నిశ్చితార్థం ఒకరితో.. పెళ్లి మరొకరితో | bride complaint against groom cheating | Sakshi
Sakshi News home page

నిశ్చితార్థం ఒకరితో.. పెళ్లి మరొకరితో

Published Sat, Dec 30 2017 4:11 AM | Last Updated on Sat, Dec 30 2017 1:44 PM

bride complaint against groom cheating - Sakshi

సాక్షి, రఘునాథపల్లి: తనతో నిశ్చితార్ధం అయ్యాక మరొకరిని పెళ్లి చేసుకున్నాడని ఓ యువతి ఫిర్యాదు మేరకు యువకుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రంజిత్‌రావు శుక్రవారం తెలి పారు. వివరాలు.. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కోమల్లకు చెందిన కన్నారపు స్వాతి అనే యువతితో వరంగల్‌ రూరల్‌ జిల్లా రాయపర్తి మండలం మహబూబ్‌నగర్‌ గ్రామానికి చెందిన ఇల్లందుల రాజశేఖర్‌తో నవంబర్‌ 26న ఇరు గ్రామాల పెద్దల సమక్షంలో నిశ్చితార్థం జరిగింది. అదే రోజు వరకట్నం కానుకుల కింద రాజశేఖర్‌కు రూ.70 వేల నగదు అందజేశారు. ఇటీవల గుట్టు చప్పుడు కాకుండా రాజశేఖర్‌ మరో అమ్మాయిని పెళ్లి చేసుకొని తనను మోసం చేశాడని బాధిత యువతి శుక్రవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు రాజశేఖర్‌పై కేసు నమోదు చేసినట్లు  ఎస్సై తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement