నగరం: గుంటూరు జిల్లా నగరం మండలం అల్లపాడు పంచాయతీ పరిధిలో ఓ పెళ్లి వేదిక వద్ద విషాదం నెలకొంది. పంచాయతీ పరిధిలోని కట్టవలో సోమవారం ఓ వివాహ వేడుక వద్ద ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో విశ్రాంత సైనిక ఉద్యోగి షేక్ బాజీపై కత్వాల్ బాజీ (28) కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలతో షేక్‌బాజీ మృతి చెందాడు. పూర్తి వివరాలు రావాల్సి ఉంది.