Top Stories
ప్రధాన వార్తలు
నారా లోకేష్ రెడ్‌బుక్ అమలులో ముఖ్య పాత్ర ఆయనదే?
ఏబీ వెంకటేశ్వరరావు.. ఐపీఎస్! పదేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో తరచూ వార్తల్లోకి ఎక్కిన వివాదాస్పద అధికారి. రిటైర్ అయిన తరువాత కూడా తన వ్యాఖ్యలు, వైఖరితో మరిన్ని వివాదాల్లో చిక్కుకుంటున్న వ్యక్తి కూడా. టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన కుమారుడు నారా లోకేష్‌ల అండతో ఆయన ఈ మధ్య కాలంలో మరింత చెలరేగిపోతున్నట్లు విమర్శలు వస్తున్నాయి.తాజాగా ఆయన తన ‘కమ్మ’ కులం వారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, హితబోధ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఎవరేమనుకుంటే తనకేమన్నట్టుగా ఆయన మాట్లాడటం.. తన మాటల వల్ల ఇతర కులాల వారి మనోభావాలు ఎంత దెబ్బతింటున్నాయో ఆలోచించకపోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క కులం వారు ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి రావడాన్ని అడ్డుకోగలరా?. కులమతాలకు అతీతంగా అందరూ ఓట్లేస్తేనే ఒక పార్టీ ఎన్నికవుతుంది కదా?. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి అధికారంలోకి రాకుండా కమ్మ కులం వాళ్లు అన్ని రకాలుగా అడ్డుకోవాలన్నది ఏబీ వెంకటేశ్వరరావు ఇచ్చిన పిలుపు! ఇందుకోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండాలని, అహర్నిశలు కష్టపడాలని కూడా ఆయన తన కులం వారిని కోరుకున్నారు. కమ్మ వారికి ఏదో పెద్ద సందేశం ఇచ్చానని ఆయన అనుకుంటున్నారేమో తెలియదు కానీ, దీనివల్ల కమ్మ వారిపై మిగిలిన వారికి మరింత వ్యతిరేకత వస్తుంది. అసహ్యం ఏర్పడుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఈయన లాంటి వ్యక్తులు కమ్మ కులం వారిని భ్రష్టు పట్టిస్తున్నట్లుగా ఉంది.ఈ క్రమంలోనే ఆయన వైఎస్ జగన్‌పై పరుష పదాలతో విమర్శించారు కూడా. సభ్య సమాజం ఏమాత్రం అంగీకరించని విమర్శలివి. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా ఆయన రెడ్డి, ఇతర కులాల వారిని ఏకం చేస్తున్నారని, వైఎస్ జగన్‌ను అభిమానించే బలహీన వర్గాల వారందరూ ఒక్కతాటిపైకి వచ్చేలా చేస్తున్నారని కొందరు వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వం పనితీరుకు ఏబీ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయని కూడా అంటున్నారు. వైఎస్ జగన్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను చూస్తే అసలు ఆయన ఐపీఎస్ అధికారేనా? అన్న అనుమానం వ్యక్తం చేసిన వాళ్లూ ఉన్నారు. వీటన్నింటిని బట్టి చూస్తే రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు వెనుక కీలక పాత్రధారి ఈయనే అన్న అనుమానమూ వస్తోంది.వాస్తవానికి ఏబీ వెంకటేశ్వరరావు ఒకప్పుడు ఇంత వివాదాస్పదుడు కానేకాదు. ఇంత చెడ్డ పేరూ లేదు. తెలుగుదేశంతో జత కట్టిన తర్వాతే ఇలా తయారయ్యారు అన్నది ఎక్కువ మంది అభిప్రాయం. రెడ్‌బుక్ సృష్టికర్త లోకేష్ కనుసన్నలలో పనిచేస్తూ అరాచకాలకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా మారారన్న విమర్శ ఎదుర్కుంటున్నారు. 2014 టర్మ్‌లో చంద్రబాబు ప్రభుత్వ వ్యవహార శైలి వల్ల కమ్మ వర్గం వారు ఇతర సామాజికవర్గాల దృష్టిలో విలన్ల మాదిరి కనిపించేవారు. తత్ఫలితంగా మిగిలిన కులాలన్నీ ఏకమై తెలుగుదేశం పార్టీని ఓడించాయి. ఆ తర్వాత వివిధ కారణాలతో 2024లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మళ్లీ ఇదే ధోరణి ఆరంభమైనట్లుగా ఉంది.వీరి రెడ్‌బుక్‌లో ఉన్న పేర్లలో ఎక్కువ భాగం రెడ్డి లేదా షెడ్యూల్ కులాల వారే. వైఎస్ జగన్ ప్రభుత్వంలో కీలకంగా పనిచేశారన్న కారణంగా ఈ వర్గాల అధికారులు కొందరికి ఏడు నెలలుగా పోస్టింగ్ ఇవ్వలేదు. ఐఏఎస్ టాప్ ర్యాంకర్ ముత్యాలరాజు వంటి వారు కూడా ఈ జాబితాలో ఉన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాగల అవకాశం ఉన్న మహిళా ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా అవమానించారు. అలాగే టీడీపీ ప్రభుత్వంలో జరిగిన స్కామ్‌లను బయటకు తీశారన్న కోపంతో ఏదో ఒక నెపం పెట్టి కొంతమంది ఐపీఎస్‌లను సస్పెండ్ చేయడం, కేసు పెట్టి అరెస్టు చేయాలన్న ఆలోచన కూడా చేశారు. ఇదంతా ప్రజాస్వామ్యబద్ధంగా ఉందని ఏబీ వెంకటేశ్వరరావు ఫీల్ అవుతుండవచ్చు.కానీ, ఇండియన్ పోలీస్ సర్వీసెస్‌కు ఎంపికై సుదీర్ఘ కాలం బాధ్యతలు నిర్వహించిన ఈయనకు రాజ్యాంగంపై అవగాహన ఉండాలి. ప్రభుత్వం, ముఖ్యమంత్రి పేషీ, మంత్రులు ఎలా పనిచేస్తారో తెలిసి ఉండాలి. లోకేష్ వంటి అనుభవం లేని వారు కక్ష సాధింపు చర్యలకు దిగుతుంటే, వారించవలసిన ఈయనే స్వయంగా కుల ప్రస్తావన తెచ్చి ప్రసంగాలు చేయడం శోచనీయం. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా కాకుండా అడ్డుకునేందుకు దేనికైనా సిద్ధపడాలన్న ఏబీ వ్యాఖ్య వెనుక ఉద్దేశం ఏమిటన్నది చాలామంది వేస్తున్న ప్రశ్న. హింసకు కూడా వెనుకాడవద్దని పరోక్షంగా పిలుపునిస్తున్నారా? అంటూ మీడియాలో కథనాలూ వచ్చాయి.2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంల మ్యానిప్యులేషన్ జరిగిందన్న అనుమానాలు ఉన్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లోనూ అదే పద్ధతి అవలంబించాలన్నది ఆయన చేస్తున్న సూచనా?. సమాజంలో కులాల కొట్లాటలు ఉంటే ఉండవచ్చు కానీ.. ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నత హోదాల్లో పనిచేసే వాళ్లు కూడా ఇంత తక్కువ స్థాయి ఆలోచనలు చేయడం, చెత్త ప్రకటనలు చేయడం ఎంత వరకూ సబబు?. 2014-19 మధ్య కాలంలో చంద్రబాబు వద్ద ఇంటెలిజెన్స్ అధికారిగా ఉన్న ఏబీ శాంతి భద్రతల విషయాన్ని పక్కనబెట్టి రాజకీయంగా వైఎస్సార్సీపీని ఎలా దెబ్బ తీయడమన్న విషయంపైనే దృష్టిపెట్టేవారని చాలా మంది టీడీపీ నేతలు చెబుతారు. ప్రస్తుత ఎమ్మెల్యే బోండా ఉమా పార్టీ సమావేశంలో ఒకసారి మాట్లాడుతూ తెలుగు యువత అధ్యక్ష పదవిని పొందడానికి ఏబీ వెంకటేశ్వర రావు క్లియరెన్స్ తీసుకోవాలని ఆశావహులకు సూచించిన వీడియో అప్పట్లో కలకలం రేపింది.వైఎస్సార్సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీలోకి తీసుకురావడానికి ప్రలోభాలు పెట్టడంలో ఏబీతో పాటు ఒక మీడియా అధినేత విశేష పాత్ర పోషించారని చెబుతారు. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక ఆయనపై ఇజ్రాయిల్ నుంచి గూఢచర్య పరికరాల కొనుగోలులో జరిగిన అక్రమాలపై కేసు పెట్టి సస్పెండ్ చేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై విచారణకు ఓకే చేసింది. తనపై ఆ కేసు పెట్టినందుకు ఏబీకి ఆగ్రహం ఉండవచ్చు. కానీ, ఆ కేసులో తాను సచ్ఛీలుడినని రుజువు చేసుకోవచ్చు. ఎటూ ప్రభుత్వం వారిదే కనుక తమకు కావల్సిన జీవోలను తెప్పించుకుంటున్నారని చెబుతున్నారు. కోర్టు ద్వారా రిటైర్మెంట్ రోజున సస్పెన్షన్ ఎత్తివేత ఉత్తర్వు పొందారు. దాన్ని గౌరవించి గత ప్రభుత్వం ఈయనకు పోస్టింగ్ ఇచ్చింది. ఏబీ తన వ్యాఖ్యల్లో వైఎస్ జగన్‌తోపాటు వైఎస్ రాజశేఖరరెడ్డిని కూడా విమర్శించారు.అయితే, వైఎస్సార్ హాయంలో ఈయనకు వచ్చినవన్నీ దాదాపు మంచి పోస్టులేనని సోషల్ మీడియాలో వ్యాప్తిలోకి వచ్చిన వివరాలను బట్టి అర్ధం అవుతుంది. ఉదాహరణకు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావుకు కర్నూలు రేంజి డీఐజీ పోస్టు ఇచ్చింది. వైఎస్సార్ సొంత జిల్లా అయిన కడప కూడా ఈ రేంజ్‌లోనే ఉంది. మరి ప్రాముఖ్యత లభించినట్లా? కాదా? హైదరాబాద్‌లో జాయింట్ కమిషనర్, పోలీస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ రిక్రూటింగ్, వైజాగ్ రేంజ్ ఐజీ వంటి బాధ్యతలను కూడా అప్పట్లో అప్పగించారు. వైఎస్సార్ మరణం తర్వాత రోశయ్య ముఖ్యమంత్రి అయ్యాక ఈయనను అంతగా ప్రాధాన్యం లేని ఏపీఎస్పీ బెటాలియన్ ఐజీగా నియమించారు. అయినా వైఎస్సార్‌పై ఈయన విమర్శలు చేయడం ధర్మమా? అన్నది కొందరి ప్రశ్న.ఇక్కడ మరో మాట చెప్పాలి. తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించేసి అవమానించినప్పుడు కమ్మవారికి అవమానం జరిగినట్లు కాదా?. చంద్రబాబుకో, ఏబీ వంటివారికో ఏదైనా ఇబ్బంది వస్తే, వారిపై ఆరోపణలు వస్తే కమ్మ వారందరికీ వచ్చినట్లా? ఏ కులంలో అయినా లాభం కొందరికే లభిస్తూంటుంది. సంపాదన, పెత్తనం కూడా కొందరికే దక్కుతుంది. అలాంటివారు ఆ కులంలోని ఇతరులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటారు. ఏబీ కూడా సరిగ్గా అదే పని చేసినట్లుగా కనిపిస్తుంది. ఏబీ వెంకటేశ్వరరావు, చంద్రబాబు, లోకేష్ వంటివారి ధోరణి వల్ల రెడ్లతో సహా మిగిలిన పలు కులాల వారిలో అభద్రతాభావం ఏర్పడుతుంది. పైకి కాపులను కలుపుకున్నట్లు కనిపిస్తున్నా వారికి క్షేత్రస్థాయిలో అనేక అవమానాలు జరుగుతున్నట్లు చెబుతున్నారు. ఇందుకు ఉదాహరణ పెడన నియోజకవర్గం ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ ఎదుటే ఒక జనసేన నేత ఆత్మహత్యాయత్నం చేయడం. ఇక పవన్ కళ్యాణ్ డిప్యూటి సీఎంగా ఉంటే, ఆయనకు పోటీగా లోకేష్‌ను కూడా ఆ హోదాలోకి తీసుకురావడానికి జరుగుతున్న ప్రయత్నాలు కాపులలో కాక రేపుతోంది.జనసేన, టీడీపీ మధ్య సోషల్ మీడియాలో వార్ జరుగుతోంది. ఇలాంటి తరుణంలో ఏబీ వెంకటేశ్వరరావు ఈ తరహా అసందర్భ ప్రసంగాలు చేసి సమాజంలో మరింత అశాంతికి దోహదపడడం ఐపీఎస్ హోదాకే అవమానం కాదా? రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఉద్యోగంలోకి వచ్చిన ఈయన రిటైరయ్యాక వ్యవహరిస్తున్న తీరు చూశాక, పదవి బాధ్యతలలో ఉన్నప్పుడు నిష్పక్షపాతంగా ఉన్నారని ఎవరైనా అనుకోగలరా?. -కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
పుట్టుకతో వచ్చే పౌరసత్వం: భారత్ సహా ఏ దేశాల్లో ఎలా ఉందంటే..
విదేశీయులకు పిల్లలు పుడితే.. ఆ చిన్నారులకు అమెరికాలో సహజంగా దక్కుతున్న పౌరసత్వ హక్కును రద్దు చేయాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుకున్నారు. కానీ, న్యాయస్థానం తాజాగా ఆ ఆదేశాలకు మోకాలడ్డేసింది. దీంతో అప్పీల్‌కు వెళ్లాలని ట్రంప్ నిర్ణయించారు. అయితే.. జన్మతః దక్కే పౌరసత్వం విషయంలో మిగతా దేశాలు ఏం విధానాలు పాటిస్తున్నాయో తెలుసా?.అమెరికా గడ్డపై పుట్టే ప్రతీ ఒక్కరికీ అక్కడి పౌరసత్వం దక్కేలా అక్కడి రాజ్యాంగం హక్కు కల్పించింది. 14వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఆ హక్కు దక్కాలి కూడా. అయితే ఆ హక్కును తనకున్న విశిష్ట అధికారంతో మార్చేయాలని ట్రంప్ భావించారు.ఈ క్రమంలోనే రాజ్యాంగ సవరణతో సంబంధం లేకుండా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. ఇకపై అమెరికా నేలపై విదేశీయులకు పుట్టే పిల్లలను అమెరికా పౌరులుగా పరిగణించకూడదన్నది ఆ ఆదేశాల సారాంశం.👉పుట్టే పిల్లలకు పౌరసత్వం వర్తింపజేయడమే బర్త్‌రైట్ సిటిజన్‌షిప్. తల్లిదండ్రుల జాతీయత.. అంటే వాళ్లది ఏ దేశం, ఇమ్మిగ్రేషన్ స్టేటస్.. అంటే ఏ రకంగా వలసలు వచ్చారు ఇలాంటివేవీ పరిగణనలోకి తీసుకోకుండా అమెరికాలో ఇంతకాలం పౌరసత్వ గుర్తింపు ఇస్తున్నారు. అయితే ప్రపంచం మొత్తంగా ‘‘జస్ సాన్‌గ్యుఇనిస్, జస్ సోలి’’ అనే రెండు సిద్ధాంతాల ఆధారంగా సిటిజన్‌షిప్‌ను వర్తింపజేస్తున్నారు. అయితే.. ఎక్కువ దేశాలు మాత్రం పౌరసత్వాన్ని ‘‘జస్ సాన్‌గ్యుఇనిస్’’ ఆధారంగానే పౌరసత్వం అందిస్తున్నాయి . జస్ సాన్‌గ్యుఇనిస్ అంటే.. వారసత్వంగా(రక్తసంబంధంతో) పౌరసత్వ హక్కు పొందడం. జస్ సోలి అంటే.. ఫలానా దేశంలో పుట్టిన కారణంగా ఆ దేశ పౌరసత్వ హక్కు లభించడం. 👉ఇప్పటిదాకా అమెరికా మాత్రమే కాదు.. మరికొన్ని దేశాలు పుట్టుకతో పౌరసత్వం విషయంలో జస్ సోలి వర్తింపజేస్తున్నాయి. అందులో అమెరికా పొరుగుదేశాలైన కెనడా కూడా ప్రధానంగా చెప్పుకోవాలి. అమెరికా తరహాలోనే ఈ దేశం కూడా తమ గడ్డపై పుట్టే విదేశీయుల పిల్లలకు జన్మతః పౌరసత్వం వర్తింపజేస్తోంది. అయితే అమెరికాలోలానే ఇక్కడా దీనిపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.👉అమెరికా రెండు ఖండాల్లో మెక్సికో, అర్జెంటీనాతో సహా చాలాదేశాలే ఈ జాబితాలో ఉన్నాయి. అయితే.. చిలీ, కంబోడియా మాత్రం ఇవ్వడం లేదు. ఆ దేశాలు జస్ సాన్‌గ్యుఇనిస్ ఆధారంగా పౌరసత్వం అందించడంపై ప్రధానంగా దృష్టిసారించాయి. 👉యూరప్, ఆసియా, ఆఫ్రికా.. చాలా దేశాలు జస్ సాన్‌గ్యుఇనిస్ మీదే జన్మతః పౌరసత్వాన్ని అందిస్తున్నాయి. అయితే కొన్ని దేశాలు మాత్రం షరతులతో కూడిన సడలింపులు ఇచ్చాయి ఉదాహరణకు.. జర్మనీ, ఫ్రాన్స్‌లాంటి దేశాలు తమ దేశాల్లో పుట్టే పిల్లలకు సంబంధించి.. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు తమ దేశాల్లో నివాసం ఏర్పాటు చేసుకుని కొన్నేళ్లపాటు(ప్రస్తుతం 8 సంవత్సరాలుగా ఉంది) జీవించి ఉండాలి. అలా ఉంటే ఆ పిల్లలకు ఆ దేశాల పౌరసత్వం వర్తిస్తుంది. అలాగే.. కొన్ని దేశాలు న్యాయపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని కూడా పౌరసత్వం ఇస్తున్నాయి.👉భారత్‌లో జన్మతఃపౌరసత్వంపై కఠిన నిబంధనలు ఉన్నాయి. జస్ సాన్గ్యుఇని అనుసరిస్తోంది మన దేశం. అంటే.. వారసత్వంగా రక్తసంబంధీకులకు పౌరసత్వం వర్తిస్తుందన్నమాట. అయితే.. 1928లో మోతిలాల్ నెహ్రూ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ.. జస్ సోలిని భారత్‌లోనూ వర్తింపజేయాలని ప్రతిపాదించింది. అంటే.. భారత గడ్డపై జన్మించే విదేశీయులకు కూడా ఇక్కడి పౌరసత్వం వర్తింపజేయాడన్నమాట. జస్ సాన్గ్యుఇని ‘జాతి భావన’ మాత్రమే ప్రతిబింబిస్తుందని, అదే జస్ సోలి అనేది సమాన హక్కుల భావనను చూపిస్తుందని ఈ కమిటీ అభివర్ణించింది. ఈ కమిటీలో నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, తేజ్ బహదూర్ సప్రూ ఉన్నారు.1949లో రాజ్యాంగం కూడా ఈ ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకుంది. కానీ, కాలక్రమేణా భారత్‌లో వారసత్వ పౌరసత్వానికే ప్రాధాన్యం లభించింది. 1955లో భారత పౌరసత్వ చట్టం.. జన్మతః పౌరసత్వ చట్టాలకు కఠిన నిబంధనలను చేర్చింది. తల్లిదండ్రుల్లో ఒకరు కచ్చితంగా భారత పౌరసత్వం ఉన్నవాళ్లు ఉండాలి. మరొకరు చట్టపరంగా వలసదారు అయి ఉంటే సరిపోతుంది.👉జపాన్‌లోనూ కఠిన నిబంధనలే అమలు అన్నాయి. అయితే ఏ జాతీయత లేని స్థితిలో ఆ పిల్లలకు అక్కడి పౌరసత్వం ప్రసాదిస్తారు. స్పెయిన్‌లో పేరెంట్స్‌లో ఎవరో ఒకరికి కచ్చితంగా పౌరసత్వం ఉండాలి. లేదంటే ఎలాంటి జాతీయత లేని పిల్లలైనా అయి ఉండాలి.👉ఇటలీలో బర్త్‌రైట్ సిటిజన్‌షిప్‌పై పరిమితులున్నాయి. పేరెంట్స్‌లో ఎవరో ఒకరికి ఇటలీ పౌరసత్వం ఉండాలి. లేదంటే.. ఆ బిడ్డకు 18 ఏళ్లు నిండేదాకా ఆ దేశంలోనే ఉండాలి. అప్పుడే పౌరసత్వం ఇస్తారు.👉యూకే, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మలేషియా.. ఇలా మరికొన్ని దేశాల్లోనూ తల్లిదండడ్రులు కచ్చితంగా ఆ దేశ పౌరులై ఉంటేనే, లేదంటే శాశ్వత నివాసుతులై ఉంటేనే అక్కడి పౌరసత్వం సంక్రమిస్తుంది. 👉జన్మతః పౌరసత్వ హక్కుతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. సమానత్వం, ఏకీకరణలతో పాటు జాతీయత విషయంలో న్యాయపరమైన చిక్కులేవీ తలెత్తకుండా ఉంటాయి. అయితే.. అభ్యంతరాలు కూడా అదే స్థాయిలో వినిపిస్తున్నాయి. అక్రమ వలసదారుల్నిప్రొత్సహించడంతో పాటు దేశంపై ఆర్థికపరమైన భారాన్ని మోపుతుంది. ఈ క్రమంలోనే పౌరుల జాతీయత-వలసవిధానం గురించి పెద్ద ఎత్తునే చర్చ నడుస్తోంది. మరోవైపు ఇది ‘‘బర్త్ టూరిజం’’గా మారే ప్రమాదం లేకపోలేదని విమర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో ఉత్తర, దక్షిణ రాష్ట్రాల మధ్య బానిసత్వం, హక్కుల సాధనగా మొదలైన అంతర్యుద్ధం 1861-65 మధ్య కొనసాగింది. దాదాపు 6,20,000 మంది ఈ యుద్ధంలో మరణించారు. ఆ తర్వాత రాజ్యాంగంలోని 14వ సవరణ ద్వారా బర్త్‌రైట్ సిటిజన్‌షిప్ అమల్లోకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి అమెరికా గడ్డపై పుట్టే ప్రతీ చిన్నారికి అక్కడి పౌరసత్వం లభిస్తోంది. ఈ 157 ఏళ్ల చరిత్రను రాజ్యాంగ సవరణ ద్వారా కాకుండా.. తన సంతకంతో మార్చేయాలని ట్రంప్ భావించడం విశేషం.
అమెరికాలో అడుగు పెట్టాలంటే ఇది తప్పని సరి.. నిబంధనలు మార్చిన ట్రంప్
వాషింగ్టన్ : విదేశీయుల ప్రవేశానికి అమెరికా (usa) కొత్త నిబంధనలు విధించింది. విదేశీయులకు పోర్ట్ ఆఫ్ ఎంట్రీ నిబంధనల్లో కీలక మార్పులు చోటు చేసింది. అమెరికా వచ్చే వారికి రిటన్ ఎయిర్ టికెట్ తప్పని సరి చేసింది. ఈ నింబధనల్ని డిపార్ట్మెంట్ ఆఫ్ హోం ల్యాండ్ సెక్యూరిటీ (U.S. Department of Homeland Security) జారీచేసింది. కచ్చితంగా నిబంధనలు అమలు చేయాలని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ డీహెచ్ఎస్కు ఆదేశాలు జారీ చేసింది. ట్రంప్ ఆదేశాలతో రిటన్ టికెట్ లేని కారణంగా నిన్న ఒక్కరోజే వందమంది భారతీయుల్ని వెనక్కి పంపింది. నిబంధనల మేరకు కనీసం 3వేల డాలర్లు లేని మరో వంద మంది భారతీయుల్ని డీహెచ్ఎస్ అనుమతించలేదు.అంతకుముందు, 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే డొనాల్డ్ ట్రంప్తన కార్యచరణ ప్రకటించారు. తాత్కాలిక వీసాలపైనైనా అమెరికాలో ఉద్యోగాలు చేయాలని, సంతానానికి జన్మనివ్వాలని, తద్వారా వారికి అమెరికా పౌరసత్వం దక్కాలని కోరుకొనే భారతీయులతోపాటు ప్రపంచ దేశాల పౌరులకు, అమెరికాలో ఉంటున్న అక్రమ వలసదారులకు నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పెద్ద షాక్ ఇచ్చారు. జన్మతః పౌరసత్వం దక్కే విధానానికి మంగళం పాడేశారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ట్రంప్ సంచలన నిర్ణయాలకు తెరతీశారు. అంతా ఊహించినట్లుగానే తనకున్న అసాధారణ అధికారాలు ఉపయోగించుకొని పదుల సంఖ్యలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేశారు.అమెరికాకే ప్రథమ ప్రాధాన్యం ఇస్తూ ట్రంప్ విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నారు. భారతీయులతోపాటు ప్రపంచదేశాల ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేయగల నిర్ణయాలు సైతం ఉన్నాయి. కానీ, ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లకు చట్టపరమైన రక్షణ కొంతవరకే ఉంటుందని, ఆయన తర్వాత పగ్గాలు చేపట్టబోయే అధ్యక్షులు గానీ, కోర్టులు గానీ వాటిని తిరగదోడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ నిర్ణయాలకు కోర్టుల్లో సవాళ్లు ఎదురుకావడం ఖాయమని అంటున్నారు. నూతన అధ్యక్షుడు జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు ఏమిటంటే... జన్మతః పౌరసత్వం లేనట్లే అమెరికాలో నివసిస్తున్న అక్రమవలసదార్లకు, వలస వచ్చినవారికి, తాత్కాలిక వీసాలపై ఉంటున్నవారికి అమెరికా గడ్డపై సంతానం జన్మిస్తే.. ఇకపై జన్మతః అమెరికా పౌరసత్వం లభించదు. తల్లిదండ్రులు అమెరికా పౌరులు కాకపోయినా ఇక్కడ పుట్టిన వారి బిడ్డలకు జన్మతః పౌరసత్వం లభించే వెసులుబాటు గత శతాబ్ద కాలంగా అమలవుతోంది. ఈ మేరకు వందేళ్ల క్రితమే 14వ రాజ్యాంగ సవరణ చేశారు. 1868లో చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టాన్ని రద్దు చేయాలని ట్రంప్ ఆదేశించారు. జన్మతః పౌరసత్వం లభించే అవకాశం ఉండొద్దని తేల్చిచెప్పారు. దీనివల్ల లక్షలాది మందికి ఇబ్బందులు ఎదురుకానున్నాయి.ప్రధానంగా అమెరికాలో ఉంటున్న విదేశీయులకు జన్మించే సంతానానికి ఇక్కడి పౌరసత్వం దక్కడం కష్టమే. అయితే, ఈ విషయంలో ట్రంప్ నిర్ణయాన్ని కొందరు ఫెడరల్ కోర్టులో సవాలు చేసినట్లు తెలిసింది. చట్టపరంగా ఇది చెల్లదని అంటున్నారు. ట్రంప్ జారీ చేసిన ఆర్డర్ ప్రకారం.. అమెరికా గడ్డపై పుట్టినవారికి పౌరసత్వం రావాలంటే తల్లిదండ్రుల్లో కనీసం ఒక్కరైనా అమెరికా పౌరులై ఉండాలి. లేదా చట్టపరమైన శాశ్వత నివాసిత హోదా(గ్రీన్‌కార్డు హోల్డర్) ఉండాలి. ఒకవేళ వలసదార్లు అమెరికా సైన్యంలో పని చేస్తూ ఉంటే వారికి జన్మించే పిల్లలకు కూడా పౌరసత్వం లభిస్తోంది.అక్రమ వలసదారులంతా వెనక్కే మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన ‘రిమెయిన్ ఇన్ మెక్సికో విధానాన్ని ట్రంప్ పునరుద్ధరించారు. ప్రస్తుతం సరిహద్దుల్లో వేచిచూస్తున్న 70 వేల మంది నాన్–మెక్సికన్ శరణార్థులను వెనక్కి పంపించబోతున్నారు. ‘క్యాచ్ అండ్ రిలీజ్’కు శుభంకార్డు వేశారు. అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని గుర్తించి వెనక్కి పంపబోతున్నారు. శరణార్థులుగా గుర్తించాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నవారికి కూడా వదిలిపెట్టరు. అక్రమ వలసదార్లంతా అమెరికాను విడచిపెట్టి వెళ్లిపోవాల్సిందే. లేకపోతే బలవంతంగానైనా వెళ్లగొడతారు. ఈ విషయంలో ట్రంప్ నిర్ణయానికి చట్టపరమైన సవాళ్లు ఎదురుకాబోతున్నాయి. జాతీయ అత్యవసర పరిస్థితి అమెరికా సార్వభౌమత్వం ప్రమాదంలో పడిందని ట్రంప్ ఎప్పటినుంచో చెబుతున్నారు. అందుకే మెక్సికో సరిహద్దుల్లో జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తూ ఉత్తర్వుపై సంతకం చేశారు. దీంతో మెక్సికో సరిహద్దుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయడానికి, గోడ నిర్మాణానికి స్వేచ్ఛగా నిధులు వాడుకొనే అవకాశం ట్రంప్‌కు లభించింది.
Rohit Sharma: వింటేజ్ ‘హిట్‌మ్యాన్’ను గుర్తు చేసి.. మరోసారి..
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) బ్యాటింగ్ వైఫల్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో విఫలమైన ఈ ముంబై రాజా.. రంజీ ట్రోఫీ(Ranji Trophy) మ్యాచ్‌లోనూ పూర్తిగా నిరాశపరిచాడు. జమ్మూ కశ్మీర్‌తో పోరు(Mumbai Vs Jammu Kashmir)లో రెండు ఇన్నింగ్స్‌లో కలిపి కనీసం ఒక్క అర్ధ శతకం కూడా సాధించలేకపోయాడు.ఫలితంగా అతడిపై మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోహిత్ శర్మ ఇకనైనా టెస్టు ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి.. యువ క్రికెటర్లకు మార్గం సుగమం చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా ఫెయిల్‌కాగా ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌లో కెప్టెన్‌గా, బ్యాటర్‌గా రోహిత్ విఫలమయ్యాడు. దీంతో కనీవినీ ఎరుగని రీతిలో తొలిసారి సొంతగడ్డపై భారత్ 3-0తో ప్రత్యర్థి చేతుల్లో వైట్‌వాష్‌కు గురైంది.అనంతరం.. ఆస్ట్రేలియా గడ్డ మీద ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో కూడా రోహిత్ చేతులెత్తేశాడు. ఫలితంగా 3-1తో ఓడిన భారత్.. పదేళ్ల తర్వాత తొలిసారి బోర్డర్- గావస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియాకు కోల్పోయింది. ఇక గత పదకొండు ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ నమోదు చేసిన స్కోర్లు వరుసగా 2, 52, 0, 8, 18, 11, 3, 6, 10, 3, 9.రంజీల్లోనైనా రాణిస్తాడనిఈ నేపథ్యంలో రిటైర్మెంట్ అంశం తెరమీదకు రాగా.. తాను ఇప్పట్లో తప్పుకొనే ప్రసక్తి లేదని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. ఈ క్రమంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నిబంధనలకు అనుగుణంగా ముంబై తరఫున రంజీ ట్రోఫీ తాజా ఎడిషన్ రెండో దశ పోటీల బరిలో దిగాడు.ఇందులో భాగంగా గురువారం జమ్మూ కశ్మీర్‌తో మొదలైన మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్‌తో కలిసి రోహిత్ ముంబై ఇన్నింగ్స్ ఆరంభించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 19 బంతులు ఎదుర్కొని కేవలం మూడు పరుగులే చేసి నిష్క్రమించాడు. కనీసం రెండో ఇన్నింగ్స్‌లోనైనా రాణిస్తాడనుకుంటే.. శుక్రవారం కూడా రోహిత్ అభిమానులను మెప్పించలేకపోయాడు.వింటేజ్ హిట్‌మ్యాన్‌ను గుర్తుచేసి.. మరోసారి విఫలమైఆరంభంలో దూకుడుగా ఆడుతూ సిక్స్‌లు, బౌండరీలు బాదిన రోహిత్ శర్మ.. వింటేజ్ హిట్‌మ్యాన్‌ను గుర్తు చేశాడు. అయితే, అదే జోరును కొనసాగించలేకపోయాడు. మొత్తంగా 35 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 28 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అతడి ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి.VINTAGE ROHIT SHARMA IS BACK....🔥#RohitSharma#RanjiTrophy#Ranjitropy #RohitSharmapic.twitter.com/NQ3T9m52cu— HitMan (@HitMan_4545) January 24, 2025 జైసూ, గిల్, పంత్ కూడా అంతేఇక తొలి ఇన్నింగ్స్‌లో ఉమర్ నజీర్ బౌలింగ్‌లో పోరస్ డోగ్రాకు క్యాచ్ ఇచ్చి అవుటైన రోహిత్.. తాజాగా యుధ్వీర్ సింఘ్ బౌలింగ్‌లో అబిద్ ముస్తాక్ చేతికి ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా గడ్డ మీద భారీ శతకం(161- పెర్త్) యశస్వి జైస్వాల్ కూడా రంజీ ట్రోఫీలో నిరాశపరిచాడు. జమ్మూ కశ్మీర్‌తో తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు పరుగులు చేసిన ఈ లెఫ్టాండర్.. రెండో ఇన్నింగ్స్‌లో 51 బంతులు ఎదుర్కొని నాలుగు ఫోర్ల సాయంతో 26 పరుగులు మాత్రమే చేశాడు. వీరిద్దరి వైఫల్యం కారణంగా ముంబై జట్టు కష్టాల్లో కూరుకుపోయింది. మరోవైపు.. శుబ్‌మన్ గిల్, రిషభ్ పంత్ కూడా రంజీ పునరాగమనంలో వైఫల్యం చెందారు. కర్ణాటకతో మ్యాచ్‌లో పంజాబ్ ఓపెనర్‌గా బరిలోకి దిగిన గిల్ నాలుగు పరుగులకే పరిమితమయ్యాడు. ఇక ఢిల్లీ క్రికెటర్ రిషభ్ పంత్ సౌరాష్ట్రతో మ్యాచ్‌లో ఒక్క పరుగుకే పెవిలియన్ చేరడం గమనార్హం. చదవండి: Ind vs Engఅతడొక సూపర్‌స్టార్.. మా ఓటమికి కారణం అదే: బట్లర్ What a Lofted drive - rohit sharma #INDvENG #INDvsENG #ChampionsTrophy #RanjiTrophy#RohitSharma pic.twitter.com/igEGrpYc1n— kuldeep singh (@kuldeep0745) January 24, 2025
కమలాపూర్‌లో ఉద్రిక్తత.. కౌశిక్‌రెడ్డిపై టమాటాలతో దాడి!
సాక్షి, కరీంనగర్: కమలాపూర్ గ్రామసభలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి(kaushik Reddy)పై కాంగ్రెస్ శ్రేణులు టమాటాలు విసిరారు. ప్రతిగా బీఆర్ఎస్ కార్యకర్తలు కుర్చీలతో దాడి చేశారు. దీంతో, అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.కరీంనగర్లో మరోసారి రాజకీయం రసవత్తరంగా మారింది. కాంగ్రెస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అనే విధంగా మరోసారి దాడి జరిగింది. నేడు కమలాపూర్‌లో గ్రామసభ జరుగుతున్న సమయంలో అక్కడికి కౌశిక్ రెడ్డి వచ్చారు. సభలో కౌశిక్ రెడ్డి మాట్లాడుతుండగా.. కాంగ్రెస్ శ్రేణులు అత్యుత్సాహం ప్రదర్శించాయి. కాంగ్రెస్ కార్యకర్తలు కౌశిక్ రెడ్డిపైకి టమాటాలు విసిరారు. దీంతో..కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల వద్ద వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి చేయడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రతిగా కాంగ్రెస్ కార్యకర్తలపైకి కుర్చీలు విసిరారు. దీంతో, ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. వెంటనే అక్కడున్న పోలీసులు ఇరు వర్గాలను అడ్డుకున్నారు. అనంతరం, ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో భారీ సంఖ్యలో పోలీసులు గ్రామసభ వద్దకు చేరుకున్నారు.
‘నాపై దుండగుడు కత్తితో ఇదిగో ఇలా దాడి చేశాడు’.. పోలీసులకు సైఫ్ వాంగ్మూలం!
ముంబై : తనపై దుండగుడు జరిపిన దాడి గురించి బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు బాంద్రాలోని సైఫ్ నివాసానికి వెళ్లి దాడి వివరాల్ని సేకరించినట్లు తెలుస్తోంది. పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తనపై దుండగుడు ఏ విధంగా దాడి చేసింది. తాను ఎలా ప్రతిఘటించిన విధానాన్ని సైఫ్ వివరించినట్లు సమాచారం.జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ‘సైఫ్ అలీ ఖాన్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. అందులో.. ‘నేను,నా భార్య కరీనా కపూర్ ఖాన్ 11వ అంతస్తులో బెడ్ రూమ్‌లో ఉన్నాం. ఆ సమయంలో మా ఇంట్లో సహాయకురాలు ఎలియామా ఫిలిప్ బిగ్గరగా కేకలు వేసింది. దుండగుడు (మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్) నా చిన్న కుమారుడు జహంగీర్ ( జెహ్) నిద్రిస్తున్న గదిలోకి చొరబడ్డాడు. కత్తితో అగంతకుడు జెహ్ను బెదిరించాడు. కోటి రూపాయిలు ఇవ్వాలని ఫిలిప్‌ను డిమాండ్ చేశాడు. దుండగుడు కత్తితో బెదిరించడంతో జెహ్ ఏడ్వడం మొదలపెట్టాడు. వెంటనే, దుండగుడి నుంచి జెహ్ను రక్షించేందుకు ఫిలిప్ ప్రయత్నించింది. ఈ క్రమంలో దుండగుడు ఆమెపై కత్తితో దాడి చేశాడు.ఫిలిప్ కేకలు విన్న నేను జెహ్ రూంకు వెళ్లి చూడగా.. ఇద్దరి మధ్య పెనుగులాట జరుగుతోంది. జెహ్ను రక్షించేందుకు నేనూ దుండగుడిని నిలువరించే ప్రయత్నం చేశా. అప్పుడే దుండగుడు నా వీపు భాగం,మెడ, చేతులపై పలుమార్లు కత్తితో పొడిచాడు. నా నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దుండగుడి నుంచి జెహ్ను రక్షించిన సహాయకులు మరో రూంలోకి తీసుకెళ్లారు’ అని పోలీసులకు వివరించారు.ఘటన జరిగిన వెంటనే కుటుంబ సభ్యులు సైఫ్ అలీఖాన్‌ను లీలావతి ఆసుపత్రికి తరలించారు. దుండగుడు కత్తితో దాడి చేయడంతో సైఫ్ అలీఖాన్‌కు రెండు చోట్ల లోతుగా గాయలయ్యాయి. కత్తి దాడి రెండు మిల్లీమీటర్ల మేర తృటిలో తప్పి వెన్నెముక పక్కన కత్తి పోట్లు దిగబడినట్లు వైద్యులు తెలిపారు. మెడ, చేతిపై గాయాలకు చికిత్స అనంతరం జనవరి 21న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. సైఫ్‌పై దాడి ఘటనపై పోలీసులు విచారించారు. విచారణలో దొంగతనం చేయాలని ఉద్దేశ్యంతో దుండగుడు సైఫ్ ఇంట్లో చొరబడినట్లు పోలీసులు తెలిపారు. దండుగుడు బంగ్లాదేశ్‌కు చెందిన మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌గా గుర్తించారు. సైఫ్‌పై దాడి అనంతరం దుండగుడు షెహజాద్ తప్పించుకున్నాడు. థానేలో అతన్ని పోలీసులు అరెస్టు చేశారు.ఇదిలా ఉంటే, సైఫ్ అలీ ఖాన్ బాంద్రా ఫ్లాట్ నుండి సేకరించిన వేలిముద్రలు షరీఫుల్‌తో సరిపోలినట్లు నిర్ధారించబడింది. నిందితుడు భవనంలోని పదకొండవ అంతస్తుకు ఎక్కేందుకు ఉపయోగించిన డక్ట్ పైపుపై,గది డోర్ హ్యాండిల్, బాత్రూమ్ డోర్‌పై వేలిముద్రల్ని గుర్తించారు. అయితే, సైఫ్ అలీఖాన్ ఇంటిలోని సీసీటీవీ ఫుటేజీలోని దుండగుడు, తన కుమారుడు షెహజాద్‌లు ఒకరు కాదని. ఇద్దరు వేర్వేరుగా ఉన్నారని షెహజాద్ తండ్రి రూహుల్ అమీన్ వాదిస్తున్నాడు.
డబ్బు లేకపోయినా ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు: ఇలా..
'బుక్ నౌ.. పే లేటర్' విధానాన్ని చాలా సందర్భాల్లో వినే ఉంటారు. ఆటో మొబైల్ కంపెనీలు, ఈ కామర్స్ వెబ్సైట్లు ఈ విధానం అమలు చేస్తున్నాయి. కాగా ఇప్పుడు 'ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్' (ఐఆర్సీటీసీ) దీనిని ప్రవేశపెట్టింది. అంటే డబ్బు లేకపోయినా టికెట్ పొందవచ్చు, ఆ తరువాత గడువు లోపల డబ్బు చెల్లిస్తే సరిపోతుంది. దీని గురించి మరిన్ని వివరాలు వివరంగా ఇక్కడ తెలుసుకుందాం.ఇండియన్ రైల్వే తీసుకొచ్చిన 'ఇప్పుడే బుక్ చేయండి, తర్వాత చెల్లించండి' విధానంలో.. బుకింగ్ ప్రక్రియను ఆన్లైన్లోనే పూర్తి చేయాలి. బుక్ చేసుకున్న తరువాత 14 రోజుల్లో డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.'బుక్ నౌ.. పే లేటర్'➤ముందుగా IRCTC అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి.➤బుక్ నౌ ఆప్షన్ ఎంచుకున్న తరువాత.. ప్రయాణం చేయాల్సిన వ్యక్తి వివరాలను ఎంటర్ చేసి, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.➤ఆ తరువాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ అవసరమైన వివరాలను ఎంటర్ చేసి.. సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి.➤ఇవన్నీ పూర్తయిన తరువాత పేమెంట్ పేజీకి వెళ్తారు. అక్కడ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, భీమ్ (BHIM) యాప్ ద్వారా లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లింపులు చేయడానికి ఆప్షన్స్ కనిపిస్తాయి.➤పే లేటర్ ఫీచర్‌ని ఉపయోగించాలనుకునే కస్టమర్లు ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. 'ఈపేలేటర్' ప్లాట్ఫామ్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.➤ముందుగా ఈపేలేటర్ పేజీలో రిజిస్టర్ చేసుకున్న వారికి మాత్రమే పేమెంట్ ఆప్షన్స్ పేజీలో 'పే లేటర్' ఆప్షన్ కనిపిస్తుంది.➤ఇలా పే లేటర్ ద్వారా టికెట్ బుక్ చేసుకున్న వ్యక్తి 14 రోజుల్లో డబ్బు చెల్లించాలి.➤14 రోజుల్లో డబ్బు చెల్లించకపోతే.. 3.5 శాతం సర్వీస్ ఛార్జ్ పే చేయాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: TRAI: రూ. 20తో.. 120 రోజులు: ఇదే రూల్..
మీర్పేట్ మాధవి హత్య కేసు.. పిల్లల విచారణలో కీలక విషయాలు
సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా మీర్పేట్ చిల్లెలగూడలో జరిగిన దారుణ హత్యపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో పోలీసుల విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. మరో మహిళతో ఉన్న వివాహేతర సంబంధమే ఈ హత్యకు దారి తీసినట్లు విచారణలో భాగంగా గురుమూర్తి నుంచి పోలీసులు వివరాలు రాబట్టారు. పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేసిన గురుమూర్తి, ఓ వెబ్ సిరీస్ తరహాలో మృతదేహాన్ని మాయం చేసి తప్పించుకోవాలని చూసినట్టు పోలీసులు నిర్ధారించారు.మీర్‌పేట్‌కు చెందిన మాధవి హత్య కేసులో ఆమె భర్త, నిందితుడు గురుమూర్తిని పోలీసులు నేడు కోర్టులో హాజరుపరచనున్నారు. ఇక, ఇప్పటికే రెండుసార్లు సీన్ రీ-కన్స్ట్రక్షన్ చేసిన పోలీసులు. కస్టడీలోకి తీసుకున్న తర్వాత మరోసారి సీన్ రీ-కన్స్ట్రక్షన్ చేయనున్నారు. ఈ కేసులో కీలకమైన ఆధారాలను దర్యాప్తు అధికారులు సేకరించారు. సుమారు మూడు గంటల పాటు గురుమూర్తి ఇంట్లో క్లూస్ టీమ్ సోదాలు నిర్వహించింది. అలాగే, సీసీ ఫుటేజ్, ఫోన్ సిగ్నల్ ఆధారంగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.మరోవైపు, మాధవి హత్య కేసులో ఇద్దరు పిల్లల స్టేట్మెంట్ను కూడా పోలీసులు రికార్డు చేశారు. పిల్లల స్టేట్మెంట్ సందర్భంగా కూడా విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. తమ తల్లి కనిపించకపోయిన తర్వాత ఇంట్లో చెడు వాసన వచ్చినట్టు పిల్లలు తెలిపారు. అలాగే, కుటుంబ సభ్యలను కూడా పోలీసులు విచారిస్తున్నారు.ఇదిలా ఉండగా.. నిందితుడు విషయాలపై ఆధారపడకుండా పోలీసులు వేర్వేరు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు నిందితుడి ఫోన్ పరిశీలించినప్పుడు మరో మహిళ ఫొటోలు కొన్ని ఉన్నట్లు గుర్తించారు. ఈ నెల 18వ తేదీన నమోదు చేసిన వెంకట మాధవి అదృశ్యం కేసును హత్య కేసు సెక్షన్ల కింద మారుస్తున్నారు. కేసు విషయంలో నేడు కొంత స్పష్టత వచ్చే అవకాశముంది.జరిగింది ఇదీ.. ఏపీలోని ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువుకు చెందిన పుట్ట గురుమూర్తి, అదే గ్రామానికి వెంకట మాధవికి 13 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. గురుమూర్తి ఆర్మీలో జవాన్‌గా చేరి నాయక్ సుబేదార్‌గా పదవీ విరమణ పొందాడు. ప్రస్తుతం కంచన్‌బాగ్ డీఆర్డీఏలో కాంట్రాక్టు భద్రతా సిబ్బందిగా పని చేస్తున్నారు. గురుమూర్తి కొన్నాళ్లుగా తన సమీప బంధువైన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం భార్యకు తెలిసి పలుమార్లు గొడవలు జరిగినట్టు సమాచారం. ఈ క్రమంలోనే భార్య అడ్డు తొలగించుకోవాలనే క్రమంలోనే ఆమెను హత్య చేసేందుకు ప్లాన్ వేశాడు.సంక్రాంతి పండుగ సందర్భంగా గురుమూర్తి తన ఇద్దరు పిల్లల్ని నగరంలోనే ఉండే తన సోదరి ఇంటి దగ్గర దింపాడు. 13, 14 తేదీల్లో మాధవితో కలిసి ఉదయం సోదరి ఇంటికెళ్లి సాయంత్రానికి తిరిగొచ్చేవారు. 15వ తేదీన ఉదయం గురుమూర్తికి భార్యకు గొడవ మొదలైంది. మరో మహిళతో సంబంధం, ఇందుకు సంబంధించి కొన్ని ఫొటోలు భార్య చూసింది. అప్పటికే భార్యను హతమార్చాలని కసితో ఉన్న గురుమూర్తి అనుకున్నంత పని చేశాడు. భార్యను తలమీద కొట్టడంతో ఆమె కిందపడిపోయింది. ఆరు నెలల క్రితం ఓటీటీలో చూసిన వెబ్సిరీస్లోని పాత్రల తరహాలోనే మృతదేహాన్ని మాయం చేయాలనుకున్నాడు. ఇందులో భాగంగా మృతదేహాన్ని టాయిలెట్లోకి తీసుకెళ్లి ముక్కలుగా నరికాడు.శరీరాన్ని ముక్కలుగా చేసి..ఆ తర్వాత బకెట్ నీళ్లను హీటర్‌తో వేడి చేసి ముక్కల్ని వేశాడు. ముక్కలు మొత్తగా మారాక మాంసాన్ని ఎముకల నుంచి విడదీసి మరో బకెట్లో వేసి రోకలితో దంచి ముద్దగా చేశాడు. ఎముకల్ని ముక్కలుగా చేసి అంతా సంచుల్లో నింపి సమీపంలోని చెరువులో వేశాడు. హత్య తర్వాత దాదాపు రెండ్రోజులు నిద్రలేకుండా ఇదంతా చేసినట్లు నిందితుడు పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని మాయం చేసిన తర్వాత గదిని నీళ్లతో శుభ్రం చేశాడు. 17వ తేదీ సాయంత్రం భార్య కనిపించడం లేదని వెంకట మాధవి తల్లిదండ్రులకు ఫోన్లో చెప్పాడు. చిన్న గొడవతో ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు ఫిర్యాదు చేయించాడు.ఈ కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే పోలీసులకు గురుమూర్తి మీద అనుమానమొచ్చింది. మాధవి ఇంటి లోపలికి వెళ్లడం తప్ప బయటకు వచ్చే దృశ్యాలు రికార్డవలేదు. దీంతో గురుమూర్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించినప్పుడు అసలు విషయం బయటపడింది. బుధ, గురువారాల్లో నిందితుడి నివాసాన్ని పరిశీలించిన క్లూస్‌టీం, ఫోరెన్సిక్ బృందాలు నీళ్ల బకెట్, వాటర్ హీటర్‌తో పాటు ఇంట్లో కొన్ని కీలక ఆనవాళ్లు సేకరించాయి. వీటిని పరీక్షల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. బకెట్లో వేసి శరీరం ముక్కలు ఉడికించినట్లు కొన్ని ఆధారాలు లభ్యమయ్యాయి.పోలీసులకే ట్విస్ట్.. నిందితుడు చెప్పిన విషయాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్న అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మృతదేహాన్ని చెరువులో విసిరేసినట్లు చెబుతున్నా, అక్కడ ఇంకా ఆధారాలు లభించలేదు. శరీరం ఆనవాళ్లు లభ్యమైనా వెంకట మాధవి పిల్లల డీఎన్ఏతో పోల్చే అవకాశముంది. ఇప్పటి వరకూ ఎలాంటి ఆధారాలు దొరకలేదు. క్లూస్‌టీం, ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక కీలకం కానుంది. వెంకట మాధవి అదృశ్యంపై కేసు నమోదు చేశామని, ఆమె ఇంట్లోకి వెళ్తున్న దృశ్యాలు మాత్రమే లభ్యమైనట్లు ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్ తెలిపారు.
'పుష్ప 3' ఐటెమ్ సాంగ్.. ఆ హీరోయిన్ అయితే సూపర్ హిట్టే: దేవిశ్రీ ప్రసాద్
పుష్ప సిరీస్ గురించి సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) కీలక వ్యాఖ్యలు చేశారు. పుష్ప2 భారీ కలెక్షన్స్ సాధించి ఎన్నో రికార్డ్స్‌ను దాటేసింది. పుష్ప రెండు భాగాలకు దేవిశ్రీ అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ క్రమంలో ఆయన తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో 'పుష్ప 3' (Pushpa 3) ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు. పుష్ప చిత్రాలకు ఐటెమ్ సాంగ్స్ మంచి గుర్తింపును ఇచ్చాయి. ఇప్పుడు పుష్ప3లో ఐటెమ్ సాంగ్‌లో ఎవరు కనిపిస్తే బాగుంటుందో దేవిశ్రీ ప్రసాద్ తాజాగా చెప్పారు. (ఇదీ చదవండి: విజయ్‌తో చేయి కలిపేందుకు అడుగులేస్తున్న త్రిష)పుష్పలో సమంత 'ఊ అంటావా మామ.. ఉఊ అంటావా మామా' అంటూ తన గ్లామర్‌తో దుమ్మురేపింది. పుష్ప2లో శ్రీలీల కిస్సిక్ సాంగ్‌లో నేషనల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. అయితే, ఈ ప్రత్యేకమైన సాంగ్స్ గురించి దేవిశ్రీ ప్రసాద్ ఇలా పంచుకున్నారు. పుష్ప 2 కిస్సిక్ పాటలో ఎవరు నటించినా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటారని తాము ముందే ఊహించామని అయన అన్నారు. అయితే, ఈ సాంగ్‌కు శ్రీలీల మంచి ఆప్షన్ అని తాను మేకర్స్‌కు ముందే చెప్పానని ఆయన అన్నారు. దానికి ప్రధాన కారణం ఆమె చాలా బెటర్‌గా డ్యాన్స్ చేయడమేనని దేవిశ్రీ అన్నారు. ఇప్పటికే చాలామంది టాప్ హీరోయిన్లు తన మ్యూజిక్‌లో వచ్చిన ఐటెమ్ సాంగ్స్‌లో మెప్పించిన విషయాన్ని గుర్తుచేశారు. అందులో కాజల్ అగర్వాల్ (జనతా గ్యారేజ్), పూజా హెగ్డే( రంగస్థలం), సమంత (పుష్ప), శ్రీలీల (పుష్ప2)ఉన్నారన్నారు. వారందరూ కూడా కెరీర్లో మంచి పీక్‌లో ఉన్నప్పుడే ఐటెమ్ సాంగ్స్‌లలో కనిపించారన్నారు.'పుష్ప 3' ఐటెమ్ సాంగ్‌లో జాన్వీ ఎంపిక ఎందుకంటే..?పుష్ప 3 సినిమాలో ఐటెమ్ సాంగ్‌లో కనిపించేది ఎవరని ఇప్పటి నుంచే ఊహాగానాలు మొదలయ్యాయని ఆయన అన్నారు. ఈ అంశంపై దీనిపై దర్శక నిర్మాతలు తుది నిర్ణయం తీసుకుంటారన్నారు. పాట ఆధారంగా హీరోయిన్ను ఎంపిక చేస్తారని దేవి తెలిపారు. ఇండస్ట్రీలో సాయి పల్లవి డ్యాన్స్‌కు తాను అభిమానినని చెప్పిన ఆయన.. జాన్వీ కపూర్(Janhvi Kapoor) కూడా మంచి డ్యాన్సర్ అని ఆయన తెలిపారు. ఇప్పటికే బాలీవుడ్లో నటించిన ఆమె పాటలు చూశానని అన్నారు. ఆమె అమ్మగారు అయిన శ్రీదేవిలో ఉన్న గ్రేస్ జాన్వీలో కూడా ఉందని అభిప్రాయపడ్డారు. అయితే, పుష్ప-3 ఐటెమ్ సాంగ్‌కు జాన్వీ అయితే సరైన ఎంపిక అని తాను అనుకుంటున్నట్లు దేవిశ్రీ ప్రసాద్ అన్నారు.‘పుష్ప 2’ ఘన విజయం అందుకున్న తర్వాత దర్శకుడు సుకుమార్ ‘పుష్ప’ పార్ట్ 3కి సంబంధించి నిరంతరం పని చేస్తున్నారని దేవిశ్రీ ప్రసాద్ ఇప్పటికే చెప్పారు. ఆ స్టోరీపై రీవర్క్ కూడా చేస్తున్నారని ఆయన తెలిపారు. సుకుమార్ ఇచ్చిన మంచి స్క్రిప్టుకు అల్లు అర్జున్ అద్భుతంగా నటించడం వల్లే సినిమా భారీ హిట్ అయిందని ఆయన అన్నారు. పుష్ప 1, పుష్ప 2కి ఎలా పనిచేశామో ‘పుష్ప 3’కి అదే స్థాయిలో కష్టపడతామని తెలిపారు.
సంక్రాంతికి వస్తున్నాం ‘అప్పడాలు’ కాదు... సోషల్ మీడియాను షేక్ చేస్తున్నవీడియో!
సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో కామెడీ పండించిన ‘బుల్లిరాజు’ గుర్తున్నాడా? ‘‘అప్పడాలు వడియాలు అయ్యాయా’’అంటూ చెప్పిన కొన్ని డైలాగులు సోషల్ మీడియాను షేక్ చేశాయి. థియేటర్ లో నవ్వులు పూయించిన బుల్లిరాజు క్యారెక్టర్ విమర్శల పాలయ్యింది. పిల్లాడితో బూతు డైలాగులా అంటూ జనం మండిపడ్డారు. ఇప్పుడు ఇదంతా ఎందుకూ అంటే...అక్కడికే వస్తున్నా... పప్పు, సాంబారు, అప్పడాలు కాంబినేషన్ ఎంత ఫ్యామస్సో తెలుసు కదా. చాన్స్ దొరికితే కరకరమనే అప్పడాలను ఇంకో రెండు వేసుకుని మరీ లాగించేస్తాం. అయితే ఈ అప్పడాలను ఎలా తయారు చేస్తారో ఎపుడైనా ఆలోచించారా? దీనికి సంబంధించిన ఒక వీడియోపై నెట్టింట తెగ చర్చ నడుస్తోంది.అప్పడాల్లో చాలా రకాలు మార్కెట్లో లభిస్తుంటాయి. బియ్యం పాపడ్, మసాలా పాపడ్, కలి మిర్చ్ పాపడ్, రాగి పాపడ్, వెల్లుల్లి పాపడ్, సాబుదానా పాపడ్, అబ్బో ఇలా చాలా రకాలే ఉన్నాయి. ఈ అప్పడాలు లేనిదే ఫంక్షన్స్, పార్టీలు సంపూర్ణం కాదంటే అతిశయోక్తి కాదు. అయితే అప్పడాలను తయారు చేస్తున్న వీడియో ఒకటి ట్విటర్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో ప్రకారం ఒక పెద్ద గిన్నెలో అప్పడాల పిండి కలిపి ఉంది. దీని ఆవిరి మీద ఉడికేలా.. వేడినీటి గిన్నెపై ఉన్న మూతపై పూతలా వేసింది ఒక మహిళ.దాన్ని తీసి ఒకచోట పేర్చింది. ఆ తర్వాత వరుసగా పేర్చిన వాటిపై పదునైన గుండ్రటి స్టీల్ డబ్బాల సాయంతో కాళ్లతో తొక్కుతూ పెద్ద అప్పడంపై ఒత్తిడి పెంచి, దాన్ని గుండ్రటి అప్పడాలుగా తయారు చేశారు. అలా ఒక్కోటి వేరు వేరుగా తీసి వాటిని ఎండబెట్టడం ఈ వీడియోలు చూడవచ్చు.తేజస్ పటేల్ అనే యూజర్ దీన్ని ఎక్స్‌లో షేర్ చేశారు. కష్టపడి పనిచేస్తున్నారు... కానీ శుభ్రతగురించి పట్టించుకోవడం లేదు అన్నట్టుగా కమెంట్ చేశారు. ఇలాంటి వాటిని తినడం తినకపోవడం మీ ఇష్టం అన్నట్టుగా ఉన్న ఈ వీడియోపై నెటిజన్లు విభినంగా స్పందించారు. కాళ్లతో తొక్కడం తప్ప అంతా బానే ఉందని కొందరు, అప్పడం రుచిలోని రహస్యం అదే అంటూ వ్యాఖ్యానించారు.Very hardworking ppl, let's support. Why care about hygiene🤡 pic.twitter.com/4HmsxZIgWC— Tejas Patel (@237Stardust) January 22, 2025ఫాస్ట్ ఫుడ్, హోటల్స్‌లో పాటించే శుభ్రత కంటే బెటరేగా?గతంలో ఇలాంటి వీడియో ఒకటి ఇన్‌స్టాలో చర్చకు తెరతీసింది. దీనిపై చాలామంది విమర్శలు గుప్పించినప్పటికీ, చాలామంది సమర్ధించారు. "ఫాస్ట్ ఫుడ్" కంటే మెరుగే అని కొందరు "చాలా హై-ఎండ్ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లు, స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ కంటే ఇది చాలా బెటర్ అని ఒకరు,"కనీసం ఈ మహిళ అప్పడాలపై డైరెక్ట్‌గా పాదం పెట్టకుండా తగినంత జాగ్రత్త పడుతోంది.. ఇంత కంటే ఘోరంగా చాలా హోటల్స్ ఉంటాయి ఇంకొందరు అంటూ వ్యాఖ్యానించడం గమనార్హం. View this post on Instagram A post shared by Karansingh Thakur (@dabake_khao)అప్పడం ఒక ఎమోషన్సౌత్ ఇండియాలో అప్పడాలు, వడియాలు విందు భోజనాన్ని అస్సలు ఊహించలేం. అప్పడాలలో ఫైబర్, ప్రోటీన్, ఇతర మంచి పోషకాలు వుంటాయి. జీవక్రియను ప్రోత్సహించేందుకు అప్పడాలు దోహదపడతాయి. గ్యాస్ట్రిక్ సమస్యలను నివారించగల శక్తి అప్పడాలకు వుంది.అయితే ఇటీవల ఆరోగ్యంపై పెరుగుతున్న అవగాహన నేపథ్యంలో ఆయిల్ లేకుండా వేయించుకునే అప్పడాలు కూడా వచ్చాయి ఎందుకంటే అప్పడాలతో ఆరోగ్య ప్రయోజనాలతో పాటు అనారోగ్య సమస్యలు కూడా వున్నాయి ముఖ్యంగా ఆయిల్లో వేయించడం ద్వారా ఎన్నో అనారోగ్య సమస్యలు వేధిస్తుంటాయి. రక్తపోటు, గుండె జబ్బుల నుంచి క్యాన్సర్ వరకు ముప్పు పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతారు. సో.. చాయిస్ ఈజ్ యువర్స్.
తుస్సుమన్న టీమిండియా స్టార్లు.. శ్రేయస్, శివమ్ దూబే కూడా..!
ఎస్వీసీ ఆఫీస్‌కు దిల్ రాజును తీసుకెళ్లిన ఐటీ అధికారులు
సంక్రాంతికి వస్తున్నాం ‘అప్పడాలు’ కాదు... సోషల్ మీడియాను షేక్ చేస్తున్నవీడియో!
నేడే హల్వా వేడుక.. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పేలుడు.. ఏడుగురు దుర్మరణం
భర్త వివాహేతర సంబంధం..
డబ్బు లేకపోయినా ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు: ఇలా..
మ్యాడ్ బ్యూటీ '8 వసంతాలు' టీజర్ రిలీజ్
రిలయన్స్ ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు
కమలాపూర్‌లో ఉద్రిక్తత.. కౌశిక్‌రెడ్డిపై టమాటాలతో దాడి!
సాక్షి కార్టూన్ 24-01-2025
ఈ రాశి వారికి ఇంతకాలం పడిన కష్టం ఫలిస్తుంది.. భూలాభం
అతడొక సూపర్‌స్టార్.. మా ఓటమికి కారణం అదే: బట్లర్
చరిత్ర సృష్టించిన అభిషేక్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
చనిపోయిన తర్వాత నా ఫోటోలు పెట్టకండి.. కన్నీళ్లతో గ్లామర్ క్వీన్ రిక్వెస్ట్
అమెరికాలో అడుగు పెట్టాలంటే ఇది తప్పని సరి.. నిబంధనలు మార్చిన ట్రంప్
డీజీపీ పోస్టు కోసం మూడు ముక్కలాట!
చరిత్ర సృష్టించిన ఆండ్రూ ఫ్లింటాఫ్ తనయుడు
మీర్పేట్ మాధవి హత్య కేసు.. పిల్లల విచారణలో కీలక విషయాలు
173 కిలో మీటర్లు.. నాలుగు లైన్లు..
తుస్సుమన్న టీమిండియా స్టార్లు.. శ్రేయస్, శివమ్ దూబే కూడా..!
ఎస్వీసీ ఆఫీస్‌కు దిల్ రాజును తీసుకెళ్లిన ఐటీ అధికారులు
సంక్రాంతికి వస్తున్నాం ‘అప్పడాలు’ కాదు... సోషల్ మీడియాను షేక్ చేస్తున్నవీడియో!
నేడే హల్వా వేడుక.. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పేలుడు.. ఏడుగురు దుర్మరణం
భర్త వివాహేతర సంబంధం..
డబ్బు లేకపోయినా ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు: ఇలా..
మ్యాడ్ బ్యూటీ '8 వసంతాలు' టీజర్ రిలీజ్
రిలయన్స్ ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు
కమలాపూర్‌లో ఉద్రిక్తత.. కౌశిక్‌రెడ్డిపై టమాటాలతో దాడి!
సాక్షి కార్టూన్ 24-01-2025
ఈ రాశి వారికి ఇంతకాలం పడిన కష్టం ఫలిస్తుంది.. భూలాభం
అతడొక సూపర్‌స్టార్.. మా ఓటమికి కారణం అదే: బట్లర్
చరిత్ర సృష్టించిన అభిషేక్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
చనిపోయిన తర్వాత నా ఫోటోలు పెట్టకండి.. కన్నీళ్లతో గ్లామర్ క్వీన్ రిక్వెస్ట్
అమెరికాలో అడుగు పెట్టాలంటే ఇది తప్పని సరి.. నిబంధనలు మార్చిన ట్రంప్
డీజీపీ పోస్టు కోసం మూడు ముక్కలాట!
చరిత్ర సృష్టించిన ఆండ్రూ ఫ్లింటాఫ్ తనయుడు
మీర్పేట్ మాధవి హత్య కేసు.. పిల్లల విచారణలో కీలక విషయాలు
173 కిలో మీటర్లు.. నాలుగు లైన్లు..
సినిమా
‘లైలా’గా రెడీ కావడానికి రెండు గంటలు పట్టేది : విశ్వక్ సేన్
‘‘నా కెరీర్లో యాక్షన్ టచ్‌తో రూపొందిన ఔట్ అండ్ ఔట్ కామెడీ ఫ్యామిలీ ఫిల్మ్ ‘లైలా’. చాలా క్లీన్‌గా ఉంటుంది. ప్రేక్షకులంతా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా కోసం లైలాగా రెడీ కావడానికి రెండు గంటలు పట్టేది. నిజంగా అమ్మాయిలకు హ్యాట్సాఫ్ చెప్పాలి’’ అని హీరో విశ్వక్ సేన్(Vishwak Sen) అన్నారు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో విశ్వక్ సేన్, ఆకాంక్షా శర్మ జంటగా నటించిన చిత్రం ‘లైలా’( Laila). సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న విడుదల కానుంది. లియోన్ జేమ్స్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ‘ఇచ్చుకుందాం బేబీ...’ అంటూ సాగే రెండో పాటని విడుదల చేశారు. పూర్ణాచారి సాహిత్యం అందించిన ఈ పాటని ఆదిత్య ఆర్కే, ఎంఎం మానసి ఆలపించారు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్లో విశ్వక్ సేన్ మాట్లాడుతూ– ‘‘లైలా’లో మోడల్ సోనూ, లైలా అనే రెండు పాత్రల్లో నటించా. వాలెంటైన్స్ డే కి సింగిల్స్ తమకు ఎవరూ లేరని బాధపడుతుంటారు. ఈ వాలెంటైన్స్ డే కి మీకు లైలా ఉంది. అమ్మాయిలు సింగిల్ అని అనుకుంటే మీకు సోను మోడల్ వున్నాడు.(నవ్వుతూ). మీరంతా ఎంజాయ్ చేస్తారు. ఫిబ్రవరి 14కి కలుద్దాం’ అన్నారు. ‘‘లైలా’ కథ ఇద్దరు ముగ్గురు హీరోలకు చెప్పాను. లేడీ గెటప్ వేయడం అంత ఈజీ కాదు. సినిమా అంటే పిచ్చి ఉంటేనే చేయగలరు. అలాంటి పిచ్చి ఉన్న విశ్వక్ దొరికారు’’ అని రామ్ నారాయణ్ చెప్పారు. నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ.. రామ్ కథ చెప్పిన తర్వాత కొందరు హీరోలకు అప్రోచ్ అయ్యాను. లేడి క్యారెక్టర్ ని చేయగలుగుతామా లేదా అనుకునే టైంలో విశ్వక్ ఇలాంటి క్యారెక్టర్ కోసం తను ఎదురుచూస్తున్నాని చెప్పి సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఇది మంచి క్యారెక్టర్ గా తన కెరీర్ లో నిలిచిపోతుంది. యూత్ ట్యాలెంట్ తో ఈ సినిమా కోసం పని చేశారు. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది' అన్నారు.లిరిక్ రైటర్ పూర్ణచారి మాట్లాడుతూ... ధమ్కి లో ఆల్ మోస్ట్ పడిపోయిందే పిల్లా సాంగ్ నేనే రాశాను, అది వంద మిలియన్స్ కొట్టింది. ఇప్పుడీ ఈ సాంగ్ కి రెండు వందల మిలియన్స్ కి మించి రావాలని కోరుకుంటున్నాను. ఈ పాట రాసే అవకాశం ఇచ్చిన విశ్వక్ గారికి, నిర్మాత సాహు గారికి, డైరెక్టర్ రామ్ గారికి థాంక్ యూ. ఈ సినిమాని పెద్ద చేస్తారని కోరుకుంటున్నాను' అన్నారు
కోలీవుడ్‌లో సీక్వెల్ సందడి
కోలీవుడ్‌లో సీక్వెల్ హవా బాగా వీస్తోంది. కోలీవుడ్ హీరోలందరూ సీక్వెల్ జపం చేస్తున్నారు. ప్రస్తుతం తమిళంలో పదికి పైగా సీక్వెల్స్ సినిమాలు ఉండటమే ఇందుకు ఓ నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మరి... ఈ సీక్వెల్స్, ఫ్రాంచైజీ చిత్రాలతో బిజీగా ఉన్న తమిళ హీరోలు ఎవరో తెలుసుకుందాం...జైలర్ తిరిగి వస్తున్నాడురజనీకాంత్ హీరోగా చేసిన ‘జైలర్’ (2023) మూవీ బ్లాక్‌బస్టర్ హిట్. నెల్సన్ దిలీప్‌కుమార్ డైరెక్షన్లో కళానిధి మారన్ నిర్మించిన ఈ మూవీలో రజనీ కొత్త తరహా స్టైల్, స్వాగ్, మేనరిజమ్స్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. వీటికి అనిరు«ధ్ రవిచందర్ మ్యూజిక్, ఆర్ఆర్ ప్లస్ అయ్యాయి. దీంతో ‘జైలర్’ మూవీ రజనీ ఖాతాలో ఓ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిపోయింది. ఈ సినిమా మూవీ రిలీజ్ తర్వాత ‘జైలర్ 2’ ఉంటుందనే ఊహాగానాలు వినిపించాయి. ఆ ఊహాలను నిజం చేస్తూ నెల్సన్ దిలీప్‌కుమార్ ఇటీవలే ‘జైలర్ 2’ సినిమాను ప్రకటించారు. రజనీకాంత్ హీరోగా చేయనున్న ‘జైలర్ 2’ చిత్రీకరణ ఈ ఏడాది మార్చిలో ప్రారంభం కానుందని తెలిసింది. కాగా ‘జైలర్’లో రమ్యకృష్ణ, మీర్నా మీనన్ కీ రోల్స్‌లో, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్ గెస్ట్ రోల్స్‌లో నటించారు. వీరందరి పాత్రలు ‘జైలర్ 2’లోనూ కొనసాగుతాయని కోలీవుడ్ టాక్. అంతే కాదు... బాలకృష్ణ, ‘కేజీఎఫ్’ బ్యూటీ శ్రీనిధి శెట్టి ‘జైలర్ 2’లో యాడ్ అవుతారట. ఈ సీక్వెల్ 2026 ప్రారంభంలో రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.వీర శేఖరన్ పోరాటంహీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో వచ్చిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) మూవీ 1996లో విడుదలై, బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. 28 సంవత్సరాల తర్వాత కమల్, శంకర్ కాంబినేషన్లోనే 2024లో విడుదలైన ‘ఇండియన్ 2’ సినిమా మాత్రం ఆడియన్స్‌ను అంతగా మెప్పించలేకపోయింది. అయితే ‘ఇండియన్ 2’ సినిమా తీస్తున్న సమయంలోనే ‘ఇండియన్ 3’ చిత్రీకరణను కూడా దాదాపు పూర్తి చేశారు దర్శకుడు శంకర్.ఈ ఏడాదే ‘ఇండియన్ 3’ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లుగా ఇటీవల ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘గేమ్ చేంజర్’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో శంకర్ పేర్కొన్నారు. ‘ఇండియన్, ఇండియన్ 2’ చిత్రాల్లో సేనాపతిగా కనిపించారు కమల్‌హాసన్. కానీ ‘ఇండియన్ 3’ మాత్రం సేనాపతి తండ్రి వీరశేఖరన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కథనం ఉంటుంది. స్వాతంత్య్రం కోసం బ్రిటీషర్లతో వీరశేఖరన్ ఏ విధంగా పోరాడారు? అన్నది ‘ఇండియన్ 3’ స్టోరీ అని కోలీవుడ్ సమాచారం. ఈ ఫ్లాష్‌బ్యాక్‌లో వీరశేఖరన్ భార్యగా కాజల్ అగర్వాల్ కనిపిస్తారు. రెడ్ జెయింట్ మూవీస్, లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ‘ఇండియన్ 3’కి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.ఇటు సర్దార్... అటు ఖైదీతండ్రీకొడుకులుగా కార్తీ ద్విపాత్రాభినయం చేసిన స్పై యాక్షన్ మూవీ ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మించిన ఈ మూవీ 2022లో విడుదలై, బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. అయితే ‘సర్దార్’ సినిమా క్లైమాక్స్‌లో ‘మిషన్ కంబోడియా’ అంటూ ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘సర్దార్ 2’ను కన్ఫార్మ్ చేశారు పీఎస్ మిత్రన్. అలాగే జూలైలో ‘సర్దార్’కు సీక్వెల్‌గా పీఎస్ మిత్రన్ డైరెక్షన్లోనే ‘సర్దార్ 2’ ప్రారంభమైంది.కార్తీ హీరోగా ఎస్జే సూర్య, మాళవికా మోహనన్, ఆషికా రంగనాథ్, రజీషా విజయన్ ప్రధాన తారాగణంగా నటిస్తారని ఆల్రెడీ మేకర్స్ వెల్లడించారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ మొదలైంది కాబట్టి ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో థియేటర్స్‌లో చూడొచ్చు. అప్పుడు మిషన్ కంబోడియా వివరాలు కూడా తెరపైన కనిపిస్తాయి. ఇక ‘ఖైదీ’లో కార్తీ చేసిన దిల్లీ రోల్‌ను మర్చిపోరు ఆడియన్స్. లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్లో కార్తీ హీరోగా నటించిన ‘ఖైదీ’ చిత్రం 2019లో విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో వెంటనే కార్తీతో ‘ఖైదీ 2’ చేయాలని లోకేశ్ ప్లాన్ చేశారు. కానీ లోకేశ్‌కు కమల్‌హాసన్‌తో ‘విక్రమ్’, రజనీకాంత్‌తో ‘కూలీ’ సినిమాల ఆఫర్స్ రావడంతో ‘ఖైదీ’ సీక్వెల్ షూటింగ్‌ను కాస్త ఆలస్యం చేశారు. రజనీకాంత్ ‘కూలీ’ సినిమా చిత్రీకరణ పూర్తి కావొచ్చింది. దీంతో లోకేశ్ నెక్ట్స్ మూవీ కార్తీ ‘ఖైదీ 2’నే ఉండొచ్చు. ఇలా రెండు సీక్వెల్స్‌తో ఆడియన్స్‌ను అలరించేందుకు రెడీ అవుతున్నారు కార్తీ.రెండు దశాబ్దాల తర్వాత..!‘7/జీ రెయిన్బో కాలనీ’ అంటే తెలుగు ప్రేక్షకులకు తెలియకపోవచ్చు. కానీ ‘7/జీ బృందావన కాలనీ’ అంటే మాత్రం చాలామంది తెలుగు ఆడియన్స్‌కు ఈ సినిమా గుర్తొస్తుంది. 2004లో సెల్వ రాఘవన్ డైరెక్షన్లో రూపొందిన ‘7/జీ రెయిన్బో కాలనీ’ తెలుగులో ‘7/జీ బృందావన కాలనీ’గా అనువాదమై, సూపర్‌హిట్‌గా నిలి చింది. ఈ మూవీలో హీరో హీరోయిన్లుగా రవికృష్ణ, సోనియా అగర్వాల్ నటించారు. ఏఎమ్ రత్నం నిర్మించారు. ఇప్పుడు 28 ఏళ్ల తర్వాత ‘7/జీ బృందావన కాలనీ’ సినిమాకు సీక్వెల్‌గా ‘7/జీ బృందావన కాలనీ 2’ సినిమా తీస్తున్నారు దర్శకుడు సెల్వ రాఘవన్.తొలి భాగంలో నటించిన రవికృష్ణనే మలి భాగంలోనూ హీరోగా చేస్తుండగా, అనశ్వర రాజన్ హీరోయిన్గా చేస్తున్నారు. ఏఎమ్ రత్నం నిర్మిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. జయరామ్, సుమన్ శెట్టి, సుధ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ‘7/జీ బృందావన కాలనీ 2’ సినిమా రిలీజ్‌పై త్వరలోనే ఓ ప్రకటన రానుంది. ఇక సెల్వ రాఘవన్ డైరెక్షన్లో వచ్చిన ‘ఆయిరత్తిల్ ఒరువన్’ (తెలుగులో ‘యుగానికి ఒక్కడు’) సినిమా గుర్తుండే ఉంటుంది.కార్తీ, రీమా సేన్, పార్తీబన్, ఆండ్రియా లీడ్ రోల్స్‌లో నటించిన ఈ మూవీ 2010లో విడుదలై, బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ఆయిరత్తిల్ ఒరువన్ 2’ సినిమాను 2021 జనవరి 1న ప్రకటించారు సెల్వ రాఘవన్. ఈ సీక్వెల్లో ధనుష్‌ను హీరోగా ప్రకటించారు. ఈ చిత్రం 2024లో రిలీజ్ అవుతుందని, అప్పట్లో ధనుష్ ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. కానీ ఈ సినిమా చిత్రీకరణ ఇంకా ఆరంభం కాలేదు. ఇక ‘ఆయిరత్తిల్ ఒరువన్’ సీక్వెల్ గురించి మరో అప్డేట్ రావాల్సి ఉంది.అమ్మోరు తల్లినయనతార నటించిన ‘ముకుత్తి అమ్మన్’ (తెలుగులో అమ్మోరు తల్లి) 2020 నవంబరులో డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై, వీక్షకుల మెప్పు పొందింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ముక్కుత్తి అమ్మన్ 2’ను ప్రకటించింది వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ సంస్థ. ‘ముక్కుత్తి అమ్మన్’లో నటించిన నయనతారనే సీక్వెల్లోనూ లీడ్ రోల్ చేస్తున్నారు. అయితే ‘ముక్కుత్తి అమ్మన్’కు నటుడు ఆర్జే బాలాజీ–ఎన్జే శరవణన్ దర్శకత్వం వహించగా, ‘ముకుత్తి అమ్మన్ 2’ను మాత్రం నటుడు–దర్శకుడు సుందర్ .సి తెరకెక్కించనున్నారు. సుందర్.సి నేతృత్వంలోని మరో ఫ్రాంచైజీ ‘కలగలప్పు’లోని ‘కలగలప్పు 3’ని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. కామెడీ డ్రామాగా ‘కలగలప్పు’కు తమిళ ఆడియన్స్‌లో మంచి క్రేజ్ ఉంది.హారర్ ఎఫెక్ట్!ఇవే కాదు... కమల్‌హాసన్ ‘విక్రమ్ 2’, ధనుష్ ‘వడ చెన్నై 2’ వంటి చిత్రాలతో పాటు మరికొన్ని తమిళ చిత్రాల సీక్వెల్స్ వచ్చే అవకాశం ఉంది.ఈసారి హారర్ జానర్ సీక్వెల్స్ కోలీవుడ్‌లో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలవనున్నాయి. రాఘవా లారెన్స్ ఆధ్వర్యంలో ఆడియన్స్‌ను అలరిస్తున్న ‘కాంచన’ సిరీస్‌కు మంచి ఆదరణ ఉంది. ఈ సిరీస్‌లో మరో చిత్రంగా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు ‘కాంచన 4’ రానుందని కోలీవుడ్ సమాచారం. రాఘవా లారెన్స్ నటించి, దర్శకత్వం వహించనున్న ‘కాంచన 4’లో పూజా హెగ్డే హీరోయిన్గా నటించనున్నారనే టాక్ వినిపిస్తోంది. మరి... ‘కాంచన 4’లో ఎవరు నటిస్తారనే విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఇక సుందర్ .సి సారథ్యంలో నడుస్తున్న హారర్ ఫ్రాంచైజీ ‘అరణ్మణై’ గురించి చెప్పుకోవాలి. తమన్నా, రాశీ ఖన్నా లీడ్ రోల్స్‌లో నటించిన ‘అరణ్మణై 4’ (తెలుగులో ‘డాకు’) ఆడియన్స్‌ను మెప్పించింది. దీంతో ఈ ఏడాదిలోనే ‘అరణ్మణై 5’ను కూడా తీయాలని సుందర్ .సి ప్లాన్ చేస్తున్నారని కోలీవుడ్ టాక్. అలాగే హారర్ జానర్లో సంతానం చేస్తున్న హారర్ కామెడీ ఫ్రాంచైజీ ‘డీడీ’ నుంచి నాలుగో మూవీగా ‘డీడీ నెక్ట్స్ లెవల్’ చిత్రం రానుంది. ఎస్. ప్రేమ్ ఆనంద్ డైరెక్షన్‌లోని ఈ మూవీలో సెల్వ రాఘవన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఇతర లీడ్ రోల్స్ చేశారు. ఈ మూవీ మేలో రిలీజ్ కానుంది. ఇక 2014లో మిస్కిన్ డైరెక్షన్లో వచ్చిన ‘పిశాసు’ (తెలుగులో ‘పిశాచి’) చిత్రం ఆడియన్స్‌ను ఆకట్టుకోగలిగింది. దాదాపు పదేళ్ల తర్వాత ‘పిశాసు’ సినిమాకు సీక్వెల్‌గా ‘పిశాసు 2’ తీస్తున్నారు మిస్కిన్. సీక్వెల్లో ఆండ్రియా మెయిన్ లీడ్ రోల్ చేశారు. మార్చిలో ఈ మూవీ రిలీజ్ కానుంది. ‘డీమాంటి కాలనీ’ ఫ్రాంచైజీ గురించి హారర్ చిత్రాలను ఇష్టపడేవారికి తెలిసే ఉంటుంది. గత ఏడాది ఆగస్టులో విడుదలైన ‘డీమాంటి కాలనీ 2’ తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందే ప్రయత్నం చేసింది. కాగా ‘డీమాంటీ కాలనీ’ ఫ్రాంచైజీ దర్శకుడు అజయ్.ఆర్ జ్ఞానముత్తు ‘డీమాంటీ కాలనీ’కి సీక్వెల్‌గా ‘డీమాంటీ కాలనీ 3’ని ఆల్రెడీ ప్రకటించారు. ఈ చిత్రం ఈ ఏడాదే సెట్స్‌పైకి వెళ్లనున్నట్లుగా తెలిసింది. రిలీజ్ మాత్రం 2026లో ఉండొచ్చు.ప్రకటించారు... కానీ..!కోలీవుడ్‌లో కొన్ని హిట్ ఫిల్మ్స్‌కు సీక్వెల్స్ ప్రకటించారు మేకర్స్. కానీ ఈ సినిమాలు ఇంకా పూర్తి స్థాయిలో సెట్స్‌పైకి వెళ్లలేదు. ఆ సినిమాలేవో చదవండి.విదేశాల్లో డిటెక్టివ్ విశాల్ కెరీర్‌లోని వన్నాఫ్ ది బెస్ట్ హిట్స్‌లో ‘తుప్పరివాలన్’ ఒకటి. మిస్కిన్ డైరెక్షన్‌లోని ఈ మూవీ తెలుగులో ‘డిటెక్టివ్’గా విడుదలై, ప్రేక్షకులను మెప్పించింది. అప్పట్నుంచే ఈ మూవీకి సీక్వెల్ తీయానులనుకున్నారు విశాల్. మిస్కిన్ డైరెక్షన్లోనే ‘డిటెక్టివ్ 2’ను ప్రకటించారు విశాల్. అయితే కథ విషయంలో మిస్కిన్కు, విశాల్‌కు మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయి. దీంతో ఈ ప్రాజెక్ట్ నుంచి మిస్కిన్ తప్పుకున్నారు. ఆ తర్వాత ‘డిటెక్టివ్ 2’కి తానే దర్శకత్వం వహించాలనుకున్నారు విశాల్.తన స్టైల్ ఆఫ్ ‘డిటెక్టివ్ 2’తో తాను దర్శకుడిగా పరిచయం కాబోతున్నానని, ఇది తన పాతికేళ్ల కల అని, ఇందుకోసం లండన్, అజర్ బైజాన్, మాల్తా వంటి లొకేషన్స్‌ను పరిశీలిస్తున్నానని గత ఏడాది మార్చిలో విశాల్ పేర్కొన్నారు. కానీ ‘డిటెక్టివ్ 2’ చిత్రం ఇంకా సెట్స్‌పైకి వెళ్లలేదని తెలుస్తోంది. ఇలా విశాల్ నుంచి ‘డిటెక్టివ్ 2’ అప్డేట్ రావాల్సి ఉంది. అలాగే విశాల్ హీరోగా పీఎస్ మిత్రన్ డైరెక్షన్లో వచ్చిన ‘ఇరంబుదురై’ మూవీ 2018లో రిలీజై, హిట్ సాధించింది. ఈ సినిమాకు సీక్వెల్ రానుందనే టాక్ వినిపిస్తోంది. బాక్సింగ్ రౌండ్ 2 నాలుగు సంవత్సరాల క్రితం కరోనా సమయంలో ‘సార్పట్టై పరంబర’ చిత్రం డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలైంది. పా. రంజిత్ డైరెక్షన్‌లోని ఈ మూవీకి వీక్షకుల నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. దీంతో ‘సార్పట్టై పరంబర’ సినిమా సీక్వెల్‌ను థియేటర్స్‌లో రిలీజ్ చేయాలని పా. రంజిత్ భావించారు. 2023 మార్చిలో ‘సార్పట్టై పరంబర’ సినిమాకు సీక్వెల్‌గా ‘సార్పట్టై రౌండ్ 2’ ప్రకటించారు. అయితే ఈ మూవీపై మరో అప్డేట్ రావాల్సి ఉంది.తని ఒరువన్ 2 రవి మోహన్ (‘జయం’ రవి తన పేరును ఇటీవల రవి మోహన్‌గా మార్చుకున్నారు) హీరోగా మోహన్ రాజా డైరెక్షన్లో వచ్చిన ‘తని ఒరువన్’ మూవీ గుర్తుండే ఉంటుంది. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిన ఈ మూవీ 2015లో విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘తని ఒరువన్ 2’ని ప్రకటించారు మోహన్ రాజా. అయితే మణిరత్నం పొన్నియిన్ సెల్వన్’తో రవి మోహన్ బిజీగా ఉండటం వల్ల ‘తని ఒరువన్ 2’ చేయడానికి వీలు పడలేదు. ఈ ఏడాది ఈ సినిమాను సెట్స్‌కు తీసుకువెళ్లే సాధ్యసాధ్యాలను రవి మోహన్ పరిశీలిస్తున్నారని కోలీవుడ్ సమాచారం. ఈ సినిమాని కూడా ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించనుంది. ఇక ‘తన్ ఒరువన్’ మూవీ తెలుగులో ‘ధృవ’ (రామ్ చరణ్ హీరోగా నటించారు)గా రీమేక్ అయి, విజయం సాధించిన సంగతి తెలిసిందే. – ముసిమి శివాంజనేయులు
రాయడం గేమ్ చేంజర్ లా మారింది: సమంత
‘‘నేను గత రెండేళ్లుగా డైరీ రాస్తున్నాను. నా జీవితంలో డైరీ రాయడం ఓ గేమ్ చేంజర్లా మారింది. మీరూ రాయడానికి ప్రయత్నించండి’’ అంటున్నారు హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu) . కాగా విజయ్ దేవరకొండ, సమంత నటించిన ‘ఖుషి’ సినిమా 2023 సెప్టెంబరు 1న విడుదలైంది. ఈ మూవీ తర్వాత మరో చిత్రంలో నటించలేదు సమంత. అయితే గతేడాది ‘సిటాడెల్ హన్నీ బన్నీ’ అనే బాలీవుడ్ వెబ్ సిరీస్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులను పలకరించారు సమంత.ఇక సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటారామె. ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయాన్ని షేర్ చేస్తూ తన అభిమానులతో టచ్‌లో ఉంటారు సమంత. ఇందులో భాగంగా తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆమె చేసిన ఓ పోస్ట్ వైరల్‌గా మారింది.‘‘డైరీ రాయడం అనేది పాత పద్ధతే. కానీ, రాస్తే మాత్రం మనకు ఓ తీయని జ్ఞాపకంగా ఉంటుంది. నేను గత రెండేళ్లుగా డైరీ రాసే ఆచారాన్ని పాటిస్తున్నాను. ప్రారంభంలో కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఏం రాయాలో అర్థం కాదు.కానీ, ఎంత చిన్న విషయమైనా సరే అందులో రాస్తే... మెల్లిగా అదొక అలవాటుగా మారుతుంది. మనలో చాలా మార్పులు వస్తాయి. నేను కూడా నాకు కష్టమైన, కష్టం అనిపించిన క్షణాల్లో కొన్నింటిని డైరీలో రాశాను. డైరీ రాయడం అనేది నా కష్టతరమైన క్షణాల నుంచి ఉపశమనం కలగడానికి చాలా ఉపయోగపడింది. చెప్పాలంటే డైరీ రాయడం నాకో గేమ్ చేంజర్లా మారింది. అందరూ రాయడం ప్రయత్నించండి... ఎవరి జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో చూద్దాం’’ అంటూ పోస్ట్ చేశారు సమంత. ఇదిలా ఉంటే సమంత ప్రస్తుతం ‘రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్’ అనే వెబ్ సిరీస్ చేస్తున్నారు.
హీరోల వయసు గురించి ఎందుకు మాట్లాడరో?
చిత్ర పరిశ్రమలో వయసనేది పెద్ద సమస్యే కాదని నటి మనీషా కొయిరాలా(Manisha Koirala) అంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ– ‘‘చిత్ర పరిశ్రమలోని సీనియర్ నటీమణులకు ముఖ్యమైన పాత్రలు చేసే అవకాశం ఇవ్వాలి. వయసు, వృద్ధాప్యం అనేది సినిమా ఇండస్ట్రీలో పెద్ద సమస్య కాదు. కానీ, ఇది పరిష్కరించాల్సిన సామాజిక సమస్య.ఎందుకంటే చిత్ర పరిశ్రమలో హీరోల వయసు గురించి ఎవరూ మాట్లాడరు. హీరోల ఏజ్‌పై కామెంట్స్ చేయడం నేనిప్పటి వరకూ వినలేదు. ఏజ్ విషయంలో కేవలం నటీమణులను మాత్రమే ఎందుకు ట్రోల్ చేస్తారో అర్థం కావడం లేదు. సీనియర్లకు తల్లి పాత్రలో లేక సోదరి పాత్రలో ఇద్దామనుకుంటున్నారు. మహిళలు ఎలాంటి పాత్రలైనా చేయగలరు. యాక్షన్ పాత్రలని కూడా సులభంగా చేయగలరు.గతంలో ఎంతో మంది సీనియర్ నటీమణులు ఈ విషయాన్ని నిరూపించారు. నేను కూడా ఇప్పటికీ ఎలాంటి పాత్ర అయినా సవాల్‌గా స్వీకరిస్తాను. కొత్త పాత్రలు చేసి నన్ను నేను నిరూపించుకోవాలనుకుంటున్నాను. ఏజ్ అనేది జస్ట్ నంబర్ మాత్రమే. యాభై సంవత్సరాలు దాటినా మంచి జీవితాన్ని గడపగలం. అసలు వయసనేది సమస్య కాదని ప్రపంచానికి చాటి చెప్పాలి. ఈ విషయంలో భవిష్యత్ తరాలకు మార్గదర్శిగా నిలవాలి. నేను జీవించి ఉన్నంత వరకు ఆరోగ్యంగా, సంతోషంగా, సంతృప్తిగా ఉండాలనుకుంటున్నా.. ఇదే ఆశయంతో జీవిస్తున్నాను’’ అన్నారు.
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు
ఆస్ట్రేలియాకు కొత్త కోచ్
ఆస్ట్రేలియా పేస్ బౌలింగ్ కోచ్‌గా ఆర్సీబీ బౌలింగ్ కోచ్ ఆడమ్ గ్రిఫిత్ నియమితుడయ్యాడు. 46 ఏళ్ల గ్రిఫిత్ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్‌గా ఆస్ట్రేలియా దేశవాలీ క్రికెట్ (టస్మానియా తరఫున) ఆడాడు. గ్రిఫిత్ 2019 నుంచి 2024 వరకు ఆర్సీబీ బౌలింగ్ కోచ్‌గా పని చేశాడు. గ్రిఫిత్ ప్రస్తుతం ఆస్ట్రేలియా దేశవాలీ జట్టు అయిన విక్టోరియాకు అసిస్టెంట్ కోచ్‌గా సేవలందిస్తున్నాడు. గ్రిఫిత్.. ఆస్ట్రేలియా జాతీయ జట్టుతో పాటు ఆస్ట్రేలియా-ఏ జట్టుకు కూడా బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు.గ్రిఫిత్ బ్రిస్బేన్‌లో ఉన్న క్రికెట్ ఆస్ట్రేలియా నేషనల్ క్రికెట్ సెంటర్‌ను ఆపరేట్ చేస్తాడని క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. గ్రిఫిత్ పేస్ బౌలర్ల అభివృద్ధి మరియు కొత్త పేస్ బౌలర్లను తయారు చేయడంలో భాగమవుతాడని క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది. గ్రిఫిత్ నియామకాన్ని ఆస్ట్రేలియా హెడ్ కోచ్ ఆండ్రూ మెక్ డొనాల్డ్ స్వాగతించాడు. గ్రిఫిత్ అనుభవం ఆసీస్ పేసర్లను మరింత పదునెక్కించేందుకు ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డాడు.గ్రిఫిత్ తన కోచింగ్ కెరీర్లో వెస్ట్రన్ ఆస్ట్రేలియా, పెర్త్ స్కార్చర్ జట్లకు సీనియర్ అసిస్టెంట్ కోచ్‌గా.. టస్మానియా కోచింగ్ డైరెక్టర్‌గా.. బీబీఎల్ జట్లైన టస్మానియా టైగర్స్, హోబర్ట్ హరికేన్స్ జట్లకు హెడ్ కోచ్‌గా పని చేశాడు.ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియా జట్టు త్వరలో రెండు టెస్ట్‌లు, రెండు మ్యాచ్ వన్డే సిరీస్ కోసం శ్రీలంకలో పర్యటించనుంది. ఈ సిరీస్‌లో టెస్ట్ జట్టుకు స్టీవ్ స్మిత్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ గాయం కారణంగా ఈ పర్యటనకు దూరంగా ఉన్నాడు. ఈ సిరీస్‌లో తొలి టెస్ట్ గాలే వేదికగా జనవరి 29న ప్రారంభం కానుంది. రెండో టెస్ట్ ఇదే వేదికగా ఫిబ్రవరి 6 నుంచి మొదలవుతుంది. అనంతరం ఫిబ్రవరి 12, 14 తేదీల్లో రెండు వన్డేలు జరుగనున్నాయి.ఆస్ట్రేలియా ఇటీవలే స్వదేశంలో భారత్‌తో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. శ్రీలంక పర్యటన అనంతరం ఆస్ట్రేలియా ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొంటుంది. మెగా టోర్నీలో ఆసీస్ ఫిబ్రవరి 22న తమ తొలి మ్యాచ్ ఆడుతుంది. కరాచీలో జరిగే ఆ మ్యాచ్‌లో ఆసీస్ ఇంగ్లండ్‌ను ఢీకొంటుంది. అనంతరం ఫిబ్రవరి 25న సౌతాఫ్రికాతో (రావల్పిండి), ఫిబ్రవరి 28న ఆఫ్ఘనిస్తాన్‌తో (లాహోర్) తలపడుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆసీస్ గ్రూప్-బిలో ఉంది. గ్రూప్-ఏలో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లు ఉన్నాయి. మెగా టోర్నీలో భారత్ ఫిబ్రవరి 20న దుబాయ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. అనంతరం ఫిబ్రవరి 23న పాకిస్తాన్‌ను, మార్చి 2న న్యూజిలాండ్‌ను ఢీకొంటుంది.
పంత్‌తో పోటీలో సంజూ వెనుకబడటానికి కారణం అదే: డీకే
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) జట్టులో రిషభ్ పంత్‌కు చోటు దక్కడంపై భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ స్పందించాడు. సంజూ శాంసన్(Sanju Samson)ను కాదని.. సెలక్టర్లు ఈ ఉత్తరాఖండ్ ఆటగాడి వైపు మొగ్గుచూపడానికి గల కారణాన్ని విశ్లేషించాడు. ఇద్దరూ సూపర్ బ్యాటర్లే అయినా.. పంత్(Rishabh Pant)లోని ఓ ప్రత్యేకతే అతడిని రేసులో ముందు నిలిపిందని పేర్కొన్నాడు.పాకిస్తాన్ వేదికగావన్డే ఫార్మాట్లో నిర్వహించే చాంపియన్స్ ట్రోఫీ తాజా ఎడిషన్ ఫిబ్రవరి 19న పాకిస్తాన్ వేదికగా మొదలుకానుంది. భద్రతా కారణాల దృష్ట్యా తటస్థ వేదికైన దుబాయ్‌లో మ్యాచ్‌లు ఆడనున్న టీమిండియా.. తమ తొలి మ్యాచ్‌లో ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఇక ఈ మెగా టోర్నీకి ఆతిథ్య జట్టు హోదాలో పాకిస్తాన్ నేరుగా క్వాలిఫై అయింది.మరోవైపు.. ఆస్ట్రేలియా, భారత్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ వన్డే వరల్డ్‌కప్-2023 పాయింట్ల పట్టికలో స్థానాల ఆధారంగా అర్హత సాధించాయి. ఇందుకు సంబంధించి ఈ ఏడు దేశాలు తమ జట్లను ప్రకటించగా.. పాకిస్తాన్ మాత్రం ఇంకా టీమ్ వివరాలు వెల్లడించలేదు.సంజూకు దక్కని చోటుఇదిలా ఉంటే.. జనవరి 18న భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించిన జట్టులో కేరళ ఆటగాడు సంజూ శాంసన్‌కు చోటు దక్కలేదు. వికెట్ కీపర్ల కోటాలో వన్డే వరల్డ్‌కప్- 2023లో రాణించిన కేఎల్ రాహుల్‌తో పాటు.. రిషభ్ పంత్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. నిజానికి వన్డేల్లో పంత్ కంటే సంజూ గణాంకాలు మెరుగ్గా ఉన్నాయి.అప్పుడు కూడా ఇదే తరహాలోఇప్పటి వరకు టీమిండియా తరఫున 31 వన్డేల్లో పంత్ 33.5 సగటుతో 871 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ ఉంది. మరోవైపు.. సంజూ 16 వన్డేల్లో 56.66 సగటుతో ఓ శతకం, మూడు హాఫ్ సెంచరీల సాయంతో 510 పరుగులు సాధించాడు. నిజానికి సంజూకు వన్డే వరల్డ్‌కప్-2023 జట్టులో కూడా చోటు దక్కాల్సింది. కానీ నాడు అతడిని కాదని.. టీ20 స్పెషలిస్టు సూర్యకుమార్ యాదవ్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది.అయితే, ఈ ఐసీసీ టోర్నీలో సూర్య పూర్తిగా తేలిపోయాడు. దీంతో సంజూకు అవకాశం ఇచ్చి ఉంటే.. ఫలితాలు ఇంకాస్త మెరుగ్గా ఉండేవనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సూర్య కోసం అతడిని బలిచేసి.. మరోసారి అన్యాయం చేశారంటూ బీసీసీఐపై విమర్శలు వచ్చాయి. తాజాగా మరోసారి కూడా పంత్ కోసం సంజూను కావాలనే పక్కనపెట్టారనే వార్తలు వినిపిస్తున్నాయి.పంత్‌ను చేర్చడం ద్వారానే అది సాధ్యంఈ నేపథ్యంలో టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్.. ఈ ఇద్దరినీ పోలుస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘రిషభ్ పంత్.. లేదా సంజూ శాంసన్.. ఇద్దరి మధ్య పోటాపోటీ నెలకొంది. ఇద్దరూ అచ్చమైన బ్యాటర్లే. అయితే, రిషభ్ పంత్ వైపు సెలక్టర్లు మొగ్గు చూపడానికి కారణం.. అతడు ఎడమచేతి వాటం బ్యాటర్ కావడమే.బ్యాటింగ్ ఆర్డర్లో మేనేజ్మెంట్ కోరుకుంటున్న వైవిధ్యం పంత్‌ను చేర్చడం ద్వారా సాధ్యమవుతుంది. ఏదేమైనా సంజూ శాంసన్ కూడా చివరి వరకు పోటీలో నిలిచాడని చెప్పవచ్చు.విజయ్ హజారే ట్రోఫీలో ఆడి ఉంటే..అయితే, ఈసారి విజయ్ హజారే ట్రోఫీ ఆడకపోవడం కూడా అతడి ఎంపికపై ప్రభావం చూపింది. ఈ దేశీ టోర్నీలో ఆడి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది’’ అని దినేశ్ కార్తిక్ క్రిక్‌బజ్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.కాగా దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీకి సంజూ శాంసన్ దూరంగా ఉన్నాడు. కేరళ క్రికెట్ అసోసియేషన్(కేసీఏ)తో అతడికి విభేదాలు తలెత్తిన కారణంగానే ఈ టోర్నీలో పాల్గొనలేకపోయాడు. మూడు రోజుల పాటు నిర్వహించిన శిక్షణా శిబిరానికి సంజూ రాలేదని కేసీఏ పెద్దలు వేటు వేయగా.. సంజూ తండ్రి శాంసన్ విశ్వనాథ్ మాత్రం తన కుమారుడిపై కావాలనే కక్ష సాధిస్తున్నారని ఆరోపించాడు. సంజూ మాదిరి ప్రాక్టీస్ సెషన్‌కు హాజరుకాని ఎంతో మంది ఆటగాళ్లకు కేరళ జట్టులో చోటు ఇచ్చారని పేర్కొన్నాడు.చదవండి: అతడొక సూపర్‌స్టార్.. మా ఓటమికి కారణం అదే: బట్లర్
గంగూలీ బయోపిక్‌లో రాజ్‌కుమార్ రావు..?
టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ జీవిత కథ వెండితెరపై ఆవిష్కృతం కానున్న విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు విక్రమాదిత్య మోత్వాని హిందీలో ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాలో తొలుత బాలీవుడ్ విలక్షణ నటుడు ఆయుష్మాన్ ఖురానా లీడ్ రోల్లో నటిస్తాడిని ప్రచారం జరిగింది. అయితే డేట్స్ కుదరక ఖురానా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. 🚨 RAJKUMAR RAO AS GANGULY. 🚨- Rajkumar Rao likely to play Sourav Ganguly in Dada's biopic. (Sumit Ghosh). pic.twitter.com/zReuoMSp4h— Mufaddal Vohra (@mufaddal_vohra) January 24, 2025తాజాగా గంగూలీ బయోపిక్‌లో రాజ్‌కుమార్ రావు లీడ్ రోల్ పోషిస్తాడని ప్రచారం జరుగుతుంది. ఈ విషయమై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. నిర్మాతలు లవ్ రంజన్, అంకుర్ గార్గ్ (లవ్ ఫిల్మ్స్) ఇప్పటివరకు స్పందించలేదు.కాగా, గంగూలీ బయోపిక్‌లో లీడ్ రోల్ కోసం తొలుత ఓ ప్రముఖ బెంగాలీ నటుడిని కూడా సంప్రదించారని తెలుస్తుంది. గంగూలీ స్నేహితుడైన ప్రొసేన్‌జిత్ ఛటర్జీని బయోపిక్‌లో నటించమని దర్శక, నిర్మాతలు కోరారట. ఇందుకు ప్రొసేన్‌జిత్ కూడా ఒప్పుకున్నాడని ప్రచారం జరిగింది. అయితే ఏమైందో ఏమో తెలీదు కానీ ప్రొసేన్‌జిత్ సైడ్ అయిపోయి కొత్తగా రాజ్‌కుమార్ రావు తెరపైకి వచ్చాడు.గంగూలీ క్రికెటింగ్ కెరీర్ విషయానికొస్తే.. టీమిండియా గొప్ప కెప్టెన్లలో గంగూలీ ఒకడు. భారత క్రికెట్‌కు గంగూలీ దూకుడు నేర్పాడు. గంగూలీ సారథ్యంలో టీమిండియా ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించింది. గంగూలీ నేతృత్వంలో భారత్ 146 వన్డేల్లో 76 విజయాలు.. 49 టెస్ట్‌ల్లో 21 విజయాలు సాధించింది. క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అనంతరం గంగూలీ బీసీసీఐ అథ్యక్షుడిగా పని చేశాడు. ప్రస్తుతం గంగూలీ ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు.
విడాకులు తీసుకోనున్న వీరేంద్ర సెహ్వాగ్..?
టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 20 ఏళ్ల తన వైవాహిక బంధానికి స్వస్తి పలుకనున్నట్లు తెలుస్తుంది. సెహ్వాగ్ తన భార్య ఆర్తి అహ్లావత్‌తో విడాకులు తీసుకోనున్నాడని సమాచారం. దీనికి సంబంధించిన వార్త నిన్నటి నుంచి సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది. సెహ్వాగ్, ఆర్తి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడంతో పాటు గత కొన్ని నెలలుగా వేర్వేరుగా ఉంటున్నట్లు తెలుస్తుంది. గత దీపావళి రోజున సెహ్వాగ్ ఒంటరిగా ఉన్న ఫోటోలు షేర్ చేయడం.. సెహ్వాగ్ ఒంటరిగానే పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడం విడాకుల ప్రచారానికి బలం చేకూరుస్తుంది. కొడుకులు ఇద్దరూ క్రికెట్లో రాణిస్తున్నారుసెహ్వాగ్కు 2004లో ఆర్తితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు. ఆర్యవీర్, వేదాంత్. వీరిద్దరూ తండ్రి బాటలోనే క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నారు.అర్యవీర్.. గతేడాది నవంబర్‌లో జరిగిన అండర్-19 కూచ్ బెహార్ ట్రోఫీలో డబుల్ సెంచరీ సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఢిల్లీకి ప్రాతినిథ్యం వహించే ఆర్యవీర్.. మేఘాలయతో జరిగిన మ్యాచ్‌లో 229 బంతుల్లోనే 34 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 200 పరుగులు చేశాడు.రెండో కుమారుడు వేదాంత్ స్పిన్నర్‌గా రాణిస్తున్నాడు. వేదాంత్.. అండర్-16 విజయ్ మర్చంట్ ట్రోఫీలో ఢిల్లీకి ప్రాతినిథ్యం వహిస్తూ అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. ఈ సీజన్లో వేదాంత్ 24 వికెట్లు పడగొట్టి.. ఢిల్లీ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఇందులో రెండు 5 వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి.ఆర్తి కంప్యూటర్ సైన్స్‌లో డిప్లొమా చేసిందిఆర్తి.. సెహ్వాగ్ కంటే రెండేళ్లు చిన్నది. ఆమె ఢిల్లీ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో డిప్లొమా చేసింది. ఆర్తి ప్రాథమిక విద్యాభ్యాసం అంతా ఢిల్లీలోనే జరిగింది. ఆర్తి భారతీయ విద్యా భవన్లో చదువుకుంది. సెహ్వాగ్-ఆర్తిల వివాహం దివంగత కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఇంట్లో జరిగింది. విడాకుల ప్రచారంపై సెహ్వాగ్ కాని, ఆర్తి కాని ఇప్పటివరకు స్పందించలేదు.భారత క్రికెట్ సర్కిల్స్‌లో వరుస విడాకుల వార్తలుకాగా, ఇటీవలికాలంలో భారత క్రికెట్ సర్కిల్లో విడాకుల వార్తలు కలకలం రేపుతున్నాయి. గత కొద్ది రోజులుగా టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్, అతని భార్య ధనశ్రీ వర్మ విడాకులు తీసుకోబోతున్నారని ప్రచారం జరుగుతుంది. విడాకుల ప్రచారాన్ని చహల్, ధనశ్రీ ఖండించకపోవడంతో ఈ వార్త నిజమేనని తెలుస్తుంది. మరో భారత క్రికెటర్ మనీశ్ పాండే కూడా తన భార్య అశ్రిత షెట్టి నుంచి విడిపోబోతున్నాడని తెలుస్తుంది. మనీశ్, అశ్రిత్ సైతం సెహ్వాగ్-ఆర్తి, చహల్-ధనశ్రీ తరహాలో సోషల్‌మీడియాలో ఒకరినొకరు అన్ఫాల్లో చేసుకున్నారు. వీరిద్దరికి ముందు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా విషయంలోనూ ఇదే డ్రామా నడిచింది. అయితే హార్దిక్, అతని భార్య నటాషా ఒకరినొకరు విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. హార్దిక్‌కు ముందు షమీ, శిఖర్ ధవన్ కూడా తమతమ భార్యలతో విడాకులు తీసుకున్నారు.సెహ్వాగ్ క్రికెటింగ్ కెరీర్ విషయానికొస్తే.. సెహ్వాగ్‌ను క్రికెట్ సర్కిల్స్‌లో ముద్దుగా నజఫ్ఘడ్ నవాబ్, వీరూ అని పిలుస్తారు. వీరూ 1999లో భారత్ తరఫున అరంగేట్రం చేసి 2013లో రిటైరయ్యాడు. సెహ్వాగ్ తన కెరీర్లో 104 టెస్ట్‌లు, 251 వన్డేలు, 19 టీ20 ఆడి 17000కు పైగా పరుగులు చేశాడు. రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ బౌలర్ కూడా అయిన సెహ్వాగ్ భారత్ తరఫున 136 వికెట్లు తీశాడు. సెహ్వాగ్ కెరీర్లో 23 టెస్ట్ సెంచరీలు, 15 వన్డే సెంచరీలు ఉన్నాయి. సెహ్వాగ్ టెస్ట్‌ల్లో రెండు ట్రిపుల్ సెంచరీలు, వన్డేల్లో ఓ డబుల్ సెంచరీ చేశాడు.
బిజినెస్
లాభాల్లో కదలాడుతున్న స్టాక్‌మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:30 సమయానికి నిఫ్టీ(Nifty) 33 పాయింట్లు లాభపడి 23,241కు చేరింది. సెన్సెక్స్(Sensex) 129 పాయింట్లు ఎగబాకి 76,655 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 107.8 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 78.17 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.62 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.53 శాతం లాభపడింది. నాస్డాక్ 0.22 శాతం ఎగబాకింది.ఇదీ చదవండి: రోల్స్‌రాయిస్‌కు రూ.90,200 కోట్ల కాంట్రాక్ట్దేశీయ కార్పొరేట్ క్యూ3 ఆర్థిక ఫలితాలు నిరాశపరుస్తున్నాయి. ఇప్పటి వరకు ఫలితాలు వెల్లడించిన లిస్టెడ్ కంపెనీల సగటు నికరలాభ వృద్ధి కేవలం 4%గా మాత్రమే నమోదైంది. వార్షిక ప్రాతిపదిక డిసెంబర్ త్రైమాసికంలో నిఫ్టీ50 కంపెనీల ఈపీఎస్(ఎర్నింగ్స్ పర్ షేర్) 3% మాత్రమే ఉంటుందని బ్లూమ్‌బర్గ్ ఇటీవల అంచనా వేసింది. రానున్న బడ్జెట్లో ప్రభుత్వం మూలధన పెట్టుబడులకు సంబంధించి కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దాంతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
రోల్స్‌రాయిస్‌కు రూ.90,200 కోట్ల కాంట్రాక్ట్
బ్రిటన్ జలాంతర్గాములకు ఎనర్జీ అందించే అణు రియాక్టర్ల రూపకల్పన, వాటి నిర్వహణ కాంట్రాక్ట్‌ను రోల్స్ రాయిస్ దక్కించుకుంది. 11 బిలియన్ డాలర్ల(సుమారు రూ.90,200 కోట్లు) ఈ ‘యూనిటీ’ కాంట్రాక్టు ఎనిమిదేళ్లపాటు చెల్లుబాటు అవుతుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ ఒప్పందం బ్రిటన్ రాయల్ నేవీ సామర్థ్యాన్ని పెంచుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.ఈ యూనిటీ ఒప్పందం గతంలో చేసుకున్న ఒప్పందాలను క్రమబద్ధీకరిస్తుందని అధికారులు తెలిపారు. కంపెనీ అందుకున్న కాంట్రాక్టు వల్ల లండన్‌లో పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఈ నిధులు బ్రిటిష్ వ్యాపారం, ఉద్యోగాలు, జాతీయ భద్రతకు దీర్ఘకాలిక ప్రోత్సాహాన్ని అందిస్తాయని రక్షణ మంత్రి జాన్ హీలీ నొక్కి చెప్పారు. ఈ ఒప్పందం వల్ల కనీసం 1,000 నైపుణ్యం కలిగిన ఉద్యోగులకు అవకాశాలు వస్తాయని, 4,000 మందికి పరోక్షంగా రక్షణ లభిస్తుందని భావిస్తున్నారు. ఈ సందర్భంగా సెంట్రల్ ఇంగ్లాండ్‌లో డెర్బీలో రోల్స్ రాయిస్ న్యూక్లియర్ రియాక్టర్ ఉత్పత్తి కేంద్రాన్ని బ్రిటన్ రక్షణ మంత్రి హీలీ సందర్శించారు.ఇదీ చదవండి: కాల్స్ కోసమే ప్రత్యేక ప్యాక్.. వాట్సప్‌కు ఊరటయూకే, యూఎస్, ఆస్ట్రేలియా మధ్య సైనిక సహకారాన్ని బలోపేతం చేయడానికి ఈ ఒప్పందం సహకరిస్తుందని బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది. ఈ ఒప్పందంతో రక్షణ రంగంలో నూతన ఆవిష్కరణలతో అత్యాధునిక టెక్నాలజీని వినియోగించబోతున్నట్లు రోల్స్ రాయిస్ పేర్కొంది.
కాల్స్ కోసమే ప్రత్యేక ప్యాక్.. వాట్సప్‌కు ఊరట
న్యూఢిల్లీ: కాల్స్, ఎస్ఎంఎస్ల కోసం ప్రత్యేక ప్రీపెయిడ్ ప్యాక్స్‌ను టెలికాం కంపెనీలు రిలయన్స్ జియో(Jio), భారతీ ఎయిర్టెల్(Airtel) పరిచయం చేశాయి. 84 రోజుల కాల పరిమితితో రూ.499 ధరలో కొత్త ప్లాన్‌ను ఎయిర్టెల్ అందుబాటులోకి తెచ్చింది. అపరిమిత కాల్స్, 900 ఎస్ఎంఎస్లు ఆఫర్ చేస్తారు. అలాగే రూ.1,959 ధరలో 365 రోజుల వ్యాలిడిటీ గల ప్యాక్ కింద అపరిమిత కాల్స్, 3,600 ఎస్ఎంఎస్లు అందుకోవచ్చు.రిలయన్స్ జియో రూ.458 ధరలో 84 రోజుల కాల పరిమితితో అపరిమిత వాయిస్‌కాల్స్, 1,000 ఎస్ఎంఎస్లను అందిస్తోంది. ఏడాది కాల పరిమితితో రూ.1,958 ధరలో అపరిమిత కాల్స్, 3,600 ఎస్ఎంఎస్లను పొందవచ్చు. డేటా అవసరం లేకపోయినా బండిల్ ప్యాక్స్ వల్ల కస్టమర్లకు చార్జీల భారం పడుతోందన్న ఫిర్యాదుల పెద్ద ఎత్తున రావడంతో టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ గత నెలలో టారిఫ్ నిబంధనలను సవరించింది. దీనికి అనుగుణంగా డేటా అవసరం లేని కస్టమర్ల కోసం వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ల కోసం టెలికం కంపెనీలు ప్రత్యేక ప్లాన్స్‌ను ప్రవేశపెట్టాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: త్రైమాసిక ఫలితాల్లో కంపెనీలకు లాభాలుఎన్సీఎల్ఏటీలో వాట్సాప్‌కి ఊరటన్యూఢిల్లీ: నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్‌లో (NCLAT) వాట్సాప్‌కు ఊరట లభించింది. మాతృ సంస్థ మెటాతో వాట్సాప్ అయిదేళ్ల పాటు యూజర్ల డేటాను షేర్ చేసుకోరాదంటూ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) నిషేధంపై ఎన్సీఎల్ఏటీ స్టే విధించింది. తదుపరి విచారణను మార్చి 17కు వాయిదా వేసింది. ప్రకటనల అవసరాలరీత్యా యూజర్ల డేటాను మెటాతో పాటు గ్రూప్ కంపెనీలకు అందించేలా 2021లో వాట్సాప్ గోప్యతా పాలసీని అప్డేట్ చేసింది. అయితే, ఇలాంటివి అనుచిత వ్యాపార విధానాల కిందికి వస్తాయంటూ నవంబర్‌లో సీసీఐ అయిదేళ్ల నిషేధంతో పాటు మెటాపై రూ.213 కోట్ల జరిమానా విధించింది. దీన్ని సవాలు చేస్తూ మెటా, వాట్సాప్ సంస్థలు ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించాయి.
త్రైమాసిక ఫలితాల్లో కంపెనీలకు లాభాలు
అదానీ ఎనర్జీ లాభం దూకుడున్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ విద్యుత్ ప్రసార దిగ్గజం అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 80 శాతం దూసుకెళ్లి రూ. 625 కోట్లను అధిగమించింది. ఆదాయం పుంజుకోవడం ఇందుకు సహకరించింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 348 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 4,824 కోట్ల నుంచి రూ. 6,000 కోట్లకు ఎగసింది. విద్యుత్ ప్రసార విభాగంలో రూ. 54,761 కోట్ల భారీ ఆర్డర్‌బుక్‌ను కలిగి ఉన్నట్లు కంపెనీ సీఈవో కందర్ప్ పటేల్ పేర్కొన్నారు. స్మార్ట్ మీటరింగ్‌లో రూ. 13,600 కోట్ల విలువైన ఆర్డర్లు పొందినట్లు వెల్లడించారు. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ షేరు ఎన్ఎస్ఈలో స్వల్ప లాభంతో రూ. 805 వద్ద ముగిసింది.జీల్ లాభం హైజంప్న్యూఢిల్లీ: మీడియా రంగ కంపెనీ జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్(జీల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం మూడు రెట్లుపైగా దూసుకెళ్లి దాదాపు రూ. 164 కోట్లకు చేరింది. ప్రధానంగా నిర్వహణ వ్యయాలు తగ్గడం ఇందుకు సహకరించింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 59 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 1,027 కోట్ల నుంచి రూ. 941 కోట్లకు క్షీణించింది. అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 1,931 కోట్ల నుంచి రూ. 1,735 కోట్లకు తగ్గాయి. వీటిలో నిర్వహణ వ్యయాలు రూ. 1,188 కోట్ల నుంచి రూ. 997 కోట్లకు వెనకడుగు వేశాయి.సైయంట్ లాభం రూ.122 కోట్లుహైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంజినీరింగ్, టెక్నాలజీ సేవల సంస్థ సైయంట్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ. 122 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన) ప్రకటించింది. గత క్యూ3లో ఇది రూ. 147 కోట్లుగా నమోదైంది. మరోవైపు, ఆదాయం రూ. 1,821 కోట్ల నుంచి రూ. 1,926 కోట్లకు చేరింది. కీలకమైన డీఈటీ (డిజిటల్, ఇంజినీరింగ్, టెక్నాలజీ) విభాగం ఆదాయం స్వల్పంగా 0.8 శాతం క్షీణించి రూ. 1,480 కోట్లకు పరిమితమైనట్లు కంపెనీ తెలిపింది. ఈడీ, సీఈవోగా కార్తికేయన్ నటరాజన్ తప్పుకున్నట్లు పేర్కొంది. పవర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ ఉత్పత్తులు, ఎలక్ట్రిక్ వాహనాల్లో ముఖ్యమైన విడిభాగాల అభివృద్ధిలో తమ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కీలక పాత్ర పోషిస్తుందని సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ కృష్ణ బోదనపు తెలిపారు. ఇదీ చదవండి: రియల్టీలో మహిళలకు ఉపాధి ఎక్కడ?హెచ్‌పీసీఎల్ లాభం 3 రెట్లు ప్లస్న్యూఢిల్లీ: చమురు రంగ పీఎస్‌యూ దిగ్గజం హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్(హెచ్‌పీసీఎల్) ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం మూడు రెట్లు ఎగసి రూ. 2,544 కోట్లకు చేరింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో కేవలం రూ. 713 కోట్లు ఆర్జించింది. ఈ ఏడాది క్యూ2(జులై–సెప్టెంబర్)లో సాధించిన రూ. 143 కోట్లతో పోల్చినా లాభాలు భారీగా బలపడ్డాయి. ఇంధన రిటైలింగ్ బిజినెస్ పన్నుకుముందు లాభం రూ. 981 కోట్ల నుంచి రూ. 4,566 కోట్లకు జంప్‌చేసింది. అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు తగ్గినప్పటికీ పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను యథాతథంగా కొనసాగించడం ఇందుకు తోడ్పాటునిచ్చింది. మరోవైపు దేశీ వంటగ్యాస్(ఎల్పీజీ) విక్రయాలలో రూ. 3,100 కోట్లమేర అండర్ రికవరీ(ఉత్పత్తికంటే తక్కువధరకు అమ్మడం)లను నమోదు చేసింది. తాజా సమీక్షా కాలంలో హెచ్‌పీసీఎల్ 6.47 మిలియన్ టన్నుల చమురును ప్రాసెస్ చేసింది. గతేడాది క్యూ3లో 5.34 ఎంటీ చమురును శుద్ధి చేసింది. అమ్మకాలు 11.36 ఎంటీ నుంచి 12.32 ఎంటీకి పెరిగాయి.
ఫ్యామిలీ
దివ్యాంగుల్లో కొత్త వెలుగులు, మన ‘సారా’ సేవకే అంకితం
తమ కోసం ఏదైనా పని చేసుకుంటే స్వార్థం.. అదే సమాజం కోసం చేస్తే సేవ. ఇందులోనూ ఒక్కొక్కరి ఆలోచనా విధానం ఒక్కోలా ఉంటుంది. కొంత మంది వృద్ధులకు సహాయం చేస్తే, మరి కొందరు అనాథలకు, పేద పిల్లలకు సహకారం అందిస్తారు. ఇలా పేద విద్యార్థులు, దివ్యాంగులు, అనాథ వృద్ధుల సంక్షేమం కోసం పరితపిస్తూ, తనకు తోచిన సేవలు అందించడమే కాకుండా, తన లాంటి ఎంతో మందికి దక్సూచిలా నిలుస్తున్నారు. అంగవైకల్యం కలిగిన వారికి భరోసా కల్పిస్తూ వారి కాళ్ల మీద వారు నిలబడేలా చేయూతనిస్తున్నారు. ఇలా ఒకరిద్దరు కాదు ఏకంగా 200 మంది విద్యార్థులు, 150 మంది దివ్యాంగులకు అండగా ఉన్నారు డాక్టర్ సారథామురుగన్. అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందారు ఈ సేవకురాలు.. – అడ్డగుట్ట కేరళకు చెందిన ఈమె పదిహేను ఏళ్ల క్రితం నగరానికి వచ్చి సికింద్రాబాద్‌లోని తన బంధువులతో కలిసి ఉంటున్నారు. మొదట ఐటీ ఉద్యోగం చేస్తూ జీవనం సాగించిన సారా అనంతరం, ఉద్యోగం మానేసి పేద విద్యార్థులు, దివ్యాంగుల సేవకు 2016లో సెవెన్ రేస్ ఫౌండేషన్ పేరుతో స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు. ఈమె సేవలను గుర్తించి ఇటీవల డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ నేషనల్ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ నెలలో మహారాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు డాక్టర్ సారా. దివ్యాంగుల్లో స్ఫూర్తి నిపుతూ.. దివ్యాంగుల్లో స్ఫూర్తిని నింపి మానసిక స్థైర్యాన్ని పెంపొందించేందుకు తన వంతు కృషి చేస్తోంది. సొంత కాళ్లపై నిలబడేలా ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. ఇందులో భాగంగా దివ్యాంగులతో చిరు వ్యాపారాలు పెట్టించడం, కుట్టు మిషన్లు పంపిణీ వంటి ఉపాధి మార్గాలను కల్పిస్తున్నారు. మురికివాడల్లోనూ, రోడ్లపైనా ఎలాంటి ఆసరా లేని వారికి ఆహారం పంపిణీ చేస్తారు. దాదాపు 150 మంది దివ్యాంగులకు కుట్టు మిషన్లతో పాటు 200 వీల్ చైర్లు పంపిణీ చేశారు. 30 వేల గ్రాసరీ కిట్ల పంపిణీ.. కోవిడ్ మహమ్మారి సమయంలో రెక్కాడితే కానీ డొక్కాడని పేదలకు సెవెన్ రేస్ ఫౌండేషన్ ద్వారా 30 వేల నిత్యావసర సరుకుల కిట్లను పంపిణీ చేశారు. ఎంతో ముఖ్యమైన ఆక్సిజన్ సిలిండర్లు కూడా సప్లై చేశారు. సహాయం కోసం ఎదురు చూస్తున్న ఎందరికో అండగా నిలిచారు. విద్యతోనే పేదరిక నిర్మూలన సాధ్యం.. ప్రస్తుత సమాజంలో ధనిక, పేద అనే భేదాలు లేకుండా ఉండాలంటే అది విద్యతోనే సాధ్యమని నమ్ముతాను. అందుకే మా ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులు, వికలాంగులకు సహాయ సహకారాలు అందించే దాతల సహాయంతో విద్యార్థులను చదివిస్తాం. ఇటీవల బాబా సాహెబ్ అంబేద్కర్ నేషనల్ అవార్డుకు ఎంపిక చేయడం గర్వంగా ఉంది. – డాక్టర్ సారా, సెవెన్ రేస్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు పేదలకు ఉన్నత విద్య లక్ష్యంగా..ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న పేద విద్యార్థులకు మెరుగైన ఉన్నత విద్యను అందించేందుకు సారా నిరంతరం శ్రమిస్తున్నారు. సికింద్రాబాద్, మల్కాజ్గిరి, ఓల్డ్ సఫీల్‌గూడ, మౌలాలి ప్రాంతాల్లోని 6 ప్రభుత్వ పాఠశాలను సెవెన్‌రేస్ ఫౌండేషన్ దత్తత తీసుకుంది. ప్రతి ఏడాదీ ఉచితంగా నోటు పుస్తకాలు, స్టేషనరీ, విద్యారి్థనులకు శానిటరీ కిట్స్ పంపిణీ చేస్తుంటారు. పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులను సెవెన్‌రేస్ సంస్థ సొంతంగా చదివిస్తుంది.
ఆ రేంజ్ ధర పలికే ఇడ్లీలా..?
ఇడ్లీ(Idli) అనగానే చీప్ ధరలో దొరికే బ్రేక్‌ఫాస్ట్‌గా భావిస్తాం. అయితే ఈ సౌత్ ఇండియన్ వంటకం హోటల్ రేంజ్‌ని బట్టి ధరలు కూడా వేరేలెవల్లో ఉంటాయి. అయితే విలాసవంతమైన హోటల్లో దొరికే ఇడ్లీ టేస్ట్ మతిపోయేలా ఉంటుందనుకుంటున్నారా...?. అలా అనుకుంటే పొరపాటే. ఎందుకో ఈ వైరల్ వీడియోని చూస్తే మీకే తెలుస్తుంది. బెంగుళూరు వ్లాగర్(Bengaluru Vlogger) వీధుల్లో ఉండే హోటల్లో(roadside shop) దొరికే రూ. 5ల ఇడ్లీ నుంచి విలాసవంతమైన ప్యాలెస్‌లో దొరికే రూ. 5 వేల రూపాయల వరకు వివిధ ధరలు పలికే ఇడ్లీనే టేస్ట్ చేశాడు. పైగా వాటికి టేస్ట్‌కి రేట్స్ కూడా ఇచ్చాడు. ఆ వీడియోలో ముందుగా వీధులలో అమ్మే రూ. 5ల ఇడ్లీని తినేందుకు సాదాసీదాగా వెళ్లి టేస్టీ చేసి చూశాడు. రుచి అదుర్స్ అంటూ పదికి తొమ్మిదన్నర మార్కులు వేశాడు. ఆ తర్వాత ప్రముఖ రామేశ్వరం కేఫ్(Rameshwaram cafe)లోని రూ. 50ల ఇడ్లీని టేస్ చేయడానికి వెళ్లాడు. అయితే ఈ ఇడ్లీ టేస్ట్‌కి ఏడున్నర మార్కులు వేశాడు. తాజ్ హోటల్(Taj Hotel)లో ఇడ్లీని టేస్ట్ చేయగా అక్కడ దానిని చక్కగా ప్లేట్లో తీసుకురావడం తోపాటు నైఫ్, ఫోర్క్‌లు ఇచ్చారు. వాటితో అక్కడ ఇడ్లీని తినడం ఇబ్బందిగా అనిపించినా.. అలా తినక తప్పలేదు. అయితే అక్కడ టేస్ట్‌కి నాలుగున్నర మార్కులే వేశాడు. ఇక చివరగా ఓ లగ్జరీయస్ ప్యాలెస్‌లో ఇడ్లీ తినడానికి వెళ్లాడు. అక్కడ ఇడ్లీ ఖరీదు ఏకంగా రూ. 5వేల రూపాయలు. 23 క్యారెట్ల బంగారంతో చేసిన ఇడ్లీ ఇది. పాపం అన్ని డబ్బులు వెచ్చించినా..కొద్దిగా మాత్రమే తినగలిగాడు. ఇక నావల్ల కాదంటూ వదిలేశాడు. ఫైనల్‌గా రూ. 5 ఇడ్లీనే చాలా టేస్ట్‌గా ఉందని చెప్పడం విశేషం. అయితే నెటిజన్లు రుచి అనేది రేంజ్ హోటల్ని బట్టికాదు..చేసే విధానం పరిశుభ్రంగా ఉంటే ఆటోమేటిగ్గా రుచి బాగుంటుందని కొందరూ, మరీ రూ. 5 కోట్ల రూపాయల ఇడ్లీని ఎప్పుడూ తింటావ్ అని కామెంట్లు చేస్తూ పోస్ట్‌లు పెట్టారు. View this post on Instagram A post shared by Cassy Pereira (@cassiusclydepereira) (చదవండి: సోనాలి బింద్రే మెరిసే చర్మం రహస్యం..ఆ భారతీయ సంప్రదాయ మొక్క..! )
ముఖం చందమామలా మెరవాలంటే, ఇలాంటి తప్పులు చేయకండి!
మనసు ప్రశాంతంగా ఉంటే.. ముఖం కూడా అందంగా మరిసిపోతూ ఉంటుంది. కానీ పెరుగుతున్నకాలుష్యం, రసాయనాలతో కూడిన ఆహారం తదితర కారణాలతో ముఖం వెలవెలబోతూ ఉంటుంది. అలాంటిపుడే కొన్ని జాగ్రత్తలు, చిట్కాలు పాటించాలి. ఇంట్లోనే, సహజసిద్ధంగా ఫేషియల్ గ్లో(Facial Glow) పొందవచ్చు. సింపుల్ అండ్ పవర్ ఫుల్ చిట్కాలు తెలుసుకుందాం పదండి. సమతుల ఆహారం, వ్యాయామం, తగినన్ని నీళ్లు తాగడం, రోజులో కనీసం 7 గంటల నిద్రతోపాటు ఒత్తిడికి దూరంగా ఉంటూ కొన్ని సింపుల్ ఇంటి చిట్కాలతో ఆశ్చర్యపోయే బ్యూటీని సొంతం చేసుకోవచ్చు.స్ట్రాబెర్రీ , ఎగ్అరకప్పు స్ట్రాబెర్రీ గుజ్జులో కోడిగుడ్డు తెల్లసొన రెండు చెంచాలు, ఒక చెంచాడు నిమ్మరసం, వేసి ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. వారానికి మూడుసార్లు ఇలా చేస్తుంటే జిడ్డు తగ్గి, ముఖం మిలమిలలాడుతుంది. ఇది చర్మాన్ని లోతుగా శుభ్రంగా చేస్తుంది. చర్మం పై పేరుకుపోయిన మృత కణాలను తొలగిస్తుంది.పప్పాయి, కలబందబాగా పండిన తాజా బొప్పాయి ముక్కలు,( Papaya) తాజా కలబంద (Aloevera)లో కొద్ది నిమ్మరసం కలిపి మెత్తగా చేసుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా బియ్యం పిండి, తేనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆపై తడి వేళ్ళతో చర్మాన్ని సున్నితంగా రబ్ చేసుకుంటూ చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.కీరా ఎగ్సగం కీరకాయ, ఒక కోడిగుడ్డు, రెండు టేబుల్ స్పూన్ల పాలమీగడ పావు కప్పు ఆయిల్ (వీట్‌జెర్మ్, ఆలివ్, అవొకాడోలలో ఏదో ఒకటి) తీసుకోవాలి. కీరకాయను శుభ్రంగా కడిగి చెక్కు తీయకుండా ముక్కలు చేయాలి. ఈ ముక్కలను, మిగిలిన అన్నింటితో కలిపి బ్లెండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లయ్ చేసి పది నిమిషాల తర్వాత తుడిచేయాలి. ఇలా ఉదయం, రాత్రి చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో పెట్టి మూడు రోజుల వరకు వాడుకోవచ్చు. (ఐఐఎం గ్రాడ్యుయేట్ : లైఫ్‌లో రిస్క్ తీసుకుంది, నెలకు రూ.4.5 కోట్లు)ముఖం మీద మురికి, ఆయిల్, మలినాలను తొలగించడానికి రోజుకు రెండుసార్లు (ఉదయం, రాత్రి) ముఖాన్ని కడగాలి.సహజ నూనెలను తొలగించకుండా ఉండటానికి మీ చర్మ రకానికి సరిపోయే తేలికపాటి క్లెన్సర్‌ను ఉపయోగించండి.విటమిన్ సీ లభించే పండ్లను బాగా తీసుకోవాలివిటమిన్ సి పిగ్మెంటేషన్, సన్ టాన్ మచ్చలు, వయసు మచ్చలను తగ్గిస్తుంది.కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఈవెన్ టోన్డ్ ఛాయను ప్రోత్సహిస్తుంది. చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలిచర్మ ఆరోగ్య రక్షణలో హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా ముఖ్యం. మెరిసే చర్మానికి ఉత్తమమైన మాయిశ్చరైజర్‌ను ఎంచుకోవాలి.కెమికల్స్ లేని సన్ స్క్రీన్ వాడాలి. అవసరాన్ని బట్టి రోజులు మూడు, నాలుగు సార్లు దీన్ని అప్లయ్ చేయాలి.తాజా పళ్లు కూరగాయలను ఆహారంలో చేర్చుకోవాలి. కొవ్వు, నూనె పదార్థాలకు దూరంగా ఉండాలి. పండ్లు, కూరగాయలు అధికంగా ఉండే ఆహారం తీసుకుంటే, విటమిన్లు యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి. ప్రిజర్వేటివ్స్, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి.అలాగే ఫేస్ ప్యాక్ వేసుకున్నపుడు, లేదా ఎక్స్ఫోలియేట్ చేసేటపుడు చర్మాన్ని గట్టిగా రుద్దకూడదు. సున్నితంగా, మృదువుగా చేయాలి.ప్రోబయోటిక్స్ ఆరోగ్యకరమైన జుట్టుకు ,మెరిసే చర్మానికి కూడా దోహదం చేస్తాయి.ప్రోబయోటిక్ సప్లిమెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.యాంటీఆక్సిడెంట్లు (బెర్రీలు, ఆకుకూరలు ,గింజలు వంటివి),ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు (సాల్మన్ , అవకాడోలు వంటివి) అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.వేడినీటితో ఈ ముప్పుఆవిరిస్నానం, ఎక్కువ వేడి నీటి స్నానానికి దూరంగా ఉండాలి. లేదా సమయాన్ని తగ్గించుకోవాలి. ఎక్కువసేపు వేడి నీటిని ప్రవహించడం వల్ల చర్మంలోని సహజనూనెలు దెబ్బతిని స్తేజంగా కనిపిస్తుంది. ఇదీ చదవండి: లడ్డూలిస్తా వదిలేయండి సార్.. చలాన్‌కు లడ్డూ లంచమా?!
ఐఐఎం గ్రాడ్యుయేట్ : లైఫ్‌లో రిస్క్ తీసుకుంది, నెలకు రూ.4.5 కోట్లు
జీవితంలో అనుకున్నది సాధించాలంటే పట్టుదల, కఠోర శ్రమ కచ్చితంగా ఉండాలి. జీవితంలో రిస్క్ తీసుకోవాలి. రిస్క్ తీసుకుంటేనే సక్సెస్‌లో కిక్ ఉంటుందని నమ్మేవారు చాలామందే ఉంటారు. అలాగే ఎవరి దగ్గరో పనిచేయడం కాకుండా తమంతట తాముగా ఏదైనా చేయాలనే తపనతో ఉన్నత శిఖరాలకు చేరింది. బెంగళూరుకు చెందిన దివ్య. నెలకు వెయ్యి రూపాయల ప్యాకెట్‌మనీ కోసం కష్టపడిన ఈమె ఇపుడు నెలకు నాలుగున్నర కోట్లు ఆర్జిస్తోంది. ఎలా? తెలుసుకోవాలని ఉందా?దివ్య రావు సాధారణ మధ్య తరగతి కుటుండంలో పుట్టి పెరిగింది. కష్టపడి చదువుకుంటేనే భవిష్యత్తు బావుంటుందన్న తల్లిదండ్రుల మాటలను అక్షరాలా నమ్మింది. అచంచలమైన దృఢ సంకల్పంతో 21 సంవత్సరాల వయస్సులోనే సీఏ చదివింది. తరువాత IIM అహ్మదాబాద్‌లో ఫైనాన్స్‌లో MBA చేసింది. ఈ సమయంలో ఆర్థికంగా చాలా కష్టపడ్డానని చెప్పుకొచ్చింది. ఒక ఎగ్ పఫ్ తినడానికి కూడా ఎంతో ఆలోచించాల్సి వచ్చేది. కష్టపడి చదివి కుటుంబంలోనే సీఏ చదవిన యువతిగా పేరు తెచ్చుకుంది. అయితే నల్లేరుమీద నడకలా ఏమీ సాగలేదు. ఆర్థికంగా పలు సవాళ్లు ఎదుర్కొంది. అయినా ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగింది.వ్యాపారవేత్తగా ఎలా మారింది?ఐఐఎంలో చదువుకునే సమయంలోనే కొన్ని ప్రముఖ ఆహార సంస్థలు, వాటి సక్సెస్‌పై అధ్యయనం చేసింది దివ్యా. ఆ సమయంలోనే ఫుడ్ బిజినెస్ ఆలోచనకు బీజం పడింది. ముఖ్యంగా దక్షిణాది రుచుల్ని విశ్వవ్యాప్తం చేయాలన్న ఆసక్తి పెరిగింది. ఫుడ్ బిజినెస్ అంటే దివ్య తల్లి అస్సలు ఇష్టపడలేదు. 10-20 రూపాయలకు రోడ్లపై ఇడ్లీ, దోసెలు అమ్మాలనుకుంటున్నావా?" అని తల్లి ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో సీఏగా ఉద్యోగం మొదలు పెట్టింది. కానీ మనసంతా వ్యాపారం పైనే ఉండేది. (ముఖం చందమామలా మెరవాలంటే, ఇలాంటి తప్పులు చేయకండి!)ఆహార పరిశ్రమలో 15 ఏళ్లకుపైగా అనుభవం ఉన్న రాఘవేంద్రరావును కలిసే వరకు ఆమె ఆలోచనలకు ఒక రూపం రాలేదు. సీఏగా అతడికి పరిచయమైంది. అలా రాఘవ్‌కు ఫుడ్ బిజినెస్‌లో, ఆర్థికాంశాల్లో దివ్య అతనికి సలహాలిచ్చేది. దీంతో బిజినెస్ పార్ట్‌నర్స్‌గా మారారు. ఆ తరువాత అభిరుచులుకలవడంతో పెళ్లితో ఒక్కటయ్యారు. భర్త రాఘవేంద్రతో కలిసి 2021లో ‘రామేశ్వరం కెఫే’ ప్రారంభించింది. ఆహారం నాణ్యత పరంగా, టేస్ట్ పరంగా ప్రత్యేకంగా ఉండాలని ప్లాన్ చేసింది.తొలుత బెంగళూరులో రెండు బ్రాంచీలతో మొదలై ఇపుడు కోట్ల రూపాయల ఆదాయాన్నిచ్చే స్థాయికి చేరింది. రాబోయే ఐదేళ్లలో దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం, విదేశాలలో కూడా ప్లాన్ చేస్తున్నారు ఈ దంపతులు. దుబాయ్, హైదరాబాద్ , చెన్నైలలో బ్రాంచెస్ తెరవనుంది. దాదాపు 700 మందికి ఉపాధి కల్పిస్తోంది. నివేదికల ప్రకారం ప్రతి స్టోర్ నుండి నెలకు రూ. 4.5 కోట్లు అమ్మకాలు సంపాదిస్తున్నారు. సంవత్సరానికి రూ. 50 కోట్లు సంపాదిస్తున్నారు. View this post on Instagram A post shared by Rupa (@ruparavi21578)రామేశ్వరం కెఫేకర్ణాటకలోని బెంగళూరు నగరంలో రామేశ్వరం కెఫే చాలా పాపులర్. అక్కడికి వెళ్లినవారు ఈ కేఫేకు వెళ్లకుండా రారు. అంత ఫేమస్. దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకొంది. ఈ కేఫును ఈ స్థాయికి తీసుకు రావడంలో భర్తతో కలిసి దివ్య అహర్నిశలు కష్టపడింది. ఇంత చదువూ చదివి, ఇడ్లీలు, దోసెలు అమ్ముతావా? అని గేలిచేసినా వెనుకడుగు వేయలేదు. తనకిష్టమైన ఫుడ్ బిజినెస్‌లోకి అడుగుపెట్టి తానేమిటో నిరూపించుకుంది.కెఫే వేదికగా ఇడ్లీ, దోసె, వడ, పొంగల్, బాత్, రోటీ, పరోటాతోపాటు, రైస్ వెరైటీలనూ ఆహార ప్రియులు ఆరగిస్తారు. అలాగే టీ, కాఫీలను స్పెషల్‌గా అందిస్తూ మరింతమందిని ఆకట్టుకుంటోంది. ప్రతీ వంటలోనూ ఆరోగ్య, నాణ్యతా ప్రమాణాల్ని తప్పకుండా పాటిస్తున్నామని ,సహజ పద్ధతుల్లో తయారుచేసిన నెయ్యి, ఇతర పదార్థాలను వాడతామని చెబుతుంది. తమ వంట తిన్న వారు తృప్తిగా.. ఆహా, ఏమిరుచి అన్నపుడు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది అంటుంది సంతోషంగా దివ్య. తన వ్యాపారాన్ని విదేశాలకు సైతం విస్తరించాలని లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తోంది.
ఫొటోలు
National View all
నేడే హల్వా వేడుక.. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్
కేంద్ర బడ్జెట్ 2025-26(Budget 2025-26) తయారీ ప్రక్రియలో చివరి దశకు చేరుకున్న ఆర్థిక మంత్రిత్వ శాఖ(Finance Ministry) నేడు
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పేలుడు.. ఏడుగురు దుర్మరణం
ముంబై : మహారాష్ట్రలో ప్రమాదం సంభవించింది.
భర్త వివాహేతర సంబంధం..
తిరువొత్తియూరు: చూళగిరి సమీపంలో భర్త వివాహేతర సంబంధం కారణంగా భార్య, ఆమె కుమారుడు మంగళవారం రా
అమెరికాలో అడుగు పెట్టాలంటే ఇది తప్పని సరి.. నిబంధనలు మార్చిన ట్రంప్
వాషింగ్టన్ : విదేశీయుల ప్రవేశానికి అమెరికా (usa) కొత్త నిబం
AI జనరేటెడ్ ఫొటో కాదు.. ప్రభుత్వ అధికారి ఇంట్లో దొరికిన నోట్ల కట్టలు
పాట్నా : ఈ నోట్ల కట్టల్ని చూసి ఏఐ జనరేటెడ్ ఫొటో అనుకునేరు.
International View all
International Day of Education 2025 దీని ప్రాముఖ్యత, ఏడాది థీమ్ ఇదే!
International Day of Education 2025 : ప్రతీ ఏడాది &nb
పుట్టుకతో వచ్చే పౌరసత్వం: భారత్ సహా ఏ దేశాల్లో ఎలా ఉందంటే..
విదేశీయులకు పిల్లలు పుడితే..
అమెరికాలో అడుగు పెట్టాలంటే ఇది తప్పని సరి.. నిబంధనలు మార్చిన ట్రంప్
వాషింగ్టన్ : విదేశీయుల ప్రవేశానికి అమెరికా (usa) కొత్త నిబం
USA: టీటీఏ అధ్యక్షుడిగా నవీన్ రెడ్డి మల్లిపెద్ది
వాషింగ్టన్: మన తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) అ
ట్రంప్‌కు ఝలక్.. పౌరసత్వం ఉత్తర్వుకు కోర్టులో చుక్కెదురు
సియాటెల్: అగ్రరాజ్యం అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రం
NRI View all
USA: టీటీఏ అధ్యక్షుడిగా నవీన్ రెడ్డి మల్లిపెద్ది
వాషింగ్టన్: మన తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) అ
కాన్సస్‌లో దిగ్విజయంగా నాట్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్
అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్..
ట్రంప్ దెబ్బకు డెలి‘వర్రీ’
ముందే వచ్చిన పురిటినొప్పులు.. నెలలు నిండకుండానే అగ్రరాజ్యంలో కాన్పులు.. ఆస్పత్రులకు పరుగులు..
న్యూజెర్సీలో ఘనంగా బాలల సంబరాలు..
అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా న్యూజెర్సీలో బాలల సంబరాల
ట్రంప్ దూకుడు.. ఇక స్వేచ్ఛ స్టాచ్యూ అయిపోనుందా..!
అమెరికా అన్నిట్లో ముందుంటుంది! అభివృద్ధికి ప్రామాణికమని చెప్పుకుంటారు!
క్రైమ్
Afzalgunj Incident: కోలుకున్న ‘బీదర్ క్షతగాత్రుడు’
సాక్షి, సిటీబ్యూరో: కర్ణాటకలోని బీదర్‌లో ‘అఫ్జల్‌గంజ్ దుండగులు’ జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన శివకుమార్ నగరంలోని ఓ ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. ఇది తనకు పునర్జన్మ అంటూ చేసిన వీడియోను ఆయన సమీప బంధువు గురువారం విడుదల చేశారు. బీదర్‌లోని శివాజీ సర్కిల్ వద్ద గత గురువారం (ఈ నెల 16) ఉదయం భారీ దోపిడీ చోటు చేసుకుంది. బైక్‌పై వచి్చన ఇద్దరు దుండగులు ఎస్బీఐ ఏటీఎం కేంద్రాల్లో నగదు నింపే సీఎంఎస్ సంస్థకు చెందిన వాహనంపై విరుచుకుపడ్డారు. ఈ వాహనంలో సెక్యూరిటీ గార్డు, గన్‌మెన్ లేకపోవడం వీరికి కలిసి వచ్చింది. కస్టోడియన్లుగా ఉన్న శివకుమార్, గిరి వెంకటే‹Ùలపై తుపాకీతో కాల్పులు జరిపి రూ.83 లక్షలతో ఉన్న అల్యూమినియం బాక్సు ఎత్తుకెళ్లారు. నాలుగు తూటాలు దిగిన వెంకటేష్ అక్కడిక్కడే చనిపోగా... ఛాతిలోకి ఓ తూటా దూసుకుపోయిన శివకుమార్ తీవ్రంగా గాయపడ్డారు. అదే రోజు రాత్రి వారు అఫ్జల్‌గంజ్‌లోని రోషన్ ట్రావెల్స్ నుంచి రాయ్‌పూర్ వెళ్లే ప్రయత్నం చేశారు. ఇక్కడ చోటు చేసుకున్న పరిణామాలతో రోషన్ ట్రావెల్స్ మేనేజర్ జహంగీర్ పైనా కాల్పులు జరిపిన ఇరువురూ పారిపోయారు. బీదర్ పోలీసులు తొలుత శివకుమార్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో వారి సూచన మేరకు మెరుగైన వైద్య సేవల నిమిత్తం సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కోలుకున్న శివకుమార్ నాటి ఉదంతానికి సంబంధించిన వివరాలు చెబుతుండగా చిత్రీకరించిన ఓ వీడియోను ఆయన సమీప బంధువు శివయోగి కన్నడ మీడియాకు విడుదల చేశారు. అందులో శివకుమార్ చెప్పిన వివరాలివీ... ‘ఆ రోజు నగదు తీసుకుని సీఎంఎస్‌కు చెందిన చెస్ట్ నుంచి బయటకు వచ్చాం. ఇద్దరు దుండగులు నేరుగా మాపై దాడికి దిగారు. కస్టోడియన్‌గా ఉన్న నాతో పాటు నా సహచరుడి పైనా కాల్పులకు పాల్పడ్డారు. నేను తొలుత తప్పించుకున్నా.... వెంకటేష్‌పై కాల్పులు జరుపుతుండటంతో తుపాకీ చేతిలో ఉన్న వ్యక్తిని చూసి అరుస్తూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేశా. దీంతో అతడు నా వైపు గురిపెట్టి కాలి్చన తూటా నా ఛాతిలోకి దూసుకుపోయింది. ఇది నాకు పునర్జన్మ లాంటిది’ అని పేర్కొన్నారు.మళ్లీ తెరపైకి మనీష్ పేరు..అఫ్జల్‌గంజ్ ఫైరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా సిటీ పోలీసులు బీదర్‌తో పాటు నగరంలోని కొన్ని సీసీ కెమెరాల్లో లభించిన దుండగుల ఫొటోలను సేకరించారు. వీటిని కర్ణాటక అధికారులతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల పోలీసులకు పంపారు. వీటిలో ఉన్న ఓ దుండగుడు తమ రాష్ట్రానికి చెందిన మోస్ట్ వాంటెడ్ మనీష్ కుషా్వహా మాదిరిగా ఉన్నాడు అంటూ బీహార్ అధికారులు సమాచారం ఇచ్చారు. దీంతో ఇతడే సూత్రధారిగా రెండు నేరాలు జరిగినట్లు భావించారు. అతడి కోసం ముమ్మరంగా గాలించడం మొదలెట్టారు. అయితే గత శుక్రవారం రాత్రి బీహార్ పోలీసులు ఆ ఫొటోలను అక్కడి నిరంజన గ్రామంలో ఉండే మనీష్ తల్లిదండ్రులకు చూపించారు. వారు వాటిని చూసి తమ కుమారుడు కాదని చెప్పడంతో ఆ విషయాన్ని నగర పోలీసులకు చెప్పారు. దీంతో అతడు సూత్రధారి కాదనే ఉద్దేశంతో పోలీసులు మరికొన్ని కోణాల్లో ముందుకు వెళ్తున్నారు. అయితే తాజాగా మహేష్ తల్లిదండ్రులు తమ కుమారుడిని రక్షించడానికి తప్పుదోవ పట్టించి ఉంటారనే అనుమానం పోలీసులకు వచ్చింది. దీనికితోడు మహేష్ ఆచూకీ సైతం లేకపోవడంతో అతడి పాత్రను పరిగణలోకి తీసుకుంటున్నారు. దీంతో మహేష్ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు ముమ్మరం చేశారు.
దెయ్యం పట్టింది.. వదిలిస్తా..
యాదాద్రి భువనగిరి జిల్లా: అనారోగ్యా నికి గురైన చిన్నారికి.. దెయ్యం పట్టింది.. వదిలిస్తా.. అంటూ ఒక భూతవైద్యు డు చేసిన పూజలతో.. ఆమె అపస్మారక స్థితికి వెళ్లింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం మటంలంక గ్రామంలో గురువారం ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలివి. గ్రామానికి చెందిన ఒక చిన్నారి అనారోగ్యంగా ఉండడంతో.. ఆమె తల్లిదండ్రులు మూడు రోజుల క్రితం ఇల్లెందు ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. కాగా, వారికి తారసపడిన ఒక భూత వైద్యుడు ఆస్పత్రికి అవసరం లేదని, తాను నయం చేస్తానని నమ్మించాడు. ఓ మేకను బలిచ్చి, భూతాలను కట్టడి చేస్తానని పూజలు చేశాడు. రెండు రోజులు గడుస్తున్నా పాప ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో కుటుంబసభ్యులు భూత వైద్యుడిని నిలదీశారు. అతను చేతులెత్తేయడంతో వెంటనే ఖమ్మంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్య ఖర్చులు భరించలేక.. అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లారు. ప్రస్తుతం పాప ఆరోగ్యం నిలకడగానే ఉందని, భూత వైద్యుడి మాటలు నమ్మి సకాలంలో చికిత్స అందక అపస్మారక స్థితికి చేరిందని వైద్యులు స్పష్టం చేశారు. కాగా, ఈ ఘటనపై ఎస్ఐ రాజమౌళి స్పందిస్తూ భూత వైద్యం పేరుతో ఎవరైనా వస్తే తమకు సమాచారం అందించాలని కోరారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పోటీ పరీక్ష రాసేందుకు వెళుతూ..
మర్రిపాలెం: రాజమహేంద్రవరం శివారు గామన్ వంతెనపై బుధవారం అర్ధరాత్రి కావేరి ట్రావెల్స్‌కు చెందిన బస్సు బోల్తాపడిన ఘటనలో నగరంలోని 53వ వార్డు మర్రిపాలెం పార్వతీనగర్‌కు చెందిన హోమిని కల్యాణి (21) మృతి చెందింది. దువ్వాడలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్న కల్యాణి కాంపిటేటివ్ పరీక్ష రాయడానికి హైదరాబాద్ బయలుదేరింది. బుధవారం రాత్రి ఎన్ఏడీ కొత్తరోడ్డులో బస్సు ఎక్కగా..అర్ధరాత్రి రాజమండ్రి గామన్ వంతెన వద్ద బస్సు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ప్రమాదంలో కల్యాణి అక్కడికక్కడే మృతి చెందగా, మరో పది మందికి తీవ్రగాయాలయ్యాయి. మృతురాలు శరీరం నుజ్జునుజ్జవ్వడం అందర్నీ కలచి వేసింది. గురువారం సాయంత్రం కల్యాణి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అందివచ్చిన కుమార్తె ఇలా విగతజీవిగా ఉండడాన్ని తల్లిదండ్రులు, బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. కల్యాణి తండ్రి రాఘవదాస్ రైల్వే ఉద్యోగి కాగా.. తల్లి లక్ష్మి(లత) గృహిణి. వీరికి ఇద్దరు కుమార్తెలు, కాగా పెద్ద కుమార్తె మేఘన ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉన్నత చదువులకు సిద్ధమవుతోంది. కల్యాణి ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతూ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది. ఈ క్రమంలో కాంపిటేటివ్ పరీక్ష రాసేందుకు వెళుతూ మృతిచెందడంతో పార్వతినగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.
‘నారాయణ’ ఫీ‘జులుం’కి విద్యార్థి బలి..
అనంతపురం ఎడ్యుకేషన్/సాక్షి, అమరావతి: నారాయణ కళాశాలల ధన దాహానికి మరో విద్యార్థి బలయ్యాడు. ఫీజులు చెల్లించకపోతే కళాశాలలోకి అనుమతించకుండా గంటల తరబడి బయటే నిలబెట్టడంతో అవమానంగా భావించిన ఆ విద్యార్థి ఆ తర్వాత కళాశాలలోని మూడో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ ఘటన గురువారం అనంతపురంలో చోటుచేసుకుంది. శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందిన చరణ్ అనంతపురం నగర శివారు సోములదొడ్డి సమీపంలోని నారాయణ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. సంక్రాంతి సెలవుల అనంతరం గురువారం చరణ్‌ను తన సోదరుడు కళాశాలలో విడిచిపెట్టాడు. ఈ సమయంలో ఫీజు బకాయి మొత్తం చెల్లించాలని యాజమాన్యం ఒత్తిడి చేసినట్లు కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు. చరణ్ సోదరుడు సర్దిచెప్పి వెళ్లాడు. తర్వాత ఏం జరిగిందో ఏమో.. మూడో అంతస్తులోని తరగతి గదిలో ఉన్న చరణ్ అధ్యాపకుడి ముందునుంచే ఒక్కసారిగా బయటకొచ్చి కిందకు దూకేశాడు. తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. అప్రమత్తమైన కళాశాల యాజమాన్యం చరణ్ మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించింది. రక్తమోడిన ప్రాంతమంతా ఎవరూ రాకుండానే హడావుడిగా శుభ్రం చేసేశారు. కాలేజీ యాజమాన్యం తీరును నిరసిస్తూ వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపా«ద్యక్షుడు నరేంద్రరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన్, నగర అధ్యక్షుడు కైలాష్‌తో పాటు ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యూఐ తదితర విద్యార్థి సంఘాల నేతలు కాలేజీ వద్ద ఆందోళన చేశారు. అలాగే, ఈ ఘటనపై విచారణ చేయాలని ఆంధ్రప్రదేశ్ పేరెంట్స్ అసోసియేషన్ కూడా డిమాండ్ చేసింది.