gadikota srikanthreddy
-
‘గ్రామ సచివాలయాలతో ప్రజల వద్దకే పాలన’
సాక్షి, కడప : గాంధీ జయంతి సందర్భంగా ఆయన కన్న కల ‘గ్రామ స్వరాజ్యాన్ని’ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం చేశారని ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా అన్నారు. కడప ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మెత్తం 1.60 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్ ప్రభుత్వానిదే అన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా ఉద్యోగాలు ఇచ్చామని, ప్రతి గ్రామ సచివాలయంలో 10మందికి ఉద్యోగాలు ఇస్తున్నామని తెలిపారు. అలాగే గ్రామ సచివాలయం ద్వారా ప్రజల వద్దకే పాలన వెళ్లనుందని పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో నవరత్నాల పథకాలు అమలు చేయాలని కృషి చేస్తున్నామన్నారు. నామినేటెడ్ పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఇచ్చిన ఏకైక నాయకుడు జగన్ ఒక్కరేనని పేర్కొన్నారు. కౌలు రైతులకు మేలు కలిగేలా ప్రత్యేక చట్టం తీసుకువచ్చామని, భూ చట్టం ద్వారా రీ సర్వే చేయించనున్నామని, దీని ద్వారా భూ సమస్యలను తగ్గించడానికి సులభంగా ఉంటుందని అనుకుంటున్నామన్నారు. మానిఫేస్టోలో ఇచ్చిన ప్రతి పథకాన్ని 100 రోజుల్లో అమలు చేస్తున్నామని, ముఖ్యమంత్రి జగన్ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, ఈ ఉగాదికి 25 లక్షల మందికి రిజిస్ట్రేషన్ చేసిన భూములను ఇవ్వనున్నట్లు వెల్లడించారు. గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఎంపిక పత్రాలు ఇస్తున్నామని మంత్రి తెలిపారు. అలాగే రాష్ట్ర చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి కూడా మాట్లాడుతూ.. దేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకుని చారిత్రాత్మక నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తీసుకున్నారని అన్నారు. గాంధీ కలలు కన్న స్వరాజ్యాన్ని సీఎం జగన్ నేరవేరుస్తున్నారని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో పేజీ పేజీలు లేదని... రెండు పేజీల మ్యానిఫెస్టో మాత్రమే ఇచ్చామన్నారు. మూడు నెలల లోపే 85 శాతం మానిఫెస్టోని అమలు చేసామని, జగన్ పాలన చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు బురద చల్లుతున్నాయని అన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజులలోపే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఏకైక నాయకుడు జగన్మోహన్రెడ్డి అని పేర్కొన్నారు. టీడీపీ నేత చంద్రబాబు నాయుడు తన పచ్చమీడియా ద్వారా దుష్పచారం చేస్తున్నారని.. బాబు అక్రమ ఇంట్లో ఉంటూ ఇప్పటి వరకు దానిపై నోరు తెరవలేదని అన్నారు. చంద్రబాబు కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా పనికి రాడని విమర్శించారు. ఇప్పటికిప్పుడు జగన్ పేరు, చంద్రబాబు పేరు మీద ఓటింగ్ పెడితే 99 శాతం ఓట్లు జగన్‌కే వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నూతన మధ్యపాలసీ అమలు చేస్తున్నామని, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇసుక అందించాలని ఆదేశాలు జారీ చేశామని ఆయన వెల్లడించారు. -
కులాల పేరుతో పథకాలా...
-
‘శంకుస్థాపన రాళ్లతో పోలవరం కట్టొచ్చు’
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో గత నాలుగు రోజులుగా శంకుస్థాపనలు, శ్వేతపత్రాలతో బిజీ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చంద్రబాబు చేసిన శంకుస్థాపనల రాళ్లతో పోలవరం ప్రాజెక్టు కట్టొచ్చునని వ్యాఖ్యాంచారు. పోలవరం, కడప స్టీల్ ప్లాంట్లను కేంద్ర ప్రభుత్వం చేపట్టేలా ఒత్తిడి తేవడంలో టీడీపీ ప్రభత్వం విఫలమైందని మండిపడ్డారు. పబ్లిసిటీ, గ్రాఫిక్స్ మాయలతో ప్రజల్ని ఆకర్షించేందుకు చంద్రబాబు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో శంకుస్థాపనల బాట పట్టారని ఎద్దేవా చేశారు. ‘గండికోటకు నీళ్లు రావడం వల్లనే కడపలో స్టీల్ ప్లాంట్ పెడుతున్నామని బాబు గతంలో వ్యాఖ్యానించారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి పాలనలోనే గండికోటకు నీళ్లొచ్చాయని విషయం బాబకు తెలియదా’ అని సూటిగా ప్రశ్నించారు. కులాల పేరుతో పథకాలా... ‘జేసీ దివాకర్ రెడ్డి కులం పేరుతో సభల్లో పిచ్చికూతలు కూస్తుంటే చంద్రబాబు నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. జగన్‌కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు. టీడీపీ మేనిఫెస్టోలో కులాల పేరుతో పథకాలు పెట్టింది చంద్రబాబు కాదా’ అని శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. ‘దివాకర్ రెడ్డి సంస్కారం మరిచి వైఎస్ జగన్ గురించి వ్యాఖ్యలు చేయడం దారుణం. వైఎస్ జగన్ వందల సభల్లో మాట్లాడినా ఏనాడు సంస్కారహీనంగా మాట్లాడలేదు. కులాల పేరుతో తిట్టించి లబ్ది పొందడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య. గతంలో మోత్కుపల్లి నర్సింహులు, నాగం జనార్దన్ రెడ్డిలను ఇలాగే ఉపయోగించుకున్నారు’ అని చంద్రబాబుపై విమర్శలు చేశారు. -
చంద్రబాబు పతనం మొదలైంది: గడికోట
కదిరి : మంత్రివర్గ విస్తరణతో సీఎం చంద్రబాబు నాయుడి పతనం మొదలైందని వైఎస్సార్సీపీ రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన అనంతపురం జిల్లా కదిరి పట్టణంలోని పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ పీవీ సిద్దారెడ్డి స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో టీడీపీ తరఫున గెలిచిన ఓ ఎమ్మెల్యే టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేరితే చంద్రబాబు పెద్ద పెద్ద మాటలన్నారని, అయితే ఇప్పుడు తమ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. నీతులు చెప్పడానికేనా? ఆచరించడానికి కాదా? అని నిలదీశారు. అన్ని పార్టీల కలయికతో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడం బహుశా దేశంలోనే ఎన్నడూ చూడలేదని ఎద్దేవా చేశారు. ముస్లిం మైనార్టీలకు మంత్రి పదవి ఇస్తానని ఆశలు కల్పించి విస్తరణలో మొండిచేయి చూపారన్నారు. వచ్చే ఎన్నికల్లో మైనార్టీలు టీడీపీకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. కదిరి, రాయచోటి ప్రాంతాలనుంచి ఎంతోమంది పొట్టకూటికోసం వివిధ ప్రాంతాలకు వలసలు వెళుతున్నారని, అయితే.. మెరుగైన జీవితం గడిపేందుకే కేరళ, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లారని ఈ ప్రభుత్వం చెప్పడం దారుణమని గడికోట దుయ్యబట్టారు. అక్కడ అడుక్కోవడం మెరుగైన జీవితమా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కరువు రావడం సహజమన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సిద్దారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
'గడికోట' జోక్యంతో సాఫీగా పట్టాల పంపిణీ
వైఎస్సార్ కడప: చినమాండ్య మండలంలో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ముంపు బాధితులకు ఇళ్ల పట్టాలు అందేలా చూశారు. శ్రీనివాసపురం రిజర్వాయర్ బాధితులకు పట్టాలను ఇవ్వకుండా టీడీపీ నేతలు అడ్డుకున్నారు. అధికారులు ఏర్పాటుచేసిన వేదికలో కాకుండా మరో చోట పట్టాల పంపిణీ చేయాలని భీష్మించారు. బాధితులను వదిలేసి తమ అనునూయులకే పట్టాలు ఇవ్వాలని అడ్డుతగిలారు. దీంతో బాధితులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పోలీసుల సాయంతో పరిస్ధితిని చక్కదిద్దారు. దీంతో పట్టాల పంపిణీ కార్యక్రమం సజావుగా ముగిసింది. -
డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేయొద్దు
రాయచోటి: ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రోజు రోజుకు డ్వాక్రా సంఘాలు నిర్వీర్యం అవుతున్నాయని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన తన కార్యలయంలో విలేకర్లతో మాట్లాడారు. డ్వాక్రా మహిళలకు సరైన ప్రోత్సాహం, అవగాహన కల్పించలేకపోవడం వల్ల ఎం తో మంది మహిళలు సంఘాలలో చేరడానికి వెనుకడుగు వేస్తున్నారన్నారు. ప్రభు త్వ తీరు వల్లనే వేలాది సంఘాలు వెనుకబడి(సిక్) పోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజుల నుంచి జరుగుతున్న గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమానికి ప్రజల నుంచి ఆదరణ, మంచి స్పందన లభిస్తోందన్నారు. మహిళా సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయడంలేదని ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారన్నారు. బ్యాంకులలో తాకట్టుపెట్టిన బంగారు, అప్పు తీసుకున్న ప్రతి రూపాయిని మాఫీ చేస్తామన్నారు.. మహిళలకు సెల్ఫోన్లు ఇస్తామన్నారు.. రాయచోటిలో మహిళాపోలీసు స్టేషన్ ఏర్పాటు చేస్తామన్నారు.. వీటిలో ఏ ఒక్క హామీని అమలు చేయకపోవడం దురదృష్టకరమన్నారు. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలపైన ప్రజలు మండిపడుతున్నారని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని చాలా పల్లెల్లో సక్రమంగా పంటలు పండక, కుటుంబపోషణ కోసం పాడిపశువులపై దృష్టి పెట్టారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన సొంత హెరిటేజ్ సంస్థ బాగుకోసం ప్రభుత్వానికి చెందిన విజయ డెయిరీని నిర్వీర్యం చేసి, లీటరు పాలును రూ.20లకే కొనుగోలు చేసి, ఐదారు నెలల పాటు బిల్లులు చెల్లించక, పాడిరైతులను ఆర్థికంగా దెబ్బతీస్తున్నట్లు తెలిపారు. హెరిటేజ్‌కు పాలు పోయడానికి రైతులు సిద్ధమేనని, అయితే గిట్టుబాటు ధర లీటరుకు రూ.30లు చేసి క్రమం తప్పకుండా బిల్లులు చెల్లిస్తే చాలన్నారు. అలా చేస్తే రైతుకుల భరోసా కల్గించినట్లువుతుందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకివస్తే లీటరు పాలు ధర రూ.30లు చేస్తామన్నారు. గతంలో చెప్పిన ప్రకారం డ్వాక్రా అక్క , చెల్లెల్లకు రుణమాఫీ చేసి తీరుతామన్నారు.