May 27th: ఏపీ పొలిటికల్‌ అప్‌డేట్స్‌ | Sakshi
Sakshi News home page

May 27th AP Election News Updates: ఏపీ పొలిటికల్‌ అప్‌డేట్స్‌

Published Mon, May 27 2024 7:00 AM

AP Elections 2024: May 27th Political Updates In Telugu

May 26th AP Elections 2024 News Political Updates..

7:00 PM, May 27th, 2024

వ్యక్తిగత గొడవలకి రాజకీయ రంగుపులిమి టీడీపీ రాక్షసానందం

 

5:36 PM, May 27th, 2024

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్‌పై తీర్పు రిజర్వ్‌

  • రేపటికి తీర్పు రిజర్వ్‌ చేసిన ఏపీ హైకోర్టు
  • తనపై నమోదైన కేసుల్లో బెయిల్‌ ఇవ్వాలంటూ పిన్నెల్లి పిటిషన్‌
     

4:00 PM, May 27th, 2024

చెప్పేదేమో శుద్ధ పూస మాటలు చేసేవన్నీ తప్పుడు పనులు..!

 

 

3:30 PM, May 27th, 2024

విచారణకు రఘురాజు గైర్హాజరు

  •  పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీ రఘురాజును విచారణకు పిలిచిన మండలి ఛైర్మన్ మోషేన్ రాజు
  • అనర్హత వేటు పిటిషన్‌ విచారణకు ఎమ్మెల్సీ ఇందుకురి రఘురాజు గైర్హాజరు.
  • ఈ నెల 31వ తేదీకి విచారణ వాయిదా.
  • వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి రఘురాజు పార్టీ ఫిరాయించిన సంగతి తెలిసిందే.

3:00 PM, May 27th, 2024

ఓట్ల లెక్కింపు కార్యక్రమంపై అధికారులతో సీఈసీ రాజీవ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్

  • జూన్ 4న జరగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమంపై అధికారులతో సీఈసీ రాజీవ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్.
  • సీఈసీ మార్గదర్శకాలను పాటిస్తూ ఖచ్చితమైన ఫలితాలను త్వరగా ప్రకటించేలా చర్యలు చేపట్టాలని దిశా నిర్దేశం
  • సీఈసీతో పాటు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఈసీలు జ్ఞానేష్ కుమార్, డాక్టర్ సుఖ్ బీర్ సింగ్, ఏపీ సీఈవో ముఖేష్ కుమార్ మీనా.

    2:00 PM, May 27th, 2024
    పోస్టల్‌ బ్యాలెట్లు కృష్ణా యూనివర్సిటీ తరలింపు..

  • కృష్ణా జిల్లా..
  • మచిలీపట్నం పార్లమెంట్ సంబంధించిన పోస్టల్ బ్యాలెట్లను కలెక్టరేట్ నుండి కృష్ణా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్‌కి తరలింపు
  • రాజకీయ పార్టీల సభ్యుల సమక్షంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్‌కి పోస్టల్ బ్యాలెట్లు తరలించిన అధికారులు

 

1:30 PM, May 27th, 2024
ఈసీకి పేర్ని నాని ప్రశ్నలు..

ఎన్నికల సంఘానికి ప్రశ్నలు సంధించిన పేర్ని నాని.

 

11:20 AM, May 27th, 2024
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిటిషన్లపై నేడు విచారణ
 

  • పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిటిషన్లపై హైకోర్టులో నేడు కొనసాగనున్న విచారణ
  • పిన్నెల్లిపై అక్రమంగా మూడు కేసులు నమోదు
  • పచ్చ బ్యాచ్‌ సూచనల మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు. 

 

11:00 AM, May 27th, 2024
దాడులపై చోద్యం చూస్తున్న ఈసీ..

  • టీడీపీ దాడులపై ఇంకా చోద్యం చూస్తున్న ఎన్నికల సంఘం. 
  • ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న పచ్చ మూకల అరాచకాలు. 
  • ఈసీ, పోలీసులను అడ్డుపెట్టుకుని టీడీపీ శ్రేణుల దారుణాలు. 
  • వైఎస్సార్‌సీపీ నేతలను టార్గెట్‌ చేసిన టీడీపీ అనుకూల పోలీసులు. 
  • పోలింగ్‌, ఆ తర్వాత మాచర్లలో పచ్చ మూకల అరాచకాలు. 
  • ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి హత్యకు కుట్ర పన్నిన పచ్చ మూకలు. 
  • దాడులకు పరోక్షంగా వత్తాసు పలికిన పోలీసులు. 

 

10:30 AM, May 27th, 2024
ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు అనర్హతపై నేడు విచారణ

  • ఇందుకూరి రఘురాజు అనర్హతపై నేడు విచారణ
  • పార్టీ ఫిరాయించిన రాఘురాజు వ్యక్తిగత విచారణను రావాలని ఆదేశం.
  • విచారణ అనంతరం అనర్హతపై నిర్ణయం తీసుకోనున్న మండలి చైర్మన్‌
  • నేడు 11 గంటలకు విచారించనున్న మండలి చైర్మన్‌ మోషేన్‌ రాజు.
  • వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి పార్టీ ఫిరాయించిన రఘురాజు.

 

9:30 AM, May 27th, 2024
ఎన్నికల దృష్ట్యా పోలీసుల కార్డన్‌ సెర్చ్‌..

  • ఎన్టీఆర్ జిల్లా:
  • గంపలగూడెం మండలం సొబ్బాల గ్రామంలో తిరువూరు సీఐ అబ్దుల్ నబీ ఆధ్వర్యంలో పోలీసుల కార్డన్ సెర్చ్..
  • ఎన్నికల ఫలితాల భద్రతా దృష్యా ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టిన పోలీసులు..
  • రికార్డులు లేని 11 వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలింపు..

 

8:50 AM, May 27th, 2024
బరితెగించిన పచ్చ గూండాలు..

  • ఎన్నికల్లో ఓటమి భయంతో రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్‌
  • కారంపూడిలో బరితెగించిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు
  • పోలింగ్‌ జరిగిన మరుసటి రోజే వైఎస్సార్‌సీపీకి చెందిన కార్యకర్తలను టార్గెట్‌ చేశారు. 
  • వైఎస్సార్‌సీపీ కార్యకర్తల షాపులను ధ్వంసం చేసి తగలపెట్టారు. 
     

 

 

 

7:45 AM, May 27th, 2024
పిన్నెళ్లిపై పోలీసుల అక్రమ కేసులు..

  • తాడేపల్లి..
  • మాచర్ల ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డిపై వరుస కేసులు
  • ఎమ్మెల్యే అరెస్టే లక్ష్యంగా అక్రమ కేసులు పెడుతున్న పోలీసులు
  • టీడీపీకి అనుబంధ సంఘాలుగా మారిన ఈసీ, పోలీసు శాఖ
  • ఈవీఎం కేసులో బెయిల్ రాగానే వెంటనే మరో మూడు హత్యాయత్నం కేసులు పెట్టిన పోలీసులు
  • సీఐ నారాయణస్వామి చౌదరి ఆధ్వర్యంలోనే కుట్ర జరుగుతోందన్న వైఎస్సార్‌సీపీ
  • ఏదోలా ఎమ్మెల్యే పిన్నెళ్లిని అరెస్టు చేసి హతమార్చేందుకే కుట్రలంటున్న వైఎస్సార్‌సీపీ నేతలు

 

7:00 AM, May 27th, 2024
ఓటు తెచ్చిన చేటు..

  • కౌలురైతులపై ‘మంగళగిరి’లో ఓ సామాజికవర్గం దుర్మార్గం
  • సాగు కోసం పొలాల వద్దకు రావొద్దని హెచ్చరికలు
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు టీడీపీకి చెందిన ఆ వర్గీయుల అల్టిమేటం
  • దశాబ్దాలుగా కౌలుకు చేస్తున్న పేదలపై బరితెగింపు
  • వ్యవసాయ సీజన్‌ ఆరంభంలో ఒక్కసారిగా రోడ్డునపడ్డ కౌలుదారులు
  • నారా లోకేశ్‌కు ఓట్లు వేయకపోవడమే వారు చేసిన నేరం
  • ఆ సామాజికవర్గానికి చెందిన సంస్థల్లో పనిచేసే వారికీ ఇదే అనుభవం
  • నీ పేరు లోకేశ్‌ రెడ్‌బుక్‌లోకి ఎక్కిందంటూ బెదిరింపులు
  • ‘ఫ్యాను’కు ఓటేసినందుకే అంటూ లబోదిబోమంటున్న బాధితులు
  • ఇల్లు కట్టుకుంటున్నా ఓర్వలేకపోతున్నారని.. మాకిష్టమైన వారికి 
  • ఓటు వేసుకునే స్వేచ్ఛ కూడా లేదా అని ఆవేదన
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పదవులు వస్తున్నాయని కూడా ఏడుపు

 

6:50 AM, May 27th, 2024
సీల్‌ లేదని పోస్టల్‌ బ్యాలెట్‌  తిరస్కరించొద్దు

  • డిక్లరేషన్‌పై అటెస్టింగ్‌ ఆఫీసర్‌ సంతకం, పేరు, హోదా ఉంటే ఆమోదించండి 
  • అనుమానం వస్తే పోస్టల్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్‌లోని కౌంటర్‌ ఫాయిల్‌తో సరిచూడండి
  • డిక్లరేషన్‌పై ఓటరు, అటెస్టింగ్‌ ఆఫీసర్‌ సంతకాలు లేకపోయినా తిరస్కరించండి 
  • డిక్లరేషన్‌ ఫారం విడిగా కవర్‌–బీలో లేకపోతే ఓపెన్‌ చేయకుండానే తిరస్కరించొచ్చు 
  • బ్యాలెట్‌ పేపర్‌ నెంబరు డిక్లరేషన్‌పైన ఒకలాగా, ఫారం–13బీ పైన మరొకటి వుంటే తిరస్కరించాలి.. 
  • బ్యాలెట్‌ పేపర్‌ ఓపెన్‌ చేసిన తర్వాత ఒకరి కంటే ఎక్కువమందికి సంతకాలు చేసినా తిరస్కరించొచ్చు 
  • పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపుపై ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్‌ మీనా ఆదేశాలు

 

6:40 AM, May 27th, 2024
‘పిన్నెల్లి’కి మధ్యంతర ముందస్తు బెయిల్‌ ఇవ్వండి

  • ఈవీఎంల కేసులో ముందస్తు బెయిల్‌ ఇవ్వగానే హత్యాయత్నం కేసులు పెట్టారు 
  • ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా నిరోధించేందుకే ఈ తప్పుడు కేసులు 
  • ఎన్నికల సంఘం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది.. పరిధి దాటి పనిచేస్తోంది 
  • ఆయన్ను అరెస్టు చేసి తీరాలన్న లక్ష్యంతోనే ఇలా చేస్తోంది 
  • ఘటనలు జరిగిన పది రోజుల తర్వాత నిందితుడిగా చేర్చారు 
  • అంత జాప్యం ఎందుకు జరిగిందో పోలీసులు చెప్పడం లేదు 
  • ఈవీఎంల కేసులో కల్పించిన రక్షణే ఈ కేసుల్లో కూడా కల్పించండి 
  • హైకోర్టుకు నివేదించిన సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి 
  • మరోవైపు.. టీడీపీ నేత అస్మిత్‌పై హత్యాయత్నం కేసున్నా బెయిల్‌ను వ్యతిరేకించని పోలీసులు

 

6:30 AM, May 27th, 2024
తాపీగా తప్పుడు కేసులు

  • పిన్నెల్లికి బెయిల్‌ రావడంతో మరో మూడు అక్రమ కేసులు.. కారంపూడిలో సీఐ తలకు గాయమైతే వారానికిపైగా ఏం చేస్తున్నట్లు? 
  • నరసరావుపేటలో ఇంట్లో బాంబులు దాచిన టీడీపీ నేత అరవిందబాబును వదిలేసి గోపిరెడ్డిపై కేసులా?
  • టీడీపీ గూండాలకు చట్టం చుట్టమా?

Advertisement
 
Advertisement
 
Advertisement