
చెన్నై,అన్నానగర్: మరికొద్ది గంటల్లో పెళ్లి జరుగుతుండనగా వరుడు అదృశ్యమవడంతో వివహం ఆగిపోయింది. వివరాలు.. చెన్నై మీనమ్‌బాక్కమ్‌కు చెందిన సుకుమారన్ (34) చెన్నై విమానాశ్రయం కార్గో విభాగంలో పనిచేస్తున్నాడు. ఇతనికి చెన్నై రాయపేటకి చెందిన మహిళతో వివాహం నిశ్చయించారు. మంగళవారం ఉద యం పల్లావరంలోని ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో వివాహం చేయడానికి ఏర్పాట్లు చేశారు. సోమవారం సాయంత్రం బంధువులు, స్నేహితులు కల్యాణ మండపానికి వచ్చారు. ఈ క్రమంలో సుకుమారన్ బయటకి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లాడు. చాలా సేపు అయినా మండపానికి రాకపోవడంతో బంధువులు ఆందోళనకు గురయ్యారు. సెల్‌ఫోన్‌కు కాల్ చేస్తే స్విచ్ఛాఫ్ అని వచ్చింది. దీనిపై వధువు ఇంటి వారు పల్లావరం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి సుకుమారన్ కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment