kadapa steel plant
-
రూ.650 కోట్లతో కడప స్టీల్‌కు మౌలిక వసతులు
సాక్షి, అమరావతి: రాయలసీమ రూపు రేఖలను మార్చే కడప స్టీల్ ప్లాంట్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూ.650 కోట్లతో కీలక మౌలిక వసతులు కల్పిస్తోంది. వైఎస్సార్ జిల్లా సున్నపురాళ్లపల్లి వద్ద రూ.8,800 కోట్లతో జేఎస్‌డబ్ల్యూ ఏర్పాటు చేయనున్న ఈ స్టీల్ ప్లాంట్‌లో వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించేలోగా.. రహదారులు, రైల్వే, విద్యుత్, నీటి సరఫరా తదితర కీలక మౌలిక వసతులను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. ప్లాంట్‌ను ఎన్‌హెచ్67కు అనుసంధానిస్తూ సుమారు రూ.90 కోట్లతో నాలుగు లేన్ల రహదారిని ఏర్పాటు చేస్తోంది. తొలి దశలో రెండు లేన్ల రహదారిగా నిర్మించి రెండో దశ నాటికి నాలుగు లేన్ల రహదారిగా అభివృద్ధి చేయనుంది. ఇప్పటికే రెండు లేన్ల రహదారి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి దీన్ని అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే ఎర్రగుంట్ల–నంద్యాల ప్రధాన రైల్వే లైన్‌కు ప్లాంట్‌ను అనుసంధానిస్తూ రూ.324 కోట్ల వ్యయంతో రైల్వే లైన్ నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన నివేదికను ఇప్పటికే రైల్వే శాఖకు అందించగా.. ఆ శాఖకు చెందిన అధికారులు వచ్చి సర్వే పూర్తి చేశారు. ఈ రైల్వే లైన్ నిర్మాణానికి ఈ నెలలో సూత్రప్రాయ ఆమోదం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. అలాగే ప్లాంట్‌కు విద్యుత్ సరఫరా కోసం రూ.64.56 కోట్లతో 400 కేవీ/200 కేవీ సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. ప్లాంట్‌కు అవసరమైన రెండు టీఎంసీల నీటిని ఆర్టీపీపీ నుంచి పైప్‌లైన్ ద్వారా తీసుకెళ్లడానికి రూ.127 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. అనుమతి రాగానే నిర్మాణ పనులు ప్రారంభం జేఎస్‌డబ్ల్యూ ప్లాంట్ నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్ ఫిబ్రవరి 15న శంకుస్థాపన చేశారు. ప్లాంట్ నిర్మాణ పనులను ప్రారంభించడానికి అవసరమైన కేంద్ర పర్యావరణ అనుమతులు కోసం జేఎస్‌డబ్ల్యూ ఎదురుచూస్తోంది. గతంలో వైఎస్సార్ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరు మీద జారీ చేసిన ఉత్తర్వులను.. ఈ ప్లాంట్ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కంపెనీ జేఎస్డబ్ల్యూఏపీఎస్ఎల్ పేరు మీదకు మార్చాలంటూ కేంద్ర పర్యావరణ శాఖకు లేఖ రాశామని అధికారులు చెప్పారు. ఆ పని పూర్తవ్వగానే నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. అలాగే గ్రీన్ హైడ్రోజన్ ఆధారంగా 2.5 మిలియన్ టన్నుల కెపాసిటీతో డైరెక్ట్ రెడ్యూస్డ్ ఐరన్ ప్లాంట్, ఏడాదికి 4 మిలియన్ టన్నుల కెపాసిటీతో పెల్లెట్ ప్లాంట్, 1,000 మెగావాట్ల ఎలక్ట్రోలైజర్ ప్లాంట్ ఫర్ డీఆర్ఐ ప్లాంట్, 3,000 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి యూనిట్ల ఏర్పాటుకు జేఎస్‌డబ్ల్యూ ఆసక్తి వ్యక్తం చేసింది. వీటికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలు రాగానే వీటిపై కూడా తగు నిర్ణయం తీసుకుంటామని పరిశ్రమల శాఖ అధికారులు వెల్లడించారు. -
నాడు చంద్రజాలం.. నేడు కార్యరూపం
సాక్షి ప్రతినిధి, కడప: అధికారంలో ఉన్నన్నాళ్లు మాటల మాయాజాలంతో పబ్బం గడపడం. అధికారం కోల్పోతే ప్రజల చెంతకు వెళ్లి బీరాలు పలకడం. ఇదీ టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవహార శైలి. ఇప్పుడు అదేబాటలో ఆయన తనయుడు నారా లోకేష్ పయనిస్తున్నారు. ఆచరణలో చిత్తశుద్ధి లోపించి ప్రజలు ఛీత్కరించినా.. మరోమారు మేమైతే అంటూ బీరాలు పలుకుతూ గ్రామాల్లో తిరుగుతున్నారు. బుధవారం జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గంలో నారా లోకేష్ పాదయాత్ర ప్రవేశించనుంది. ఆ నియోజకవర్గంలో ప్రధానంగా స్టీల్ ప్లాంట్ నిర్మాణం టీడీపీ వైఖరికి నిదర్శంగా నిలుస్తోంది. రాష్ట్ర విభజన చట్టంలో కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్ చిత్తశుద్ధి ప్రదర్శించి ఉక్కు పరిశ్రమ కోసం తపించింటే చరిత్ర మాటగట్టుకునేది. ఎన్నికలు సమీపించే కొద్దీ హడావుడి కార్యక్రమాలు చేపట్టడం, అధికారంలో ఉంటే మాటల గారడీతో ఊదరగొట్టడం ఇదే చంద్రబాబుకు తెలిసిన విద్యగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అచ్చం అదేవిధంగా ఉక్కు పరిశ్రమ పట్ల టీడీపీ సర్కార్ వైఖరి ప్రస్ఫుటమైంది. కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్య పార్టీగా టీడీపీ ఉంటూ విభజన చట్టానికి తూట్లు పొడిచింది. వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని చట్టంలో పొందుపర్చినా అమలు చేయడంలో అత్యంత నిర్లక్ష్యం ప్రదర్శించిందని పలువురు ఎత్తిచూపుతున్నారు. ఎన్నికలకు ముందు శంకుస్థాపనతో సరి.... 2019 ఏప్రెల్ 11న జనరల్ ఎలెక్షన్స్ రాష్ట్రంలో నెలకొన్నాయి. 2018 డిసెంబర్ 27న కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం మైలవరం మండలం కంబాలదిన్నె గ్రామం వద్ద సీఎం హోదాలో చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. అంటే ఎన్నికలకు 3 నెలలు ముందుగా శంకుస్థాపన చేపట్టారు. ఐదేళ్ల కాలం కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నా ఉక్కు పరిశ్రమ పట్ల చిత్తశుద్ధి చూపెట్టలేదు. కాగా ఎన్నికల గడువు సమీపించే కొద్ది ఆ పరిశ్రమ ఆవశ్యకత టీడీపీకి గుర్తుకు వచ్చింది. టీడీపీ అనుకూలురు అదే రాజకీయం అంటే అని చెప్పుకొస్తుంటే, యదార్థవాదులు పచ్చి అవకాశవాద రాజకీయంగా చెప్పుకొస్తున్నారు. చిత్తశుద్ధితో వ్యవహరించిన వైఎస్ జగన్ ప్రభుత్వం వెనుకబడిన రాయలసీమలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పడం ద్వారా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని వైఎస్సార్సీపీ ప్రభుత్వం నమ్మింది. అధికారంలోకి వచ్చిన 6 నెలలకు 2019, డిసెంబర్ 23న ఉక్కు పరిశ్రమ నిర్మాణం కోసం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారు. ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ పేరిట నిర్వహణకు సన్నాహాలు చేపట్టారు. రెండు నెలలు తిరక్కమునుపే 2020 ఫిబ్రవరి నుంచి కరోనా వైరస్ యావత్తు ప్రపంచాన్ని గడగడలాడించింది. మానవజీవనం అస్తవ్యస్థ్యంగా మారింది. బతుకు జీవుడా అంటూ తలదాచుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. రెండేళ్లు పాటు ఇలాంటి పరిస్థితి కొనసాగుతూ రావడంతో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ప్రతిబంధకంగా మారిందని పరిశీలకులు వివరిస్తున్నారు. జెఎస్డబ్ల్యు స్టీల్స్ లిమిటెడ్‌తో నిర్మాణం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జెఎస్డబ్ల్యు స్టీల్స్ లిమిటెడ్ ద్వారా స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి 2023 ఫిబ్రవరి 15న భూమి పూజ చేశారు. ఎకరం రూ.1.65 లక్షలతో 3,148.68 ఎకరాలు కేటాయిస్తూ 2022 డిసెంబర్ 16 ఉత్తర్వులు జారీ చేశారు. తొలివిడతలో ఏడాదికి 1 మిలియన్ టన్నులు ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మాణం తలపెట్టారు. ఫేజ్–1లో రూ.3,300 కోట్లుతో వైర్ రాడ్స్ , బార్మిల్స్ ఉత్పత్తి చేసేందుకు పనులు చేపట్టారు. ఫేజ్–2లో మరో రూ.5,500 కోట్లుతో మార్చి 31, 2029 నాటికి పూర్తి చేసేందుకు 3 మిలియన్ టన్నులు ఉత్పత్తి సామర్థ్యంతో ప్రణాళికలు రూపొందించారు. ఆమేరకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.750 కోట్లుతో మౌళిక వసతులు, కనెక్టివిటీ, నీటి పైపులైన్, నిల్వ చేసుకునే సంప్, విద్యుత్, రైల్వేలైన్ వసతి సైతం ఏర్పాటు చేసి ఆచరణలో చిత్తశుద్ధి ప్రదర్శించింది. క్షేత్రస్థాయిలో నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. రెండేళ్లకు ఉత్పత్తి చేపట్టాలనే లక్ష్యంతో నిర్మాణ పనులు వేగవంతంగా నడుస్తుండడం విశేషం. నాడు నాటకీయ పరిణామం కేంద్ర ప్రభుత్వంలో అధికారాన్ని పంచుకుంటూనే రాష్ట్రంలో టీడీపీ స్టీల్ ప్లాంట్ కోసం నాటకీయ పరిణామాలకు తెరలేపింది. 2018 జూన్ 25న కడప జడ్పీ ప్రాంగణం వేదికగా అప్పటి టీడీపీ రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్‌నాయుడు, అప్పటి ఎమ్మెల్సీ బీటెక్ రవిలచే నిరశన దీక్ష చేయించారు. ఆ దీక్ష ఫోకస్ కోసం చంద్రబాబు సర్కార్ తాపత్రయం పడింది. అప్పటి సిఎంఓ అదేశాల మేరకు కలెక్టరేట్‌కు డైరెక్షన్ చేస్తూ సక్సెస్ కోసం జిల్లా కేంద్రంలోని కళాశాల ల విద్యార్థులను దీక్ష ప్రాంగణానికి వంతులవారిగా తరలించేవారు. వారం రోజులు నాటకీయ దీక్ష చేపట్టిన తర్వాత విరమింపజేశారు. వెంటనే చంద్రబాబు సర్కార్ ఆచరణలోకి వెళ్లిందా అంటే, అదీ లేదని పరిశీలకులు అంటున్నారు. శిలాఫలకంతో సరిపెట్టారు టీడీపీ ప్రభుత్వం ఉండగా చంద్రబాబు అనేక పర్యాయాలు ఉక్కు పరిశ్రమ కోసం ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. తుదకు ఎన్నికలకు ముందు శిలాఫలకంతో సరిపెట్టారు. సీఎం వైఎస్ జగన్‌కు చిత్తశుద్ధి ఉండడంతోనే పరిశ్రమ భూమిపూజ నాటికే మౌళిక వసతులు కల్పించారు. – వి హృషికేశవరెడ్డి, జమ్మలమడుగు లోకేష్‌కు పర్యటించే అర్హత లేదు... జమ్మలమడుగు నియోజకవర్గంలో నారా లోకేష్‌కు పాదయాత్ర చేసే అర్హతే లేదు. విభజన చట్టంలో పొందుపర్చిన ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు టీడీపీ అధికారంలో ఉన్నన్నాళ్లు కనీస చొరవ చూపలేదు. ప్రజల్ని మభ్యపెట్టి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ఉద్దేశ్యంతోనే పాదయాత్ర చేస్తున్నారు. – ఎం హనుమంతురెడ్డి, జమ్మలమడుగు -
స్టీల్ ప్లాంట్ భూమిపూజపై సీఎం జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: కడప స్టీల్ ప్లాంట్ భూమిపూజపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సజ్జన్ జిందాల్ తో కలిసి స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పాల్గొనడం ఆనందంగా ఉందని.. జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ టీమ్‌కి నా శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారాయన. It was a pleasure participating in the Bhoomi Puja of #KadapaSteelPlant today with @SajjanJindal garu. My best wishes to the entire team at @TheJSWGroup. pic.twitter.com/2ywGUZLSqC — YS Jagan Mohan Reddy (@ysjagan) February 15, 2023 -
సీఎం జగన్ విజయమిది..
ఒకప్పుడు విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఆ తర్వాత కానీ.. విశాఖలో ఉక్కు ప్యాక్టరీ ఏర్పాటు కాలేదు. ఇప్పుడు ఎలాంటి నిరసనలు అవసరం లేకుండానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సారధ్యంలో వైఎస్సార్ జిల్లా జమ్మల మడుగు నియోజకవర్గం సున్నపురాళ్ల పల్లె వద్ద ఉక్కు కర్మాగారానికి బీజం పడింది. ఇది నిజంగా రాయలసీమ ప్రాంత వాసులే కాకుండా మొత్తం విభజిత ఏపీ ప్రజలంతా సంతోషించాల్సిన సమయం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న చొరవను ప్రముఖ పారిశ్రామికవేత్త జిందాల్ గొప్పగా ప్రశంసించారు. ఆంధ్రలో జరుగుతున్న వివిధ కార్యక్రమాలను కూడా ఆయన మెచ్చుకున్నారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డితో తనకు ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. 8,800 కోట్ల వ్యయంతో ఈ స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నామని, భవిష్యత్తులో ఇది ప్రపంచంలోనే అత్యుత్తమ స్టీల్ ప్లాంట్‌గా రూపొందించడానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని ఆయన ప్రకటించారు. ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చడానికి ప్రభుత్వం కూడా 700 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తోందని తెలిపారు. ఒకవైపు కొప్పర్తి ఎలక్ట్రానిక్ పారిశ్రామికవాడ, మరో వైపు స్టీల్ ప్లాంట్ సిద్దమైతే ఈ జిల్లా ముఖ చిత్రం మారిపోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మామూలుగా అయితే ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చుతుందా? లేదా? అన్న సందేహం ఉండేది. ఈసారి స్టీల్ ప్లాంట్లను నిర్వహిస్తున్న జిందాలే దీనిని టేకప్ చేయడం , భూమి పూజ పూర్తి చేయడం, తన ప్రణాళికను వెల్లడించడంతో నమ్మకం పెరుగుతుంది. ఆయన ఇప్పటికే కర్నాటక, మహారాష్ట్రల్లో భారీ స్టీల్ కర్మాగారాలను నడుపుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన వ్యక్తి. ఈ రంగంలో ఆయనో దిగ్గజం. అందువల్ల ఈ ప్లాంట్ వచ్చే రెండు, మూడేళ్లలో ఒక రూపానికి వస్తుందన్న విశ్వాసం వ్యక్తమవుతోంది. ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లుతున్న తీరు మరి కొద్దినెలల్లోనే క్షేత్ర స్థాయిలో అర్ధం అవుతుంది కూడా.. నిజమే! పదిహేనేళ్ల క్రితమే ఈ ఉక్కు ఫ్యాక్టరీ ఊపిరి పోసుకుని ఉండవలసింది. వివిధ కారణాల వల్ల అది సాధ్యపడలేదు. ఇదే ప్రాంతంలో కర్నాటకకు చెందిన మాజీ మంత్రి గాలి జనార్ధనరెడ్డి ఉక్కు ప్యాక్టరీ పెట్టడానికి ముందుకు వచ్చారు. అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఆయన ఇందుకోసం సుమారు రెండువేల ఎకరాల భూమి సేకరణ చేశారు. నిర్వాహకుల లోపాలతో పాటు తెలుగుదేశానికి చెందిన వారు, ఆ పార్టీకి సంబంధించిన మీడియా వారు పలు అడ్డంకులు సృష్టించారు. బల్లులు కూడా గుడ్లు పెట్టని స్థలాన్ని ఇందుకోసం ఎంపిక చేస్తే టీడీపీ మీడియా ఆనాడు ఏమని వార్తా కథనాలు రాసిందో తెలుసా!. అక్కడ సెలయేర్లు, జలపాతాలు ఉన్నాయని, జింకలు, లేళ్లు చెంగు చెంగున గంతులు వేస్తుంటాయని, పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతుందని అబద్దపు కథనాలు ఇచ్చారు. అయినా ప్రాజెక్టు ముందుకు వెళ్లి ఉండేదేమో. కానీ.. దురదృష్టవశాత్తు వైఎస్ రాజశేఖరరెడ్డి అనూహ్యంగా హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించడంతో అది వెనుకపడిపోయింది. ఇక్కడ మరో సంగతి కూడా ప్రస్తావించాలి. వైఎస్సార్ మరణం తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలలో ఆయన కుమారుడు సీఎం వైఎస్ జగన్ కాంగ్రెస్‌ను వీడి సొంత పార్టీ పెట్టుకోవడం, దాంతో కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం జగన్‌పై సీబీఐ కేసులు పెట్టి జైలుపాలు చేయడం వంటివి కూడా ఏపీకి తీరని నష్టం చేశాయి. అప్పట్లో సోనియాగాంధీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, వారి చేతిలో పనిముట్టుగా మారిన సీబీఐ అధికారి ఒకరు కలిసి రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా చేశారు. పరిశ్రమలు పెట్టడానికి ముందుకు వచ్చినవారిని ఏదో ఒక సాకు చూపి జైలులో పెట్టించారు. ఒకవైపు పరిశ్రమలు స్థాపిస్తామని బ్యాంకుల వద్ద వేల కోట్ల రూపాయల రుణాలు పొందిన కొందరు రాజకీయ ప్రముఖులు ఆయా జాతీయ పార్టీలలో సేఫ్‌గా ఉండగా, పరిశ్రమలు పెడుతున్నవారు నానా ఇక్కట్లు పడవలసి వచ్చింది. దానికి తోడు తెలంగాణ ఉద్యమ ప్రభావం ఉండనే ఉంది. దీంతో ఏపీలో పరిశ్రమలు పెట్టాలంటేనే భయపడేలా చేశారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగింది. విభజన చట్టంలో కడప స్టీల్ ప్లాంట్ పై అధ్యయనం చేయాలని ఒక క్లాజ్ పెట్టారు. దాని ప్రకారం కేంద్రం చర్యలు తీసుకోవలసి ఉండగా, ఆయా కారణాలతో కేంద్రం చొరవ తీసుకోలేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మిత్ర పక్షంగా ఉన్న తెలుగుదేశం ఏపీలో అప్పట్లో అధికారంలో ఉంది. కానీ.. వారు కూడా ప్రత్యేక శ్రద్ద పెట్టలేకపోయారు. దీనిపై ప్రజలలో వ్యతిరేకత వస్తోందని శంకించిన టీడీపీ ప్రభుత్వం 2018లో అంటే ఎన్నికల ముందు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన అంటూ హడావుడి చేసింది. దానికి ముందుగా రాజ్యసభ సభ్యుడు సీ.ఎమ్. రమేష్ నిరాహార దీక్ష డ్రామా కూడా జరిగింది. అదేదో కర్మాగారం వచ్చేసినంత హడావుడి చేశారు. అదంతా ఉత్తుత్తిదే అన్న సంగతి ప్రజలకు అర్ధం కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. 2019లో టీడీపీ ఓడిపోయి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ వెంటనే ముఖ్యమంత్రి జగన్ ఏపీ ప్రభుత్వమే దీని ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని భావించి శంకుస్థాపన చేశారు. ఇందుకోసం భాగస్వామిని ఎంపిక చేసే యత్నం జరిగింది. ఇంతలో కరోనా సమస్య అతలాకుతలం చేయడంతో రెండేళ్లపాటు ఇది ఆలస్యం అయింది. అయినా సీఎం జగన్ దీనిని వదలిపెట్టలేదు. పట్టువదలని విక్రమార్కుడి మాదిరి ఈ రంగంలో అనుభవజ్ఞులతో సంప్రదింపులూ జరిపి, వారిని ఒప్పించడానికి ప్రయత్నించారు. ఎట్టకేలకు ఆ కృషి ఫలించి ఇప్పుడు అది కార్యరూపం దాల్చుతోంది. ఈ ప్లాంట్ సజావుగా పూర్తి అయి, వేలాది మందికి ఉపాధి కల్పించడమే కాకుండా ఏపీ పారిశ్రామిక చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి నాందీ పలుకుతుందని ఆశిద్దాం. - హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్. -
ఏపీలో పారిశ్రామిక ప్రగతి అగ్రగామిగా నిలిపిన సీఎం జగన్ విజన్
-
సీఎం జగన్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన సజ్జన్ జిందాల్
-
వైఎస్ఆర్ చూపిన బాటలోనే సీఎం జగన్ నడుస్తున్నారు: సజ్జన్ జిందాల్
-
సీఎం జగన్‌పై సజ్జన్ జిందాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: మహానేత వైఎస్సార్ తనకు మంచి మిత్రులు, గురువు అని జేఎస్‌డబ్ల్యు ఛైర్మన్ సజ్జన్ జిందాల్ అన్నారు. బుధవారం ఆయన జమ్మలమడుగు మండలం సున్నపురాళ్ళపల్లెలో స్టీల్‌ప్లాంట్ భూమిపూజ కార్యక్రమంలో మాట్లాడుతూ.. సీఎం జగన్‌తో చాలా కాలం నుంచి పరిచయం ఉందన్నారు. మహానేత వైఎస్సార్ చూపిన బాటలోనే సీఎం జగన్ నడుస్తున్నారని అన్నారు. ‘‘రాష్ట్రంలో విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. వైఎస్ జగన్ నాయకత్వం గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ స్టీల్ ప్లాంట్ కడప ప్రజల చిరకాల స్వప్నం. వైఎస్ జగన్ కృషి, పట్టుదల కారణంగానే ఈ కల సాకారమవుతోంది. ఇది వైఎస్సార్ జిల్లా. మహానేత వైఎస్సార్‌ని స్మరించుకోకుంటే ఈ కార్యక్రమం అసంపూర్తిగానే మిగిలిపోతుంది’’ అని సజ్జన్ జిందాల్ వ్యాఖ్యానించారు. ‘‘నేను వైఎస్సార్‌ను కలిసినప్పుడు వైఎస్ జగన్ యువకుడు. ఆయన్ను ముంబై తీసుకెళ్లి వ్యాపార సూత్రాలు నేర్పించాలని వైఎస్సార్ చెప్పారు. 15-17 ఏళ్ల క్రితం జగన్ ముంబైలోని నా ఆఫీస్‌కు కూడా వచ్చారు. ఏపీని సీఎం జగన్ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. ప్రజా సంక్షేమమే తన జీవిత లక్ష్యంగా జగన్ భావిస్తున్నారు. విజయవాడలో సీఎంతో కలిసి లంచ్ చేసినప్పుడు రాష్ట్రం గురించి చాలా మాట్లాడుకున్నాం. వైద్య ఆరోగ్య రంగం నుంచి డిజిటలైజేషన్ వరకూ ఆయన మాటలు నాకు దేవుడి మాటల్లా అనిపించాయి. నాకు తెలుగు మాట్లాడటం రాదు.. లేదంటే.. నేను చెప్పే విషయాలు మీకు పూర్తిగా అర్థమయ్యేవి. సీఎం జగన్ లాంటి యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఉండటం వల్ల కలిగే ప్రయోజనం ఏంటో ఏపీలో స్పష్టంగా కనిపిస్తోంది’’అని సజ్జన్ జిందాల్ పేర్కొన్నారు. చదవండి: దేవుడి దయతో మంచిరోజులొచ్చాయ్: సీఎం జగన్ -
75 శాతం ఉద్యోగాలు స్థానికులకే: సీఎం వైఎస్ జగన్
-
వైఎస్ఆర్ కన్న కలను సీఎం జగన్ నెరవేర్చారు: మంత్రి గుడివాడ అమర్నాథ్
-
స్టీల్ ప్లాంట్ ను జగనన్న ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది: ఎంపీ అవినాష్ రెడ్డి
-
స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో జిల్లా మరింత అభివృద్ధి చెందుతుంది : సీఎం జగన్
-
దేవుడి దయతో మంచిరోజులొచ్చాయ్: సీఎం జగన్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో గత మూడేళ్లుగా ఏపీ నంబర్ వన్‌గా ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. జేఎస్‌డబ్ల్యు ఛైర్మన్ సజ్జన్ జిందాల్ సమక్షంలో జమ్మలమడుగు మండలం సున్నపురాళ్ళపల్లెలో స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి సీఎం జగన్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడుతూ, రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉందన్నారు. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం ఏపీ అని సీఎం పేర్కొన్నారు. దేవుడి దయతో వైఎస్సార్ జిల్లాలో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని సీఎం జగన్ అన్నారు. ఎన్నికల కోడ్ ఉన్నందున ఎక్కువ మందిని పిలవలేకపోయామన్నారు. ఎప్పట్నుంచో కలలుగన్న స్వప్నం ఈ స్టీల్‌ప్లాంట్. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని వైఎస్సార్ కలలుగన్నారు. వైఎస్సార్ మరణంతో ఈ ప్రాంతాన్ని ఎవరూ పట్టించుకోలేదని సీఎం అన్నారు. ‘‘రూ.8,800 కోట్లతో 3 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి అవుతుంది. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో జిల్లా మరింత అభివృద్ధి చెందుతుంది. ఈ ప్లాంట్ రావడం కోసం కష్టాపడాల్సి వచ్చింది. అయినప్పటికీ దేవుడి దయతో మనకు మంచి రోజులు వచ్చాయి. స్టీల్ ప్లాంట్‌వస్తే ఈ ప్రాంతం స్టీల్ సిటీ తరహాలో అభివృద్ధి చెందుతుంది. గండికోట రిజర్వాయర్ నుంచి ప్రత్యేక పైపులైన్ ద్వారా నీటి సరఫరా అవుతుంది. తొలి విడతలో రూ. 3,300 కోట్లతో ఏటా 10 లక్షల టన్నుల ఉక్కు ఉత్పత్తి అవుతుంది’’ అని సీఎం జగన్ అన్నారు. ‘‘రూ.700 కోట్లతో మౌలిక వసతులు అభివృద్ధి చేస్తున్నాం. 30 నెలల్లోపు స్టీల్‌ప్లాంట్ తొలి దశ పూర్తవుతుంది. మొత్తం 30 లక్షల టన్నుల సామర్థ్యంతో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నాం. స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుతో చుట్టుపక్క అనుబంధాల రంగాలు అభివృద్ధి చెందుతాయి. చదువుకున్న మన పిల్లలకు మన ప్రాంతంలో ఉపాధి లభిస్తుంది. 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని చట్టం కూడా తెచ్చాం’’ అని సీఎం జగన్ అన్నారు. చదవండి: బాకీలంటూ.. తప్పుడు బాకాలు.. ఇదేం జర్నలిజం రామోజీ? -
కడప స్టీల్ ప్లాంట్..భూమి పూజకు సర్వం సిద్ధం
-
కడప స్టీల్ ప్లాంట్.. భూమి పూజకు సర్వం సిద్ధం
సాక్షి, అమరావతి: సీమవాసుల చిరకాల స్వప్నాన్ని నెరవేరుస్తూ రూ.8,800 కోట్లతో 30 లక్షల టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో జేఎస్‌డబ్ల్యూ గ్రూపు వైఎస్సార్ కడప జిల్లా సున్నపురాళ్లపల్లెలో ఏర్పాటు చేస్తున్న స్టీల్ ప్లాంట్ పనులను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం భూమి పూజ చేసి లాంఛనంగా ప్రారంభించనున్నారు. కార్యక్రమంలో జేఎస్‌డబ్ల్యూ గ్రూపు చైర్మన్ సజ్జన్ జిందాల్ కూడా పాల్గొంటారు. 2019లో ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ పేరుతో ముఖ్యమంత్రి స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన చేసిన తర్వాత కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేయడంతో రెండేళ్లు పనులు జరగలేదు. కోవిడ్ సంక్షోభానికి భయపడి పలు సంస్థలు పెట్టుబడి ప్రతిపాదనలను ఉపసంహరించుకున్నాయి. ఇప్పుడు రూ.1,76,000 కోట్ల (22 బిలియన్ డాలర్లు) మార్కెట్ విలువ కలిగి, ఏటా 27 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేస్తున్న జేఎస్‌డబ్ల్యూ కంపెనీ కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణం చేపట్టింది. దీంతో పనులు చకచకా జరగనున్నాయి. ఈ సంస్థకు ప్రభుత్వం దీర్ఘకాలిక లీజు ప్రాతిపదికన భూములు కేటాయించింది. జేఎస్‌డబ్ల్యూ సంస్థ తొలి విడతలో రూ.3,300 కోట్లతో ఏటా 10 లక్షల టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంతో యూనిట్ ఏర్పాటు చేస్తుంది. రెండో విడతలో మరో 20 లక్షల టన్నులు ఉత్పత్తి చేసేందుకు ప్లాంట్‌ను విస్తరిస్తుంది. మొత్తం 30 లక్షల టన్నుల సామర్థ్యంతో పరిశ్రమ అందుబాటులోకి తెస్తుంది. నిర్మాణం ప్రారంభించిన 36 నెలల్లో తొలి దశ అందుబాటులోకి తేవాలని జేఎస్‌డబ్ల్యూ లక్ష్యంగా నిర్దేశించుకుంది. రూ.700 కోట్లతో మౌలిక వసతుల కల్పన రాయలసీమ వాసులకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.700 కోట్లతో మౌలిక వసతులు కల్పిస్తోంది. ఈ ప్లాంట్‌ను జాతీయ రహదారి 67కు అనుసంధానిస్తూ 7.5 కిలోమీటర్ల అప్రోచ్ రోడ్డు నిర్మిస్తోంది. ప్రొద్దుటూరు – ఎర్రగుంట్ల రైల్వే లైన్‌కు అనుసంధానిస్తూ 10 కిలోమీటర్ల నూతన రైల్వే లైన్ ఏర్పాటు చేయనుంది. మైలవరం రిజర్వాయర్ నుంచి రెండు టీఎంసీల నీటిని సరఫరా చేసేలా ప్రత్యేక పైప్‌లైన్ నిర్మిస్తోంది. గ్రీన్ ఎనర్జీ రంగంలోనూ పెట్టుబడులు గ్రీన్ ఎనర్జీ రంగంలో కూడా జేఎస్‌డబ్ల్యూ పెట్టుబడులు పెట్టనుంది. 2.5 మెట్రిక్ టన్నుల డీఆర్ఐ ప్లాంట్, 1000 మెగావాట్ల ఎలక్ట్రోలైజర్ ప్లాంట్, 3,000 మెగావాట్ల సోలార్, విండ్, పంప్డ్ హైడ్రోస్టోరేజ్ వంటి ప్రత్యామ్నాయ ఇంధన ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. బ్యాటరీ స్టోరేజ్, హైడ్రోజన్ స్టోరేజ్ కేంద్రాలనూ ఏర్పాటు చేయనుంది. -
కడప స్టీల్‌ప్లాంట్‌కు పర్యావరణ అనుమతులు
వైఎస్సార్ కడప: కడప స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ అనుమతులను ఇచ్చింది. దీంతో 3,591 ఎకరాల్లో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుకు మార్గం సుగమం అయ్యింది. కడప స్టీల్ ప్లాంట్.. ఏడాదికి 3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. -
కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకొచ్చిన ఎస్సార్
-
కడప స్టీల్ ప్లాంట్ భూములకు స్టాంప్ డ్యూటీ మినహాయింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి కోసం వైఎస్సార్ జిల్లాలో ఏర్పాటు చేస్తోన్న వైఎస్సార్ స్టీల్ ప్లాంట్ (వైఎస్సార్ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్) కోసం కేటాయించిన 3,148.68 ఎకరాలకు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్వర్వులిచ్చింది. జిల్లాలోని జమ్మలమడుగు మండలం పెద్దనందులూరు, సున్నపురాళ్లపల్లెలో ప్రభుత్వం ఈ భూమిని సేకరించింది. ఈ భూములకు సంబంధించి రూ.3.89 కోట్ల స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాల్సి ఉంటుందని రిజిస్ట్రేషన్ల శాఖ లెక్కించింది. రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా ఏర్పాటు చేస్తోన్న స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం ఈ మొత్తాన్ని మినహాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రజత్ భార్గవ నోటిఫికేషన్ జారీ చేశారు. కాకినాడ సెజ్ భూములకూ మినహాయింపు తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సెజ్‌లో రైతులకు తిరిగి ఇస్తున్న 2,180 ఎకరాలకు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజును మినహాయిస్తూ మరో నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ ప్రాంత రైతులకు ఇచ్చిన హామీలో భాగంగా చిన్న, సన్నకారు రైతులకు మేలు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. -
వేగంగా కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం
ఆయా కంపెనీల ప్రతిపాదనలు స్వీకరించిన వెంటనే ఎంపిక ప్రక్రియ ప్రారంభించాలి. పనులు కూడా వేగంగా జరిగేలా చూడాలి. తొలుత ప్రభుత్వ పరంగా ఏమైనా పనులు మిగిలి ఉంటే నాలుగైదు రోజుల్లో పూర్తి చేయాలి. కరువు పీడిత ప్రాంతంలో పారిశ్రామికాభివృద్ధి, ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా స్టీల్ ప్లాంట్‌ను తీసుకొస్తున్నాం. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పనులు ప్రారంభం కావాలి. – సీఎం జగన్ సాక్షి, అమరావతి: కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణ ప్రయత్నాలు ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. వీలైనంత త్వరగా నిర్మాణ కంపెనీ ఎంపిక పూర్తి చేయాలని సూచించారు. కొప్పర్తి ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ద్వారా 30 వేల మందికి ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పనిచేయాలన్నారు. కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం, కొప్పర్తి ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌పై సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి 7 ప్రఖ్యాత కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయని, వాటితో జరిపిన సంప్రదింపుల పురోగతిని అధికారులు సీఎంకు వివరించారు. ఆయా కంపెనీల ప్రతిపాదనలు స్వీకరించి తదుపరి ఒక సంస్థను ఎంపిక చేస్తామని చెప్పారు. ఇందుకు కనీసం 7 వారాల సమయం పడుతుందని, ఆ ప్రక్రియ పూర్తి కాగానే తదుపరి 3–4 వారాల్లో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. రూ.300 కోట్ల పెట్టుబడులతో ఉద్యోగాలు ► కడప నగరానికి సమీపంలో కొప్పర్తి వద్ద ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యల గురించి అధికారులు సీఎంకు వివరించారు. ► రూ.300 కోట్ల పెట్టుబడితో ఉద్యోగాల కల్పనకు డిక్సన్ కంపెనీ సంసిద్ధత వ్యక్తం చేసిందని, ఆ పెట్టుబడి మరింత పెంచే అవకాశం ఉందన్నారు. డిక్సన్‌తో పాటు మరిన్ని కంపెనీలు కూడా పెట్టుబడికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ► పెట్టుబడులను ఆకర్షించేలా చక్కటి ప్రమాణాలతో కొప్పర్తి ఈఎంసీని తీర్చిదిద్దాలని, తద్వారా 30 వేల మందికి ఉద్యోగాల కల్పనే లక్ష్యం కావాలని సీఎం సూచించారు. ► ఈ సమీక్షలో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, ఇండస్ట్రియల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణంపై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి: కడప స్టీల్‌ప్లాంట్ ప్రయత్నాలు ముమ్మరం చేయాలని, వీలైనంత త్వరగా కంపెనీ ఎంపిక పూర్తి కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. కొప్పర్తి ఈఎంసీ ద్వారా 30వేల మందికి ఉద్యోగాల కల్పనే లక్ష్యమని ఆయన అన్నారు. కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం, కొప్పర్తి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌పై అధికారులతో ముఖ్యమంత్రి సోమవారం క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, ఇండస్ట్రియల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి 7 ప్రఖ్యాత కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయని ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. వాటితో జరిపిన సంప్రదింపుల పురోగతిని సీఎంకు వివరించారు. స్టీల్‌ప్లాంట్ నిర్మాణంపై ఆయా కంపెనీల ప్రతిపాదనలు స్వీకరించి తదుపరి ఒక సంస్థను ఎంపిక చేస్తామని తెలిపారు. అందుకు కనీసం ఏడు వారాల సమయం పడుతుందని అధికారులు పేర్కొన్నారు. ఆ ప్రక్రియ పూర్తి కాగానే తదుపరి 3-4 వారాల్లో పనులు ప్రారంభిస్తామన్నారు. ప్రతిపాదనలు స్వీకరించిన వెంటనే ఎంపిక ప్రక్రియ ప్రారంభించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూచించారు. పనులు కూడా వేగంగా జరిగేలా చూడాలని ఆదేశించారు. కంపెనీల ప్రతిపాదనల స్వీకరణకు ముందు ప్రభుత్వ పరంగా ఏమైనా పనులు మిగిలిఉంటే వాటిని నాలుగైదు రోజుల్లో పూర్తి చేయాలన్నారు. కరువు పీడిత ప్రాంతంలో పారిశ్రామికాభివృద్ది, ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా స్టీల్‌ప్లాంట్‌ను తీసుకొస్తున్నామని, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పనులు ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. (చదవండి: శరవేగంగా కడప ఉక్కు పనులు) కొప్పర్తి ఈఎంసీ ద్వారా 30 వేల ఉద్యోగాలు: సీఎం జగన్ అనంతరం కడప నగరానికి సమీపంలో కొప్పర్తి వద్ద ఏర్పాటవుతున్న ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. క్లస్టర్ ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యలను అధికారులు వివరించారు. 300 కోట్ల రూపాయల పెట్టుబడితో ఉద్యోగాల కల్పనకు డిక్సన్ కంపెనీ సంసిద్ధత వ్యక్తం చేసిందన్నారు అధికారులు. ఆ పెట్టుబడి మరింత పెంచే అవకాశం ఉందని తెలిపారు. డిక్సన్‌తో పాటు మరిన్ని కంపెనీలు కూడా పెట్టుబడికి సిద్ధంగా ఉన్నాయన్నారు. పెట్టుబడులను ఆకర్షించేలా చక్కటి ప్రమాణాలతో కొప్పర్తి ఈఎంసీని తీర్చిదిద్దాలని సీఎం జగన్ ఆదేవించారు. కొప్పర్తి ఈఎంసీ ద్వారా 30 వేల మందికి ఉద్యోగాల కల్పన లక్ష్యం కావాలన్నారు. -
‘ఏపీ హైగ్రేడ్ స్టీల్స్’కు రూ.20 కోట్ల రుణం
సాక్షి, విజయవాడ: కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణ ప్రక్రియలో భాగంగా ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్‌కు రూ.20 కోట్ల రూపాయల మేర రుణాన్ని ఏపీఎండీసీ నుంచి తీసుకునేందుకు అనుమతి లభించింది. రెండూ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలే అయినందున బ్యాంకు గ్యారెంటీ లేకుండా రుణాన్ని తీసుకునేందుకు ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ అనుమతి పొందింది. ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్‌గా కడప ఉక్కు కర్మాగారాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనుంది. (చదవండి: ‘కడప స్టీల్ ప్లాంట్’కు భారీ స్పందన) ఏడాదికి 3 మిలియన్ టన్నుల సామర్థ్యంతో వైఎస్సార్ కడప జిల్లా సున్నపురాళ్లపల్లి, పెదనందలూరు గ్రామాల్లో 3,591.65 ఎకరాల్లో ఉక్కు కర్మాగారాన్ని నిర్మించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గతేడాది డిసెంబర్ 23న శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సివిల్ పనులు శరవేగంగా జరుగుతుండగా, వచ్చే జనవరి నుంచి ప్రధాన ప్లాంటు పనులు ప్రారంభమయ్యే విధంగాఏపీహెచ్‌ఎస్‌ఎల్ ప్రణాళికలు సిద్ధం చేసింది. (చదవండి: కడప ఉక్కుపై దిగ్గజ కంపెనీల ఆసక్తి) -
‘కడప స్టీల్ ప్లాంట్’కు భారీ స్పందన
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కడప స్టీల్ ఉక్కు కర్మాగారం (ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్–ఏపీహెచ్‌ఎస్‌ఎల్)లో భాగస్వామ్యం కావడానికి దేశీయ, అంతర్జాతీయ ఉక్కు దిగ్గజ కంపెనీలు ముందుకు వచ్చాయి. ఈ ప్రాజెక్టులో చేరడానికి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈవోఐ) కోరుతూ పిలిచిన టెండర్లలో అయిదు దేశీయ, రెండు అంతర్జాతీయ అతిపెద్ద ఉక్కు తయారీ కంపెనీలు ఆసక్తిని వ్యక్తం చేసినట్లు ఏపీహెచ్‌ఎస్‌ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.షాన్ మోహన్ ‘సాక్షి’కి తెలిపారు. ► జూలై 31తో ముగిసిన టెండర్లకు ఈ స్థాయిలో స్పందన రావడంపై అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ► పలు ఆర్థిక ప్రతిపాదనలతో రావాల్సిందిగా రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ) టెండర్లను త్వరలో జారీ చేయనున్నారు. ► ట్రాన్సాక్షన్ అడ్వైజరీగా వ్యవహరిస్తున్న ఎస్బీఐ క్యాప్ ఈ టెండర్ల ప్రతిపాదనలను సిద్ధం చేస్తోంది. ► ఈ ప్రతిపాదనల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం ఇవ్వడానికి ముందుకు వచ్చిన కంపెనీని భాగస్వామిగా ఎంపిక చేస్తారు. ► ఏడాదికి 3 మిలియన్ టన్నుల సామర్థ్యంతో వైఎస్సార్ కడప జిల్లా సున్నపురాళ్లపల్లి, పెదనందలూరు గ్రామాల్లో 3,591.65 ఎకరాల్లో ఉక్కు కర్మాగారాన్ని నిర్మించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతేడాది డిసెంబర్ 23న శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. ► ఇప్పటికే సివిల్ పనులు శరవేగంగా జరుగుతుండగా, వచ్చే జనవరి నుంచి ప్రధాన ప్లాంటు పనులు ప్రారంభమయ్యే విధంగాఏపీహెచ్‌ఎస్‌ఎల్ ప్రణాళికలు సిద్ధం చేసింది. -
శరవేగంగా కడప ఉక్కు పనులు
సాక్షి, అమరావతి: రాయలసీమ ప్రజల చిరకాల ఆకాంక్ష కడప స్టీల్ ప్లాంట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఏడాదికి 3 మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఉక్కు కర్మాగారాన్ని నిర్మించడానికి ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ (ఏపీహెచ్‌ఎస్‌ఎల్) పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కంపెనీని ఏర్పాటు చేసింది. వైఎస్సార్ జిల్లా సున్నపురాళ్లపల్లి, పెదనందలూరు గ్రామాల్లో 3,591.65 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ ప్లాంట్‌కు సీఎం వైఎస్ జగన్ గతేడాది డిసెంబర్ 23న శంకుస్థాపన చేసినప్పటి నుంచి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. 67వ నంబర్ జాతీయ రహదారి నుంచి ప్లాంట్ దగ్గరకు చేరుకోవడానికి నాలుగులైన్ల రహదారి నిర్మాణానికి రూ.50 కోట్లు కేటాయిస్తూ రాష్ట్ర పరిశ్రమల శాఖ సోమవారం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ప్లాంట్ చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణానికి రూ.76 లక్షలు కేటాయిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఇప్పటికే సాయిల్ టెస్టింగ్, సర్వే పనులు పూర్తి చేసి ప్రహరీ గోడ నిర్మాణ పనులు చేపట్టినట్లు ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.షాన్ మోహన్ ‘సాక్షి’కి తెలిపారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ► జనవరి నుంచి ప్రధానప్లాంటు పనులు ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్లాంట్‌కు చేరుకోవడానికి అవసరమైన నాలుగు లైన్ల రహదారికి సంబంధించి త్వరలోనే టెండర్లు పిలవనున్నారు. ► 10,000 కేవీఏ సామర్థ్యంతో విద్యుత్ సరఫరా కోసం ఏపీఎస్పీడీసీఎల్కు రూ.6.88 కోట్లు కేటాయించారు. సుమారు రూ.15,000 కోట్ల పెట్టుబడి అంచనాతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులు సేకరించే బాధ్యతను ఎస్బీఐ క్యాప్‌కు అప్పగించారు. ► ప్లాంట్‌కు అవసరమైన నీటిని గండికోట రిజర్వాయర్ నుంచి సరఫరా చేయడానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధమవుతోంది. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులపై ఇప్పటికే దరఖాస్తు చేశాం. రెండు కీలకమైన సమావేశాలు ఇప్పటికే పూర్తయ్యాయి. ► ఈ ప్లాంట్‌కు అవసరమైన ముడి ఇనుము ఏటా 5 మిలియన్ టన్నులు సరఫరా చేయడానికి ఇప్పటికే ఎన్ఎండీసీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ► ప్లాంటు నుంచి వచ్చే వ్యర్థాలను సొంత అవసరాలకు వినియోగించుకునేలా 88.6 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు. నెల రోజుల్లో భాగస్వామ్య కంపెనీ ఎంపిక ► ఈ ప్రాజెక్టులో భాగస్వామ్య కంపెనీగా చేరడానికి ఆసక్తి ఉన్నకంపెనీల నుంచి దరఖాస్తులు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈవోఐ) కోరుతూ టెండర్లు పిలిచారు. ► దీనికి జాతీయ అంతర్జాతీయ కంపెనీల నుంచి మంచి స్పందన వస్తోంది. ► ఇప్పటికే ఐదు కంపెనీలు ఆసక్తి కనబరిచాయి. ► ఈవోఐ దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 31 వరకు గడువుండటంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ► మొత్తం ప్రక్రియను వచ్చే నెలరోజుల్లో పూర్తి చేసి భాగస్వామ్య కంపెనీని ఎంపిక చేయనున్నారు. ► శంకుస్థాపన చేసినప్పటి నుంచి మూడేళ్లలో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. -
కడప ఉక్కుపై దిగ్గజ కంపెనీల ఆసక్తి
సాక్షి, అమరావతి: వైఎస్ఆర్ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం సొంతగా నిర్మిస్తున్న ఉక్కు కర్మాగారంలో భాగస్వామ్యం కావడానికి జాతీయ, అంతర్జాతీయ ఉక్కు రంగ దిగ్గజ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయని రాష్ట్ర పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ వెల్లడించారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఈ స్టీల్ ప్లాంట్‌లో భాగస్వామ్యం కోసం అనేక కంపెనీలు ముందుకు వచ్చాయని తెలిపారు. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ‘రాష్ట్రంలో ఉక్కు రంగం–సుస్థిరత’ అనే అంశంపై నిర్వహించిన జాతీయ స్థాయి వెబినార్ సదస్సులో వలవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వెల్లడించిన అంశాలు.. ► లాక్డౌన్ తరువాత పరిశ్రమలను తిరిగి ప్రారంభించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి సహకారం అందించింది. ► ఉద్యోగుల ఆరోగ్య రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన కోవిడ్–19 ప్రోటోకాల్స్‌ను విధిగా పాటించాల్సిందిగా కోరుతున్నాం. -
కడప స్టీల్ ప్లాంట్‌కు రూ.500 కోట్లు
సాక్షి, అమరావతి: కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం ఈక్విటీ కింద రూ.500 కోట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్లాంట్ నిర్మాణంపై సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. కడప స్టీల్ ప్లాంట్ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్‌తో భాగస్వామ్యం కోసం ఆసక్తి చూపిస్తున్న సంస్థలతో చర్చల వివరాలను ఈ సందర్భంగా అధికారులు సీఎంకు వివరించారు. హ్యుందాయ్, టాటా స్టీల్స్, ఎస్సార్ స్టీల్ సహా పలు కంపెనీలతో చర్చలు జరిపామని చెప్పారు. ఆయా సంస్థల ప్రతిపాదనలపై సమావేశంలో చర్చించారు. సమీక్ష వివరాలు ఇంకా ఇలా ఉన్నాయి. నెలాఖరులోగా టెక్నికల్ సర్వే పూర్తి ► ఆ సంస్థలతో చర్చలు కొనసాగించాలని సీఎం ఆదేశించారు. చర్చల అనంతరం ఎంపిక చేసిన భాగస్వామ్య సంస్థతో 2 నెలల్లోగా ఒప్పందం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అధికారులు వెల్లడించారు. ► రెండేళ్లలో టౌన్షిప్, అనుబంధ మౌలిక వసతుల ఏర్పాటు దిశగా అడుగులు వేయాలని నిర్ణయించారు. ఈ నెలాఖరులోగా సాయిల్ టెస్టింగ్, జియో టెక్నికల్ సర్వే పూర్తి చేస్తామని అధికారులు చెప్పారు. ► ఫ్యాక్టరీ నిర్మాణం కోసం అవసరమైన రోడ్లు, కాంపౌండ్ వాల్, విద్యుత్ సరఫరా కోసం నిర్మాణపు పనులు, ఫ్యాక్టరీ నిర్మాణ కార్యకలాపాల కోసం విద్యుత్.. ఆర్టీపీపీ లైన్, నిర్మాణ పనుల కోసం నీటిని తరలించేందుకు అవసరమైన పనులను పూర్తి చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ► సమీక్షలో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవన్, పలువురు అధికారులు పాల్గొన్నారు. -
కడప స్టీల్‌ప్లాంట్‌పై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి: కడప స్టీల్‌ప్లాంట్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం ఈక్విటీ కింద రూ.500 కోట్లు కేటాయించాలని ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశానికి పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవన్ సహా పలువురు అధికారులు హాజరు అయ్యారు. కడప స్టీల్‌ప్లాంట్ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్‌తో భాగస్వామ్యం కోసం ఆసక్తి చూపిస్తున్న సంస్థలతో చర్చల వివరాలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. హ్యుందాయ్, టాటా స్టీల్స్, ఎస్సార్ స్టీల్ సహా పలు కంపెనీలతో జరిపిన చర్చల వివరాలను ముఖ్యమంత్రికి తెలిపారు. ఆ సంస్థలు చేసిన ప్రతిపాదనలపై సమావేశంలో సీఎం జగన్ చర్చించారు. ప్రతిపాదనలు చేసిన సంస్థలతో చర్చలు జరపాలని అధికారులను ఆదేశించారు. ఎంపిక చేసిన భాగస్వామ్య సంస్థతో రెండు నెలల్లోగా ఒప్పందం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సూచించారు. అదే సమయంలో రెండు సంవత్సరాల్లో టౌన్షిప్, అనుబంధం మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకునే దిశగా అడుగులు వేయాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా ఈ నెలాఖరులోగా సాయిల్ టెస్టింగ్, జియో టెక్నికల్ సర్వే పూర్తి చేస్తామని అధికారులు వివరించారు. (వెండి తెర వెలుగు రేఖ.. విశాఖ) ఫ్యాక్టరీ నిర్మాణం కోసం అవసరమైన రోడ్లు, కాంపౌండ్ వాల్, విద్యుత్ సరఫరా కోసం నిర్మాణపు పనులు, అలాగే ఫ్యాక్టరీ నిర్మాణ కార్యకలాపాల కోసం కరెంటుతో పాటు ఆర్టీపీపీ లైన్ ద్వారా నిర్మాణ పనుల కోసం నీరు, అలాగే ఫ్యాక్టరీ నిర్వహణ కోసం నీటిని తరలించేందుకు అవసరమైన పనులను పూర్తి చేయడానికి అన్ని రకాల చర్యలూ తీసుకుంటామన్న అధికారులు వివరించారు. -
స్టీల్‌ప్లాంట్ స్థలాన్ని సిద్ధం చేయండి
సాక్షి, అమరావతి: కడప స్టీల్ ప్లాంట్‌కు భాగస్వామ్య సంస్థల కోసం ఓ పక్క ప్రయత్నిస్తూనే.. మరోవైపు నిర్మాణ ప్రారంభానికి చేపట్టాల్సిన పనులన్నీ త్వరితగతిన పూర్తిచేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ప్లాంట్ నిర్మా ణం విషయంలో అనుసరించాల్సిన వ్యూహం పై సోమవారం ఆయన తన క్యాంపు కార్యాల యంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. జాయింట్ వెంచర్ వచ్చేలోగా ప్లాంట్ కోసం ఎంపిక చేసిన ప్రాంతాన్ని నిర్మాణానికి సిద్ధం చేయడం చాలా ముఖ్యమని, దీనిపై దృష్టి పెడితే చాలా సమయం ఆదా అవుతుం దన్నారు. ఇదే సమయంలో ప్లాంట్ నిర్మాణానికి కావాల్సిన అన్ని రకాల అనుమతులు తెచ్చుకోవాలని సూచించారు. సమావేశంలో ప్రస్తావనకు వచ్చిన ముఖ్యాంశాలు.. ► ఎలాంటి ఉత్పత్తులు చేస్తే డిమాండు ఉంటుంది, దీనికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం ఎలా లభిస్తుంది? తదితర అంశాలను విస్తృతంగా చర్చించారు. ► ఉత్పత్తులకు అనుగుణంగా ప్లాంట్ నిర్మాణంలో వివిధ దశలను ఎలా ప్రా రంభించాలన్న దానిపైనా మాట్లాడారు. ► ప్రఖ్యాత ఉక్కు తయారీ సంస్థల భాగస్వామ్యం, ఇందుకు జరపాల్సిన సంప్రదింపులపైనా చర్చ జరిగింది. ► అలాగే, ఉక్కు రంగంలో ప్రముఖుడు, ‘సెయిల్’ మాజీ సీఎండీ సీఎస్ వర్మ కూడా వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం వైఎస్ జగన్‌తో మాట్లాడారు ► ప్రపంచ వ్యాప్తంగా ఉక్కు రంగంలో ఉన్న పరిస్థితులను చర్చించారు. ► ముడి ఖనిజం సరఫరా, రవాణా, ఉత్ప త్తులు, సాంకేతిక పరిజ్ఞానం తదితర అంశాలపై తన అభిప్రాయాలను వర్మ వివరించారు. ► కడప స్టీల్‌ప్లాంట్‌లో భాగస్వామ్యానికి చాలా సంస్థలు ఆసక్తి చూపిస్తాయని వర్మ చెప్పారు. ► ఈ సమీక్షలో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవన్ సహా ఇతర అ«ధికారులు పాల్గొన్నారు. -
‘రాజధాని లేదా హైకోర్టు అవసరం’
సాక్షి, వైఎససార్ కడప : అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. జిల్లాకు మరో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఆదేశాలు జారీ అయ్యాయని పేర్కొన్నారు. శ్రీబాగ్ ఒప్పందమైనా.. శ్రీకృష్ణ కమిటీ నివేదిక అయినా వెనకబడిన రాయలసీమ అభివృద్ధి చెందాలంటే నీటితోపాటు రాజధాని లేదా హైకోర్టు అవసరమని తేల్చిందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, దేవినేని ఉమా వంటి వారు రాయలసీమ ప్రాంతానికి నీరు ఇవ్వడంపై వ్యతిరేకించారన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రైతులను దేవుళ్లుగా చూస్తుంటే ప్రతిపక్షాలు పెయిడ్ ఆర్టిస్టులతో రైతుల అవతారం ఎత్తి అభాసుపాలైందని విమర్శించారు. రాజధానిపై కమిటీల నివేదికలు పూర్తి స్థాయిలో రాగానే అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ లోపే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ విషయంలో కోట్ల రూపాయలు ఖర్చు చేసి వెళ్లిన నాయకులను చూశాం కానీ ఒకటి కాదు రెండు స్టీల్ ప్లాంట్లను ఏర్పాటు చేసి వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం పనిచేస్తున్న నాయకుడు వైఎస్ జగన్ ఒక్కరేనని ప్రశంసించారు. -
ఉక్కు సంకల్పం
-
మూడేళ్లలో కడప ఉక్కు
ఐదు సంవత్సరాలు అధికారం ఇస్తే నాలుగున్నరేళ్లు ఏమీ చేయకుండా, ఎన్నికలకు ఆరు నెలల ముందు ఒక పెద్ద మనిషి వచ్చి ఉక్కు పరిశ్రమ అంటూ టెంకాయ కొడితే దానిని మోసమంటారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే పరిశ్రమ నిర్మాణానికి టెంకాయ కొడితే దాన్ని చిత్తశుద్ధి అంటారు. ఇదే ఆయన పాలనకు, నా పాలనకు మధ్య తేడా. వాస్తవానికి స్టీల్ ఫ్యాక్టరీ కట్టడం రాష్ట్ర ప్రభుత్వం పని కాదు. ఐదేళ్లు ఎదురు చూసినా కడపకు కేంద్రం స్టీల్ ఫ్యాక్టరీ ఇవ్వక పోవడంతో రాయలసీమ ముఖ చిత్రం మార్చాలని, పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలని మనమే ముందడుగు వేయాల్సి వచ్చింది. ఉక్కు సంకల్పంతో ఈ ఫ్యాక్టరీకి పునాది రాయి వేస్తున్నా. ఈ పరిశ్రమతో మన బతుకులు మారతాయి. వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయి. అనుబంధ యూనిట్లూ వస్తాయి. ఇప్పటికే అనంతపురంలో కార్ల పరిశ్రమ ఉంది. వీటన్నింటి ద్వారా ఉద్యోగాలలో కొత్త శకానికి నాంది పలుకుతున్నాం. దీంతో రాయలసీమ పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి కడప : కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. రూ.15 వేల కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఈ పరిశ్రమ ద్వారా 25 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె వద్ద సోమవారం ఉదయం ఆయన కడప ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేసినంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. జిల్లాలో ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేస్తుంటే సంతోషంగా ఉందన్నారు. ఇది తన జీవితంలో మరిచిపోలేని ఘట్టమన్నారు. ఈ సభలో సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఆ కల సాకారం చేసేందుకు శ్రీకారం ‘‘జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ రావాలని, పారిశ్రామిక రంగంలో అభివృద్ధి పరుగులు పెట్టాలని ఎన్నో కలలు కన్నానని తెలిపారు. జిల్లా అభివృద్ధికి దివంగత ముఖ్యమంత్రి, నాన్నగారి హయాంలో కాస్తో, కూస్తో ముందడుగులు పడ్డాయి. నాన్న చనిపోయాక జిల్లా గురించి, మన పిల్లల గురించి గానీ, వారికి మంచి జరగాలనిగానీ ఎవరు ఆలోచించలేదు. రాయలసీమ వెనుకబడిన ప్రాంతమని, నీరు, పరిశ్రమలు, ఉద్యోగాలు వస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందనే విషయం తెలిసిన వ్యక్తి, మీ బిడ్డ ఈ రోజు ముఖ్యమంత్రిగా పాలన సాగిస్తున్నాడు. ఇందులో భాగంగా రాయలసీమ ఆర్థిక, ఉద్యోగాల చరిత్రను మార్చేందుకు 30 లక్షల టన్నుల సామర్థ్యంతో ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేస్తున్నామని సగర్వంగా చెబుతున్నా. రాష్ట్రంతో పాటు దేశానికీ మేలు ఏపీ హైగ్రేడ్ స్టీల్ పరిశ్రమకు ముడిసరుకు అందించేందుకు ఎన్ఎండీసీ (నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్)తో మన ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించేందుకు కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఇందుకు ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రి ధరేంద్ర ప్రధాన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు తప్పకుండా ఇక్కడ ఉక్కు ఫ్యాక్టరీ కట్టిస్తామని చెప్పారు. ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటు ఇది కూడా చేస్తామని చెప్పారు. ఐదేళ్లు ఎదురు చూసినా న్యాయం జరగలేదు. దేవుడి దయ, అందరి చల్లని దీవెనలతో ఈ రోజు కడపతోపాటు రాయలసీమ జిల్లాలకు న్యాయం జరిగే రోజులు మళ్లీ వచ్చాయి. 2018 నాటికి దేశంలో ఉక్కు పరిశ్రమ సామర్థ్యం కోటి ఆరు లక్షల టన్నులు. జాతీయ విధానం ప్రకారం 2030 నాటికి మన దేశ అవసరాలు తీరాలంటే మూడు కోట్ల టన్నుల సామర్థ్యం అవసరమని అంచనా. ఈ పరిస్థితిలో ఈ జిల్లాలో 30 లక్షల టన్నుల సామర్థ్యంతో ఫ్యాక్టరీ రావడం వల్ల రాష్ట్రంతోపాటు దేశానికి మంచి జరుగుతుంది. పెద్ద సంస్థలతో చర్చలు రాష్ట్ర ప్రభుత్వం ఓ వైపు ఈ ఫ్యాక్టరీని కడుతూనే.. మరోవైపు ఇదే విషయమై పెద్ద పెద్ద కంపెనీలతో చర్చలు జరుపుతుంది. ఆ చర్చలు చర్చలు కొలిక్కి వచ్చే వరకు ఆగకూడదన్న ఉద్దేశంతోనే మనమే ముందడుగు వేశాం. మధ్యలో ఎవరైనా వస్తే సరి. రాకపోతే ప్రభుత్వమే ఉక్కు పరిశ్రమను నిర్మిస్తుంది. ఏపీ స్టీల్స్ అనేది మన రాష్ట్ర హక్కుగా నిలుస్తుంది. ఏపీలో ఉక్కు పరిశ్రమ కావాలని 1960లో ఉక్కు ఉద్యమం మొదలైంది. ఈ ఉద్యమంలో 1966లో ఆరుగురు విద్యార్థులు, ముగ్గురు ఉద్యోగులు.. మొత్తంగా తొమ్మిది మంది బలిదానం చేశారు. దీంతో నాడు ‘ఆంధ్రుల హక్కు – విశాఖ ఉక్కు’ అనే పిలుపుతో ఉద్యమం సాగింది. ఇవాళ మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాడు కాబట్టి ఉద్యమాలు, ప్రాణ త్యాగాల అవసరం లేకుండానే, ఆరు నెలలు తిరక్కుకుండానే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నాం.దేవుడి ఆశీర్వాదంతో మీ బిడ్డ మరిన్ని గొప్ప కార్యక్రమాలు చేయగలిగేలా అందరూ ఆశీర్వదించాలి’’ అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. అంతకు ముందు ఉదయం 11.48 గంటలకు ఉక్కు పరిశ్రమ శంకుస్థాపనకు సంబంధించిన పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం వేదికపై వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ సీఎం ఎస్బీ అంజద్‌బాష, జిల్లా ఇన్చార్జ్ మంత్రి ఆదిమూలపు సురేష్, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన కృష్ణదాస్, మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఎంపీలు వైఎస్ అవినాష్‌రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, విప్ కొరముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు డాక్టర్ సుధీర్‌రెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి, రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉక్కు కర్మాగారం శంకుస్థాపన సందర్భంగా జరిగిన బహిరంగ సభకు హాజరైన జనవాహినిలో ఒక భాగం. ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి -
కడప జిల్లా: పలు అభివృద్ధి కార్యక్రమాలలో వైఎస్ జగన్
-
మూడేళ్లలో నిర్మాణం పూర్తి చేస్తాం
-
ఇది నా జీవితంలో మరిచిపోలేని రోజు
సాక్షి, వైఎస్సార్ : జిల్లాలో ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేయడం తన జీవితంలో మరచిపోలేని రోజని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఈ ఉక్కు కర్మాగారాన్ని మూడేళ్లలో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. సోమవారం జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో కడప ఉక్కు కర్మాగారానికి సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ.. ‘జిల్లాకు స్టీల్ ప్లాంటు రావాలని.. అభివృద్ధి బాటలో పరుగులు పెట్టాలని చాలా ఏళ్లుగా అనుకున్నాం. నాన్నగారి హయాంలో జిల్లా అబివృద్ధికి బీజాలు పడ్డాయి. కానీ ఆయన చనిపోయిన తరువాత జిల్లా అభివృద్ధిని పట్టించుకునేవారే లేకుండా పోయారు. సరిగ్గా ఎన్నికలకు ఆరు నెలల ముందు ఒక పెద్ద మనిషి వచ్చి టెంకాయ కొట్టాడు. ఐదేళ్లు పాలించడానికి ప్రజలు అధికారమిస్తే.. నాలుగేళ్లు ఏమి చేయకుండా ఎన్నికలకు ఆరు నెలల ముందు టెంకాయ కొడితే మోసం అంటారు. అదే అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే టెంకాయ కొడితే చిత్తశుద్ధి అంటారు. పాలనలో తేడాను ప్రజలు గమనించాలి. ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక, పరోక్షంగా 25వేల మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి నెలకొంటుంది. అక్షరాల రూ. 15 వేలకోట్ల రూపాయలతో పునాదిరాయి వేశాం. స్టీల్ ప్లాంట్‌కు కావాల్సిన ఐరన్ ఓర్ కోసం ఎన్ఎండీసీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంద’ని తెలిపారు. అంతకముందు, దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్టు అయిన కడప ఉక్కు కర్మాగారానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారు. రూ.15 వేల కోట్ల పెట్టుబడి అంచనాతో వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె వద్ద ఈ కర్మాగారాన్ని నిర్మిస్తున్నారు. ఏడాదికి 30 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు చేయనున్న ఈ కర్మాగారానికి రాష్ట్ర ప్రభుత్వం సున్నపురాళ్లపల్లి, పెదనందలూరు గ్రామాల్లో 3,275.66 ఎకరాలను కేటాయించింది. ఈ కర్మాగారానికి గండికోట రిజర్వాయర్ నుంచి 2 టీఎంసీల నీటిని సరఫరా చేయనున్నారు. -
రేపు కడప స్టీల్ ప్లాంట్‌కు సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన
-
వైఎస్సార్ జిల్లాలో సీఎం జగన్ మూడు రోజుల పర్యటన
-
ఈ నెల 23న సీఎం వైఎస్ జగన్ కడప జిల్లా పర్యటన
-
వైఎస్సార్ జిల్లాలో సీఎం జగన్ మూడు రోజుల పర్యటన
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు రోజుల పాటు వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 23వ తేదీ నుంచి 25 వరకూ ఆయన జిల్లాలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. తొలి రోజు సోమవారం స్టీల్ ప్లాంట్‌కు పునాది రాయి వేయనున్నారు. అలాగే పులివెందుల, జమ్మలమడుగు, మైదుకూరు, కడప, రాయచోటి ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. మరోవైపు జిల్లాలో సీఎం పర్యటనపై పోలీసులు అప్రమత్తం అయ్యారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లి వద్ద స్టీల్‌ప్లాంట్ కర్మాగారానికి శంకుస్థాపన చేయనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం జగన్ ఆరు నెలల్లోనే శంకుస్థాపన చేస్తున్నారు.ఇప్పటికే 3200 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అలాగే 2 టీఎంసీల నీటిని కేటాయించగా, మరోవైపు స్టీల్‌ప్లాంట్‌కు కావాల్సిన ఐరన్ ఓర్ కేటాయిస్తూ ఎన్‌ఎమ్‌డీసీతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. త్వరలోనే అధికారులు పనులు కూడా ప్రారంభించనున్నారు. సీఎం జగన్ పర్యటన షెడ్యూల్ 23.12.2019 (సోమవారం) ఉదయం 9.20 – కడపలో రైల్వే ఓవర్‌బ్రిడ్జి ప్రారంభం 9.55 గంటలకు – రిమ్స్‌లో వివిధ అభివృద్ది పనులకు శంకుస్ధాపన 10.30 గంటలకు– వైఎస్సార్ ఉచిత భోజన వసతి భవనం ప్రారంభం 11.50 – జమ్ములమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో ఏపీ హైగ్రేడ్ స్టీల్స్‌కు సీఎం శంకుస్ధాపన, అనంతరం బహిరంగసభ మధ్యాహ్నం 2.15 గంటలకు – దువ్వూరు మండలం నేలటూరు వద్ద మైదుకూరు, బద్వేలు నియోజకవర్గాలకు సంబంధించిన అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్ధాపన, అనంతరం బహిరంగసభలో ప్రసంగిస్తారు సాయంత్రం 5 గంటలకు ఇడుపులపాయ చేరిక 24.12.2019 (మంగళవారం) ఉదయం 9.05 గంటలకు – ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్‌కు చేరిక 9.10 – దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌కు నివాళి 2.00 – రాయచోటి సభాస్ధలికి ముఖ్యమంత్రి చేరుకుంటారు 2.15 – వివిధ అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్ధాపన, అనంతరం బహిరంగసభ 5.00 – పులివెందుల భాకరాపురంలోని నివాసానికి చేరుకోనున్న సీఎం 25.12.2019 (బుధవారం) ఉదయం 9.20 – క్రిస్మస్ సందర్భంగా పులివెందుల సీఎస్ఐ చర్చిలో ప్రార్థనలు 11.15 – పులివెందుల జూనియర్ కళాశాల మైదానంలో పలు అభివృద్ది పనులకు శంకుస్ధాపన, వైఎస్సార్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభం 3.10 – కడప ఎయిర్పోర్ట్ నుంచి గన్నవరం బయలుదేరుతారు. -
నెరవేరిన ఉక్కు సంకల్పం
-
కడప ఉక్కు కర్మాగారం.. మరో కీలక అడుగు
సాక్షి, అమరావతి: కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటులో మరో కీలక అడుగు పడింది. ముడి ఇనుము సరఫరా విషయంలో జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్ఎండీసీ)తో ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ ఒప్పందం కుదుర్చుకుంది. బుధవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ సీఎండీ పి.మధుసూదన్, ఎన్ఎండీసీ ప్రతినిధి అలోక్ కుమార్ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఇది చరిత్రాత్మక ఒప్పందమని ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ అభివర్ణించారు. ఈ ఒప్పందం ప్రకారం ఎన్ఎండీసీ ఏటా 5 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజాన్ని సరఫరా చేయనుంది. ఉక్కు ఉత్పత్తి ఖర్చు తగ్గించే చర్యల్లో భాగంగా తొలివిడతలో కర్మాగారానికి సమీపంలో ఉన్న గనుల నుంచే ముడి ఇనుము సరఫరా చేయనున్నట్లు ఎన్ఎండీసీ అధికారులు తెలిపారు. కాగా, సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వైఎస్ జగన్.. ఉక్కు కర్మాగారానికి ఎన్ఎండీసీ నుంచి ఇనుప ఖనిజం సరఫరా కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లి, పెదనందలూరు గ్రామాల్లో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయడానికి ఈ నెల చివరి వారంలో సీఎం శంకుస్థాపన చేయనున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఇప్పటికే ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ కార్పొరేషన్‌కు 3,295 ఎకరాలను కేటాయించారు. నిర్మాణాన్ని సాధ్యమైనంత వేగంగా పూర్తి చేస్తామని, మూడేళ్లలో ఉక్కు ఫ్యాక్టరీ ఉత్పత్తి ప్రారంభిస్తుందని సీఎం గతంలో ప్రకటించారు. కార్యక్రమంలో ఏపీఐఐసీ చైర్పర్సన్ ఆర్కే రోజా, అధికారులు పాల్గొన్నారు. 8,000 మందికి ఉపాధి ఎన్ఎండీసీతో ఒప్పందం కుదరడంపై మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా 8,000 మందికి, పరోక్షంగా 10,000 మందికి ఉపాధి లభించనుందని ట్వీట్ చేశారు. -
కడప స్టీల్ ప్లాంట్‌కు ఐరన్ ఓర్ సరఫరాపై ఒప్పందం
-
ఈ ఒప్పందం చరిత్రాత్మకం: సీఎం జగన్
సాక్షి,తాడేపల్లి: మరో చారిత్రాత్మక ఒప్పందానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందడుగు వేసింది. కడప స్టీల్ ప్లాంట్‌కు ఐరన్ ఓర్ సరఫరాపై ఎన్ఎండీసీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పదం కుదరింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఎన్ఎండీసీ డైరెక్టర్ (కమర్షియల్) అలోక్‌కుమార్ మెహతా, ఏపీ హైగ్రేడ్ స్టీల్ లిమిటెడ్ సీఎండీ పీ.మధుసూదన్ పత్రాలపై సంతకాలు చేశారు. అనంతరం దీనిపై సీఎం సంతోషం వ్యక్తం చేశారు. ఎన్ఎండీసీతో ఒప్పందం చరిత్రాత్మకం అన్నారు. కాగా తాజా అంగీకారంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కళ సాకారం కానుంది. కడప స్టీల్ ప్లాంట్‌కు సీఎం జగన్ త్వరలోనే శంకుస్థాపన చేయనున్నారు. దీని కోసం ఇప్పటికే అధికారులు ఏర్పాటు ముమ్మరం చేసినట్లు సమాచారం. -
కడప స్టీల్ ప్లాంట్‌కు 23 లేదా 24న సీఎం శంకుస్థాపన
సాక్షి, అమరావతి: రాయలసీమ ప్రజల చిరకాల స్వప్నమైన కడప ఉక్కు కర్మాగారానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 23 లేదా 24వ తేదీన శంకుస్థాపన చేయనున్నారు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లి, పెద్దదండ్లూరు గ్రామాల పరిధిలో ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో ఈ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక కంపెనీని ఏర్పాటు చేసి.. రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ భార్గవ, మైనింగ్ శాఖ కార్యదర్శి కె.రాంగోపాల్‌లను డైరెక్టర్లుగా నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన సమయంలో కడపలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తామని కేంద్రం హామీ ఇవ్వడం తెలిసిందే. అయితే ఐదేళ్లు గడిచినా అది కార్యరూపం దాల్చకపోవడం తెలిసిందే. కాగా రాష్ట్రానికి భారీ పరిశ్రమలను తీసుకు రావడం ద్వారా స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తామని తమ మేనిఫెస్టోలో పేర్కొన్న వైఎస్ జగన్.. ఇందులో భాగంగా కడప ఉక్కు కర్మాగారం నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఈ దిశగా దృఢచిత్తంతో ముందుకు సాగుతున్నారు. స్టీల్‌ప్లాంట్ కోసం బడ్జెట్లో రూ.250 కోట్లు కేటాయించడమేగాక దీనికి అవసరమైన ముడి ఇనుమును సరఫరా చేసేలా ఎన్ఎండీసీతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. ఈ నేపథ్యంలో కడప స్టీల్ ప్లాంట్ కోసం తక్షణం రూ.62 కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ యూనిట్ ఏర్పాటుకు సేకరించిన 3,295 ఎకరాలను చదును చేసి అభివృద్ధి చేయడం, డీపీఆర్ నివేదిక, ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్‌కు మూలధనం.. కోసం ఈ మొత్తాన్ని వ్యయం చేయనున్నారు. నెలాఖరుకు డీపీఆర్.. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర నివేదికను తయారుచేసే బాధ్యతను మెకాన్ సంస్థకు అప్పగించినట్టు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ భార్గవ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెలాఖరుకు నివేదిక వస్తుందని పేర్కొన్నారు. ఈ యూనిట్‌కు అవసరమైన నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చామన్నారు. పీపీపీ విధానంలో కంపెనీ ఏర్పాటు చేయడానికి వివిధ సంస్థలతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు. ఒకవేళ ప్రతిపాదిత పీపీపీ ప్రాజెక్టు కార్యరూపం దాల్చకపోతే రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా యూనిట్‌ను ఏర్పాటు చేస్తుందని స్పష్టం చేశారు. -
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి : వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్ జిల్లా వాసుల చిరకాల స్వప్పమైన స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లి - పెద్దనందులూరు పంచాయతీల మధ్య ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు అనుమతిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 26న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేయనున్నారు. 2013 కంపెనీల చట్టం ప్రకారం ఈ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ పేరిట ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయనున్నారు. వంద శాతం పెట్టుబడులను రాష్ట్ర ప్రభుత్వమే పెడుతుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. స్టీల్‌ప్లాంట్ నిర్మాణం కోసం 2019-20 బడ్జెట్లో రూ. 250కోట్లను కేటాయించారు. ఇబ్రహీంపట్నంలోని ఇన్‌క్యాప్ కార్యాలయాన్ని ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ రిజిస్టర్ కార్యాలయంగా పేర్కొన్న ప్రభుత్వం.. పరిశ్రమశాఖ ముఖ్య కార్యదర్శి రజత్ భార్గవ, గనుల శాఖ కార్యదర్శి కె.రామ్ గోపాల్‌ను డైరెక్టర్లుగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. -
‘కడప స్టీల్ ప్లాంట్‌కు వైఎస్సార్ పేరు’
ఢిల్లీ: కడప జిల్లాలో డిసెంబర్ మాసంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయబోతున్నారని.. దీనికి కేంద్ర ఉక్కుశాఖ మంత్రి సానుకూలంగా స్పందించటం సంతోషమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ బలశౌరి అన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా ఎంపీ సోమవారం లోక్‌సభలో కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు గురించి ప్రశ్నించారు. దీనిపై కేంద్ర ఉక్కుశాఖ మంత్రి స్పదిస్తూ.. కడపలో స్టీల్ ప్లాంటు ఏర్పాటు చేయడానికి అన్ని విధాల సహకరిస్తామని తెలిపారు. ముడి ఇనుము దీర్ఘకాలికంగా సరఫరా చేసేందుకు ఒప్పందం చేసుకుంటామని పేర్కొన్నారు. త్వరలో కడపలో ఏర్పాటు కాబోయే స్టీల్ ప్లాంట్‌కు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు పెట్టాలని ఎంపీ బాలశౌరి కోరారు. జస్టిస్ ఫర్ దిశ అత్యాచార ఘటన అందరిని తలదించుకునేలా ఉందన్నారు. ఆ ఘటనకు పాల్పడిన మానవ మృగాలను శిక్షించటంలో ఆలస్యం చేయవద్దని చెప్పారు. ఇలాంటి ఘటనలకు పాల్పడకుండా ఉండేలా కఠిన శిక్షలు విధించాలని ఎంపీ తెలిపారు. అవసరమైతే చట్టంలో మార్పులు తీసుకురావాలన్నారు. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు తెలుపుతుందని పేర్కొన్నారు. సుజనా చౌదరి, కన్నా లక్ష్మీనారాయణ చిల్లర పనులు మానుకోవాలని ఎంపీ హెచ్చరించారు. తిరుపతి వెబ్సైట్లో లేనిపోని అంశాలను వారే సృష్టించి అన్యమత ప్రచారం పేరిట దుష్ప్రచారనికి దిగుతున్నారని ఎంపీ బాలశౌరి మండిపడ్డారు. -
నాన్న బాటలో... ఉక్కు సంకల్పం
నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి.. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి హోదాలో స్టీల్‌ప్లాంట్ నిర్మాణాన్ని తలపెట్టారు. పారిశ్రామిక వేత్త గాలి జనార్దన్‌రెడ్డిని ఇందుకోసం ఒప్పించి 2007 జూన్ 7న శంకుస్థాపన చేశారు. 10,670 ఎకరాలను కేటాయించారు. విమానాశ్రయానికి మూడువేల ఎకరాలు కేటాయించారు. రూ.20వేల కోట్లతో పది బిలియన్ టన్నుల సామర్థ్యంతో ప్లాంటును ప్రతిపాదించారు. నేడు వైఎస్జగన్మోహన్రెడ్డి... కేంద్ర ప్రభుత్వం నిర్మించకపోతే అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోపే తమ ప్రభుత్వమే స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేస్తుందని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. జూలై 8న జమ్మలమడుగులో జరిగిన రైతు సభలో డిసెంబర్ 26న శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం ఆయన నేతృత్వంలోని ప్రభుత్వ కేబినెట్ ఇందుకు ఆమోద ముద్ర వేసింది. సాక్షి, జమ్మలమడుగు: పుష్కరకాలం తర్వాత జిల్లావాసుల చిరకాల వాంఛ నెరవేరనుంది. ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు వచ్చేనెలలో పునాది రాయి పడనుంది. ఎన్నో ఆటంకాలను అధిగమించి దృఢమైన సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డిసెంబరు 26న శంకుస్థాపన చేయనున్నారు. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె– పెద్దదండ్లూరు పంచాయతీల మధ్య కర్మాగారం ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ ఉక్కు సంకల్పానికి జిల్లా ప్రజలు హర్షాతిరేకం వ్యక్తంచేస్తున్నారు. పన్నెండేళ్ల క్రితం దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అంబవరం పంచాయతీలో చిటిమిటి చింతలలో శంకుస్థాపన చేసిన విషయం విదితమే. ఆయన మరణానంతరం పాలకులెవరూ దీని గురించి పట్టించుకోలేదు. టీడీపీ ఎన్నికల ముందు కంటితుడుపుగా శంకుస్థాపన చేసి గాలికొదిలేసింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి తన తండ్రి వైఎస్సార్ మాదిరిగా ఇచ్చిన మాట నెరవేర్చుకుంటున్నారు. ఈ ప్రాంతంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు బలంగా అడుగులు వేస్తున్నారు. విలేకరులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి విభజన హామీ విస్మరణ రాష్ట్ర విభజన సందర్భంగా ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తామని నాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. తర్వాత వచ్చిన బీజేపీ ప్రభుత్వం గాని రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం గాని ఈ హామీని పూర్తిగా విస్మరించాయి. మైలవరం మండలం కంబాలదిన్నెలో ఎన్నికల ముందు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు మొక్కుబడిగా శంకుస్థాపన చేతులు దులుపుకొన్నారు. కనీసం భూమిని కూడా కేటాయంచలేదు. ఒక్క రూపాయి బడ్జెట్ కేటాయించలేదు. అన్ని సానుకూలంగా: కర్మాగారానికి సున్నపురాళ్లు–పెద్దదండ్లూరు మధ్య ప్రాంతం అనువైనదని ప్రభుత్వం భావించింది. ఇక్కడ దాదాపు 90శాతంపైగా ప్రభుత్వ భూములున్నాయి.డీకేటీ భూములు కూడా ఉన్నాయి. సమీపంలోనే ఆర్టీపీ పీ ఉంది. దక్షిణ కాలువతో పాటు ఆర్టీపీపీ పైప్‌లైన్, సమీపంలోనే రైల్వే లైన్ కూడా ఉన్నా యి. ఫలితంగా ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, జమ్మలమడుగు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. స్టీల్‌ప్లాంటుకు ప్రభుత్వం 3200 ఎకరాల భూమిని కేటాయించింది. అలాగే ఏపీ హైగ్రేడ్ స్టీల్కార్పొరేషన్ను ఏర్పాటు చేసింది. గతంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ సీఎండీగా పనిచేసి రిటైరైన మధుసూధన్‌రెడ్డిని ఈ సంస్థ అధికారిగా నియమించింది. రెండు రోజుల్లో భూమిని సర్వే చేసి డిసెంబరు 26న శంకుస్థాపనకు సిద్ధం చేయనున్నారు. ఉక్కు భూముల పరిశీలన జమ్మలమడుగు రూరల్: స్టీల్‌ప్లాంట్ కోసం ప్రభుత్వం కేటాయించిన భూములను జిల్లా కలెక్టర్ హరికిరణ్, ఎమ్మెల్యే డాక్టర్‌మూలే సుధీర్‌రెడ్డిలు గురువారం పరిశీలించారు. మండల పరిధిలోని సుగుమంచిపల్లె–పెద్దదండ్లూరు గ్రామాల మధ్య 3200 ఎకరాలను కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం బుధవారం ప్రకటించిన సంగతి తెలిసందే. ఈనేపథ్యంలో జిల్లా అధికారులు, పలువురు వైఎస్సార్సీపీ నాయకులు భూములను పరిశీలించారు. సున్నపురాళ్లపల్లె నుంచి కన్యతీర్థం సమీప ప్రాంతం నుంచి కోసినేపల్లి రహదారి వరకు గల భూములను పరిశీలించారు. ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ హరికిరణ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రెండు నెలలుగా రెండుమూడు చోట్ల భూములను పరిశీలించడం జరిగిందన్నారు. ప్రభుత్వ భూమి ఎక్కువగా ఉండటంతో పాటు సమీపంలో ధర్మల్ పవర్ ప్రాజెక్టు, రైల్వే ట్రాక్ , నీటి వసతులు ఉన్నందున సున్నపురాళ్లపల్లి– పెద్దదండ్లూరు పంచాయతీల మధ్య ఏర్పాటుకు అంగీకరించిందన్నారు. ఇక్కడి పనులను ఏపీ హైగ్రేడ్ స్టీల్ కార్పొరేషన్ సంస్థకు అప్పగిస్తామన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ మూలే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ జూలైలో జరిగిన రైతు సభలో డిసెబర్ 26వతేదిన స్టీల్ ప్లాంటుకు శంకుస్థాపన చేస్తామని ప్రకటించడం సంతోషకరమన్నారు. ముఖ్యమంత్రికి జమ్మలమడుగువాసులపై ఎనలేని ప్రేమ ఉందన్నారు. స్టీల్ఫ్లాంట్ నిర్మాణం జరిగితే జమ్మలమడుగుతో పాటు, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల మున్సిపాలిటీలతో పాటు చుట్టుపక్కల గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతాయన్నారు. వారి వెంట ఆర్డీఓ వి,నాగన్న, తహసీల్దార్ మధుసూధన్‌రెడ్డి, సర్వేయర్లు వైఎస్సార్సీపీ నాయకులు, ఇతర అధికారులు ఉన్నారు. -
ఉక్కు ఒప్పందం!
సాక్షి, అమరావతి : వైఎస్సార్ జిల్లా కడపలో నిర్మించే స్టీల్ ప్లాంట్‌కు జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్ఎండీసీ) నుంచి ఇనుప ఖనిజం సరఫరాకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈమేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన విజ్ఞప్తి పట్ల కేంద్ర పెట్రోలియం, సహజవాయువు, ఉక్కు, గనుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సానుకూలంగా స్పందించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, ఎన్ఎండీసీ మధ్య త్వరలో ఒప్పందం కుదరనుంది. శుక్రవారం సచివాలయంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు, ఉక్కుశాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సమావేశమయ్యారు. ఆయా శాఖలకు సంబంధించి పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలను తీసుకున్నారు. రాష్ట్రానికి పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. వచ్చే ఐదేళ్లలో ఏపీకి పెట్రోలియం, సహజవాయువులు, ఉక్కు రంగాల్లో రూ.2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రానున్నాయని, తద్వారా రాష్ట్ర ఆదాయం పెరగడంతో పాటు పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలిపారు. ఈ భేటీలో ముఖ్యాంశాలు ఇవీ... 16,554 మత్స్యకార కుటుంబాలకు రూ.81 కోట్లు తూర్పు గోదావరి జిల్లా పోలవరం మండలం భైరవపాలెంలో జీఎస్పీసీ లిమిటెడ్ చేపట్టిన ఆఫ్ షోర్ డ్రిల్లింగ్ వల్ల 16,554 మత్స్యకార కుటుంబాలకు చెల్లించాల్సిన రూ.81 కోట్ల పరిహారం పెండింగ్‌లో ఉందని, దీన్ని వెంటనే మంజూరు చేయాలని అధికారులు విజ్ఞప్తిచేశారు. ఈ పరిహారం చెల్లించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి ప్రధాన్ ఓఎన్జీసీ అధికారులను ఆదేశించారు. సీఎస్ఆర్ నిధులు ఇచ్చేందుకు ఓకే చమురు, గ్యాస్ కంపెనీలు ఏపీలో తమ టర్నోవర్‌కు తగినట్టుగా కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద నిధులు ఇవ్వాలన్న విజ్ఞప్తిపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో ఆయా కంపెనీల టర్నోవర్ మేరకు సీఎస్ఆర్ నిధులు ఇచ్చేలా చూస్తామని చెప్పారు. రాయల్టీలో వాటా ఇవ్వాలని వినతి చమురు, గ్యాస్ వెలికితీత కంపెనీలు చెల్లిస్తున్న రాయల్టీలో ఏపీకి వాటా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఆఫ్‌షోర్‌లో చమురు, గ్యాస్ వెలికితీత వల్ల పరిసర ప్రాంతాలపై కాలుష్య ప్రభావం పడుతోందని, తీర ప్రాంతాల్లో ప్రాసెసింగ్ ప్లాంట్ల వల్ల పర్యావరణ పరంగా క్లిష్ట పరిస్థితులు ఏర్పడుతున్నాయని, భారీ వాహనాల రాకపోకలతో రోడ్లు దెబ్బతింటున్నాయని, ప్రజలు, మత్స్యకారుల జీవనోపాధికి కూడా ఇబ్బంది తలెత్తుతోందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చింది. పెట్రో కాంప్లెక్స్‌కు ప్రణాళిక ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం క్రూడాయిల్ రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, కాకినాడలో దీన్ని నెలకొల్పేందుకు సత్వరమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. దీనిపై పెట్రోలియం శాఖ, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో అత్యున్నతస్థాయి సంయుక్త కమిటీని ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి ప్రదాన్ తెలిపారు. పెట్రో కాంప్లెక్స్ ఏర్పాటుకు తగిన ప్రణాళిక సిద్ధం చేస్తామని చెప్పారు. రెండు చోట్ల పెట్రోలియం ఎక్స్‌లెన్స్ కేంద్రాలు కాకినాడ, రాజమహేంద్రవరం ప్రాంతాల్లో పెట్రోలియం ఎక్స్‌లెన్స్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తామని «కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమావేశంలో హామీ ఇచ్చారు. సమస్యల పరిష్కారంపై కృతజ్ఞతలు పైపులైన్ల ఏర్పాటులో సమస్యలను తొలగించడంతోపాటు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారంపై ఓఎన్జీసీ, హెచ్‌పీసీఎల్ చైర్మన్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తూర్పు తీరంలో పెట్టుబడులకు ఆసక్తి దేశానికి తూర్పు తీరంలో ఉన్న ఏపీలో పెట్రో రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు ముందుకు వస్తున్నాయని ప్రధాన్ తెలిపారు. వచ్చే ఐదేళ్లలో పెట్రోలియం, సహజవాయువు, ఉక్కు రంగాలకు సంబంధించి దాదాపు రూ.2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రానున్నట్టు వెల్లడించారు. విశాఖలో విస్తరణ ప్రాజెక్టులు, కాకినాడలో పెట్రో కాంప్లెక్స్ ఏర్పాటు ద్వారా, కడపలో స్టీల్ ప్లాంట్ రూపంలో ఏపీకి భారీగా పెట్టుబడులు వస్తాయని ప్రధాన్ చెప్పారు. పరిశ్రమల ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా ఉందని ప్రశంసించారు. ఏది కావాలన్నా సమకూరుస్తాం.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. పరిశ్రమల ఏర్పాటు విషయంలో సానుకూల దృక్పథంతో ఉంటామని, ఏది కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. సమావేశంలో కేంద్ర ఉక్కుశాఖ కార్యదర్శి బినోయ్రాయ్, పెట్రోలియంశాఖ సంయుక్త కార్యదర్శి అమర్నాథ్, ఎన్ఎండీసీ సీఎండీ ఎన్.బైజేంద్రకుమార్, గెయిల్ సీఎండీ అశుతోష్ కర్ణాటక్, ఓఎన్జీసీ సీఎండీ శశిశంకర్, హెచ్‌పీసీఎల్ సీఎండీ ముఖేష్ కుమార్ సురానా, ఆర్ఐఎన్ఎల్ సీఎండీ పి.కె.రథ్ తదితరులు పాల్గొన్నారు. సచివాలయం వద్ద ఇన్చార్జ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్ కేంద్ర మంత్రి ప్రధాన్‌కు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. సమావేశం ముగిసిన తర్వాత కేంద్ర మంత్రి ప్రదాన్‌ను ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లిలోని తన నివాసంలో మెమెంటోతో సత్కరించి విందు ఇచ్చారు. ఎన్ఎండీసీతో త్వరలో ఎంవోయూ పునర్విభజన చట్టం ప్రకారం కడప స్టీల్‌ప్లాంట్‌ను కేంద్రం ఏర్పాటు చేయాల్సి ఉందని, దీనికోసం ప్రపంచ ప్రఖ్యాత ఉక్కు కంపెనీలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోందని సమావేశంలో అధికారులు వివరించారు. ప్లాంట్ నిర్వహణలో స్థిరత్వం సాధించేందుకు నిరంతరాయంగా ఇనుప ఖనిజాన్ని సరఫరా చేయాలని కోరారు. దీనిపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వంతో ఎన్ఎండీసీ ఒప్పందం చేసుకుంటుందని చెప్పారు. ఈమేరకు త్వరలో ఎంఓయూ కుదుర్చుకోవాలని ఉక్కుశాఖ అధికారులను ఆదేశించారు. ఏపీ అభివృద్ధికి సహకరించండి కేంద్ర మంత్రి ప్రధాన్‌ను కోరిన గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కేంద్ర మంత్రి ధర్మేంద ప్రధాన్‌ను కోరారు. విభజనతో నష్టపోయిన ఏపీ అభివృద్ధికి సహకరించాలన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కేజీ బేసిన్, విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను సందర్శించాలని ఈ సందర్భంగా ఆయన గవర్నర్‌ను కోరారు. విశాఖలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం, ఎనర్జీ సంస్థలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై భేటీలో చర్చించారు. -
త్వరలో కడప స్టీల్ ప్లాంట్‌కు ఇనుప ఖనిజం
సాక్షి, అమరావతి : కడప స్టీల్ ప్లాంట్‌కు ఎన్ఎమ్డీసీ నుంచి ఇనుప ఖనిజం సరాఫరాకు అంగీకారం కుదిరింది. ఈ మేరకు త్వరలో ఎన్ఎమ్డీసీ, ఏపీ ప్రభుత్వం మద్య ఎంఓయూ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో కేంద్ర పెట్రోలియం, సహజవాయువు, ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం భేటీ అయ్యారు. ఈ భేటీలో వివిధ చమురు కంపెనీల ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను చర్చించి.. కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చమురు కంపెనీలకు రాష్ట్రంలో వనరుల ఆదాయాల మేరకు సీఎస్ఆర్ నిధులు చెల్లించాలని నిర్ణయించారు. తూర్పు గోదావరిలోని ముమ్మిడివరం ప్రాంతంలో మత్య్సకారులకు చెల్లించాల్సిన రూ. 81 కోట్లను త్వరలో చెల్లిస్తామని ఈ సందర్భంగా ఓఎన్జీసీ అంగీకరించింది. కాకినాడలో పెట్రోలియం కాంప్లెక్స్ ఏర్పాటుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో అత్యున్న స్థాయి కమిటీ ఏర్పాటు కానుంది. వచ్చే ఐదేళ్లలో ఏపీలో పెట్రోలియం, సహజవాయువు, ఉక్కు రంగాల నుంచి రూ. 2లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రానున్నాయి. అంతకుముందు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమావేశమయ్యారు అయ్యారు. ఆయనతో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను కేంద్ర మంత్రి ప్రస్తావించారు. -
ఉక్కు పరిశ్రమ స్థాపనకు కేంద్రం సిద్ధం
సాక్షి, వైఎస్సార్: జిల్లాలో ఉక్కు పరిశ్రమ స్థాపనకు కేంద్రం సిద్ధంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ స్పష్టం చేశారు. శనివారం జిల్లాలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో టీడీపీ ఉక్కు పరిశ్రమను రాజకీయంగా వాడుకుందని ఆరోపించారు. అందుకే అది కార్యరూపం దాల్చలేదని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం ఉక్కు ఫ్యాక్టరీ స్థాపనకు సిద్ధమైతే మా వంతు సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. వెనకబడిన ప్రాంతమైన రాయలసీమ అభివృద్ధి కోసం నాయకులతో చర్చించనున్నట్లు తెలిపారు. జిల్లాలో బీజేపీని బలోపేతం చేసే దిశగా ముందుకు సాగుతామన్నారు. జమిలి ఎన్నికలు వచ్చినా రాకపోయినా రాష్ట్రంలో వైసీపీకి ప్రధాన ప్రతిపక్షం బీజేపీనే అని పేర్కొన్నారు. -
‘హోదా’పై కేబినెట్ నిర్ణయాన్ని అమలుచేయాలి
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వర్తింపజేస్తూ 2014 మార్చిలో కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని అమలుచేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభా పక్షనేత పీవీ మిథున్‌రెడ్డి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఆర్థిక బిల్లుపై గురువారం లోక్‌సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కొత్త డిమాండ్ ఏమీ కాదు. 2014 మార్చిలో అప్పటి కేంద్ర కేబినెట్ ఏపీకి ప్రత్యేక హోదా వర్తింపజేయాలని నిర్ణయించింది. దానిని తక్షణం అమలుచేయాలని ప్రణాళిక సంఘానికి పంపింది. కానీ, గడిచిన ఐదేళ్లలో దీనిని అమలుచేయలేదు. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదాను ఆక్షేపించిందని సభలో పలుమార్లు చెప్పారు. కానీ, ఇది వాస్తవం కాదు. కేంద్రం ఒక్క సంతకంతో దానిని అమలుచేయవచ్చు. ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న పరిస్థితుల దృష్ట్యా ప్రత్యేక హోదా అవసరం. రాష్ట్రంలో అప్పులు పేరుకుపోయాయి. కేంద్రం స్పందించేందుకు ఇది సరైన సమయం. రెవెన్యూ లోటు రూ.63 వేల కోట్ల మేర ఉంది. రాజధాని లేకుండా, మౌలిక వసతలు లేకుండా ఉన్న రాష్ట్రం ఇంత మొత్తం రెవెన్యూ ఎలా భర్తీ చేసుకోగలదు? అనేక పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ, ఒకటి రెండే ప్రకటించారు. గడిచిన ఐదేళ్లలో ఏపీలో రూ.5 వేల కోట్లకు మించి పెట్టుబడులు రాలేదు. ఉద్యోగాల కోసం లక్షలాది మంది యువత ఎదురుచూస్తున్నారు. అందువల్ల ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి’.. అని మిథున్‌రెడ్డి వివరించారు. చట్టంలో హామీలు నెరవేర్చండి ‘ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో అనేక హామీలు పొందుపరిచారు. కడప స్టీలు ప్లాంటు గురించి బడ్జెట్లో ప్రస్తావనలేదు. వెనకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వాల్సి ఉండగా.. గడిచిన రెండేళ్లుగా ఇవ్వలేదు. బుందేల్‌ఖండ్ ప్రాంతానికి ఇచ్చిన ప్యాకేజీ తరహాలో ఆంధ్రప్రదేశ్‌కు ఇస్తామన్నారు. గడిచిన ఐదేళ్లలో మీరు పారిశ్రామిక రాయితీలు ఏమిచ్చారో తెలుసుకోవాలనుకుంటున్నాను. అలాగే, దుగరాజపట్నం పోర్టు ప్రస్తావనలేదు.. వైజాగ్–చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ లేదు.. మెట్రో రైలు పనులు ప్రారంభం కాలేదు.. ఆంధ్రప్రదేశ్‌ను ప్రత్యేకంగా చూడాల్సిన అవసరముంది’.. అని మిథున్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. కేంద్ర పన్నుల నుంచి రాష్ట్రాలకు వాటా లెక్కించే విషయంలో 15వ ఆర్థిక సంఘం 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుంటోందని, ఇది సరికాదని ఆయనన్నారు. -
చంద్రబాబు సినిమా సూపర్ డూపర్ ప్లాప్
-
చంద్రబాబు తాజా సినిమా ఫ్లాప్...
సాక్షి, కడప : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజా సినిమా ‘ఆరో బడ్జెట్’ ఫ్లాప్ అయిందంటూ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కడపలో వైఎస్సార్ సీపీ సమర శంఖారావం సభలో ఆయన గురువారం మాట్లాడుతూ... తనది కాని బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. తల్లికి అన్నం పెట్టనివాడు... చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట అంటూ వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. బడ్జెట్ మాత్రమే కాదని, అన్ని విషయాల్లో చంద్రబాబు రాష్ట్ర ప్రజలను మోసం చేశారన్నారు. కడప జిల్లా తమకు ఎంతో ఇచ్చిందన్న వైఎస్ జగన్...ఉక్కు ఫ్యాక్టరీ కట్టించే బాధ్యత తానే తీసుకుంటానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో శంకుస్థాపన చేసి, మూడేళ్లలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. (అధికారంలోకి రాగానే సీపీఎస్ రద్దు: వైఎస్ జగన్) వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ‘రాజధాని కట్టడు..కట్టినట్లు బిల్డప్ ఇస్తాడు. ఆటో డ్రైవర్లకు రూ.10వేలు ఇస్తానని పాదయాత్రలో చెప్పాను. దాన్నే చంద్రబాబు ఖాకీ చొక్కా వేసుకుని కాపీ కొట్టాడు. 2013లో బీసీల కోసం 119 హామీలు ఇచ్చాడు. అంతేకాకుండా బీసీ డిక్లరేషన్‌తో మోసం చేశాడు. 57 నెలలు కడుపు మాడ్చి... చివరి మూడు నెలలు అన్నం పెడతాననే వాడిని ఎలా నమ్మలి. చంద్రబాబును అన్న అనాలా? దున్నా అనాలా?’ అని ధ్వజమెత్తారు. (చంద్రబాబు కుయుక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి) -
టీడీపీ ప్రతిదానికీ రాజకీయం చేస్తోంది
-
‘ఓట్ల కోసమే శంకుస్థాపన చేశారు’
సాక్షి, అమరావతి: కడప స్టీల్ ప్లాంట్‌పై బుధవారం ఏపీ అసెంబ్లీలో టీడీపీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం జరిగింది. స్టీల్ ప్లాంట్ విషయంలో టీడీపీ ప్రభుత్వం కేంద్రంపై బురద జల్లుతోందని బీజేపీ శాసనసభ్యుడు విష్ణుకూమార్ రాజు మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ నిర్మాణ సాధ్యాసాధ్యలపై కేంద్ర ప్రభుత్వం గతంలో అనేకసార్లు వివరాలు అడిగితే రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని ఆయన గుర్తుచేశారు. ఎన్నికలు దగ్గరు పడుతుండటంతో ఓట్ల కోసమే సీఎం చంద్రబాబు నాయుడు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారని విమర్శించారు. టీడీపీ నేతల వ్యవహారం చూస్తుంటే విశాఖ రైల్వేజోన్ కూడా చంద్రబాబే ప్రకటించుకునేలా ఉన్నారని విష్ణుకూమార్ రాజు ఎద్దేవా చేశారు. -
తుక్కు రాజకీయం
-
కులాల పేరుతో పథకాలా...
-
‘శంకుస్థాపన రాళ్లతో పోలవరం కట్టొచ్చు’
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో గత నాలుగు రోజులుగా శంకుస్థాపనలు, శ్వేతపత్రాలతో బిజీ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబు చేసిన శంకుస్థాపనల రాళ్లతో పోలవరం ప్రాజెక్టు కట్టొచ్చునని వ్యాఖ్యాంచారు. పోలవరం, కడప స్టీల్ ప్లాంట్లను కేంద్ర ప్రభుత్వం చేపట్టేలా ఒత్తిడి తేవడంలో టీడీపీ ప్రభత్వం విఫలమైందని మండిపడ్డారు. పబ్లిసిటీ, గ్రాఫిక్స్ మాయలతో ప్రజల్ని ఆకర్షించేందుకు చంద్రబాబు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో శంకుస్థాపనల బాట పట్టారని ఎద్దేవా చేశారు. ‘గండికోటకు నీళ్లు రావడం వల్లనే కడపలో స్టీల్ ప్లాంట్ పెడుతున్నామని బాబు గతంలో వ్యాఖ్యానించారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి పాలనలోనే గండికోటకు నీళ్లొచ్చాయని విషయం బాబకు తెలియదా’ అని సూటిగా ప్రశ్నించారు. కులాల పేరుతో పథకాలా... ‘జేసీ దివాకర్ రెడ్డి కులం పేరుతో సభల్లో పిచ్చికూతలు కూస్తుంటే చంద్రబాబు నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. జగన్‌కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు. టీడీపీ మేనిఫెస్టోలో కులాల పేరుతో పథకాలు పెట్టింది చంద్రబాబు కాదా’ అని శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. ‘దివాకర్ రెడ్డి సంస్కారం మరిచి వైఎస్ జగన్ గురించి వ్యాఖ్యలు చేయడం దారుణం. వైఎస్ జగన్ వందల సభల్లో మాట్లాడినా ఏనాడు సంస్కారహీనంగా మాట్లాడలేదు. కులాల పేరుతో తిట్టించి లబ్ది పొందడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య. గతంలో మోత్కుపల్లి నర్సింహులు, నాగం జనార్దన్ రెడ్డిలను ఇలాగే ఉపయోగించుకున్నారు’ అని చంద్రబాబుపై విమర్శలు చేశారు. -
బాబు బడాయి..!
సాక్షి కడప : విక్రమార్కుడు సినిమాలో హీరో రవితేజ ఆడవాళ్లందరికీ అరగుండు కొట్టడం గుర్తింది కదా..అదే తరహాలో సీఎం చంద్రబాబు ప్రస్తుతం స్టీల్ ప్లాంటుకు శంఖుస్థాపన చేస్తున్నా..మళ్లీ నాకే అవకాశం ఇవ్వండి..లేకపోతే అభివృద్ధి ఆగిపోతుదంటూ చెప్పిన మాటలు అచ్చం సినిమాలోని అరగుండును గుర్తుకు తెచ్చాయి. అన్నీ నేనే చేశా..రాజకీయాలు చెప్పడం లేదు..రెండు నెలల్లో పనులు మొదలుపెట్టి...ఆరు నెలలకు కాంపౌండ్ కట్టి....రెండేళ్లకు పూర్తి చేస్తాం....అయితే అంతకుముందే వచ్చే 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఒకసారి ఆలోచించాలి..పనిచేసే వారినే ప్రోత్సహించండి.అన్నీ చేస్తున్నా...అభివృద్ధి ఏమిటో చూపిస్తున్నా....అటువంటప్పుడు అధికారంలోకి తీసుకు రావాల్సిన బాధ్యత మీదేనంటూ చంద్రబాబు తన మనసులో మాటను వెల్లడించారు. అభివృద్ధి పేరుతో రాయలసీమ స్టీల్ ప్లాంటుకు శంకుస్థాపన, భూమిపూజ చేసిన ఆయన అంతలోనే ఎన్నికల మాటెత్తడంపై అందరూ చర్చించుకోవడం కనిపించింది. ముందంతా అభివృద్ధి, సంక్షేమం అంటూ పెద్దపెద్ద మాటలు చెబుతూ వచ్చిన ప్రభుత్వాధినేత చివరకు స్టీల్ ప్లాంటు రహస్యం వెనుక ఉన్న మతలబు ఏమిటో అందరికీ ఇట్టే అర్థమైపోయింది. ఇదేనేమో బాబు బడాయి అంటూ పలువురు పెదవి విరవడం కనిపించింది. ఎన్నికల స్టంట్ టీడీపీ, బీజేపీల చెలిమి నాలుగేళ్లకుపైగా నిరాడంబరంగా కొనసాగినా..స్టీల్ ప్లాంటు విషయంలో అప్పట్లో పెద్దగా పోరాడిన పరిస్థితి లేదు. ఎప్పటికప్పుడు విభజన హామీలు...ప్రత్యేక హోదా, స్టీల్‌ప్లాంటుతోపాటు అనేక అంశాలు నెరవేర్చాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట సాగిస్తూనే ఉంది. అయితే ఎన్నికలు దగ్గరపడే వరకు పెద్దగా పట్టించుకోని సీఎం బాబుకు ఒక్కసారిగా స్టీల్‌ప్లాంటు గుర్తుకు రావడం ఎన్నికల స్టంట్ తప్ప వేరే కాదని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే జూన్‌లో ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవిల దీక్షల సందర్భంగా ప్రకటించిన బాబు తర్వాత ఆరు నెలలపాటు సాగదీశారు. తీరా ఎన్నికలు మరో మూడు నెలల్లో రాబోతున్నాయనగా ఇప్పటికిప్పుడు పునాది రాయి వేశారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే దీక్ష సందర్బంగా కేంద్రానికి అల్టిమేటం గడువు పూర్తయిన వెంటనే స్టీల్‌ప్లాంటు పనులకు శ్రీకారం చుట్టాల్సి ఉంది. కానీ ఇంతవరకు పట్టించుకోకుండా ఇప్పుడు మొదలుపెట్టి నెలరోజుల్లో భూసేకరణ....రెండు నెలల్లో పనులు ప్రారంభం....ఆరు నెలలకు కాంపౌండ్ వాల్, రెండేళ్లకు పరిశ్రమ పూర్తి చేస్తామంటూ చెబుతున్న బాబు మాటలపై జిల్లా వాసులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అధికారంపై బాబు మాట గ్రామాల రూపురేఖలు మార్చే సిమెంటు రోడ్డు వేశా.. రుణమాఫీ చేశా..... అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వేయించా..ఇళ్లు కట్టించా..తాగు, సాగునీరు అందిందా..ప్రజలకు ఏం కావాలన్నా అన్నీ చేశా....ఇంకేం కావాలి..? పనిచేసే వారిని ప్రోత్సహించాలి...ఆరు నెలల్లో ఎన్నికలు వస్తాయి....అభివృద్ధి చేసే పార్టీకే పట్టం కట్టాలి. తటస్థులందరూ ఆలోచన చేయండి...స్టీల్ ప్లాంటుకు రూపకల్పన చేశా..రెండేళ్లలో పూర్తి చేస్తా....గతంలోనూ జిల్లాలో మా వాళ్లకు అవకాశం ఇవ్వలేదు...ఇన్ని చేస్తున్నా 2019 ఎన్నికల్లో టీడీపీ గెలవాలి...లేకపోతే మీరు చాలా నష్టపోతారు. 2004లో కాంగ్రెస్ గెలిచినా ఏం చేయలేదు. అదే నేను వచ్చి ఉంటే ఈ రాష్ట్రాన్ని ఎక్కడో నిలిపిండే వాడిని. 2014లో గెలువకపోయి ఉంటే ఈ రాష్ట్రం ఎన్ని ఇబ్బందులు పడేదో....ఇప్పటికైనా గుర్తించండి....అధికారాన్ని కట్టబెట్టడంటూ స్టీల్‌ప్లాంటుకు భూమిపూజ, పైలాన్, శిలాఫలాకాల ఆవిష్కరణ అనంతరం సభలో బాబు మాటలు అధికారంపై ఉన్న మమకా>రాన్ని స్పష్టం చేశాయి. స్టీల్ ప్లాంటు ఏర్పాటు చేస్తున్నట్లు చెబుతూనే అభివృద్ది పేరుతో పట్టం కట్టండని చెబుతున్న మాటలు విని పలువురు దీనికోసమేనా బాబు ఇంతలా సంక్షేమం అంటూ చెప్పుకొచ్చారని పలువురు చర్చించుకోవడం కనిపించింది. చెప్పిందే చెప్పి...జనాలు లేకున్నా చెబుతూ.... రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గంటా 15 నిమి షాలకు పైగా ప్రసంగంలో చెప్పిందే చెబుతూ...జనాలకు విసుగు పుట్టించారు. పదేపదే అడిగి మరీ చప్పట్లు కొట్టించుకోవడం....అంతంత మాత్రం గా స్పందన రావడం కనిపించింది. అంతేకాకుండా బాబు ప్రసంగం మొదలైన కొద్దిసేపటికే చెప్పిందే చెబుతుండడంతో వరుస పెట్టి ఇంటిదారి పట్టారు. గ్యాలరీలు ఖాళీ అయినా బాబు ప్రసంగాన్ని మాత్రం వదల్లేదు. దాదాపు గంటకు పైగా నిరంతరాయంగా చెబుతూనే ఉన్నారు. -
నెల రోజుల్లో మూడు వేల ఎకరాలు!
-
మరో ఎన్నికల డ్రామా!
సాక్షి, అమరావతి:కడప ఉక్కు కర్మాగారం నిర్మాణాన్ని రెండేళ్లలో పూర్తి చేస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనను మరో ఎన్నికల డ్రామాగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. నాలుగేళ్ల ఎనిమిది నెలలపాటు అధికారాన్ని అనుభవిస్తూ కడప ఉక్కు కర్మాగారం ఊసే ఎత్తని చంద్రబాబు ఇప్పుడు ఎన్నికలకు కేవలం మూడు నెలల ముందు, ఎన్నికల నోటిఫికేషన్ జారీకి నెలన్నర మాత్రమే సమయం ఉన్న సమయంలో ఆర్భాటంగా శంకుస్థాపన చేయడం ఓట్ల కోసం ప్రజలను మభ్యపెట్టడమేనని మేధావులు, రాజకీయ విశ్లేషకులు కుండబద్దలు కొడుతున్నారు. నిజంగా కడపలో స్టీల్ ప్లాంటు ఏర్పాటు చేయాలనే చిత్తశుద్ధి ముఖ్యమంత్రికి ఉంటే నాలుగేళ్ల క్రితమే శంకుస్థాపన చేసి ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసి ఉండేవారని రాయలసీమ వాసులు పేర్కొంటున్నారు. గనుల నిక్షేపాలేవీ? నిధులేవీ? ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం కడప స్టీల్‌ప్లాంట్‌ను కేంద్ర ప్రభుత్వమే నిర్మించాలి. ఈ దిశగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయించాల్సిన బాధ్యత తనపై ఉన్నప్పటికీ చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. టీడీపీ కేంద్ర ప్రభుత్వంలో నాలుగేళ్లపాటు భాగస్వామిగా ఉంటూ కేంద్రంలో మంత్రి పదవులను కూడా అనుభవిస్తూ స్టీల్‌ప్లాంట్ గురించి ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు. సొంత పనులు, పైరవీలు చేసుకుంటూ ఆస్తులు కూడబెట్టుకున్నారే గానీ వెనుకబడిన ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పించే కడప స్టీల్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేద్దామన్న ఆలోచనే చేయలేదు. ఇప్పటివరకూ ఈ కర్మాగారం కోసం ఇనుప ఖనిజ నిక్షేపాలనే కేటాయించలేదు. నిర్మాణానికి బడ్జెట్లో రూపాయి కూడా ఇవ్వలేదు. నీటి కేటాయింపుల గురించి ప్రస్తావించలేదు. చేయాల్సిన ఈ పనులేవీ చేయకుండా హడావుడిగా శంకుస్థాపన చేయడం అంటే ప్రజలను మభ్యపెట్టడం తప్ప మరేమీ కాదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆర్థిక సంస్థల నుంచి రుణం తీసుకోవాలన్నా సరిపడా గనులు, నీటి కేటాయింపులను చూపడం తప్పనిసరి వారు వివరిస్తున్నారు. 2017 నవంబర్ 12న దువ్వూరులో జరిగిన వైఎస్ జగన్ బహిరంగ సభ ప్రసంగం క్లిపింగ్ జగన్ ప్రకటించి ఏడాది దాటినా? కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోతే.. తమ ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోగా వైస్సార్ జిల్లాలో స్టీల్ ప్లాంటు నిర్మాణానికి శంకుస్థాపన చేసి, మూడేళ్లలో పూర్తి చేస్తామని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి 2017 నవంబరు 12న ప్రకటించారు. వైఎస్సార్ జిల్లా దువ్వూరులో జరిగిన బహిరంగ సభలో జగన్ ఈ హామీ ఇచ్చారు. ఇది జరిగి ఏడాది దాటినా చంద్రబాబు స్పందించలేదు. నిజంగా చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే అప్పుడైనా శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించి ఉండేవారు. అప్పుడు స్పందించకుండా తీరా ఇప్పుడు ఎన్నికలు ముంచుకొస్తుండడంతో చంద్రబాబు వైఎస్సార్ జిల్లాలో స్టీల్‌ప్లాంటు నిర్మాణానికి భూమి పూజ చేశారు. బాబు మోసం బట్టబయలు కడపలో స్టీల్ ప్లాంటు ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగిన సహకారం అందించలేదని, సమాచారం ఇవ్వలేదని కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ప్లాంటు నిర్వహణకు ఇనుప ఖనిజ నిక్షేపాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలపాలని టాస్క్ఫోర్సు కోరినా స్పందించలేదని కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టింది. దీంతో ఈ వ్యవహారంలో చంద్రబాబు సర్కారు కపట నాటకం బట్టబయలైంది. చంద్రబాబుకు నిజంగా వైఎస్సార్ జిల్లాలో స్టీల్ ప్లాంటు ఏర్పాటు కావడం ఇష్టం లేదని, కేవలం ఇప్పుడు ఓట్ల కోసం శంకుస్థాపన డ్రామా ఆడారని తేటతెల్లమవుతోంది. కేంద్ర ప్రభుత్వ టాస్క్ఫోర్సు కోరిన సమాచారం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదంటే చంద్రబాబు ఉద్దేశం ఏమిటో సులభంగా అర్థం చేసుకోవచ్చు. -
కీర్తి కిరీటంలో మరో శంకుస్థాపన రాయి
-
రెండేళ్లల్లో స్టీల్ ప్లాంట్ పూర్తి చేస్తాం
సాక్షి ప్రతినిధి కడప: ‘‘ఈరోజు రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు భూమిపూజ చేసుకున్నాం. మూడు నెలల్లోపు పనులు ప్రారంభించి, రెండేళ్లలోపు స్టీల్‌ప్లాంట్ నిర్మాణం పూర్తి చేస్తాం’’ అని సీఎం చంద్రబాబు అన్నారు. వైఎస్సార్ జిల్లా మైలవరం మండలం కంబాలదిన్నె వద్ద ఉక్కుఫ్యాక్టరీకోసం గురువారం ఉదయం 11.12 గంటలకు ఆయన భూమి పూజ చేశారు. అక్కడే ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం తోడుగా ఉంటుందని భావిస్తే మోసగించిందన్నారు. రాష్ట్ర విభజన చట్టంలోని అంశాల్ని అమలు చేయాలని కోరినా నిర్లక్ష్యం చేసిందన్నారు. విభజన చట్టంలో 6 నెలల్లోపు సెయిల్ నేతృత్వంలో విచారణ చేపట్టి కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి శ్రీకారం చుట్టాలని ఉంటే, 2014 నవంబర్‌లో ఉక్కు వయబులిటీ లేదని సెయిల్ రిపోర్టు ఇచ్చిందన్నారు. అయితే ఇక్కడ ఉక్కు ఫ్యాక్టరీ నిర్మిస్తే 18.9 శాతం ఆదాయం వస్తుందని మెకాన్ సంస్థ రిపోర్టు ఇచ్చిందని, అప్పటినుంచి ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలని కోరామని, వారడిగిన విషయాలన్నింటికీ ఓపిగ్గా 11సార్లు సమాధానం చెప్పామని, 2018 జూన్‌లో ప్రధానిమంత్రికి లేఖ కూడా రాశామని, అయినా కేంద్రం స్పందించలేదన్నారు. దీంతో కసి, బాధ, ఆవేదనతో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి సిద్ధమయ్యామన్నారు. ఎన్నికల ప్రచారంకోసం కాదు.... ఉక్కు ఫ్యాక్టరీ శంకుస్థాపన ఎన్నికల ప్రచారం కోసం కాదని సీఎం అన్నారు. తన సంకల్పం వేరని, దూరదృష్టితో వ్యవహరిస్తున్నామని చెప్పుకొచ్చారు. ‘‘మూడు నెలల్లో పనులు ప్రారంభిస్తాం. తొలివిడతలో రూ.18వేల కోట్లతో నిర్మిస్తాం. మరో ఐదేళ్లల్లో రూ.15 వేల కోట్లు వెచ్చిస్తాం. తొలివిడతగా 5వేల ఉద్యోగాలు, రెండోవిడతలో 5వేల ఉద్యోగాలొస్తాయి. పనులు ప్రారంభమైనప్పటినుంచి రెండేళ్లలోపు ఉక్కుఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి చేస్తాం’’ అని చెప్పారు. 2020 నాటికి ఓబుళాపురం ఐరన్ ఓర్ గనులు కోర్టు వివాదం ముగిసే వీలుందని, ఉక్కు ఫ్యాక్టరీకి కావాల్సిన ముడి ఖనిజం అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్మాణం తన భుజస్కంధాలపై ఉందన్నారు. ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణంతో కడప అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్రానికి సన్‌రైజ్ ఆంధ్రప్రదేశ్‌గా నామకరణం చేశానని, ఆ మేరకు అద్భుతమైన రాజధాని నిర్మిస్తున్నామని చెప్పారు. అప్పుల ఊబిలో ఉన్నా తెలంగాణ, తమిళనాడు, కేరళ కంటే ఎక్కువగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. ఇంత చేస్తున్నాం.. 2014లో టీడీపీ అధికారంలోకి రాకుంటే రాష్ట్రం పరిస్థితి ఏమిటో అంచనా వేయండి.. మీ తోడ్పాటు అవసరం అని ఆయన ప్రజానీకాన్ని కోరడం గమనార్హం. రాయలసీమను పరిశ్రమల గడ్డగా మారుస్తా.. రాయలసీమకు ఏమీ చేయలేదని కొంతమంది మాట్లాడుతున్నారని, గోదావరి–కృష్ణా నదులు పట్టిసీమ ద్వారా అనుసంధానం చేసి, కృష్ణా డెల్టా నీరు శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు తీసుకొచ్చామని సీఎం అన్నారు. ఎడారిని తలపించే అనంతపురం జిల్లాలో కియో మోటార్స్ ఏర్పాటు చేశామని, జనవరిలో రోడ్డుపైకి అనంతపురంలో తయారైన కారు రానుందని చెప్పారు. భవిష్యత్‌లో రాయలసీమ హార్టికల్చర్ హబ్ కానుందని, పరిశ్రమల గడ్డగా మారుస్తానని పేర్కొన్నారు. గోదావరి నీళ్లను సోమశిల, నాగార్జునసాగర్ రైట్ కెనాల్‌కు తీసుకెళ్లి, శ్రీశైలం నీటిని రాయలసీమకే ఉపయోగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు ఆదినారాయణరెడ్డి, సుజయ్‌కృష్ణ రంగారావు, ఎంపీ రమేష్‌నాయుడు, శాసనమండలి ప్రభుత్వ విప్ రామసుబ్బారెడ్డి, ఎమ్మెల్సీలు కత్తి నరసింహారెడ్డి, బీటెక్ రవి, ఎమ్మెల్యే జయరాములు, టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఆ ఘనత చంద్రబాబుకే దక్కుతుంది’
సాక్షి, వైఎస్సార్ కడప జిల్లా : దివంగత నేత వైఎస్సార్ హయాంలో పూర్తి చేసిన ప్రాజెక్టులను ప్రారంభిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు ఫొటోలకు ఫోజులు ఇచ్చారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, మేయర్ సురేష్ బాబు అన్నారు. దేశంలో ఇంత మోసం చేసిన నాయకుడు ఎక్కడా లేడని విమర్శించారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లాలో ఉక్కుపరిశ్రమకు ఇంతవరకు శంకుస్థాపన చేయలేదు... కానీ పరిశ్రమ పెట్టేసి ఉద్యోగాలు ఇచ్చినట్లు టీడీపీ నాయకులు అభినందన సభ పెట్టడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. నాలుగేళ్లుగా నిద్రపోయి ఎన్నికల సమయంలో ప్రజలను మభ్య పెట్టేందుకే స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కహానీ ముందుకు తెచ్చారని శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. గండికోట ప్రాజెక్టుకు కృష్ణా జలాలు అవసరం లేదని చంద్రబాబు గతంలో ఎన్నోసార్లు చెప్పారని గుర్తు చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు అనే నరకాసురుడు ప్రజలను పట్టి పీడిస్తున్నాడని, రాజకీయ స్వలాభం కోసం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన ఘనత ఆయనదేనని ఎద్దేవా చేశారు. ఎప్పుడు ఎవరిని మోసం చేయాలి, మభ్య పెట్టాలి అనే ఆలోచిస్తారా అంటూ చంద్రబాబును ప్రశ్నించారు. -
కడప స్టీల్ ప్లాంట్‌పై కేంద్ర ఉక్కుశాఖ సమీక్ష
సాక్షి, న్యూఢిల్లీ : కడప స్టీల్ ప్లాంట్ విషయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాగుడు మూతలు ఆడుతున్నాయి. అందుబాటులో ఉన్న ఇనుప ఖనిజం, మైనింగ్ లీజు వివరాలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదంటూ కేంద్ర ఉక్కు శాఖ మళ్లీ పాత పాటే పాడింది. కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై సమీక్ష నిర్వహించిన కేంద్ర ఉక్కుశాఖ సాంకేతిక నివేదిక ఇవ్వాలని మెకాన్ సంస్థను ఆదేశించింది. ఇప్పటికే మెకాన్ సంస్థ ముసాయిదా నివేదిక ఉక్కు శాఖకు అందేజేసింది. సాంకేతిక నివేదికపై వివిధ సంస్థలు కసరత్తు చేస్తున్నాయి. ఇనుప ఖనిజం నిల్వలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని కేంద్ర ఉక్కు శాఖ పేర్కొంది. మైనింగ్ లీజు, అందుబాటులో ఉన్న ఇనుప ఖనిజం వివరాలు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకోవాలని మెకాన్ సంస్థను ఆదేశించింది. ఆ వివరాల ఆధారంగానే సాధ్యాసాధ్యాల నివేదిక రిపోర్టు తయారు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ప్రభుత్వ, ప్రైవేటు , సంయుక్త భాగస్వామ్యం తదితర మార్గాల్లో పెట్టుబడి అంశాలను కూడా అధ్యయనం చేయాలని ఉక్కు శాఖ టాస్క్ ఫోర్స్‌కు ఆదేశాలు జారీ చేసింది. -
కేంద్ర మంత్రికి చేదు అనుభవం
సాక్షి, వైఎస్సార్: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలతో పాటు జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కోరుతూ... రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ నేతలు కడపలో ఆర్అండ్బీ అతిథి గృహం వద్ద కేంద్ర మంత్రి అనంత కుమార్ హెగ్డే కారును అడ్డుకున్నారు. జిల్లాలో ఉక్కు కర్మాగారంను వెంటనే ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆందోళకారులు మంత్రి కారును చుట్టుముట్టి విభజన సమయంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఆందోళనకు దిగారు. బీజేపీ, ఆర్సీపీ నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. కారును అడ్డుకున్న వారిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. -
మరో సరికొత్త నాటకానికి తెరలేపిన బాబు
సాక్షి, అమరావతి : కడప స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరో సరికొత్త నాటకానికి తెరలేపారు. అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల తర్వాత స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకై సాధ్యఅసాధ్యాలు పరిశీలించేందుకంటూ కమిటీ వేశారు. ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ కుటుంబరావు నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ కమిటీలో ఆరుగురు సభ్యులు ఉంటారు. స్టీల్ ఫ్యాక్టరీ విషయమై కేంద్ర ప్రభుత్వంతో ఈ కమిటీ చర్చించనుంది. గతంలో రెండు నెలల్లోనే స్టీల్ ప్లాంట్ అంటూ హామీలు ఇచ్చిన చంద్రబాబు.. తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు, కాలాయాపన చేసేందుకే కమిటీ అంటూ డ్రామాలాడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ప్రభుత్వాల మెడలు వంచాలంటే.. యువత ముందుకు రావాలి
రైల్వేకోడూరు అర్బన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి ప్రత్యేకహోదా, కడప జిల్లాకు ఉక్కుపరిశ్రమ సాధించాలంటే యువత పోరాటాలను ఉధృతం చేయాలని అఖిలపక్షం నాయకులు పిలుపునిచ్చారు. ఈనెల 25న ఆయా నియోజకవర్గాల్లో చేపట్టిన మానవహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ బుధవారం జీపుజాతాను ప్రారంభించారు. రాష్ట్రానికి విభజన హామీలు, ప్రత్యేకహోదా, కడపకు ఉక్కు పరిశ్రమ సాధనకు ఏపీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జీపుజాతా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య మాట్లాడుతూ విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి ఇవ్వాల్సిన ప్రత్యేకహోదా, పరిశ్రమలు, విద్యాసంస్థలు, నిధులు ఇవ్వకుండా నాలుగేళ్లుగా కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేసిందన్నారు. అలాగే చంద్రబాబు ఇంటికో జాబు అని ప్రజలను మోసం చేసి బామ్మర్దికి ఎమ్మెల్యే, కొడుకుకు మంత్రి ఉద్యోగాలు ఇప్పించారని విమర్శించారు. కేంద్రం నాడు కడపలో ఉక్కుపరిశ్రమ నెలకొల్పుతామని హామీ ఇచ్చి నేడు కుదరదని చెప్పడం దారుణమన్నారు. తిరుపతిలో వెంకన్న సాక్షిగా ప్రత్యేకహోదా 15 ఏళ్లు ఇస్తామని చెప్పి నేడు నయవంచన చేస్తే ప్రజలు సహించరని పేర్కొన్నారు. అలాంటి పార్టీలకు ప్రజలు బుద్ధి చెబుతారని విద్యార్ధులు తెలి పారు. విభజన సమయంలో కేంద్రం పార్లమెంటులో ఇచ్చిన హామీలను రాబట్టుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమై, నేడు రాజకీయ లబ్ధి కోసం ఎన్నికల ముందు బయటకు వచ్చి పోరా టాలు, దీక్షలంటూ నాటకాలు ఆడుతోందని విమర్శించారు. అనంతరం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు.సీపీఐ నాయకులు రాధాకృష్ణ, జయచంద్ర, చెన్నయ్య, సీపీఏం రాష్ట్ర నాయకులు బీ నారాయణ, సీఐటీయూ జిల్లా కార్యవర్గ సభ్యుడు సీహెచ్ చంద్రశేఖర్, వైఎస్సార్సీపీ నాయకులు గుంటిమడుగు సుధాకర్‌రాజు, సీహెచ్ రమేష్, మందల నాగేంద్ర, తల్లెం భరత్‌కుమార్‌రెడ్డి, నందాబాల, సులోచన, సుదర్శనరాజు, చల్లా రాజశేఖర్, తుమ్మల అనిల్‌రెడ్డి, కాజా అహ్మతుల్లా, రమనాథరెడ్డి, కిషోర్,జనసేన నాయకులు తాతంశెట్టి నాగేంద్ర, ముత్యాల కిషోర్, కాంగ్రెస్ నాయకులు జయప్రకాష్ నారాయన వర్మ, జైబీమ్ తుమ్మల సురేష్, విద్యార్ధి నాయకులు రాజశేఖర్, బండారు మల్లి, పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు. -
ఆ చేతులను నరకడమే బాబు నైజం
సాక్షి, విశాఖపట్నం : సాయం చేసిన చేతులను నరకడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నైజమని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ మండిపడ్డారు. గురువారం విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన బాబుపై నిప్పులు చెరిగారు. గత ఎన్నికల్లో చంద్రబాబు జనసేన, బీజేపీ కాళ్లు పట్టుకొని అధికారంలోకి వచ్చారని, నాలుగేళ్లు కలిసిఉన్న అనంతరం విమర్శలు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. కడప స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం పోర్టు రావడం చంద్రబాబుకు ఇష్టం లేదని అందుకే వాటి గురించి ఇంకా సమాచారం ఇవ్వలేదని విమర్శించారు. ఉక్కు ఫ్యాక్టరీ అంశాన్ని చంద్రబాబు రాజకీయంగా వాడుకుంటున్నరని మండిపడ్డారు. కడప ఉక్కు గురించి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటి వరకూ నిర్వాసితుల వివరాలతో పాటు ఇతర సమాచారం ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఫీజబిలిటీ లేదని సెయిల్ చెప్పినా, రాయలసీమ వెనుకబడిన ప్రాంతం కావడంతో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి కేంద్రం అంగీకరించిందన్నారు. టీడీపీ ప్రతీ అంశాన్ని రాజకీయం చేయడానికి యత్నిస్తోందంటూ ఆయన మండిపడ్డారు. 2019 ఎన్నికల్లో ప్రజలకు చెప్పడానికి కొత్తగా హామీలు లేవని, అన్నీ 2014 ఎన్నికల్లోనే ఇచ్చి ప్రజలను మోసం చేశారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు కేంద్రంను నిందించడమే మేనిఫెస్టోగా సీఎం పనిచేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో విపరీతమైన అవినితి జరుగుతోందని కన్నా ఆరోపించారు. పోలవరం పనుల్లో అక్రమాలు జరుగుతున్నాయని నిర్వాసిత గిరిజనులు ఆరోపించారని.. తప్పుడు పత్రాలు, రికార్డులు సృష్టించి భూములను లాక్కున్నారని విమర్శించారు. విశాఖ రైల్వే జోన్‌ను కూడా కేంద్రం ఇస్తుందని దానికి ఇంకా సమయం ఉందని తెలిపారు. ఏపీ అభివృద్ధి ధ్యేయంగా కేంద్రం నిధులు విడుదల చేస్తోందని అన్నారు. కానీ చంద్రబాబు మాత్రం అన్యాయం చేస్తున్నారంటూ బీజేపీ, కేంద్రంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో ఏపీ ప్రజలను ఓటు అడిగే హక్కు కేవలం బీజేపీ కి మాత్రమే ఉందని కన్నా అన్నారు. -
వెన్నుపోటు పొడవడం చంద్రబాబు సహజగుణం
-
కడప ఉక్కుపై టీడీపీ డ్రామాలు
-
కొండను తవ్వి ఎలుకను పట్టారు!
