యూకే నా సొంతిల్లు | Rishi Sunak rubbishes California relocation rumours | Sakshi
Sakshi News home page

యూకే నా సొంతిల్లు

Published Wed, May 29 2024 4:25 AM | Last Updated on Wed, May 29 2024 4:25 AM

Rishi Sunak rubbishes California relocation rumours

అమెరికాకు మకాం మార్చట్లేను బ్రిటన్‌ ప్రధాని 

రిషి సునాక్‌ స్పష్టికరణ 

లండన్‌: త్వరలో జరగబోయే సాధారణ ఎన్నికల తర్వాత తన కుటుంబం అమెరికాకు తరలిపోతుందని సొంత పార్టీలో చక్కర్లు కొడుతున్న వార్తను బ్రిటన్‌ ప్రధానమంత్రి రిషి సునాక్‌ కొట్టిపారేశారు. మంగళవారం సునాక్‌ ఆగ్నేయ ఇంగ్లాండ్‌లోని అమెర్శామ్‌ ప్రాంతంలో కన్జర్వేటివ్‌ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పార్టీ మద్దతుదారులనుద్దేశించి ప్రసంగించారు. ‘‘ మాజీ విదేశాంగ మంత్రి, పార్టీ నేత జాక్‌ గోల్డ్‌స్మిత్‌ మాటలు వింటుంటే ఆశ్చర్యమేస్తోంది. అసలు ఆయనతో నేను మాట్లాడక చాలా కాలమైంది. నా విషయాలు ఆయనకెలా తెలుస్తాయి.

అయినా నేను బ్రిటన్‌ను వదిలి అమెరికాకు వెళ్లట్లేను. యూకే నా సొంతిల్లు.  ఇక్కడి సౌతాంప్టన్‌లో పుట్టి పెరిగా’’ అని సునాక్‌ వ్యాఖ్యానించారు. బ్రిటన్‌ను వీడతారంటూ వచ్చిన వదంతులను ఇటీవల ‘లూజ్‌ ఉమెన్‌’ టెలివిజన్‌ షోలోనూ రిషి కొట్టిపారేశారు. ‘‘ఇక్కడ ఎంపీగా ఉండటానికే ఇష్టపడుతున్నా. ఇక్కడే ఉంటా. నా నియోజకవర్గ ప్రజలను ప్రేమిస్తా. నార్త్‌ యార్క్‌షైర్‌లోని నా సొంతిల్లు అంటే చెప్పలేని ప్రేమ’’ అని అన్నారు. అయితే ముందస్తు ఎన్నికలకు సొంత పార్టీ నేతలు సన్నద్ధం కాకపోవడం, ఈసారి విపక్ష లేబర్‌ పార్టీ మెజారిటీ సాధిస్తుందని సర్వేల్లో తేలడంతో సొంత కన్జర్వేటివ్‌ పార్టీ ఎంపీల్లో గుబులు పెరిగింది. దీంతో చాలా మంది ఎంపీలు పార్టీ మారొచ్చని వార్తలొచ్చాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement