నిశ్చితార్థం మధ్యలోనే ఉడాయించాడు | Bride groom vanishes on engagement day, faces cheating case | Sakshi
Sakshi News home page

నిశ్చితార్థం మధ్యలోనే ఉడాయించాడు

Published Wed, Sep 3 2014 8:54 AM | Last Updated on Fri, Jul 12 2019 3:15 PM

Bride groom vanishes on engagement day, faces cheating case

హైదరాబాద్ : నిశ్చితార్థం మధ్యలోనే పెళ్లికొడుకు ఉడాయించాడు. బంజారాహిల్స్ పోలీసుస్టేషన్ పరిధిలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  పోలీసుల కథనం ప్రకారం... టోలిచౌక్ నివాసి మహ్మద్ అబ్దుల్ రవూఫ్ తన కూతురుకు మలక్‌పేటకు చెందిన షౌకత్‌తో జూన్ 15న స్థానిక నజీర్ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేశాడు. వేడుక జరుగుతుండగానే షౌకత్‌కు ఎవరి నుంచో ఫోన్ కాల్ వచ్చింది.

 

దీంతో ఎవరికీ చెప్పకుండానే నిశ్చితార్థం మధ్యలోంచి షౌకత్ వెళ్లిపోయాడు. అప్పటి నుంచి పెళ్లికి నిరాకరిస్తున్నాడు. దీంతో తమ పరువు ప్రతిష్టలకు భంగం కల్గించడంతో పాటు నిశ్చితార్థం పేరుతో తమతో భారీగా ఖర్చు చేయించిన షౌకత్‌పై చర్యలు తీసుకోవాలని అబ్దుల్వ్రూఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బంజారాహిల్స్ పోలీసులు షౌకత్‌పై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement