వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
తూర్పుగోదావరి జిల్లా: కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్విటర్ ద్వారా ప్రశ్నించారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అసలైన ఆకాంక్షని వ్యాఖ్యానించారు. కడప ఉక్కు ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా కేంద్రం ఇచ్చిన అఫిడవిట్‌ను చూస్తే ఏపీ సంక్షేమం పట్ల కేంద్రానికి ఉన్న చిత్తశుద్ధిపై సందేహం కలుగుతుందని అన్నారు.
కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏంటో మొదటి నుంచి టీడీపీకి తెలుసునని, కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం అకస్మాత్తుగా టీడీపీ ఇప్పుడు ఆందోళన చెందడం ప్రజలను మోసం చేయడం కిందకే వస్తుందని ధ్వజమెత్తారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో కేంద్రం స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేస్తుందని ట్విటర్ ద్వారా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment