బీటెక్ చదివిందని అబద్ధం చెప్పారు... | NRI bridegroom navadeep raju parents condemns, bride, her father alligations | Sakshi
Sakshi News home page

బీటెక్ చదివిందని అబద్ధం చెప్పారు...

Published Wed, May 13 2015 2:05 PM | Last Updated on Thu, Jul 11 2019 7:49 PM

బీటెక్ చదివిందని అబద్ధం చెప్పారు... - Sakshi

బీటెక్ చదివిందని అబద్ధం చెప్పారు...

నిజామాబాద్ : తమపై వచ్చిన ఆరోపణలను వరుడు నవదీప్ రాజు తల్లిదండ్రులు ఖండించారు. వధువు ఇంజినీరింగ్ పూర్తి కాలేదనే పెళ్లి రద్దు చేసుకున్నట్లు పెళ్లికూతురు, ఆమె తండ్రి చేస్తున్న ఆరోపణలు వాస్తవం కాదని వారు తెలిపారు. తమ అబ్బాయి ఇంకా అమెరికా నుంచి రాలేదని, డబ్బులు ఎలా డిమాండ్ చేస్తామని నవదీప్ రాజు తల్లిదండ్రులు ప్రశ్నించారు.  వధువు బీటెక్ చేసిందని అబద్దం చెప్పారని, తన తండ్రికి నెలనెలా డబ్బులు పంపాలని వధువు బ్లాక్ మెయిల్ చేసిందని వారు ఆరోపించారు. అందుకే వివాహాన్ని మూడు నెలలు వాయిదా వేసినట్లు చెప్పారు.

కాగా నిశ్చితార్థ సమయంలో కట్నకానుకలు వద్దని వరుడి కుటుంబ సభ్యులు చెప్పారని వధువు తండ్రి తెలిపారు. పరోక్షంగా రూ.50 లక్షల కట్నాన్ని వరుడి కుటుంబీకులు డిమాండ్ చేశారని, తన కుమార్తె మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసుకుందని ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement