
వెలవెలబోతున్న పెళ్లికూతురి ఇల్లు
సారంగాపూర్(జగిత్యాల) : మరో కొద్దిగంటల్లో పెళ్లి. వధూవరుల ఇళ్లలో పనులు శరవేగంగా సాగుతున్నాయి. వధువు ఇంటికి ఫోన్ వచ్చింది. పెళ్లికుమారుడు వచ్చే వాహనానికి ప్రమాదం జరిగిందని వధువు కుటుంబ సభ్యులు వరుడి ఇంటికి వెళ్లారు. పెళ్లికి ముందే ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉందని అందిన ఫిర్యాదుతో పోలీసులు వరుడ్ని అరెస్ట్ చేశారనే విషయం తెలిసి అవాక్కయ్యారు.
ఇదీ జరిగింది..
సారంగాపూర్ మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన యువతికి జగిత్యాల రూరల్ మండలం పోరండ్ల గ్రామానికి చెందిన కొర్రి వంశీతో వివాహం నిశ్చయమైంది. శుక్రవారం ఉదయం 10.35కు పెళ్లి జరిగాల్సి ఉంది. గురువారం సాయంత్రం వరుడిని తీసుకొచ్చేందుకు వధువు బందువులు పోరండ్లకు వెళ్లారు. రాత్రి ఎనిమిది గంటలకు వధువు ఇంటికి ఫోన్ చేసి వరుడికి రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పారు. వెంటనే వధువు ఇంటివారు పోరండ్లకు పయనమయ్యారు.
మరో మహిళతో సంబంధం..
వరుడి ఇంటికి వెళ్లిన వధువు బంధువులు అసలు విషయం తెలుసుకుని అవాక్కయ్యారు. వంశీకి అప్పటికే కోరుట్ల ప్రాంతానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం ఉందని, పెళ్లి విషయం తెలిసి కోరుట్ల పోలీసులకు ఫిర్యాదు చేసిందని, ఈ మేరకు వంశీని అరెస్ట్ చేశారని తెలుసుకున్నారు. దీంతో పెళ్లిని నిలిపివేశారు. క్షణాల్లో సందడిగా మారాల్సిన ఇల్లు బోసిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment