నార్వే చెస్ టోర్నీ-2024 ఛాంపియన్‌గా వరల్డ్ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్‌సన్ నిలిచాడు. శనివారం జరిగిన ఫైనల్ రౌండ్‌లో ఫాబియానో కారువానాపై కార్ల్‌సన్ విజయం సాధించాడు. తొలుత వీరిద్దిరి మధ్య జరిగిన క్లాసికల్ గేమ్ డ్రాగా ముగిసింది.
ఆ తర్వాత ఉత్కంఠగా సాగిన ఆర్మగెడాన్ ప్లేఆఫ్‌లో ఫాబియానో కరువానాను కార్ల్‌సన్ ఓడించాడు. మరొక ఆర్మగెడాన్ పోటీలో హికారు నకమురాను భారత గ్రాండ్‌మాస్టర్ ప్రగ్నానంద రమేష్‌బాబు.. హికారు నకమురాను ఓడించడంతో కార్ల్‌సెన్ విజయం లాంఛనమైంది.
నకమురా ఓటమి పాలవ్వడంతో కార్ల్‌సెన్ స్టాండింగ్‌లో తన ఆధిక్యాన్ని నిలుపునకుని ఛాంపియన్‌గా అవతరించాడు. కార్ల్‌సన్‌కు ఆర్మగెడాన్ ఫార్మాట్ ఇది ఐదో విజయం కావడం విశేషం.
ఇక ఈ టోర్నీలో కార్ల్‌సన్(17.5) తొలి స్ధానం సంపాదించగా.. నకమురా(15.5), ప్రగ్నానంద(14.5) వరుసగా రెండు మూడు స్ధానాల్లో నిలిచారు. ఇక మహిళల విభాగంలో జు వెన్షున్(చైనా) విజేతగా నిలిచింది.
🐐🐐🐐 @MagnusCarlsen pic.twitter.com/MUH73HWmNG
— Chess.com (@chesscom) June 7, 2024
Magnus Carlsen beats Fabiano Caruana in Armageddon to earn at least a playoff for the #NorwayChess title! https://t.co/vj9WZbbkJq pic.twitter.com/fdWy4evo1K
— chess24 (@chess24com) June 7, 2024
Comments
Please login to add a commentAdd a comment