దీని వెనుక ఓ పరమార్థముందని శాస్త్రాలు చెబుతున్నాయి. శ్రీమహాలక్ష్మి కమలంలో కూర్చుని ఉంటుంది కదా! ఆ విధంగానే...
నివృత్తం
దీని వెనుక ఓ పరమార్థముందని శాస్త్రాలు చెబుతున్నాయి. శ్రీమహాలక్ష్మి కమలంలో కూర్చుని ఉంటుంది కదా! ఆ విధంగానే... మా ఇంటి మహాలక్ష్మిని మీకిస్తున్నాం అని చెప్పడానికి ఆడపిల్లను అలా బుట్టలో పెట్టి ఇస్తారట. మేనమామే ఎందుకు తీసుకొస్తాడు అంటే... ఆడపిల్లకు పుట్టినప్పట్నుంచీ అన్ని సంప్రదాయాలు, అచ్చట్లు, ముచ్చట్లు మేనమామే చూస్తాడు కాబట్టి ఇది కూడా ఆయనే చేస్తాడన్నమాట!
తడిసి ముప్పందుం మోసినట్టు....
పూర్వం ఓ వ్యాపారి ప్రతిరోజూ ఉప్పు మూటను గాడిద మీద వేసి, పట్నం తీసుకెళ్లి అమ్మేవాడు. రోజూ ఆ మూట మోయలేక ఆ గాడిద రొప్పుతూ ఉండేది. పైగా మధ్యలో ఒక నది దాటాల్సి రావడం దానికి మహా కష్టంగా అనిపించేది. ఓ రోజు నదిని దాటుతుండగా గాడిద కాలుజారి నీటిలో పడిపోయింది. తిరిగి లేచేటప్పటికి ఉప్పు సగం కరిగిపోయి మూట తేలికైపోయింది. ఇదేదో బాగుందే అని ప్రతి రోజూ నదిలో పడిపోవడం మొదలెట్టింది.
విసుగు చెందిన యజమాని గాడిదను ఓ రజకుడికి అమ్మేశాడు. తర్వాతి రోజు అతడు గాడిద మీద బట్టల మూట వేసుకుని బయలుదేరాడు. నది దాటాల్సి వచ్చినప్పుడు ఎప్పటిలానే నీటిలో పడిపోయింది గాడిద. రజకుడు మూటను తీసి మళ్లీ గాడిద మీద వేశాడు. బట్టలు తడవడంతో బరువు ఎక్కువైపోయి ముప్పుతిప్పలు పడింది గాడిద. ఇంకెప్పుడూ అలా చేయకూడదని నిర్ణయించుకుంది. అన్నింటికీ ఒకటే సూత్రం పనికిరాదు అని చెప్పడానికి ఈ సామెత వాడతారు. అతి తెలివితో ఇబ్బంది కొని తెచ్చుకున్నవారిని చూసి ‘తడిసి ముప్పందుం మోసినట్టుంది అంటుంటారు.