worker
-
లోకేష్‌ను కలిసిన న్యాయం జరగలేదు.. పెట్రోల్ బాటిల్‌తో టీడీపీ కార్యకర్త నిరసన
సాక్షి, అనకాపల్లి: కూటమి పాలనలో తనకు న్యాయం జరగలేదంటూ పెట్రోల్ బాటిలతో కలెక్టర్ కార్యాలయం ముందు ఓ టీడీపీ కార్యకర్త నిరసనకు దిగాడు. తన భూమిని కొంతమంది ఆక్రమించుకున్నారని.. న్యాయం జరగకపోతే కలెక్టర్ కార్యాలయం ముందు కుటుంబంతో ఆత్మహత్య చేసుకుంటానంటూ టీడీపీ కార్యకర్త బుద్ధా శ్రీను హెచ్చరించాడు.అధికార పార్టీకి చెందిన తనకే న్యాయం జరగలేదని.. ఇక సామాన్యులకు ఏం న్యాయం జరుగుతుందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. లోకేష్‌ను కలిసిన న్యాయం జరగలేదన్నారు. రికార్డులు తారుమారు వెనక రాజకీయ నాయకుల ప్రమేయం ఉందన్న బుద్ధా శ్రీను.. న్యాయం జరగకపోతే కుటుంబంతో ఆత్మహత్యే గతి అంటూ వాపోయాడు. -
కార్మికుడి మృతిపై అనుమానాలు.. విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్తత
విశాఖ: స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఓ కార్మికుడు మృతి చెందిన ఘటనపై అతని బంధువులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కోక్ అవెన్ డిపార్ట్ మెంట్ లో సూర్య వెంకట రమణ అనే కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. అయితే మృతదేహాన్ని ప్రధాన గేటు వద్దే అంబులెన్స్ సిబ్బంది వదిలేసి వెళ్లిపోయారు. ఇది కాస్తా ఉద్రిక్తతలకు దారి తీసింది. మృతదేహంతో బంధువులు స్టీల్ ప్లాంట్ ఆవరణలో ఆందోళనకు దిగారు.సూర్య వెంకట రమణ కుటుంబాన్ని ఆదుకోవాలని కార్మికులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. మరొకవైపు మృతిపై అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కనీసం ఫోన్, పర్స్ లాంటి ఏవీ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమకు సమాచారం వచ్చిన తర్వాత ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ వచ్చిందని, ఫోన్ స్విచ్చాప్ చేయాల్సిన అవసరం ఎందుకొచ్చిందని కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. గుండె పోటుతో మరణించినట్లు చెబుతున్నారన్నారు.అయితే కార్మికుడు సూర్య వెంకట రమణ.. అరటి చెట్టు కింద కూర్చొని చనిపోయాడని కొందరు చెబుతుంటే, గోడకు జారబడి చనిపోయాడని మరికొందరు చెబుతున్నారన్నారు. ట్రాక్టర్ మీద పడిపోయి ఉన్నారని వేరే వాళ్లు చెప్పారన్నారు. నోటి నుంచి బ్లడ్ వచ్చి చనిపోయినట్లు తమకు చెప్పినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. డబ్బున్న వాళ్లకే ప్లాంట్ లో న్యాయం జరుగుద్దనీ, తమ లాంటి పేదలకు న్యాయం జరగదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
శ్రీకాకుళం జిల్లా: వైఎస్సార్సీపీ కార్యకర్తకు గాయాలు
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: వైఎస్సార్సీపీ కార్యకర్తపై దుండగులు కత్తితో దాడి చేశారు. పాతపట్నంలోని దువ్వార వీధిలో ఘటన చోటుచేసుకుంది. దాడిలో పెద్దింటి తిరుపతిరావు తీవ్రంగా గాయపడ్డారు. ఆయన మెడ, చేతిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. తెల్లవారు జామున మూడు గంటల సమయంలో ఇంట్లో చొరబడి దాడికి పాల్పడ్డారు. రాజకీయ కక్షతోనే తనపై దాడి చేశారని బాధితుడు తిరుపతిరావు తెలిపారు. తిరుపతిరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఏపీలో కొనసాగుతున్న అక్రమ అరెస్టులు
-
వక్ఫ్ బోర్డును రద్దు చేయాలంటూ ర్యాలీ
హమీర్పూర్: హిమాచల్ ప్రదేశ్‌లోని సంజౌలీలో అక్రమంగా నిర్మిస్తున్న మసీదును కూల్చివేయాలని కోరుతూ దేవభూమి సంఘర్ష్ సమితి హమీర్‌పూర్‌లో నిరసన ర్యాలీ చేపట్టింది. దీనిలో పాల్గొన్న 46 ఏళ్ల విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) సభ్యుడొకరు గుండెపోటుతో కన్నుమూశారు. వక్ఫ్ బోర్డును రద్దు చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. దేవభూమి సంఘర్ష్ సమితి పిలుపు మేరకు సిమ్లా, హమీర్పూర్, మండీ, చంబా, నహాన్ జిల్లాల్లో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. హమీర్‌పూర్‌లో ఆందోళనకారులు అధికారులకు మెమోరాండం సమర్పించడానికి వెళ్తుండగా, వీహెచ్‌పీ కార్యకర్త వరిందర్ పర్మార్ స్పృహతప్పి పడిపోయాడు. అతన్ని వెంటనే పోలీసు వాహనంలో హమీర్పూర్ మెడికల్ కాలేజీకి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు అతను మృతిచెందాడని తెలిపారు.నిరసన ప్రదర్శనలో పాల్గొన్న దేవభూమి సంఘర్ష్ సమితి కమిటీ కో-కన్వీనర్ మదన్ ఠాకూర్ మాట్లాడుతూ, వివాదాస్పద మసీదుపై అక్టోబర్ ఐదు వరకూ కోర్టు నిర్ణయం కోసం వేచి చూస్తామని, ఆ తరువాత భవిష్యత్ వ్యూహాన్ని నిర్ణయించుకుంటామన్నారు. అక్టోబర్ ఐదు తర్వాత జైల్ భరో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. తమపై ఎఫ్ఐఆర్లు నమోదు చేశారని, ప్రజల మనోభావాలను రెచ్చగొట్టిన ఏఐఎంఐఎం నేత షోయబ్ జమైపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు.ఇది కూడా చదవండి: రోడ్డు ప్రమాదం.. తొమ్మిదిమంది మృతి -
TN: అన్నాడీఎంకే కార్యకర్త హత్య
చెన్నై: తమిళనాడులోని కడలూర్ జిల్లాలో ఆదివారం(జులై 28) అన్నాడీఎంకే కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. హత్యకు గురైన వ్యక్తిని తిరుపాప్లియూర్కు చెందిన పద్మనాభన్‌గా గుర్తించారు. ఇతడు ఓ షాపు నడుపుతూ జీవనం సాగిస్తూ అన్నాడీఎంకే పార్టీలో కార్యకర్తగా పనిచేస్తున్నాడు. బాగూర్ గ్రామానికి బైక్‌పై వెళుతుండగా పద్మనాభన్‌ను గుర్తుతెలియని వ్యక్తులు తమ వాహనంతో వేగంగా ఢీకొట్టారు. దీంతో పద్మనాభన్ మృతిచెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయిన పద్మనాభన్‌పై గతంలో హత్యకేసు ఉండటం గమనార్హం. -
విదేశీ వర్కర్ల భద్రతకు మరిన్ని కఠిన నిర్ణయాలు
కెనడా ప్రభుత్వం తమ దేశంలో పనిచేసే విదేశీ వర్కర్ల రక్షణకు చర్యలు తీసుకుంటుంది. ఆ దేశంలో టెంపరరీ ఫారిన్ వర్కర్ ప్రోగ్రామ్ (టీఎఫ్డబ్ల్యూపీ) నిబంధనలను ఉల్లంఘించిన యజమానులకు విధించే జరిమానా పెంచాలని యోచిస్తోంది. విదేశీ వర్కర్ల హక్కులను ఉల్లంఘించిన యాజమాన్యాలపై 2023లో 2.1 మిలియన్ల(రూ.17 కోట్లు) అడ్మినిస్ట్రేటివ్ మానిటరీ పెనాల్టీలు (ఏఎంపీ) విధిస్తున్నా పరిస్థితిలో మార్పు లేదని ప్రభుత్వం తెలిపింది. దాంతో మరిన్ని కఠిన నియమాలను అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.కెనడాలో నివసిస్తున్న విదేశీ వర్కర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎంప్లాయిమెంట్ అండ్ సోషల్ డెవలప్మెంట్ కెనడా (ఈఎస్డీసీ) టెంపరరీ ఫారెన్ వర్కర్(టీఎప్డబ్ల్యూ) అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా విదేశీ కార్మికుల హక్కులను రక్షించేలా చర్యలు తీసుకుంటున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఈఎస్డీఎసీ టీఎప్డబ్ల్యూ ప్రోగ్రామ్ కింద 2,122 తనిఖీలను నిర్వహించింది. వీటిలో 94 శాతం కంపెనీ యజమానులపై ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపింది. సంస్థలు ఏఎంపీ పెనాల్టీగా రూ.17 కోట్లు చెల్లిస్తున్నా ఇలాంటి ఫిర్యాదులు పెరుగుతుండడం ఆదోళనకరంగా మారినట్లు ప్రభుత్వం తెలిపింది. వీరిపై మరిన్ని కఠిన నిబంధనలు విధించాలనే యోచిస్తోంది.ఇదీ చదవండి: పారిస్ ఒలింపిక్స్.. భారీగా ట్రావెల్ బుకింగ్స్!కెనడా ప్రభుత్వం ఇన్స్పెక్టర్ల నియామకం, వర్కర్ల భద్రతా నిర్వహణ, వారి సమస్యల పరిష్కారం కోసం రెండేళ్ల కింద ప్రారంభించిన ఈఎస్డీసీ ప్రోగ్రామ్‌కు కేటాయించే నిధులను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఆ దేశంలో వర్కర్ల భద్రాతా కోసం కాన్ఫిడెన్షియల్ టిప్ లైన్ అనే హెల్ప్‌లైన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. అందులో వివిధ భాషల్లో మాట్లాడే ఏజెంట్లు 24/7 పని చేసేలా ఏర్పాటు చేశారు. -
పొలంలో తెగిపడిన చేయి, ఇటలీలో భారతీయ కార్మికుడి దుర్మరణం
ఇటలీలో భారతీయ వ్యవసాయ కార్మికుడి పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ఘటన ఒకటి కలకలం రేపింది. లాటినా ప్రాంతంలోని ఓ పొలంలో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తూ సత్నామ్ సింగ్ చేయి తెగిపోయింది. అయితే తీవ్ర రక్తస్రావంతో ప్రమాదకర స్థితిలో ఉన్న అతడిని ఆసపత్రికి తరలించాల్సిన యాజమానులు నిర్లక్ష్యంగా ప్రవర్తించారు. అతడిని రోడ్డుపై అలానే వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆసుపత్రికి తరలించడం ఆలస్యం కావడంతో సత్నామ్ సింగ్ కన్నుమూశాడు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.ఇటలీ కార్మికశాఖ మంత్రి మెరీనా కాల్డెరోన్ పార్లమెంటు వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. "ఇది నిజంగా అనాగరిక చర్య," అని పేర్కొన్న ఆమె, అధికారులు దర్యాప్తు చేస్తున్నారని, బాధ్యులను శిక్షిస్తామని ప్రకటించారు. అటు ఈ ఘటనను అక్కడి సెంటర్ లెఫ్ట్ డెమోక్రెటిక్ పార్టీ తీవ్రంగా ఖండించింది. గ్యాంగ్మాస్టర్లకు వ్యతిరేకంగా, గౌరవప్రదమైన పని, జీవన పరిస్థితుల కోసం పోరాటం కొనసాగుతుందని ఎక్స్ ద్వారా ప్రకటించింది.పదివేల మంది భారతీయ వలస కార్మికులు నివసించే రోమ్కు దక్షిణంగా ఉన్న గ్రామీణ ప్రాంతంలోని లాటినాలోని పొలంలో సత్నామ్ సింగ్ పనిచేస్తున్నాడు. సోమవారం ప్రమాద వశాత్తూ ఓ యంత్రంలో పడి అతడి చేయి తెగిపోయింది. అయితే రక్తమోడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న సత్నామ్ సింగ్‌ను పట్టించుకోలేదు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న బాధితుడి భార్య, స్నేహితులు అత్యవసర సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో బాధితుడిని ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు బుధవారం కన్నుమూశాడు. Flai CGIL ట్రేడ్ యూనియన్ ప్రకారం, సుమారు 31 ఏళ్ల వయస్సున్న సింగ్, చట్టపరమైన పత్రాలేవీ లేకుండా పని చేస్తున్నాడు. బాధితుడినిఆసుపత్రికి తరలించాల్సిన యజమానులు, చెత్త మూటలా వదిలేసి వెళ్లిపోయారని, ఇది హారర్ చిత్రాన్ని తలపిస్తోందని ట్రేడ్ యూనియన్ మండిపడింది. -
ఉపాధి కూలీ అవతారమెత్తిన IRS అధికారి
-
ఉత్తరకాశీ సొరంగంలో మరో ప్రమాదం.. ఒకరు మృతి!
ఉత్తరకాశీలోని యమునోత్రి హైవేపై నిర్మాణంలో ఉన్న సిల్క్యారా సొరంగంలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. సొరంగం బయటనున్న లోడర్ మిషన్ ఒక్కసారిగా రోడ్డు మీదకు వచ్చి బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ కూలీ మృతి చెందాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సిల్క్యారా సొరంగం వెలుపల పనులలో ఉన్న లోడర్ యంత్రం అకస్మాత్తుగా సొరంగం వెలుపలి గుంతలో పడిపోయింది. ఈ ఘటనలో మెషిన్ ఆపరేటర్ తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడ ఉన్న ఇతర కార్మికులు బాధితుణ్ణి ఆసుపత్రికి తరలించేలోగానే అతను మృతి చెందాడు. మృతుడిని పితోర్‌గఢ్ జిల్లా గోవింద్ కుమార్‌గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. 2023, నవంబరులో ఇదే సొరంగంలో జరిగిన ప్రమాదంలో 41 మంది కార్మికులు లోపల చిక్కుకుపోయారు. తరువాత భారీ రెస్క్యూ ఆపరేషన్‌తో వీరిని బయటకు తీసుకువచ్చారు. -
టన్నెల్ టైంపాస్ పై వర్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
న్యూఢిల్లీ : ఉత్తర కాశీ టన్నెల్ నుంచి బయటపడ్డ 41 మంది కార్మికులు ఒక్కొక్కటిగా తమ అనుభవాలను పంచుకుంటున్నారు. టన్నెల్లో ఉన్నప్పుడు వారు ఎలా టైమ్ గడిపారో చెప్తున్నారు. తాజాగా యూపీలోని మోతీపూర్‌కు చెందిన అంకిత్ టన్నెల్లో 17 రోజుల పాటు తాము చేసిన పనులకు సంబంధించి ఆసక్తికరర విషయాలు వెల్లడించారు. ‘టన్నెల్లో గడిపిన 17 రోజులు టైమ్ పాస్ చేసేందుకు చిన్నప్పుడు ఆడిన ఆటలన్నీ ఆడాం. రాజా, మంత్రి, చోర్, సిపాయి లాంటి ఆటలు ఆడుకున్నాం. టన్నెల్ చాలా పొడవుండడంతో ఎక్కువగా వాకింగ్ చేసే వాళ్లం. టన్నెల్లో పెద్దగా చలి లేదు. నిద్రపోవడానికి బ్లాంకెట్లు, జియో టెక్స్టైల్స్ వాడాం’అని అంకిత్ చెప్పాడు. ‘అయితే, టన్నెల్లో ఉన్న సమయంలో చావుకు దగ్గరగా వెళ్లొచ్చిన అనుభవం కలిగింది. కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారా అన్న కంగారుండేది. ఎందుకటే టన్నెల్లో నుంచి మేము వారితో మాట్లాడేంందుకు వీలు లేదు’అని అంకిత్ వివరించాడు. ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో నిర్మాణంలో ఉన్న చార్దామ్ ప్రాజెక్టు టన్నెల్ కూలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో అక్కడ పనిచేస్తున్న 41 మంది కార్మికులు టన్నెల్‌లోనే చిక్కుకుపోయారు. 17 రోజులు టన్నెల్‌లోనే ఉండిపోయిన కార్మికులను అతికష్టం మీద బయటకు తీసుకొచ్చారు. ఇదీచదవండి..బెంగళూరులో పదుల సంఖ్యలో స్కూల్స్‌కు బాంబు బెదిరింపులు -
సొరంగంలో సంకల్ప స్ఫూర్తి.. ప్రధాని ప్రశంసలు.. ఎవరీ గబ్బర్ సింగ్ నేగి?
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో ఉత్తరకాశీ సిల్క్యారా సొరంగ ప్రమాదంలో చిక్కుకుని 17 రోజులు పర్వత గర్భంలో గడిపిన 41 మంది కార్మికులు సురక్షితంగా బయటపడ్డారు. నవంబర్ 12న ఈ ప్రమాదం జరిగినప్పటి నుంచి కార్మికులను సురక్షితంగా బయటకు తెచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. అయితే ఈ ప్రయత్నాలు పూర్తయి బయటపడే వరకూ సొరంగం లోపల చిక్కుకున్న కార్మికుల్లో మానిసిక స్థైర్యం చాలా అవసరం. విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు మానసికంగా చాలా ధైర్యం కావాలి. బతకాలన్న సంకల్పం ఉండాలి. బతుకుతామన్న ఆశ కోల్పోకూడదు. ఇది అందరికీ ఉండదు. కానీ ఉత్తరకాశీ సొరంగ ప్రమాదంలో చిక్కుకున్న 41 మందిలో ఈ మానసిక స్థైర్యాన్ని ప్రదర్శించాడు గబ్బర్ సింగ్ నేగి. ఆ స్థైర్యాన్ని మిగతా 40 మందికీ పంచాడు. సొరంగంలో ఉన్న 17 రోజులూ తోటి కార్మికులకు యోగా, ధ్యానం నేర్పించి చేయించాడు. వారు శారీరకంగా, మానసికంగా చురుకుగా ఉండేలా చూసుకున్నారు. అందరం తప్పకుండా బయటపడతామంటూ వారిలో ధైర్యం నూరిపోశాడు. చివరగా నేనే.. సొరంగంలో ఉండగా గబ్బర్ సింగ్ నేగి చెప్పిన మాటలను ఆయన అతని సోదరుడు జయమల్ సింగ్ నేగి తెలియజేశారు. రెస్క్యూ ప్రారంభమైనప్పుడు తొక్కిసలాట జరుగుతుందా అని అతన్ని అడిగినప్పుడు.. నేను సీనియర్ని..అందరూ బయటకు వచ్చిన తర్వాతే నేను చివరిగా వస్తాను అని గబ్బర్ సింగ్ నేగి చెప్పినట్లుగా జయల్ సింగ్ నేగి పేర్కొన్నారు. సొరంగం నుంచి సురక్షితంగా బయటపడిన కార్మికులందరూ తమ సహచరుడు గబ్బర్ సింగ్ నేగి కృషిని ప్రశంసించారు. తమను సురక్షితంగా మానసికంగ సంతోషంగా ఉంచడంలో నేగి పాత్రను వివరించారు. యోగా, ధ్యానంతోపాటు లూడో, చెస్ వంటి ఆటలు కూడా ఆడించినట్లు చెప్పారు. ఇదే విషయాన్ని సైట్‌లోని మానసిక వైద్యులలో ఒకరైన డాక్టర్ రోహిత్ గోండ్వాల్ కూడా తెలిపారు. ప్రధాని ప్రశంసలు గబ్బర్ సింగ్ నేగీ ధైర్యాన్ని, చొరవను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా మెచ్చుకున్నారు. కార్మికులు సురక్షితంగా బయటపడిన తర్వాత మంగళవారం రాత్రి రాత్రి వారితో ఫోన్ ద్వారా మాట్లాడారు. గబ్బర్ సింగ్ నేగి గురించి తోటి కార్మికులు చెప్పడంతో ప్రధాని మోదీ ఆయన్ను అభినందించారు. -
మైనర్‌పై జనసేన కార్యకర్త లైంగిక దాడి
వీరవాసరం: మైనర్‌పై జనసేన కార్యకర్త లైంగిక దాడికి పాల్పడిన ఘటన సోమవారం రాత్రి జరిగింది. బాధితులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి వీరవాసరం పోలీసులు తెలిపిన వివరాలు.. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం పంజావేమవరానికి చెందిన జనసేన కార్యకర్త పంజా నాగేంద్ర అదే గ్రామానికి చెందిన 14 ఏళ్ల మైనర్ బాలికపై సోమవారం రాత్రి లైంగిక దాడి చేశాడు. ఇంటి సమీపంలో ఆడుకుంటున్న మైనర్ బాలికను కాళ్లు, చేతులు కట్టేసి వాటర్ ట్యాంక్ సమీపంలోకి తీసుకువెళ్లి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. తనపై జరిగిన దారుణాన్ని బాధిత బాలిక కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు మంగళవారం పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ పి.రమేష్ తెలిపారు. చదవండి: రామోజీ మా సంతకాలు ఫోర్జరీ చేశారు -
పట్టుతప్పి పట్టాలపై పిల్లాడు.. క్షణాల్లో స్పందించిన కార్మికుడు.. కన్నార్పనీయని వీడియో!
ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు భగవంతుడు ఎవరినో ఒకరిని పంపిస్తాడని అంటారు. ఇది నిజమని అప్పుడప్పుడు నిరూపితమవుతుంటుంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో దీనిని నిరూపిస్తోంది. ఈ వీడియోలో ఒక పిల్లాడు తల్లి చేతుల నుంచి జారి రైలు పట్టాలపై పడిపోవడం, సరిగ్గా అదే సమయానికి రైలు వస్తుండటం.. ఇంతలోనే ఒక వ్యక్తి ఆ పిల్లాడిని కాపాడటం కనిపిస్తుంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ముందుగా రైల్వే స్టేషన్ వద్ద ఒక పిల్లాడు తన తల్లి చేయి పట్టుకుని నడుస్తుండటాన్ని గమనించవచ్చు. కొంచెం ముందుకు వెళ్లాక ఆ పిల్లాడు తల్లి చేతుల నుంచి జారి పట్టాలపై పడిపోతాడు. దీనిని గమనించిన ఆ పిల్లాడి తల్లి గాభరా పడిపోతూ ఉంటుంది. పిల్లవాడిని పైకి లాగేందుకు తన చేయి అందించే ప్రయత్నం చేస్తుంటుంది. అయితే ఆ మార్గంలో రైలు వస్తుండటంతో ఆమె భయపడిపోతుంది. ఇంతలో మరోవైపు నుంచి ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి, ఆ పిల్లాడిని ప్లాట్‌ఫారంపైకి ఎక్కిస్తాడు. తాను కూడా వేగంగా ప్లాట్‌ఫారంపైకి ఎక్కిపోతాడు. ఇదంతా రెండుమూడు సెకెన్లలో జరిగిపోతుంది. ఇంతలో రైలు అత్యంత వేగంగా ఆ పట్టాల మీదుగా వెళ్లిపోవడం వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో @Suhan Raza పేరుతో షేర్ అయ్యింది. క్యాప్షన్‌లో ఈ రైల్వే ఉద్యోగి తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పిల్లాడిని కాపాడినందుకు అతనికి హ్యాట్సాఫ్ అని రాశారు. ఇది కూడా చదవండి: అందమైన గడ్డం ఆమెకే సొంతం.. మరో గడ్డం బామ్మతో తలపడి.. Salute to this railway staff employee who did not care for his life and saved the life of a blind child who fell on the railway track. 🙏👌#railway #earthquake #TrainAccident #ElvishArmy𓃵 #patlama #ISRO #SaveIndianMuslims pic.twitter.com/7ZoAzHup4V — Suhan Raza (@SuhanRaza4) August 8, 2023 -
పాపమని పనిలో పెట్టుకుంటే.. రాత్రికి రాత్రే..
వరంగల్: అపరిచిత వ్యక్తిని పనిలో పెట్టుకుంటే చివరికి గోదాంనే లూఠీ చేశాడు. ఈ ఘటన గురువారం అర్ధరాత్రి కాకతీయ యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పరిమళ కాలనీలో జరిగింది. ఈ మేరకు బాధితుడు శుక్రవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. నగరంలోని ప్రశాంత్‌నగర్‌కు చెందిన చక్రవర్తి హనుమకొండ టైలర్ స్ట్రీట్‌లో ఓ గార్మెంట్ (బట్టల)షాపు నిర్వహిస్తున్నాడు. అందుకు సంబంధించిన గోదాం పరిమళ కాలనీలో ఉంది. బట్టల షాపులో పనిచేయడానికి ఏపీలోని ఈస్ట్ గోదావరి జిల్లా తాడిపల్లి గూడేనికి చెందిన సుబ్రహ్మణ్యాన్ని పనిలో కుదుర్చుకున్నాడు. రోజూ ఉదయం షాపుకు వెళ్లి రాత్రి గోదాం ముందు రూంలో వచ్చి నిద్రించేవాడు. రోజు మాదిరిగా సుబ్రహ్మణ్యాన్ని యజమాని రాత్రి గోదాం వద్ద వదిలి పెట్టాడు. శుక్రవారం ఉదయం గోదాం వద్దకు వచ్చిచూసే సరికి పని మనిషి కనిపించలేదు. ఫోన్ చేస్తే స్వీచ్ ఆఫ్. గోదాంలో సుమారు రూ.2.50లక్షల స్టాక్ మాయమైనట్లు గుర్తించాడు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకుని దర్యా ప్తు చేస్తున్నట్లు ఎస్సై విజయ్‌కుమార్ తెలిపారు. -
మ్యాన్‌హోల్‌లో పనిచేస్తున్న కార్మికునిపై దూసుకెళ్లిన కారు.. వీడియో వైరల్..
ముంబయి: ముంబయిలో దారుణం జరిగింది. నడిరోడ్డుపై ఉన్న మ్యాన్‌హోల్‌లో పనిచేస్తున్న కార్మికునిపై కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో కార్మికుడు మృతి చెందినట్లు తెలుస్తోంది. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటన.. కందివాలి ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. A manual scavenger was mowed to death by a vehiclein Kandivali, Mumbai. An FIR has been registered in this case at Kandivali police station under sections 304 (A), 336 and 279. Two people - driver and the contractor - have been arrested. pic.twitter.com/86pwBaW5AM — TIMES NOW (@TimesNow) June 26, 2023 ఈశాన్య రుతుపవనాలతో ముంబయిలో వర్షాలు కుండపోతగా కురిశాయి. దీంతో డ్రైనేజీల్లో వర్షపు నీరు పొంగి పారుతోంది. దీంతో చాలాచోట్ల డ్రైనేజీల్లో సమస్యలు ఎదురయ్యాయి. ఈ క్రమంలో రహదారిపై ఉన్న డ్రైనేజీ మ్యాన్‌హోల్ మూత తీసి కార్మికులు మరమ్మతులు చేస్తున్నారు. ఓ వ్యక్తి మ్యాన్‌హోల్‌లో దిగి చెత్తను అందిస్తుండగా.. మరో వ్యక్తి దానిని దూరంగా పారబోస్తున్నాడు. ఇదే సమయంలో మ్యాన్‌హోల్‌లో ఉన్న వ్యక్తి కిందికి వంగాడు. అది గమనించని కారు డ్రైవర్.. కార్మికుని మీదుగానే వాహనాన్ని పోనిచ్చాడు. ఇదీ చదవండి: రెచ్చిపోయిన దొంగలు.. గన్‌తో బెదిరించి.. కారును అడ్డగించి.. వీడియో వైరల్.. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కార్మికున్ని మ్యాన్‌హోల్ నుంచి బయటకు తీశారు. ఆస్పత్రికి తరలించగా.. చికిత్స తీసుకుంటూ అతను మరణించినట్లు తెలుస్తోంది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. కార్మికున్ని గమనించని కారు డ్రైవర్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు మరమ్మతులు చేసేప్పుడు కార్మికులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలను కామెంట్ చేశారు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్.. రాత్రంతా రోడ్డుమీదే.. పర్యటకుల అవస్థలు.. -
దళిత కార్యకర్త ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ చేసిన కేంద్ర మంత్రి జైశంకర్
వారణాసి: ఈ ఏడాది జీ-20 సమావేశం మన దేశంలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ నెల 11(ఆదివారం) నుంచి 13వ తేదీ వరకు వారణాసిలో జీ-20 మీటింగ్స్ జరుగుతున్నాయి. ఇందుకు విదేశాంగ మంత్రి జై శంకర్ అధ్యక్షత బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు జీ-20 సమావేశాల్లో పాల్గొన్న జైశంకర్ ఓ దళిత వ్యక్తి(బీజేపీ బూత్ అధ్యక్షుడు) ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ చేశారు. మంత్రి రాకకోసం ఒకరోజు ముందు నుంచే ఏర్పాట్లు చేసినట్లు బీజేపీ బూత్ ప్రెసిడెంట్ సుజాత చెప్పారు.'మా కుటుంబమంతా ఆ ఏర్పాట్లలో ఉన్నాం. ఇళ్లు శుభ్రం చేసి కచోరి,ఆలూ పన్నీర్ వండిపెట్టాము. కేంద్ర మంత్రి మా ఇంట్లో తినడం మాకు ఎంతో సంతోషాన్నిచ్చింది'అని ఆమె అన్నారు. తమ లాంటి పేదవాళ్ల ఇంట్లో కేంద్ర మంత్రి వచ్చి తినడం చాలా ఆనందాన్ని కలిగించిందని సుజాత మామయ్య చెప్పారు. తిన్న అనంతరం భోజనం చాలా బాగుందని జైశంకర్ చెప్పారు. ఆహార భద్రత,ధాన్యం, ఫర్టిలైజర్స్, చిరుధాన్యాల గురించే ఈ రోజు సమావేశంలో చర్చ జరగనుందని చెప్పారు. వీడియో కాన్ఫరెన్సులో ప్రధాని మోదీ కూడా ఇందులో పాలుపంచుకోనున్నారని వెల్లడించారు. ఇదీ చదవండి:భారతీయ స్ట్రీట్ ఫుడ్ రుచికి జపాన్ జంట ఫిదా.. -
వివాదంలో కామా రెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్
-
శ్రమో నమః
వందల కోట్ల చేతులు ప్రపంచమనే ఈ మహాయంత్రాన్ని పని చేయిస్తున్నాయి. పని అంటే కర్మ. కాలగతిలో కర్మ శబ్దం ఆ ప్రాథమికార్థపు నేల విడిచి విధిలిఖితమనే తాత్వికార్థపు గగనసీమను తాకింది. మనుగడకు అవసరమైన సాధారణ కర్మల స్థాయిని దాటి మతపరమైన తంతులతో సహా ఇతరేతర అర్థాలకు విస్తరించింది. కర్మలో శ్రమ ఉంటుంది, శ్రమలో కర్మ ఉంటుంది. రెండూ అన్యోన్యాశ్రితాలు. మళ్ళీ ప్రపంచాన్నే ఒక యాంత్రిక మహాశకటమనుకుంటే, దానిని ముందుకు నడిపించేది కోట్లాది జనాల శ్రమ ఇంధనమే. పుట్టిన ప్రతిజీవీ అంతో ఇంతో కర్మయోగే. అందరికీ వందనం. వేదం కర్మవాదమే. అందులో కర్మ గురించిన ఉగ్గడింపే ఆద్యంతం వ్యాపించి ఉంటుంది. వేదకాలపు కర్మభావనలో హెచ్చుతగ్గుల వింగడింపు లేదు; దేవతలు, మనుషులన్న తారతమ్యం లేదు. సూర్యచంద్రులు, ఉషస్సు, అగ్ని సహా అందరూ క్రమం తప్పకుండా తమ విధ్యుక్త కర్మలను నిర్వహించవలసిందే. ఇంద్రుడు కర్మ చేతనే గొప్పవాడయ్యాడంటుంది వేదం. అతని చేతి వేళ్ళు అనేక వేల కర్మలను చేస్తూ ఉంటాయి. ఆహార పచనం, దేవతలకు హవ్యాన్ని అందించడంతో సహా అగ్ని బహువిధ కర్మదక్షుడు. అగ్నిని అనేక విధాలుగా వినియోగంలోకి తెచ్చిన కార్మిక నిపుణులు అంగిరసులు. సర్వకర్మకుశలురైన పుత్రపౌత్రులు కావాలని వేదజనం కోరుకుంటారు. కర్మనిరతిని ప్రకృతితో ముడిపెట్టి వేదం అందంగా చెబుతుంది. ‘‘మనుషుల్లారా! నిద్రలేవండి, చీకట్లు తొలిగాయి, మన దేహాలకు ప్రాణం వచ్చింది, ఉష ఉదయించి సూర్యుని రాకను ప్రకటించింది, అన్నం సమృద్ధిగా దొరికే చోటుకి వెడదాం పదండి’’ అని ఒక ఋక్కు చెబుతుంది. ఉష ఉదయించి మీ మీ వృత్తి వ్యాపారాల వైపు మిమ్మల్ని జాగృతం చేస్తోందని మరో ఋక్కు అంటుంది. ‘‘జాలరి పగ్గం, సాలెల మగ్గం, శరీర కష్టం స్ఫురింపజేసే గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి, సహస్ర వృత్తుల సమస్త చిహ్నా’’ల స్మరణ ఆధునిక మహాకావ్యంలోనే కాదు; కవిత్వానికే ఆదిమమైన వేదంలోనూ కనిపిస్తుంది. త్వష్ట నిపుణుడైన లోహకార్మికుడు... స్వర్ణమయమై, వేయి అంచులు కలిగిన వజ్రాయుధాన్ని నిర్మించి ఇంద్రునికి ఇచ్చాడు. దేవతలతో సమానమైన గౌరవాన్ని పొందాడు. ఋభులనే అన్నదమ్ములు మానవులైనా లోహవిద్యలో త్వష్టను మించిన ప్రావీణ్యం చూపి దేవతలయ్యారు. మరుత్తులనే దేవతలు ప్రవాహానికి అడ్డుపడిన ఓ పర్వతాన్ని బద్దలుకొట్టి నీటికి దారి చేశారు. అశ్వినులు మనువుకి విత్తనాలిచ్చి వ్యవసాయం చేయించారు; వైద్యం చేసి ఎంతోమందికి ఆరోగ్యాన్ని, ఆయుష్షును ఇచ్చారు. క్షురకుడు కేశఖండన చేసినట్లుగా ఉష చీకట్లను ఉత్తరిస్తోందని ఒక ఋక్కు అంటుంది. శ్రమ ఉచ్చమా, న్యూనమా అని చూడకుండా; శ్రామికుల మధ్య హెచ్చుతగ్గుల తేడా తేకుండా శ్రమను మాత్రమే గౌరవించిన దశ అది. ఇంద్రాదులు సమాజానికి ఏదో ఒక మేలు చేసే సేవకులు కనుకనే దేవతలయ్యారు. వేదకాలంలో అలాంటి సేవకులను పన్నెండుగురిని గుర్తించి పన్నిద్దరు ఆయగార్లు అన్నారు. శారీరక శ్రమను తక్కువ చేసి మేధోశ్రమను ఆకాశానికి ఎత్తడం ఆనాటికి లేదు. తిథివారనక్షత్రాలు చూసే వ్యక్తి కన్నా మృతపశువుల చర్మాన్ని ఒలిచే చర్మకారునికి ఎక్కువ ప్రతిఫలం ముట్టిన కాలం అది. కర్మ, కర్మఫలం రెండూ ఆనాడు సాముదాయికమే. చెరువుల వంటి నిర్మాణాలలో రాజు, రాజుగారి భార్యా కూడా మట్టితట్టలు మోసిన ఉదాహరణలు పురాచరిత్రలో కనిపిస్తాయి. అది పోయి చాకిరొకరిది, సౌఖ్యమొకరిదైన తర్వాతే పరిస్థితి తలకిందులైందని పండితులంటారు. అందరూ అన్నిరకాల పనులూ చేయడం పోయి వృత్తి విభజన రావడంతోనే వృత్తుల మధ్య, వ్యక్తుల మధ్య చిన్నా పెద్దా తారతమ్యాలూ పొటమరించాయి. ఇష్టపూర్వక కర్మ నిర్బంధకర్మగా మారి దుఃఖదాయిని అయింది. అప్పుడు కూడా వృత్తి నైపుణ్యంలో ఆనందాన్ని, తృప్తిని అనుభవించే అవకాశం ఎంతోకొంత ఉండేది. వృత్తిదారులు పారిశ్రామిక యంత్రంలోని పరికరాలుగా మారిపోవడంతోనే అదీ పోయింది. ఈ మార్పును కొడవటిగంటి కుటుంబరావు ఒక కథలో అద్భుతంగా చిత్రీకరిస్తారు. ప్రకృతి సమవర్తి. శ్రుతిమించిన అసమానతలను ఆట్టే కాలం సహించదు, ఎప్పటికైనా కత్తెర వేసి సమతుల్యతను తెస్తుంది. అడుగంటిన శ్రమ విలువను, గౌరవాన్ని, తగిన ప్రతిఫలాన్ని ఉద్ధరించే ప్రయత్నం ఆధునిక కాలంలోనే మళ్ళీ ఊపందుకుంది. ‘శ్రమ నిష్ఫలమై, జన నిష్ఠురమై నూతిని గోతిని వెదికే కార్మిక వీరుల కన్నుల నిండా కణకణమండే విలాపాగ్నులకు, గలగల తొణికే విషాదాశ్రులకు ఖరీదు కట్టే షరాబులు’ ఉద్భవించారు. ఏ ఒకడి ఆస్తిహక్కైనా శ్రమపునాది మీదే ఆధారపడుతుందని జాన్ లాక్ అనే ఆర్థికవేత్త నొక్కిచెప్పి శ్రమకు తిరిగి పట్టం కట్టాడు. ఆడమ్ స్మిత్ అనే మరో ఆర్థికవేత్త విలువకు మూలం శ్రమేనన్నాడు. దాని ఆధారంగా డేవిడ్ రికార్డో అనే మరో ఆర్థికవేత్త శ్రమవిలువ సిద్ధాంతాన్ని ముందుకుతెచ్చాడు. కార్ల్ మార్క్స్ తాత్వికతకు అదే సారవంతమైన వనరు అయింది. శ్రమ విలువను తిరిగి గుర్తించడమే జరిగింది కానీ శ్రామికుని బతుకు బండి ఇంకా పూర్తిగా పట్టాలకెక్కలేదు. ‘ఉందిలే మంచి కాలం ముందు ముందునా’ అన్న కవి ఆకాంక్ష నెరవేరే రోజు ముందుకు జరుగుతూనే ఉంది. అయినా మనిషి నిత్య ఆశాజీవి కదా! -
మంచి మాట: విడదియ్యరాని శ్రమ
శ్రమ నుంచి శ్రామికుల్ని, శ్రామికుల నుంచి శ్రమను ఎలా అయితే విడదియ్యలేమో అలా ప్రపంచం నుంచి శ్రమను, శ్రామికులను విడదియ్యలేం. శ్రమలేందే శ్రామికులు లేరు; శ్రామికులు లేందే శ్రమలేదు; శ్రమ, శ్రామికులు లేందే ప్రపంచం లేదు. మనిషికి ప్రపంచం ఆధారం; ప్రపంచానికి శ్రామికుడు ఆధారం. ప్రతి మనిషికి శ్రామికుడి అవసరం ఉంది; ప్రతిమనిషీ శ్రామికుడు అవ్వాల్సిన అవసరం ఉంది. మన ఈ ప్రపంచం మనకు ఇవాళ ఇలా ఉందీ అంటే అది శ్రామికులు శ్రమిస్తూనే ఉన్నందువల్ల వచ్చిన ఫలితమే. శ్రమతో శ్రామికులు సృజించిన ఆకృతి ప్రపంచం. శ్రమతో, శ్రమలో శ్రామికుడు జీవనం చేస్తున్నందువల్లే ప్రపంచానికి స్థితి, ద్యుతి ఉన్నాయి. అవి మనకు ఆలవాలమూ అయినాయి. మన మనుగడ సాగేందుకు అవి మనతో, మనకై ఉన్నాయి. ‘శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదు’ అని కవి శ్రీశ్రీ అన్నారు. శ్రమైకజీవనం సౌందర్యమై ప్రపంచం మొత్తానికి సౌందర్యాన్ని తీసుకు వచ్చింది! శ్రమ అన్నదాన్ని లుప్తం చేసి ఊహించుకుంటే ప్రపంచం వికృతంగా ఉంటుంది. శ్రమైక జీవనం అన్నది సౌందర్యం మాత్రమేనా? కాదు. శ్రమైకజీవనం ఈ ప్రపంచానికి లభించిన సౌభాగ్యం కూడా. అనాది గా ప్రపంచం పొందిన ప్రగతికి కారణం శ్రామికుడు. శ్రామికుడు ప్రపంచానికి సౌందర్యప్రదాత. శ్రామికుడు ప్రపంచానికి సౌభాగ్యప్రదాత. అటువంటి శ్రామికుడికి, అతడి శ్రమకు న్యాయం జరుగుతోందా? అనాదిగానే అది లేదు అన్నది క్షేత్ర వాస్తవంగా మనకు ప్రస్ఫుటంగా తెలుస్తూనే ఉంది.‘మన ప్రపంచంలో చాలా విషయాలు అన్యాయం; / పత్తిని నాటని వాళ్లు శ్రేష్ఠమైన పత్తి బట్టలు కట్టుకుంటారు. / అంతే కాదు పొలంలో పని చెయ్యని వాళ్లు తెల్లటి బియ్యం తింటారు’ అని అంటూ చైనాలోని ఒక అజ్ఞాత యూనాన్ జానపద కవి వందలయేళ్ల క్రితమే ఆవేదనను వ్యక్తపరిచాడు. చిందిన చెమట కు అందిన ఫలం చాలని స్థితి ఎప్పటి నుంచో ఉంది. ఈ పరిస్థితి ఇకనైనా మారాలి. శ్రమకు, శ్రామికుడికి తగిన ఫలం దక్కాలి. ‘మేఘాలు తియ్యటి నీరును ఇచ్చినట్టుగా, తేనెటీగలు తేనెను ఇచ్చినట్టుగా నువ్వు పశువుల్లో పాలను సృష్టించావు. అదే విధంగా పగలంతా శ్రమించిన శ్రామికుడికి ధాన్యాదిరూపంలో సంపదను ఇవ్వు’ అంటూ వేదంలో ఒక దైవ ప్రార్థన ఉంది. శ్రామికుడికి న్యాయం జరగాలన్న ఆకాంక్ష కూడా ఎప్పటినుంచో వస్తూనే ఉంది. ఇకనైనా శ్రమకు, శ్రామికులకు న్యాయం సాకారం కావాలి. ఏడాదిలో ఏ ఒక్కరోజునో శ్రామికుల రోజు అనీ, ఆ రోజున ఏదో హడావిడి చేసేసి, ఉపన్యాసాలు ఇచ్చేసి ఆ తరువాత శ్రామికుల్ని నిర్లక్ష్యం చెయ్యడం ఇక చాలు. ప్రతిరోజూ శ్రామికులకు, శ్రమకు న్యాయం చేస్తూ మనం మన మనుగడను సౌందర్యవంతమూ, సౌభాగ్యవంతమూ చేసుకుందాం. శ్రామికులకు, శ్రమకు గౌరవాన్ని, మన్నను ఇస్తూ మనల్ని మనం గౌరవించుకుందాం; మనకు మనం మన్ననను కలిగించుకుందాం. ఏ ఒక్కరోజో శ్రామికుల రోజు అవదు. ప్రతిరోజూ శ్రామికుల రోజే. సూర్యోదయంతో మొదలయ్యే ప్రతి దినమూ శ్రామికుల దినమే! శ్రమ అన్నది చిందే దినమే! శ్రమ చిందనిదే, శ్రామికులు పని చెయ్యనిదే ఏ దినమూ గడవదు కదా? ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని అంటూ ఒక్కో పేరుతో ఒక్కో దినం ఉంది. ఏ పేరుతో ఉన్న దినమైనా శ్రమ, శ్రామికుల అభినివేశంతోనే అది దినంగా నడుస్తుంది, గడుస్తుంది. ప్రతిదినమూ శ్రామికుల దినమే! – రోచిష్మాన్ -
ఆయన కచ్చితంగా గెలుస్తారు.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది..రక్తంతో లేఖ
బెంగళూరు: త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన మాజీ సీఎం జగదీశ్ శెట్టర్ కచ్చితంగా గెలుస్తారని ఓ కార్యకర్త రక్తంతో పోస్టర్ రూపొందించాడు. అలాగే హస్తం పార్టీ స్పష్టమైన మెజార్టీతో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. ఈ పోస్టర్‌ను స్వయంగా తీసుకెళ్లి జగదీశ్ శెట్టర్‌కు అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫొటో చర్చనీయాంశమైంది. దశాబ్దాల పాటు బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న జగదీశ్ శెట్టర్ ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. బీజేపీ టికెట్ నిరాకరించడంతో ఆయన హస్తం గూటికి చేరుకున్నారు. అయితే హుబ్బళ్లి ధర్వాడ్ నిజయోజకవర్గంలో రెండో రోజుల క్రితం సమావేశం నిర్వహించిన మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప శెట్టర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. స్వార్థ ప్రయోజనాల కోసమే ఆయన పార్టీకి, కార్యకర్తలకు వెన్నుపోటు పొడిచి వెళ్లిపోయారని విమర్శించారు. ఆయన ఎలా గెలుస్తారో చూస్తామన్నారు. శెట్టర్‌ను ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఇదే నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త శెట్టర్ గెలుపు ఖాయమని రక్తంతో పోస్టర్ రూపొందించాడు . బీఎస్ యడియూరప్ప వ్యాఖ్యలకు ప్రతి సవాల్‌గా ఈ పోస్టర్లను గోడలపై అంటించాడు. చదవండి: ఆ హీరోలు ప్రచారం చేసినా బీజేపీకి ఒరిగేదేంలేదు.. డీకే శివకుమార్ సెటైర్లు.. -
ప్రత్యేక సెల్ఫీని పంచుకున్న మోదీ! నేను చాలా గర్వపడుతున్నా!
ప్రధాని నరేంద్ర మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించేందుకు చెన్నై పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. శనివారం పర్యటన ముగిసే సమయానికి తిరు ఎస్ మణికందన్ అనే దివ్యాంగుడిని కలిశారు. అతనితో సమావేశమై ప్రత్యేక సెల్ఫీ తీసుకున్నారు. ఈ ఫోటోను 'ప్రత్యేక సెల్ఫీ' పేరుతో మోదీ ట్విట్టర్లో షేర్ చేస్తూ అతని గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అతను సొంతంగా దుకాణాన్ని నడపడమే గాక తన రోజువారి లాభాలలో గణనీయమైన భాగాన్ని బీజేపీకి ఇస్తాడని చెప్పారు. "ఆయన నేను ప్రారంభించిన రోడ్‌కు బూత్ ప్రెసిడెంట్‌గా, కార్యకర్తగా పనిచేయడం మాకెంతో గర్వకారణం. అలాంటి వ్యక్తి ఉన్న పార్టీలో నేను కార్యకర్తను అయినందుకు చాలా గర్వపడుతున్నాను. అతని జీవితం స్ఫూర్తిదాయకం, అలాగే మా పార్టీ సిద్ధాంతాల పట్ల అతను కనబర్చిన నిబద్ధత కూడా ఆదర్శవంతంగా ఉంది . అతని భవిష్యత్తు ప్రయత్నాలకు నా శుభాకాంక్షలు" అని మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, మోదీ చెన్నైలో రూ. 5వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. ఇది ప్రభుత్వ పని సంస్కృతి, దార్శినికతల వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు మోదీ. తమ ప్రభుత్వ డెడ్‌లైన్ కంటే ముందే ఫలితాలను సాధిస్తుందన్నారు. తమ ప్రభుత్వం విజయాలను అందుకోవడంలో పని సంస్కృతి, విజన్ అనే రెండు అంశాలు కీలక పాత్ర పోషించాయన్నారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ అంటే ఆలస్యం కానీ ఇప్పుడూ ఆ అర్థం డెలిరీ(తగిన సమయానికి అందించడం). తాము పన్ను చెల్లించే చెల్లింపుదారుల ప్రతి రూపాయికి తాము జవాబుదారిగా పనిచేస్తున్నాం. తాము నిర్థిష్ట గడువులతో పని చేస్తాం, వాటికంటే ముందే ఫలితాలను సాధిస్తాం అని మోదీ ఒక బహిరంగ సభలో అన్నారు. (చదవండి: సేవ చేయండి.. పేరొస్తుందని చూడకండి) -
మూకుమ్మడిగా కుక్కల దాడి... పోస్టల్ ఉద్యోగి మృతి
ఫ్లోరిడా: నార్త్ ఫ్లోరిడాలో ఒక పోస్టల్ ఉద్యోగి కుక్కల దాడిలో మృతి చెందింది. 61 ఏళ్ల పమేలా జేన్ రాక్ అనే మహిళ తన పోస్టల్ ట్రక్కుతో రోడ్డుపై వెళ్తోంది. ఇంతలో ట్రక్కు కదలకుండా మొరాయించడంతో ఆమె వాహనం దిగి సాయం కోసం చూస్తోంది. అంతే ఎక్కడ నుంచి వచ్చాయో ఒక ఐదు కుక్కలు గుంపుగా ఆమెను చుట్టుముట్టి దాడి చేశాయి. దీంతో ఆమె కింద పడిపోయి గట్టిగా పెడబొబ్బలు పెడతూ సాయం కోసం అరుస్తూ ఉంది. ఆమె కేకలు విని చుట్టు పక్కల ఉన్న నివాసితులు, సదరు కుక్కల యజమాని వెంటనే వచ్చి ఆ కుక్కలను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. అందులో భాగంగా ఒక వ్యక్తి తుపాకిని గాల్లో రెండు రౌండ్ల కాల్చాడు కూడా. ఐతే పమేలాకి తీవ్ర గాయాలై రక్త స్రావం అవడంతో ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు స్థానికులు. కానీ ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో జంతు నియంత్రణ సంస్థ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ ఐదు కుక్కలను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు చేయడమే కాకుండా సదరు కుక్కుల యజమానిని కూడా విచారిస్తున్నారు. యూఎస్ పోస్ట్ సర్వీస్ విడుదల చేసిన డేటా ప్రకారం 2021లో సుమారు 5 వేల మంది పోస్టల్ ఉద్యోగుల పై కుక్కలు దాడి చేశాయని అదికారులు తెలిపారు. కుక్కల యజమానుల తమ కుక్కలను చుట్టుపక్కల వారికి హాని కలిగించకుండా సురక్షితమైన ప్రదేశాల్లో పర్యవేక్షించుకోవాలని సూచించారు అధికారులు. (చదవండి: ఇదేం సరదా.. అడిగి మరీ అరెస్టయింది!) -
వర్కర్‌పై కర్కశత్వం.. రెండేళ్లుగా చిత్రహింసలు.. బెల్టుతో..
సాక్షి,జవహర్‌నగర్: టిఫిన్ సెంటర్లో పని చేస్తున్న వర్కర్‌పై ఓ యజమాని తన కర్కశత్వాన్ని చూపించాడు. రెండు నెలలుగా చిత్రహింసలకు గురిచేస్తూ విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని జమ్మిగడ్డ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం... కాప్రా జమ్మిగడ్డ ప్రాంతంలో నిససిస్తున్న తిప్పారపు పవన్‌కుమార్ నాలుగేళ్లుగా తన ఇంటి సమీపంలోని మణికంఠ టిఫిన్ సెంటర్లో పని చేస్తున్నాడు. కాగా హోటల్యజమాని తాడూరి అనిల్ గత రెండేళ్లుగా పవన్‌ను వేధిస్తూ చిత్రహింసలు గురిచేయడమే కాకుండా బెల్ట్‌తో ఒళ్లంగా దారుణంగా కొట్టాడు. బాధితుడు పవన్‌కుమార్ ఫిర్యాదు మేరకు పోలీ సులు కేసు నమోదు చేసుకుని హోటల్ యజమాని తాడూరి అనిల్‌ను శువ్రవారం రిమాండ్‌కు తరలించారు. చదవండి: గమనించాలి: పోలీస్ ఫోన్ నెంబర్లు మారనున్నాయ్! -
హాయిగా ఊళ్లోనే ఉపాధి... ఇక ఎక్కడికీ వెళ్లనవసరం లేకుండా...
కూలీలకు ఉన్న ఊళ్లోనే ఉపాధి పనులను ప్రభుత్వం కల్పిస్తోంది. తద్వారా పొట్ట చేతపట్టుకుని నగరాలకు వలస వెళ్లే బాధ తప్పింది. మండు వేసవిలో ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఉదయం వేళల్లో మాత్రమే పని చేసేలా వెసులుబాటు కల్పించింది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా కూలీల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తోంది. ఉపాధి కూలీల జీవనానికి భరోసా ఇచ్చింది. లక్షలాది కుటుంబాలకు లబ్ధి చేకూరింది. అధికార యంత్రాంగం నిర్విరామ కృషి ఫలితంగా ఉపాధి హామీ పథకం అమలులో రాష్ట్రం జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది. సాక్షి, చిత్తూరు: వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఉపాధి హామీ పథకంపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచింది. పారదర్శకంగా పనులు చేపడుతూ కూలీల జీవనానికి భరోసా ఇచ్చింది. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి స్థానం దక్కడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో జరిగిన పనులు, లబ్ధిదారులకు అందుతున్న నగదుపై నిర్వహించిన సోషల్ ఆడిట్లో ఏపీ పనితీరును కేంద్రం ప్రశంసించింది. కూలీల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు పథకాన్ని క్షేత్రస్థాయిలో ఈ పకడ్బందీగా అమలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 7 నియోజకవర్గాల్లోని 31 మండలాల్లో ఉపాధి హామీ పనులు పక్కాగా సాగుతున్నాయి. మూడేళ్లలో 5.5 లక్షల పనిదినాలు జిల్లా వ్యాప్తంగా 1,50,682 కుటుంబాల నుంచి 74,059 మంది కూలీలు ఉపాధి పనులకు హాజరవుతున్నారు. 2019 ప్రారంభం నుంచి ఈ ఏడాది జూన్ 10 వరకు 5,43,81,511 పనిదినాలను కల్పించారు. ఇందుకు గాను రూ.1971.31 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. 2021–22లో 20,393 కుటుంబాలు 100 రోజులపాటు పనులకు హాజరయ్యారు. ఇక 2022–23 ఏడాది ఏప్రిల్ వరకు 13.19 శాతం వరకు వంద రోజుల పనిదినాలు పూర్తి చేసినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. కూలీలకు రోజువారి వేతనం సగటున రూ.251 అందుతోంది. ఉపాధి పనుల్లో జాబ్‌కార్డుపై నమోదైన ఒక కుటుంబానికి ఏడాదికి కనీసం వంద పనిదినాలు కల్పించాలన్నదే ప్రభుత్వ ఆశయం. కుటుంబంలో ముగ్గురు కంటే ఎక్కువ సభ్యులు ఉన్నా వారికి కనీసం వంద పనిదినాలు కల్పిస్తారు. పల్లెల్లో పచ్చదనం ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టే పనుల్లో ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో పచ్చదనం పెంచే పనులకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు. మొక్కలు నాటేందుకు గోతులు తీయటం నుంచి మొక్కలు నాటి వాటి సంరక్షణ వరకు అన్నీ కూలీలే పర్యవేక్షిస్తున్నారు. దీనివల్ల చాలా గ్రామాల్లో పచ్చదనం పెరిగిందని అధికారులు చెబుతున్నారు. ఇక పనిచేసిన వెంటనే కూలీలకు సకాలంలో వేతనాలను చెల్లిస్తున్నారు. మెరుగైన వసతులు జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న ఉపాధి కూలీలకు మెరుగైన వసతులు కల్పించేలా అధికారులు చర్యలు చేపట్టారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని పని ప్రదేశంలో నీడ, మంచినీరు, ఫస్ట్ ఎయిడ్ కిట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో గ్రామీణ ప్రజలు ఉపాధి హామీ పనులకు వెళ్లేందుకు ఉత్సాహం కనబరుస్తున్నారు. కలెక్టర్ హరి నారాయణన్ క్షేత్రస్థాయిలో అమలవుతున్న ఉపాధి హామీ పనులను ఎప్పటికప్పడు పర్యవేక్షిస్తూ పనుల్లో పారదర్శకతను అమలు చేస్తున్నారు. పని అడిగిన ప్రతి కూలీకి ఉపాధి కల్పించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. కూలీలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా స్థానికంగానే పనులు కల్పిస్తున్నారు. వారి జీవనోపాధికి తోడ్పాటునందిస్తున్నారు. ఆదుకున్న ఉపాధి ఎండలు మండిపోతున్నాయి. పనులు చేయలేకపోతున్నాము. ఇదే సమయంలో ఉపాధి పనులు కల్పించడంతో పట్టణాలకు వలస వెళ్లాల్సిన బాధ తప్పిపోయింది. ప్రభుత్వం ఉదయం 10 గంటల్లోపే పనులు చేసుకునే వెసులుబాటు కల్పించింది. అనంతరం పశుపోషణతో మెరుగైన జీవనం సాగిస్తున్నాం. –కుప్పయ్య, గొల్లపల్లె యాదమరి మండలం రోజుకు రూ.250 పనులు లేని కాలంలోనే రోజుకు రూ.250 సంపాదించుకునే ఉపాధిని ప్రభుత్వం కల్పించింది. నిత్యం పట్టణానికి వెళ్లే అవస్థ తప్పింది. ఇంటి దగ్గర పశువులను చూసుకునే వారు లేక ఇబ్బందులు పడుతున్నాను. ఉపాధి పనుల వల్ల కూలీ వస్తోంది. మిగిలిన సమయంలో సొంతపనులూ చేసుకుంటున్నాం. – నాగమ్మ, విజయపురం పని కల్పించటమే ధ్యేయం జిల్లా వ్యాప్తంగా అడిగిన వారందరికీ పని కల్పించేలా చర్యలు చేపట్టాము. ఉపాధి పనుల్లో జిల్లాను రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిపేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళుతున్నాం. అడిగిన వారికి జాబ్‌కార్డులను ఇస్తున్నాము. వేసవిని దృష్టిలో ఉంచుకుని కూలీలకు వసతులు కల్పిస్తున్నాము. – హరి నారాయణన్, కలెక్టర్, చిత్తూరు జిల్లా (చదవండి: పవన్ కల్యాణ్ జనసేన జనం కోసమా.. చంద్రబాబు కోసమా..?) -
రూ.100కి 20 రూపాయల వడ్డీ.. దిక్కుతోచని స్థితిలో..
చిట్టినగర్(విజయవాడ పశ్చిమ): క్రికెట్ బెట్టింగ్ ఓ వ్యక్తి ప్రాణాలను తీసింది. దీంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితికి చేరుకుంది. చేసిన అప్పులకు వందకు రూ.20 వడ్డీ చెల్లించలేక ఏం చేయాలో పాలుపోని ఆ వ్యక్తి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని చిట్టినగర్ సొరంగం వద్ద జరిగింది. ఘటనపై మృతుని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. చదవండి: కూర విషయంలో భార్యతో గొడవ.. స్నేహితుడి ఇంటికి వచ్చి.. పోలీసుల కథనం ప్రకారం చిట్టినగర్ సొరంగం సమీపంలోని కటికల మస్తాన్ వీధికి చెందిన జొన్నలగడ్డ బాలస్వాతి, శ్రీనివాసరావు(42) భార్యాభర్తలు. వీరికి అన్నపూర్ణ, అజయ్‌కుమార్ సంతానం. శ్రీనివాసరావు పెయింటింగ్ పని చేస్తూ క్రికెట్ బెట్టింగులు ఆడుతుంటాడు. బాలస్వాతి పంజా సెంటర్లో ఓ వస్త్ర దుకాణంలో పని చేస్తుంటుంది. గత కొద్ది రోజులుగా పనులు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న శ్రీనివాసరావుకు అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరిగింది. వందకు రూ.20 చొప్పున వడ్డీలు చెల్లించాల్సి రావడంతో ఏం చేయాలో అర్ధం కాక మానసికంగా కుంగిపోయాడు. గురువారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ హుక్కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ట్యూషన్ నుంచి ఇంటికి వచ్చిన పిల్లలు తండ్రిని చూసి భయంతో కేకలు వేశారు. వెంటనే తేరుకుని కిందకు దింపి ఆటోలో ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు స్పష్టం చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కొత్తపేట పోలీసులు శుక్రవారం ఉదయం మృతుని నివాసానికి చేరుకుని వివరాలను నమోదు చేసుకున్నారు. మృతుని భార్య నుంచి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేశారు. -
ఆనందంగా పండుగ జరుపుకోవాలని వచ్చి.. అంతలో విషాదం
సాక్షి,ధర్మపురి(కరీంనగర్): సంక్రాంతి పండుగను కుటుంబసభ్యులతో ఆనందంగా జరుపుకోడానికి స్వగ్రామం వచ్చిన ఓ చేనేత కార్మికుడు గుండెపోటుతో మృతిచెందాడు. వివరాల్లోకి వెళ్తే.. ధర్మపురి మండలంలోని తీగల ధర్మారం గ్రామానికి చెందిన ఆడెపు శంకరయ్య(63) చేనేత కార్మికుడు. స్థానికంగా ఉపాధి లేకపోవడంతో సిరిసిల్లలో ఉంటూ పని చేస్తున్నాడు. సంక్రాంతి నేపథ్యంలో గురువారం పని ముగించుకొని, ఇంటికి వచ్చాడు. రాత్రి కటుంబసభ్యులతో ఆనందంగా గడిపాడు. శుక్రవారం బహిర్భూమికి వెళ్లి, ఛాతిలో నొప్పి రావడంతో కుప్పకూలాడు. శంకరయ్య ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యలు వెతకగా బహిర్భూమి ప్రాంతంలో మృతిచెంది కనిపించాడు. మృతుడికి భార్య, ఒక కుమారుడు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కుటుంబ పెద్ద తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో వారు రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. మరో ఘటనలో.. ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య తంగళ్లపల్లి(సిరిసిల్ల): ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన తంగళ్లపల్లి మండలం అంకుశాపూర్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు. గ్రామానికి చెందిన నాగారపు బాలయ్య–రేనవ్వలకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. చిన్నకొడుకు నాగారపు నరేశ్(23) డిగ్రీ పూర్తి చేసి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం ఇంటికొచ్చిన నరేశ్ శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నరేశ్ బలవన్మరణానికి గల కారణాలు తెలియరాలేదు. తంగళ్లపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కూల్‌గా కూర్చోని ఫోన్ తెరిచాడు.. ఒక్కసారిగా మంటలు.. షాకింగ్ వీడియో
ఓ వైపు స్మార్ట్ ఫోన్ విక్రయాలు పెరుగుదలతో పాటే వాటి రిపేర్ల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇక కొన్ని ఫోన్లు వాటి లోపల సాంకేతిక సమస్య మరేదో కారణం వల్ల వాడుతున్నప్పుడో, లేదా జేబులో పెట్టుకున్నప్పుడో పేలిన ఘటనలు బోలెడు ఉన్నాయి. అందుకే నిపుణుల ఛార్జింగ్ పెట్టినప్పుడు మొబైల్‌ని వాడకూడదని సూచిస్తుంటారు. తాజాగా ఓ వ్యక్తి ఫోన్‌ని రిపేర్ చేయాలని ప్రయత్నిస్తుండగా అది హఠాత్తుగా పేలిన ఘటన వియత్నాంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. షాపులోని ఓ వ్యక్తి తన డెస్క్ ముందు కూర్చోని ఫోన్ రిపేర్ చేస్తుంటే... సడెన్‌గా అది పెద్ద శబ్దంతో పేలింది. హఠాత్తుగా ఫోన్ పేలి మంటలు వచ్చాయి. అదృష్టవశాత్తు అతను అప్రమత్తంగా ఉండడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అనంతరం దాన్ని జాగ్రత్తగా తీసి... షాప్ బయటకు విసిరేశాడు. అతను ఆలస్యం చేసి ఉంటే... పెద్ద అగ్ని ప్రమాదం జరిగేదే. అక్కడి సీసీటీవీ కెమెరా ఈ దృశ్యాన్ని రికార్డ్ చేసింది. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు స్పందిస్తూ.. "ఇదే ఫోన్ పాకెట్లో పేలితే ఎలా ఉంటుందో ఊహించుకోండి" అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా... "లక్కీ బాయ్ నీకు ఏమీ కాలేదు" అని మరో నెటిజన్ కామెంట్ పెట్టాడు. చదవండి: హే! ఇది నా హెయిర్ స్టైయిల్... ఎంత క్యూట్‌గా ఉందో ఈ ఏనుగు!! -
మేస్త్రీ అసభ్యంగా తిడుతూ, కొట్టాడు..
సాక్షి, దుండిగల్(హైదరాబాద్): అసభ్య పదజాలంతో మేస్త్రీ దూషించడంతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుండిగల్ మున్సిపాలిటీ సాయి పూజా కాలనీకి చెందిన రామ్‌నాథ్(32) లేబర్ పని చేస్తుంటాడు. ఆయన గాజులరామారం ప్రాంతానికి చెందిన శేఖర్ మేస్త్రీ వద్ద గత 12 సంవత్సరాలుగా పని చేస్తున్నాడు. కాగా ఈ నెల 16న ఆలస్యంగా పనికి వచ్చిన రామ్నాథ్పై శేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. బూతులు తిడుతూ చెప్పుతో కొట్టాడు. దీంతో ఇంటికి వచ్చిన రామ్‌నాథ్ జరిగిన విషయాన్ని భార్యకు చెప్పి బాధపడ్డారు. 17వ తేదీ రాత్రి కుటుంబ సభ్యులు అన్నం తిని నిద్రపోయారు. 18వ తేదీ ఉదయం 6 గంటలకు నిద్రలేచి చూడగా రామ్‌నాథ్ ఇంటి పైకప్పు రేకులకు లుంగీతో ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. అతన్ని కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెందాడు. మేస్త్రీ అసభ్యంగా తిట్టి, కొట్టడంతోనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కూలీ ఇంటికి రూ.లక్షల్లో కరెంట్ బిల్లు
సాక్షి, ఉరవకొండ: విడపనకల్లు మండల పరిధిలోని పాల్తూరు గ్రామంలో కరెంటు బిల్లుల మోత మోగుతోంది. విద్యుత్‌శాఖ అధికారుల నిర్లక్ష్యంతో సామాన్య రైతు, కూలీ కుటుంబాలకు లక్షల్లో కరెంటు బిల్లులు వస్తుండటంతో బాధితులు షాక్‌కు గురవుతున్నారు. గ్రామానికి చెందిన చెందిన సాధారణ కూలీ పర్వతప్పకు ప్రతి నెలా రూ.200 నుంచి రూ.300 బిల్లు వచ్చేది. కానీ జూన్‌కు సంబంధించిన బిల్లు ఏకంగా రూ.1,48,371 రావడంతో అవాక్కయ్యాడు. విద్యుత్‌శాఖ అధికారుల వద్దకు వెళ్ళి తనకు వచ్చిన కరెంట్ బిల్లు చూపించాడు. తాను కూలీ పనులకు వెళ్ళే వాడినని తన ఇంటోŠల్ రెండు బల్పులు, ఒక ఫ్యాను, టీవీ మాత్రమే ఉందని, ఇంత బిల్లు ఎలా వచ్చిందని ప్రశ్నించాడు. పర్వతప్పపై అధికారులు చివరికి కనికరం చూపి రూ.56,399 తగ్గించి మిగతా బిల్లు మొత్తం కట్టాలని అధికారులు సూచించారు. తాను కూలీ పనులకు వెళ్ళేవాడినని తాను ఇంత డబ్బు ఎలా కట్టగలలని కూలీ లబోదిబోమంటున్నాడు. అలాగే గ్రామానికి చెందిన బండయ్య అనే మరో కూలీకి చెందిన ఇంటికి కూడా రూ 16,251 రావడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదని వాపోతున్నాడు. వీరిద్దరికే కాదు ఇలా గ్రామంలో 15 మంది కూలీ కుటుంబాలకు అధిక సంఖ్యలో బిల్లులు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు. కొంతమేర బిల్లు తగ్గించాం పాల్తూరు గ్రామంలో సాంకేతిక సమస్య కారణంగానే కరెంటు బిల్లులు అధిక సంఖ్యలో బిల్లులు వచ్చాయి. దీంతో పాటు మీటర్లో ఏదైనా సమస్య ఉన్నా ఇలా జరుగుతుంది. అధిక సంఖ్యలో బిల్లు వచ్చిన వారికి కొంతమేర బిల్లులు తగ్గించాము. మిగతాది వారు చెల్లిస్తే సరిపోతుంది. – శ్రీనివాసరెడ్డి, ఏఈ, విద్యుత్‌శాఖ చదవండి: కలికిరి బ్యాంకు కుంభకోణంలో ఆసక్తికర విషయాలు -
6 రోజులవుతున్నా ఇంకా దొరకని అంతయ్య ఆచూకీ
-
వామ్మో.. బిహారి గ్యాంగ్ .. యజమాని బయటి రాష్ట్రాలకు వెళ్లడంతో..
సాక్షి, బనశంకరి(కర్ణాటక): యజమాని ఇంట్లో వెండి ఆభరణాలు దోచుకెళ్లిన బిహారీ ముఠాను కోరమంగల పోలీసులు అరెస్ట్‌చేశారు. వీరి వద్ద నుంచి రూ.20 లక్షల విలువచేసే 17 కేజీల వెండి వస్తువులు, మూడు విలువైన గడియారాలు, నాలుగు మొబైళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు చోటూకుమార్, రంజిత్‌కుమార్, పంకజ్‌కుమార్, గౌతమ్‌కుమార్. వీరు ఉపాధి కోసం బెంగళూరుకు చేరుకున్నారు. చోటుకుమార్ కోరమంగల బ్లాక్‌లో పారిశ్రామికవేత్త ఇంట్లో పనిచేసేవాడు. యజమాని బయటి రాష్ట్రాలకు వెళ్లిన సమయంలో చోటుకుమార్ ముగ్గురు స్నేహితులను పిలిపించి విలువైన వస్తువులను వారికి ఇచ్చి పంపాడు. యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తులో అసలు విషయం వెల్లడైంది. కుుమ్మక్కు అప్రయిజర్ అరెస్టు దొడ్డబళ్లాపురం: ఖాతాదారులు డూప్లికేట్ నగలు కుదువ పెట్టడానికి సహకరించిన అప్రయిజర్పై బ్యాంకు అధికారులు కేసు నమోదుచేశారు. ఈ సంఘటన కనకపుర తాలూకా హొన్నిగనహళ్లి కెనరా బ్యాంకులో చోటుచేసుకుంది. బ్యాంకులో 32 ఏళ్లుగా మలగూరు రాజన్న అప్రయిజర్‌గా పనిచేస్తున్నాడు. 352 మందికి ఇతని ద్వారా బంగారు నగల పరీక్షలు జరిపించి అసలైనవేనని తేల్చడంతో పెద్దమొత్తంలో రుణాలు ఇచ్చారు. ఎక్కువమంది రుణాలు చెల్లించకపోవడంతో అధికారులు అనుమానంతో నగలను పరీక్షించగా మొత్తం 81 మంది నకిలీ నగలు కుదువ పెట్టి డబ్బు కొట్టేశారని తేలింది. ఇందులో రాజన్న పాత్ర కూడా ఉండడంతో ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్టు చేశారు. -
రూ.6 లక్షలు మాయం, వాళ్లే తీసుకున్నారంటూ హైడ్రామా
సాక్షి, సుల్తాన్‌బజార్: సుల్తాన్‌బజార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి తన యజమాని డబ్బును పోలీసులు తీసుకున్నారని చెప్పడంతో తీవ్ర కలకలం రేగింది. అయితే ఈ విషయం మీడియాకు తెలియడంతో ఓ నకిలీ పోలీసు రూ.6 లక్షలు కాజేసినట్లు వైరలైంది. అయితే సుల్తాన్‌బజార్ పోలీసులు మాత్రం ఇది ఫేక్ అంటూ కొట్టిపడేస్తున్నారు. కోదాడకు చెందిన అమర్నాథ్రెడ్డి సొమ్ము రూ.6 లక్షలు పోయినట్లు తప్పుడు సమాచారం పోలీసులకు అందింది. డబ్బు పోయిందని డ్రామానా? రూ.6 లక్షలు తన డ్రైవర్ తండ్రి హన్మంతు ద్వారా కూకట్పల్లి నుంచి కోదాడకు తీసుకువెళ్తున్నారు. హన్మంతుకు డబ్బుపై ఆశ కలగడంతో డబ్బులను కోఠి ఆంధ్రా బ్యాంక్ చౌరస్తా వద్ద పోలీసుల తనిఖీల్లో పోలీసులు తీసుకున్నారని చెప్పడంతో అమర్నాథ్రెడ్డి సుల్తాన్‌బజార్ పోలీసులను వాకబు చేశారు. పోలీసులు కోఠి ఆంధ్రాబ్యాంకు చౌరస్తా వద్ద ఎలాంటి డబ్బు పట్టుకోలేదని తేల్చి చెప్పారు. ఈ విషయమై సుల్తాన్‌బజార్ ఇన్స్పెక్టర్ భిక్షపతిని వివరణ కోరగా తమకు ఈ విషయమై ఎలాంటి ఫిర్యాదు రాలేదని డబ్బుపై ఆశతోనే హన్మంతు నకిలీ పోలీసులంటూ డ్రామా ఆడుంటారని అభిప్రాయపడ్డారు. -
ప్రజల నిర్లక్ష్యం.. రోడ్లపై జీహెచ్ఎంసీ సిబ్బంది
రహమత్‌నగర్: ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి పేరు దుర్గయ్య. జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య విభాగంలో కామాటీగా విధులు నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం కామాటీ పని పక్కన పెట్టి రహదారులపై చెత్త వేయకుండా ఇలా కాపలా కాస్తున్నాడు. వాహనాలపై వచ్చి రోడ్లమీద, ఫుట్‌పాత్‌లపై చెత్త పడవేయకుండా అడ్డుకుంటున్నాడు. ప్రజల నిర్లక్ష్యం మూలంగా సిబ్బంది ఇలా రోజు కాపలా ఉండాల్సి వస్తోంది. సర్కిల్–19లోని రహమత్‌నగర్ డివిజన్ హెచ్‌ఎఫ్‌నగర్, కార్మికనగర్, శ్రీరాంనగర్ డంపింగ్ ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది చాలా మంది ఇలాగే కాపలా కాయాల్సి వస్తోంది. ప్రజలు ఇప్పటికైనా మేల్కొని..సామాజిక బాధ్యతతో వ్యవహరించి రోడ్లపై చెత్త వేయకుండా ఉండాలని, లేకుంటే మాకు రోజూ ఇలా కాపలా కాసే డ్యూటీ తప్పదని దుర్గయ్య వాపోయారు. రోగాలు వ్యాపిస్తున్న ఈ తరుణంలో అందరూ జాగ్రత్తగా ఉండాలన్నారు. ( చదవండి: అతి తెలివి అంటే ఇదే.. ఇళ్లంతా ఐరన్‌తోనే నిర్మాణం ) -
పనివాడితో పిల్ల ఏనుగు పోట్లాట..ఎవరు గెలిచారో?
జంతువులు చిన్న వయసులో ఉన్నప్పుడు ఎంత ముద్దొస్తాయో అవి చేసే చిలిపి పనులు కూడా అంతే ముద్దుగా ఉంటాయి. అవి పేరకే జంతువులు గానీ మనలో ఒకరిగి ఇమిడిపోయి జీవిస్తుంటాయి. మనతో పోట్లాడేందుకు, మనతో ఆడుతూ, మన ఆహారం లాక్కునేందుకు పోటీ పడుతూ.. ఇలా అవి చేసే ప్రతీ పని మనకు ఎంతో ఉల్లాసానిస్తుంటాయి. మన ఇళ్లలో పెంపుడు జంతువులను పెంచుకునే వాళ్లకు ఇదంతా అనుభవం ఉంటుంది. ఇలాంటి చిలిపి పనులు చేస్తున్న ఓ గున్న ఏనుగు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఎన్‌క్లోజర్‌లో పనిచేసే కార్మికుడిని ఓ గున్న ఏనుగు సరదాగా ఆటపట్టించింది. అతనితో మజాక్లు చేస్తూ, ఆ కార్మికుడిని పనిచేయనీకుండా అడ్డుకుంది. అన్ని చేస్తూ మళ్లీ తనకి ఏమీ తెలీదు నేను తల్లిచాటు పిల్లనంటూ పెద్ద ఎనుగు వెనకాలే నక్కింది. ఇలా ఆ పనివాడితో కాసేపే సరదాగా పోట్లాడుతూ, కిందపడేసి రెజ్లింగ్‌లో మాదిరిగా ఆతనిపై కాసేపు ఉండిపోయింది. చివరకు నేనే గెలిచానోచ్.. అంటూ పనివాడి పైనుంచి పైకి లేచింది. ఈ ముద్దొచ్చే వీడియోను గన్నుప్రేమ్ అనే వ్యక్తి ట్విట్టర్లో పోస్ట్ చేశారు.ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్ది సేపటికే 93 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. 11 వేలకుపైగా లైక్స్ వచ్చాయి. ఈ వీడియోను చూసిన పలువురు నెటిజన్లు ‘సో క్యూట్ గన్నూ’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ( చదవండి: ‘వావ్.. నేను ఇంత అందంగా ఉంటానా’ ) Affectionate Gannu wants to play with Hooman, but he is busy working Who will win? 🤭😝 pic.twitter.com/OFkr72FGKc — Gannuprem (@Gannuuprem) April 8, 2021 -
నా జుట్టు పట్టుకొని లాగి కొట్టారు!
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నకోలది భారతీయ జనాతా పార్టీ, తృణముల్ కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయాలు మరింత హీట్‌ను పుట్టిస్తున్నాయి. కాగా, ఇరుపార్టీలు ఏదో ఒక ఘటనతో ప్రతిరోజు వార్తల్లో నిలుస్తున్నాయి. తాజాగా, బీజేపీ పార్టీకి చెందిన ఒక కార్యకర్త ఇంటిపై తృణముల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంత మంది కార్యకర్తలు దాడిచేశారని ఒక మహిళ ఆరోపించింది. ‘తన భర్తను, నన్ను ఇద్దరిని ఇంటి నుంచి బయటకు లాగి కొట్టారని తెలిపింది. తమ కారును కూడా ధ్వంసం చేశారని వాపోయింది. అయితే, ఆదివారం జరిగిన ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సదరు మహిళ తెలిపింది. అయితే దీనిపై స్పందించిన తృణముల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చిత్తరంజన్ మండల్ ఈ ఆరోపణలను ఖండించాడు. ఈ ఘటనతో తమ వారికి ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నాడు. కాగా, వారు తమకారును తామే ధ్వంసం చేసుకుని కావాలనే తమపై బురదజల్లుతున్నారని మండిపడ్డారు. భారతీయ జనాతపార్టీ ప్రతి విషయాన్నిరాజకీయం చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. చదవండి: దెబ్బతిన్న పులి మరింత ప్రమాదకారి: దీదీ -
ఊపిరాడక కాంట్రాక్ట్ కార్మికుడి మృతి
సాక్షి, మల్కాపురం (విశాఖ పశ్చిమ): బొగ్గుపొడి పడడంతో ఊపిరాడక ఓ కాంట్రాక్టు కార్మికుడు చనిపోయాడు. ఈ దుర్ఘటన ఆలూ ఫ్లోరైడ్ సంస్థలో జరిగింది. గాజువాక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జీవీఎంసీ 59వ వార్డు పరిధి హిమచల్‌నగర్ కొండ ప్రాంతంలో బమ్మిడి వాసు (50) తన భార్య, కుమారుడు నాగరాజు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నారు. 58వ వార్డు పరిధి ములగాడ విలేజ్ ప్రాంతంలోని ఆలూ ఫ్లోరైడ్ సంస్థలో నాగరాజు కాంట్రాక్ట్ పనులు చేస్తున్నాడు. అతని వద్ద హెల్పర్‌గా వాసు పని చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో విధుల్లో భాగంగా శనివారం ఉదయం 5 గంటలకు వాసు సంస్థ ఆవరణలో హాట్ ఎయిర్ జనరేటర్ డిపార్టమెంట్ సమీపంలోని స్టాగ్ వద్ద పని చేస్తున్నాడు. ఆ సమయంలో స్టాగ్‌లో బొగ్గుపొడి కొలిచే (అల్యూమినియం మరిగించేందుకు వాడే బొగ్గు పొడి) తూనిక స్కేల్ (ఇనుప రాడ్) స్టాగ్ రంధ్రంలో పడిపొయింది. ఆ రాడ్డును తీసేందుకు వాసు ఉదయం 7 గంటల సమయంలో అందులోకి దిగాడు. ఆ సమయంలో బొగ్గుపొడి భారీగా అతనిపై పడిపోవడంతో ఊపిరి ఆడక మృతిచెందాడు. తండ్రిని ఆ యూనిట్ నుంచి వెలుపలకు తీసేందుకు సమీపంలో ఉన్న కుమారుడు నాగరాజు యత్నించినా ప్రయోజనం లేకపోయింది. విషయం తెలుసుకున్న గాజువాక పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. మరోవైపు వైఎస్సార్సీపీ వార్డు అధ్యక్షుడు గులిగిందల కృష్ణ, ములగాడ గ్రామం అధ్యక్షుడు ధర్మాల వేణుగోపాలరెడ్డి జరిగిన ప్రమాదాన్ని వైఎస్సార్సీపీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మళ్ల విజయప్రసాద్‌కు తెలియజేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని కోరారు. దీంతో ఆలూ ఫ్లోరైడ్ సంస్థ యాజమాన్యంతో మళ్ల విజయప్రసాద్ మాట్లాడి మృతుని కుటుంబానికి రూ.21 లక్షల పరిహారం ఇప్పించేలా ఒప్పించారు. విషయం తెలుసుకున్న ములగాడ తహసీల్దార్ బీవీ రమణి, జీవీఎంసీ 59, 60వ వార్డుల వైఎస్సార్సీపీ కార్పొరేటర్ అభ్యర్థులు పుర్రె సురేష్‌యాదవ్, పీవీ సురేష్ ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. కొడుకు కాంట్రాక్టు పనులు చేస్తుండడంతో తోడుగా ఉందామని పనికెళ్లిన తండ్రి మృతితో హిమాచల్నగర్లో విషాదం నెలకొంది. -
200 కిమీ నడక.. మధ్యలోనే ఆగిన ఊపిరి
భోపాల్ : కూటికోసం పొట్ట చేతపట్టుకుని దేశ రాజధాని ఢిల్లీకి వచ్చిన ఓ కార్మికుడు (39) లాక్డౌన్ కారణంగా మరణించాడు. ఢిల్లీ నుంచి మధ్యప్రదేశ్‌కు కాలిబాటన వెళ్తున్న ఓ వలస కార్మికుడు మార్గం మధ్యలోనే కన్నుమూశాడు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన విధించిన విషయం తెలిసిందే. దీంతో ఎక్కడివారు అక్కడ చిక్కుకుపోయారు. ముఖ్యంగా ఉపాధి కోసం ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్లిన కార్మికుల పిరిస్థితి అగమ్యగోచరంగా మారింది. విదేశాల్లో చిక్కుకున్న వారికి ప్రత్యేక విమానాలు పంపుతున్న భారత ప్రభుత్వం.. స్థానిక ప్రజలపై మాత్రం కనికరం చూపలేదు. ఈ నేపథ్యంలో లాక్డౌన్ కారణంగా ఢిల్లీ నుంచి మధ్యప్రదేశ్‌కు కాలి నడకన బయలుదేరిన ఓ కార్మికుడు ఆలసిపోయి మార్గం మధ్యంలో ఆగ్రా సమీపంలో మృత్యువాత పడ్డాడు. (క్షమాపణలు కోరిన ప్రధాని మోదీ) స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌కు చెందిన రణ్‌వీర్‌సింగ్ అనే కార్మికుడు ఉపాధికోసం ఢిల్లీకి వలసవెళ్లాడు. అక్కడ ఓ ప్రముఖ రెస్టారెంట్లో డెలివరీ బాయ్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలో కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధించారు. రెస్టారెంట్‌ను మూసివేయక తప్పలేదు. దీంతో రోజగడవడం కష్టంగా మారింది. ఈ క్రమంలోనే తన స్వస్థలం మొరీయానాకు బయలుదేరాలని నిర్ణయించుకున్నాడు. అయితే వాహనాలు లేకపోవడంతో శుక్రవారం కాలి నడకన బయలుదేరాడు. దాదాపు 200 కిలోమీటర్లు నడిసిన అనంతరం తీవ్రమైన ఛాతీ నొప్పితో కైలాష్ సమీపంలో జాతీయ రాజధాని 2పై కుప్పకూలాడు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు రణ్వీర్ను ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసేలోనే ఆయన మృతి చెందాడు. చివరి నిమిషంలో ఆయన సోదరుడుతో మాట్లాడానికి ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. (లాక్డౌన్ ఉల్లంఘనులకు వినూత్న శిక్ష) కాగా అతని ఫోన్ కాల్స్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని, మృతుడిని స్వస్థలంకు పంపే ఏర్పాటు చేస్తున్నామని పోలీసు అధికారి సికిందర్ తెలిపారు. కాగా దేశ వ్యాప్త లాక్డౌన్ కారణంగా చాలా చోట్ల కార్మికులు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఒడిశా, గుజరాత్, మధ్యప్రదేశ్, బిహార్‌కు చెందిన భవన నిర్మాణ కార్మికులు పలు ప్రాంతాల్లో ఉండిపోయారు. నెత్తి మీద ఒక మూట, చంకలో పిల్ల, రెండు చేతుల నిండా పెద్ద పెద్ద బ్యాగుల్లో సామాన్లతో వలస కార్మికులు నడుస్తున్న దృశ్యాలు అన్నిచోట్లా కనిపిస్తున్నాయి. కొంతమంది కనీసం తిండిలేక అలమటిస్తున్నారు. మరికొందరు మాత్రం వందల కిలోమీటర్లు కుంటుంబంతో సహా నడుచుకుంటూ స్వస్థలాలకు చేరుతున్నారు. తెలంగాణలోనూ పలువురు కార్మికులు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. వారందరినీ ఆదుకుంటామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. (వెల్లువలా వలసలు) -
షిప్పింగ్ కంపెనీలో పని చేసేందుకు వెళ్లి..
-
నిన్న కార్మికురాలు.. నేడు అధికారి
సాక్షి, చెన్నై: నిన్నటి వరకు బాణసంచా పరిశ్రమలో తండ్రితో కలిసి చేదోడు వాదోడుగా ఉన్న కార్మికురాలు, మరికొన్ని రోజుల్లో ›గ్రూప్–1 అధికారి కాబోతున్నారు. గ్రూప్–1 ఫలితాల్లో ఆ కార్మికురాలు రాష్ట్రంలోనే టాప్–4 స్థానంలో నిలవడం విశేషం. ఇక, ఈ ఫలితాల్లో మహిళల హవా సాగింది. రాష్ట్రంలో ప్రతి ఏటా పట్టభద్రుల సంఖ్య పెరుగుతూనే ఉన్న విషయం తెలిసిందే. ప్రైవేటు ఉద్యోగాల కోసం ఓ వైపు, ప్రభుత్వ ఉద్యోగాల కోసం మరో వైపు అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు నిరుద్యోగులు తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇక, రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీల భర్తీ నిమిత్తం టీఎన్పీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే చాలు లక్షల్లో దరఖాస్తులు దాఖలు కావడం తథ్యం. ఆ దిశగా గత ఏడాది సబ్ కలెక్టర్, డీఎస్పీ సహా ఎనిమిది రకాల పోస్టుల భర్తీకి టీఎన్పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. 181 పోస్టులకు రెండు లక్షల 29 వేల మంది దరఖాస్తులు చేసుకుని పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 9,442 మంది మెయిన్‌కు అర్హత సాధించారు. వీరిలో ప్రస్తుతం 363 మంది ప్రత్యక్ష ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు. టాప్–10లో ఎనిమిది మంది మహిళలకు చోటు దక్కింది. మొదటి ఆరు ర్యాంకులు మహిళల ఖాతాలో పడ్డాయి. ఈ ఫలితాలను టీఎన్పీఎస్సీ వెబ్సైట్లో పొందుపరిచారు. ఇందులో శివగంగైకు చెందిన ఐటీ ఉద్యోగి అర్చన తొలిస్థానాన్ని దక్కించుకున్నారు. ఐటీ ఉద్యోగాన్ని పక్కన పెట్టి మరీ గ్రూప్ –1 పరీక్ష కోసం తానుపడ్డ శ్రమకు ఫలితం దక్కిందని అర్చన ఆనందం వ్యక్తం చేశారు. సబ్ కలెక్టర్ కావాలన్నదే తన లక్ష్యంగా పేర్కొన్నారు. ఇక, చెన్నైలోని ప్రముఖ సంస్థలో శిక్షణ పొందిన యురేకా అనే మహిళ రెండో స్థానంలో, ప్రస్తుతం డీఎస్పీగా ఉన్న ధనలక్ష్మి మూడో స్థానంలో నిలిచారు. అయితే, నాలుగో స్థానాన్ని దక్కించుకున్న మహా లక్ష్మి ప్రస్తుతం అందరి దృష్టిలో పడ్డారు. బాణసంచా తయారీలో మహాలక్ష్మి బాణసంచా కూలీ నుంచి.. విరుదునగర్ జిల్లా తిరుకులై గ్రామానికి చెందిన గురుస్వామి, రాజ్యలక్ష్మి దంపతుల కుమార్తె మహాలక్ష్మి. ఈ కుటుంబం కడు పేదరికంలో ఉంది. తల్లిదండ్రులు ఇద్దరు బాణసంచా పరిశ్రమలో కూలీలు. బాణసంచా తయారీ పరిశ్రమలో పీస్ రేటుకు ఇచ్చే వేతనమే ఆ కుటుంబానికి పోషణ. అయినా, ఆ కుటుంబంలోని మహాలక్ష్మి చదువుల తల్లి సరస్వతిగా మారింది. పట్టువదలకుండా ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలలో చదువుకుంది. అంతే కాదు, తల్లిదండ్రులతో కలిసి బాణసంచా తయారీలో కార్మికు రాలిగా కూడా పనిచేసింది. ఇప్పుడు ఆమె పడ్డ శ్రమకు, నేర్చుకున్న విద్యకు తగిన ఫలితం తగ్గింది. గ్రూప్ –1లో ఆమె టాప్ –4 స్థానాన్ని దక్కించుకున్నారు. తనకు ర్యాంకు రావడంతో మహాలక్ష్మి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగంలో చేరడం లక్ష్యంగా ఇప్పటికే రెండు సార్లు తాను టీఎన్పీఎస్సీ పరీక్షలు రాయడం జరిగిందని, ఇది మూడోసారిగా పేర్కొన్నారు. చదివించేందుకు తన తల్లిదండ్రులు పడ్డ కష్టానికి ఫలితం దక్కిందని ఉద్వేగానికి లోనయ్యారు. -
నాడు గల్ఫ్ కార్మికుడు.. నేడు జెడ్పీటీసీ సభ్యుడు
సాక్షి, మోర్తాడ్(బాల్కొండ): నిన్నటి వరకు గల్ఫ్ కార్మికుడిగా కొనసాగిన గుల్లె రాజేశ్వర్ నేటి నుంచి ఏర్గట్ల మండల తొలి జెడ్పీటీసీ సభ్యుడిగా పదవీ బాధ్యతలను స్వీకరించారు. జీవనోపాధి కోసం ఎన్నో ఏళ్ల పాటు గల్ఫ్‌లో పని చేసిన గుల్లె రాజేశ్వర్ తనకు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జెడ్పీటీసీ సభ్యుడిగా ఎంపికయ్యాడు. అంతేకాక జిల్లా పరిషత్‌లో కాంగ్రెస్ పార్టీ తరపున ఫ్లోర్ లీడర్‌గా బాధ్యతలను నిర్వహించడానికి పార్టీ అధిష్టానం అవకాశం కల్పించింది. ఏర్గట్లకు చెందిన రాజేశ్వర్ సాధారణ రైతు కుటుంబంలో జన్మించాడు. వ్యవసాయం ఉన్నా ఉపాధి కోసం 2002లో గల్ఫ్ పయనం అయ్యాడు. అక్కడ ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో కూలీగా చేరిన రాజేశ్వర్ తన వృత్తి నైపుణ్యంతో సూపర్వైజర్ స్థాయికి ఎదిగాడు. తాను ఆర్థికంగా స్థిరపడడంతో పాటు పది మందికి పని కల్పిం చాలనే ఉద్దేశంతో ఎంతో కష్టపడి 2010లో స్నేహితులు, బంధువుల సహకారంతో సప్లయింగ్ కంపెనీని కువైట్‌లో ప్రారంభించాడు. మరామిష్ జనరల్ ట్రేడింగ్ కాంట్రాక్టింగ్ కంపెనీని స్థాపించి వందలాది మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగాడు. కువైట్‌లో తన కంపెనీ సక్సెస్ కావడంతో ఇటీవల దుబాయ్ లో కూడా మరో కంపెనీని స్నేహితుల భాగస్వామ్యంతో ప్రారంభించాడు. అయితే కువైట్‌లో ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ గల్ఫ్ విభాగం బాధ్యతలను స్వీకరించి సేవా కార్యక్రమాలను కొనసాగించాడు. కువైట్‌లో క్షమాభిక్ష అమలు జరిగిన సమయంలో ఎంతో మంది ఖల్లివెల్లి కార్మికులు ఇళ్లకు చేరుకోవడానికి విమాన టిక్కెట్లను కాంగ్రెస్ పార్టీ నాయకుల సహకారంతో అందించి పార్టీలో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. దీంతో అతని సేవలను ఆ పార్టీ అధిష్టానం గుర్తించింది. ఏర్గట్ల జెడ్పీటీసీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయడానికి అవకాశం కల్పించగా ఆయనను జెడ్పీటీసీ పదవి వరిం చింది. జెడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికైన రాజేశ్వర్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయడంతో పాటు జిల్లా పరిషత్‌లో పార్టీ ఫ్లోర్ లీడర్‌గాను వ్యవహరించే అవకాశాన్ని దక్కించుకున్నారు. -
నాడు కార్మికుడు.. నేడు యజమాని
సాక్షి, రాజేంద్రనగర్: పదవ తరగతి పాసై ఉన్నత విద్యకు నోచుకోక ఆ యువకుడు పరిశ్రమలో కార్మికుడిగా చేరాడు. ఒకపక్క పని చేస్తూనే మరోపక్క తాను పరిశ్రమను నెలకొల్పి నలుగురికి ఉపాధి కల్పించాలని ఆలోచించేవాడు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు నానా కష్టాలు పడ్డాడు. పైసాపైసా కూడబెట్టి చిన్న ప్లాస్టిక్ పరిశ్రమను స్థాపించాడు. అంచలంచలుగా ఎదుగుకుంటూ నేడు 40 కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నాడు. మైలార్‌దేవ్‌పల్లి లక్ష్మిగూడ ప్రాంతానికి చెందిన అడికే మారప్ప, కమలమ్మలకు ముగ్గురు కుమారులు, ఒక కూతురు. రెండవ కుమారుడైన అడికే అర్జున్ 10వ తరగతి వరకు పాతబస్తీలోని రాఘవేంద్ర స్కూల్లో అభ్యసించాడు. వేసవి సెలవుల్లో కాటేదాన్ పారిశ్రామికవాడల్లోని పరిశ్రమల్లో పని చేసేవాడు. ఇలా ప్లాస్టిక్ పరిశ్రమలో పని చేస్తూ యజమాని మెప్పుపొందాడు. సెలవులు, ఆదివారాల్లో పరిశ్రమకు వెళ్లి పని చేసి వచ్చేవాడు. పదవ తరగతి అనంతరం ఉన్నత విద్యా చదువుకోవాలన్న కోరిక ఉన్నప్పటికీ కుటుంబ పరిస్థితుల కారణంగా పరిశ్రమలో చేరాడు. పని చేస్తూనే తాను కూడా పరిశ్రమను నెలకొల్పి నలుగురికి ఉపాధి కల్పించాలని అనుకున్నాడు. ఇలా తనకు వచ్చే జీతంలో కొంత భాగం పక్కనపెట్టి ఆ డబ్బుతో చిన్న ప్లాస్టిక్ పరిశ్రమను స్థాపించాడు. నలుగురితో ప్రారంభించిన ఆ పరిశ్రమ నేడు 40 మందితో కోనసాగుతోంది. రిసైక్లింగ్ ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను ప్రస్తుతం తయారు చేసి విక్రయిస్తున్నారు. ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా తనవంతు కృషి చేస్తున్నాడు. పని చేసిన పరిశ్రమలో నేర్చుకున్న మెలకువలతో నేడు అదే పరిశ్రమను స్థాపించి నిలదొక్కుకున్నాడు. సంఘ సేవకుడిగా... అడికే అర్జున్ సంఘ సేవకుడిగానూ గుర్తింపు పొందాడు. యువజన సంఘాలతో పాటు స్థానికంగా పేరు సంపాదించాడు. గత రెండు సంవత్సరాలుగా రాజేంద్రనగర్ సర్కిల్ మహాత్మా జ్యోతిరావుపూలే జయంతోత్సవ కమిటీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. ఇబ్బందుల్లో ఉన్నామని ఎవరూ వచ్చిపా తన స్థాయికి అనుగుణంగా సహాయం చేస్తూ పేరు తెచ్చుకున్నాడు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నా ప్లాస్టిక్ పరిశ్రమ నెలకొల్పినప్పటికీ తనవల్ల పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా తన వంతు సహాయ, సహకారాలను ఎప్పటికప్పుడు అందజేస్తున్నాడు. హరితహారం కార్యక్రమం పాల్గొని మొక్కలను నాటడంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకున్నాడు. దూరప్రాంతాలకు వెళ్లిన సమయంలో తాను సేకరించిన అన్ని రకాల విత్తనాలను అడవుల్లో చల్లుతూ మొక్కలు మొలిచేవిధంగా పాటుపడుతున్నాడు. వర్షాకాలం మొదలై వర్షాలు ప్రారంభం కాగానే వీటిని చల్లుతానని తెలిపాడు. గత రెండు సంవత్సరాలుగా కొత్తగా విత్తన బాల్స్‌ను తయారు చేసి అడవులు, ఇతర గుట్టల్లో వేస్తున్నట్లు వివరించాడు. – అడికే అర్జున్ -
‘ఉపాధి’ ఊసేది!
సాక్షి, ధరూరు: వలసలను నివారించి ఉన్న ఊళ్లోనే ఉపాధి పనులు కల్పించాలనే సంకల్పంతో ప్రారంభమైన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు ఆ శాఖ అధికారులు తీరు కారణంగా నీరుగారిపోతోంది. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఉపాధి హామీ పనులు జోరుగా సాగుతుండగా.. మండలంలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ముందు నుంచి ఆ శాఖ అధికారులు మండలంలో కూలీలకు పనులు కల్పించడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. అసలే వర్షాలు లేక ఇళ్ల ఉంటున్నామని, దీంతో జీవనోపాధికి ఇబ్బందిగా ఉందని ఉపాధి పనులు ప్రారంభించాలని అధికారులను కోరుతున్నా పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల ఉపాధి కూలీలు ఆరోపిస్తున్నారు. మండలంలో ఇదీ పరిస్థితి... మండలంలో మొత్తం 28 పంచాయతీలకు గాను 18 వేల జాబ్ కార్డులు ఉన్నాయి. గ్రామాల్లో నామమాత్రంగా పనులు కల్పింస్తున్నారు. కూలీలకు పూర్తిస్థాయిలో పనులు కల్పించాలనే ఆలోచన కలగడం లే దు. 28 పంచాయతీలకు గాను దాదాపు స గం గ్రా మాల్లో పనులు జరగడం లేదు. పనులు కల్పించాలని ఉపాధి ఏపీఓను, ఫీల్డ్ అసిస్టెంట్లను కోరుతున్నా.. పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నా యి. వర్షాలు కురవకపోవడంతో కూలీలు ఇళ్లలో ఉంటున్నారు. కనీసం ఉపాధి పనులైనా కల్పిస్తే జీవనం గడుస్తుందని కూలీలు భావిస్తున్నారు. కలెక్టర్‌ను కలిసేందుకు.. ఉపాధి పనులు ప్రారంభించాలని రెండు నెలలుగా ఈజీఎస్ అధికారులను కోరుతున్నా.. ప్రారంభం చేయడం లేదని కోతులగిద్ద, అల్వాలపాడు, మైలగడ్డ గ్రామాల కూలీలు ఆరోపిస్తున్నారు. వర్షాలు లేక పనులు దొరక్క ఇబ్బందులు పడుతున్నామని పలుమార్లు, ఈజీఎస్ ఏపీఓ అనిల్, ఎంపీడీఓ జబ్రాను కోరుతున్నా వారి నుంచి ఎలాంటి స్పందన రావడం లేదని ఆరోపిస్తున్నారు. రేపు మాపు అంటూ పబ్బం గడుపుతున్న అధికారుల తీరును నిరసిస్తూ.. జిల్లా కేంద్రంలో నిర్వహించే ప్రజావాణిలో కలెక్టర్‌ను కలిసి తమ గోడును చెబుతామని కూలీలు వాపోతున్నారు. ఎమ్మెల్యే హెచ్చరించినా.. గత నెలలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఉపాధి అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. పనులు కల్పించకపోతే ఎదురయ్యే పరిణామాలకు తాము బాధ్యులం కాదని హెచ్చరించినా.. వారిలో మార్పు రావడం లేదు. కార్యాలయానికి వచ్చి కేవలం హాజరు వేసుకుని వెళ్తున్న ఆ శాఖ అధికారులకు నిద్ర మత్తు వీడడం లేదని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో.. వరుస ఎన్నికల నేపధ్యంలో కేవలం ఉపాధి శాఖలో మాత్రమే నిధులు ఉన్నాయని, కొన్ని వందల రకాల పనులు కల్పించే అవకాశాలు ఉన్నా.. ఎందుకు పనులు కల్పించడం లేదో అర్థం కావడంలేదని వారి తీరుపై సభలోనే ఎమ్మెల్యే గట్టిగా హెచ్చరించారు. కానీ ఈజీఎస్ అధికారులు మాత్రం పాత పద్ధతినే అవలంభిస్తున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదు నెల రోజులుగా ఉపాధి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. రేపు మాపు అంటూ కాలయాపన చేస్తున్నారు. గ్రామంలో పనులు లేక జీవనోపాధికి ఇబ్బందిరంగా ఉంది. ఈసారి వర్షాలు కురవలేదు. మున్ముందు ఇంకెన్ని ఇబ్బందులు పడాలో తెలియడం లేదు. ప్రజావాణిలో కలెక్టర్‌ను కలిసి గోడును వెళ్లబోసుకోవాలనుకుంటున్నాం. – సారంబండ వెంకటేష్, కోతులగిద్ద -
న్యాయం చేయకపోతే దూకేస్తా...
పాల్వంచ: కేటీపీఎస్‌లో నిర్మాణ కార్మికుడిగా పనిచేసిన తనను ఆర్టిజన్‌గా తీసుకోకపోవడంతో ఆవేదన చెందిన కార్మికుడు, విద్యుత్ టవర్ లైన్ ఎక్కాడు. పట్టణంలోని కరకవాగు గ్రామానికి చెందిన గుగులోతు శ్రీను, గురువారం స్థానిక కేటీపీఎస్ 7వ దశలోని 400 కేవీ విద్యుత్ లైన్ ఎక్కాడు. తాను కేటీపీఎస్ 6వ దశ నిర్మాణంలో, భూపాలపల్లి కర్మాగారంలో, కేటీపీఎస్ 7వ దశలో ఏళ్లతరబడి నిర్మాణ కార్మికుడిగా పనిచేశానని, తనను ఆర్టిజన్ కార్మికుడిగా అధికారులు గుర్తించడం లేదని, తనకు న్యాయం చేయకపోతే దూకి చనిపోతానంటూ గురువారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో విద్యుత్ టవర్ ఎక్కాడు. పట్టణ అదనపు ఎస్ఐ రవి, ఎస్పీఎఫ్ ఎస్ఐ తిరుపతి చేరుకున్నారు. సీఈ సమ్మయ్యతో ఎస్ఐ రవి మాట్లాడారు. గుగులోతు శ్రీనుతో సెల్ ఫోన్లో సీఈ మాట్లాడారు. జెన్కో సీఎండీ ప్రభాకర్ రావును కల్పించి సమస్య పరిష్కరిస్తానని సీఈ హామీ ఇవ్వడంతో శ్రీను శాంతించి, సాయంత్రం 5.30 గంటల సమయంలో టవర్ లైన్ పైనుంచి కిందకు వచ్చాడు. తనకు సంబంధం లేని కేసులో ఇరికించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ ఈ నెల 22న ఓ యువకుడు (షల్‌మోహన్ నరేష్ బాబు) కూడా విద్యుత్ టవర్ లైన్ ఎక్కిన విషయం పాఠకులకు గుర్తుండే ఉంటుంది. ఐదు రోజుల వ్యవధిలో అదే ప్రాంతంలోని మరో విద్యుత్ టవర్ లైన్‌ను శ్రీను ఎక్కాడు. -
నరకయాతన
అనంతపురం, మడకశిర: మడకశిర పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్లో పాత ఇళ్ల కూల్చివేత సందర్భంగా కూలీపైకి గోడ కూలబడింది. శిథిలాల మధ్యన ఇరుక్కుపోయిన కూలీ దాదాపు మూడు గంటలపాటు నరకయాతన అనుభవించాడు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు శ్రమించి ఎట్టకేలకు అతడిని రక్షించారు. వివరాలిలా ఉన్నాయి. అంబేద్కర్ సర్కిల్లో బుధవారం పాత భవనాల కూల్చివేత పనులకు కొందరు కూలీలు ఉపక్రమించారు. డ్రిల్లింగ్ మిషన్, సుత్తిల ద్వారా భవనాన్ని బద్దలుకొడుతున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మెట్లపై ఉండి పని చేస్తున్న గుడిబండ మండలం ఎస్ఎస్ గుండ్లు గ్రామానికి చెందిన నాగప్ప అనే కూలీపైకి ఒక్కసారిగా పైకప్పు పడింది. మధ్యలో ఇరుక్కుపోయిన నాగప్ప ఎటూ రాలేని పరిస్థితి. ఓ వైపు భారీ బరువు ధాటికి నొప్పితో విలవిలలాడుతూ ఆర్తనాదాలు చేశాడు. ప్రమాద విషయం తెలియగానే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. జేసీబీలు, క్రేన్లు తెప్పించి తోటికూలీల సహకారంతో శిథిలాల తొలగింపు చేపట్టారు. మధ్యాహ్నం 3.30 తర్వాత నాగప్పను సజీవంగా బయటకు తీసుకొచ్చారు. కాళ్లు తీవ్రగాయాలు కావడంతో వెంటనే ఆయన్ను హిందూపురం తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారని ఎస్ఐ గోపీయాదవ్ తెలిపారు. -
మోదీ ఐడియా.. సెటిలైన కాంగ్రెస్ నేత!
గాంధీనగర్, గుజరాత్ : ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది ఒక టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘పకోడాలు (పకోడీలు) అమ్ముకోవడం కూడా ఉద్యోగమే’ అన్న సంగతి తెలిసిందే. అయితే మోదీ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శించింది. కానీ నేడు మోదీ ఇచ్చిన ‘పకోడా ఐడియా’నే ఒక కాంగ్రెస్ కార్యకర్త జీవితాన్ని మార్చేసింది. వడోదరకు చెందిన నారాయణభాయ్ రాజ్‌పుత్ హిందీ లిటరేచర్‌లో పోస్టు గ్రాడ్యూయేట్. కాంగ్రెస్ పార్టీకి వీరాభిమాని. ఎన్ఎస్యూఐలో కార్యకర్తగా చేరి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నాడు. అయితే పీజీ చేసిన నారాయణభాయ్ నిరుద్యోగి. మోదీ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూను అతడు కూడా చూశాడు. మోదీ చెప్పిన ‘పకోడా ఐడియా’ అతనికి బాగా నచ్చింది. పనిపాటా లేకుండా ఖాళీగా ఉండటం కంటే పకోడా బిజినెస్ చేయడం మంచిదని భావించాడు. తొలుత ఒక స్టాల్‌తో ప్రారంభమైన నారాయణభాయ్ పకోడా వ్యాపారం నేడు మొత్తం 35శాఖలుగా, వడోదర నగరమంతా విస్తరించింది. ఈ విషయం గురించి నారాయణభాయ్ ‘ప్రధాని ‘పకోడా బిజినెస్ ఐడియా’ విన్న తర్వాత నేను ఎందుకు ఆ మార్గంలో వెళ్లకూడదు అనుకున్నాను. నిరుద్యోగిగా ఉండటం కంటే పకోడా అమ్మి రోజుకు కనీసం 200 రూపాయలు సంపాదించడం మంచిదే కదా అనిపించింది. అందుకే ఒకసారి ప్రయత్నించి చుద్దామని భావించాను. మొదట 10 కేజీల పదార్థాలతో, 100 గ్రాముల పకోడా ఒక్కొక్కటిగా 10 రూపాయలుగా ఒక స్టాల్‌ను ప్రారంభించాను. నేడు నగరవ్యాప్తంగా నా పకోడా స్టాల్స్ 35 ఉన్నాయి. ప్రతిరోజు 500 - 600 కేజీల పకోడాలు అమ్ముతున్నాను’ అని తెలిపాడు. వ్యాపారం ప్రారంభించిన రెండు నెలల్లోనే నారాయణభాయ్ ‘పకోడా బిజినెస్’కు మంచి పేరు వచ్చింది. నారాయణభాయ్ రోజు ఉదయం 7 - 11 గంటల వరకూ అలానే సాయంత్రం కూడా ఇదే సమయంలో పకోడాను అమ్ముతుంటాడు. -
మున్సిపల్ కార్మికురాలికి అభినందన
మెట్పల్లి: చెత్త కుప్పలో దొరికిన రూ.1.20లక్షలను పోగొట్టుకున్న వ్యక్తికి ఇచ్చి నిజాయితీని చాటుకున్న మున్సిపల్ పారిశుధ్య కార్మికురాలు మద్దెల లక్ష్మిని గురువారం పలువురు అభినందించారు. మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ మర్రి ఉమారాణి, కమీషనర్ అయాజ్లు, బీసీ సంఘం నాయకులు అందె మారుతి, బొడ్ల రమేశ్‌లు సన్మానించారు. అలాగే 9వార్డులో కౌన్సిలర్ గైనీ లావణ్యతో పాటు స్థానికులు లక్ష్మీ దంపతులను అభినందించారు. -
మంచి నీరనుకుని..
ఇంకొల్లు: స్థానిక ఓ ప్రైవేట్ స్పిన్నింగ్ మిల్లులో కార్మికుడు మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం జరిగింది. ఎస్ఐ వి.రాంబాబు కథనం ప్రకారం.. చినగంజాం మండలం సంతరావూరు గ్రామానికి చెందిన నల్లమల శ్యాంసన్ (58) స్థానిక స్పిన్నింగ్ మిల్లులో కొంతకాలంగా పని చేస్తున్నాడు. రోజూ మాదిరిగానే మిల్లుకు వచ్చిన శ్యాంసన్ అన్నం తినే సమయంలో మంచినీరనుకుని బాటిల్లో ఉన్న యాసిడ్ తాగాడు. బాధితుడిని వెంటనే స్థానిక ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్యాంసన్ మృతి చెందాడు. మృతుడి భార్య రమణమ్మ ఫిర్యాదు మేరకు ఎస్ఐ వి.రాంబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలాన్ని ఇంకొల్లు సీఐ ఎం.శేషగిరిరావు పరిశీలించి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం చీరాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
హైకోర్టు జోక్యంతో కార్మికుడికి న్యాయం
సాక్షి, హైదరాబాద్: ఓ కాంట్రాక్టర్ కింద విద్యుత్ శాఖలో పనిచేస్తూ ప్రమాదంలో చేయి కోల్పోయిన ఓ కార్మికునికి హైకోర్టు ఆదేశాలతో గౌరవప్రదమైన వేతనం దక్కింది. మొదట ఆ కార్మికునికి నెలకు రూ.5 వేలు చెల్లిస్తామని తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) ప్రతి పాదించగా, దానికి హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అతనికి కనీస వేతనం ఇచ్చే విషయాన్ని మరోసారి పరిశీలించాలని ఆదేశించింది. దీంతో టీఎస్ఎస్పీడీసీఎల్ అధికారులు ఆ కార్మికునికి నెలకు రూ.12 వేల వేతనాన్ని చెల్లిస్తామని కోర్టుకు నివేదించారు. సంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు, అధికారులపై ఆ కార్మికుడు దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్‌ను మూసివేసింది. శుక్రవారం ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్ శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన పి.వెంకటేశ్వర్లు ఓ కాంట్రాక్టర్ కింద విద్యుత్ సంస్థలో కార్మికునిగా పనిచేస్తూ, విధి నిర్వహణలో 2011లో కుడిచేతిని పూర్తిగా కోల్పోయాడు. తనకు ఉపాధి చూపాలని కోరి నా అధికారులు స్పందించకపోవడంతో 2013 లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. వెంకటేశ్వర్లు పిటిషన్‌ను కొట్టేశారు. వెంకటేశ్వర్లు ధర్మాసనం ముందు అప్పీల్ చేయగా.. జస్టిస్ నాగార్జునరెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం అతని పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని టీఎస్ఎస్పీడీసీఎల్కు స్పష్టం చేసింది. అయితే అధికారులు స్పందించడం లేదని వెంకటేశ్వర్లు కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశాడు. -
రెండు యూనిట్ల బిల్లు రూ.10వేలు
బలిజిపేట: విద్యుత్ శాఖ సిబ్బంది ఓ రిక్షా కార్మికుని ఇంటికి ఇచ్చిన విద్యుత్ బిల్లు అక్షరాలా రూ.పది వేలు. దీన్ని చూసిన ఆ కార్మికుడు నిజంగానే షాక్‌కు గురయ్యాడు. బిల్లులో వాడిన యూనిట్లు రెండుగా చూపి..బిల్లు మాత్రం రూ.పది వేలుగా చూపడంతో ఆ ఇంటి యజమాని కంగుతిన్నాడు. వివరాల్లోకి వెళ్తే...పలగర గ్రామానికి చెందిన రిక్షా కార్మికుడు నులక పెంటయ్య ఇంటికి ఫిబ్రవరి నెలకు సంబంధించి విద్యుత్ బిల్లు రూ.10,357లు వచ్చింది. దీంతో యజమాని అవాక్కయ్యాడు. పెంటయ్య పలగర ఎస్సీ కాలనీలో నివాసముంటున్నాడు. ఆ రిక్షా కార్మికుని ఇంట్లో రెండు బల్బులు, ఒక ఫ్యాన్, టీవీ ఉన్నాయి. రిక్షా కార్మికుడు కావడంతో ఉదయం సాయంత్రం వరకు రిక్షాతో పాటు ఆయన బయటే ఉంటారు. ఫిబ్రవరి నెలలో కుటుంబ సభ్యులు కూడా వలసపోవడంతో ఒక్కడే ఉంటున్నాడు. పెంటయ్య సర్వీసు నంబరు 354 కాగా వచ్చిన బిల్లు రూ.పది వేలు దాటిపోవడంతో లబోదిబోమంటున్నాడు. ఆ బిల్లులో పూర్వపు రీడింగ్ 1669 ఉండగా ప్రస్తుత రీడింగ్ 1671 ఉంది. అంటే కేవలం రెండు యూనిట్లు మాత్రమే వినియోగించినట్టు లెక్క తేల్చారు. కానీ బిల్లు మాత్రం గూబ గుయ్యమనిపించారు. పెంటయ్యకు ఏం చేయాలో తెలియక సంబంధిత శాఖాధికారులను సంప్రదించగా అదంతే...అన్నట్టుగా సమాధానం చెప్పి పంపారు. -
ఆర్బీ చౌదరి ఇంట్లో అనుమానాస్పద మృతి
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ నిర్మాత ఆర్బీ చౌదరి ఇంట్లో పనిమనిషి కుమారుడి ఆత్మహత్య సంచలనం కలిగిచింది. ఆయన ఇంట్లో పనిమనిషిగా చేస్తున్న ఆనంద్‌కుమార్ తనయుడు, చౌదరి ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆనంద్ కుమార్ కొన్నేళ్లుగా ఆర్బీ చౌదరి ఇంట్లో పనిమనిషిగా చేస్తున్నాడు. ఆయనతో పాటు తన కుమారుడు కూడా అక్కడే ఉంటున్నాడు. అయితే బుధవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో వంటగదిలో ఆనంద్ కుమార్ కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొద్ది సేపు అనంతరం వంటగదిలోకి వెళ్లిన కుటుంబ సభ్యులు ఆత్మహత్య దృశ్యాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పంచాయతీ కాంట్రాక్ట్ కార్మికుడి హత్య
తలపై కిరాతకంగా మోది చంపిన ఉన్మాది కొవ్వూరు మండలం ఐ.పంగిడిలో కలకలం కొవ్వూరు రూరల్: ఎక్కడి నుంచి వచ్చాడో.. ఎందుకు వచ్చాడో తెలియదు కాని ఓ వృద్ధుడిని అతి కిరాతకంగా హత్య చేశాడు ఓ ఉన్మాది. చూడటానికి మతిస్థిమితం లేని వ్యక్తిగా కన్పిస్తున్నా దారుణంగా పంచాయతీలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్న వ్యక్తిని హతమార్చిన ఘటన కొవ్వూరు మండలం ఐ.పంగిడిలో మంగళవారం వేకువజామున 5.20 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. దీంతో గ్రామంలో కలకలం రేగింది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఐ.పంగిడి శివాలయం వద్ద ఉన్న చెరువుకు పంచాయతీ ఆధ్వర్యంలో వాకింగ్ ట్రాక్ నిర్మించి మొక్కలు నాటారు. సంపూర్ణ పారిశుద్ధ్యంలో భాగంగా అక్కడ ఎవరూ బహిరంగ మలవిసర్జన చేయకుండా పంచాయతీ కాంట్రాక్టు కార్మికుడైన ముప్పిడి చిన నాగయ్య (59)కు పరిశీలనా బాధ్యతలు అప్పగించారు. రోజూలానే మంగళవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో నాగయ్య విధులు నిర్వహించేందుకు అక్కడకు వెళ్లాడు. అదే సమయంలో పలువురు వాకింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా ఆ ప్రాంతంలో సంచరిస్తున్నాడని వాకింగ్ చేస్తున్న మహిళలు చిన నాగయ్య దృష్టికి తీసుకువచ్చారు. చిన నాగయ్య అతని వద్దకు వెళ్లి ఇక్కడ ఉండకూడదు వెళ్లిపోవాలని సూచించాడు. దీనిపై ఆగ్రహించిన ఆ వ్యక్తి నాగయ్యపై దాడికి ఉపక్రమించి అతడిని కిందకు తోచి చేతిలో ఉన్న కర్రతో విచక్షణారహితంగా తలపై మోదాడు. దీంతో నాగయ్య అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అదే సమయంలో వాకింగు చేస్తున్న వైఎస్సార్ సీపీ నాయకులు, స్థానిక సర్పంచ్ భర్త పీకే రంగారావు, మరికొందరు ఇక్కడకు చేరుకుని ఉన్మాదిని పట్టుకున్నారు. కొవ్వూరు రూరల్ పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై ఎం.శ్యాంసుందరరావు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. నాగయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే హత్య చేసిన వ్యక్తి ఉన్మాదా.. లేక మతిస్థిమితం కోల్పోయినా వ్యక్తా అనేది తేలాల్సి ఉంది. 15 ఏళ్లుగా ఇదే వృత్తిలో.. ఉన్మాది దాడిలో మృతిచెందిన ముప్పిడి చిన నాగయ్య 15 ఏళ్లుగా ఐ.పంగిడి పంచాయతీలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నాడు. సౌమ్యుడిగా పేరున్న అతను వాకింగు ట్రాక్ వద్ద పరిశుభ్రంగా ఉండేలా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునేవాడని స్థానికులు చెబుతున్నారు. చిన నాగయ్యకు భార్య వెంకాయమ్మ, వివాహమైన కుమార్తె మరియమ్మ ఉన్నారు. -
బండల ఫ్యాక్టరీ కార్మికుడు ఆత్మహత్య
తాడిపత్రిరూరల్: తాడిపత్రి మండలం ఆవులతిప్పాయపల్లి సమీపంలోని చుక్కలూరు పరిశ్రమ వాడకు చెందిన బాలుడు(45) అనే బండల ఫ్యాక్టరీ కార్మికుడు సోమవారం పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల మేరకు.. కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం బండిఆత్మకూరుకు చెందిన బాలుడు కొనేళ్లుగా చుక్కలూరు పరిశ్రమ వాడలో నివాసముంటున్నాడు. బండల ఫ్యాక్టరీలో కార్మికునిగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. బాలుడుకు అప్పులు పెరిగిపోయాయి. ఈ విషయమై భార్య లక్ష్మీదేవితో గొడవ పడ్డాడు. మనస్థాపం చెందిన బాలుడు ఆవులతిప్పాయపల్లి వద్ద పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రూరల్ పోలీసులు సంఘటన స్థలం చేరుకుని, మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. -
కార్యకర్తకు చెంపదెబ్బ!
భోపాల్: మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత అజయ్ సింగ్ చిక్కుల్లో పడ్డారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన రైతు హత్యలపై నిరసన తెలిపే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సహనం కోల్పోయారు. సొంతపార్టీ కార్యకర్తపైనే చేయిచేసుకున్నారు. మంద్‌సౌర్‌లో రైతులపై కాల్పుల ఘటనపై సాగర్‌లో కాంగ్రెస్ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో అజయ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ దశలో సహనం కోల్పోయిన ఆయన పార్టీ కార్యకర్తపై దురుసుగా ప్రవర్తించారు. ఈ దృశ్యాలు మీడియాలో ప్రసారం కావడంతో అజయ్ సింగ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై వివరణ ఇచ్చిన అజయ్ సింగ్.. కలెక్టర్‌కు మెమొరాండం ఇచ్చేందుకు వెళ్తుండగా కొందరు కార్యకర్తలు ఆవేశంగా వ్యవహరించడంతో.. వారిని శాంతియుతంగా నిరసన చేపట్టాలని చెప్పానన్నారు. కార్యకర్తను పక్కకు నెట్టివేశానే తప్ప కొట్టలేదని చెప్పుకొచ్చారు. -
ట్రాక్టర్ ఢీకొని కార్మికుడి మృతి
మరొకరికి తీవ్రగాయాలు వి.సావరం(రాయవరం) : ఇంట్లోకి కావాల్సిన నిత్యావసర సరుకులు తీసుకుని వచ్చేందుకు వెళ్తున్న బట్టీ కార్మికుడు మృత్యువాత పడ్డాడు. బట్టీ నుంచి రోడ్డుపైకి మరొకరి మోటార్ సైకిల్‌పై వెళ్తుండగా ట్రాక్టర్ ఢీకొట్టింది. ప్రమాదంలో ఉందుర్తి సత్యనారాయణ (50) అనే బట్టీ కార్మికుడు మృతి చెందగా, మోర్త మహేష్ అనే మరో కార్మికుడు తీవ్రగాయాల పాలైన ఘటన శనివారం మండలంలోని వి.సావరం గ్రామ శివార్లలో చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిందిలా.. అమలాపురం మండలం సామంకుర్రుకు చెందిన ఉందుర్తి సత్యనారాయణ, మండలంలోని పసలపూడికి చెందిన మోర్త మహేష్‌లు కుటుంబ సభ్యులతో పనిచేస్తున్నారు. ఇంట్లోకి కావాల్సిన సరుకులు తెచ్చుకునేందుకు మహేష్, సత్యనారాయణ కలిసి మోటార్‌సైకిల్‌పై రాయవరం బయలుదేరాడు. బట్టీకి కొద్ది అడుగుల దూరంలోనే వీరు ప్రయాణిస్తున్న మోటార్‌సైకిల్‌ను రాయవరం నుంచి వెదురుపాక వైపుకు వస్తున్న ట్రాక్టర్ ఢీకొంది. ప్రమాదంలో సత్యనారాయణ అక్కడికక్కడే చనిపోగా, గాయాలపాలైన మహేష్‌ను 108 వాహనంపై రామచంద్రపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉంటే మృతుడు సత్యనారాయణ రెండేళ్లుగా బట్టీలో పనిచేస్తున్నాడు. సత్యనారాయణ భార్య మరియమ్మతో బట్టీలో పనిచేసుకుంటుండగా, కుమారుడు, కుమార్తె వారి స్వగ్రామంలో నివశిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఎస్సై వెలుగుల సురేష్ సంఘటనా స్థలికి వచ్చి ప్రమాద ఘటనపై ఆరా తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సురేష్ తెలిపారు. దేవుడా ఎంతపనిచేశావు.. సరుకులు తెస్తానని చెప్పిన నా భర్తను నీ దగ్గరకే తీసుకుని పోయావా..దేవుడా ఎంత పని చేశావంటూ మృతుడు భార్య మరియమ్మ బోరున విలపించింది. బయటకు వెళ్లక పోయినా ప్రాణాలు దక్కి ఉండేవని, ఎంతపని జరిగిందంటూ ఆమె పెట్టిన రోదన మిన్నంటాయి. ముందే హెచ్చరించిన ‘సాక్షి’.. మట్టిని రవాణా చేస్తున్న ట్రాక్టర్లు మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్న తీరుపై ఈ నెల 25న ‘సాక్షి’లో ‘మట్టి వాహనాల జోరు..ప్రజల బేజారు’ అంటూ ప్రచురితమైన విషయం పాఠకులకు విదితమే. మట్టి ట్రాక్టర్లు మితిమీరిన వేగంతో ప్రయాణించడం వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, వాహనదారులు, ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్న విషయాన్ని కథనంలో ప్రస్తావించిన విషయం పాఠకులకు విదితమే. -
గని కార్మికుడు మృతి
కొలిమిగుండ్ల: నాపరాళ్ల గనిలో ఓ కార్మికుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడు. అంకిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన గంగయ్య (39) అదే గ్రామానికి చెందిన పుల్లారెడ్డి నాపరాతి గనిలో సోమవారం కూలీకి వెళ్లాడు. కటింగ్ మిషన్‌తో కోత కోసిన ఆరడుగల ఎత్తైన నాపరాయిని వెలికి తీసి వరుసలో పెట్టేక్రమంలో కాలు జారి కింద పడ్డాడు. అతని తలపై నాపరాయి పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అనంతపురం జిల్లా తాడిపత్రి ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య కుళ్లాయమ్మ, కుమారుడు గణేష్ ఉన్నారు. ఏఎస్ఐ ఉస్మాన్‌ఘని తాడిపత్రి ప్రభుత్వ వైద్యశాలకు చేరుకొని వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. -
చింతచెట్టు నుంచి జారి పడి కూలీ మృతి
గోరంట్ల(సోమందేపల్లి): మండలంలోని బుడ్డపల్లి గ్రామంలో చింతచెట్టు నుంచి జారీ పడి రామకిష్టప్ప (55) మృతి చెందిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రామచంద్రప్ప చింత పొలంలో చింతకాయలను దులపడానికి కూలీకి వెళ్లాడు. చెట్టు ఎక్కగా ప్రమాదపుశాత్తు జారి కింద పడడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నాపరాతి గనిలో కార్మికుడి దుర్మరణం
కొలిమిగుండ్ల: రాఘవరాజుపల్లె–అంకిరెడ్డిపల్లె గ్రామాల మధ్యనున్న నాపరాతి గనిలో జరిగిన ప్రమాదంలో ఓ కార్మికుడు దుర్మరణం చెందాడు. కనకాద్రిపల్లెకు చెందిన మేకల లింగారెడ్డి (55) రోజు మాదిరిగానే అంకిరెడ్డిపల్లెకు చెందిన విశ్వనాథరెడ్డి నాపరాతి గనిలో కూలీ పనికి వెళ్లాడు. కోత కోసిన రాయిన నడిపిస్తున్న తరుణంలో వంద అడుగుల పైనుంచి బండ రాయి నేరుగా తలపై పడింది. తోటి కార్మికులు చూస్తుండగానే కుప్పకూలిపోయాడు. క్షణాల్లోనే రక్తపు మడుగులో తుదిశ్వాస విడిచాడు. లింగారెడ్డి గనిలో పని చేస్తుండగా... భార్య పార్వతి పాలీష్ ఫ్యాక్టరీలో పని చేస్తుండేది. ఒక్కగానొక్క కుమార్తెకు వివాహం జరిపించారు. మరి కొద్ది సేపట్లో పని ముగించుకొని ఇంటికి చేరాల్సిన కార్మికుడు రెప్పపాటులో అనంత లోకాలకు చేరాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ బీటీ వెంకటసుబ్బయ్య అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. కొద్ది రోజుల నుంచి నాపరాతి గనుల్లో కోతులు సంచరిస్తున్నాయి. ఈ క్రమంలోనే గని పైభాగంలో సంచరించే సమయంలో రాయి కిందకు పడటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని సహ కార్మికులు పేర్కొన్నారు. కోతుల బెడద ఎక్కువగా ఉంటే తరచూ టపాసులు పేల్చాలని ఎస్ఐ యజమానులకు సూచించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
మావోయిస్టనుకొని తాపీమేస్త్రీ ఎన్కౌంటర్
► కూలి కోసం వెళ్లి కాల్పులకు గురయ్యాడంటున్న కుటుంబసభ్యులు ► పోలీసు రికార్డుల్లో పేరు లేదంటున్న చింతూరు సీఐ బుర్కనకోట (చింతూరు): ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా కుంటలో సోమవారం అర్థరాత్రి జరిగిన ఎన్కౌంటర్ ఉదంతం వివాదంగా మారుతోంది. తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం బుర్కనకోటకు చెందిన సోయం మనోహర్(26) అనే మావోయిస్టు ఛత్తీస్‌గఢ్‌లోని కుంటలో భెర్జి బేస్ క్యాంపు సమీపంలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందినట్లుగా కుంట పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే. మనోహర్‌కు మావోయిస్టులతో సంబంధాలు లేవని వ్యవసాయంతోపాటు తాపీపని చేసుకుంటూ జీవనం గడుపుతున్నాడని అతని కుటుంబ సభ్యులు అంటున్నారు. మనోహర్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం అనంతరం బుధవారం బుర్కనకోటకు తరలించారు. తాపీపని కోసమంటూ వెళ్లాడు... తన భర్త మూడ్రోజుల క్రితం తాపీ పని నిమిత్తం వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లినట్లు మృతుడి భార్య తిరపతమ్మ విలేకరులకు తెలిపింది. బుర్కనకోటలో ఉంటూ తన భర్త వ్యవసాయంతోపాటు తాపీ పని చేసుకుంటున్నాడని ఆమె తెలిపింది. కాగా మావోయిస్టులతో కలసి కుంటలో దాడికి రాగా తాము జరిపిన కాల్పుల్లో మనోహర్ మృతిచెందాడని, అతని వద్ద తుపాకీ కూడా లభ్యమైందని పోలీసులు చెబుతుండగా.. అదంతా కట్టుకథని, తమకు న్యాయం చేయూలని మృతుని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసు రికార్డుల్లో పేరులేదు.. మనోహర్ మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్టు పోలీసు రికార్డుల్లో లేదని చింతూరు సీఐ దుర్గాప్రసాద్ తెలిపారు. ఎన్కౌంటర్ వార్త అనంతరం అతను బుర్కనకోటకు చెందిన వ్యక్తిగా తేలిందన్నారు. అతనికి మావోయిస్టులతో ఎలాంటి సంబంధాలున్నాయనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. -
కోరమాండల్‌లో జట్టు కూలీ మృతి
మృతదేహంతో బంధువుల ఆందోళన రూ.8 లక్షలు చెల్లించేందుకు యాజమాన్యం అంగీకారం సద్దుమణిగిన వివాదం కాకినాడ రూరల్ : రూరల్ మండలం వాకలపూడిలోని కోరమాండల్ ఫ్యాక్టరీలో జట్టు కూలీగా పనిచేస్తున్న ఓ వ్యక్తి శనివారం రాత్రి మృతి చెందాడు. దీంతో మృతుని బంధువులు, సీపీఎం, సీపీఐ నాయకులు ఆదివారం ఆందోళనకు దిగారు. పూర్తి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి అకస్మాత్తుగా చనిపోవడానికి కారణాలు ఫ్యాక్టరీ యాజమాన్యం తెలపాలని, మృతుని బంధువులకు నష్టపరిహారం చెల్లించాలని మృతదేహంతో ఫ్యాక్టరీ గేటు ముందు ధర్నాకు దిగారు. ఒకానొకదశలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో రూరల్ తహసీల్దార్ జె.సింహాద్రి, సర్పవరం సీఐ మురళీకృష్ణారెడ్డి వచ్చి ఆందోళనకారులు, ఫ్యాక్టరీ యాజమాన్యంతో చర్చించారు. చివరకు చర్చలు సఫలం కావడంతో మధ్యాహ్నం రెండు గంటలకు ఆందోళన విరమించారు. మృతదేహాన్ని అతడి స్వగ్రామమైన యండమూరు తీసుకువెళ్లారు. వివరాలివి... కరప మండలం యండమూరుకు చెందిన మారెళ్ల వెంకటరావు (54) కాకినాడలోని కోరమాండల్ ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీలో చాలా కాలం నుంచి జట్టుకూలీగా పని చేస్తున్నాడు. రోజూ మాదిరిగానే శనివారం రాత్రి 10 గంటల సమయంలో విధులకు హాజరయ్యాడు. తరువాత ఏం జరిగిందో తెలీదుగానీ వెంకట్రావు చనిపోయాడు. కూలీలు వెంటనే యాజమాన్యానికి సమాచారం అందించడంతో సర్పవరం జంక్షన్‌లోని ట్రస్ట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. వెంకట్రావు బంధువులు ఆస్పత్రి వద్దకు రావడంతో పరిస్థితులు ఉద్రిక్తతంగా మారాయి. మృతదేహాన్ని కోరమాండల్ ఫ్యాక్టరీకి చేర్చి ఆందోళనకు దిగారు. పోలీసులు, తహసీల్దార్ ఎంత నచ్చజెప్పినా వినలేదు. చివరకు యాజమాన్యంతో అధికారులు, పోలీసులు, కుటుంబ సభ్యులు, వివిధ పార్టీల నాయకులు సమావేశమై చర్చించారు. మృతుని కుటుంబానికి రూ.7 లక్షల ఆర్థిక సాయం అందించేందుకు యాజమాన్యం ఒప్పుకోవడంతో వివాదం సద్దుమణిగింది. ఆందోళనలో సీపీఎం నాయకులు సిహెచ్.అజయ్‌కుమార్, పలివెల వీరబాబు, యండమూరు మాజీ సర్పంచ్ మారెళ్ల వెంకటరమణ, మండవ సమాధానం, సీపీఐ నాయకుడు తోకల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో కార్మికుడి మృతి
మడకశిర: పావగడ పట్టణ పోలీస్ స్టేషన్పరిధిలోని బళ్లారి రోడ్డులో శనివారం ఉదయం విద్యుదాఘాతంతో కలకత్తాకు చెందిన కేబుల్ కార్మికుడు భపిన్రాయ్(24) మృతి చెందాడు. నిరంతరజ్యోతి పథకం కింద కేబుల్ వైరు లాగుతున్న సమయంలో స్థానిక బెస్కామ్ కార్యాలయానికి సంబంధించిన విద్యుత్ తీగ తగలడంతో షాక్‌కు గురై మరణించినట్లు పోలీసులు తెలిపారు. విద్యుత్ లైన్ క్లియర్ తీసుకున్నా కూడా విద్యుత్ సరఫరా అవడంతో బెస్కామ్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రిలో శవపరీక్ష నిర్వహించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మంజునాథ్ తెలిపారు. -
విద్యుదాఘాతంతో కూలీ మృతి
మద్దూరు :అడవి పందుల బారి నుంచి మొక్కజొన్న పంటను రక్షించుకునేందుకు ఓ రైతు దొంగచాటుగా వేసుకున్న కరెంట్ తీగలు తాకి మరో కౌలు మృతిచెందిన ఘటన మద్దూరు మండలం దూల్మిట్టలో గురువారం చోటుచేసుకుంది. ఎస్సై కథనం ప్రకారం..గ్రామానికి చెందిన తొగిటె లింగయ్య (65)భైరాన్‌పల్లి గ్రామానికి చెందిన పులిగిల్ల రాజయ్య అనే రైతుకు చెందిన మొక్కజొన్న చేనుకు కావలి వెళ్లున్నాడు. కాగా, ధూల్మిట్ట గ్రామరైతు ఇస్కిల్ల రాజయ్య అడవిపందుల నుంచి మొక్కజొన్న చేను రక్షించుకునేందుకు అక్రమంగా వేసిన కరెంట్ తీగలు లింగయ్యకు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే లింగయ్య మృతికి కారణమైన ఇస్కిల్ల రాజయ్యను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. లింగయ్య మృతితో తనకు సంబంధం లేదంటూ స్థానికులతో రాజయ్య వాగ్వాదానికి దిగడంతో మృతదేహన్ని అతడి ఇంటివద్ద వేసి నిరసన తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, మృతుని కుటుంబానికి న్యాయం చేయిస్తమని హామి ఇచ్చి, గ్రామస్తులను శాంతింపచేశారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. లింగయ్య కుమారుడు రవికుమార్ ఫిర్యాదు మేరకు కేసు ఽదర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వీరేందర్ తెలిపారు. -
గని ప్రమాదంలో కార్మికుని మృతి
ఆదిలాబాద్ జిల్లా శ్రీరాంపూర్ సింగరేణి డివిజన్లోని ఆర్కే 5గనిలో ఆదివారం తెల్లవారు జామున జరిగిన ప్రమాదంలో సపోర్టుమన్ బద్రి జనార్దన్(53) మృతిచెందాడు. మరో సపోర్టుమన్ మచ్చకుర్తి రాయమల్లు గాయపడ్డాడు. వీరు శనివారం రాత్రి షిఫ్ట్ డ్యూటీలకు హాజరయ్యారు. గని భూగర్భంలోని 4వ సీం, 12 లెవల్, 11 డిప్ వద్ద విత్‌డ్రాయింగ్ పనులు నడుస్తున్నాయి. వీరితోపాటు అక్కడ మరో నలుగురు సపోర్టుమన్లు, ఇద్దరు లైన్మన్లు పని చేస్తున్నారు. దిమ్మెకట్టె పనిలో ఉండగా ఒక్కసారిగా పైకప్పు బండ కూలింది. శబ్దం విని ఆరుగురు క్షణాల్లో అక్కడి నుంచి తప్పించుకోగా.. జనార్దన్ బండ కింద పడి అక్కడిక్కడే మృతిచెందాడు. రాయమల్లు దిమ్మెకు పక్కనే ఉండడంతో శిథిలాల కింద చిక్కుకున్నాడు. సర్ధార్ కుమారస్వామి సమాచారం మేరకు రెస్క్యూ సిబ్బంది మూడు గంటలు శ్రమించి జనార్దన్ మృతదేహం, రాయమల్లును బయటకు తీశారు. రాయమల్లు కుడికాలుకు గాయం కావడంతో రామకృష్ణాపూర్‌లోని ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
కార్మికుడి దారుణ హత్య
♦ బండరాయితో మోది చంపిన దుండగులు ♦ మేడ్చల్ పారిశ్రామికవాడలో ఘటన ♦ క్లూస్ టీం, జాగిలాలతో పరిశీలించిన పోలీసులు ♦ హతుడు జార్ఖండ్‌వాసి మేడ్చల్: మేడ్చల్ పారిశ్రామికవాడలో ఓ కార్మికుడు దారుణహత్యకు గురయ్యాడు. దుండగులు అతడిని బండరాళ్లతో మోది చంపేశారు. గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు, సీఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన రుబీ కుల్వ (28) గత నాలుగు సంవత్సరాల నుంచి మేడ్చల్ చెక్‌పోస్ట్‌లో ఉన్న పారిశ్రామిక వాడలోని సర్వోత్తమ్ కంపెనీలో కూలీపనులు చేసుకుంటూ అక్కడే క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నాడు. ఇదిలా ఉండగా, బుధవారం రాత్రి భోజనం చేసిన తర్వాత క్వార్టర్స్ నుంచి బయటకు వెళ్లిన రుబీ కుల్వ తిరిగి రాలేదు. గురువారం తెల్లవారుజామున పారిశ్రామిక వాడ సమీపంలోని మినీస్టేడియం వద్ద గుర్తు తెలియని దుండగులు రుబీ కుల్వ తలపై బండరాళ్లతో మోది దారుణంగా చంపేశారు. విషయం తెలుసుకున్న మేడ్చల్ పోలీసులు, పేట్ బషీరాబాద్ ఏసీపీ అశోక్‌కుమార్ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. హత్య జరిగిన తీరును పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్‌స్క్వాడ్‌ను వివరాలు సేకరించారు. పోలీసు జాగిలాలు హత్య జరిగిన ప్రదేశం నుంచి కంపెనీ పరిసర ప్రాంతాల్లో తిరగడంతో తోటి కార్మికులే రుబీ కుల్వను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. హత్య విషయం తెలుసుకున్న స్థానికులు, కార్మికులు సంఘటన స్థలంలో పెద్దఎత్తున గుమిగూడారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. -
కష్టాలు పుష్కలం
వారం రోజులైనా అందని వేతనాలు నిధులు రాలేదని చేతులెత్తేసిన కాంట్రాక్టర్లు సాక్షి, అమరావతి : వారంతా దినసరి కూలీలు. పుష్కరాల్లో గుంటూరు, కృష్ణాజిల్లాల్లో పారిశుద్ధ్య పనులు నిర్వహించేందుకు 20వేల మంది కాంట్రాక్టు కార్మికులు ఈనెల 9న వచ్చారు. వారం రోజులైనా ఒక్క రూపాయి అందలేదు. చేతి ఖర్చులకని తీసుకువచ్చిన డబ్బులు అయిపోయాయి. టీ తాగేందుకు కూడా చిల్లర లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదంటూ కాంట్రాక్టర్లు చేతులెత్తేయడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. 150 పుష్కరఘాట్లలో విధులు కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 150 పుష్కర ఘాట్లలో సుమారు 20 వేల మంది పారిశుద్ధ్య సిబ్బంది దినసరి వేతనంపై పనిచేస్తున్నారు. రోజుకు 8 గంటలపాటు మూడు షిప్టుల్లో విధులు నిర్వహిస్తున్నారు. చెత్త ఊడ్చడం, ఎత్తివేయడంతో పాటు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసిన చోట దుస్తులు మార్చుకునే గదుల్లో, పిండ ప్రదానం షెడ్లలో వేసిన చెత్తను తొలగిస్తున్నారు. అలాగే రహదారులు శుభ్రం చేయడంతోపాటు రాత్రి వేళల్లో దోమల ఫాగింగ్ చేస్తున్నారు. ఇన్ని విధాలా కష్టపడుతున్నా కనీస వేతనం వారికి ఇవ్వడం లేదు. వేతనాల్లోనూ కక్కుర్తి ! ప్రభుత్వం ఒక్కో కార్మికుడికి రూ.400 వంతున రోజువారి వేతనంతో పాటు వారికి భోజన వసతి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రతి ఐదురోజులకు ఒకసారి వేతనాలు చెల్లించాల్సిఉన్నా ఇప్పటివరకు ఒక్క రూపాయి చెల్లించలేదు. రూ. 400కు బదులుగా రూ.250 నుంచి రూ.300 వంతున వేతనం ఇస్తామని ముందే ఒప్పించారు. ప్రభుత్వం ఇచ్చే వేతనంలో కూడా కాంట్రాక్టర్లు కోత పెడుతూ వారి పొట్ట కొడుతున్నారు. నిధులు ఇవ్వని ప్రభుత్వం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో ఖజానా ఖాళీగా వుంది. పుష్కరాల్లో పారిశుద్ధ్య కార్మికుల వేతనాల కోసం ప్రభుత్వం రూ.184 కోట్లు మంజూరు చేసింది. కానీ నిధులు మంజూరు జీవో కాపీ ఇచ్చారు కానీ నిధులు మంజూరు చేయలేదు. దీంతో మున్సిపల్ శాఖ ఖజానాలో నిధులు లేవు. 14 వ ఆర్థిక సంఘం నిధులైనా ఖర్చు చేసుకోవాలని ఆదేశాలిచ్చినా ఆ నిధులు ఇప్పటికీ ఖజానాలో జమ కాలేదు. దీంతో కాంట్రాక్టర్లకు నిధులు అందించలేక చతికిలపడింది. -
శానిటరీ మేస్త్రీ ఆత్మహత్య
విజయవాడ(చిట్టినగర్): శానిటరీ మేస్త్రీ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొత్తపేట పోలీస్‌స్టేçÙన్ పరి«ధిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం కేఎల్‌రావునగర్ వీఎంసీ కాలనీకి చెందిన వడ్డాది ఏడుకొండలు కార్పొరేషన్ ప్రజారోగ్య విభాగంలో శానిటరీ మేస్త్రీగా ఉద్యోగం చేస్తుంటాడు. భార్య, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ఇంటి అవసరాల నిమిత్తం రూ.ఆరు లక్షలు అప్పులు చేశాడు. అప్పు ఇచ్చిన వారు ఇంటికి వచ్చి అడుగుతారనే ఆందోళనతో ఆదివారం సాయంత్రం పాముల కాల్వ సమీపంలో తన బైక్‌లోని పెట్రోల్ ఒంటిపై పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తీవ్రగాయాలతో ఆస్పత్రికి తరలించిన ఏడుకొండలు చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
తాటి చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడి మృతి
చెన్నారావుపేట మండలం సూరిపల్లి గ్రామంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గడ్డం వీరస్వామి(58) అనే గీతకార్మికుడు ప్రమాదవశాత్తూ తాటి చెట్టుపై నుంచి మృతిచెందాడు. తాటి చెట్టు మీద కల్లు తీస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. -
రైలుకింద పడి కార్మికుడి ఆత్మహత్య
తాండూరు రూరల్: ఓ కార్మికుడు రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన తాండూరు-రుక్మాపూర్ రైల్వేస్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. రైల్వే హెడ్‌కానిస్టేబుల్ రాజు కథనం ప్రకారం.. తాండూరు మండలం గుంతబాసుపల్లికి చెందిన వెంకటయ్య(49) కరన్‌కోట్ గ్రామ శివారులోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)లో కార్మికుడిగా పని చేస్తున్నాడు. భార్యాపిల్లలతో కలిసి ఫ్యాక్టరీ సమీపంలోని క్వార్టర్స్‌లో ఉంటున్నాడు. కొన్ని రోజులుగా అతడు మానసిక వేధనకు గురవుతున్నాడు. ఈక్రమంలో మంగళవారం వికారాబాద్‌లోని ఎల్ఐసీ కార్యాలయానికి వెళ్తున్నట్లు చెప్పి ఇంట్లో నుంచి బయలుదేరాడు. ఆయన ఎంతకూ తిరిగి ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబీకులు ఆందోళనకు గురయ్యారు. ఫోన్ చేసినా స్పందన లేదు. ఇదిలా ఉండగా, తాండూరు-రుక్మాపూర్ రైల్వేస్టేషన్ల మధ్యలో బుధవారం ఉదయం పట్టాలపై ఓ వ్యక్తి మృతదేహం పడిఉంది. గమనించిన రైల్వే కీమన్ రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడి వద్ద ఉన్న ఆధారాల ద్వారా అతడిని వెంకటయ్యగా గుర్తించారు. తాండూరులోని జిల్లా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. మృతుడికి భార్య మణెమ్మ, ఓ కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వెంటకయ్య మృతికి గల కారణాలు తెలియరాలేదు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రమాదవశాత్తూ కార్మికుడి మృతి
మందమర్రి మండలంలోని కేకేవన్ గనిలో ప్రమాదవశాత్తూ ఓ కార్మికుడు మృతిచెందాడు. మ్యాన్ రైడింగ్ మీద నుంచి పడి జంగంపల్లి బాపు(56) అనే వ్యక్తి మృత్యువాత పడ్డాడు. రెండు రోజుల క్రితమే గోలేటి నుంచి మందమర్రి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
గనిలోనే సింగరేణి కార్మికుడు మృతి
కరీంనగర్ జిల్లా రామగుండంలోని సింగరేణి బొగ్గుగనిలో ఒక కార్మికుడు చనిపోయాడు. గోదావరిఖనిలోని జీఎంకాలనీలోనివాసం ఉండే మింగబోయిన అనిల్‌కుమార్(22) గత నెల క్రితమే కార్మికుడిగా ఉద్యోగం పొందాడు. అతడు మంగళవారం రామగుండం డివిజన్-2 పరిధిలోని జీడీకే 7 ఎల్ఈపీ గనిలోమొదటిషిఫ్టులో పనిలోకి దిగాడు. పని ప్రదేశంలో ప్రాణవాయువు అందక అనిల్ అక్కడే పడిపోయాడు. కొద్దిసేపటి తర్వాత గమనించిన తోటి కార్మికులు అతడిని గని బయటకు తెచ్చి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా, అతడి మృతికి యాజమాన్యమే కారణమంటూ కార్మిక సంఘాలు గనిపైనే ఆందోళనకు దిగాయి. -
బండరాళ్లతో మోది దారుణ హత్య
బత్తలపల్లి: అనంతపురం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బత్తలపల్లి మండలం మాల్యవంతం గ్రామ శివారులో చంద్రశేఖరరెడ్డి(42) అనే భవన నిర్మాణ కార్మికుడిని గుర్తుతెలియని దుండగులు బండరాళ్లతో తలపై మోది హతమార్చారు. జాతీయ రహదారి పక్కన చంద్రశేఖరరెడ్డి విగతజీవుడై పడిఉండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు దుండగులకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నారు. మృతుడు మాల్యవంతం గ్రామానికి చెందిన వాడని పోలీసులు చెప్పారు.కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గొడ్డలితో కూలీని చంపిన సూపర్వైజర్
ఇబ్రహీంపట్నం(రంగారెడ్డి): సూపర్వైజర్కు, కూలీకి మధ్య జరిగిన ఘర్షణలో కార్మికుడు మృతిచెందగా.. సూపర్వైజర్కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కర్ణంగూడలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామ శివారులోని ఇటుక బట్టీలో కూలీగా పని చేస్తున్న సుధాకర్ (35)కు సూపర్వైజర్ బ్రహ్మయ్యకు మధ్య ఈ రోజు వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన బ్రహ్మయ్య పక్కనే ఉన్న గొడ్డలితో సుధాకర్ తలపై కొట్టడంతో.. అతను అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘర్షణలో బ్రహ్మయ్యకు కూడా గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. -
బాంబు పేలి కార్మికుడు మృతి
కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం మోతె శివారులో బాంబు పేలి ఓ కార్మికుడు మృతి చెందగా, మరో కార్మికుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. శుక్రవారం ఉదయం గుట్ట వద్ద రాళ్లు పగులగొట్టే పనిలో ఉండగా... సాపెల్లి శ్రీనివాస్ అనే కార్మికుడి చేతిలో ఉన్న బాంబు అకస్మాత్తుగా పేలిపోయింది. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే మృతి చెందగా, పక్కనే ఉన్న అశోక్ అనే కార్మికుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స కోసం అతడ్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
అనుమానాస్పదంగా హమాలీ మృతి
బీబీగూడెం(చివ్వెంల): అనుమానాస్పద స్థితిలో హమాలీ మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని బీబీగూడెం గ్రామ శివారులోని విష్ణువందన ఫార్‌బాయిల్డ్ రైస్ మిల్లులో గురువారం జరిగింది. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని మున్యానాయక్‌తండాకు చెందిన ధరావత్ రాజు(45) 20 సంవత్సరాలుగా విష్ణు వందన రైస్ మిల్లులో హమాలీగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో రోజు మాదిరిగానే మిల్లులో పని నిమిత్తం వచ్చాడు. కాగా పని కొంచెం ఆలస్యంగా మొదలవుతుందని తెలుసుకుని వెంట తెచ్చుకున్న ఆహారాన్ని మిల్లులోనే అతడితో పాటు మరికొంత మంది హమాలీలు చెట్టు కింద కూర్చొని భోజనం చేశారు. కొద్ది సేపటికే రాజు కుప్పకూలి కింద పడిపోయాడు. గమనించిన తొటి హమాలీలు వెంటనే చికిత్స నిమిత్తం సూర్యాపేటకు తరలించగా అప్పటికే మృతిచెం దినట్లు వైద్యులు ధ్రువీకరించారు. గుండెపోటుతో మృతిచెందినట్టు భావిస్తున్నారు. మృతదేహాన్ని తిరిగి ట్రాక్టర్లలో మిల్లు వద్దకు తీసుకువచ్చారు. మృతుడి కుటుంబానికి యాజమాన్యం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ బంధువులు మృతదేహంతో మిల్లు ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో మిల్లు యాజమాన్యం రూ.1.20 లక్షలు ఇస్తామని అంగికరించడంతో ఆందోళన విరమించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
కారు ఢీకొని సింగరేణి కార్మికుడి మృతి
ఖమ్మం జిల్లా మణుగూరు మండలం సింగరేణి సీటైప్ కాలనీలో కారు ఢీకొనడంతో ఓ కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. గురువారం అర్ధరాత్రి గణపతి (55) అనే సింగరేణి కార్మికుడు కాలనీలో నివాసం ముందు ఉండగా ప్రాజెక్టు అధికారి టీవీ రావు కారు ఢీకొనడంతో ఈ విషాదం చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేశారు. -
విద్యుదాఘాతంతో కార్మికుడు మృతి
నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండలం కల్వరాల్ గ్రామంలో విద్యుదాఘాతంతో ఓ కార్మికుడు మృతి చెందారు. నల్లగొండ జిల్లాకు చెందిన వెంకటేశం (48), ఆయన కుమారుడు పరమేశం కల్వరాల్లో బండలు కొట్టే పని చేస్తున్నారు. గురువారం బండల్ పగులగొట్టే కంప్రెషన్ యంత్రానికి 11కేవీ ట్రాన్స్ఫారం నుంచి విద్యుత్ కనెక్షన్ తీసుకుంటన్న క్రమంలో షాక్‌కు గురై వెంకటేశం కు తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. అయితే అతడు మార్గ మధ్యంలోనే మృతి చెందాడు. -
విద్యుదాఘాతంతో కార్మికుడికి గాయాలు
యాదాద్రి: నల్లగొండ జిల్లా యాదగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో నిర్వహిస్తున్న వరుణయాగం సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది. శనివారం ఉదయం లైట్లను అమర్చుతున్న శ్రీ వర్ష ఏజెన్సీకి చెందిన ఎల్లేశ్ అనే కార్మికుడికి విద్యుదాఘాతంతో గాయాలు అయ్యాయి. సమయానికి కొండపైన డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. -
వడదెబ్బతో గీతకార్మికుడి మృతి
వీణవంక మండలం కనపర్తి గ్రామంలో చెప్పాళ్ల సత్తయ్య(60) అనే గీతకార్మికుడు వడదెబ్బ తగిలి సొమ్మసిల్లి పడిపోయాడు. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా ప్రాణాలు విడిచాడు. -
షాపు యజమానినే దోచుకోవాలని...
సుల్తాన్‌బజార్ (హైదరాబాద్): ఓ వ్యాపారిని దోపిడి చేసేందుకు యత్నించిన ఐదుగురు దొంగల ముఠాను ఆదివారం సుల్తాన్‌బజార్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఐ రామిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... బజార్‌ఘట్‌కు చెందిన బషీర్ కోఠిలోని ట్రూప్‌బజార్‌లో బాంబే స్పేర్‌పార్ట్స్ పేరిట ఆటో మోబైల్ వ్యాపారం చేస్తున్నాడు. ప్రతిరోజు రూ. 5 లక్షల వరకు వ్యాపారం జరుగుతుంది. దీంతో అదే దుకాణంలో పనిచేసే పహాడిషరీఫ్‌కు చెందిన జహంగీర్ అనే యువకుడికి దుర్బుద్ధి పుట్టింది. తనకు తెలిసిన ఓ రౌడీషీటర్ ఇతర వ్యక్తులతో బషీర్‌ను దోచుకునేందుకు ప్రణాళిక వేశారు. గతంలో డిసెంబర్ 2015న బషిర్‌ను దోచుకునేందుకు ప్రయత్నించి వీరు విఫలమయ్యారు. అయినా తన ఆలోచన మానుకోలేదు. పహాడిషరీఫ్‌కు చెందిన మహ్మద్ ఫిరాజ్ అలియాస్ నిర్రా(24), బంజారాహిల్స్‌కు చెందిన సయ్యద్ మాజీద్(22), అదే ప్రాంతానికి చెందిన మహ్మద్ వహీద్(21) పహాడీషరీఫ్‌కు చెందిన జంగీర్ఖాన్(20), అదే ప్రాంతానికి చెందిన షాబాజ్‌ఖాన్(21)లు కోఠిలోని ట్రూప్ బజార్లో ప్లాన్ సిద్దం చేశారు. బషీర్ దుకాణం నుంచి ఇంటికి వెళ్లే క్రమంలో అతడిపై కారం చల్లి డబ్బు దోచుకోవాలని పథకం పన్నారు. ఈ సమాచారం తెలుసుకున్న వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని సుల్తాన్‌బజార్ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమాదు చేసుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. -
సౌదీలో భారత్ వర్కర్ కష్టాలు...!
ఉపాధి కోసం సౌదీకి వెళ్లి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు కొందరు, కుటుంబ భారాన్ని మోసేందుకు మరికొందరు సుదూర తీరాల నుంచి దుబాయ్ కి వలసలు వెళ్తుంటారు. వీరిలో కొందరు కొన్నాళ్ల తర్వాత స్వదేశానికి వచ్చి స్థిరపడుతున్నా... ఎక్కువశాతం మంది అక్కడ యజమానులు పెట్టే హింసలకు, ఇబ్బందులకు గురై తీవ్ర కష్టాల్లో కూరుకుపోతున్నారు. ప్రస్తుతం ఫేస్బుక్లో కలకలం సృష్టించిన వీడియో ఈ కష్టాలు, కన్నీళ్లను కంటికి కట్టినట్లు చూపిస్తోంది. భారత్ నుంచి సౌదీ అరేబియాకు డ్రైవర్ పనికోసం వెళ్లి యజమాని పెట్టే హింసలను భరించలేక కన్నీటి పర్యంతమౌతున్న అబ్దుల్ సత్తార్ మకందర్ వీడియో సౌదీ కష్టాలను కళ్లకు కట్టింది. రెండేళ్ల క్రితం ఉపాధి కోసం వెళ్లి సౌదీ అరేబియాలో డ్రైవర్‌గా చేరిన 35 ఏళ్ల సత్తార్ మకందర్ అత్యంత దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. సత్తార్ కన్నీటి కథ వీడియో ను ఢిల్లీకి చెందిన కార్యకర్త కుందన్ శ్రీవాస్తవ గతవారం ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. దీంతో ఇంటర్నెట్లో ఆ వీడియో దేశ విదేశాల్లోనూ వైరల్‌గా వ్యాపించింది. తన యజమాని స్వదేశానికి (ఇండియాకు) పంపించడం లేదంటూ వీడియోలో సత్తార్ కన్నీరు మున్నీరయ్యాడు. తనకు జీతం కూడా సరిగా చెల్లించడం లేదని, కనీసం తిండికి కూడా డబ్బు ఇవ్వడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే సత్తార్ వీడియో అతడికి మేలు చేయకపోగా, మరిన్ని సమస్యలు తెచ్చిపెట్టింది. సౌదీలో ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తున్న సత్తార్ వీడియో ఇంటర్నెట్లో వ్యాపించడంతో సౌదీ అధికారులు అతడిని అరెస్టుచేశారు. తప్పుడు సమాచారం వ్యాపింపజేయడం సౌదీ అరేబియాలో క్రిమినల్ చర్యగా భావించిన అధికారులు అతడ్ని అరెస్ట్ చేశారు. దీంతో వెంటనే సౌదీ అధికారులను సంప్రదించి వెంటనే అసలు వీడియోను ఇంటర్నెట్ నుంచి తొలగించి, క్షమాపణలు చెప్పానని శ్రీవాస్తవ తెలియజేశాడు. మానవ హక్కుల కార్యకర్త అయిన శ్రీవాస్తవ మానవత్వమే తన కుటుంబమని, మానవులంతా తమకుటుంబంలోని వారిగానే భావిస్తానని, అందుకే సత్తార్ ను సైతం తన కుటుంబంలోని వ్యక్తిగా భావించి అతడి తరపున క్షమాపణలు చెప్పినట్లు వెల్లడించాడు. ఈ సందర్భంలో సత్తార్ మకందర్ ఎ1 సరూర్ యునైటెడ్ గ్రూప్ లో పని చేస్తున్నాడని, అతడికి కంపెనీ సమయానికి జీతం చెల్లిస్తోందని, అతడికి పనిచేయడం ఇష్టం లేకపోతే స్వేచ్ఛగా వైదొలగవచ్చునని రిక్రూట్ మెంట్ ఏజెన్సీకి చెందిన ఓ ప్రతినిధి తెలిపారు. అయితే తాను చెప్పిన క్షమాపణలతో సత్తార్ ను విడిచి పెట్టారని, కానీ మర్నాడు వెంటనే మరో కారణంతో అరెస్టు చేశారని శ్రీవాస్తవ చెప్తున్నాడు. మకందర్ తల్లి కూడా అతడితో మాట్లాడేందుకు ప్రయత్నిస్తోంది. అరెస్టు కాకముందు ఐదురోజుల క్రితం సత్తార్ ఓసారి తనతో మాట్లాడాడని, ఆ తర్వాత సత్తార్ ను అరెస్టు చేసినట్లు స్నేహితులు చెప్పారని ఆమె తెలిపింది. ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం కనిపించలేదని శ్రీవాస్తవ అన్నాడు. ఇప్పటికీ మకందర్ ఖైదీగానే ఉన్నాడని, ఏ ప్రభుత్వం అతడికి సహాయం చేసేందుకు ముందుకు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. -
నిర్మాణ పనుల్లో అపశృతి: కార్మికుడు మృతి
నర్మెట్ట : వరంగల్ జిల్లా నర్మెట్ట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నూతన భవన నిర్మాణ పనుల్లో ఆదివారం ప్రమాదం చోటుచేసుకుంది. భవన నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన సెంట్రింగ్ కుప్పకూలి కార్మికుడిపై పడిపోయింది. దీంతో జెల్ల రవి (25) అనే కార్మికుడు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. -
ఆగని పులుల దాడులు, వ్యక్తి మృతి
తమిళనాడుః అటవీ ప్రాంతాల్లో పులల దాడులు ఆగడం లేదు. అటుగా వచ్చే ఏ వ్యక్తినీ వదలడం లేదు. దీంతో ఎప్పుడు ఏ పులి పంజా విసురుతుందోనని ఆయా ప్రాంతాల్లో నివసించేవారు నిత్యం భయాందోళనలకు గురౌతున్నారు. ఇప్పటికే ఎన్నోసార్లు పులుల బారిన పడి స్థానికులు ప్రాణాలు కోల్పోగా.. తాజాగా జార్ఘండ్ కు చెందిన ఓ టీ ఎస్టేట్ కార్మికుడు మృత్యు వాత పడంటం దేవరసోలై ప్రాంతంలో కలకలం రేపింది. దేవరసోలై టీ ఎస్టేట్ లో పనికి వెళ్ళిన 53 ఏళ్ళ మాగు.. పులి దాడికి బలైన ఘటన స్థానికంగా ఆందోళన నింపింది. జార్ఖండ్ కు చెందిన మాగు.. శుక్రవారం విధులకు హాజరయ్యేందుకు వెళ్ళి తిరిగి ఇంటికి రాకపోవడంతో అతడి జాడకోసం బంధువులు, సహ కూలీలు తీవ్రంగా వెతికారు. రాత్రంగా వెతికినా లాభం లేకపోయింది. అయితే శనివారం ఉదయం ఓ గుర్తు తెలియని వ్యక్తి శవాన్ని గుర్తించిన అటవీ అధికారులు పోలీసులకు స్థానికులకు సమాచారం అందించారు. దీంతో గతరాత్రి కనపడకుండా పోయిన మాగు... పులి దాడికి గురై ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. అడవిలోని ఓ బురదగా ఉన్న ప్రాంతంలో పులి కాళ్ళ గుర్తులను గమనించిన అధికారులు.. మాగు మెడపై పులి పళ్ళగాట్లను కూడ కనుగొన్నారు. దీంతో మాగు... పులి దాడిలో చనిపోయినట్లుగా భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మాగు మరణంతో స్థానికులు అటవీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రాంతంలో పులులతో ఎదురౌతున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవడం లేదంటూ అటివీ అధికారులపై మండిపడ్డారు. అదే ప్రాంతంలో ఆరునెలల క్రితం ఓ మహిళ పులిబారిన పడి చనిపోయిందని, ఆ తర్వాత ఆ పులి కూడ తుపాకీ దెబ్బకు మరణించిందని అన్నారు. తాజా ఘటన నేపథ్యంలో గ్రామస్థులు, అన్ని పార్టీల నాయకులు ఓ సమావేశం నిర్వహించి, పులి దాడుల నిర్మూలనకు భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నట్లు తెలిపారు. -
పొట్టకూటి కోసం వెళ్లి అనంత లోకాలకు..
సీలేరు (విశాఖ జిల్లా) : పొట్ట కూటి కోసం ఇతర రాష్ట్రానికి వెళ్లిన ఓ వ్యక్తి తిరిగి రాని లోకాలకు తరలిపోయాడు. విశాఖ జిల్లా సీలేరు ప్రాంతానికి చెందిన గొల్లూరి శివో బొగ్గు ఫ్యాక్టరీలో పని చేయడానికి కర్ణాటక వెళ్లాడు. అక్కడ పనిచేస్తున్న శివో బుధవారం వాంతులు, విరేచనాలతో అకస్మాతుగా మృతిచెందాడు. కనీసం కుటుంబసభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వని ఫ్యాక్టరీ యాజమాన్యం గురువారం అర్థరాత్రి అంబులెన్స్‌లో మృతదేహాన్ని స్వగ్రామం సీలేరుకు తరలించింది. శివో మృతిపై అతని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కంపెనీలోనే ఏదో జరిగి ఉంటుందని భావిస్తున్నారు. బొగ్గు ఫ్యాక్టరీ యాజమాన్యం వచ్చి సమాధానం చెబితే కానీ అంబులెన్స్ నుంచి మృతదేహాన్ని దించేది లేదని కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
విద్యుదాఘాతంతో కార్మికుడు మృతి
కోవూరు : నెల్లూరు జిల్లా కోవూరులో కరెంట్ షాక్‌తో ఓ భవన నిర్మాణ కార్మికుడు మృత్యువాతపడ్డాడు. మైథిలి సెంటర్లో ఓ ఇంటి నిర్మాణం జరుగుతోంది. ఆదివారమైనా పనికి రావాలని ఒత్తిడి చేయడంతో శ్రీకాంత్ అనే కార్మికుడు (20) కూలీ పనులకు వెళ్లాడు. భవనం పక్కనే విద్యుత్ తీగలు ఉన్నాయి. కమ్ములు తీస్తున్న సమయంలో విద్యుత్ తీగలను తాకడంతో షాక్‌కు గురై శ్రీకాంత్ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మిగతా కార్మికులు ఆందోళన చేశారు. -
చెట్టు పై నుంచి పడి గీతకార్మికుడి మృతి
హుజూరాబాద్: గీత వృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తున్న ఓ గీత కార్మికుడు ప్రమాదవశాత్తు తాటిచెట్టు పై నుంచి జారిపడి మృతిచెందాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం జూపాక గ్రామంలో శుక్రవారం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన రావుల కొమరయ్య(55) కల్లు గీయడం కోసం తాటి చెట్టు ఎక్కి ప్రమాదవశాత్తూ చెట్టుపై నుంచి కింద పడి మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పోలీసుల అదుపులో కర్నూల్ జెడ్పీ చైర్మెన్ సొదరుడు
-
విద్యుదాఘాతంతో కార్మికుడు మృతి
ఎర్రగొండపాళెం: ప్రకాశం జిల్లా ఎర్రగొండపాళెంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఒక ఇంటికి సెంట్రింగ్ పని చేస్తుండగా బాలయ్య(25) అనే కార్మికుడు కరెంట్‌షాక్‌తో శనివారం మధ్యాహ్నం మృతిచెందాడు. ఇంటి పైనుంచి వెళుతున విద్యుత్ వైర్లు తగలడంతో బాలయ్య అక్కడికడ్డడే మృతిచెందాడు. మృతునికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు. -
వితంతువుకు అండగా నిలిచిన కలెక్టర్
పట్నా: గ్రామస్తుల చేతిలో అవమానింపబడిన వితంతు మహిళకు ఓ జిల్లా కలెక్టర్ అండగా నిలిచారు. అక్కడ రాజ్యమేలుతున్న సాంఘిక దురాచారానికి వ్యతిరేకంగా గ్రామస్తుల్లో అవగాహన కల్పించారు. వితంతు మహిళను తమ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకానికి వంట చేయడానికి వీల్లేదంటూ ఆందోళన చేపట్టిన గ్రామస్తులను జిల్లా కలెక్టర్ రాహుల్ కుమార్ ఒప్పించి ఆదర్శంగా నిలిచారు. బిహార్ గోపాల్ గంజ్ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వితంతువు తమ పాఠశాలలో వంట చేస్తే ఒప్పుకోమంటూ గోపాల్ గంజ్ జిల్లాలోని కళ్యాణ్ పూర్ గ్రామవాసులు కొంతమంది ఆందోళనకు దిగారు. ఆమె చేతి వంట తమ పిల్లలు తింటే అనర్థమని వాదించారు. స్కూల్ గేట్లకు తాళం వేసి పాఠశాలను నడవనీయమంటూ మొండి పట్టు పట్టారు. దీంతో వివాదం రేగింది. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ రాహుల్ కుమార్ ఉన్నతాధికారులతో కలిసి శుక్రవారం పాఠశాలను సందర్శించారు. వితంతు మహిళకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారితో చర్చలు జరిపారు. స్వయంగా ఆమె చేతి వంటను విద్యార్థులతో కలిసి కలెక్టర్ భుజించారు. దీంతోపాటుగా గ్రామస్తుల్లో అవగాహన కల్పించి పరిస్థితిని చక్కదిద్దారు. కాగా వివక్ష ఎదుర్కొన్న మహిళకు పాఠశాలలో వంట చేయడం ద్వారా నెలకు 1000 రూపాయలు వేతనం. ఇద్దరు పిల్లలు ఉన్న ఆమె కుటుంబానికి అదే ఆధారం. దీంతో. కలెక్టర్, ఉన్నతాధికారులు చొరవ తీసుకొని తనకు న్యాయం చేయడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేసింది. -
నేటి భారతంలో వర్గం కొత్త కులం
జాతిహితం సంపద పెరుగుతున్నా మనవాళ్ల దృక్పథాలు మాత్రం మారలేదు. సంపన్న వర్గాలు పని మనిషి సహాయం అవసరమయ్యేంత తీరుబడి లేకుండా లేదా సోమరులుగా మారుతున్నాయి. అట్టడుగు, అతి పేద స్థాయి పురుషులు, స్త్రీలు ఎక్కువగా వారి ఇళ్లల్లోకి, జీవితాల్లోకి ప్రవేశిస్తున్నారు. అది కూడా మన ఉన్నత, ఉన్నత మధ్యతరగతి అస్తిత్వపు సంప్రదాయక కొలబద్ధల పరిధిలోనే. నేటి భారతంలో వర్గం ఒక కొత్త కులం. అప్పుడప్పుడూ, అదీ కొద్దిసేపే, ఒక ఆదివాసి బాలిక గాయాలతో టీవీలోంచి సూటిగా మన కళ్లలోకి చూస్తుంటే చలించిపోతాం, అంతే. గుర్గావ్లోని సంపన్నవంతులైన భార్యాభర్తలు 14 ఏళ్ల పని మనిషిని పదే పదే చావబాదిన కథనం గురువారం వెలుగులోకి వచ్చింది. జార్ఖండ్‌కు చెందిన ఆ ఆదివాసి పని మనిషి ఒక అల్మారా వెనుక నక్కి ఉండగా లేదా బలవంతంగా బంధించి ఉండగా కాపాడారు. ఆమె ఒంటిపై కమిలిన గాయాలు, తెగి చీరుకుపోయిన మచ్చలు ఉన్నాయి. ఎప్పటిలాగే వారామెను కొట్టి, గోడకు తోసేశారని, కత్తితో గాటు కూడా పెట్టారని ఆమె టీవీ చానళ్లకు చెప్పింది. తను ‘‘నచ్చ లేదు’’ కాబట్టే యజమానులు తనను కొట్టేవారని ఆ బాలిక చెప్పడం అన్నిట్లోకీ గగుర్పాటు కలిగించే విషయం. పని మనుషులపట్ల ప్రదర్శించే క్రూరత్వంలో ఇది ఒక అత్యంత తీవ్రమైన ఉదంతమే. కానీ ఇది అరుదైనదేమీ కాదు. ఇదే గుర్గావ్ ప్రాంతంలో ఒక సౌదీ దౌత్యవేత్త ఇంటి నుంచి నేపాలీ సంతతికి చెందిన ఒక పని మనిషిని ఇటీవలే కాపాడారు. ఆమెపై పదే పదే అత్యాచారానికి పాల్పడి, ఐఎస్ఐఎస్ శైలిలో అమానుషంగా హింసించారు. జార్ఖండ్ పనిమనిషికి సంబంధించిన తాజా ఘటనపై సమాజం నుంచి, పోలీసుల నుంచి తక్షణమే ప్రతిస్పందన వచ్చింది. అందుకు కారణం బహుశా సౌదీ దౌత్యవేత్త కథనం సృష్టించిన సంచలనమే కావచ్చు. పరాధీనత సంపన్నుల హక్కు యజమాని-సేవకుడు అనే ఈ సంబంధం మన దేశంలో సమస్యాత్మకంగా ఉంటోంది. సంపదలు పెరుగుతుండటంతో పాటూ, రెండు ఆదాయాల జంటలకూ, న్యూక్లియార్ (భార్యాభర్త, పిల్లలు) కుటుంబాలకు ఇంటి పని మనుషుల అవసరమూ, దానితో పాటే వర్గ విభజన కూడా పెరిగాయి. మన భారతీయులం ప్రపంచంలోనే అతి ఎక్కువగా ‘‘నౌకర్ల’’పైన ఆధారపడే వారి కోవలోకి వస్తాం. మన గిన్నెలు కడగటం నుంచి మరుగుదొడ్లను శుభ్రం చేయడం వరకు, మన పిల్లలను తయారు చేయడం నుంచి కుక్కలను బయట తిప్పుకు రావడం వరకు, పని ప్రదేశానికి డ్రైవ్ చేసుకుని తీసుకెళ్లడం నుంచి మన లంచ్ బాక్స్‌లను తెరచి పెట్టడం, మన బట్టలు ఇస్త్రీ చేసిపెట్టడం వరకు... మనకు ఇంటి పనిమనుషుల అవసరం పరిపూర్ణమైనదిగా మారింది. నిద్ర సమయాన్ని మినహాయిస్తే కనీసం వారంలో ఏడు రోజులూ, రోజుకు 16 గంటలు వారు పనిచేయాల్సిందే. ఈ శ్రామికులను ప్రధాన స్రవంతికి చెందిన ఇంగ్లిష్ పత్రికలు సైతం ‘‘డొమెస్టిక్స్’’ (ఇంటి పనిమనుషులు) అనే అంటాయి. సంపన్నవంతులు ఎక్కువయ్యే కొద్దీ వారు పని మనిషి సహాయం అవసరమయ్యేంత తీరుబడి లేకుండా లేదా సోమరులుగా మారుతున్నారు. అట్టడుగు, అతి పేద స్థాయి పురుషులు, స్త్రీలు ఎక్కువగా వారి ఇళ్లలోకి, జీవితాల్లోకి ప్రవేశిస్తున్నారు. వంటవాళ్లు, డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులు (వాళ్లే అప్పుడప్పుడూ ద్వార పాలకులు కూడా), ఇంటిని శుభ్రం చేసేవాళ్లు, ఇంటి పనులన్నిటినీ చక్కబెట్టేవాళ్లు, వ్యక్తిగత సేవకులు, పిల్లలను చూసుకునే వారుగా వాళ్లు మన ఉన్నత/ఉన్నత మధ్యతరగతి అస్తిత్వపు సంప్రదాయక కొలబద్ధల పరిధిలోనే మన జీవితాల్లోకి ప్రవేశిస్తున్నారు. అర్థనిపుణ శ్రామికుల మార్కెట్లో కొనుక్కునేవాళ్ల ఇష్టారాజ్యమైన పనిమనుషుల మార్కెట్ ఎంత ఏకపక్షమైనదో మీకు తెలుసుకోవాలనుందా? ‘టీమ్ లీజ్ ఇండియా’ అల్ప, మధ్యస్థ స్థాయి నిపుణ శ్రామికులకు ఉద్యోగాలిప్పించే మధ్యవర్తి సంస్థ. అలాంటి సంస్థల్లో అది దేశంలోనే మూడో అతి పెద్దది. ‘‘గత ఐదేళ్లుగా మా కంపెనీ ప్రతి ఐదు నిమిషాలకు ఒక కొత్త వ్యక్తిని పనిలో నియమిస్తోంది. అయినా దరఖాస్తు చేసుకున్న వారిలో దాదాపు 5 శాతానికి మాత్రమే పని చూపగలిగాం’’ అంటూ ఆ సంస్థను నడిపే మనీష్ శబర్వాల్ బాగా ఆలోచించాల్సిన విషయాన్ని చెప్పారు. కలవారి ఇంట్లో రెండు వర్గాలు 2008లో ఆనంద్ గిరిధరదాస్ ‘న్యూయార్క్ టైమ్స్’లో రాసిన ఒక వ్యాసంలో సరిగ్గా ఇదే విషయాన్ని ఒక ఐదు నక్షత్రాల హోటల్ టాయ్‌లెట్‌ను తీసుకుని వివరించారు. ఈ టాయ్లెట్లలో మనుషులు రెండు రకాలుగా విభజితమై ఉంటారు. సబ్బును ఉపయోగించుకునే వారు, డిస్పెన్సర్ నుంచి సబ్బును మీ చేతిలోకి పిండి, పంపు తిప్పి కట్టేసి, గ్లౌజులు తొడుక్కున్న చేతులతో మీకు టవల్ అందించి తిరిగి దాన్ని తీసుకుని, పంపును తుడిచి, టిప్పు ఇచ్చో ఇవ్వకుండానో మీరు బయటకుపోతుంటే ‘థ్యాంక్యూ’ అని గొణిగేవారు. మనకున్న సువిశాలమైన చౌక శ్రమశక్తి రిజర్వాయరు ఇతర సృజనాత్మక ఉపయోగాలకు కూడా ఉపయోగపడుతోంది. అత్యంత సంపన్నవంతమైన మన పాత కంపెనీల కార్పొరేట్ ఆఫీసుల్లో ఒక బంట్రోతు మీ వెంటే వస్తాడు. గ్లౌజులు తొడుక్కున్న చేతులతో తలుపుకు తళతళ మెరుస్తున్న ఇత్తడి పిడిని పట్టుకుని తలుపు తెరుస్తాడు, లేదా మీరే దాన్ని తిప్పితే మెత్తటి గుడ్డతో దాన్ని తుడుస్తాడు. చాలా అత్యున్నత స్థాయి హోటళ్లు తమ వద్ద వ్యక్తిగత బట్లర్లు, సేవకులున్నారని ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్నాయి. వృద్ధితో పాటూ పనిమనుషుల పెరుగుదల ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందడం ఈ వైఖరులు మరింత అధ్వానం కావడానికే తోడ్పడింది. ముగ్గురు చిన్న పిల్లలున్న ఓ జంట ఇప్పుడు ముగ్గురు పని మనుషులను నియమించుకుంటోంది. వారిని తమతో పాటూ రెస్టారెంట్లకు, కిట్టీ పార్టీలకు, సెలవుల్లోని ప్రయాణాలకు విమానాల్లోకి లాక్కుపోతారు. ఈ పరాధీనత తీవ్రమైనదే. అయినా, ఎలాంటి ఫిర్యాదులూ చేయని ‘‘మెట్ల కింది’’ తరగతి అతి పెద్దదిగా ఉండ టానికి విస్తృత ఆమోదం ఉంది కాబట్టి ఆ సదుపాయం అందుబాటులోనే ఉంది. మన కొత్త అపార్ట్మెంట్ భవనాల్లో ‘‘నౌకర్ల క్వార్టర్స్’’గా పిలిచే శవపేటికంత పడక స్థలాలను ఓసారి చూడండి. చౌకగా నౌకర్లను నియమించుకునే హక్కు మనకుందనే ఈ స్పృహ దేవయాని కోబ్రగడే ఉదంతంలో అతి కొట్టవచ్చినట్టుగా కనిపిస్తుంది. దేవయాని విష యంలో అది ఆవశ్యకంగా దౌత్యపరమైన రక్షణేగానీ, ఏ భారతీయునికైనా అతి చౌకగా దొరికే పని మనిషిని పెట్టుకునే హక్కు ప్రాథమిక హక్కుగానే ఉంది. పేదలకు అనుకూలమైనదిగా, మధ్యస్తవాదుల్లో వామపక్షంగా చెప్పుకునే యూపీఏ ప్రభుత్వం సైతం ఈ హక్కు విషయంలో తన అత్యంత ముఖ్య మిత్రునితో (అమెరికా) సంబంధాలను చెడగొట్టుకోడానికి సిద్ధపడింది. మీడియా అంతా ఆ దౌత్యవేత్త వెనుక నిలిచి, భారత దేశానికి అప్రతిష్ట తేవడానికి విదేశంతో కుమ్మక్కయిన వ్యక్తిగా, అంత గొప్ప పని ఇచ్చినందుకు కృతజ్ఞతలేని దానిగా ఆ పనిమనిషిని తీసిపారేసింది. కనీస వేతనాల సంగతి మనకు అనవసరం. 2013, డిసెంబర్ 21 నాటి జాతిహితం ‘మన ఫ్యూడల్ సర్వీస్’లో నేను ఈ అంశాలను లేవనెత్తిన వెంటనే విదేశీ వ్యవహారాల సర్వీసులకు చెందినవారు దుమ్మెత్తి పోయడం ప్రారంభించారు. ఆ కథ ఇప్పుడు పూర్తిగా బట్టబయలైంది. ‘బాధితులు’, ‘అనుమానితులు’ గిరిధర్దాస్ ఒక బాలీవుడ్ సినిమాను (‘బారా అణా’ 2009) తీసుకుని యజమానులు, డ్రైవర్ల జీవితాల ద్వారా ఈ విషయాన్నే చెప్పాడు. తాజాగా మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించిన ‘తల్వార్’ను నేను అందుకు ఉదాహరణగా చూపగలను. ఆ సినిమాకు నా మిత్రుడు విశాల్ భరద్వాజ్ స్క్రిప్ట్ రాశారు. ఆరుషి-హేమరాజ్ కేసుపై నాకు ఎలాంటి అభిప్రాయమూ లేదు. నేనిక్కడ చూపుతున్నది ఆ కథలోని రెండు రకాల లేదా వర్గాల మను షులను మాత్రమే. ఒక రకం సుతారంగా, నాగరికంగా, ప్రేమాస్పదంగా, కష్టపడి పనిచేసేవారై ఉంటారు. బాధితులని వారి మొహాల మీదే రాసి ఉంటుంది. మరో రకం అతి మొరటుగా వాగుతూ, తాగుతూ, కాముకులై, వెకిలిగా నవ్వుతూ ఉండేవారు. సాధారణంగా అలాంటి వారికి నిలువెల్లా ‘అనుమానాస్పదులు’ అని రాసుంటుంది. నాలాంటి చాలా మంది ఆ సినిమా చూసి వస్తూ జరిగిన ‘‘అన్యా యానికి’’ చలించిపోయారు. మరుసటి రోజున ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ మన నౌకర్లకు కూడా ఆ సినిమా చూపించమని సలహా చెబితే మెచ్చుకున్నాం (ఆ సినిమా నిర్మాతే ఆ పత్రికకు కూడా యజమాని). అంటే, ఆ సినిమా చూసి వాళ్లు అపరాధ భావనకు లోనవుతారని మనం ముందస్తుగానే ఊహించాం. ఆ కేసు పరిశోధననూ, సుప్రీంకోర్టు ఆదేశాలు సహా 16 ఆదేశాల మేరకు సాగిన న్యాయ ప్రక్రియను చెడగొట్టేసి, తారుమారు చే సేయగలిగే శక్తి ముగ్గురు పేద నేపాలీ పని మనుషులకు ఉంటుందే తప్ప, ఉన్నత స్థానాల్లోని వారితో మంచి సంబంధాలున్న ఆ దంత వైద్యులకు ఆ శక్తి ఉండదా? అని అడగాలని మాత్రం ఎవరికీ అనిపించలేదు. వర్గం నేటి కులం ఆ సినిమాలో నార్కో టెస్టులు చేసిన ‘‘డాక్టర్’’ మెదడును ఒత్తిడికి గురిచేసే రసాయనాన్ని దంత వైద్యులైన భార్యాభర్తల కంటే మరింత ఎక్కువగా నౌకర్ల శరీరాల్లోకి ఎక్కించడానికి సిద్ధపడటాన్ని ఎవరూ గమనించలేదు. ఒక సీబీఐ అధికారి ఒక దిగువస్థాయి ఉత్తరప్రదేశ్ కానిస్టేబుల్ని ప్యాంటు విప్పి లాఠీతో నీ మొలల వ్యాధిని కాస్త సరిచేసుకోరాదా? అని అడిగితే మనం ఆనందించాం, కొంటెగా నవ్వుకున్నాం (మాయావతి పాలనలోని యూపీలోనే కాదు, మరే రాష్ట్రంలోనైనా నిజంగానే ఒక సీబీఐ అధికారి ఒక కానిస్టేబుల్‌ను అలా అడగటం చూడాలని ఉంది). ఆ మంచి సీబీఐ పోలీసు కూడా నేపాలీ నౌకర్ను చావబాదుతాడు. మనం అది బాగానే ఉందనుకుంటాం. అతని జూనియర్ సహోద్యోగి దాన్ని తన ఫోన్లో రికార్డ్ చేసినందుకు అతన్ని ద్రోహి అనుకుంటాం. అంతేగానీ ప్రజా ప్రయోజన కార్యకర్త అనుకోం. అదే ఆ దంత వైద్యులనే అలా కొట్టి ఉంటే తప్పకుండా అతన్ని అలా గొప్పగానే చూసేవాళ్లం. విశాల్ భరద్వాజ్ వంటి సున్నితమైన, జాగరూకతగలిగిన వ్యక్తి అలాంటి స్క్రిప్టును రాసినప్పుడు ఇక ఊపిరి సలపని సినిమా విమర్శకులను తప్పుపట్టడం ఎందుకు? పునరుజ్జీవితమవుతున్న నేటి భారతావనిలో వర్గం ఒక కొత్త కులం. అనివార్యంగానే ఒకటి మరోదానికి చక్కగా అతుకుతుంది. అప్పుడప్పుడూ, అదీ కొద్ది కాలమే, జార్ఖండ్‌కు చెందిన ఒక ఆదివాసి బాలిక గాయాలతో టీవీలోంచి సూటిగా మన కళ్లలోకి చూస్తుంటే మాత్రం చలించిపోతాం. శేఖర్ గుప్తా twitter@shekargupta -
సింగరేణి కార్మికుడు ఆత్మహత్య
గోదావరిఖని మండల కేంద్రంలోని విఠల్‌నగర్‌లో చొప్పరి భూమయ్య(57) అనే సింగరేణి ఉద్యోగి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొంతకాలంగా భూమయ్య నడుము నొప్పి, బీపీ, అస్తమాతో బాధపడుతున్నాడు. రెండు సంవత్సరాల నుంచి అనారోగ్య సమస్యలతో విధులకు కూడా హాజరు కావడంలేదు. ఎంతకీ తగ్గకపోవడంతో తీవ్ర మనస్తాపానికి లోనైన భూమయ్య బుధవారం తెల్లవారుజామున వరండాలో తాడుతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య రాధ ఫిర్యాదు మేరుకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు సస్పెండ్
సుల్తానాబాద్ (కరీంనగర్) : ఓ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం సరిగా అమలు కాకపోవడంతో నిర్వహకురాలిని అధికారులు సస్పెండ్ చేశారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్‌లో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలోని అశోక్‌నగర్ ప్రాథమిక పాఠశాలలో 45 మంది విద్యార్థులకు వండేందుకు హెచ్ఎం 4.5 కేజీల బియ్యాన్ని నిర్వహకురాలికి ఇచ్చారు. అయితే ఆమె అందులో సగం బియ్యాన్ని వండి మిగతా వాటిని మాయం చేసింది. దీంతో విద్యార్థులు అర్ధాకలితోనే భోజనం ముగించాల్సి వచ్చింది. ఈ విషయాన్ని తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు విచారణ చేపట్టి నిర్వాహకురాలిని సస్పెండ్ చేశారు. సాంబారు, కొడుగుడ్డు కూడా భోజనంలో వడ్డించడం లేదని విద్యార్థులు ఈ సందర్భంగా అధికారుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. -
హెచ్బీఎల్లో కార్మికుడి మృతి
విజయనగరం: ప్రమాదవశాత్తూ ఐరన్ రాడ్డు మీదపడి తాత్కాలిక కార్మికుడు మృతిచెందిన సంఘటన విజయనగరం జిల్లా పూసపాటిరాగ మండంలోని హెచ్బీఎల్లో కార్మాగారంలో బుధవారం జరిగింది. వివరాలు.. నెల్లిమర్ల మండలం గుస్ని గ్రామానికి చెందిన జమ్ము రమణ(43) హెచ్బీఎల్లో తాత్కాలిక కార్మికునిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈరోజు కార్మాగారంలో ఐరన్ పోల్స్‌ను తరలించే క్రేన్ బెల్ట్ పక్కన విధులు నిర్వర్తిస్తున్న రమణపై ఐరన్ రాడ్డు పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. కార్మికులకు ఈ విషయం తెలిస్తే గొడవ అవుతుందనే ఉద్ద్దేశ్యంతో యాజమాన్యం వెంటనే రమణ మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించింది. కాగా.. యాజమాన్యం సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడతోనే ఈ ప్రమాదం జరిగిందని.. క్రేన్ బె ల్ట్(పట్టా) తెగడంతోనే రమణ మృతిచెందాడని తోటి కార్మికులు ఆరోపిస్తున్నారు. బాదితునికి నష్ట పరిహారం చెల్లించడంతో పాటు సేఫ్టీ ప్రమాణాలు పాటించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు ధర్నా చేస్తున్నారు. మృతునికి భార్యా ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
జీఎంహెచ్‌సీ కార్మికురాలి ఆత్మహత్యాయత్నం
రాజేంద్రనగర్ : విధుల్లో తొలగించినందుకు మనస్తాపానికి గురైన జీహెచ్ఎంసీ కార్మికురాలు ఆత్మహత్యకు యత్నించింది. రాజేంద్రనగర్‌కు చెందిన పారిశుధ్య కార్మికురాలు లక్ష్మమ్మ(40)ను ఇటీవల జరిగిన సమ్మెలో పాల్గొన్నందుకు గాను విధుల నుంచి తొలగించారు. గత మూడు రోజులుగా తొలగింపునకు గురైన వారంతా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె బుధవారం ఉదయం పురుగులమందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు ఉస్మానియాకు తరలించారు. -
వేం నరేందర్‌రెడ్డికి బిగుసుకుంటున్న ఉచ్చు
-
మెటల్ అనుకుని చంపేసిన రోబో
జర్మన్: జర్మనీలోని ఫ్రాంకఫర్ట్లోని ఫోక్స్‌వాగన్ ప్లాంట్‌లో ఒక రోబో మనిషిని చంపేసిన ఘటన కలకలం సృష్టించింది. 22 ఏళ్ల వయసున్న ఉద్యోగి స్టేషనరీ రోబోకు సాయం చేస్తుండగా ప్రమాదవశాత్తూ రోబో చేతిలో బలైపోయాడు. ఎదురుగా ఉన్నమనిషిని మెటల్ ప్లేట్‌గా పొరబడిందో ఏమో తెలియదు గానీ, ఆ వ్యక్తిని పట్టి నలిపేసి, దారుణంగా చిదిమేసింది. అక్కడ ఉన్న మరో ఉద్యోగి అదృష్టవశాత్తూ బతికి బయటపడ్డాడు. ఫోక్స్‌వాగన్ ప్రతినిధి ఈ విషయాన్ని ధ్రువీకరించారు. రోబోను ఆపరేట్ చేయడంలో ఎక్కడో మానవ తప్పిదం జరిగిందని ఆయన వెల్లడించారు. దీనిపై మరిన్ని వివరాలను వెల్లడించడానికి నిరాకరించి, విచారణ చేస్తున్నామని మాత్రం తెలిపారు. గురువారం ఈ కథనం జర్మన్ మీడియాలో బాగా వ్యాపించింది. దీంతో ఈ కేసులో ఎవరిపై కేసు నమోదు చేస్తున్నారు, ఎవరిని విచారిస్తారనే ఆసక్తికర చర్చకు తెరలేపింది. -
విద్యార్థినులను బంధించి పూజలు
వరంగల్ (ఏటూరు నాగారం) : వరంగల్ జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలోని కస్తూరిబా బాలికల ఆశ్రమ పాఠశాలలో పూనకంతో ఊగిపోయిన ఓ వర్కర్ విద్యార్థినులను బంధించి పూజలు చేసింది. ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. పదవ తరగతి విద్యార్థినులను వారి తరగతి గదిలోనే బంధించి పూజలు చేసింది. దీంతో వారంతా భయాందోళనకు గురయ్యారు. ఈ సన్నివేశాన్ని చిత్రీకరించేందుకు వెళ్లిన మీడియాపై కూడా ఆమె చిర్రుబుర్రులాడింది. సమాచారం అందుకున్న పోలీసులు స్కూల్‌కు వచ్చి హల్చల్ చేసిన సదరు మహిళను మందలించారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహించాలని ఉపాధ్యాయులకు పోలీసులు సూచించారు. -
సింగరేణిలో బంకర్ కూలి కార్మికుడి మృతి
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా శ్రీరాంపూర్‌లోని సింగరేణి గనుల వద్ద బుధవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఒక కార్మికుడు మృతి చెందాడు. శ్రీరాంపూర్‌కు చెందిన శ్రీకాంత్(26) సీహెచ్‌పీ ప్రాంతంలోని బంకర్ వద్ద విధులు నిర్వహిస్తుండగా అది కూలటంతో శిథిలాల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు. అక్కడే ఉన్న మరో ఏడుగురు కార్మికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. శిథిలాల నుంచి శ్రీకాంత్ మృతదేహాన్ని వెలికి తీశారు. అతని కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్నారు. (శ్రీరాంపూర్) -
క్వారీ వద్ద కార్మికుడి మృతి
పొందూరు: రాపాక పంచాయతీ పరిధిలోని ఇల్లయ్యగారిపేట సమీపంలో నిర్వహిస్తున్న క్వారీలో ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడు. క్వారీలో పని చేస్తుండగా కొండపై నుంచి కాలు జారి పడిపోవడంతో ఇల్లయ్యగారిపేటకు చెందిన కొంచాడ శ్రీను(28) అనే వ్యక్తి చనిపోయినట్టు గ్రామస్తులు తెలిపారు. ఎస్సై కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లీజుదారులు, క్వారీ మేస్త్రీలు తగు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. కొండపైకి ఎక్కి పెద్ద రాళ్లను తోయడం, మట్టిని తీస్తున్నప్పుడైన ఈ ప్రమాదం సంభవించి ఉండవచ్చునని స్థానికులు అనుమానిస్తున్నారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకొన్నాయి. అనాథలైన భార్య, పిల్లలు శ్రీనుకు భార్య వరలక్ష్మి, ఇద్దరు చంటి పిల్లలు సురేంద్ర (2 సంవత్సరాలు), వాసు( నెల రోజులు) ఉన్నారు. తల్లి లక్ష్మీనారాయణ, తండ్రి చిన్నప్పన్న వృద్ధులు. ఆ కుటుంబమంతా రాయిపని చేసుకొనే జీవనం సాగిస్తున్నారు. శ్రీను మృతితో భార్య బిడ్డలు, తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. -
గని కార్మికుడి మృతి
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలోని ఓ బొగ్గు గనిలో సోమవారం ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ కార్మికుడు మృతి చెందాడు. వివరాలు జిల్లాలోని శ్రీరాంపూర్ డివిజన్లో ఉన్న ఎస్సార్-3 గనీలో ప్రమాదవశాత్తు గడర్స్లో నీళ్లు చేరాయి. దీంతో అక్కడ విధులు నిర్వర్తిస్తున్న మైనింగ్ సర్ధార్ సత్యనారామణ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సిఉంది. (మంచిర్యాల) -
ప్రమాదవశాత్తు కార్మికుడి మృతి
కుషాయిగూడ: ఓ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో కార్మికుడు మృతిచెందాడు. ఈ సంఘటన శనివారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని చర్లపల్లి పారిశ్రామికవాడలో చోటు చేసుకుంది. వివరాలు... నల్లగొండ జిల్లా, నకిరేకల్ మండలం, చిప్పలపల్లికి చెందిన బి. సైదులురెడ్డి(40) బతుకుతెరువు కోసం కొంత కాలం క్రితం నగరానికి వచ్చి చక్రిపురంలో నివాసం ఉంటున్నాడు. చర్లపల్లి పారిశ్రామికవాడ ఫేజ్-2లోని బీఈసీ పరిశ్రమలో గత ఏడు సంవత్సరాలుగా కార్మికునిగా పనిచేస్తున్నాడు. శనివారం కంపేనీలోని హీట్ ట్రీట్మెంట్ ఎయిర్లీక్ను పరిశీలించే క్రమంలో చోటు చేసుకున్న ప్రమాదంలో సైదులురెడ్డి తీవ్ర గాయాలపాయ్యాడు. దీంతో అతన్ని చికిత్స నిమిత్తం ఈఎస్ఐ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. మృత దేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. -
పోరుసత్వం
సింగరేణి సంస్కరణలో భాగంగా ఆ యాజమాన్యం తొలగించిన కార్మికులను మళ్లీ విధుల్లోకి చేర్చుకోవాలంటూ ఓ డిసి్మస్డ్ కార్మికుడిగా పదేళ్ల క్రితం తన తండ్రి చేపట్టిన ఒంటరి పోరును ఆయన మరణానంతరం కూడా నేటికీ కొనసాగిస్తున్నారు రాధిక. తండ్రి నుంచి ఉద్యమ వారసత్వం పొందిన ఆమె... ‘కార్మికులకు నేనున్నా’నంటూ వారితో కలిసి ధర్నాలు, రాస్తారోకోలు చేయడంతో పాటు ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా మందమర్రి పట్టణానికి చెందిన సింగరేణి డిస్మిస్డ్ కార్మిక సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు రామిల్ల రాజలింగు కూతురైన రాధిక పోరాట నేపథ్యం గురించి ఆమె మాటల్లోనే... నాన్న, అమ్మ పద్మ, చెల్లి సురేఖ... ఇదీ మా కుటుంబం. మాది మందమర్రి. అమ్మ మంచిర్యాల ఏరియా ఆస్పత్రిలో స్టాఫ్‌నర్సు. మా చదువు, అమ్మ ఉద్యోగం రీత్యా మేం చిన్నప్పుడే మంచిర్యాలకు వచ్చేశాం. నాన్న మాత్రం మందమర్రిలోనే ఉండిపోయారు. అప్పుడప్పుడు మంచిర్యాల వచ్చి వెళ్లేవారు. మాకు ఊహ వచ్చిన తర్వాత నాన్నను కలిసిన సందర్భాలు తక్కువ. అమ్మే కష్టపడి మమ్మల్ని చదివించింది. ఇప్పుడు నేను ఇండస్ట్రియలిస్ట్ని. నా భర్తతో కలిసి హైదరాబాద్‌లో ఉంటున్నా. పోయాకే తెలిసింది! ఫిబ్రవరి 09, 2014 మా నాన్న చనిపోయిన రోజు. అప్పుడు నేను హైదరాబాద్‌లో ఉన్నా. నాన్న చనిపోయిన సంగతి తెలిసిన వెంటనే మందమర్రికి బయల్దేరా. నాన్న పార్థివదేహాన్ని ఆయన దీక్షకు కూర్చొన్న శిబిరం దగ్గరే ఉంచడంతో.. ఆయన్ను చూడడానికి చాలా మంది వచ్చారు. ఎక్కువ మంది గుమిగూడితే గొడవ అవుతుందని భావించిన పోలీసులు భౌతికకాయాన్ని బలవంతంగా శ్మశానానికి తరలించారు. నేను వెళ్లే సరికే అంతిమయాత్ర అయిపోయింది. నేనే అంత్యక్రియలు చేశా. అప్పుడు అక్కడున్న వాళ్లు చెప్పారు మా నాన్న గడిపిన జీవితం గురించి. ఆయన ఆశయం గురించి. అప్పటి వరకు డి స్మిస్డ్ కార్మికుల గురించి నాన్న చేపట్టిన న్యాయపోరాటం గురించి మాకు తెలిసింది కొంతే. కానీ నాన్న చనిపోయిన తర్వాత.. ఆయన చేపట్టిన ఉద్యమం.. చేసిన పోరాటం గురించి ఆ ప్రాంతంలో ఉన్న వాళ్లు చర్చించుకుంటూ కన్నీళ్ల పర్యంతమయ్యారు. ‘‘బతికిన్నాళ్లూ మా కోసమే బతికాడు. ఎవరి దగ్గరా చేయి చాపలేదు. ప్రయాణానికి డబ్బు లేకపోతే మందమర్రి నుంచి మంచిర్యాల వరకు (15కి.మీ) నడుచుకుంటూ వెళ్లేటోడు. ఆకలైనా చెప్పుకొనేటోడు కాదు. తినడానికి లేకపోతే తాగి పడేసిన కొబ్బరిబొండాల్లో నుంచి కొబ్బరి తీసి తిన్నాడమ్మా మీ నాన్న’’ అని నాన్న స్నేహితులు చెప్పడం నన్ను కలిచివేసింది. పదకొండో రోజు పిండప్రదానం చేయడం సంప్రదాయం. ఇంట్లో మగ పిల్లలు లేకపోవడంతో పిండ ప్రదానం చేయాలని నేనే మందమర్రిలోని యాపల్ ప్రాంతానికి వెళ్లా. కానీ నా కంటే ముందే అక్కడ వందకు పైగా డిస్మిస్డ్ కార్మికుల పిల్లలు మా నాన్నకు పిండ ప్రదానం చేయాలని ఉండడం చూసి నా కళ్లనిండా నీళ్లు వచ్చాయి. నాతో పాటు అందరూ మా నాన్నకు పిండ ప్రదానం చేశారు. నాన్న చేసిన ఉద్యమం నాకు తోబుట్టువులనూ ఇచ్చిందని తెలుసుకున్నా. ఇలాంటి పలు సంఘటనలు నన్ను మా నాన్న ఆశయ సాధన వైపు అడుగులేసేలా చేశాయి. నిరసనలు... విజ్ఞప్తులు డిస్మిస్డ్ కార్మికులతో, వారి కుటుంబ సభ్యులతో కలిసి నేటికీ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా. నాయకులకు, అధికారులకు వినతి పత్రాలు సమర్పిస్తున్నా. ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోని డిస్మిస్డ్ కార్మిక సంఘ నేతలు కొప్పుల భాస్కర్ (కొత్తగూడెం), బుర్ర సారయ్య (భూపాలపల్లి)తో కలిసి ఉద్యమాలు చేపడుతున్నా. నాన్న ప్రారంభించిన పోరాటాన్ని కార్మికుల సమస్య పరిష్కారమయ్యేంత వరకు కొనసాగించాలన్నదే నా ఆశయం. వేలమంది కోసం ఒక్కరు రాధిక తండ్రి రామిల్ల రాజలింగు 2004 మే 24 న ఒంటరిగా దీక్షలో కూర్చున్నారు. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలో ఉన్న సుమారు 7వేల మంది డిస్మిస్డ్ కార్మికులను ఉద్యోగాల్లోకి తీసుకోవాలంటూ అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టారు. 2006లో మందమర్రి నుంచి ఖమ్మం జిల్లా కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం వరకు, 2009లో మందమర్రి నుంచి హైదరాబాద్‌లోని సింగరేణి భవన్ వరకు పాదయాత్ర చేశారు. చివరకు తన ఆశయం కార్యరూపం దాల్చకుండానే ఏడాది క్రితం తుది శ్వాస విడిచారు. -
‘ఖర్మా’గారంలో నుజ్జయిన జీవితం
అచ్యుతాపురం: యాజమాన్యం నిర్లక్ష్యం మరో కార్మికుడి ప్రాణాన్ని బలితీసుకుంది. ఎస్ఈజెడ్లో ఉత్పత్తి చేపడుతున్న ఆంజనేయ ఎల్లాయ్స్ పరిశ్రమలో మంగళవారం విధులు నిర్వహిస్తూ ఓ కార్మికుడు ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాలివి. రాంబిల్లి మండలం లోవపాలేనికి చెందిన బొంది సత్తిబాబు(28) మంగళవారం ఉదయం ‘ఎ’ షిప్టుకి వెళ్లాడు. పరిశ్రమలో బ్లాస్ట్ ఫర్నిస్ వద్ద మరిగిన లోహపు ద్రావణం నింపిన పాత్రలకు క్రేన్ హుక్కులను తగిలించే పనిలో ఉన్నాడు. హుక్కుతాడు తెగిపోవడంతో అరటన్ను బరువు గల హుక్కు అతని తలపై పడి తల నుజ్జునుజ్జయి అక్కడికక్కడే మృతిచెందాడు. యాజమాన్యం వెంటనే సత్తిబాబు మృతదేహాన్ని అనకాపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించింది. ప్రమాద సమాచారం తెలుసుకున్న సత్తిబాబు కుటుంబసభ్యులు, మత్స్యకారసంఘాల నాయకులు, సీఐటీయు నాయకులు వెంటనే పరిశ్రమకి వచ్చారు. తమకు సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అందివచ్చిన కొడుకు దూరం కావడంపై కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. మృతుడి కుటుంబానికి 20 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని మత్స్యకారసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ కార్మికులు విధులను బహిష్కరించారు. రూ.20 లక్షల పరిహారం ప్రమాదంపై ఆందోళనలతో దిగి వచ్చిన పరిశ్రమ యాజమాన్యం మృతుని కుటుంబాన్ని ఆదుకోవడానికి సమ్మతించింది. మృతుని కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం, దహన ఖర్చులకు రూ.యాభై వేలు, కుటుంబంలో ఇద్దరికి ఉద్యోగాలు ఇవ్వడానికి అంగీకరించింది. యాజమాన్యం నిర్లక్ష్యమే.. ప్రమాదానికి పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా కార్మికలు చెబుతున్నారు. ఈ పరిశ్రమలో వివిధ లోహాల మిశ్రమాన్ని మరిగించి ఎల్లాయ్ అచ్చులను తయారు చేస్తారు. బ్లాస్ట్ ఫర్నిస్కి పది అడుగుల సమీపంలోనే కార్మికులు పనిచేస్తున్నారు. అధిక వేడి, పొగ వద్ద వారు గంటల తరబడి పని చేయాల్సి ఉంటుంది. మరిగిన ద్రవ లోహపు ముద్దలు ఎక్కడికక్కడ పడుతున్నాయి. భద్రత రిత్యా బ్లాస్ట్ఫర్నిస్ వద్ద పని చేసేవారికి ప్రత్యేక సూట్, బూటు, హెల్మెట్ ఇవ్వాలి. అయితే ఇక్కడి యాజమాన్యం కార్మికులకు నాణ్యత లేని భద్రతా పరికరాలను అందించింది. ఆరు నెలలకొకసారి భద్రత పరికరాలను మార్చాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. దీంతో ఏళ్లతరబడి అవే పరికరాలతో పనిచేస్తున్నామని,సామగ్రిని మార్చమని కోరితే ఉద్యోగంలో నుంచి తొలగిస్తామని యాజమాన్యం బెదిరిస్తోందని కార్మికులు వాపోతున్నారు. అండ కోల్పోయారు... మృతుడు సత్తిబాబుకు తల్లిదండ్రులు, ఇద్దరు అన్నలు, అక్క, చెల్లెలు ఉన్నారు. అన్న అమ్మోరు వికలాంగుడు. చెల్లెలు శ్రీదేవికి పెళ్లి చేయాల్సి ఉంది. కుటుంబ పోషణలో తల్లిదండ్రులకు అండగా ఉన్న సత్తిబాబుకు మూడేళ్ల క్రితం దేవితో పెళ్లయ్యింది. కుటుంబానికి అండగా ఉండే సత్తిబాబు ఇలా దుర్మరణం పాలవ్వడంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. పర్యవేక్షణ లేదు... ద్రవ రూపంలో ఉన్న లోహాన్ని బకెట్లలో తరలించి అచ్చువేసే ప్రక్రియ అత్యంత ప్రమాదకరమైంది. ద్రావణం పైన పడితే చావడం తధ్యం. అందువల్ల ప్రతిరోజు క్రేన్ తాళ్లు ఏ విధంగా ఉన్నాయో ప్రత్యేక సాంకేతిక నిపుణులు పరీక్షించాలి. కానీ లాభాల కోసం తాపత్రయ పడే పరిశ్రమ యాజమాన్యం తగినంత సిబ్బందిని నియమించడం లేదు. బ్లాస్ట్ ఫర్నిస్ వద్ద పనిచేసే కార్మికులు గంటకొకసారి ఏసీ గదిలో విశ్రాంతి తీసుకోవాలి. అలాంటి ఏర్పాట్లు ఇక్కడ లేవు. -
పెదగొన్నూరులో రగులుతున్న చిచ్చు
ఏడు ఇళ్లు దహనం రూ.10 లక్షల ఆస్తి నష్టం నిన్నమొన్నటివరకు ప్రశాంతంగా ఉన్న ఆ గ్రామంలో కక్షల కార్చిచ్చు రాజుకుంది. 48 గంటల వ్యవధిలో గ్రామంలో ఒక హత్య, లక్షల విలువైన ధాన్యం రాశుల దహనం, తాజాగా ఏడు ఇళ్లు దగ్ధం ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పెదగొన్నూరు (ముదినేపల్లి రూరల్), న్యూస్‌లైన్ : పెదగొన్నూరులో కక్షలు, కార్పణ్యాల చిచ్చు రగులుతూనే ఉంది. గ్రామంలో హత్య, ధాన్యం రాశుల దహనం ఘటనలు జరిగి 48 గంటలు గడవకముందే.. బుధవారం రెండో వర్గానికి చెందిన ఏడు ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనలో రూ.10 లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించినట్లు అంచనా. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. సోమవారం రాత్రి గ్రామానికి చెందిన కోటప్రోలు గంగాధరరావు హత్యకు గురయ్యాడు. అదే సమయంలో గ్రామానికి చెందిన పలువురు రైతుల ధాన్యం రాశులు, కుప్పలు, గడ్డివాములు అగ్నికి ఆహుతయ్యాయి. పాత కక్షల నేపథ్యంలోనే ఈ ఘటనలు జరిగాయని, వీటన్నింటికీ గోకరకొండ ముత్యాలయ్య బాధ్యుడని స్థానికులు భావిస్తున్నారు. వారి అనుమానాలను బలపరుస్తూ ముత్యాలయ్య పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో నిందితుడైన ముత్యాలయ్య ఇంటినుంచి ఒక్కసారిగా మంటలు ఎగసి పడ్డాయి. వాటిని స్థానికులు అరికట్టే లోపుగానే ఇతర ఇళ్లకు వ్యాపించాయి. అదుపు చేయడం సాధ్యం కాకపోవడంతో ఏడు ఇళ్లు వరుసగా దగ్ధమయ్యాయి. ఇళ్లలోని నగదు, బంగారం, వెండి తదితర వస్తువులన్నీ కాలిపోయి.. బాధితులంతా కట్టుబట్టలతో మిగిలారు. తప్పుదోవ పట్టించేందుకే... హత్య, ధాన్యం దహనం చేసిన కేసులో నిందితుడు ముత్యాలయ్య పోలీసుల ఎదుట లొంగిపోయి స్టేషన్లోనే ఉన్నాడు. గ్రామంలో ముత్యాలయ్యపై తీవ్ర వ్యతిరే కత వ్యక్తమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో హతుడు గంగాధరరావు కుటుంబ సభ్యులపై దృష్టి మరల్చేందుకు ముత్యాలయ్య బావమరిది భార్య బత్తుల జ్యోతి మధ్యాహ్నం సమయంలో ముత్యాలయ్య ఇంటికి వచ్చి నిప్పంటించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాద స్థలానికి చేరుకున్న గుడివాడ డీఎస్పీ జీ నాగన్న ఎదుట గ్రామస్తులంతా జ్యోతి మాత్రమే గృహ దహనాలకు కారణమని చెప్పారు. పలువురు మహిళలు ఇందుకు సంబంధించి డీఎస్పీకి వివరాలు తెలిపారు. వెంటనే స్పందించిన డీఎస్పీ జ్యోతిని అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. బాధితులంతా తమకు న్యాయంచేసి రక్షణ కల్పించాలని డీఎస్పీ, ఎస్ఐ వీ సతీష్‌లను కోరారు. ప్రమాదంలో నిందితుడు ముత్యాలయ్య ఇంటితో పాటు తణుకు శ్రీనివాసరావు, బత్తుల క్రీస్తురాజు, వెంకట నాగమణి, రాములమ్మ, లక్ష్మీనరసింహం, నల్లగచ్చు వెంకటనారాయణ, నాంచారయ్యల ఇళ్లు కాలిపోయాయి. ఆర్ఐ గౌతమ్‌కుమార్, వీఆర్వో కాంతారావు బాధితులనుంచి వివరాలు సేకరించారు. లక్ష రూపాయల నగదు కాలిపోయింది... స్థలం రిజిస్ట్రేషన్ చేయించేందుకు, పొలం కౌలు చెల్లించేందుకు లక్ష రూపాయల నగదు ఇంట్లో దాచిపెట్టా. ప్రమాదంలో నగదుతో పాటు 5 కాసుల బంగారం, 10 తులాల వెండి కాలిపోయాయి. - బత్తుల క్రీస్తురాజు, బాధితుడు కట్టుబట్టలతో మిగిలాం అగ్ని ప్రమాదంలో ఇంట్లోని వస్తువులు, పొలం దస్తావేజులు కాలిపోయాయి. కట్టుబట్టలతో మిగిలాం. ఏం పాపం చేశామని మాకిలాంటి పరిస్థితి ఏర్పడింది? - నల్లగచ్చు నాగప్రసాద్, బాధితుడు జ్యోతి వల్లే ప్రమాదం ముత్యాలయ్య బంధువైన జ్యోతి ఇంటికి వచ్చి బయటకు వెళ్లిన వెంటనే ఆ ఇంటి నుంచి మంటలు వచ్చాయి. ప్రమాదానికి జ్యోతి కారణమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. - ఎర్రంశెట్టి వరల క్ష్మి, ప్రత్యక్ష సాక్షి -
‘గుడ్‌హార్ట్’ గోల్మాల్
కరీంనగర్ క్రైం, న్యూస్‌లైన్ : నిరుపేదలు, కూలీలకు ఎల్ఐసీలో బీమా పాలసీలు చేయించే పేరుతో కరీంనగర్‌లోని గుడ్‌హార్ట్ అనే స్వచ్ఛంద సంస్థ రూ.కోట్లలో మోసానికి పాల్పడింది. మూడు నెలల క్రితం సంస్థ నిర్వాకం బయటపడడంతో పత్రికల్లో కథనాలు వచ్చాయి. వెంటనే స్పందించిన సంస్థ నిర్వాహకులు త్వరలోనే ప్రీమియం డబ్బులను ఎల్ఐసీకి జమచేస్తామని వివరణ ఇచ్చారు. కానీ ఇంతవరకు గుడ్‌హార్ట్ సంస్థ తమకు డబ్బు చెల్లించలేదని ఎల్ఐసీ అధికారులు స్పష్టం చేయడంతో ఏజెంట్లు ఇబ్బందుల్లో పడ్డారు. జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన ఏజెంట్లు సోమవారం కరీంనగర్‌లోని ఎల్ఐసీ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. తాము ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బులను గుడ్‌హార్ట్ సంస్థకు చెల్లించామని, ఇప్పుడు డబ్బులు కట్టలేదని ఎల్ఐసీ అధికారులు అంటున్నారని, ఇప్పుడు తమ పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నించారు. కిరణ్ అనే ఏజెంట్.. 1400పైగా పాలసీలు చేసి రూ.5లక్షలకు పైగా ప్రీమియం గుడ్‌హార్ట్ సంస్థకు చెల్లించగా, ఆ సంస్థ మాత్రం ఎల్ఐసీకి రూ.2లక్షలే జమచేసిందని, మిగతా రూ.3లక్షలను తన జేబులో వేసుకుందని ఆరోపించారు. మోసం ఇలా.. పేదలకు సైతం బీమా పాలసీలు ఉండాలనే ఉద్దేశంతో ఎల్ఐసీ ఆరేళ్ల క్రితం జీవన్మాధుర్, జీవన్మంగళ్ అనే రెండు పాలసీలను ప్రకటించింది. వీటికోసం ఎల్ఐసీలో మెక్రో ఇన్సూరెన్స్ అనే విభాగాన్ని ఏర్పాటు చేసింది. జీవన్మాధుర్కు వారానికి రూ.25, జీవన్మంగళ్కు వారానికి రూ.15 చెల్లించి పాలసీ తీసుకోవచ్చు. వీటిని వారానికి ఒకసారి లేదా నెలకు ఒకసారి వసూలు చేసి సక్రమంగా చెల్లించడానికి ఎన్జీవోలకు అవకాశం ఇచ్చింది. వీరు పాలసీల్లో సభ్యులను చేర్చడం, వారి డాటా నమోదు చేయడం, వారు కడుతున్న ప్రీమియం డబ్బులను ప్రతినెల ఐల్ఐసీకి జమచేయాలి. ఇలా కరీంనగర్ జిల్లా మొత్తం, వరంగల్ జిల్లాలోని ఏటూరునాగారం, భూపాలపల్లి మండలాల్లో పాలసీలు చేయించడానికి కరీంనగర్‌కు చెందిన రహీం అనే వ్యక్తికి చెందిన గుడ్‌హార్ట్ అనే సంస్థకు బాధ్యతలు అప్పగించింది. వీరు అయా మండలాల్లో ఫీల్డ్ అఫీసర్లను, ఏజెంట్లను నియమించుకుని పాలసీలు చేయించి ప్రీమియం డబ్బులను ఎల్ఐసీకి జమచేయాలి. కరీంనగర్‌లోని గాంధీరోడ్‌లో గల వైశ్యభవన్ ఎదురుగా గుడ్‌హార్ట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. రెండు జిల్లాలోని మహిళ సంఘాల సభ్యులను, అంగన్వాడీ కార్యకర్తలను, ఆర్ఎంపీలు, పీఎంపీలను, రిటైర్డ్ ఉద్యోగులను సుమారు 2వేల మందిని ఏజెంట్లుగా నియమించకున్నారు. వీరిద్వారా రెండు జిల్లాల్లో సుమారు 40వేల మంది ఖాతాదారులను చేర్పించుకున్నారు. మొదటి ప్రతి నెల సుమారు రూ.1.50 కోట్లు వసూలు చేసి ఎల్ఐసీకి చెల్లించారు. తర్వాత రెండు సంవత్సరాల నుంచి వసూలు చేసిన డబ్బులను తన జేబులో వేసుకోవడం మొదలు పెట్టారు. ఇలా రెండేళ్లలో సుమారు 15 కోట్లు దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కొందరు పాలసీదారులు మృతి చెందగా వారికి సంబంధించిన పాలసీ డబ్బుల కోసం కుటుంబసభ్యులు ఎల్ఐసీలో సంప్రదించారు. నెలనెలా డబ్బులు కట్టడం లేదని, అందుకే కొన్నేళ్ల క్రితమే పాలసీలను మూసివేశామని ఎల్ఐసీ అధికారులు చెప్పడంతో గుడ్‌హార్ట్ బాగోతం వెలుగులోకి వచ్చింది. దీంతో పాలసీదారులు ఏజెంట్లపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ క్రమంలో తిరిగి గత పదిహేను రోజులుగా కార్యాలయం మూసి ఉండడంతో.. ఏజెంట్లు ఎల్ఐసీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ఈ విషయమై ఎల్ఐసీ సీనియర్ మేనేజర్ సదానందను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా.. గుడ్‌హార్ట్ సంస్థపై రూ.6లక్షల గోల్‌మాల్‌కు సంబంధించి ఫిర్యాదులు వచ్చాయని, విచారణ కొనసాగుతోందని తెలిపారు. ఆ సంస్థకు ఇప్పటికే నోటీసులు జారీ చేశామని, ఇంకా సమాధానం ఇవ్వలేదని చెప్పారు. -
బతికించండి
జన్నారం, న్యూస్‌లైన్ : జన్నారం మండలం కామన్పల్లి గ్రామానికి చెందిన తోకల ప్రభాకర్ కూలీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నాడు. పెద్ద కూతురు రజిత వివాహం చేశాడు. నాలుగు కాసులు సంపాదిస్తామని 2011లో రూ.1.10 లక్షలు ఖర్చు చేసి దుబాయ్ వెళ్లాడు. దుబాయ్ కంపెనీ తిరిగి ఇంటికి పంపించింది. మళ్లీ రూ.60 వేలు ఖర్చు చేసి వెళ్లాడు. అక్కడ 19 నెలలు పనిచేసి ఆరోగ్యం బాగా లేకపోవడంత తిరిగొచ్చాడు. ఈ సమయంలోనే రెండో కూతురు సరిత వివాహం చేశాడు. తన కుమారుడు రాజేందర్‌ను డిగ్రీ వరకు చదివించాడు. ప్రభాకర్ ఖాళీగా కూర్చోలేక నాలుగు నెలలుగా గేదెలను మేపుతూ వచ్చిన ధాన్యం, డబ్బులతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పిడుగులాంటి వార్త.. హాయిగా గడుపుతున్న ఆ కుటుంబంలో పిడుగులాంటి వార్త. ఆరోగ్యం బాగాలేదని జనవరి 28న కరీంనగర్‌లోని ఆస్పత్రికి వెళ్లగా వైద్యులు రెండు కిడ్నీలు చెడిపోయాయని తెలిపారు. మరోసారి హైదరాబాద్‌కు వెళ్లి పరీక్షలు చేయించుకున్నాడు. రెండు కిడ్నీలు చెడిపోయాయని, వారానికి రెండుసార్లు డయాలసిస్ చేయించాలని సూచించారు. అసలే పేదలం. పనిచేస్తేగాని పూట గడవదు. వారానికోసారి డయాలసిస్ చేయించుకోవాలంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి. అని మదనపడుతున్నారు. దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అయినా ఉన్నది అమ్మి రూ.1.50 లక్షలు పెట్టి ఆస్పత్రులు తిరిగారు. అయినా కిడ్నీలు బాగు కాలేదు. కిడ్నీలు మార్చాలంటే రూ.5 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారని, అంత డబ్బు మా వద్ద లేదని, ఎవరైన ఆదుకుంటే చికిత్స చేయించుకుంటానని ప్రభాకర్ కోరుతున్నాడు. పశువుల కాపరిగా భార్య కుటుంబ పెద్ద జబ్బుతో మంచం పట్టాడు. ఇక కుటుంబాన్ని పోషించాల్సిన భారం భార్య అమృతపై పడింది. తన భర్త మేపే గేదెలను ఇప్పుడు ఆమె మేపుకుంటూ పశువుల కాపరిగా మారింది. గేదెలను మేపినందుకు గ్రామస్తులు ఇచ్చే ధాన్యంతో కుటుంబాన్ని పోషిస్తున్నారు. కుమారుడు చదువు మానేసి తండ్రి ఆరోగ్యం చూసుకుంటున్నాడు. మనసున్న మారాజులు ఆపన్నహస్తం అందించి పేద కుటుంబంలో వెలుగులు నింపాలని వారు వేడుకుంటున్నారు. అన్ని ఆస్పత్రులు తిరిగాం.. పేద కుటుంబమైన నాన్న నన్ను పెద్ద చదువులు చదివించాలనుకున్నాడు. మా కోసం బయట దేశం పోయి నన్ను డిగ్రీ వరకు చదివించాడు. ఇప్పుడు నేను డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాను. నాన్న జబ్బు పడ్డాడు. రెండు కిడ్నీలు చెడిపోయాయని వైద్యులు చెప్పారు. చేతిలో డబ్బులు లేవు. వారానికి రెండు సార్లు కరీంనగర్ లోని చెడిమెల ఆనందరావు ఆస్పత్రిలో డయాలసిస్ చేపిస్తున్నాము. వారానికి రూ.3 వేల వరకు ఖర్చు అవుతుంది. దాతలు స్పందించాలి. మా నాన్నను బతికించండి. - రాజెందర్, కుమారుడు -
పందెం నోట్లు.. గెలిచినోళ్లకు పాట్లు
ఏలూరు (టూటౌన్)/పాలకొల్లు, న్యూస్‌లైన్ : అతడో కూలీ. ఏలూరు మండలం వెంకటాపు రం పంచాయతీ పరిధిలోని బగ్గయ్యపేటలో నివాసం ఉంటున్నాడు. సంక్రాంతి రోజుల్లో పేకాట శిబిరానికి వెళ్లాడు. ఆసు.. రాణి.. కింగ్.. జోకర్ వంటి పేక ముక్కలు కలిసొచ్చాయి. ఐదారు ఆటల్లో రూ.1,500 గెలిచాడు. ఆ డబ్బుతో ఆనందంగా ఇంటికొచ్చాడు. రెండు రోజుల క్రితం ఏలూరు నగరంలోని ఓ వస్త్ర దుకాణానికి వెళ్లి జీన్ ప్యాంటు కొన్నాడు. క్యాష్ కౌంటర్లో రూ.500 నోట్లు రెండు ఇచ్చాడు. అందులో ఒకటి నకిలీదని తేలింది. క్యాషియర్ నిలదీయడంతో సిగ్గుపడిపోయూడు. ఆ నోటు తీసుకుని అక్కడే చించివేశాడు. పాలకొల్లు ప్రాంతానికి చెందిన మరో కూలీ కోడి పందేలకు వెళ్లాడు. డేగ పుంజుపై రూ.500, నెమలి పుంజుపై మరో రూ.500 పైపందెం కట్టాడు. మొత్తం నాలుగు పందేల్లో గెలవడంతో అతడికి రూ.2000 వచ్చింది. గెలిచిన ఆనందంతో మద్యం దుకాణానికి వెళ్లాడు. రూ.500 నోటు ఇచ్చి మద్యం సీసా అడిగాడు. దానిని పరిశీలించిన మద్యం అమ్మకందారు అతడివైపు ఎగాదిగా చూసి అది నకిలీ నోటని చెప్పాడు. అవాక్కవడం ఆ కూలీ వంతైంది. మారుమాట్లాడకుండా వెనక్కి వచ్చేశాడు. నాలుగైదు రోజులుగా జిల్లాలో చాలాచోట్ల ఇలాంటి ఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నారుు. భారీగా నకిలీ నోట్ల చలామణి సంకాంత్రి సంబరాలు ముగిశాయి. కోడి పందాలు, జూదాలు ముమ్మరంగా సాగాయి. కోట్లాది రూపాయలు చేతులు మారాయి. డబ్బు పోగొట్టున్న వారు విచారంలో మునిగిపోయూరు.. పందాలు గెలిచినోళ్లు హుషారెత్తిపోయూరు. కానీ.. వారి ఆనందం ఎన్నో రోజులు నిలబడలేదు. కోడిపందాలు, జూదాలు నిర్వహించిన వారు లెక్కలు తేల్చుకుంటున్న తరుణంలో బయటపడుతున్న నకిలీ నోట్లు వారిని బేజారెత్తిస్తున్నాయి. ఇటీవల కాలంలో దొంగనోట్లు మార్పిడి విచ్చలవిడిగా సాగిపోతోంది. పోలీసులు ఎంత అప్రమత్తంగా ఉన్నా మార్పిడి ముఠాలు గుట్టుచప్పుడు కాకుండా తమపని తాము చేసుకుపోతున్నారు. అడపాదడపా వీరిని పోలీసు అరెస్టులు చేయడం, కోర్టుకు పంపడం చేస్తున్నా బెయిల్ విడుదలైన అనేకమంది అదేపనిలో నిమగ్నమవుతున్నారు. ఈసారి సంక్రాంతి కోడి పందాలను నకిలీ నోట్ల మార్పిడికి లక్ష్యంగా ఎంచుకున్నారు. జూదగాళ్ల అవతారం ఎత్తి పెద్దమొత్తంలో పందాలు కాసి నకిలీ నోట్లను చలామణిలో పెట్టారు. పాలకొల్లు మండలం పూలపల్లిలో రెండుచోట్లు భారీ పందాలు నిర్వహించగా యలమంచిలి, పోడూరు మండలాల్లో మోస్తరు పందాలు జరిగాయి. ఈ శిబిరాల్లోకి చొరబడిన వ్యక్తులు పెద్దమొత్తంలో పందాలు కాశారు. ఒడ్డిన సొమ్ములో కొన్ని నకిలీ, మరికొన్ని అసలు నోట్లు పెట్టి ఇవ్వగా, జూదాల నిర్వహకులు హడావిడిలో వాటిని తీసుకున్నారు. పందాల తంతు ముగియడంతో ప్రస్తుతం సొమ్ము పంపకాలు, లాభనష్టాల బేరీజు వేసుకుంటున్న తరుణంలో నకిలీ నోట్లు బయట పడుతున్నాయి. వాటిని మార్చే సందర్భంలో కొందరు దొరికిపోతున్నారు. అక్కడిక్కడే వాటిని చింపేసి బయటపడుతున్నారు. మరికొందరైతే వాటిని దర్జాగా మార్చుకుని బయటపడుతున్నారు. వస్త్ర దుకాణాలు, మద్యం షాపులు, సినిమా హాళ్లు, పెట్రోల్ బంకుల వద్ద దొంగనోట్లు ఎక్కువగా బయటపడుతున్నాయి. -
రాక్‌వూల్ పరిశ్రమలో కార్మికుడి మృతి
కోహీర్, న్యూస్‌లైన్: మండలంలోని కవేలి రాక్‌వూల్ కర్మాగారంలో పని చేస్తున్న ఓ కార్మికుడు విధి నిర్వహణలో అకస్మాత్తుగా మృతి చెందాడు. దీంతో బంధువులు, కుటుంబీకులు పరిహారం చెల్లించాలంటూ మృతదేహంతో ఆందోళనకు దిగారు. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన ఆందోళన పోలీసుల చొరవతో రాత్రి 8 గంటలకు ముగిసింది. మృతుని బంధువులు, తోటి కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం...మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన పర్తుగారి సంగయ్య (55) కవేలి రాక్‌వూల్ కర్మాగారంలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆదివారం రాత్రి విధులకు వెళ్లిన అతను తెల్లవారుజామున 3.30 గంటలకు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన తోటి కార్మికులు అతన్ని జహీరాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. అయితే విధి నిర్వహణలో చనిపోయిన సంగయ్య కుటుంబాన్ని యాజమాన్యం ఆదుకోవాలని బంధువులు ఆందోళనకు దిగారు. కర్మాగారంలోని అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఎదుట సంగయ్య మృతదేహాన్ని ఉంచి ధర్నాకు దిగారు. రూ.15 లక్షలు నష్ట పరిహారం, సంగయ్య కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బంధువుల తరఫున కార్మిక సంఘం నాయకులు కర్మాగారం అధికారులతో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. అయితే మరోసారి కవేలి సర్పంచు మొగులయ్య, వెంకటాపూర్ సర్పంచు మల్లికార్జున్, మాజీ ఎంపీటీసీ మణ్యయ్యగౌడ్ల ఆధ్వర్యంలో కార్మిక సంఘం నాయకులు కర్మాగారం అధికారులు అడ్మినిస్ట్రేషన్ జనరల్ మేనేజర్ ర త్నాకర్, ఆపరేషన్ జనరల్ మేనేజర్ సతీష్ గుప్తలతో చర్చలు జరిపారు. అయితే యాజమాన్యం స్థానికంగా లేనందున వారితో మాట్లాడేంతవరకూ తాము ఏమీ చెప్పలేమని కర్మాగారం అధికారులు చెప్పారు. దీంతో ఆగ్రహించన కార్మికులు కూడా మృతుడు సంగయ్య బంధువులతో కలిసి కర్మాగారం ఆవరణలో బైఠాయించారు. కర్మాగార యాజమాన్యానికి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న జహీరాబాద్ సీఐ నరేందర్ సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నించారు. అయితే పరిహారం చెల్లించేందుకు కర్మాగారం అధికారులు ఒప్పుకోకపోవడంతో సీఐ కూడా ఏమీ చేయలేకపోయారు. మరోవైపు పలువురు కార్మిక, రాజకీయ పార్టీల నేతలు మృతుని కుటుంబ సభ్యులకు నష్ట పరిహారం కోసం ఇప్పించేందుకు కర్మాగారం అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దీంతో రాత్రి 8 గంటల సమయంలో సీఐ నరేందర్ మరోసారి కార్మాగారం అధికారులు, మృతుని కుటుంబీకులతో మాట్లాడారు. బాధిత కుటుంబానికి తక్షణ అవసరం కింద రూ.50 వేలు చెల్లిస్తామని ఒప్పుకున్న కర్మాగారం అధికారులు, పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేందుకు 10 రోజుల అనంతరం యాజమాన్యంతో చర్చలు జరుపుతామని వెల్లడించారు. ఇందుకు సంగయ్య కుటుంబీకులు ఒప్పుకోవడంతో పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు జహీరాబాద్ ఆస్పత్రికి తరలించారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.