన మాట వాస్తవమే. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నాం. చిరుత సంచారాన్ని తెలుసుకునేలా మోమినాపూర్, నందిగామ, నందిపాడ్ వంటి ప్రధాన చోట్ల ట్రాక్ కెమెరాలు అమర్చాం. ఈ ప్రాంతాలతోపాటు దేవరకద్ర, ధన్వాడ ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేశాం. కొత్తపల్లి మండలం నందిగామ, ధన్వాడలో ఇప్పటివరకు రెండింటిని బంధించి నల్లమల పరిధిలోని లింగాల, అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాం. మిగతా వాటిని తరలిస్తాం. ప్రజలకు ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకుంటాం.. – కమాలొద్దీన్, జోగుళాంబ సర్కిల్ అటవీ రేంజ్ ఆఫీసర్ ● -
గ్యారంటీ ఇచ్చే మిల్లులకే యాసంగి ధాన్యం
వనపర్తి: జిల్లాలో మిల్లర్లు ఎఫ్‌సీఐకి ఇవ్వాల్సిన ధాన్యం క్లియర్ చేసి బ్యాంక్ గ్యారంటీ ఇచ్చేవారికే యాసంగి వరి ధాన్యం కేటాయించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డీఎస్ చౌహాన్ స్పష్టం చేశారని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. యాసంగి ధాన్యం కొనుగోలు, సీఎంఆర్ అప్పగింతపై గురువారం అదనపు కలెక్టర్లు, రెవెన్యూ, సివిల్ సప్లయ్ అధికారులతో వీసీ నిర్వహించారు. జిల్లాలలో నిర్దేశించుకున్న మేరకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని, కేంద్రాల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లాలో 481 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు లక్ష్యంగా పెట్టుకొని.. ఇప్పటికే 379 కేంద్రాలను ప్రారంభించామన్నారు. జిల్లాలో 178 మిల్లులు ఉండగా చాలా వరకు డిఫాల్ట్ అయి కేసులు నమోదు చేసి ఉన్నాయన్నారు. యాసంగి ధాన్యం కేటాయించేందుకు ప్రస్తుతం 11 మిల్లులతో ఒప్పందం చేసుకున్నామని, ఇంకా బ్యాంక్ గ్యారంటీలు ఇవ్వలేదని చెప్పారు. సమావేశంలో సివిల్ సప్లయ్ అధికారి విశ్వనాథ్, డీఆర్డీఓ ఉమాదేవి, జిల్లా కోఆపరేటివ్ అధికారి రాణి, సివిల్ సప్లయ్ డీఎం జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు. పరిమితికి మించి వైద్యం చేస్తే చర్యలు ఆత్మకూర్: ప్రైవేట్ ఆస్పత్రుల్లో పరిమితికి మించి వైద్యం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని డీఎంహెచ్ఓ శ్రీనివాసులు అన్నారు. గురువారం ఆత్మకూర్‌లోని 8 ప్రైవేట్ ఆస్పత్రులు, 2 డెంటల్ ఆస్పత్రులు, 8 ల్యాబ్‌లను ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆస్పత్రుల్లోని రికార్డులను పరిశీలించి వైద్యుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఎంబీబీఎస్ వైద్యులు మాత్రమే వైద్యం చేయాలని, అవసరం లేకున్న పరీక్షల పేరిట రోగుల ద్వారా డబ్బులు లాగేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయన్నారు. ఆర్ఎంపీలు టైఫాయిడ్, మలేరియా ఇతర జ్వరాలకు సైతం వచ్చీరాని వైద్యం చేస్తున్నట్లు ఇది వరకే ఫిర్యాదులు వచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిమితికి మించి వైద్యం చేస్తున్న ఆస్పత్రులకు నోటీసులు జారీ చేస్తున్నామన్నారు. డీఎంహెచ్ఓ వెంట వైద్యులు వంశీకృష్ణ, రాజు, రవికుమార్ తదితరులున్నారు. చెరుకు రైతులకు బకాయిలు చెల్లించండి అమరచింత: జిల్లాలో కృష్ణవేణి షుగర్ ఫ్యాక్టరీకి చెరుకు తరలించిన రైతులకు బకాయిపడిన రూ.6 కోట్లు వెంటనే చెల్లించాలంటూ కృష్ణవేణి చెరుకు రైతు సంఘం ఆధ్వర్యంలో గురువారం ఫ్యాక్టరీ కార్యాలయంలో ఈడీ రవికుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాజన్న మాట్లాడుతూ ఫ్యాక్టరీ పరిధిలో చెరుకు కోతలు పూర్తయినా ఇప్పటి వరకు చెరుకు రైతులకు బకాయి డబ్బులను చెల్లించడం లేదన్నారు. బకాయిల చెల్లింపు వ్యవహారంపై పలుమార్లు ఫ్యాక్టరీ ఏజీఎం, డీజీఎంలకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ క్రమంలోనే జీఎం కార్యాలయం వద్ద తమ సమస్యల పరిష్కారం కోసం ధర్నా చేపట్టడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు రూ.4.50 కోట్లను చెల్లించామని ఈడీ చెరుకు కార్మిక సంఘం నాయకులకు వెల్లడించారు. దీంతో మిగిలిన మొత్తం వెంటనే రైతు ఖాతాలలో జమ చేయాలని కోరగా.. వారం రోజుల వ్యవధిలో పూర్తి స్థాయిలో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో చెరుకు రైతు సంఘం నాయకులు వాసారెడ్డి, చంద్రసేనారెడ్డి, ఆంజనేయలు, నాగేంద్రం, రంగారెడ్డి, షాలిమియా తదితరులు పాల్గొన్నారు. -
జూన్ 1 వరకు జత యూనిఫాంలు అందించాలి
ఖిల్లాఘనపురం: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు జూన్ 1 వరకు జత యూనిఫాంలను అందించాలని జిల్లా కోఆర్డినేటర్ యుగేందర్ అన్నారు. గురువారం స్థానిక ఎమ్మార్సీలో నిర్వహించిన హెచ్ఎంల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా 2025– 26 విద్యా సంవత్సరానికి గాను విద్యార్థులకు అవసరమైన యూనిఫాంలకు సంబంధించిన వస్త్రాన్ని మండల సమాఖ్యకు అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో 1 నుంచి 10వ తరగతి వరకు మొత్తం 3,537 మంది విద్యార్థులు ఉన్నారని, విద్యాశాఖ ఆదేశాల ప్రకారం మండల సమాఖ్యకు యూనిఫాంలకు కావాల్సిన వస్త్రాలను అప్పగించామన్నారు. వెంటనే కుట్టు పనులు మొదలుపెట్టి జూన్ 1 నాటికి విద్యార్థులకు ఒక జత ఇచ్చేలా చూడాలని ఏపీఎం రాంబాబుకు సూచించారు. విద్యార్థులకు కొలతల ప్రకారం చక్కగా కుట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో ఎంఈఓ జయశంకర్, క్లస్టర్ హెచ్ఎం కాళిదాసు, ఆయా పాఠశాలల హెచ్ఎంలు పాల్గొన్నారు. -
డెడ్ స్టోరేజీ
మే నెలాఖరుకు ఎడారిలా.. జూరాల ●ఎండలు ఎక్కువైతే ఇబ్బందులు.. ప్రస్తుతం జూరాలలో ఉన్ననీటి నిల్వలను పూర్తిగా తాగునీటి అవసరాలకే వినియోగిస్తాం. ఇప్పుడు జలాశయంలో అందుబాటులో ఉన్న నీరు మే నెలాఖరు వరకు సరిపోతాయి. అయితే ఎండలు ఎక్కువైతే ఇబ్బందులు రావొచ్చు. అప్పుడు పరిస్థితులను బట్టి అవసరమైన ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటాం. – రహీముద్దీన్ ఎస్ఈ జూరాల మరో తడి ఇవ్వండి.. అమరచింత ఎత్తిపోతల ద్వారా రబీలో 6 ఎకరాల్లో వరి పంట సాగు చేశా. ప్రస్తుతం జూరాల ఎడమ కాల్వ ద్వారా సాగునీటిని నిలిపేస్తున్నామని అధికారులు చెప్పారు. ఈ కాల్వకు అనుసంధానంగానే అమరచింత లిఫ్ట్‌కు సాగునీరు అందుతుంది. మరో తడి సాగు నీరు ఇస్తేనే మా పంటలు చేతికి వస్తాయి. – వెంకటేశ్వర్‌రెడ్డి, రైతు, అమరచింత రైతులను ఆదుకోవాలి.. జూరాల ప్రధాన ఎడమ కాల్వ పరిధిలోని డీ–6లో పంటలు సాగు చేస్తున్న రైతులకు ఇంకా పక్షం రోజుల పాటు నీళ్లు ఇస్తేనే పంట చేతికి వస్తుంది. ఈ విషయమై ప్రజాప్రతినిధులు, అధికారులకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం. మా పంటలు చేతికి వచ్చే విధంగా సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలి. – లక్ష్మణ్, రైతు, ఆరేపల్లి, ఆత్మకూర్ మండలం గద్వాల: ఉమ్మడి పాలమూరు జిల్లాకు పెద్దదిక్కుగా అయిన జూరాల జలాశయం గతంలో ఎన్నడూ లేనంతటి గడ్డు పరిస్థితులను ఎదుర్కోబోతోంది. వరుసగా రెండో ఏడాది కూడా జలాశయం అడుగంటిపోయింది. ఫలితంగా ఇప్పటికే సాగునీటి కష్టాలు తలెత్తగా.. రాబోయే రోజుల్లో తాగునీటికి సైతం ఇబ్బందులు ఎదురుకానున్నాయి. అధికారులు ఇప్పటికే జూరాల ఎడమ, కుడి ప్రధాన కాల్వల కింద రబీలో సాగుచేసిన ఆయకట్టుకు నీటి విడుదల పూర్తిగా నిలిపివేశారు. ప్రస్తుతం జూరాలలో అందుబాటులో ఉన్న నీటి నిల్వలు ఈ నెలాఖరు నాటికే సరిపోతాయని, మే, జూన్ నెలల్లో తాగునీటికి కూడా ఇబ్బందులు తలెత్తవచ్చని రూపొందించిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. ఈ నేపథ్యంలో రాబోయే రెండు నెలల్లో తాగునీటి గండాన్ని అధిగమించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జిల్లాకు రూ.కోటి చొప్పున రూ.5 కోట్లను ఆయా కలెక్టర్లకు విడుదల చేశారు. అడుగంటిన జలాశయం..ఆందోళనలో రైతన్నలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నది 2.871 టీఎంసీలు మాత్రమే తాగునీటి కోసం ప్రతి రోజు 0.1 టీఎంసీలు వినియోగం ఇప్పటికే ఆయకట్టు పరిధిలోనిపంటలకు సాగునీటి నిలిపివేత రాబోయే రోజుల్లో మరింత గడ్డు పరిస్థితులు -
రైతులకు ఆధార్ మాదిరిగా భూదార్ కార్డులు
ఖిల్లాఘనపురం/ కొత్తకోట రూరల్: ఇక నుంచి రైతులకు ఆధార్ మాదిరిగా భూదార్ కార్డులు ప్రభుత్వం అందజేస్తుందని, భూ భారతిలో సమస్యలు వేగంగా పరిష్కారమవుతాయని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన భూ భారతి చట్టంపై గురువారం ఖిల్లాఘనపురం, పెద్దమందడి రైతువేదికల్లో నిర్వహించిన భూ భారతి అవగాహన సదస్సులకు ఎమ్మెల్యే మేఘారెడ్డి, డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డితో కలిసి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ చట్టం ద్వారా తహసీల్దార్ చేసే మ్యుటేషన్లు, జారీ చేసిన పాస్ పుస్తకాలపై అభ్యంతరాలు ఉంటే ఆర్డీఓ, కలెక్టర్‌కు అప్పీలు చేసుకునే అవకాశం ఉందన్నారు. గతంలో ఈ వ్యవస్థ లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. కానీ, భూ భారతితో అన్ని సమస్యలకు వేగంగా పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తొందరపాటుగా కాకుండా అందరి సూచనలు, సలహాలు తీసుకుని ఈ చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు. ఈ చట్టం ద్వారా రికార్డుల్లో ఏమైనా తప్పులు, సవరణలు ఉంటే సరిదిద్దే అవకాశం ఉందన్నారు. ఈ చట్టాన్ని అమలు చేయడంతో రెవెన్యూ అధికారులది కీలక పాత్ర అని, వారికి ప్రజాప్రతినిధులు, ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ సుబ్రమణ్యం, వనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, తహసీల్దార్లు సుగుణ, సరస్వతి, పీఏసీఎస్ చైర్మన్ మురళీధర్‌రెడ్డి, మండల ప్రత్యేకాధికారి సుధీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 30 నాటికి ఎల్ఆర్ఎస్ గడువు వనపర్తి: ఈ నెల 30 నాటికి ఎల్ఆర్ఎస్ గడువు ముగుస్తున్నందున కచ్చా లే అవుట్, ప్లాట్లు రెగ్యులరైజ్ చేయించుకునే విధంగా మున్సిపల్ అధికారులు కృషి చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. హైదరాబాద్ నుంచి మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ఎల్ఆర్ఎస్ పురోగతిపై కలెక్టర్లతో వెబ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వివరిస్తూ జిల్లాలో 48,423 దరఖాస్తులకు గాను 38,726 మందికి ఫీజు చెల్లించాలని సమాచారం ఇచ్చామన్నారు. ఇప్పటి వరకు 7,405 మంది తమ ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం రూ.9.28 కోట్లు చెల్లించారని, ఇందులో 3,602 ప్లాట్లను క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశామన్నారు. శనివారం మరోసారి సమావేశం నిర్వహించి గడువులోగా అత్యధికంగా ఎల్ఆర్ఎస్ చేసుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. -
దేశంలోనే రోల్ మోడల్‌గా ‘భూభారతి’
నారాయణపేట/మద్దూర్/కొత్తపల్లి: పేదలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చిందని.. ఒక్క రూపాయి తీసుకోకుండానే భూ సమస్యలను పరిష్కరించనున్నామని.. దేశంలోనే భూ భారతి చట్టం రోల్‌మోడల్‌గా నిలుస్తుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికై న మద్దూరు మండలం ఖాజీపూర్ గ్రామంలో గురువారం ఏర్పాటు చేసిన భూ భారతి రెవెన్యూ సదస్సుకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై పోర్టల్‌ను ప్రారంభించారు. అంతకుముందు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి గ్రామస్తులు, రైతులు పెద్ద ఎత్తున మంత్రికి స్వాగతం పలకగా.. కాలినడకన రెవెన్యూ సదస్సు సభా స్థలికి చేరుకుని మాట్లాడారు. ప్రతి రైతుకు భరోసా, భద్రత కల్పించాలని ఉద్దేశంతో మేధావులతో కలిసి ఈ చట్టాన్ని రూపొందించామని, గత ప్రభుత్వ ధరణి చట్టానికి దీనికి ఎంతో తేడా ఉందన్నారు. ప్రజల వద్దకే అధికారులు.. ధరణి చట్టంతో ప్రజలు అధికారుల వద్దకు వెళ్లాల్సి ఉండేదని, భూభారతితో ప్రజల వద్దకే అధికారులు వచ్చి భూ సమస్యలను పరిష్కరిస్తారన్నారు. గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను, వీఆర్ఏ వీఆర్వో వ్యవస్థను కుప్ప కూల్చిందని, ఈ ప్రజా ప్రభుత్వంలో గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించి, అర్హులైన వారిని మళ్లీ తీసుకువచ్చి గ్రామాల్లో ఇలాంటి భూ సమస్య ఎక్కడ ఉన్నా అక్కడే పరిష్కారం చూపిస్తామన్నారు. ఎవరి పేరుతో ఎంత భూమి ఉందో అది వారికే చెందేలా చూస్తామన్నారు. మొదటి విడత 6 వేల మంది లైసెన్స్డ్ సర్వేయర్లను ఏర్పాటు చేసి వారికి శిక్షణ ఇచ్చి మ్యాప్‌పై సర్వేయర్ సంతకంతో కంప్యూటర్లో అప్లోడ్ చేయడం జరుగుతుందన్నారు. సీఎం ఇటీవల కలెక్టర్లను పిలిచి భూ భారతి చట్టం ద్వారా రైతుల భూ సమస్యలను పరిష్కరించాలని స్పష్టంగా చెప్పారన్నారు. అన్ని మండలాలకు కలెక్టర్లు వెళ్లి ఈ చట్టంపై ప్రజలు, రైతులకు అవగాహన కల్పిస్తారన్నారు. అయితే జూన్ 2 లోగా ఎంపిక చేసిన మొదటి నాలుగు పైలెట్ గ్రామాల్లో సమస్యలను పరిష్కరిస్తారన్నారు. ఆ తర్వాత ప్రతి మండలం, ప్రతి రెవెన్యూ గ్రామానికి ఇదే పద్ధతిలో అధికారులే రైతుల వద్దకు వస్తారన్నారు. సీఎం నాయకత్వంలో ఇందిరమ్మ రాజ్యం ప్రజలకు అండగా ఉంటుందన్నారు. తాము అమలు చేస్తున్న కొత్త భూభారతి చట్టాన్ని ప్రతిపక్షంలో ఉన్న వాళ్లు వినియోగించుకోవచ్చని మంత్రి సూచించారు. ధరణితో ప్రజలను ఎంత గోస పెట్టారో భూ భారతి అమలులోకి వచ్చిన తర్వాత తెలుస్తుందన్నారు. ప్రభుత్వం ఏదైనా మంచి పని చేస్తే మంచి చేసిందని చెప్పకపోయినా పర్వాలేదు కానీ.. మంచిని చెడుగా చెప్పి ప్రచారం చేస్తే మాత్రం ప్రతిపక్షానికి వచ్చే ఎన్నికలలో రెండు అంకెల సీట్లు కూడా రావని, పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల మాదిరిగా శాసనసభ ఎన్నికలలో రిపీట్ అవుతుందని జోస్యం చెప్పారు. ఒక్క రూపాయి తీసుకోకుండానే భూ సమస్యలు పరిష్కరిస్తాం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మద్దూరు మండలం ఖాజీపూర్‌లో రెవెన్యూ సదస్సు ప్రారంభం నూతన అధ్యాయానికి శ్రీకారం రాష్ట్ర ప్రభుత్వం భూ పరిపాలనలో నూతన అధ్యాయానికి శ్రీకారం చూడుతూ భూ భారతి పోర్టల్‌ను ఈ నెల 14న ప్రారంభించిందని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. జిల్లాలోని మద్దూరు మండలాన్ని పైలెట్ మండలంగా ఎంపిక చేసిందని, భూ పరిపాలనలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ పోర్టల్‌ను జిల్లా అధికార యంత్రాంగం, ఉద్యోగుల సహకారంతో విజయవంతంగా నిర్వహించడానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ సీతాదయాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, వాకిటి శ్రీహరి, చిట్టెం పర్ణికారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ వార్ల విజయ్ కుమార్, కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎనుముల తిరుపతిరెడ్డి, భూభారతి ప్రత్యేక అధికారి యాదగిరి, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జ్యోతి బుద్ధ ప్రకాష్, మంద మకరంద్, ఎస్పీ యోగేష్ గౌతమ్, అడిషనల్ కలెక్టర్ బేన్‌షాలం, కడా ప్రత్యేక అధికారి వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అధిక సాగు నేపథ్యంలో..
జూరాల జలాశయంలో నీటి నిల్వజూరాల కింద.. జూరాల జలాశయం కింద ఎడమ, కుడి ప్రధాన కాల్వలు ఉండగా.. దీని ద మొత్తం ఆయకట్టు 1.09 లక్షల ఎకరాలు. కాగా ప్రతి ఏడాది ఖరీఫ్‌లో ఎడమ ప్రధాన కాల్వ పరిధిలో వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో 72 వేల ఎకరాలు, కుడి ప్రధాన కాల్వ కింద జోగుళాంబ గద్వాల జిల్లా పరిధిలో 37 వేల ఎకరాల్లో పంటలు సాగు చేస్తారు. ఈ ఏడాది జూరాలలో నీటి నిల్వలను దృష్టిలో ఉంచుకుని ఆయా కాల్వల కింద కేవలం 35 వేల ఎకరాలకు వారబందీ విధానంలో ఏప్రిల్ 15 వరకు సాగునీటిని అందిస్తామని అధికారులు ప్రకటించారు. కానీ, రైతులు అధికంగా సుమారు 50 వేల ఎకరాల్లో వరిపంట సాగుచేయడంతో సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి -
45 రోజుల్లోనే ఫిర్యాదులకు పరిష్కారం
వనపర్తి టౌన్: విద్యుత్ వినియోగదారుల ఫోరం పరిధిలోకి వచ్చే సమస్యలను వినియోగదారులు ఫోరానికి ఎలా ఫిర్యాదు చేసినా 45 రోజుల్లోనే పరిష్కరిస్తామని ఫోరం చైర్మన్ నాగేశ్వరరావు, ఫైనాన్స్ మెంబర్ రామానుజ నాయక్ అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని డీఈ కార్యాలయం ఎదుట సీజీఆర్ఎఫ్ (కన్జ్యూమర్ గ్రీవెన్స్ రీడ్రెసెల్ ఫోరం) ఆధ్వర్యంలో గ్రీవెన్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాట్సప్, ఆన్లైన్ లేదా కార్యాలయానికి ప్రత్యక్షంగా వచ్చి, పోస్టు కార్డు ద్వారా ఫిర్యాదు చేసిన విద్యుత్ సమస్య పరిష్కారానికి ఫోరం కృషిచేస్తుందన్నారు. హైదరాబాద్ మినహా రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం, ఓల్టేజీలో హెచ్చుతగ్గులు, కొత్త కనెక్షన్ జారీలో ఆలస్యం, మీటర్, సర్వీస్ లోపాలు, రీ కనెక్షన్ సమస్యలు, కాలిపోయిన మీటర్, కనెక్షన్ మార్పిడి, బిల్లులో తప్పులు తదితర సమస్యలపై ఫోరం వినియోగదారులకు పరిష్కారం చూపుతుందన్నారు. గతేడాది ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ, సంగారెడ్డి జిల్లాల పరిధిలో విద్యుత్ ఫోరం 700 సమస్యలను పరిష్కరించిందని చెప్పారు. అలాగే చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న రైతుల సమస్యలను సైతం ఫోరం పరిష్కరిస్తుందన్నారు. విద్యుత్ ఫోరం సేవలను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ క్రమంలో ఫోరానికి 51 మంది ఫిర్యాదులు అందజేశారు. సమావేశంలో ఎస్ఈ రాజశేఖరం, డీఈ శ్రీనివాస్, అధికారులు వెంకటశివరాం, వెంకటరమణ పాల్గొన్నారు. ● ఇదిలా ఉండగా.. విద్యుత్ వినియోగదారుల ఫోరానికి స్పందన కరువైంది. క్షేత్రస్థాయిలో సమావేశంపై ప్రచారం చేయకపోవడంతో ఎవరూ రాలేకపోయారనే విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే వినియోగదారులకు కేటాయించిన సీట్లలో డీఈ, ఎస్ఈ, రెవెన్యూ కార్యాలయంలో, వివిధ మండలాలకు చెందిన ఏఈలు, ఏడీలు వినియోగదారుల మాదిరిగా అవగాహన సదస్సులో కూర్చోవడం గమనార్హం. -
ఫలించిన రైతుల ఆందోళన
జూరాల ఎడమ కాల్వకు నీటి విడుదల అమరచింత: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎడమ కాల్వ ఆయకట్టులో వరి సాగు చేసిన రైతులు తమకు నీరు అందడం లేదని, పంటలు వాడుముఖం పడుతున్నాయంటూ ప్రాజెక్టు రహదారిపై రెండు పర్యాయాలు చేసిన ఆందోళనకు ఫలితం దక్కింది. రైతుల ఆవేదనను ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రాజెక్టు ఉన్నతాధికారులకు విన్నవించడంతో ఎట్టకేలకు చివరి తడిగా రెండురోజుల పాటు నీటిని అందించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు బుధవారం జూరాల ఎడమ కాల్వకు అధికారులతో కలిసి ఎమ్మెల్యే నీటిని విడుదల చేయడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఎడమ కాల్వ పరిధిలోని అమరచింత, ఆత్మకూర్ మండలాల్లో అత్యధికంగా వరి సాగు చేయడంతో ఇరు మండలాల ప్రజలు సాగునీరు కావాలంటూ వారం రోజుల్లో రెండు పర్యాయాలు ఆందోళన చేపట్టారు. మరోతడి అవసరమే.. ఆత్మకూర్ మండలంలోని తూంపల్లి, కత్తేపల్లి, ఆరేపల్లి, మెట్లంపల్లి, జూరాల గ్రామాలతో పాటు ఇతర గ్రామాల ఆయకట్టు రైతులు ఆలస్యంగా వరి సాగుచేయడంతో సమస్య జఠిలంగా మారింది. అధికారుల అంచనా ప్రకారం మార్చి చివరి వారంలోనే పంట చేతికందాల్సి ఉంది. ఆలస్యంగా సాగు చేయడంతో 15 రోజుల తర్వాతే పూర్తిస్థాయిలో వరిపంట చేతికందే పరిస్థితి ఉంది. చివరి తడిగా బుధవారం నుంచి రెండురోజుల పాటు నీటిని వదులుతుండగా.. వచ్చేవారం రెండ్రోజుల పాటు నీటిని అందిస్తే పంటలు చేతికందుతాయంటున్నారు. జలాశయంలో నిల్వ నీటిమట్టం రోజురోజుకు తగ్గుతుండటంతో ఇదే చివరితడిగా వదులుతున్నామని, పొదుపుగా వాడుకోవాలని సూచిస్తుండటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఎత్తిపోతల రైతులు గట్టెక్కినట్లే.. జూరాల ఎడమ కాల్వకు అనుసంధానంగా ఉన్న అమరచింత ఎత్తిపోతల పథకం ఆయకట్టుకు చివరిసారిగా అందిస్తున్న నీటితో తమ పంటలు చేతికందే అవకాశం ఉందని రైతులు తెలిపారు. సాగునీరు వదిలిన వెంటనే ఆయకట్టు పరిధిలోని మూలమళ్ల, మస్తీపురం, సింగంపేట, ఖానాపురం, అమరచింత, పాంరెడ్డిపల్లిలో రైతులు వెయ్యి ఎకరాల వరి సాగుచేశారు. పొట్టదశలో ఉన్న వరి పైరుకు ప్రస్తుతం అందిస్తున్న సాగునీరు ఊపిరి పోసేలా ఉందని, పంట చేతికందుతుందనే ఆశలో ఉన్నారు. చివరి తడిగా ప్రకటించిన అధికారులు మరో తడి ఇవ్వాలంటున్న రైతన్నలు రెండ్రోజుల పాటు సరఫరా.. ప్రభుత్వ ఆదేశాలు, ఉన్నతాధికారుల సూచనల మేరకు జూరాల ఎడమ కాల్వ పరిధిలోని అమరచింత, ఆత్మకూర్ మండలాల రైతులకు సాగునీరు రెండురోజుల పాటు వదులుతున్నాం. రోజువారీగా 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నాం. పొదుపుగా వినియోగించుకోవాలని రైతులకు సూచించాం. – శ్రీనివాస్‌రెడ్డి ఎస్ఈ, జూరాల జలాశయం -
రామన్‌పాడుకు నీటి సరఫరా నిలిపివేత
మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో బుధవారం 1,015 అడుగుల నీటిమట్టం ఉందని ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ, సమాంతర కాల్వలో నీటి సరఫరా లేదని.. జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 15 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వకు 12 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కులు వినియోగిస్తున్నామని వివరించారు. నేడు విద్యుత్ గ్రీవెన్స్ డే వనపర్తిటౌన్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికిగాను గురువారం జిల్లాకేంద్రంలోని బాలానగర్ విద్యుత్ డివిజన్ కార్యాలయంలో సీజీఆర్ఎఫ్ (కన్స్యూమర్ గ్రీవెన్స్ రీడ్రెసెల్ ఫోరం), హైదరాబాద్ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు డివిజనల్ ఇంజినీర్ శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు జరిగే కార్యక్రమానికి హాజరయ్యే వినియోగదారులు ఆధార్‌కార్డు, కరెంట్ బిల్లు రసీదులను వెంట తీసుకురావాలని సూచించారు. వనపర్తి సర్కిల్ పరిధిలోని విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. డీఎంహెచ్ఓ ఆకస్మిక తనిఖీ వనపర్తి: జిల్లాకేంద్రంలోని మూడు ప్రైవేట్ ఆస్పత్రులు, క్లీనిక్‌లను బుధవారం డీఎంహెచ్ఓ డా. శ్రీనివాసులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. సాయిబాలాజీ పాలీక్లీనిక్ లైసెన్స్ పునరుద్ధరించుకోకపోవడంతో సీజ్ చేశారు. ఆర్ఎంపీలు కేవలం ప్రాథమిక చికిత్స మాత్రమే అందించాలని.. పరిమితికి మించి వైద్యం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ శ్రీనివాస్, సీసీఎస్ సీఐ రవిపాల్, ఎస్ఐలు జయన్న, రామరాజు, ఏఎస్ఐ తిరుపతిరెడ్డి ఉన్నారు. రూ.8.51 లక్షలు పలికిన తైబజార్ ఆత్మకూర్: పుర కేంద్రంలోని తైబజార్ వేలం బుధవారం పుర కార్యాలయంలో నిర్వహించారు. కమిషనర్ శశిధర్ వేలం నిర్వహించగా పట్టణానికి చెందిన కావలి కృష్ణ రూ.8,51,500 పాట పాడి దక్కించుకున్నారు. 25 శాతం చొప్పున నాలుగు విడతల్లో డబ్బులు చెల్లించాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. వేలంలో ఇద్దరు పాల్గొన్నా రని వివరించారు. పుర సిబ్బంది పాల్గొన్నారు. -
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం
అమరచింత: జూరాల ఆయకట్టు రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నామని.. చివరి తడి వరకు సాగునీరు ఇస్తామన్న హామీని ఎన్నటికీ విస్మరించమని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. బుధవారం ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎడమ కాల్వకు సాగునీటిని విడుదల చేసి మాట్లాడారు. జూరాల ప్రాజెక్టు అధికారులు యాసంగిలో రామన్‌పాడు వరకు కేవలం 20 వేల ఎకరాలకే నీటిని అందిస్తామని ప్రకటించారని, సకాలంలో కాల్వకు సాగునీటిని విడుదల చేసినా.. రైతులు ఆలస్యంగా పంటలు సాగు చేసుకోవడంతోనే ఈ పరిస్థితి దాపురించిందన్నారు. జూరాల ప్రాజెక్టులో నిల్వ నీటిమట్టం తగ్గిందని.. కర్ణాటకలోని ప్రాజెక్టు ద్వారా 5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని అక్కడి ముఖ్యమంత్రితో పాటు నీటిపారుదలశాఖ మంత్రిని కోరామని చెప్పారు. ఉమ్మడి జిల్లా ప్రజల తాగు, సాగునీటి అవసరాలకే ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, జి.మధుసూదన్‌రెడ్డి, పర్ణికారెడ్డి, అనిరుధ్‌రెడ్డి తదితరులు కలిసి కర్ణాటక ప్రభుత్వానికి సమస్యను విన్నవించడంతో జూరాలకు 4 టీఎంసీల నీటిని వదిలినట్లు తెలిపారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఆ పార్టీ నేతలు జూరాల ఆయకట్టు రైతుల గురించి ఎన్నడూ పట్టించుకోలేదని, నేడు రైతులను రెచ్చగొట్టి ధర్నాలకు పూనుకుంటున్నారని ఆరోపించారు. ఆందోళన చేస్తేనే నీటిని వదులుతున్నారని అనుకోవడం తగదని.. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రెండ్రోజుల పాటు అమరచింత, ఆత్మకూర్ మండలాల పరిధిలోని డి–6 కాల్వకు రోజువారీగా 500 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు వెల్లడించారు. రైతులు పొదుపుగా నీటిని వినియోగించుకొని పంటలు కాపాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జూరాల ప్రాజెక్టు ఎస్ఈ శ్రీనివాస్‌రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి కేశం నాగరాజుగౌడ్, డీసీసీ కార్యదర్శి అయ్యూబ్‌ఖాన్, చుక్కా ఆశిరెడ్డి, బాలకృష్ణారెడ్డి, అరుణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆయకట్టు పంటలు కాపాడేందుకే కర్ణాటకతో చర్చలు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి -
బడుల బలోపేతానికి తోడ్పాటునివ్వాలి
పాన్‌గల్: ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల చైర్మన్లు తోడ్పాటునందించాలని జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల చైర్మన్ల మండలస్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. చైర్మన్లు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేస్తూ విద్యార్థుల సంఖ్య పెంచేందుకు సహకరించాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కృత్రిమ మేధా ఆధారిత విద్యబోధన ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. అభివృద్ధి పనులకు సంబంధించిన నిధుల విడుదలలో జాప్యం జరుగుతుందని కమిటీ చైర్మన్లు వివరించగా.. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. 3వ తరగతి విద్యార్థులు శ్రీమాన్, నయనతార ఆంగ్లంలో అంబేడ్కర్ జీవిత చరిత్రను వివరించడంతో పాటు ఆంగ్లంలో మాట్లాడిన తీరును అభినందిస్తూ ఒక్కో విద్యార్థికి రూ.100 నగదు అందించారు. పాఠశాల కమిటీల చైర్మన్లతో సమావేశం నిర్వహించడం జిల్లాలోనే ప్రథమం అని ఎంఈఓ శ్రీనివాసులను డీఈఓ అభినందించారు. ఏఎంఓ మహానంది, జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాసులు, కృష్ణమూర్తి, ఎంఈఓ శ్రీనివాసులు, ఏపీఎం వెంకటేష్‌యాదవ్, పీఎస్ హెచ్ఎం పద్మ, చైర్మన్లు, సీఆర్పీలు పాల్గొన్నారు. -
ఉద్యోగ ఆధారిత కోర్సులు ప్రవేశ పెడతాం..
డిగ్రీ, పీజీ పూర్తి చేసిన విద్యార్థులు.. ఆ వెంటనే ఉద్యోగాలు సాధించే దిశగా వివిధ కోర్సుల్లో అన్ని స్థాయిల్లో సిలబస్‌లో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. కొత్త కోర్సుల వల్ల సులువుగా ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, ఫిన్‌టెక్, రీసెర్చి ఆప్టిట్యూట్, మెషిన్ టూల్స్, వంటి కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. సాధారణ తరగతులతో పాటు వీటిని బోధిస్తారు. అవకాశం ఉన్న కోర్సుల్లో మార్కులు నేరుగా విద్యార్థి మెమోలో ముద్రిస్తాం. అవకాశం లేని వాటికి నేరుగా సర్టిఫికెట్లు అందజేస్తాం. – జీఎన్.శ్రీనివాస్, వైస్ చాన్స్‌లర్, పీయూ ఉన్నత విద్యా మండలి సూచనలతో.. ప్రస్తుత సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులను ఉద్యోగాలకు సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. చదువులు పూర్తయిన వెంటనే సాంకేతిక విద్యనభ్యసించిన వారికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం, ఉన్నత విద్యా మండలి సూచనలతో సిలబస్‌లో 25 శాతం మార్పులకు చేసేందుకు కసరత్తు జరుగుతోంది. విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యనందించేందుకు కృషి చేస్తాం. – రమేష్ బాబు, రిజిస్ట్రార్, పీయూ ● -
నిబంధనల మేరకే ధాన్యం కొనుగోళ్లు
కొత్తకోట రూరల్/వనపర్తి రూరల్: ప్రభుత్వ నిబంధనల ప్రకారం తేమ శాతం 14 వచ్చిన వరి ధాన్యం కొనుగోలు చేయాలని, ఆలస్యమైతే రైతులు నష్టపోతారని కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సూచించారు. బుధవారం పెద్దమందడి, వనపర్తి మండలాల్లో 18 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించగా.. వనపర్తి మండలంలోని అంకూర్, వెంకటాపూర్, చిమనగుంటపల్లి, చిట్యాల కొనుగోలు కేంద్రాలను కలెక్టర్, ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కేంద్రాల నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. సన్నరకం ధాన్యానికి ప్రభుత్వం రూ.500 బోనస్ ఇస్తుందని, వచ్చిన ధాన్యం దొడ్డు రకమా, సన్న రకమా ఎలా గుర్తిస్తారని ప్రశ్నించారు. క్యాలీఫర్ మిషన్ ద్వారా ధాన్యం రకాన్ని గుర్తించే విధంగా శిక్షణ ఇవ్వాలని ఏపీఎంను ఆదేశించారు. కేంద్రాలకు వచ్చే రైతులకు ఇబ్బందులు కలగకుండా కనీస సౌకర్యాలు కల్పించాలని, ఎండలు తీవ్రంగా ఉన్నందున తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించాలని సూచించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు సైతం తేమ శాతం, తూకం గుర్తింపు విషయంలో అవగాహన కలిగి ఉండాలన్నారు. వచ్చిన ధాన్యాన్ని వెంటనే తూకం వేసి కొనుగోలు చేయాలని నిర్వాహకులను కోరారు. వారి వెంట మార్కెట్‌యార్డు చైర్మన్ పి.శ్రీనివాస్‌గౌడ్, పౌరసరఫరాలశాఖ అధికారి విశ్వనాథ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, తహసీల్దార్ రమేష్‌రెడ్డి, మాజీ ఎంపీపీలు కిచ్చారెడ్డి, శంకర్‌నాయక్, స్థానిక రైతులు తదితరులు పాల్గొన్నారు. -
దళారులను నమ్మి మోసపోవద్దు
వనపర్తి రూరల్: రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని చిట్యాల శివారు వ్యవసాయ మార్కెట్‌యార్డులో మహిళా సమాఖ్య ఽఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ఽధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతుల సంక్షేమానికి కాంగ్రెస్‌పార్టీ కృషి చేస్తోందని.. పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని చెప్పారు. సన్నరకం ధాన్యానికి మద్దతు ధరతో పాటు బోనస్ క్వింటాకు రూ.500 చెల్లిస్తున్నామన్నారు. కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు కలగకుండా, గన్నీ బ్యాగుల కొరత లేకుండా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కావాల్సిన అన్ని రకాల ధ్రువపత్రాలు తీసుకొస్తే డబ్బులను నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేస్తామన్నారు. కార్యక్రమంలో మండల ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు ఎత్తం చరణ్, సోషల్ మీడియా కో–ఆర్డినేటర్ గట్టు రాజు, కాంగ్రెస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు. -
రైతుల మేలుకే కొత్త భూ చట్టం
ఖిల్లాఘనపురం: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి చట్టంతో రైతులకు మేలు చేకూరనుందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని పర్వతాపురం గ్రామం రైతువేధికలో భూ భారతి చట్టం ఆవిష్కరణ కార్యక్రమాన్ని నాయకులు, అధికారులు, రైతులతో కలిసి తిలకించారు. అలాగే పలు గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణితో ఎంతోమంది రైతుల మధ్య గొడవలు జరిగాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధరణికి బదులుగా భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చారని తెలిపారు. త్వరలోనే అన్ని మండలాల్లో ఈ చట్టం అమలులోకి వస్తుందని చెప్పారు. గ్రామాల్లో సింగిల్‌విండో, ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న వరి కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ‘నిరంతర పోరాట స్ఫూర్తి జార్జిరెడ్డి’ వనపర్తి విద్యావిభాగం: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అణు భౌతికశాస్త్రంలో బంగారు పతకం సాధించిన గొప్ప మేధావి, నిరంతర పోరాట స్ఫూర్తినిచ్చిన వ్యక్తి జార్జిరెడ్డి అని పీడీఎస్‌యూ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పవన్‌కుమార్ కొనియాడారు. సోమవారం జిల్లాకేంద్రంలోని పీడీఎస్‌యూ కార్యాలయంలో నిర్వహించిన జార్జిరెడ్డి వర్ధంతి వేడుకల్లో ఆయన పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసి విప్లవ జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోరాట యోధుడు చెగువెరా స్ఫూర్తితో జార్జిరెడ్డి తన మిత్రులతో కలిసి ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘాన్ని స్థాపించారన్నారు. అనతికాలంలోనే విద్యార్థుల ఆదరణ పొంది ఎదురులేని శక్తిగా పీడీఎస్‌యూ నిలిచిందని తెలిపారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి సాయికృష్ణ, ప్రవీణ్, బీచుపల్లి, గోపి, నిఖిల్, శికామణి, నవనీత, కిరణ్, మౌనిక, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ‘భూ భారతి’కి పైలెట్ ప్రాజెక్టుగా ‘మద్దూరు’ నారాయణపేట: వ్యవసాయ భూములకు సంబందించి సమస్యల పరిష్కారం, భూ లావాదేవీలకు సంబంధించిన సమాచారం రైతులకు, ప్రజలకు సులభంగా, వేగంగా అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం భూభారతి పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. మంగళవారం ఈ పోర్టల్‌ను సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లో ప్రారంభించగా.. రాష్ట్ర వ్యాప్తంగా మూడు మండలాలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. అందులో సీఎం ఇలాఖా అయిన కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు మండలాన్ని ఎంపిక చేశారు. పైలెట్ ప్రాజెక్టు కింద మద్దూరుమండలాన్ని ఎంపిక చేయడంతో కలెక్టర్ సిక్తా పట్నాయక్, రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ బెన్‌షాలం సూచనలతో తహసీల్దార్ మహేశ్‌గౌడ్, అధికార యంత్రాంగం భూభారతిని క్షేత్ర స్థాయిలో పక్కాగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టారు. మంగళవారం నుంచి మండలంలో క్షేతస్థాయిలో రైతులకు, ప్రజలకు ముందుగా భూ భారతిపై అవగాహన కల్పించనున్నారు. ప్రజల నుంచి వచ్చే సందేహాలు, సలహాలు, సూచనలు స్వీకరించి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయనున్నారు. రెవెన్యూ గ్రామాలు 17.. భూమి 30,621 ఎకరాలు మద్దూరు మండలంలో 17 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. చెన్వార్, చెన్నారెడ్డిపల్లి, చింతల్‌దిన్నె దమ్‌గన్‌పూర్ దొరెపల్లి, జాదరావ్‌పల్లి, ఖాజీపూర్, లక్కాయపల్లి, మద్దూర్, మల్కిజాదవ్రావ్పల్లి, మొమినాపూర్, నాగిరెడ్డిపల్లి, నందిపహడ్, పల్లెర్ల, పర్సపూర్, పెదరిపాడు, రేనివట్ల గ్రామాలు ఉన్నాయి. రెవెన్యూ రికార్డుల ప్రకారం మండల వ్యాప్తంగా 30,621 ఎకరాల భూమి ఉంది. డిప్యూటీ తహసీల్దార్ పోస్టు ఖాళీగా ఉండగా ఒక ఆర్ఐ, ఒకరు సర్వేయర్ విధుల్లో ఉన్నారు. పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన మద్దూర్ మండలానికి జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తూ రెవెన్యూ, సర్వేయర్లను నియమించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. -
ఉచిత వైద్య శిబిరాలతో పేదలకు మేలు
పాన్‌గల్: ఉచిత వైద్య శిబిరాలతో పేదలకు ఎంతో మేలు చేకూరుతుందని జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాసులు అన్నారు. సోమవారం మండలంలోని రేమద్దులలో డా. బీఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని ఇండియన్ మెడికల్ అసోసియేషన్, జన విజ్ఞాన వేదిక జిల్లా కమిటీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. గ్రామాలకు వైద్యులను తీసుకొచ్చి శిబిరం నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. రోగులకు వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు కూడా పంపిణీ చేసినట్లు తెలిపారు. అంతకుముందు గ్రామంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో చిన్నపిల్లల వైద్య నిపుణుడు డా. పీజే బాబు, గైనకాలజిస్ట్ డా. మోహ, జనరల్ ఫిజీషియన్ డా. భాస్కర్ ప్రభాత్, చర్మవ్యాధి నిపుణుడు డా. కె.లక్ష్మీకుమారి, జన విజ్ఞాన వేదిక గౌరవ అధ్యక్షుడు, ఈఎన్టీ, డెంటల్ స్పెషలిస్ట్ డా. విశ్వేశ్వర్‌రెడ్డి, డా. ఎండీ ఖాదర్, పాన్‌గల్ పీహెచ్సీ వైద్యుడు డా. చంద్రశేఖర్, జన విజ్ఞాన వేధిక రాష్ట్ర కన్వీనర్ జితేందర్, ఎంఎల్‌హెచ్‌పీ వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి
వనపర్తి: భారతరత్న డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కోరారు. సోమవారం ఉదయం పట్టణంలోని అంబేడ్కర్ కూడలిలో అంబేడ్కర్ విగ్రహానికి, ఓ ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన జయంతి వేడుక సభలో ఆయనతో పాటు రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి, ఇతర సంఘాల నాయకులు పాల్గొని పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బడుగు, బలహీనవర్గాల పిల్లలు బాగా చదువుకొని సమాజంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నదే అంబేడ్కర్ ఆశయమన్నారు. ప్రతి ఒక్కరూ చదువుకోవాలి.. అందరికీ సమాన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. జిల్లాకేంద్రంలోని నల్ల చెరువుకు అంబేడ్కర్ పేరు పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జిల్లాలోని హరిజన వాడలు, హరిజన పాఠశాలలని పేరు లేకుండా వాటిని కూడా అంబేద్కర్ వాడలు, పాఠశాలలు అని నామకరణం చేయనున్నట్లు వివరించారు. విశ్రాంత ఐఏఎస్ సూచనల మేరకు ప్రతి మండలంలో కార్పొరేట్ స్థాయి పాఠశాలను ఏర్పాటు చేసి చుట్టుపక్కల గ్రామాల నుంచి విద్యార్థులను తరలించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కొత్తకాపు శివసేనారెడ్డి మాట్లాడుతూ.. అంబేడ్కర్ ప్రతి ఒక్కరికి దేవుడని, ప్రతి పేదకు న్యాయం జరగాలని, సమాన హక్కులు కల్పించాలని కలలుగన్నారని చెప్పారు. ప్రతి ఇంటికి అంబేడ్కర్ ఆశయాలను తీసుకెళ్లడమే ఆయనకు నిజమైన నివాళులన్నారు. ఎస్పీ రావుల గిరిధర్ మాట్లాడుతూ.. అంబేడ్కర్ అడుగుజాడల్లో నడవడమే ఆయనకు నిజమైన నివాళి అన్నారు. విద్యార్థులు కనీసం పీజీ వరకు చదువుకోవాలని.. మరింత అభివృద్ధి సాధించి తమ జీవన విధానాన్ని మార్చుకోవాలని సూచించారు. అనంతరం కుల సంఘం నాయకులను శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మల్లికార్జున్, అంబేడ్కర్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గంధం గట్టయ్య, ఉపాధ్యక్షుడు బోజరాజు, పుర కమిషనర్ వెంకటేశ్వర్లు, మైనార్టీ సంక్షేమశాఖ అధికారి అక్బర్, కులసంఘాల నాయకులు గంధం నాగరాజు, కిరణ్‌కుమార్, బోయ వెంకటేష్, రాజారాం, కేశవులు, మహేశ్, అక్కమ్మ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
భావితరాలకు స్ఫూర్తి ప్రదాత
వనపర్తి: డా. అంబేడ్కర్ జీవితం భావితరాలకు ఆదర్శప్రాయమని, ఆయన ఆశయాలకు అనుగుణంగా యువత దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎస్పీ రావుల గిరిధర్ కోరారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన జయంతి వేడుకలో ఆయన పాల్గొని అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారతదేశానికి ప్రజాస్వామ్యం గొప్పతనాన్ని చాటిన మహోన్నత నాయకుడన్నారు. అంటరానితనం, కుల నిర్మూలనకు ఎంతో కృషి చేశారని తెలిపారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, రిజర్వ్ సీఐలు అప్పలనాయుడు, శ్రీనివాస్, శిక్షణ ఎస్ఐలు వేణుగోపాల్, నరేష్, హిమబిందు, దివ్య, జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
వచ్చే ఏడాది నుంచి..
ప్రతి సంవత్సరం తాగునీటి అవసరాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వచ్చే ఏడాది నుంచి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. ఎల్లూరు రిజర్వాయర్ సామర్థ్యం చిన్నది కావడంతో తాగునీటి సరఫరాపై ఆందోళనలు నెలకొంటున్నాయి. పాలమూరు ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోతలు జరిగితే తాగునీటి ఇక్కట్లు పూర్తిస్థాయిలో తీరుతాయి. నార్లాపూర్ రిజర్వాయర్ నీటినిల్వ సామర్థ్యం 6 టీఎంసీల పైనే. ఒక్కసారి రిజర్వాయర్ నిండుగా ఉంచితే వేసవి మొత్తం మిషన్ భగీరథకు తాగునీరు అందుతుంది. నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి మిషన్ భగీరథ పథకానికి నీటిని మళ్లించేందుకు వీలుగా రూ.10 కోట్ల వ్యయంతో చేపట్టిన నిర్మాణాలు తుది దశకు చేరుకున్నాయి. -
దాహం తీరేనా..?!
శ్రీశైలం జలాశయంలో వేగంగా తగ్గుతున్న నీటిమట్టం తాగునీటి అవసరాలకే.. ప్రస్తుతం తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. కేఎల్ఐ ప్రాజెక్టు వద్ద 818 అడుగుల మేరకు కృష్ణానదిలో బ్యాక్ వాటర్ ఉంది. 800 అడుగుల వరకు తాగునీటి అవసరాలకు నీటిని ఎత్తిపోసుకోవచ్చు. తాగునీటి అవసరాలను బట్టే ఎత్తిపోతలు సాగుతున్నాయి. కృష్ణానదిలో బ్యాక్ వాటర్ నిల్వలు, మిషన్ భగీరథ అవసరాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలియజేస్తున్నాం. నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి మిషన్ భగీరథకు నీటిని మళ్లించేందుకు చేపట్టిన పనులు తుదిదశకు చేరాయి. ఈ పనులు పూర్తయితే తాగునీటి అవసరాలకు ఎప్పటికీ ఢోకా ఉండదు. – అంజద్ పాషా, డీఈఈ, మిషన్ భగీరథ ● మిషన్ భగీరథ అవసరాలకు కేఎల్ఐ ద్వారా ఎత్తిపోతలు ● వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చూసేందుకు చర్యలు ● యాసంగి సీజన్ ముగియడంతో నిలిచిన సాగునీటి సరఫరా ● నార్లాపూర్ రిజర్వాయర్ నిర్మాణంతో లభించనున్న శాశ్వత పరిష్కారం ప్రస్తుతం శ్రీశైలంలో ఉన్న నీరు 38.86 టీఎంసీలు ఇందులో వాడుకునే అవకాశం ఉన్నది 1.86 టీఎంసీలు కొల్లాపూర్: శ్రీశైలం బ్యాక్‌వాటర్ లెవెల్స్ క్రమంగా తగ్గుతుండటంతో తాగునీటి అవసరాలపై అధికారులు దృష్టిసారించారు. మిషన్ భగీరథ పథకం ద్వారా నీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా చర్యలు చేపట్టారు. ఇందుకోసం కేఎల్ఐ ప్రాజెక్టుకు అనుసంధానంగా కొల్లాపూర్ మండలం ఎల్లూరులో మిషన్ భగీరథ పంప్‌హౌజ్ నిర్మించారు. ఇక్కడి నుంచి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాతోపాటు రంగారెడ్డి జిల్లా 3 నియోజకవర్గాల పరిధిలోని 84 మండలాల ప్రజలకు తాగునీరు అందించేందుకు పైప్లైన్లు, వాటర్ ట్యాంకులు నిర్మించి నీటి సరఫరా చేస్తున్నారు. అయితే వేసవిలో ప్రజలకు తాగునీటి ఇక్కట్లు తలెత్తకుండా చూస్తామని అధికారులు చెబుతున్నారు. తగ్గుతున్న నీటిమట్టం.. వేసవి ప్రభావంతో శ్రీశైలంలో బ్యాక్‌వాటర్ లెవెల్స్ వేగంగా పడిపోతున్నాయి. ప్రస్తుతం డ్యాంలో 818 అడుగుల వద్ద 38.86 టీఎంసీల నీరు ఉండగా.. మిషన్ భగీరథ కోసం 800 అడుగుల (37.0 టీఎంసీల డెడ్ స్టోరేజీ) వరకు నీటిని వినియోగించుకునే వెసులుబాటు ఉంది. కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా ప్రస్తుతం తాగు, సాగునీటి అవసరాల కోసం నీటిని ఎత్తిపోస్తున్నారు. ఇప్పటికే యాసంగి సీజన్ ముగియడంతో సాగునీటి సరఫరా నిలిపివేసి.. కేవలం తాగునీటి కోసమే ఎత్తిపోతలు చేపట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. నీటి అవసరాలు తీర్చేలా... మిషన్ భగీరథ పథకానికి రోజూ 0.2 టీఎంసీల నీళ్లు అవసరం. కేఎల్ఐ ప్రాజెక్టు పరిధిలోని ఎల్లూరు రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 0.36 టీఎంసీలు. ఒక్కసారి రిజర్వాయర్‌ను నింపితే దాదాపుగా 18 రోజులపాటు తాగునీటి అవసరాలు తీరుతాయి. ప్రస్తుతం శ్రీశైలం బ్యాక్ వాటర్ లెవెల్స్ ప్రకారం వేసవి పూర్తయ్యే వరకు నీటిని ఎత్తిపోసుకునే వీలుంది. తాగునీటి కేటాయింపుల ప్రకారమే శ్రీశైలం బ్యాక్ వాటర్ వినియోగం ఉంటుంది. జలాశయం డెడ్ స్టోరేజీ 37.0 టీఎంసీలు కేఎల్ఐ కాల్వ అప్రోచ్ కెనాల్లో కృష్ణా బ్యాక్‌వాటర్ మిషన్ భగీరథకు ప్రతిరోజు అవసరమైన నీరు 0.2 టీఎంసీలు -
చౌడేశ్వరీదేవి కరుణ ఉండాలి
గోపాల్పేట: చౌడేశ్వరీదేవి కరుణ ప్రజలందరిపై ఉండాలని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి కోరారు. సోమవారం ఏదుల మండలం చెన్నారం గ్రామంలో కొనసాగుతున్న విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడే నిర్వహిస్తున్న ఎద్దులు, ట్రాక్టర్లు, పొట్టేళ్ల బండ్ల పోటీలను తిలకించారు. సరదాగా కాసేపు పొటేళ్ల బండిపై ఎక్కి ప్రయాణించారు. గ్రామస్తులంతా సంతోషంగా ఉండాలని కోరారు. పలువురు నాయకులు పాల్గొన్నారు. బండలాగుడు పోటీలు.. మండల కేంద్రంలోని కోదండ రామస్వామి ఆలయ జాతరలో భాగంగా సోమవారం పెద్దబండలాగుడు పోటీలు నిర్వహించారు. సాయంత్రం నాలుగు గంటలకు పోటీలను జాతర కమిటీ సభ్యులు ప్రారంభించారు. మొత్తం ఆరు జతల ఎద్దులు పాల్గొనగా.. మొదటి స్థానంలో హైదరాబాద్‌కు చెందిన ఆర్ఆర్ బుల్స్ శ్రీధర్‌బాబు ఎద్దులు, రెండోస్థానంలో యాదిరెడ్డిపల్లికి చెందిన టీసీఆర్ బుల్స్, మూడోస్థానంలో పీఆర్‌పల్లికి చెందిన మోతుకపాటి వెంకటసుబ్బారెడ్డి ఎద్దులు, నాలుగో స్థానంలో చిన్నంబావి మండలం గోపాలకృష్ణకు చెందిన ఎద్దులు, ఐదోస్థానంలో నంద్యాలకు చెందిన హర్షిణి బుల్స్, ఆరోస్థానంలో ఆళ్ల మదన్‌మోహన్‌రెడ్డి ఎద్దులు నిలిచాయి. పోటీలను తిలకించేందుకు మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి అధికసంఖ్యలో తరలివచ్చారు. -
ప్రమాదకర స్తంభాలు
● ఇనుప పోల్స్ తొలగింపులో జాప్యం ● కొన్నిచోట్ల సిమెంట్ స్తంభాలు శిథిలం ● భయాందోళనలో ప్రజలు వనపర్తిటౌన్: జిల్లాలోని పట్టణాలు, గ్రామాల్లో పలుచోట్ల విద్యుత్ స్తంభాలు ప్రమాదకరంగా ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నిబంధనల ప్రకారం ఏళ్ల కిందట ఏర్పాటు చేసిన ఇనుప స్తంభాలు తొలగించి వాటి స్థానంలో సిమెంట్‌వి ఏర్పాటు చేయాలి. కానీ జిల్లాకేంద్రంలోని కమాన్ చౌరస్తా, హనుమాన్ టేకిడీ, మసీద్ రోడ్, గాంధీచౌక్, శంకర్‌గంజ్, రాయిగడ్డ, పెబ్బేర్, కొత్తకోటలోని ప్రధాన రహదారులకు ఇరువైపులా ఇనుప స్తంభాలే ఉండటంతో పాటు సరైన రీతిలో లేని పరిస్థితి. భారీ వాహనాలు రాత్రిళ్లు అదుపుతప్పి ఢీ కొట్టడంతో చాలావరకు ఒరిగి ప్రమాదకరంగా ఉన్నాయి. జిల్లాకేంద్రంతో పాటు పెబ్బేరు, కొత్తకోటలో ఇలాంటి స్తంభాలు కనిపిస్తున్నా అధికారులు స్పందించి తొలగించకపోవడం గమనార్హం. గతేడాది విద్యుత్ అధికారులు ఒరిగిన, శిథిలావస్థలో ఉన్న స్తంభాల వివరాలు సేకరించినా.. ఆ వివరాలు సైతం వెల్లడించేందుకు వెనుకాడుతున్నారు. ప్రమాదం జరిగినప్పుడు.. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, ప్రజాప్రతినిధుల పర్యటనకు వచ్చినప్పడు అధికారులు హడావుడి చేయడం తప్పితే వాటి తొలగింపునకు, కొత్తవి ఏర్పాటుకు ఎలాంటి చర్యలు చేపట్టం లేదు. కొన్నిచోట్ల దుకాణాలకు ఎదురుగా సపోర్టుతో స్తంభాలు ఏర్పాటుచేసి వదిలేశారు. ఇటీవల జిల్లాకేంద్రంలోని బస్టాండ్ రోడ్లో ఓ ఇనుప స్తంభాన్ని కారు ఢీ కొటడ్డంతో రోడ్డుపై పడిపోయింది. ఆ సమయంలో సమీపంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. అదేవిధంగా కొన్నిచోట్ల సిమెంట్ స్తంభాలు నెలకొరుగుతున్నా పునరుద్ధరణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. గాంధీనగర్, ప్యాటగడ్డ, రాయిగడ్డ, పాతబజార్, బాలానగర్, పీర్లగుట్ట తదితర ప్రాంతాల్లో నేటికీ శిథిల, ప్రమాదకర స్తంభాలు కనిపిస్తున్నాయి. వీటితో వాహనాలతో పాటు ప్రజలు ప్రమాదాల బారినపడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. -
1,075 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
● పక్కా సమాచారంతో ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు ● ఉదయం నుంచి రాత్రి వరకు కొనసాగిన సోదాలు కల్వకుర్తి రూరల్: రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆకలి తీర్చాలని సంకల్పంతో రేషన్ షాపుల ద్వారా ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టింది. అయితే సన్నబియ్యం సైతం పక్కదారి పట్టిన సంఘటన కల్వకుర్తి మండలంలో వెలుగుచూసింది. సన్నబియ్యంతోపాటు దొడ్డు బియ్యం నిల్వ ఉంచినట్లు పక్కా సమాచారం రావడంతో రాష్ట్ర ఎన్ఫోర్స్మెంట్ ఏఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జిల్లా అధికారులు ఆదివారం మండలంలోని మార్చాల సమీపంలో ఉన్న శ్రీకృష్ణ రైస్‌మిల్‌పై ఆకస్మికంగా దాడులు నిర్వహించగా.. 1,075 క్వింటాళ్ల బియ్యం పట్టుబడినట్లు అధికారులు తెలిపారు. మిల్లర్లు ఇవి రేషన్ బియ్యం కావని చెప్పినప్పటికీ అధికారులు వారి మాటలను పట్టించుకోలేదు. మిల్లుకు నాలుగేళ్లుగా సీఎమ్మార్ వడ్లు ఇవ్వలేదని అధికారులు చెప్పారు. అయినా మిల్లులో ఎఫ్ఆర్కే బియ్యం దర్శనం ఇవ్వడంతో అవి రేషన్ బియ్యం అని అధికారులు తేల్చారు. ఈ బియ్యం ఎక్కడి నుంచి వచ్చాయో ఆరా తీసే పనిలో పడ్డారు. రాత్రి 10 గంటల వరకు.. రైస్ మిల్లులో రేషన్ బియ్యం నిల్వ ఉంచినట్లు సమాచారం రావడంతో అధికారులు మిల్లుకు చేరుకున్నారు. ఆ సమయంలో మిల్లు మూసి ఉండగా సంబంధిత యజమాని గుమాస్తాలతో మిల్లు తెరిపించారు. దీంతో ఏఎస్పీ వెంకటేశ్వర్లు టెక్నికల్ సిబ్బందితోపాటు జిల్లాలో పనిచేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డీటీలు, డీఎం రాజేందర్‌ను మిల్లు వద్దకు రప్పించారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్విరామంగా సోదాలు నిర్వహించారు. మిల్లులో ఉన్న రేషన్ బియ్యాన్ని వివిధ వాహనాల ద్వారా వేరే మిల్లుకు తరలించారు. మిల్లు గుమా స్తాలను అదుపులోకి తీసుకున్నారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ వెంకటేశ్వర్లు చెప్పా రు. మిల్లు యజమాని సంబు రమణపై పోలీసులకు ఫిర్యాదు చేశామని డీఎం రాజేందర్ తెలిపారు. -
కనీస మద్దతు ధరలు అమలు చేయాలి
వనపర్తి రూరల్: కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా వచ్చే నెల 20న చేపట్టే గ్రామీణ భారత్ బందును జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బాల్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రైతుల జీవితాలను, జీవనోపాధిని నాశనం చేసిన కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపే హక్కును బలవంతంగా అణచివేస్తోందన్నారు. నిరసన తెలిపే పౌరుల రాజ్యాంగ హక్కు ప్రజాస్వామ్య సమాజానికి పునాది రాయి అన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి రాత పూర్వకంగా ఇచ్చిన హామీ ప్రకారం ఎంఎస్పీ ప్రకారం కనీస మద్దతు ధరలు నిర్ణయించి కొనుగోలుకు గ్యారంటీ చేయాలని, రైతుల రుణాలను మాఫీ చేసి, రుణ విమోచన చట్టం చేయాలన్నారు. పంటల బీమా పథకాన్ని రైతాంగానికి ఉపయోగపడే విధంగా సవరిస్తూ, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. దేశంలో ప్రతిరోజు 31 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నందున వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించడం ధ్వారా వారిని అప్పుల నుంచి విముక్తి చేస్తూ రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్పొరేట్ శక్తులకు, పోలీసు అణచివేతకు వ్యతిరేకంగా దేశవ్యాప్త పిలుపులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా జరిగే గ్రామీణ భారత్ బందులో రైతు సంఘాలతో పాటు ప్రజలు, ప్రజాస్వామిక వాదులు భాగస్వామ్యం కావాలని కోరారు. సమావేశంలో రైతు సంఘం రాష్ట్ర నాయకులు ఎండీ జబ్బార్, జిల్లా ప్రధాన కార్యదర్శి పరమేశ్వరచారి, జీఎస్ గోపి, మహబూబ్‌బాషా, కృష్ణయ్య, భాస్కర్, రమేష్, జమ్ములయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఇప్పటివరకు 12,521 మెట్రిక్ టన్నుల పంపిణీ..
● అన్నం వండుకోవడానికే ఆసక్తి చూపుతున్న లబ్ధిదారులు ● పలు రేషన్ షాపుల పరిధిలో నిర్ణీత కోటా మించి డిమాండ్ ● అక్కడక్కడా కొంత మేర నూకలు.. ముద్దగా అన్నం ● దొడ్డు బియ్యంతో పోల్చితే పరవాలేదంటున్న వినియోగదారులు ● సరైన సమయంలో గంజి వార్చితే బాగుంటుందంటున్న మహిళలు ● ‘రేషన్ దుకాణాల్లో ఇదివరకు దొడ్డు బియ్యం ఇచ్చేవారు. అన్నం సరిగ్గా కాకపోయేది. వాటిని పిండి పట్టించి దోశలు ఇతర పిండి పదార్థాల తయారీకి ఉపయోగించేటోళ్లం. ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నారు. కొంత మేర నూకలు ఉన్నాయి. అన్నం ముద్దగా అవుతోంది. అయినా దొడ్డు బియ్యంతో పోల్చితే నయమే కదా. ఈ సన్న బియ్యంతో అన్నమే వండుకుంటున్నాం. సరైన సమయంలో గంజి వార్చితే అన్నం పుల్లలు పుల్లలుగా ఉంటుంది.’ అని రేషన్ లబ్ధిదారులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ● దొడ్డుబియ్యం పంపిణీ సమయంలో ఆసక్తి చూపని లబ్ధిదారులు, కిలో రూ.9, రూ.10 అంటూ బేరసారాలకు దిగే వారు.. సన్న బియ్యం వచ్చాయా.. తీసుకోవడానికి వస్తున్నాం అంటూ డీలర్లకు ఫోన్ చేసి మరీ చెబుతున్నారు... సర్కారు ఉగాది కానుకగా అమలు చేస్తున్న సన్నబియ్యం పంపిణీపై ప్రజా స్పందనకు ఇవి అద్దం పడుతున్నాయి. లబ్ధిదారులు అన్నం వండుకుని తినేందుకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది. – సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ ఉమ్మడి పాలమూరులోని మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల పరిధిలో 2,024 రేషన్ దుకాణాలు ఉన్నాయి. 9,67,639 రేషన్ కార్డులు ఉండగా.. ఏప్రిల్ కోటాకు సంబంధించి రేషన్ దుకాణాలకు సుమారు 20,469 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సరఫరా చేయాల్సి ఉంది. ఇప్పటివరకు 21,064 మెట్రిక్ టన్నులు సరఫరా కాగా.. రేషన్‌షాపుల ద్వారా లబ్ధిదారులకు శనివారం వరకు 12,521 మెట్రిక్ టన్నులు పంపిణీ చేశారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 2.60 లక్షల మంది వలస కూలీలు ఉన్నారు. ఇందులో మెజార్టీ సంఖ్యలో ముంబై, పూణే వంటి ప్రాంతాల్లో కూలీలుగా పనిచేస్తున్నారు. వీరు కాకుండా హైదరాబాద్, నగర శివారు ప్రాంతాల్లో 80 వేల మంది వరకు భవన నిర్మాణ రంగంలో మేసీ్త్రలు, అడ్డా కూలీలు, డైలీ కూలీలుగా బతుకీడుస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా సన్న బియ్యం పంపిణీ వాయిదా పడింది. అక్కడ దొడ్డు బియ్యమే పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాకు చెందిన వలస కూలీలు సొంత ప్రాంతాలకు వచ్చి రేషన్‌షాపుల్లో తమ కోటా సన్న బియ్యం తీసుకెళ్తున్నారు. దీంతో వనపర్తి జిల్లా అమరచింత, ఆత్మకూర్, మదనాపురం, కొత్తకోట, పెబ్బేరుతో పాటు మహబూబ్‌నగర్ జిల్లా గండేడ్, మహమ్మదాబాద్, హన్వాడా, కోయిల్‌కొండ, మహబూబ్‌నగర్, దేవరకద్ర, నారాయణపేట జిల్లా కోస్గి, మద్దూర్, దౌల్తాబాద్ మండలాల పరిధిలోని పలు రేషన్ దుకాణాలకు నిర్ణీత కోటాకు మించి సరఫరా చేయాలని డీలర్లు కోరుతున్నారు. ఈ మేరకు అధికారులు రేషన్ కోటా పెంచేలా ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వనపర్తి జిల్లాలో ఇప్పటివరకే కోటాకు మించి 594.478 మెట్రిక్ టన్నుల బియ్యం అదనంగా పంపిణీ చేసినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ● వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండలంలో మొత్తం 9,673 రేషన్ కార్డులు ఉన్నాయి. రేషన్ షాపులు 21 ఉండగా.. లబ్ధిదారులు 34,629 మంది ఉన్నారు. ఫిబ్రవరిలో చౌక దుకాణాలకు 203.929 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా అయ్యాయి. అదే ఏప్రిల్ నెలకు సంబంధించి ఇప్పటివరకు సుమారు నాలుగు మెట్రిక్ టన్నులు అధికంగా సరఫరా చేశారు. వలస కూలీలు వచ్చి సన్నబియ్యం తీసుకెళ్లడంతో కోటాకు మించి అధికంగా కావాల్సి వచ్చినట్లు డీలర్లు చెబుతున్నారు. బస్తాకు 3 కిలోల వరకు తక్కువగా వస్తున్నాయి.. హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వలస వెళ్లిన వాళ్లు పలువురు అక్కడే రేషన్ బియ్యం తీసుకునేవాళ్లు. అక్కడ ఎమ్మెల్సీ కోడ్ కారణంగా సన్న బియ్యం అమలు కాలేదట. దీంతో వారు ఈ నెల ఇక్కడకు వచ్చి తీసుకెళ్తున్నారు. మరోవైపు సివిల్ సప్లయ్ గోదాంల నుంచి రేషన్ దుకాణాలకు సరఫరా చేస్తున్న 50 కేజీల బస్తాల్లో ఒక్కో దాంట్లో ఒక్క కేజీ నుంచి మూడు కేజీల వరకు బియ్యం తక్కువగా వచ్చాయి. దీంతో కొంత ఇబ్బందిగా ఉంది. అధికారులు ఈ సమస్య రాకుండా చూడాలి. – బాలస్వామి, రేషన్ డీలర్, ఖానాపూర్, వనపర్తి అన్నం బాగానే అయింది.. గతంలో వేసే లావు బియ్యం తినటానికి కొంచెం ఇబ్బందిగా ఉండేది. అయితే ప్రభుత్వం ఉచితంగా సన్న బియ్యం ఇస్తుండగా.. మొన్ననే తెచ్చుకున్నాం. అవే తింటున్నాం. అన్నం చాలా బాగా అయ్యింది. కాకపోతే కొత్త బియ్యం కావడంతో మెత్తగా అయింది. ఇదే బియ్యం బయట అంగట్లో కొంటే కిలో రూ.53 పలుకుతోంది. మా లాంటి పేదోళ్లు అంత ధర పెట్టి కొనలేం. సన్న బియ్యం పంపిణీకి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం మంచి నిర్ణయమే తీసుకుంది. – వెంకటేష్, నల్లకుంట, గద్వాల సన్నబియ్యం ఇస్తుండటంతో ఊరికొచ్చి తీసుకున్నాం.. నా భార్య, పిల్లలతో సహా గత 15 సంవత్సరాల నుంచి హైదరాబాదులో ఉంటూ జీవనం సాగిస్తున్నాం. మేం మొత్తం ఐదుగురం ఉంటాం. ప్రతి నెల 35 కిలోల బియ్యం వస్తాయి. ఈసారి సన్న బియ్యం ఇస్తున్న కారణంగా మా సొంత ఊరిలో తీసుకున్నాం. సన్న బియ్యంలో కొంత నూక ఉంది. అయినా బాగానే ఉన్నాయి. అన్నం కూడా బాగానే అవుతుంది. – స్వామి, వలస కూలీ, దుప్పల్లి, మదనాపురం, వనపర్తి అవసరమైతే గడువు పెంపు.. ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల పరిధిలో శనివారం నాటికి 65 శాతం మంది లబ్ధిదారులకు సన్నబియ్యం సరఫరా చేశారు. మరో మూడు రోజుల్లో పంపిణీ పూర్తి చేసేలా అధికారులు ముందుకు సాగుతున్నారు. ఈ మేరకు వేగం పెంచాలని డీలర్లను ఆదేశించారు. నిర్దేశిత గడువు ముగిసిన తర్వాత ఇంకా ఎవరైనా లబ్ధిదారులు మిగిలి ఉన్నట్లయితే.. వారికి ఈ నెల 20వ తేదీ వరకు గడువు పెంచి అందజేయనున్నట్లు సివిల్ సప్లయ్ అధికారులు చెబుతున్నారు. జిల్లాల వారీగా సన్న బియ్యం పంపిణీ వివరాలు (మెట్రిక్ టన్నుల్లో).. జిల్లా రే.షా రే.కా ఏప్రిల్ కోటా రే.షా.ప.అ ల.ప.అ మహబూబ్‌నగర్ 506 2,53,229 5,228.000 5,129.000 3,471 జోగుళాంబ గద్వాల 335 1,63,693 3,591.429 3,591.428 2,500 నారాయణపేట 301 1,44,472 3,382.916 3,382.916 1,745 నాగర్‌కర్నూల్ 558 2,43,107 4,946.455 4,500.000 2,813 వనపర్తి 324 1,63,138 3,321.066 4,461.000 1,992 మొత్తం 2,024 9,67,639 20,469.866 21,064.344 12,521 రే.షా: రేషన్‌షాపులు,రే.కా: రేషన్‌కార్డులు, రే.షా.ప.అ: రేషన్‌షాపులకు పంపిణీ అయింది, ల.ప.అ: లబ్ధిదారులకు పంపిణీ అయింది నిర్ణీత కోటాకు మించి డిమాండ్.. -
ధాన్యం కొనుగోళ్లు షురూ
జిల్లాలో 1.95 లక్షల ఎకరాల్లో వరిపంట సాగు జిల్లాలో సాగు ఇలా.. జిల్లాలోని 14 మండలాలు, 255 గ్రామాల్లో రైతులు ఈసారి సన్న రకాలను సాగు చేస్తున్నారు. జిల్లా మొత్తంలో 1.95 లక్షల ఎకరాల్లో వరిపంట సాగు చేయగా.. 3.95 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని జిల్లా వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. జూరాల ఎడమ కాల్వ ద్వారా ఈసారి అమరచింత, ఆత్మకూర్, మదనాపురం మండలాల్లో కేవలం 20 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందగా.. మిగిలిన ఆయకట్టు రైతులు చెరువులు, బోరు బావులపై ఆధారపడి పంట పండించుకుంటున్నారు. ఆయకట్టు సాగు విస్తీర్ణం తగ్గిన రైతులు సన్నాలు సాగు చేసేందుకు ఆసక్తి చూపారు. అయితే పంట చేతికందే దశలో భూగర్భజలాలు తగ్గిపోవడంతో అక్కడక్కడ వరి ఎండిపోయి దిగుబడిపై ప్రభావం చూపింది. మొదలైన వరికోతలు.. జిల్లాలో వరి సాగుచేసిన రైతులు ఇప్పటికే చాలా వరకు పంట కోతలు మొదలుపెట్టారు. బోరు బావులు, చెరువుల కింద వరి పండించిన రైతుల పంటలు చేతికి వస్తున్నాయి. దీంతో ప్రభుత్వం కోతలు ఎక్కడెక్కడ మొదలయ్యాయి అన్న విషయాలను తెలుసుకుని ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ పరంగా సన్న, దొడ్డురకం వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం మొదలుపెట్టారు. అమరచింత: జిల్లాలో వరి పంట కోతలు, ధాన్యం కొనుగోళ్లు ఊపందుకుంటున్నాయి. కలెక్టర్ జరిపిన సమీక్షలో ఈ నెల రెండో వారంలో వరికోతలు ప్రారంభమవుతాయని, ముందస్తుగా బోరు బావుల వద్ద వరిని పండించిన రైతుల పంట కోతకు వస్తుండటంతో ఈ నెల 1 నుంచే ప్రభుత్వ పరంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించడంతో జిల్లాలో ఇప్పటికే 90 కేంద్రాలు ప్రారంభించామని సివిల్ సప్లయ్ శాఖ అధికారులు వెల్లడించారు. కాగా కొత్తకోటలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రం ద్వారా 400 క్వింటాళ్ల ధాన్యం కొన్నట్లు వివరించారు. గత వానాకాలం సీజన్లో వరిధాన్యం కొనుగోలు చేసి సకాలంలో డబ్బులు చెల్లించడంతోపాటు ప్రభుత్వం ప్రకటించిన బోనస్ డబ్బులను సైతం పూర్తిస్థాయిలో రైతులకు చెల్లించారు. ఈ క్రమంలోనే మరోమారు యాసంగి కొనుగోలుకు సైతం ప్రభుత్వం సన్నాలకు బోనస్ ప్రకటించడంతో రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వైపే దృష్టిసారిస్తున్నారు. ● ఇప్పటికే 90 చోట్ల కేంద్రాల ప్రారంభం ● సుమారు 400 క్వింటాళ్ల ధాన్యం సేకరణ ● ఊపందుకుంటున్న పంట కోతలు ● గన్నీ బ్యాగులు, టార్పాలిన్ల కొరత లేకుండా అధికారుల చర్యలు -
పేదలకు అండగా కేంద్ర పథకాలు
వనపర్తి రూరల్: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అండగా నిలుస్తున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నారాయణ అన్నారు. శనివారం శ్రీరంగాపురం మండల అధ్యక్షుడు విష్ణువర్ధన్ ఆధ్వర్యంలో శ్రీరంగాపురం మండలంలోని తాటిపాములలో గావ్ చలో కార్యక్రమంలో ఆయనతోపాటు ముఖ్య అతిథిగా జెడ్పీ మాజీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి పాల్గొని ప్రతి ఇంటికి బీజేపీ అందజేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరించారు. గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం పాఠశాలకు ఇస్తున్న పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యే దిశగా ప్రయత్నం చేస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామాల్లో బీజేపీ అభ్యర్థుల విజయానికి కార్యకర్తలు కృషిచేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు మేమారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రామన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రామన్‌పాడులో తగ్గుతున్న నీటిమట్టం మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో శనివారం వరకు పూర్తిస్థాయి నీటిమట్టం 1,015 అడుగులకు చేరిందని ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ, సమాంతర కాల్వల ద్వారా వచ్చే నీటిని నిలిపివేశారన్నారు. ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్ కాల్వ ద్వారా 24 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వల ద్వారా 63 క్యూసెక్కులు, తాగునీటి అవసరాల కోసం 20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నామని వివరించారు. పీయూలో ప్రాంగణ ఎంపికలు మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: పాలమూరు యూనివర్సిటీ (పీయూ)లోని సెమినార్ హాల్లో శనివారం ఎంఎస్ఎన్ లేబరేటరీ నిర్వాహకులు క్యాంపస్ సెలక్షన్స్ నిర్వహించారు. కాగా క్యూసీ, క్యూఏ, ప్రొడక్షన్ పోస్టుల కోసం యూజీ, పీజీ రసాయన శాస్త్రం విద్యార్థులు 60 మందికి పైగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్లేస్మెంట్ ఆఫీసర్ డా.ఎస్ఎన్ అర్జున్‌కుమార్ మాట్లాడుతూ మొదటి దశలో రాత పరీక్ష ఉంటుందన్నారు. ఇందులో అర్హత సాధించిన ఉద్యోగార్థ్లుకు తర్వాత ముఖాముఖి ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. త్వరలోనే తుది జాబితాను ప్రకటిస్తామన్నారు. కార్యక్రమంలో పీయూ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ డా.మధుసూదన్‌రెడ్డి, హెచ్ఆర్ సుబ్బారావుతో పాటు క్యూసీ మేనేజర్లు పాల్గొన్నారు. -
వైభవంగా అలంకారోత్సవం
ఆత్మకూర్: అమరచింత మండలంలోని నందిమల్లలో వెలసిన చింతల మునిరంగస్వామి, నల్లారెడ్డిస్వామి జారత ఉత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆత్మకూర్‌లోని ఎస్బీఐ బ్యాంకులో భద్రపరిచిన స్వామివారి నగలు, అలంకారోత్సవాన్ని భాజా భజంత్రీలు, ప్రత్యేక పూజలతో ఊరేగింపుగా ఆలయానికి చేర్చారు. సాయంత్రం కృష్ణానది తీర్థావళి కార్యక్రమం నిర్వహించారు. జాతర ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సేవ, అర్చన, ఆరాధన, రాత్రి 11.15 గంటలకు ప్రభోత్సవం, సోమవారం ఆరాధన, అర్చన, రాత్రి 1.30 గంటలకు రథోత్సవం, పల్లకీసేవ, దశమికట్ట వరకు ఊరేగింపు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర గీత కార్మిక డిపార్ట్మెంట్ చైర్మన్ నాగరాజుగౌడ్, సీఐ శివకుమార్, ఎస్ఐ సురేష్, నిర్వాహకులు అరవింద్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, సత్యారెడ్డి, రాజు, నర్సింహు లు, శ్రీధర్, భక్తులు పాల్గొన్నారు. -
ఎక్కువగా నీరు తాగుతూ ఉండాలి..
రోడ్లపై విధులు నిర్వహించే పోలీస్ సిబ్బంది వీలైనంత ఎక్కువగా నీరు తాగుతూ ఉండాలి. ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోజ్ కలిపిన నీటిని సైతం తీసుకోవాలి. ఎండలోనే ఎక్కువ సమయం నిలబడి ఉండే వారు నిమ్మరసం, కొబ్బరి నీళ్లు సైతం మేలు చేస్తాయి. చెమటలో నీటితో పాటు లవణాలు ఉంటాయి. వీటిలో సోడియం, క్లోరైడ్ ముఖ్యమైనవి. రోజుకు ఐదు లీటర్ల నీటిని తీసుకోవడంతో పాటు పండ్ల రసాలు, ద్రవ పదార్థాలు తీసుకుంటే మంచిది. – డాక్టర్ ఏజీ శంకర్, జనరల్ మెడిసిన్, మహబూబ్‌నగర్ జాగ్రత్తలు పాటిస్తున్నాం జిల్లా ఎస్పీ సూచన మేరకు ఆరోగ్య జాగ్రత్తలు పాటించడంతో పాటు ఇటీవల ఎస్పీ ట్రాఫిక్ సిబ్బందికి కూలింగ్ వాటర్ బాటిల్స్, క్యాప్‌లు, కూలింగ్ గ్లాస్లు అందజేశాం. అలాగే ఆరోగ్య పరీక్షలు సైతం చేయించారు. నిత్యం సిబ్బందికి ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు ఇస్తున్నాం. – భగవంతురెడ్డి, ట్రాఫిక్ సీఐ, మహబూబ్‌నగర్ ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి.. పట్టణంలో ఉన్న ట్రాఫిక్ పాయింట్లు మొత్తం తిరుగుతూ తనిఖీలు చేస్తుంటాను. ధర్నాలు, ర్యాలీలు, ఇతర ట్రాఫిక్ సమస్యలు వస్తే సంఘటనా స్థలానికి వెంటనే వెళ్తుంటాను. ఇటీవల ఉన్నతాధికారులు అద్దాలు, టోపీలు, వాటర్‌బాటిల్స్ ఇవ్వడం వల్ల సిబ్బందికి ఉపయోగకరంగా మారాయి. మా వ్యక్తిగతంగా కూడా ఆరోగ్యపరంగా రక్షణ చర్యలు తీసుకుంటున్నాం. – లక్ష్మయ్య, ఏఎస్ఐ, మహబూబ్‌నగర్ ద్రవ పదార్థాలు తీసుకుంటున్నాం.. దాదాపు ఆరు గంటల పాటు రోడ్లపై విధులు నిర్వహించడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ప్రధానంగా నీరు అధికంగా తాగుతున్నాం. ఉన్నతాధికారులు ఇచ్చిన టోపీలు, అద్దాలు ఉపయోగపడుతున్నాయి. కొన్ని సందర్భాల్లో తలనొప్పి వంటి సమస్య వస్తే మజ్జిగ, ఇతర ద్రవ పదార్థాలు తీసుకుంటాం. ఉన్నతాధికారుల నుంచి కావాల్సిన సహాయం అందుతుంది. – రాఘవేందర్, ట్రాఫిక్ కానిస్టేబుల్, మహబూబ్‌నగర్ ఎండతో ఇబ్బందికరం.. ట్రాఫిక్ నియత్రించేందుకు ఎండలో నిలబడటం వల్ల ఎండవేడిమితో ఇబ్బందికరంగా ఉంది. షిఫ్ట్‌ల వారీగా విధులు ఉండటంతో కొంత ఉపశమనంగా ఉంది. ఎండవేడిమి నుంచి రక్షణ పొందేందుకు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో కూలింగ్ గ్లాసెస్‌తో పాటు టోపీలను అందజేశారు. ఎండలో ట్రాఫిక్ డ్యూటీలో ఉండే సిబ్బంది వడదెబ్బకు గురికాకుండా ఉండటంకోసం ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేస్తున్నారు. – శ్రీనివాస్, ట్రాఫిక్ కానిస్టేబుల్, నాగర్‌కర్నూల్ ● -
భక్తుల ఇలవేల్పు చింతల మునిరంగడు
అమరచింత: శ్రీమహావిష్ణువుగా కొలువుదీరి భక్తుల ఇంటి ఇలవేల్పుగా వెలుగొందుతున్న చింతల మునిరంగస్వామి ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. మండలంలోని పాత ఈర్లదిన్నెలో వెలసిన శ్రీచింతల మునిరంగస్వామి బ్రహ్మోత్సవాలు పౌర్ణమి రోజు నుంచి మూడురోజులపాటు అత్యంత వైభవంగా కొనసాగనున్నాయి. ఇక్కడి స్వామివారికి భక్తులు పొట్టేళ్లు, కోళ్లు బలి ఇచ్చి నైవేద్యం సమర్పించిన తర్వాత.. మళ్లీ తీపి వంటలతో నైవేద్యాలను సమర్పించి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ. అయితే చింతల మునిరంగస్వామి జాతర ఉత్సవాలు ఆదివారం నుంచి మంగళవారం వరకు మూడు రోజుల పాటు కొనసాగనున్నాయి. ఆదివారం రాత్రి స్వామివారి పల్లకీసేవ కార్యక్రమంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. సోమవారం ప్రభోత్సవం, మంగళవారం జంతుబలితోపాటు నైవేద్యాల సమర్పణ ఉంటుంది. జాతరకు జోగుళాంబ గద్వాల జిల్లా నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. స్వామివారికి మాంసం.. తీపి వంటలతో నైవేద్యాలు నేటినుంచి మూడురోజులపాటు బ్రహ్మోత్సవాలు -
మన్యంకొండలో వైభవంగా కల్యాణం
మహబూబ్‌నగర్ రూరల్: మన్యంకొండ శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో శనివారం స్వామివారి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రతినెల పౌర్ణమి రోజు స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శోభాయమానంగా అలంకరించిన పల్లకిలో స్వామి దంపతులను గర్భగుడి నుంచి దేవస్థానం సమీపంలోని మండపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. సన్నాయి వాయిద్యాలు, పురోహితుల వేదమంత్రాల మధ్య ఈ ఊరేగింపు ముందుకు కదిలింది. అనంతరం స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ఆశేష భక్తులు తిలకిస్తుండగా పురోహితుల మంత్రోచ్ఛరణలు, సన్నాయి వాయిద్యాల మధ్య అమ్మవారి మంగళసూత్రధారణ కనులపండువగా సాగింది. అనంతరం తలంబ్రాల కార్యక్రమాన్ని నిర్వహించారు. రకరకాల పూలు, వివిధ ఆభరణాల అలంకరణలో స్వామివారి దంపతులు ధగధగ మెరిసిపోతూ భక్తకోటికి దర్శనమిచ్చారు. దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్‌కుమార్, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారి పాల్గొన్నారు. -
తప్పని వెతలు
ఎండలో విధులు.. వడగాల్పుల నడుమ ట్రాఫిక్ పోలీసుల విధులు ఒకవైపు పోటెత్తిన వాహనాలు.. మరోవైపు నిప్పులు కురిసేలా ఎండ.. ఒక్క క్షణం ఆదమరిచినా ముంచుకొచ్చే ప్రమాదాలు. ఎండల్లో ట్రాఫిక్ పోలీసుల విధి నిర్వహణ కత్తిమీద సామే. నిప్పుల కుంపటిపై నిల్చొని పని చేస్తున్నట్లు ఉన్నా.. వేడి గాలులు వీస్తున్నా.. వడదెబ్బలు తగులుతున్నా.. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉంటున్నారు. – మహబూబ్‌నగర్ క్రైం ఉదయం 8 గంటల నుంచే ఎండ దంచికొడుతోంది. ప్రస్తుతం దాదాపు 41 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భానుడి భగభగకు బయటకు రావాలంటే భయపడే పరిస్థితి.. కానీ ట్రాఫిక్ పోలీసులకు సెగలు కక్కుతున్న ఎండలో విధులు కొనసాగిస్తున్నారు. రోజురోజుకు పెరిగిపోతున్న ఎండలతో రోడ్లపై విధులు నిర్వహించే పోలీసులకు ఇబ్బందులు ఎదురవుతున్నా సమర్థవంతంగా వారి బాధ్యతలు పూర్తి చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఏకై క ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ మహబూబ్‌నగర్‌లో ఉండగా.. ఇక్కడ మొత్తం 55 మంది పోలీస్ సిబ్బంది పని చేస్తున్నారు. ఇందులో ఒక సీఐతో పాటు ఇద్దరూ ఎస్ఐలు, ఒక ఏఎస్ఐ, 12 మంది హెడ్‌కానిస్టేబుల్స్, 32 మంది కానిస్టేబుల్స్, ఏడుగురు హోంగార్డులు ఉన్నారు. మిగతా జిల్లాలో ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ లేనప్పటికీ ట్రాఫిక్ కోసం ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించారు. వనపర్తి జిల్లాలో ఏఆర్ ఎస్ఐ, ఏఎస్ఐ,12 మంది కానిస్టేబుల్స్, నలుగురు హోంగార్డులు, గద్వాల జిల్లాలో ఒక ఏఆర్ ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు, ఎనిమిది మంది హోంగార్డులు, నాగర్‌కర్నూల్‌లో ఒక ఎస్ఐ, ఒక ఏఎస్ఐ, నలుగురు హోంగార్డులు, ఆరుగురు కానిస్టేబుల్స్ విధులు నిర్వహిస్తున్నారు.ఉమ్మడి జిల్లాలో ట్రాఫిక్ విభాగంలో 102 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిని ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను బట్టి రెండు షిఫ్ట్‌లుగా విభజించి విధులు కేటాయిస్తున్నారు. మొదటి షిప్ట్ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, రెండో షిప్ట్ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. మహబూబ్‌నగర్‌లోని పిస్తాహౌస్, మెట్టుగడ్డ, న్యూటౌన్, సుభాష్ చంద్రబోస్ సర్కిల్,, బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, అశోక్ టాకీస్, పాత బస్టాండ్, వన్‌టౌన్ చౌరస్తా, తెలంగాణ కూడలి, పాన్‌చౌరస్తా, గాంధీచౌక్ ప్రాంతాల్లో వాహనాల రద్దీ ఉంటుంది. వనపర్తిలో ఇందిరాపార్క్, రాజీవ్ చౌరస్తా, కొత్త బస్టాండ్, గాంధీ చౌక్, నారాయణపేటలోని సత్యనారాయణ చౌరస్తా, ఓల్డ్ బస్టాండ్, మెయిన్ చౌక్, నాగర్‌కర్నూల్ జిల్లాకేంద్రంలో బస్టాండ్ ఇన్‌గేట్, ఔట్‌గేట్ వద్ద, శ్రీపురం చౌరస్తా, రవీంద్రటాకీస్ చౌరస్తా, గద్వాలో పాత బస్టాండ్, కృష్ణవేణి చౌరస్తా, పాత కూరగాయల మార్కెట్, గాంధీ చౌక్, సుంకులమ్మ మెట్టు వద్ద ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. అధిక వేడి వల్ల వడదెబ్బకు గురయ్యే అవకాశం ఆరోగ్యంపై జాగ్రత్తలు అవసరం అంటున్న వైద్యులు పాలమూరులో క్యాప్‌లు, కూలింగ్ అద్దాలు, వాటర్ బాటిల్స్ పంపిణీ -
ఉపాధ్యాయురాలి సస్పెన్షన్
ఖిల్లాఘనపురం: మండలంలోని మల్క్‌మియాన్‌పల్లి ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వర్తించే ఉపాధ్యాయురాలు పి.భారతమ్మను సస్పెండ్ చేసినట్లు మండల విద్యాధికారి జయశంకర్ తెలిపారు. సమయపాలన పాటించకపోవడం, విద్యార్థులకు అకాడమిక్ సైడ్ రిజిస్టర్లు, ఎఫ్ఎల్ఎన్ నోటీస్ రిజిస్టర్, ఎండీఎం రిజిస్టర్, వర్క్‌బుక్ నిర్వహణ, అడ్మిషన్ రిజిస్టర్ల నిర్వహణలో అలసత్వం ప్రదర్శించడంతో పాటు ప్రభుత్వం నుంచ్చి వచ్చే నిధుల వినియోగంలో అవకతవకలు ఉన్నాయన్నారు. ఈ విషయమై 4వ తేదీన జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘని పాఠశాలను సందర్శించి రికార్డులను పరిశీలించడంతో పాటు నిధుల వినియోగంపై ఆరా తీశారని చెప్పారు. ఆయన సూచనల మేరకు శుక్రవారం ఉపాధ్యాయురాలిని సస్పెండ్ చేసినట్లు ఎంఈఓ వివరించారు. రామన్‌పాడులో 1,016 అడుగుల నీటిమట్టం మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో శుక్రవారం పూర్తిస్థాయి నీటిమట్టం 1,016 అడుగులు ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వలో 285 క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా.. సమాంతర కాల్వలో నీటి సరఫరా లేదని చెప్పారు. ఇదిలా ఉండగా జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 36 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 67 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు వివరించారు. పాలెం డిగ్రీ కళాశాలలో సమూల మార్పులు బిజినేపల్లి: మండలంలోని పాలెం శ్రీవెంకటేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల (అటానమస్)లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు శుక్రవారం 2024– 25 విద్యా సంవత్సరానికి సంబంధించిన మొదటి అకాడమిక్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిల్ సభ్యులు, యూనివర్సిటీ అకాడమిక్ డీన్లు, ప్రొఫెసర్లు, సబ్జెక్టు నిపుణులు, ఆయా ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాళ్లు హాజరై అకాడమిక్ క్యాలెండర్ రూపకల్పన, సిలబస్‌ను అభివృద్ధి చేశారు. అంతేకాక పాఠ్యాంశాలను సమర్థవంతంగా అభివృద్ధి చేయడం, సవరించడం, ప్రశ్నపత్రాల రూపకల్పన, పరీక్ష ఫీజుల నిర్ణయం, పరీక్షల నిర్వహణ, మూల్యాంకన విధానం, మాడరేషన్, డిటెండ్ నియమాలు, వివిధ ప్రోగ్రాంల వివరణ, విద్యా సంబంధిత నిబంధనలు, ఇతర మార్గ దర్శకాలను రూపొందించారు. సమావేశంలో ప్రొఫెసర్లు చెన్నప్ప, జయపాల్‌రెడ్డి, పాలెం డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రాములు, ఎంవీఎస్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పద్మావతి, పెబ్బేరు కళాశాల ప్రిన్సిపల్ వెంకటప్రసాద్, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్లు పద్మజ, శ్రీనివాసులు, నాగరాజు, సుష్మ, శివ, బోర్డు ఆఫ్ సబ్జెక్టు సభ్యులు పాల్గొన్నారు. -
సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా ఫూలే..
అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలన, బలహీనవర్గాలు, మహిళా హక్కుల సాధనకు కృషిచేసిన గొప్ప సంఘసంస్కర్త, మహనీయుడు మహాత్మా జ్యోతిబా ఫూలే అని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫూలే జయంతి వేడుకలో ఆయన పాల్గొని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజలందరికీ సమాన హక్కులు ఉండాలని మహిళలకు సైతం విద్యనందించి మొదటిసారిగా వారి హక్కుల కోసం పోరాడిన గొప్ప ఉద్యమకారుడు, సామాజిక తత్వవేత్త, సంఘ సేవకుడన్నారు. ఆయన ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిగా నిలిచాయాని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా పోలీసు సాయుధదళ అదనపు ఎస్పీ వీరారెడ్డి, ఏఓ సునందన, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేశ్, డీసీఆర్బీ సీఐ రవిపాల్, రిజర్వ్ సీఐ శ్రీనివాస్, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
భూ సేకరణ వేగవంతం చేయాలి
వనపర్తి: సాగునీటి ప్రాజెక్టుల భూ సేకరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో భూ సేకరణ, పునరావాస కేంద్రాల ఏర్పాటుపై ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. బుద్ధారం పెద్ద చెరువు, గణపసముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ భూ సేకరణపై ప్రధానంగా చర్చించారు. బుద్ధారం పెద్ద చెరువుకు సంబంధించి 11.57 ఎకరాల భూమికి వారంలో అవార్డ్ పాస్ చేయడంతో పాటు ధరణి పోర్టల్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. చెరువు లోపల అవసరమైన 205 ఎకరాల భూమికిగాను 109 ఎకరాలకు త్వరలో అవార్డ్ పాస్ చేయాలని, మిగిలిన 96 ఎకరాలకు సర్వే చేయించాలని ఆర్డీఓను ఆదేశించారు. సర్వే అనంతరం గ్రామసభ నిర్వహించాలన్నారు. గణపసముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సర్వే పూర్తయిన 18 ఎకరాలు, మరో 388 ఎకరాల స్థలానికి అవార్డ్ పాస్ చేయాలని, ఇరిగేషన్‌శాఖ వెంటనే పనులు ప్రారంభించాలని ఆదేశించారు. మిగిలిన 197 ఎకరాల సర్వే చేయించాల్సిందిగా సూచించారు. పునరావాస కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పన వేగవంతంగా జరగాలన్నారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు, ఆర్డీఓ సుబ్రమణ్యం, ఇరిగేషన్‌శాఖ కార్యనిర్వాహక ఇంజినీర్ డి.కేశవరావు, డీఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. -
అన్నదానం, తాగునీటి వసతి
సలేశ్వరం వచ్చే భక్తుల కోసం మోకాళ్ల కుర్వు, అప్పాయిపల్లి మార్గంలోని గిరిజన గుండాల వద్ద స్వచ్ఛంద సంస్థలు, దాతలు ఏర్పాటు చేసిన అన్నదాన సత్రాలు, చలివేంద్రాలు భక్తులను ఆదుకుంటున్నాయి. అల్పాహారం మొదలుకొని మధ్యాహ్నం, రాత్రి సమయంలో భోజనాలు, రాగి అంబలి, మజ్జిగ, తాగునీటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. అలాగే ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో తాగునీటి ఏర్పాట్లు చేశారు. ఫర్హాబాద్ చెక్‌పోస్టు, పుల్లాయిపల్లి బేస్ క్యాంపు, రాంపూర్‌పెంట, మోకాళ్లకుర్వు (సలేశ్వరం), లింగాల మండలం అప్పాయిపల్లి, గిరిజన గుండాల వద్ద వాటర్ ట్యాంకులు, చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా దాతలు ఏర్పాటు చేసిన ఉచిత భోజనశాలలతోపాటు 20 ట్యాంకర్లతో నీటి సరఫరా చేస్తున్నారు. మూడురోజులపాటు తాగునీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నట్లు డీఈ హేమలత తెలిపారు. -
సకాలంలో ధాన్యం కొనుగోళ్లు
అమరచింత: దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో రేషన్ లబ్ధిదారులకు సన్నబియ్యం అందిస్తున్నామని, రైతుల నుంచి వరి ధాన్యం సకాలంలో కొనుగోలు చేస్తున్నామని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం మండలంలోని నాగల్‌కడ్మూర్, పాంరెడ్డిపల్లిలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లుతో కలిసి లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేశారు. అదేవిధంగా ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. నాగల్కడ్మూర్లోని దళితవాడలో సోనియమ్మ ఇంట్లో రేషన్ సన్నబియ్యంతో వండిన భోజనం అధికారులతో కలిసి చేశారు. గ్రామంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని, ఆ ఘనత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికే దక్కుతుందన్నారు. రూ.రెండు లక్షల పంట రుణమాఫీ, సన్నరకం వరి ధాన్యం క్వింటాకు రూ.500 బోనస్ అందించామన్నారు. యాసంగిలో ముందస్తుగానే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని.. రైతుల నుంచి వచ్చిన ప్రతి గింజా కొనడమే కాకుండా సకాలంలో డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మక్తల్ నియోజకవర్గంలోని అన్ని మండలాలకు సీసీ రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు చేశామని, పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, బీటీ రహదారులతో పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. కాంగ్రెస్ పేదల ప్రభుత్వమని.. ప్రజా ప్రభుత్వంలో అన్నివర్గాలకు సంక్షేమ ఫలాలు అందించడమే తమ కర్తవ్యమన్నారు. టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి కేశం నాగరాజుగౌడ్, తహసీల్దార్ రవికుమార్ యాదవ్, ఏపీఎం కృష్ణవేణి, ఏఓ అరవింద్, కాంగ్రెస్‌పార్టీ నాయకులు మహేందర్‌రెడ్డి, అరుణ్‌కుమార్, తిరుమల్లేశ్, మహంకాళి విష్ణు పాల్గొన్నారు. -
కనులపండువగా పంబ ఆరట్టు
వనపర్తిటౌన్: అయ్యప్ప జన్మదినం సందర్భంగా శుక్రవారం జిల్లాకేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో పంబ ఆరట్టు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవమూర్తికి శాస్త్రోక్తంగా పూజాధికాలు నిర్వహించి పంబ ఆరట్టులో భాగంగా పవిత్ర జలాలతో చక్రస్నానం చేయించారు. భక్తుల శరణుఘోషతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. చక్రస్నానం అనంతరం మేళతాళాలు, వాయిద్యాలతో స్వామివారిని ఆలయ ప్రాంగణంలోకి తీసుకొచ్చి పల్లకీసేవ నిర్వహించారు. శుక్రవారం తెల్లవారుజామున సుప్రభాత సేవతో ప్రారంభమై లక్ష్మీ గణపతి హోమం, మూల విగ్రహానికి ఆలయ ప్రధాన అర్చకుడు రమేష్‌శర్మ అభిషేకాలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉత్సవమూర్తికి 3 గంటల పాటు అభిషేకాలు నిర్వహించారు. తర్వాత ఆలయంలోని మూలమూర్తికి సహస్ర నామార్చన, మహా మంగళహారతి, భక్తులకు అన్నదానం చేశారు. ఆయా కార్యక్రమాలు తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఆధ్యాత్మికతే శరణ్యం.. ఆత్మశుద్ధికి ఆధ్యాత్మికతే శరణ్యమని బిజ్వారం అంబత్రేయ క్షేత్ర పీఠాధిపతి డా. ఆదిత్య పరాశ్రీ అన్నారు. శుక్రవారం రాత్రి ఆలయంలోని ఏకాశిల పడికి పూజ నిర్వహించి సందేశమిచ్చారు. సనాతన ధర్మం ఎంతో గొప్పదని.. అందులోని ప్రతి అంశం లోక కళ్యాణం, సర్వమానవాళి శ్రేయస్సే లక్ష్యమని తెలుసుకోవాలన్నారు. భక్తిభావంతో పాటు ధర్మమార్గాన్ని అనుసరించాలని సూచించారు. అంతకుముందు ఆలయ ప్రాంగణంలో భక్తిభావం పెంపొందించే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గురుస్వాములు తదితరులు పాల్గొన్నారు. 108 ఇటుకలకు పూజలు.. కొత్తకోట రూరల్: మండల కేంద్రంలోని హరిహరపుత్ర అయ్యప్ప క్షేత్రంలో అయ్యప్ప సేవాసమితి ఆధ్వర్యంలో గోపాలకృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్పస్వామి జన్మదిన వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజ్వారం అంబత్రేయ క్షేత్ర పీఠాధిపతి డా. ఆదిత్య పరాశ్రీ హాజరయ్యారు. హరిహర పుత్ర ధర్మశాస్త్ర అయ్యప్ప క్షేత్ర నిర్మాణంలో సమస్త భక్తులకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో 108 ఇటుకలకు ప్రత్యేక పూజలు చేశారు. ఆయా ఇటుకలను ఆదిత్య పరశ్రీ గురూజీ భక్తులకు అందజేశారు. ఆ ఇటుకలకు ఇంట్లో11 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించి తదనంతరం అందజేయాలని ఆలయ నిర్వాహకులు సూచించారు. కార్యక్రమంలో అయ్యప్ప సేవాసమితి అధ్యక్షుడు దూపం నాగరాజు, పొగాకు అనిల్‌కుమార్, విశ్వనాథం గంగాధర్‌శెట్టి, భీమకిషోర్కుమార్, బలిజ లింగేశ్వర్, వేముల సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు. ఏకశిల పడిపూజ నిర్వహిస్తున్న అర్చకులు -
శనేశ్వరుడికి శతకుంభ తిలతైలాభిషేకం
బిజినేపల్లి: మండలంలోని నందివడ్డెమాన్‌లో వెలసిన జేష్ట్యాదేవి సమేత శనేశ్వరుడి 25వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రెండోరోజు స్వామివారికి శతకుంభ తిలతైలాభిషేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకు డు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి శుక్రవారం గణపతి పూజానంతరం జేష్ట్యాదేవి సమేత శనేశ్వరులకు వెయ్యి కుంభాలతో నువ్వుల నూనెతో ప్రత్యేక పూజ లు, మహాన్యాస పూర్వక అష్టోత్తర సహిత అభిషేక పూజలు జరిపారు. కాగా.. శనివారం ఉదయం 9 గంటలకు ఉమామహేశ్వరస్వామి వ్రత ం, శాంతిహోమం, బలిహరణం, పూర్ణాహుతి, సాయంత్ర ఆలయం చుట్టూ బండ్ల ఊరేగింపు ఉంటుందని ఆలయ కమిటీ చైర్మన్ గోపాల్‌రావు తెలిపారు. -
పేదలకు నాణ్యమైన సన్న బియ్యం
వనపర్తి: ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా పేదలకు నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ చేస్తోందని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. గురువారం ఆయన జిల్లాకేంద్రంలోని బండార్‌నగర్‌లో ఉన్న 19వ నంబర్ రేషన్ దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి సన్న బియ్యం పంపిణీపై ఆరా తీశారు. బియ్యం నిల్వలకు సంబంధించి రిజిస్టర్ నిర్వహించడమేగాకుండా లబ్ధిదారులు సన్న బియ్యం తీసుకున్నాక తప్పనిసరిగా రసీదు ఇవ్వాలని డీలర్‌కు సూచించారు. ఇక నుంచి ప్రతి నెలా సన్నబియ్యం పంపిణీ జరుగుతుందని.. పకడ్బందీగా నిర్వహించాలని, ప్రజలు ప్రభుత్వం అందిస్తున్న బియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నల్లచెరువు ట్యాంక్‌బండ్ సందర్శన.. జిల్లాకేంద్రంలోని నల్ల చెరువు ట్యాంక్‌బండ్ సుందరీకరణ పనులు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన నల్లచెరువు పరిసరాలను ఆయన పరిశీలించి మాట్లాడారు. రెండు, మూడురోజుల్లో చెరువుకట్టపై ఏర్పాటు చేయనున్న వాకింగ్ ట్రాక్‌కు ఇరువైపులా మొక్కలు నాటాలని సూచించారు. కొత్తగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ దగ్గర సీసీ కెమెరాలు బిగించాలని పుర కమిషనర్‌ను ఆదేశించారు. ఓపెన్ జిమ్ మీదుగా ఉన్న విద్యుత్ తీగలను పక్కకు మార్చాలన్నారు. పిల్లలకు ఇబ్బందులు కలగకుండా చుట్టూ కంచెతో పాటు విద్యుత్ స్తంభాలకు లైట్లు బిగించాలని కోరారు. వసతిగృహాల తనిఖీ.. జిల్లాకేంద్రంలోని పీర్లగుట్టలో ఉన్న షెడ్యూల్డ్ కులాల బాలికల వసతి గృహాన్ని గురువారం కలెక్టర్ సందర్శించారు. పోస్ట్ మెట్రిక్ వసతిగృహంలో ఉన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న ప్రీ మెట్రిక్ హాస్టల్‌ను కూడా సందర్శించి విద్యార్థుల వసతి, సామర్థ్యాలపై ఆరా తీశారు. అదే ప్రాంగణంలో నూతన భవన నిర్మాణానికి సంబంధించి పూర్తి వివరాలతో నివేదిక అందజేయాలని పంచాయతీరాజ్ డీఈకి సూచించారు. అనంతరం కేటీఆర్నగర్లో ఉన్న ఎస్సీ బాలుర వసతిగృహాన్ని సందర్శించి మరమ్మతులు చేయడానికి అవకాశం ఉందా అనే విషయంపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. బసవన్నగడ్డలో ఉన్న బీసీ బాలికల వసతిగృహాన్ని కలెక్టర్ పరిశీలించి విద్యార్థులతో మాట్లాడి వసతి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట జిల్లా పౌరసంబంధాల అధికారి కాశీ విశ్వనాథ్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మల్లికార్జున్, తహసీల్దార్ రమేష్‌రెడ్డి, పుర కమిషనర్ వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
వినియోగంలోకి జిల్లా సాయుధదళ కార్యాలయ భవనం
వనపర్తి: జిల్లా పోలీసు సాయుధ దళ కార్యాలయ భవన నిర్మాణం పూర్తి చేయించి వినియోగంలోకి తీసుకొచ్చిన ఎస్పీ రావుల గిరిధర్‌కు సాయుధ దళ పోలీసు అధికారులు, సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు. కొత్త జిల్లాలు ఏర్పాటైన నాటినుంచి కార్యాలయాన్ని వనపర్తి రెడ్డి సేవాసమితి భవనంలో తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. నాటి నుంచి నేటి వరకు ప్రతి నెల రూ.88 వేలు అద్దె చెల్లించడంతో పాటు సాయుధ పోలీసుల ఇబ్బందులను ఎస్పీ తెలుసుకొని అసంపూర్తిగా ఉన్న భవన నిర్మాణానికి ప్రత్యేక చొరవతో కలెక్టర్ ఆదర్శ్ సురభితో చర్చించారు. ఆయన నిధులు రూ.10 లక్షలు, పెబ్బేరు షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం అందించిన రూ.2.50 లక్షలతో నిర్మాణం పూర్తి చేయించారు. అత్యాధునిక హంగులతో ఆహ్లాదకర వాతావరణంలో విశాలమైన భవనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి ఏప్రిల్ 4న రాష్ట్ర డీజీపీ జితేందర్ చేతుల మీదుగా ప్రారంభింపజేశారు. గురువారం భవనం వినియోగంలోకి రావడంతో ఎస్పీని పోలీసు అధికారులు, సిబ్బంది, హోంగార్డ్స్ సంతోషం వ్యక్తం చేస్తూ ఎస్పీని శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా పోలీసు సాయుధదళ అదనపు ఎస్పీ వీరారెడ్డి, జిల్లా ఇన్చార్జ్ అదనపు ఎస్పీ ఉమామహేశ్వరరావు, రిజర్వ్ సీఐలు శ్రీనివాస్, అప్పలనాయుడు, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేశ్, పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
జూరాల కాల్వలకు నీటి సరఫరా నిలిపివేత
అమరచింత: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నుంచి ప్రధాన ఎడమ, కుడి కాల్వలకు గురువారం సాయంత్రం నీటి సరఫరా నిలిపివేసినట్లు ఏఈ ఆంజనేయులు తెలిపారు. ఆయా కాల్వల కింద 35 వేల ఎకరాల వరి సాగు చేపట్టగా ప్రాజెక్టులో నిల్వ నీటిమట్టం భారీగా తగ్గిపోవడం, వేసవిలో తాగునీటి అవసరాల దృష్ట్యా ఉన్నతాధికారులు గత వారమే నీటి సరఫరా నిలిపివేశారు. మరో రెండు తడులు అందిస్తేనే పంట చేతికందుతుందని రైతులు ఎమ్మెల్యే, అధికారులకు విన్నవించగా చివరి తడిగా రెండ్రోజుల కిందట నీటిని వదిలారు. గురువారం సాయంత్రం 6 గంటలకు కాల్వ షట్టర్లు మూసి నీటి సరఫరా నిలిపివేసినట్లు ఏఈ వివరించారు. లాటిన్ అమెరికా సదస్సుకు జిల్లా వాసి వనపర్తి: ప్రపంచ ప్రసిద్ధిగాంచిన యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్‌లో గురువారం ప్రారంభమైన లాటిన్ అమెరికా సదస్సుకు వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం చిన్నదగడకు చెందిన మొలకలపల్లి శివకుమార్ హాజరయ్యారు. స్పానిష్‌లో తాను చేసిన పరిశోధనలను యూనివర్సిటీ బృందం గుర్తించి సదస్సుకు హాజరై పరిశోధన పత్రాలు సమర్పించాలని ఆహ్వానం పంపినట్లు ఆయన వెల్లడించారు. నిరుపేద దళిత కుటుంబంలో జన్మించిన ఆయన ప్రాథమిక విద్యను స్థానికంగా.. హైదరాబాద్ దేశభాషల విశ్వవిద్యాలయంలో స్పానిష్ లాంగ్వేజ్‌లో డిగ్రీ, ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో పీజీ పూర్తి చేశారు. ప్రస్తుతం ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో డిపార్ట్మెంట్ ఆఫ్ స్పానిష్ లో పరిశోధకులుగా కొనసాగుతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఉద్యమం పాన్‌గల్: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజలతో కలిసి ఉద్యమిస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎండీ జబ్బార్, మండల కార్యదర్శి బాల్యనాయక్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో పార్టీ మండల కమిటీ సమావేశాన్ని నాయకుడు భీమయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైనట్లు వారు పేర్కొన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు కోసం ప్రజలతో కలిసి పోరాటాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం దశల వారీగా పోరాటాలు కొనసాగిస్తామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు పార్టీ బలోపేతం కోసం నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. -
వరంగల్ సభను విజయవంతం చేద్దాం
గోపాల్పేట: వరంగల్‌లో ఈ నెల 27న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధికసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం ఆయన ఏదుల, రేవల్లిలో పార్టీ కార్యకర్తలతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఏదులలో సమావేశంలో మాట్లాడుతూ.. గుత్తేదారుల కోసం కాంగ్రెస్ నాయకులు రూ.1,800 కోట్లతో ఏదుల రిజర్వాయర్ నుంచి నల్లగొండకు నీరు తరలించేందుకు యత్నిస్తున్నారని.. వారికోసమే రైతులను నష్టపరుస్తూ గొల్లపల్లి రిజర్వాయర్ ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కల్వకుర్తి, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుల అనుసంధానంతో కరువును పారద్రోలామని తెలిపారు. అనంతరం రేవల్లిలో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. రజతోత్సవ సభతో బీఆర్ఎస్ పార్టీకి మంచిరోజులు రాబోతున్నాయని.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ మెజార్టీ సాధించనుందని చెప్పారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. -
పది నెలల కిందటే చెల్లించాను..
ప్రభుత్వం రాయితీపై అందించే స్ప్రింక్లర్ల కోసం 10 నెలల కిందట డీడీ ఇచ్చాను. రాలేదని తెలిసి అధికారులను ప్రశ్నించగా.. రాష్ట్రవ్యాప్తంగా గిరిజన కోటా పూర్తి కావడంతో జిల్లాలో ఎవరికీ మంజూరు కాలేదని సమాధానమిచ్చారన్నారు. అధికారులు స్పందించి స్ప్రింక్లర్లను మంజూరు చేయాలి. – గోపాల్, రైతు, నాగమ్మతండా, వనపర్తి అధికారుల నిర్లక్ష్యమే.. స్ప్రింక్లర్లకు దరఖాస్తు చేసుకోవాలని ఉద్యానశాఖ ప్రకటన ఇచ్చిన వెంటనే తమవంతు చెల్లించాల్సిన డబ్బులను డీడీ రూపంలో దరఖాస్తుకు జత చేశాం. మంజూరులో అధికార, పాలకవర్గంలో చోటు చేసుకున్న ఆలస్యంతో మాకు ఎలాంటి సంబంధం లేదు. అధికారులు స్పందించి స్ప్రింక్లర్లు మంజూరు చేయాలి. – గోవింద్, రైతు, నాగమ్మతండా, వనపర్తి రానున్న యాక్షన్ ప్లాన్‌లో తొలి ప్రాధాన్యం.. రాష్ట్రవ్యాప్తంగా ఎస్టీ కేటగిరీకి ఇవ్వాల్సిన కోట పూర్తి కావడంతో గిరిజన రైతులకు ఇవ్వలేకపోయాం. రానున్న యాక్షన్ ప్లాన్‌లో వారికి తొలి ప్రాధాన్యం ఇస్తాం. అర్హులైన గిరిజన రైతులందరికీ మంజూరు చేసేందుకు ప్రయత్నిస్తాం. ఇప్పటి వరకు జిల్లా రైతులకు మంజూరైన స్ప్రింక్లర్లను 15వ తేదీ లోపు పంపిణీ చేస్తాం. – విజయభాస్కర్‌రెడ్డి, జిల్లా ఉద్యాన అధికారి ● -
అధికారులా.. మజాకా!
●జిల్లాకేంద్రంలో కాల్వ లేని చోట కల్వర్టు నిర్మాణం పరిశీలనకు ఆదేశిస్తాం.. వచ్చిన ఫిర్యాదుల మేరకు క్షేత్రస్థాయి పరిశీలన చేసి నివేదిక అందజేయాలని కిందిస్థాయి అధికారులను ఆదేశిస్తాం. ఇప్పటి వర కు చేసిన పనులకు సంబంధించి కొంతమేర పార్ట్బిల్ ఇచ్చాం. ఫిర్యాదుల్లో పేర్కొన్న అంశాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. – దేశ్యానాయక్, ఈఈ, ఆర్అండ్బీ వనపర్తి: అధికారం ఉంటే.. కాదేదీ అసాధ్యం అన్నట్లు జిల్లాకేంద్రంలోని మర్రికుంటలో కాల్వ లేనిచోట కల్వర్ట్ నిర్మాణ వ్యవహారం. కొంతకాలం క్రితం ఓ మాజీ ప్రజాప్రతినిధి మర్రికుంట సమీపంలో వనపర్తి–కర్నూలు ఆర్అండ్బీ ప్రధాన రహదారిని ధ్వంసం చేసి రూ.లక్షల ప్రజాధనం వెచ్చించి చేస్తున్న కల్వర్టు నిర్మాణంపై మొదటి నుంచి ఫిర్యాదులు, నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కల్వర్టు సమీపంలోని నివాసాల ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు చేసిన ఫిర్యాదులను బుట్టదాఖలు చేసి అధికార బలంతో పనులు సాగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2024, నవంబర్‌లో ఈ విషయంపై వనపర్తి బీజేపీ పట్టణశాఖ ఆధ్వర్యంలో కాల్వ లేనిచోట కల్వర్టు నిర్మాణం ప్రజాధనం దుర్వినియోగం చేయడమేనంటూ నిరసన వ్యక్తం చేసి ఆర్అండ్బీ అధికారులకు ఫిర్యాదులు అందజేశారు. తాత్కాలికంగా పనులు నిలిపివేసి ప్రస్తుతం కల్వర్టుకు ఇరువైపులా సీసీ రోడ్డు నిర్మాణం చేసేందుకు పనుల అంచనాలను రూ.లక్షలకు పెంచి సీసీ పనులు చేస్తుండటం గమనార్హం. రోడ్డుపైనే అలుగు పారుతున్నా.. మర్రికుంట (చెరువు) అలుగు పారితే వచ్చే నీరు వనపర్తి–కర్నూలు ప్రధాన రహదారి బీటీ రోడ్డుపై నుంచే అమ్మచెరువులోకి వెళ్తోంది. నిజానికి కల్వర్టు నిర్మాణం ఈ ప్రాంతంలో చేయాల్సి ఉండింది. కానీ కొందరు మాజీ ప్రజాప్రతినిధులు, స్థానిక అధికార పార్టీ నేతలు తమ పట్టుదలను నిలుపుకొనేందుకు ఏళ్ల క్రితమే మూసుకుపోయిన తూము కాల్వ పేరుతో రెండు ఇళ్ల మధ్యన ప్రధాన రహదారిపై కల్వర్టు నిర్మాణం చేపడుతున్నారు. దీంతో ఎవరికి ప్రయోజనం కలుగుతుందనేది అధికారులు విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఈ నిర్మాణంపై నిత్యం ఫిర్యాదులు అందుతున్నా.. ఇప్పటికే రూ.4 లక్షల బిల్లు విడుదల చేసినట్లు తెలుస్తోంది. పనులకు సంబంధించిన మంజూరు, టెండర్ ప్రక్రియ రహస్యంగా సాగుతున్నట్లు విమర్శలున్నాయి. అభివృద్ధి పేరిట అవసరం లేనిచోట కాల్వర్టు నిర్మాణం చేస్తున్నా.. ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతలు స్పందించకపోవడం ఏమిటనే ప్రశ్నలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ● కల్వర్టు నిర్మాణంపై కొన్నినెలలుగా లిఖితపూర్వకంగా, సోషియల్ మీడియా వేదికగా ఫిర్యాదులు అందుతున్నాయి. జిల్లాస్థాయి అధికారులు నిత్యం అదే రహదారిపై రాకపోకలు సాగిస్తుంటారు. కనీసం కాల్వ లేదని వస్తున్న ఫిర్యాదులపై విచారణ చేసే ప్రయత్నం చేయకపోవడం ఏమిటమే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అవసరమైన ప్రాంతంలో కల్వర్టు నిర్మాణం చేపట్టకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నా.. అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తుండటం శోచనీయం. బీజేపీ నేతల నిరసనతో నెల పాటు పనులు నిలిపివేత ఇటీవల తిరిగి ప్రారంభం పలువురి ప్రయోజనానికే నిర్మాణమంటూ ఆరోపణలు -
రేషన్ కార్డు లేకపోవడంతో..
రాజీవ్ యువవికాస్ పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు వెళితే రేషన్‌కార్డు అడిగారు. మాకు రేషన్‌కార్డు రాకపోవడంతో దరఖాస్తు చేసుకోలేకపోయాను. ఇప్పటి వరకు ఎలాంటి ప్రభుత్వ పథకం తీసుకోలేదు. కొత్త ప్రభుత్వంలోనైన రేషన్‌కార్డు వస్తుందనుకుంటే కొందరికి ఇచ్చి కొందరికి ఇవ్వడంలేదు. – రాజు, గద్వాల పట్టణం సాంకేతిక సమస్యలు పరిష్కరిస్తాం.. యువ వికాసం పథకం దరఖాస్తులకు సంబంధించి పలు సాంకేతిక సమస్యలు మా దృష్టికి రాగా.. కొన్నింటిని పరిష్కరించాం. కొత్త మండలాల్లో బ్యాంకులు, గ్రామాలు తదితర సమస్యలు వస్తున్నట్లు తెలుస్తోంది. బీసీ లోన్ కింద దరఖాస్తు చేసుకునే వారు మహబూబ్‌నగర్‌లోని బీసీ సంక్షేమ శాఖ కార్యాలయానికి వస్తే వెంటనే పరిష్కరిస్తాం. ఎవరూ ఇబ్బందిపడాల్సిన అవసరం లేదు. కార్యాలయంలో ఎడిట్ ఆప్షన్‌కు అవకాశం ఉంది. – ఇందిర, బీసీ సంక్షేమ శాఖ అధికారి, మహబూబ్‌నగర్ ● -
పుర సిబ్బంది పనితీరు భేష్
వనపర్తి: స్థానిక పుర సిబ్బంది పనితీరు అద్భుతంగా ఉందని.. గతేడాదితో పోలిస్తే ఈసారి పన్ను వసూళ్లు రూ.కోటి పెంచారని కలెక్టర్ ఆదర్శ్ సురభి అభినందించారు. బుధవారం జిల్లాకేంద్రంలో పన్ను వసూళ్ల కార్యక్రమాన్ని ఆయన స్వయంగా పర్యవేక్షించి మాట్లాడారు. ఆస్తి పన్ను 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.4.43 కోట్లు వసూలు కాగా.. 2024–2025లో రూ.5.55 కోట్లు వసూలు చేశారని చెప్పారు. పుర ఆదాయం రూ.కోటి పెంచారని.. పన్ను వసూళ్లలో సిబ్బంది మెరుగైన పనితీరు కనబర్చారని తెలిపారు. ఇక కొళాయి బిల్లుల విషయానికొస్తే 2023–24లో రూ.35.63 లక్షలు వసూలు కాగా.. 2024–25లో రూ.1.27 కోట్లు వసూలయ్యాయని, మొండి బకాయిలు సైతం రాబట్టారన్నారు. ఆస్తి పన్ను, కొళాయి బిల్లులు, ట్రేడ్ లైసెన్స్, తైబజార్ వేలం, దుకాణాల అద్దెలు, భవన నిర్మాణ అనుమతులు మొత్తం రూ.11.29 కోట్లు జమ అయ్యాయని తెలిపారు. 2024–2025 ఆర్థిక సంవత్సరంలో 19 బృందాలు ఏర్పాటు చేసి పన్ను బకాయిదారులందరికీ నోటీసులు అందజేసినట్లు పుర కమిషనర్ వెంకటేశ్వర్లు వివరించారు. ఫ్లెక్సీలు, ఆటోలు, శానిటేషన్ వాహనాలతో ప్రచారం చేయడంతో పాటు సెల్ఫోన్లకు సందేశాలు పంపించి పన్ను చెల్లింపుదారులకు అవగాహన కల్పించామన్నారు. పన్ను వసూళ్లకు వార్డ్ అధికారులు, బిల్ కలెక్టర్లు ఉదయం నుంచి రాత్రి వరకు శ్రమించారని తెలిపారు. పనుల్లో వేగం పెంచాలి.. జిల్లాకేంద్రంలో రహదారి విస్తరణ బకాయి పనులు వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్యతో కలిసి రెవెన్యూ, మున్సిపల్, ఆర్అండ్బీ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. పాలిటెక్నిక్ కళాశాల నుంచి పెబ్బేరు వైపు, పానగల్ రోడ్డు, హైదరాబాద్ రోడ్, మిగతా రహదారుల విస్తరణకు సంబంధించి అధికారులతో చర్చించారు. ఆయా మార్గాల్లో ఉన్న ఇళ్లకు మార్కింగ్ ఇవ్వకపోతే వారంలోగా పూర్తి చేయాలని సూచించారు. ఇదివరకే పరిహారం చెల్లించి ఉంటే వెంటనే పనులు ప్రారంభించాలని ఆదేశించారు. రెవెన్యూ, పుర అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. సమావేశంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, పుర కమిషనర్ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ రమేశ్‌రెడ్డి, ఆర్అండ్బీ అధికారులు దేశ్యానాయక్, సీతారామస్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ ఏడాది భారీగా పెరిగిన పన్ను వసూళ్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి -
నిఘాతోనే నేరాల నియంత్రణ
వనపర్తి: గ్రామ పోలీసు అధికారులు గ్రామాల్లో పూర్తిస్థాయిలో నిఘా ఉంచి నేరాలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు ముందస్తుగా తెలుసుకోవాలని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన పాల్గొని వివిధ అంశాలపై పలు సూచనలు చేశారు. డీఎస్పీ, సీఐలు తమ పరిధిలోని పోలీస్స్టేషన్లను సందర్శించి సిబ్బంది పనితీరు సమీక్షించాలని, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకొని నేర నియంత్రణకు కృషి చేయాలన్నారు. పెట్రోలింగ్ మరింత సమర్థవంతంగా నిర్వహించాలని, వీలైనంత త్వరగా బాధితుల వద్దకు చేరుకోవాలని సూచించారు. యువత మత్తు పదార్థాలకు బానిసలై విచక్షణ కోల్పోయి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ యువత సైతం గంజాయి తీసుకునే స్థాయికి విక్రయాలు పెరిగాయని.. సమాచార వ్యవస్థను మరింత పటిష్టం చేసి అడ్డుకట్ట వేయాలని, గ్రామాల్లోని యువతకు అవగాహన కల్పించాలని కోరారు. రైతులు నకిలీ విత్తనాలతో మోసపోకుండా చూడాలని, ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. రైటర్స్, సీసీటీఎన్ఎస్, రిసెప్షన్, సీడీఓఎస్కు వర్టికల్ వారీగా నైపుణ్య శిక్షణ ఇవ్వాలన్నారు. పట్టణాల్లో సైక్లింగ్ చేస్తూ గస్తీ నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రహదారులపై హాట్స్పాట్లను గుర్తించి ఆయా ప్రాంతాల్లో తగిన మార్పులు చేపట్టాలని, ప్రతి రోడ్డు ప్రమాదాన్ని ఎస్హెచ్ఓ స్వయంగా సమీక్షించాలన్నారు. వాహన తనిఖీలతో పాటు జాతీయ రహదారి కూడళ్లు, గ్రామాలు, పుర వార్డుల్లో సీసీ కెమెరాలు ఉండేలా చూడాలని సూచించారు. సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే పోస్టులు, మహిళలపై దాడులు, వేధింపులపై అలసత్వం వద్దని, అలాంటి ఫిర్యాదులపై వెంటనే స్పందించాలన్నారు. బెట్టింగ్ వైపు యువత వెళ్లవద్దని.. బెట్టింగ్‌లు ఆడినా, ఆడించినా కఠినంగా వ్యవహరించాలని కోరారు. సమావేశంలో జిల్లా ఇన్చార్జ్ అదనపు ఎస్పీ ఉమామహేశ్వరరావు, డీఎస్పీ వెంకటేశ్వరరావు, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేశ్, సీఐలు కృష్ణ, రాంబాబు, శివకుమార్, అన్ని పోలీస్స్టేషన్ల ఎస్ఐలు, శిక్షణ ఎస్ఐలు పాల్గొన్నారు. పెట్రోలింగ్ సమర్థవంతంగా నిర్వహించాలి ఎస్పీ రావుల గిరిధర్ -
దరఖాస్తుల ఆహ్వానం
వనపర్తిటౌన్: నిరుద్యోగ దివ్యాంగ యువతకు హైదరాబాద్‌లోని సమర్థనం దివ్యాంగుల సంస్థ ఆధ్వర్యంలో ఐటీఈఎస్ (కంప్యూటర్, బీపీఓ,సాఫ్ట్ స్కిల్స్) కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ రాష్ట్ర కో–ఆర్డినేటర్ నల్లపు శ్రవణ్‌కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 35 ఏళ్లలోపు వయస్సు ఉండి 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులని పేర్కొన్నారు. శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి, స్టడీ మెటీరియల్స్ అందిస్తామని.. ఆసక్తి గల యువత 10వ తరగతి మెమో, ఆధార్‌కార్డు, సదరం సర్టిఫికేట్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో హైదరాబాద్‌లోని ట్రస్ట్‌లో ఈ నెల 15వ తేదీలోగా సంప్రదించాలన్నారు. మరిన్ని వివరాలకు సెల్‌నంబర్లు 63648 67804, 63648 63218 సంప్రదించాలని సూచించారు. వైద్యసిబ్బందికి శిక్షణ వనపర్తి విద్యావిభాగం: ప్రత్యేక ఇమ్యునైజేషన్ కార్యక్రమం సందర్భంగా బుధవారం జిల్లాకేంద్రంలో వైద్యసిబ్బంది, డాటా ఎంట్రీ ఆపరేటర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీఎంహెచ్ఓ డా. శ్రీనివాసులు, డీఐఓ డా. పరిమళ హాజరై మాట్లాడారు. మొదటి విడత ఏప్రిల్ 21 నుంచి 28 వరకు, రెండో విడత మే 21 నుంచి 28 వరకు, మూడో విడత జూన్ 23 నుంచి 30 వరకు టీకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించాలని చెప్పారు. వ్యాక్సిన్ వేసుకోని చిన్నారులు, గర్భిణుల ఇళ్లను సందర్శించి వివరాలు సేకరించడంతో పాటు టీకాల పంపిణీకి కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఘనంగా టీపీఆర్టీయూ ఆవిర్భావ వేడుకలు వనపర్తి విద్యావిభాగం: టీపీఆర్టీయూ ఆవిర్భావ వేడుకలను బుధవారం జిల్లాకేంద్రంలో ఘనంగా నిర్వహించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు తలకంటి మహిపాల్‌రెడ్డి జెండా ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ఉపాధ్యాయ సంఘాల రాష్ట్ర నాయకత్వం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు తెలుపకుంటే చీలిక తెచ్చి 2011, ఏప్రిల్ 9న పీఆర్టీయూ–తెలంగాణ అనే సంఘం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి నాయకత్వంలో విద్యావ్యవస్థ పటిష్టత, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సంఘం ఎంతో కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వ విద్యావ్యవస్థను బలోపేతం చేయడానికి నిబద్ధతతో పని చేస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు రాయినిపల్లి శ్రీనివాసులు, పల్లా శ్రీనివాసులు, గోపాల్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, నాగరాజు, రాజశేఖర్, శ్రీనివాసులు, పరందాములు, కిరణ్, విష్ణువర్ధన్‌రెడ్డి, రాములు, సురేందర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, లోకారెడ్డి, బాలస్వామి, ఆంజనేయులు, రత్నకుమార్, వెంకటస్వామి, సంతోష్, అమిన్రెడ్డి, స్వామి తదితరులు పాల్గొన్నారు. బీజేపీతోనే నిరుద్యోగ యువతకు భవిష్యత్ వనపర్తిటౌన్: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తేనే నిరుద్యోగ యువతకు భవిష్యత్ ఉంటుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని 11, 14, 15, 17, 32 వివేకానంద చౌరస్తాలో వేర్వేరుగా పార్టీ జెండాలను ఎగురవేసి మాట్లాడారు. గ్రామపంచాయతీ, పుర ఎన్నికల్లో యువత చురుగ్గా పాల్గొనాలని, యువత రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు సబిరెడ్డి వెంకట్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి, రాష్ట్ర మహిళామోర్చా జాయింట్ ట్రెజరర్ నారాయణదాసు జ్యోతి రమణ, జిల్లా ఉపాధ్యక్షుడు సీతారాములు, పట్టణ అధ్యక్షుడు రాజశేఖర్, పట్టణ ప్రధాన కార్యదర్శి నవీన్, కార్యవర్గసభ్యుడు వెంకటేష్, నాయకులు ఖాజా, శంకర్‌నాయక్, భాస్కర్, ప్రతాప్, శివగౌడ్, లింగేశ్వర్, రామకృష్ణ, రాజు, మండ్ల వెంకటేశ్, రాములు, శ్రీనివాసులు, శ్రీను, రవి, చిరంజీవి, రఘు, గోవిందు, సుదర్శన్, వసంత్‌రెడ్డి, అరవింద్, చాణక్య, వంశీ తదితరులు పాల్గొన్నారు. -
నిబంధనల మేరకే ధాన్యం కొనుగోళ్లు
కొత్తకోట రూరల్: వరి ధాన్యం కొనుగోళ్లలో ఎఫ్ఏక్యూ నిబంధనలు విధిగా పాటించాలని.. తేమ శాతం నిర్దేశించిన స్థాయికి వచ్చిన వెంటనే తూకం చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు ఆదేశించారు. బుధవారం మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్ ఎం.వెంకటేశ్వర్లుతో కలిసి అదనపు కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా తాగునీరు, నీడ సౌకర్యం కల్పించాలని సూచించారు. ధాన్యం శుభ్రతపై రైతులకు అవగాహన కల్పించాలని కేంద్రాల నిర్వాహకులు, వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఒక కేంద్రంలో ఒకే రకమైన ధాన్యం కొనుగోలు చేయాలని, ప్రతి కేంద్రంలో ఫ్యాన్లు, సరిపడా గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు కచ్చితంగా ఉండాలని, లేని పక్షంలో మార్కెటింగ్ అధికారిని సంప్రదించాలని కోరారు. ధాన్యం కొనుగోలు చేసిన వెనువెంటనే డాటా నమోదు ప్రక్రియ పూర్తి చేస్తేనే రైతులకు డబ్బులు జమ అవుతాయని.. వేగంగా జరగాలన్నారు. అనంతరం పెద్దమందడి మండలం వెల్టూర్ శివారులోని ఏఎంసీ ధాన్యం గోదాంను సందర్శించి రికార్డులను పరిశీలించారు. ధాన్యం నిల్వకు కావాల్సిన పరిస్థితులపై ఆరా తీశారు. ఆయన వెంట పౌరసరఫరాలశాఖ అధికారి జగన్, పీఏసీఎస్‌ల ఇన్‌చార్జ్‌లు తదితరులు ఉన్నారు. -
‘ప్రజల నమ్మకాన్ని కోల్పోయిన కాంగ్రెస్’
వనపర్తిటౌన్: రాష్ట్రంలో అమలుకు సాధ్యంకాని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్‌పార్టీ ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ ఆరోపించారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని 12, 25 వార్డులో పార్టీ ఆవిర్భావ వేడుకలు పట్టణ అధ్యక్షుడు రాజశేఖర్‌గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై పార్టీ జెండా ఆవిష్కరించి మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనపై రాష్ట్ర ప్రజలు విసుగు చెందారని, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని చెప్పారు. రాష్ట్ర ప్రజల కష్టాలు తీరాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని.. ప్రజలు సైతం ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. పుర ఎన్నికల్లో కష్టపడి పనిచేసి అత్యధిక కౌన్సిలర్లను గెలిపించుకొని చైర్మన్ పదవిని సాధించుకుందామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు బాలరాజు, పద్మక్క, పెద్దపులి కిరణ్, ప్రధాన కార్యదర్శులు నవీన్, అరవింద్, ఉపాధ్యక్షుడు ఉపేందర్ యాదవ్, ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షుడు రవినాయుడు, నాయకులు చాణక్య, శివ, పవన్, కార్తీక్, చందు, విజయ్, సంజీవ్, రాజు, మన్నెం, గణేష్, రాములు, నాగరాజు, శివ, నవీన్, కార్యకర్తలు పాల్గొన్నారు. -
తాగునీటి సరఫరాలో నిర్లక్ష్యం వద్దు
వీపనగండ్ల: వేసవిలో ప్రజలకు తాగునీరు అందించడంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ ఈఈ మేఘారెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఫిల్టర్బెడ్లు, గోపల్‌దిన్నె రిజర్వాయర్ అవుట్‌ఫాల్, ఇన్‌ఫాల్ ప్రదేశాలను ఆయన పరిశీలించారు. గ్రామాల్లోని పంచాయతీ సిబ్బంది క్లోరినేషన్, వాటర్ ట్యాంక్‌లు శుభ్రపర్చడంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించరాదన్నారు. గోపల్‌దిన్నె రిజర్వాయర్‌లోని ఫిల్టర్‌బెడ్స్ నుంచి పాన్‌గల్, చిన్నంబావి, వీపనగండ్ల మండలాల్లోని గ్రామాలకు తాగునీరు సరఫరా చేస్తున్నామని.. రిజర్వాయర్‌లో నీటినిల్వపై ఉన్నతాధికారులకు నివేదికలు అందజేస్తామని చెప్పారు. కార్యక్రమంలో మిషన్ భగీరథ డీఈ అమిత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
జూన్ 1లోగా యూనిఫాంల తయారీ
వనపర్తి విద్యావిభాగం: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యూనిఫాంలను మండలస్థాయిలో త్రిసభ్య కమిటీని ఏర్పాటుచేసి జూన్ 1వ తేదీలోగా డీఆర్డీఓ, మెప్మా సహకారంతో కుట్టిస్తామని డీఈఓ అబ్దుల్ ఘనీ తెలిపారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో మండల విద్యాధికారుల ప్రత్యేక సమావేశంలో ఆయన పాల్గొని వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి యూనిఫాంల పంపిణీపై ప్రత్యేకంగా చర్చించారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు ప్రతి విద్యార్థి ఇంటికి వెళ్లి కొలతలు తీసుకురావాలని.. 6, 7 తరగతుల విద్యార్థులకు పాంట్లు పంపిణీ చేస్తామని చెప్పారు. ఐఆర్సీకి సంబంధించిన అన్ని అంశాలు మండల విద్యాధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. సమావేశంలో సమ్మిళితవిద్య సమన్వయకర్త యుగంధర్, డీపీఎం అరుణ, మహానంది, శేఖర్, మండల విద్యాశాఖ అధికారులు, ఐఈఆర్పీలు తదితరులు ఉన్నారు. -
జూరాల కాల్వలకు నీటి విడుదల
అమరచింత: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు మంగళవారం ప్రాజెక్టు అధికారులు సాగునీరు విడుదల చేశారు. కాల్వలకు నీరు వదలకపోతే వరి పంటలు ఎండిపోతాయని ఆయకట్టు రైతులు ఆందోళన చేయడం, ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మంత్రి దృష్టికి సమస్యను తీసుకెళ్లడంతో ఎట్టకేలకు రెండ్రోజుల పాటు నీటిని వదలడానికి అధికారులు అంగీకరించారు. మంగళవారం నీటిని విడుదల చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు తడులు వదలాలని కోరుతున్నారు. చెరుకు రైతుల ఆందోళన అమరచింత: బకాయి ఉన్న రూ.6 కోట్లు వెంటనే చెల్లించాలంటూ చెరుకు రైతులు కృష్ణవేణి చెరుకు రైతు సంఘం ఆధ్వర్యంలో షుగర్ ఫ్యాక్టరీ ఎదుట మంగళవారం ఆందోళన చేపట్డారు. ఈ సందర్భంగా సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాజన్న మాట్లాడుతూ.. ఫ్యాక్టరీ పరిధిలో కోతలు పూర్తయినా ఇప్పటి వరకు బకాయి డబ్బులు చెల్లించడం లేదన్నారు. ఈ విషయాన్ని పలుమార్లు ఏజీఎం, డీజీఎంలకు విన్నవించినా ఫలితం లేకపోయిందని వివరించారు. కేన్ అసిస్టెంట్ కమిషనర్ రవీంద్రరావుకు సమస్యను వివరించగా.. ఆయన ఫ్యాక్టరీ డైరెక్టర్ రవికుమార్‌తో ఫోన్లో మాట్లాడారు. వారం రోజుల్లో డబ్బులు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు వాసారెడ్డి, చంద్రసేనారెడ్డి, ఆంజనేయలు, నాగేంద్రం, రంగారెడ్డి, షాలిమియా తదితరులు పాల్గొన్నారు. రామన్‌పాడులో 1,015 అడుగులు మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో మంగళవారం 1,015 అడుగుల నీటిమట్టం ఉందని ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ, సమాంతర కాల్వలో నీటి సరఫరా లేదని.. జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 7 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వకు 36 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని వివరించారు. -
చట్టాలపై అవగాహన ఉండాలి
పాన్‌గల్: ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి రజని అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని కస్తూర్బా విద్యాలయంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించగా ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని సమయం వృథా చేయకుండా చదివితే తప్పక విజయం లభిస్తుందన్నారు. బాల్య వివాహాలు చట్ట ప్రకారం చెల్లవని.. పెళ్లి చేసుకున్న వ్యక్తిపై పోక్సో యాక్ట్ ప్రకారం కేసు నమోదవుతుందని తెలిపారు. భారత న్యాయ సంహిత, వినియోగదారులు, బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, మోటారు వెహికల్, సైబర్ చట్టాల గురించి వివరించారు. ఉచిత న్యాయ సలహాల కోసం హెల్ప్‌లైన్ నంబర్ 15100 సంప్రదించాలన్నారు. చట్టాలపై అవగాహన కలిగి ఉన్న విద్యార్థినికి బహుమతి అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ఉత్తరయ్య, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ రఘు, ఎస్ఓ హేమలత, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. -
పక్కాగా ‘పోషణ పక్షం’ అమలు
కొత్తకోట రూరల్: చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదలకు పౌష్టికాహారం అందించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. మంగళవారం పోషణ్ అభియానన్ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని దండుగడ్డకాలనీ అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్షం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ హాజరై గర్భిణులు, బాలింతలకు పోషక విలువలున్న ఆహార పదార్థాలపై సంపూర్ణ అవగాహన కల్పించారు. అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ పక్షం పక్కాగా అమలుచేస్తూ తల్లీబిడ్డల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. బరువు తక్కువగా ఉన్న చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని.. ఎప్పటికప్పుడు పిల్లల బరువు, ఎత్తు చూసి తల్లిదండ్రులకు తెలియజేయాలని సిబ్బందిని ఆదేశించారు. గర్భిణులు తమ ఆరోగ్యంపై దృష్టి సారించి హిమోగ్లోబిన్ శాతం మెరుగుపర్చుకోవాలన్నారు. పుట్టిన బిడ్డకు మొదటి ఆరునెలలు తల్లి పాలు మాత్రమే పట్టించాలని.. అలా ఇవ్వాలంటే తల్లి ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. అదేవిధంగా పిల్లలు రోగాల బారిన పడకుండా పరిశుభ్రతపై అవగాహన కల్పించాలన్నారు. అనంతరం పట్టణంలోని రెండోనంబర్ రేషన్ దుకాణాన్ని సందర్శించి స్టాక్ రిజిస్టర్, సన్న బియ్యం పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత సన్న బియ్యాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తర్వాత భగీరథ చౌరస్తాలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. కేంద్రంలో కనీస సౌకర్యాలు కల్పించాలని, తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. రైతులు తీసుకొచ్చిన ధాన్యం తేమ శాతాన్ని ఎప్పటికప్పుడు రిజిస్టర్లలో నమోదు చేయాలని సూచించారు. తాలు తొలగింపునకు ఫ్యాన్ ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి రేషన్ సన్న బియ్యంతో భోజనం.. మండలంలోని ముమ్మళ్లపల్లి ఎస్సీకాలనీలో మంగళవారం కలెక్టర్ పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో మంజూరైన సీసీ రహదారి పనులను వేగంగా పూర్తి చేయాలని పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అనంతరం అడ్డాకుల శరమందా, లక్ష్మి ఇళ్లను సందర్శించి రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం అందిందా లేదా అని ఆరా తీశారు. వారితో కలిసి ప్రభుత్వం ఉచితంగా అందించిన సన్నబియ్యంతో వండిన భోజనాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆరగించారు. అనంతరం గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. 19వ నంబర్ రేషన్ దుకాణాన్ని సందర్శించారు. కలెక్టర్ వెంట జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి, జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాసులు, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీవిశ్వనాథ్, తహసీల్దార్ ఎం.వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ శ్రీనివాసులు, సహకారశాఖ సిబ్బంది నరేశ్, వ్యవసాయశాఖ సిబ్బంది తదితరులు ఉన్నారు. -
రెవెన్యూ వ్యవస్థ బలోపేతానికే జీపీఓలు
వనపర్తి: గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకే ప్రభుత్వం జీపీఓల నియామకం చేపడుతోందని రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జీపీవోల నియామకం అంశంపై పూర్వ వీఆర్వోలు, వీఆర్ఏలకు ఆప్షన్ల ఎంపికపై అవగాహన కార్యక్రమం నిర్వహించగా ఆయన హాజరై మాట్లాడారు. ఆప్షన్ల ఎంపికకు పూర్వ వీఆర్వోలు, వీఆర్ఏలకు ఈ నెల 16వ వరకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని తెలిపారు. పోస్టులకు సంబంధించి బాధ్యతలు తదితర అంశాలను వారికి వివరించారు. సమావేశంలో కలెక్టరేట్ ఏఓ భానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజారోగ్యం గాలికి..!
పురపాలికల్లో యథేచ్ఛగా జంతువధ ●అధికారులు చొరవ చూపాలి.. ప్రజారోగ్యంపై పుర అధికారులు చొరవ చూపాలి. నిత్యం పర్యవేక్షణ చేసి నిబంధనల మేరకు జంతువధ చేపడితేనే ప్రజలకు నాణ్యమైన మాంసం అందుతుంది. – సుధాకర్‌రెడ్డి, కొత్తకోట తనిఖీలు చేపట్టాలి.. రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరిరక్షణకు చొరవ తీసుకుంటున్నారు. మాంసంలో నాణ్యత, పర్యవేక్షణ లోపిస్తే ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. అధికారులు తనిఖీలు చేపడితేనే మంచిది. – కురుమయ్య, పీర్లగుట్ట, వనపర్తి నిబంధనలు అమలు చేస్తాం.. ప్రజారోగ్య పరిరక్షణలో రాజీపడే ప్రసక్తే ఉండదు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో క్షుణ్ణంగా తెలుసుకొని నిబంధనలు అమలు చేస్తాం. నిబంధనలు పాటించేలా పుర అధికారులను అప్రమత్తం చేస్తాం. కమిటీల ఏర్పాటుపై దృష్టి సారిస్తాం. – యాదయ్య, పుర ప్రత్యేక అధికారి, వనపర్తి వనపర్తి టౌన్: జిల్లాలోని పురపాలికల్లో జీవాలను ఇళ్లు, దుకాణాలు, వీధుల్లో ఎక్కడపడితే అక్కడ వధిస్తూ మాంసం విక్రయాలు చేపడుతూ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీంతో కొనాలన్నా, తినాలన్నా మీమాంస తప్పడం లేదు. జిల్లాకేంద్రంలో కబేళా ఉండి అన్ని వసతులు కల్పించినా విక్రయదారులు ముందుకురావడం లేదు. మిగతా పురపాలికలో కబేళాలు లేవు. పుర అధికారులు ఏడాదికోసారి వేలం నిర్వహించి వదిలేస్తుండటంతో కాంట్రాక్టర్ పన్ను వసూలు చేసుకుంటున్నారే తప్ప ఇవేమీ పట్టించుకోవడం లేదు. కొనుగోలుదారులు సైతం మాంసం నాణ్యతపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కొన్నిచోట్ల స్వలాభాపేక్ష కోసం ఆరోగ్యంగా లేని వాటిని వధిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇవీ నిబంధనలు.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం జంతువధ కబేళాలోనే జరగాలి. జంతువధ చేసేముందు పశువైద్యులు అవి ఆరోగ్యంగా ఉన్నాయని ధ్రువీకరించాల్సి ఉంటుంది. తర్వాత పుర అధికారులు ముద్ర వేసిన తర్వాతే వధిస్తారు. కానీ ఏ పురపాలికలో ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. కొన్నేళ్లుగా అధికారులు మౌనంగా ఉండటంతో చేసేదీమీ లేక కొనుగోలుదారులు కిలో మాంసం రూ.700 నుంచి రూ.900 వరకు కొనుగోలు చేస్తున్నారు. కానరాని కమిటీలు.. ప్రజారోగ్యం దృష్ట్యా రెవెన్యూ డివిజన్ పరిధి కేంద్రంగా ఉన్న పురపాలికలో పుర కమిషనర్ కన్వీనర్‌గా, ఆర్డీఓ చైర్మన్‌గా, హెల్త్, పోలీస్ ఇలా పలు విభాగాలకు చెందిన అధికారులతో పాటు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మొత్తం 8 మందితో కమిటీ వేయాలి. అలాగే జిల్లాస్థాయిలోనూ ఉన్నతాఽధికారులతో కమిటీలు ఉండాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. జిల్లాకేంద్రంలోవృథాగా మారిన కబేళా ముద్రలు లేకుండానే మాంసం విక్రయాలు కిలో రూ.800 నుంచిరూ.900 వరకు ఏర్పాటుకాని డివిజనల్, జిల్లాస్థాయి పర్యవేక్షణ కమిటీలు -
రెగ్యులర్ ‘రగడ’..!
●మాకు న్యాయం చేయాలి.. ప్రభుత్వం జీఓ నంబర్ 21ని వెంటనే రద్దు చేయాలి. ఇచ్చిన హామీలో భాగంగా డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులను ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. కానీ పీయూలో పనిచేస్తున్న వారిని క్రమబద్ధీకరించలేదు. ఇదెక్కడి న్యా యం? ప్రభుత్వం ఇప్పటికై నా పీయూలో కాంట్రాక్ట్ లెక్చరర్లను క్రమబద్ధీకరించాలి. అర్హులైన ప్రతి ఒక్కరికి ఉద్యోగ భద్రత కల్పించేలా న్యాయం చేయాలి. ఆ తర్వాత మిగిలిన పోస్టులను రెగ్యులర్ ప్రతిపాదికన భర్తీ చేయాలి. – రవికుమార్, పీయూ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆందోళనలు తీవ్రతరం చేస్తాంయూనివర్సిటీ ప్రారంభం నుంచి లెక్చరర్లుగా విధు లు నిర్వర్తిస్తున్నాం. అయి నా ఎలాంటి ఉద్యోగ భద్ర త లేకుండా పోయింది. 2016లో రెగ్యులర్ పోస్టు ల్లో సీనియర్లను పక్కన బెట్టి భర్తీ చేశారు. ఉద్యోగ విరమణకు దగ్గరగా వస్తున్నాం. వెంటనే ప్రభుత్వం జీఓ 21ను రద్దు చేసి క్రమబద్ధీకరించాలి. లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లో నిరసనలు తీవ్రతరం చేస్తాం. – భూమయ్య, పీయూ టీచర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా.. కాంట్రాక్ట్ అధ్యాపకుల స మస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఒకవేళ తొలగించాల్సిన పరిస్థితి వస్తే కొత్త కోర్సులు, పీజీ సెంటర్లలో సర్దుబాటు చేస్తాం. ఎవరిని తొలగించాలనే ఉద్దేశం లేదు. కాంట్రాక్ట్ అధ్యాపకులందరికీ న్యాయం చేసేలా నా వంతు కృషి చేస్తా. – శ్రీనివాస్, వీసీ, పాలమూరు యూనివర్సిటీ సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : పాలమూరు యూ నివర్సిటీలో లొల్లి రాజుకుంది. విశ్వవిద్యాలయంలో అధ్యాపక పోస్టుల శాశ్వత భర్తీకి సంబంధించి ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీఓ 21 కాంట్రాక్ట్, పార్ట్ టైం లెక్చరర్లలో అలజడి సృష్టిస్తుండగా.. రగడ మొదలైంది. దశలవారీగా తమను తొలగించేందుకు రంగం సిద్ధమవుతోందని.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఊ రుకునేది లేదని.. తమను క్రమబద్ధీకరించిన తర్వా తే శాశ్వత నియామకాలు చేపట్టాలంటూ సోమవా రం వారు ప్రత్యక్ష పోరుకు శ్రీకారం చుట్టారు. త్వరలో 22 పోస్టులకు నోటిఫికేషన్.. యూనివర్సిటీలో ప్రస్తుతం 16 మంది రెగ్యులర్ అ ధ్యాపకులు పనిచేస్తున్నారు. వీరితో పాటు 93 మంది కాంట్రాక్ట్, 60 మంది పార్ట్‌టైం ప్రతిపాదికన విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో చాలా మంది ఉ ద్యోగ విరమణకు దగ్గరగా ఉన్నారు. పీయూలో మొ త్తం 58 రెగ్యులర్ పోస్టులు కాగా.. గతంలో 16 భర్తీ చేశారు. మిగతావి భర్తీ చేయాల్సి ఉంది. ఇందులో కనీసం 22 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ ఇచ్చి.. భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. పీయూ లో ప్రభుత్వం రెగ్యులర్ అధ్యాపకులను నియమిస్తే.. ఆయా విభాగాల్లో కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లను తొలగించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. గత తొలగింపుల నేపథ్యంలో.. పీయూలో చివరిసారిగా 2014లో రెగ్యులర్ అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే భర్తీ ప్రక్రియలో అనేక అవాంతరాలు ఎదురయ్యా యి. ఎట్టకేలకు 2016లో రెగ్యులర్ అధ్యాపకుల నియామకాలు జరిగాయి. ఆంగ్ల విభాగంలో ఇద్దరు, తెలుగులో ముగ్గురు, కెమిస్ట్రీ, కామర్స్, పొలిటికల్ సైన్స్, మైక్రోబయాలజీ విభాగాల్లో ఒక్కొక్కరిని చొప్పున మొత్తం తొమ్మిది మంది అధ్యాపకులను తీసుకున్నారు. ఈ క్రమంలో ఎనిమిది మంది కాంట్రాక్ట్ అధ్యాపకులను తొలగించారు. దీంతో సీనియర్ కాంట్రాక్ట్ అధ్యాపకుడు భూమయ్య తదితరులు ఆందోళనలు చేపట్టారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ కోర్టును సైతం ఆశ్రయించారు. ప్రస్తుతం రెగ్యులర్ ప్రాతిపాదికన అధ్యాపక పోస్టు ల భర్తీకి రంగం సిద్ధమవుతుండడం.. గతంలో జరిగిన తొలగింపుల నేపథ్యంలో కాంట్రాక్ట్ లెక్చరర్లు అభద్రతా భావానికి లోనవుతున్నట్లు తెలుస్తోంది. అనుభవానికి వెయిటేజీ ఇస్తున్నా.. నూతనంగా నియామకాలను మూడు దశల్లో చేపట్టనున్నారు. మొదటి దశలో 50 మార్కులు.. వీసీ, ఉన్నత విద్యామండలి సభ్యుడు, బోర్డు ఆఫ్ స్డడీస్ చైర్మన్, హెచ్ఓడీ కన్వీనర్‌గా ఉండే స్క్రూట్నీ కమిటీ పలు కొలమానాల ఆధారంగా మార్కులు కేటా యించనుంది. రెండో దశలో మొత్తం 30 మార్కు లు.. ఇందులో బోధనానుభవం ఉన్న వారికి ఏడాది కి ఒక్క మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కులు, డెమోకు 10 మార్కులు, పుస్తక రచన, రీసెర్చ్ ఫెల్లో షిప్ ఇలా మొత్తం 10 మార్కులు కేటాయించనున్న ట్లు సమాచారం. మూడో దశలో ఇంటర్వ్యూకు 20 మార్కులు కేటాయించనున్నారు. మొత్తంగా 100 మార్కులకు సంబంధించి అత్యధిక మార్కులు సా ధించిన వారికి మాత్రమే ఉద్యోగం పొందే అవకాశం ఉంది. నియామకాల్లో అనుభవానికి వెయిటేజీ ఇస్తు న్న క్రమంలో ప్రస్తుతం పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు మేలు జరిగే అవకాశం ఉంది. అయితే అంతా సవ్యంగా జరుగుతుందా? గతంలో ఏం జరిగిందో అందరికీ తెలుసని.. తమకు న్యాయం జరిగే వ రకు పోరాటం చేస్తామన్నారు. తమను క్రమబద్ధీకరించిన తర్వాతే మిగిలిన పోస్టులను రెగ్యులర్ ప్రా తిపదికన భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పీయూలో జీఓ 21 లొల్లి శాశ్వత నియామకాలపై కాంట్రాక్ట్, పార్ట్ టైం అధ్యాపకుల్లో ఆందోళన దశల వారీగా తమను తొలగిస్తారని బెంబేలు.. పోరుబాటకు శ్రీకారం వీసీకి వినతి.. యూనివర్సిటీ ప్రాంగణంలో ప్రభుత్వ ఉత్తర్వు కాపీల దహనం డిగ్రీ, ఇంటర్ కాలేజీల్లో క్రమబద్ధీకరణ తమకు వర్తించదా అంటూ నిరసన గళం ఎన్నో ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నాం.. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ మేమెందుకు అర్హులం కాదు ? ఇటీవలి డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో అర్హత ఉన్న అధ్యాపకులను ప్రభుత్వం రెగ్యులర్ చేసిన విషయం తెలిసిందే. పీయూ ఏర్పాటైనప్పటి నుంచి లెక్చరర్లుగా పనిచేస్తున్నామని.. అయినా తమను క్రమబద్ధీకరించపోవడం అన్యాయమని కాంట్రాక్ట్, పార్ట్ టైం లెక్చరర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేమెందుకు అర్హులం కాదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం పీయూ వైస్‌చాన్స్‌లర్ శ్రీనివాస్, నూతన రిజిస్ట్రార్ రమేష్‌బాబును కలిసి వినతిపత్రం అందజేశారు. తాము ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్ట్, పార్ట్ టైం ప్రాతిపదికన లెక్చరర్లుగా చేస్తున్నామని.. తమను రెగ్యులర్ చేసిన తర్వాత మాత్రమే మిగిలిన పోస్టుల భర్త్తీ ప్రక్రియ చేపట్టాలని కోరారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం పీయూలోని అడ్మినిస్ట్రేషన్ భవనం వద్ద జీఓ 21 ప్రతులను దహనం చేశారు. సమస్యను పరిష్కరించకపోతే ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. -
మరో రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి పనులు
వనపర్తి: నియోజకవర్గంలో మరో రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి నేటి వరకు రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక కొందరు సోషల్ మీడియా వేదికగా తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వంలో నిర్మించిన ఏదుల రిజర్వాయర్ నుంచి చుక్క నీరు అందని పరిస్థితి ఉందని.. కాంగ్రెస్ ప్రభుత్వం లింక్ కెనాల్ ఏర్పాటు చేసి పలు మండలాలకు సాగునీరు అందించనున్నట్లు చెప్పారు. అదే విధంగా రూ.985 కోట్లతో గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలం వనపర్తి: అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో కార్యకర్తలతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఆస్తి కేసీఆర్ అని.. 14 ఏళ్ల ఉద్యమ చరిత్ర తమదని అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించిందని గుర్తుచేశారు. ఈ నెల 27న వరంగల్‌లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేసేందుకు గ్రామగ్రామానా సమావేశాలు నిర్వహించడంతో పాటు సోషల్ మీడియా వేదికగా ప్రచారం నిర్వహించి కార్యకర్తలు, ప్రజలను సమాయత్తం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, మీడియా కన్వీనర్ అశోక్ ఉన్నారు. సాగునీటి కోసం రైతుల ఆందోళన అమరచింత: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం రైతు లు ఆందోళనకు దిగారు. ఆత్మకూర్ మండలంలోని ఆరెపల్లి, కత్తేపల్లి, తూంపల్లి గ్రామాలకు చెందిన ఆయకట్టు రైతులు జూరాల ప్రధాన ఎడమ కాల్వ వద్దకు చేరుకొని గద్వాల– అమరచింత రహదారిపై ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. చేతికొచ్చే దశలో ఉన్న యాసంగి పంటలకు సాగునీటి విడుదలను నిలిపివేయడంతో తమ కుటుంబాలు రోడ్డున పడుతాయని ఆవేదన వ్యక్తంచేశారు. యాసంగి సాగుకు వారబందీ ద్వారా సాగునీటిని క్రమం తప్పకుండా అందిస్తామన్న అధికారులు.. సమాంతర కాల్వ ద్వారా ప్రాజెక్టులో ఉన్న నీటిని తీసుకెళ్తున్నా పట్టించుకోక పోవడంతోనే ఇలాంటి పరిస్థితి దాపురించిందని ఆరోపించారు. వారబందీ విధానంలో మరో రెండు పర్యాయాలు సాగునీరు వదలా లని డిమాండ్ చేశారు. కాగా, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మరో రెండు రోజులపాటు సాగునీటిని కాల్వలకు వదులుతామని ప్రాజె క్టు అధికారులు ప్రకటించడంతో రైతులు ధర్నా ను విరమించారు. పంటలు చేతికొచ్చే వరకు సాగునీరు అందించాలని కోరుతూ ఏఈ ఆంజనేయులుకు వినతిపత్రం అందించారు. రామన్‌పాడు @ 1,015 అడుగులు మదనాపురం: రామన్‌పాడు జలాశయంలో సోమవారం 1,015 అడుగులకు నీటిమట్టం చేరిందని ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ, సమాంతర కాల్వ ద్వారా వచ్చే నీటిని నిలిపివేసినట్లు పేర్కొన్నారు. రామన్‌పాడు నుంచి ఎన్టీఆర్ కాల్వకు 24 క్యూసెక్కులు, కుడి, ఎమడ కాల్వలకు 55 క్యూసెక్కులు, తాగునీటి అవసరాల కోసం 20 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఏఈ తెలిపారు. -
ముందుజాగ్రత్తలతోనే ఆరోగ్యం
వనపర్తిటౌన్: ముందుజాగ్రత్తలు పాటిస్తూ.. ఆరోగ్య సూత్రాలను నిత్య జీవితంలో అలవర్చుకోవడం ద్వారా పరిపూర్ణ ఆరోగ్యానికి కొదవ ఉండదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత అన్నారు. జిల్లా కేంద్రంలోని కన్యకా పరమేశ్వరిదేవి ఆలయంలో సోమవారం జిల్లా న్యాయ సేవాధికార సంఽస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో న్యాయమూర్తి మాట్లాడారు. స్వీయ మెళకువలు పాటించడం ద్వారా అనారోగ్య సమస్యలను చాలా వరకు తగ్గించుకోవచ్చన్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో పాటు పోషకాలు అధికంగా ఉండే పదార్థాలను తీసుకోవాలని సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రజిని మాట్లాడుతూ.. ఆరోగ్యానికి మించిన సంపద లేదన్నారు. ఆరోగ్య పరిరక్షణలో ప్రతి ఒక్కరూ ముందుండాలని అన్నారు. ఉచిత న్యాయసేవ సలహాల కోసం 15100 టోల్‌ఫ్రీ నంబర్ సంప్రదించాలని సూచించారు. అనంతరం సీపీఆర్ చేసే విధానంపై జిల్లా వైద్యాధికారి శ్రీనివాసులు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ మంజుల, న్యాయవాది ఉత్తరయ్య పాల్గొన్నారు. -
సన్నబియ్యం పంపిణీపై పక్కాగా పర్యవేక్షణ
వనపర్తి: రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీని పక్కాగా పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సన్నబియ్యంలో దొడ్డుబియ్యం కలిపి పంపిణీ చేయరాదని.. అలాంటి పనులు ఎక్కడైనా చేసినట్లు తమ దృష్టికి వస్తే చర్యలు తప్పవన్నారు. అక్రమాలకు పాల్పడితే రేషన్ డీలర్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. అదే విధంగా మరికొన్ని రోజుల్లో వరిధాన్యం కొనుగోలు ప్రారంభం కాబోతోందని.. అధికారులు ఎప్పటికప్పుడు ధాన్యం కొ నుగోలు వివరాలను సేకరించాలని సూచించారు. కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలన్నారు. ఫిర్యాదులు త్వరగా పరిష్కరించండి ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, యాదయ్య, ఆర్డీఓ సుబ్రహ్మణ్యంలతో కలిసి ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 30 ఫిర్యాదులు అందగా.. పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు పంపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ.. ప్రజలకు తగిన సమాచారం అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రజలు ఎంతో నమ్మకంతో తమ సమస్యలను తెలియజేసేందుకు వస్తుంటారని.. వారు ఇచ్చిన ఫిర్యాదులను నిశితంగా పరిశీలించి పరిష్కార మార్గం చూపాలని సూచించారు. సీఎం ప్రజావాణి ఫిర్యాదులు ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. -
ప్రజాపాలనకు సీఎం అడుగులే నిదర్శనం
వనపర్తిటౌన్: ముఖ్యమంత్రి హోదాలో సామాన్యు ల ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను తెలుసుకోవడం మామూలు విషయం కాదని.. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనకు సీఎం రేవంత్‌రెడ్డి వేస్తున్న అడుగులే నిదర్శనమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో సోమవారం వనపర్తి నియోజక వర్గానికి చెందిన 105 మందికి రూ. 30.07లక్షల విలువగల సీఎం రిలీఫ్‌ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏడాదిన్నర కాలంలో ప్రజాభీష్టానికి అనుగుణంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. గత ప్రభుత్వ హయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకే సీఎంను కలిసే భాగ్యం దక్కలేదన్నారు. ఆ పరిస్థితులను కాంగ్రెస్ ప్రభుత్వం రూపుమాపడంతో పాటు పాలనపై అంకితభావాన్ని చాటుకుందని అన్నారు. సీఎం హోదా ప్రజాసేవకు లభించిన అవకాశంగా రేవంత్‌రెడ్డి భావించి ముందుకెళ్తున్నారని చెప్పారు. పేదలకు సన్నబియ్యం పంపిణీ చారిత్రాత్మకమని అన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్, నాయకులు ఖమర్, కోట్ల రవి, బాబా, నందిమళ్ల యాదయ్య, కోళ్ల వెంకటేశ్, రాగి వేణు, నాగరాజు, అబ్దుల్లా, అక్షయ్, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యం
పాలమూరు: క్షేత్రస్థాయిలో పార్టీ ఎంతో బలపడటంతోపాటు తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని ఎంపీ డీకే అరుణ అన్నారు. ఆదివారం బీజేపీ 45వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మొదట ఎంపీ నివాసంలో నాయకులతో కలిసి పార్టీ జెండా ఆవిష్కరించి అక్కడి నుంచి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డితో కలిసి పార్టీ జెండా ఆవిష్కరించి.. పార్టీ వ్యవస్థాపకుల చిత్రపటాలకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ కేంద్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 25 వరకు చేపట్టబోయే కార్యక్రమాల్లో నాయకులు, కార్యకర్తలు ప్రతిఒక్కరూ పాల్గొనాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. వారం రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో భాగంగా ప్రతి కార్యకర్త ఇంటిపై బీజేపీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. గాంవ్ చలో– బస్తీ చలో పేరుతో ఊరూరా ప్రత్యేక కార్యక్రమం, ఈ నెల 13 నుంచి 25 వరకు అంబేడ్కర్ సంయాన్ అభియాన్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ నెల 13న ప్రతి గ్రామంలోని అంబేడ్కర్ విగ్రహాన్ని శుభ్రం చేయడం, 14న విగ్రహాల దగ్గర కొవ్వొత్తుల ప్రదర్శన చేయాలన్నారు. దేశ చరిత్రలో కీలక ఘట్టం వక్ఫ్ బిల్లు చట్టరూపం దాల్చడం దేశ చరిత్రలో మరో కీలక ఘట్టమని, దేశంలో వేలాది మంది వక్ఫ్ బాధితులకు న్యాయం జరుగుతుందని ఎంపీ డీకే అరుణ అన్నారు. పార్టీ కార్యాలయం దగ్గర ఆమె మీడియాతో మాట్లాడారు. దేశంలో వక్ఫ్ పేరుతో లిటిగేషన్లో ఉన్న వేలాది ఎకరాల భూములకు రిలీఫ్ రాబోతుందన్నారు. వక్ఫ్ సవరణ బిల్లుతో మైనార్టీల ఆస్తులు, మసీద్‌లు, కబ్రస్తాన్లు తీసుకుంటారని జరిగిన ప్రచారం పూర్తిగా అవాస్తవం అని స్పష్టం చేశారు. వక్ఫ్ పేరుతో జరిగిన మోసాలకు ఈ చట్టం చెక్ పెడుతుందన్నారు. ఇకపై అసలైన మైనార్టీ మహిళలు, వితంతువులకు సరైన న్యాయం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు పద్మజారెడ్డి, జయశ్రీ, పాండురంగారెడ్డి, కృష్ణవర్ధన్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. -
నడిచి వెళ్లాల్సిందే..
గ్రామ రహదారి అధ్వానంగా ఉందని ఆటోలు సైతం రావడం లేదు. ఆర్టీసీ బస్ కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే వస్తుంది. గ్రామానికి బస్ సౌకర్యం కల్పించాలని అధికారులకు విన్నవిస్తే రోడ్డు బాగోలేదంటున్నారు. ఎక్కడికై నా వెళ్లాలంటే స్టేజీ వరకు నడిచి వెళ్లాల్సిందే. 65 ఏళ్ల వయస్సులో మోకాళ్ల నొప్పులతో నడిచి వెళ్లడం ఇబ్బందిగా ఉంది. – లక్ష్మమ్మ, ధర్మాపురం అంబులెన్స్ కూడా రాదు.. అత్యవసర సమయాల్లో అంబులెన్స్ కోసం ఫోన్‌చేసే రోడ్డు బాగోలేదని.. రామంటూ సిబ్బంది సమాధానమిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఇదే పరిస్థితి. తప్పని పరిస్థితుల్లో ఆటోలు, ట్రాక్టర్లలో అమరచింత, ఆత్మకూర్‌కు తీసుకెళ్లాల్సి వస్తోంది. అధికారులు, ఎమ్మెల్యే సమస్యను పరిష్కరించాలి. – ద్యావర్ల చెన్నప్ప, ధర్మాపురం -
రామన్‌పాడులో 1,015 అడుగుల నీటిమట్టం
మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో ఆదివారం 1,015 అడుగుల నీటిమట్టం ఉందని ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ, సమాంతర కాల్వల్లో నీటి సరఫరా లేదని.. జలాశయం నుంచి ఎన్టీఆర్ కాల్వకు 15 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 52 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని వివరించారు. నేడు మార్కెట్లో లావాదేవీలు దేవరకద్ర: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో సోమవారం యథావిధిగా లావాదేవీలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. శని, ఆదివారాల్లో సెలవుల కారణంగా మార్కెట్ బంద్ చేశారు. సోమవారం మధ్యాహ్నం మార్కెట్ కార్యాలయంలో ధాన్యం టెండర్లు వేసి ధరలు నిర్ణయిస్తారు. ప్రస్తుతం వరి కోతలు ప్రారంభం కావడంతో రైతులు పెద్దఎత్తున వరి ధాన్యం అమ్మకానికి తెస్తున్నారు. హ్యాండ్‌బాల్ పోటీలకు పాలమూరు క్రీడాకారులు మహబూబ్‌నగర్ క్రీడలు: ఒడిశా రాష్ట్రంలో మంగళవారం నుంచి శనివారం వరకు జరిగే జాతీయ సబ్ జూనియర్ హ్యాండ్‌బాల్ పోటీలకు జిల్లాకు చెందిన ఇద్దరు క్రీడాకారులు ఎంపికయ్యారు. సాయి వివేక్, ఎండీ నవాజ్ తెలంగాణ రాష్ట్ర జట్టులో చోటు దక్కించుకున్నారు. వీరి ఎంపికపై సంఘం సభ్యులు రజనీకాంత్‌రెడ్డి, ఎండీ జియావుద్దీన్, ఎండీ అహ్మద్ హుస్సేన్, కోచ్ ప్రదీప్‌కుమార్, పీఈటీ ప్రణయ్ హర్షం వ్యక్తం చేశారు. జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభచాటి పేరు, ప్రఖ్యాతులు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు. ఆరోగ్యమే.. ఆనందం ● జిల్లాలో పెరుగుతున్న దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ● జీవన విధానం, ఆహారంలో మార్పులే కారణం ● నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం -
నిధులున్నా.. నిట్టూర్పే
మిట్టనందిమళ్ల పనులు ప్రతిపాదనలోనే.. నందిమళ్ల క్రాస్‌రోడ్ నుంచి గ్రామం వరకు సుమారు 4 కిలోమీటర్ల రహదారిని బీటీగా మార్చేందుకు సుమారు రూ.4.50 కోట్లు అవసరమని అధికారులు గతేడాది ప్రతిపాదనలు పంపించారు. కిష్టంపల్లి క్రాస్‌రోడ్ నుంచి మిట్టనందిమళ్ల వరకు రహదారి పూర్తిగా దెబ్బతినడంతో ఆయా గ్రామస్తులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలో గ్రామాల మీదుగా వెళ్లే రహదారిని బీటీగా మార్చాలని పాలకులు, అధికారులకు పలుమార్లు విన్నవిస్తూనే ఉన్నామని.. నేటికీ ప్రతిపాదనకే వదిలేశారని చెబుతున్నారు. అమరచింత: అమరచింత, ఆత్మకూర్ మండలాల్లోని వీరరాఘవాపురం, నందిమళ్ల, ధర్మాపురం గ్రామాలకు బీటీ రహదారి నిర్మాణానికి నిధులు మంజూరైనా.. పనుల్లో పురోగతి కనిపించడం లేదు. ఆయా గ్రామాల రహదారులను బీటీగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5.60 కోట్లు మంజూరు చేసింది. ఆర్నెల్ల కిందటే అధికారులు టెండర్ ప్రక్రియ పూర్తి చేసినా.. నేటికీ కాంట్రాక్టర్ పనులు ప్రారంభించకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అమరచింత మండలంలోని చంద్రగఢ్ క్రాస్‌రోడ్ నుంచి నందిమళ్ల వరకు, ధర్మాపురం గేట్ నుంచి గ్రామం వరకు బీటీ రహదారి నిర్మాణానికిగాను రూ.5 కోట్లు మంజూరయ్యాయి. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి గ్రామ రహదారిని అధికారులు, నాయకులు పట్టించుకోవడం లేదని.. దీంతో 2.50 కిలోమీటర్లు నడుచుకుంటూ స్టేజీ వరకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రత్యేక చొరవచూపి బీటీ పనులు త్వరగా ప్రారంభించి వేసవి చివరి నాటికి పూర్తి చేయాలని కోరుతున్నారు. 6 నెలల కిందటే.. వీరరాఘవాపురం, ధర్మాపురం, నందిమళ్ల గ్రామాల బీటీ పనులకు ఆరు నెలల కిందటే అధికారులు టెండర్ ప్రక్రియ పూర్తి చేశారు. పనులు త్వరలోనే ప్రారంభిస్తామని పంచాయతీరాజ్‌శాఖ అధికారులు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి చెప్పారే తప్ప నేటికీ ప్రారంభించలేదు. పనులు త్వరగా పూర్తి చేద్దామనే ఆలోచన సదరు కాంట్రాక్టర్‌కు కలుగకపోవడం ఏమిటని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయా గ్రామాల్లో జరిగే సభలు, సమావేశాల్లో రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేశామని చెప్పుకొస్తున్నారే తప్ప ఇప్పటి వరకు పనులు ఎందుకు చేపట్టలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నారు. బీటీగా మారని మట్టి రహదారులు 5.50 కి.మీ. నిర్మాణానికి రూ.5.60 కోట్లు మంజూరు మిట్టనందిమళ్ల బీటీ పనులుప్రతిపాదనలకే పరిమితం టెండర్ పూర్తయినా పురోగతి శూన్యం -
జగ్జీవన్‌రాం జీవితం స్ఫూర్తిదాయకం
జిల్లా పోలీసు కార్యాలయంలో.. మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్‌రాం జయంతిని శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించగా.. ఎస్పీ రావుల గిరిధర్ సిబ్బందితో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, రిజర్వ్ సీఐలు అప్పలనాయుడు, శ్రీనివాస్, డీసీఆర్బీ ఎస్ఐ తిరుపతిరెడ్డి, శిక్షణ ఎస్ఐలు వేణుగోపాల్, నరేశ్, హిమబిందు, దివ్య, డీసీఆర్బీ, ఎస్పీ, ఐటీకోర్, సీసీఎస్, క్లూస్ టీం సిబ్బంది, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వనపర్తి: బాబు జగ్జీవన్‌రాం జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో జగ్జీవన్‌రాం జయంతి వేడుకలు నిర్వహించగా.. కలెక్టర్‌తో పాటు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, ఎస్పీ రావుల గిరిధర్, డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరై జగ్జీవన్‌రాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. డా. బాబు జగ్జీవన్‌రాం భారత తొలి ఉప ప్రధానిగా, రక్షణశాఖమంత్రిగా, వ్యవసాయశాఖమంత్రిగా పనిచేశారని వివరించారు. చదువుతోనే సమున్నతస్థాయికి ఎదగగలమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం, స్టాండప్ ఇండియా, టీప్రైడ్ వంటి పథకాలతో యువత స్వయం ఉపాధి పొందేందుకు అవకాశం కల్పిస్తుందని.. యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా త్వరలోనే జిల్లాలో ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ సమావేశం నిర్వహిస్తామన్నారు. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ.. సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమానికి అలుపెరగని పోరాటం చేసిన గొప్ప సంఘసంస్కర్త బాబు జగ్జీవన్‌రాం అని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాల అభివృద్ధికి కట్టుబడి ఉందని.. వారికోసం అనేక పథకాలు అమలు చేస్తోందని చెప్పారు. జిల్లాలో బాబు జగ్జీవన్‌రాం, డా. బీఆర్ అంబేడ్కర్ భవనాల నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. జిల్లాకేంద్రంలో నిర్మించిన టౌన్‌హాల్‌కు అంబేడ్కర్ పేరు పెడతామని తెలిపారు. ఎస్పీ రావుల గిరిధర్ మాట్లాడుతూ.. వ్యక్తిగత సంస్కరణతోనే సంఘ సంస్కరణ సాధ్యమని, ప్రతి ఒక్కరూ అనుకున్న లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు సాగాలన్నారు. జిల్లావ్యాప్తంగా సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, బాబు జగ్జీవన్‌రాం, అంబేడ్కర్ విగ్రహాల సంరక్షణకు కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి, స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ యాదయ్య, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మల్లికార్జున్, వనపర్తి వ్యవసాయ మార్కెట్‌యార్డు చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, ఆర్డీఓ సుబ్రమణ్యం, తహసీల్దార్ రమేష్‌రెడ్డి, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ నాయకులు గంధం ఘట్టన్న, బోజరాజు, గంధం నాగరాజు, కోళ్ల వెంకటేష్, మిషేక్, మీసాల రాము, ప్రజావాగ్గేయకారుడు రాజారాం ప్రకాష్, ఇతర అధికారులు, షెడ్యూల్డ్ కులాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి -
శ్రీరామనవమికి ఆలయాలు ముస్తాబు
వనపర్తి టౌన్: శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం సీతారాముల కల్యాణ వేడుకను కనులపండువగా నిర్వహించేందుకు జిల్లాలోని ఆలయాలు, మండపాలు ముస్తాబయ్యాయి. జిల్లాకేంద్రంలోని రామాలయం, వేంకటేశ్వరస్వామి, లక్ష్మీ నర్సింహస్వామి, గోపాల్పేట రోడ్‌లోని రామాంజనేయ, రాంనగర్‌లోని రామాంజనేయ ఆలయాల్లో కల్యాణ క్రతువు నిర్వహించనున్నారు. రామాలయంలో ఆలయ ప్రధాన అర్చకుడు నరేంద్రస్వామి నేతృత్వంలో యాగశాలను ఏర్పాటుచేసి మూడురోజులుగా వేద పండితులు పూజాదికాలు నిర్వహిస్తున్నారు. శనివారం సుదర్శన హోమం.. రాత్రి సీతారాముల ఎదుర్కోళ్ల మహోత్సవం భక్తిశ్రద్ధలతో చేపట్టారు. ఆదివారం కల్యాణ వేడుకకు హాజరయ్యే భక్తుల కోసం వేసవి దృష్ట్యా చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. కల్యాణ మండపాన్ని రంగురంగు పూలు, మామిడి తోరణలతో అందంగా అలంకరించారు. కల్యాణ మహోత్సవాన్ని వీక్షించేందుకు పలు ఆలయాల్లో ప్రొజెక్టర్లు ఏర్పాటు చేయడంతో పాటు పలు ఆలయాలను రంగురంగుల విద్యుద్ధీపాలతో అలంకరించారు. ఆర్టీసీకి 300 ఆర్డర్లు.. భద్రాద్రి రామయ్య కల్యాణ తలంబ్రాలను ఆర్టీసీ కార్గో ద్వారా పొందేందుకు శనివారం వరకు జిల్లా లో 300 మంది భక్తులు రూ.45,300 చెల్లించినట్లు వనపర్తి ఆర్టీసీ డిపో మేనేజర్ వేణుగోపాల్ తెలి పారు. రూ.151 చెల్లించి ఈ నెల 7 వరకు బుక్ చేసు కునే అవకాశం ఉందని.. ఈ నెల 15 వరకు భక్తుల చెంతకు చేరుస్తామని వివరించారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నేడు సీతారాముల కల్యాణ వేడుక ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు -
‘ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలి’
వనపర్తి రూరల్: ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు కోరారు. శనివారం జిల్లాకేంద్రంలోని సంఘం కార్యాలయంలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) జిల్లా అధ్యక్షురాలు శారద అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆయనతో పాటు సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మండ్ల రాజు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, మినీ టీచర్లు, ఆశాలను కార్మికులుగా గుర్తించాలన్నారు. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని, అంగన్వాడీలకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ చెల్లించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారంగాకపోతే మే 20న కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్త సమ్మెలో పాల్గొని విజయవంతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బొబ్బిలి నిక్సన్, అంగన్వాడీ సంఘం జిల్లా కార్యదర్శి నారాయణమ్మ, కవిత, జ్యోతి, అరుణ, కవిత, భాగ్యమ్మ, భాగ్యలక్ష్మి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
పోషణ్ ట్రాకర్
అంగన్వాడీల్లో లబ్ధిదారుల వివరాల నమోదు భార్యాభర్తల్లో ఎవరైనా.. గర్భిణులు, బాలింతలు లేదా వారి భర్తలు ఎవరైనా ఒకరు వచ్చి పోషణ్ ట్రాకర్ యాప్‌లో వివరాలు నమోదు చేసుకుంటేనే సరుకులు అందిస్తున్నారు. ముఖాలను యాప్ ధ్రువీకరించకపోతే సరుకులు అందించే వీలు లేదు. మొరాయిస్తున్న నెట్వర్క్.. పోషణ్ ట్రాకర్ యాప్‌లో వివరాల నమోదు సమయంలో సెల్‌ఫోన్ సిగ్నల్స్ లేకపోవడం, సర్వర్ స్లో, సర్వర్ ప్రాబ్లం తలెత్తడంతో టీచర్లు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రతిరోజు కనీసం అయిదుగురికి కూడా సరుకులు పంపిణీ చేయలేకపోతున్నామని టీచర్లు వాపోతున్నారు. అధికారులు స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు. అమరచింత: అంగన్వాడీ కేంద్రాల్లో పారదర్శకత కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గర్భిణులు, బాలింతలు, కిషోర బాలికలు, చిన్నారులకు అందించే పౌష్టికాహరం పక్కదారి పట్టకుండా పోషన్ ట్రాకర్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. యాప్‌లో లబ్ధిదారు ఆధార్ నంబర్, ఫొటో, సెల్‌నంబర్ నమోదు కొనసాగుతుంది. లబ్ధిదారు సెల్‌ఫోన్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేసిన అనంతరం సరుకులు పంపిణీ చేయనున్నారు. దీంతో సరుకులు నేరుగా లబ్ధిదారుకే అందనున్నాయి. పక్కదారి పట్టకుండా.. లబ్ధిదారులకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా రోజు బియ్యం, పప్పు, నూనె, ఆకుకూరలు, గుడ్లు, బాలామృతం తదితర సరుకులు అందిస్తున్నారు. ఆయా సరుకులు పక్కదారి పడుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం కట్టడికి చర్యలు చేపట్టింది. యాప్‌లో లబ్ధిదారు ఫొటోతీసి అప్లోడ్ చేయడంతో అర్హులకే లబ్ధి చేకూరుతుంది. దీంతో అక్రమాలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంది. సరుకుల పంపిణీలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకే మెరుగైన సేవలకు ప్రభుత్వం నిర్ణయం -
కాల్వకు గండి.. పట్టించుకోని అధికారులు
పాన్‌గల్: మండలంలోని మాందాపూర్–రాయినిపల్లి గ్రామాల మధ్య ఉన్న కేఎల్ఐ మైనర్ కాల్వకు గండిపడి సాగునీరు వృథా అవుతోంది. కాల్వలపై నీటిపారుదలశాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కోతకు గురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాల్వకు గండి పడి రెండు, మూడురోజులు గడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని.. చివరి ఆయకట్టుకు సక్రమంగా నీరందక పంటలు ఎండుతున్నాయని వివరించారు. ఇప్పటికై నా స్పందించి కాల్వలపై పర్యవేక్షణ పెంచి చివరి ఆయకట్టుకు సక్రమంగా సాగునీరు చేరేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రంగనాథుడి సన్నిధిలో పాలమూరు న్యాయమూర్తి వనపర్తి రూరల్: శ్రీరంగాపురం రంగనాథస్వామి ఆలయాన్ని శనివారం మహబూబ్‌నగర్ సీనియర్ సివిల్ నాయమూర్తి రాధిక కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ విశిష్టతను వివరించి స్వామివారి శేషవస్త్రాలతో సత్కరించి వేద ఆశీర్వచం చేశారు. కార్యక్రమంలో ఎస్ఐ రామకృష్ణ, ఆలయ సిబ్భంది తదితరులు పాల్గొన్నారు. ‘సుంకాల భారం సరికాదు’ వనపర్తి రూరల్: భారతదేశ ఉత్పత్తులపై అమెరికా విఽధిస్తున్న అధిక సుంకాలు సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాలనర్సింహ అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రధాని మోదీ గొప్ప నాయకుడని చెబుతున్నారని.. అధిక సుంకాలను ఆపమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను అడిగే ధైర్యం ఎందుకు లేదని ప్రశ్నించారు. 50 లక్షల డాలర్ల గోల్డ్‌కార్డు కొంటేనే అమెరికాలో శాశ్వతంగా ఉండొచ్చని చెబుతున్నారని.. ఇది భారతీయులకు ఎంతో భారమన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు పూర్తిగా అమలు చేయడం లేదని.. రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, రూ.500కి సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పాక్షికంగానే అమలవుతున్నాయని వివరించారు. ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంటే మిత్రపక్షమైన సీపీఐ ఎంతో కాలం చూస్తూ ఊరుకోలేదన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి విజయరాములు, కళావతమ్మ, శ్రీరాం, మోషా, రమేష్ అబ్రహం, గోపాలకృష్ణ, రవీందర్, శ్రీహరి, నరసింహశెట్టి తదితరులు పాల్గొన్నారు. -
‘యువ వికాసం’ దరఖాస్తులకు ప్రత్యేక కౌంటర్
వనపర్తి: రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల స్వీకరణకు ఎంపీడీఓ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శుక్రవారం పెబ్బేరు ఎంపీడీఓ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి అధికారులతో మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్‌ను వేగంగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం కార్యాలయ ఆవరణలోని నమూనా ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని పరిశీలించారు. నెలాఖరు వరకు నిర్మాణం పూర్తి చేయాలని హౌసింగ్ విభాగం డీఈ విఠోభాకు సూచించారు. అక్కడి నుంచి పట్టణంలోని మూడోనంబర్ రేషన్ దుకాణాన్ని సందర్శించారు. స్టాక్ రిజిస్టర్, బియ్యం పంపిణీ విధానాన్ని పరిశీలించారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత సన్నబియ్యాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇక నుంచి ప్రతి నెల సన్న బియ్యం పంపిణీ చేస్తామని చెప్పారు. ఆయన వెంట తహసీల్దార్ లక్ష్మి, ఎంపీడీఓ రవీంద్ర, ఇతర అధికారులు ఉన్నారు. ‘రేషన్’ దరఖాస్తుల పరిశీలన వేగవంతం జిల్లాలో రేషన్ దుకాణాలకు సన్న బియ్యం రవాణా, పంపిణీ వేగవంతం చేసినట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి వివరించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొని జిల్లా వివరాలు వెల్లడించారు. కొత్త ఆహార భద్రత కార్డుల జారీకి దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించి బియ్యం రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు పేదలతో కలిసి సన్న బియ్యంతో భోజనం చేయాలని సూచించారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు, పౌరసరఫరాల డీఎం జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
సన్న బియ్యం పంపిణీ చారిత్రాత్మకం
పాన్‌గల్: రాష్ట్రంలోని పేదలు సన్న బియ్యంతో భోజనం చేయాలనే ఉన్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దేశంలో ఎక్కడా లేని విధంగా సన్న బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టారని.. ఇది చారిత్రాత్మక నిర్ణయమని రాష్ట్ర ఎకై ్సజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంతో పాటు రేమద్దుల, కిష్టాపూర్‌తండా, గోప్లాపూర్, అన్నారం గ్రామంలోని రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీని అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో పంపిణీ చేసిన దొడ్డు బియ్యాన్ని లబ్ధిదారులు తక్కువ ధరకు దళారులకు విక్రయించేవారని, కాంగ్రెస్ ప్రభుత్వం పేదలందరికి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్న రకం బియ్యం పంపిణీని ప్రారంభించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో చాలావరకు అమలు చేసిందని.. మిగిలిన వాటిని కూడా నెరవేరుస్తుందని చెప్పారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని.. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు జనాభా ప్రతిపాదికన పంపిణీ చేయనుండగా, 69 ఓట్లకు ఒక ఇల్లు చొప్పున మంజూరు అవుతాయన్నారు. మొదటి విడతలో రాని వారికి రెండోవిడతలో మంజూరు చేస్తామని చెప్పారు. ప్రజలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలని, ప్రభుత్వం అందించే వైద్య సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాజీవ్ యువ వికాసం పథకాన్ని నిరుద్యోగ యువత వినియోగించుకోవాలని మంత్రి కోరారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేసినా.. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినా, తప్పులు చేసే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం వివిధ గ్రామాలకు చెందిన 41 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, డీఆర్డీఓ ఉమాదేవి, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీవిశ్వనాథ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్‌సాగర్, మండల కాంగ్రెస్ నాయకులు వెంకటేష్‌నాయుడు, రవికుమార్, అధికారులు పాల్గొన్నారు. కాంగ్రెస్‌పార్టీ కార్యాలయ నిర్మాణ స్థల పరిశీలన.. వనపర్తి: జిల్లాకేంద్రంలోని రాజపేట శివారులో కాంగ్రెస్‌పార్టీ జిల్లా కార్యాలయ నిర్మాణానికిగాను శుక్రవారం మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు తూడి మేఘారెడ్డి, జి.మధుసూదన్‌రెడ్డి స్థల పరిశీలన చేశారు. ఎకరా స్థలంలో కార్యాలయాన్ని నిర్మించనున్నట్లు మేఘారెడ్డి తెలిపారు. స్థలం నిర్మాణానికి అనువుగా ఉందని.. వెంటనే పనులు ప్రారంభించాలని మంత్రి చెప్పారు. భవన నిర్మాణం పూర్తయితే కార్యకలాపాలకు అనువుగా ఉంటుందని పేర్కొన్నారు. జనాభా ప్రాతిపదికన ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు