Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

తాజాగా బయట పడిన వీడియో ఆధారంగా.. పోలింగ్‌ మరుసటి రోజు పల్నాడు జిల్లా కారంపూడి వీధుల్లో మారణాయుధాలతో దాడులు చేస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న టీడీపీ గూండాలు
పదుల సంఖ్యలో వీడియో సాక్ష్యాలు అయినా ‘పచ్చ’పాతమే!

రాష్ట్రంలో టీడీపీ గూండాలు సాగిస్తున్న విధ్వంసకాండ గురించి పదుల సంఖ్యలో వెలుగు చూస్తున్న వీడియోలు ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. మనం ఉంటున్నది ప్రజాస్వామ్య దేశంలోనేనా లేక ఆటవిక రాజ్యంలో ఉంటున్నామా.. అనే అనుమానం కలుగుతోంది. గుంపులు గుంపులుగా తోడేళ్ల మందలా వచ్చి దుకాణాలు, ఇళ్లపై పడుతున్నారు. కుర్చీలు, బల్లలు, మోటార్‌ సైకిళ్లను లాక్కొచ్చి రోడ్లపై పడేస్తున్నారు. లావుపాటి కర్రలు, ఇనుప రాడ్లతో వాటిని ధ్వంసం చేస్తున్నారు. ఆయిల్‌ ట్యాంక్‌ పగులగొట్టి నిప్పంటిస్తున్నారు. నిర్భయంగా వచ్చిన దారినే కేకలు వేసుకుంటూ వెళ్లిపోతున్నారు. ఆ దృశ్యాలు చూస్తుంటే సినిమాల్లో సీన్లు కళ్ల ముందు మెదులుతున్నాయి. ఇంత జరుగుతున్నా పోలీసులు స్పందించక పోవడం విస్తుగొలుపుతోంది. పైగా ఎక్కడ, ఏ చిన్న గొడవ జరిగినా.. దాన్ని వైఎస్సార్‌సీపీకి అంటగడుతూ ఎల్లో మీడియా, ఎల్లో బ్యాచ్‌ దుష్ప్రచారం సాగిస్తోంది. బాధితుల నుంచి ఎన్ని ఫిర్యాదులు వచ్చినా, అటు ఈసీ, ఇటు పోలీసులు.. టీడీపీ అనుబంధ సంఘాలన్నట్లు వ్యవహరిస్తుండటం దారుణం.సాక్షి, నరసరావుపేట: రాష్ట్రంలో పోలింగ్‌ సందర్భంగా టీడీపీ గూండాలు, రౌడీలు పేట్రేగిపోయారు. యథేచ్ఛగా రిగ్గింగ్‌ చేస్తూ అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ నేతలు, శ్రేణులను దారుణంగా చితకబాదారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలు వైఎస్సార్‌సీపీకి ఓటేయనీయకుండా వారిపై అత్యంత పాశవికంగా దాడులకు తెగబడ్డారు. కొన్నిచోట్ల ఈ వర్గాలు తమకు ఓట్లేయలేదని వారి ఇళ్లను ధ్వంసం చేశారు. దుకాణాలను లూఠీ చేశారు. ఇదేంటని అడ్డుకోవడానికి ప్రయత్నించినవారిని చావ బాదారు. స్వగ్రామాలను వదిలేసి బిక్కుబిక్కుమంటూ వేరే ఊళ్లలో తల దాచుకునేలా టీడీపీ మూకలు స్వైర విహారం సాగించాయి. చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు టీడీపీ గూండాలకే కొమ్ముకాశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు తమను కాపాడండి అంటూ ఆర్తనాదాలు చేసినా ఏ ఒక్క పోలీసూ పట్టించుకోలేదు. రాష్ట్రంలో పల్నాడు జిల్లా మాచర్ల, నరసరావుపేట, అనంతపురం జిల్లా తాడిపత్రి, తిరుపతి జిల్లా చంద్రగిరి, తదితర ప్రాంతాల్లో టీడీపీ గూండాల దాడిని పోలీసులు చేష్టలుడిగి వేడుకలా చూశారు. మే 13న పోలింగ్‌ ముగిసిననాటి నుంచి వెలుగు చూస్తున్న వీడియోలు టీడీపీ మూకలు అరాచకాలు, విధ్వంస కాండను కళ్లకు కట్టినట్టు చూపుతున్నా పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటే ఒట్టు. మాచర్ల ప్రాంతంలో పచ్చ మూక విధ్వంసం గురించి పదుల సంఖ్యలో వీడియోలు వైరల్‌ అవుతున్నా, వాటి గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అటు ఈసీ, ఇటు పోలీసులు టీడీపీ అనుబంధ సంఘాలన్నట్లు వ్యవహరిస్తుండటం గమనార్హం. అదే మాచర్లలో ఒక్క వీడియోను సాకుగా చూపిస్తూ వైఎస్సార్‌సీపీ శ్రేణులను మాత్రం వెంటాడి వేధిస్తున్నారు. హత్యాయత్నం కేసులు, అట్రాసిటీ కేసులు నమోదు చేస్తూ ‘పచ్చ’పాతం చూపుతున్నారు. పోలీసుల మద్దతుతోనే టీడీపీ మూక దాడులు ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు వైఎస్సార్‌సీపీకి ఓటు వేశారన్న అక్కసుతో టీడీపీ మూక పల్నాడు జిల్లాలో చేసిన అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పౌర సమాజం భయభ్రాంతులకు గురయ్యేలా వైఎస్సార్‌సీపీ సానుభూతిపరు­లపై అత్యంత పాశవికంగా టీడీపీ గూండాలు జరిపిన దాడి వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవు­తున్నాయి. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా పోలీ­సుల తీరుపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతమని ముందే తెలిసినా తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. టీడీపీ చేసిన దాడికి కొంత మంది పోలీసుల మద్దతుందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పోలింగ్‌ మరుసటి రోజు మే 14న కారంపూడిలో బుడగ జంగాలు, దళితులు, ముస్లింలపై టీడీపీ మూకలు రెచ్చిపోయా­యి. ఆ రోజు వందలాది మంది టీడీపీ రౌడీల దారుణ కాండను కొంత మంది ప్రజలు ఇళ్ల మీద నుంచి సెల్‌ఫోన్లలో వీడియోలు తీశారు. అందులో బడుగు, బలహీనవర్గాలకు చెందిన దుకాణాలు, ఇళ్లు, వాహనాలను టీడీపీ మూక ధ్వంసం చేస్తున్న దృశ్యాలు రికార్డు అయ్యాయి. వాటిలో వీడియో తీస్తున్న కుటుంబ సభ్యులు.. ఇంతవరకు ఇక్కడే ఉన్న పోలీసులు లేకుండా ఎటుపోయారని ఒకటికి రెండుసార్లు అనుకోవడం ఆ వీడియోలో రికార్డు అయ్యింది. ఆ సమయంలో టీడీపీ గూండాలు మారణాయుధాలతో చేస్తున్న స్వైరవిహారం చూసి భయపడిన కూతురు ఇంట్లోకి వెళ్లి తాళాలు వేసుకుందామని అనగా.. ఇంకో వీడియో తీస్తున్న వ్యక్తి.. ‘దాడి చేస్తు­న్నవారు మన టీడీపీ వాళ్లు.. మనల్ని ఏం చేయరు’ అని భరోసానివ్వడం గమనార్హం. ఇప్పుడు ఈ వీడియోలన్నీ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. టీడీపీ మూకలపై చర్యలేవి? టీడీపీ రౌడీలు, గూండాలు మారణాయుధాలతో విధ్వంస కాండకు దిగిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నా పోలీసులు చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాము ఇంతగా వీడియోల ద్వారా ఆధారాలు అందిస్తున్నా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని టీడీపీ మూక దాడుల బాధితులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ విషయంపై మాట్లాడేందుకు, సమాచారం ఇచ్చేందుకు జిల్లా పోలీసులెవరూ ముందుకు రావడం లేదు. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా వివరాలు వెల్లడించలేమంటున్నారు. కారంపూడి ఘటనలో వందలాది మంది టీడీపీ గూండాలు విధ్వంస కాండకు దిగారు. ఈ దాడులకు సంబంధించి ఇప్పటివరకు ఎంతమందిని గుర్తించారు, ఎందరిపై కేసు నమోదు చేశారనేది తెలియనీయడం లేదు. ఇటీవల పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చిన ఓ ఉన్నతాధికారి కేసుల నమోదు, ఇతరత్రా వివరాలేవీ తనకు తెలియకుండా బయటకు వెళ్లనివ్వొద్దని హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తోంది. దీంతో పోలీసులు ఏ సమాచారం బయటకు రానివ్వడం లేదు. వైఎస్సార్‌సీపీ శ్రేణులపై కేసుల నమోదుకు ఉత్సాహం.. వందలాది వీడియోల రూపంలో ఆధారాలు ఉన్నా టీడీపీ మూకలపై చర్యలు తీసుకోని పోలీసులు.. మరోవైపు మాచర్ల, నరసరావుపేట వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్‌సీపీ నేత పిన్నెల్లి వెంకటరామిరెడ్డి లాంటి వారిపైన మాత్రం కేసుల నమోదుకు ఎక్కడలేని ఉత్సాహం చూపుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇల్లు, ఆస్పత్రిని విధ్వంసం చేయడంతోపాటు వైఎస్సార్‌సీపీ ఎస్సీ నేతలపై హత్యాయత్నం కేసుల్లో నిందితుడైన టీడీపీ నరసరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద్‌బాబు, ఆయన అనుచరులను అరెస్ట్‌ చేయడంలో పోలీసులు నిలువెత్తు నిర్లక్ష్యం చూపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పల్నాడులో 144 సెక్షన్‌ అమలవుతున్న నేపథ్యంలో శాంతియుతంగా ఉండాల్సిన చదలవాడ అరవింద్‌బాబు ఇంట్లోనే నిరసన దీక్షలు పేరిట మీడియాకు వీడియోలు, ఫొటోలు పంపి రెచ్చగొట్టే ప్రయత్నాలు మానుకోకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలపై తగిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నేతలు మర్రి రాజశేఖర్, రావెల కిషోర్‌ బాబు తదితరులు డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తాకి శనివారం వినతిపత్రం అందజేశారు. ఎన్నికల కౌంటింగ్‌ దగ్గరపడుతున్నందున మళ్లీ టీడీపీ మూకలు హింసకు పాల్పడకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలని ప్రజలు కూడా కోరుతున్నారు. ఇప్పటికైనా పోలీసులు ‘పచ్చ’పాతాన్ని మానుకోవాలని విన్నవిస్తున్నారు.

33 People Died In Rajkot Game Zone Horrific Fire Accident
రాజ్‌కోట్‌ ప్రమాదంలో 33కు చేరిన మృతుల సంఖ్య.. ప్రభుత్వం కీలక నిర్ణయం

రాజ్‌కోట్‌: గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో విషాదకర ఘటన చోటుచేఉసకుంది. రాజ్‌కోట్‌లోని గేమ్‌జోన్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 33కు చేరుకుంది. ఈ నేపథ్యంలో గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ తాజాగా ఘటనాస్థలాన్ని పరిశీలించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. కాగా, శనివారం సాయంత్రం రాజ్‌కోట్‌లోని టీఆర్‌పీ గేమ్‌ జోన్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. వీకెండ్‌ కావడంతో​ భారీ సంఖ్యలో పర్యాటకులు అక్కడికి వచ్చారు. వారంతా ఆటల్లో నిమగ్నమైన సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు వారని చుట్టుముట్టడంతో తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఇంతలో గేమ్‌ జోన్‌ పైకప్పు కూలిపోవడంతో లోపల ఉన్న వారంతా బయటకు రాలేకపోయారు. ఈ క్రమంలో వారంతో మంటల్లో సజీవదహనమయ్యారు. తీవ్రంగా కాలిపోవడంతో మృతదేహాలను గుర్తించడం కష్టం మారిందని అధికారులు వెల్లడించారు. మరికొందరికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందతూ కొందరు బాధితులు మృతిచెందారు. దీంతో, మృతిచెందిన వారి సంఖ్య 33కి చేరుకుంది. #WATCH | Gujarat CM Bhupendra Patel and Home Minister Harsh Sanghavi took stock of the situation at TRP game zone in Rajkot where a massive fire broke out yesterday claiming the lives of 27 people. pic.twitter.com/ks1YhRszH2— ANI (@ANI) May 26, 2024 మరోవైపు.. ఈ ఘటన నేపథ్యంలో గేమ్‌ జోన్‌ వద్దకు గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ వచ్చి పరిశీలించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సీఎం పరామర్శించారు. ఈ సందర్భంగా గాయపడిన వారికి మెరుగైన వైద్య సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉండగా.. అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి పోలీసులు ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. వారిలో టీఆర్‌పీ గేమ్‌జోన్‌ యజమాని యువ్‌రాజ్‌ సింగ్‌ సోలంకితోపాటు దాని మేనేజర్‌ నితిన్‌ జైన్‌ కూడా ఉన్నారు. ఇక, ఈ ప్రమాద ఘటనపై ప్రభుత్వం సిట్‌ను నియమించింది. సీనియర్‌ పోలీస్‌ ఆఫీసర్‌ నేతృత్వంలో సిట్‌ను నియమించగా.. 72 గంటల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. 🚨 SHOCKING! At least 26 people, including at least 12 children, were killed in a massive fire that broke out at a game zone in Rajkot, Gujarat. pic.twitter.com/nN21BAP1WF— Indian Tech & Infra (@IndianTechGuide) May 26, 2024

Sakshi Editorial On National politics
బొటాబొటిగా జాతీయం!

చండీగఢ్‌ టూ పట్నా. జాతీయ రాజకీయాలకు ఆయువుపట్టు. సారవంతమైన గంగా–యమునల మైదాన ప్రాంతం ఇదే. కొద్దిగా సింధూ బేసిన్‌ కూడా ఇందులో చేరి ఉండవచ్చు. కాస్త విస్తరిస్తే ‘కౌబెల్ట్‌’ అని కూడా పిలుస్తాము. మనం ఏ రకమైన మాంసం తినాలో, ఏ రకమైనది తినకూడదో తెలియజెప్పే కౌబాయ్స్‌కు ఇది పరమ పూజనీయమైన ప్రాంతం. అనాదిగా పిలుచుకుంటున్నట్టు ‘ఆర్యావర్తం’ కూడా ఇదే! ఈ ప్రాంతం మీద పట్టు సాధించకుండా దేశంలో రాజ్యాధికారాన్ని సంపాదించడం చాలా కష్టం.మొదటి ఐదు సాధారణ ఎన్నికల్లో ఆర్యావర్తం, ద్రవిడదేశం అనే తేడాల్లేకుండా దేశంలోని అన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఆధిక్యత కనబరిచింది. ఆరోసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ జైత్రయాత్రకు కళ్లెం వేసిన జనతా పార్టీ మాత్రం అచ్చంగా ఉత్తరాది పార్టీయే! అప్పుడు జనతా పార్టీకి 295 లోక్‌సభ స్థానాలు దక్కాయి. ఇందులో వింధ్య పర్వతాలకు దిగువన గెలిచిన సీట్లు రెండు డజన్లు దాటలేదు. అవి కూడా ప్రధానంగా మహారాష్ట్రలో గెలిచినవే!భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి గడచిన పదేళ్లుగా అధికారంలో ఉన్నది. అయినప్పటికీ ఒక్క కర్ణాటక మినహా మిగిలిన దక్షిణాదిలో పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నది. ఈసారి అదనంగా తెలంగాణపై కూడా ఆశలు పెట్టుకున్నది. కానీ, మూడోసారి వరసగా అధికారాన్ని చేపట్టాలంటే కచ్చితంగా గోమాత ప్రాంతమే కాషాయ దళాన్ని కరుణించి కాపాడాలి. గత ఎన్నికల్లో భారీ సీట్లను ప్రసాదించిన ఈ ప్రాంతంలో బలమైన గండి పడితే మాత్రం ఇతర ప్రాంతాలు పూడ్చగలిగే పరిస్థితి కనిపించడం లేదు. మరి ఈసారి కూడా ఆర్యావర్తం బీజేపీని గట్టెక్కిస్తుందా లేదా అన్నదే ముఖ్యమైన ప్రశ్న.చండీగఢ్‌ నుంచి హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌ల మీదుగా బీహార్‌లోని పట్నా వరకు మొత్తం 157 స్థానాలను అప్పట్లో జనతా పార్టీ క్లీన్‌స్వీప్‌ చేసింది. ఇప్పటికీ అదే రికార్డు. ఇందిరాగాంధీ హత్యానంతరం వెల్లువెత్తిన సానుభూతి ప్రభంజనం (1984)లో కూడా ఈ రికార్డు చెక్కుచెదరలేదు. అప్పుడు యూపీ, బీహార్‌లలో ఎనిమిదిమంది ఇతర పార్టీల వారు గెలిచారు. కొత్త రాష్ట్రాలుగా అవతరించిన ఉత్తరాఖండ్, జార్ఖండ్‌లను కూడా కలుపుకొంటే ఇదే ప్రాంతంలో బీజేపీకి 2019లో 113 సీట్లు దక్కాయి. ఎన్డీఏ భాగస్వాములతో కలిసి 131 సీట్లలో గెలిచారు.ఇప్పుడా సంఖ్యను బీజేపీ నిలబట్టుకోగలదా? రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హిమాచల్‌లను కూడా కలిపి చూస్తే కౌబెల్ట్‌ పూర్తవుతుంది. ఇందులో రాజస్థాన్‌ (25), గుజరాత్‌ (26), హిమాచల్‌ (4)లో అప్పుడు బీజేపీ క్లీన్‌ స్వీప్‌ చేసింది. మధ్యప్రదేశ్‌ (29)లో 28, ఛత్తీస్‌గఢ్‌ (11)లో 9 సీట్లను గెలుచుకున్నది. ఈ దూకుడును ఇప్పుడు కూడా ప్రదర్శించగలుగుతుందా? దాదాపు 90 శాతం స్ట్రయిక్‌ రేట్‌తో విజృంభిస్తేనే కౌబెల్ట్‌లో బీజేపీ తన బలాన్ని నిలబెట్టుకోగలుగుతుంది.ఈ ప్రాంతంలో బలమైన సామాజిక వర్గాలుగా పేరున్న రాజ్‌పుత్, జాట్, యాదవ కులాలు బీజేపీకి వ్యతిరేకంగా పని చేస్తున్నాయనే వార్తలు వస్తున్నాయి. ఓబీసీ రిజర్వేషన్ల కోసం డిమాండ్‌ చేస్తున్న జాట్‌ నాయకులు రాజస్థాన్, హర్యానాల్లో ఇప్పటికే ‘ఇండియా’ కూటమికి మద్దతు ప్రకటించారు. పశ్చిమ యూపీలోని జాట్లు మాత్రం చరణ్‌సింగ్‌ పరివారానికి చెందిన ఆర్‌ఎల్‌డీతోనే ఉన్నట్టు కనిపిస్తున్నది. ఈ పార్టీ ఎన్డీఏలో చేరినందువల్ల యూపీ జాట్ల మద్దతు బీజేపీకి లభించవచ్చు.ఉత్తరాదిలో తొలి నుంచీ బీజేపీకి వెన్నుదన్నుగా ఉన్న రాజ్‌పుత్‌ల తాజా వైఖరి ఆ పార్టీని కొంత కలవరపరుస్తున్నది. ఈ వర్గానికి ప్రాతినిధ్యం వహించే కర్ణిసేన సభ్యులు బహిరంగ సభలు పెట్టి మరీ బీజేపీకి వ్యతిరేకంగా ఓటేయాలని పిలుపునిస్తున్నారు. రాజ్‌పుత్‌ వర్గం మీద వీరి పిలుపు ప్రభావం చూపితే ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లలోని కనీసం 30 నియోజకవర్గాల్లో బీజేపీకి నష్టం జరిగే అవకాశం ఉన్నది. రాజ్‌పుత్‌ వర్గానికి చెందిన యోగీ బాబానే యూపీ సీఎంగా ఉన్నందువలన ఆ రాష్ట్రంలో పెద్దగా భయపడవలసిన అవసరం లేదని బీజేపీ భావిస్తున్నది.యూపీ, బీహార్‌లలో గణనీయమైన సంఖ్యలో ఉన్న యాదవులు చాలాకాలంగా ఎస్పీ, ఆర్జేడీల వెనుకనే సమీకృతమై ఉన్నారు. ఇప్పుడీ సమీకరణ మరింత సంఘటితంగా ఉన్నట్టు సమాచారం. అఖిలేశ్, తేజస్వీ యాదవ్‌లను వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రులను చేయాలనే పట్టుదల యువతలో కనిపిస్తున్నది. యాదవ వర్గం వ్యతిరేకతకు విరుగుడుగా యాదవేతర ఓబీసీలను మచ్చిక చేసుకుంటూ బీజేపీ ఇన్నాళ్లుగా నెట్టుకొస్తున్నది. బీజేపీ అధికారంలోకి వస్తే ఈసారి రిజర్వేషన్లు ఎత్తివేస్తారని జరిగిన ప్రచారం వల్ల ఈ వర్గం మద్దతును కూడా ఎంతోకొంత బీజేపీ కోల్పోవచ్చనే అభిప్రాయం బలపడుతున్నది. రిజర్వేషన్లు ఎత్తివేసే ఆలోచన తమకు లేదని ప్రధాని సహా పలువురు నేతలు వివరణ ఇచ్చినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయిందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.వాజ్‌పేయి హయాంలోని ఎన్డీఏ సర్కార్‌ చేసుకున్న ‘షైనింగ్‌ ఇండియా’ ప్రచారం వికటించినట్టుగానే మోదీ సర్కార్‌ చేస్తున్న ‘వికసిత భారత్‌’ కూడా వికటిస్తున్నట్టుగానే కనిపిస్తున్నది. ఉపాధి రంగం దారుణంగా దెబ్బతిన్నది. పెద్దనోట్ల రద్దు, కోవిడ్‌ వరస దెబ్బలతో కుదేలైన చిన్న వర్తకులు ఇప్పటికీ కోలుకోలేదు. నిరుద్యోగిత రేటుపై నిన్ననే విడుదలైన పీరియాడిక్‌ లేబర్‌ శాంపుల్‌ సర్వే నివేదిక నిరాశాజనకంగానే ఉన్నది. ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీల్లో చదువుకున్న ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లలో 38 శాతం మందికి క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు లభించలేదని వచ్చిన తాజా వార్త పరిస్థితికి అద్దం పడుతున్నది.ఉత్తరాది రాష్ట్రాల్లోని నిరుద్యోగ యువతకు సైనిక బలగాల్లో చేరడం ఒక ప్రత్యామ్నాయం. అందులో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘అగ్నివీర్‌’ పథకం ఈ యువతను తీవ్రంగా నిరాశపరిచింది. దేశంలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలపై ప్రపంచస్థాయి ఆర్థికవేత్తలందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆక్స్‌ఫామ్‌ వంటి సంస్థలు క్రమం తప్పకుండా ఇచ్చే నివేదికల్లో ఈ అన్యాయాన్ని ఎత్తిచూపుతున్నాయి. ఒకే దేశంలోని మనుషుల మధ్య వంద రెట్లు, వేయి రెట్లు కాదు లక్షల రెట్ల ఆర్థిక తారతమ్యాలు వెక్కిరిస్తున్నాయి.2012 నుంచి 2021 మధ్యకాలంలో భారత జాతి సృష్టించిన సంపదలో నలభై శాతం సొత్తు జనాభాలోని ఒకే ఒక్క శాతం కుబేరుల జేబుల్లోకి వెళ్లింది. యాభై శాతం మంది అడుగు జనాభా దోసిళ్లలో ఎంగిలి మెతుకులు రాలిపడ్డట్టు ఒకే ఒక్క శాతం సొమ్ము ఉమ్మడిగా జారిపడింది. దీన్నే కొందరు ’ట్రికిల్‌ డౌన్‌ థియరీ’గా పిలుచుకుంటున్నారు. ఈ రకమైన ఆర్థిక విధానాలతో ఎన్డీఏ రాజ్యమేలుతున్నది.ఇటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకునే శామ్‌ పిట్రోడాతో సహా పలువురు ఆర్థికవేత్తలు కూడా దేశంలో వారసత్వ పన్ను విధించాలన్న ప్రతిపాదన చేస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడానికి ఇటువంటి సూచనలపై విస్తృతమైన చర్చను ఆహ్వానించడం అవసరం. కానీ, పిట్రోడాకు ఉన్న కాంగ్రెస్‌ సంబంధాలను ఆసరా చేసుకొని స్వయంగా ప్రధానమంత్రే ఎదురుదాడికి పూనుకున్నారు. ‘ప్రతిపక్షం అధికారంలోకి వస్తే మీరు సంపాదించుకున్న సొమ్మును లాగేసుకుంటారట’ అంటూ రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేశారు. ఈ ప్రచారం బీజేపీకి మేలు చేసిందా... కీడు చేసిందా అనే విషయం ఓట్ల లెక్కింపు తర్వాత తేలిపోనున్నది.ఈ రకమైన సామాజిక – ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తన కంచుకోటలను ఏ మేరకు కాపాడుకోగలదన్న చర్చ జరుగుతున్నది. ప్రభుత్వానికి అనుకూలంగా గానీ, వ్యతిరేకంగా గానీ ఎటువంటి గాలి లేదని అభిప్రాయపడిన పక్షంలో గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో కలిపి సుమారు 50 స్థానాలను బీజేపీ చేజార్చుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. వీటితోపాటు మహారాష్ట్ర, కర్ణాటకల్లో కూడా గత ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలనే సాధించింది. ఈసారి రెండు రాష్ట్రాల్లో కనీసం 15 స్థానాల వరకు ఆ పార్టీ పోగొట్టుకోవచ్చనే అంచనాలున్నాయి.శరద్‌ పవార్, బాల్‌ఠాక్రేలు స్థాపించిన పార్టీలను చీల్చడం బీజేపీకి కలిసివచ్చే అంశం కాదనే అభిప్రాయం మహారాష్ట్రలో ఉన్నది. ఎన్నికల హామీల అమలులో చతికిలబడ్డ కర్ణాటక కాంగ్రెస్‌కు బీజేపీ మిత్రపక్షం జేడీఎస్‌ మళ్లీ ఊపిరిపోసింది. దేవెగౌడ పౌత్రరత్నం చేసిన నిర్వాకంపై కన్నడిగులు మండిపడుతున్నారు. ఇక బెంగాల్, ఒడిషా, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో ఓ పదిహేను స్థానాలను బీజేపీ అధికంగా సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే కోల్పోయే అవకాశం ఉన్న సీట్లు 65 అనుకుంటే, అదనంగా తెచ్చుకునే సీట్లు పదిహేను వరకు ఉండవచ్చని అంచనా. అంటే కనీసం యాభై సీట్లను బీజేపీ నికరంగా కోల్పోతుంది.వ్యతిరేక గాలి బలంగా లేకపోతేనే గత ఎన్నికలతో పోలిస్తే యాభై స్థానాలను బీజేపీ కోల్పోవచ్చు. కూటమిలోని మిత్రపక్షాలన్నీ ఉమ్మడిగా మరో పాతిక, ముప్పయ్‌ సీట్లను గెలవచ్చు. ఇది దాదాపు తొంభై శాతం స్థానాలకు పోలింగ్‌ పూర్తయిన తర్వాత పరిశీలకుల్లో నెలకొని ఉన్న అభిప్రాయం. అంటే బొటాబొటి మెజారిటీతో ఎన్డీఏ మూడోసారి గద్దెనెక్కడానికి అవకాశాలు ఉన్నాయనుకోవాలి. బీజేపీకి సొంతంగా 370 సీట్లు కావాలనీ, కూటమికి 400 సీట్లు కావాలని ప్రధానమంత్రి చేసిన అభ్యర్థనను జనం పట్టించుకోలేదు. మూడింట రెండొంతుల మెజారిటీ లభిస్తే ఈ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని మార్చడానికి వెనకాడదనే వాదనను జనం విశ్వసిస్తున్నారనే అనుకోవాలి.విశ్వసనీయమైన ప్రత్యామ్నాయం, సమర్థవంతమైన నాయకత్వం అందుబాటులో ఉండి ఉంటే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ప్రజలు కచ్చితంగా ఓడించేవారే. ప్రజల ఆకాంక్షలకు, ప్రభుత్వ విధానాలకు మధ్యన ఓ పెద్ద అగాధమే ఉన్నది. కానీ, ఇండియా కూటమిలో పెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ కొన్ని రాష్ట్రాలకే పరిమితమైన పార్టీగా మిగిలిపోయింది. సాధారణ మెజారిటీకి అవసరమైన 272 స్థానాల్లో కనీసం సగం సీట్లను కూడా కాంగ్రెస్‌ గెలవగలదన్న నమ్మకం ఎవరికీ లేదు. ఈ పరిస్థితుల్లో అతుకుల బొంతతో అస్థిర ప్రభుత్వ ప్రయోగాలకు మెజారిటీ ప్రజలు సిద్ధపడకపోవచ్చు. పార్టీ అధ్యక్షుడు ఖర్గేను ప్రధాని పదవికి ప్రతిపాదించి ఉంటే కూటమి సభ్యుల ఆమోదం లభించేది. సాహసోపేతమైన ఈ ప్రయోగాన్ని దేశ ప్రజలు స్వాగతించేవారు. కానీ రాహుల్‌గాంధీ మాటల్లో కనిపించేంత ఔదార్యం, అభ్యుదయం చేతల్లో కనిపించవు. అదే విషాదం. ఎట్టకేలకు కాంగ్రెస్‌ పార్టీకి లోక్‌సభలో సెంచరీ కొట్టే ఒక మంచి అవకాశం దొరికింది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆశిద్దాం.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

AP Elections 2024: May 26th Political Updates In Telugu
May 26th: ఏపీ పొలిటికల్‌ అప్‌డేట్స్‌

May 26th AP Elections 2024 News Political Updates.. 8:40 AM, May 26th, 2024పచ్చముఠా పైశాచికత్వం..కౌంటింగ్ ముంగిట పచ్చముఠా పైశాచికత్వంవైఎస్సార్‌సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని భయాందోళనకి గురిచేసేలా దాడులుతిరుపతిలో వెంకట శివారెడ్డిపై టీడీపీ గూండాలు దాడి.తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరికప్రజాక్షేత్రంలో ఓటమి తప్పదని అర్థమైందిరాష్ట్రవ్యాప్తంగా అరాచకాలకి మళ్లీ తెరలేపుతున్నావా టీడీపీ చంద్రబాబు కౌంటింగ్ ముంగిట పచ్చముఠా పైశాచికత్వంవైయస్‌ఆర్‌సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని భయాందోళనకి గురిచేసేలా దాడులు తిరుపతిలో వెంకట శివారెడ్డిపై టీడీపీ గూండాలు దాడి. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిక ప్రజాక్షేత్రంలో ఓటమి తప్పదని అర్థమై.. రాష్ట్రవ్యాప్తంగా అరాచకాలకి మళ్లీ తెరలేపుతున్నావా…— YSR Congress Party (@YSRCParty) May 25, 2024 7:50 AM, May 26th, 2024దాడుల సంస్కృతి నాది కాదు: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిచంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కామెంట్స్‌..దాడుల సంస్కృతి నాది కాదు.. హుందా రాజకీయాలే నా నైజం!చంద్రగిరిలో ఐదేళ్లుగా లెక్కకి మించి నాపై టీడీపీ నేత పులివర్తి నానితో పాటు అతని భార్య నోరుజారినా.. ఏరోజూ నేను పల్లెత్తు మాట అనలేదుపులివర్తి నానీని నా రాజకీయ ప్రత్యర్థిగానే చూశాను తప్ప.. శత్రువుగా ఎప్పుడూ భావించలేదు దాడుల సంస్కృతి నాది కాదు.. హుందా రాజకీయాలే నా నైజం!చంద్రగిరిలో ఐదేళ్లుగా లెక్కకి మించి నాపై టీడీపీ నేత పులివర్తి నానితో పాటు అతని భార్య నోరుజారినా.. ఏరోజూ నేను పల్లెత్తు మాట అనలేదు పులివర్తి నానీని నా రాజకీయ ప్రత్యర్థిగానే చూశాను తప్ప.. శత్రువుగా ఎప్పుడూ భావించలేదు… pic.twitter.com/YMmEAgkK8s— YSR Congress Party (@YSRCParty) May 25, 2024 7:10 AM, May 26th, 2024ఓట్ల లెక్కింపు ఇలాజూన్‌ 4న ఉదయం 8గంటలకు లెక్కింపు ప్రారంభంతొలుత పోస్టల్, సర్వీసు ఓట్ల లెక్కింపు ఆ తర్వాత ఈవీఎంలలో నమోదైన ఓట్ల లెక్కింపు సువిధ యాప్‌లో నమోదు చేసిన తర్వాతే ఫలితాల వెల్లడి 7:00 AM, May 26th, 2024కౌంటింగ్‌ ఏజెంట్లే కీలకంఫారం–18 సమర్పించడం ద్వారా ఏజెంట్ల నియామకంఓట్ల లెక్కింపులో ఫారం–17సీ ఎంతో ముఖ్యంనిబంధనలు తెలియకుంటే అయోమయమే 6:50 AM, May 26th, 2024పదుల సంఖ్యలో వీడియో సాక్ష్యాలు అయినా ‘పచ్చ’పాతమే!పోలింగ్‌ రోజు, ఆ తర్వాత టీడీపీ గూండాల స్వైర విహారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఓట్లేయనీయకుండా దాడులు వైఎస్సార్‌సీపీకి ఓటు వేశారనే కారణంతో విధ్వంసాలు పల్నాడులో పచ్చ మూకల దాడులపై వీడియోలు తీసిన ప్రజలుఒక్కొక్కటిగా బయటపడుతున్న టీడీపీ హింసాత్మక చర్యలు దుకాణాలపై రాళ్లు, బైక్‌ల ధ్వంసాలు, దహనాలు, లూటీలు.. పట్టపగలు విధ్వంసకాండను చూసి ఆందోళన వ్యక్తం చేస్తున్న జనం టీడీపీ దారుణాలు కళ్లెదుటే కనిపిస్తున్నా పట్టించుకోని పోలీసులు హత్యాయత్నం, అట్రాసిటీ కేసులున్నప్పటికీ చూసీచూడనట్లు వ్యవహారం చిన్న చిన్న సాకులతో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై మాత్రం జులుం వెంటాడి కేసుల నమోదు.. భయభ్రాంతులకు గురిచేస్తూ దండనలుఇంకోవైపు ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోని ఈసీ బడుగు, బలహీన వర్గాల బాధితుల వేదన అరణ్య రోదనగా మారిన వైనం 6:40 AM, May 26th, 2024క్షమాపణ చెప్పాలి... లేకుంటే దావాజనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తికి సీఎస్‌ జవహర్‌రెడ్డి హెచ్చరికవిశాఖలో అసైన్డ్‌ భూములు కొనుగోలు చేయలేదుచట్ట ప్రకారం క్రిమినల్‌ చర్యలు తీసుకుంటానని హెచ్చరిక 6:30 AM, May 26th, 202421 లోక్‌సభ స్థానాల్లో విజేతలను నిర్ణయించేది మహిళలేఆ స్థానాల్లో పురుషుల కన్నా ఎక్కువగా నమోదైన మహిళల ఓట్లు కాకినాడ, అనంతపురం తప్ప మిగతా స్థానాల్లో భారీ వ్యత్యాసం మహిళల ఓట్లు వైఎస్సార్‌సీపీకే అంటున్న రాజకీయ విశ్లేషకులు

Maldives minister reacts India seeking Free Trade Agreement
Maldives: ‘భారత్‌ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కోరుకుంటోంది’

మాలె: మాల్దీవులుతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) చేసుకోవడానికి భారత్‌ ప్రయత్నాలు ప్రారంభించిందని ఆ దేశ మంత్రి మహ్మద్‌ సయీద్ అన్నారు. అయితే దానికి సంబంధించిన చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు. మాలెలో ఆర్థిక, వాణిజ్య అభివృద్ధి శాఖ మంత్రి మహ్మద్‌ సయీద్ మీడియాతో మాట్లాడారు.‘‘దక్షిణాసియా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(SAFTA)తో పాటు మాల్దీవులతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకోవాలని భారత్‌ కోరుకుంటోంది. అయితే దీనికి సంబంధించిన చర్చలు, సంప్రదింపులు కొనసాగుతున్నాయి. మాల్దీవులు అధ్యక్షుడు మహ్మద్‌ మొయిజ్జు స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందం చేసుకోవడానికి అన్ని దేశాలకు అవకాశం కల్పించారు. వాణిజ్య కార్యకలాపాలను మరింత సులభతరం చేయటంలో భాగంగా అనేక దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది’’ అని మహ్మద్‌ సయీద్ అన్నారు.ఇక.. గతేడాది భారత ప్రధాని మోదీ లక్ష్యదీప్‌ పర్యటన సందర్భంగా దీగిన ఫొటోలు, వీడియోలపై మాల్దీవులు మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు దెబ్బ తిన్నాయి. అధ్యక్షుడు మహ్మద్‌ మొయిజ్జుకు చైనా అనుకూలుడనే పేరు ఉండటం. అదే విధంగా మాల్దీవుల్లో ఉన్న భారత్‌ బలగాలను వెనక్కి తీసుకోవాలని వ్యాఖ్యానించటం వంటి వల్ల ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి.అయినప్పటికీ భారత్ మాల్దీవుల విజ్ఞప్తి మేరకు బడ్జెట్‌లో 50 మిలియన్‌ డాలర్ల అర్థిక సాయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక.. 1981లో ఇండియా-మాల్దీవుల మధ్య అత్యవసర సరుకుల ఎగుమతుల కోసం వాణిజ్య ఒప్పందం కుదిరింది. 2021లో మొదటిసారి ఇరుదేశాల ద్వైపాక్షిక వాణిజ్యం విలువ 300 మిలియన్‌ డాలర్లకు చేరుకుంది. ఆ తర్వాత సంవత్సరాల్లో అదికాస్త ఇంకా పెరుగుతూ 500 మిలియన్‌ డాలర్లు చేరుకుంది.

Tesla Shareholders Advised To Reject Musk's $56 Billion Pay
రూ.4.5 లక్షల కోట్లు భారీ వేతన ప్యాకేజీలో.. మస్క్‌కు ఎదురు దెబ్బ

టెస్లా సీఈఓ ఎలోన్‌ మస్క్‌కు చెల్లించే భారీ వేతన ప్యాకేజీ అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.టెస్లా బోర్డు డైరెక్టర్లు నిర్ణయించిన 55 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.4.5 లక్షల కోట్లు) భారీ వేతన ప్యాకేజీని ఇవ్వొద్దంటూ టెస్లా షేర్‌ హోల్డర్లు తమని కోరినట్లు ప్రాక్సీ అడ్వైజరీ సంస్థ గ్లాస్ లూయిస్‌ తెలిపింది. ప్రాక్సీ అడ్వైజరీ సంస్థ గ్లాస్‌ లూయిస్‌ అనేది కార్పొరేట్‌ కంపెనీల్లో జరిగే కార్యకలాపాల్లో షేర్‌ హోల్డర్లకు సహాయం చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం టెస్లాలో షేర్‌ హల‍్డర్ల తరుపున పనిచేస్తోంది. మార్కెట్‌ విలువను పెంచిఅయితే, ఎలోన్‌ మస్క్‌ తన అసాధారణమైన ప్రతిభతో టెస్లా మార్కెట్‌ విలువను కేవలం 10 ఏళ్ల కాలంలో అన్యూహ్యంగా పెంచారని, 2018లో తొలిసారి మార్కెట్‌ విలువ 650 బిలియన్‌ డాలర్లకు చేర్చారని టెస్లా బోర్డు డైరెక్టర్లు ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాదు టెస్లా బోర్డు డైరెక్టర్లు ఏడాదికి 55 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.4.5 లక్షల కోట్లు) భారీ వేతన ప్యాకేజీ అందిస్తూ ఆమోదం తెలిపారు. వేతనాన్ని అందించారు.రూ.4.5 లక్షల కోట్ల వేతనం దండగదీనిని వ్యతిరేకిస్తూ టెస్లా సీఈఓ ఎలోన్‌ మస్క్‌, ఆ సంస్థ డైరెక్టర్లకు వ్యతిరేకంగా టెస్లా వాటాదార్లలో ఒకరైన రిచర్డ్‌ టోర్నెట్టా.. డెలావర్‌ కోర్టును ఆశ్రయించారు. ఇంత వేతనం ఇవ్వడం కార్పొరేట్‌ ఆస్తులను వృథా చేయడమే అవుతుందని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ కేసు విచారణ ప్రస్తుతం కొనసాగుతుండగా.. షేర్‌ హోల్డర్లు మస్క్‌కు అంత ప్యాకేజీ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ గ్లాస్ లూయిస్‌కు ప్రతిపాదనలు పంపారు. తాజా షేర్‌ హోల్డర్ల నిర్ణయంతో టెస్లాలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది. అంత ప్యాకేజీ.. అందుకు మస్క్‌ అనర్హుడేగతంలో టెస్లా షేర్‌ హోల్డర్‌ రిచర్డ్‌ టోర్నెట్టా పిటిషన్‌పై డెలావర్‌ కోర్టు విచారణ చేపట్టింది. టెస్లా బోర్డు డైరెక్టర్లు నిర్ణయించిన భారీ వేతన ప్యాకేజీ అందుకునేందుకు ఎలోన్‌ మస్క్‌ అనర్హుడని డెలావేర్‌ కోర్టు న్యాయమూర్తి కేథలీన్‌ మెక్‌కార్మిక్‌ ఆదేశాలిచ్చారు.అయితే, ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతుడైన పారిశ్రామికవేత్త, తన విలువైన సమయాన్ని కంపెనీ కోసం వెచ్చించాలనే ఉద్దేశంతోనే అంత మొత్తం చెల్లించామని టెస్లా డైరెక్టర్ల తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది.

Kolkata Knight Riders vs Sunrisers Hyderabad, road to IPL 2024 final
IPL 2024: రైజర్స్‌ VS రైడర్స్‌

గత మూడు సీజన్లలో ఎనిమిది, ఎనిమిది, పదో స్థానం... సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పరిస్థితి ఇది. గత రెండు సీజన్లలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఏడో స్థానానికి పరిమితం. ఐపీఎల్‌ ఈ ఏడాది ఆరంభానికి ముందుకు ఇరు జట్ల రికార్డు చూస్తే ఈ రెండు టీమ్‌లు ఫైనల్‌ చేరతాయని ఎవరూ ఊహించలేదు. కానీ అద్భుత ప్రదర్శనలతో రైజర్స్, రైడర్స్‌ అంచనాలు తిరగరాశాయి. అదరగొట్టే బ్యాటింగ్, రికార్డు ప్రదర్శనలతో హైదరాబాద్‌ ప్రస్థానం సాగితే... అన్ని రంగాల్లో చెలరేగి కోల్‌కతా అగ్రస్థానంతో ముందుకు దూసుకెళ్లింది. అన్ని అవరోధాలను దాటిన తర్వాత ఇప్పుడు అసలైన అంతిమ సమరానికి రంగం సిద్ధమైంది. పదేళ్ల క్రితం చివరిసారి విజేతగా నిలిచిన కోల్‌కతా తమ మూడో టైటిల్‌పై గురి పెడితే... ఎనిమిదేళ్ల క్రితం చాంపియన్‌గా నిలిచిన హైదరాబాద్‌ రెండో ట్రోఫీ లక్ష్యంగా బరిలోకి దిగింది. ఇరు జట్లు సమ ఉజ్జీలుగా కనిపిస్తున్న నేపథ్యంలో చెపాక్‌ మైదానంలో ఎవరిది పైచేయి కానుందనేది ఆసక్తికరం. చెన్నై: ఐపీఎల్‌–17లో రెండు నెలలకు పైగా హోరాహోరీగా సాగిన సమరాల తర్వాత టోర్నీ విజేతను తేల్చే సమయం ఆసన్నమైంది. లీగ్‌ మాజీ చాంపియన్లు మరో ట్రోఫీ వేటలో సత్తా చాటేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాయి. చిదంబరం స్టేడియంలో ఆదివారం జరిగే ఫైనల్‌ పోరులో సన్‌రైజర్స్‌ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తలపడతాయి. తొలి క్వాలిఫయర్‌లో సన్‌రైజర్స్‌నే ఓడించి దర్జాగా తుది పోరుకు అర్హత సాధించిన కోల్‌కతా దానిని పునరావృతం చేసేందుకు సిద్ధంగా ఉంది. మరో వైపు గత మ్యాచ్‌తో పాటు అంతకు ముందు లీగ్‌ దశలో కూడా కేకేఆర్‌ చేతిలో ఓడిన హైదరాబాద్‌ ఈ సారి మాత్రం వెనక్కి తగ్గకుండా తమ అత్యుత్తమ ఆటను ప్రదర్శించాలని పట్టుదలగా ఉంది. శుక్రవారం ప్రతికూల పరిస్థితుల మధ్య ఇదే మైదానంలో క్వాలిఫయర్‌–2లో రాజస్తాన్‌ను ఓడించడంతో రైజర్స్‌ టీమ్‌లో ఆత్మవిశ్వాసం పెరిగింది. మార్పులు చేస్తారా! ఫైనల్‌ కోసం హైదరాబాద్‌ తుది జట్టు ఎంపిక ఆసక్తికరంగా మారింది. టాప్‌–3లో హెడ్, అభిõÙక్, త్రిపాఠి ఖాయం. గత మూడు మ్యాచ్‌లుగా భారీ స్కోరు బాకీ ఉన్న హెడ్‌ ఫైనల్లో చెలరేగితే నిలువరించడం కష్టం. అదే విధంగా అభిõÙక్‌ కూడా మరో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాల్సి ఉంది. వరుసగా రెండు మ్యాచ్‌లలో దూకుడైన బ్యాటింగ్‌తో తానేంటో త్రిపాఠి నిరూపించుకున్నాడు. ఎప్పటిలాగే భారీ షాట్లతో క్లాసెన్‌ మిడిలార్డర్‌లో ఉన్నాడు. అయితే ఇద్దరు దేశవాళీ బ్యాటర్లు నితీశ్‌ రెడ్డి, సమద్‌లు మరింత మెరుగైన ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. నాలుగో విదేశీ ఆటగాడిగా ఎవరిని ఎంచుకోవాలనే విషయంలో రైజర్స్‌ మేనేజ్‌మెంట్‌లో గందరగోళం కొనసాగుతోంది. మార్క్‌రమ్‌ ఆశించిన స్థాయిలో ఆడలేకపోతుండగా, లీగ్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా ఫిలిప్స్‌ను తీసుకోవడం కూడా దాదాపు అసాధ్యం. పిచ్‌ను బట్టి క్వాలిఫయర్‌లో షహబాజ్‌ను అనూహ్యంగా ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా చేసుకొచ్చి టీమ్‌ మంచి ఫలితం సాధించింది. అయితే ఈ పిచ్‌ను స్పిన్‌కు అంతగా అనుకూలించేది కాకపోవడంతో పాటు ప్రత్యర్థి టీమ్‌లో నలుగురు లెఫ్టార్మ్‌ బ్యాటర్లు ఉన్నారు. కమిన్స్, భువనేశ్వర్, నటరాజన్‌ పేస్‌ బౌలింగ్‌లో తమ బాధ్యత నిర్వర్తించగలరు. మార్పుల్లేకుండా... కోల్‌కతా మాత్రం ఎలాంటి సందేహం లేకుండా క్వాలిఫయర్‌–1 ఆడిన టీమ్‌నే కొనసాగించనుంది. మొదటినుంచి చివరి ఆటగాడి వరకు అందరూ ఫామ్‌లో ఉండటం సానుకూలాంశం. ఓపెనర్లుగా నరైన్, గుర్బాజ్‌ సత్తా చాటగలరు. ఆ తర్వాత వరుసగా వెంకటేశ్, శ్రేయస్, రాణా జట్టు భారం మోస్తారు. చివర్లో రింకూ, రసెల్‌ విధ్వంసం సృష్టించగల సమర్థులు. కేకేఆర్‌ బౌలింగ్‌ కూడా సమతూకంగా ఉంది. స్టార్క్‌ ఫామ్‌లో ఉంటే ఏం జరుగుతుంతో గత మ్యాచ్‌లో హైదరాబాద్‌కు అర్థమైంది. హర్షిత్, అరోరాలాంటి యువ పేసర్లు కూడా రాణిస్తుండగా... స్పిన్నర్‌ వరుణ్‌ ఒంటిచేత్తో మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చేయగలడు. తుది జట్ల వివరాలు (అంచనా) సన్‌రైజర్స్‌: కమిన్స్‌ (కెపె్టన్‌), హెడ్, అభిõÙక్, త్రిపాఠి, మార్క్‌రమ్, క్లాసెన్, నితీశ్‌ రెడ్డి, సమద్, భువనేశ్వర్, ఉనాద్కట్, నటరాజన్, షహబాజ్‌/ మర్కండే. నైట్‌రైడర్స్‌: శ్రేయస్‌ (కెపె్టన్‌), నరైన్, గుర్బాజ్, వెంకటేశ్, నితీశ్, రింకూ, రసెల్, రమణ్‌దీప్, స్టార్క్, హర్షిత్, వరుణ్, వైభవ్‌. పిచ్, వాతావరణం రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్‌ నల్లరేగడి మట్టితో కూడిన పిచ్‌పై జరిగి స్పిన్‌కు బాగా అనుకూలిస్తుంది. కానీ ఫైనల్‌ను ఎర్రమట్టితో కూడిన మరో పిచ్‌ను నిర్వహిస్తున్నారు. దాంతో బ్యాటింగ్‌కు అనుకూలించి భారీ స్కోరుకు అవకాశం ఉంటుంది. శనివారం సాయంత్రం వర్షం కురిసినా...మ్యాచ్‌ రోజు చిరు జల్లులకు మాత్రమే అవకాశం ఉంది. ఏదైనా ఇబ్బంది ఎదురైనా రిజర్వ్‌ డే ఉంది.

Payal Kapadia Achieves Cannes Grand Prix Award
బ్యాన్‌ చేసిన వారే ఆమె టాలెంట్‌కు నివ్వెరపోయారు

డైరెక్టర్‌ పాయల్‌ కపాడియా... భారతీయ సినిమా గొప్పతనాన్ని కేన్స్‌ వేదికగా ప్రపంచానికి చాటి చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నటులందరూ అక్కడ అడుగుపెడితే చాలు అనుకుంటే భారత్‌కు చెందిన పాయల్‌ కపాడియా తన ప్రతిభతో అత్యుత్తమ అవార్డును సొంతం చేసుకుంది. 77వ కేన్స్‌ చలన చిత్రోత్సవంలో పాయల్‌ కపాడియా రూపొందించిన భారతీయ చిత్రం 'ఆల్‌ వి ఇమాజిన్‌ యాజ్‌ లైట్‌' రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ఈ సినిమా ద్వారా అత్యున్నత పురస్కారమైన 'గ్రాండ్‌ ప్రిక్స్‌'ను తాజాగా ఆమె సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు ఏ భారతీయ సినిమా కూడా ఈ అవార్డును దక్కించుకోలేదు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఓ భారతీయ చిత్రం కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ కాంపిటీషన్‌లో నిలిచి అవార్డ్‌ దక్కించుకోవడంతో ఒక్కసారిగా చప్పట్లతో పాయల్‌ కపాడియాను అభినందించారు.విద్యాభ్యాసంముంబైలో జన్మించిన పాయల్‌ కపాడియా ఆంధ్రప్రదేశ్‌లోని రిషి వ్యాలీ స్కూల్‌లో ఇంటర్‌ వరకు చదివింది. ఆమె ముంబైలోని సెయింట్ జేవియర్స్ కాలేజీ నుంచి ఆర్థికశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పొందింది. ఆమె సోఫియా కాలేజీలో ఒక సంవత్సరం మాస్టర్స్ డిగ్రీ చేసింది. ఆ తర్వాత, ఆమె ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (FTII)లో ఫిల్మ్ డైరెక్షన్‌ కోర్సుని అభ్యసించిందిబ్యాన్‌ చేసిన వారే తన టాలెంట్‌కు ఫిదా అయ్యారుపాయల్‌ కపాడియాకు చదువుతో పాటు సినిమాలంటే చాలా ఆసక్తి. దీంతో ఆమె డైరెక్టర్‌గా అడుగుపెట్టాలని తపించింది. తన అభిమాన దర్శకులెందరో పుణెలోని ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (FTII)లో చదువుకున్నారని తెలిసి అక్కడే చేరాలని ఎంతో కష్టపడి 2015లో సీటు సాధించింది. అయితే ఆమెకు అక్కడ పలు సవాళ్లు ఎదురయ్యాయి. కళాశాల ఛైర్మన్‌గా ఉన్న ఒక నటుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం తనకు నచ్చలేదు. దీంతో వారికి వ్యతిరేకంగా పోరాటం చేయడంతో పాటు తరగతులను కూడా బహిష్కరించింది. పాయల్‌ చేసిన పనికి ఆగ్రహించిన FTII ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఆమెకు వచ్చే స్కాలర్‌షిప్‌ను కూడా రద్దు చేసింది. వారు ఎన్ని చేసినా ఆమె బెదరలేదు. చివరకు పాయల్‌పై ఎఫ్‌టీఐఐ కేసు కూడా పెట్టింది. నమ్మిన సిద్ధాంతాల కోసం ధైర్యంగా నిలబడింది. వాటిపై పోరాడుతూనే మరోపక్క చిత్ర నిర్మాణ కార్యక్రమాలను కూడా ప్రారంభించింది.పాయల్‌ను FTII బ్యాన్‌ చేసినా కూడా తన పోరాటం ఆగలేదు. 2017లో ఆమె డైరెక్ట్‌ చేసి షార్ట్‌ఫిల్మ్‌ 'ఆఫ్టర్‌నూన్‌ క్లౌడ్స్‌' కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు ఎంపికైంది. అప్పుడు భారత్‌ నుంచి ఎంపికైన ఏకైక చిత్రంగా రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. దీంతో ఆమె పేరు ఒక్కసారిగా ప్రపంచానకి తెలిసింది. తర్వాత అదే కళాశాల యాజమాన్యం ఆమె వద్దకు వచ్చింది. ఆమెపై ఉన్న ఆంక్షలను ఎత్తేసింది. ఆ సమయంలో విమాన టికెట్లు సహా ఖర్చులన్నీ విద్యాసంస్థే భరించి కేన్స్‌కు పంపింది.ఆ తర్వాత 2021లో 'ఏ నైట్‌ ఆఫ్‌ నోయింగ్‌ నథింగ్‌' పేరుతో తీసిన డాక్యుమెంటరీ కూడా కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో అడుగు పెట్టింది. అప్పుడు 'గోల్డెన్‌ ఐ' అవార్డుని సొంతం చేసుకున్న పాయల్‌.. దేశం దృష్టినీ మరోసారి తనవైపు తిప్పుకొంది. ఇప్పటి వరకు ఆమె తీసిన ప్రతి సినిమా కూడా పలు అంతర్జాతీయ వేదికల మీదా అవార్డులను కొల్లగొట్టాయి. తాజాగా 77వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రతిష్ఠాత్మక పామ్‌ డి ఓర్‌ స్క్రీనింగ్‌ కాంపిటీషన్‌లో 'ఆల్‌ వి ఇమాజిన్‌ యాజ్‌ లైట్‌' చిత్రం ద్వారా 'గ్రాండ్‌ ప్రిక్స్‌' అవార్డును సొంతం చేసుకుంది. 30 ఏళ్ల క్రితం 'స్వహం' అనే సినిమా పామ్‌ డి ఓర్‌ స్క్రీనింగ్‌కి ఎంపికైంది. ఆ తర్వాత ఈ పోటీలో నిలిచిన భారతీయ సినిమా ఇదొక్కటే కావడం విశేషం. 34 ఏళ్ల పాయల్‌ జీవితం ఈతరం యువతకు ఆదర్శం. ఆమె డైరెక్ట్‌ చేసిన ప్రతి సినిమాలో కూడా కథకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఈతరం అమ్మాయిల కలలు, ఆశయాలను ఆమె ఎంతో సున్నితంగా తెరకెక్కిస్తారు. తాజాగా అవార్డు అందుకున్న 'ఆల్‌ వి ఇమాజిన్‌ యాజ్‌ లైట్‌' చిత్రం కూడా కేరళకు చెందిన ఇద్దరు నర్సులు గురించి చెబుతుంది.

Mansukhbhai Prajapatis Mitti Cool Clay Creations  Without Power Supply
‘మిట్టీకూల్’: మట్టితో ఫ్రిడ్జ్‌‌!..కరెంట్‌తో పనిలేదు..!

రిఫ్రిజిరేటర్... సామాన్య భాషలో ఫిడ్జ్‌. ఒకప్పుడూ అది అపురూపమైన వస్తువు. ధనికులు మాత్రమే దీన్ని ఉపయోగించేవారు. ఇప్పుడూ మధ్య తరగతి ఇళ్లల్లో కూడా ఇవి దర్శనమిస్తున్నాయి. కానీ పేదవాళ్లకు మాత్రం ఇప్పటికీ అపురూపమైన వస్తువే. పైగా కొనాలంటే రూపాయి, రూపాయి పోగు చేసుకుని అప్పోసొప్పో చేసుకుని కొంటారు. పైగా దీన్ని వేసవిలోనే జాగ్రత్తగా వాడుకుంటారు. ఎందుకంటే..? దీనికి అయ్యే కరెంట్‌ బిల్లు కూడా ఎక్కువే. ఒకవేళ పాడైతే బాగు చేయించుకోవాలన్న కష్టమే. అలాంటి వాటికి చెక్‌పెట్టేలా ఎకో ప్రెండ్లీగా మట్టితో ఫ్రిడ్జ్‌ని ఆవిష్కరించారు గుజరాత్‌కి చెందిన డ భాయ్ ప్రజాపతి. ఎలా రూపొందించారంటే..‘మిట్టీకూల్’ ఫ్రిడ్జ్‌..ఇది పూర్తిగా బంకమన్నుతో తయారైన ఫ్రిజ్. అందుకే దీనికి ‘మిట్టీకూల్’ ఫ్రిడ్జ్‌ అని పేరు పెట్టి, మార్కెట్‌లోకి తెచ్చాడు ,మన్సుఖ్ . ఈ ఫ్రిడ్జ్‌ కు విద్యుత్ అవసరం లేదు. ఎటువంటి మరమ్మత్తులూ చేయాల్సిన పని లేదు. అయినా అద్భుతంగా పని చేస్తుంది. సాధారణ గది ఉష్ణోగ్రతలో రెండు రోజుల్లోనే పాడైపోయే కూరగాయలను ఇందులో భద్రపరిస్తే, ఐదారు రోజులు నిక్షేపంగా నవనవలాడుతూ తాజాగా ఉంటాయి. పెరుగు, దోశె పిండి లాంటివి కూడా పుల్లబడకుండా ఉంటాయి. జ్యూసులు, నీళ్లు పెడితే చల్లబడతాయి. ఇందులో 5 కిలోల కూరగాయలు, పండ్లను నిల్వ చేయవచ్చు. విద్యుత్ కోతలు తరచుగా ఉండే ప్రాంతాల్లో, మట్టి రిఫ్రిజిరేటర్‌ను ఉపయోగిస్తున్నారు. మిట్టి కూల్‌లో పైన ఉన్న అరలో 2 లీటర్ల నీటిని పోయాలి. ఈ ఫ్రిజ్ బాష్పీభవన సూత్రాలపై పనిచేస్తుంది. దీనికి నిర్వహణ ఖర్చు కూడా ఉండదని కనగరాజ్ తెలిపారు.విద్యుత్ అవసరం లేదుసాధారణంగా విద్యుత్ ఆధారితంగా పనిచేసే ఫ్రిడ్జ్‌లో ఉంచిన వస్తువులు తింటే కొంత అనారోగ్యానికి గురవుతారు. కాని మట్టితో తయారు చేసి.. సహజసిద్దంగా ఉండే మట్టితో తయారు చేసి ఈ మిట్టి కూల్ లోని వస్తువులు తింటే ఎలాంటి అనారోగ్యం రాదని చెబుతున్నారు. అందుకే ప్రస్తుతం తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో ఈ మిట్టి కూల్ కు అత్యంత డిమాండ్ ఉంది. ఇందులో ఉంచిన ఆహార పదార్ధాల్లో రుచిలో ఎలాంటి మార్పు రాదంటున్నారు మన్‌సుక్‌భాయ్ ప్రజాపతి.ప్రజాపతి నేపథ్యం..ప్రజాపతి గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లోని మోర్బిలోని నిచ్చిమండల్ గ్రామంలో జన్మించాడు. ప్రతికూల ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువుకు స్వస్తి చెప్పి.. కుటుంబ పోషణ కోసం కూలీ పనులు చేసేవాడు. అతను చిన్నతనం నుంచి సాంప్రదాయక మట్టి వస్తువుల తయారీపై సమగ్రమైన పరిజ్ఞానం ఉంది. దీంతో 1988లో ప్రజాపతి రూ. 30,000 చెల్లించి మట్టి పలకల తయారీకి సంబంధించిన తన సొంత కర్మాగారాన్ని ప్రారంభించాడు. కానీ మట్టి చిప్పల మన్నిక గురించి అతనికి చాలా ప్రతికూల అభిప్రాయాలు వచ్చాయి. అయినప్పటికీ పలు ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. అలా 1990లో అతని కంపెనీ రిజిస్టర్ అయ్యింది.ఇక 2001లో మిట్టికూల్‌ ట్రేడ్‌ మార్క్‌ రిజిస్టర్‌ చేయబడింది. ఆ తర్వాత 2002 నుంచి పూర్తి స్థాయిలో దీనిపై పనిచేయడం మొదలు పెట్టారు. అదే ఏడాది GIANగా ప్రసిద్ధి చెందిన గ్రాస్‌రూట్స్ ఇన్నోవేషన్ ఆగ్మెంటేషన్ నెట్‌వర్క్‌తో ప్రపంచానికి పరిచయమై.. ఈ మిట్టీకూల్‌ గురించి అందరికీ తెలియడం జరిగింది. ఇక బ్రిటన్, జర్మనీల్లో జరిగిన ప్రదర్శనల్లో ఈ ఫ్రిడ్జ్‌ను చూసి, అక్కడి శాస్త్రవేత్తలు ప్రశంసలు కురిపించారు. విద్యుత్తుతో పనిచేసే ఫ్రిజ్‌లతో పోలిస్తే, ఈ మట్టి ఫ్రిజ్ ఖరీదు చాలా తక్కువ. దీని ఖరీదు రూ. 8,500/అంతే!.(చదవండి: జపాన్‌ బుల్లెట్‌ రైలు తరాతని మార్చిన కింగ్‌ఫిషర్‌!)

Central Election Commission Arrangements for Election Votes Counting
ఓట్ల లెక్కింపు ఇలా

సాక్షి, అమరావతి: ఎన్నికల్లో పోటీ చేసిన అభ్య­ర్థుల భవితవ్యాన్ని తేల్చే ఓట్ల లెక్కింపు సమయం దగ్గర పడుతోంది. జూన్‌ 4న ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను కల్పించనున్నారు. మే 13న పోలింగ్‌ అనంతరం పలుచోట్ల హింసాత్మక ఘటన­లు చోటుచేసుకున్న నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యల కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే 25 కంపెనీల బలగాలను రాష్ట్రానికి పంపింది. మొత్తం ఓట్ల లెక్కింపు ప్రక్రియలో 25 వేల మందికిపైగా ఉద్యోగులు పాల్గొననున్నారు. వీరందరికీ రెండు రోజుల శిక్షణ ఇవ్వనున్నారు. ఆ తర్వాత ర్యాండమైజే­షన్‌ ద్వారా ఉద్యోగులను నియోజకవర్గాలకు కేటాయిస్తారు. మొత్తం ఈ ఓట్ల ప్రక్రియను నిశితంగా పరిశీలించడానికి 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఒక్కొక్కరు చొప్పు­న మొత్తం 200 మంది కేంద్ర పరిశీలకులతోపాటు 200 మంది రిటరి్నంగ్‌ ఆఫీసర్లను నియమించారు. ఈవీఎంల తరలింపు మే 13న పోలింగ్‌ ముగిసిన తర్వాత నుంచి ఈవీఎంలను, వీవీ ప్యాట్‌లను స్ట్రాంగ్‌ రూమ్‌ల్లో భద్రపర్చారు. జూన్‌ 4న ఓట్ల లెక్కింపు మొదలయ్యే అరగంట ముందు స్ట్రాంగ్‌ రూమ్‌ల నుంచి ఈవీఎంలను ఓట్ల లెక్కింపు కేంద్రాలకు తరలిస్తారు. ముందుగా ఆర్వో టేబుల్‌ వద్ద పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు మొదలవుతుంది. పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు మొదలైన అరగంట తర్వాత కూడా ఆ ప్రక్రియ కొనసాగుతుంటే అప్పుడు ఇక ఈవీఎంల లెక్కింపును మొదలుపెట్టడం మొదలు పెడతారు. అసెంబ్లీ, పార్లమెంట్‌కు ఒకేసారి ఎన్నికలు జరగడంతో ఈవీంఎలు తారుమారు కాకుండా ఉండటం కోసం స్ట్రాంగ్‌ రూమ్‌ల నుంచి తీసుకువచ్చే సిబ్బందికి వేర్వేరు రంగుల్లో యూనిఫామ్‌ కేటాయించి ఈవీఎంలను తరలిస్తారు. వీరు ఈవీఎంల సీరియల్‌ నంబర్‌ ప్రకారం ఒకదాని తర్వాత ఒకటి కౌంటింగ్‌ టేబుళ్లపైకి చేరుస్తారు. కౌటింగ్‌ సమయంలో కేవలం ఈవీఎం కంట్రోల్‌ యూనిట్‌ మాత్రమే తీసుకువస్తారు. ఓటు వేసిన ఈవీఎం మెషీన్‌తో అవసరం లేదు. కౌంటింగ్‌ హాల్‌లో టేబుళ్లు ఎన్ని ఉంటే అన్ని ఈవీఎంలను మాత్రమే తీసుకురావాలి. ఒక రౌండ్‌ పూర్తయిన తర్వాతే మరుసటి రౌండ్‌కు సంబంధించిన కంట్రోల్‌ యూనిట్‌ను తీసుకురావాల్సి ఉంటుంది. పోలైన ఓట్ల ఆధారంగా ఎన్ని రౌండ్లు కౌంటింగ్‌ అన్నది లెక్కించి.. దాని ప్రకారం టేబుళ్లను ఏర్పాటు చేస్తారు. ఈవీఎంలో నమోదైన ఓట్లు, వీవీ ప్యాట్‌లో నమోదైన ఓట్లు సరిగా ఉన్నాయా.. లేదా.. అన్నదాన్ని పరిశీలించడం కోసం ర్యాండమ్‌గా మూడు వీవీప్యాట్లు ఎంపిక చేసి మూడింటిని లెక్కిస్తారు. ఇది కూడా ఈవీఎంల లెక్కింపు పూర్తయిన తర్వాత మాత్రమే చేస్తారు. పోలింగ్‌ ముగిసిన తర్వాత క్లోజ్‌ బటన్‌ నొక్కకుండా ఉన్న (క్లోజ్‌ రిజల్ట్‌ క్లియర్‌–సీఆర్‌సీ) ఓటింగ్‌ యంత్రాలతో పాటు మాక్‌ పోలింగ్‌ ఓట్లను తీసివేయకుండా అలాగే ఉంచిన ఓటింగ్‌ యంత్రాలను పక్కకు పెట్టి వాటిని చివర్లో మాత్రమే లెక్కిస్తారు. అది కూడా పోటీ హోరాహోరీగా ఉంటేనే. మెజార్టీ భారీగా ఉంటే ఇలా అభ్యంతరాలు వ్యక్తం చేసిన ఓటింగ్‌ యంత్రాలను లెక్కించకుండా పక్కకు పెట్టేస్తారు. ప్రతీ రౌండ్‌ ఫలితాలను కేంద్ర ఎన్నికల సంఘం అందుబాటులోకి తీసుకొచ్చిన సువిధ యాప్‌లో నమోదు చేసిన తర్వాతనే ఆర్వో ఫలితాలను ప్రకటించాల్సి ఉంటుంది.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement