
సాక్షి, సుల్తాన్‌బజార్: సుల్తాన్‌బజార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి తన యజమాని డబ్బును పోలీసులు తీసుకున్నారని చెప్పడంతో తీవ్ర కలకలం రేగింది. అయితే ఈ విషయం మీడియాకు తెలియడంతో ఓ నకిలీ పోలీసు రూ.6 లక్షలు కాజేసినట్లు వైరలైంది. అయితే సుల్తాన్‌బజార్ పోలీసులు మాత్రం ఇది ఫేక్ అంటూ కొట్టిపడేస్తున్నారు. కోదాడకు చెందిన అమర్నాథ్‌రెడ్డి సొమ్ము రూ.6 లక్షలు పోయినట్లు తప్పుడు సమాచారం పోలీసులకు అందింది.
డబ్బు పోయిందని డ్రామానా?
రూ.6 లక్షలు తన డ్రైవర్ తండ్రి హన్మంతు ద్వారా కూకట్‌పల్లి నుంచి కోదాడకు తీసుకువెళ్తున్నారు. హన్మంతుకు డబ్బుపై ఆశ కలగడంతో డబ్బులను కోఠి ఆంధ్రా బ్యాంక్ చౌరస్తా వద్ద పోలీసుల తనిఖీల్లో పోలీసులు తీసుకున్నారని చెప్పడంతో అమర్నాథ్‌రెడ్డి సుల్తాన్‌బజార్ పోలీసులను వాకబు చేశారు. పోలీసులు కోఠి ఆంధ్రాబ్యాంకు చౌరస్తా వద్ద ఎలాంటి డబ్బు పట్టుకోలేదని తేల్చి చెప్పారు. ఈ విషయమై సుల్తాన్‌బజార్ ఇన్‌స్పెక్టర్ భిక్షపతిని వివరణ కోరగా తమకు ఈ విషయమై ఎలాంటి ఫిర్యాదు రాలేదని డబ్బుపై ఆశతోనే హన్మంతు నకిలీ పోలీసులంటూ డ్రామా ఆడుంటారని అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment