‘కడప స్టీల్‌ ప్లాంట్‌’కు భారీ స్పందన | Huge response to Kadapa Steel Plant | Sakshi

‘కడప స్టీల్‌ ప్లాంట్‌’కు భారీ స్పందన

Aug 6 2020 3:33 AM | Updated on Aug 6 2020 4:41 AM

Huge response to Kadapa Steel Plant - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కడప స్టీల్‌ ఉక్కు కర్మాగారం (ఏపీ హైగ్రేడ్‌ స్టీల్స్‌ లిమిటెడ్‌–ఏపీహెచ్‌ఎస్‌ఎల్‌)లో భాగస్వామ్యం కావడానికి దేశీయ, అంతర్జాతీయ ఉక్కు దిగ్గజ కంపెనీలు ముందుకు వచ్చాయి. ఈ ప్రాజెక్టులో చేరడానికి ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌ (ఈవోఐ) కోరుతూ పిలిచిన టెండర్లలో అయిదు దేశీయ, రెండు అంతర్జాతీయ అతిపెద్ద ఉక్కు తయారీ కంపెనీలు ఆసక్తిని వ్యక్తం చేసినట్లు ఏపీహెచ్‌ఎస్‌ఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎస్‌.షాన్‌ మోహన్‌ ‘సాక్షి’కి తెలిపారు.

► జూలై 31తో ముగిసిన టెండర్లకు ఈ స్థాయిలో స్పందన రావడంపై అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 
► పలు ఆర్థిక ప్రతిపాదనలతో రావాల్సిందిగా రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌ (ఆర్‌ఎఫ్‌పీ) టెండర్లను త్వరలో జారీ చేయనున్నారు.
► ట్రాన్సాక్షన్‌ అడ్వైజరీగా వ్యవహరిస్తున్న ఎస్‌బీఐ క్యాప్‌ ఈ టెండర్ల ప్రతిపాదనలను సిద్ధం చేస్తోంది.
► ఈ ప్రతిపాదనల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం ఇవ్వడానికి ముందుకు వచ్చిన కంపెనీని భాగస్వామిగా ఎంపిక చేస్తారు.
► ఏడాదికి 3 మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో  వైఎస్సార్‌ కడప జిల్లా సున్నపురాళ్లపల్లి, పెదనందలూరు గ్రామాల్లో 3,591.65 ఎకరాల్లో ఉక్కు కర్మాగారాన్ని నిర్మించడానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గతేడాది డిసెంబర్‌ 23న శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. 
► ఇప్పటికే సివిల్‌ పనులు శరవేగంగా జరుగుతుండగా, వచ్చే జనవరి నుంచి ప్రధాన ప్లాంటు పనులు ప్రారంభమయ్యే విధంగాఏపీహెచ్‌ఎస్‌ఎల్‌ ప్రణాళికలు సిద్ధం చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement