పెళ్లికాని ప్రసాదులకు పెండ్లాములు కావలెను!
పెళ్లికాని ప్రసాదులకు పెండ్లాములు కావలెను!
Published Mon, Jul 7 2014 3:59 PM | Last Updated on Fri, Jul 12 2019 3:15 PM
మగపిల్లాడే కావాలి. ఆడపిల్ల వద్దే వద్దన్న హర్యానా ఇప్పుడు కష్టాల్లో పడింది. అక్కడ మగమహారాజులకు పెళ్లాడేందుకు ఆడపిల్లలు కరువయ్యారు. ఎదురు డబ్బులిద్దామన్నా అమ్మాయిలు దొరకడం లేదు. దాంతో హర్యానా యువకులు అమ్మాయిల కోసం ఎక్కడంటే అక్కడ వెతకడం మొదలుపెట్టారు.
పెళ్లికాని ప్రసాదుల సంఖ్య నానాటికీ పెరిగిపోతూండటంతో రాజకీయులు దాన్ని కూడా ఓ ఇష్యూగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. హర్యానా బిజెపి నేత, జాతీయ బిజెపి కిసాన్ మోర్చా అధ్యక్షులు ఓ పీ ధన్ కడ్ ఒకడుగు ముందుకు వేసి 'పెళ్లి కాని ప్రసాదులూ... చింతించకండి. బీహార్ నుంచి అమ్మాయిల్ని తెచ్చి మీకు పెళ్లి చేయిస్తాం. బీహార్ లో మా సుశీల్ మోడీ రాజ్యం రాబోతోంది. మీరేం చింతించకండి,' అంటూ ఆయన చెబుతున్నారు. ఈ మాట ఆయన ఈ మధ్య ఒక బహిరంగ సభలోనే బాహాటంగా చేసేశారు.
ఇప్పుడీ ప్రసంగం ఆయన్ని చిక్కుల్లో పారేసింది. ఇది బీహారీలను అవమానించడమేనంటూ బీహారీలు విరుచుకుపడుతున్నారు. ఆయన్ని అరెస్టు చేయాలని కోరుతున్నారు. ధన్ కడ్ గారు ప్రస్తుతం ఎవరికీ దొరకడం లేదు. అయితే నేనేం పొరబాటు మాట అనలేదని ఆయన వాదిస్తున్నారు.
హర్యానాలో ప్రతి వెయ్యి మంది మగవారికి 879 మంది స్త్రీలే ఉన్నారు. కాబట్టి సమాజంలో ప్రతి వెయ్యి మందికి 121 మందికి అమ్మాయిలు దొరికేపరిస్థితి లేదు.
Advertisement
Advertisement