భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద సంచలనం సృష్టించాడు. ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ మాగ్నస్ కార్ల్‌సన్‌కు షాకిచ్చాడు. నార్వే చెస్ టోర్నమెంట్ ప్రజ్ఞానంద కార్ల్‌సన్‌పై ఊహించని విజయం నమోదు చేశాడు. 18 ఏళ్ల ప్రజ్ఞానందకు క్లాసికల్ ఫార్మాట్‌లో కార్ల్‌సన్‌పై ఇదే తొలి విజయం.
Magnus Carlsen resigns!@rpraggnachess overtakes Fabiano Caruana and jumps into sole first!https://t.co/wJtLtsYIDS#NorwayChess pic.twitter.com/6DGZDqQbrG
— chess24 (@chess24com) May 29, 2024
మూడో రౌండ్‌లో తెల్ల పావులతో ఆడిన ప్రజ్ఞానంద.. కార్ల్‌సన్ ఎత్తులను చిత్తు చేసి పైచేయి సాధించాడు. ఈ గెలుపుతో ప్రజ్ఞానంద 5.5/9 పాయింట్లతో అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. కార్ల్‌సన్ ఐదో స్థానానికి పడిపోగా.. వరల్డ్ నంబర్ టూ ర్యాంకర్ ఫాబియానో కారువాన రెండో స్థానంలో నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment