
మెటల్ అనుకుని చంపేసిన రోబో
జర్మనీలోని ఫ్రాంకఫర్ట్లోని ఫోక్స్వాగన్ ప్లాంట్లో ఒక రోబో మనిషిని చంపేసిన ఘటన కలకలం సృష్టించింది.
జర్మన్: జర్మనీలోని ఫ్రాంకఫర్ట్లోని ఫోక్స్వాగన్ ప్లాంట్లో ఒక రోబో మనిషిని చంపేసిన ఘటన కలకలం సృష్టించింది. 22 ఏళ్ల వయసున్న ఉద్యోగి స్టేషనరీ రోబోకు సాయం చేస్తుండగా ప్రమాదవశాత్తూ రోబో చేతిలో బలైపోయాడు. ఎదురుగా ఉన్నమనిషిని మెటల్ ప్లేట్గా పొరబడిందో ఏమో తెలియదు గానీ, ఆ వ్యక్తిని పట్టి నలిపేసి, దారుణంగా చిదిమేసింది.
అక్కడ ఉన్న మరో ఉద్యోగి అదృష్టవశాత్తూ బతికి బయటపడ్డాడు. ఫోక్స్వాగన్ ప్రతినిధి ఈ విషయాన్ని ధ్రువీకరించారు. రోబోను ఆపరేట్ చేయడంలో ఎక్కడో మానవ తప్పిదం జరిగిందని ఆయన వెల్లడించారు. దీనిపై మరిన్ని వివరాలను వెల్లడించడానికి నిరాకరించి, విచారణ చేస్తున్నామని మాత్రం తెలిపారు. గురువారం ఈ కథనం జర్మన్ మీడియాలో బాగా వ్యాపించింది. దీంతో ఈ కేసులో ఎవరిపై కేసు నమోదు చేస్తున్నారు, ఎవరిని విచారిస్తారనే ఆసక్తికర చర్చకు తెరలేపింది.