Bridegroom
-
పెళ్లి కొడుక్కి ‘సినిమా చూపించిన మావా!’
మరికొద్ది గంటల్లో అక్కడ వివాహ మహోత్సవం జరగాల్సి ఉంది. పెళ్లి బాజాలతో అక్కడంతా కోలాహలం నెలకొంటుందని అనుకునేరు. బదులుగా.. పెండ్లి కొడుకు వీపు విమానం మోత మోగింది. అయితే.. అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు.. ఆ దాడిని ఆపారు. తన్నులు తిన్న ఆ యువకుడికి కడుపు నిండా కమ్మటి భోజనం పెట్టారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ కథనం చదివి తెలుసుకోండి..సోహన్‌లాల్ యాదవ్‌కు మరో మూడు రోజుల్లో వివాహం జరగాల్సి ఉంది. అయితే సడన్‌గా అతను కనిపించకుండా పోయాడు. దీంతో అతని కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. మిస్సింగ్ నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఈలోపు.. ఇదేం తెలియని పెళ్లి కూతురు తరఫువాళ్లు తమ ఏర్పాట్లు చేసుకుంటూ పోతున్నారు. పెండ్లి టైం దగ్గర పడడంతో బాజాభజంత్రీలతో స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. కానీ, అక్కడి నుంచి సీన్ పీఎస్‌కు మారింది.పెళ్లి కొడుకు తరఫు వాళ్లు రాకపోవడంతో.. పెళ్లి కూతురు వాళ్లంతా దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. పోలీసుల జోక్యంతో.. అబ్బాయి తరఫు వాళ్లంతా వచ్చారు. చివరకు ఆ అమ్మాయితో వివాహానికి అబ్బాయి ఒప్పుకున్నాడు. అయితే.. అదేరోజు మరో ముహూర్తానికి వివాహం జరగాల్సి ఉంది. కానీ, ఇంతలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. మూడు రోజులపాటు కనిపించకుండా పోయిన ఆ యువకుడు.. మరో ఊరిలో ఇంకో అమ్మాయితో కలిసి ఉన్నాడని అమ్మాయి తరఫు వాళ్లకు తెలిసింది. దీంతో ఆగ్రహంతో గ్రామస్తులంతా అతన్ని చితకబాదారు. ఈలోపు అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు ఆ దాడిని ఆపారు. ఆ యువకుడికి భోజనం పెట్టి మరీ పెళ్లి క్యాన్సిల్ చేసుకందామని చెప్పారు. అయితే.. ఇక్కడే ఆ యువకుడికి ఊహించని షాక్ తగిలింది.పెళ్లి కోసం తాము ఎంతో ఖర్చు చేశామని, ఆ డబ్బంతా ఇచ్చి కదలమని కండిషన్ పెట్టారు. దీంతో ఖంగుతినడం అతని వంతు అయ్యింది. ‘‘మేం ఇక్కడికి ఆలస్యంగా వచ్చాం. ఆ మాత్రం దానికే పెండ్లి రద్దు చేసుకున్నారు. పైగా పరిహారం ఇవ్వమని అడుగుతున్నారు. అది ఇచ్చేదాకా నన్ను కదలనివ్వమంటున్నారు. అంతా చెప్తున్నట్లు నేనేం అదృశ్యం కాలేదు. పని మీద ఊరెళ్లా. నా ఫోన్ పని చేయకుండా పోయింది. బాగు చేసుకునేసరికి పోలీసులు రమ్మని పిలిచారు. పెళ్లికి నేను రెడీ, కానీ వాళ్లు సిద్ధంగా లేరు’’ అని పారిపోయే ప్రయత్నం చేసిన పెళ్లి కొడుకు మొబైల్ వీడియో సందేశం ఒకటి వైరల్ అయ్యింది. ఇక అమ్మాయి తండ్రి మాట్లాడుతూ.. 10 నెలల కిందట నా కూతురికి వివాహం నిశ్చయించా. పెండ్లి కొడుకుగా చేశాక.. అతను నాకు కారు కావాలనే డిమాండ్ చేశాడు. ఇవ్వడానికి మేం సిద్ధంగానే ఉన్నాం. ఆపై కారు వద్దు.. క్యాష్ కావాలన్నాడు. దానికీ మేం ఒప్పుకున్నాం. ఆ తర్వాతే అన్ని ఏర్పాట్లు చేశాం. పెండ్లి రోజు బంధువులంతా వచ్చినా.. పెండ్లి కొడుకు రాలేదు. చివరకు.. మా దగ్గరి బంధువును అక్కడికి పంపిస్తే అతను ఊర్లోనే లేడని సమాచారం ఇచ్చాడు. అందుకే పోలీస్ స్టేషన్‌కు వెళ్లాం. తీరా అక్కడికి వెళ్లే సరికి పీఎస్‌లో ఆ యువకుడు కూడా ఉన్నాడు. వరకట్నం కేసు పెడతామని వాళ్లు హెచ్చరించారు. అందుకే పెళ్లికి ఒప్పుకున్నాడు. కానీ, మాకీ పెళ్లి ఇష్టం లేదు. అతను చేసిన మోసం ఇప్పుడే బయటపడింది. ఒకవేళ పెండ్లి తర్వాత బయటపడి ఉంటే నా కూతురి జీవితం నాశనం అయ్యేది. అందుకే పరిహారం చెల్లించమని కూర్చున్నాం. ఉత్తర ప్రదేశ్ అమేథీ పోలీసులు ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. अमेठी : दूल्हे राजा के इंतजार में दुल्हन के हाथों की मेहंदी हो गई फीकीकाफी इंतजार के बाद पुलिस के हस्तक्षेप पर सुबह पहुंची बारातसुबह बारात पहुंचने पर दुल्हन के घरवालों ने दूल्हे को बनाया बंधकशादी में हुए खर्च को लेकर अड़े दुल्हन के घर वाले@amethipolice @Uppolice #Amethi pic.twitter.com/VxYSFPcSUQ— Tasleem choudhary (JOURNALIST) (@tasleem7573) December 3, 2024 -
జాడ లేని పెళ్లికూతురు.. నిరాశతో తిరిగొచ్చిన పెళ్లికొడుకు
లక్నో: పాపం ఓ పెళ్లికొడుకు పెళ్లి చేసుకోవడం కోసం బంధుమిత్రులు, బాజా భజంత్రీలతో పెళ్లి కూతురు ఇంటికి బయలుదేరాడు. ఇక్కడే అతడికి పెద్ద షాక్ తగిలింది. వెళ్లినచోట ఎంత వెతికినా పెళ్లికూతురు ఇల్లు దొరకలేదు. పెళ్లి కూతురు, ఆమె అమ్మానాన్నలకు ఫోన్ చేస్తే స్విచ్ఆఫ్ వచ్చింది.అక్కడ ఇరుగుపొరుగు వాళ్లను అడిగితే అసలు మీరు చెబుతున్నవారెవరు ఇక్కడ ఉండరు అని సమాధానం వచ్చింది. ఇంకేముంది పోలీసులకు ఫిర్యాదు చేసిన పెళ్లికొడుకు నిరాశతో వెనుదిరిగాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో లక్నోలోని రహీమామాబాద్ ప్రాంతంలో ఆదివారం(జులై 14) జరిగింది. ఉన్నావోకు చెందిన సోనూ అనే యువకుడికి కాజల్ అనే అమ్మాయికి చండీగఢ్‌లో పరిచయమైంది. వారిద్దరు పెళ్లి చేసుకోవాలని డిసైడయ్యారు. భాజాభజంత్రీలు అన్నీ రెడీ చేసుకుని వస్తే పెళ్లి చేసుకుందాం అని కాజల్ సోనూకు ఫోన్లో చెప్పింది. పెళ్లి ఏర్పాట్లు మొత్తం చేసేశామని కాజల్ తండ్రి కూడా సోనూకు ఫోన్లో చెప్పాడు. ఈ మాటలు నిజమని నమ్మిన సోనూ పెళ్లి చేసుకుందామని వెళ్లి పెళ్లికూతురు ఇల్లు దొరకక షాక్‌లో వెనుదిరిగి వచ్చాడు. -
నా పెళ్లి నా ఇష్టం
పెళ్లిలో పెళ్లికొడుకు మెడలో పూలదండ కనిపించడం సాధారణమే. హరియాణ రాష్ట్రం ఖురేషీపూర్ గ్రామానికి చెందిన ఈ వరుడు మాత్రం సంప్రదాయానికి భిన్నంగా ఖరీదైన కొత్తరకం దండ తయారు చేయించాడు. దీని అర్థం... ఖరీదైన పువ్వులతో దండ తయారు చేయించాడు అని కాదు. అది కరెన్సీ దండ. 20 లక్షల అయిదు వందల నోట్లతో తయారు చేయించిన ఈ వరుడి దండ సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో క్లిప్‌పై నెటిజనులు రకరకాలుగా స్పందించారు. కొందరు ‘ఆహా! అద్భుతం’ అంటే– మరికొందరు ‘ఏమిటీ అతి’ అని చురకలు అంటించారు. ‘ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్లకు ఫిర్యాదు చేస్తాం’ అని కొందరు బెదిరించారు. ఎవరి స్పందన ఎలా ఉన్నా ఈ వీడియో క్లిప్ 15 మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకుంది. ఈ మధ్య వచ్చిన ‘కీడా కోలా’ సినిమాలో హీరో బార్బీ డాల్ మీద మనసు పడతాడు. పెళ్లంటూ చేసుకుంటే బార్బీ డాల్నే చేసుకుంటానని ప్రతినపూనుతాడు. అది సినిమా కాబట్టి నవ్వుకుంటాం. ‘నిజజీవితంలో ఇంత సీన్ ఉంటుందా!’ అనుకుంటాం. అయితే బ్రెజిల్‌కు చెందిన రోచా మోరీస్ వివాహవేడుకను చూస్తే ‘నిజ జీవితంలో కూడా ఇలాంటివి జరుగుతుంటాయి’ అనే వాస్తవం బోధపడుతుంది. రోచా ‘మార్సెల్’ను పెళ్లి చేసుకుంది. సదరు ఈ మార్సెల్ మానవమాత్రుడు కాదు. ఓ బొమ్మ. 40 మంది గెస్ట్‌లతో ఈ పెళ్లి ఘనంగా జరిగింది. -
పెళ్లి మండపంలో ఇదేంది.. వధువు చేసిన పనికి నవ్వుకుంటున్న నెటిజన్లు!
పెళ్లంటే ఇద్దరు వ్యక్తులను ఒకటిగా చేసే ఓ వేడక. అందుకే జీవితంలో ఇది మర్చిపోలేని రోజుల్లో ఒకటిగా పేర్కొంటుంటారు. అంతటి విశిష్టత ఉంది కనుకే పెళ్లి రోజు ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా భావిస్తుంటారు. ఇక భారతీయ వివాహాలపై ఓ లుక్కేస్తే అందులో జరిగే హడావుడి మామూలుగా ఉండదు. వధూవరుల కుటుంబసభ్యులు పెళ్లి ఏర్పాట్లు, తతంగాలను చేస్తూ అలిసిపోతే, వధూవరులు మాత్రం పెళ్లి కార్యక్రమాల్లో పాల్గొని అలిసిపోతారు. ఇక రాత్రివేళ ముహూర్తాలు ఉన్న సమయంలో వధూవరుల అవస్థల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఓ వధువు తన పెళ్లిరోజు మండపంలో చేసిన పని అందరికీ నవ్వ తెప్పించింది. ప్రస్తుతం నెట్టింట్లో ఆ వీడియో వైరల్‌గా మారి చక్కర్లు కొడుతోంది. ఇటీవల ఓ వివాహం అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఆ మండపంలో వరుడు వివాహ కార్యక్రమాలలో తతంగాలలో బిజీబిజీగా గడుపుతున్నాడు. వధువు కూడా బిజీగా ఉందనుకుంటే పొరపడినట్లే. అంతవరకు జరిగిన కార్యక్రమాల్లో వధువు పాల్గొని అలిసిపోయిందేమో గానీ ఆమె మాత్రం ఓ కూర్చీలో పడుకుని ఆదమరిచి నిద్రపోతోంది. పెళ్లికి వచ్చిన వారిలో ఒకరు దీన్ని వీడియో తీసి సోషల్‌మీడియాలో షేర్ చేశారు. పవర్ నాప్ అంటే ఇదే అంటూ వీడియోలో కామెంట్ కూడా ఆ వీడియోకి జతచేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టంట హల్ చల్ చేస్తోంది. ఇక నెటిజన్లు వధువు పరిస్థితి చూసి పడిపడీ నవ్వుకుంటున్నారు. పాపం నిద్ర వస్తే ఎవరు మాత్రం ఏం చేయగలరంటూ కొందరు కామెంట్లు చేయగా.. మరికొందరు మాత్రం పెళ్లికూతురిని ట్రోల్ చేస్తున్నారు. పెళ్లి పెట్టుకుని ఇదేం పనంటూ సెటైర్లు వేస్తూ కామెంట్లు పెడుతున్నారు. View this post on Instagram A post shared by Candid Impressions🧿📸 (@candid_impressions) చదవండి: వధువు మెడపై కత్తి పెట్టి కిడ్నాప్.. నిశ్చేష్టుడైన వరుడు! చూస్తుండగానే -
బావా మరదలు సరదా ఆట! అసలు విషయం తెలియడంతో పెళ్లి క్యాన్సిల్
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో ఓ వింత సంఘటన జరిగింది. ప్రధాని పేరు చెప్పలేకపోయాడని ఓ వధువు పెళ్లిని రద్దు చేసింది. అంతేకాకుండా వెంటనే వరుని తమ్ముడినే వివాహమాడింది. సైద్పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇదీ జరిగింది.. శివ శంకర్(27) నాసిర్పూర్ గ్రామానికి చెందిన రామ్ అవతార్ కుమారుడు. ఇతనికి సమీప గ్రామానికి చెందిన రంజన అనే అమ్మాయితో జూన్ 11న వివాహం జరిగింది. మరుసటి రోజు వధువు ఇంటి వద్ద ఓ చిన్న వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో వరుడు తన మరదలు, బావమరిదిని సరదాగ ప్రశ్నలు అడిగాడు. ఈ క్రమంలో మరదలు కూడా వరున్ని ప్రధాని ఎవరని ప్రశ్నించింది. దేశ ప్రధాని పేరు ఆయన చెప్పలేకపోయాడు. వధువు బంధువులు వరున్ని హేళన చేశారు. దీన్ని అవమానంగా భావించిన రంజన అక్కడికక్కడే అనంత్‌ను వివాహమాడింది. అనంత్ శివ శంకర్ సోదరుడు. వయస్సులో చిన్నవాడు. దీనిని రామ్ అవతార్ ఖండించాడు. స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇదీ చదవండి: స్నేహితురాలిపై ప్రేమతో ఆమె..‘అతని’గా మారాలనుకుంది.. తరువాత జరిగిన దారుణమిదే.. -
కొత్త పెళ్లికొడుకును చంపింది మాజీ ప్రియుడే!
క్రైమ్: ప్రేమించానంది. వెంట తిరిగింది. కానీ, చివరకు తనను కాదని మరో వ్యక్తిని వివాహమాడింది. అది తట్టుకోలేకపోయాడు. మరిచిపోలేని గుణపాఠం నేర్పాలనుకున్నాడు. డేంజరస్ కానుకతో మాజీ ప్రేయసి సహా ఆమె అత్తింటివాళ్లందరినీ చంపాలని ప్లాన్ వేశాడు. కానీ, అది వికటించి కొత్త పెళ్లి కొడుకు, అతని సోదరుడు చనిపోయారు. చివరకు సైకో ప్రియుడు పోలీసులకు దొరికిపోయాడు. ఛత్తీస్‌గఢ్ ఖబిర్దామ్ హోం థియేటర్ పేలుడు ఘటనలో మిస్టరీని స్థానిక పోలీసులు చేధించారు. అది ప్రమాదవశాత్తూ జరిగిన ఘటన కాదని.. కావాలనే చేసిన పని అని తేల్చారు పోలీసులు. తనను కాదని మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కోపంతో.. ఆమె అత్తింటి కుటుంబాన్ని మొత్తాన్ని చంపేయాలని ప్లాన్ వేసినట్లు పోలీసులు తేల్చారు. ఏప్రిల్ 1వ తేదీన హేమేంద్ర మేరావికి స్థానికంగా ఉండే ఓ యువతితో ఘనంగా వివాహం జరిగింది. పెళ్లి సందర్భంగా భారీగా కానుకలు వచ్చాయి. ఆ మరుసటి రోజు కానుకలు ఉంచిన గదిలోకి హేమేంద్ర, కుటుంబ సభ్యులు వెళ్లారు. అందులోంచి హోం థియేటర్‌ను తీయగా.. అది భారీ విస్పోటనంతో పేలిపోయి హేమేంద్ర అక్కడికక్కడే మరణించాడు. పేలుడు ధాటికి ఆ గది గోడలు, పైకప్పు సైతం కూలిపోయాయి. హేమేంద్ర సోదరుడు రాజ్‌కుమార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూయగా.. మరో నలుగురు(ఏడాదిన్నర బాలుడు కూడా) తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆ హోం థియేటర్ ఇచ్చింది సార్జూ అనే యువకుడని, అతనికి నవవధువుకి గతంలో ప్రేమ వ్యవహారం నడిచిందని తేల్చారు. మరో వ్యక్తిని వివాహం చేసుకుందన్న కోపంలో అతను ఆ కుటుంబం మొత్తాన్ని చంపేయాలని ప్లాన్ వేశాడట. హోం థియేటర్లో బాంబు ఫిక్స్ చేసి ఇచ్చాడట. అలా చివరకు రెండు ప్రాణాలు పోవడంతో పాటు నిందితుడు కటకటాల పాలయ్యాడు. ఇదీ చదవండి: ఊయలలో బొమ్మ.. కాలువలో నిహారిక -
ఎంతటి విషాదం! బాంబులా పేలిన గిఫ్ట్.. పెళ్లైన రెండు రోజులకే..
ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్నాడు కానీ పెళ్లైన రెండు రోజులకే ఓ వరుడు జీవితం అర్థాంతరంగా ముగిసిపోయింది. కాళ్ల పారాణి ఆరకముందే ఆ వధువు కలలు కలలుగానే మిగిలిపోయింది. ఈ విషాద ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కబీర్ధామ్ జిల్లాలోని చమరి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చమరి గ్రామానికి చెందిన యువకుడు హేమేంద్ర మేరవి, అంజానా గ్రామానికి చెందిన యువతికి ఇటీవల అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. పెళ్లలో బంధుమిత్రులు, స్నేహితుల నుంచి రకరకాల బహుమతులు వచ్చాయి. సోమవారం ఉదయం ప్రాంతంలో హేమేంద్ర ఇంటికి తెచ్చిన పెళ్లి కానుకలను ఓపన్ చేసి చూస్తున్నారు. అందులో వారికి ఒక హోమ్ థియేటర్ ఉంది. పెళ్లి కొడుకు తన కుటుంబసభ్యులతో కలిసి బహుమతిగా వచ్చిన హోమ్ థియేటర్‌ను ఏర్పాటు చేసిన తర్వాత ఆన్ చేశాడు. అయితే ఒక్కసారిగా హోమ్ థియేటర్ పేలింది. పేలుడు ధాటికి ఇంటి పైకప్పు ఎగిరిపోయి గోడ కూలిపోవడంతో హేమేంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. అతని సోదరుడు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గాయపడిన వారిలో ఏడాదిన్నర చిన్నారి కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. ఫోరెన్సిక్స్ నివేదిక వచ్చే వరకు ఈ ఘటనపై స్పందించేందుకు పోలీసులు నిరాకరించారు. ఇది ప్రమాదవశాత్తు పేలిందా లేదా మరేదైన కుట్ర దాగుందా అనే విషయంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఒకటి లేదా రెండు రోజుల్లో దీనిపై క్లారిటీ వస్తుందని తెలిపారు. -
పదే పదే చెప్పినా పట్టించుకోలేదు.. డీజే సౌండ్ మోతకు కొత్త పెళ్లికొడుకు మృతి!
ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని భావించిన ఓ వరుడి కల కలగానే మిగిలిపోయింది. మండపంలో డీజే సౌండ్ మోతకు ఆ వరుడి గుండె లయ తప్పి స్టేజిపైనే అక్కడికక్కడే కుప్పుకూలిపోయాడు. పెళ్లి బాజాలు మోగాల్సిన మండపం కాస్త మూగపోయింది. ఈ విషాదకర ఘటన బీహార్‌లోని సీతామర్హి జిల్లా మణితార గ్రామంలో చోటుచేసుకొంది. ఎన్ని సార్లు చెప్పినా వినిపించుకోలేదు బీహార్లోఘో వ్యక్తికి అదే ప్రాంతానికి చెందిన యువతితో ఇందర్వాలో వివహం జరుగుతోంది. వధూవరులు స్టేజిపైకి వచ్చి దండలు మార్చుకుని, వచ్చిన అతిథులతో ఫోటోలు దిగుతున్నారు. అదే సమయంలో అతడి మిత్రులు డీజే సౌండ్‌ను పెంచి, డ్యాన్స్ చేస్తున్నారు. పెళ్లి హంగామా కారణంగా ఆ వాతావరణమంతా సందడి నెలకొంది. అంతా బాగానే నడుస్తుండగా, డీజే తనకు ఇబ్బందిగా ఉందని సౌండ్ తగ్గించాలని పదేపదే కోరాడు వరుడు. కానీ, అతని మాటలు ఎవరూ పట్టించుకోలేదు. పాటలు యథావిధిగానే బిగ్గరగా వినిపిస్తూనే ఉన్నాయి. కొద్ది క్షణాల తర్వాత వరుడు వేదికపైనే హఠాత్తుగా కుప్పకూలిపోగా, కుటుంబ సభ్యులు, అతిథులు వెంటనే అతడిని వైద్య సహాయం కోసం స్థానిక ఆసుపత్రికి చికిత్స కోసం తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఈ దురదృష్టకర సంఘటన వెనుక పెళ్లి ఊరేగింపులో డీజే సంగీతం ఎక్కువగా వినిపించడమే కారణమని తెలిసింది. ఈ ఘటనపై జిల్లా యంత్రాంగం విచారణ ప్రారంభించింది. నివేదికల ప్రకారం, శబ్ద కాలుష్యాన్ని నివారించడానికి సీతామర్హి జిల్లాలో డీజేల వినియోగాన్ని నిషేధించారు. వివాహాలు, ఇతర బహిరంగ కార్యక్రమాల సమయంలో డీజేల వినియోగాన్ని నియంత్రించాల్సిన అవసరాన్ని ఈ సంఘటన మరోసారి హైలైట్ చేసింది. చదవండి: డ్రైవర్ లేకుండానే దానికదే హఠాత్తుగా స్టార్ట్ అయిన ట్రాక్టర్! ఆ తర్వాత.. -
ఊరేగింపులో రూ.కోట్ల విలువైన కార్లు.. అయినా ఎద్దుల బండి మీద వరుడు ఎంట్రీ!
ఇటీవల పెళ్లి వేడుకల వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అటు వధువు దగ్గర నుంచి వరుడు వరకు పాటించే ఆచారాలు ఎవరో ఒకరు చిత్రీకరించడంతో అవి నెట్టింట వైరల్‌గా మారడం షరా మామూలుగా మారింది. ఈ ట్రెండ్ కరోనా నుంచి కాస్త ఎక్కువ అయ్యిందనే చెప్పాలి. తాజాగా ఓ వరుడు ఊరేగింపులో రూ. కోట్లు విలువైన లగ్జరీ కార్లను ఉపయోగించాడు. అయితే కార్ల నుంచి కాకుండా మండపంలోకి వెరైటీగా ఎంట్రీ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు ఆ వరడు! వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన భాజపా నేత భరత్ వఘాశియా తన కుమారుడి పెళ్లి ఊరేగింపులో రూ.కోట్ల విలువైన 100 విలాసవంతమైన కార్లను వినియోగించారు. అందులో అత్యంత ఖరీదైన కార్ల సరికొత్త మోడల్స్ అన్నీ కనిపించాయి. ఊరేగింపులో ఖరీదైన కార్లు రావడం చూసి పెళ్లికి వచ్చి బంధువులు, చుట్టూ ఉన్న ప్రజలు సైతం ఆశ్చర్యపోయారు. కానీ, ఆ వరుడు ఊరేగింపులో ఉన్న లగ్జరీ కార్లలో కాకుండా ఎద్దుల బండిపై వచ్చి ఊహించని షాకిచ్చాడు. కారణం ఏంటంటే.. గుజరాత్లో వరుడు ఎప్పుడూ ఎద్దుల బండిలో రావడం అనాదిగా వస్తున్న ఆచారం. గుజరాత్ సంస్కృతి ,సంప్రదాయాలతో పాటు ఆధునిక, సాంకేతికతతో నడిచే జీవనశైలిని ప్రదర్శించాలని వరుడు కోరుకున్నాడట. తన కుమారుడికి ఖరీదైన కార్లంటే ఇష్టమని, అందుకే ఊరేగింపులో రూ.50 లక్షల నుంచి రూ.5 కోట్ల విలువైన కార్లను ఉపయోగించామని, అలాగే సంప్రదాయాన్నీ కొనసాగించినట్లు వరుడు తండ్రి తెలిపాడు. చదవండి వెరైటీ వంట: ప్లాస్టిక్ కవర్లో చేపల పులుసు, ఈ బామ్మ ఎలా చేసిందో చూడండి! -
వైరల్ వీడియో: వధువుకు ఎమర్జెన్సీ సర్జరీ.. ఆస్పత్రి బెడ్‌పైనే తాళి కట్టాడు
-
వధువుకు ఎమర్జెన్సీ సర్జరీ.. ఆస్పత్రి బెడ్‌పైనే తాళి కట్టాడు
సాక్షి, మంచిర్యాల: అమ్మాయిది నిరుపేద కుటుంబం. అందుకే పెళ్లి అయినా ఘనంగా చేయాలని ఆమె తల్లిదండ్రులు అనుకున్నారు. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. వివాహానికి ఇంకా ఒక్కరోజే ఉంది. ఈలోపు పెళ్లి కూతురు ఆస్పత్రి పాలైంది. ఆ పెళ్లి కొడుకు వధువు కుటుంబం పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. ఆసుపత్రి బెడ్‌పైనే వధువుకు తాళి కట్టాడు వరుడు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. లంబాడిపల్లికి చెందిన శైలజకు.. భూపాలపల్లికి చెందిన యువకుడితో వివాహం నిశ్చయమైంది. గురువారం ఉదయం 11 గంటలకు ముహూర్తం. అయితే.. బుధవారం రాత్రి వధువుకు కడపు నొప్పి వచ్చింది. దీంతో ఆమెను స్థానికంగా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమెకు ఎమర్జెన్సీ ఆపరేషన్ చేశారు వైద్యులు. అయితే.. ఖర్చు చేసి చుట్టాలందరినీ పిలిపించి.. వివాహ వేడుకను వాయిదా వేయడానికి పెళ్లి కొడుక్కి మనస్సు రాలేదు. అందుకే.. పెద్దలను ఒప్పించాడు. ఆపై ఆస్పత్రి వైద్యులతో మాట్లాడితే.. వాళ్లూ సంతోషంగా అంగీకరించారు. వాళ్ల సమక్షంలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టింది ఆ జంట. -
‘వధువు కావలెను’.. పెళ్లి బట్టలతో రోడ్డెక్కి నిరసనలు
ముంబై: లింగ నిష్పత్తి బేధాలు.. చాలా దేశాల్లో ఆందోళన కలిగించే అంశంగా మారింది. పురుషులకు సరిపడా మహిళలు లేకపోవడంతో ఏకంగా జనాభా తగ్గిపోతున్న దేశాలనూ చూస్తున్నాం. కడుపులో ఉండగానే.. ఆడ బిడ్డగా నిర్ధారించుకుని చిదిమేయడం, ఇతర కారణాలతోనే ఈ పరిస్థితి తలెత్తుతోంది, ఈ క్రమంలో.. పెళ్లి చేసుకుందామంటే అమ్మాయిలు దొరకడం లేదంటూ కొందరు యువకులు రోడ్డెక్కిన ఘటన మన దేశంలోనే చోటు చేసుకుంది. మహారాష్ట్ర షోలాపూర్ జిల్లాలో పెళ్లీడుకొచ్చిన యువకులు.. పెళ్లి చేసుకుందామంటే అమ్మాయిలు దొరకడం లేదంటూ వాపోతున్నారు. వయసు మీద పడుతుండడంతో తమకు పెళ్లి కూతుళ్లు దొరికేలా చూడాలని డిమాండ్ చేస్తూ ఏకంగా నిరసనకు దిగారు. పెళ్లికాని ప్రసాదులంతా రోడ్ల మీద పరేడ్ నిర్వహించారు. అదీ వినూత్నంగా.. పెళ్లి దుస్తుల్లో గుర్రాల మీద కొందరు, బ్యాండ్ మేళంతో మరికొందరు.. తమకు వధువులు కావాలంటూ డిమాండ్ వినిపిస్తూ ముందుకు సాగారు. చేతుల్లో ఫ్లకార్డులు పట్టుకుని నిరసన తెలియజేశారు. ఆపై జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. మహారాష్ట్రలో మగ-ఆడ నిష్పత్తిని పెంపొందించడానికి ప్రీ-కాన్సెప్షన్, ప్రీ-నేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ (PCPNDT) చట్టం అమలయ్యేలా చూడాలంటూ జిల్లా కలెక్టర్(జిల్లా మెజిస్ట్రేట్) వినతి పత్రం సమర్పించారు. వీళ్లంతా బ్రైడ్‌గ్రూమ్(వరుడి) మోర్చా పేరిట ఏర్పాటు చేసిన ఓ సంఘంలోని సభ్యులు. ‘‘మమ్మల్ని చూసి నవ్వుకున్నా ఫర్వాలేదు. కానీ, పెళ్లీడు వచ్చినా.. చేసుకుందామంటే అమ్మాయిలు దొరకడం లేదు. వయసు మీద పడుతోంది. ఇదంతా రాష్ట్రంలో పురుష-స్త్రీ లింగ నిష్పత్తి రేటు పడిపోవడం వల్లే’’ అని ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన రమేశ్ బరాస్కర్ తెలిపారు. మహారాష్ట్రలో పురుష-స్త్రీ నిష్పత్తి రేటు 1000 మందికి 889 మందిగా ఉంది. భ్రూణ హత్యలు.. అసమానతల వల్లే ఈ సమస్య తలెత్తిందని, ప్రభుత్వాలే ఇందుకు బాధ్యత వహించాలని పలువురు యువకులు కోరుతున్నారు. ये बारात नहीं प्रदर्शन है...जी हां, महाराष्ट्र के सोलापुर में शादी के लिए लड़की नहीं मिली तो डीएम ऑफिस के बाहर युवाओं ने किया प्रदर्शन, दूल्हे की तरह सज निकाली बारात#Maharashtra #ViralVideo #Protest pic.twitter.com/bDIPucE4Cw — Zee News (@ZeeNews) December 22, 2022 ఆడపిల్లల భ్రూణహత్యలు, లింగ నిర్ధారణ నిషేధ చట్టాలను పటిష్టం చేయాలని యువకులు కోరారు. ఈ చట్టాలను ఉల్లంఘించిన వారికి కఠిన శిక్షలు పడేలా చూడాలని కోరుతున్నారు. ఇదిలా ఉంటే.. ఇదే షోలాపూర్ జిల్లా మాల్షిరాస్ తాలుకా అక్లుజ్‌లో ఒక యువకుడు.. కవలలైన అక్కాచెల్లెలను వివాహం చేసుకున్న ఘటన ఈమధ్యే ప్రముఖంగా వార్తల్లో నిలిచింది కూడా. Twin sisters From Mumbai,got married to the same man in Akluj in Malshiras taluka of Solapur district in #maharashtra#maharashtranews#twinsisters #Mumbai #Viral #ViralVideos #India #Maharashtra pic.twitter.com/d52kPVdd5t — Siraj Noorani (@sirajnoorani) December 4, 2022 -
కమెడియన్ అలీకి కాబోయే అల్లుడు ఎవరో తెలుసా?
టాలీవుడ్ స్టార్ కమెడియన్ అలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన ఇప్పటివరకు వెయ్యికి పైగా చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఇటీవలె లైగర్ సినిమాలో నటించారు. ఈమధ్య సినిమాల కంటే బుల్లితెరపై హోస్ట్‌గా,జడ్జిగా అలరిస్తున్నారు. మరోవైపు ఆయన భార్య జుబేదా అలీ సైతం సొంతంగా యూట్యూబ్ ఛానెల్‌తో పాపులారటీ దక్కించుకున్నారు. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇదిలా ఉండగా అలీ పెద్ద కుమెర్తె ఫాతిమా రెమీజు త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఎంగేజ్మెంట్ వీడియోను జుబేదా అలీ తన ఛానెల్లో షేర్ చేయగా ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ ఎంగేజ్మెంట్ వేడుకకు సన్నిహితులు సహా బ్రహ్మానందం, సాయికుమార్ వంటి సినీ ప్రముఖులు హాజరయ్యారు. చదవండి: కమెడియన్ అలీ కూతురి ఎంగేజ్మెంట్ చూశారా? అయితే అలీకా కాబోయే అల్లుడు ఏం ఎవరు, ఏం చేస్తారు? అంటూ నెటిజన్లలో క్యూరియాసిటీ పెరిగింది. అయితే అలీ అల్లుడు డాక్టర్ అని తెలుస్తుంది. అంతేకాకుండా అలీ వియ్యంకుల ఇంట్లో అందరూ డాక్టర్లేనట. అలీ కూతురు ఫాతిమా సైతం ఈమధ్య మెడిసన్ కంప్లీట్ చేసింది. తమ కుటుంబంలో ఫాతిమానే మొదటి డాక్టర్ అంటూ అలీ దంపతులు పేర్కొన్న సంగతి తెలిసిందే. -
అదిరిందయ్యా చంద్రం.. పడవలో వధువు, థర్మోకోల్ షీట్‌పై వరుడు..
దేశవ్యాప్తంగా కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలోనే పెళ్లి వేడుకల వంటి శుభాకార్యాలకు ముహుర్తాలు ఉండటంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. కాగా,గురువారం కోనసీమ జిల్లాలోని లంకపేటకు చెందిన వధువు నల్లి ప్రశాంతి.. కూడా పడవలో వెళ్లి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఈ ఘటన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమయంలో ఇలాంటి మరో ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. భారీ వర్షాల నేపథ్యంలో రోడ్డు మార్గంలో ప్రయాణం చేయలేని వరుడు పెద్ద సాహసమే చేశాడు. హడ్గావ్ మండలం కొర్రి గ్రామానికి చెందిన ఓ వరుడు పెళ్లి కోసం థర్మకోల్ షీట్ సాయంతో 7 కిలోమీటర్ల దూరంలోని ఉమర్‌ఖేడ్ మండలం సంగమ్ చించోలి వరకు నీటిలో ప్రయాణించాడు. అతడితో పాటు బంధువులు సైతం థర్మకోల్ షీట్ల సాయంతోనే వివాహానికి వెళ్లారు. అనంతరం పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. आम्ही लग्नाळू:गुडघ्याला बांशिग बांधून पुराच्या पाण्यात थर्माकॉलवरून निघाली वरात; नवरदेवाचा 7 किमी नदीमार्गे प्रवास#nanded #marriage #flood #monsoon2022 #HeavyRains https://t.co/sjydoCUumU आणखी बातम्यांसाठी इन्स्टॉल करा दिव्य मराठी अॅपhttps://t.co/Jec3P7FpPp pic.twitter.com/q7wIx6yYEI — Divya Marathi (@MarathiDivya) July 15, 2022 ఇదిలా ఉండగా.. కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పెదపట్నంలంక లంకపేటకు చెందిన నల్లి ప్రశాంతికి, మలికిపురం మండలం కేశనపల్లికి చెందిన గంటా అశోక్‌కుమార్‌తో వివాహం నిశ్చయమైంది. గురువారం ఉదయం పెళ్లి కావాల్సి ఉండగా.. పెదపట్నంలంకను గోదావరి వరద చుట్టు ముట్టింది. ఈ నేపథ్యంలో అష్టకష్టాలు పడి పెళ్లి కుమార్తెను అతి ముఖ్యులతో కలిసి పడవపై అప్పనపల్లి కాజ్వే వరకు తీసుకువచ్చారు. అక్కడి నుంచి కారులో కేశనపల్లికి చేరుకున్నారు. ముహూర్త సమయానికి కాస్త ఆలస్యమైనా పెళ్లి వేదిక వద్దకు చేరుకోగలిగారు. అనంతరం పెద్దలు పెళ్లి ప్రక్రియ పూర్తి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Bride and family were not going to let the rains spoil the party; so, clad in silk finery, they set off in boats to the groom's place, making their way through coconut groves !! #Godavari receiving huge surplus waters #AndhraPradesh #Konaseema @ndtv @ndtvindia #AshokWedsPrashanti pic.twitter.com/viytS8jUJ2 — Uma Sudhir (@umasudhir) July 15, 2022 -
పెళ్లి కొడుకు.. పెళ్లి కూతురాయె!
కొనకనమిట్ల: పెళ్లిలో ఠీవీగా కనిపించాల్సిన పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తెగా దర్శనమిచ్చాడు. ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం గొట్లగట్టుకు చెందిన నాలి రామయ్య కుమారుడు యోగేంద్రబాబుకు ఆదివారం రాత్రి వివాహం జరిగింది. పెళ్లి కుమారుడు తమ వంశాచారం ప్రకారం ప్యాంటు, చొక్కాలకు బదులుగా చీర, జాకెట్ ధరించి బారెడు విగ్గు, తలనిండా పూలు పెట్టుకున్నాడు. బొట్టూ, కాటుక, గాజులు, దండలతో అచ్చం పెళ్లి కుమార్తెలా ముస్తాబయ్యాడు. వంశాచారం ప్రకారం పెళ్లి ముందు దేవుడికి ఎదురు నడిచే తతంగం ఉంది. అందులో భాగంగా తమ ఇలవేల్పు అయిన గురప్పడు స్వామికి కొలుపులు జరిపేందుకు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి మేళతాళాలు, బొల్లావుతో ఉత్సవం చేసుకుంటూ ఎదురైన ముత్తయిదువులకు నుదుట బొట్టు పెట్టుకుంటూ వారి ఆశీర్వచనాలు అందుకున్నాడు. ఊరి చివరి ఉన్న జమ్మిచెట్టు దగ్గరకు వెళ్లి పూజలు చేసి నైవేద్యాలు సమర్పించారు. ఇది తమ వంశాచారమని పెళ్లికి ముందుగా పెళ్లి కుమారుడిని పెళ్లి కుమార్తెగా..పెళ్లి కుమార్తెను పెళ్లి కుమారుడిగా అలంకరించి పూజలు చేస్తామని, అది తమ ఆనవాయితీ అని నాలి రామయ్య చెప్పారు. -
ఈ పెళ్లి ప్రత్యేకం.. వరుడు చేత బాండ్ పేపర్‌పై సంతకం.. మాట తప్పితే తిప్పలే!
‘నాతిచరామి’ అంటూ వధూవరులు చేసే వాగ్దానం ప్రతి పెళ్లిలోనూ చూసే తంతే. కానీ ఈ పెళ్లి ప్రత్యేకం. అందుకే హర్షు సంగ్తానీ అనే యువతి పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. హర్షు.. తనకు కాబోయే భర్త కరణ్ నుంచి కొన్ని వాగ్దానాలను కోరుకుందట. వాటిని 100 రూపాయల బాండుపై కండిషన్స్ అప్లై అంటూ ఐదంటే ఐదు షరుతుల్ని వివరంగా రాయించి, కాబోయే భర్తతో సంతకం పెట్టించుకుంది. దాన్ని లామినేషన్ చేయించి కాన్ఫిడెన్షియల్ అంటూ దాచి పెట్టుకుంది. ఇంతకీ అందులో ఏం షరతులు ఉన్నాయి? పాపం పెళ్లికొడుకు ఏం బేజారెత్తుతున్నాడో అనుకునేరు! ఆ షరతులు తెలిస్తే నవ్వుకుంటారు. మొదటి షరతు... ప్రతిరోజూ రాత్రివేళ వరుడు తన దగ్గరే పడుకోవాలట. రెండో షరతు... వెబ్ సిరీస్ కలిసే చూడాలట. మూడో షరతు.. రోజుకి మూడుసార్లు తనకి ఐలవ్యూ చెప్పాలట. నాలుగో షరతు.. బార్బెక్యూ ఫుడ్స్‌ని ఆమె లేకుండా ఒక్కడే తినకూడదట. ఐదో షరతు... ఆమె ఎప్పుడు ఏది అడిగినా అతను నిజమే చెప్పాలట. ప్రస్తుతం ఈ కాంట్రాక్ట్ బాండ్ పేపర్ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో విపరీతంగా హల్చల్ చేస్తోంది. దీన్ని ఫిబ్రవరి 20న హర్షు పెళ్లికి మేకప్ చేసిన భూమికా సాజ్ అకౌంట్ నుంచి పోస్ట్ చేశారు. హర్షు చాలా సరదా మనిషి అని అదే అకౌంట్లో మిగిలిన వీడియోలు చూస్తుంటే అర్థమవుతోంది. ప్రతిచోట ఫుల్ జోష్‌తో డాన్స్ చేసే హర్షు.. ఏదో సరదగా ఈ కండిషన్స్ పెట్టి ఉంటుందని, ఇలాంటి కాంట్రాక్ట్ ఇంతకుముందెప్పుడూ చూడలేదంటూ స్పందిస్తున్నారు నెటిజన్లు. అయితే హర్షు మాత్రం తన అకౌంట్‌ని ప్రైవసీగానే ఉంచుకుంది. దాంతో పూర్తి వివరాలు వెలువడలేదు. -
నాలుగేళ్లుగా ప్రేమ.. పెళ్లికి పెద్దల అంగీకారం..4 రోజుల్లో పెళ్లి.. చివర్లో ట్విస్ట్!
సాక్షి,మల్కాపురం(విశాఖ పశ్చిమ): వారిద్దరూ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వారి ప్రేమను గుర్తించిన పెద్దలు పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు. నాలుగు రోజుల్లో పెళ్లి అనగా.. వరుడు అదృశ్యమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న వధువు, ఆమె తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. తమకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు తెలిపిన వివరాలివీ.. మల్కాపురం సమీపంలోని ప్రకాష్‌నగర్‌కు చెందిన యువతి, 58వ వార్డు పరిధి అజంతా కాలనీలో ఉంటున్న మణికంఠ ఒకరినొకరు నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమను ఇరువురి తల్లిదండ్రులు ఒప్పుకుని.. ఈ నెల 10వ తేదీన స్థానిక కల్యాణ మండపంలో వివాహం జరిపేందుకు నిర్ణయించారు. చదవండి: అగ్రి ఇన్ఫ్రా ప్రాజెక్టుల్లో గణనీయ పురోగతి కనిపించాలి: సీఎం జగన్ ఇరు కుటుంబాలు బంధువులకు పెళ్లి కార్డులను అందించి ఆహ్వానించారు. ఇంతలో వరుడు అదృశ్యమయ్యాడు. ఆదివారం సాయంత్రం నుంచి ఇంట్లో కనిపించకుండా పోయాడు. దీంతో ఆ యువకుడి తల్లిదండ్రులు చుట్టు పక్కల, బంధువుల ఇళ్ల వద్ద వెతికారు. ఫలితం లేకపోవడంతో వధువు తల్లిదండ్రులకు తెలిపారు. పెళ్లికి నాలుగు రోజులుండగా.. ఇలాంటి పరిస్థితి ఎదురు కావడంతో వారు ఆందోళనకు చెందుతున్నారు. పోలీసులను ఆశ్రయించి తమకు న్యాయం చేయాలని కోరారు. దీనిపై పూర్తి సమాచారం సేకరించిన తర్వాత కేసు నమోదు చేస్తామని మల్కాపురం పోలీసులు తెలిపారు. చదవండి: పెళ్లి జరిగిందన్న ఆనందం నిలువక మునుపే ఆ ఇంట మృత్యుఘోష -
ఆ వివరాలు తెలపాలంటూ మాట్రీమోనియల్ యాడ్.. నెటిజన్ల ఆగ్రహం
మాట్రీమోనియల్ సైట్లు, యాప్‌ల సాయంతో పలువురు యువతి, యువకులు వివాహ బంధంలోకి అడుగుపెడతారు. యువతియువకులు తమ వ్యక్తిగత, వృత్తిగత వివరాలతో పాటు కుటుంబ వివరాలతో కూడిన ఫ్రొఫైల్ యాడ్‌ను మాట్రీమోనియల్ సైట్లలో అప్లోడ్ చేస్తుంటారు. అయితే చాలా వరకు అమ్మాయిలు, అబ్బాయిలు.. తమకు కాబోయేవారు ఎలా ఉండాలి? ఎలాంటి అభిరుచులు కలిగి ఉండాలి? అనే దానిపై చాలా స్పష్టత కనబరుస్తారు. మంచి క్వాలిటీస్ ఉన్న వారు తమ జీవిత భాగస్వామిగా రావాలని కోరుకుంటూరు. అయితే ముఖ్యంగా రంగు, ఎత్తు, అందం విషయంలో వెనక్కు తగ్గరు కూడా. అయితే ఓ వ్యక్తి మాత్రం చాలా విచిత్రంగా.. తనకు భార్యగా కాబోయే అమ్మాయి ఎత్తు, బరువు, పాదాలు, నడుము సైజ్‌ను తనకు నచ్చిన మెజర్మెంట్లతో ఉండాలని ప్రొఫైల్‌లో పొందుపరిచాడు. అక్కడితో ఆగకుండా బ్రా సైజ్‌ను కూడా పేర్కొన్నాడు. ఇంకా కొన్ని విచిత్రంగా అనిపించే.. క్వాలిటీస్‌ను కూడా అందులో జతచేశాడు. అటువంటి అమ్మాయి వధువుగా రావాలని తెలిపాడు. అయితే ముందుగా ఈ పోస్ట్ రెడ్డిట్ అనే సైట్లో అప్లోడ్ కాగా.. దాన్ని చూసిన నెటిజన్లు పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో షేర్ చేయటంతో వైరల్‌గా మారింది. అయితే ఈ పోస్ట్‌ను నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తూ మండిపడుతున్నారు. ‘ఇలాంటివి ఎలా అడుగుతున్నావ్రా బాబు. నాకు విచిత్రంగా ఉంది’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఓ ట్విటర్ యూజర్ సంబంధిత మాట్రామోనియల్ యాప్‌కు ట్యాగ్ చేయగా.. అతనిపై తాము చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. -
అత్తింటి సారె: వామ్మో.. అల్లుడి కళ్లు బైర్లు కమ్మేలా..
యానాం: నవ వధువు ఇంటి నుంచి అత్తారింటికి ఆదివారం పంపిన ఆషాఢ కావిడి ఇది. స్థానిక వ్యాపారవేత్త తోట రాజు కుమారుడు పవన్‌కుమార్‌కు రాజమహేంద్రవరానికి చెందిన బత్తుల బలరామకృష్ణ కుమార్తె ప్రత్యూషాదేవికి గత నెల 21న వివాహమైంది. ఆషాఢ కావిళ్లుగా 100 రకాల స్వీట్లు, వెయ్యి కిలోల చొప్పున పండుగొప్ప చేపలు, కొరమేనులు, కూరగాయలు, 250 కిరాణా సరకులు, 1500 కిలోల చెరువు చేపలు, 350 కిలోల రొయ్యలు, 250 కిలోల బొమ్మిడాయిలు, 10 మేకపోతులు, 50 పందెం పుంజులు ఊరేగింపుగా తీసుకురావడం స్థానికంగా ఆశ్చర్యానికి గురిచేసింది. బిందెలతో తీసుకు వచ్చిన తినుబండారాలు -
తెల్లవారితే పెళ్లి.. తలుపు తీసి చూస్తే..
సాక్షి, తలకొండపల్లి( రంగారెడ్డి జిల్లా): తెల్లవారితే.. పెళ్లిపీటలు ఎక్కాల్సిన ఆ యువకుడు ఉరివేసుకొని తనువు చాలించాడు. ఈ విషాదకర సంఘటన తలకొండపల్లి మండల పరిధిలోని మెదక్పల్లిలో గురువారం జరిగింది. గ్రామానికి చెందిన పట్టెబర్ల యాదమ్మ, లింగంగౌడ్ దంపతుల చిన్న కుమారుడు శ్రీకాంత్‌గౌడ్(26) గతంలో నగరంలో పనిచేస్తుండేవాడు. కొన్నిరోజల క్రితం గ్రామానికి తిరిగి వచ్చి వ్యవసాయం చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. శుక్రవారం అతడి వివాహం చేసేందుకు పెద్దలు నిర్ణయించారు. కందుకూరు మండలం కొత్తగూడెంకు చెందిన ఓ యువతితో పెళ్లి చేసేందుకు 20 రోజుల కితం నిశ్చితార్థం కూడా చేశారు. అయితే, బుధవారం రాత్రి 10 గంటలకు శ్రీకాంత్‌గౌడ్ భోజనం చేసి తమ పాత ఇంట్లో నిద్రించాడు. గురువారం తెల్లవారుజామున అతడి అన్న ప్రభాకర్‌గౌడ్ వెళ్లి నిద్రలేపి అతడి వద్ద ఉన్న బైకు తాళంచెవి తీసుకొని పొలానికి వెళ్లాడు. మేడికొమ్మ తీసుకొచ్చి కొత్త ఇంట్లో పందిరి వేసేందుకు సిద్ధం చేశాడు. తిరిగి 5 గంటలకు ప్రభాకర్‌గౌడ్ పాతఇంటికి వెళ్లి పెళ్లికొడుకును చేసేందుకు శ్రీకాంత్‌గౌడ్‌ను నిద్రలేపే యత్నం చేయగా అతడి నుంచి స్పందన రాలేదు. దీంతో తలుపులు విరగ్గొట్టి ఇంట్లోకి వెళ్లి చూడగా ఉరివేసుకొని విగతజీవిగా వేలాడుతూ కనిపించాడు. దీంతో తల్లిదండ్రులు, కుటుంబీకులు, బంధువులు బోరుమన్నాడు. పెళ్లిపీటలు ఎక్కాల్సిన యువకుడు అర్ధంతరంగా తనువు చాలించాడని కన్నీటిపర్యంతమయ్యారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అతడి సెల్‌ఫోన్, ఆత్మహత్యకు ఉపయోగించిన తాడును స్వాధీనం చేసుకున్నారు. మృతుడి తల్లి యాదమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బీఎస్ఎస్ వరప్రసాద్ తెలిపారు. కాగా, శ్రీకాంత్ ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. అతడి ఇష్టం మేరకే పెళ్లి.. శ్రీకాంత్‌గౌడ్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. అతడి అభీష్టం మేరకే.. అతను ఇష్టపడిన అమ్మాయితో పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు మృతుడి సోదరుడు ప్రభాకర్ తెలిపాడు. శ్రీకాంత్‌గౌడ్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చదవండి : 27 రోజులు.. 27 లక్షలు... ఐనా దక్కని ప్రాణం...! -
వైరల్: వరుడి చెంప పగలగొట్టిన వధువు
లక్నో: ఘనంగా పెళ్లి జరిగింది. రిసెప్షన్‌కు అంతా సిద్ధమైంది. కొద్దిసేపట్లో ఫంక్షన్ ప్రారంభమవుతుందనగా వరుడు ఓ మెలిక పెట్టాడు. దానికి వధువు కుటుంబసభ్యులు ససేమిరా అన్నారు. అయినా కూడా వరుడు పట్టుబట్టడంతో విసుగు చెందిన పెళ్లికూతురు పెళ్లి మండపంపైనే అతడి చెంప ఛల్లుమనిపించింది. ఈ ఘటనతో వివాహానికి హాజరైన అతిథులు, బంధుమిత్రులు షాక్‌కు గురయ్యారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని అమేథి జిల్లా సలీమ్‌పూర్ గ్రామానికి చెందిన నాసిమ్ అహ్మద్ కుమార్తెకు మహమ్మద్ ఇమ్రాన్ సాజ్‌తో మే 17వ తేదీన వివాహమైంది. బరాత్ అనంతరం విందు ఏర్పాటు చేశారు. అందంగా ముస్తాబై వేదికపై పెళ్లి కుమారుడు ఇమ్రాన్ సాజ్ కూర్చున్నాడు. అయితే ఈ సమయంలో వరకట్నం కింద తనకు బుల్లెట్ వాహనం ఇవ్వాలని వరుడు డిమాండ్ చేశాడు. అల్లుడి విజ్ఞప్తిని వధువు కుటుంబసభ్యులు తమకు కుదరదు.. అంత స్తోమత లేదని బతిమిలాడారు. ఈ సమయంలో ఇరువర్గాల మధ్య వివాదం రాజుకుంది. ఇదంతా గమనిస్తున్న వధువు తీవ్ర ఆవేశానికి గురయ్యింది. వెంటనే వరుడి వద్దకు వెళ్లి చెంపపై కొట్టింది. రెండు, మూడుసార్లు చేయి చేసుకుంది. ఆమె చర్యను అభినందించిన గ్రామస్తులు వరుడి కుటుంబసభ్యులపై దాడికి పాల్పడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇరువర్గాలను సర్ది చెప్పేందుకు ప్రయత్నించగా వినిపించుకోలేదు. మనస్తాపానికి గురైన వరుడు విడాకులు కావాలని పట్టుబట్టారు. పంచాయతీ ఎటూ తేలకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: బైక్ దొంగ చేసిన పనికి డ్రైనేజీలోకి పోలీసులు చదవండి: జనం చస్తుంటే.. జాతర చేస్తారా.. -
8న అన్న పెళ్లి.. అంతలోనే విషాదం
కోనరావుపేట(వేములవాడ) : వారింట్లో మొదటి శుభకార్యం.. పెద్ద కుమారుడి పెళ్లి కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. పచ్చని పందిరి వేసి, బంధుమిత్రులకు శుభలేఖలు పంచుతున్నారు. ఈ క్రమంలో వరుడి సోదరుడు బంధువులకు పెళ్లి కార్డులు ఇచ్చి, సామగ్రి తీసుకురావడానికి తన మిత్రుడితో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్లి దుర్మరణం చెందాడు. ఈ ఘటన పెళ్లింట విషాదం నింపింది. బాధిత కుటుంబీకుల కథనం ప్రకారం.. కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన అవధూత వజ్రవ్వ–కాశయ్య దంపతులకు ప్రశాంత్, ప్రవీణ్ ఇద్దరు కుమారులు. వీరిలో ప్రశాంత్‌కు ఈ నెల 8న వివాహం నిశ్చయించారు. దీంతో ఇంట్లో సందడి వాతావరణం నెలకొంది. ప్రవీణ్(21) బంధువులందరినీ కలుస్తూ అన్న పెళ్లి పత్రికలు ఇస్తున్నాడు. బుధవారం సిరిసిల్లలో బంధువులకు కార్డులిచ్చి, సామగ్రి తేవాల్సి ఉండటంతో తన మిత్రుడు తిరుమల్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్లాడు. నిజామాబాద్ శివారులోని చాంద్‌నగర్ సమీపంలో ట్రాక్టర్‌ను ఓవర్ టేక్ చేస్తుండగా ఎదురుగా టిప్పర్ వచ్చింది. దాన్ని తప్పించబోయి ట్రాక్టర్‌ను వెనుకనుంచి ఢీకొట్టారు. దీంతో బైక్ ట్రాక్టర్ ట్రాలీ కింది భాగంలోకి చొచ్చుకుపోయింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనం నడుపుతున్న ప్రవీణ్ అక్కడికక్కడే మృతిచెందాడు. వెనకాల కూర్చున్న తిరుమల్ ఎగిరిపడటంతో త లకు గాయాలయ్యాయి. సంఘటన స్థలాన్ని ఎస్సై వెంకటేశ్వర్లు పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
వధువు కావాలి.. వరుడు అన్నదాత
హిందీలో పాట రాయడం ఆమెకు ఇష్టం. బాణీ కట్టి పాడడం అంతకంటే ఇష్టం. స్వచ్‌భారత్... నిర్భయ... ఆమె రాసిన సామాజికాంశాల గేయాలు. ఇప్పుడు.. ‘కామధేను అయోగ్’.. గోమాత కోసం ఆమె రాసి పాడిన పాట. మొత్తం రెండు వందల పాటలు రాశారు. కార్పొరేట్ రంగంలో ఉద్యోగం చేశారు. జీవితం అంటే బాధ్యత అంటారు. అది చెప్పడానికి గ్రామాల బాటపట్టారు. నేల కోసం, రైతు కోసం పని చేస్తున్నారు. ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, రాత్రికి మళ్లీ భోజనం, ఈ మధ్యలో చిరుతిళ్లు.. రోజులో ఏ పని చేసినా ఏ పని చేయకపోయినా మనిషి తప్పనిసరిగా చేసే పని చక్కగా భుజించడం. ఆరోగ్యం పట్ల ఆకాంక్ష పెరిగితే ఒకరకమైన భోజనం, జిహ్వ మీద మమకారం పెరిగితే మరో రకమైన భోజనం... ఏది ఏమైనా పొట్ట పూజ మాత్రం తప్పదు. దేహం నడవాలంటే ఇంధనం కావాల్సిందే, కాబట్టి తినడం తప్పనిసరి. మరి ఈ భోజనం మన కంచంలోకి రావడానికి బీజం ఎక్కడ పడుతోంది. పొలాన్ని పలకగా చేసుకుని విత్తనాలనే బీజాక్షరాలుగా మార్చుకుని జీవిత గ్రంథాలను రాసుకుంటున్న రైతుకు దక్కాల్సిన గౌరవం దక్కుతోందా? ఇదే ప్రశ్న తనను తాను వేసుకున్నారు మోటూరి సూర్యకళ. దక్కడం లేదని ఆమె ఘంటాపథంగా చెబుతున్నారు. పన్నెండేళ్ల సామాజిక సేవా జీవితంలో ఆమె ఎందరి అనుభవాలనో ప్రత్యక్షంగా చూశారు. ఎన్నో రకాల సవాళ్లను చూశారు. వాటన్నింటికీ సమాధానంగా ‘మన ఊరు – మన బాధ్యత’ అనే వేదికకు రూపకల్పన చేశారు. అందులో భాగంగానే రైతు యువకుల కోసం ‘వివాహ పరిచయ వేదిక’ను రూపొందించారు. సమాజంలో ఇప్పటికే కులాల ప్రాతిపదికగా, మతాల ప్రాతిపదికగా, ఆస్తిపాస్తులు సంపన్నతల ప్రాతిపదికగా ఎన్నో వివాహ వేదికలు లెక్కలేనన్ని ఉన్నాయి. ఇన్ని ఉండగా రైతుల కోసం మరొక వేదిక అవసరం ఉంటుందా అంటే... తప్పని సరిగా ఉందన్నారు సూర్యకళ. ‘‘రైతు అనే వ్యక్తి ఉన్నాడని, వ్యవసాయం అనే ఒక రంగం ఉందని మన సమాజం మర్చిపోయింది. పూట పూట మనం మంచిగా తినాలి, కానీ ఆ పంటను పండించే రైతును గుర్తించడం లేదు’’ అని తనకు ఎదురైన కొన్ని అనుభవాలను పంచుకున్నారు. అంతరం ఉంది! ‘మన ఊరు– మన బాధ్యత’లో భాగంగా అనేక గ్రామాల్లో పర్యటించాను. ఎంతోమంది తో స్వయంగా మాట్లాడాను. కాలేజ్‌లో చదువుకుంటున్న ఆడపిల్లలు రైతులకు దక్కని గౌరవాల గురించి చెప్పిన మాట నాకు ఆవేదన కలిగింది. వాళ్ల నాన్న కాలేజ్‌కి వెళ్తే... లెక్చరర్లు ఏ మాత్రం పట్టించుకోరట. పైగా నేలపై కూర్చుని ఎదురు చూడాలట. అదే కాలేజ్‌లో చదువుతున్న ఇతర విద్యార్థుల నాన్నలు పట్టణాల్లో ఉద్యోగాలు చేస్తూ ప్యాంటు షర్టుల్లో వస్తే.. వారి పట్ల అత్యంత గౌరవంగా వ్యవహరిస్తారట. సమాజం ఇలా ఉంది కాబట్టే... మా అమ్మానాన్నలు మమ్మల్ని రైతుకిచ్చి పెళ్లి చేయడానికి ఇష్టపడడం లేదు. చదువుకుని ఉద్యోగాలు చేసుకుంటున్న అబ్బాయిలతో వివాహం చేయాలనుకుంటున్నారు.. అని చెప్పారా అమ్మాయిలు. పంచె కట్టుకునే రైతుకి, ప్యాంటు షర్టు వేసుకున్న గుమాస్తాకి మధ్య సమాజం పెద్ద అంతరాన్నే సృష్టించింది. సమాజం సృష్టించిన అంతరాన్ని ఆ అమ్మాయిలు చిన్న వయసులోనే గ్రహించగలిగారు. ఇక పట్టణాలు, నగరాల్లో పెరిగిన వాళ్లకయితే రైతు కూడా మనిషేననే గుర్తింపు కూడా ఉండడం లేదు. నేల మీద నిలబడి వ్యవసాయం చేసే వాడికి వెన్నెముక ఉంటుంది, ఉద్యోగం చేసే వ్యక్తికంటే మించిన వ్యక్తిత్వం రైతు యువకుడిలో కూడా ఉంటుందనే గమనింపు ఉండడం లేదు. అందుకే రైతు యువకుల వివాహం కోసం ఒక పరిచయ వేదిక ఏర్పాటు చేశాను. అబ్బాయిలు తమ వివరాలతోపాటు వాళ్ల పొలం, కుటుంబం, తన ఆశయాలు, ఆకాంక్షలను వివరిస్తూ వీడియో రికార్డు చేసి మాకు పంపిస్తారు. ఆ వీడియోను నిపుణులతో ఎడిట్ చేయించి డిజిటల్ వేదిక మీద అప్లోడ్ చేస్తున్నాను’’ అని వివరించారు సూర్యకళ. గోమాత.. భూమాత మోటూరి సూర్యకళ గుర్తించిన సమస్య మనలో చాలామందికి తెలిసినదే. అయినా ఎవరూ పని గట్టుకుని స్పందించలేదు. ఆ పని ఆమె చేశారు. ఆమె చిన్నప్పటి నుంచి గ్రామాల గురించి తెలిసి పెరగలేదు. హైదరాబాద్ పాతబస్తీలో పుట్టారు. పదమూడేళ్ల వయసులో కొత్త నగరానికి మారింది వాళ్ల కుటుంబం. ఇంటర్ చదువుతూ చిన్న పిల్లలకు హోమ్ ట్యూషన్లు చెప్పేవారామె. ఆ తర్వాత దూరవిద్యా విధానంలో డిగ్రీ, పీజీ పూర్తి చేశారు. ఇరవై ఏళ్ల పాటు హైదరాబాద్‌లో అనేక కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగం చేశారు. ఆ ఉద్యోగంతోపాటు గత పన్నెండేళ్లుగా అనేక ఎన్జీవోలతో కలిసి పని చేశారు. నాలుగేళ్ల నుంచి గ్రామభారతి స్వచ్ఛంద సంస్థ తెలంగాణ శాఖ అధ్యక్షురాలిగా సమాజహితమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీటితోపాటు తనకు వచ్చిన ఆలోచనకు ‘మన ఊరు– మన బాధ్యత’ అని నామకరణం చేసి దేశమంతటినీ అందులో భాగస్వాములను చేస్తున్నారు. దివ్యాంగుల కోసం జాతీయ స్థాయి డాన్స్ టాలెంట్ షో, రాబోయే దీపావళి కోసం గోమయంతో ప్రమిదల తయారీలో శిక్షణ, గో ఉత్పత్తుల తయారీలో శిక్షణ వంటివి ఆమె చేపట్టిన కొన్ని కార్యక్రమాలు. వీటన్నింటితోపాటు ఆమె... రైతు యువకుల వివాహ పరిచయ వేదిక ద్వారా సమాజంలో అందరి మనసుల్లో పెద్ద అగాధంగా స్థిరపడిపోయిన అంతరాన్ని తొలగించడానికి కంకణం కట్టుకున్నారు. మనిషిని జీవితాంతం కాపాడేవి గో ప్రాశస్త్యం, భూ సస్యత్వం అంటారు సూర్యకళ. ‘‘ప్రతి ఒక్కరిలోనూ సామాజిక బాధ్యత ఉంటుంది. అయితే అది కొన్ని విషయాల్లో నిద్రాణంగా ఉండిపోతుంది. ఆ నిద్రపోతున్న బాధ్యతను తట్టిలేపే ప్రయత్నమే ఇది’’ అన్నారామె. – వాకా మంజులారెడ్డి -
‘బారాత్’లో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన వరుడు!
-
పెళ్లింట విషాదం: డాన్స్ చేస్తూ వరుడు మృతి!
సాక్షి, నిజామాబాద్: పెళ్లి జరిగిన 12 గంటల్లోనే వరుడు మృతి చెందిన ఘటన బోధన్ పట్టణంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఉదయం 11 గంటలకు వివాహాం జరగ్గా.. రాత్రి నిర్వహించిన బారాత్ కార్యక్రమంలో పాల్గొన్న వరుడు చెందూరు గణేష్ హఠాన్మరణం చెందాడు. బారాత్‌లో డ్యాన్స్ చేసిన గణేష్ ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు విడిచాడు. దీంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. బారాత్‌లో భారీ సౌండ్ బాక్స్‌లతో కూడిన డీ.జే కారణంగానే గణేష్ మరణించాడని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపించారు. కాగా, బోధన్ పట్టణంలోని నాయీబ్రాహ్మణ కాలనీకి చెందిన గణేష్ దుబాయ్‌లో పనిచేస్తున్నాడు. పెళ్లి నేపథ్యంలో వారం క్రితం సొంతూరుకు వచ్చాడు. -
పోలీసు బందోబస్తు మధ్య దళిత వరుడి ఊరేగింపు
జైపూర్: పోలీసుల పటిష్ట భద్రత మధ్య పెళ్లికొడుకు ఊరేగింపు చేపట్టిన అరుదైన ఘటన సోమవారం రాజస్థాన్‌లో జరిగింది. బుంది జిల్లాలోని జారా గ్రామానికి చెందిన పరశురామ్ మేఘ్వల్ అనే దళితుడు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అతనికి బరాన్‌కు చెందిన మహిళతో ఫిబ్రవరి 4న వివాహం నిశ్చయమైంది. అయితే సంఘవాడ గ్రామానికి చెందిన ఉన్నత కులాల వ్యక్తులు దళిత వరుడి ఊరేగింపును అడ్డుకుంటారని అతని కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. జిల్లా అధికారులను ఆశ్రయించి తమకు రక్షణ కల్పించాల్సిందిగా కోరారు. (కేరళ, పంజాబ్ బాటలో రాజస్తాన్..!) దీనికి అంగీకరించిన అధికారులు నాలుగు పోలీసు స్టేషన్ల నుంచి సుమారు 80 మంది పోలీసు సిబ్బందిని వరుడి ప్రీవెడ్డింగ్ కార్యక్రమానికి వెళ్లాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో పోలీసు బలగాల మధ్య వరుడి ఊరేగింపు కార్యక్రమం జరగడం ఆ గ్రామస్తులను విస్మయానికి గురి చేసింది. ఇక భారీగా పోలీసులు మెహరించడంతో సంగీత్ కార్యక్రమాన్ని వరుడి కుటుంబ సభ్యులు మధ్యాహ్నానికి వాయిదా వేసుకున్నారు. అనంతరం ఓ ఆలయంలో వరుడు దేవుని దీవెనలు తీసుకున్నాడు. రెండు గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని అధికారులు తెలిపారు. చదవండి: ఎలుగుబంటి దెబ్బకు తోక ముడిచిన పులులు -
మరికొద్ది గంటల్లో పెళ్లి.. వరుడు అదృశ్యం
చెన్నై,అన్నానగర్: మరికొద్ది గంటల్లో పెళ్లి జరుగుతుండనగా వరుడు అదృశ్యమవడంతో వివహం ఆగిపోయింది. వివరాలు.. చెన్నై మీనమ్‌బాక్కమ్‌కు చెందిన సుకుమారన్ (34) చెన్నై విమానాశ్రయం కార్గో విభాగంలో పనిచేస్తున్నాడు. ఇతనికి చెన్నై రాయపేటకి చెందిన మహిళతో వివాహం నిశ్చయించారు. మంగళవారం ఉద యం పల్లావరంలోని ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో వివాహం చేయడానికి ఏర్పాట్లు చేశారు. సోమవారం సాయంత్రం బంధువులు, స్నేహితులు కల్యాణ మండపానికి వచ్చారు. ఈ క్రమంలో సుకుమారన్ బయటకి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లాడు. చాలా సేపు అయినా మండపానికి రాకపోవడంతో బంధువులు ఆందోళనకు గురయ్యారు. సెల్‌ఫోన్‌కు కాల్ చేస్తే స్విచ్ఛాఫ్ అని వచ్చింది. దీనిపై వధువు ఇంటి వారు పల్లావరం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి సుకుమారన్ కోసం గాలిస్తున్నారు. -
పెళ్లికొడుకు మృతి కేసులో ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్ : పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో పెళ్లికొడుకు మృతి కేసు మరో మలుపు తిరిగింది. తన కుమారుడు ఆత్మహత్య చేసుకోలేదని సందీప్ తండ్రి నక్కెర్తి శ్రీనివాస్‌చారి చెప్పారు. సందీప్‌ను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపించారు. పెళ్లికి ముందు జరిగిన ఫొటోషూట్‌కు వెళ్లిన తన కుమారుడు ఎలా ఆత్మహత్య చేసుకుంటాడని అనుమానం వ్యక్తం చేశారు. సందీప్ హత్యకు బాబాయ్, పిన్నమ్మలే కారకులని ఆరోపించారు. తన కుమారుడికి తాత ఆస్తిలో వాటా ఇవ్వాల్సివస్తుందనే కారణంగానే హత్య చేశారని ఆరోపించారు. సందీప్ తల్లి చనిపోయిన నాటి నుంచి కుమారుడిని తనకు దూరంగా ఉంచారని, 15 ఏళ్ల క్రితం చనిపోయిన తన భార్య మృతిపై కూడా అనుమానాలు ఉన్నాయన్నారు. పెళ్లికి రెండు రోజుల ముందు సందీప్‌కు తనకు ఎలాంటి గొడవ జరగలేదని చెప్పారు. సందీప్ కోరినట్టుగానే పెళ్లి, రిసెప్షన్ జరిపిస్తానని కూడా తాను చెప్పినట్టు వివరించారు. పెళ్లికి కొద్ది గంటల ముందు ఆదివారం ఉదయం వివాహ వేదికైన కొంపల్లి టీ-జంక్షన్‌లోని శ్రీకన్వెన్షన్‌లో సందీప్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. (చదవండి: పెళ్లి హాలులోనే వరుడి ఆత్మహత్య) -
పెళ్లి హాలులోనే వరుడి ఆత్మహత్య
దుండిగల్: మరికొద్ది గంటల్లో తాళి కట్టా ల్సిన చేతులతో తనమెడకే ఉరితాడు బిగించుకున్నాడు ఓ వరుడు. తల్లి లేని బాధ తెలియనివ్వకుండా పెంచి న తాతయ్య..పెళ్లికి నెల రోజులు ముందే తనువు చాలించడం.. ‘పెళ్లి కొడుకు’ను చేసే కార్యక్రమం విషయ మై తండ్రితో గొడవ వంటి కారణా లతో కుంగిపోయిన వరుడు ఆత్మహ త్యకు పాల్పడ్డాడు. వరుడిగా పెళ్లిపీట లెక్కితే చూద్దామని మురిసిపోయిన బంధుమిత్రులకు, కుటుంబ సభ్యు లకు గుండెకోత మిగిల్చాడు. వధూవరులను ఆశీర్వదించడానికి వేడుకకు వచ్చిన వారు ఘటన గురించి తెలిసి నివ్వెరపోయారు. పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. అల్లారుముద్దుగా పెంచిన తాతయ్య మలక్‌పేటకు చెందిన రిటైర్డ్ లెక్చరర్ నక్కెర్తి శ్రీనివాస్‌చారి, పద్మజ రాణిల కుమారుడు సందీప్(24). చిన్నతనంలోనే సందీప్ తల్లి మృతి చెందింది. దీంతో శ్రీనివాస్‌చారి రెండో వివాహం చేసుకోవడంతో సందీప్ చిన్నతనం నుంచి తాతయ్య జాగేశ్వరరావు వద్ద పెరిగాడు. జాగేశ్వరరావు కూడా సందీప్‌కు తన తల్లి లేని లోటు తెలియనివ్వకుండా పెంచాడు. బీటెక్ వరకు చదువుకున్న సందీప్‌కు బోయిన్‌పల్లికి చెందిన ఓ యువతితో ఏప్రిల్ నెలలో నిశ్చితార్థం చేశారు. అయితే చిన్నప్పటినుంచి తనను అల్లారుముద్దుగా పెంచిన తాతయ్య జాగేశ్వరరావు నెలక్రితం మృతి చెందడంతో సందీప్ బాగా కుంగిపోయాడు. తాతయ్య చనిపోయి నెల కూడా గడవకుండానే తనకు పెళ్లి ఏమిటంటూ వ్యతిరేకిస్తూ వచ్చాడు. అయినప్పటికీ పెద్దలు ఈనెల 10న కొంపల్లి టీ–జంక్షన్లో ఉన్న శ్రీకన్వెన్షన్‌లో పెళ్లి నిశ్చయించారు. ‘పెళ్లి కొడుకు’తంతుపై రేగిన వివాదం.. సాంప్రదాయం ప్రకారంగా తండ్రి ఇంట్లో పెళ్లి కొడుకును చేసే కార్యక్రమం నిర్వహించాల్సి ఉండగా సందీప్ దీన్ని వ్యతిరేకించాడు. ‘తన తల్లి చనిపోయిన ఇంట్లో నేను ‘పెళ్లి కొడుకు’కార్యక్రమాన్ని చేసుకోలేను’అని సందీప్ చెప్పడంతో ఆ కార్యక్రమానికి ఓ ఇంటిని అద్దెకు కూడా తీసుకుని నిర్వహించారు. ఈ క్రమంలో తండ్రి సందీప్ వైఖరిని తప్పుపట్టగా..ఇద్దరి మధ్యా మాటామాటా పెరిగి వివాదం చెలరేగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సందీప్ ఆదివారం తెల్లవారుజామున కొంపల్లిలో ఉన్న వివాహ వేదిక వద్దకు వచ్చి తనకు కేటాయించిన గదిలోకి వెళ్లిపోయాడు. సర్దుకుంటుందనుకుంటే.. సందీప్ కోపాన్ని కుటుంబ సభ్యులు అంతగా పట్టించుకోలేదు. గదిలోకి వెళ్లిన సందీప్‌ను చూసి అంతా సర్దుకుపోతుందనుకుని ఒంటరిగా వదిలేశారు కుటుంబ సభ్యులు. ఆదివారం ఉదయం 7.30 గంటలకు వివాహ వేడుకలకు సిద్ధం చేసేందుకు సందీప్ గది తలుపును తట్టగా ఎంతకీ స్పందన లేదు. దీంతో మాస్టర్ కీ తో తలుపులు తెరిచి చూడగా సీలింగ్‌కు వేలాడుతూ సందీప్ కనిపించాడు. వెంటనే సందీప్‌ను సుచిత్ర సర్కిల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా..అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కన్నీరు మున్నీరైన బంధువులు ఉదయం 7.30 గంటలకు వరుడు సందీప్ ఆత్మహత్య చేసుకోవడంతో వివాహ వేదికైన శ్రీకన్వెన్షన్ గేట్లు మూసుకుపోయాయి. విషయం తెలియని ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు, మిత్రులు ఒక్కొక్కరిగా కన్వెన్షన్ సెంటర్‌కు రాగా జరిగిన విషయం తెలుసుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ‘‘సందీప్ చాలా మంచి పిల్లవాడని, అతను ఇలా చేసుకోవడమేమిట’’ని చెప్పుకుంటున్నారు. ‘సందీప్ ను ఎప్పుడో పదవ తరగతి చదువుతున్నప్పుడు చూశా..ఇప్పుడు పెళ్లి కొడుగ్గా చూద్దామని ఏలూరు నుంచి వచ్చాను.. కాని అతను ఇలా చేసుకుంటాడని అనుకోలేదంటూ’ఓ బంధువు చెప్పుకొచ్చారు. ఆస్పత్రిలో ఘర్షణ పడ్డ సందీప్ తండ్రి.. చిన్నతనం నుంచే తన కొడుకును తనకు కాకుండా దూరం చేశారంటూ సందీప్ తండ్రి శ్రీనివాస చారి గుండెలవిసేలా రోదిస్తున్నాడు. ఈ క్రమంలో జాగేశ్వరరావు తరఫుబంధువులతో సందీప్‌ను తన నుంచి దూరం చేయడమే కాకుండా, తాత, పిన్ని దగ్గరకు రాకుండా కట్టడి చేశారంటూ శ్రీనివాసచారి ఘర్షణ పడగా...పేట్ బషీరాబాద్ పోలీసులు వారిని విడదీశారు. సందీప్ ఆత్మహత్యకు గల ప్రధాన కారణం తాతయ్య మరణమేనా మరేదైనా వ్యవహారం ఉందా అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు. సందీప్ ఫోన్ తెరిచిన తర్వాత మరిన్ని విషయాలు వెలుగుచూసే అవకాశముందని పేట్ బషీరాబాద్ సీఐ మహేశ్ తెలిపారు. వివాహ వేదిక వద్దనే సందీప్ ఆత్మహత్య కేసును పోలీసులు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
‘నా పెళ్లికి వచ్చేవారు మోదీకి ఓటు వేయండి’
సాక్షి, హైదరాబాద్: రాజకీయ నాయకులపై తమ అభిమానాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా వ్యక్తంచేస్తూ ఉంటారు. ప్రధాని నరేంద్ర మోదీకి వీరాభిమాని అయిన ఓ నవ వరుడు మాత్రం వినూత్న రీతిలో తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. ‘‘ఫిబ్రవరి 21న నా వివాహం. వివాహానికి వచ్చే వారు ఎలాంటి బహుమతులను తీసుకురావద్దు. వాటికి బదులుగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం బీజేపీకి ఓటు వేసి.. నరేంద్ర మోదీని ప్రధానిగా మరోసారి గెలిపించండి అంతే చాలు’’ అంటూ తన వివాహ పత్రికపై అచ్చువేయించాడు. ఓట్ ఫర్ మోదీ అని బీజేపీ ఎన్నికల చిహ్నమైన కమళం గుర్తును సైతం పత్రికపై ముద్రించాడు. దీన్ని చూసిన వారంతా ఒక్కింత ఆశ్చర్యానికి గురైయ్యారు. తనకు మోదీ అంటే ఎంతో అభిమానమని, గడిచిన నాలుగున్నరేళ్లలో ఎన్నో పథకాలను ఆయన ప్రవేశపెట్టారని 27 ఏళ్ల ముఖేష్ రావు చెప్పుకొస్తున్నారు. మోదీ స్ఫూర్తితోనే తాను పనిచేస్తున్న ఆఫీసులో ప్రతి నెల స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. మరోసారి మోదీ అధికారంలోని రావాలని తాను కోరుకుంటున్నాననీ, ఆయన విజయానికి తన వంతుగా ఈవిధంగా కృషి చేస్తున్నాని పేర్కొన్నారు. మోదీ నాయకత్వలోనే దేశం అభివృద్ధి చెందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. శంషాబాద్‌కు చెందిన ముఖేష్ రావు టీఎస్ జెన్కోలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన టీఆర్ఎస్కు మద్దుతుగా నిలవడం విశేషం. ఇటీవల గుజరాత్లో కూడా ఓట్ ఫర్ మోదీ అంటూ ఓ జంట వివాహ పత్రికపై ముద్రించి మోదీపై తమకున్న అభిమానాన్ని చాటుకున్న విషయం తెలిసిందే. -
ఆర్మీలో సీక్రెట్ ఏజెంట్ అని చెప్పి..
గచ్చిబౌలి : తాను ఆర్మీలో సీక్రెట్ ఏజెంట్‌గా పని చేస్తున్నానని మ్యాట్రిమోనిలో తప్పుడు సమాచారం ఇచ్చి ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను పెళ్లి చేసుకున్నాడు. నమ్మించి వంచించి రెండుసార్లు అబార్షన్ చేయించాడు. బాధితురాలికి తెలియకుండానే రూ. 60 లక్షలకు టోకరా వేసి ఉడాయించాడు. బాధితురాలి ఫిర్యాదుతో ఘరానా మోసగాడు కటకటాలపాలయ్యాడు. ఈ సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ ఆర్.శ్రీనివాస్ తెలిపిన మేరకు.. మధ్యప్రదేశ్‌కు చెందిన అఖిలేష్ గుజార్ అలియాస్ తేజస్ అలియాస్ తేజ పటేల్ అలియాస్ తన్మయ్(36) కొండాపూర్‌లోని శుభం బోటానికల్ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నాడు. ఆర్మీలో సీక్రేట్ ఏజెంట్‌గా పని చేస్తున్నాని భారత్ మ్యాట్రిమోనిలో తప్పుడు వివరాలు, ఆర్మీ డ్రెస్‌లో ఉన్న ఫొటోలను అఖిలేష్ ఉంచాడు. హైటెక్‌సిటీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేసే పూజ నిజమేనని నమ్మి 2018 మే నెలలో కూకట్‌పల్లిలోని ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకుంది. తెలియకుండా పూజ పేరిట సిటీ బ్యాంక్‌లో రూ. 15 లక్షలు రుణం, బజాజ్ పైనాన్స్‌లో రూ.12 లక్షలు, ఇండియన్ బుల్లో రెండు లక్షలు, అమెక్స్ క్రెడిట్ కార్డ్ ద్వారా రూ. 4.91 లక్షలు, ఎస్బీఐ క్రెడిట్ కార్డు ద్వార రూ.2.71 లక్షలు, ఎస్బీఐ సేవింగ్ అకౌంట్ నుంచి రూ.5.61 హెచ్డీఎఫ్సీ మ్యూచవల్ ఫండ్ ద్వారా రూ.10 లక్షలు, బంగారు ఆభరణాలు తీసుకొని చెప్పాపెట్టకుండా ఉడాయించాడు. అంతకు ముందు రెండు సార్లు పూజ గర్భం దాల్చగా తెలియకుండా ట్యాబ్లెట్లు వేసి ఒకసారి, బలవంతంగా మరో సారి అబార్షన్ చేయించాడు. భర్త కనిపించకుండా పోయేసరికి బాధితురాలు గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడికి మధ్యప్రదేశ్‌లో భార్య, ఏడేళ్ల సంవత్సరాల కొడుకు ఉన్నట్లు తేల్చారు. ఇప్పటికే నలుగురిని పెళ్లి చేసుకొని మోసం చేసినట్లు నిర్ధారించారు. మ్యాట్రిమోనియాలో తప్పుడు వివరాలు ఇచ్చి యువతుల వివరాలు, ఫోన్ నెంబర్ తెలుసుకుంటాడు. శారీరక సంబంధాలు పెట్టుకొని, డబ్బులు దండుకొని మోసగిస్తుంటాడు. ఇప్పటి వరకు దాదాపు 15 మంది యువతులను మోసం చేశారని సీఐ తెలిపారు. నిందితుడిని సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
నవ వరుడి ఆత్మహత్య
హైదరాబాద్: సికింద్రాబాద్ పరిధిలోని మారేడుపల్లిలో కొత్తగా పెళ్లైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎప్పుడూ వాట్సప్‌లో చాటింగ్‌తో బిజీగా ఉంటున్నావని ఇటీవల అతని భార్య మందలించింది. ఈ విషయం గురించి కుటుంబసభ్యులకు చెబుతానని అనడంతో నవ వరుడు శివకుమార్ మనస్తాపానికి గురయ్యాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. శివ కుమార్‌కు గత నెల ఆగస్టు 15న వివాహం జరిగింది. ఈ ఘటనతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
తెల్లవారితే పెళ్లి.. వరుడి అరెస్ట్
సారంగాపూర్(జగిత్యాల) : మరో కొద్దిగంటల్లో పెళ్లి. వధూవరుల ఇళ్లలో పనులు శరవేగంగా సాగుతున్నాయి. వధువు ఇంటికి ఫోన్ వచ్చింది. పెళ్లికుమారుడు వచ్చే వాహనానికి ప్రమాదం జరిగిందని వధువు కుటుంబ సభ్యులు వరుడి ఇంటికి వెళ్లారు. పెళ్లికి ముందే ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉందని అందిన ఫిర్యాదుతో పోలీసులు వరుడ్ని అరెస్ట్ చేశారనే విషయం తెలిసి అవాక్కయ్యారు. ఇదీ జరిగింది.. సారంగాపూర్ మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన యువతికి జగిత్యాల రూరల్ మండలం పోరండ్ల గ్రామానికి చెందిన కొర్రి వంశీతో వివాహం నిశ్చయమైంది. శుక్రవారం ఉదయం 10.35కు పెళ్లి జరిగాల్సి ఉంది. గురువారం సాయంత్రం వరుడిని తీసుకొచ్చేందుకు వధువు బందువులు పోరండ్లకు వెళ్లారు. రాత్రి ఎనిమిది గంటలకు వధువు ఇంటికి ఫోన్ చేసి వరుడికి రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పారు. వెంటనే వధువు ఇంటివారు పోరండ్లకు పయనమయ్యారు. మరో మహిళతో సంబంధం.. వరుడి ఇంటికి వెళ్లిన వధువు బంధువులు అసలు విషయం తెలుసుకుని అవాక్కయ్యారు. వంశీకి అప్పటికే కోరుట్ల ప్రాంతానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం ఉందని, పెళ్లి విషయం తెలిసి కోరుట్ల పోలీసులకు ఫిర్యాదు చేసిందని, ఈ మేరకు వంశీని అరెస్ట్ చేశారని తెలుసుకున్నారు. దీంతో పెళ్లిని నిలిపివేశారు. క్షణాల్లో సందడిగా మారాల్సిన ఇల్లు బోసిపోయింది. -
నవ వరుడి బంగారు చైన్ తెంచేందుకు యత్నం
సీతానగరం : నవవరుడి మెడలో నుంచి బంగారు గొలుసు తెంచేందుకు ప్రయత్నించిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొమరాడ మండలం కళ్లికోట గ్రామానికి చెందిన కె. వెంకటరమణకు రామవరం గ్రామానికి చెందిన యువతితో గత నెల 29న వివాహం అయింది. గురువారం అత్తారింటికి వెళ్లిన వెంకటరమణ శుక్రవారం తిరిగి స్వగ్రామం చేరుకునేందుకు స్కూటీపై వస్తున్నాడు. సరిగ్గా ఆర్. వెంకంపేట రోడ్డు వద్దకు వచ్చేసరికి ఒక వ్యక్తి లిఫ్ట్ కావాలని అడగడంతో వెంకటరమణ వాహనాన్ని ఆపాడు. ఇంతలో అగంతకుడు ఒక్కసారిగా ఆయన మెడలో ఉన్న బంగారు గొలుసు తెంచేందుకు ప్రయత్నించగా బాధితుడు ఒక్కసారిగా అతడ్ని తోసేశాడు. ఈ క్రమంలో గొలుసు సగం ముక్క బాధితుడి మెడలో ఉండగా, మిగిలిన ముక్క అగంతకుడి వద్ద ఉండిపోయింది. వెంటనే తేరుకున్న బాధితుడు అగంతుకుడితో పాటు అతడికి సహాయంగా పక్కనే చెరుకుతోటలో ఉన్న ఇద్దరినీ వెంబడించాడు. దీంతో వారు చైన్‌ను వదిలేసి పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు, గ్రామస్తులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ విషయమై ఎస్సై సాయికృష్ణ వద్ద ప్రస్తావించగా, నిందితులను పట్టుకుంటామన్నారు. -
పెళ్లిలో కాల్పులు పీటలపై వరుడి మృతి
-
కాల్పుల కలకలం.. పెళ్లి పీటలపై వరుడి మృతి
లక్నో, ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్‌లో మరో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. మద్యం మత్తులో ఓ యువకుడు సరదాగా కాల్పులు జరపడంతో తీవ్రంగా గాయపడ్డ వరుడు మృతిచెందాడు. ఈ ఘటన యూపీ, లఖిమ్‌పూర్ ఖేరీ జిల్లా రామ్‌పూర్‌లో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. సునీల్ వర్మ (25), రూబీ వర్మని హిందూ సంప్రదాయంలో ఆదివారం వివాహం చేసుకోవాల్సి ఉంది. వధువు ఇంటికి వరుడి బంధువులు వచ్చారు. మరికాసేపట్లో పెళ్లనగా వరుడు సునీల్ వర్మ బంధువు మద్యం మత్తులో సరాదాగా కొన్ని రౌండ్లు కాల్పులు జరిపాడు. పెళ్లి పీటలపై కూర్చున్న వరుడి ఛాతిలోకి ఓ బుల్లెట్ దూసుకెళ్లింది. వివాహ వేడుకలో సౌండ్ సిస్టమ్ పెట్టి బంధువులు డ్యాన్స్ చేస్తున్నారు. కానీ పెళ్లి మంటపంలో వరుడి పక్కన ఉన్న వారు వరుడిని హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే సునీల్ చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. నిందితుడిని మీడియా ఎదుట ప్రవేశపెట్టిన పోలీసులు వరుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. తుపాకీని కూడా స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. మద్యం మత్తులో తూటా పేల్చడం వల్లే సునీల్ మృతిచెందాడని, ఉద్దేశపూర్వకంగా చేసిన పని కాదని నిందితుడు పోలీసులకు వివరించాడు. -
పెళ్లి కొడుకుపై పెట్రోల్ పోసి నిప్పు!
సాక్షి, జనగాం : మరో రెండు రోజుల్లో ఆ యువకుడి వివాహం.. శుభముహుర్తం కావడంతో ఆదివారం అతడి కుటుంబ సభ్యులు గృహ ప్రవేశం కూడా చేశారు. నుదుట బొట్టు, పట్టు వస్త్రాలు ధరించి పెళ్లి పీటలెక్కాల్సిన అతడు ప్రస్తుతం చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. కలల స్వగృహంలో సంతోషంగా పెళ్లి చేసుకోవాలనుకున్న అతడి ఆశలు అడియాసలయ్యాయి. కాబోయే భార్యతో అర్ధరాత్రి బయట ఫోన్లో మాట్లాడుతున్న అతడిపై గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించడంతో దాదాపు 50 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. అనుమానాలు రేకిత్తిస్తున్న ఈ ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లి గ్రామంలో ఆదివారం అర్థరాత్రి జరిగింది. గ్రామానికి చెందిన గొంగళ్ల సామ్యేల్ ఏకైక కుమారుడు యాకయ్య (24)కు మాదారం గ్రామానికి చెందిన ఓ యువతితో 20 రోజుల క్రితం నిశ్చితార్థం జరిగింది. ఈ నెల 21న పెళ్లి ముహుర్తంగా నిర్ణయించారు. శుభలేఖలు అచ్చు వేయించి బంధువులకూ పంచారు. పెళ్లిని దృష్టిలో పెట్టుకొని కొత్తగా నిర్మించిన ఇంట్లోకి వరుడి కుటుంబం ఆదివారం గృహ ప్రవేశం కూడా చేసింది. గృహ ప్రవేశానికి వధువు తరఫు బంధువులు హాజరయ్యారు. ఫంక్షన్ ముగిసిన తర్వాత అలసట చెందిన వారంతా నిద్రిస్తున్నారు. ఈ క్రమంలోనే వధువు నుంచి యాకయ్యకు ఫోన్ రావడంతో ఆమెతో మాట్లాడుతుండగా తనకు సరిగ్గా వినిపించడం లేదని, బయటికి వచ్చి మాట్లాడాలని ఆమె కోరింది. దీంతో యాకయ్య బయటికి వచ్చి ఫోన్లో మాట్లాడుతుండగా అప్పటికే అక్కడ మాటు వేసి ఉన్న నలుగురు యువకులు మాస్కులు ధరించి అతడిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. మంటలు భరించలేక యాకయ్య కేకలు వేయడంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తల్లి యాదమ్మ అతడిని పట్టుకోవడంతో ఆమె చాతి, చేతులకు గాయాలయ్యాయి. యాకయ్య భూమిపైనే బొర్లుతూ మంటలను చల్లార్చుకోగలిగాడు. అప్పటికే చాతి, వీపు 50 శాతం కాలడంతో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై అనుమానాలు.. వరుడిపై జరిగిన హత్యాయత్నం పలు అనుమానాలకు తావిస్తోంది. పెట్రోల్ పోసి అంటించింది ఎవరు..? ఎవరి ప్రోద్బలమైన ఉందా.. ? ఎందుకు హత్యాయత్నం చేశారు..? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఫోన్ మాట్లాడుతుండగా సిగ్నల్ రావడం లేదని బయటకు రావాలని పదేపదే వధువు తనకు చెప్పిందని, అందుకే ఇంటి ముందుకు వచ్చి ఫోన్ మాట్లాడుతున్నానని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యాకయ్య పోలీసులకు వాగ్మూలం ఇచ్చినట్లు తెలిసింది. వారం రోజుల క్రితం యాకయ్య తండ్రి సామ్యేల్ గేదెలకు మేత వేసేందుకు ఇంటి బయటటికి రాగా వరుడిగా భావించిన గుర్తుతెలియని వ్యక్తులు అతడిపై దాడి చేశారు. అయితే దొంగలుగా భావించిన కుటుంబ సభ్యులు పెళ్లి పనులు ఉండడంతో ఈ ఘటనను పెద్దగా పట్టించుకోలేదు. ఇదిలా ఉండగా డీసీపీ మల్లారెడ్డి, ఏసీపీ వెంకటేశ్వర్లు, సీఐ తిరుపతి, ఎస్సై రంజిత్‌రావు కంచనపల్లిలో ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. వధువు గ్రామంలో కూడా విచారణ చేపట్టారు. కాగా తమ కుమారుడిపై దాడికి వధువే కారణమని సామ్యేల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
నిశ్చితార్థం ఒకరితో.. పెళ్లి మరొకరితో
సాక్షి, రఘునాథపల్లి: తనతో నిశ్చితార్ధం అయ్యాక మరొకరిని పెళ్లి చేసుకున్నాడని ఓ యువతి ఫిర్యాదు మేరకు యువకుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రంజిత్‌రావు శుక్రవారం తెలి పారు. వివరాలు.. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కోమల్లకు చెందిన కన్నారపు స్వాతి అనే యువతితో వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం మహబూబ్‌నగర్ గ్రామానికి చెందిన ఇల్లందుల రాజశేఖర్‌తో నవంబర్ 26న ఇరు గ్రామాల పెద్దల సమక్షంలో నిశ్చితార్థం జరిగింది. అదే రోజు వరకట్నం కానుకుల కింద రాజశేఖర్‌కు రూ.70 వేల నగదు అందజేశారు. ఇటీవల గుట్టు చప్పుడు కాకుండా రాజశేఖర్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకొని తనను మోసం చేశాడని బాధిత యువతి శుక్రవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు రాజశేఖర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
పెళ్లి కొడుకు స్నేహితులు చేసిన మొరటు పనికి..
-
సర్ ప్రైజ్ వీడియోతో పెళ్లి కూతురికి షాక్
సాక్షి : పెళ్లి కూతురిపై అనుమానంతో ఓ పెళ్లి కొడుకు చేసిన పని.. దానిని నిజమని నిరూపించింది. పెళ్లి వేదికలోనే ‘హాట్’ టాపిక్‌గా మారేలా ఓ వీడియో ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు అతగాడు. అంతే ఒక్కసారిగా అక్కడి వాతావరణం మొత్తం మారిపోయి.. రచ్చ మొదలైంది. సింగపూర్‌లో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్లితే... తొలుత వధూవరులు గతంలో కలిసి తిరిగిన దృశ్యాలతో ప్రారంభమైన వీడియో, ఒక్కసారిగా, ఆమె వేరేకరితో చనువుగా ఉన్న దృశ్యాలు ప్రసారం అయ్యాయి. ఆ వ్యక్తితో కలసి హోటల్ రూమ్ లోకి వెళ్లడం, ఆపై అతనితో అక్రమ సంబంధాన్ని కొనసాగించడం అందులో స్పష్టంగా కనిపించింది. ఇంకేం పెళ్లి కూతురు అసలు స్వరూపం బయటపడటంతో అక్కడున్న వారంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. దీంతో అవమానభారంతో పెళ్లి కూతురు వేదికను వదిలి వెళ్లినట్లు తెలుస్తోంది. నిశ్చితార్థం అయ్యాక పెళ్లి కూతురి ప్రవర్తనపై అనుమానం వచ్చిన అతను అజాక్స్ ఇన్వెస్టిగేషన్ అండ్ సెక్యూరిటీ సర్వీసెస్ అనే ప్రైవేట్ డిటెక్టివ్ సంస్థను ఆశ్రయించాడు. జుహో అనే 42 ఏళ్ల మహిళా డిటెక్టివ్ ఈ కేసును టేకప్ చేసింది. ఆరు వారాలుగా పెళ్లి కూతురిని వెంబడిస్తూ ఆమె ప్రతీ కదలికలను పరిశీలిస్తూ.. వాటిని వీడియో రూపంలో భద్రపరచసాగింది. చివరకు ఆమె ఓ వ్యక్తితో సంబంధం కొనసాగిస్తుందన్నది ధృవీకరణ కావటంతో పెళ్లి కొడుకుకి తెలియజేసింది. అలా ఈ వ్యవహారం అంతా పబ్లిక్ అయిపోయిందన్న మాట. ఇంతకీ వారి వివరాలేంటీ? ఆ ఈ వివాహాన్ని వారు రద్దు చేసుకున్నారా? లేదా? అన్న విషయం మాత్రం తెలియరావటం లేదు. -
భార్య ఉండగానే మరో పెళ్లికి సిద్ధం
-
పెళ్లయిన మరుక్షణమే ప్రియుడితో పరార్!
కొచ్చి: తనకు ఇష్టం లేని వివాహం చేశారన్న కారణంగా ఓ యువతి పెళ్లి జరిగిన కాసేపటికే వరుడికి షాకిచ్చింది. కల్యాణ మండపానికి వచ్చిన తన ప్రియుడు కనిపించగానే అతడితో కలిసి వెళ్లిపోయింది. ఈ ఘటన కేరళలోని త్రిశూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి.. త్రిశూరులోని ముల్లస్సెరీకి చెందిన యువతికి అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో వివాహం నిశ్చయించారు. గురువాయూర్ లోని శ్రీకృష్ణుడి ఆలయ కల్యాణ మండపం వివాహ వేదికైంది. గత ఆదివారం (జూలై 31న) వధూవరుల బంధువులతో అంతా సవ్యంగానే సాగిపోతోంది. మూహూర్త సమయానికి వధువు మెడలో వరుడు తాళి కట్టాడు. అంతలోనే వధువుకు కల్యాణ మండపంలో తన ప్రియుడు కనిపించాడు. ఇష్టం లేని పెళ్లి చేశారన్న ఆగ్రహంతో ఉన్న యువతి తన ప్రియుడితో కలిసి చెప్పాపెట్టకుండా వెళ్లిపోయింది. ఇక అది మొదలు వరుడు, అతడి బంధువులు వధువు తరఫు వారితో గొడవ పడ్డారు. మీ అమ్మాయి వల్ల పరువు పోయిందని రూ.15 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని వరుడి బంధువులు డిమాండ్ చేశారు. చివరికి రూ.8 లక్షలు ఇచ్చేందుకు యువతి తల్లిదండ్రులు అంగీకరించారు. వధువు తనను కాదనుకొని వెళ్లిపోయినందుకు వరుడు మాత్రం హ్యాపీగా ఫీలయ్యాడు. తన పెళ్లి చూసేందుకు వచ్చిన బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఆ రోజు సాయంత్రం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఫేస్ బుక్, వాట్సాప్ లలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారాయి. -
కార్డులు ఇవ్వడానికి వెళ్తూ వరుడి మృతి
గుమ్మలక్ష్మీపురం: విజయనగరం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తన పెళ్లి కార్డులు ఇవ్వడానికి వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. గుమ్మలక్ష్మీపురం మండలంలో ఆదివారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి.. బొబ్బిలి మండలం రామన్న దొరవలసకు చెందిన రాజు (25)కు ఈ నెల 28న పెళ్లి నిశ్చయమైంది. ఈ క్రమంలో కార్డులు పెట్టి పెళ్లికి ఆహ్వానించడానికి మరో యువకుడితో కలిసి బైక్‌పై వెళ్లాడు. దురదృష్టవశాత్తూ అమిటి జంక్షన్ వద్ద వీరి బైక్ అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో రాజు మృతిచెందగా, అతని వెంట వెళ్లిన మరో వ్యక్తికి గాయాలయ్యాయి. పెళ్లి నిశ్చయం అయి శుభలేఖలు పంచడానికి వెళ్లిన రాజు మృతిచెందాడని తెలియగానే అతడి కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
గుర్రంతోపాటు బావిలో పడ్డ వరుడు.. వైరల్
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఓ పెళ్లి వేడుకలో అపశృతి చోటచేసుకుంది. అప్పటివరకూ ఎంతో ఉత్సాహంగా ఉన్న వధూవరుల బంధువులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. పెళ్లికొడుకును గుర్రంపై ఊరేగింపుగా తీసుకెళ్తున్న సమయంలో దురదృష్టవశాత్తూ గుర్రంతో పాటే వరుడు ఓ బావిలో పడిపోయాడు. దీంతో ఏం జరుగుతుందోనని వరుడి బంధువులు ఆందోళన చెందారు. ఈ ఘటన యూపీలోని గొండాలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకుంది. శుభకార్యం జరిగే సమయంలో ఇలా జరగడంపై వధూవరుల బంధువుల ఆనందం ఆవిరైంది. అయితే జేసీబీ సాయంతో గుర్రాన్ని ప్రాణాలతో బయటకు తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బావి మరీ ఎక్కువ లోతు లేకపోవడంతో ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. అ వరుడిని బావి నుంచి బయటకు తీసి చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ఈ ఘటన ఎలా జరిగిందన్న దానిపై స్పష్టత లేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
పూర్తికాని వంతెనలతో ప్రజలకు అవస్థలు
తణుకు టౌ¯ŒS : జిల్లాలో యనమదుర్రు డ్రెయి¯ŒSపై చేపట్టిన వంతెనల పనులు అసంపూర్తిగా నిలిచిపోవడంతో డ్రెయి¯ŒSకు ఇరువైపులా ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డ్రెయి¯ŒSకు ఇరువైపులా ఉన్న గ్రామాల ప్రజలకు దగ్గరి మార్గంగా ఉంటుందనే ఉద్దేశంతో రూ.24 కోట్లతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో చేపట్టిన ఈ వంతెనల నిర్మాణం మధ్యలోనే ఆగిపోవడంతో ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు. జిల్లాలో ఎగువ ప్రాంతాల నుంచి తీర ప్రాంతానికి మురుగునీరు ప్రవహించే యనమదుర్రు డ్రెయి¯ŒSపై ఎనిమిది చోట్ల వంతెనలు నిర్మించారు. వీటిలో ఉండ్రాజవరం మండలం పసలపూడి, తణుకు మండలం దువ్వ, పెంటపాడు మండలం బి కొందేపాడు, గణపవరం మండలం ఎస్ కొందేపాడు, భీమవరం, గొల్లవానితిప్ప, తోకతిప్ప గ్రామాల్లో రూ.24 కోట్లతో 2007–08 సంవత్సరంలో వీటి నిర్మాణం చేపట్టారు. వీటన్నింటినీ ఒకే ప్యాకేజీగా ప్రముఖ నిర్మాణ సంస్థ ఐవీఆర్సీఎల్ చేపట్టింది. నిర్మాణాల్లో లోపాలు ఈ వారధుల నిర్మాణాల్లో లోపాలు ఉన్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు.. ముఖ్యంగా పసలపూడి గ్రామంలో నిర్మించిన వంతెన మధ్యలో ఒక స్పా¯ŒSలో లోపాలు ఉన్నట్టు గుర్తించినట్టు స్థానిక రైతులు చెప్పారు. ఈ కారణంగానే ఈవంతెన నిర్మాణం నిలిచిపోయిందని తెలి పారు. దీంతో పాటు యనమదుర్రు డ్రెయి¯ŒS ఉధృతిని తట్టుకునే విధంగా గట్లను పటిష్టం చేసి డ్రెయి¯ŒS వెడల్పు చేసేందుకు రైతుల భూములను కూడా డ్రెయి¯ŒSలో విలీనం చేసి మరీ గట్లను పటిష్టం చేశారు. అయితే మిగిలి పోయిన వంతెన పనులను మాత్రం పూర్తి చేయలేదని రైతులు ఆరోపిస్తున్నారు. దువ్వలో నిర్మించిన వంతెనకు ఇరువైపులా అప్రోచ్ రోడ్డు నిర్మించాల్సి ఉంది. మధ్యలో ఆగిపోయిన వంతెనలకు అప్రోచ్ రోడ్డులు నిర్మించిస్తే యనమదుర్రు డ్రెయి¯ŒSకు ఇరువైపులా ఉన్న గ్రామాల ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని ఆయా గ్రామాల ప్రజలు ఎదురు చూస్తున్నారు. తగ్గనున్న దూరం ఈవంతెనలను అందుబాటులోకి తెస్తే జిల్లాలోని పలు గ్రామాల మధ్య దూరం తగ్గుతుంది. పసలపూడి వంతెన పూర్తయితే తణుకు, నిడదవోలు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల ప్రజలకు.. దువ్వ గ్రామంలోని వంతెన పూర్తయితే తణుకు, తాడేపల్లిగూడెం, పెంటపాడు, అత్తిలి, గణపవరం, మండలాల్లోని గ్రామాల ప్రజలకు.. బీ కొందేపాడు, ఎస్ కొందేపాడు వంతెనల నిర్మాణాల ద్వారా గణపవరం, అత్తిలి, ఉండి మండలాల రైతులకు మేలు చేకూరుతుంది. భీమవరంలో నిర్మించే వంతెనతో పట్టణంలోని ట్రాఫిక్ సమస్య తీరుతుంది. ఈ వంతెనల నిర్మాణాలు ఎప్పుడు పూర్తవుతాయా.. అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. -
యోగి రాష్ట్రంలో బీఫ్ పెట్టలేదని.. పెళ్లి క్యాన్సిల్!
లక్నో: ఓ వైపు యోగి ఆదిత్యనాథ్ సీఎం అయ్యాక గోమాంసాన్ని నిషేధించి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు బీఫ్ వడ్డించలేదని ఆగ్రహంతో వరుడి కుటుంబీకులు వివాహాన్నే ఆపేయడం దుమారం రేపింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ధరియాగఢ్ లోని భోట్ పోలీస్ స్టేషన్ పరిదిలో చోటుచేసుకుంది. ఆ వివరాలు.. రాంపూర్ కు చెందిన యాదవ్ వర్గీయుల ఇంట్లో శనివారం వివాహం జరగాలని నిర్ణయించారు. పెళ్లి మండపంలో ఇరు వర్గాల వారి బంధువులతో సందడి వాతావరణం నెలకొంది. ఓ వైపు భోజనాలు ప్రారంభించారు. వరుడి తరఫు వారు తమకు బీఫ్ వడ్డించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో గో మాంసంపై నిషేధం ఉందని ఎంత మొత్తుకున్నా వరుడి బంధువులు వినలేదు. మమ్మల్ని అవమానిస్తారా అంటూ పెళ్లి ఆపేసేందుకు సిద్ధమయ్యారు. చివరికి కట్నంగా కారు కూడా ఇవ్వాలని.. లేకుంటే తమ దారిన వెళ్లిపోతామంటూ వధువు తండ్రిని హెచ్చరించారు. అందుకు వధువు తండ్రి నిరాకరించడంతో పెళ్లి రద్దుచేస్తున్నట్లు ప్రకటించి వరుడు బంధువులు వెళ్లిపోయారు. ఈ విషయంపై వరుడిపై, అతడి బంధువులపై వధువు తరఫువారు ఫిర్యాదు చేశారని స్టేషన్ ఆఫీసర్ రాజేశ్ కుమార్ ఆదివారం మీడియాకు తెలిపారు. కారు కావాలంటే కొన్ని రోజుల తర్వాత కష్టపడి ఇవ్వగలమని, కానీ నిషేధం ఉన్న గోమాంసాన్ని అడిగి ఇబ్బందుల పాలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు వివరించారు. -
పెళ్లైన నాలుగు రోజులకే..!
తిరుత్తణి(చెన్నై): వివాహం జరిగిన నాలుగు రోజులకే ఏం కష్టమో ఏమో కానీ నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన తిరుత్తణి సమీపంలో చోటుచేసుకుంది. తిరుత్తణి సమీపంలోని చెరుకునూర్ దళితవాడకు చెందిన భాస్కర్(27) ప్రయివేటు కర్మాగార సిబ్బంది. అరక్కోణం తాలూకా కుండ్రత్తూరు దళితవాడకు చెందిన అతని బంధువు పళణి కుమార్తె పద్మ(21) ప్లస్‌టూ వరకు చదువుకుని అదే ప్రాంతంలోని ప్రయివేటు కర్మాగారంలో పని చేసేది. ఇరు కుటుంబీకుల నిర్ణయం మేరకు భాస్కర్, పద్మల వివాహం నాలుగు రోజుల కిందట కేజీ కండ్రిగలో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం జరిగింది. రెండు రోజులు తల్లిగారింట్లో ఉండి మొదటిసారిగా భర్త ఇంటి మెట్టు ఎక్కింది. ఇంతలో ఏమైందో ఏమోగానీ గురువారం రాత్రి ఇంట్లో పురుగులు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. భర్త కుటుంబీకులు గుర్తించి వెంటనే షోళింగర్ ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు ఆమెను పరీ క్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. నవ వధువు ఆత్మహత్యకు సంబంధించి తిరుత్తణి ఆర్డీవో విమల్‌రాజ్ దర్యాప్తు ప్రారంభించారు. మృతికి సంబం ధించి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు మృతదేహాన్ని అప్పగించారు. వివాహం జరిగిన నాలుగు రోజుల్లోనే నవ వధువు ఆత్మహత్య సంఘటన శుభకార్యం జరిగిన కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చింది. -
పెళ్లి కొడుకు అదృశ్యం
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): కర్నూలులోని సంతోష్‌నగర్‌కు చెందిన పందిళ్ల పెద్ద వెంకటేశ్వర్లు(25) ఐదు రోజులుగా కనిపించడంలేదని ఆయన సోదరి ఎస్.లక్ష్మిదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు నాలుగో పట్టణ పోలీసులు సోమవారం తెలిపారు. పూర్తి వివరాలు.. తాండ్రపాడు సమీపంలోని శ్రీచైతన్య పాఠశాలలో పెద్ద వెంకటేశ్వర్లు టీచర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల ఆయన పెళ్లి నిశ్చయం అయింది. ఈనెల ఒకటో తేదీన స్నేహితులు, బంధువులకు కార్డులు పంచేందుకు వెళ్లాడు. అప్పటి నుంచి అతని ఆచూకీ కోసం తండ్రి పి.పెద్ద అంకయ్య, సోదరి ఎస్.లక్ష్మిదేవి వేర్వేరు ప్రాంతాల్లో వెతికారు. అయినా జాడ కనిపించకపోవడంతో సోమవారం ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
కాసేపట్లో పెళ్లి.. గుండెపోటుతో వరుడి మృతి
పాట్నా: మరికాసేపట్లో ఆ ఇంట్లో పెళ్లి జరగనుంది. కానీ అంతలోనే బరాత్‌లో డాన్స్ చేస్తున్న పెళ్లికొడుకు హఠాత్తుగా కుప్పకూలి చనిపోయాడు. ఈ విషాద ఘటన బిహార్ లోని కైముర్ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి... కైముర్ జిల్లా సరన్పూర్ ప్రాంతానికి చెందిన దయా శంకర్‌పాండే కుమారుడు శశికాంత్పాండే (25)కి గత శుక్రవారం వివాహం నిశ్చయించారు. బంధువులు, స్నేహితులతో కలిసి పెళ్లి మండపానికి తన గ్రామం నుంచి వివాహ వేదికకు ఊరేగింపుగా వెళ్తున్నారు. బరాత్ సందర్భంగా.. పెళ్లికొడుకును డాన్స్ చేయమని స్నేహితులు బలవంతంగా కారునుంచి దించి డాన్స్ చేయించారు. అందరితో కలిసి సంతోషంతో వరుడు శశికాంత్ ఫుల్లుగా డ్యాన్స్ చేశాడు. అంతలోనే గుండె పట్టుకుని ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. పెళ్లికొడుకును పరీక్షించిన డాక్టర్లు గుండెపోటుతో వరుడు శశికాంత్ మృతి చెందినట్లు నిర్ధారించారు. డ్యాన్స్ చేయడం వల్లే గుండెపై ఒత్తిడి పెరిగి చనిపోయాడని తెలిపారు. దీంతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
93 ఏళ్ల బామ్మ ఫేస్ బుక్ పోస్ట్ వైరల్!
సిడ్నీ: ప్రేమకు వయసుతో పని లేదంటారు. ఇందుకు ఆస్ట్రేలియా బామ్మ సిల్వియా ప్రేమ వివాహమే తాజా ఉదాహరణ. 93 ఏళ్ల బామ్మ సోషల్ మీడియాలో సెలబ్రిటీగా మారిపోయారు. అందుకు కారణం ఆమె చేసిన ఓ చిన్న ప్రయత్నం. తాను పెళ్లి చేసుకోబోతున్నానని, పెళ్లి డ్రెస్ విషయంలో మీరు కాస్త సాయం చేయండని కోరుతూ సోషల్ మీడియాలో ఓ ఫొటో షేర్ చేస్తూ పోస్ట్ చేశారు సిల్వియా. ఈ పోస్ట్ ఇంటర్ నెట్ లో వైరల్ గా మారింది. ఆ వివరాలిలా ఉన్నాయి.. 93 ఏళ్ల సిల్వియా, 88 ఏళ్ల ఫ్రాంక్ గత రెండు దశాబ్దాల నుంచి గాఢంగా ప్రేమించుకుంటున్నారు. పలుమార్లు పెళ్లి ప్రతిపాదన తెచ్చినా సిల్వియా అందుకు నో చెప్పేవారు. ఈ క్రమంలో ఇటీవల మరోసారి ఫ్రాంక్ చేసిన పెళ్లి ప్రతిపాదనకు బామ్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఫ్రాంక్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇన్నేళ్లుగా పెళ్లికి నో చెప్పిన బామ్మగారు, ఇప్పుడు పెళ్లికి ఒప్పుకునేందుకు ఓ కండీషన్ కూడా పెట్టారు. అదేమంటే.. తన మొదటి భర్త ఇంటిపేరును మార్చుకునే ప్రసక్తే లేదని చెప్పగా.. ఇది తనకు సమస్యే కాదని స్పష్టం చేయడంతో పెళ్లికి అంగీకరించారు. వచ్చే నెలలో ఫ్రాంక్, సిల్వియా దంపతులు కానున్నారు. ఈ క్రమంలో బామ్మగారు పెళ్లి షాపింగ్ మొదలుపెట్టారు. ఇందులో భాగంగా షాపింగ్ మాల్ లో నాలుగు డ్రెస్సులు ట్రై చేసి, వాటి ఫొటోలను ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. 'నాకు కొంచెం సాయం చేయండి. పెళ్లికి ఏ డ్రెస్సు వేసుకోవాలో సూచించండి' అంటూ సిల్వియా చేసిన పోస్టుకు భారీగా లైక్స్, కామెంట్స్ వస్తున్నాయి. ప్రేమకు వయసుతో సంబంధం లేదని మరోసారి నిరూపించారు.. కంగ్రాట్స్ అంటూ బామ్మకు అభినందనల వెల్లువ మొదలైంది. -
వరుడి కిడ్నాప్.. వధువు సహా నలుగురి అరెస్ట్
పట్నా: వరుడిని కిడ్నాప్ చేసిన వ్యవహారంలో వధువు సహా నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన బిహార్ లోని ముజఫర్ పూర్ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. ముజఫర్ పూర్ ఈస్ట్ డీఎస్పీ ముస్తాఫిక్ అహ్మద్ కథనం ప్రకారం.. జూలీ అనే యువతికి మిథాలీ గ్రామానికి చెందిన అభినయ్ కుమార్ తో వివాహం చేయాలని వధువు కుటుంబసభ్యులు నిశ్చయించుకున్నారు. అనుకున్నదే తడవుగా అభినయ్ ని వధువు బంధువులు నంద్ కిశోర్ సింగ్, మరికొందరు కలిసి కిడ్నాప్ చేశారు. అభినయ్ కిడ్నాప్ అయ్యాడని గైఘాట్ పోలీసులకు అతడి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకున్నారు. 'పకాడ్వా షాది' అనే సంప్రదాయం ప్రకారం తమకు కావలసిన వ్యక్తిని కిడ్నాప్ చేసి అతడికి బలవంతంగా పెళ్లి చేయడం బిహార్ లో కొనసాగుతుండేది. వధువు బంధువులు నిర్ణయించినట్లుగానే పెళ్లి ఏర్పాట్లు అన్ని జరిగిపోయాయి. శుక్రవారం మరికాసేపట్లో వివాహం జరుగుతుందనగా జూలీ ఇంటికి చేరుకున్న పోలీసులు అభినయ్ ని వారి చెర నుంచి విడిపించారు. అయితే వధువు తరఫు బంధువులు పోలీసులపై దాడులకు దిగి విధ్వంసం సృష్టించారు. పోలీసులను వారి దాడులను అడ్డుకుని కల్యాణ మండపం వద్ద ఉన్న వధువు సహా నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వధువు జూలీని, ఆమె సోదరి, సోదరుడు, మరో వ్యక్తిని అరెస్ట్ చేసి విచారణ చేశారు. ఈ నలుగురిని అనంతరం స్థానిక కోర్టులో ప్రవేశపెట్టగా, షాహిద్ ఖుదీ రామ్ బోస్ సెంట్రల్ జైలుకు జ్యూడీషియల్ కస్టడీకి అప్పగించారు. అభినయ్ ఇష్టప్రకారమే వివాహం జరుగుతుందని వధువు బంధువులు పోలీసులను నమ్మించాలని చూశారు. అయితే అక్కడ వరుడి కుటుంబంగానీ, బంధువులుగానీ ఏ ఒక్కరూ లేరని నిర్ధారించుకున్న తర్వాతే పోలీసులు అతడిని రక్షించారని డీఎస్పీ తెలిపారు. తనను జూలీ బంధువులు కిడ్నాప్ చేశారని, బలవంతంగా పెళ్లి చేయాలని ప్రయత్నించారని ఆరోపించాడు. వధువు బంధువు ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ.. జూలీ, అభినయ్ కుమార్ కి గతంలోనే పెళ్లి నిశ్చయమైందని, కట్నం అడగటంతో గొడవ తలెత్తి పెళ్లి రద్దయిందని చెప్పాడు. ఆ కారణం వల్లే వరుడిని ఎలాగైనా తీసుకొచ్చి పెళ్లి చేయాలని చూశారని చెప్పుకొచ్చాడు. ఓ వ్యక్తిని కిడ్నాప్ చేయడంతో పాటు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని డీఎస్పీ ముస్తాఫిక్ అహ్మద్ వివరించారు. -
తాళి కట్టి పరారయ్యాడు
జూపాడుబంగ్లా(కర్నూలు): బంధు- మిత్రులతో కలిసి వివాహాన్ని అంగరంగ వైభవంగా చేశారు. పెళ్లి అయిపోయి కుటుంబ సభ్యులంతా చాలా ఆనందంగా ఉన్నారు. తన కూతురి జీవితం చాలా సంతోషంగా గడవాలని తల్లిదండ్రులు కోరుకున్నారు. ఎన్నో ఆశాలతో కొత్త జీవితాన్ని ప్రారంభిద్దామని అనుకున్న యువతి జీవితంలో అనుకోని సంఘటన చోటుచేసుకుంది. వేద మంత్రాల సాక్షిగా తాళి కట్టిన భర్త.. పెళ్లైన పన్నెండు గంటల్లోపే పత్తాలేకుండా పోయాడు. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురైన యువతి పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటన కర్నూలు జిల్లా జూపాడుబంగ్లాలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన వెంకటస్వామి కుమార్తి మోతెలక్ష్మికి తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూరానికి చెందిన కొడిగంటి కురుమూర్తితో బుధవారం అట్టహాసంగా వివాహామైంది. పెళ్లి అనంతరం రాత్రి అంతా నిద్రిస్తున్న సమయంలో పెళ్లి కొడుకు ఎవరికి చెప్పకుండా పరారయ్యాడు. ఇది గుర్తించిన పెళ్లి కూతురు విషయం కుటంబ సభ్యులకు చెప్పడంతో వారంతా కలిసి కురుమూర్తి కోసం గాలించారు. అయినా ఫలితం లేకపోవడంతో.. స్థానిక పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. గతంలోనే కురుమూర్తికి వివాహమైందని.. మొదటి భార్య కూడా కొల్లాపూర్ పోలీసుస్టేషన్లో ఇతనిపై కేసు పెట్టినట్లు బంధువులు అంటున్నారు. హైదరాబాద్‌లో షార్ట్ఫిలిమ్స్ తీస్తున్న కురుమూర్తి వివాహానికి ముందే లక్ష్మికి సెల్‌ఫోన్ బహుమతిగా ఇచ్చాడని తరచు ఫోన్ చేసేవాడని.. బాగా మాట్లాడేవాడని పెళ్లి కూతురు చెబుతోంది. -
మరికొద్ది గంటల్లో పెళ్లి.. వరుడి మృతి
-
మరికొద్ది గంటల్లో పెళ్లి.. వరుడి మృతి
సూర్యాపేట (మోతే): మరికొద్ది గంటల్లో పెళ్లి జరగనుండగా వరుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. బాజా బజంత్రీలతో వేద మంత్రాల సాక్షిగా నూతన వధువరులు ఒకటి కావల్సిన ఇంట్లో పెళ్లి కూతరు రోదన పలువురిని కంటతడిపెట్టించింది. డీసీఎంలో వెళ్తున్న పెళ్లి బృందాన్ని లారీ ఢీకొట్టిన ఘటనలో పెళ్లికొడుకు సహా ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు చికిత్స పొందుతూ చనిపోయారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన సూర్యాపేట జిల్లా మోతే మండల కేంద్రం సమీపంలో బుధవారం వేకువజామున చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి.. హైదరాబాద్‌లోని కూకట్పల్లి నుంచి ఖమ్మం జిల్లా చర్లకు చెందిన వధువు నామగరి సత్యనాగలక్ష్మీ ఇంటికి వరుడు తప్పెట శేష సాయినాథ్ సహా బంధువులు డీసీఎంలో బయలుదేరారు. మార్గం మధ్యలో మోతే మండల కేంద్రంలోని ఓ పెట్రోలు బంక్ సమీపంలో డీసీఎంను ఆపగా, వేగంగా దూసుకొచ్చిన లారీ పెళ్లిబృందం వాహనాన్ని వెనకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పెళ్లికొడుకు తప్పెట శేష సాయినాథ్, అతని బంధువు దామోదర్‌లు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 10 మందికి గాయాలు కాగా క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూ సత్యనారాయణ, మూడేళ్ల చిన్నారి అఖిల్ మృతిచెందారు. దీంతో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. బుధవారం రాత్రి పెళ్లి జరగనున్న నేపథ్యంలో మంగళవారం అర్ధరాత్రి కుకట్పల్లి నుంచి పెళ్లిబృందం డీసీఎంలో బయలుదేరగా మార్గం మధ్యలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనతో వధువు, వరుడి కుటుంబాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
నిత్య పెళ్లికొడుకుపై ఫిర్యాదు
పెదవాల్తేరు (విశాఖ తూర్పు): ఒకరిని.. ఇద్దరిని కాదు ఏకంగా నలుగురు అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. ఒకరికి తెలియకుండా ఇంకొకరిని పెళ్లి చేసుకుని వారిని నట్టేటముంచాడు. మాయమాటలతో బురిడీకొట్టి నలుగురిని బుట్టలో వేసుకున్న నిత్యపెళ్లి కొడుకు బాగోతం.. కాస్త నాలుగో భార్యతో పెట్టుకున్న వివాదంతో బట్టబయలైంది. మూడో పట్టణ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నరసింహనగర్‌కు చెందిన జన్న అరుణ్‌కుమార్ న్యూగరుడా ట్రావెల్స్‌ను నిర్వహిస్తున్నాడు. ఈయన తన భార్య చనిపోయిందని చెప్పి శివాజీపాలేనికి చెందిన శ్యామలను 2015లో వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి ఓ పాప కూడా జన్మించింది. వాహనం కొనుగోలు కోసం డబ్బులు కావాలని చెప్పి శ్యామల వద్ద రూ.4 లక్షలు తీసుకున్నాడు. ఆ తరువాత తరచూ గొడవ పడుతూ ఆమెను దూరం చేయడం మొదలు పెట్టాడు. దీంతో అనుమానం వచ్చిన శ్యామల.. అరుణకుమార్ గురించి ఆరా తీసింది. తనకంటే ముందు మరో ముగ్గురు మహిళలను పెళ్లిళ్లు చేసుకున్నట్టు తెలుసుకుని షాక్‌కు గురైంది. మొదటి భార్యకు ఒక సంతానం కూడా ఉంది. రెండో భార్య చనిపోయింది. మూడో భార్యకు పాప ఉంది. తనను నాలుగో పెళ్లి చేసుకుని నట్టేట ముంచాడని శ్యామల భోరున విలపించింది. పోలీసులను ఆశ్రయించి, మహిళల జీవితాలతో ఆటలు ఆడుకుంటున్న అరుణ్‌కుమార్‌పై కేసు నమోదు చేసి, అరెస్టు చేయాలని కోరుతోంది. ఈ కేసు మహిళా పోలీసు స్టేషన్ పరిధిలోకి వస్తుందని, అక్కడ ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. ఈ మేరకు మహిళా పోలీసులకు శ్యామల ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తులో ఉంది. -
లక్ష్మీరంగనాథస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
జూపాడుబంగ్లా : తర్తూరు లక్ష్మీరంగనాథస్వామి బ్రహ్మోత్సవాల్లో బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు పూలచపురం కార్యక్రమంలో భాగంగా స్వామివారు పెళ్లి కుమారుడిగా ముస్తాబయ్యారు. ఉదయం స్వామివారికి పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం వేదమంత్రాల మధ్య çపట్టువస్త్రాలతో స్వామివారిని పెళ్లికుమారుడిగా తీర్చిదిద్దారు. స్వామివారు తర్తూరులో పెళ్లికుమారుడిగా ముస్తాబైన అనంతరం ఇక్కడ పదిరోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఇక్కడ స్వామివారికి కల్యాణం నిర్వహించకపోవటంతో బ్రహ్మోత్సవాల అనంతరం స్వామివారు నెల్లూరు జిల్లాల్లోని శ్రీరంగాపురంలో జరిగే కల్యాణవేడుకలకు తరలివెళ్తారని పూజారులు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, భక్తులకు అన్నదానం నిర్వహించారు. పట్టువస్త్రాలు సమర్పించిన ఆర్ఐ.. లక్ష్మిరంగనాథస్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ సుధీంద్ర సతీసమేతంగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. నేడు సింహవాహనసేవ: బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండోరోజైన గురువారం స్వామివారికి సింహవాహనసేవ నిర్వహించనున్నట్లు ఆలయ పూజారి వెంకటరెడ్డి, ఈఓ సుబ్రమణ్యంనాయుడు, చైర్మన్ రాయపుచిన్నరంగారెడ్డి తెలిపారు. -
తమ్ముడిని పెళ్లి చేసుకోమని.. ప్రియురాలి వద్దకు
అనంతపురం: ఒక్క రోజులో పెళ్లి.. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.. ఇరువైపు బంధువులు వచ్చారు.. ఇంతలో తాను ప్రేమించిన అమ్మాయి గుర్తుకొచ్చిన పెళ్లికొడుకు.. ఆమెనే పెళ్లి చేసుకుంటానంటూ పెళ్లి కుమార్తెకు ఓ లేఖ రాసి ఉన్నట్టుండి పరారయ్యాడు. ఈ సంఘటన జిల్లా కేంద్రమైన అనంతపురంలోని సిండికేట్ నగర్లో జరిగింది. చరణ్ అనే యువకుడు రైల్వేలో టికెట్ కలెక్టర్‌గా పనిచేస్తున్నాడు. అతను ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ వారి ప్రేమ పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించకుండా మరో సంబంధం చూశారు. గురువారం పెళ్లి జరగాల్సిఉంది. ముందస్తుగా రూ. 5 లక్షల కట్నం కూడా పుచ్చుకున్నాడు. గంటల్లో పెళ్లి ఉందనగా తీరా ప్రేమించిన అమ్మాయి దగ్గరకు వెళ్లిపోతున్నానంటూ లేఖ రాసి మరీ ఉడాయించాడు చరణ్. పైగా పెళ్లి కూతురుకు మరో సూచన కూడా చేశాడు. పెళ్లి ఆగిపోకుండా తన తమ్ముడు హరిని పెళ్లి చేసుకోవాలని అందులో రాశాడు. పెళ్లి కొడుకు వెళ్లిపోవడం, పెళ్లి ఆగిపోవడంతో పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పెళ్లింట విషాదం
వరుడు ఆత్మహత్య ఐదు రోజుల్లో పెళ్లికి ఏర్పాట్లు లక్ష్మీపూజకు బంధువుల గైర్హాజరు మనస్తాపంతో ఉరి వేసుకుని అఘాయిత్యం గుంతకల్లు టౌన్ : మరో ఐదు రోజుల్లో పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. లక్ష్మీపూజకు బంధువులు రాలేదని మనస్తాపానికి గురై వరుడు వీరేష్‌కుమార్ (30) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన గుంతకల్లు పట్టణంలో శుక్రవారం చోటు చేసుకుంది. మృతుడి తల్లి పోలీసులకిచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. రాజీవ్ కాలనీకి చెందిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి శ్రీనివాసులు, విజయగౌరీ దంపతులకు ఐదుగురు సంతానం. నలుగురు అబ్బాయిలు, ఒక అమ్మాయి ఉన్నారు. వీరిలో పెద్దకుమారుడైన వీరేష్‌కుమార్ క్రికెటర్. ఇతను కర్ణాటక రాష్ట్రం కొప్పల్ జిల్లా గిన్నిగెర అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. ఏడాది క్రితమే తన తండ్రి శ్రీనివాసులు అనారోగ్యంతో మృతి చెందడంతో వీరేష్ ఆ కుటుంబానికి పెద్దదిక్కయ్యాడు. 23, 24 తేదీల్లో పెళ్లి.. వీరేష్‌కు కర్నూల్ జిల్లా ఆదోనికి చెందిన జ్యోతితో వివాహం కుదిరింది. ఈ నెల 23, 24 తేదీల్లో గుంతకల్లు ఆర్అండ్బీ సర్కిల్లో గల తమిళ సంఘం ఫంక్షన్ హాల్లో పెళ్లి జరగాల్సి ఉంది. ఆహ్వాన పత్రికలు కూడా సిద్ధం చేశారు. పెళ్లివేడుకల్లో భాగంగా ఆనవాయితీ ప్రకారం గురువారం రాత్రి తన ఇంట్లో లక్ష్మీపూజ నిర్వహించారు. ఈ పూజకు తన బంధువులెవ్వరూ హాజరుకాలేదు. ఈ విషయమై శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి టీ తాగుతూ సొంత బంధువులెవ్వరూ పూజకు రాకపోతే ఎలా అని తల్లి, చెల్లెతో చెబుతూ తీవ్ర మనస్తాపం చెందాడు. కొద్దిక్షణాలకే బెడ్రూమ్లోకి వెళ్లిన వీరేష్ ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. కొన ఊపిరితో ఉన్న అతడిని ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గం మాధ్యంలో చనిపోయాడు. తల్లి ఫిర్యాదు మేరకు ఒన్‌టౌన్ ఎస్ఐ నగేష్‌బాబు కేసు నమోదు చేసుకున్నారు. -
తోటి పెళ్లికూతుళ్లపై లైంగిక దాడులు
చైనాలో రోజు రోజుకూ తోటి పెళ్లికూతుళ్లపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా పెళ్లికొడుకు మిత్రులు వారిని శారీరకంగా, మానసికంగా, లైంగికంగా వేధిస్తున్నారు. గత నెలలోనే పెళ్లికూతురు తరఫున 28 ఏళ్ల తోటి పెళ్లికూతురికి పీకలదాకా మద్యం తాగించడం వల్ల అమె మరణించింది. ఈ సంఘటన కొన్ని దశాబ్దాలుగా దేశంలో ఓ ఆచారంగా వస్తున్న తోటి పెళ్లికూతుళ్ల తతంగం మొదటిసారి కలవరం రేపింది. ఇటీవల తన స్నేహితురాలి పెళ్లికి తోటి పెళ్లికూతురుగా వచ్చిన లియూ యాన్ అనే సినీ నటిని పెళ్లికొడుకు మిత్రులు అమాంతంగా ఎత్తుకెళ్లి స్విమ్మింగ్ పూల్‌లో పడేసి అల్లరి చేయడం చైనా ఇంటర్నెట్లో ఇప్పుడు హల్చల్ చేస్తోంది. చైనాలో ఈ తోటి పెళ్లకూతుళ్ల సంప్రదాయం గణవ్యవస్థ కాలం నుంచి కొనసాగుతోంది. అప్పట్లో ఓ గణంలోని అమ్మాయికి పెళ్లంటే ఆ అమ్మాయిని ఇప్పటిలాగే ఉన్నంతలో ఖరీదైన ఆభరణాలు, దుస్తులతో అందంగా అలంకరించేవారట. శత్రుగణాలు నగల కోసం పెళ్లి కూతుళ్లను ఎత్తుకుపోయేవట. అలా జరగకుండా పెళ్లికూతుళ్లను కాపాడుకోవడం కోసం తోటి పెళ్లికూతుళ్ల తతంగం వచ్చిందని పెద్దలు చెబుతారు. వారు కూడా అచ్చంగా పెళ్లి కూతుళ్లలాగే తయారై ఇళ్లంతా సందడి చేసేవారు. ఇంటికొచ్చిన ప్రతి అతిథిని పెళ్లికూతురు పలకరించడం, మర్యాదపూర్వకంగా వారితో కలసి బియ్యంతో తయారుచేసిన వైన్ తాగడం ఆనవాయితీ. ఇందులో కూడా పెళ్లి కూతురుకు రిస్క్ ఉండడంతో ఈ కార్యక్రమాన్ని కూడా తోటి పెళ్లికూతురుతోనే చేయిస్తూ వస్తున్నారు. పెళ్లి పీటల మీదకు ఎక్కే ముందు మాత్రమే పెళ్లి కూతురు బంధు, మిత్రుల మధ్యకు వస్తుంది. ఇలా చేయడం ద్వారా నాడు గణ వ్యవస్థలో పెళ్లికూతుళ్లను రక్షించుకోగలిగారని ఆచార, వ్యవహారాలు తెలిసిన చైనా పెద్దలు చెబుతున్నారు. పెళ్లి కూతురనుకొని తోటి పెళ్లికూతుళ్లను ఎత్తుకెళ్లిన గణాలు కూడా ఆమె ధరించిన నగలన్నీ నకిలీవని తెలిసి వదిలేసే వారట. తరతరాలుగా కొనసాగుతున్న ఈ ఆచారంలో చాలాకాలం వరకు పెళ్లి కూతురు బంధువులు లేదా మిత్రులే తోటి పెళ్లి కూతురుగా వ్యవహరించేవారు. ఇంటికొచ్చిన అతిథులను ఆహ్వానించడం, పెళ్లి కొడుకు పరివారాన్ని ఎదుర్కోవడం, పెళ్లి తర్వాత కొత్త దంపతుల మూడు రాత్రుల ముచ్చట తీర్చేవరకు అన్ని పెళ్లి తతంగాల్లో తోటి పెళ్లి కూతురుదే ముఖ్యపాత్ర. ఒకప్పుడు మూడు రాత్రుల ముచ్చట ఎలా తీర్చుకోవాలో కూడా అనుభవంలేని పెళ్లి కొడుకులకు తోటి పెళ్లి కూతుళ్లే శిక్షణ ఇచ్చేవారట. సమాజం మారుతున్నకొద్దీ చైనాతోపాటు భారత్ లాంటి ఆసియా దేశాల్లో తోటి పెళ్లి కూతుళ్ల తతంగం మారుతూ వచ్చి నిన్నటివరకు సింబాలిక్‌గానే మిగిలిపోయింది. పెళ్లిళ్లు అట్టహాసంగా, ఆర్భాటంగా చేసుకోవడంలో భాగంగా 'వెడ్డింగ్ ప్లానర్లు' వచ్చిన విషయం తెల్సిందే. ఈ వెడ్డింగ్ ప్లానర్లు పేరుకు మాత్రమే మిగిలిపోయిన తోటి పెళ్లికూతుళ్ల తతంగానికి మళ్లీ వన్నె తెచ్చారు. ఇప్పుడు దీన్ని ఓ వృత్తిగా స్వీకరిస్తూ సెలబ్రటీలుగా వెలుగుతున్న వాళ్లు పలు దేశాల్లో ఉన్నారు. తాము ప్రతి పెళ్లికి తోటి పెళ్లి కూతురును ఏర్పాటు చేస్తున్నామని, వారి అందం, మాటతీరు, కలుపుగోలుతనం తదితరాలను బట్టి రోజుకు ఒక్కో తోటి పెళ్లి కూతురుకు 2,200 రూపాయల నుంచి 9,000 రూపాయలను చెల్లిస్తున్నామని చైనాలోని దాదాపు 50 వెడ్డింగ్ ప్లానర్లు తెలియజేశారు. కొన్ని పెళ్లిళ్లకు ఇద్దరు, ముగ్గురు తోటి పెళ్లికూతుళ్లు కావాలని కూడా కోరుతున్నారని, వారాంతంలోనే ఎక్కువ పెళ్లిళ్లు ఉంటాయి కనుక మిగతా రోజుల్లో మామూలు ఉద్యోగాలు చేసుకుంటూ వారంతంలో తోటి పెళ్లికూతుళ్ల అవతారం ఎత్తేందుకు ఉత్సాహం చూపిస్తున్నవారు ఎక్కువ మందే ఉన్నారని వారు చెప్పారు. ఒకప్పుడు పెళ్లి కూతురు, ఇప్పుడు ఆమె తరఫున తోటి పెళ్లి కూతురు బంధు, మిత్రులతో మద్యం సేవించడం సంప్రదాయం కనుక అప్పుడప్పుడు అసభ్య, అఘాయిత్య సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని వారన్నారు. ఇలాంటి సంఘటనలు జరుగకుండా చట్టాలు తీసుకొస్తే మంచిదేమోనని వారు అభిప్రాయపడ్డారు. అప్పటి వరకు బౌన్సర్లను ఏర్పాటు చేస్తే మంచిదేమో....! -
పెళ్లి కావాలంటే 'దూకుడు' ఉండాల్సిందే!
ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి ఆఫ్రికా దేశం ఇథియోపియా గిరిజన ప్రాంతం ఓమీ లోయకు చెందిన హమర్ తెగ యువకుడు. ఇతడు ఇలా ఎద్దులపై నుంచి దూకడం వెనుక పెద్ద కథే ఉంది. అది ఏంటంటే.. పెళ్లీడుకు వచ్చిన యువకులు తమకు నచ్చిన యువతిని ఎంచుకోవడానికి హమర్ గిరిజన పెద్దలు ఏటా ‘జంపింగ్’ పోటీలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వరుసగా నాలుగు కంటే ఎక్కువ ఎద్దులను నిలబెడతారు. వీటన్నింటిపై నుంచి కింద పడకుండా నడిచి అవతలివైపు దూకేయాలి. అలా చేసిన యువకులు మాత్రమే పెళ్లికి అర్హత సాధిస్తారు. లేదా నాలుగైదు ఎద్దుల పైనుంచి నేరుగా ఎగిరి దూకిన వారు పోటీలో గెలుపొందినట్లే. పోటీలో విఫలమైతే కొన్నిసార్లు జీవితాంతం బ్రహ్మచర్యం పాటించాల్సి ఉంటుందట. పెళ్లి జరిగిన రోజు మాత్రం దంపతులు అలసిపోయేలా తమ తెగకు సంబంధించిన పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు. పెళ్లి తర్వాత ఇక్కడి తెగ వారు మరో వింత ఆచారాన్ని పాటిస్తుంటారు. భర్త చేతిలో ఓ తాడులాంటి వస్తువుతో భార్యను కొడతాడు. అలా తనకు నచ్చిన రీతిలో, కాస్త సమయం చెలరేగిపోయి భార్యను కొట్టి ఆపేస్తారు. తెగలో కొందరైతే కర్రసాములో పాల్గొని విజేతగా నిలిచిన వారు పెళ్లి చేసుకుని జీవితాన్ని గడుపుతుంటారు. ఓడిన వాళ్లు మరో ఏడాది మళ్లీ ప్రయత్నించి ఏదో రకంగా కొన్ని నియమాలలో విజయం సాధించి వివాహానికి అర్హత సాధిస్తారు. హమర్ తెగలో వివాహ వయసు పురుషులకు దాదాపు 30 ఏళ్లకు పైగా ఉండగా.. మహిళలకు 17 ఏళ్లు నిండితే చాలు. కాబోయే భార్య కుటుంబానికి వరుడు పెద్ద మొత్తంలో సంపదను ఇచ్చుకోవాల్సి ఉంటుంది. 30 మేకలు లేదా గొర్రెలను అత్తింటివారికి వరుడు సమర్పించుకోవాలి. అయితే చాలావరకూ పురుషులు తమ జీవితకాలంలో చెప్పినమేరకు మేకలు, గొర్రెలను ఇచ్చుకోవడంలో విఫలమవుతుంటారు. ఈ తెగలో భార్యలతే పెత్తనం. వయసులో భర్త పెద్దవాడు కావడం, భార్య యుక్తవయసులో ఉండటమే ఇందుకు కారణమని చెప్పవచ్చు. -
పెళ్లయి రెండు వారాలు కాకుండానే..
బైక్ అదుపు తప్పి నవ వరుడు దుర్మరణం కావలిరూరల్: పెళ్లై రెండు వారాలైనా కాలేదు. బైక్ అదుపు ఓ నవ వరుడు దుర్మరణం చెందాడు.ఈ సంఘటన శనివారం నెల్లూరు, ప్రకాశం సరిహద్దు చేవూరు వద్ద జాతీయ రహదారిపై జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం భీమవరానికి చెందిన చంద్రగిరి గోవిందు, సుబ్బలక్షమ్మ కుమారుడు వంశీ (21)కి కావలి రూరల్ మండలం రుద్రకోటకు చెందిన మేనమామ కూతురు రమ్యతో గత నెల 20వతేదీన వివాహమైంది. శనివారం రుద్రకోటలో ఉన్న తన భార్యను బంధువులతో కారులో భీమవరం పంపించాడు. అనంతరం తాను ఒంటరిగా బైక్‌పై బయలుదేరాడు. చేవూరు వద్ద ఎదురుగా వస్తున్న కుక్కను తప్పించబోయి బైక్ అదుపు తప్పి పడిపోయాడు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వస్తున్న గుర్తుతెలియని కారు వంశీ నడుము మీదుగా ఎక్కి వెళ్లడంతో నడుము భాగం నుజ్జు నుజ్జు అయింది. అటుగా వెళ్తున్న ఒంగోలు అంబులెన్సు వారు తీవ్రంగా గాయపడిన వంశీని చూసి కావలి ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన ఏరియా ఆసుపత్రి వైద్యులు అప్పటికే అతను మృతి చెందాడని నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీలో ఉంచారు. సమాచారం అందుక్నున మృతుడి కుటుంబæులు ఏరియా ఆసుపత్రికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. కావలి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమికుల రోజున రెండు ఇళ్లల్లో విషాదం
తాండూరు: ప్రేమికుల రోజున రెండు ఇళ్లల్లో విషాదం చోటుచేసుకుంది. కాబోయే భార్యను కలుసుకునేందుకు వెళ్లిన యువకుడు మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్నది. వివరాలు ఇలా ఉన్నాయి... తాండూరు పట్టణంలోని షావుకార్‌పేట్‌కు చెందిన గంగాధర్(30)కు ఈనెల 11వ తేదీన వికారాబాద్‌కు చెందిన యువతితో నిశ్చితార్థం జరిగింది. అయితే ప్రేమికుల రోజును పురస్కరించుకొని కాబోయే భార్యను కలుసుకోవడానికి ఆదివారం గంగాధర్ వికారాబాద్ లోని యువతి ఇంటికి వెళ్లాడు. అక్కడ ఉన్నట్టుండి కూప్పకూలిపోయి అతను మరణించడంతో విషాదం నెలకొంది. సమాచారం తెలుసుకున్న కుటుంబసభ్యులు వికారాబాద్‌కు వెళ్లి మృతదేహాన్ని తాండూరుకు తీసుకువచ్చారు. మరికొద్ది రోజుల్లో వివాహం జరగనుండగా పెళ్లికుమారుడు చనిపోవడంతో ఇరు కుటుంబాల్లో ఈ ఘటన విషాదాన్ని నింపింది. -
వరుడు అదృశ్యం.. ఆగిన పెళ్లి
చిత్తూరు: చిత్తూరు జిల్లాలోని కుప్పం టీటీడీ కల్యాణ మండపంలో పెళ్లి ఆగిపోయింది. నిన్న మధ్యాహ్నం నుంచి వరుడు కనిపించకుండా పోయాడు. ముహూర్తం సమయానికి రాకుండా వరుడు అదృశ్యం కావడంతో వివాహం నిలిచిపోయింది. దాంతో వధువు బంధువులు ఆందోళన చెందుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మూడు గంటల్లో పెళ్లి: పెళ్లికొడుకు పరార్
అచ్యుతాపురం (విశాఖపట్నం) : మూడు ముళ్లు వేయడానికి మూడు గంటల ముందు పెళ్లి కొడుకు పరారైన ఘటన విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురంలో గురువారం చోటుచూసింది. మండలంలోని రామన్నపాలెం గ్రామానికి చెందిన రాము నాయుడు(27).. మాటూరుకు చెందిన ఓ యువతి(20)ని ప్రేమించాడు. ఏడాదిపాటు సజావుగా సాగిన వీరి ప్రేమయణం చివరకు పెళ్లి పీటల వరకు వెళ్లింది. దీంతో ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకున్నారు. గురువారం తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి సమక్షంలో పెళ్లి జరపనున్నట్లు అందరికి పెళ్లి పత్రికలు పంచారు. ఈ క్రమంలో గురువారం మరి కొద్ది గంటల్లో పెళ్లి జరగాల్సి ఉండగా.. వరుడు అక్కడి నుంచి పరారయ్యాడు. పెళ్లి కూతురు తల్లి వద్ద వేయి రూపాయలు తీసుకొని ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆడపెళ్లి వారు పోలీసులను ఆశ్రయించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. గతంలో ఈ పెళ్లిని పెద్దలు నిరాకరించడంతో యువకుడే ప్రాధేయపడి మరీ యువతి తల్లిదండ్రులను పెళ్లికి ఒప్పించడం కొసమెరుపు. -
ఒకరితో సహజీవనం చేసి, మరొకరితో..
కృష్ణా: మరి కాసేపట్లో పెళ్లి జరగాల్సి ఉండగా.. పెళ్లి కొడుకు తనతో సహజీవనం చేశాడనీ..తనకు న్యాయం చేయాలని మరో మహిళ పెళ్లిని అడ్డుకున్న ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని పెదపారుపాడి మండలం దూలవానిగూడెంలో అనిల్ అనే యువకుడి వివాహం జరుగుతుండగా అంతలోనే అక్కడికి చేరుకున్న ఓ మహిళ పెళ్లికొడుకు అనిల్ తనతో సహజీవనం చేసి ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చాడని ఆరోపించింది. అనిల్ తనకు తెలియకుండా వివాహం చేసుకుంటున్నాడనీ.. ఎలాగైనా తనకు న్యాయం చేయాలని ఆందోళనకు దిగింది. దీంతో పెళ్లికొడుకు అనిల్ పెళ్లి మండపం నుండి ఉడాయించాడు. అనిల్‌తో పెళ్లి ఏర్పాట్లు చేసుకున్న పెళ్లికూతురు తరుపు వారు ఈ ఊహించని పరిణామంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. -
పెళ్లికి ఆహ్వానించి తరిమికొట్టారు
పెళ్లి దుస్తులతో కలెక్టర్‌కు వినతి న్యాయం చేయాలని కన్నీళ్లు పెట్టుకున్న యువతి తిరువళ్లూరు: ప్రేమించి, రిజిస్టర్ వివాహం చేసుకున్న యువకుడితో సంప్రదాయబద్దంగా చెంగాళమ్మ ఆలయంలో పెళ్లి చేస్తామని యువతి, బంధువులను పిలిపించి చితకబాదారనీ ఆరోపిస్తూ ఓ యువతి కలెక్టర్ వీరరాఘవరావును కలిసి వినతి పత్రం సమర్పించింది. ఈ సంఘటన తిరువళ్లూరు కలెక్టర్ కార్యాలయంలో కలకలం సృష్టించింది. తిరువళ్లూరు జిల్లా కొత్తగుమ్మిడిపూండిలోనీ కాళహస్తిగుడి వీధికి చెందిన సంపత్‌కుమార్ ప్రైవేటు కంపెనీలో సూపర్వైజర్గా పని చేస్తున్నాడు. ఇతని కుమార్తె సంగీత (20). ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం మండలం రాశీకండ్రిగకు చెందిన చంద్రశేఖర్ కుమారుడు వివేక్(22). ఇతను ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలోని ఇంజినీరంగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. ఆ సమయంలో సంగీతతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరు ఐదు సంవత్సరాల నుంచి ప్రేమాయాణం కొనసాగించారు. ఈ నేపథ్యంలో సంగీత, వివేక్ గత ఆగస్టు 30న ఇంటి నుంచి వెళ్లిపోయి కొడెకైనాల్లో తలదాచుకున్నారు. వీరిని సెప్టెంబర్ 17న గుర్తించి తల్లిదండ్రులు ఇంటికి తీసుకొచ్చారు. ఆగస్టు 18న గుమ్మడిపూండిలోనీ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్టర్ చేయించారు. అనంతరం అక్టోబర్ 26న శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట చెంగాళమ్మ ఆలయంలో సంప్రదాయబద్ధంగా వివాహం జరిపించాలనీ నిర్ణయించారు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం సంగీత, ఆమె తరఫు బంధువులు వివాహం కోసం ఆలయం వద్దకు వెళ్లారు. అక్కడ పెళ్లి ఏర్పాట్లు కనిపించకపోవడంతో అనుమానం కలిగిన సంగీత బంధువులు వివేక్‌ను, అతని బంధువులను నిలదీశారు. రెండు కుటుంబాల మధ్య వాగ్వాదం పెరిగి, తమపై విచక్షాణారహితంగా దాడి చేశారని ఆరోపిస్తూ సంగీత తన బంధువులు, మహిళా సంఘాల ప్రతినిధులతో వచ్చి కలెక్టర్ వీరరాఘవరావుకు వినతి పత్రం సమర్పించారు. తనను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి శారీరకంగా వాడుకున్నారని, తీరా వివాహం చేసుకోవాలని నిలదీస్తే దాడులు చేస్తున్నారని కలెక్టర్ ఎదుట బోరున విలపించింది. మోసం చేసిన వివేక్‌తో తన పెళ్లి జరిపించడంతోపాటు తన బంధువులపై దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకుని భద్రత కల్పించాలని కలెక్టర్‌కు విన్నవించుకుంది. గ్రీవెన్స్హల్లో బోరున రోదించడంతో చలించిపోయిన కలెక్టర్ యువతికి తక్షణం సాయం చేయాలని గుమ్మిడిపూండి డీఎస్పీ, ఇన్స్పెక్టర్, సాంఘిక సంక్షేమ శాఖా అధికారులను ఆదేశించారు. -
రాత్రికి పెళ్లి.. పెళ్లికొడుకు అదృశ్యం
హైదరాబాద్ : రాత్రి పెళ్లి...ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. బంధువులంతా వచ్చేశారు. ఉదయం నుంచి పెళ్లికొడుకు కనిపించుకుండా పోయాడు. దీంతో వరుడు, వధువు కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. శుక్రవారం గోల్కొండ ఇన్స్పెక్టర్ ఖలీల్ పాష తెలిపిన వివరాల ప్రకారం గోల్కొండ మహ్మదీ లైన్స్ శాతంగనగర్కు చెందిన రహీం అహ్మద్ ఖాన్ స్టోన్ పాలిష్ వర్కర్. ఈ నెల 10వ తేదీ సాయంత్రం టోలీచౌకికి చెందిన యువతితో ఇతనికి నిఖా జరగాల్సి ఉంది. కాగా గురువారం ఉదయం రహీం అహ్మద్ ఖాన్ తాను పని చేసే సైట్‌కు వెళ్తున్నాని ఇంట్లో చెప్పి బైక్‌పై వెళ్లాడు. మధ్యాహ్నం వరకూ అతడు ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు ఫోన్ చేయగా స్విఛ్ఛాప్ వచ్చింది. సాయంత్రం అయినా రహీం తిరిగి రాకపోవటంతో ఇరు కుటుంబాల వారు రహీం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ఆచూకీ దొరకక పోవడంతో గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
వరుడు మూడడుగులు.. వధువు మూడున్నర!
జియ్యమ్మవలస: విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలంలోని బిత్రపాడు గ్రామంలో జరిగిన మూడడుగుల అబ్బాయి, మూడున్నర అడుగుల అమ్మాయి వివాహాన్ని అందరూ ఆసక్తిగా తిలకించారు. గ్రామానికి చెందిన కర్ర గంగరాజు వయస్సు 28 సంవత్సరాలు, 3 అడుగుల పొడవు ఉంటాడు. ఇతనికి తగిన అమ్మాయి కోసం చాలా సంబంధాలు చూశారు. చివరకు ఒడిశా రాష్ట్రం రాయ్‌గఢ్ జిల్లాకు చెందిన దాసరి వీరభద్రుడు, లక్ష్మి దంపతుల కనిష్టపుత్రిక మూడున్నర అడుగుల పొడవున్న సుజాత(21)తో పెళ్లి సంబంధం కుదుర్చుకున్నారు. వీరిద్దరికీ సాలూరుకు చెందిన రెవరెండ్ జోషెప్ క్రిష్టియన్ బుధవారం క్రైస్తవ సంప్రదాయ ప్రకారం వివాహం జరిపించారు. చిన్న పిల్లల్లా కనిపిస్తుండడంతో వీరి వివాహాన్ని స్థానికులు ఆసక్తిగా తిలకించారు. -
అంగరంగ వైభవంగా మంచు మనోజ్-ప్రణతి వివాహం
-
వైభవంగా మనోజ్-ప్రణతి వివాహం
-
వైభవంగా మనోజ్-ప్రణతి వివాహం
-
పల్లకిలో పెళ్లి కూతురు..
-
వైభవంగా మనోజ్-ప్రణతి వివాహం
హైదరాబాద్ : మంచువారి అబ్బాయి ఓ ఇంటివాడయ్యాడు. ప్రముఖ సినీనటుడు మోహన్ బాబు చిన్న కుమారుడు మనోజ్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. మాదాపూర్ హైటెక్స్‌లో బుధవారం ఉదయం 9 గంటల 10 నిమిషాలకు మనోజ్-ప్రణతిల వివాహం సంప్రదాయబద్ధంగా జరిగింది. సరిగ్గా సుముహూర్తం సమయానికి ప్రణతి మెడలో మంచు మనోజ్ తాళి కట్టాడు. సోదరి లక్ష్మీప్రసన్న దగ్గరుండి ఈ తంతును పూర్తిచేయించారు. ఈ వివాహానికి దక్షిణాది చిత్ర పరిశ్రమతో పాటు రాజకీయ ప్రముఖులు, వాణిజ్యవేత్తలు హాజరై నూతన వధువరూలను ఆశీర్వదించారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులు హాజరయ్యారు. మరోవైపు మంచువారి పెళ్లికి భారీ భద్రత ఏర్పాటు చేశారు. అంతకు ముందు మనోజ్‌తో పురోహితులు పూజ చేయించారు. -
పల్లకిలో పెళ్లికూతురు...
హైదరాబాద్ : మాదాపూర్ హైటెక్ సిటీలో మంచువారి పెళ్లి ధూంధాంగా జరుగుతోంది. నూతన వధువు ప్రణతిని పల్లకిలో పెళ్లి వేదికకు తీసుకు వచ్చారు. మరోవైపు మంచు మనోజ్ వివాహానికి తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు తరలి వస్తున్నారు. అతిథులను మంచు విష్ణు దగ్గరుండి రిసీవ్ చేసుకుంటున్నాడు. ప్రముఖ నటుడు బాలకృష్ణ, రాఘవేంద్రరావు, గొల్లపూడి మారుతీరావు, దాసరి నారాయణరావు తదితరులు విచ్చేశారు. -
హైటెక్స్‌లో మంచువారి పెళ్లిసందడి..
హైదరాబాద్ : మంచువారి పెళ్లికి సినీ తారలు తరలి వస్తున్నారు. మంచు మనోజ్-ప్రణతి వివాహం బుధవారం ఉదయం మాదాపూర్ హైటెక్‌లో వైభవంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వివాహానికి సినీ, రాజకీయ, వాణిజ్య ప్రముఖులు తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో కనీవినీ ఎరుగని రీతిలో హైటెక్స్ పరిసరాల్లో భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. -
సంగీత్‌కు 'తారలు' దిగి వచ్చారు
మంచువారి ఇంట్లో జరిగిన మనోజ్ సంగీత్ కార్యక్రమానికి 'తారలు' దిగి వచ్చారు. సంగీత్ కార్యక్రమంలో నాటి తరం నటీనటుల నుంచి నేటి తరం యంగ్ హీరోహీరోయిన్లు స్టెప్స్ వేశారు. కొడుకు పెళ్లి సందడిలో మునిగి తేలుతున్న మోహన్ బాబు కూడా ఉత్సాహంగా నృత్యం చేశారు. ఇక మంచు లక్ష్మి, ఆండ్రీ అయితే ఓ రేంజ్లో డాన్స్ చేసి దుమ్ము రేపారు. వారిద్దరి కలిసి ఓ పాటకు చేసిన డాన్స్ హైలెట్‌గా నిలిచింది. . ఈ నెల 20వ తేదీ బుధవారం ఉదయం 9.10 గంటలకు మనోజ్-ప్రణతి వివాహం జరుగబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన సంగీత్ కార్యక్రమంలో వధువరుల కుటుంబాలతో పాటు పలువురు సినీ తారలు హాజరై సందడి చేశారు. హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్ ఈ వేడుకకు వేదికైంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ సినిమా రంగాలకు చెందిన సినీస్టార్స్ ...మనోజ్ సంగీత్ ఫంక్షన్లో పాల్గొన్నారు. ఈ వేడుకలో కాబోయే వధూవరులు, మోహన్ బాబు తనతో నటించిన హీరోయిన్లు జయసుధ, సుమలత, రవీనా టండన్‌తో కలిసి డాన్స్ చేస్తే... ఇక మంచు విష్ణు, వెరొనికా ఓ తెలుగు పాటకు నృత్యం చేశారు. తమిళ చిత్ర పరిశ్రమ నుంచి హీరో ఆర్య, త్రిష, హన్సికతో పాటు పలువురు హాజరు కాగా, ఇక టాలీవుడ్ యంగ్ యాక్టర్స్ అల్లరి నరేష్, నాని, శ్రీకాంత్, హీరో బాలకృష్ణతో పాటు రాజకీయ నేతలు సుశీల్ కుమార్ షిండే, దానం నాగేందర్, కేవీపీ రామచంద్రరావుతో పాటు పలువురు హాజరయ్యారు. మే 16న మంచు మనోజ్‌ను పెళ్లికొడుకు చేసిన కార్యక్రమం కూడా కుటుంబ సభ్యులు గ్రాండ్‌గా నిర్వహించిన విషయం తెలిసిందే. -
పెళ్లికొడుకు అవుతున్న మరో హీరో
హైదరాబాద్ : టాలీవుడ్లో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. బ్యాచులర్ హీరోలు వరుసగా ఓ ఇంటివారు అవుతున్నారు. మంచు మనోజ్ ఈ నెల 20న ప్రణతి మెడలో మూడు ముళ్లు వేయబోతున్న విషయం తెలిసిందే. అలాగే హీరో అల్లరి నరేష్ కూడా మే 29న ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. తాజాగా 'అందాల రాక్షసి' ఫేమ్ నవీన్ చంద్ర కూడా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఆ సినిమా పెద్దగా హిట్ కాకపోయినా నవీన్ చంద్రకు మాత్రం మంచి గుర్తింపే వచ్చింది. ఇక ఇతగాడు పెద్దలు నిర్ణయించిన యువతిని పెళ్లాడనున్నాడు. వధువు హైదరాబాద్‌కు చెందిన యువతిగా సమాచారం. త్వరలో నిశ్చితార్థం జరగనుందని, అయితే పెళ్లి మాత్రం వచ్చే ఏడాదేనని నవీన్ చంద్ర సన్నిహితులు తెలిపారు. కాగా అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నవీన్ చంద్ర ఓ వైపు తెలుగులో మరోవైపు తమిళ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. పెళ్లి సమయానికి ఆ సినిమాలన్ని పూర్తి చేసుకోవాలనే ప్లాన్‌లో ఉన్నాడు. ప్రస్తుతం స్వాతి ప్రధాన పాత్ర పోషిస్తున్న'త్రిపుర' చిత్రం షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తెలుగు, తమిళంలో రూపొందుతోంది.ఇక తమిళ చిత్రం శివప్పుతో పాటు మరో కోలివుడ్ చిత్రానికి సైన్ చేశాడు. అంతేకాకుండా నవీన్ చంద్ర చేతిలో రెండు, మూడు తెలుగు చిత్రాలు ఉన్నాయి. -
మంచువారి 'పెళ్లికొడుకు'
మంచువారి ఫ్యామిలీ పెళ్లి సందడిలో మునిగితేలుతోంది. ప్రముఖ నటుడు మోహన్ బాబు చిన్న కుమారుడు మనోజ్ ఈ నెల 20న స్నేహితురాలు ప్రణీత మెడలో మూడుముళ్లు వేయబోతున్నాడు. పెళ్లి దగ్గర పడుతుండటంతో ఆ కుటుంబంలో పెళ్లి పనుల్లో తలమునకలై ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే వారింట పెళ్లి సందడి ధూమ్ ధామ్‌గా మొదలైంది. మార్చి 4న మనోజ్-ప్రణితల నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులు గురువారం సొట్ట బుగ్గల చిన్నోడు... మనోజ్‌ను పెళ్లి కొడుకును చేశారు. మనోజ్‌తో కలిసి మోహన్ బాబు ఆయన సతీమణి నిర్మల, విష్ణు, వెరోనిక, లక్ష్మిప్రసన్న, ఆండీ శ్రీనివాస్, విష్ణు ఇద్దరు కూతుళ్లు దిగిన ఫ్యామిలీ ఫోటో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఇక శంషాబాద్‌లోని మోహన్ బాబు నివాసంలో జరిగిన ఈ కార్యక్రమానికి కుటుంబ సన్నిహితులతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. చిరంజీవి,బాలకృష్ణ,రవితేజ, జూనియర్ ఎన్టీఆర్ సతీమణి ప్రణతి,ఊహాతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్. భారతి, శిల్పారెడ్డి తదితరులు విచ్చేసి కాబోయే పెళ్లికొడుకు ఆశీర్వదించారు. కాగా ఈ నెల 17న నగరంలోని ఓ స్టార్ హోటల్లో సంగీత్ నిర్వహించనున్నారు. ఇందుకోసం మంచు ఫ్యామిలీ..ఓ నృత్య దర్శకుడి ఆధ్వర్యంలో రిహార్సిల్ కూడా చేసినట్లు సమాచారం.ఈ సంగీత్ కార్యక్రమానికి మంచు లక్ష్మి యాంకరింగ్ చేయనుంది. -
బీటెక్ చదివిందని అబద్ధం చెప్పారు...
నిజామాబాద్ : తమపై వచ్చిన ఆరోపణలను వరుడు నవదీప్ రాజు తల్లిదండ్రులు ఖండించారు. వధువు ఇంజినీరింగ్ పూర్తి కాలేదనే పెళ్లి రద్దు చేసుకున్నట్లు పెళ్లికూతురు, ఆమె తండ్రి చేస్తున్న ఆరోపణలు వాస్తవం కాదని వారు తెలిపారు. తమ అబ్బాయి ఇంకా అమెరికా నుంచి రాలేదని, డబ్బులు ఎలా డిమాండ్ చేస్తామని నవదీప్ రాజు తల్లిదండ్రులు ప్రశ్నించారు. వధువు బీటెక్ చేసిందని అబద్దం చెప్పారని, తన తండ్రికి నెలనెలా డబ్బులు పంపాలని వధువు బ్లాక్ మెయిల్ చేసిందని వారు ఆరోపించారు. అందుకే వివాహాన్ని మూడు నెలలు వాయిదా వేసినట్లు చెప్పారు. కాగా నిశ్చితార్థ సమయంలో కట్నకానుకలు వద్దని వరుడి కుటుంబ సభ్యులు చెప్పారని వధువు తండ్రి తెలిపారు. పరోక్షంగా రూ.50 లక్షల కట్నాన్ని వరుడి కుటుంబీకులు డిమాండ్ చేశారని, తన కుమార్తె మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసుకుందని ఆయన అన్నారు. -
రెండు రోజుల్లో పెళ్లి, ఆచూకీ లేని వరుడు
రెండు రోజుల్లో పెళ్లి. అయితే అమెరికా నుంచి రావాల్సిన వరుడు మాత్రం రాలేదు. ముహుర్తం దగ్గర పడుతున్నా అమెరికా నుంచి అబ్బాయి రాకపోవడంతో వధువు కుటుంబీకులు ఫోన్ చేశారు. అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో వారిలో కలవరం మొదలైంది. నిశ్చితార్థం జరిగితే సగం పెళ్లి అయినట్లే. అయితే తాళి కట్టాల్సిన వాడు మోసం చేయడంతో వధువు మంగళవారం సాయంత్రం ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ సంఘటన హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుంది. వివరాల్లోకి వెళితే నిజామాబాద్‌కు చెందిన సాప్ట్వేర్ ఇంజనీర్ నవదీప్ రాజు, హైదరాబాద్ ఎస్ఆర్ నగర్‌కు చెందిన ఓ యువతితో నిశ్చితార్ధం చేసుకున్నాడు. అతని సూచన మేరకు, మే 14వ తేదీ పెళ్లి ముహుర్తం పెట్టుకున్నారు. నిశ్చితార్ధం అయిపోయిన తరువాత ఉద్యోగం నిమిత్తం నవదీప్ రాజు అమెరికాకు వెళ్లిపోయాడు. పెళ్లి ముహుర్తం దగ్గర పడుతుండటంతో అమ్మాయి ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది.. అమెరికా నుంచి రావాల్సినోడు ఇంకా రాకపోవడంతో .. పెళ్లిపీటలు ఎక్కాల్సిన అమ్మాయిలో టెన్షన్ మొదలైంది. మరో వైపు కూతురు పెళ్లి ఘనంగా చేయాలనుకున్న ఆ తండ్రి గచ్చిబౌలిలోని ఓ ఫంక్షన్ హాల్లో కళ్లు చెదిరేలా గ్రాండ్‌గా ఏర్పాట్లు చేశాడు. అమెరికాలో ఉంటున్న అల్లుడు రాక కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూశాడు. ఈ క్రమంలోనే వధువు ..కాబోయే భర్త కు ఫోన్ చేసింది.ఈ నేపథ్యంలో అతడి ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో కట్టుకోవాల్సినోడు మోసం చేశాడని నమ్మిన ఆ వధువు సూసైడ్ లేఖ రాసి.., ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మరోవైపు పెళ్లిపీటలు ఎక్కాల్సిన అమ్మాయి ..ఆస్పత్రి పాలుకావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. రూ. 50 లక్షల రూపాయల వరకు వసూలు చేసి చివరి నిమిషం లో మోసం చేశాడని ఆరోపిస్తున్నారు. కాగా నవదీప్ రాజుకు మరో యువతితో సన్నిహిత సంబంధం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. -
కాసేపట్లో పెళ్లి... ప్రియురాలితో వరుడు జంప్
కామేపల్లి(ఖమ్మం): కాసేపట్లో పెళ్లి..కల్యాణ మండపం..బాజాభజంత్రీలు.. బంధుమిత్ర పరివారంతో అమ్మాయి ఇంట్లో హడావుడి..ఇంతలోనే షాక్. తన ప్రియురాలితో కలిసి పెళ్లి కొడుకు పరారయ్యాడన్న సమాచారం వధువు ఇంటికి చేరింది. దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ తిన్నారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం గరిడేపల్లిలో బుధవారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి... గరిడేపల్లికి చెందిన భూక్యా మౌనికకు వరంగల్ జిల్లా కొరవి మండలం ఉప్పరిగూడెం పంచాయతీ మంజ్యాతండాకు చెందిన మాళోత్ శ్రీనివాస్‌తో పది రోజుల క్రితం వివాహం నిశ్చయమైంది. వరకట్నంగా వరుడి కుటుంబసభ్యులు రూ.4 లక్షలు మాట్లాడుకున్నారు. దీనిలో రూ.3 లక్షలు వివాహానికి ముందే వధువు తల్లిదండ్రులు ముట్టజెప్పారు. బుధవారం ఉదయం 9.30 గంటలకు పెళ్లి జరగాల్సి ఉంది. వరుడు తెల్లవారుజామునే వధువు ఇంటికి రావాల్సి ఉంది. కానీ రాలేదు. ఆరా తీయగా ప్రేమించిన అమ్మాయితో పెళ్లికొడుకు పరారయ్యాడని వధువు కుటుంబానికి తెలిసింది. ఈ విషయం తెలిసిన వధువు కుటుంబసభ్యులు వరుడిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. -
కట్నంతో వరుడు జంప్!
-
కాసేపట్లో పెళ్లి అనగా.. కట్నంతో వరుడు జంప్!
విజయవాడ: కాసేపట్లో పెళ్లి అనగా ఓ వరుడు కట్నం తీసుకుని ఉడాయించాడు. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం విజయవాడలో చోటుచేసుకుంది. విజయవాడ పడమట ప్రాంతానికి చెందిన యువతితో ఖమ్మం జిల్లాకు చెందిన శ్రీకాంత్‌కు ఈ రోజు మధ్యాహ్నం వివాహం జరగాల్సి ఉంది. అయితే కట్నం రూ.1.25వేలు తీసుకుని శ్రీకాంత్ పత్తా లేకుండా పోయాడు. ఎంత సేపటికి వివాహ వేదిక దగ్గరకు పెళ్లి కొడుకు రాకపోవడంతో అనుమానం వచ్చి వరుడు కుటుంబ సభ్యులను పెళ్లి కుమార్తె తరపు వారు నిలదీయగా శ్రీకాంత్ పరరాయ్యడు అని తెలిపారు. వధువు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు శ్రీకాంత్ కుటంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. -
వరుడికి ఎయిడ్స్... ఆగిన రెండో పెళ్లి
పీటలపై ఆగిన పెళ్లి - ఎయిడ్స్‌తో రెండో పెళ్లికి సిద్ధమైన వరుడు - ఖాకీల రంగప్రవేశం.. వరుడికి పరీక్షలు - హెచ్ఐవీ ఉన్నట్లు నివేదిక హసన్‌పర్తి : ముహూర్తం ఉదయం 10 గంటలకు.. పెళ్లి పనులు చకచకా జరిగిపోతున్నారుు.. ఇంతలోనే పోలీసుల రంగప్రవేశం.. వరుడిని వాహనంలో ఎక్కించుకుని వెళ్లి న పోలీసులు.. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు విషయం ఏమిటని అడిగినా సమాధానం రాని పరిస్థితి. హసన్‌పర్తి మండలం మడిపల్లికి చెంది న ఓ యువకుడికి హుస్నాబాద్ మండలం తౌళ్లపల్లికి చెందిన ఓ యువతితో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. కొంతకాలం వారి దాంపత్యం జీవితం సవ్యంగానే సాగింది. మూడేళ్లుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతుండగా వివిధ ప్రాంతాల్లో వైద్యం చేయించారు. చివరికి ఆమెకు హెచ్ఐవీ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో భర్త కూడా పరీక్షలు చేరుుంచుకున్నాడు. అయితే అతడికి హెచ్ఐవీ(నెగటివ్) ఉన్నట్లు రిపోర్ట్ వచ్చింది. భార్య అనారోగ్యంతో బాధపడుతుండగా ఇరువర్గాలకు చెందిన కుటుంబ సభ్యులు అతడికి మరో పెళ్లి చేయాలని నిర్ణయించారు. రెండో పెళ్లి చేసుకున్నట్లయితే మొదటి భార్యకు రూ.50వేలు డిపాజిట్ చేయాలని నిర్ణయించారు. మడిపల్లికి చెందిన అమ్మాయితోనే... ఇదిలా ఉండగా, మడిపల్లికి చెందిన అమ్మాయితోనే రెండో పెళ్లికి సిద్ధమయ్యూడు. కాగా, బుధవారం ఉదయం 10 గంటలకు పెళ్లి ముహూర్తం ఉండగా, ఉదయం 7.15గంటలకు పోలీసులకు ఫోన్ వచ్చింది. అటు వైపు నుంచి ఓ వ్యక్తి మాట్లాడుతూ సార్.. మడిపల్లిలో ఫలాన యువకుడికి ఎయిడ్స్ ఉంది.. ఉదయం 10 గంటలకు పెళ్లి ముహూర్తం.. మీరు వెళితే... ఓ యువతి జీవితం నాశనం కాకుం డా ఉంటుందని ఫోన్ పెట్టేశాడు. స్థానిక ఎస్సై రవికిరణ్ సమాచారాన్ని సీఐ రఘుచందర్‌కు చేరవేశారు. దీంతో పోలీసులు మడిపల్లికి వెళ్లి వరుడిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. కాగా, వరుడిని వైద్య పరీక్షల నిమిత్తం ఓ డయాగ్నస్టిక్ సెంటర్‌కు పంపించారు. సుమారు రెండు గంటల తర్వాత నివేదిక ఎస్సై చేతికి అందింది. దీంతో ఆయన స్థానిక వైద్యులకు దానిని చూపించగా.. వారు హెచ్ఐవీ ఉన్నట్లు చెప్పారు. దీనిపై పోలీసులు కరుణ మైత్రి స్వచ్ఛంద వారికి సమాచారం అందించారు. వారు మడిపల్లికి వెళ్లి బాధిత కుటుంబాలకు కౌన్సెలింగ్ నిర్వహించారు. -
నిశ్చితార్థం జరిగిన తర్వాత పెళ్లి వద్దన్నాడు
కరీంనగర్ : తమకు కాబోయే అల్లుడు ప్రభుత్వ ఉద్యోగి అని, రూ.10లక్షల కట్నం ఇవ్వడానికి ఒప్పుకుని నిశ్చితార్థం చేశారు అమ్మాయి తల్లిదండ్రులు. వచ్చే నెల మే 2వ తేదీన వివాహం చేయడానికి పెళ్లి కుమార్తె తరపు వారు ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో.. పెళ్లి కుమారుడు ఈ వివాహం తనకు ఇష్టం లేదని వర్తమానం పంపించాడు. ఇదేంటని అడిగితే.. ఇంకా కట్నం కావాలని అతడి కుటుంబసభ్యులు... పెళ్లి కుమార్తె తల్లిదండ్రులను డిమాండ్ చేస్తున్నారు. దీంతో బాధితురాలు తనకు కాబోయే భర్త ఇంటి ముందు బంధువులతో కలిసి బైఠాయించింది. బాధితురాలు కథనం ప్రకారం.. కరీంనగర్ మండలం చింతకుంటకు చెందిన అప్పాల రాజిరెడ్డి రెండో కూతురు బీటెక్ చదివింది. ఆమెకు చొప్పదండి మండలం రుక్మాపూర్‌కు చెందిన ఎ.సందీప్‌కుమార్‌తో వివాహం నిశ్చయమైంది. సందీప్ తన కుటుంబంతో కరీంనగర్‌లోని సప్తగిరికాలనీకి నివాసం ఉంటున్నాడు. ఇతడు కరీంనగర్ వ్యవసాయ మార్కెట్లో యూడీసీగా పని చేస్తున్నాడు. ప్రభుత్వం ఉద్యోగం కావడంతో కట్నం కింద రూ.పది లక్షలు కావాలని డిమాండ్ చేయగా అందుకు అమ్మాయి కుటుంబసభ్యులు ఒప్పుకున్నారు. మార్చి 22న ఘనంగా ఎంగేజ్మెంట్ చేశారు. అదే రోజు వరకట్నం కింది రూ.5 లక్షలు, బంగారం కోసం మరో రూ.2లక్షల ముట్టచెప్పారు. మే 2న వివాహం జరిపించడానికి లగ్నపత్రిక రాసుకున్నారు. పది రోజుల్లో పెళ్లి పెట్టుకుని సందీప్‌కుమార్ అమ్మాయిని వివాహం చేసుకోవడం ఇష్టం లేదని మధ్యవర్తుల ద్వారా ఆమె తల్లిదండ్రులకు సమాచారం పంపించాడు. అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి బంధువులను నిలదీయగా ప్రభుత్వం ఉద్యోగం కాబట్టి తమకు ఇంకా కట్నం కావాలంటున్నారు. దీంతో అమ్మాయి, తల్లిదండ్రులు, బంధువులు మహిళా సంఘాల సహకారంతో బుధవారం సందీప్‌కుమార్ ఇంటి ముందు ధర్నా చేపట్టారు. పోలీసులు రెండు కుటుంబాల వారిని ఠాణాకు తరలించారు. -
నిత్య పెళ్లికొడుకు కోసం గాలింపు
బంజారాహిల్స్ (హైదరాబాద్): మరో పది రోజుల్లో పెళ్లి జరగాల్సిన యువతిని ప్రేమ పేరుతో ప్రలోభపెట్టి ఓ యువకుడు తీసుకెళ్లిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కార్మికనగర్‌లో నివసించే సయ్యద్ నిసార్ సొహైల్(27) మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన సొహైల్ రెండో భార్యను వదిలేసి ఇటీవలే మూడో పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఆమె గర్భవతి. కాగా, సొహైల్ ప్రేమ పేరుతో అదే ప్రాంతానికి చెందిన ఓ బీటెక్ విద్యార్థిని(23)తో సన్నిహితంగా మెలుగుతున్నాడు. అయితే, ఆ యువతికి వచ్చే నెల 1న పెళ్లి నిర్వహించేందుకు పెద్దలు నిశ్చయించారు. ఈ లోపే సొహైల్, ఆ యువతి ఈ నెల 17వ తేదీ నుంచి కనిపించకుండా పోయారు. దీంతో ఆ యువతి తల్లిదండ్రులు తమ కూతురు కనిపించడం లేదంటూ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, సొహైల్‌పై మూడు దొంగతనం కేసులు నమోదై ఉన్నాయని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అతడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో పెళ్లికొడుకు సహా ఇద్దరు మృతి
వైఎస్ఆర్ జిల్లా: శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్న నవ వధువరుల బృందం ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురై పెళ్లికుమారుడు మరణించిన విషాద సంఘటన మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాలు.. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం అచ్చంపేట గ్రామానికి చెందిన వెంకట ప్రసాద్(27)కు అదే మండలానికి చెందిన లక్ష్మిస్వాతి(19)తో సోమవారం ఉదయం వివాహమైంది. వివాహానంతరం స్వామివారి ఆశిస్సుల కోసం తిరుమలకు వెళ్లాలని నిర్ణయించుకున్న వాళ్లు తూఫాన్ వాహనంలో సోమవారం రాత్రి బయలుదేరారు. వాహనం మంగళవారం తెల్లవారుజామున కాజీపేట మండలం చెన్నముక్కపల్లె సమీపంలో రోడ్డు పక్కన నిలిపిఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో తూఫాన్లో ప్రయాణిస్తున్న పెళ్లి కొడుకు వెంకట ప్రసాద్‌తో పాటు అతని బంధువు నర్సమ్మ(50) అక్కడికక్కడే మృతిచెందారు. వాహనంలో ఉన్న మిగతా పదిమందికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను 108 సహయంతో కర్నూలు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పెళ్లి కూతురు లక్ష్మిస్వాతితో పాటు మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. -
నిత్య పెళ్లికొడుకు...!
చాంద్రాయణగుట్ట: ఒకరికి తెలియకుండా మరొకరిని.. ఇలా మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఓ నిత్యపెళ్లికొడుకు ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆ మోసగాడిని ఫలక్‌నుమా పోలీసులు అరెస్ట్ చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు. ఇన్స్పెక్టర్ ఎం.సురేందర్ గౌడ్ కథనం ప్రకారం... నిజామాబాద్ జిల్లా బిక్నూర్ ప్రాంతానికి చెందిన రహ్మత్ పాషా (29) ఏసీ మెకానిక్. కాగా ఇతడు 2006లో సంతోష్‌నగర్‌లోని ఒవైసీ ఆసుపత్రిలో నర్సుగా పనిచేసే షాయిన్సుల్తానాను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి కుమారుడు జన్మించాడు. అనంతరం రహ్మత్ పాషా... శాలిబండలోని ఓ కాలేజీలో ఇంటర్ చదువుతున్న పర్వీన్‌బేగం వెంట ప్రేమిస్తున్నానని పడ్డాడు. మొదటి భార్యకు తెలియకుండా పర్వీన్‌ను రెండో పెళ్లి చేసుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత ఫలక్‌నుమాలో ఇంటర్ ఒకేషనల్ కోర్సు చేస్తున్న చాంద్రాయణగుట్టకు చెందిన ఆసియా బేగం (26)కు ప్రేమ పేరుతో వల వేసి మూడో పెళ్లి చేసుకున్నాడు. ఇంట్లో నుంచి వచ్చిన సమయంలో ఆసియా బేగం 7 తులాల బంగారం, రూ. 10 వేలు తీసుకొచ్చింది. నగలు, డబ్బులు తీసుకొని ఈమెతో నిజామాబాద్‌లోని బిక్నూరులో కాపురం పెట్టాడు. కాగా, ఈనెల 15న రహ్మత్ పాషా మూడో భార్యతో కలిసి తీగలకుంటలోని రెండో భార్య వద్దకు వచ్చాడు. ఆసియా బేగం తన చెల్లెలు అని చెప్పి నమ్మించాడు. ఇలా ఇద్దరి భార్యలకు ఒకరి విషయం మరొకరికి తెలియనీయకుండా జాగ్రత్త పడ్డాడు. అయినప్పటికీ అనుమానం వచ్చిన ఆసియా కూపీ లాగడంతో అసలు విషయం వెల్లడైంది. దీంతో ఆసియా బేగం తండ్రి అబ్దుల్ అజీజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇదిలాఉండగా.. నిందితుడు రహ్మత్ పాషా వివాహ సమయంలో పెద్దల సమక్షంలో నిఖా జరిపినప్పటికీ తాము ఇష్ట పూర్వకంగానే పెళ్లి చేసుకుంటున్నట్లు అంగీకార పత్రాలు కూడా రాయించుకోవడం కొసమెరుపు. -
పెళ్ళైన ఆరు గంటలకే.. పరారయ్యాడు!
-
కొద్ది గంటల్లోనే పెళ్లి... వరుడు ఆత్మహత్య
గుంటూరు: మరికొద్ది గంటల్లో శుభకార్యం జరగనున్న పెళ్లింట్లో విషాదం చోటుచేసుకుంది. కోరుకున్నట్లుగా కాకుండా సాధారణ రీతిలో వివాహం జరిపిస్తున్నారని మనస్తాపానికి గురైన పెళ్లికొడుకు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. స్నేహితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి... పెళ్లి కుమారుడు ఏసుబాబు గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం వేములాయపాడు గ్రామానికి చెందినవాడు. తన అక్క కూతురితో ఏసుబాబుకు వివాహాన్ని నిశ్చయించారు. ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ఏసుబాబు తన మేనకోడలిని వివాహం చేసుకోవాల్సి ఉండగా... పెళ్లి ఏర్పాట్లు సాధారణంగా ఉండటంతో తీవ్ర మనస్తాపనానికి గురయ్యాడు. ఏసుబాబు కోరుకున్నట్లుగా వైభవంగా కాకుండా సాధరణ రీతిలో వివాహ ఏర్పాట్లు ఉన్నాయని ఆదివారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంతకు మించి పెద్ద కారణాలేవి కనిపించటం లేదని పెళ్లి కుమారుడి స్నేహితులు తెలిపారు. ఏసుబాబు ఆత్మహత్య చేసుకోవడంతో ఆ రెండు కుటుంబాలు కన్నీరుమన్నీరయ్యాయి. మరికొద్ది గంటల్లో శుభకార్యం ఉండగా ఈ విషాదం చోటుచేసుకోవడంతో రెండు కుటుంబాలతో పాటు బంధువులు ఈ వాస్తవాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. -
కాసేపట్లో పెళ్లనగా.. వరుడు పరార్
చక్రం సినిమాలో హీరో ప్రభాస్ మరికాసేపట్లో పెళ్లనగా మండపం నుంచి పారిపోతాడు. సరిగ్గా అలాంటి సన్నివేశం తూర్పుగోదావరి జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. ప్రభాస్ వ్యాధి కారణంగా వెళ్లిపోతే ఇక్కడ పెళ్లికొడుకు మాత్రం అందుకు పూర్తి విరుద్ధం... కట్నం డబ్బులు 3 లక్షల రూపాయలతో ఉడాయించాడు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా కాకినాడ అచ్యుతాపురం అంబేద్కర్ కాలనీలో జరిగింది. మరికాసేపట్లో తమ బాధ్యతలు తీరుతాయని ఆశగా చూస్తున్న వధువు తల్లిదండ్రులకు మాత్రం ఈ ఘటన తీవ్ర దు:ఖాన్ని నింపింది. కూతురి పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోయినందుకు వదువు తల్లిదండ్రులకు ఏం చేయాలో తోచడం లేదు. పెళ్లికొడుకు ఎందుకు పారిపోయాడు, అందుకు సంబంధించిన కారణాలు ఏంటన్నది వధువు బంధువులకు అర్థం కావడం లేదు. -
తెల్లవారితే పెళ్లి...వరుడు ఆత్మహత్య
వేల్పూర్ (నిజామాబాద్): తెల్లవారితే పెళ్లి... అందరూ పెళ్లిపనుల్లో నిమగ్నమైయ్యారు. ఇంతలో పిడుగులాంటి వార్త.. పెళ్లి చేసుకుని కొత్తజీవితాన్ని ఆరంభించాల్సిన వరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఎన్నో ఆశలతో సంతోషంగా ఉన్న ఆ ఇంట ఒక్కసారిగా విషాదం అలుముకుంది. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం అమీనాపూర్ గ్రామంలో గురువారం జరిగింది. వివరాలు.. శేఖ్ షాబుద్దిన్, ఖాజా దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. చిన్నవాడైన శేఖ్ హమీద్‌కు ఇటీవల నవీపేట మండలం బినోల గ్రామానికి చెందిన యువతితో పెళ్లి నిశ్చయించారు. గురువారం ఉదయం 11.30కు బినోలలో పెళ్లి జరగాల్సి ఉంది. అంతలో పెళ్లి కొడుకు హమీద్ (24) పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం ఐదు గంటలకు కుటుంబం, బంధువులు బినోల గ్రామానికి వెళ్లడానికి సిద్ధమయ్యారు. హమీద్ కనిపించలేదు. చుట్టుపక్కల వెదికినా జాడలేదు. దీంతో అనుమానం వచ్చి తమ సొంత వ్యవసాయక్ష్రేతంలో వెదకడంతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ కనిపించాడు. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే మర ణించాడు. హమీద్ ఏడేళ్లుగా ఉపాధి కోసం దుబాయికి వెళ్లి వస్తున్నాడు. నాటుగు నెలల కిందటే ఇంటికి రాగా, తల్లిదండ్రులు అతనికి పెళ్లి నిశ్చయించారు. అంతలోనే అతను ఆత్మహత్మకు పాల్పడ డంతో కుటుంబ సభ్యులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. హమీద్ ప్రవర్తన దురుసుగా ఉండేదని, ఇదే నెలలో రెండుసార్లు ఉరి వేసుకొని ఆత్మహత్యకు యత్నించాడని కుటుంబీకులు చెప్పారు. ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
'విచారణకు ముందే మాళవిక విషం తాగింది'
హైదరాబాద్ : సీసీఎస్ కార్యాలయంలో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాంతో ఆమెను పోలీసులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే ఎన్ఆర్ఐని మోసం చేసిన కేసులో మాళవిక అనే మహిళను నిన్న పోలీసులు విచారిస్తున్నారు. అయితే పోలీసులు విచారిస్తుండగానే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఈ విషయాన్ని గమనించిన పోలీసులు మాళవికను హుటాహుటీన చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చారు. ఆమె విషం తాగినట్లు వైద్యులు వెల్లడించారు. కాగా వెబ్సైట్లో వరుడు కావాలని ప్రకటనలు ఇస్తూ మాళవిక మోసాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఓ ఎన్ఆర్ఐని ఆమె మోసం చేయటంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ వ్యవహారంపై సీసీఎస్ డీసీపీ పాలరాజు మాట్లాడుతూ విచారణకు ముందే మాళవిక విషం తాగి సీసీఎస్‌కు వచ్చినట్లు తెలిపారు. ఆమో వద్ద సూసైడ్ నోట్ లభించినట్లు ఆయన పేర్కొన్నారు. కాగా ఓ ఎన్ఆర్ఐని మోసం చేసినట్లు ఫిర్యాదు అందిన నేపథ్యంలో మాళవికను విచారణకు పిలిచినట్లు డీసీపీ చెప్పారు. -
తుళ్లూరు వధూవరులకు భలే డిమాండ్
*ఫొటోలతో తిరుగుతున్న మ్యారేజ్ బ్యూరోలు *చదువు లేకపోయినా.. ఆస్తి ఉంటే చాలు.. విజయవాడ : రాజధాని తుళ్లూరు అంటే మాటలా.. ఎన్నో వింతలు, విశేషాలు ఒకవైపు.. రియల్టర్లు, భూ యజమానులు, రైతుల హడావుడి మరోవైపైతే.. తాజాగా మ్యారేజ్ బ్రోకర్ల హవా కూడా ఇక్కడ నడుస్తోంది. ఒకప్పుడు తుళ్లూరులో పెళ్లి సంబంధమంటేనే.. ‘ఆ.. పెద్దగా చదువుకోరు ఏం అవసరం లేదులే..’ అనుకున్న పెళ్లి పెద్దలు ఇప్పుడు ఎగిరి గంతేసి మరీ ఒప్పుకొంటున్నారు. బ్రోకర్లకు ఫొటోలిచ్చి సంబంధం చూడమంటున్నారు. చదువు లేకపోయినా.. ఆస్తి తప్పనిసరి.. ఒకప్పుడు తుళ్లూరు సంబంధం అంటేనే వెనక్కి తగ్గేవారని, రాజధాని ప్రభావంతో ఇప్పుడు ఆ పరిస్థితి మారిందని గుంటూరులోని మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులు చెబుతున్నారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచే కాకుండా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి కూడా సంబంధాల కోసం వస్తున్నారంటున్నారు. నాలుగైదు ఎకరాల భూమి ఉన్న కుర్రాడికి చదువు లేకపోయినా చాలు తమ కుమార్తెను ఇవ్వడానికి తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తున్నారు. విజయవాడ, గుంటూరులో ఐదారు ఇళ్లు ఉన్న యజమానుల కంటే.. తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో రెండు మూడు ఎకరాల భూమి ఉన్న వారికి సంబంధం చూడటం సులభంగా ఉందని గుంటూరు పండరీపురం ఏరియాలోని ఒక మ్యారేజ్ లింక్స్ నిర్వాహకురాలు చెబుతున్నారు. బీటెక్ సంబంధాలున్నాయా..? రాజధాని ప్రభావం తుళ్లూరు రైతులపై బాగానే పడింది. గతంలో తమ కుమారుడికి మధ్య తరగతి ఆడపిల్లను ఇచ్చి పెళ్లి చేసేందుకు ఇష్టపడేవారు. ఇప్పుడు వరుడికి చదువు లేకపోయినా.. వధువు మాత్రం తప్పనిసరిగా బీటెక్ చదివి ఉండాలని ఆంక్షలు పెట్టడం విశేషం. ఇక ఇటీవల ముగిసిన మ్యారేజ్ సీజన్లో తుళ్లూరులో జరిగిన వివాహాలు చూస్తే ఔరా..! అనక మానరు. ఒకప్పుడు సాదాసీదాగా ఉన్న రైతులు లక్షలు ఖర్చుపెట్టి వివాహాలు జరిపించారు. ఆడపిల్లల తండ్రులు పెద్ద మొత్తంలో కట్నాలు సమర్పించడమే కాకుండా భారీగా, హుందాగా వివాహాలు చేస్తున్నారు. -
రూ. 2కోట్లు ఇస్తేనే పెళ్లి చేసుకుంటా..
* పోలీస్ అధికారికే కట్న వేధింపులు *పెళ్లికొడుకు కుటుంబంపై ఫిర్యాదు విశాఖపట్నం: 'ఐస్ ఫ్యాక్టరీ పెట్టాలి... రూ. రెండు కోట్లు కట్నం, కేజీ బంగారం, అయిదు కేజీల వెండి ఇవ్వండి... ఇవి ఇస్తేనే వివాహం... లేదంటే మీ అమ్మాయిని వివాహం చేసుకోను... ప్రభుత్వం మాది..మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి...'అంటూ వివాహాన్ని ఆపేశాడో ప్రబుద్ధుడు. కుమార్తె వివాహం చేయడానికి కార్డులు పంచి, లక్షలు ఖర్చు పెట్టి నిశ్చితార్థ వేడుకలు చేసిన ఓ పోలీస్ ఉన్నతాధికారికే వేదనను మిగిల్చాడు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలివి. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురానికి చెందిన పసల పర్వేశ్ విశాఖనగరం పెందుర్తిలోని ఓ రొయ్యల కంపెనీలో పని చేస్తున్నాడు. ఎంవీపీకాలనీలో నివాసముంటున్న ఓ పోలీసు ఉన్నతాధికారి కుమార్తెతో పర్వేశ్‌కు పరిచయం ఏర్పడింది. ఆమె డెంటల్ విద్య చదువుతోంది. ఇరు కుటుంబాలు వివాహానికి అంగీకరించాయి. ఆడపడుచు కట్నం కింద ముందుగానే పర్వేశ్ కుటుంబ సభ్యులు రూ.పది లక్షలు తీసుకున్నారు. తర్వాత ఆగస్టులో విశాఖలోని ఆఫీసర్స్ క్లబ్లో నిశ్చితార్థం జరిగింది. డిసెంబర్ 12న వివాహ ముహర్తం పెట్టుకున్నారు. అయితే పర్వేశ్ పని చేస్తున్న సంస్థకు ఐస్ అవసరం ఉంది. దీంతో సొంతంగా ఐస్ ఫ్యాక్టరీ పెట్టాలని భావించాడు. వధువు తండ్రి పోలీస్ ఉన్నతాధికారి కావడంతో కట్నం కింద రూ.రెండు కోట్లు కావాలని డిమాండ్ చేశాడు. అంత మొత్తం ఇచ్చుకోలేమని చెప్పడంతో మీ అమ్మాయిని వివాహం చేసుకోనని చెప్పాడు. ప్రభుత్వం మాది... మీరేం చేసుకుంటారో చేసుకోండని చెప్పడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పర్వేశ్ స్నేహితుడైన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే కుమారుడు కూడా బెదిరిస్తున్నాడని బాధితులు వాపోయారు. వివాహాన్ని నిలిపేయడంతో వధువు తల్లిదండ్రులు పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. ఆమేరకు కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. నిందితుడిని పట్టుకోవడానికి ఒక పోలీస్ బృందం గాలిస్తోందని తెలిపారు. -
హైదరాబాద్ చేరుకున్న ఆయుష్ శర్మ
-
పదిలక్షలతో పెళ్లికొడుకు జంప్!
నూజివీడు: ఏడడుగులేసి మూడు రోజుల కాకముందే పెళ్లి కొడుకు పరారైన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కృష్ణాజిల్లా నూజివీడులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం గత మూడు రోజుల క్రితమే పెళ్ల ఓ జంటకు పెళ్లైంది. అయితే పది లక్షల కట్నంతో పెళ్లి కొడుకు పరారయ్యాడు. పెళ్లి కూతురు కుటుంబం ఫిర్యాదు చేశారు అని పోలీసు తెలిపారు. పెళ్లి కూతురు తల్లి తండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పెళ్లికొడుకు గురించి గాలింపు చేపట్టారు. -
నిశ్చితార్థం మధ్యలోనే ఉడాయించాడు
హైదరాబాద్ : నిశ్చితార్థం మధ్యలోనే పెళ్లికొడుకు ఉడాయించాడు. బంజారాహిల్స్ పోలీసుస్టేషన్ పరిధిలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం... టోలిచౌక్ నివాసి మహ్మద్ అబ్దుల్ రవూఫ్ తన కూతురుకు మలక్‌పేటకు చెందిన షౌకత్‌తో జూన్ 15న స్థానిక నజీర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేశాడు. వేడుక జరుగుతుండగానే షౌకత్‌కు ఎవరి నుంచో ఫోన్ కాల్ వచ్చింది. దీంతో ఎవరికీ చెప్పకుండానే నిశ్చితార్థం మధ్యలోంచి షౌకత్ వెళ్లిపోయాడు. అప్పటి నుంచి పెళ్లికి నిరాకరిస్తున్నాడు. దీంతో తమ పరువు ప్రతిష్టలకు భంగం కల్గించడంతో పాటు నిశ్చితార్థం పేరుతో తమతో భారీగా ఖర్చు చేయించిన షౌకత్‌పై చర్యలు తీసుకోవాలని అబ్దుల్వ్రూఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బంజారాహిల్స్ పోలీసులు షౌకత్‌పై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమించాడు 'గోవింద'... పెళ్లంటే గోవిందా...
విజయనగరం (మక్కువ) : ‘ప్రేమించానన్నాడు. ప్రేమ పేరుతో లొంగదీసుకున్నాడు. పెద్దల సమక్షంలో నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు. కట్నం పేరుతో ఇప్పుడు అడ్డం తిరిగాడు. కట్నం కింద రూ.పది లక్షలు, భూమిని రాసిస్తేనే పెళ్లి చేసుకుంటానంటున్నాడు’ అంటూ మండల కేంద్రం మక్కువలోని గుళ్లమజ్జివీధికి చెందిన ఉషారాణి వాపోయింది. సోమవారం తన తల్లిదండ్రులు కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు. తాను విజయనగరంలో కంప్యూటర్ కోర్సులో కోచింగ్ తీసుకుంటుండగా రామభద్రపురం మండలం తారాపురం గ్రామానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ తుమరాడ గోవిందతో ఏడాదిన్నర కిందట పరిచయమైందని చెప్పిం ది. గత ఏడాది డిసెంబర్ 8న రైల్వే పరీక్షలను రాసేందుకు విశాఖపట్నంలో వెళ్లగా గోవింద కూడా తనతో వచ్చాడని, అనంతరం విజయనగరం తీసుకెళ్లి కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి లొంగదీసుకున్నాడని తెలిపింది. ఈ ఏడాది జూన్ 22న గోవింద తన కుటుంబ సభ్యులను తన ఇంటికి తీసుకొచ్చి నిశ్చితార్థం చేసుకున్నాడని, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో తన తల్లిదండ్రులు లక్ష రూపాయల అడ్వాన్సు కూడా అందించాని ఉషారాణి తెలిపింది. ఇంతలో గోవింద పెళ్లి ఇష్టం లేదని, నీకన్నా అందమైన అమ్మాయి, కట్నం అధికంగా ఇచ్చే వారు ఉన్నారని వేధించసాగాడని వాపోయింది. రూ.10 లక్షలకట్నం, తన పేరున ఉన్న భూమిని ఇస్తేనే పెళ్లిచేసుకుంటానని వేధించేవాడని ఆవేదన వ్యక్తం చేసింది. గోవిందపై కేసు నమోదు చేయవద్దని, తనతో వివాహం చేస్తే చాలని ఉషారాణి విజ్ఞప్తి చేసింది. ఇదే విషయమై ఈ నెల 4న విజయనగరంలో ఎస్పీ నిర్వహించిన గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చే యగా ఆ సమయంలో ఎస్పీ బయటకు వెళ్లారని తెలిపింది. దీంతో ఈ నెల 18న మళ్లీ గ్రీవెన్స్‌లో ఎస్పీకు ఫిర్యాదు చేయడంతో మక్కువ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని అక్కడ అధికారులు తెలిపినట్లు ఆమె వివరించింది. ఈ నెల 22న మక్కువ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సమస్య వివరించింది. కాగా, సోమవారం సాలూరు సీఐ దేముళ్లు మక్కువ పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని విచారణ చేపట్టారు. -
పెళ్లికాని ప్రసాదులకు పెండ్లాములు కావలెను!
మగపిల్లాడే కావాలి. ఆడపిల్ల వద్దే వద్దన్న హర్యానా ఇప్పుడు కష్టాల్లో పడింది. అక్కడ మగమహారాజులకు పెళ్లాడేందుకు ఆడపిల్లలు కరువయ్యారు. ఎదురు డబ్బులిద్దామన్నా అమ్మాయిలు దొరకడం లేదు. దాంతో హర్యానా యువకులు అమ్మాయిల కోసం ఎక్కడంటే అక్కడ వెతకడం మొదలుపెట్టారు. పెళ్లికాని ప్రసాదుల సంఖ్య నానాటికీ పెరిగిపోతూండటంతో రాజకీయులు దాన్ని కూడా ఓ ఇష్యూగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. హర్యానా బిజెపి నేత, జాతీయ బిజెపి కిసాన్ మోర్చా అధ్యక్షులు ఓ పీ ధన్ కడ్ ఒకడుగు ముందుకు వేసి 'పెళ్లి కాని ప్రసాదులూ... చింతించకండి. బీహార్ నుంచి అమ్మాయిల్ని తెచ్చి మీకు పెళ్లి చేయిస్తాం. బీహార్ లో మా సుశీల్ మోడీ రాజ్యం రాబోతోంది. మీరేం చింతించకండి,' అంటూ ఆయన చెబుతున్నారు. ఈ మాట ఆయన ఈ మధ్య ఒక బహిరంగ సభలోనే బాహాటంగా చేసేశారు. ఇప్పుడీ ప్రసంగం ఆయన్ని చిక్కుల్లో పారేసింది. ఇది బీహారీలను అవమానించడమేనంటూ బీహారీలు విరుచుకుపడుతున్నారు. ఆయన్ని అరెస్టు చేయాలని కోరుతున్నారు. ధన్ కడ్ గారు ప్రస్తుతం ఎవరికీ దొరకడం లేదు. అయితే నేనేం పొరబాటు మాట అనలేదని ఆయన వాదిస్తున్నారు. హర్యానాలో ప్రతి వెయ్యి మంది మగవారికి 879 మంది స్త్రీలే ఉన్నారు. కాబట్టి సమాజంలో ప్రతి వెయ్యి మందికి 121 మందికి అమ్మాయిలు దొరికేపరిస్థితి లేదు. -
పెళ్లికి ముందే అదనపు కట్న వేధింపులు!
-
ప్రియుడి పెళ్లిని అడ్డుకున్న ప్రియురాలు
తూప్రాన్ : ప్రేమించిన యువతి పెళ్లిని అడ్డుకోవడంతో పీటల మీద పెళ్లి ఆగిపోయిన సంఘటన మండలంలోని పడాల్‌పల్లి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. పడాల్‌పల్లి గ్రామానికి చెందిన పంబాల యాదగిరి పెద్ద కుమార్తె శిరీషకు మండలంలోని యావపూర్ గ్రామానికి చెం దిన నీల రాములు కుమారుడు శంకర్ తో పెళ్లి నిశ్చయమైంది. ఈ క్రమంలోనే 9న శుక్రవారం ఉదయం 11 గంటలకు వివాహం జరగాల్సి ఉంది. పెళ్లి కుమారుడు శంకర్ బంధువులతో కలిసి ఊరేగింపుగా పడాల్పల్లిలోని పెళ్లింటికి చేరుకుంటున్నాడు. ఈ క్రమంలో పెళ్లి కుమారుడి మాజీ ప్రియురాలు విజయ గ్రామానికి చేరుకుని పెళ్లిని అడ్డుకుంది. తనను కాదని మరో యవతిని ఇచ్చి ఎలా పెళ్లి చేస్తారని అక్కడి పెద్దలను నిలదీసింది. అసలు ఏం జరిగిందో తెలుసుకునే లోపే అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే పెళ్లి కుమారుడు శంకర్ గతంలో యావపూర్ గ్రా మానికి చెందిన ధర్మారం విజయను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసగించాడం టూ బాధితురాలు స్థానిక పోలీస్‌స్టేష న్లో గత ఏడాది ఆగస్టు 5న ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేయగా, కేసు విచారణలో ఉంది. ఇదిలా ఉండగా.. శుక్రవారం పెళ్లి విషయం తెలుసుకున్న విజయ పడాల్‌పల్లి గ్రామానికి చేరుకుని అడ్డుకుంది. సమాచారం అందుకున్న పోలీసులకు గ్రామస్తులు తెలుపడంతో ఎస్ఐ - 2 వీరబాబు సిబ్బందితో సం ఘటనా స్థలానికి చేరుకుని విజయను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. అక్కడ కౌ న్సెలింగ్ ఇచ్చి వదిలేశారు. ఇదిలా ఉంటే పెళ్లి కుమారుడు, బంధువులు అక్క డి నుంచి జారుకున్నారు. దిలా ఉండ గా.. పెళ్లి కుమార్తె శిరీషకు సమీపబంధువైన వెల్దుర్తి మండలం నెల్లూరుకు చెందిన అబ్బాయితో శుక్రవారం రాత్రి తొమ్మిది గంటలకు వివాహం జరిగింది. -
పెళ్లి కూతురిని గంపలో ఎందుకు తీసుకొస్తారు?
నివృత్తం దీని వెనుక ఓ పరమార్థముందని శాస్త్రాలు చెబుతున్నాయి. శ్రీమహాలక్ష్మి కమలంలో కూర్చుని ఉంటుంది కదా! ఆ విధంగానే... మా ఇంటి మహాలక్ష్మిని మీకిస్తున్నాం అని చెప్పడానికి ఆడపిల్లను అలా బుట్టలో పెట్టి ఇస్తారట. మేనమామే ఎందుకు తీసుకొస్తాడు అంటే... ఆడపిల్లకు పుట్టినప్పట్నుంచీ అన్ని సంప్రదాయాలు, అచ్చట్లు, ముచ్చట్లు మేనమామే చూస్తాడు కాబట్టి ఇది కూడా ఆయనే చేస్తాడన్నమాట! తడిసి ముప్పందుం మోసినట్టు.... పూర్వం ఓ వ్యాపారి ప్రతిరోజూ ఉప్పు మూటను గాడిద మీద వేసి, పట్నం తీసుకెళ్లి అమ్మేవాడు. రోజూ ఆ మూట మోయలేక ఆ గాడిద రొప్పుతూ ఉండేది. పైగా మధ్యలో ఒక నది దాటాల్సి రావడం దానికి మహా కష్టంగా అనిపించేది. ఓ రోజు నదిని దాటుతుండగా గాడిద కాలుజారి నీటిలో పడిపోయింది. తిరిగి లేచేటప్పటికి ఉప్పు సగం కరిగిపోయి మూట తేలికైపోయింది. ఇదేదో బాగుందే అని ప్రతి రోజూ నదిలో పడిపోవడం మొదలెట్టింది. విసుగు చెందిన యజమాని గాడిదను ఓ రజకుడికి అమ్మేశాడు. తర్వాతి రోజు అతడు గాడిద మీద బట్టల మూట వేసుకుని బయలుదేరాడు. నది దాటాల్సి వచ్చినప్పుడు ఎప్పటిలానే నీటిలో పడిపోయింది గాడిద. రజకుడు మూటను తీసి మళ్లీ గాడిద మీద వేశాడు. బట్టలు తడవడంతో బరువు ఎక్కువైపోయి ముప్పుతిప్పలు పడింది గాడిద. ఇంకెప్పుడూ అలా చేయకూడదని నిర్ణయించుకుంది. అన్నింటికీ ఒకటే సూత్రం పనికిరాదు అని చెప్పడానికి ఈ సామెత వాడతారు. అతి తెలివితో ఇబ్బంది కొని తెచ్చుకున్నవారిని చూసి ‘తడిసి ముప్పందుం మోసినట్టుంది అంటుంటారు. -
పెళ్లింట చావుబాజా
కాసేపట్లో పెళ్లికొడుకు కాబోయే ముందు రోడ్డు ప్రమాదంలో మృతి చిట్యాల పెళ్టింట చావుబాజా మోగింది. కాసేపట్లో పెళ్లికొడుకు కావాల్సిన ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లాలో చోటుచేసుకుంది. చిట్యాల మండలం శివనేనిగూడేనికి చెందిన నర్సింహ(25)కు, రామన్నపేట మండలం నీర్నేంలకు చెందిన యువతితో 23వ తేదీన వివాహం జరగాల్సి ఉంది. పెళ్లిపనుల నిమిత్తం అతను సోమవారం రామన్నపేటకు వెళ్లాడు. తిరుగు పయనమవుతుండగా, సాయంత్రం పేట శివారు దాటుతుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొనడంతో అతను మృతి చెందాడు. మంగళవారం పెళ్లికొడుకు కావాల్సిన బిడ్డ శవమై రావడంతో కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించారు. ఒగ్గుకథలు చెబుతూ చుట్టుపక్కల గ్రామాల్లో కలవిడిగా ఉండే నర్సింహ మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. -
లావు అంటూ వంక పెట్టిన వరుడు అరెస్ట్
-
లావు అంటూ వంక పెట్టిన వరుడు అరెస్ట్
విజయవాడ : పెళ్లికి ముందే అదనపు కట్నం కోసం వధువును వేధించిన కేసులో వరుడుతో పాటు అతని కుటుంబసభ్యులను మాచవరం పో లీసులు సోమవారం అరెస్టు చేశారు. సెంట్రల్ ఏసీపీ లావణ్యలక్ష్మి కథనం ప్రకారం... మాచవరానికి చెందిన యువతికి కుకట్‌పల్లికి చెందిన పాలెం విక్రమ్నాయుడుతో గత ఫిబ్రవరి 6న నిశ్చితార్థం జరిగింది. ఆ సమయంలో రూ. 2 లక్షల నగదును వరుడికి కట్నంగా ఇ చ్చారు. వచ్చేనెల 12న వివాహం కావాల్సి ఉంది. ఈ క్రమంలో వరుడు, అతని కుటుంబ సభ్యులు కలిసి వధువుకు ఫోన్ చేసి ‘నీవు లావుగా ఉన్నావ్.. ఈ పెళ్లి కుదరదు. మరో ఐదు లక్షలు ఇస్తే పెళ్లి జరుగుతుంది’ అని వేధించసాగారు. బాధితులు మాచవరం పోలీసులను ఆశ్రయించారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీ సు లు వరుడు విక్రమ్‌నాయుడు, అతని తల్లి, సోదరి, పినతల్లిలను పోలీసులు అరెస్ట్‌చేసి రిమాండ్‌కు పంపారు. -
లావు కొద్దీ కట్నమా..?
-
పీటల మీద ఆగిన పెళ్లిళ్లు
అప్పటిదాకా సందడిగా ఉన్న పెళ్లి ఇళ్లు చివరి క్షణంలో కళ తప్పాయి...పీటల దాకా వచ్చిన పెళ్లిళ్లు ఆగిపోయాయి.. ఒక చోట వరుడు నచ్చలేదని వధువు మొండికేయగా..మరోచోట పెళ్లి ఇష్టం లేదని వరుడు మొహం చాటేశాడు... ఇంకోచోట పెళ్లి కూతురు నచ్చలేదని పెళ్లి కొడుకు పరారయ్యాడు... జీలకర్ర, బెల్లం పెట్టాక పెళ్లి వద్దన్న వరుడు వరుడికి దేహశుద్ధి చేసిన వధువు బంధువులు వేదమంత్రాల నడుమ పచ్చని పందిట్లో జరుగుతున్న పెళ్లి హఠాత్తుగా ఆగిపోయింది. కొన్ని నిమిషాల్లో తాళి కట్టాల్సి ఉంది. అంతలోనే వరుడు తనకు పెళ్లి ఇష్టం లేదని మారాం చేశాడు. ఆగ్రహించిన అమ్మాయి తరఫు వారు వరుడిని, అతని బంధువులను చితకబాదారు. హన్మకొండకు చెందిన దొంతు రాంరెడ్డి కుమారుడు ప్రదీప్‌రెడ్డికి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌కు చెందిన మధుసూదన్‌రెడ్డి కుమార్తెతో బుధవారం హన్మకొండ ఎన్జీవోస్ కాలనీలో పెళ్లి జరుగుతోంది. వధువు తలపై వరుడు జీలకర్ర బెల్లం కూడా పెట్టాడు. తాళి కట్టే సమయంలో వాంతి వచ్చినట్లుగా ఉందని చెప్పిన వరుడు ఫంక్షన్ హాలు గదిలోకి వెళ్లి పెళ్లి ఇష్టం లేదంటూ తాళికట్టడానికి మొండికేశాడు. దీంతో వధువు బంధువులు ప్రదీప్‌రెడ్డిని, అతని సంబంధీకులను చితకబాదారు. పోలీసులు ప్రదీప్‌రెడ్డితో పాటు అతనిపై దాడిచేసిన వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వరుడి తల్లిదండ్రులు పారిపోయారు. వివాహం సవ్యంగా జరిగేందుకు వరుడుప్రదీప్కు సీఐ పృథ్వీధర్‌రావు కౌన్సెలింగ్ ఇచ్చారు. పెద్దల సమక్షంలో బుధవారం రాత్రి వరకు చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. పెళ్లికొడుకు నచ్చలేదని.. కాటారం, న్యూస్‌లైన్: వరుడు ఇష్టం లేదని పెళ్లి కూతురు చెప్పడంతో పీటల మీద పెళ్లి ఆగిపోయింది. కరీంనగర్ జిల్లా కాటారం మండలం చింతకానికి చెందిన రేవె ళ్లి అనూష, వరంగల్ జిల్లా వెంకటాపురం మండలం కొండపల్లికి చెందిన శ్రీనివాస్‌కు బుధవారం వివాహం జరగాల్సి ఉంది. రెండు కుటుంబాల వారు వధువు ఇంట్లో పెళ్లి జరిపేందుకు సిద్ధమయ్యారు. పెళ్లి మండపంలోకి రావాల్సిన సమయంలో తనకు పెళ్లి కొడుకు ఇష్టం లేదని, మేనమామ రాజునే పెళ్లి చేసుకుంటానని వధువు తెగేసి చెప్పింది. దీంతో కంగుతున్న రెండు కుటుంబాల సభ్యులు, రాజును విచారించగా తనకు అనూష అంటే ఇష్టం లేదని, ఆమెను తాను ఇష్టపడటం లేదని, కావాలనే అలా చెపుతుందని అన్నాడు. దీంతో చేసేదేమీలేక పెళ్లి తతంగం నిలిపివేసి కులపెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. పరారైన పెళ్లి కొడుకు... మరో యువకునితో పూర్తయిన పెళ్లి అమ్మాయికి తెలివిలేదని పరారయ్యాడు ఓ పెళ్లి కుమారుడు. మరో యువకుడు ఆమెతో వివాహానికి ముందుకు రాగా పెళ్లి ఘనంగా జరిపించారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా వలిగొండ మండలం వర్కట్‌పల్లిలో బుధవారం జరిగింది. చౌటుప్పల్ మండలం జైకేసారంకు చెందిన నట్ట భిక్షంకు వర్కట్‌పల్లికి చెందిన సిర్పంటి నర్సింహ కూతురుతో బుధవారం వివాహం జరగాల్సి ఉంది. వరుడు, వధువు బావామరదళ్లు. ఉదయం 10.30 గంటలకు వివాహ ముహూర్తం. వరుడిని తీసుకెళ్లేందుకు తెల్లవారుజామున వధువు తరఫు బంధువులు వచ్చారు. ఇంతలోనే పెళ్లికుమారుడు భిక్షం బయటికి వెళ్లొస్తానంటూ బైక్ తీసుకుని వెళ్లాడు. గంట, రెండు గంటలైనా రాలేదు. దీంతో అంతా ఆందోళనకు గురయ్యారు. అక్కడా.. ఇక్కడా వెతికారు. చివరకు రామన్నపేట సమీపంలో పెళ్లి కుమారుడు తీసుకెళ్లిన బైకు దొరికింది. కానీ, అతని జాడ మాత్రం లేదు. చివరకు పరారైనట్టు గుర్తించారు. వివాహం ఆగినంత పని జరిగింది. దీంతో ఇరువర్గాల పెద్దమనుషులు చర్చించారు. లింగోజిగూడానికి చెందిన వధువు మేనత్త శంకరమ్మ కుమారుడు రాజుతో వివాహం చేయాలని నిర్ణయించారు. ఆగిపోతుందనుకున్న వివాహం రాత్రి ఏడు గంటలకు ఆడంబరంగా నిర్వహించారు. పారిపోయిన పెళ్లికుమారుడి తల్లిదండ్రులు కూడా తమ ఆస్తినంతా రాజుకు ఇవ్వాలని నిర్ణయించారు. కాగా, రాజు హైదరాబాద్‌లో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం నిర్వహిస్తున్నాడు. -
ఆర్మీ జవాన్ మోసం...ఆగిన రెండోపెళ్లి
కరీంనగర్ : కరీంనగర్ జిల్లా కాలువ శ్రీరామ్‌పూర్ మండలం కూనారంలో పెళ్లిపీటల వరకూ వెళ్లిన వివాహం నిలిచిపోయింది. తనను ప్రేమించి పెళ్లి చేసుకుని.... ఆ తర్వాత మోసం చేశాడంటూ మొదటి భార్య ఫిర్యాదుతో రెండో పెళ్లి ఆగిపోయింది. బాధితురాలి ఫిర్యాదుతో వరుడు ఆర్మీ జవాన్ పరారయ్యాడు. తనకు న్యాయం చేయాలంటూ ఆమె ఆర్మీ జవాన్ ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
వివాహం.. నమోదు చేసుకోండిలా...
వికారాబాద్, న్యూస్‌లైన్: మీరు వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా..? మీకు తెలిసిన వారు పెళ్లి చేసుకోబోతున్నారా..? అయితే జరిగే వివాహానికి చట్టబద్ధత కల్పించుకోండి. తెలిసినవారికి మీ మాటగా చెప్పండి. వివాహాలను తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించేలా రాష్ట్ర ప్రభుత్వం చ ట్టం తీసుకువచ్చింది. ఈ చట్టంలోని 8వ సెక్షన్ రాష్ట్రంలో జరిగే ప్రతి వివాహం తప్పనిసరిగా నమోదు కావాలని స్పష్టం చేస్తోంది. 2006 నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. చట్టం అమలుకు రాష్ట్ర స్థాయిలో వివాహాల రిజిస్ట్రార్ జనరల్ ఉంటారు. జిల్లాలకు జిల్లా వివాహాల రిజిస్ట్రార్ ఉంటారు. నిర్ణయించిన సంఖ్యలో అదనపు డిప్యూటీ రిజిస్ట్రార్లు ఉంటారు. వివాహాల రిజిస్ట్రేషన్ కోసం ప్రతి జిల్లాలో ఒక కార్యాలయం ఉంటుంది. దాని పరిధిలో ప్రాంతాల వారీగా అధికారులు ఉంటారు. గ్రామాల్లో గ్రామ కార్యదర్శి, మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో సంబంధిత కమిషనర్లు అధికారులుగా వ్యవహరిస్తారు. ఇదీ విధానం.. వివాహం జరిగిన రోజు నుంచి 30 రోజుల్లోపు పెళ్లి కుమారుడు/ కుమార్తె లేదా ఇద్దరిలో ఎవరి తల్లిదండ్రులు, సంరక్షకులైనా నిర్ధేశించిన దరఖాస్తు ఫారం నింపి అధికారికి అందజేయాల్సి ఉంటుంది. దరఖాస్తులో పెళ్లి కుమారుడు/ కుమార్తె వయసు తెలియ జేయాలి. ఇరువురి తరపున ఇద్దరు సాక్షులు వివాహాల అధికారి సమక్షంలో సంతకం చేయాల్సి ఉంటుంది. అధికారి ఈ సమాచారాన్ని వివాహాల రిజిస్టర్లో నమోదు చేసి అందరి సంతకాలు తీసుకుంటారు. పెళ్లి జరిగే చోట, లేదా మన ఇంటి వద్ద కూడా వివాహం నమోదు చేసుకోవచ్చు. అయితే ముందుగా దరఖాస్తు చేసుకుని ఆ ప్రాంతం అధికారికి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. దీని కోసం నిర్ధేశించిన ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. వివాహ నమోదు పత్రంపై వివాహాల అధికారి సంతకం, సీలు వేసి అందజేస్తారు. వివాహం జరిగిన 30 రోజుల తరువాత రిజిస్ట్రేషన్ చేయించాలంటే జరిగిన నాటి నుంచి రెండు నెలల లోపు రూ.100 ఫీజుతో నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఎందుకు నమోదు చేసుకోవాలి? వివాహాన్ని చట్టబద్ధం చేసుకుంటే ప్రభుత్వ పరంగా అన్ని విధాలా అర్హులుగా ఉంటారు. కుటుంబానికి సంబంధించిన అన్ని పథకాలు వర్తించేందుకు ఇది దోహదపడుతుంది. భర్త నుంచి విడిపోయి దూరంగా ఉంటే భరణం కోరేందుకు ఉపయోగపడుతుంది. కట్నం వేధింపుల సందర్భంగా నేరం రుజువు కావడానికి ముఖ్య ఆధారంగా పనికి వస్తుంది. హింసకు గురైన మహిళలు విడాకులు పొందడానికి అవసరమవుతుంది. విడాకులు కోరే వారు కూడా వివాహం జరిగిన ఆధారంగా చూపాల్సి ఉంటుంది. రెండో వివాహాలను అడ్డుకోవడానికి, బాల్య వివాహాలను నిరోధించడానికి ఉపయోగపడుతుంది. తప్పుడు సమాచారం ఇస్తే? వివాహ నమోదు పత్రంలో తెలిసి, మోసపూర్వకంగా తప్పుడు సమాచారం ఇస్తే ఏడాది జైలు శిక్ష లేదా రూ.వెయ్యి జరిమానా లేదా ఈ రెండూ అమలు చేస్తారు. వివాహం నమోదు చేయని అధికారికి మూడు నెలల జైలు శిక్ష లేదా రూ.500 జరిమానా లేదా ఈ రెండు అమలు చేస్తారు. -
చెదిరిన ‘పెళ్లి కళ’
గజ్వేల్, న్యూస్‌లైన్: మరికొద్ది సేపట్లో బాజాభజంత్రీలు మోగాల్సిన ఆ పెళ్లి మండపంలో.. ఒక్కసారిగా విచారం అలుముకుంది. తాళి కట్టాల్సిన వరుడు మొహం చాటేశాడు. వధువు బంధువులు వరుడి తల్లిని నిలదీయగా ఎక్కడికి వెళ్లాడో తెలియదని చేతులెత్తేసింది. దీంతో ఉద్రిక్తత నెలకొంది. సాయంత్రం వరకు వరుడి కోసం ఎదురుచూసినా ఎంతకీ రాకపోవడంతో చివరకు వివాహాన్ని రద్దు చేసుకున్నారు. దీంతో వధువు బంధువులు విచారంలో మునిగిపోయారు. ఈ సంఘటన గజ్వేల్‌లో ఆదివారం చోటుచేసుకుంది. గజ్వేల్ నియోజకవర్గంలోని ఓ గ్రామానికి చెందిన యువతికి సికింద్రాబాద్ ఆర్కే పురానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అరుణ కుమారుడు విజయ్‌రెడ్డితో పెళ్లి కుదిరింది. ఇతను హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కేఎండబ్ల్యూ సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. వివాహాన్ని పురస్కరించుకుని వధువు తల్లిదండ్రులు అతనికి భారీగానే కట్నకానుకలను సమర్పించుకున్నారు. ఆదివారం స్థానికంగా ఉన్న ఓ ఫంక్షన్ హాలులో మధ్యాహ్నం వివాహం జరగాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఆనవాయితీ ప్రకారం ఆదివారం తెల్లవారుజామున వరుడిని తీసుకురావడానికి వధువు తరపు బంధువులు ఆర్కే పురానికి వెళ్లారు. కానీ అక్కడ ఒక్కసారిగా సీను మారింది. ఏం జరిగిందో తెలియదు కానీ వరుడు అప్పటికే ఆ ఇంట్లోంచి పరారయ్యాడు. దీంతో వారు ఏం చేయాలో తెలియక వరుడి తల్లి అరుణ, సోదరి స్వప్నతో మరో అమ్మాయి, కొందరు బంధువులను తీసుకొని ఇక్కడికి వచ్చారు. వారంతా పెళ్లి సమయానికి విజయ్‌రెడ్డి వస్తాడని నమ్మబలికారు. తాళి కట్టే సమయానికైనా విజయ్‌రెడ్డి రావచ్చనే ఆశతో ఇక్కడ ఏర్పాట్లు పూర్తి చేశారు. మండపాన్ని తీర్చిదిద్దడమే కాకుండా భోజనాలకు కూడా ఏర్పాట్లు చేశారు. సాయంత్రం వరకు కూడా వరుడి జాడ లేదు. ఫోన్ చేసినా కలవలేదు. అతని తల్లిని, బంధువులను నిలదీస్తే తమకేం తెలియదని చేతులెత్తేశారు. వారిపై వధువు తరపు బంధువులు తీవ్రంగా మండిపడ్డారు. ఈ సందర్భంగా వరుడి తరపు బంధువులపై దాడి చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు హుటాహుటిన కల్యాణ మండపం వద్దకు చేరుకుని వారిని శాంతింపజేశారు. మొత్తానికి పెళ్లి ఆగిపోవడంతో వధువు తల్లిదండ్రులు, బంధువులు విచారంలో మునిగిపోయారు. గజ్వేల్ ఎస్ఐ ఆంజనేయులును వివరణ కోరగా వధువు తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.