సాక్షి ప్రతినిధి, కడప: వరుసగా మంత్రుల ప్రకటనలు టీడీపీ నాయకుల ప్రసంగాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు కడప ఉక్కుపైన స్పష్టత ఇస్తారని ఆశించారు. కాగా కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా దీక్షలకు ముగింపు పలికారు. నాలుగేళ్లు ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి కట్టుబడి ఉన్నాం. జిల్లా ఉన్నతికి కృషి చేయనున్నామంటూ గతంలో జిల్లాలో పర్యటించిన 23 సార్లు ఇదే విషయం చెప్పుకొచ్చారు. శనివారం సాయంత్రం కూడా నిర్ధిష్టమైన స్పష్టత ప్రభుత్వ ఉత్తర్వులుంటాయని ఆశించిన వారి ఆశలు అడియాశలే అయ్యాయి. ఇదివరకే మెకాన్ సంస్థ నేతృత్వంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామని బీజేపీ నాయకులు ప్రకటించారు. తాజాగా కేంద్ర ప్రభుత్వానికి 2నెలలు గడువు అంటూ సీఎం చంద్రబాబు ప్రకటించారు. తర్వాతైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్మిస్తుందా అంటే అదీ లేదు, నాలుగైదు మార్గాలున్నాయి, అన్వేషిస్తామని.. సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫడవిట్ దాఖలు చేసిందంటూ తెలుగుదేశం పార్టీ ఉద్యమబాట పట్టింది. నాలుగేళ్లుగా కలిసి కాపురం చేసిన టీడీపీకి అకస్మాత్తుగా విభజన చట్టంలోని అంశాలు గుర్తుకు వచ్చాయి. లేడికి లేచిందే పరుగు అన్నట్లుగా రాజకీయ పార్టీల ఉద్యమాలతో నిమిత్తం లేకుండా కార్యాచరణ రూపొందించింది. రాజకీయ ప్రయోజనాలు మినహా ప్రజాప్రయోజనాలు కాదని గుర్తిం చిన వామపక్షపార్టీలు, కాంగ్రెస్, వైఎస్సార్సీపీ, జనసేన పార్టీలు టీడీపీ తీరును ఎండగట్టాయి. కడప ఉక్కు ఆంధ్రుల హక్కుగా ఉద్యమాలు చేసిన రాజకీయ పక్షాలను అవమానపర్చిన టీడీపీ ముందుగా బహిరంగ క్షమాపణ కోరి ఆపై ఉద్యమ కార్యచరణ చేపట్టింటే ప్రజలు కాస్తోకూస్తో అభిమానించే వారని విశ్లేషకులు అభిప్రాయపడుతోన్నారు. వక్రభాష్యం పలకడంలో టీడీపీ ముందంజ.. ‘తాము చేస్తే ఒప్పు..ఎదుటోళ్లు చేస్తే తప్పు’ అన్న ధోరణిని టీడీపీ ఎప్పుడూ ప్రదర్శిస్తూనే ఉంటుందని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. ఉక్కు ఉద్యమం చేపట్టిన అఖిలపక్షం వినతి పత్రం స్వీకరించేందుకు కూడా ముఖ్యమంత్రి అంగీకరించని పరిస్థితి. ఎయిర్‌పోర్టులో 2నిమిషాలు సమయం కేటాయించాలని కోరినా తిరస్కరించి, పోలీసులను ఉసిగొల్పారు. పైగా ఉద్యమకారులందరినీ వైఎస్సార్సీపీ వర్గీయులుగా చిత్రీకరించారు. అప్పట్లో బీజేపీ నాయకత్వంలోని ఏన్డీయే భాగస్వామ్యపక్షంలో టీడీపీ కూడా ఉండడమే అసలు కారణం. ఇక్కడ ఉద్యమాలు చేస్తే వస్తే ప్రయోజనం ఏమిటంటూ పోలీసుల ద్వారా వాటిని నీరుగార్చేవారని పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు. తాజాగా శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు కడపలో సీఎం రమేష్ దీక్షలో ప్రసంగిస్తూ కొన్ని రాజకీయ పార్టీలు నిన్ననే బంద్ చేపట్టాయి. ఇక్కడ బంద్ చేస్తే వచ్చే ప్రయోజనం ఏమిటంటూ ప్రశ్నించారు. మరి రమేష్ కడప కేంద్రంగా ఆమరణదీక్ష చేపట్టడం వెనుక మతలబు ఏమిటని పలువురు నిలదీస్తున్నారు. మంత్రుల పరేడ్..ఎంపీల హల్చల్.... జిల్లా కేంద్రమైన కడప జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణంలో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆమరణ దీక్షకు మంత్రుల పరేడ్ నిర్వహించారు. దీక్ష చేపట్టినప్పటి నుంచి ప్రతిరోజు వీఐపీల తాకిడి అధికంగా ఉంది. మంత్రులు, ఎంపీలు,ప్రముఖులు దీక్షాశిబిరం సందర్శించేలా ప్రణాళిక రచించారు.ఎవరు ఎప్పుడు హాజరు కావాలి, ఎవరి ప్రసంగం ఎలా ఉండాలి అన్న విషయం సీఎంఓ ఆదేశాల మేరకు జిల్లాలో ఆచరించారు. ఉక్కు దీక్ష చేపట్టిన టీడీపీ కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి ఉద్యమించాల్సి ఉండగా ప్రతిపక్ష వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్నే అధికంగా టార్గెట్ చేశారు.రమేష్ దీక్షకు సంఘీభావం ప్రకటించి హాజరైన మంత్రులు ప్రతి ఒక్కరూ ప్రతిపక్షనేతనే విమర్శించడాన్ని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. 22 మంది రాష్ట్ర మంత్రులు, 15మంది ఎంపీలు పర్యటించడం మొత్తం వ్యవహారం పక్కా ప్రణాళికబద్ధంగా చేపట్టారని విశ్లేషకులు వివరిస్తున్నారు. 11రోజుల దీక్షాపరుడు గంటలో డిశ్చార్జి...!? 11రోజులు తిండి లేకుండా ఆమరణదీక్ష చేపట్టిన రాజ్యసభ సభ్యుడు రమేష్ రిమ్స్‌లో గంటలోపు చికిత్సల అనంతరం డిశ్చార్జి అయ్యారు. శనివారం సాయంత్రం 3.35 గంటలకు ఆస్పత్రిలో చేరిన ఆయన, 4.20 డిశ్చార్జి అయ్యారు. 11రోజులుపాటు ఆమరణదీక్ష చేపట్టిన వ్యక్తి గంటలోపే ఆస్పత్రిలో ట్రీట్మెంట్ చేయించుకొని హుషారుగా ఇంటికి వెళ్లడంపై వైద్యవర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ‘రాజ్యసభ సభ్యుడు రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆమరణదీక్ష ఓ బూటకం’ అనేందుకు అనేక కారణాలు బలపడుతున్నాయి. బీటెక్ రవి షుగర్ పేషేంట్, తొలిరోజు సాయంత్రానికే తీవ్రంగా నీరసించిపోయారు. అలాంటి వ్యక్తి 7రోజులు దీక్షను కొనసాగించారు. షుగర్ పేపేంట్ వరుసగా మూడు రోజులు ఏమి తినకుండా ఉంటే కోమాకు వెళ్తారని వైద్యులు వివరిస్తున్నారు. అలాగే రమేష్ బ్లడ్ రిపోర్టు పరిశీలిస్తే అనేక ఆసక్తికర విషయాలు తెరపైకి వస్తున్నాయి. మూడోరోజు నుంచి ఐదోరోజు వరకు ఆయన బరువులో ఒక గ్రాము కూడా తేడా కన్పించలేదు. ఏమి తినకుండా నీరు మాత్రమే తాగుతూ ఆమరణదీక్ష చేపట్టే వ్యక్తి బరువులో వ్యత్యాసం లేకపోవడం ఆయన చేపట్టిన దీక్ష ప్రశ్నార్థకంగా నిలుస్తోంది. బ్లడ్ షుగర్ తగ్గిపోవాల్సి ఉండగా మధ్యలో పెరుగుతూ రావడాన్ని వైద్యులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సీఎం నిమ్మరసం ఇచ్చి రమేష్ దీక్ష విరమింపజేయగా మాట్లాడే పరిస్థితిలో లేనంటూ మైకు తీసుకున్న ఆయన దాదాపు ఏడున్నర్ర నిమిషాలు ప్రసంగించారు. ఆపై రిమ్స్‌కు వెళ్లిన ఆయన 45 నిమిషాలకే డిశ్చార్జి అయ్యారు. 7రోజులు దీక్ష అనంతరం ఎమ్మెల్సీ బీటెక్ రవిని ఆస్పత్రికి తరలించగా నాలుగురోజులు చికిత్స పొందారు.దీనిని బట్టి వీరి దీక్ష ఏస్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చుని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. ఉక్కు పరిశ్రమ నెలకొల్పడం ఎలా ఉన్నా పట్టులేని జిల్లాలో రాజకీయంగా పట్టుసాధించడమే లక్ష్యంగా కొనసాగిందని విశ్లేషకులు వెల్లడిస్తుండడం విశేషం. కడప దశ మారుస్తా! సాక్షి, కడప : రాయలసీమలోనే అత్యంత వెనుకబడిన కడపజిల్లా దశ మారుస్తా నని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం జిల్లా పరిషత్ సమావేశ మందిరం వద్ద ఉక్కు దీక్షలో ఉన్న రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవిలను పరామర్శించిన అనంతరం సీఎం మాట్లాడుతూ తలసరిఆదాయంలో రాష్ట్రం దూసుకుపోతోందని, 2022 నాటికి దేశంలోనే రాష్ట్రం నంబర్ వన్‌గా నిలుస్తుందని పునరుద్ఘాటించారు.కేంద్రంపై ఉక్కు కోసం పోరాటం సాగిస్తానని...తాడోపేడో తేల్చుకుంటానని తెలియజేశారు. చప్పట్లు కొట్టండి..హర్షాన్ని తెలియజేయండి.. సీఎం మాట్లాడుతూ అనేక సందర్భాల్లో రాష్ట్రానికి అన్నీ తానే చేసినట్లు చెప్పడంతో వదిలి పెట్టకుండా మీరు నమ్మినట్లయితే చప్పట్లు కొట్టండంటూ అడిగి కొట్టించుకోవడం కనిపించింది. సరిగా వినిపించడం లేదు....గట్టిగా వినిపించేలా కొట్టండి..జిల్లా నలుమూలలకు వినిపించాలన్నా పెద్దగా సభికుల నుంచి స్పందన లేదు. పదేపదే హర్షం ప్రకటించాలంటూ సీఎం స్థాయిలో అడిగి ఆమోదం తెలుపమని కోరడం కనిపించింది. ఉక్కు పరిశ్రమ నెలకొల్పొతాం...మీరు నమ్ముతున్నారా అంటూ జనాలను అడిగినపుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉక్కు పరిశ్రమతోపాటు టీడీపీ నేతల దీక్ష.. ధర్మపోరాటమంటూ ఊకదంపుడు ఉపన్యాసం చేస్తున్న బాబుకు పలుమార్లు ప్రత్యేక హైకోర్టు నినాదం వినిపించింది. సభలో బాబు మాట్లాడుతున్న సందర్భలో పలువురు న్యాయవాదులు సీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు. ఉక్కు దీక్షలో కనిపించని వరద టీడీపీ మైలేజ్‌కోసం చేపట్టిన ఉక్కు దీక్షలో మాజీమంత్రి వరదరాజులరెడ్డి కనిపించలేదు. దీక్షకు వారంరోజుల ముందే సీఎం రమేష్‌పై విమర్శల వర్షం కురిపించిన మాజీ ఎమ్మెల్యే అదే పట్టుదలతో హాజరు కాలేదు. 11 రోజులపాటు దీక్ష చేసినా ఏ ఒక్క రోజూ సంఘీభావం తెలుపడానికి రాలేదు. సీఎం వచ్చినా ఎయిర్ పోర్టు వద్ద కలిసి మాట్లాడిన వరద అనంతరం వెళ్లిపోయారు.జిల్లాలోని పులివెందుల, ప్రొద్దుటూరు, మైదకూరు, కడప, కమలాపురం తదితర ప్రాంతాల నుంచి జనాలను భారీగా తరలించారు. డ్వాక్రా మహిళలతోపాటు పార్టీ కార్యకర్తలను ప్రత్యేక బస్సుల ద్వారా తీసుకొచ్చారు. వారికి ఇక్కడ స్థలం లేకపోవడంతో అగచాట్లు పడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈనెల 30న జిల్లాకు వస్తున్నారు. ఆమరణ దీక్ష చేస్తున్న రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌కు సంఘీభావం ప్రకటించనున్నారు. ముఖ్యమంత్రి తెలివైన నాయకుడు ఎప్పుడు ఏమి చేయాలో అది చేస్తాడు. ఉక్కు పరిశ్రమకు సంబంధించి కీలక ప్రకటన చేస్తారు. –మార్కెటింగ్‌శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి. కేంద్ర ప్రభుత్వం విభజన హామీలు అమలు చేయకుండా తాత్సారం చేసింది. హక్కుగా వచ్చిన అంశాలను కూడా అమలు చేయలేదు. రమేష్ చేపట్టిన ఆమరణదీక్ష సందర్శనకు ముఖ్యమంత్రి రానున్నారు. ఉక్కు పరిశ్రమపై స్పష్టమైన ప్రకటన చేయనున్నారు. –మంత్రులు నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి. -
‘ఉక్కు’ బాధ్యత నాదే
సాక్షి ప్రతినిధి, కడప: కడపకు ఉక్కు పరిశ్రమ తెచ్చే బాధ్యత తనదేనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ వైఎస్సార్ జిల్లా కేంద్రం కడపలో ఉక్కు పరిశ్రమ కోసం నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. శనివారం కడపకు వచ్చిన ముఖ్యమంత్రి రమేష్ దీక్షకు సంఘీభావం ప్రకటించి ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. నిమ్మరసం ఇచ్చిన ఆయన దీక్షను విరమింపజేశారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ విభజన చట్టంలోని అంశాలను అమలు చేయకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నాటకాలు ఆడుతోం దని మండిపడ్డారు. 6 నెలల్లో పరిశీలించి ప్లాంట్ నిర్మాణం చేపట్టాలని విభజన చట్టంలో ఆదేశాలున్నా యన్నారు. ఇప్పుడేమో ఫీజుబులిటీ లేదంటూ కేంద్ర ప్రభుత్వం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిందని ధ్వజమెత్తారు. కడపలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పేందుకు భూమి, నీరు, ఐరన్‌వోర్ ఇలా అన్నీ తగినన్ని అందుబాటులో ఉన్నాయన్నారు. ముద్దనూరులో థర్మల్ పవర్ ఫ్లాంట్, 15 కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారి, కృష్ణపట్నం పోర్టు చేరుకునేందుకు 15కిలోమీటర్ల దూరంలోనే రైల్వేలైన్ ఉందన్నారు. ఇన్ని వసతులున్న ఈ ప్రాంతం కాకుండా ఏ ప్రాంతం అనుకూలమైనదో చూపాలని సీఎం సవాల్ చేశారు. కేంద్రం దిగిరాకపోతే దించుతామని సీఎం హెచ్చరించారు. కేంద్రం అహంభావంతో ఉందని, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం రాయలసీమ, ఉత్తరాంధ్ర పరిధిలోని 7 జిల్లాలకు రూ.50కోట్లు నిధులు కేటాయించి కూడా వెనక్కి తీసుకుందన్నారు. వెనుకబడిన జిల్లా ఉన్నతి కోసం ఉక్కు పరిశ్రమ ఎందుకు స్థాపించరని సిఎం నిలదీశారు. కేంద్రం నాటకాలు ఆడుతోంది.... రెండేళ్లల్లో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తానని ఇటీవల గాలి జనార్దన్‌రెడ్డి ప్రటించారని, గతంలో ఆయన ఉక్కు ఫ్యాక్టరీ ముసుగులో దోపిడీకి పాల్పడ్డారని సీఎం ఆరోపించారు. బీజేపీ నాటకాలు ఆడుతోందని, ఇంతకాలం సెయిల్ నేతృత్వంలో ఫ్యాక్టరీ పెడితే గాలి జనార్దన్‌రెడ్డికి డబ్బులు రావనే పక్కదారి పట్టించారని ఆరోపించారు. కొన్ని రాజకీయ పార్టీలు నిన్ననే బంద్ చేశాయని, వారు కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేయాలన్నారు. కేంద్రం వైఎస్ జగన్మోహన్రెడ్డి, పవన్‌కళ్యాణ్‌ను పక్కన పెట్టుకొని నాటకాలు ఆడుతోందని పేర్కొన్నారు. వెంకటేశ్వరస్వామితో ఆడుకుంటారు, నగలన్నీ లెక్కల ప్రకారం ఉన్నాయంటే పింక్ డైమెండ్ లేదంటారు. పూజారీతో చెప్పిస్తారు.. దానికి జగన్మోహన్రెడ్డి, పవన్‌కళ్యాణ్ వంతపాడుతారని సీఎం ఆరోపించారు. 25 ఎంపీ సీట్లు అప్పగించండి.... రాష్ట్రంలోని మొత్తం 25 ఎంపీ సీట్లను అప్పగించండి.. బీజేపీ ఎందుకు దిగిరాదో చూద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. అన్ని స్థానాలు వస్తే కేంద్రంలో మన ప్రభుత్వమే వస్తుందని, లేదన్నా ఏ ప్రభుత్వం ఉన్నా మనకే ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. జిల్లాను ఆదుకోవాలని ప్రత్యేక శ్రద్ద పెట్టానని, కుప్పం కంటే ముందుగా పులివెందులకు నీరు ఇస్తానని చెప్పి మాట నిలుపుకున్నానని వెల్లడించారు. ఉక్కు ఫాక్టరీకి అన్నీ సమకూర్చుతాం కేంద్ర ప్రభుత్వానికి చెబుతున్నా.. ఉక్కు పరిశ్రమపై రెండు నెలల్లో నిర్ణయం తీసుకోండి.. మీరు ఫ్యాక్టరీ పెడతామంటే సహకరిస్తాం. కావాల్సిన భూ వసతులు సమకూరుస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. లేదంటే 50:50శాతం వాటాతో నిర్మించేందుకు తాము సిద్ధమన్నారు. మరోమార్గం కూడా ఉందని, అదే మనకు మనమే స్టీల్ ఫ్లాంట్ ఏర్పాటు చేసుకోవడమన్నారు. అయితే దీనికి మేజర్ మినరల్స్ నిబంధనలు అడ్డుగా నిలుస్తున్నాయన్నారు. వాటిని సవరించాల్సింది కూడా కేంద్ర ప్రభుత్వమేనని సీఎం తెలిపారు. అనంతరం రమేష్‌కు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరవింపజేశారు. ఆయనతో పాటు దీక్ష చేపట్టిన ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆస్పత్రిలో నాలుగు రోజులుగా దీక్ష కొనసాగిస్తున్నారని, ఆయనను కూడా విరమింపజేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. కాగా గత నెల 26న పోలీసులు బీటెక్ రవి దీక్షను భగ్నం చేసి ఆస్పత్రికి తరలించగా ఆయన ఇప్పటికీ దీక్షలో ఉన్నట్లు సీఎం ప్రకటించడంతో అంతా విస్తుపోయారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి నారా లోకేష్, ఉన్నత విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, జిల్లా మంత్రి ఆదినారాయణరెడ్డి, టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్‌యాదవ్, ఎమ్మెల్యేలు జయరాములు, మేడా మల్లికార్జునరెడ్డి, శ్రావణ్‌కుమార్, ఎమ్మెల్సీ దొరబాబు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ఆర్ జిల్లా వ్యాప్తంగా హోరెత్తిన ఉక్కు ఉద్యమం
-
టీడీపీ, బీజేపీ పాపపరిహారం చేసుకోవాలి
సాక్షి, కడప : కడప ఉక్కు - రాయలసీమ హక్కు అంటూ వైఎస్సార్ జిల్లా నినదించింది. కరువు సీమ అభివృద్ధి చెందాలంటే ఉక్కు పరిశ్రమ ఒక్కటే దారని జిల్లా ప్రజానీకం ఆకాంక్షింది. నాయకుల కుట్రలకు బలైన రాయలసీమకు న్యాయం చేయాలంటూ యువత ఉద్యమ బాట పట్టారు. విభజన చట్టంలో ఇచ్చిన ఉక్కు పరిశ్రమను స్థాపించాల్సిందేనని జిల్లా ప్రజానీకం ముక్తకంఠంతో డిమాండ్ చేసింది. తమ హక్కులను సాధించుకోవడానికి అఖిల పక్షం పిలుపునిచ్చిన నేపథ్యంలో శుక్రవారం తెల్లవారు జామున నాలుగు గంటల నుంచే జిల్లా వ్యాప్తంగా ప్రజలు, ప్రజాప్రతినిధులు బంద్‌లో పాల్గొన్నారు. కడప ఉక్కు పరిశ్రమ విషయంలో ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణికి నిరసనగా శుక్రవారం వైఎస్ఆర్సీపీ, వామపక్షాలు సంయుక్తంగా జిల్లా బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. పూటకో మాట మాట్లాడుతున్న టీడీపీ.. : బంద్ సందర్బంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ, టీడీపీలకు గుణపాఠం చెప్పేందుకు బంద్ చేపట్టామని అన్నారు. విభజన హామీలను బీజేపీ విస్మరించిందని ఆయన ధ్వజమెత్తారు. ఇరుపార్టీలకు సెగ తగిలేలా ఉక్కు ఉద్యమం చేపట్టామని పేర్కొన్నారు. బీజేపీ, టీడీపీలు ఒకరిపై మరొకరు నిందలు వేసుకొని కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ నేతలకు ఉక్కు పరిశ్రమపై చిత్తశుద్ధి లేదని, అందుకే పూటకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రజల్లో పరిశ్రమపై బలమైన ఆకాంక్ష ఉందని, అందుకే బంద్‌కు అందరూ సహకరిస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఇప్పటికైనా పాపపరిహారం చేసుకోవాలి : జిల్లాకు ఉక్కు పరిశ్రమ ప్రకటించకపోవడంపై వామపక్ష నేతలు మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేసి పాపాలను మూటగట్టుకున్నాయని, ఉక్కు పరిశ్రమ స్థాపించి చేసిన పాపాలకు పరిహారం చేసుకోవాలని హితవు పలికారు. ప్రజాఉద్యమంలో టీడీపీ, బీజేపీలు కొట్టుకు పోతాయిని ధ్వజమెత్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంకుశత్వం విడిచి ప్రజల ఆకాంక్షల మేరకు నడుచు కోవాలంటూ సూచించారు. హామీలు అమలయ్యే వరకూ పోరాటం : విభజన చట్టంలోని హామీలు అమలయ్యే వరకూ వైఎస్సార్సీపీ అవిశ్రాంతంగా పోరాటం చేస్తుందని మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా యువత పెద్ద ఎత్తున పాల్గొని జిల్లాలో ఉక్కు పరిశ్రమ పెట్టాలనే ఆకాంక్షను బలంగా తెలియచేశారని అన్నారు. గత నాలుగేళ్లుగా విభజన చట్టం హమీల కోసం నాలుగేళ్లుగా వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుంటే.. టీడీపీ నేతలు మాత్రం చిత్తశుద్ధి లేని దీక్షలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. -
కడప బంద్ : హోరెత్తిన ఉక్కు నినాదం
సాక్షి, కడప : ఉక్కు ఉద్యమం హోరెత్తుతోంది. తెల్లవారు జామున నాలుగు గంటల నుంచే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు, అఖిలపక్ష నేతలు బంద్‌లో పాల్గొన్నారు. కడప ఉక్కు పరిశ్రమ విషయంలో ప్రభుత్వాల సాచివేత ధోరణికి నిరసనగా శుక్రవారం వైఎస్ఆర్సీపీ, వామపక్షాలు సంయుక్తంగా జిల్లా బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. బంద్ విజయవంతం చేయడం ద్వారా కేంద్రప్రభుత్వానికి ఉక్కు సెగ తగిలేలా చేస్తామని అఖిలపక్షం నాయకులు అన్నారు. బీజేపీ విభజన హామీలను విస్మరించినా గత నాలుగేళ్లుగా నోరు మెదపని టీడీపీ నేతలు తగుదనమ్మా అంటూ దీక్షలకు ఉపక్రమించడం రాజకీయ స్టంట్ అన్న విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అఖిలపక్ష నేతలు నిర్ణయించామన్నారు. మైదుకూరు : మైదుకూరులో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉక్కు పరిశ్రమ సాధనకై జిల్లా బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో వైఎస్సార్సీపీతో పాటు ఇతర అఖిలపక్ష నేతలు బంద్‌లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే రఘురామి రెడ్డి, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఇరంగం రెడ్డి, వామపక్ష నేతలు జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పులివెందుల : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పులివెందులలో ఉక్కు నినాదం హోరెత్తింది. విభజన చట్టంలో హామీల అమలను డిమాండ్ చేస్తూ ఎంపీ పదవులకు రాజీనామా చేసిన వైఎస్ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. బస్టాండ్ వద్ద బైఠాయించారు. అనంతరం అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. బద్వేలు : జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేస్తూ జిల్లా బంద్‌కు అఖిలపక్షం ఇచ్చిన పిలుపు మేరకు బద్వేలు నేతలు బంద్ నిర్వహించారు. బస్ డిపో ముందు బైఠాయించి బస్సులను అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు. ప్రజాసంఘాల నేతలు, విద్యార్థి సంఘాల నినాదాలతో బద్వేల్ హోరెత్తింది. ఈ మేరకు బస్సులు డిపోలకు పరిమితం అవ్వగా ప్రవేటు వాహనాలు కూడా బంద్‌కు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నాయి. రాయచోటి : అఖిలపక్షం పిలుపు మేరకు ఉక్కుసంకల్పం పేరుతో రాయచోటిలో బంద్ జరుగుతోంది. ఆర్టీసి డిపో ఎదుట వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పార్టీల నాయకులు భైఠాయించారు. బంద్ సందర్భంగా విద్యాసంస్థలు ఒక రోజు ముందే సెలవు ప్రకటించాయి. ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర నాయకుడు మదన్మోహన్ రేడ్డి, జిల్లా బీసీ ప్రధాన కార్యదర్శి విజయ భాస్కర్, సీపీఐ నాయకులు విశ్వనాథ్, వైఎస్సార్ మున్సిపల్ కౌన్సిలర్లు బంద్‌లో పాల్గోన్నారు. ఇందులో భాగంగా వైఎస్సార్సీపీ ఇతర నేతలు, కార్యకర్తలు సీపీఎం, సీపీఐ, జనసేన పార్టీ కార్యకర్తలు బంద్‌లో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. జమ్మలమడుగు : వైఎస్సార్సీపీ ఇంచార్జ్ సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నేతలు బంద్ నిర్వహించారు. వామపక్షాలు, జనసేనలు వైఎస్సార్సీసీ తలపెట్టిన బంద్‌కు మద్దతు తెలిపాయి. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు సీపీఎం, సీపీఐ, జనసేన పార్టీ కార్యకర్తలు బంద్‌లో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. రాజంపేట : ఆకేపాటి అమర్నాథ రెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్ష నేతలు బంద్ నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ, సీపీఐ, సీపీఎం, జనసేనలతో పాటు ఇతర విద్యార్ధి సంఘాల నేతలు నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రమేష్ దీక్ష నిజమైతే టీడీపీ బంద్‌లో ఎందుకు పాల్గొనడం లేదని అమర్ నాథ్ రెడ్డి ప్రశ్నించారు. కడప : ఆర్టీసీ బస్టాండ్ వద్ద అఖిలపక్ష నేతలు బంద్ నిర్వహించారు. తెల్లవారు జామున నాలుగు గంటలకే అన్ని పార్టీల నేతలు రోడ్డు మీదకు వచ్చారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేశారు. కడప మేయర్ సురేష్ బాబు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల అంజాద్ బాషా, సీపీఎం జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, జనసేన జిల్లా నాయకుడు రంజిత్ సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య నగర కార్యదర్శి వెంకట శివ పాల్గొన్నారు. -
బట్టబయలైన టీడీపీ ఎంపీల కపట దీక్ష
-
జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు
-
ఉక్కురాదు.. తుక్కురాదు : ఎంపీ జేసీ
సాక్షి, ఢిల్లీ : టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్కురాదు.. తుక్కురాదని నాకు తెలుసు.. ఆయనకు తెలుసని జేసీ అన్నారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదా కూడా రాదని ఎంపీ జోస్యం చెప్పారు. పప్పు బెల్లాలు చిలకరిస్తారు.. ఇవన్నీ కూడా వాస్తవాలని జేసీ పేర్కొన్నారు. ఈ విషయం నిరసన చేసే సీఎం రమేష్‌కు తెలుసు, నాకు తెలుసని చెప్పారు. ఇదంతా ప్రజలను ప్రేరేపించడానికి, ఎడ్యుకేట్ చేసేదానికి అని ఎంపీ జేసీ తనదైన శైలిలో తెలిపారు. నేడు కడప స్టీల్ ఫ్యాక్టరీ విషయమై టీడీపీ ఎంపీలు కేంద్ర ఉక్కుశాఖ మంత్రి బీరేంద్ర సింగ్‌ను కలిశారు. ‘ప్రస్తుతం మూడువేల ఎకరాలు అందుబాటులో ఉంది. మెకాన్ 18వందల ఎకరాలు కావాలని అని అడిగింది. ఆలస్యం చేయాలనే ఉద్దేశంతో 500 ఎకరాల ప్రైవేట్ భూమి కావాలంటున్నారు. ఎకరానికి రూ. 4 లక్షలు ఇస్తామని చెప్పాం.16కి.మీ రైల్వే లైన్ రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తాం. ఈ విషయంలో కేంద్రాన్ని ఇరుకున పెట్టాం. మేము విజయం సాధించలేదు. దొంగనాటకాలు, కుట్రలు జరుగుతున్నాయి. దీక్ష విరమించాలని మంత్రి ఫోన్ చేసి కోరారు. మరో 24గంటల్లో అవసరమైన సమాచారం ఇస్తామని’ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. -
టైం దగ్గర పడింది.. త్వరలోనే చరమగీతం
సాక్షి, విజయనగరం : కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ అశోక్ గజపతి రాజుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు నిప్పులు చెరిగారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన కడప ఉక్కు కోసం సంతకాల సేకరణ చేపట్టిన గజపతి రాజు, విభజన సమయంలో జిల్లాకు ఇచ్చిన హామీలపై ఎందుకు పోరాడటం లేదని ప్రశ్నించారు. జిల్లాకు గిరిజన విశ్వ విద్యాలయం ఇస్తామని చెప్పి మోసగించారని, యూనివర్సిటీ గిరజనుల హక్కు అని, వాటిపై పోరాడాలని అనిపించకపోవడం దురదృష్టకరమని అన్నారు. విభజన సమయంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తామని చెప్పారని, ఇప్పటి వరకూ అమలు కాలేదని ఈ విషయంపై అశోక్ గజపతి రాజు ఎందుకు పోరాటం చేయడం లేదని శ్రీనివాసరావు నిలదీశారు. విభజన చట్టంలో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని ఉందని, కేంద్రంలో భాగస్వామిగా ఉండి పదవులు అనుభవించిన ఎంపీ సంతకాల సేకరణ ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. జిల్లాకు లబ్ధి చేకూర్చే అంశాలను విస్మరించిన ఎంపీకి కడప ఉక్కు పరిశ్రమకై పోరాడే అర్హత లేదని విమర్శించారు. అమ్మకు అన్నం పెట్టని వాడు చిన్నమ్మకు గాజులు చేయిస్తానని చెప్పినట్లు, ఓటు వేసి గెలిపించిన జిల్లా ప్రజలకు న్యాయం చేయలేని అశోక్ గజపతి రాజు.. కడప ఉక్కు పరిశ్రమ కోస పోరాడటం హాస్యాస్పదంగా ఉందని శ్రీనివాసరావు తెలిన్నారు. టీడీపీ పాలనకు చరమ గీతం పాడే రోజు దగ్గరలోనే ఉందని, రానున్న ఎన్నికల్లో గజపతి రాజుకు ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. -
ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఉద్యమం ఉధృతం
-
స్టీల్ ప్లాంట్‌పై తామెందుకు రాయితీ ఇవ్వాలన్న లోకేశ్
-
చంద్రబాబును ఎవరూ నమ్మే పరిస్థితి లేదు
-
అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో స్టీల్‌ప్లాంట్
గసాక్షి ప్రతినిధి, కడప/జమ్మలమడుగు: రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో వైఎస్సార్ జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హామీ ఇచ్చారు. శంకుస్థాపన చేసిన రెండేళ్లలో ఉత్పత్తి కూడా మొదలయ్యేలా కృషి చేస్తామని వారు వెల్లడించారు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో మంగళవారం వైఎస్సార్సీపీ నేతలు ఉక్కు సంకల్పదీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ బీజేపీతో కేంద్రంలో నాలుగేళ్లు అధికారం పంచుకున్న చంద్రబాబు విభజన హామీల అమలుకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఆయనకు స్వప్రయోజనాలే ముఖ్యమని, పదవిపై వ్యామోహమే తప్ప ప్రజలకు మేలు చేయాలన్న యావ ఉండదని వారు దుయ్యబట్టారు. దీక్ష కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ కూడా రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న హామీలను అమలు చేయించడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారు. ప్రత్యేకించి ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం కోసం ఎలాంటి ప్రయత్నం చేయలేదని విమర్శించారు. జమ్మలమడుగు సమీపంలో 2007లో వైఎస్ రాజశేఖరరెడ్డి బ్రహ్మణి ఉక్కు పరిశ్రమ కోసం శంకుస్థాపన చేయగా దాదాపు రూ.1,300 కోట్ల విలువైన పనులు పూర్తి అయ్యాయన్నారు. దేశంలో అత్యధికంగా స్టీల్ ఉత్పత్తి చేసే జిందాల్ పరిశ్రమకు దీటుగా ఉండాలని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బ్రహ్మణీని రూపొందించారన్నారు. ఆయనే బతికి ఉంటే నేడు జమ్మలమడుగు రూపురేఖలు పూర్తిగా మారిపోయేవని వివరించారు. బ్రహ్మణీ స్టీల్స్ పూర్తి అయి ఉంటే ఇప్పటికే కోటి టన్నుల సామర్థ్యం కలిగిన పరిశ్రమగా ఉండేదన్నారు. వైఎస్ మరణానంతరం చంద్రబాబు కుటిల రాజకీయాల కారణంగా పరిశ్రమ పూర్తికాలేదన్నారు. ఆయన జీవితమే కుట్రలమయం టీడీపీ అధినేత చంద్రబాబు జీవితమే కుట్రలమయం.. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే ధైర్యంలేక ప్రతిసారి ఏదో ఒక పార్టీ సహకారంతో గెలిచారని సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఏనాడైనా నిజాయితీగా మాట్లాడారా.... చిత్తశుద్ధితో ప్రజలకేమైనా మేలు చేశారా అని నిలదీశారు. చంద్రబాబు వ్యక్తిత్వం పరిశీలిస్తే అవలక్షణాలున్న విలనే కన్పిస్తాడని తెలిపారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యక్తిత్వం పరిశీలిస్తే అసలుసిసలు హీరో కన్పిస్తారన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం జరిగిందని తెలిపారు. బచావత్ ట్రిబ్యునల్ సమయం పూర్తి అవుతోండగా, ఎగువ రాష్ట్రమైన కర్ణాటక ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచడంతోపాటు ఇష్టారాజ్యంగా ప్రాజెక్టులు నిర్మించినా అడ్డుకోలేకపోయారని ఆరోపించారు. భవిష్యత్ తరాలకు ప్రశ్నార్థకంగా కానున్న ఆ ప్రాజెక్టులను కర్ణాటక నిర్మిస్తుంటే చూస్తూ ఊరుకున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సుకు చిత్తశుద్ధితో పనిచేసిన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రమేనని స్పష్టం చేశారు. మెట్ట ప్రాంతాలకు సాగునీరు అందించాలనే తపన వైఎస్‌లో మెండుగా ఉండేదని, అందుకే ముఫ్పైఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయాలనే సంకల్పం తీసుకున్నారని తెలిపారు. మీ ముంగిట గండికోట ప్రాజెక్టులో నీరు నిల్వ ఉన్నాయంటే అదీ వైఎస్సార్ పుణ్యమేనని పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధికారంలోనికి రాగానే వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాలో ఉక్కు పరిశ్రమ కోసం ఆరునెలల్లోనే శంకుస్థాపన చేసి రెండు సంవత్సరాల్లో ఉత్పత్తి ప్రారంభించేలా చేస్తామని హమీ ఇచ్చారు. రాజకీయ ప్రయోజనాల కోసమే టీడీపీ దీక్షలు: ఎంపీ అవినాశ్‌రెడ్డి విభజన చట్టంలో ఉన్న హామీలను అమలు చేయాలని ఏనాడు చంద్రబాబు ప్రభుత్వం కేంద్రంపైనే ఒత్తిడి తీసుకురాలేదని తాజా మాజీ ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం 2014 డిసెంబర్లోనే స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి అనుకూలంగా లేదని తేల్చిచెప్పినా, మూడున్నరేళ్లుగా తెలుగుదేశం నాయకులు, సీఎం స్పందించలేదన్నారు. ఇప్పుడు ఎన్నికల దగ్గర పడుతుండటంతో రాజకీయ ప్రయోజనాల కోసమే దీక్షల పేరుతో నాటకం ఆడుతున్నారన్నారు. అదే సమయంలో విభజన చట్టంలోని ప్రతి హామీని అమలు చేయాలని వైఎస్సార్సీపీ నాలుగేళ్లుగా పోరాటం చేస్తోందని గుర్తు చేశారు. 2014లో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితో కలిసి విభజన హామీలను నెరవేర్చాలంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి విన్నవించామన్నారు. జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి ముందుకు వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని కేంద్రం చెబుతోందన్నారు. దీనికి టీడీపీ నేతలు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. విభజన హామీలు అమలు చేయని కేంద్రప్రభుత్వ వైఖరికి నిరసనగా తాము పదవులకు రాజీనామా చేశామన్నారు. టీడీపీ నాయకుల మాదిరి వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం మోసపూరిత పోరాటాలు చేయడం లేదన్నారు. ప్రత్యేక హోదా కోసం తాము 14నెలల ముందే ఎంపీ పదవీకి రాజీనామాలు చేశామన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రాష్ట్రంలో టీడీపీకి, బీజేపీకి ప్రజలు తగ్గిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఎస్ రఘురామిరెడ్డి, ఎస్బీ అంజద్‌బాషా, రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, పార్టీ కడప, రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు సురేష్‌బాబు, ఆకేపాటి అమర్నాథరెడ్డి, జమ్మలమడుగు, కమలాపురం సమన్వయకర్తలు సుధీర్‌రెడ్డి, మల్లికార్జునరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి డి.శంకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీపి.సుబ్బారెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. -
‘ఆనాడే దీక్ష చేస్తే ఇప్పటికే స్టీల్ ప్లాంట్ వచ్చేది’
సాక్షి, కడప : ఎన్నికల కోసమే టీడీపీ దీక్ష చేస్తోంది కానీ జిల్లా ప్రజలపై ప్రేమతో కాదని వైఎస్సార్ సీసీ మాజీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విమర్శించారు. కడప ఉక్కు- ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో చేపడుతున్న పోరాటంలో భాగంగా జమ్మలమడుగులో వైఎస్సార్ పీపీ ఆధ్వర్యంలో ఉక్కు సంకల్ప దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ఆదేశంతో ప్రత్యేక హోదా, విభజన హామీలైన ఉక్కు పరిశ్రమ కోసం తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేసి దీక్ష చేశామన్నారు. ఆనాడే తమతోపాటు టీడీపీ ఎంపీలు రాజీనామా చేసి దీక్ష చేస్తే కేంద్రం దిగొచ్చెదన్నారు. టీడీపీ ఇప్పుడు దీక్ష చేస్తే ఏం ఫలితం ఉంటుందని విమర్శించారు. ఉపఎన్నికల్లో బీజేపీ, టీడీపీకి బుద్ది వచ్చేలా తీర్పునివ్వాలని ప్రజలను కోరారు. సీఎం రమేష్‌ది కార్పొరేట్ దీక్ష : అంజాద్ బాషా ఆనాడు వైయస్సార్ తలపెట్టిన స్టీల్ ప్లాంట్ అడ్డుకోకుండా ఉంటే లక్ష మందికి ఉపాధి లభించేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంజాద్ అన్నారు.దీక్షలో ఆయన మాట్లాడుతూ..సీఎం రమేష్ రోజుకు రూ. కోటి ఖర్చు పెట్టి దీక్ష చేస్తున్నారని..అది కార్పొరేట్ దీక్ష అని ఆరోపించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న చంద్రబాబు ఆయన కొడుకు లోకేష్ తప్పా ఎవరికీ ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. బీజేపీతో వైఎస్సార్సీపీ జతకట్టే ప్రసక్తే లేదన్నారు. కొద్ది రోజుల్లో మైరారిటీ, ఎస్సీ, ఎస్టీ, బీసీల ప్రభుత్వం రాబోతుందని పేర్కొన్నారు. కప్పం కట్టందే పథకం రాదు : రఘురామి రెడ్డి జన్మభూమి కమిటీకి కప్పం కట్టందే సంక్షేమ పథకాలు ప్రజలకు అందడం లేదని మైదుకూరు ఎమ్మెల్యే రుఘురామి రెడ్డి ఆరోపించారు. టీడీపీ వాళ్ల సొంత అభివృద్ధి తప్పా రాష్ట్రం అభివృద్ధే లేదని ఎద్దేవా చేశారు. జమ్మలమడుగు అభివృద్ధి ఉక్కు ఫ్యాక్టరీతో ముడిపడి ఉందన్నారు. వైయస్సార్ బతికి ఉండిఉంటే జమ్మలమడుగు పరిస్థితి ఇలా ఉండకపోవునని వ్యాఖ్యానించారు. టీడీపీకి బుద్ది చెప్పే రోజులు త్వరలోనే ఉన్నాయన్నారు -
‘ఇసుక, మట్టితో సహా అన్నీ తినేశారు’
సాక్షి, హైదరాబాద్ : కడప స్టీల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడే అర్హత మంత్రి ఆది నారాయణరెడ్డికి లేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు అన్నారు. కడప స్టీల్ ప్లాంట్‌పై ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యలు సిగ్గుచేటని విమర్శించారు. టీడీపీ నేతలు నాలుగేళ్లుగా ఇసుక, మట్టితో సహా అన్ని తినేశారని, తిన్నది అరగక దొంగ దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలకు వెన్నుపోట్లు, బ్లాక్మెయిల్ రాజకీయలు తప్ప మరొకటి తెలియదని ఆరోపించారు. నాలుగేళ్లలో విభజన హామీలపై ఎప్పుడైనా మాట్లాడారా అని శ్రీనివాసులు ప్రశ్నించారు. టీడీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, హోదా కోసం వైఎస్సార్సీపీ నిరంతర పోరాటం చేస్తోందని పేర్కొన్నారు. -
కడపలోనే కాదు, విశాఖలోనూ స్టీల్ ప్లాంట్
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ నేతృత్వంలోని కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు కేవలం కడపలోనే కాదు, విశాఖలోనూ మరో స్టీల్ ప్లాంట్ ఇవ్వనుందని ఏపీ బీజేపీ నేత కందుల రాజమోహన్ రెడ్డి తెలిపారు. మంగళవారం కడప స్టీల్ ప్లాంట్ వ్యవహారంపై ఏపీ బీజేపీ నేతలు కందుల రాజమోహన్ రెడ్డి, రఘునాథ్ బాబు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును కలిశారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై ఉప రాష్ట్రపతి నివాసంలో జరిగిన చర్చలో పాల్గొన్నారు. చర్చ అనంతరం కందుల రాజమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై సుప్రీంకోర్టులో కేంద్రం దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ విషయంలో టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. 2014 సంవత్సరంలో సెయిల్ ఇచ్చిన నివేదికలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు సాధ్యం కాదని చెప్పిన విషయాన్ని మాత్రమే ప్రస్తావిస్తున్నారని, చివరి పేరాలో ప్రస్తావించిన మెకాన్ సంస్థ ప్రాథమిక నివేదిక గురించి ఉద్దేశపూర్వకంగా వదలేశారని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఒత్తిడి ఉన్నా సరే విశాఖలో స్టీల్ ప్లాంట్ పెట్టేందుకు కేంద్రం సిద్దపడిందని, కడపలో స్టీల్ ప్లాంట్ శంఖుస్థాపనకు ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్నారని తెలిపారు. స్టీల్ ప్లాంట్ ఖచ్చితంగా వస్తుందన్న విషయం తెలుసుకాబట్టే టీడీపీ నేతలు స్టీల్ ప్లాంట్ కోసం దీక్షల పేరుతో రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని అన్నారు. టీడీపీకి చిత్తశుద్ధి ఉన్నట్లయితే 2014లో సెయిల్ నివేదిక.. స్టీల్ ప్లాంట్ సాధ్యం కాదన్నప్పుడే ఎందుకు ధర్నాలు, దీక్షలు చేయలేదని ప్రశ్నించారు. కడప జిల్లాలో అభివృద్ధి పనులు చేయకుండా ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వమేనన్నారు. సీఎం రమేశ్ సహా టీడీపీ నేతల దీక్షల్లో ఏమాత్రం స్వచ్ఛత, చిత్తశుద్ధి లేదని, పార్లమెంటులో 6 గంటలకే స్పృహ కోల్పోయిన నేతలు 6 రోజులుగా ఇప్పుడు ఎలా దీక్ష చేయగల్గుతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు రాయలసీమకు ఏం చేశారు? న్యూఢిల్లీ : చంద్రబాబు రాయలసీమ వ్యక్తి అని చెప్పుకుంటూ.. సీమకు ఏం చేశారో చెప్పాలని ఏపీ బీజేపీ నేత రఘనాధ బాబు డిమాండ్ చేశారు. మంగళవారం కడప స్టీల్ ప్లాంట్ వ్యవహారంపై ఏపీ బీజేపీ నేతలు కందుల రాజమోహన్ రెడ్డి, రఘునాథ్ బాబు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును కలిశారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై ఆయన నివాసంలో జరిగిన చర్చలో పాల్గొన్నారు. చర్చ అనంతరం రఘునాధ బాబు మాట్లాడుతూ.. టీడీపీ దొంగ దీక్షలు కొంగ జపాలు చేస్తోందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై అబద్దాలు, అసత్యాలను ప్రచారం చేస్తోందన్నారు. 300మిలియన్ టన్నుల ఐరన్ ఉత్పత్తి చేయాలని కేంద్రం భావిస్తోందని, స్టీల్ ధర పెరుగుతుంది కాబట్టి తప్పకుండా స్టీల్ ప్యాక్టరీ వచ్చి తీరుతుందని స్పష్టం చేశారు. కేంద్ర ఉక్కుశాఖ మంత్రిని ఆరా తీసిన వెంకయ్య నాయుడు న్యూఢిల్లీ : కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై కేంద్ర ఉక్కుశాఖ మంత్రి బీరేంద్ర సింగ్‌ను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆరా తీశారు. మంగళవారం కడప స్టీల్ ప్లాంట్ వ్యవహారంపై ఏపీ బీజేపీ నేతలు కందుల రాజమోహన్ రెడ్డి, రఘునాథ్ బాబు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును కలిశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రిని ఇంటికి పిలిపించిన వెంకయ్య నాయుడు స్టీల్ ప్లాంట్‌కు సంబంధించిన పలు విషయాలపై చర్చించారు. కడప, విశాఖలో స్టీల్ ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్రం సుముఖంగా ఉందని కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్ తెలిపారు. -
జమ్మలమడుగులో వైఎస్సార్సీపీ ఉక్కు సంకల్ప దీక్ష
సాక్షి, కడప: కడప ఉక్కు- ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని ఉధృతం చేసింది. ఈ నేపథ్యంలో జమ్మలమడుగు వైఎస్సార్పీపీ ఆధ్వర్యంలో ఉక్కు సంకల్ప దీక్ష చేపట్టారు. విభజన చట్టంలో హామీ ఇచ్చినప్పటికీ కడపలో ఇప్పటికీ ఉక్కు పరిశ్రమ రాకపోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని పార్టీ నేతలు మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ సాధించేంత వరకు తమ పోరాటాన్నిఆపబోమని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 23న కడప నగరంలో మహా ధర్నా, 24న బద్వేలు, 25న రాజంపేటలో ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ దీక్షలో మాజీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి, రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు ఆకెపాటి అమర్నాథ్ రెడ్డి, కడప పార్లమెంట్ అధ్యక్షుడు సురేష్ బాబు, కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా, కమలాపురం సమన్వయకర్త మల్లికార్జునరెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామి రెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి లతో పాటు జమ్మలమడుగు సమన్వయకర్త డాక్టర్ సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ గోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డిలు పాల్గొన్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు ఉక్కు సంకల్ప దీక్ష కొనసాగనుంది. సీఎం రమేష్‌ది డబ్బు దీక్ష సీఎం రమేష్ చేసేది డబ్బు దీక్ష అని కడప పార్లమెంట్ అధ్యక్షుడు సురేష్ బాబు ఆరోపించారు. వైఎస్సార్ సీపీ చేసేది జనదీక్ష, జనం కోసం చేసే దీక్ష అని పేర్కొన్నారు. కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ రాకుండా అడ్డుకుంది చంద్రబాబే అని మండిపడ్డారు. ఇప్పుడు కపట నాటకాలతో దీక్షలు చేస్తున్నారని విమర్శించారు. -
ఉక్కు పరిశ్రమ కోసం వైఎస్సార్సీపీ మహధర్నా
-
రాజంపేటలో ఉక్కు మహాధర్నా ప్రారంభం
సాక్షి, రాజంపేట : కడప ఉక్కు- రాయలసీమ హక్కు అనే నినాదం జిల్లాలో హోరెత్తుతోంది. గ్రామాల్లో ప్రచార సభలు మొదలుకొని పార్టీ సమావేశం , సంతకాల సేకరణ, రిలే దీక్షలతో వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు కదం తొక్కుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం రాజంపేట కేంద్రంగా వైఎస్సార్సీపీ నేతలు పోరుబాట పట్టారు. కడపలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పాలంటూ రాజంపేట కూడళ్లలో వైఎస్సార్పీపీ నేతలు మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో ప్రజలు, పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఉక్కు పరిశ్రమ కోసం వైఎస్సార్సీపీ చేపట్టిన మహధర్నాకు ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలివచ్చారు. కడప ఉక్కు రాయలసీమ హక్కు అంటూ నినదించారు. మాజీ ఎంపీలు అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి, ఎమ్మెల్యేలు కొరుముట్ల శ్రీనివాసులు, రఘురామిరెడ్డి, అంజాద్ బాషా, ఎమ్మల్సీ గోపాల్ రెడ్డి, రాజంపేల పార్లమెంట్ అద్యక్షుడు అమర్నాథ్ రెడ్డి, పార్టీ ఇతర నాయకులు సమన్వయ కర్తలు మహాధర్నాలో పాల్గొన్నారు. -
ఉక్కు ఫ్యాక్టరీ కోసం టీడీపీ నాలుగేళ్లు ఏం చేసింది?
-
నాడబ్బు నాకు ఇచ్చేయండి: గాలి జనార్ధన్ రెడ్డి
సాక్షి, బెంగళూరు : ఏపీ ప్రభుత్వం అవకాశమిస్తే వైఎస్సార్ జిల్లాలోని బ్రహ్మణి స్టీల్ ప్లాంటును రెండేళ్లలో పూర్తి చేస్తానని కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి చెప్పారు. అది సాధ్యం కాకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే ఆ స్టీల్ ప్లాంటును స్వాధీనం చేసుకుని నిర్మాణం పూర్తి చేసుకోవచ్చన్నారు. లేదంటే ఆ ప్లాంట్ నిర్మాణం కోసం తాను వెచ్చించిన రూ. 1,350 కోట్లు తిరిగి ఇచ్చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆయన బెంగళూరులోని ఓ హోటల్లో మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ జిల్లాలో స్టీలు ప్లాంటు స్థాపించాలనే డిమాండ్‌తో జరుగుతున్న పోరాటాలను మీడియా ద్వారా తెలుసుకున్నట్లు చెప్పారు. 2007, జూన్ 10న జమ్మలమడుగులో బ్రహ్మణి ఇండస్ట్రీస్ లిమిటెడ్ పేరిట స్టీలు ప్లాంటు నిర్మాణానికి శంకుస్థాపన జరిగిందని గాలి జనార్దనరెడ్డి గుర్తు చేశారు. ఈ స్టీలు ప్లాంటు వల్ల ప్రత్యక్షంగా 10 వేల మందికి, పరోక్షంగా లక్ష మందికిపైగా ఉపాధి లభిస్తుందని, అందుకే దివంగత సీఎం వైఎస్ఆర్ను స్టీలు ప్లాంటు ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరినట్టు తెలిపారు. అప్పుడు అనుకూలమన్న మెకాన్ అప్పట్లో మెకాన్ సంస్థ తమకు కన్సల్టెంట్‌గా ఉందని జనార్దనరెడ్డి చెప్పారు. ప్లాంటు ఏర్పాటుకు ఎలాంటి ఇబ్బందులు లేవని మెకాన్ కూడా వెల్లడించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ అంశం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉండడం వల్ల కడపలో స్టీలు ప్లాంటుకు అనువైన పరిస్థితులు లేవని ప్రస్తుతం మెకాన్ చెప్పడం సమంజసం కాదన్నారు. సీఎం చంద్రబాబు అనుమతిస్తే బ్రహ్మణి స్టీలు ప్లాంటు నిర్మాణాన్ని ఏ క్షణమైన ప్రారంభిస్తానని ఆయన తెలిపారు. -
‘సీఎం రమేష్ ఒక్కరోజైనా నోరు తెరిచారా?’
సాక్షి, కడప : కడపలో స్టీల్ ప్లాంట్ రాకపోవడానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలే కారణమని వైఎస్సార్సీపీ నేతలు తెలిపారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం తమ పోరాటం ఉధృతం చేస్తామని వైఎస్సార్సీపీ నేతలు స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేకహోదా కోసం ఎంపీ పదవికి రాజీనామా చేసిన వైఎస్సార్సీపీ నేత వైఎస్ అవినాష్‌రెడ్డి కడపలో మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ఏపీ స్టీల్స్ పేరిట పరిశ్రమ స్థాపిస్తామన్నారు. ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుతో పాటు కడపలో నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. ఉక్కు ఫ్యాక్టరీ కోసం టీడీపీ సర్కార్ నాలుగేళ్లుగా ఏం చేసింది? టీడీపీ ఎంపీ సీఎం రమేష్ పార్లమెంట్లో ఏ ఒక్కరోజైనా స్టీల్ ప్లాంట్ గురించి అడిగారా అని ఈ సందర్భంగా వైఎస్ అవినాష్ రెడ్డి ప్రశ్నించారు. ప్రత్యేక హోదా విషయంలో మాతో కలిసి రావాలని కోరితే టీడీపీ ఎంపీలు ఎందుకు ముందుకు రాలేదంటే.. వారికి విభజన హామీలపై చిత్తశుద్ధి లేదంటూ ఆయన ధ్వజమెత్తారు. -
అభివృద్ధి కోసమే కర్మాగారం..లాభాల కోసం కాదు
-
‘నాలుగేళ్లు చంద్రబాబు నిద్రపోయారా’
సాక్షి, అమరావతి: కడపలో ఉక్కు ఫ్యాకర్టీ నిర్మిస్తే చదువుకున్నయువతకు ఉద్యోగాలు దొరుకుతాయని, ప్రజలకు ఉపాధి లభిస్తుందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు. కడపలో మానవ వనరులు అధికంగా ఉన్నాయని, ఉక్కు ఫ్యాక్టరీకి కావాల్సిన నీరు, విద్యుత్, ఖనిజం, భూమి, ఈ ప్రాంతంలో ఉన్నాయని పేర్కొన్నారు. ఇన్ని సహజ వనరులు ఉన్నచోట ఫ్యాక్టరీని ఎందుకు నిర్మించరని రాచమల్లు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఉక్కు ఫ్యాక్టరీ సాధన కోసం కడపలో వైఎస్సార్ సీపీ నిర్వహించిన మహాధర్నాలో ఆయన ప్రసంగించారు. నాలుగేళ్ల కేంద్రంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ పదవులు అనుభవించి ఇప్పుడు కొత్తగా ఉక్కు ఫ్యాక్యర్టీ కోసం దీక్ష చేయడం ఏమిటని రాచమల్లు ప్రశ్నించారు. కడపలో కర్మాగారం పెడితే లాభం రాదని కేంద్రం చెబుతోందన్న రాచమల్లు ప్రజల అభివృద్ధి కోసం కర్మాగారం నిర్మించాలిగానీ, లాభాల కోసం కాదని వ్యాఖ్యానించారు. కడపలో వైఎస్ జగన్‌ను దెబ్బతియాలనే ఉద్దేశంతోనే టీడీపీ దొంగ దీక్షలు చేస్తోందని విమర్శించారు. అర్హత, యోగ్యత, నైతిక విలువలు లేని రమేష్ నాయుడు (సీఎం రమేశ్) రాజకీయ లబ్ధి కోసమే దీక్ష చేస్తున్నారని ఆరోపించారు. 19 మంది ఎంపీలు ఉన్న టీడీపీ ఉక్కు ఫ్యాక్టర్టీ సాధించలేకపోతోందని, నాలుగేళ్లుగా చంద్రబాబు నాయుడు నిద్రపోయారా అని ధ్వజమెత్తారు. కేంద్రంతో విభేదించినప్పుడే చంద్రబాబు దీక్ష చేసి ఉంటే 67 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు తెలిపేవారని అన్నారు. ముగిసిన మహాధర్నా ఉక్కు ఫ్యాక్టరీ కోసం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన మహాధర్నా విజయవంతంగా ముగిసింది. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా కడప స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. జిల్లాలోని పాత కలెక్టరేట్ వద్ద జూన్ 23 నుంచి 26 వరకు ధర్నా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వైఎస్సార్సీపీ ప్రకటించింది. ఈ నెల 24న బద్వేలులో మహా ధర్నా, 25న రాజాంపేటలో మహాధర్నా, జమ్మలమడుగులో భారీ దీక్షలు చేపడుతామని వైఎస్సార్సీపీ నేతలు తెలిపారు. నిరసనల్లో భాగంగా జూన్ 27న జాతీయ రహదారుల దిగ్బందిస్తామన్నారు. స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం డిమాండ్ చేస్తూ జూన్ 29న రాష్ట్ర బంద్‌కు వైఎస్సార్సీపీ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సమన్వయకర్తలు పాల్గొన్నారు.. కడప ఉక్కు- ఆంధ్రుల హక్కు అంటూ పెద్ద ఎత్తున నినదించారు. -
కడప స్టీల్ ప్లాంట్‌ను అడ్డుకుంది చంద్రబాబే!
సాక్షి, కడప: విభజన చట్టంలో హామీ ఇచ్చినప్పటికీ.. కడపలో ఇప్పటికీ స్టీల్ ప్లాంట్ రాకపోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడ్డారు. కడపలో స్టీల్ ప్లాంట్ సాధన కోసం తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేశారు. కడపలో వెంటనే స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ శనివారం నగరంలో మహా ధర్నాను చేపట్టింది. జిల్లాలోని పాత కలెక్టరేట్ వద్ద దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి వైఎస్సార్ సీపీ నేతలు మహాధర్నాను ప్రారంభించారు. ఈ సందర్భంగా కడప స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు, టీడీపీ, బీజేపీ నేతల మోసపూరిత వైఖరిపై పార్టీ నేతలు మండిపడ్డారు. కడప్ స్టీల్ ప్లాంట్ గురించి నాలుగేళ్లుగా మాట్లాడని టీడీపీ నేతలు ఇప్పుడు దీక్షలు చేయడంలో అర్థమేమిటని నిలదీశారు. కేవలం ఓట్ల కోసమే టీడీపీ నేతలు దీక్షలు చేస్తున్నారని దుయ్యబట్టారు. వైఎస్సార్ తలపెట్టిన స్టీల్ ప్లాంట్‌ను అడ్డుకుంది చంద్రబాబేనని.. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కోసం ఆయన మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. ఈ మహాధర్నాకు వైస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సమన్వయకర్తలు హాజరయ్యారు. కడప స్టీల్ ప్లాంట్ సాధన పోరాటంలో భాగంగా జూన్ 23 నుంచి 26 వరకు కడపలో ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ నెల 24న (జూన్) బద్వేలులో మహాధర్నా, రాజాంపేటలో 25న మహాధర్నా, జమ్మలమడుగులో భారీ దీక్షలు చేపడుతామని చెప్పారు. జూన్ 27న జాతీయ రహదారుల దిగ్బంధానికి, జూన్ 29న రాష్ట్ర బంద్‌కు వైఎస్సార్సీపీ పిలుపునిచ్చింది. గత నాలుగేళ్లుగా కడప ఉక్కు- రాయలసీమ హక్కు అనే నినాదంతో ఉద్యమం జోరుగా నడుస్తున్న విషయం తెలిసిందే. కడప ఉక్కు సాధన కోసం నిరంతరం పోరాటం చేస్తామని నేతలు చెప్పారు. ఈ మహాధర్నాలో వైఎస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి, ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, అంజాద్ బాషా, శ్రీకాంత్ రెడ్డి, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, మేయర్ సురేష్ బాబు, రాజంపేట పార్లమెంట అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి, బద్వేలు సమన్వయకర్త వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. -
తెలుగు డ్రామా పార్టీ నాటకాలు ఆపాలి
-
ఎన్నికలలోపే కడప స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన
సాక్షి, న్యూఢిల్లీ : ఎన్నికలలోపే కడప స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేస్తామని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు రమేష్ నాయుడు అన్నారు. విభజన హామీలను పూర్తిగా నెరవేర్చాకే ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. గురువారం న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కడప ఉక్కు పరిశ్రమకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేస్తారని, మరో నెల రోజుల్లో తేదీ కూడా ప్రకటిస్తామని తెలిపారు. బీజేపీకి క్రెడిట్ రాకూడదనే విధంగా తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తోందన్నారు. స్టీల్ ప్లాంట్ వస్తే తెలుగుదేశం మనుగడ కష్టమని ప్లాంట్ రాకుండా అడ్డుపడుతోందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నించారాయన. -
సీఎం రమేష్‌కు రాచమల్లు సవాల్
సాక్షి, వైఎస్సార్ కడప : కడప ఉక్కు పరిశ్రమ కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేపట్టిన 48 గంటల నిరహార దీక్ష పూర్తైంది. గురువారం ప్రొద్దుటూరులో ఆయన దీక్షను విరమించారు. కడప ఉక్కు-రాయలసీమ హక్కు అనే నినాదంతో పరిశ్రమ స్థాపన కోసం జిల్లాలోని ఎమ్మెల్యేలంతా రాజీనామాలు చేస్తామని రాచమల్లు ప్రకటించారు. ఉక్కు పరిశ్రమ కోసం దీక్ష చేపట్టిన తెలుగుదేశం పార్టీ ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజీనామాలు చేయడానికి సిద్ధమా? అని సవాల్ విసిరారు. టీడీపీతో రాజీనామాలు చేయించే బాధ్యతను అఖిలపక్షం తీసుకోవాలన్నారు. కడపలో స్టీల్ ప్లాంట్ రాకపోవడానికి కారణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలేనని చెప్పారు. స్టీల్ ప్లాంట్ కోసం ఎందాకైనా పోరాటం చేస్తామని అన్నారు. స్టీల్ ప్లాంట్ గురించి నాలుగేళ్లుగా మాట్లాడని తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పటికిప్పుడు దీక్షలు చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో కేవలం ఓట్లు కోసమే టీడీపీ మొసలి కన్నీరు కార్చుతోందని ఆరోపించారు. -
మరోసారి మోసగిస్తున్న బాబు
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర ప్రజలను మరోసారి మోసగించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు కేవలం రూ.వెయ్యి కోట్లు కావాలని అడిగితే ఏడాదికి రూ.3,200 కోట్లు చొప్పున ఐదేళ్లకు రూ.16 వేల కోట్లు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఇస్తామని వెంకన్న సాక్షిగా చెప్పారన్నారు. అయితే ఇవ్వాల్సిన మొత్తంలో ముందుగానే 30 శాతం మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం రాష్ట్ర పర్యటనను బుధవారం శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రారంభించారు. శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్హాల్లో నాయకులు, కార్యకర్తలతో సమావేశమై మాట్లాడారు. ప్రత్యేక ప్యాకేజీ కింద రూ.16 వేల కోట్లు ఇస్తామని ప్రకటించినప్పుడు మోదీ, అమిత్‌షా, వెంకయ్యనాయుడులను పొగడ్తలతో చంద్రబాబు ముంచెత్తారని గుర్తు చేశారు. ఇప్పుడు కేంద్రం ఇచ్చిన నిధులను చక్కగా మెక్కేసి ఎన్నికల సమయం దగ్గరవ్వడంతో తప్పులన్నీ బీజేపీపై, కేంద్రంపై నెట్టేసి మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమవుతున్నారన్నారు. ప్రజలు నమ్మరు: కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చంద్రబాబును ఈసారి ప్రజలు నమ్మరన్నారు. కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఫీజుబిలిటీ లేదని చెప్పినప్పటికీ నిపుణుల కమిటీ వేసి స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు సిద్ధం ఉన్నామన్నారు. కడప స్టీల్‌ప్లాంట్ ఇస్తారని తెలిసీ ప్రజల మెప్పుకోసం సీఎం రమేష్ దీక్ష చేస్తాననడం సిగ్గుచేటన్నారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు తమ పార్టీ వ్యతిరేకం కాదన్నారు. విశాఖ రైల్వే జోన్‌కు అన్ని దస్త్రాలు సిద్ధంగా ఉన్నాయని తెలిసీ టీడీపీ ఎంపీలు ధర్నాలు చేసేందుకు సిద్ధమై ప్రజల నుంచి మార్కులు కొట్టేయాలని చూస్తున్నారన్నారు. వీటిన్నింటిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. 2014లో మోసపూరిత హామీలిచ్చి చంద్రబాబు ఏ ఒక్కటీ అమలు చేయలేదని మండిపడ్డారు. వెనుకబడిన కులాలవారు న్యాయవృత్తికి పనికిరారని ముఖ్యమంత్రిగా లేఖ రాయడం సరికాదన్నారు. సమావేశంలో బీజేపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు కోటగిరి నారాయరావు, ఎమ్మెల్సీ పి.వి.ఎన్ మాధవ్ తదితరులు పాల్గొన్నారు. -
రాజీనామాలకు సిద్ధం: శ్రీకాంత్‌రెడ్డి
సాక్షి, కడప : నాలుగేళ్లుగా కడప ఉక్కు పరిశ్రమ కోసం పోరాటాలు చేసిన వారిపై అక్రమ కేసులు పెట్టిన టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు ఉక్కుదీక్ష చేస్తాననడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. టీడీపీది చేసేది ఉక్కు దీక్ష కాదని పార్టీ ఇమేజ్ కోసం ఏర్పాటు చేసిన ఈవెంట్ అని ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కడప ఉక్కు కోసం తమ పార్టీ చిత్తశుద్ధితో పోరాటం చేస్తోదన్నారు. ఉక్కు పరిశ్రమ కోసం రాజీనామాలకు సిద్ధమని పేర్కొన్నారు. మహానేత వైఎస్సార్ కేంద్రంపై ఆధారపడకుండా దృఢసంకల్పంతో ఉక్కుపరిశ్రమ స్థాపించి రెండు వేల కోట్ల రూపాయాల పనులు చేయించారని గుర్తుచేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగేళ్లలో ఒక్క పరిశ్రమను కూడా ఏర్పాటు చేయలేదని విమర్శించారు. ఎన్నికల ముందు కడపను టీహబ్ చేస్తా, హర్ట్ కల్చర్ హబ్ చేస్తామని వాగ్దానాలు చేసిన టీడీపీ ఒక్కపని కూడా చేయలేదని ఆరోపించారు. రాయలసీమ అభివృద్ధిపై టీడీపీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఉక్కు పరిశ్రమ, హైకోర్టుతో పాటు రెండో రాజధానిని ఇక్కడ నిర్మించాలని ఎమ్మెల్యే సవాల్ విసిరారు. -
మెకాన్ నివేదికను ఎందుకు బయటపెట్టరు?
సాక్షి, అమరావతి : కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు విషయంలో కేంద్రం అనుసరిస్తున్న తీరు బాధాకరమని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టులో సెయిల్ అందించిన పాత నివేదికను సమర్పించడం ద్వారా కేంద్రం మరోసారి తన నైజాన్ని బయటపెట్టిందని విమర్శించారు. కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు తప్పనిసరని రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో ఉండబట్టే కేంద్రం టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసిందన్నారు. అనంతపురం జిల్లాలో 135 మిలియన్ టన్నులు ఐరన్ ఉండగా.. ప్రకాశం జిల్లాలో మరికొన్ని గనులు ఉన్నాయని.. వీటన్నింటిని కడప స్టీల్ ప్లాంట్ కు కేటాయిస్తామని ఇదివరకే మెకాన్ సంస్థకు, టాస్క్ ఫోర్స్‌కు తెలియజేసామని ఆయన స్పష్టం చేశారు. మికాన్ సంస్థకు రాష్ట్రం అందిస్తోన్న ప్రోత్సాహకాలను కూడా తెలియజేశామన్నారు. అయినప్పటికీ కేంద్ర మెకాన్ నివేదికను ఎందుకు బయటపెట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రాలో తగినంత ఐరన్ ఉండగా.. ఉక్కు పరిశ్రమ విషయంలో తెలంగాణతో ఆంధ్రను ముడిపెడుతూ.. కుంటి సాకులు చెప్పడం అర్ధరహితమని ఆయన వ్యాఖ్యానించారు. కడప ఉక్కు రాయలసీమ హక్కు.. ఉక్కు పరిశ్రమ సాధించుకోవడం కోసం పోరాటం ఉధృతం చేస్తామని ఆయన తెలిపారు. -
‘ఓనమాలు తెలియకుండా మాట్లాడుతున్నారు’
సాక్షి, కడప : జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు టీడీపీ అడ్డంకి అని బీజేపీ నాయకులు అనడం సబబు కాదని ఏపీ మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారు. మైకన్ సంస్థకి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం ఇచ్చిందన్నారు. రాయలసీమపై ముఖ్యమంత్రి చంద్రబాబుది సవతితల్లి ప్రేమ అయితే జిల్లాలోని ఒంటిమిట్టలో ప్రభుత్వం తరపున కల్యాణం ఎందుకు నిర్వహిస్తారంటూ ప్రశ్నించారు. కడప జిల్లాకు చంద్రబాబు పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్నారని తెలిపారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు బీజేపీనే ముందుకు రావడం లేదని ఆరోపించారు. ఉక్కు పరిశ్రమ కోసం ఈనెల 20 నుంచి ఎంపీ సీఎం రమేష్ అమరణ నిరాహారదీక్ష చేస్తున్నారని తెలిపారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుచేసే వరకూ తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. శంకుస్థాపన కోసం ప్రధానిని పిలిపిస్తామని అనడం ముఖ్యం కాదని, నిధులు ఎంత మేరకు కేటాయిస్తారో ముందే స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఓనమాలు తెలియకుండా బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతున్నారంటూ మంత్రి మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని టీడీపీ నేతలు అడుగుతుంటే, బీజేపీ నేతలు మాత్రం అడగలేదు అనడం సరైన పద్దతి కాదన్నారు. బీజేపీ కుట్ర, అబద్ధపు రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. జిల్లా అభివృద్ధిని ప్రతిపక్షం అడ్డుకుంటోందని అన్నారు. అయితే ఇప్పటి వరకూ జిల్లాకు ఎన్ని నిధులు ఇచ్చారో మంత్రి స్పష్టత ఇవ్వలేక పోయారు. జిల్లాకు ఇచ్చిన హామీల గురించి అడిగన ప్రశ్నలకు ఆదినారాయణ రెడ్డి సమాధానం దాటవేశారు. -
రాయలసీమపై టీడీపీ కక్ష తీర్చుకుంటోంది
సాక్షి, కడప : రాయలసీమ కోసం తెలుగుదేశం నేతలు దొంగ దీక్షలు, యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదని బీజేవైఎం అధ్యక్షుడు విష్ణువర్థన్ రెడ్డి మండిపడ్డారు. శనివారం కడపలో మీడియాతో మాట్లాడిన ఆయన సీమ అభివృద్ధి కోసం త్వరలో కేంద్ర మంత్రులు, ప్రధాని కడప జిల్లాకు రానున్నారని తెలిపారు. రాయలసీమ అభివృద్ధి చేయకుండా టీడీపీ కంకణం కట్టుకుందని అందుకే దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు. 2014 ఎన్నికల్లో రాయలసీమ ప్రజలు టీడీపీకి ఓటు వేయలేదని కక్ష తీర్చుకుంటున్నారని దుయ్యబట్టారు. తెలుగుదేశం పార్టీ రాయలసీమ ద్రోహి పార్టీ అంటూ విమర్శలు గుప్పించారు. నాలుగేళ్లుగా పరిపాలిస్తున్న చంద్రబాబు కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయమని ఏరోజు కేంద్రాన్ని అడగలేదని ఆయన పేర్కొన్నారు. రెండుసార్లు అడిగినా స్పందించలేదు : బీజేపీతో పొత్తులో ఉన్నప్పడు నాలుగేళ్లుగా ఎందుకు ఉక్కు పరిశ్రమ కోసం నిలదీయలేదని విష్ణువర్ధన్ చంద్రబాబును ప్రశ్నించారు. సాక్షాత్తు రాష్ట్ర మంత్రులే ఓట్లు వేయయని కడప జిల్లాను ఎందుకు అభివృద్ధి చేయాలి అన్న వ్యాఖ్యలని ఉటంకిస్తూ, టీడీపీపై నిప్పులు చెరిగారు. 2014 డిసెంబర్ 2న కేంద్ర ప్రభుత్వం కడపలో స్టీల్ ప్లాంట్ పెడతామంటే రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదని, తిరిగి 2016లో అడిగినా కూడా రాష్ట్ర ఎటువంటి స్పందన ఇవ్వలేదని వెల్లడించారు. ఇప్పటికీ కూడా జిల్లలో ఉక్కు పరిశ్రమ వద్దు అని పరోక్షంగా టీడీపీ నేతలు అంటున్నారని ఆరోపించారు. సుప్రీంకోర్టు లో కేంద్రం అఫిడవిట్ దాఖలు విషయంలో అవసరమైన విషయం పక్కన పెట్టి, అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. రాయలసీమలో హైకోర్టు, రెండో రాజధాని పెట్టగలరా? : కడప జిల్లాలో కచ్చితంగా బీజేపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తుందని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. రాయలసీమలో టీడీపీ నేతలు దొంగ దీక్షలు చేయాల్సిన అవసరం లేదని, జిల్లాలో ఉక్కు పరిశ్రమ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని స్పష్టం చేశారు. అలానే రాయలసీమలో చంద్రాబాబు హైకోర్టు ఏర్పాటు చేయగలరా అని ప్రశ్నించారు. రాయలసీమను బీజేపీ రత్నాల సీమను చేస్తుందని పేర్కొన్నారు. టీడీపీకి దమ్ముంటే రాయలసీమలో ఒకజిల్లాను రెండవ రాజధాని చేయాలంటూ సవాల్ విసిరారు. సీమవాసులను రౌడీలుగా చిత్రీకరించారు : రాష్ట్రంలో ఎక్కడ దాడులు జరిగినా రాయలసీమ రౌడీలు వచ్చారంటూ చంద్రబాబు సీమ ప్రజలను గుండాలుగా చిత్రీకరించారని మండిపడ్డారు. కోర్టులను మేనేజ్ చేయించుకోగల శక్తి చంద్రబాబుకు ఉందని, ఆవిషయం ప్రజలు బాగా తెలుసునని అన్నారు. అభివృద్ధి మొత్తం అమరావతిలో పెడితే సీమ పరిస్థితి ఏం కావాలంటూ ప్రశ్నించారు. ఇక్కడి పరిశ్రమలు, సాగు నీటి ప్రాజెక్టులు, ఏమై పోవాలంటూ ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌కు దమ్ముంటే ఎంపీ పదవికి రాజీనామా చేసి బయటకు రావాలంటూ సవాల్ విసిరారు. -
బాబు కోర్టులను మేనేజ్ చేస్తాడని అందరికీ తెలుసు
-
బాబు వల్లే స్టీల్ ప్లాంట్ ఆలస్యం
సాక్షి, తిరుపతి : చంద్రగిరిలో జరుగుతున్న వైఎస్సార్ క్రికెట్ టోర్నమెంట్ చాలా గొప్ప కార్యక్రమని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం క్రీడలను పూర్తిగా పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో యువతకు ఒక్క ఉద్యోగం రాలేదని, కానీ నారా లోకేష్‌కు మాత్రం మంత్రి పదవి వచ్చిందంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రానిని ప్రత్యేక హోదా సంజీవని అని పునరుద్ఘాటించారు. హోదా వస్తేనే యువతకు ఉపాధి అవకాశం లభిస్తాయని స్పష్టం చేశారు. చంద్రబాబు అన్ని రంగాల్లో పూర్తిగా విఫలం అయ్యారని వైవీ దయ్యబట్టారు. కమీషన్ల కోసమే పోలవరాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారని.. ఇందులో భాగంగానే చంద్రబాబుకు ముడువులు ముట్టాయని ఆయన ఆరోపించారు. మొదటి నుంచి ప్రత్యేక హోదా కొసం పోరాడుతున్న పార్టీ, వైఎస్సార్సీపీ అని స్పష్టం చేశారు. టీడీపీకి ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా తక్షణమే తెలుగుదేశం ఎంపీలు తమతో పాటు కలిసిరావాలంటూ పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా వస్తే ప్రతి జిల్లా ఒక హైదరాబాద్ అవుతుందన్నారు. రాయలసీమపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని వైవీ మండిపడ్డారు. కడప స్టీల్ ప్లాంట్ ఇప్పటికే ప్రారంభం కావాల్సిందని, కానీ చంద్రబాబు నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికీ ప్లాంట్ ఏర్పాటులో పురోగతి లేదని మండిపడ్డారు. ఏ ఒక్కరోజైనా ఉక్కు పరిశ్రమ గురించి మాట్లాడారా అంటూ నిలదీశారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ తమ పార్టీ సభ్యులు రాజీనామా చేసిన ఎంపీ స్థానాలకు తప్పనిసరిగా ఎన్నికలు వస్తాయని అన్నారు. -
ఉక్కు కోసం ఉద్యమిద్దాం
సాక్షి, కడప కార్పొరేషన్ : కడప ఉక్కు పరిశ్రమ బీజేపీ ప్రభుత్వం వేసే భిక్ష కాదని, పార్లమెంటులో చేసిన చట్టమని, హక్కుదారులు కావాలంటే ప్రజలంతా కలిసికట్టుగా ఉద్యమించాలని అఖిపక్షనేతలు పిలుపునిచ్చారు. కడపలోని వైఎస్ఆర్ స్మారక ప్రెస్‌క్లబ్‌లో ఉక్కు ఫ్యాక్టరీ సాధన కోసం ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఆంజనేయులు అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె. సురేష్‌బాబు మాట్లాడుతూ జిల్లాకు పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు రావాలని వైఎస్ఆర్ కలలు కనేవారన్నారు. ఈ మేరకే ఆయన హయాంలో జమ్మలమడుగు వద్ద బ్రాహ్మణి ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేశారన్నారు. బ్రాహ్మణి యాజమాన్యం రూ.1800కోట్లు ఖర్చు చేసి పరిశ్రమ ఏర్పాటు చేసిందని, రూ.1200కోట్లు ఖర్చు చేస్తే అది పూర్తవుతుందన్నారు. అయితే దురదృష్టవశాత్తు మొదటి నుంచి జిల్లాకు ఉక్కు పరిశ్రమ రావడం చంద్రబాబుకు ఇష్టం లేదన్నారు. ఉక్కు పరిశ్రమను విభజన చట్టంలో పొందుపరిచారని, పరిశ్రమ స్థాపనకు కావలసిన ఎయిర్‌పోర్టు, రైల్వే, విద్యుత్, నీరు, వనరులు వంటి అన్ని అనుకూలతలు ఇక్కడ ఉన్నా అది రాకపోవడానికి ప్రధాన కారణం టీడీపీయేనని ధ్వజమెత్తారు. నాలుగేళ్లపాటు కలిసి పోరాడుదామంటే ముందుకు రాని టీడీపీకి ఈరోజు ప్రతిపక్షాలు కనిపించాయా అని ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చే ఎంగిలి మెతుకులకు ఆశపడి లక్షల కోట్లు పచ్చచొక్కాల వారికి పంచేసి పబ్బం గడుపుకున్నారని ధ్వజమెత్తారు, ఉక్కు పరిశ్రమ వల్లే విశాఖపట్నం అంతపెద్ద నగరంగా అభివృద్ధి చెంది, 42 శాతం ఆదాయాన్నిస్తోందన్నారు. కడపకు ఉక్కు పరిశ్రమ వస్తే అదే తరహాలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని, అందరూ ఐక్యంగా సైనికుల వలే పోరాడి సాధించాలని పిలుపునిచ్చారు. ఏఐసీసీ సభ్యుడు బండి జకరయ్య మాట్లాడుతూ జెండాలు పక్కనబెట్టి ఉక్కు పరిశ్రమే ఏకైక ఎజెండాగా పోరాడాలన్నారు. నాలుగేళ్లు ఉక్కు పరిశ్రమపై పట్టించుకోని టీడీపీ ఈనాడు అఖిలపక్షాన్ని పిలవడం సిగ్గుచేటన్నారు. బీఎస్పీ నాయకులు గుర్రప్ప మాట్లాడుతూ ఉక్కు పరిశ్రమ సాధనకు అన్ని వర్గాలను ఏకం చేసి పోరాడాలని సూచించారు. జనసేన నాయకులు చలపతి మాట్లాడుతూ ఉక్కు ఫ్యాక్టరీ సాధన కోసం ఇన్నాళ్లు చేసిన పోరాటం మళ్లీ మొదటికొచ్చినట్లయ్యిందన్నారు. లీగల్ సెల్ అథారిటీ కన్వీనర్ గుర్రప్ప మాట్లాడుతూ వైఎస్ఆర్ దూరదృష్టితో ఉక్కు పరిశ్రమ స్థాపించారని, రెండు పత్రికలు మాత్రం బ్రాహ్మణి మూతపడే వరకూ విశ్రమించకుండా కథనాలు రాశాయని గుర్తు చేశారు. వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షురాలు టీపీ వెంకట సుబ్బమ్మ మాట్లాడుతూ జల్లికట్టు, తెలంగాణ ఉద్యమ తరహాలో ఉద్యమించాలని చెప్పారు. మహిళా సమాఖ్య నాయకురాలు విజయలక్ష్మి మాట్లాడుతూ ఉక్కు పరిశ్రమ సాధనకోసం ప్రాణ త్యాగానికైనా, అరెస్టులు కావడానికైనా, జైలుకెళ్లడానికైనా సిద్దమేనని తెలిపారు. ఈ సమావేశంలో ప్రజా సంఘాల నాయకులు ఐఎన్ సుబ్బమ్మ, స్టీల్‌ప్లాంటు సాధన సమితి నాయకులు సీఆర్వీ ప్రసాద్, రైతు స్వరాజ్య వేదిక శివారెడ్డి, కిషోర్ కుమార్, చల్లా రాజశేఖర్, సంబటూరు ప్రసాద్‌రెడ్డి, టి. సునీల్, విజయ్‌కుమార్, ఖాజా, షఫీ, పత్తి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. అన్నీ ఉన్నా మోడీ నోట్లో శని.. బీజేపీ కళ్లున్న కబోదిలా వ్యవహరించింది. నాలుగేళ్లు కమిటీల పేరుతో కాలయాపన చేసి ఈనాడు సాధ్యం కాదని చెప్పడం దారుణం. జిల్లాలో ఉక్కు పరిశ్రమకు కావలసినంత భూమి, నీరు, రైల్వేలైన్, ఎయిర్‌పోర్టు, ముడిసరుకు ఉందని.. అన్నీ ఉన్నా మోడీ నోట్లో శని ఉన్నట్లు పరిస్థితి తయారైంది. ఉక్కు పరిశ్రమ సాధనకు చేసే ఉద్యమానికి కాంగ్రెస్ పూర్తి సహకారం ఇస్తుంది. – నజీర్ అహ్మద్, డీసీసీ అధ్యక్షుడు ఉక్కు ఉద్యమానికి ఏపీయూడబ్లు్యజే మద్దతు... కడపలో ఉక్కు పరిశ్రమ సాధనకు అఖిలపక్షం ఆధ్వర్యంలో చేసే ఉద్యమానికి ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్(ఏపీయూడబ్లు్యజే) పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ఆ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పి. రామసుబ్బారెడ్డి తెలిపారు. విభజనతో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందని, విభజన చట్టంలో ఉన్న ఉక్కు పరిశ్రమను ఇన్నాళ్లు ఇస్తాం, ఇస్తాం అని ఊరించిన కేంద్రం ఒక్కసారిగా సాధ్యం కాదని చెప్పడం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఆర్ఎస్ రెడ్డి, జయపాల్, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఉక్కు ఉద్యమం పల్లెల వరకూ పాకాలి.. ఉక్కు ఉద్యమం పల్లెల వరకూ పాకాలి. అందుకోసం విస్తృత ప్రచారం చేయాలి. ద్రోహం చేసిన వారు, ఆ ద్రోహానికి సహకరించిన వారు కూడా దోషులే. అన్యాయం చేసేవారితో చేతులు కలపొద్దని, ద్రోహులను ఏకాకిని చేసి ఉక్కు పరిశ్రమ ఒక్కటే ఏకైక ఎజెండాగా పోరాడాలి. అమరావతికి భూమిపూజ చేసేటప్పుడు మట్టి, నీళ్లు తెచ్చి మొఖాన కొట్టిన మోడీ, ఈనాడు రాయలసీమ ఆశలపై నీళ్లు చల్లారు. – ఈశ్వరయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి -
టీడీపీ, బీజేపీ దొంగాట
సాక్షి, అమరావతి: కడపలో స్టీల్‌ప్లాంటు ఏర్పాటు చేయాలనే చిత్తశుద్ధి బీజేపీ, టీడీపీలకు ఏమాత్రం లేదన్న విషయం అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు సాక్షిగా రుజువైంది. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయరాదని నాలుగేళ్ల క్రితమే టీడీపీ –బీజేపీ ద్వయం నిర్ణయించుకున్నట్లు కేంద్ర ప్రభుత్వ అఫిడవిట్ సాక్షిగా తేలిపోయింది. కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయడం వీలుకాదని నాలుగేళ్ల కిత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసినట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా సుప్రీం కోర్టుకు రాతపూర్వకంగా సమర్పించిన అఫిడవిట్లోనే స్పష్టం చేసింది. వెనుకబడిన కడపలో ఫ్యాక్టరీ ఏర్పాటుచేసేది లేదని కేంద్ర ప్రభుత్వం తెలియజేసిన తర్వాత కూడా మూడున్నరేళ్లు బీజేపీతో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కాపురం చేసింది. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా రెండు మంత్రి పదవులను కూడా అనుభవించింది. అత్యంత వెనుకబడిన ప్రాంతమైన కడపలో పరిశ్రమ ఏర్పాటు చేసేది లేదని కేంద్రం తెలియజేసిన తర్వాత కూడా గత మూడున్నరేళ్ల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీని పలుమార్లు పొగిడారు. ఢిల్లీకి వెళ్లి సన్మానాలు చేశారు. స్టీల్‌ప్లాంటు ఏర్పాటు చేయకపోతే రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని తెలిసినా ప్రధానమంత్రి మోదీతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫ్రెండ్షిప్ కొనసాగింది. ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేది లేదని బయటకు చెప్పకుండా దాచిపెట్టి ఇద్దరూ దొంగ నాటకాలు ఆడుతూ వచ్చారు. వెనుకబడిన రాయలసీమలోని కడపలో ఉక్కు కర్మాగారం పెట్టి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని, ఆ ప్రాంతాన్ని పారిశ్రామికంగా, ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే ధ్యాస చంద్రబాబుకు గానీ, బీజేపీకి గానీ ఏ కోశానా లేదని దీనిని బట్టి తేటతెల్లమవుతోంది. ఫ్యాక్టరీ రాదన్న విషయాన్ని నాలుగేళ్లు దాచిపెట్టి ప్రజలను మోసం చేసింది చాలక.. స్టీల్‌ప్లాంటు రాదని ఇప్పుడే తెలిసినట్లుగా.. దీని సాధన కోసం ఆమరణ దీక్ష చేస్తామంటూ టీడీపీ నేతలు ప్రజలను ఇంకా మభ్యపెట్టేందుకు పూనుకోవడం గమనార్హం. బాధ్యులెవరు? వెనుకబడిన రాయలసీమలోని వైఎస్సార్ కడప జిల్లాలో నాలుగేళ్లుగా ఉక్కు కర్మాగారం నిర్మాణానికి కనీసం శంకుస్థాపన కూడా జరగకపోవడానికి బాధ్యులెవరు? విభజన చట్టంలో ఉన్న ‘కడప ఉక్కు’ సాకారం చేయడంలో విఫలమైంది ఎవరు? అ ప్రశ్నలు ఎవరిని అడిగినా రాష్ట్రంలోని టీడీపీ సర్కారు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాలేనని ఠక్కున సమాధానం చెబుతారు. క్రియారహితంగా వ్యవహరించడం ద్వారా కడప ఉక్కు కర్మాగారం అనే రాష్ట్ర ప్రజల కలను చెదరగొట్టిన తెలుగుదేశం పాలకులే ఇప్పుడు కడప ఉక్కు సాధన కోసం నిరసన ప్రదర్శనలు, బందులు నిర్వహిస్తామంటూ కొత్త నాటకానికి తెరలేపడం చూసి ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాక్టరీ నిర్మాణం కోసం ఏమాత్రం చిత్తశుద్ది చూపకుండా నాలుగేళ్లు మోసం చేసిన తెలుగుదేశం నాయకులు ఎన్నికల సంవత్సరం కావడంతో ప్రజలను మభ్యపెట్టేందుకు ఆమరణదీక్ష, బందులంటూ కుయుక్తులు పన్నుతున్నారని రాయలసీమకు చెందిన రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఆర్థిక అంశం ఒక్కటే కాదు ‘కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయడం లాభదాయకం కాదని సెయిల్ 2014 డిసెంబరులో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ప్రభుత్వ రంగ సంస్థలతో పరిశ్రమ ఏర్పాటుకు.. లాభదాయకమా? కాదా? అనే అంశం ఒక్కటే ప్రామాణికం కాదు. వెనుకబడిన ప్రాంతాల్లో ఆర్థిక, పారిశ్రామిక ప్రగతి, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన లక్ష్యాల కోసం ప్రభుత్వ రంగ సంస్థలతో పరిశ్రమలు ఏర్పాటు చేయించి ఆర్థికంగా నిలదొక్కుకుని నడిచేలా ఆర్థిక వెసులుబాట్లను ప్రభుత్వంకల్పించాలి. లాభదాయకత మాత్రమే చూసుకోవడానికి ప్రభుత్వమేమీ వ్యాపార సంస్థ కాదు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, ఉద్యోగాల కల్పన, పారిశ్రామిక ప్రగతి అన్నీ ప్రభుత్వ బాధ్యతలు. ఈ బాధ్యతల కోసం ప్రభుత్వ రంగ సంస్థలకు రాయితీలు ఇచ్చి వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. టీడీపీ ప్రభుత్వం ఇవే అంశాలను ప్రస్తావించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చింటే ఎప్పుడో కడపలో ఉక్కు కర్మాగారం నిర్మాణ పనులు ఆరంభమై ఉండేవి. దురదృష్టవశాత్తూ టీడీపీ సర్కారు ఈ దిశగా పనిచేయలేదు...’ అని పరిశ్రమల శాఖపై అపార అనుభవం ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి వివరించారు. ‘ఇప్పటికైనా టీడీపీ, బీజేపీలు ఓట్ల డ్రామాలు కట్టిబెట్టి వెనుకబడిన కడపలో స్టీల్‌ప్లాంటు ఏర్పాటుకు తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఈ కర్మాగారం ఏర్పాటు ఆర్థికంగా ఆచరణ సాధ్యం కాదని ఎప్పుడో సెయిల్ చెప్పింది. మూడున్నరేళ్ల కిత్రమే ఈ విషయం చంద్రబాబుకు తెలుసు. మరి ఇప్పుడు ఇదేదో కొత్తగా జరిగినట్లు దీనికి నిరసనగా ఆమరణ నిరాహారదీక్ష చేస్తామని టీడీపీ నేతలు ప్రకటించడం విడ్డూరంగా ఉంది. సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర హక్కులను తాకట్టు పెట్టి ఇప్పుడు ఓట్ల కోసం ఉద్యమం అంటే నమ్మడానికేమైనా ప్రజలు అమాయకులా’ అని కాంగ్రెస్, వామపక్షాల నేతలు ఎద్దేవా చేస్తున్నారు.. కాంగ్రెస్‌దీ తప్పే... కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని పునర్వ్యవస్థీకరణ చట్టంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా పేర్కొనలేదు. కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) రాష్ట్ర పునర్విభజన (అపాయింటెండ్) తేదీ (2014 జూన్ 2) నుంచి ఆరు నెలల్లోగా నివేదిక సమర్పించాలని కేంద్ర పునర్విభజన చట్టంలో ఉంది. దీని ప్రకారం 2014 డిసెంబరులో సెయిల్ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. పరిశ్రమ ఏర్పాటు చేయాలి అని కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టంగా పేర్కొని ఉంటే ఈ సమస్యే వచ్చేది కాదంటూ బీజేపీ నేతలు తప్పించుకునే ప్రయత్నం చేస్తుండటం గమనార్హం. వైఎస్ కృషివల్లే కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుచేస్తామని రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొనడానికి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేసిన బీజాలే కారణం. కడప జిల్లాలో బ్రహ్మణి ఉక్కు కర్మాగారం ఏర్పాటు కోసం జమ్మలమడుగు నియోజకవర్గంలో వైఎస్ సర్కారు భూములు కేటాయించింది. 20వేల మందికి ప్రత్యక్షంగా, లక్షమందికి పరోక్షంగా ఉపాధి కల్పించాలనే ధ్యేయంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బ్రహ్మణి స్టీల్ ప్లాంటు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 10 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో, రూ.20వేల కోట్లు అంచనా వ్యయంతో బ్రహ్మణీ స్టీల్స్‌కు 2007 జూన్10న భూమి పూజ చేశారు. రూ. 1500 కోట్ల కోట్లతో నిర్మాణ పనులు కూడా జరిగాయి. స్టీల్ ఫ్లాంట్ పనులు వేగంగా సాగుతున్న సమయంలో వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోవడంతో బ్రహ్మణీ స్టీల్స్‌కు రాజకీయ గ్రహణం పట్టింది. ఈ కర్మాగారానికి కేటాయించిన భూమిని, గనులను, నీటి కేటాయింపులను టీడీపీ సర్కారు రద్దు చేసింది. తద్వారా బ్రహ్మణి ఉక్కు కర్మాగారం ఏర్పాటు కాకుండా అడ్డుకట్ట వేసింది. కనీసం దీని స్థానంలో ప్రభుత్వ రంగ సంస్థతో భారీ స్టీల్‌ప్లాంటు నిర్మాణానికి చొరవ తీసుకోవాల్సిన చంద్రబాబు సర్కారు.. విభజన చట్టంలోని హామీ అమలు కోసం కూడా చిత్తశుద్ధితో కృషి చేయకుండా రాజకీయ డ్రామాలు ఆడుతూ వచ్చింది. -
ఉక్కు ఫ్యాక్టరీ ఏపీ ప్రజల అసలైన ఆకాంక్ష
తూర్పుగోదావరి జిల్లా: కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్విటర్ ద్వారా ప్రశ్నించారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అసలైన ఆకాంక్షని వ్యాఖ్యానించారు. కడప ఉక్కు ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా కేంద్రం ఇచ్చిన అఫిడవిట్‌ను చూస్తే ఏపీ సంక్షేమం పట్ల కేంద్రానికి ఉన్న చిత్తశుద్ధిపై సందేహం కలుగుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏంటో మొదటి నుంచి టీడీపీకి తెలుసునని, కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం అకస్మాత్తుగా టీడీపీ ఇప్పుడు ఆందోళన చెందడం ప్రజలను మోసం చేయడం కిందకే వస్తుందని ధ్వజమెత్తారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో కేంద్రం స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తుందని ట్విటర్ ద్వారా పేర్కొన్నారు. -
ఉక్కు పరిశ్రమ సాధించే వరకూ పోరాటం ఆగదు
-
మోదీ,బాబు కలిసి ఉక్కు ఫ్యాక్టరీ రాకుండా చేశారు
-
‘ముందు కుస్తీ పోటీలంటారు.. ఆ తర్వాత..’
సాక్షి, విజయవాడ: వైఎస్సార్ కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ నిర్మించక పోవడం అన్యాయమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు తెలిపారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ నేతలు ఇపుడు గగ్గోలు పెడుతున్నారు.. నాలుగేళ్లు కేంద్రంతో కలిసి ఉన్నపుడు ఎందుకు ప్రశ్నించలేదన్నారు. కడపలో ఉక్కు పరిశ్రమ సాధ్యం కాదని కేంద్రం చెప్పింది. కానీ అపుడు ఎన్డీయేలో టీడీపీ ఉంది కాబట్టి ఏమీ మాట్లాడలేదన్నారు. ఆరునెలల్లో ఉక్కు పరిశ్రమ నిర్మాణం చేపడుతామని.. ఆ మేరకు విభజన చట్టంలోని 13 వ షెడ్యూల్లో ఉందని తెలిపారు. దొంగలు పడ్డ ఆరునెలలకు టీడీపీ నేతలు మొరుగుతున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబులు కలిసి రాష్ట్రాన్ని అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. విభజన హామీలపై చివరిదాకా పోరాడేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే అని స్పష్టం చేశారు. కేవలం ప్రజలను మభ్య పెట్టేందుకు టీడీపీ దీక్షల డ్రామాలాడుతోందన్నారు. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని ప్రజలు తిరస్కరించారని, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి ఆయనకు ఉందా అని ప్రశ్నించారు. టీడీపీ నేతలు ముందు కుస్తీ పోటీలంటారు.. ఆ తర్వాత మోదీ కాళ్లు పట్టుకుంటారని ఎద్దేవా చేశారు. -
కడప ఉక్కు - ఆంధ్రుల హక్కు
సాక్షి, కడప : ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కేంద్రం నిరాకరించిన నేపథ్యంలో జిల్లాలో ఉక్కుపోరాటం ఉదృతమౌతోంది. కడప ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ వైఎస్సార్సీపీ శ్రేణులు కదం తొక్కాయి. పరిశ్రమ సాధంచే వరకూ వెనకడుగు వేసేది లేదంటూ ముందుకు కదులుతున్నాయి. ఈ మేరకు వైఎస్సార్సీపీ నాయకుల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. కడపలోని అంబేడ్కర్ కూడలి వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రాజ్యాంగ సృష్టి కర్తకు పూలమాలలు వేసి, విగ్రహం ముందు బైఠాయించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరికి నిరసనగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ కడపలో ఉక్కు పరిశ్రమ సాధించే వరకూ తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ ఆందోళనలో మైదుకూరు ఎమ్మెల్యే రఘురామి రెడ్డి, కడప, పార్లమెంట్ అధ్యక్షులు సురేస్ బాబు, రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, నగర అధ్యక్షుడు పులి సునీల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. రాజంపేటలో వామపక్షాల ఆందోళన : కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ స్థాపించాలని డిమాండ్ చేస్తూ రాజంపేటలో వామపక్ష పార్టీలు ఆందోళనకు దిగాయి. పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద చెవిలో పూలు పెట్టుకొని వినూత్న నిరసన వ్యక్తం చేశారు. కడప ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. రాష్టానికి అన్యాయం చేసిన బీజేపీని తరిమి కొట్టాలని నినదించారు. -
విభజన హామీలపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని హామీల అమలు కోరుతూ కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లో కేంద్ర ప్రభుత్వం బుధవారం కౌంటర్ దాఖలు చేసింది. ఈ పిటిషన్లో ప్రతివాదులైన ఉక్కు శాఖ, ఆదాయపు పన్ను విభాగం ఈ కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేశాయి. ఏపీలోని వైఎస్సార్ జిల్లా, తెలంగాణలోని బయ్యారంలో స్టీలు ఫ్యాక్టరీల ఏర్పాటుకు గల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేస్తూ విభజన చట్టం అమలులోకి వచ్చిన ఆరు నెలల్లో యోగ్యత నివేదిక ఇవ్వాలని మాత్రమే చట్టం చెప్పిందని, ఆయా ఫ్యాక్టరీల ఏర్పాటుకు అనుకూలత లేదని సెయిల్ నివేదిక ఇచ్చిందని ఉక్కు శాఖ పేర్కొంది. తదుపరి 2016లో టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటైందని వివరించింది. 2017 డిసెంబర్ 12న ఈ కమిటీ చివరిసారిగా సమావేశమైందని, యోగ్యతపై అధ్యయనం చేస్తున్న మెకాన్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వాలు తగిన సమాచారాన్ని పంచుకోవాలని కమిటీ సూచించిందని వివరించింది. అలాగే విభజన చట్టంలో పేర్కొన్న మేరకు పన్ను రాయితీల విషయంలో అదనపు డిప్రిసియేషన్‌ను సాధారణంగా ఇచ్చే 20 శాతానికి అదనంగా మరో 15 శాతం ప్రకటించామని, అలాగే అదనపు పెట్టుబడి భత్యం కింద 15 శాతం ప్రకటించామని ఆదాయపు పన్ను శాఖ తన అఫిడవిట్లో పేర్కొంది. -
పార్లమెంట్లో వైఎస్సార్ సీపీ ఎంపీల గళం
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ సమావేశాల్లో వైస్సార్ సీపీ ఎంపీలు ప్రజాసమస్యలపై గళమెత్తారు. ఏపీకి కేంద్రం తరపున నిధులు, కేటాయింపులు అంశాలపై ప్రశ్నలు సంధించారు. ఎంపీలు అడిగిన పలు ప్రశ్నలకు కేంద్ర మంత్రులు సమాధానాలు ఇచ్చారు. ఖర్చు రూ. 6,598 కోట్లు... ఇచ్చింది రూ. 4,343 కోట్లు పోలవరంపై ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రం జవాబు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2014 ఏప్రిల్ 1 నుంచి 2017 జూలై వరకూ రూ.6,598 కోట్లు వ్యయం చేయగా కేంద్రం రూ.4,343 కోట్లను విడుదల చేసిందని కేంద్ర జలవనరులశాఖ సహాయ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ తెలిపారు. వైఎస్సార్ సీపీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి సోమవారం రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. 2014 మార్చి 31వరకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రూ.5135.87 కోట్లు ఖర్చు చేసిందన్నారు. కేంద్రం వాటాగా రూ.562.47 కోట్లు విడుదల చేసినట్లు వివరించారు. పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లింపులో అక్రమాలు జరగటంపై విజయసాయిరెడ్డి అడిగిన మరో ప్రశ్నకు మేఘవాల్ సమాధానమిస్తూ... రాష్ట్ర ప్రభుత్వం తమకు అందించిన సమాచారం మేరకు అలాంటి సంఘటనలు జరిగిన మాట వాస్తవమేనన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 30 కుటుంబాలు మైనర్ పిల్లలను మేజర్లుగా చూపి పరిహారం పొందేందుకు ప్రయత్నించాయన్నారు. ఈ కేసులను విచారించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలవరం స్టేషన్ హౌస్ ఆఫీసర్‌ను ఆదేశించినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం తమకు తెలియజేసిందన్నారు. విశాఖ జిల్లాలో ఉపాధి వేతనాలు ఆగలేదు విశాఖ జిల్లాలోని 13 మండలాల్లో ఉపాధి హామీ కింద చెల్లించాల్సిన వేతనాలు 3 నెలలుగా పోస్టల్ శాఖ నిర్లక్ష్యం వల్ల నిలిచిపోవటం కేంద్రం దృష్టికి వచ్చిందా? అని విజయసాయిరెడ్డి అడిగిన మరో ప్రశ్నకు కేంద్ర మంత్రి రామ్‌కృపాల్ యాదవ్ సమాధానమిస్తూ వేతనాల చెల్లింపులో ఎలాంటి జాప్యం జరగలేదన్నారు. ఉపాధి హామీ పనులు చేసిన వారు పోస్టాఫీసుకు వచ్చిన వెంటనే బకాయిల చెల్లింపులు జరుగుతున్నాయన్నారు. వైఎస్సార్ జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి : ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి వైఎస్సార్ జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఆయన సోమవారం లోక్‌సభలో నిబంధన–377 కింద ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘‘వైఎస్సార్ జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. వైజాగ్ స్టీల్ వంటి భారీ ప్లాంట్లను గమనిస్తే ముడి ఇనుప ఖనిజాన్ని దూర ప్రాంతాల నుంచి తీసుకురావాల్సి వస్తోంది. అయినప్పటికీ అవి లాభాల బాటలో నడుస్తున్నాయి. వైఎస్సార్ జిల్లాతోపాటు చుట్టుపక్కల ముడి ఇనుప ఖనిజం నిల్వలు విస్తారంగా ఉండగా, లాభదాయకతపై ప్రశ్నలు ఎందుకు ఉత్పన్నమవుతున్నాయి?’’ అని అవినాష్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. శనగ పంటకు బీమా గడువు పొడిగించండి రబీలో సాగు చేసిన శనగ పంటకు బీమా ప్రీమియం చెల్లించేందుకు గడువును ఈ నెల 22 వరకు పొడిగించాలని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కేంద్ర వ్యవసాయ శాఖ జాయింట్ సెక్రెటరీ అశిష్‌కుమార్ బుటానీని కోరారు. ఈ మేరకు సోమవారం ఢిల్లీలో ఆయన బుటానీని కలిసి కోరారు. రెండో తరగతి వరకు స్కూల్ బ్యాగులు వద్దు లోక్‌సభలో ఎంపీ మేకపాటి ప్రశ్నకు కేంద్రం సమాధానం చిన్నారులు రెండో తరగతి వరకు స్కూల్ బ్యాగులు మోయకుండా చూడాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) గతేడాది సెప్టెంబరులో సర్క్యులర్ జారీ చేసినట్టు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి ఉపేంద్ర కుష్వాహా తెలిపారు. వైఎస్సార్సీపీ లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి సోమవారం అడిగిన రాతపూర్వక ప్రశ్నకు ఆయన సభలో సమాధానం ఇచ్చారు. ఒకటి, రెండు తరగతులకు కేవలం రెండు పుస్తకాలను(భాష, గణితం) మాత్రమే ఎన్సీఈఆర్టీ సిఫార్సు చేసిందని, అలాగే మూడు, నాలుగు, ఐదో తరగతులకు భాష, పర్యావరణ అధ్యయనం, గణితం వంటి మూడు పుస్తకాలనే సిఫార్సు చేసిందన్నారు. కేంద్రీయ విద్యాలయాల్లో చదివే ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేస్తామన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలపై సమాచారం సేకరిస్తున్నాం దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆత్మహత్యలపై సమాచారం సేకరిస్తున్నామని కేంద్ర సహాయ మంత్రి ఉపేంద్ర కుష్వాహా తెలిపారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి సంబంధిత సమాచారాన్ని సేకరించే పనిలో ఉన్నట్టు రాతపూర్వకంగా తెలిపారు. సోమవారం ఆయన లోక్‌సభలో సభ్యుడు జితేంద్ర చౌదరి అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. స్టీల్ ప్లాంట్‌పై టాస్క్‌ఫోర్స్ నివేదిక ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని షెడ్యూల్ 13 ప్రకారం వైఎస్సార్ జిల్లాలో ఏర్పాటు చేయాల్సిన సమీకృత స్టీల్ ప్లాంట్‌పై అధ్యయనం చేస్తున్న టాస్క్‌ఫోర్స్ కమిటీ ఇప్పటివరకు నివేదిక ఇవ్వలేదని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి విష్ణుదేవ్ సాయి తెలిపారు. ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, ఎం.మురళీమోహన్ సోమవారం అడిగిన రాతపూర్వక ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఇంకా తాత్కాలిక క్యాంపస్‌లలోనే జాతీయ విద్యాసంస్థలు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీల మేరకు ఏపీలో ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఎం, ఐఐఎస్ఈఆర్ తదితర జాతీయ విద్యాసంస్థలన్నీ ప్రారంభమయ్యాయని, అయితే ఇవన్నీ ఇంకా తాత్కాలిక క్యాంపస్‌లలోనే నడుస్తున్నాయని కేంద్రం తెలిపింది. ఆయా జాతీయ సంస్థల ఏర్పాటులో పురోగతి, ఇంకా శాశ్వత ప్రాంగణాల్లోకి రాకపోవడానికి గల కారణాలపై వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు సోమవారం లోక్‌సభలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ సత్యపాల్ సింగ్ సమాధానమిచ్చారు. సెంట్రల్ వర్సిటీ, ట్రైబల్ వర్సిటీలు ఇంకా ప్రారంభం కాలేదని, పార్లమెంటులో సంబంధిత బిల్లులు ఆమోదం పొందిన మీదట ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ రెండు వర్సిటీలకు 2017–18 బడ్జెట్లో రూ.8 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. ‘పోలవరం’ అంచనాలపై సీడబ్ల్యూసీ స్పష్టత కోరింది పోలవరం జాతీయ ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని 2013–14 ధరల సూచీ ప్రకారం రూ.58,319.06 కోట్లకు సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపగా, కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) పరిశీలించి స్పష్టత కోరిందని కేంద్రం తెలిపింది. రాజ్యసభలో ఎంపీ కేవీపీ రామచంద్రరావు అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ సోమవారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. సీడబ్ల్యూసీ చేసిన పరిశీలన మేరకు తగిన మార్పులు చేసిన పక్షంలో ఆమోదం లభిస్తుందని తెలిపారు. భూములు ఇస్తే సీబీ ఇండస్ట్రియల్ కారిడార్ చెన్నై–బెంగళూరు పారిశ్రామిక కారిడార్ ప్రాజెక్టును కేంద్రం 2016 డిసెంబర్లో ఆమోదించిందని, ఏపీకి సంబంధించిన ప్రాజెక్టు అభివృద్ధి పనులు రాష్ట్రప్రభుత్వం భూములు అప్పగిస్తే ప్రారంభమవుతాయని కేంద్ర సహాయ మంత్రి సీఆర్ చౌదరి తెలిపారు. ఎంపీ అవినాశ్ రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు. -
కడప ఉక్కు రాయలసీమ హక్కు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లా కడపలో ఉక్కు కర్మాగారం కోసం 5 నెలలగా ప్రజలు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ధ్వజమెత్తారు. ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తామని విభజన చట్టంలో ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీలు కత్తి నరసింహారెడ్డి, వై.శ్రీనివాసులరెడ్డి, రాము సూర్యారావు, బొడ్డు నాగేశ్వరరావు సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. కడప ఉక్కు రాయలసీమ హక్కు అని దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని కత్తి నరసింహారెడ్డి హెచ్చరించారు. రాష్ట్ర విభజనకు ముందు ఖాళీగా ఉన్న 1.86 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని శ్రీనివాసులరెడ్డి డిమాండ్ చేశారు. అలాగే శాసనసభ, శాసన మండలి సమావేశాలు ముగిసేలోగా రాష్ట్రంలో తెలుగు భాషను తప్పనిసరి చేస్తూ ఆర్డినెన్స్ చేయాలని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మున్సిపల్ పాఠశాలల్లో ఇంగ్లీష్ మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ విడుదల చేసిన జీవో నంబర్ 14ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కర్నాటక, తమిళనాడులో ప్రాంతీయ భాషను తప్పనిసరి చేశారన్నారు. -
స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయండి
► రాజ్యసభలో విజయసాయిరెడ్డి ప్రత్యేక ప్రస్తావన న్యూఢిల్లీః ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని 13వ షెడ్యూలులో పొందుపరిచిన నిబంధన మేరకు వైఎస్సార్ కడప జిల్లాలో స్టీలు ప్లాంటు ఏర్పాటు చేయాల్సి ఉందని, ఈ దిశగా తగిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ వి.విజయసాయిరెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈమేరకు ఆయన ఈ అంశాన్ని గురువారం ప్రత్యేక ప్రస్తావనల కింద లేవనెత్తారు. విభజన జరిగిన సమయం నుంచి 6 నెలల్లో సెయిల్ ఈ ప్లాంటు ఏర్పాటుకు యోగ్యత అధ్యయనాన్ని పూర్తిచేయాల్సి ఉందని గుర్తుచేశారు. ఎట్టకేలకు రెండేళ్ల అనంతరం స్టీలు ప్లాంటు ఏర్పాటుకు రోడ్ మ్యాప్ తయారుచేయడానికి ఒక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశారని, కానీ ఇప్పటివరకు పురోగతి లేదని వివరించారు. పొరుగున ఉన్న అనంతపురం, కర్నూలు జిల్లాల తరహాలోనే వైఎస్సార్ జిల్లా ఐరన్ ఓర్ నిల్వలు ఉన్నాయన్నారు. ఈ ప్లాంటు ఏర్పాటు చేస్తే రాయలసీమ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని వివరించారు. ఈ ప్రాంతంలో నిరుద్యోగిత తీవ్రంగా ఉందని, సామాజిక–ఆర్థిక స్థితిగతులు సరిగ్గా లేవని వివరించారు. స్టీల్ ప్లాంట్ సాధన సమితి, కడప ఉక్కు పోరాట కమిటీ ఈ ప్లాంటు ఏర్పాటు కోసం పోరాటం చేస్తున్నాయని గుర్తుచేశారు. ఈ పరిస్థితుల దృష్ట్యా స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. -
కడప ఉక్కు కోసం ఉద్యమిద్దాం
కడప సెవెన్‌రోడ్స్: ప్రభుత్వాల మెడలు వంచి కడపలో ఉక్కు పరిశ్రమను సాధించుకోవడానికి ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు గఫూర్ పిలుపునిచ్చారు. గురువారం కలెక్టరేట్ ఎదుట ఆ పార్టీ నిర్వహించిన ధర్నాలో ఆయన ప్రసంగించారు. కడపలో స్టీల్ ప్లాంటు నిర్మించాలని విభజనచట్టంలో పేర్కొన్నా కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. అంతర్జాతీయంగా ఉక్కు ధరలు తగ్గడాన్ని సాకుగా చూపెడుతూ ఆ పరిశ్రమలు ఏర్పాటు లాభదాయకం కాదని కేంద్రం మాట్లాడటం తగదన్నారు. సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసి కరువు ప్రాంతంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వెనుకబడిన రాయలసీమ, ఉత్తర కోస్తా జిల్లాలకు బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. రాయలసీమకు రూ. 50 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గాలేరు–నగరి, హంద్రీ–నీవా ప్రాజెక్టులకు నిధులు కేటాయించి మూడేళ్లలో పూర్తి చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఆంజనేయులు కోరారు. శ్రీశైలం రిజర్వాయర్‌లో కనీస నీటిమట్టం 854 అడుగులు నిల్వ చేయాలన్నారు. జిల్లాపై ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసరిస్తున్న వివక్షపై తీవ్రంగా ధ్వజమెత్తారు. కేసీ ఆయకట్టు స్థిరీకరణకు రాజోలి, జొలదరాశి రిజర్వాయర్లను నిర్మించాలన్నారు. ఖరీఫ్‌లో వేరుశనగను నష్టపోయిన రైతులందరికీ పరిహారం ఇవ్వాలని, రబీలో ఉచితంగా ఎరువులు, విత్తనాలు ఇవ్వాలని, రుణాలు రీషెడ్యూల్డ్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు చంద్రశేఖర్, ఎ.రామ్మోహన్‌రెడ్డి, చంద్రశేఖర్, ఓ.శివశంకర్, సావంత్ సుధాకర్, పాపిరెడ్డి, దస్తగిరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.