జేసీ దివాకర్ రెడ్డి
సాక్షి, ఢిల్లీ : టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్కురాదు.. తుక్కురాదని నాకు తెలుసు.. ఆయనకు తెలుసని జేసీ అన్నారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదా కూడా రాదని ఎంపీ జోస్యం చెప్పారు. పప్పు బెల్లాలు చిలకరిస్తారు.. ఇవన్నీ కూడా వాస్తవాలని జేసీ పేర్కొన్నారు. ఈ విషయం నిరసన చేసే సీఎం రమేష్‌కు తెలుసు, నాకు తెలుసని చెప్పారు. ఇదంతా ప్రజలను ప్రేరేపించడానికి, ఎడ్యుకేట్ చేసేదానికి అని ఎంపీ జేసీ తనదైన శైలిలో తెలిపారు. నేడు కడప స్టీల్ ఫ్యాక్టరీ విషయమై టీడీపీ ఎంపీలు కేంద్ర ఉక్కుశాఖ మంత్రి బీరేంద్ర సింగ్‌ను కలిశారు.
‘ప్రస్తుతం మూడువేల ఎకరాలు అందుబాటులో ఉంది. మెకాన్ 18వందల ఎకరాలు కావాలని అని అడిగింది. ఆలస్యం చేయాలనే ఉద్దేశంతో 500 ఎకరాల ప్రైవేట్ భూమి కావాలంటున్నారు. ఎకరానికి రూ. 4 లక్షలు ఇస్తామని చెప్పాం.16కి.మీ రైల్వే లైన్ రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తాం. ఈ విషయంలో కేంద్రాన్ని ఇరుకున పెట్టాం. మేము విజయం సాధించలేదు. దొంగనాటకాలు, కుట్రలు జరుగుతున్నాయి. దీక్ష విరమించాలని మంత్రి ఫోన్ చేసి కోరారు. మరో 24గంటల్లో అవసరమైన సమాచారం ఇస్తామని’ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment