కెనడా ప్రభుత్వం తమ దేశంలో పనిచేసే విదేశీ వర్కర్ల రక్షణకు చర్యలు తీసుకుంటుంది. ఆ దేశంలో టెంపరరీ ఫారిన్ వర్కర్ ప్రోగ్రామ్ (టీఎఫ్‌డబ్ల్యూపీ) నిబంధనలను ఉల్లంఘించిన యజమానులకు విధించే జరిమానా పెంచాలని యోచిస్తోంది. విదేశీ వర్కర్ల హక్కులను ఉల్లంఘించిన యాజమాన్యాలపై 2023లో 2.1 మిలియన్ల(రూ.17 కోట్లు) అడ్మినిస్ట్రేటివ్ మానిటరీ పెనాల్టీలు (ఏఎంపీ) విధిస్తున్నా పరిస్థితిలో మార్పు లేదని ప్రభుత్వం తెలిపింది. దాంతో మరిన్ని కఠిన నియమాలను అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
కెనడాలో నివసిస్తున్న విదేశీ వర్కర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎంప్లాయిమెంట్ అండ్ సోషల్ డెవలప్‌మెంట్ కెనడా (ఈఎస్‌డీసీ) టెంపరరీ ఫారెన్ వర్కర్(టీఎప్‌డబ్ల్యూ) అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా విదేశీ కార్మికుల హక్కులను రక్షించేలా చర్యలు తీసుకుంటున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఈఎస్‌డీఎసీ టీఎప్‌డబ్ల్యూ ప్రోగ్రామ్ కింద 2,122 తనిఖీలను నిర్వహించింది. వీటిలో 94 శాతం కంపెనీ యజమానులపై ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపింది. సంస్థలు ఏఎంపీ పెనాల్టీగా రూ.17 కోట్లు చెల్లిస్తున్నా ఇలాంటి ఫిర్యాదులు పెరుగుతుండడం ఆదోళనకరంగా మారినట్లు ప్రభుత్వం తెలిపింది. వీరిపై మరిన్ని కఠిన నిబంధనలు విధించాలనే యోచిస్తోంది.
ఇదీ చదవండి: పారిస్ ఒలింపిక్స్.. భారీగా ట్రావెల్ బుకింగ్స్!
కెనడా ప్రభుత్వం ఇన్‌స్పెక్టర్ల నియామకం, వర్కర్ల భద్రతా నిర్వహణ, వారి సమస్యల పరిష్కారం కోసం రెండేళ్ల కింద ప్రారంభించిన ఈఎస్‌డీసీ ప్రోగ్రామ్‌కు కేటాయించే నిధులను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఆ దేశంలో వర్కర్ల భద్రాతా కోసం కాన్ఫిడెన్షియల్ టిప్ లైన్ అనే హెల్ప్‌లైన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. అందులో వివిధ భాషల్లో మాట్లాడే ఏజెంట్లు 24/7 పని చేసేలా ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment