సముద్రంలో పెళ్లివేడుకలకు బయలుదేరిన తారలు | Celebs Have Left For The Celebrations Of Anant Radhika Merchant Second Pre Wedding Bash, Airport Videos Viral | Sakshi
Sakshi News home page

Celebrities Airport Videos: సముద్రంలో పెళ్లివేడుకలకు బయలుదేరిన తారలు

Published Thu, May 30 2024 8:46 AM | Last Updated on Thu, May 30 2024 1:45 PM

celebs have left for the celebrations of Anant Radhika Merchant second pre wedding bash

రిలయన్స్‌ ఛైర్మన్‌ ముఖేశ్‌అంబానీ కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ రెండో ప్రీ వెడ్డింగ్ బాష్ ఇటలీలో మొదలైంది. ఈ వేడుకకు ఆహ్వానం అందుకున్న ప్రముఖులు బుధవారం ముంబయి ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఇటలీ బయలుదేరారు.

మొదటి ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జామ్‌నగర్‌లో జరిగాయి. రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకలు క్రూయిజ్ షిప్‌లో జరగనున్నాయి. ఈ వేడుకకు కరీనాకపూర్‌, సారాఅలీఖాన్‌, ఇబ్రహీం అలీఖాన్‌, అనన్యపాండే, జాన్వీకపూర్‌ బుధవారం ముంబయి ఎయిర్‌పోర్ట్‌ చేరుకున్నారు. ఈ మేరకు ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అప్పటికే చాలామంది ప్రముఖులు ఇటలీ చేరుకున్నారు.

రెండో ప్రీవెడ్డింగ్‌ వేడుకలు మే 29న ప్రారంభమై జూన్ 1న ముగియనున్నాయి. ఈ వేడుకలు ఎలా సాగనున్నాయి, డ్రెస్‌కోడ్‌ ఎలా ఉంటుందనే వివరాలతో పాటు సెకండ్ ప్రీ వెడ్డింగ్ ఇన్విటేషన్ షెడ్యూల్ కూడా ఇప్పటికే లీక్ అయింది. ఈ ప్రయాణం ఇటలీ నుంచి దక్షిణ ఫ్రాన్స్‌కు సుమారు 4,380 కిలోమీటర్లు సాగుతుంది. ఈ వేడుకలకు దాదాపు 800 మంది అతిథులు హాజరవుతున్నట్లు తెలుస్తోంది.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement