ఓ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో కార్మికుడు మృతిచెందాడు.
కుషాయిగూడ: ఓ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో కార్మికుడు మృతిచెందాడు. ఈ సంఘటన శనివారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని చర్లపల్లి పారిశ్రామికవాడలో చోటు చేసుకుంది. వివరాలు... నల్లగొండ జిల్లా, నకిరేకల్ మండలం, చిప్పలపల్లికి చెందిన బి. సైదులురెడ్డి(40) బతుకుతెరువు కోసం కొంత కాలం క్రితం నగరానికి వచ్చి చక్రిపురంలో నివాసం ఉంటున్నాడు. చర్లపల్లి పారిశ్రామికవాడ ఫేజ్-2లోని బీఈసీ పరిశ్రమలో గత ఏడు సంవత్సరాలుగా కార్మికునిగా పనిచేస్తున్నాడు. శనివారం కంపేనీలోని హీట్ ట్రీట్‌మెంట్ ఎయిర్‌లీక్‌ను పరిశీలించే క్రమంలో చోటు చేసుకున్న ప్రమాదంలో సైదులురెడ్డి తీవ్ర గాయాలపాయ్యాడు. దీంతో అతన్ని చికిత్స నిమిత్తం ఈఎస్‌ఐ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. మృత దేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.