
కాసేపట్లో పెళ్లి అనగా.. కట్నంతో వరుడు జంప్!
విజయవాడ: కాసేపట్లో పెళ్లి అనగా ఓ వరుడు కట్నం తీసుకుని ఉడాయించాడు. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం విజయవాడలో చోటుచేసుకుంది. విజయవాడ పడమట ప్రాంతానికి చెందిన యువతితో ఖమ్మం జిల్లాకు చెందిన శ్రీకాంత్‌కు ఈ రోజు మధ్యాహ్నం వివాహం జరగాల్సి ఉంది. అయితే కట్నం రూ.1.25వేలు తీసుకుని శ్రీకాంత్ పత్తా లేకుండా పోయాడు.
ఎంత సేపటికి వివాహ వేదిక దగ్గరకు పెళ్లి కొడుకు రాకపోవడంతో అనుమానం వచ్చి వరుడు కుటుంబ సభ్యులను పెళ్లి కుమార్తె తరపు వారు నిలదీయగా శ్రీకాంత్ పరరాయ్యడు అని తెలిపారు. వధువు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు శ్రీకాంత్ కుటంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.