సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజముద్రపై వివాదం నెలకొన్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుతం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త లోగోపై అభిప్రాయ సేకరణ చేపట్టాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనలు, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అయితే ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, తెలంగాణ ప్రజల్లో ఓ వర్గం నుంచి వస్తున్న వ్యతిరేకతతో ప్రభుత్వం పునరాలోచనలో పడిందనే టాక్ కూడా నడుస్తోంది.
కాగా కొత్త చిహ్నానికి దాదాపు 200పైగా ప్రపోజల్స్ రాగా.. సాంకేతిక కారణాల దృష్ట్యా మరికొంత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. తొలుత జూన్ 2న రిలీజ్ చేయాలని భావించిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. జూన్ 2న తెలంగాణ గేయం మాత్రమే విడుదల చేయనున్నారు.
ఇదిలా ఉండగా ప్రభుత్వ అధికారిక చిహ్నంలో మార్పులు చేయాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించిన విషయం తెలిసిందే.. ఇప్పటివరకు లోగోలో ఉన్న కాకతీయ కళాతోరణం, చార్మినార్‌ను తొలగించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారిక దాదాపు ఖరారైనట్లు, ఇదే ఫైనల్ లోగో అంటూ పలు ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. రాజముద్రలో మూడు సింహాల జాతీయ చిహ్నం, వ్యవసాయం, తెలంగాణ అమరవీరుల స్తూపం, కాంగ్రెస్ పతాకంలోని రంగులకు చోటు లభించినట్లు తెలుస్తున్నది.
Comments
Please login to add a commentAdd a comment