
పేదలకు అండగా కేంద్ర పథకాలు
వనపర్తి రూరల్: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అండగా నిలుస్తున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నారాయణ అన్నారు. శనివారం శ్రీరంగాపురం మండల అధ్యక్షుడు విష్ణువర్ధన్ ఆధ్వర్యంలో శ్రీరంగాపురం మండలంలోని తాటిపాములలో గావ్ చలో కార్యక్రమంలో ఆయనతోపాటు ముఖ్య అతిథిగా జెడ్పీ మాజీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి పాల్గొని ప్రతి ఇంటికి బీజేపీ అందజేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరించారు. గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం పాఠశాలకు ఇస్తున్న పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యే దిశగా ప్రయత్నం చేస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామాల్లో బీజేపీ అభ్యర్థుల విజయానికి కార్యకర్తలు కృషిచేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు మేమారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రామన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
రామన్‌పాడులో
తగ్గుతున్న నీటిమట్టం
మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో శనివారం వరకు పూర్తిస్థాయి నీటిమట్టం 1,015 అడుగులకు చేరిందని ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ, సమాంతర కాల్వల ద్వారా వచ్చే నీటిని నిలిపివేశారన్నారు. ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్ కాల్వ ద్వారా 24 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వల ద్వారా 63 క్యూసెక్కులు, తాగునీటి అవసరాల కోసం 20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నామని వివరించారు.
పీయూలో
ప్రాంగణ ఎంపికలు
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: పాలమూరు యూనివర్సిటీ (పీయూ)లోని సెమినార్ హాల్‌లో శనివారం ఎంఎస్‌ఎన్ లేబరేటరీ నిర్వాహకులు క్యాంపస్ సెలక్షన్స్ నిర్వహించారు. కాగా క్యూసీ, క్యూఏ, ప్రొడక్షన్ పోస్టుల కోసం యూజీ, పీజీ రసాయన శాస్త్రం విద్యార్థులు 60 మందికి పైగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్లేస్‌మెంట్ ఆఫీసర్ డా.ఎస్‌ఎన్ అర్జున్‌కుమార్ మాట్లాడుతూ మొదటి దశలో రాత పరీక్ష ఉంటుందన్నారు. ఇందులో అర్హత సాధించిన ఉద్యోగార్థ్లుకు తర్వాత ముఖాముఖి ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. త్వరలోనే తుది జాబితాను ప్రకటిస్తామన్నారు. కార్యక్రమంలో పీయూ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ డా.మధుసూదన్‌రెడ్డి, హెచ్‌ఆర్ సుబ్బారావుతో పాటు క్యూసీ మేనేజర్లు పాల్గొన్నారు.

పేదలకు అండగా కేంద్ర పథకాలు