marriage Venue
-
పెళ్లిలో ఘర్షణ... ఓ వ్యక్తి మృతి
నగరం: గుంటూరు జిల్లా నగరం మండలం అల్లపాడు పంచాయతీ పరిధిలో ఓ పెళ్లి వేదిక వద్ద విషాదం నెలకొంది. పంచాయతీ పరిధిలోని కట్టవలో సోమవారం ఓ వివాహ వేడుక వద్ద ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో విశ్రాంత సైనిక ఉద్యోగి షేక్ బాజీపై కత్వాల్ బాజీ (28) కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలతో షేక్‌బాజీ మృతి చెందాడు. పూర్తి వివరాలు రావాల్సి ఉంది. -
కట్నంతో వరుడు జంప్!
-
కాసేపట్లో పెళ్లి అనగా.. కట్నంతో వరుడు జంప్!
విజయవాడ: కాసేపట్లో పెళ్లి అనగా ఓ వరుడు కట్నం తీసుకుని ఉడాయించాడు. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం విజయవాడలో చోటుచేసుకుంది. విజయవాడ పడమట ప్రాంతానికి చెందిన యువతితో ఖమ్మం జిల్లాకు చెందిన శ్రీకాంత్‌కు ఈ రోజు మధ్యాహ్నం వివాహం జరగాల్సి ఉంది. అయితే కట్నం రూ.1.25వేలు తీసుకుని శ్రీకాంత్ పత్తా లేకుండా పోయాడు. ఎంత సేపటికి వివాహ వేదిక దగ్గరకు పెళ్లి కొడుకు రాకపోవడంతో అనుమానం వచ్చి వరుడు కుటుంబ సభ్యులను పెళ్లి కుమార్తె తరపు వారు నిలదీయగా శ్రీకాంత్ పరరాయ్యడు అని తెలిపారు. వధువు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు శ్రీకాంత్ కుటంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.