
వైభవంగా అలంకారోత్సవం
ఆత్మకూర్: అమరచింత మండలంలోని నందిమల్లలో వెలసిన చింతల మునిరంగస్వామి, నల్లారెడ్డిస్వామి జారత ఉత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆత్మకూర్‌లోని ఎస్‌బీఐ బ్యాంకులో భద్రపరిచిన స్వామివారి నగలు, అలంకారోత్సవాన్ని భాజా భజంత్రీలు, ప్రత్యేక పూజలతో ఊరేగింపుగా ఆలయానికి చేర్చారు. సాయంత్రం కృష్ణానది తీర్థావళి కార్యక్రమం నిర్వహించారు. జాతర ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సేవ, అర్చన, ఆరాధన, రాత్రి 11.15 గంటలకు ప్రభోత్సవం, సోమవారం ఆరాధన, అర్చన, రాత్రి 1.30 గంటలకు రథోత్సవం, పల్లకీసేవ, దశమికట్ట వరకు ఊరేగింపు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర గీత కార్మిక డిపార్ట్‌మెంట్ చైర్మన్ నాగరాజుగౌడ్, సీఐ శివకుమార్, ఎస్‌ఐ సురేష్, నిర్వాహకులు అరవింద్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, సత్యారెడ్డి, రాజు, నర్సింహు లు, శ్రీధర్, భక్తులు పాల్గొన్నారు.