ఒకరితో సహజీవనం చేసి, మరొకరితో.. | bridegroom escaped from marriage | Sakshi
Sakshi News home page

ఒకరితో సహజీవనం చేసి, మరొకరితో..

Published Wed, Nov 4 2015 6:49 PM | Last Updated on Sun, Sep 3 2017 12:00 PM

bridegroom escaped from marriage

కృష్ణా: మరి కాసేపట్లో పెళ్లి జరగాల్సి ఉండగా.. పెళ్లి కొడుకు తనతో సహజీవనం చేశాడనీ..తనకు న్యాయం చేయాలని మరో మహిళ పెళ్లిని అడ్డుకున్న ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని పెదపారుపాడి మండలం దూలవానిగూడెంలో అనిల్ అనే యువకుడి వివాహం జరుగుతుండగా అంతలోనే అక్కడికి చేరుకున్న ఓ మహిళ పెళ్లికొడుకు అనిల్ తనతో సహజీవనం చేసి ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చాడని ఆరోపించింది.

అనిల్ తనకు తెలియకుండా వివాహం చేసుకుంటున్నాడనీ.. ఎలాగైనా తనకు న్యాయం చేయాలని ఆందోళనకు దిగింది. దీంతో పెళ్లికొడుకు అనిల్ పెళ్లి మండపం నుండి ఉడాయించాడు. అనిల్తో పెళ్లి ఏర్పాట్లు చేసుకున్న పెళ్లికూతురు తరుపు వారు ఈ ఊహించని పరిణామంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement