అనంతపురం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది
బత్తలపల్లి: అనంతపురం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బత్తలపల్లి మండలం మాల్యవంతం గ్రామ శివారులో చంద్రశేఖరరెడ్డి(42) అనే భవన నిర్మాణ కార్మికుడిని గుర్తుతెలియని దుండగులు బండరాళ్లతో తలపై మోది హతమార్చారు. జాతీయ రహదారి పక్కన చంద్రశేఖరరెడ్డి విగతజీవుడై పడిఉండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు దుండగులకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నారు. మృతుడు మాల్యవంతం గ్రామానికి చెందిన వాడని పోలీసులు చెప్పారు.కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.