సాక్షి, అమరావతి : వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్ జిల్లా వాసుల చిరకాల స్వప్పమైన స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లి - పెద్దనందులూరు పంచాయతీల మధ్య ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు అనుమతిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 26న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేయనున్నారు.
2013 కంపెనీల చట్టం ప్రకారం ఈ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ పేరిట ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయనున్నారు. వంద శాతం పెట్టుబడులను రాష్ట్ర ప్రభుత్వమే పెడుతుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. స్టీల్‌ప్లాంట్ నిర్మాణం కోసం 2019-20 బడ్జెట్‌లో రూ. 250కోట్లను కేటాయించారు. ఇబ్రహీంపట్నంలోని ఇన్‌క్యాప్ కార్యాలయాన్ని ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ రిజిస్టర్ కార్యాలయంగా పేర్కొన్న ప్రభుత్వం.. పరిశ్రమశాఖ ముఖ్య కార్యదర్శి రజత్ భార్గవ, గనుల శాఖ కార్యదర్శి కె.రామ్ గోపాల్‌ను డైరెక్టర్లుగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment