సాక్షి, వైఎస్సార్: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలతో పాటు జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కోరుతూ... రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ నేతలు కడపలో ఆర్అండ్‌బీ అతిథి గృహం వద్ద కేంద్ర మంత్రి అనంత కుమార్ హెగ్డే కారును అడ్డుకున్నారు. జిల్లాలో ఉక్కు కర్మాగారంను వెంటనే ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఆందోళకారులు మంత్రి కారును చుట్టుముట్టి విభజన సమయంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఆందోళనకు దిగారు. బీజేపీ, ఆర్సీపీ నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. కారును అడ్డుకున్న వారిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment