
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో గత నాలుగు రోజులుగా శంకుస్థాపనలు, శ్వేతపత్రాలతో బిజీ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబు చేసిన శంకుస్థాపనల రాళ్లతో పోలవరం ప్రాజెక్టు కట్టొచ్చునని వ్యాఖ్యాంచారు. పోలవరం, కడప స్టీల్ ప్లాంట్లను కేంద్ర ప్రభుత్వం చేపట్టేలా ఒత్తిడి తేవడంలో టీడీపీ ప్రభత్వం విఫలమైందని మండిపడ్డారు. పబ్లిసిటీ, గ్రాఫిక్స్ మాయలతో ప్రజల్ని ఆకర్షించేందుకు చంద్రబాబు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో శంకుస్థాపనల బాట పట్టారని ఎద్దేవా చేశారు. ‘గండికోటకు నీళ్లు రావడం వల్లనే కడపలో స్టీల్ ప్లాంట్ పెడుతున్నామని బాబు గతంలో వ్యాఖ్యానించారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి పాలనలోనే గండికోటకు నీళ్లొచ్చాయని విషయం బాబకు తెలియదా’ అని సూటిగా ప్రశ్నించారు.
కులాల పేరుతో పథకాలా...
‘జేసీ దివాకర్ రెడ్డి కులం పేరుతో సభల్లో పిచ్చికూతలు కూస్తుంటే చంద్రబాబు నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. జగన్‌కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు. టీడీపీ మేనిఫెస్టోలో కులాల పేరుతో పథకాలు పెట్టింది చంద్రబాబు కాదా’ అని శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. ‘దివాకర్ రెడ్డి సంస్కారం మరిచి వైఎస్ జగన్ గురించి వ్యాఖ్యలు చేయడం దారుణం. వైఎస్ జగన్ వందల సభల్లో మాట్లాడినా ఏనాడు సంస్కారహీనంగా మాట్లాడలేదు. కులాల పేరుతో తిట్టించి లబ్ది పొందడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య. గతంలో మోత్కుపల్లి నర్సింహులు, నాగం జనార్దన్ రెడ్డిలను ఇలాగే ఉపయోగించుకున్నారు’ అని చంద్రబాబుపై విమర్శలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment