
కాసేపట్లో పెళ్లనగా.. వరుడు పరార్
చక్రం సినిమాలో హీరో ప్రభాస్ మరికాసేపట్లో పెళ్లనగా మండపం నుంచి పారిపోతాడు. సరిగ్గా అలాంటి సన్నివేశం తూర్పుగోదావరి జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. ప్రభాస్ వ్యాధి కారణంగా వెళ్లిపోతే ఇక్కడ పెళ్లికొడుకు మాత్రం అందుకు పూర్తి విరుద్ధం... కట్నం డబ్బులు 3 లక్షల రూపాయలతో ఉడాయించాడు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా కాకినాడ అచ్యుతాపురం అంబేద్కర్ కాలనీలో జరిగింది.
మరికాసేపట్లో తమ బాధ్యతలు తీరుతాయని ఆశగా చూస్తున్న వధువు తల్లిదండ్రులకు మాత్రం ఈ ఘటన తీవ్ర దు:ఖాన్ని నింపింది. కూతురి పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోయినందుకు వదువు తల్లిదండ్రులకు ఏం చేయాలో తోచడం లేదు. పెళ్లికొడుకు ఎందుకు పారిపోయాడు, అందుకు సంబంధించిన కారణాలు ఏంటన్నది వధువు బంధువులకు అర్థం కావడం లేదు.