
May 26th AP Elections 2024 News Political Updates..
4:00 PM, May 26th, 2024
అనంతపురం:
అనంతపురం జిల్లా ఎస్పీ గౌతమి శాలిని కలిసిన తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి
- ధర్మవరం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ నేతలపై కేసులు నమోదు చేయవద్దని విజ్ఞప్తి
- తాడిపత్రి అల్లర్లతో ధర్మవరం నేతలకు సంబంధం లేదు
- నన్ను పరామర్శించేందుకు మాత్రమే ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, ఇతర నేతలు తాడిపత్రి వచ్చారు
- ధర్మవరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయించాలన్న ఆలోచన విరమించాలి
- ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై కేసు నమోదు చేస్తే ఫ్యాక్షన్ ప్రేరెపించినట్లు అవుతుంది
- వైఎస్సార్సీపీ శ్రేణులపై అక్రమ కేసులు పెడితే న్యాయ పోరాటం చేస్తాం
2:00 PM, May 26th, 2024
తాడేపల్లి :
టీడీపీ హింసాత్మక చర్యలను బయటపెట్టిన వైఎస్సార్‌సీపీ
- పోలింగ్ మరుసటిరోజు కూడా పల్నాడులో టీడీపీ విధ్వంసం
- కారంపూడిలో మారణాయుధాలతో దాడులకు తెగపడిన టీడీపీ కార్యకర్తలు
- టీడీపీ విధ్వంసానికి ముందే వెళ్లిపోయిన పోలీసులు
- ఇదంతా టీడీపీ, పోలీసు అధికారుల కుట్రేనంటున్న వైఎస్సార్‌సీపీ
- సాక్ష్యాధారాలతో సహా బయట పెట్టిన వైఎస్సార్‌సీపీ
- కారంపూడిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తల ఇళ్లు, షాపుల ధ్వంసమే లక్ష్యంగా రెచ్చిపోయిన టీడీపీ మూకలు
- మాచర్ల ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి హత్యకు టీడీపీ కుట్ర పన్నిందంటున్న వైఎస్సార్‌సీపీ
- ఏదో కేసులో ఎమ్మెల్యే అరెస్టుకు ఉత్సాహం చూపుతున్న పల్నాడు పోలీసులు
1:45 PM, May 26th, 2024
పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై ఈసీ కీలక ఆదేశం
- పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు
- పోస్టల్ బ్యాలెట్‌పై గెజిటెడ్ అధికారి స్టాంప్ వేయలేదనే కారణంతో పోస్టల్ బ్యాలెట్‌ను చెల్లని ఓటుగా పరిగణించవద్దు.
- ఆర్వో సంతకం ఉన్న పోస్టల్ బ్యాలెట్లు చెల్లుతాయి.
- ఫాం 13పై ఆర్వో సంతకంతో పాటు అన్ని వివరాలు ఉండాలి.
- ఆర్వో సంతకం, బ్యాలెట్‌ను ధృవీకరించే రిజిస్టర్‌తో చూసుకోవాలి.
- ఆర్వో సంతకం, సీరియల్ నెంబర్‌లేని పోస్టల్ బ్యాలెట్ తిరస్కరణ.
- నిబంధనల ప్రకారం ఓటు నమోదు చేయకుంటే తిరస్కరిస్తాం.
12:50 PM, May 26th, 2024
టీడీపీ వీడియో ట్వీట్ చేస్తే ఈసీ విచారణకు ఆదేశిస్తుందా?: పేర్ని నాని
- ఏపీలో ఈసీ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది.
- పోలీసు అధికారులు కూడా బరితెగించి ప్రవర్తిస్తున్నారు.
- పోలింగ్ సందర్భంగా హింస జరుగుతోందని తెలిసినా పోలీసులు పట్టించుకోలేదు.
- టీడీపీ నేతలు హత్యాయత్నం చేస్తే వారిపై కేసులు పెట్టరు.
- పోలీసులు ఏకపక్షంగా వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపైనే కేసులు పెడుతున్నారు.
- అసలు ముద్దాయిని వదిలేసి తప్పుచేయని వారిపై కేసులు పెడుతున్నారు.
- హింస జరిగిన తర్వాత కూడా పోలీసులు సరిగా స్పందించలేదు.
- హింస జరుగుతోందని తెలిసినా పోలీసులు పట్టించుకోలేదు.
- వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు ఓటు వేయకుండా అడ్డుకున్నారు.
- కూటమి నేతలు ఎవరిని నియమించాలని కోరితే వారినే నియమించారు.
- పాల్వాయి గేటు దగ్గర దౌర్జన్యం జరిగితే అడ్డుకోలేదు.
- పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేస్తే 13వ తేదీనే ఎందుకు కేసు నమోదు చేయలేదు.
- ఈ ఘటనపై టీడీపీ అప్పుడే ఎందుకు ఫిర్యాదుచేయలేదు.
- డీజీపీకి సిట్ ఇచ్చిన నివేదికలో పిన్నెల్లి ప్రస్తావన కూడా లేదు.
- ఈసీ కూడా దుర్మార్గంగా వ్యవహరిస్తోంది.
- టీడీపీ నేతలు హత్యాయత్నం చేస్తే వారిపై కేసులు పెట్టలేదు.
- ఎస్పీ సహా అధికారులకు పిన్నెల్లి ఫిర్యాదు చేశారు.
- పోలింగ్ ఆగినట్టు ప్రిసైడింగ్ ఆఫీసర్ లాగ్ బుక్‌లో ఎందుకు లేదు?.
- ఛానళ్లలో చూసిన తర్వాతే ఈసీ అధికారులు స్పందిస్తారా?.
- టీడీపీ పిన్నెళ్లి వీడియోను ట్వీట్ చేస్తే ఈసీ విచారణకు ఆదేశిస్తుందా?.
- అసలు ఏం జరిగిందో విచారణ చేయరా?.
టీడీపీ నేతలు హత్యాయత్నం చేస్తే వారిపై కేసులు పెట్టరు.. ఏకపక్షంగా వైయస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలపైనే కేసులు పెడుతున్నారు.
అసలు ముద్దాయిని వదిలేసి తప్పుచేయని వారిపై కేసులు పెట్టడం దుర్మార్గం.
-మాజీ మంత్రి పేర్ని నాని#TDPLosing#TDPGoons pic.twitter.com/AUK8As1QIX— YSR Congress Party (@YSRCParty) May 26, 2024
12:15 PM, May 26th, 2024
ఈసీ పక్షపాత ధోరణితో వ్యవహరించింది: మంత్రి కాకాణి
- నెల్లూరులో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కామెంట్స్..
- ఎన్నికల కమిషన్ పక్షపాత ధోరణిలో వ్యవహరించింది..
- పోలీస్ అధికారులను ఉద్దేశ్యపూరీతంగా బదిలీ చేసింది..
- కొత్తగా బాధ్యతలు చేపట్టిన పోలీస్ అధికారులు ఉద్రిక్తతలను రెచ్చగొట్టారు..
- వైఎస్సార్‌సీపీ బలంగా ఉన్న చోట కేడర్‌ను భయబ్రాంతులకు గురి చేశారు..
- మాచర్ల ఘటన వీడియో ఎలా బయటికి వచ్చిందో చెప్పలేని దుస్థితిలో ఎన్నికల కమిషన్ ఉంది..
- ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించలేదని మా అభిప్రాయం..
- నెల్లూరు జిల్లాలోని కొన్ని పోలింగ్ బూతుల్లో కనీస మౌలిక వసతులు కల్పించలేదు..
- ఎన్నికల నిర్వహణలో జిల్లా ఎన్నికల యంత్రాంగం ఘోరంగా విఫలమైంది..
- ఎన్నికల నిధులు దుర్వినియోగం, వైఫల్యంపై జిల్లా రిటర్నింగ్ అధికారిపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాము.
- మాజీ మంత్రి సోమిరెడ్డి పట్టపగలు ఓటర్లకి డబ్బులు పంచితే.. దాని మీద ఫిర్యాదు చేస్తే జిల్లా రిటర్నింగ్ అధికారి పట్టించుకోలేదు..
- మానవతా దృక్పధంతో సోమిరెడ్డి డబ్బులు పంచాడని జిల్లా ఎన్నికల అధికారి చెప్పడం హాస్యాస్పదం..
- ఈ వ్యవహారంపై ఎన్నికల కమిషన్ స్పందించకపోతే హైకోర్టుకు వెళ్తాను..
- జిల్లా కలెక్టర్ పక్షపాత ధోరణిలో పని చేశారు..
- జిల్లా రిటర్నింగ్ అధికారి ఆధ్వర్యంలో ఓట్ల లెక్కింపు సజావుగా సాగుతుందనే నమ్మకం మాకు లేదు..
- కౌంటింగ్ నిర్వహణకు ఒక అబ్జర్వర్‌ను నియమించాలని కోరుతున్నాం..
11:40 AM, May 26th, 2024
దెందులూరులో సంక్షేమానికే ప్రజల మద్దతు..
- దౌర్జాన్యాలతో, అరాచకాలతో చెలరేగిపోయిన చింతమనేని ప్రభాకర్
- 2019 ఎన్నికల్లోనే చింతమనేనికి బుద్ధి చెప్పిన దెందులూరు నియోజకవర్గ ప్రజలు.
- దళితులను, అధికారులను తిట్టడం, కొట్టడంతో పేరుపొందిన చింతమనేని.
- ఈసారి కూడా చింతమనేనికి తమ పవరేంట్ చూపామంటున్న ప్రజలు.
- ప్రజలతో మమేకమై పనులు చేయించిన ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి
11:00 AM, May 26th, 2024
విశాఖ జిల్లాలో ఓట్ల లెక్కింపునకు ఏయూలో ఏర్పాట్లు
- ఓట్ల లెక్కింపునకు 14 గంటలు పట్టే అవకాశం.
- ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు
- తొలి రౌండ్ ఫలితాలు 9 గంటల నుంచి వెల్లడించే అవకాశం
- విశాఖ జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గం కలిపి 98 లోక్ సభ పరిధిలోని ఏది నియోజకవర్గాలు కలిపి 98 చొప్పున టేబుల్స్ ఏర్పాటు
- భీమిలి అసెంబ్లీకి 26 రౌండ్లతో రాత్రి 7:30 కు ఫలితం వచ్చే అవకాశం
- విశాఖ తూర్పు 21 రౌండ్లలో సాయంత్రం ఐదు గంటలకు
- విశాఖ సౌత్ లో 17 రౌండ్లకు మధ్యాహ్నం మూడున్నరకు
- విశాఖ నార్త్ లో 22లకు సాయంత్రం ఐదు గంటలకు
- విశాఖ వెస్ట్ 16 రౌండ్లకు మధ్యాహ్నం 3:15 కు
- గాజువాకలో 22 రౌండ్లకు సాయంత్రం 5:45 గంటలకు
- పెందుర్తిలో 21 రౌండ్లకు సాయంత్రం 5:30 గంటలకు
- ఎస్ కోట లో 19 రౌండ్లకు సాయంత్రం నాలుగున్నర గంటలకు ఫలితాలు వెల్లడి
- విశాఖ జిల్లాలో మొత్తం ఓటర్లు 2012373
- ఓట్లు వినియోగించుకున్న ఓటర్లు 1409316
- పోస్టల్ బ్యాలెట్ 23,981
- విశాఖ లోక్‌సభ పరిధిలో 1962 పోలింగ్ కేంద్రాలు 14 రౌండ్లలో లెక్కింపు ప్రక్రియ
10:30 AM, May 26th, 2024
విజయం వైఎస్సార్‌సీపీదే..
పోలింగ్ ఫలితాలపై లెక్కలువేసుకుంటున్న ప్రధాన పార్టీలు
తమ స్థానాలు ‘పది’లమంటున్న వైఎస్సార్‌సీపీ
పరువు నిలుపుకుంటామంటున్న టీడీపీ
జనసేన, బీజేపీ స్థానాల్లో గెలుపు అసాధ్యమే
ఓటు బదిలీ కాలేదంటున్న రాజకీయ పరిశీలకులు
వైఎస్సార్‌సీపీ ఖాతాలోకే కడప,రాజంపేట పార్లమెంటు స్థానాలు
9:50 AM, May 26th, 2024
బరితెగించిన టీడీపీ నాయకులు..
- పచ్చ బ్యాచ్‌ను వెంటాడుతున్న ఓటమి భయం..
- ఓటమి భయంతో కారంపూడిలో బరితెగించిన టీడీపీ నాయకులు
- పోలింగ్ జరిగిన మరుసటి రోజున వైఎస్సార్‌సీపీకి చెందిన కార్యకర్తల షాపులను ధ్వంసం చేసి తగలపెట్టిన టీడీపీ గుండాలు
ఓటమి భయంతో కారంపూడిలో బరితెగించిన @JaiTDP నాయకులు
పోలింగ్ జరిగిన మరుసటి రోజున వైయస్ఆర్ సీపీకి చెందిన కార్యకర్తల షాపులను ధ్వంసం చేసి తగలపెట్టిన టీడీపీ గుండాలు.#TDPLosing#TDPGoons pic.twitter.com/BzBkJBOkT1— YSR Congress Party (@YSRCParty) May 26, 2024
8:40 AM, May 26th, 2024
పచ్చముఠా పైశాచికత్వం..
- కౌంటింగ్ ముంగిట పచ్చముఠా పైశాచికత్వం
- వైఎస్సార్‌సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని భయాందోళనకి గురిచేసేలా దాడులు
- తిరుపతిలో వెంకట శివారెడ్డిపై టీడీపీ గూండాలు దాడి.
- తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిక
- ప్రజాక్షేత్రంలో ఓటమి తప్పదని అర్థమైంది
- రాష్ట్రవ్యాప్తంగా అరాచకాలకి మళ్లీ తెరలేపుతున్నావా టీడీపీ చంద్రబాబు
కౌంటింగ్ ముంగిట పచ్చముఠా పైశాచికత్వం
వైయస్ఆర్సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని భయాందోళనకి గురిచేసేలా దాడులు
తిరుపతిలో వెంకట శివారెడ్డిపై టీడీపీ గూండాలు దాడి. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిక
ప్రజాక్షేత్రంలో ఓటమి తప్పదని అర్థమై.. రాష్ట్రవ్యాప్తంగా అరాచకాలకి మళ్లీ తెరలేపుతున్నావా…— YSR Congress Party (@YSRCParty) May 25, 2024
7:50 AM, May 26th, 2024
దాడుల సంస్కృతి నాది కాదు: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
- చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కామెంట్స్..
- దాడుల సంస్కృతి నాది కాదు.. హుందా రాజకీయాలే నా నైజం!
- చంద్రగిరిలో ఐదేళ్లుగా లెక్కకి మించి నాపై టీడీపీ నేత పులివర్తి నానితో పాటు అతని భార్య నోరుజారినా.. ఏరోజూ నేను పల్లెత్తు మాట అనలేదు
- పులివర్తి నానీని నా రాజకీయ ప్రత్యర్థిగానే చూశాను తప్ప.. శత్రువుగా ఎప్పుడూ భావించలేదు
దాడుల సంస్కృతి నాది కాదు.. హుందా రాజకీయాలే నా నైజం!
చంద్రగిరిలో ఐదేళ్లుగా లెక్కకి మించి నాపై టీడీపీ నేత పులివర్తి నానితో పాటు అతని భార్య నోరుజారినా.. ఏరోజూ నేను పల్లెత్తు మాట అనలేదు
పులివర్తి నానీని నా రాజకీయ ప్రత్యర్థిగానే చూశాను తప్ప.. శత్రువుగా ఎప్పుడూ భావించలేదు… pic.twitter.com/YMmEAgkK8s— YSR Congress Party (@YSRCParty) May 25, 2024
7:10 AM, May 26th, 2024
ఓట్ల లెక్కింపు ఇలా
జూన్ 4న ఉదయం 8గంటలకు లెక్కింపు ప్రారంభం
తొలుత పోస్టల్, సర్వీసు ఓట్ల లెక్కింపు
ఆ తర్వాత ఈవీఎంలలో నమోదైన ఓట్ల లెక్కింపు
సువిధ యాప్‌లో నమోదు చేసిన తర్వాతే ఫలితాల వెల్లడి
7:00 AM, May 26th, 2024
కౌంటింగ్ ఏజెంట్లే కీలకం
ఫారం–18 సమర్పించడం ద్వారా ఏజెంట్ల నియామకం
ఓట్ల లెక్కింపులో ఫారం–17సీ ఎంతో ముఖ్యం
నిబంధనలు తెలియకుంటే అయోమయమే
6:50 AM, May 26th, 2024
పదుల సంఖ్యలో వీడియో సాక్ష్యాలు అయినా ‘పచ్చ’పాతమే!
పోలింగ్ రోజు, ఆ తర్వాత టీడీపీ గూండాల స్వైర విహారం
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఓట్లేయనీయకుండా దాడులు
వైఎస్సార్‌సీపీకి ఓటు వేశారనే కారణంతో విధ్వంసాలు
పల్నాడులో పచ్చ మూకల దాడులపై వీడియోలు తీసిన ప్రజలు
ఒక్కొక్కటిగా బయటపడుతున్న టీడీపీ హింసాత్మక చర్యలు
దుకాణాలపై రాళ్లు, బైక్‌ల ధ్వంసాలు, దహనాలు, లూటీలు..
పట్టపగలు విధ్వంసకాండను చూసి ఆందోళన వ్యక్తం చేస్తున్న జనం
టీడీపీ దారుణాలు కళ్లెదుటే కనిపిస్తున్నా పట్టించుకోని పోలీసులు
హత్యాయత్నం, అట్రాసిటీ కేసులున్నప్పటికీ చూసీచూడనట్లు వ్యవహారం
చిన్న చిన్న సాకులతో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై మాత్రం జులుం
వెంటాడి కేసుల నమోదు.. భయభ్రాంతులకు గురిచేస్తూ దండనలు
ఇంకోవైపు ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోని ఈసీ
బడుగు, బలహీన వర్గాల బాధితుల వేదన అరణ్య రోదనగా మారిన వైనం
6:40 AM, May 26th, 2024
క్షమాపణ చెప్పాలి... లేకుంటే దావా
- జనసేన కార్పొరేటర్ పీతల మూర్తికి సీఎస్ జవహర్‌రెడ్డి హెచ్చరిక
- విశాఖలో అసైన్డ్ భూములు కొనుగోలు చేయలేదు
- చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటానని హెచ్చరిక
6:30 AM, May 26th, 2024
21 లోక్‌సభ స్థానాల్లో విజేతలను నిర్ణయించేది మహిళలే
- ఆ స్థానాల్లో పురుషుల కన్నా ఎక్కువగా నమోదైన మహిళల ఓట్లు
- కాకినాడ, అనంతపురం తప్ప మిగతా స్థానాల్లో భారీ వ్యత్యాసం
- మహిళల ఓట్లు వైఎస్సార్‌సీపీకే అంటున్న రాజకీయ విశ్లేషకులు
Comments
Please login to add a commentAdd a comment