మరో సరికొత్త నాటకానికి తెరలేపిన బాబు | AP Govt Appoints Study Committee On Kadapa Steel Plant | Sakshi
Sakshi News home page

స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకై అధ్యయన కమిటీ

Published Thu, Aug 2 2018 8:10 PM | Last Updated on Sat, Aug 18 2018 8:08 PM

AP Govt Appoints Study Committee On Kadapa Steel Plant - Sakshi

సాక్షి, అమరావతి : కడప స్టీల్‌ ఫ్యాక్టరీ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరో సరికొత్త నాటకానికి తెరలేపారు. అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల తర్వాత స్టీల్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకై సాధ్యఅసాధ్యాలు పరిశీలించేందుకంటూ కమిటీ వేశారు. ప్లానింగ్‌ కమిషన్‌ వైస్‌ చైర్మన్‌ కుటుంబరావు నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ కమిటీలో ఆరుగురు సభ్యులు ఉంటారు. స్టీల్‌ ఫ్యాక్టరీ విషయమై కేంద్ర ప్రభుత్వంతో ఈ కమిటీ చర్చించనుంది. గతంలో రెండు నెలల్లోనే స్టీల్‌ ప్లాంట్‌ అంటూ హామీలు ఇచ్చిన చంద్రబాబు.. తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు, కాలాయాపన చేసేందుకే కమిటీ అంటూ డ్రామాలాడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement