Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

తాజాగా బయట పడిన వీడియో ఆధారంగా.. పోలింగ్‌ మరుసటి రోజు పల్నాడు జిల్లా కారంపూడి వీధుల్లో మారణాయుధాలతో దాడులు చేస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న టీడీపీ గూండాలు
పదుల సంఖ్యలో వీడియో సాక్ష్యాలు అయినా ‘పచ్చ’పాతమే!

రాష్ట్రంలో టీడీపీ గూండాలు సాగిస్తున్న విధ్వంసకాండ గురించి పదుల సంఖ్యలో వెలుగు చూస్తున్న వీడియోలు ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. మనం ఉంటున్నది ప్రజాస్వామ్య దేశంలోనేనా లేక ఆటవిక రాజ్యంలో ఉంటున్నామా.. అనే అనుమానం కలుగుతోంది. గుంపులు గుంపులుగా తోడేళ్ల మందలా వచ్చి దుకాణాలు, ఇళ్లపై పడుతున్నారు. కుర్చీలు, బల్లలు, మోటార్‌ సైకిళ్లను లాక్కొచ్చి రోడ్లపై పడేస్తున్నారు. లావుపాటి కర్రలు, ఇనుప రాడ్లతో వాటిని ధ్వంసం చేస్తున్నారు. ఆయిల్‌ ట్యాంక్‌ పగులగొట్టి నిప్పంటిస్తున్నారు. నిర్భయంగా వచ్చిన దారినే కేకలు వేసుకుంటూ వెళ్లిపోతున్నారు. ఆ దృశ్యాలు చూస్తుంటే సినిమాల్లో సీన్లు కళ్ల ముందు మెదులుతున్నాయి. ఇంత జరుగుతున్నా పోలీసులు స్పందించక పోవడం విస్తుగొలుపుతోంది. పైగా ఎక్కడ, ఏ చిన్న గొడవ జరిగినా.. దాన్ని వైఎస్సార్‌సీపీకి అంటగడుతూ ఎల్లో మీడియా, ఎల్లో బ్యాచ్‌ దుష్ప్రచారం సాగిస్తోంది. బాధితుల నుంచి ఎన్ని ఫిర్యాదులు వచ్చినా, అటు ఈసీ, ఇటు పోలీసులు.. టీడీపీ అనుబంధ సంఘాలన్నట్లు వ్యవహరిస్తుండటం దారుణం.సాక్షి, నరసరావుపేట: రాష్ట్రంలో పోలింగ్‌ సందర్భంగా టీడీపీ గూండాలు, రౌడీలు పేట్రేగిపోయారు. యథేచ్ఛగా రిగ్గింగ్‌ చేస్తూ అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ నేతలు, శ్రేణులను దారుణంగా చితకబాదారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలు వైఎస్సార్‌సీపీకి ఓటేయనీయకుండా వారిపై అత్యంత పాశవికంగా దాడులకు తెగబడ్డారు. కొన్నిచోట్ల ఈ వర్గాలు తమకు ఓట్లేయలేదని వారి ఇళ్లను ధ్వంసం చేశారు. దుకాణాలను లూఠీ చేశారు. ఇదేంటని అడ్డుకోవడానికి ప్రయత్నించినవారిని చావ బాదారు. స్వగ్రామాలను వదిలేసి బిక్కుబిక్కుమంటూ వేరే ఊళ్లలో తల దాచుకునేలా టీడీపీ మూకలు స్వైర విహారం సాగించాయి. చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు టీడీపీ గూండాలకే కొమ్ముకాశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు తమను కాపాడండి అంటూ ఆర్తనాదాలు చేసినా ఏ ఒక్క పోలీసూ పట్టించుకోలేదు. రాష్ట్రంలో పల్నాడు జిల్లా మాచర్ల, నరసరావుపేట, అనంతపురం జిల్లా తాడిపత్రి, తిరుపతి జిల్లా చంద్రగిరి, తదితర ప్రాంతాల్లో టీడీపీ గూండాల దాడిని పోలీసులు చేష్టలుడిగి వేడుకలా చూశారు. మే 13న పోలింగ్‌ ముగిసిననాటి నుంచి వెలుగు చూస్తున్న వీడియోలు టీడీపీ మూకలు అరాచకాలు, విధ్వంస కాండను కళ్లకు కట్టినట్టు చూపుతున్నా పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటే ఒట్టు. మాచర్ల ప్రాంతంలో పచ్చ మూక విధ్వంసం గురించి పదుల సంఖ్యలో వీడియోలు వైరల్‌ అవుతున్నా, వాటి గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అటు ఈసీ, ఇటు పోలీసులు టీడీపీ అనుబంధ సంఘాలన్నట్లు వ్యవహరిస్తుండటం గమనార్హం. అదే మాచర్లలో ఒక్క వీడియోను సాకుగా చూపిస్తూ వైఎస్సార్‌సీపీ శ్రేణులను మాత్రం వెంటాడి వేధిస్తున్నారు. హత్యాయత్నం కేసులు, అట్రాసిటీ కేసులు నమోదు చేస్తూ ‘పచ్చ’పాతం చూపుతున్నారు. పోలీసుల మద్దతుతోనే టీడీపీ మూక దాడులు ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు వైఎస్సార్‌సీపీకి ఓటు వేశారన్న అక్కసుతో టీడీపీ మూక పల్నాడు జిల్లాలో చేసిన అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పౌర సమాజం భయభ్రాంతులకు గురయ్యేలా వైఎస్సార్‌సీపీ సానుభూతిపరు­లపై అత్యంత పాశవికంగా టీడీపీ గూండాలు జరిపిన దాడి వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవు­తున్నాయి. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా పోలీ­సుల తీరుపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతమని ముందే తెలిసినా తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. టీడీపీ చేసిన దాడికి కొంత మంది పోలీసుల మద్దతుందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పోలింగ్‌ మరుసటి రోజు మే 14న కారంపూడిలో బుడగ జంగాలు, దళితులు, ముస్లింలపై టీడీపీ మూకలు రెచ్చిపోయా­యి. ఆ రోజు వందలాది మంది టీడీపీ రౌడీల దారుణ కాండను కొంత మంది ప్రజలు ఇళ్ల మీద నుంచి సెల్‌ఫోన్లలో వీడియోలు తీశారు. అందులో బడుగు, బలహీనవర్గాలకు చెందిన దుకాణాలు, ఇళ్లు, వాహనాలను టీడీపీ మూక ధ్వంసం చేస్తున్న దృశ్యాలు రికార్డు అయ్యాయి. వాటిలో వీడియో తీస్తున్న కుటుంబ సభ్యులు.. ఇంతవరకు ఇక్కడే ఉన్న పోలీసులు లేకుండా ఎటుపోయారని ఒకటికి రెండుసార్లు అనుకోవడం ఆ వీడియోలో రికార్డు అయ్యింది. ఆ సమయంలో టీడీపీ గూండాలు మారణాయుధాలతో చేస్తున్న స్వైరవిహారం చూసి భయపడిన కూతురు ఇంట్లోకి వెళ్లి తాళాలు వేసుకుందామని అనగా.. ఇంకో వీడియో తీస్తున్న వ్యక్తి.. ‘దాడి చేస్తు­న్నవారు మన టీడీపీ వాళ్లు.. మనల్ని ఏం చేయరు’ అని భరోసానివ్వడం గమనార్హం. ఇప్పుడు ఈ వీడియోలన్నీ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. టీడీపీ మూకలపై చర్యలేవి? టీడీపీ రౌడీలు, గూండాలు మారణాయుధాలతో విధ్వంస కాండకు దిగిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నా పోలీసులు చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాము ఇంతగా వీడియోల ద్వారా ఆధారాలు అందిస్తున్నా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని టీడీపీ మూక దాడుల బాధితులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ విషయంపై మాట్లాడేందుకు, సమాచారం ఇచ్చేందుకు జిల్లా పోలీసులెవరూ ముందుకు రావడం లేదు. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా వివరాలు వెల్లడించలేమంటున్నారు. కారంపూడి ఘటనలో వందలాది మంది టీడీపీ గూండాలు విధ్వంస కాండకు దిగారు. ఈ దాడులకు సంబంధించి ఇప్పటివరకు ఎంతమందిని గుర్తించారు, ఎందరిపై కేసు నమోదు చేశారనేది తెలియనీయడం లేదు. ఇటీవల పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చిన ఓ ఉన్నతాధికారి కేసుల నమోదు, ఇతరత్రా వివరాలేవీ తనకు తెలియకుండా బయటకు వెళ్లనివ్వొద్దని హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తోంది. దీంతో పోలీసులు ఏ సమాచారం బయటకు రానివ్వడం లేదు. వైఎస్సార్‌సీపీ శ్రేణులపై కేసుల నమోదుకు ఉత్సాహం.. వందలాది వీడియోల రూపంలో ఆధారాలు ఉన్నా టీడీపీ మూకలపై చర్యలు తీసుకోని పోలీసులు.. మరోవైపు మాచర్ల, నరసరావుపేట వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్‌సీపీ నేత పిన్నెల్లి వెంకటరామిరెడ్డి లాంటి వారిపైన మాత్రం కేసుల నమోదుకు ఎక్కడలేని ఉత్సాహం చూపుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇల్లు, ఆస్పత్రిని విధ్వంసం చేయడంతోపాటు వైఎస్సార్‌సీపీ ఎస్సీ నేతలపై హత్యాయత్నం కేసుల్లో నిందితుడైన టీడీపీ నరసరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద్‌బాబు, ఆయన అనుచరులను అరెస్ట్‌ చేయడంలో పోలీసులు నిలువెత్తు నిర్లక్ష్యం చూపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పల్నాడులో 144 సెక్షన్‌ అమలవుతున్న నేపథ్యంలో శాంతియుతంగా ఉండాల్సిన చదలవాడ అరవింద్‌బాబు ఇంట్లోనే నిరసన దీక్షలు పేరిట మీడియాకు వీడియోలు, ఫొటోలు పంపి రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలపై తగిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నేతలు మర్రి రాజశేఖర్, రావెల కిషోర్‌ బాబు తదితరులు డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తాకి శనివారం వినతిపత్రం అందజేశారు. ఎన్నికల కౌంటింగ్‌ దగ్గరపడుతున్నందున మళ్లీ టీడీపీ మూకలు హింసకు పాల్పడకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలని ప్రజలు కూడా కోరుతున్నారు. ఇప్పటికైనా పోలీసులు ‘పచ్చ’పాతాన్ని మానుకోవాలని విన్నవిస్తున్నారు.

Sakshi Editorial On National politics
బొటాబొటిగా జాతీయం!

చండీగఢ్‌ టూ పట్నా. జాతీయ రాజకీయాలకు ఆయువుపట్టు. సారవంతమైన గంగా–యమునల మైదాన ప్రాంతం ఇదే. కొద్దిగా సింధూ బేసిన్‌ కూడా ఇందులో చేరి ఉండవచ్చు. కాస్త విస్తరిస్తే ‘కౌబెల్ట్‌’ అని కూడా పిలుస్తాము. మనం ఏ రకమైన మాంసం తినాలో, ఏ రకమైనది తినకూడదో తెలియజెప్పే కౌబాయ్స్‌కు ఇది పరమ పూజనీయమైన ప్రాంతం. అనాదిగా పిలుచుకుంటున్నట్టు ‘ఆర్యావర్తం’ కూడా ఇదే! ఈ ప్రాంతం మీద పట్టు సాధించకుండా దేశంలో రాజ్యాధికారాన్ని సంపాదించడం చాలా కష్టం.మొదటి ఐదు సాధారణ ఎన్నికల్లో ఆర్యావర్తం, ద్రవిడదేశం అనే తేడాల్లేకుండా దేశంలోని అన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఆధిక్యత కనబరిచింది. ఆరోసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ జైత్రయాత్రకు కళ్లెం వేసిన జనతా పార్టీ మాత్రం అచ్చంగా ఉత్తరాది పార్టీయే! అప్పుడు జనతా పార్టీకి 295 లోక్‌సభ స్థానాలు దక్కాయి. ఇందులో వింధ్య పర్వతాలకు దిగువన గెలిచిన సీట్లు రెండు డజన్లు దాటలేదు. అవి కూడా ప్రధానంగా మహారాష్ట్రలో గెలిచినవే!భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి గడచిన పదేళ్లుగా అధికారంలో ఉన్నది. అయినప్పటికీ ఒక్క కర్ణాటక మినహా మిగిలిన దక్షిణాదిలో పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నది. ఈసారి అదనంగా తెలంగాణపై కూడా ఆశలు పెట్టుకున్నది. కానీ, మూడోసారి వరసగా అధికారాన్ని చేపట్టాలంటే కచ్చితంగా గోమాత ప్రాంతమే కాషాయ దళాన్ని కరుణించి కాపాడాలి. గత ఎన్నికల్లో భారీ సీట్లను ప్రసాదించిన ఈ ప్రాంతంలో బలమైన గండి పడితే మాత్రం ఇతర ప్రాంతాలు పూడ్చగలిగే పరిస్థితి కనిపించడం లేదు. మరి ఈసారి కూడా ఆర్యావర్తం బీజేపీని గట్టెక్కిస్తుందా లేదా అన్నదే ముఖ్యమైన ప్రశ్న.చండీగఢ్‌ నుంచి హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌ల మీదుగా బీహార్‌లోని పట్నా వరకు మొత్తం 157 స్థానాలను అప్పట్లో జనతా పార్టీ క్లీన్‌స్వీప్‌ చేసింది. ఇప్పటికీ అదే రికార్డు. ఇందిరాగాంధీ హత్యానంతరం వెల్లువెత్తిన సానుభూతి ప్రభంజనం (1984)లో కూడా ఈ రికార్డు చెక్కుచెదరలేదు. అప్పుడు యూపీ, బీహార్‌లలో ఎనిమిదిమంది ఇతర పార్టీల వారు గెలిచారు. కొత్త రాష్ట్రాలుగా అవతరించిన ఉత్తరాఖండ్, జార్ఖండ్‌లను కూడా కలుపుకొంటే ఇదే ప్రాంతంలో బీజేపీకి 2019లో 113 సీట్లు దక్కాయి. ఎన్డీఏ భాగస్వాములతో కలిసి 131 సీట్లలో గెలిచారు.ఇప్పుడా సంఖ్యను బీజేపీ నిలబట్టుకోగలదా? రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హిమాచల్‌లను కూడా కలిపి చూస్తే కౌబెల్ట్‌ పూర్తవుతుంది. ఇందులో రాజస్థాన్‌ (25), గుజరాత్‌ (26), హిమాచల్‌ (4)లో అప్పుడు బీజేపీ క్లీన్‌ స్వీప్‌ చేసింది. మధ్యప్రదేశ్‌ (29)లో 28, ఛత్తీస్‌గఢ్‌ (11)లో 9 సీట్లను గెలుచుకున్నది. ఈ దూకుడును ఇప్పుడు కూడా ప్రదర్శించగలుగుతుందా? దాదాపు 90 శాతం స్ట్రయిక్‌ రేట్‌తో విజృంభిస్తేనే కౌబెల్ట్‌లో బీజేపీ తన బలాన్ని నిలబెట్టుకోగలుగుతుంది.ఈ ప్రాంతంలో బలమైన సామాజిక వర్గాలుగా పేరున్న రాజ్‌పుత్, జాట్, యాదవ కులాలు బీజేపీకి వ్యతిరేకంగా పని చేస్తున్నాయనే వార్తలు వస్తున్నాయి. ఓబీసీ రిజర్వేషన్ల కోసం డిమాండ్‌ చేస్తున్న జాట్‌ నాయకులు రాజస్థాన్, హర్యానాల్లో ఇప్పటికే ‘ఇండియా’ కూటమికి మద్దతు ప్రకటించారు. పశ్చిమ యూపీలోని జాట్లు మాత్రం చరణ్‌సింగ్‌ పరివారానికి చెందిన ఆర్‌ఎల్‌డీతోనే ఉన్నట్టు కనిపిస్తున్నది. ఈ పార్టీ ఎన్డీఏలో చేరినందువల్ల యూపీ జాట్ల మద్దతు బీజేపీకి లభించవచ్చు.ఉత్తరాదిలో తొలి నుంచీ బీజేపీకి వెన్నుదన్నుగా ఉన్న రాజ్‌పుత్‌ల తాజా వైఖరి ఆ పార్టీని కొంత కలవరపరుస్తున్నది. ఈ వర్గానికి ప్రాతినిధ్యం వహించే కర్ణిసేన సభ్యులు బహిరంగ సభలు పెట్టి మరీ బీజేపీకి వ్యతిరేకంగా ఓటేయాలని పిలుపునిస్తున్నారు. రాజ్‌పుత్‌ వర్గం మీద వీరి పిలుపు ప్రభావం చూపితే ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లలోని కనీసం 30 నియోజకవర్గాల్లో బీజేపీకి నష్టం జరిగే అవకాశం ఉన్నది. రాజ్‌పుత్‌ వర్గానికి చెందిన యోగీ బాబానే యూపీ సీఎంగా ఉన్నందువలన ఆ రాష్ట్రంలో పెద్దగా భయపడవలసిన అవసరం లేదని బీజేపీ భావిస్తున్నది.యూపీ, బీహార్‌లలో గణనీయమైన సంఖ్యలో ఉన్న యాదవులు చాలాకాలంగా ఎస్పీ, ఆర్జేడీల వెనుకనే సమీకృతమై ఉన్నారు. ఇప్పుడీ సమీకరణ మరింత సంఘటితంగా ఉన్నట్టు సమాచారం. అఖిలేశ్, తేజస్వీ యాదవ్‌లను వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రులను చేయాలనే పట్టుదల యువతలో కనిపిస్తున్నది. యాదవ వర్గం వ్యతిరేకతకు విరుగుడుగా యాదవేతర ఓబీసీలను మచ్చిక చేసుకుంటూ బీజేపీ ఇన్నాళ్లుగా నెట్టుకొస్తున్నది. బీజేపీ అధికారంలోకి వస్తే ఈసారి రిజర్వేషన్లు ఎత్తివేస్తారని జరిగిన ప్రచారం వల్ల ఈ వర్గం మద్దతును కూడా ఎంతోకొంత బీజేపీ కోల్పోవచ్చనే అభిప్రాయం బలపడుతున్నది. రిజర్వేషన్లు ఎత్తివేసే ఆలోచన తమకు లేదని ప్రధాని సహా పలువురు నేతలు వివరణ ఇచ్చినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయిందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.వాజ్‌పేయి హయాంలోని ఎన్డీఏ సర్కార్‌ చేసుకున్న ‘షైనింగ్‌ ఇండియా’ ప్రచారం వికటించినట్టుగానే మోదీ సర్కార్‌ చేస్తున్న ‘వికసిత భారత్‌’ కూడా వికటిస్తున్నట్టుగానే కనిపిస్తున్నది. ఉపాధి రంగం దారుణంగా దెబ్బతిన్నది. పెద్దనోట్ల రద్దు, కోవిడ్‌ వరస దెబ్బలతో కుదేలైన చిన్న వర్తకులు ఇప్పటికీ కోలుకోలేదు. నిరుద్యోగిత రేటుపై నిన్ననే విడుదలైన పీరియాడిక్‌ లేబర్‌ శాంపుల్‌ సర్వే నివేదిక నిరాశాజనకంగానే ఉన్నది. ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీల్లో చదువుకున్న ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లలో 38 శాతం మందికి క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు లభించలేదని వచ్చిన తాజా వార్త పరిస్థితికి అద్దం పడుతున్నది.ఉత్తరాది రాష్ట్రాల్లోని నిరుద్యోగ యువతకు సైనిక బలగాల్లో చేరడం ఒక ప్రత్యామ్నాయం. అందులో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘అగ్నివీర్‌’ పథకం ఈ యువతను తీవ్రంగా నిరాశపరిచింది. దేశంలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలపై ప్రపంచస్థాయి ఆర్థికవేత్తలందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆక్స్‌ఫామ్‌ వంటి సంస్థలు క్రమం తప్పకుండా ఇచ్చే నివేదికల్లో ఈ అన్యాయాన్ని ఎత్తిచూపుతున్నాయి. ఒకే దేశంలోని మనుషుల మధ్య వంద రెట్లు, వేయి రెట్లు కాదు లక్షల రెట్ల ఆర్థిక తారతమ్యాలు వెక్కిరిస్తున్నాయి.2012 నుంచి 2021 మధ్యకాలంలో భారత జాతి సృష్టించిన సంపదలో నలభై శాతం సొత్తు జనాభాలోని ఒకే ఒక్క శాతం కుబేరుల జేబుల్లోకి వెళ్లింది. యాభై శాతం మంది అడుగు జనాభా దోసిళ్లలో ఎంగిలి మెతుకులు రాలిపడ్డట్టు ఒకే ఒక్క శాతం సొమ్ము ఉమ్మడిగా జారిపడింది. దీన్నే కొందరు ’ట్రికిల్‌ డౌన్‌ థియరీ’గా పిలుచుకుంటున్నారు. ఈ రకమైన ఆర్థిక విధానాలతో ఎన్డీఏ రాజ్యమేలుతున్నది.ఇటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకునే శామ్‌ పిట్రోడాతో సహా పలువురు ఆర్థికవేత్తలు కూడా దేశంలో వారసత్వ పన్ను విధించాలన్న ప్రతిపాదన చేస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడానికి ఇటువంటి సూచనలపై విస్తృతమైన చర్చను ఆహ్వానించడం అవసరం. కానీ, పిట్రోడాకు ఉన్న కాంగ్రెస్‌ సంబంధాలను ఆసరా చేసుకొని స్వయంగా ప్రధానమంత్రే ఎదురుదాడికి పూనుకున్నారు. ‘ప్రతిపక్షం అధికారంలోకి వస్తే మీరు సంపాదించుకున్న సొమ్మును లాగేసుకుంటారట’ అంటూ రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేశారు. ఈ ప్రచారం బీజేపీకి మేలు చేసిందా... కీడు చేసిందా అనే విషయం ఓట్ల లెక్కింపు తర్వాత తేలిపోనున్నది.ఈ రకమైన సామాజిక – ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తన కంచుకోటలను ఏ మేరకు కాపాడుకోగలదన్న చర్చ జరుగుతున్నది. ప్రభుత్వానికి అనుకూలంగా గానీ, వ్యతిరేకంగా గానీ ఎటువంటి గాలి లేదని అభిప్రాయపడిన పక్షంలో గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో కలిపి సుమారు 50 స్థానాలను బీజేపీ చేజార్చుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. వీటితోపాటు మహారాష్ట్ర, కర్ణాటకల్లో కూడా గత ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలనే సాధించింది. ఈసారి రెండు రాష్ట్రాల్లో కనీసం 15 స్థానాల వరకు ఆ పార్టీ పోగొట్టుకోవచ్చనే అంచనాలున్నాయి.శరద్‌ పవార్, బాల్‌ఠాక్రేలు స్థాపించిన పార్టీలను చీల్చడం బీజేపీకి కలిసివచ్చే అంశం కాదనే అభిప్రాయం మహారాష్ట్రలో ఉన్నది. ఎన్నికల హామీల అమలులో చతికిలబడ్డ కర్ణాటక కాంగ్రెస్‌కు బీజేపీ మిత్రపక్షం జేడీఎస్‌ మళ్లీ ఊపిరిపోసింది. దేవెగౌడ పౌత్రరత్నం చేసిన నిర్వాకంపై కన్నడిగులు మండిపడుతున్నారు. ఇక బెంగాల్, ఒడిషా, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో ఓ పదిహేను స్థానాలను బీజేపీ అధికంగా సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే కోల్పోయే అవకాశం ఉన్న సీట్లు 65 అనుకుంటే, అదనంగా తెచ్చుకునే సీట్లు పదిహేను వరకు ఉండవచ్చని అంచనా. అంటే కనీసం యాభై సీట్లను బీజేపీ నికరంగా కోల్పోతుంది.వ్యతిరేక గాలి బలంగా లేకపోతేనే గత ఎన్నికలతో పోలిస్తే యాభై స్థానాలను బీజేపీ కోల్పోవచ్చు. కూటమిలోని మిత్రపక్షాలన్నీ ఉమ్మడిగా మరో పాతిక, ముప్పయ్‌ సీట్లను గెలవచ్చు. ఇది దాదాపు తొంభై శాతం స్థానాలకు పోలింగ్‌ పూర్తయిన తర్వాత పరిశీలకుల్లో నెలకొని ఉన్న అభిప్రాయం. అంటే బొటాబొటి మెజారిటీతో ఎన్డీఏ మూడోసారి గద్దెనెక్కడానికి అవకాశాలు ఉన్నాయనుకోవాలి. బీజేపీకి సొంతంగా 370 సీట్లు కావాలనీ, కూటమికి 400 సీట్లు కావాలని ప్రధానమంత్రి చేసిన అభ్యర్థనను జనం పట్టించుకోలేదు. మూడింట రెండొంతుల మెజారిటీ లభిస్తే ఈ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని మార్చడానికి వెనకాడదనే వాదనను జనం విశ్వసిస్తున్నారనే అనుకోవాలి.విశ్వసనీయమైన ప్రత్యామ్నాయం, సమర్థవంతమైన నాయకత్వం అందుబాటులో ఉండి ఉంటే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ప్రజలు కచ్చితంగా ఓడించేవారే. ప్రజల ఆకాంక్షలకు, ప్రభుత్వ విధానాలకు మధ్యన ఓ పెద్ద అగాధమే ఉన్నది. కానీ, ఇండియా కూటమిలో పెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ కొన్ని రాష్ట్రాలకే పరిమితమైన పార్టీగా మిగిలిపోయింది. సాధారణ మెజారిటీకి అవసరమైన 272 స్థానాల్లో కనీసం సగం సీట్లను కూడా కాంగ్రెస్‌ గెలవగలదన్న నమ్మకం ఎవరికీ లేదు. ఈ పరిస్థితుల్లో అతుకుల బొంతతో అస్థిర ప్రభుత్వ ప్రయోగాలకు మెజారిటీ ప్రజలు సిద్ధపడకపోవచ్చు. పార్టీ అధ్యక్షుడు ఖర్గేను ప్రధాని పదవికి ప్రతిపాదించి ఉంటే కూటమి సభ్యుల ఆమోదం లభించేది. సాహసోపేతమైన ఈ ప్రయోగాన్ని దేశ ప్రజలు స్వాగతించేవారు. కానీ రాహుల్‌గాంధీ మాటల్లో కనిపించేంత ఔదార్యం, అభ్యుదయం చేతల్లో కనిపించవు. అదే విషాదం. ఎట్టకేలకు కాంగ్రెస్‌ పార్టీకి లోక్‌సభలో సెంచరీ కొట్టే ఒక మంచి అవకాశం దొరికింది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆశిద్దాం.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

Ap Elections 2024 May 26th Political Updates Telugu
May 26th: ఏపీ పొలిటికల్‌ అప్‌డేట్స్‌

May 26th AP Elections 2024 News Political Updates..7:10 AM, May 26th, 2024ఓట్ల లెక్కింపు ఇలాజూన్‌ 4న ఉదయం 8గంటలకు లెక్కింపు ప్రారంభంతొలుత పోస్టల్, సర్వీసు ఓట్ల లెక్కింపు ఆ తర్వాత ఈవీఎంలలో నమోదైన ఓట్ల లెక్కింపు సువిధ యాప్‌లో నమోదు చేసిన తర్వాతే ఫలితాల వెల్లడి 7:00 AM, May 26th, 2024కౌంటింగ్‌ ఏజెంట్లే కీలకంఫారం–18 సమర్పించడం ద్వారా ఏజెంట్ల నియామకంఓట్ల లెక్కింపులో ఫారం–17సీ ఎంతో ముఖ్యంనిబంధనలు తెలియకుంటే అయోమయమే 6:50 AM, May 26th, 2024పదుల సంఖ్యలో వీడియో సాక్ష్యాలు అయినా ‘పచ్చ’పాతమే!పోలింగ్‌ రోజు, ఆ తర్వాత టీడీపీ గూండాల స్వైర విహారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఓట్లేయనీయకుండా దాడులు వైఎస్సార్‌సీపీకి ఓటు వేశారనే కారణంతో విధ్వంసాలు పల్నాడులో పచ్చ మూకల దాడులపై వీడియోలు తీసిన ప్రజలుఒక్కొక్కటిగా బయటపడుతున్న టీడీపీ హింసాత్మక చర్యలు దుకాణాలపై రాళ్లు, బైక్‌ల ధ్వంసాలు, దహనాలు, లూటీలు.. పట్టపగలు విధ్వంసకాండను చూసి ఆందోళన వ్యక్తం చేస్తున్న జనం టీడీపీ దారుణాలు కళ్లెదుటే కనిపిస్తున్నా పట్టించుకోని పోలీసులు హత్యాయత్నం, అట్రాసిటీ కేసులున్నప్పటికీ చూసీచూడనట్లు వ్యవహారం చిన్న చిన్న సాకులతో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై మాత్రం జులుం వెంటాడి కేసుల నమోదు.. భయభ్రాంతులకు గురిచేస్తూ దండనలుఇంకోవైపు ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోని ఈసీ బడుగు, బలహీన వర్గాల బాధితుల వేదన అరణ్య రోదనగా మారిన వైనం 6:40 AM, May 26th, 2024క్షమాపణ చెప్పాలి... లేకుంటే దావాజనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తికి సీఎస్‌ జవహర్‌రెడ్డి హెచ్చరికవిశాఖలో అసైన్డ్‌ భూములు కొనుగోలు చేయలేదుచట్ట ప్రకారం క్రిమినల్‌ చర్యలు తీసుకుంటానని హెచ్చరిక 6:30 AM, May 26th, 202421 లోక్‌సభ స్థానాల్లో విజేతలను నిర్ణయించేది మహిళలేఆ స్థానాల్లో పురుషుల కన్నా ఎక్కువగా నమోదైన మహిళల ఓట్లు కాకినాడ, అనంతపురం తప్ప మిగతా స్థానాల్లో భారీ వ్యత్యాసం మహిళల ఓట్లు వైఎస్సార్‌సీపీకే అంటున్న రాజకీయ విశ్లేషకులు

Weekly Horoscope Telugu 26-05-2024 To 01-06-2024
Weekly Horoscope: ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది

మేషంకొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆస్తి విషయంలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. కుటుంబసభ్యులతో ముఖ్య విషయాలపై చర్చిస్తారు. గృహ నిర్మాణం, కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు క్రమేపీ లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్య సూచనలు. నీలం, ఆకుపచ్చ రంగులు. శివాష్టకం పఠించండి.వృషభంఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో మంచీచెడ్డా విచారిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల సూచనల మేరకు ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో చర్చలు సఫలమవుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. విద్యార్థుల యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కే అవకాశం. వారం ప్రారంభంలో కుటుంబంలో ఒత్తిడులు. ధనవ్యయం. గులాబీ, లేత ఎరుపు రంగులు. శివపంచాక్షరి పఠించండి.మిథునంరుణాలు తీరి ఊరట చెందుతారు. రావలసిన డబ్బు అందుతుంది. సోదరులు, మిత్రులతో సఖ్యత నెలకొంటుంది. దీర్ఘకాలిక సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. నిరుద్యోగులు, విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. మీపై వచ్చిన ఆరోపణలు తొలగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సజావుగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు రాగలవు. పారిశ్రామికవర్గాలకు సత్కారాలు. వారం మ«ధ్యలో అనారోగ్యం. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. తెలుపు, లేత ఎరుపు రంగులు. శివారాధన మంచిది.కర్కాటకంప్రారంభంలో చికాకులు, సమస్యలు ఎదురైనా ఆత్మస్థైర్యం, ఓర్పుతో అధిగమిస్తారు. మీపై ఉంచిన బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తారు. బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులు మరింత చురుగ్గా ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు దక్కుతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ ఆహ్వానాలు. వారం చివరిలో ధనవ్యయం. ఆస్తి వివాదాలు. నేరేడు, చాక్లెట్‌ రంగులు. అన్నపూర్ణాష్టకం పఠించండి.సింహంపనులలో ఆటంకాలు తొలగుతాయి. పాతమిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం రాగలదు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. సోదరులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత గుర్తింపు పొందుతారు. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. పసుపు, ఆకుపచ్చ రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.కన్యముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. దూరపు బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రత్యర్థులు సైతం మిత్రులు మారతారు. విలువైన వస్తువులు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపార లావాదేవీలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగాలలో అనుకోని హోదాలు రాగలవు. కళారంగం వారికి సత్కారాలు జరుగుతాయి. వారం ప్రారంభంలో అనారోగ్యం. బంధువిరోధాలు. తెలుపు, గులాబీ రంగులు. గణేశ్‌స్తోత్రాలు పఠించండి.తులఅనుకున్న పనులు సజావుగా పూర్తి చేస్తారు. అందరిలోనూ విశేష గౌరవం పొందుతారు. ఆర్థికంగా మరింత బలపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులకు ఆశించిన విద్యావకాశాలు దక్కుతాయి. గృహం, వాహనాలు కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త హోదాలు లభించవచ్చు. రాజకీయవర్గాలకు ప్రయత్నాలు సఫలం. వారం మధ్యలో ఆరోగ్యసమస్యలు. కుటుంబసభ్యులతో కలహాలు. పసుపు, గులాబీ రంగులు. గణేశ్‌స్తోత్రాలు పఠించండి.వృశ్చికంఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. కొత్త రుణయత్నాలు సాగిస్తారు. పనులు నిదానంగా సాగుతాయి. ఆప్తులు, మిత్రులతో విభేదాలు ఏర్పడవచ్చు. ఆలోచనలు కలసిరావు. నిర్ణయాలు పునఃసమీక్షిస్తారు. పెద్దల సలహాలు పాటిస్తారు. వేడుకలలో పాల్గొంటారు. ఆలయాలు సందర్శిస్తారు. ఇంటాబయటా ఒత్తిడులు. భాగస్వామ్య వ్యాపారాలలో సామాన్యలాభాలు. ఉద్యోగాలలో కొన్ని మార్పులు జరిగే వీలుంది. రాజకీయవర్గాలకు పదవులు అసంతృప్తి కలిగిస్తాయి. వారం మధ్యలో శుభవార్తలు. స్వల్ప «దనలాభం. తెలుపు, నేరేడు రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.ధనుస్సువ్యతిరేకులు కూడా అనుకూలురుగా మారతారు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. భూవివాదాలు పరిష్కారమవుతాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వేడుకలకు హాజరవుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. జీవితాశయం నెరవేరుతుంది. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి అవకాశాలు. పారిశ్రామికవర్గాలకు ప్రభుత్వం నుంచి పిలుపు రావచ్చు. వారం చివరిలో ధనవ్యయం. కుటుంబసమస్యలు. ఎరుపు, లేతనీలం రంగులు. విష్ణుధ్యానం చేయండి.మకరంపరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. కుటుంబసభ్యుల ఆప్యాయత పొందుతారు. చిరకాల మిత్రులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. పరపతి కలిగిన వారితో పరిచయాలు. స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. కళారంగం వారికి ఆశలు ఫలిస్తాయి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. గులాబీ, ఆకుపచ్చ రంగులు. అంగారకస్తోత్రాలు పఠించండి.కుంభంఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. మీలోని సేవాగుణం వెలుగులోకి వస్తుంది. పనులు చకచకా సాగుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం కాగలరు. తీర్థయాత్రలు చేస్తారు. ఒక సమాచారం విద్యార్థులకు ఉపశమనం కలిగిస్తుంది. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. కళారంగం వారికి అనూహ్యమైన అవకాశాలు. వారం చివరిలో ధనవ్యయం. బంధువిరోధాలు. నీలం, ఎరుపు రంగులు. శివారాధన మంచిది.మీనంఎంతోకాలంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కారమవుతాయి. ఆర్థిక లావాదేవీలలో పురోగతి కనిపిస్తుంది. వ్యవహారాలు సజావుగా పూర్తి చేస్తారు. కోర్టు వివాదాల నుంచి బయటపడతారు. సోదరులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. మీ నిర్ణయాలు కుటుంబసభ్యులు అంగీకరిస్తారు. వేడుకలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. వ్యాపారాలు కొత్త పెట్టుబడులతో విస్తరిస్తారు. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. ఎరుపు, గులాబీ రంగులు. దేవీఖడ్గమాల పఠించండి.

Cyclone Remal Expected To Make Landfall Near Bengal Coast
‘రెమాల్‌’ తుపాన్‌ టెన్షన్‌.. కోల్‌కత్తాకు విమానాలు బంద్‌

కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్‌ను రెమాల్‌ తుపాన్‌ టెన్షన్‌ పెడుతోంది. తుపాన్‌ కారణంగా బెంగాల్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. కోల్‌కత్తాకు రెడ్‌ అలర్ట్‌ విధించింది. ఈ నేపథ్యంలో బెంగాల్‌లో సహాయక చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. తుపాన్ కారణంగా కోల్‌కతాలోని విమానాశ్రయం, పోర్టులో రాకపోకలను నిలిపివేశారు.కాగా, రెమాల్‌ తుపాన్‌ ప్రభావం బెంగాల్‌ను వణికిస్తోంది. కోల్‌కత్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశమున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. బెంగాల్‌ నుంచి విమానాల రాకపోకలను ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సోమవారం ఉదయం తొమ్మిది గంటల వరకు నిలిపివేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. #WATCH | West Bengal: As per IMD, cyclone 'Remal' is to intensify into a severe cyclonic storm in the next few hours and cross between Bangladesh and adjoining West Bengal coasts around May 26 midnight as a Severe Cyclonic Storm (Visuals from Sundarbans, South 24 Parganas) pic.twitter.com/1yp3xRxUPr— ANI (@ANI) May 26, 2024మరోవైపు, కోల్‌కతాలోని శ్యామ ప్రసాద్‌ ముఖర్జీ పోర్టుని కూడా మూసివేస్తున్నట్టు పోర్ట్ చైర్మన్ రతేంద్ర రామన్ తెలిపారు. అన్ని కార్గో షిప్‌, కంటైనర్‌ సంబంధిత కార్యకలాపాలను ఆదివారం సాయంత్రం నుంచి 12 గంటల పాటు నిలివేస్తున్నామన్నారు. ఓడరేవులో పనిచేస్తున్న ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పోర్ట్ వద్ద రైల్వే కార్యకలాపాలు సైతం నిలిసివేయనున్నట్టు స్పష్టం చేశారు. #CycloneRemal is here already! Earlier than predicted. Hoping that it doesn't do much damage. For the last five years, South Bengal is being badly hit by annual cyclonic storms. In 2020, Kolkata was rampaged by #Amphaan- more than 48 hours of no cell receptivity, no electricity pic.twitter.com/GQmHXMt7Hj— Srija Naskar (@writer_srija) May 25, 2024ఇదిలా ఉండగా.. బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్‌ తుపాన్‌ ఆదివారం రాత్రి బంగాళాఖాతం తీరాన్ని దాటే అవకాశం ఉన్నది. పశ్చిమ బెంగాల్‌, బంగ్లా మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అంచనా వేసింది. తుపాను నేపథ్యంలో గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. తుపాన్‌ ప్రభావంతో బెంగాల్‌తో పాటు ఉత్తర ఒడిశా ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. రెమాల్‌ తుపాన్‌ ఎఫెక్ట్‌ తెలుగు రాష్ట్రాలపై ఎక్కువగా ఉండదని వాతావరణ శాఖ పేర్కొంది. Next 24 hours are difficult for the eastern coast, esp the state of Bengal. #CycloneRemal will hit the coastal areas of East Medinipur, South Kolkata, Howrah etc. Around 12 coy of NDRF have been deployed. pic.twitter.com/ORnGCtFd63— Pranay Upadhyaya (@JournoPranay) May 26, 2024

Kolkata Knight Riders vs Sunrisers Hyderabad, road to IPL 2024 final
IPL 2024: రైజర్స్‌ VS రైడర్స్‌

గత మూడు సీజన్లలో ఎనిమిది, ఎనిమిది, పదో స్థానం... సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పరిస్థితి ఇది. గత రెండు సీజన్లలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఏడో స్థానానికి పరిమితం. ఐపీఎల్‌ ఈ ఏడాది ఆరంభానికి ముందుకు ఇరు జట్ల రికార్డు చూస్తే ఈ రెండు టీమ్‌లు ఫైనల్‌ చేరతాయని ఎవరూ ఊహించలేదు. కానీ అద్భుత ప్రదర్శనలతో రైజర్స్, రైడర్స్‌ అంచనాలు తిరగరాశాయి. అదరగొట్టే బ్యాటింగ్, రికార్డు ప్రదర్శనలతో హైదరాబాద్‌ ప్రస్థానం సాగితే... అన్ని రంగాల్లో చెలరేగి కోల్‌కతా అగ్రస్థానంతో ముందుకు దూసుకెళ్లింది. అన్ని అవరోధాలను దాటిన తర్వాత ఇప్పుడు అసలైన అంతిమ సమరానికి రంగం సిద్ధమైంది. పదేళ్ల క్రితం చివరిసారి విజేతగా నిలిచిన కోల్‌కతా తమ మూడో టైటిల్‌పై గురి పెడితే... ఎనిమిదేళ్ల క్రితం చాంపియన్‌గా నిలిచిన హైదరాబాద్‌ రెండో ట్రోఫీ లక్ష్యంగా బరిలోకి దిగింది. ఇరు జట్లు సమ ఉజ్జీలుగా కనిపిస్తున్న నేపథ్యంలో చెపాక్‌ మైదానంలో ఎవరిది పైచేయి కానుందనేది ఆసక్తికరం. చెన్నై: ఐపీఎల్‌–17లో రెండు నెలలకు పైగా హోరాహోరీగా సాగిన సమరాల తర్వాత టోర్నీ విజేతను తేల్చే సమయం ఆసన్నమైంది. లీగ్‌ మాజీ చాంపియన్లు మరో ట్రోఫీ వేటలో సత్తా చాటేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాయి. చిదంబరం స్టేడియంలో ఆదివారం జరిగే ఫైనల్‌ పోరులో సన్‌రైజర్స్‌ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తలపడతాయి. తొలి క్వాలిఫయర్‌లో సన్‌రైజర్స్‌నే ఓడించి దర్జాగా తుది పోరుకు అర్హత సాధించిన కోల్‌కతా దానిని పునరావృతం చేసేందుకు సిద్ధంగా ఉంది. మరో వైపు గత మ్యాచ్‌తో పాటు అంతకు ముందు లీగ్‌ దశలో కూడా కేకేఆర్‌ చేతిలో ఓడిన హైదరాబాద్‌ ఈ సారి మాత్రం వెనక్కి తగ్గకుండా తమ అత్యుత్తమ ఆటను ప్రదర్శించాలని పట్టుదలగా ఉంది. శుక్రవారం ప్రతికూల పరిస్థితుల మధ్య ఇదే మైదానంలో క్వాలిఫయర్‌–2లో రాజస్తాన్‌ను ఓడించడంతో రైజర్స్‌ టీమ్‌లో ఆత్మవిశ్వాసం పెరిగింది. మార్పులు చేస్తారా! ఫైనల్‌ కోసం హైదరాబాద్‌ తుది జట్టు ఎంపిక ఆసక్తికరంగా మారింది. టాప్‌–3లో హెడ్, అభిõÙక్, త్రిపాఠి ఖాయం. గత మూడు మ్యాచ్‌లుగా భారీ స్కోరు బాకీ ఉన్న హెడ్‌ ఫైనల్లో చెలరేగితే నిలువరించడం కష్టం. అదే విధంగా అభిõÙక్‌ కూడా మరో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాల్సి ఉంది. వరుసగా రెండు మ్యాచ్‌లలో దూకుడైన బ్యాటింగ్‌తో తానేంటో త్రిపాఠి నిరూపించుకున్నాడు. ఎప్పటిలాగే భారీ షాట్లతో క్లాసెన్‌ మిడిలార్డర్‌లో ఉన్నాడు. అయితే ఇద్దరు దేశవాళీ బ్యాటర్లు నితీశ్‌ రెడ్డి, సమద్‌లు మరింత మెరుగైన ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. నాలుగో విదేశీ ఆటగాడిగా ఎవరిని ఎంచుకోవాలనే విషయంలో రైజర్స్‌ మేనేజ్‌మెంట్‌లో గందరగోళం కొనసాగుతోంది. మార్క్‌రమ్‌ ఆశించిన స్థాయిలో ఆడలేకపోతుండగా, లీగ్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా ఫిలిప్స్‌ను తీసుకోవడం కూడా దాదాపు అసాధ్యం. పిచ్‌ను బట్టి క్వాలిఫయర్‌లో షహబాజ్‌ను అనూహ్యంగా ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా చేసుకొచ్చి టీమ్‌ మంచి ఫలితం సాధించింది. అయితే ఈ పిచ్‌ను స్పిన్‌కు అంతగా అనుకూలించేది కాకపోవడంతో పాటు ప్రత్యర్థి టీమ్‌లో నలుగురు లెఫ్టార్మ్‌ బ్యాటర్లు ఉన్నారు. కమిన్స్, భువనేశ్వర్, నటరాజన్‌ పేస్‌ బౌలింగ్‌లో తమ బాధ్యత నిర్వర్తించగలరు. మార్పుల్లేకుండా... కోల్‌కతా మాత్రం ఎలాంటి సందేహం లేకుండా క్వాలిఫయర్‌–1 ఆడిన టీమ్‌నే కొనసాగించనుంది. మొదటినుంచి చివరి ఆటగాడి వరకు అందరూ ఫామ్‌లో ఉండటం సానుకూలాంశం. ఓపెనర్లుగా నరైన్, గుర్బాజ్‌ సత్తా చాటగలరు. ఆ తర్వాత వరుసగా వెంకటేశ్, శ్రేయస్, రాణా జట్టు భారం మోస్తారు. చివర్లో రింకూ, రసెల్‌ విధ్వంసం సృష్టించగల సమర్థులు. కేకేఆర్‌ బౌలింగ్‌ కూడా సమతూకంగా ఉంది. స్టార్క్‌ ఫామ్‌లో ఉంటే ఏం జరుగుతుంతో గత మ్యాచ్‌లో హైదరాబాద్‌కు అర్థమైంది. హర్షిత్, అరోరాలాంటి యువ పేసర్లు కూడా రాణిస్తుండగా... స్పిన్నర్‌ వరుణ్‌ ఒంటిచేత్తో మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చేయగలడు. తుది జట్ల వివరాలు (అంచనా) సన్‌రైజర్స్‌: కమిన్స్‌ (కెపె్టన్‌), హెడ్, అభిõÙక్, త్రిపాఠి, మార్క్‌రమ్, క్లాసెన్, నితీశ్‌ రెడ్డి, సమద్, భువనేశ్వర్, ఉనాద్కట్, నటరాజన్, షహబాజ్‌/ మర్కండే. నైట్‌రైడర్స్‌: శ్రేయస్‌ (కెపె్టన్‌), నరైన్, గుర్బాజ్, వెంకటేశ్, నితీశ్, రింకూ, రసెల్, రమణ్‌దీప్, స్టార్క్, హర్షిత్, వరుణ్, వైభవ్‌. పిచ్, వాతావరణం రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్‌ నల్లరేగడి మట్టితో కూడిన పిచ్‌పై జరిగి స్పిన్‌కు బాగా అనుకూలిస్తుంది. కానీ ఫైనల్‌ను ఎర్రమట్టితో కూడిన మరో పిచ్‌ను నిర్వహిస్తున్నారు. దాంతో బ్యాటింగ్‌కు అనుకూలించి భారీ స్కోరుకు అవకాశం ఉంటుంది. శనివారం సాయంత్రం వర్షం కురిసినా...మ్యాచ్‌ రోజు చిరు జల్లులకు మాత్రమే అవకాశం ఉంది. ఏదైనా ఇబ్బంది ఎదురైనా రిజర్వ్‌ డే ఉంది.

Huge Fire At Delhi Childrens Hospital
పిల్లల ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. ఆరుగురి శిశువుల మృతి

ఢిల్లీ: ఢిల్లీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తర ఢిల్లీలోని వివేక్‌ విహార్‌ పిల్లల ఆస్పత్రిలో శనివారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసింది. బేబీ కేర్‌ ఆస్పత్రిలో ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు శిశువులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మరో ఆరుగురు శిశువులను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నామని చెప్పారు.six babies killed and several others injured after a massive fire broke out at a children's hospital in Delhi Vivek Vihar area#delhi #BreakingNews‌ #fire #vivekvihar pic.twitter.com/isMZ3AvQJa— Monu Lodhi 🇮🇳 (@monu_lodh) May 26, 2024 ఈ ప్రమాదంలో మంటలు చెలరేగిన భవనం నుంచి 12 మంది పిల్లలను రెస్య్కూ చేసి బయలకు తీసుకురాగా.. అందులో ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫైర్‌ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక శకటాలతో ఫైర్ సిబ్బంది మంటలార్పారు. రెస్య్కూలో ఆపరేషన్‌ చేపట్టి ప్రమాదంలో చిక్కుకున్న పిల్లలను కాపాడారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.BREAKING 🚨 7 newborns killed in massive fire at Delhi children's hospital• Six newborns rescued, one in ventilator• Cause of the fire yet to be ascertained• Rescue operations currently underway pic.twitter.com/aHKv5tMPy0— Gitanjali (@GitanjaliWrites) May 26, 2024

CS Jawahar Reddy reacts on Janasena Corporator Peethala Murthy Yadav
క్షమాపణ చెప్పాలి... లేకుంటే దావా

సాక్షి, అమరావతి: జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తి యాద­వ్‌ తనపైన, తన కుమారుడిపైన చేసిన నిరాధార తప్పు­డు ఆరోపణలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.­ఎస్‌.జవహర్‌ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ మేర­కు శనివారం సీఎస్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఆరోపణలను వెనక్కి తీసు­కుని క్షమా­పణలు చెప్పాలని మూర్తి యాదవ్‌ను ఆయన డిమాండ్‌ చేశారు. లేదంటే వ్యక్తిగతంగా పరువు నష్టం దావా వేయడంతో పాటు చట్ట ప్రకారం క్రిమినల్‌ చర్యలు తీసుకుంటానని సీఎస్‌ హెచ్చరించారు. రెండు నెలలుగా ఒక పథకం ప్రకా­రం వ్యక్తిత్వ హననం చేసే కుట్రలో భాగంగా చేస్తున్న ప్రచారమే ఈ ఆరో­ప­ణ­లని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విశా­ఖ పరిసర ప్రాంతాల్లో తాను గానీ, తన కుమారుడు, బంధువులు ఎలాంటి అసైన్డ్‌ భూములు కొనలేదని స్పష్టం చేశా­రు. తన స్నేహితుడైన రిటైర్డ్‌ ఆర్మీ అధికారి కుమార్తె వివాహం ఏప్రి­ల్‌లో జరిగిందని, ఎన్నికల దృష్ట్యా ఆ వివాహా­నికి హాజరు కాలేకపోయినందున రెండు రోజుల విశాఖ పర్యటలో భాగంగా ఆది­వారం కొత్త దంపతులను ఆశీర్వదించడా­నికి వెళ్లా­నని సీఎస్‌ తెలిపారు. ఆ మరు­సటి రోజు భోగా­పురం విమా­నాశ్రయ నిర్మాణ పను­లను పరిశీలించానన్నారు. ఉత్తరాంధ్రలో రెండు వేల కోట్ల రూపా­యల విలువైన 800 ఎకరాలు అసైన్డ్‌ భూములు కొట్టేసి­నట్లు యాదవ్‌ చేసిన ఆరోపణలను ఆయ­న తీవ్రంగా ఖండించారు.అసైన్డ్‌ భూముల చట్ట సవరణకు సంబంధించి అసెంబ్లీ­లో 2023 అక్టోబర్‌లో సభ ఆమో­దం తెలిపిందని, ఆ సవరణను అనుసరించి అసై­న్డ్‌ భూము­­ల­పై జీవో 586ను రెవెన్యూ శాఖ జారీ చేసిందని సీఎస్‌ పేర్కొ­న్నారు. చట్ట సభ ఆమోదం మేరకే జీవో జారీ అయితే దాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆపా­ది­ంచ­డం ఎంత వర­కు సబబని ఆయన ప్రశ్నించారు. ఈ జీవో ఆధారంగా తన కుమా­రుడి ద్వారా విశాఖ­లో 800 ఎకరాలకు పైగా భూములు కొనుగోలుకు డీల్స్‌ చేసిన­ట్లు చేసిన ఆరోపణ పచ్చి అబద్ధమని పేర్కొన్నారు. ఇప్పటికే 400 ఎకరాల అసైన్డ్‌ భూము­లను తన కుమారుడిని అడ్డంపెట్టుకుని బినామీల పేరిట చేజిక్కించుకు­న్నా­న­న­డంలో ఎంత మాత్రం నిజం లేదన్నారు.మరో 400 ఎకరాలను రిజి­స్రే­్టషన్‌ చేయించేందుకు యంత్రాంగాన్ని పరుగులు పెట్టించాననడం పూర్తిగా అవా­­స్తవ­మని సీఎస్‌ తెలి­పా­రు. ఈ భూముల రిజిస్ట్రేషన్లను పూర్తి చేసేందుకు విశా­ఖ, విజయనగరం జిల్లాల అధికారులపై ఒత్తిడి చేశాననడాన్నీ ఆయన తీవ్రంగా ఖండించారు. ఐదేళ్లలో తన కుమారుడు విశాఖకు గానీ, ఉత్తరాంధ్ర­లో ఏ జిల్లాకూ గాని వెళ్లలేదని సీఎస్‌ స్పష్టం చేశారు. మరో వైపు భోగాపురం విమా­నా­శ్రయ పనుల పరిశీలన పేరుతో సీఎం జగన్‌ మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లపై తాను సమీక్షించానని చేసిన ఆరోపణా అసంబద్ధమేనని ఖండించారు.

Central Election Commission Arrangements for Election Votes Counting
ఓట్ల లెక్కింపు ఇలా

సాక్షి, అమరావతి: ఎన్నికల్లో పోటీ చేసిన అభ్య­ర్థుల భవితవ్యాన్ని తేల్చే ఓట్ల లెక్కింపు సమయం దగ్గర పడుతోంది. జూన్‌ 4న ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను కల్పించనున్నారు. మే 13న పోలింగ్‌ అనంతరం పలుచోట్ల హింసాత్మక ఘటన­లు చోటుచేసుకున్న నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యల కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే 25 కంపెనీల బలగాలను రాష్ట్రానికి పంపింది. మొత్తం ఓట్ల లెక్కింపు ప్రక్రియలో 25 వేల మందికిపైగా ఉద్యోగులు పాల్గొననున్నారు. వీరందరికీ రెండు రోజుల శిక్షణ ఇవ్వనున్నారు. ఆ తర్వాత ర్యాండమైజే­షన్‌ ద్వారా ఉద్యోగులను నియోజకవర్గాలకు కేటాయిస్తారు. మొత్తం ఈ ఓట్ల ప్రక్రియను నిశితంగా పరిశీలించడానికి 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఒక్కొక్కరు చొప్పు­న మొత్తం 200 మంది కేంద్ర పరిశీలకులతోపాటు 200 మంది రిటరి్నంగ్‌ ఆఫీసర్లను నియమించారు. ఈవీఎంల తరలింపు మే 13న పోలింగ్‌ ముగిసిన తర్వాత నుంచి ఈవీఎంలను, వీవీ ప్యాట్‌లను స్ట్రాంగ్‌ రూమ్‌ల్లో భద్రపర్చారు. జూన్‌ 4న ఓట్ల లెక్కింపు మొదలయ్యే అరగంట ముందు స్ట్రాంగ్‌ రూమ్‌ల నుంచి ఈవీఎంలను ఓట్ల లెక్కింపు కేంద్రాలకు తరలిస్తారు. ముందుగా ఆర్వో టేబుల్‌ వద్ద పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు మొదలవుతుంది. పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు మొదలైన అరగంట తర్వాత కూడా ఆ ప్రక్రియ కొనసాగుతుంటే అప్పుడు ఇక ఈవీఎంల లెక్కింపును మొదలుపెట్టడం మొదలు పెడతారు. అసెంబ్లీ, పార్లమెంట్‌కు ఒకేసారి ఎన్నికలు జరగడంతో ఈవీంఎలు తారుమారు కాకుండా ఉండటం కోసం స్ట్రాంగ్‌ రూమ్‌ల నుంచి తీసుకువచ్చే సిబ్బందికి వేర్వేరు రంగుల్లో యూనిఫామ్‌ కేటాయించి ఈవీఎంలను తరలిస్తారు. వీరు ఈవీఎంల సీరియల్‌ నంబర్‌ ప్రకారం ఒకదాని తర్వాత ఒకటి కౌంటింగ్‌ టేబుళ్లపైకి చేరుస్తారు. కౌటింగ్‌ సమయంలో కేవలం ఈవీఎం కంట్రోల్‌ యూనిట్‌ మాత్రమే తీసుకువస్తారు. ఓటు వేసిన ఈవీఎం మెషీన్‌తో అవసరం లేదు. కౌంటింగ్‌ హాల్‌లో టేబుళ్లు ఎన్ని ఉంటే అన్ని ఈవీఎంలను మాత్రమే తీసుకురావాలి. ఒక రౌండ్‌ పూర్తయిన తర్వాతే మరుసటి రౌండ్‌కు సంబంధించిన కంట్రోల్‌ యూనిట్‌ను తీసుకురావాల్సి ఉంటుంది. పోలైన ఓట్ల ఆధారంగా ఎన్ని రౌండ్లు కౌంటింగ్‌ అన్నది లెక్కించి.. దాని ప్రకారం టేబుళ్లను ఏర్పాటు చేస్తారు. ఈవీఎంలో నమోదైన ఓట్లు, వీవీ ప్యాట్‌లో నమోదైన ఓట్లు సరిగా ఉన్నాయా.. లేదా.. అన్నదాన్ని పరిశీలించడం కోసం ర్యాండమ్‌గా మూడు వీవీప్యాట్లు ఎంపిక చేసి మూడింటిని లెక్కిస్తారు. ఇది కూడా ఈవీఎంల లెక్కింపు పూర్తయిన తర్వాత మాత్రమే చేస్తారు. పోలింగ్‌ ముగిసిన తర్వాత క్లోజ్‌ బటన్‌ నొక్కకుండా ఉన్న (క్లోజ్‌ రిజల్ట్‌ క్లియర్‌–సీఆర్‌సీ) ఓటింగ్‌ యంత్రాలతో పాటు మాక్‌ పోలింగ్‌ ఓట్లను తీసివేయకుండా అలాగే ఉంచిన ఓటింగ్‌ యంత్రాలను పక్కకు పెట్టి వాటిని చివర్లో మాత్రమే లెక్కిస్తారు. అది కూడా పోటీ హోరాహోరీగా ఉంటేనే. మెజార్టీ భారీగా ఉంటే ఇలా అభ్యంతరాలు వ్యక్తం చేసిన ఓటింగ్‌ యంత్రాలను లెక్కించకుండా పక్కకు పెట్టేస్తారు. ప్రతీ రౌండ్‌ ఫలితాలను కేంద్ర ఎన్నికల సంఘం అందుబాటులోకి తీసుకొచ్చిన సువిధ యాప్‌లో నమోదు చేసిన తర్వాతనే ఆర్వో ఫలితాలను ప్రకటించాల్సి ఉంటుంది.

Japanese influencers Mayo and Kake Taku recreate K3G
సీన్‌ హై జపానీ..సినిమా హై హిందుస్థానీ

భారతీయ సినిమా పాటలకు విదేశీయులు డ్యాన్స్‌ చేయడం కొత్త కాదు. అయితే జపాన్‌లో మాత్రం బాలీవుడ్‌ హిట్‌ సినిమాల ఐకానిక్‌ సీన్‌లను రీక్రియేట్‌ చేసే కొత్త ట్రెండ్‌ మొదలైంది. బాలీవుడ్‌ మూవీ ‘కభీ ఖుషీ కభీ ఘమ్‌’ (కె3జి)లో అంజలిగా కాజోల్, రాహుల్‌గా షారుఖ్‌ ఖాన్‌ నటించారు. రాహుల్, అంజలి వేషధారణలో జపనీస్‌ ఇన్‌ఫ్లూయెన్సర్లు మాయో, కకే టకులు ‘కె3జి’లోని ‘బడే మజాకీ హో’ కామెడీ సీన్‌ను రీక్రియేట్‌ చేశారు. ‘లెర్నింగ్‌ హిందీ ఇన్‌ 2024 ఈజ్‌ లైక్‌ బడే మజాకీ హో’ కాప్షన్‌తో పోస్ట్‌ చేసిన ఈ వీడియో వైరల్‌ అయింది. హిందీలో ్రపావీణ్యం సంపాదించిన మాయో, కకే టకుల లిప్‌ సింక్‌ బాగా కుదిరింది. ‘క్రాస్‌–కల్చరల్‌ అడ్మిరేషన్‌ అనేది భౌగోళిక సరిహద్దులను చెరిపేసి అందరినీ ఒక గొడుగు కిందికి తీసుకువస్తుంది. పర్యాటక ఆసక్తి పెంచుతుంది’... లాంటి కామెంట్స్‌ ఎన్నో యూజర్‌ల నుంచి వచ్చాయి.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement