
సాక్షి,అమరావతి: ఎస్సార్ గ్రూప్ ప్రతినిధులు బుధవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఆంధ్రప్రదేశ్‌లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఎస్సార్ గ్రూపు సన్నద్దత వ్యక్తం చేసింది. అలానే వైయస్సార్ కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కూడా ముందుకొచ్చింది. ఈ యేడాది నవంబరులో స్టీల్ ప్లాంట్ పనులకు శంకుస్ధాపన చేస్తామని ఎస్సార్ గ్రూపు ప్రతినిధులు సీఎం జగన్‌కు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్‌ను కలిసిన వారిలో ఎస్సార్ గ్రూప్ హెడ్ ప్రశాంత్ రుయా, వైస్ ఛైర్మన్ జె మెహ్రా, ఏపీ పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment