క్వారీ వద్ద కార్మికుడి మృతి | Worker killed at quarry | Sakshi
Sakshi News home page

క్వారీ వద్ద కార్మికుడి మృతి

Published Sun, Jun 14 2015 1:15 AM | Last Updated on Sun, Sep 3 2017 3:41 AM

Worker killed at quarry

పొందూరు: రాపాక పంచాయతీ పరిధిలోని ఇల్లయ్యగారిపేట సమీపంలో నిర్వహిస్తున్న క్వారీలో ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడు. క్వారీలో పని చేస్తుండగా కొండపై నుంచి కాలు జారి పడిపోవడంతో ఇల్లయ్యగారిపేటకు చెందిన కొంచాడ శ్రీను(28) అనే వ్యక్తి చనిపోయినట్టు గ్రామస్తులు తెలిపారు. ఎస్సై కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లీజుదారులు, క్వారీ మేస్త్రీలు తగు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. కొండపైకి ఎక్కి పెద్ద రాళ్లను తోయడం, మట్టిని తీస్తున్నప్పుడైన ఈ ప్రమాదం సంభవించి ఉండవచ్చునని స్థానికులు అనుమానిస్తున్నారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకొన్నాయి.
 
 అనాథలైన భార్య, పిల్లలు
  శ్రీనుకు భార్య వరలక్ష్మి, ఇద్దరు చంటి పిల్లలు సురేంద్ర (2 సంవత్సరాలు), వాసు( నెల రోజులు) ఉన్నారు. తల్లి లక్ష్మీనారాయణ, తండ్రి చిన్నప్పన్న వృద్ధులు. ఆ కుటుంబమంతా రాయిపని చేసుకొనే జీవనం సాగిస్తున్నారు. శ్రీను మృతితో భార్య బిడ్డలు, తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement