యాదాద్రి: నల్లగొండ జిల్లా యాదగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో నిర్వహిస్తున్న వరుణయాగం సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది. శనివారం ఉదయం లైట్లను అమర్చుతున్న శ్రీ వర్ష ఏజెన్సీకి చెందిన ఎల్లేశ్ అనే కార్మికుడికి విద్యుదాఘాతంతో గాయాలు అయ్యాయి. సమయానికి కొండపైన డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.