లావు అంటూ వంక పెట్టిన వరుడు అరెస్ట్ | Groom arrested over refuses to marry due to brides fat | Sakshi
Sakshi News home page

లావు అంటూ వంక పెట్టిన వరుడు అరెస్ట్

Published Tue, Apr 8 2014 9:13 AM | Last Updated on Fri, Jul 12 2019 3:15 PM

లావు అంటూ వంక పెట్టిన వరుడు అరెస్ట్ - Sakshi

లావు అంటూ వంక పెట్టిన వరుడు అరెస్ట్

 విజయవాడ : పెళ్లికి ముందే అదనపు కట్నం కోసం వధువును వేధించిన కేసులో వరుడుతో పాటు అతని కుటుంబసభ్యులను మాచవరం పో లీసులు సోమవారం అరెస్టు చేశారు. సెంట్రల్ ఏసీపీ లావణ్యలక్ష్మి కథనం ప్రకారం... మాచవరానికి చెందిన యువతికి కుకట్‌పల్లికి చెందిన పాలెం విక్రమ్‌నాయుడుతో గత ఫిబ్రవరి 6న నిశ్చితార్థం జరిగింది.

ఆ సమయంలో రూ. 2 లక్షల నగదును వరుడికి కట్నంగా ఇ చ్చారు. వచ్చేనెల 12న వివాహం కావాల్సి ఉంది. ఈ క్రమంలో వరుడు, అతని కుటుంబ సభ్యులు కలిసి వధువుకు ఫోన్ చేసి ‘నీవు లావుగా ఉన్నావ్.. ఈ పెళ్లి కుదరదు. మరో ఐదు లక్షలు ఇస్తే పెళ్లి జరుగుతుంది’ అని వేధించసాగారు. బాధితులు మాచవరం పోలీసులను ఆశ్రయించారు.   కేసు దర్యాప్తు చేపట్టిన పోలీ సు లు వరుడు విక్రమ్‌నాయుడు, అతని తల్లి, సోదరి,  పినతల్లిలను  పోలీసులు అరెస్ట్‌చేసి రిమాండ్‌కు పంపారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement