Film Chamber
-
సంధ్య థియేటర్ ఘటన.. తెలంగాణ ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. సంధ్య థియేటర్ ఘటనలో బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు విరాళాలు సేకరించాలని నిర్ణయించుకుంది. బాలుడు శ్రీతేజ్‌ను ఆదుకునేందుకు సభ్యులు ముందుకు రావాలని ఫిలిం ఛాంబర్ పిలుపునిచ్చింది.కాగా డిసెంబర్ 4న హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్లో పుష్ప 2 ప్రీమియర్స్ ఏర్పాటు చేశారు. అభిమానులతో కలిసి సినిమా చూసేందుకు అల్లు అర్జున్ తన కుటుంబంతో సహా థియేటర్‌కు వెళ్లాడు. ఈ క్రమంలో హీరోను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. అక్కడున్న బౌన్సర్లు జనాలను తోసేయడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రేవతి అనే మహిళ మరణించగా ఆమె కుమారుడు దాదాపు 20 రోజులుగా ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య పోరాడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అల్లు అర్జున్.. బాధిత కుటుంబానికి అన్నిరకాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చాడు. అలాగే రూ.25 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించాడు.చదవండి: చిరంజీవి ఫ్యాన్స్ నన్ను తిట్టుకున్నా పర్లేదు: నాగవంశీ -
వరద బాధితుల కోసం ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం..సురేష్ బాబు, దిల్ రాజు భారీ విరాళం
తెలుగు రాష్ట్రాల్లో వరద వల్ల నష్టపోయిన బాధితులకు సాయం చేసేందకు తెలుగు చిత్ర పరిశ్రమ కీలక నిర్ణయం తీసుకుంది. వరద బాధితులపే ఆదుకునేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ తాజాగా ప్రకటించింది. నివేదిక సాయంతో బాధితుల కోసం సహాయ కార్యక్రమాలను చేపడుతామని ఫిల్మ్ ఛాంబర్ పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో అన్ని సినిమా థియేటర్ల వద్ద విరాళాలు, ఆహార వస్తువలను సేకరించేందుకు ఒక టీమ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.ఇప్పటికే రెండు రాష్ట్రాలకు చాలామంది సినీ ప్రముఖులు విరాళాలు అందించారు. తాజాగా ఫిల్మ్ ఛాంబర్ తరపున ఏపీకి రూ.25 లక్షలు, తెలంగాణకు రూ.25 లక్షలు విరాళం ప్రకటించింది. తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ తరపున ఏపీకి 10 లక్షలు, తెలంగాణకు 10 లక్షలు అందిస్తుండగా ఫెడరేషన్ తరపున రెండు రాష్ట్రాలకు చెరో రూ.5 లక్షలు విరాళంగా ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. దగ్గుబాటి కుటుంబం తరఫున ఇరు రాష్ట్రాలకు చెరో రూ. 50 లక్షలు నిర్మాత సురేశ్ బాబు ప్రకటించారు. అనంతరం దిల్ రాజు కూడా తెలంగాణకు రూ. 25 లక్షలు, ఏపీకి రూ.25 లక్షల విరాళం ప్రకటించారు.ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వచ్చిన వరదల వల్ల చాలామంది నిరాశ్రయులయ్యారు. దీంతో బాధితులను ఆదుకోవడానికి సినీ పరిశ్రమ ముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఫిల్మ్ ఛాంబర్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి సినీ పరిశ్రమ చేయబోతున్న యాక్షన్ ప్లాన్ గురించి వివరించారు.ఈ సందర్భంగా ఛాంబర్ గౌరవ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. 'విజయవాడ, ఖమ్మంలో వరదలు రావడం వల్ల చాలామంది ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి విపత్తులు ఎప్పుడు వచ్చినా సాయం చేసేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ ముందుంటుంది. అలాగే ఈసారి కూడా ఎలాంటి సహాయసహకారాలు చేస్తే బాగుంటుంది అనేదానిపై చర్చించాము. ఫిల్మ్ ఛాంబర్ తరపున ఏపీ, తెలంగాణకు విరాళంగా ప్రకటిస్తున్నాం. రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్‌కు సంబంధించి అకౌంట్ నంబర్స్ అలాగే, ఛాంబర్ నుంచి ఒక అకౌంట్ నంబర్ ఇస్తున్నాం. సహాయం చేయాలనుకునేవారు ఈ అకౌంట్స్‌కు డబ్బులు పంపించవచ్చు.' అని తెలిపారు.నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు మాట్లాడుతూ.. 'ప్రజలకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా మన పరిశ్రమ ఆదుకునే విషయంలో ముందుంటుంది. ఇప్పుడు కూడా సినీ పరిశ్రమ అండగా ఉంటుంది. డబ్బు రూపంలోనే కాకుండా నిత్యావసరాలను కూడా అందించే ప్రయత్నం చేస్తాం. ఎవరికి ఎలాంటి సహాయం కావాలన్నా చేసేందుకు సిద్ధంగా ఉన్నాం.' అని చెప్పారు.నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. 'తెలుగు రాష్ట్రాల్లో వరదల గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికే చాలామంది హీరోలు విరాళాలు అందించారు. అలాగే చాంబర్ నుంచి కూడా సహాయం చేయాలని నిర్ణయించాం. ఫెడరేషన్ పిలుపుమేరకు ఇండస్ట్రీలోని అందరూ ముందుకు వచ్చి విరాళాలు అందించాలని కోరుతున్నాం. తద్వారా వచ్చిన విరాళాలను ప్రభుత్వాలకు అందిస్తాం.' అని చెప్పారు.దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ..'మేము ఈ స్థాయికి రావడానికి కారణం ప్రజల ఆదరణే. ఇప్పుడు వాళ్లు కష్టాల్లో ఉన్నారు. ఇలాంటి సమయంలో మనం వాళ్లను ఆదుకోవాలి. అలాగే మాకు ఎప్పుడూ అండగా ఉండే ప్రభుత్వాలకు మద్దతును తెలియజేయడానికే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. అని చెప్పారు.ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ మాట్లాడుతూ..'రేపు అన్ని యూనియన్లతో సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ఒకరోజు వేతనం ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నాం. మా కార్మికుల తరపున తెలుగు రాష్ట్రాలకు ఎంత చేయాలో అంతా చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం.' అని చెప్పారు.నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ..'వరద బాధితులను ఆదుకోవడం కోసం ఇండస్ట్రీ నుంచి ఒక కమిటీ ఏర్పాటు చేశాం. తెలుగు రాష్ట్రాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏమేం ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకుని కమిటీ వాటిని తీర్చేలా ముందుకు వెళ్తుంది.' అని చెప్పారు. -
పొలిమేర-2 నిర్మాతకు బెదిరింపులు.. దిల్ రాజుకు ఫిర్యాదు!
సత్యం రాజేశ్, గెటప్ శ్రీను, బాలాదిత్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం పొలిమేర. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో గతేడాది సీక్వెల్‌ను కూడా రిలీజ్ చేశారు. పొలిమేర-2 సైతం థియేటర్లలో హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. రెండు సినిమాలు హిట్ కావడంతో పొలిమేర-3 కూడా ఉంటుందని ప్రకటించారు.అయితే తాజాగా పొలిమేర 2 చిత్ర నిర్మాత గౌరీ కృష్ణ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ను ఆశ్రయించారు. తనకు ప్రాణహాని ఉందంటూ తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ దిల్ రాజుకు లేఖ రాశారు. డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి, అతడి టీమ్ నుంచి మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై తక్షణమే స్పందించి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.నిర్మాత గౌరీ కృష్ణ తన లేఖలో రాస్తూ..'ఈ విషయం మీ దృష్టికి వచ్చిందో లేదో నాకు తెలియదు. నాకు తీవ్రమైన సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రసన్న కుమార్ తన అధికారన్ని దుర్వినియోగం చేసి.. నన్ను బెదిరించి ఒత్తిడితో సంతకాలు చేయించడానికి ప్రయత్నించారు. అంతేకాకుండా వంశీ నందిపాటి నుంచి నాకు బెదిరింపులు వచ్చాయి. నేను పొలిమేర 2 సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులను ఒప్పందం మేరకు వంశీ నందిపాటికి ఇచ్చా. సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. కానీ వంశీ నందిపాటి ఇప్పటివరకు లాభాల్లో ఎలాంటి వాటా ఇవ్వలేదు. ఆయన నా వద్ద నుంచి ఖాళీ చెక్కులు, సంతకాలు చేసిన లేఖలు, ఖాళీ బాండ్ పేపర్లు తీసుకుని దుర్వినియోగం చేస్తున్నారు. అంతే కాకుండా నన్ను సంప్రదించకుండానే పొలిమేర -3 సినిమాను ప్రకటించారు. ఇలాంటి పరిస్థితి మరో నిర్మాతకు రాకూడదు. ఫిల్మ్ ఛాంబర్‌పై న్యాయం చేస్తుందనే నమ్మకం నాకుంది' అని ప్రస్తావించారు. కాగా.. కొద్ది రోజుల క్రితమే తనను బెదిరిస్తున్నారంటూ గౌరీ కృష్ణ కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. -
రెండు వారాలకే రూ. 10 కోట్లా.. వివాదంలో నాగ శౌర్య సినిమా
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య గతేడాది 'రంగబలి' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ, ఆ సినిమా డిజాస్టర్ అయింది. ఇప్పుడు నారి నారి నడుమ మురారి, పోలీస్ వారి హెచ్చరిక వంటి చిత్రాలతో శౌర్య బిజీగా ఉన్నారు. అయితే, చాలా కాలంగా మంచి హిట్ కోసం ఆయన ఎదురుచూస్తున్నాడు. సినిమాల పరంగా కాస్త ఇబ్బందుల్లోనే ఉన్నాడు. ఇలాంటి సమయంలో కన్నడ హీరో దర్శన్‌కు మద్ధతుగా శౌర్య నిలిచాడు. ఒక హత్య కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న వ్యక్తికి సపోర్ట్ చేయడం ఏంటి అని నెటిజన్లు ప్రశ్నించారు. తాజాగా ఆయన కొత్త సినిమా నిర్మాత నుంచి పలు ఇబ్బందులు ఎదురౌతున్నాయని ఇండస్ట్రీలో ఒక వార్త వైరల్ అవుతుంది.నాగశౌర్య హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా డైరక్టర్‌కు ,నిర్మాతలకు మధ్య విభేదాలు వచ్చాయని తెలుస్తోంది. నిర్మాత, దర్శకుడు ఇద్దరూ కొత్త వారు కావడంతో ఈ చిక్కులు వచ్చినట్లు సమాచారం. నాగశౌర్య సినిమాకు పెట్టుబడి పెట్టేందకు ఓ ఎన్నారై ముందుకు వస్తే.. ఆయన ఈ ఫీల్డ్‌కు కొత్త వ్యక్తి కావడంతో సినిమా షూటింగ్ మొదలవడానికి ముందే ప్రీ ప్రొడక్షన్ పేరుతో బాగా ఖర్చు పెట్టించేశారట. కేవలం రెండు వారాల షూటింగ్ కోసం ఏకంగా రూ.10 కోట్లు ఆ నిర్మాత ఖర్చు పెట్టాడట. దీంతో ఆయన భయపడిపోయి సినిమా ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడట. అయితే, సినిమా ఆగింది కాబట్టి వేరే నిర్మాతను నాగశౌర్య తీసుకొచ్చారట. కానీ, ఇప్పటి వరకు తాము పెట్టిన డబ్బు తిరిగిచ్చేసి సినిమాను నిర్మించాలని వారు పట్టుపడుతున్నారని సమాచారం. అందుకు వారు అంగీకరించకపోవడంతో ఈ పంచాయితీ ఫిలిం ఛాంబర్ వరకు వెళ్లిందని తెలుస్తోంది. అధికారికంగా వారి నుంచి ఎలాంటి ప్రకటన రాకపోయినప్పటికీ నెట్టింట మాత్రం ఈ వార్త భారీగా వైరల్ అవుతుంది. -
ఫిల్మ్ ఛాంబర్లో అగ్ని ప్రమాదం.. ఎగిసిపడిన మంటలు!
హైదరాబాద్‌లోని ఫిలింనగర్లో ఉన్న ఫిల్మ్ ఛాంబర్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కార్యాలయంలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంగి మంటలార్పేందుకు యత్నిస్తున్నారు. మరోవైపు భవనం చుట్టు దట్టమైన పొగలు కూడా అలుముకున్నాయి. అయితే ఈ అగ్ని ప్రమాదానికి కారణం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమై ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి తీసుకొచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి గల మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
తెలుగు సినీ దర్శకుల ఎన్నికలు ప్రారంభం..
-
తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్‌గా దిల్‌రాజు
హోరాహోరీగా సాగిన తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికలు విజయవంతంగా పూర్తయ్యాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజ్.. అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. వైస్ ప్రెసిడెంట్ గా ముత్యాల రామదాసు, కార్యదర్శిగా దామోదర్ ప్రసాద్, ట్రెజరర్‌గా ప్రసన్న కుమార్ ఎంపికయ్యారు. మొత్తం 48 ఓట్లలో దిల్ రాజుకి 31 ఓట్లు పడ్డాయి. దీంతో ఆయం ప్రెసిడెంట్‌గా అధికారం చేజిక్కుంచుకున్నారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో అగ్ర నిర్మాత దిల్‌రాజు, మరో నిర్మాత సి.కల్యాణ్ ప్యానల్స్ మధ్య తీవ్రమైన పోటీ ఏర్పడింది. మొత్తం 14 రౌండ్స్‌లో 563 ఓట్లు దిల్ రాజు పానెల్‌కు, సి.కల్యాణ్ పానెల్‌కు 497 ఓట్లు వచ్చాయి. ప్రొడ్యూసర్స్ సెక్టార్‌లోని 12 మందిలో దిల్‌రాజు ప్యానల్ నుంచి ఏడుగురు ఎన్నికయ్యారు. స్టూడియో సెక్టార్ నుంచి గెలిచిన నలుగురిలో ముగ్గురు దిల్‌రాజు ప్యానల్, డిస్ట్రిబ్యూషన్ సెక్టార్లో ఇరు ప్యానల్స్‌లో చెరో ఆరుగురు గెలిచారు. రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ ఎలక్షన్ లో భాగంగా 2023-25 సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో 1,339 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో చిన్న సినిమాల మనుగడ, డిజిటల్ సర్వీసు ప్రొవైడర్ల ఛార్జిల తగ్గింపు హామీతో సి.కల్యాణ్ ప్యానెల్, ఫిల్మ్ ఛాంబర్ మనుగడ, భవిష్యత్ తరాలకు మంచి సినీ పరిశ్రమను అందించాలనే నినాదంతో దిల్‌రాజు ప్యానెల్ బరిలో నిలిచారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్ కార్యాలయంలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు పోలింగ్ జరిగింది. (ఇదీ చదవండి: తమన్నాకు వింత పరిస్థితి.. ఒకే హీరోకి లవర్, సిస్టర్‌గా!) -
తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో ఎన్నికల సందడి
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల సందడి మొదలైంది. ఈ నెల 14న నామినేషన్స్ పూర్తి కాగా, శుక్రవారంతో అంటే జూలై 21తో నామినేషన్ విత్ డ్రా చేసుకోవడానికి సమయం పూర్తయింది. ఈ క్రమంలోనే జూలై 30న ఎలక్షన్స్ జరగనున్నాయి. నిర్మాతలు సి.కల్యాణ్, దిల్ రాజు ప్యానెల్స్ మధ్య పోటీ ఉంది. వీళ్లిద్దరే అధ్యక్ష బరిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా తెలుగు నిర్మాతల సెక్టార్, డిస్ట్రిబ్యూటర్ సెక్టార్, స్టూడియో సెక్టార్‌కు ఎన్నికలు జరగనున్నాయి. ఎగ్జిబిటర్ సెక్టార్‌కు ఎన్నిక ఏకగ్రీవమైంది. ఇకపోతే సి.కల్యాణ్ ఇప్పటికే టాలీవుడ్లో ఎన్నో కీలక పదవుల్లో పనిచేశారు. దక్షిణాది ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ గానూ వర్క్ చేశారు. మరోవైపు దిల్ రాజు.. యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ఏర్పాటు చేసుకున్న గిల్డ్ లో కీలకంగా ఉన్నారు. ఇప్పుడు వీళ్లిద్దరి ప్యానెల్స్ తలపడుతుండటం ఆసక్తికరంగా మారింది. ఈసారి ఏం జరుగుతుందో చూడాలి. (ఇదీ చదవండి: 'కల్కి' గ్లింప్స్‌లో కమల్‌హాసన్.. ఎక్కడో గుర్తుపట్టారా?) -
రోడ్డెక్కిన లైగర్ బయ్యర్లు, ఎగ్జిబిటర్లు
-
తారకరత్న భౌతికకాయం వద్ద విషణ్ణ వదనాలతో కుటుంబ సభ్యులు (ఫొటోలు)
-
ఫిలిం ఛాంబర్ లో తారకరత్న భౌతికకాయం
-
కొడుకును అలా చూసి అల్లాడిపోయిన తారకరత్న తల్లిదండ్రులు
తారకరత్న మృతితో నందమూరి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. 40 ఏళ్ల వయసులోనే తారకరత్న దూరం కావడం కుటుంబంతో పాటు నందమూరి అభిమానుల్ని కలిచివేస్తోంది. 23 రోజుల పాటు బెంగళూరులోని నారాయణ హృదయాలలో చికిత్స చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఎంతో భవిష్యత్తు ఉన్న తారకరత్న ఇలా అర్థాంతరంగా తనువు చాలించడం దిగ్బ్రాంతికి గురి చేస్తోంది. కాగా అజాత శత్రువుగా, ఎంతో మంచి మనస్తత్వం గల వ్యక్తిగా తారకరత్నకు పేరుంది. దీంతో ఆయన్ను కడసారి చూసేందుకు అభిమానులు తరలి వస్తున్నారు. ప్రస్తుతం తారకరత్న భౌతికకాయన్ని ఫిల్మ్‌ఛాంబర్‌లో ఉంచారు. ఈ క్రమంలో ఆయన్ను అలా చలనం లేకుండా చూసి తల్లిదండ్రులు మోహన్ కృష్ణ, సీత దంపతులు కన్నీటి పర్యంతం అయ్యారు. ఎదిగిన కొడుకు ఇలా తమ కళ్ల ముందే అచేతనంగా ఉండటం చూసి అల్లాడిపోయారు. వాళ్లను సముదాయించడం అక్కడున్న వారి తరం కాలేదు. తారకరత్న తల్లిదండ్రుల మనోవేదన చూసి అక్కడున్న వారు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. -
ఫిల్మ్ ఛాంబర్‌కు తారకరత్న భౌతికకాయం
నందమూరి తారకరత్న పార్థివదేహన్ని ఆయన నివాసం నుంచి ఫిలిం చాంబర్‌కు తరలించనున్నారు. అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఫిలిం ఛాంబర్‌లోనే ఉంచనున్నారు. అనంతరం సాయంత్రం మహాప్రస్థానంలో నేడు తారకరత్న అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇప్పటికే తారకరత్న తల్లిదండ్రులు మోహన్ కృష్ణ, సీతతో పాటు నందమూరి కుటుంబ సభ్యులు ఫిలిం చాంబర్‌కు చేరుకున్నట్లు సమాచారం. కాగా చదవండి: తారకరత్న మృతి.. బాలకృష్ణ కీలక నిర్ణయం గత నెల 27న నారా లోకేశ్ పాదయాత్రలో పాల్గొన్న ఆయన గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి 23 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం(ఫిబ్రవరి 18న) రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో నందమూరి కుటుంబంలో విషాద చాయలు నెలకొన్నాయి. ఆయన మృతిని టాలీవుడ్ సినీ పరిశ్రమతో పాటు ఇటూ నందమూరి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన పవిత్ర ఆత్మకు చాంతి చేకూరాలని ప్రార్థిస్తూ తారకరత్న మృతికి సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు నివాళులు అర్పిస్తున్నారు. -
ధమాకా సినిమాకు ధమ్కీ.. దర్శకుడు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే
సాక్షి, హైదరాబాద్(బంజారాహిల్స్): ఉప్పర కులస్తులను ధమాకా సినిమా దర్శకుడు త్రినాథరావు ప్రీ రలీజ్ ఈవెంట్లో అవమానించారని వెంటనే తమ కులస్తులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సగర ఉప్పర సంఘం అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సాగర్ ఆధ్వర్యంలో కులస్తులు బుధవారం ఫిలించాంబర్ వద్ద ఆందోళన చేశారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ చాంబర్ వద్ద బైఠాయించారు. దర్శకుడు త్రినాథ్‌రావు దిష్టిబొమ్మ దహనం చేస్తున్న సగర ఉప్పర సంఘం ప్రతినిధులు ప్రీ రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు త్రినాథ్ రావు ‘నీ ఉప్పర లొల్లి’ ఏంటి అంటూ హేళన చేశారని ఆరోపించారు. అనంతరం ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. సంఘం గ్రేటర్ అధ్యక్షుడు మోడల రవి సాగర్, కోశాధికారి రామస్వామి, ఫిలింనగర్ అధ్యక్షుడు మధుసాగర్, ప్రధాన కార్యదర్శి నాగేష్ సాగర్, డి.రాంచందర్, చెన్నయ్య, సీతారాములు, వెంకటస్వామి, మూసాపేట్ సగర సంఘం అధ్యక్షుడు లోకేష్ సాగర్, రామకృష్ణ సాగర్, అంజయ్య నగర్ అధ్యక్షుడు ఆంజనేయులు సాగర్, బి.శేఖర్ పాల్గొన్నారు. -
మరో వివాదంలో ఇరుక్కున్న విశ్వక్ సేన్.. ఫిల్మ్ చాంబర్లో కంప్లైంట్?
యంగ్ హీరో విశ్వక్ సేన్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వివాదాలతోనే పాపులర్ అవుతున్నాడు. రీసెంట్గా ఓరి దేవుడా సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఆయన ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. అయితే యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా దర్శకత్వంలో విశ్వక్సేన్ ఓ సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. అర్జున్ కూతురు ఐశ్వర్యా అర్జున్ ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం కూడా గ్రాండ్‌గా జరిగింది. ఇప్పటికే 2 షెడ్యూల్స్ కూడా పూర్తిచేశారు. ఇలాంటి సమయంలో విశ్వక్సేన్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. అగ్రిమెంట్‌ను బ్రేక్ చేసి ఎలాంటి కారణాలు చెప్పకుండా విశ్వక్ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు ఫిల్మీదునియాలో టాక్ వినిపిస్తుంది. దీంతో ఈ విషయంపై సీరియస్ అయిన అర్జున్ సర్జా విశ్వక్ సేన్ మీద ఫిల్మ్ ఛాంబర్లో ఫిర్యాదు చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది. మరి ఈ ఇష్యూ ఎంత దూరం వెళుతుందన్నది చూడాల్సి ఉంది. -
టాలీవుడ్లో షూటింగులు తిరిగి ప్రారంభం?
టాలీవుడ్లో త్వరలోనే షూటింగులు పునఃప్రారంభం కానున్నాయి. నేడు (గురువారం)ఫిల్మ్ ఛాంబర్ కీలక ప్రెస్‌మీట్ నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో ఇండస్ట్రీలో ప్రస్తుతం నిలిచిపోయిన షూటింగులు తిరిగి ప్రారంభించడంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం టాలీవుడ్లో వరుసగా మూడు సినిమాలు హిట్ కావడం, బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతుండటంతో మళ్లీ షూటింగులు ప్రారంభించాలన్న నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈనెల 22 నుంచే షూటింగులు ప్రారంభం కానున్నట్లు సమాచారం. కాగా సినిమాలకు అవుతున్న అధిక బడ్జెట్,ఓటీటీ విడుదల సహా ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యల కారణంగా ఆగస్ట్1 నుంచి షూటింగ్స్‌ను ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వాయిదా వేసిన సంగితి తెలిసిందే. -
ఎగ్జిబిటర్ల సమస్యపై డైరెక్టర్ తేజ అధ్యక్షతన ప్రత్యేక కమిటీ
Director Teja Special Committee On The Issue Of Exhibitors: మంగళవారం (ఆగస్టు 2) ఎగ్జిబిటర్లతో నిర్వహించిన ఫిలిం ఛాంబర్ సమావేశం ముగిసింది. ఈ భేటీలో వీపీఎఫ్ ఛార్జీలు, పర్సంటేజీలపై ఎగ్జిబిటర్లతో నిర్మాతలు చర్చించారు. అయితే వీపీఎఫ్ ఛార్జీలను నిర్మాతలే భరించాలని ఎగ్జిబిటర్లు కోరినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఎగ్జిబిటర్ల సమస్యలను పరిష్కరించేందుకు సానుకూలంగానే ఉన్నామని నిర్మాతల మండలి పేర్కొంది. ఇందుకోసం దర్శకుడు తేజ అధ్యక్షతన ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నారు. డిజిటల్ చార్జీల నియంత్రణపై ఈ కమిటీలో చర్చించనున్నారు. అలాగే ఫిలిం ఛాంబర్ ప్రత్యేక కమిటీ సమావేశం ఇంకా కొనసాగుతుండగా మరోవైపు వేతన సవరణ గురించి ఫెడరేషన్ నాయకులతో మీటింగ్ ప్రారంభమైంది. కాగా ఇదివరకు వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. చదవండి: సినీ కార్మికుల సమ్మె, నిర్మాతలు, ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యుల భేటీ భార్యతో అబద్ధాలు చెప్పకపోతే ఇన్ని కాపురాలు ఉంటాయా: డైరెక్టర్ సల్లూ భాయ్‌కి లైసెన్స్డ్ తుపాకీ.. ఎలాంటిది అంటే ? బికినీ దుస్తుల్లో వేదిక రచ్చ.. సినిమా అవకాశాల కోసమేనా? -
ముగిసిన ఫిలిం ఛాంబర్ ప్రత్యేక కమిటీ సమావేశం
-
101 మంది పేద కళాకారులకు ఉచితంగా రూ. 6 కోట్ల భూమి..
V Vijay Kumar Gives 101 Plots To Poor Artist: టెలివిజన్‌లోని 24 క్రాఫ్ట్స్ లో ఉండే వెనుకబడిన పేద కళాకారులకు 101 ఫ్లాట్స్‌ను విజన్ వి.విజయ్ కుమార్ ఉచితంగా అందించారు. ఈ కార్యక్రమం హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ ఆవరణలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే గోపీనాథ్ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం విజన్ వి. విజయ్ కుమార్ ఇచ్చిన మాట ప్రకారం 101 మంది నిరుపేద టీవీ కళాకారులకు ఉచితంగా ఇళ్ల స్థలాలు పత్రాలను తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు కె.వి.రమణాచారి చేతుల మీదుగా అందజేశారు. విజయ్ కుమార్ మాట్లాడుతూ 'చాలా మంది కోట్ల విలువజేసే భూమిని ఎందుకు ఇవ్వడం అన్నారు. అయితే నా దృష్టిలో మన పిల్లలకు మనం కోట్ల ఆస్తిని ఇవ్వడం ముఖ్యం కాదు. మన చుట్టూ ఉన్న పేద కార్మికులకు సహాయం చేస్తే మనకంటూ ఒక దైవ శక్తి వస్తుంది. ఆ దైవ శక్తి ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. అదే విధంగా మన పిల్లకు మంచి నాలెడ్జ్, ఆలోచనలు ఇస్తే వారు కూడా సమాజానికి ఉపయోగపడే మంచి పనులు చేస్తారనేది నా అభిప్రాయం.' అని తెలిపారు. చదవండి: పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్.. ఇప్పుడు మరో నటుడితో ప్రేమాయణం తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. 'టెలివిజన్‌లోని ఒక్కొక్క క్రాఫ్ట్ నుంచి ఐదుగురు కళాకారులను సెలెక్ట్ చేసుకొని విజయ్ కుమార్ 101 ఫ్లాట్స్ ఇవ్వడం మంచి విషయం. సుమారు రూ. 6 కోట్ల విలువ చేసే భూమిని ఇవ్వడం గొప్ప విషయం. పేదవాడి ఆశీర్వాదాలు మనకు జీవితకాలం తోడుగా ఉంటాయి. విజయ్‌కు వారి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటూ వారి బిజినెస్ దినదినాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.' అని పేర్కొన్నారు. -
సినీ కార్మికుడి నుంచి... స్టూడియో అధినేతగా..
సాక్షి,దేవరాపల్లి(అనకాపల్లి): సినీ పరిశ్రమలో కార్మికుడిగా చేరిన కళామతల్లి ఆశీస్సులతో అంచెలంచెలుగా ఎదిగి నేడు సినిమా స్టూడియో యజమాని స్థాయికి చేరుకోగలిగారు... అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలానికి చెందిన కొల్లి రామకృష్ణ. 1978లో చెన్నైలో సినీ రంగ కార్మికుడిగా చేరి, వివిధ భాషల్లో తీసిన 1600 సినిమాలకు విజయ వాహిని స్టూడియో తరపున సౌండ్ ఇంజినీర్‌గా పని చేశారు. 1997లో తెలుగు చిత్ర పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్‌కు రావడంతో ఇక్కడి శబ్ధాలయ స్టూడియోలో చేరి 2001 వరకు పని చేశారు. 2002లో రిథమ్ డిజిటల్ సినీ స్టూడియోను తానే సొంతంగా నిర్మించుకున్నారు. 2014 నుంచి ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా, ఉపాధ్యక్షుడిగా పని చేసి గత నెల(ఏప్రిల్) 27న అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు కావడం ఎంతో సంతోషాన్నిచ్చింది... ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఫిల్మ్ ఛాంబర్లో సినీ రంగంలోని నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, పంపిణీదారులు, సినీ స్టూడియో యజమానులు సభ్యులుగా ఉంటారు. దాసరి నారాయణరావు, రామానాయుడు, రాజేంద్రప్రసాద్ తదితర సినీరంగ ప్రముఖులు అధ్యక్షుడిగా పని చేసిన ఫిల్మ్‌చాంబర్ ఆఫ్ కామర్స్ సంస్థకు తాను అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం సంతోషంగా ఉందని రామకృష్ణ తెలిపారు. ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఆయన తన స్వగ్రామానికి విచ్చేశారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడారు. తాను సినీరంగంలో అంచెలంచెలుగా ఎదిగిన క్రమాన్ని, విశేషాలను వివరించారు. సినిమా షూటింగ్‌లకు ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా విశాఖనగరం ఎంతో అనుకూలంగా ఉంటుందని తెలిపారు. సినీ రంగానికి ఏపీ ఎంతో అనుకూలం ఆంధ్రప్రదేశ్‌లో సినిమాలు తీసేందుకు అనువైన అహ్లాదకర ప్రాంతాలు, అందమైన లొకేషన్లు అనేకం ఉన్నాయి. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ సినీ రంగం మరింత అభివృద్ధి చెందే విధంగా త్వరలోనే ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డిని ఫిల్మ్ ఛాంబర్ కార్యవర్గం కలిసి కోరతాం. ఈనెల ఆఖరి బుధవారం మా సంస్థ కార్యవర్గం సమావేశమై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటాం. మా సంస్థకు విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో దీనికి అనుబంధ సంస్థలు ఉన్నాయి. వీటిని త్వరలో సందర్శిస్తాం. –కొల్లి రామకృష్ణ, ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు చదవండి: Photo Feature: ఆకులు లేని పూల చెట్టు -
ఫిల్మ్ ఛాంబర్లో కందికొండ భౌతిక కాయం.. మంత్రి తలసాని నివాళి
Kandikonda Yadagiri Passes Away: Minister Talasani Tribute In Film Chamber: ప్రముఖ గేయ రచయిత కందికొండ యాదగిరి (49) భౌతికకాయాన్ని హైదరాబాద్‌లోని ఫిల్మ్ చాంబర్‌కు తరలించారు. ఆయన భౌతికకాయంపై పూలమాల వేసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాళులు అర్పించారు. కందికొండ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కందికొండ మరణం తెలంగాణ సాహిత్య లోకానికి తీరని లోటని పేర్కొన్నారు. తన పాటలతో తెలంగాణ సమాజాన్ని ఎంతో చైతన్య పరిచారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు తలసాని. తెలంగాణ సాహిత్య లోకానికి, సబ్బండ వర్గాలకు తీరని లోటని, సినీ రంగంలో తనదైన ముద్ర వేసుకున్నారని ప్రశంసించారు. కందికొండ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. చదవండి: 1300 పాటల పరవశం.. కందికొండ సినీ ప్రస్థానం శనివారం (మార్చి 12) మధ్యాహ్నం హైదరాబాద్‌లోని స్వగృహంలో కందికొండ యాదగిరి తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా గొంతు కేన్సర్, వెన్నెముక సమస్యలతో ఆయన పూర్తిగా మంచానికే పరిమితమయ్యారు. ఆయస స్వస్థలం వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని నాగుర్లపల్లి గ్రామం. తల్లిదండ్రులు సాంబయ్య, కొమురమ్మ కాగా కందికొండ యాదగిరికి భార్య రమాదేవి, కుమార్తె మాతృక, కుమారుడు ప్రభంజన్ ఉన్నారు. ప్రముఖుల నివాళుల అనంతరం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రముఖ కవి, గేయ రచయిత కందికొండ గారు మృతి చెందడం చాలా బాధాకరం. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. pic.twitter.com/Bg5zhexYUc — Talasani Srinivas Yadav (@YadavTalasani) March 12, 2022 చదవండి: ‘కందికొండ ఫ్యామిలీకి డబుల్ బెడ్రూమ్ ఇవ్వడానికి సిద్దం’ -
'టాలీవుడ్‌కు ఇవే పెద్ద దిక్కు, ప్రభుత్వాలు వీటితోనే చర్చ జరపాలి'
‘‘తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా సమస్యలున్నాయి. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, 24 క్రాఫ్ట్స్ ఫెడరేషన్, ‘మా’(మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) కలిసి సమస్యల పరిష్కారం కోసం కలిసి కట్టుగా ముందుకు వెళతాం’’ అని ఫిల్మ్ చాంబర్ జనరల్ సెక్రటరీ, నిర్మాత దామోదర ప్రసాద్ అన్నారు. కోవిడ్ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చించేందుకు ‘తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్’ ఆధ్వర్యంలో నిర్మాత జి.ఆది శేషగిరిరావు అధ్యక్షతన సినీ ప్రముఖులు ఆదివారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. సమావేశం అనంతరం దామోదర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ– ‘‘చాంబర్ తరఫున సబ్ కమిటీ ఏర్పాటు చేసి అందరికీ ఆమోద యోగ్యమైన నిర్ణయాల కోసం ముందుకువెళతాం. మూడు నెలల తర్వాత మరోసారి సమావేశమై చర్చిస్తాం’’ అన్నారు. ‘‘టాలీవుడ్‌కి ఫిల్మ్ చాంబర్, నిర్మాతల మండలి పెద్ద దిక్కు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు సినిమాలకు సంబంధించి ఏ చర్చ అయినా వీటితోనే జరపాలి’’ అని నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్ అన్నారు. సినిమా పరిశ్రమకు మేలు జరిగేందుకు ప్రభుత్వాలతో ఎవరు చర్చించినా అభ్యంతరం లేదు. కానీ, కలిసే ముందు ఫిల్మ్ చాంబర్, నిర్మాతల మండలిని సంప్రదించాలనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తమయింది. కాగా ఈ సమావేశానికి 250మందిని ఆహ్వానించినా కేవలం 60–70 మంది మాత్రమే వచ్చారు. స్టార్ హీరోలెవరూ ఈ సమావేశానికి హాజరుకాకపోవడం గమనార్హం. దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, నిర్మాతలు బీవీఎస్ఎన్ ప్రసాద్, తమ్మారెడ్డి భరద్వాజ, సి.కల్యాణ్, నవీన్ ఎర్నేని, చదలవాడ శ్రీనివాసరావు, నిరంజన్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, ఎన్.వి.ప్రసాద్, అశోక్ కుమార్, వై. రవి, అనిల్ సుంకర, నటులు మురళీ మోహన్, రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. -
టాలీవుడ్ మీటింగ్, హాజరైన రాజమౌళి!
సాక్షి, హైదరాబాద్: సినీపరిశ్రమల సమస్యలపై చర్చించేందుకు టాలీవుడ్ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఫిలింనగర్ కల్చరల్ క్లబ్లో ఆదివారం ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభమైంది. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్వర్యంలో ఆది శేషగిరిరావు అధ్యక్షతన మొదలైన ఈ సమావేశానికి 24 క్రాఫ్ట్స్ ప్రతినిధులు హాజరయ్యారు. తెలుగు ఫిలిం ఛాంబర్, తెలంగాణ ఫిలిం ఛాంబర్, నిర్మాతల మండలి, మా అసోసియేషన్, దర్శకుల సంఘం, చలనచిత్ర కార్మిక సమాఖ్య ప్రతినిధులు.. ఇలా అన్ని రంగాల నుంచి ఆయా ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫిలిం చాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. 'సినీ పరిశ్రమ అంతర్గత సమస్యలపై చర్చించనున్నాం. పరిశ్రమలోని అన్ని వ్యవస్థల సభ్యులను ఆహ్వానించాం. గత రెండేళ్ళుగా చిత్ర పరిశ్రమలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఎన్నో సమస్యలు వచ్చాయి. వాటన్నింటిపై సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశాం. గంటన్నర పాటు అన్ని విషయాలపై చర్చించుకోనున్నాం. ఇది చిత్ర పరిశ్రమ మంచి కోసం ఏర్పాటు చేసిన భేటీ' అని పేర్కొన్నారు. ఫిలిం ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్ ముత్యాల రాందాస్ మాట్లాడుతూ.. 'క్యూబ్, టికెట్ రేట్లు, చిత్ర పరిశ్రమ అంతర్గత విషయాలు చర్చకు వస్తాయి. ఏపీ ప్రభుత్వంతో జరిగిన మీటింగ్ విషయాలను సైతం చర్చిస్తాము. పూర్తి వివాదరహితంగా సమావేశం ఉంటుందని ఆశిస్తున్నాము' అన్నారు. ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. 'రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు రిప్రజెంట్ చేసే విషయాలపై చర్చించనున్నాం. వ్యక్తిగతంగా ఎవరు ఎవరిని కలిసినా, ఛాంబర్ ఆధ్వర్యంలో జరిగేదే ఇండస్ట్రీ సమావేశం' అని తెలిపారు. ఎస్ఎస్ రాజమౌళి, దామోదర్ ప్రసాద్, ప్రసన్న కుమార్, మైత్రీ మూవీస్ రవి, నవీన్, బివిఎస్ఎసన్ ప్రసాద్ , స్రవంతి రవికిషోర్ , తమ్మారెడ్డి భరధ్వాజ, ముత్యాల రాందాస్ ,మాదాల రవి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితరులు ఈ భేటీకి హాజరయ్యారు. ఇదిలా ఉంటే టాలీవుడ్ హీరోలు చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్ తదితరులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో సమావేశమై ఇండస్ట్రీ సమస్యలను చర్చించిన విషయం తెలిసిందే! ఈ సమావేశం జరిగిన కొద్ది రోజులకే టాలీవుడ్ ప్రతినిధులు భేటీ కావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
చిరంజీవి, మోహన్ బాబుల కీలక సమావేశం
టాలీవుడ్లో సంచలన సమావేశానికి ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ వేదిక కానుంది. కొంతకాలంగా ఉప్పు, నిప్పుల్లా వ్యవహరించిన చిరంజీవి, మోహన్ బాబులు ఒకే వేదికకు రానుండటంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఇండస్ట్రీలోని 24 క్రాఫ్టులకు సంబందించిన ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొననున్నట్టు తెలుస్తోంది. వివరాలివి.. ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమ ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారానికి ఎట్టకేలకు అన్ని విభాగాలు ఒక్కతాటిపైకి వచ్చే ప్రయత్నానికి ముహుర్తం ఖరారైంది. ఫిలం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్లో ఆదివారం ఈ కీలక సమావేశం జరుగనున్నట్టు తెలుస్తోంది. కరోనా సమయంలో ఇండస్ట్రీ ఎదుర్కొన్న అనేక ఆటంకాలతో పాటు ఇటీవల తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు జారీ చేసిన జీవోలు, సినీ కార్మికుల సంక్షేమం తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం. ఇక ఈ సమావేశానికి ఫిలిం ఛాంబర్లోని అన్ని సంఘాలకు సంబందించిన దాదాపు 200 మంది ప్రతినిధులు హాజరవుతారని అంచనా. సినీ పెద్దలు చిరంజీవి, మోహన్ బాబు, మురళీ మోహన్, తమ్మారెడ్డి భరద్వాజలతో పాటు మా అధ్యక్షుడు మంచు విష్ణు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. అయితే చాలా కాలం తరువాత చిరంజీవి, మోహన్ బాబులు ఒకే వేధికపై కన్పించనుండటంతో ఈ సమావేశంపై ఉత్కఠ నెలకొంది. -
'గీత' మూవీ మోషన్ పోస్టర్ విడుదల
రామ్, శ్రీజ జంటగా కిరణ్ తిమ్మల దర్శకత్వంలో నటించిన చిత్రం `గీత` (మన కృష్ణగాడి ప్రేమకథ ట్యాగ్ లైన్). శ్రీ మణికంఠ సినీ క్రియేషన్స్ పతాకంపై రాము, మురళి, పరమేష్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను ఫిలించాంబర్‌లో లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి నిర్మాత నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ``మోషన్ పోస్టర్ చాలా బావుంది. హీరో హీరోయిన్ జంట కూడా చూడ ముచ్చటగా ఉంది. ఇటీవల కాలంలో కొత్త కంటెంట్ తో కొత్త వాళ్లు చేసే చిన్న చిత్రాలు బాగా ఆడుతున్నాయి. ఆ కోవలో ఈ చిత్రం కూడా బాగా ఆడాలని కోరుకుంటున్నా. కంటెంట్ బాగుంటే థియేటర్స్ కూడా దొరుకుతున్నాయి. ప్రేక్షకులు కూడా ఆదరిస్తున్నారు అని పేర్కొన్నారు. -
ఫిల్మ్‌ఛాంబర్‌లో ‘సిరివెన్నెల’కు ప్రముఖుల నివాళి (ఫోటోలు)
-
Sirivennela: మహాప్రస్థానంలో ముగిసిన సిరివెన్నెల అంత్యక్రియలు
Live Updates: Sirivennela Sitaramasastry: మహాప్రస్థానంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి అంత్యక్రియలు ఈ రోజు(బుధవారం) మధ్యాహ్నం 2:26 గంటలకు ముగిసాయి. హిందూ సాంప్రదాయాల ప్రకారం వేద పండితులు అంతక్రియల పక్రియ జరిపారు. ఫిల్మ్ ఛాంబర్ నుంచి మహా ప్రస్థానం వరకు అంతిమయాత్ర కొనసాగింది. అంతిమ యాత్రలో పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు సహా అభిమానులు పాల్గొన్నారు. ఫిల్మ్‌ఛాంబర్‌లో ఉన్న సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని భావోద్వేగానికి లోనయ్యారు. ఎలా వ్యక్తం చేయాలో తెలియడం లేదు: ఎన్టీఆర్ సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహానికి జూనియర్ ఎన్టీఆర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొన్నిసార్లు మన మాటల్ని ఎలా వ్యక్తపరచాలో తెలియదు, ఆయన ఎన్నో పాటలు రాశారు. రాబోయే తరానికి ఈ పాటలు ఆదర్శవంతంగా ఉంటాయి. రాబోయే తరానికి ఆయన పాటలు బంగారు బాటలు. తెలుగుజాతి బతికున్నంత కాలం.. ఆయన సాహిత్యం బతికే ఉంటుంది అని ఎన్టీఆర్ పేర్కొన్నారు. ►సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహానికి పవన్ కల్యాణ్ నివాళులర్పించారు.ఆయన మరణం చాలా బాధ కలిగించిందని, గొప్ప సాహిత్య సినీ గేయ రచయిత కనుమరుగు అయ్యారని పవన్ కల్యాణ్ అన్నారు. ఇలా కలుస్తాననుకోలేదు: దేవీశ్రీ ప్రసాద్ చాలారోజుల నుంచి కలవాలి అని అనుకుంటున్నాను. కానీ ఈ విధంగా కలుస్తాననుకోలేదు. మా నాన్నగారి తర్వాత నన్ను కొట్టేవారు, తిట్టేవారు ఆయన ఒక్కరే. అందరి గురించి ఆలోచించే వ్యక్తి ఆయన. నేను ఏమైనా పాట రాస్తే అది వివరించి చెప్పేవారు.కరోనా మా మధ్య దూరం పెంచింది. ►సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహానికి సినీ నటుడు శ్రీకాంత్ నివాళులర్పించారు. ►రాజశేఖర్ సినిమాలకి ఆయన ఎన్నో పాటలు రాశారు. నేను ఆయనను చాలా మిస్ అవుతున్నాను అని జీవిత రాజశేఖర్ భావోద్వేగానికి లోనయ్యారు. ►సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు అని రాజశేఖర్ అన్నారు. సామాన్యులకి కూడా అర్థం అవుతాయి: తలసాని సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాళులర్పించారు.సిరివెన్నెల మరణం తెలుగు చిత్ర పరిశ్రమకే కాదు..అందరికీ బాధాకరం అని తలసాని అన్నారు. 'మూడు వేలకు పైగా పాటలు రాసిన గొప్ప వ్యక్తి. సిరివెన్నెల పాటలు అంటే పండుగ లాంటి పాటలు. పద్మశ్రీ, 11 నంది అవార్డులు రావడం ఎంతో గొప్ప వరం. సామన్యులకి కూడా అర్థం అయ్యేలా ఆయన పాటలు ఉంటాయి. ఈరోజు తెలుగు వారంతా బాధలో ఉన్నారు. సిరివెన్నెల కుటుంబసభ్యులు ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు ఉన్న రైటర్స్‌కి సిరివెన్నెల స్పూర్తి. తెలంగాణ ప్రభుత్వం తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం 'అని తలసాని అన్నారు. మంచి వ్యక్తిత్వం..ఆ పాట గుర్తొస్తుంది: నాగార్జున సిరివెన్నెలతో నాకు ఎప్పటి నుంచో స్నేహం ఉంది. తెలుసా మనసా అనే పాట నాకు గుర్తు వస్తుంది. ఆయన రాసే పాటలు, చెప్పే మాటలే కాదు ఆయన మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. స్వర్గానికి వెళ్లి దేవుళ్లకు కూడా ఇదే మాటలు వినిపిస్తూ ఉంటారు అది ఊహించడమే కష్టం: మహేశ్ బాబు సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహానికి నివాళులర్పించిన సూపర్‌స్టార్ మహేశ్ బాబు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు లేకుండా తెలుగు పాటలు ఎలా ఉండబోతున్నాయనేది ఊహించడానికే కష్టంగా ఉంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నా అని మహేశ్ అన్నారు. అందుకే విష్ణు రాలేదు: నరేశ్ 'తెలుగు సినీ పరిశ్రమకి బాలు, సిరివెన్నెల లాంటి వారు రెండు రధ చక్రాలను కోల్పోయాం. పెద్ద దిగ్గజాన్ని కోల్పోయాం. సమురు లేని దీపం కుండలా సినీ పరిశ్రమ మిగిలిపోయింది. బాబాయ్ కర్మకి విష్ణు వెళ్లారు. అందుకే రాలేదు' అని నరేశ్ అన్నారు. ప్రతిరోజూ ఆయన పాటలు వింటాం: సింగర్ కౌసల్య సిరివెన్నెలను కోల్పోవడం చాలా బాధాకరం.సమాజాన్ని ప్రభావితం చేసే పాటలు రాశారు.ఆయన పాటలు తెలియని ప్రజానీకం లేరు. ఆయనతో నేను చాలా పాటలు పాడాను. సిరివెన్నెల గారు రాసిన పాటలు ప్రతిరోజూ వింటూ ఉంటాం. ►సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహానికి సినీ నటుడు జగపతిబాబు, సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ నివాళులు అర్పించారు. ►సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహానికిసింగర్ గీతామాధురి, నటుడు శివబాలాజీ నివాళులు అర్పించారు. ► ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహానికి ఏపీ సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని నివాళర్పించారు. ఆయన కుటుంబసభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. జీర్ణించుకోలేకపోతున్నాను: సింగర్ సునీత 'సిరివెన్నెల సీతారామశాస్త్రి మొదటిసారి నిద్ర పోవడం చూస్తున్నాను. వరుస కథలు, ఆలోచనలతో బిజీగా ఉంటారు. ఆయన మృతిని జీర్ణించుకోలేకపోతున్నాను. చిన్న చిన్న పదాలతో ఎన్నో అర్థాలు చెప్పడం ఆయన సొంతం. మహానుభావుడు చరిత్ర సృష్టించి నిద్రలోకి జారుకున్నారు. సిరివెన్నెల చీకటి మిగిల్చి వెళ్లిపోయారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడ్ని కోరుకుంటున్నాను' అని సునీత పేర్కొన్నారు. శకం ముగిసింది: అల్లు అరవింద్ 'సరస్వతి పుత్రడు సిరివెన్నెల. మెన్నటి వరకు కూడా ఆయన ఎన్నో పాటలు రాశారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాకి కూడా పాటలు రాశారు. వేటూరి తర్వాత శకం ముగిస్తే...సిరివెన్నెల తర్వాత మరో శకం ముగిసింది. బన్నీ అంటే ఆయనకి విపరీతమైన ఇష్టం. ఎందుకో తెలియదు కానీ బన్నీతో గంటల తరబడి గడిపేవారు' అంటూ అల్లు అరవింద్ ఆయనతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అల్లు అర్జున్ నివాళులు సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహాన్ని సందర్శించిన అల్లు అర్జున్ ఆయనకు నివాళులు అర్పించారు కంటతడి పెట్టుకున్న బాలకృష్ణ 'ఒక నమ్మలేని నిజం. ఏం మాట్లాడాలో తెలియడం లేదు. తెలుగు భాషకి, సాహిత్యానికి ఒక భూషణుడు సిరివెన్నెల. తాను పుట్టిన నేలకి వన్నె తెచ్చిన వ్యక్తి ఆయన., సిరివెన్నెల లేరంటే చిత్ర పరిశ్రమ శోక సముద్రంలో ఉన్నట్లు ఉంది. సాకు సాహిత్యం అంటే ఇష్టం. మేం ఇద్దరం ఎన్నో విషయాలు మాట్లాడుకునేవాళ్లం. ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. పుట్టినవారు గిట్టక తప్పదు.. కానీ 66 ఏళ్ళకి వెళ్ళారు' అంటూ బాలకృష్ణ కంటతడి పెట్టుకున్నారు. మంచి స్నేహితుడిని కోల్పోయా : మణిశర్మ 'జగమంత కుటుంబాన్ని వదిలేసి సిరివెన్నెల వెళ్లిపోయారు. మంచి సాహిత్యవేత్తతో పాటు మంచి వ్యక్తిని కోల్పోయాం. మంచి స్నేహితుడిని కోల్పోయాను' అని సంగీత దర్శకుడు మణిశర్మ భావోద్వేగానికి లోనయ్యారు. ఒక వటవృక్షం కూలిపోయింది: తనికెళ్ల భరణి 'సిరివెన్నెల భౌతికకాయాన్ని చూసి నటుడు తనికెళ్ల భరణి కన్నీటి పర్యంతమయ్యారు. ఎన్నోరోజులు కలిసి పనిచేశాం. ఒక వటవృక్షం కూలిపోయింది. ఇక అంతా శూన్యమే. దీన్ని భర్తీ చేయలేము. ప్రతిరోజూ నవ్వుతూ ఉండేవారు. ఆయన ప్రతీ పాట ప్రకాశిస్తుంది. సిరివెన్నెల లేని లోటు తీర్చలేం' అంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహానికి రామజోగయ్య శాస్త్రి నివాళులర్పించారు. గుండె తరుక్కుపోతుంది: పరుచూరి 'పాటే శ్వాసగా జీవించిన వ్యక్తి సిరివెన్నెల. అన్నగారూ అంటూ ఆత్మీయంగా పలకరించేవారు. ఆయన లేడు అంటే గుండె తరుక్కుపోతుంది. ఆ మహానుభావుడు లేడంటే బాధగా ఉంది. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి. వేటూరి తర్వాత స్థానం సిరివెన్నెలదే. సిరివెన్నెల ప్రతి పాట ఆణిముత్యం: సాయికుమార్ సిరివెన్నెల పార్థివదేహానికి సినీ నటుడు సాయికుమార్ నివాళులర్పించారు. 'ప్రతి అడుగులో నన్ను ఆశీర్వదిస్తూ వచ్చారు. ఆయన రాసే ప్రతి పాట ఆణిముత్యం. తెలుగు సాహిత్యానికి పట్టాభిషేకం చేసిన వ్యక్తి సిరివెన్నెల. ఎవడు సినిమాలో సిరివెన్నెల కుమారుడు నటించాడు. నేను విలన్ పాత్ర పోషించాను' అంటూ సాయికుమార్.. సిరివెన్నెలతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. పోలీసుల మీద పాట రాశారు: సజ్జనార్ సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. 'ఒక మంచి గేయ రచయితని కోల్పోయాం. రెండేళ్ల నుంచి సిరివెన్నెలతో నాకు పరిచయం. పోలీసుల మీద మంచి పాటలు రాశారు. పోలీసుల తరపున, టీఎస్ఆర్టీసీ తరపున ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం' అని సజ్జనార్ అన్నారు. సిరివెన్నెల లేరంటే సాహిత్యం చచ్చిపోయినట్లే: సి. కల్యాణ్ 'ఆరోజుల్లో సినిమా సాహిత్యం వేరు..ఇప్పుడు వేరు. సిరివెన్నెల సీతారామశాస్త్రి లేరంటే సాహిత్యం చచ్చిపోయినట్లే. ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేరు' అని నిర్మాత సి. కల్యాణ్ పేర్కొన్నారు. నారప్ప వరకు కలిసి పనిచేశాను: హీరో వెంకటేశ్ 'సిరివెన్నెల మరణవార్త ఎంతో బాధాకరం. ఎంతో మంచి వ్యక్తి. సర్ణకమలం నుంచి మొన్న వచ్చిన నారప్ప సిరివెన్నెలతో కలిసి పనిచేశాను. ఎంతో సన్నిహితంగా ఉండేవారు. సాహిత్యరంగంలో మనం ఓ లెజెండ్‌ను కోల్పోయాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను' అని వెంకటేశ్ అన్నారు. ఇంటి పెద్దను కోల్పోయినట్లు అనిపిస్తుంది: డైరెక్టర్ మారుతి 'ఇలా అవుతుందని అస్సలు ఊహించలేదు. గత ఐదారేళ్ల నుంచి ఆయన ఇంట్లో కుటుంబసభ్యుడిలా ఉంటున్నా. మా ఇంటి పెద్దను కోల్పోయినట్లు అనిపిస్తుంది. సిరివెన్నెల ఇంకా మనతోనే ఉన్నారు అనిపిస్తుంది. ఆయన పాటలు ప్రతిరోజూ వింటాం' అని మారుతి తెలిపారు. ఈ లోటు తీరేది కాదు: ఎస్వీ కృష్ణారెడ్డి 'సిరివెన్నెల లాంటి గొప్ప వ్యక్తి మనకు దొరకటం మన అదృష్టం. ఎన్నో సినిమాలకు ఆయన పాటలు రాశారు. ఆయన లోటు తీరేది కాదు' అని ఎస్వీ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘సిరివెన్నెల’కు ప్రముఖుల నివాళి
Sirivennela Sitaramasastri: ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అంత్యక్రియలు మహాప్రస్థానంలో ముగిశాయి. బుధవారం మధ్యాహ్నం 2:26 గంటల సమయంలో హిందూ సాంప్రదాయాల ప్రకారం వేద పండితులు అంతక్రియల పక్రియ జరిపారు. ఫిల్మ్ ఛాంబర్ నుంచి మహా ప్రస్థానం వరకు ఆయన అంతిమయాత్ర కొనసాగగా..ఈ యాత్రలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సహా అభిమానులు వందల సంఖ్యలో పాల్గొన్నారు. కాగా నవంబర్ 3న సిరివెన్నెల లంగ్ క్యాన్సర్‌తో మృతి చెందిన సంగతి తెలిసందే. అంతనం అభిమానుల సందర్శనార్థం సిరివెన్నెల భౌతిక కాయాన్ని కడసారి చూపు కోసం ఫిల్మ్ ఛాంబర్లో ఉంచారు. ఈ రోజపు మధ్యాహ్నం 1 గంటలకు సిరివెన్నెల అంతిమయాత్ర ప్రారంభం కాగా. మహాప్రస్థానంలో అంత్యక్రియలు ముగిశాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ప్రేక్షకులపై టికెట్ భారాన్ని, అధిక షోలను అరికడతాం: మంత్రి పేర్ని నాని
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ల ఆన్లైన్ పోర్టల్‌ను పారదర్శకంగా నిర్వహిస్తుందని సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఏపీ ఫిల్మ్ చాంబర్ వినతి మేరకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఏపీ సినిమా నియంత్రణ సవరణ బిల్లును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి బదులు మంత్రి నాని గురువారం శాసనమండలిలో ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ సందర్భంగా సభ్యులు లేవనెత్తిన పలు సందేహాలకు బదులిచ్చారు. ప్రజల వినోదానికి ఇబ్బందులు లేకుండా చేయడానికే ఈ బిల్లు తెచ్చామన్నారు. దీనిపై ఇప్పటికే సినీ పరిశ్రమకు చెందిన అన్ని వర్గాల వారితో పలుమార్లు చర్చలు జరిపామని గుర్తు చేశారు. అందరి ఆమోదంతోనే ఆన్లైన్ టికెట్ పద్ధతిని తెస్తున్నామన్నారు. రూ.వందల కోట్ల పెట్టుబడితో బ్లాక్‌బస్టర్ సినిమాలంటూ నిర్ణయించిన దాని కంటే అధిక ధరలకు టికెట్లు అమ్ముకుంటున్నారని విమర్శించారు. వీరిలో కొందరు ప్రభుత్వానికి జీఎస్టీ కూడా సక్రమంగా చెల్లించడం లేదన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు రాబట్టుకోవడానికి సినిమాటోగ్రఫీ చట్టానికి విరుద్ధంగా ఒకే రోజు అత్యధిక షోలు వేస్తున్నారని మండిపడ్డారు. వీటన్నింటినీ నియంత్రిస్తూ.. ప్రేక్షకుడికి టికెట్ ధరల భారం లేకుండా కొత్త విధానానికి మొగ్గు చూపామన్నారు. నిర్ణీత సమయాల్లోనే సినిమా షోలు ప్రదర్శించేలా చూస్తామని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా రెండు వర్సిటీలు.. రాష్ట్రంలో ప్రతి జిల్లాకు విశ్వవిద్యాలయం ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం రెండు కొత్త యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తోందని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన రెండు సవరణ బిల్లులను శాసనమండలిలో గురువారం ఆయన ప్రవేశపెట్టారు. ప్రకాశం జిల్లాలో ఉన్న నాగార్జున యూనివర్సిటీ పీజీ సెంటర్‌ను ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం యూనివర్సిటీగా, కాకినాడ జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూ)కి అనుబంధంగా విజయనగరంలో ఉన్న జేఎన్టీయూ కళాశాలను గురజాడ విశ్వవిద్యాలయంగా ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం అడిగిన ప్రశ్నకు మంత్రి సురేష్ బదులిస్తూ నెల్లూరు విక్రమసింహపురి యూనివర్సిటీకి తిక్కన పేరు పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. -
'మూడు నెలల వరకు సినిమాలను ఓటీటీలో విడుదల చెయ్యొద్దు'
సాక్షి, హైదరాబాద్ : ప్రస్తుతమున్న పరిస్థితుల్లో చిత్ర నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీలో విడుదల చేయొద్దని థియేటర్ల ఓనర్లు విఙ్ఞప్తి చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ..వచ్చే మూడు నెలల వరకైనా సినిమాలను ఓటీటీలో విడుదల చేయొద్దు. ఇప్పటికే మా ఒంటి నిండా బాణాలు గుచ్చుకున్నాయి. దయచేసి కత్తితో పొడిచి చంపకండి. చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా అక్టోబర్ తరువాతే ఓటీటీకి ఇవ్వండి అంటూ నిర్మాతలను కోరారు.ఈ సమావేశంలో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు మురళీమోహన్, సెక్రెటరీ సునీల్ నారంగ్, జాయింట్ సెక్రటరీ గోవింద్ రాజ్, విజయేంద్ర రెడ్డి, అనుపమ్ రెడ్డి, అభిషేక్ నామా సహా తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు మురళీ మోహన్ మాట్లాడుతూ... "మా అందరి అభిప్రాయం ఒక్కటే..అక్టోబర్ 30 వరకు నిర్మాతలందరూ కూడా తమ సినిమాలను ఓటీటీలకు అమ్మకండని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ తరువాత కూడా బాగా లేదంటే ఓటీటీలకు అమ్ముకోండి. నిర్మాతలెవ్వరూ కూడా ఇప్పుడే ఓటీటీలకు వెళ్లకండి’అన్నారు. తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ సెక్రటరీ సునీల్ నారంగ్ మాట్లాడుతూ.. "ఈ మీటింగ్ ఏర్పాటు చేసిందుకు అందరికీ థ్యాంక్స్. ఈ విషయం అందరికీ తెలియాలి. మనం ఏం చేస్తున్నాం ఏం చేయబోతోన్నామనేది అందరికీ తెలియాలి. మీ రిక్వెస్ట్ ఏంటి? అని చాలా మంది నిర్మాతలు ఫోన్ చేసి అడుగుతున్నారు. అందరికీ తెలియాలనే ఈ ప్రెస్ మీట్ పెట్టాం. ఆగస్ట్ మొదటి వారంలో అంతా సద్దుమణిగేట్టు కనిపిస్తోంది. చిన్నవాళ్లు అమ్ముకున్నారంటే పర్లేదు.. కనీసం పెద్ద వాళ్లు అయినా కూడా ఆపుకోవాలి కదా?. కనీసం అక్టోబర్ 30 వరకైనా ఆపుకోండి. సినిమాను కాపాడండి. ఓటీటీకి సినిమాలు ఇవ్వకండి..నేను కూడా సినిమాలు తీస్తున్నా. నేను కూడా నిర్మాతనే. నాక్కూడా ఆ బాధలు తెలుసు. నిర్మాత కంటే డిస్ట్రిట్యూబర్స్, ఎగ్జిబిటర్స్ ఎక్కువ బాధలు పడుతున్నారు. అందుకని, ఓటీటీకి సినిమాలు ఇవ్వకండి. ఒకవేళ అక్టోబర్ 31వరకు థియేటర్లు ఓపెన్ కాకపోతే అప్పుడు ఇచ్చుకోండి. మేం నిర్మించిన 'లవ్ స్టోరీ' సినిమాకు పది ఆఫర్లు వచ్చాయి. అయినా ఓటీటీలకు ఇవ్వలేదు. మా రిక్వెస్ట్‌ను నిర్మాతలందరూ వింటారని అనుకుంటున్నాను.. నమస్కారం పెట్టి మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను. హీరోలకు కూడా ఓటీటీలకు సినిమాలు ఇవ్వడం ఇష్టం లేదు. వాళ్ళు మాకు మద్దతు ఇస్తారు. థియేటర్లు ఓపెన్ అయితే ఓటీటీలు 40, 50 కోట్ల ఆఫర్లు ఇవ్వవు. థియేటర్స్ ప్రజెంట్ క్లోజ్ ఉన్నాయి కాబట్టి అంత అమౌంట్ ఇస్తున్నాయి. అందుకని, అక్టోబర్ వరకు వెయిట్ చేయండి’ అని అన్నారు. తెలంగాణ థియేటర్స్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ – ‘ఓటీటీ చట్టం కల్పించిన హక్కు కానే కాదు. సినిమాలను ఎవ్వరికైనా అమ్ముకోడం నిర్మాత హక్కు. సినిమాలు రిలీజైన పది వారాలకో ఎప్పుడో ఓటీటీకి అమ్ముకోవాలనే కండీషన్ తో పది కోట్లకో ఇరవై కోట్లకో డిస్ట్రిబ్యూటర్లు కొనుక్కుంటున్నారు. అలా కొనుక్కున్న రోజునే అగ్రిమెంట్లో ఎంటర్ చేస్తే.. మా ఛాంబర్ చర్య తీసుకుంటుంది. నిర్మాతలం మాకు హక్కు ఉంటుందని కాకుండా.. అక్టోబర్ వరకు ఎదురు చూడండి. అక్టోబర్ వరకు పరిస్థితు సద్దుమణకపోతే, ప్రభుత్వాలు అనుమతి ఇవ్వకపోతే, కరోనా తగ్గకపోతే అప్పుడు ఓటీటీకి వెళ్లండి. నిర్మాతలందరికీ ఇది మా రిక్వెస్ట్. అందరూ ఓపికతో ఉండండి. థియేటర్ వ్యవస్థను ఓటీటీలు కిల్ చేయడానికి చూస్తున్నాయి. ఈ రోజు మమ్మల్ని కిల్ చేస్తే రేపు నిర్మాతలను కిల్ చేస్తాయి. నిర్మాతలకు వెంటనే షేర్ ఇచ్చేది మేమే. పీవీఆర్, ఐనాక్స్ వంటి కంపెనీలు ఎప్పుడు ఇస్తాయో తెలిసిందే. అలాగే, ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ చేస్తాయి’ అని అన్నారు. చైర్మన్ డిస్ట్రిబ్యూషన్ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అభిషేక్ నామా మాట్లాడుతూ.. ‘ఈ పాండమిక్ వల్ల అందరూ ఎంత బాధ పడ్డారో అందరం చూశాం. అందరి కంటే ఎక్కువగా కష్టాలు పడింది సినిమా పరిశమ్రకు చెందిన వాళే. ఇప్పుడు అన్ని ఇండస్ట్రీలో కోలుకుంటున్నాయి. కానీ ఒక్క సినీ ఇండస్ట్రీ మాత్రం ఇంకా అలానే ఉంది. ప్రతీ శుక్రవారం రాగానే థియేటర్ల వద్ద సందడి కనిపించేది. కానీ ఇప్పుడు అది లేదు. ఓటీటీ వచ్చి ఫస్ట్ డే ఫస్ట్ షోను తీసేసింది. నిర్మాతలకు మంచి అమౌంట్ ఇచ్చి సినిమాలను తీసేసుకుంటున్నారు. అయితే థియేటర్లో సినిమా రిలీజ్ చేసిన ఆ తరువాత ఓ 20 రోజులకు ఓటీటీకి ఇస్తే అందరూ బాగుంటారు. థియేటర్లో టిక్కెట్ ఇచ్చే వ్యక్తి నుంచి ఎంతో మంది ఆధారపడి ఉన్నారు.. మీడియా కూడా ఆధారపడి ఉంది.. మీ సహకారం కూడా కావాలి.. అందరి సపోర్ట్ లేకపోతే దీన్ని మనం ముందుకు తీసుకెళ్లలేమ’ని అన్నారు. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్ మాట్లాడుతూ.. ‘ఓటీటీల గురించి నిర్మాతలందరినీ మేం రిక్వెస్ట్ చేస్తున్నాం. అలా కాకుండా.. వాళ్లు తమ ఇష్టం మేరకు వెళ్తే.. మేం ఏం చేయాలో అది చేస్తాం.. ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చేసి చూపెట్టాం.. అది వారికి తెలియడం లేదు.. ఇప్పుడైతే మేం రిక్వెస్ట్ చేస్తున్నాం.. నిన్న కూడా రిక్వెస్ట్ చేసినం.. భవిష్యత్ అంతా కూడా సినిమా పరిశ్రమదే, థియేటర్లదే. ఫ్యామిలీలు అంతా కూడా సినిమాకు వెళ్లాలంటే పిక్నిక్ టైప్ ప్లానింగ్ చేసుకుంటున్నాయ్. ఇంట్లో కూర్చుని చూస్తుంటే ఎవరో ఒకరు డిస్టర్బ్ చేస్తుంటే వాళ్లకి సినిమా ఏం అర్థమవుతుంది. ఇంకా 25 ఏళ్లు అయినా 50 ఏళ్లు అయినా కూడా థియేటర్ బతికే ఉంటుంది.. ఇది నా అభిప్రాయం’ అని అన్నారు. కాగా, లాక్డౌన్ కారణంగా ఇప్పటికే పలు సినిమాలు ఓటీటీ బాట పట్టిన సంగతి తెలిసిందే. దీంతో థియేటర్ ఓనర్లకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రస్తుతం లాక్డౌన్ కూడా ఎత్తివేసిన క్రమంలో అక్టోబర్ వరకు తెలుగు నిర్మాతలెవరూ తమ సినిమాలను ఓటీటీలో విడుదల చేయొద్దని ఓనర్లు విఙ్ఞప్తి చేశారు. ఇప్పటికే నిర్మాతలు ఓటీటీలో తమ సినిమాల్ని విడుదల చేయడం అక్టోబరు వరకు ఆపాలని తెలంగాణ ఫిల్మ్ ఫెడరేషన్ సూచించిన సంగతి తెలిసిందే. -
స్టాలిన్‌కు ఫిలిం చాంబర్ శుభాకాంక్షలు
సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి పదవి చేపట్టబోతున్న డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌కు సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే తమిళ సినీ నిర్మాతల సంఘం, థియేటర్ సంఘం నిర్వాహకులు, డిస్ట్రిబ్యూటర్ సంఘం సభ్యులు స్టాలిన్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. గురువారం ఉదయం తమిళ చలన చిత్ర యాక్టివ్ నిర్మాతల మండలి, దక్షిణ భారత చలన చిత్ర వాణిజ్య మండలి కార్యవర్గం స్టాలిన్‌ను ఆయన స్వగృహంలో కలిసి పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. -
'వకీల్‌సాబ్'కు వ్యతిరేకంగా చేసిన జీవో కాదు
సినిమా టిక్కెట్ రేట్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన తాజా జీవో సామాన్యులకూ, చిన్న నిర్మాతలకూ మేలు చేసేలా ఉందని అన్నారు దర్శక – నిర్మాత నట్టి కుమార్. ఈ విషయంపై గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ – ‘‘ఏప్రిల్ 8న ఏపీ ప్రభుత్వం జీవో నెంబర్ 35 జారీ చేసింది. టిక్కెట్ల రేట్ల సవరణకు సంబంధించి కొత్త జీవో పాస్ చేయాలని టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచే ఫిల్మ్ ఛాంబర్ తరఫున మేము అడుగుతూ వచ్చాం. ఏపీ సీయం జగన్ మోహన్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి, చిన్న సినిమాల నిర్మాతలకు ఉద్దేశించి ఇప్పుడు జీవోను పాస్ చేశారు. ‘వకీల్‌సాబ్’ సినిమా 9న రిలీజ్ అయితే, ఆ జీవో 8న పాస్ అయ్యింది. ‘వకీల్‌సాబ్’కు వ్యతిరేకంగా ఈ జీవో పాస్ చేశారంటూ ప్రచారం సాగింది. అది వాస్తవం కాదు. నిజానికి, ఇలాంటి జీవో కోసం ఫిల్మ్ ఛాంబర్ నుంచి చాలా సార్లు సంప్రదించాం. ‘వకీల్‌సాబ్’ టికెట్ రేట్లలో తేడాల వల్లే బెనిఫిట్ షోలు రద్దు అయ్యాయి. అంతేకానీ ప్రభుత్వం ఆ బెనిఫిట్ షోలను రద్దు చేసిందనేది అవాస్తవం. నిర్మాత డి. సురేశ్‌బాబు మీటింగులు పెట్టి, థియేటర్స్ బంద్ అంటున్నారని తెలిసింది. ‘వకీల్‌సాబ్’ నడిచేవరకు థియేటర్లు ఉంచి, తరువాత బంద్ చేస్తారట. ఈ నెల 16న నా సినిమా (‘ఆర్జీవీ దెయ్యం’) విడుదల ఉంది. ఏమైనా ఇబ్బందులు ఎదురైతే కోర్టుకు వెళతాను. థియేటర్లను మూసివేస్తామని బెదిరిస్తుంటే, వారి లైసెన్సులను రద్దు చేయాలి’’ అన్నారు. ‘‘కరోనా సమయంలోని మూడు నెలల ఫిక్స్డ్ కరెంట్ ఛార్జీలను రద్దు చేస్తూ, మరో ఆరు నెలల ఛార్జీలను వాయిదా వేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంతోషదాయకం. అలాగే, టిక్కెట్ రేట్ల అడ్డగోలు పెంపును అడ్డుకుంటూ, సామాన్యుడికి ప్రభుత్వం మేలు చేసింది’’ అన్నారు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ జాయింట్ సెక్రెటరీ జె.వి. మోహన్ గౌడ్. -
ప్రభుత్వానికి టాలీవుడ్ ధన్యవాదాలు
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ మీద వరాల జల్లు కురిపించిన తెలంగాణ ప్రభుత్వానికి తెలుగు చిత్ర పరిశ్రమ ధన్యవాదాలు తెలిపింది. టాలీవుడ్‌కు సంబంధించిన వివిధ శాఖల ఆధ్వర్యంలో ఫిలిం ఛాంబర్లో మంగళవారం నిర్వహించిన ప్రెస్ మీట్లో పలు అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. ముందుగా ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రెటరీ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ... సినీ పరిశ్రమకు రాయితీలు ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. దీనికి కారకులైన చిరంజీవి, నాగార్జునకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోలను అందరం చర్చించుకొని అమలు చేస్తామన్నారు. ఏపీలో కూడా కొన్ని సమస్యలు వున్నాయని, వాటి పైన కూడా చర్చలు జరిపి రెండు మూడు రోజుల్లో థియేటర్స్ ఎప్పుడు తెరుస్తామనే విషయాన్ని వెల్లడిస్తామని పేర్కొన్నారు. (చదవండి: సినీ పరిశ్రమను కాపాడుకుంటాం: కేసీఆర్) తెలుగు ఇండస్ట్రీకి ఇద్దరు నాన్నలు నిర్మాతల మండలి అధ్యక్షుడు కళ్యాణ్ మాట్లాడుతూ.. 'జీహెచ్ఎంసీ మేనిఫెస్టోలో సినిమా వాళ్లకు కొన్ని రాయితీలు ప్రకటించారు. దీనికోసం చిరంజీవి నాగార్జున, మంత్రి తలసాని చొరవ తీసుకున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి మాతో రెండున్నర గంటలు మాట్లాడారు. రోజుకు ఎక్కువ షో లు వేసుకొనే విధంగా అనుమతి ఇచ్చారు. ఇది దేశంలో ఒక్క తెలంగాణాలో మాత్రమే వుంది. దీని వల్ల చాలా చిన్న సినిమాలు వస్తాయి. ఫలితంగా ఉపాధి కూడా పెరుగుతుంది. ఇక తెలుగు ఇండస్ట్రీకి ఇద్దరు నాన్నలు.. ఒకరు కేసీఆర్, మరొకరు వైఎస్ జగన్మోహన్రెడ్డి. సినీ ఇండస్ట్రీ గురించి ఏపీ సీఎం జగన్ గారితో కూడా చర్చిస్తాం. మా ఇండస్ట్రీ తరుపున పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేసి ఇద్దరు సీఎంలను ఆహ్వానించి, కృతజ్ఞతలు తెలుపుతాము' అని చెప్పుకొచ్చారు. సినీ ఇండస్ట్రీ కోసం రాయితీలు ప్రకటించిన కేసీఆర్‌కు మా అసోసియేషన్ సెక్రెటరీ జీవిత, డైరెక్టర్స్ అధ్యక్షుడు ఎన్.శంకర్, నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. (చదవండి: మాయలు మంత్రాలు అంటే ఆసక్తి ఉండేదట) -
ఫిల్మ్ ఛాంబర్లో మంత్రి, సినీ ప్రముఖుల భేటీ
సాక్షి, హైదరాబాద్: కరోనా వల్ల సినిమా షూటింగ్స్ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న విధంగా తయారైంది. ఈ క్రమంలో తాజాగా కేంద్రప్రభుత్వం సినిమా, టీవీ చిత్రీకరణలకు అనుమతినిచ్చిచ్చిన విషయం తెలిసిందే. అలాగే ఆరోగ్య శాఖ సూచనల మేరకు కొన్ని గైడ్ లైన్స్ కూడా విడుదల చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని టూరిజం ప్రాంతాల్లో సినిమా షూటింగ్‌లపై తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, సినీ పెద్దలతో కలిసి ఫిల్మ్ ఛాంబర్లో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో నిర్మాతలు సి.కళ్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ సహా పలువురు హాజరయ్యారు. (రామానాయుడుగారు మాకు రోల్‌మోడల్) చదవండి: షూటింగ్స్ ప్రారంభించుకోండి! -
రామానాయుడుగారు మాకు రోల్‌మోడల్
‘‘రామానాయుడుగారంటే మాకు ఓ హీరో, రోల్‌మోడల్. దాసరి నారాయణరావుగారు, రామానాయుడుగారు నన్ను ఎంతగానో ప్రోత్సహించిన వ్యక్తులు. సినీ పరిశ్రమ, దాని అనుబంధ కార్యాలయాలన్నీ అభివృద్ధి కావడానికి రామానాయుడుగారే కారణం. ఆయన జయంతిని మేం గొప్పగా జరుపుకుంటాం. ఆయన్ను తలచుకునే సినిమా స్టార్ట్ చేస్తాం. రామానాయుడుగారి వారసుడిగా అభిరామ్ ఆయన స్థానాన్ని భర్తీ చేస్తాడు’’ అని అన్నారు నిర్మాత సి. కల్యాణ్. ప్రముఖ నిర్మాత డా. డి. రామానాయుడు 85వ జయంతి కార్యక్రమం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ ఆవరణలో జరిగింది. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ మాట్లాడుతూ –‘‘రామానాయుడుగారు లేకుంటే హైదరాబాద్‌లో సినీ పరిశ్రమ, ఫిలిం నగర్, హౌసింగ్ సొసైటీ ఉండేది కాదు. రామానాయుడుగారి పేరుతో ఏది మొదలుపెట్టినా అది సక్సెస్. చెన్నారెడ్డి, దాసరి నారాయణరావు, రామానాయుడుగార్లు ఫిలింనగర్‌కు దేవుళ్లులాంటి వారు’’ అని అన్నారు. ‘‘నిర్మాతగా నాకు రామానాయుడుగారే స్ఫూర్తి. వారి ఫాలోయర్‌గా సినిమాలు చేశాను. మా బ్యానర్లో మంచి సినిమాలు రావడానికి నాయుడుగారి ప్రోత్సాహం ఉంది’’ అన్నారు నిర్మాత కేఎస్ రామారావు. ‘‘మా తాతగారు భౌతికంగా లేకున్నా మానసికంగా నాకు ఎప్పుడూ సపోర్ట్‌గానే ఉంటారు’’ అన్నారు అభిరామ్. ఈ కార్యక్రమంలో రామానాయుడు పెద్ద కుమారుడు, నిర్మాత డి. సురేష్‌బాబు, సి.కల్యాణ్, కేఎస్ రామారావు, అభిరామ్ దగ్గుబాటి, కాజా సూర్య నారాయణ, జె. బాలరాజు రామానాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. -
‘మిమ్మల్ని పెయిడ్ ఆర్టిస్టులని పిలవలేం.. కానీ’
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న పరిపాలన వికేంద్రీకరణ నిర్ణయం సరైందని సినీ నిర్మాతల సంఘం మాజీ చైర్మన్ సత్యారెడ్డి అన్నారు. ఆయన శనివారం ఫిల్మ్ చాంబర్లో మీడియాతో మాట్లాడారు. కొందరు రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలని ఫిల్మ్ ఛాంబర్ ముందు ధర్నా చేస్తున్నారని తెలిపారు. వారి నిరసన కార్యక్రమానికి మద్దతునివ్వాలని ఒత్తిడి తెస్తున్నారని అన్నారు. రాజకీయాల్లోకి సినీ ప్రముఖులను ఎందుకు లాగుతున్నారని సత్యారెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఎవరికీ తాము మద్దతు ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు. ‘ఫిల్మ్ చాంబర్ ముందు ధర్నా చేస్తున్న వారిని పెయిడ్ ఆర్టిస్టులని పిలవలేం కానీ, మీరు మాత్రం కచ్చితంగా అభివృద్ధిని అడ్డుకునే వ్యక్తులే’ అని ఆయన పేర్కొన్నారు. -
ఫిలించాంబర్ ఎదుట హీరో ఆత్మహత్యాయత్నం
సాక్షి, హైదరాబాద్: సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్న సమయంలో తన చిత్రాన్ని యూట్యూబ్‌లో పెట్టారని ఆరోపిస్తూ ‘నానిగాడు’ చిత్ర హీరో దుర్గాప్రసాద్ మంగళవారం ఫిలించాంబర్ ఎదుట ఆందోళనకు దిగాడు. రూ.40 లక్షలు ఖర్చు పెట్టి నానిగాడు సినిమా తీస్తే సినిమా విడుదల కాకముందే యూట్యూబ్‌లో పెట్టారని దీని వల్ల తమకు ఎంతో నష్టం వాటిల్లిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశాడు. సినిమా విడుదలకు సెన్సార్ బోర్డు యూ సర్టిఫికెట్ కూడా ఇచ్చిందని చిత్ర యూనిట్ తెలిపింది. సినిమా విడుదల కాకముందే సినిమా మొత్తాన్ని యూట్యూబ్‌లో పెట్టడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ లింక్‌ను వెంటనే తొలగించి తమకు న్యాయం చేయాలని లేని పక్షంలో ఫిలించాంబర్ ఎదుట చిత్ర యూనిట్ మొత్తం ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపాడు. కాగా, బుధవారం ఉదయం మరోసారి ఫిలించాంబర్ వద్దకు వచ్చి ఆత్మహత్యాయత్నం చేశాడు. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించారు. ఆందోళన చేస్తున్న దుర్గాప్రసాద్ -
ప్రకాశ్‌రాజ్‌ను బహిష్కరించాలి
సాక్షి, బెంగళూరు: బహుభాషా నటుడు ప్రకాశ్ రాజ్‌ను సినిమాల నుంచి బహిష్కరించాలని కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలిలో ఫిర్యాదు నమోదైంది. హిందూ దేవుళ్లు, హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యానించారని, ఆయనకు సినిమాల్లో అవకాశాలు ఇవ్వవద్దని అఖిల భారత హిందూ మహాసభా వేదిక ఫిర్యాదు చేసింది. ఆయన రామాయణాన్ని అవమానిస్తున్నారని, హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడుతున్నారని ఫిల్మ్ చాంబర్‌కు ఫిర్యాదు లేఖను అందించింది. ఈ నేపథ్యంలో ఆయనను కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి బహిష్కరించాలని, ఆయనకు కన్నడ సినిమాల్లో అవకాశం కల్పించరాదని, ఒకవేళ ఇస్తే మున్ముందు తమ పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. వివాదం ఎక్కడ? ఇటీవల కొన్ని రోజుల క్రితం ఒక ప్రైవేటు వార్తా చానెల్ చర్చలో పాల్గొన్న ప్రకాశ్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తర ప్రదేశ్‌లో రథోత్సవానికి ముంబై నుంచి హెలికాప్టర్ల ద్వారా ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ మోడళ్లను పిలిపిస్తున్నారని ప్రకాశ్ రాజ్ అన్నారు. అంతేకాకుండా మేకప్ చేసి ఆ మోడళ్లతో శ్రీరాముడు, సీత, లక్ష్మణుడి వేషాలు వేయిస్తున్నారని, వారికి ఘనంగా పూల స్వాగతం పలుకుతున్నారని, ఐఏఎస్ అధికారులు వారికి నమస్కరిస్తున్నారని, ఈ విధమైన చర్యలు దేశానికి ప్రమాదకరమని అన్నారు. ఈ సందర్భంలో ఇది ప్రజాస్వామ్య దేశం, ఎవరైనా వారికిష్టం వచ్చినట్లు చేయవచ్చునని, అందరి మనోభావాలకు విలువివ్వాలని చర్చ వ్యాఖ్యాత తెలిపారు. దీనికి ప్రకాశ్ రాజ్ బదులిస్తూ చిన్నపిల్లలు అశ్లీల వీడియోలు చూస్తుంటే మౌనంగా ఎలా ఉంటామని, అదే విధంగా దేశానికి ప్రమాదకర విషయాలను ప్రశ్నించాల్సిందేనని చెప్పారు. వేడుకల పేరిట మైనార్టీలకు భయపెట్టే సన్నివేశాలను సృష్టిస్తే ఎలా అని ప్రశ్నించారు. -
చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షునిగా నారాయణ్‌దాస్
శనివారం హైదరాబాద్‌లో చలన చిత్ర వాణిజ్య మండలి ఎన్నికలు జరిగాయి. ఇందులో ఎగ్జిబిటర్ సెక్టార్, డిస్ట్రిబ్యూటర్ సెక్టార్, స్టూడియో ఓనర్స్ సెక్టార్, నిర్మాతల మండలి.. ఇలా నాలుగు విభాగాలుంటాయి. ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఈ ఎన్నికల్లో ఒక్కోసారి ఒక్కో విభాగం నుండి ఒకర్ని అధ్యక్షునిగా ఎంపిక చేస్తారు. ఈసారి ఎగ్జిబిటర్ సెక్టార్ తరఫున ఏషియన్ ఫిలింస్ అధినేత నారాయణ్‌దాస్ నారంగ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 12 మంది ఎగ్జిక్యూటివ్ సభ్యుల కోసం సి.కల్యాణ్ ఆధ్వర్యంలో ‘మన ప్యానెల్’, ‘దిల్’ రాజు సారధ్యంలోని ‘యాక్టివ్ ప్రొడ్యూసర్ ప్యానెల్’ పోటీ పడ్డాయి. ‘మన ప్యానెల్’ నుండి తొమ్మిది మంది విజయం సాధిస్తే యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ప్యానెల్ నుండి ఇద్దరు విజయం సాధించారు. మోహన్‌గౌడ్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా విజయం సాదించారు. ఉపాధ్యక్షులుగా ముత్యాల రాందాసు, ‘దిల్’ రాజు, కొల్లి రామకృష్ణ, కార్యదర్శులుగా దామోదర్ ప్రసాద్, ముత్యాల రమేశ్, సహాయ కార్యదర్శులుగా భరత్ చౌదరి, నట్టికుమార్, జి. వీరనారాయణబాబు, జె. మోహన్ రెడ్డి, పి. భరత్ భూషణ్, ఎన్. నాగార్జున, కోశాధికారిగా విజయేందర్ రెడ్డి నియమితులయ్యారు. ఇంకా నాలుగు విభాగాల్లో నిర్మాతల విభాగానికి ఏలూరు సురేందర్ రెడ్డి, పంపిణీ విభాగానికి ఎన్. వెంకట్ అభిషేక్, స్టూడియో విభాగానికి వై. సుప్రియ, థియేటర్ అధినేతల విభాగానికి టీఎస్ రాంప్రసాద్ నియమితులయ్యారు. -
దిల్ రాజు ప్యానల్‌పై సీ కల్యాణ్ ప్యానల్ ఘనవిజయం
సాక్షి, హైదరాబాద్ : తెలుగు ఫిలిం చాంబర్ ఎన్నికలు ముగిశాయి. దిల్ రాజు, సీ కల్యాణ్ వర్గాలు పోటాపోటీగా తలపడిన ఈ ఎన్నికల్లో సీ కల్యాణ్ వర్గం పైచేయి సాధించింది. సీ కల్యాణ్, ప్రసన్నలు నేతృత్వం వహిస్తున్న మన ప్యానల్ ఈసీ మెంబర్స్‌తో పాటు సెక్టార్ మెంబర్స్‌ను కూడా పెద్ద సంఖ్యలో గెలిపించుకోని ఘనవిజయం సాధించింది. యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ప్యానల్ విజయం సాధించకపోయినా ఆ ప్యానల్ నుంచి దిల్ రాజు, దామోదర ప్రసాద్‌లు ఈసీ సభ్యులుగా విజయం సాధించారు. 12 మంది ఈసీ మెంబర్లలో 9 మంది సీ కల్యాణ్ నేతృత్వంలోని మన ప్యానెల్ నుంచి గెలుపొందగా, ఇద్దరు దిల్ రాజు సారధ్యంలోని యాక్టివ్ ప్యానల్ నుంచి విజయం సాధించారు. మోహన్ గౌడ్ ఇండిపెండెంట్‌గా పోటి చేసి విజయం సాధించారు. 20 మంది సెక్టార్ మెంబర్స్‌లో 16 మంది మన ప్యానల్ నుంచి విజయం సాధించగా, నలుగురు యాక్టివ్ ప్యానల్ నుంచి గెలుపొందారు. ఫిలిం చాంబర్లో నిర్మాతలు, స్టూడియో యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు భాగస్వాములుగా ఉన్నారు. నాలుగు విభాగాల్లో ప్రతీ రెండేళ్లకు ఒకసారి ఒక్కో విభాగం నుంచి అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకోవటం ఆనవాయితీగా వస్తోంది. ఈ సారి కూడా అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఎగ్జిబిటర్స్ విభాగం నుంచి నారాయణ దాస్ నారంగ్‌ను ఫిలిం చాంబర్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్: నారాయణ్‌దాస్ నారంగ్ వైస్ ప్రెసిడెంట్లు : దిల్ రాజు, ముత్యాల రామదాసు సెక్రటరీ : దామోదర్ ప్రసాద్ జాయింట్ సెక్రటరీ : నట్టికుమార్, భరత్ చౌదరి ట్రెజరర్ : విజయేందర్ రెడ్డి -
రామానాయుడు విగ్రహావిష్కరణ
మూవీ మొఘల్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత రామానాయుడు జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్‌లోని ఫిల్మ్ చాంబర్ ఆవరణలో గురువారం ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రముఖ నిర్మాత, రామానాయుడు కుమారుడు దగ్గుబాటి సురేశ్‌బాబు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సినీ, రాజకీయ రంగాలకు రామానాయుడు అందించిన సేవలను అతిథులు కొనియాడారు. దర్శకుడు కె.రాఘవేంద్రరావు, నిర్మాత అల్లు అరవింద్, ఫిల్మ్‌నగర్ సొసైటీ అధ్యక్షులు జి. ఆదిశేషగిరిరావు, రచయితలు పరుచూరి వెంకటేశ్వరరావు, పరుచూరి గోపాలకృష్ణ, నటులు కైకాల సత్యనారాయణ, గిరిబాబు, కోట శ్రీనివాసరావు, ఆర్.నారాయణమూర్తి, విజయ్‌చందర్, శివకృష్ణ, కేఎల్ నారాయణ, ఎంపీ రఘురామ కృష్ణంరాజు, దర్శకుడు బి.గోపాల్, నిర్మాతలు సి.కల్యాణ్, అశోక్ కుమార్, బోయిన సుబ్బారావు, జూబ్లీహిల్స్ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ పాల్గొన్నారు. -
‘మా’ అధ్యక్షుడు ఎవరు?
... అనే ఉత్కంఠ చిత్ర వర్గాల్లో నెలకొంది. హైదరాబాద్‌లోని ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్‌లో ‘మా’(మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికలు ఆదివారం జరిగాయి. సీనియర్ నరేశ్, శివాజీరాజా ప్యానెల్స్ బరిలో నిలిచాయి. ‘మా’లో సుమారు 800మంది సభ్యులు ఉండగా 472 ఓట్లు పోలయ్యాయి. బ్యాలెట్æపద్ధతిలో ఓటింగ్ విధానం జరగడంతో లెక్కింపు ఆలస్యమైందని తెలిసింది. ఆదివారం అర్ధరాత్రి దాటాకే రిజల్ట్ వచ్చే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ‘మా’ నూతన అధ్యక్షుడు శివాజీరాజానా? నరేశా? అన్నది నేడు అధికారికంగా ప్రకటించనున్నారు. జమున, రోజా రమణి, గీతాంజలి, కోటా శ్రీనివాసరావు, కృష్ణ, విజయ నిర్మల, చిరంజీవి, నాగార్జున, బాబూమోహన్, గిరిబాబు, రాళ్లపల్లి, విజయ్ చందర్, చలపతిరావు, జయసుధ, వై.విజయ, జయలలిత, ఆర్. నారాయణమూర్తి, రాజశేఖర్, జీవిత, లక్ష్మీ మంచు, ‘అల్లరి’ నరేశ్, నాని, రానా, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సుధీర్‌బాబు, సునీల్, అలీ, తరుణ్, జేడీ చక్రవర్తి, ప్రియమణి వంటి పలువురు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కృష్ణ, జమున, కోటా శ్రీనివాసరావు చిరంజీవి, నాగార్జున, జయసుధ -
‘మా’ డబ్బుతో టీ కూడా తాగలేదు
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో(మా) మరో వివాదం తలెత్తింది. ‘మా’ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆరోపణలు రావడం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్ అయింది. దీనిపై స్పందించిన ‘మా’ కార్యవర్గం సోమవారం ఫిల్మ్‌ఛాంబర్‌లో సమావేశమై చర్చించింది. సమావేశం అనంతరం ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా విలేకరులతో మాట్లాడుతూ –‘‘మా’ నిధులు దుర్వినియోగం అయ్యాయనే వార్తల్లో నిజం లేదు. అసోసియేషన్ డబ్బుతో నేను ఇప్పటి వరకూ టీ కూడా తాగలేదు. ఫోన్ కూడా సొంతదే వాడుతున్నా. నా పిల్లల మీద ఒట్టు.. నేను తప్పు చేశానని, డబ్బులు తిన్నానని.. కనీసం 5పైసలు దుర్వినియోగమైనట్లు నిరూపిస్తే పెద్దమ్మ తల్లి సాక్షిగా గుండు చేయించుకుని, నా ఆస్తి మొత్తం ‘మా’కు రాసిస్తా. అంతేకాదు.. ‘మా’ సభ్యత్వం శాశ్వతంగా రద్దు చేసుకుంటా. సిల్వర్ జూబ్లీ వేడుకలకు ఒప్పందం ప్రకారమే డబ్బు వసూలైంది. త్వరలో ‘మా’ ఎన్నికలు సమీపిస్తున్నందున కొంతమంది తాము చేసే ప్రతి పనిని తప్పుబడుతూ ఆరోపణలు చేస్తున్నారు. ‘మా’లో సభ్యుల మధ్య ఎలాంటి విభేదాలు లేవు’’ అన్నారు. ‘మా’ కార్యవర్గ సభ్యుడు, హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ– ‘‘తనపై ఆరోపణలు నిరూపిస్తే మా అసోసియేషన్ నుంచి శాశ్వతంగా తప్పుకుంటా. మా సిల్వర్ జూబ్లీ ఇయర్ సందర్భంగా నూతన బిల్డింగ్ కట్టబోతున్నాం. దీని కోసం చిరంజీవిగారిని కలిస్తే రెండు కోట్లు డొనేషన్ ఇస్తానని చెప్పి, ఇప్పటికే కోటి రూపాయలు ఇచ్చారు. ఫండ్స్ కోసం అమెరికాలో ప్రోగ్రాం చేయడంతో చిరంజీవిగారు ముఖ్య అతిథిగా వచ్చారు. తర్వాత హీరోలు మహేశ్‌బాబు, ప్రభాస్ కూడా వస్తారు’’ అన్నారు. ‘‘మా’ అసోసియేషన్‌లో ప్రస్తుతం రూ.5 కోట్ల వరకు డబ్బులున్నాయి’’ అని ‘మా’ కోశాధికారి, రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు చెప్పారు. నన్ను దూరం పెట్టారు ‘మా’ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో నిధులు దుర్వినియోగం ఆరోపణలపై ‘మా’ జనరల్ సెక్రటరీ, నటుడు నరేశ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఫిల్మ్‌ఛాంబర్‌లో విలేకరులతో మాట్లాడుతూ– ‘‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. తనపై వచ్చిన ఆరోపణలకు శివాజీరాజా సమాధానం చెప్పాల్సిందే. విదేశీ కార్యక్రమాల గురించి తను ఎటువంటి వివరాలు నాకు చెప్పలేదు. అమెరికా ఈవెంట్ కోసం శివాజీరాజాతో సహా మరికొందరు బిజినెస్ క్లాస్‌లో 3 లక్షలు చెల్లించి మరీ ప్రయాణం చేసిన డబ్బంతా ఎవరిది? మహేశ్‌బాబు ప్రోగ్రాం కోసం శివాజీరాజాను నమ్రత దగ్గరకు నేనే తీసుకువెళ్లా. ఆ తర్వాత వేరే వాళ్ల నుంచి నాకు కాల్స్ వచ్చాయని నమ్రత నాకు చెప్పారు. ఈ ప్రయత్నాలు నన్ను తప్పించడానికే. వచ్చే ‘మా’ ఎన్నికల్లో పోటీచేయదలచుకోవడం లేదు. ఏప్రిల్ నుంచి నా కాల్స్‌కి శివాజీరాజా స్పందించటం లేదు. నిధుల దుర్వినియోగం వివాదంపై రిటైర్డ్ ఐపీఎస్ అధికారితో హైపవర్ నిజనిర్ధాణ కమిటీ వేద్దామంటే శివాజీరాజా అంగీకరించడం లేదు. ఈ విషయాన్ని చిరంజీవిగారి దృష్టికి కూడా తీసుకువెళ్లాను’’ అన్నారు. -
కర్ణాటకలో ‘ కాలా’ కష్టాలు
బెంగళూరు: కర్ణాటకలో సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులకు చేదు వార్త. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న తలైవా తాజా చిత్రం ‘ కాలా’ కర్ణాటకలో విడుదలయ్యే అవకాశం కనిపించడంలేదు. కావేరీ జల వివాదంపై రజనీకాంత్ చేసిన వాఖ్యలపట్ల కర్ణాటక వాసులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీంతో కర్ణాటక ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ‘ కాలా’ చిత్రాన్ని ప్రదర్శించరాదని నిర్ణయించుకుంది. కావేరీ జలాలపై రజనీ వాఖ్యలు కన్నడిగుల మనోభావాలను దెబ్బతీశాయని దీంతో చిత్ర ప్రదర్శనను అడ్డుకుంటున్నామని ఫిల్మ్‌ఛాంబర్ తెలిపింది. తమిళనాడుకు కావేరీ జలాలను తక్షణమే విడుదల చేయాలని రజనీకాంత్ గతంలో కోరిన విషయం తెలిసిందే. కర్ణాటకకు చెందిన రజనీకాంత్ తమిళనాడులో నటుడై ఇక్కడే పేరు, ప్రఖ్యాతులు పొందారు. అయితే ప్రస్తుతం కావేరి మేనేజ్మెంట్ సమస్య తమిళనాడు, కార్ణాటక మధ్య ఆగ్రహ జ్వాలలను రేకెత్తిస్తున్న విషయం తెలిసిందే. రజనీకాంత్ తమిళనాడుకు కావేరి వ్యవహారంలో మద్ధతుగా మాట్లాడాల్సిన నిర్భంధానికి గురయ్యారు. ఆయన అదే చేశారు కూడా. కావేరి మేనేజ్మెంట్ బోర్టు ఏర్పాటు చేయాలంటూ కోలీవుడ్ నిర్వహించిన దీక్షలోనూ రజనీకాంత్ పాల్గొన్నారు. దీంతో కన్నడిగులు ఆయనపై గుర్రుగా ఉన్నారు. కొన్ని కర్ణాటక సంఘాలు అయితే తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశారు. నటుడు ధనుష్ తన వండర్‌బార్ ఫిలింస్ పతాకంపై నిర్మించిన చిత్రం కాలా. ఈశ్వరిరావు, బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషీ, నానాపటేకర్, సముద్రకని వంటి ప్రముఖులు ప్రధాన పాత్రలను పోషించిన ఈ చిత్రానికి కబాలీ చిత్రం ఫేమ్ పా.రంజిత్ దర్శకుడు. ముంబాయిలోని ధారవి నేపథ్యంలో జరిగే ఒక దాదా కథగా తెరకెక్కిన చిత్రం అని, ఇందులో రాజకీయ పరమైన అంశాలు చాలానే చోటు చేసుకుంటాయని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని జూన్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంపై రజనీకాంత్ గత చిత్రాలన్నింటికంటే అధికంగా అంచనాలు, ఆసక్తి పెంచుకున్నారు. కారణం చిత్రంలో రాజకీయ సెటైరికల్ సంభాషణలు ఒక అంశం కాగా.. ఇది రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం గురించి ప్రకటించిన తరువాత విడుదల కానున్న చిత్రం కావడం మరో అంశం. ఇక నటుడు సత్యరాజ్ ఏవో అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన ఒక పాత్రలో నటించిన బాహుబలి చిత్ర విడుదలనే కన్నడిగులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. చివరికి సత్యరాజ్ క్షమాపణ చెప్పక తప్పలేదు. అలాంటిది కర్ణాటకలో పుట్టిన రజనీకాంత్ విషయంతో కన్నడిగులు ఉదారత చూపించలేదు. మరి ఈ సూపర్‌స్టార్ కూడా సారీ చెబుతారా? కాలా ఎలాంటి సమస్య లేకుండా కర్ణాటకలో విడుదలవుతుందా? అన్న ఆసక్తి చిత్ర వర్గాల్లో నెలకొంది. -
దాసరిగారు చరిత్రలో నిలిచిపోతారు
‘‘దాసరిగారి పుట్టినరోజుని ‘డైరెక్టర్స్ డే’గా ప్రకటించడం ఆనందంగా ఉంది. ఆయన దర్శకుడు కాకముందు నేను చేసిన ‘మా నాన్న నిర్దోషి’కి అసోసియేట్‌గాను, నేను నటించిన ‘జగత్ కిలాడీలు, ‘హంతకులు, దేవాంతకులు’ చిత్రాలకు డైలాగ్స్ రాశారు. ఆ తర్వాత నేను హీరోగా ‘రాధమ్మ పెళ్లి’ సినిమాకి దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వంలో చాలా సినిమాలు చేశాను. 150 సినిమాలకు పైగా తెరకెక్కించిన ఘనత దాసరిగారిది. నాకు తెలిసి భవిష్యత్‌లో ఏ దర్శకుడూ ఇన్ని సినిమాలు చేయలేరేమో’’ అని సీనియర్ నటుడు కృష్ణ అన్నారు. శుక్రవారం ఫిల్మ్ చాంబర్లో జరిగిన దాసరి విగ్రహావిష్కరణలో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ – ‘‘దాసరిగారు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. సినీ పరిశ్రమకు ఏ కష్టం వచ్చినా ఆయన తన భుజాలపై వేసుకుని పరిష్కరించేవారు. మంచి, చెడు అన్నీ ఆయనే చూసుకునేవారు. పరిశ్రమను తన కుటుంబంలా చూసుకున్నారు. దాసరిగారు చరిత్రలో నిలిచిపోతారు’’ అన్నారు. ‘‘మా నాన్నగారి (నందమూరి తారక రామారావు)తో దాసరిగారు ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలు తీశారు. ఆయన 150వ చిత్రం ‘పరమవీర చక్ర’లో నటించే అవకాశం నాకు కలిగింది. ఒక కార్మికుడిలా ఇండస్ట్రీ బాగు కోసం జీవితాన్ని త్యాగం చేశారు’’ అన్నారు బాలకృష్ణ. దాసరికి భారతరత్న ఇవ్వాలని, ఈ అంశాన్ని తాము పార్లమెంట్లో కూడా లేవనెత్తామని, ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా ఇవ్వాలని మురళీమోహన్ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత, ఫిలింనగర్ సొసైటీ అధ్యక్షుడు ఆదిశేషగిరిరావు, కార్యదర్శి కాజా సూర్యనారాయణ, నిర్మాతలు సి. కళ్యాణ్, అల్లు అరవింద్, నటి–దర్శకురాలు విజయ నిర్మల తదితర ప్రముఖులు పాల్గొన్నారు. మే 4.. డైరెక్టర్స్ డే దాసరి జన్మదినాన్ని పురస్కరించుకుని మే 4ని డైరెక్టర్స్ డేగా ప్రకటించింది తెలుగు సినీ దర్శకుల సంఘం. వేదికపై డైరెక్టర్స్ అందరూ కలిసి ‘హ్యాపీ డైరెక్టర్స్ డే’ అని అనౌన్స్ చేశారు. ‘‘దాసరి జన్మదినాన్ని డైరెక్టర్స్ డేగా అనౌన్స్ చేయాలని నిర్ణయించిన దర్శక పెద్దలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. నిజానికి ఇది దాసరిగారి హక్కు’’ అన్నారు ఆర్. నారాయణమూర్తి. తనికెళ్ల భరణి ‘సినిమా’ మీద రాసిన కవిత్వం, డైరెక్టర్స్‌పై చంద్రబోస్ రచించిన పాటను ప్రదర్శించారు. ఈ గీతానికి ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించారు. దాసరిపై రచయిత గుమ్మడి గోపాలకృష్ణ పద్యాలను వినిపించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్.శంకర్. అప్పుడు దండం పెట్టినవాళ్లు ఇప్పుడు ఎక్కడ? – దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ దాసరి నారాయణరావు 76వ జయంతి వేడుకలను ఆయన స్వగృహంలో కుటుంబ సభ్యులు, అభిమానులు నిర్వహించారు. ఈ వేడుకల్లో ‘నీహార్ ఇన్ఫో గ్లోబల్ లిమిటెడ్’ ఛైర్మన్ బీయస్యన్ సూర్యనారాయణ ఏర్పాటు చేసిన ‘దాసరి టాలెంట్ అకాడమీ వెబ్సైట్’ ఆవిష్కరణ జరిగింది. దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ– ‘‘దాసరిగారి దగ్గర ఉండాలని చాలామంది పోటీపడేవారు. ఎప్పుడూ గురువుగారి పక్కన ఉండే మాలాంటి వాళ్లని కూడా తోసేసేవారు. వాళ్లు ఈ రోజు రాలేదు. కొన్నేళ్ల క్రితం ‘వీళ్లతో ఎందుకు గురువుగారూ.. మీతో పనులు చేయించుకుని, మీ ఇంటి తలుపు దాటక ముందే తిడుతున్నారు’ అని నేనంటే, ‘ఎవరెవరు నాటకాలు ఆడుతున్నారో నాకు తెలియదని కాదు. కానీ ఇండస్ట్రీలో ప్రశ్నించేవాడు ఒకడు ఉన్నాడు అన్న రోజునే వీళ్లందరూ భయపడతారు. లేకపోతే ఇండస్ట్రీ కకావికలం అయిపోతుంది’ అన్నారు. ఆ కకావికలం దాసరిగారు లేని ఈ వన్ ఇయర్లో చూశాం’’ అన్నారు. దాసరిగారు నిజంగా ఓ శిఖరం – ‘సాక్షి’ ఎడిటోరియల్ డైరెక్టర్ కె. రామచంద్రమూర్తి ‘సాక్షి’ ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్ర మూర్తి మాట్లాడుతూ – ‘‘ఇక్కడున్న అందరికీ దాసరిగారితో సినిమా అనుబంధం ఉంటే నాకు పత్రికానుబంధం ఉంది. ‘ఉదయం’లో పని చేసిన ఏ ఇద్దరు కలిసినా గత 25 ఏళ్లుగా ఏం జరిగిందని మాట్లాడుకోకుండా ‘ఉదయం’ రోజులు ఎలా గడిపాం అని మాట్లాడుకుంటాం. 1984 నుంచి నేనెక్కడున్నా దాసరిగారు ఎక్కడున్నా తప్పకుండా మే 4న ఆయన్ను కలిసి అభినందించాల్సిందే. గతేడాది వరకూ దాసరిగారిని అభినందించని సంవత్సరం లేదు. దాసరిగారు చాలామందికి సహాయం చేసేవారు. ఇటీవల సినిమా పరిశ్రమలో కొన్ని జరగకూడని సంఘటనలు జరిగినప్పుడు నారాయణరావుగారు ఉంటే బావుండు అనుకున్నాం. ఈ కథను ఇంత దూరం రానిచ్చేవారు కాదు. పరిష్కరించేవారని మా జర్నలిస్ట్‌లంతా అనుకున్నాం. ‘సాక్షి’ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ అని నాలుగు సంవత్సరాల ముందు మొదలుపెట్టాం. దాసరిగారికి ‘దర్శక శిఖరం’ అని బిరుదును కూడా ప్రదానం చేశాం. ఆయన నిజంగా శిఖరం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో కోడి రామకృష్ణ, సి. కల్యాణ్, రేలంగి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. దాసరి స్వగృహంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులు ‘డైరెక్టర్స్ డే’ని ప్రకటిస్తున్న చిత్రరంగ ప్రముఖులు -
ఫిలిం ఛాంబర్లో దాసరి విగ్రహాన్ని ఆవిష్కరణ
-
‘పరమవీరచక్ర చేయడం నా అదృష్టం’
దాసరి జయంతి సందర్భంగా సినీ ప్రముఖులు శుక్రవారం సాయంత్రం ఫిలిం ఛాంబర్లో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం పలువురు సినీ ప్రముఖులు మీడియాతో మాట్లాడారు. ‘దాసరి గారు పరిశ్రమ కష్టాలను తన ఇంట్లో కష్టాలుగా భావించేవారు. దాసరి గారితో ఎప్పుడో సినిమా చేయాలి కానీ, ఆయన తన 150వ సినిమాగా పరమ వీర చక్ర చేయడం నా అదృష్టం. ఏ విషయాన్నైనా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడే వ్యక్తిత్వం అంటే నాకు ఇష్టం. దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా, నటుడిగా, కార్మికుడిగా ఆయనలో ఎన్నో కోణాలు ఉన్నాయ’ని బాలకృష్ణ అన్నారు. ‘ దాసరి గారికి దాదా సాహెబ్ ఫాల్కే, భారత రత్న అవార్డులు ఇవ్వాలని పార్లమెంట్లో పోరాడుతామ’ని ఎంపీ మురళీ మోహన్ తెలిపారు. దర్శక దిగ్గజం, నిర్మాత, నటుడు డాక్టర్ దాసరి నారాయణరావు 71వ జయంతి సందర్భంగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఆయనకు అరుదైన గౌరవాన్ని అందించింది. దాసరి జయంతిని డైరెక్టర్స్ డేగా తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం ప్రకటించింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని.. దాసరి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ, సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల, సి.కల్యాణ్ తదితర సినీ ప్రముఖులు పాల్గొన్నారు. భౌతికంగా ఆయన దూరమైనా.. ఆయన చిత్రాల ద్వారా ఎప్పటికీ గుర్తుండిపోతారని తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం ఈ సందర్భంగా ప్రకటించింది. దాసరి జయంతి వేడుకలను నేడు ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్లో నిర్వహించనున్నారు. ఇక పలువురు దర్శకులు, సినీ ప్రముఖులు ఆయన్ని గుర్తు చేసుకుంటూ తమ సందేశాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.‘తెలుగు చలన చిత్ర పరిశ్రమకు భీష్మాచార్యుడు, తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘానికి ద్రోణాచార్యుడు , సినిమా ఇంటికి పెద్ద, దాసరి నారాయణ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తెలిపారు. ఆయన గొప్ప హృదయం ఉన్న వ్యక్తి అని.. ఇండస్ట్రీలో ఎందరికో మార్గదర్శి అని దర్శకుడు శీనువైట్ల పేర్కొన్నారు. ‘అందరం ఇక్కడే ఉన్నాం. కానీ ఆయనలేరు. దాసరి నారాయణ రావు గారు లేని లోటు స్పష్టంగా తెలుస్తోంది అని దర్శకుడు పూరి జగన్నాథ్ ట్వీట్ చేశారు. -
ఏకాభిప్రాయం కుదిరేనా?
వేతనాల పెంపు, హాఫ్ కాల్షీట్ రద్దు వంటి తమ సమస్యలను పరిష్కరించాలంటూ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో లైట్స్‌మన్ స్ట్రైక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్‌తో లైట్స్‌మన్ యూనియన్ చర్చలు జరిపింది. కానీ, చర్చల్లో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ధర్నా చేసేందుకు గురువారం ఫిల్మ్ చాంబర్‌కు వెళ్లింది లైట్స్‌మన్ యూనియన్. గురువారం సాయంత్రం యూనియన్ అధ్యక్షుడు శ్రీనివాస్ ‘సాక్షి’ తో మాట్లాడుతూ– ‘‘24 యూనియన్స్‌లో 23 యూనియన్స్‌కు అగ్రిమెంట్స్ అయ్యాయని తెలిసింది. మాకు అగ్రిమెంట్ పేపర్స్ వచ్చాయని అంటున్నారు. అందుకే ప్రస్తుతానికి ధర్నాను నిలిపివేశాం. మరోసారి చర్చలు జరపనున్నాం. ఈ సమావేశంలోని నిర్ణయాలు మాకు సానుకూలంగా రాకపోతే బంద్‌ను కొనసాగించే ఆలోచనలో ఉన్నాం. పూర్తి వివరాలు అగ్రిమెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత తెలియజేస్తాం’’ అన్నారు. -
అన్నపూర్ణ స్టూడియోస్‌కు పవన్..!
గత కొద్ది రోజులు తెలుగు సినీ పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలపై సినీపెద్దలు అన్ని రంగాల వారితో విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి మా అధ్యక్షులు శివాజీ రాజా.. నిర్మాతలు సురేష్ బాబు, అల్లు అరవింద్, కేయస్ రామారావు, దానయ్య,ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, ఠాగూర్ మధు, అశోక్ కుమార్, సీ కల్యాణ్‌తో పాటు వివిధ శాఖలకు చెందిన యన్వి ప్రసాద్, నరేష్, వంశీ పైడిపల్లి, హరీష్ శంకర్, పరుచూరి వెంకటేశ్వరరావు, రఘుబాబు, జెమినీ కిరణ్, కాశీ విశ్వనాథ్, హలు అన్నపూర్ణ 7 ఎకరాల స్టూడియోకు చేరుకున్నారు. పవన్ కూడా సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతుండటంతో అభిమానులు కూడా అన్నపూర్ణ స్టూడియోస్‌కు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం కూడా స్పందించింది. సినీ పరిశ్రమకు సంబంధించిన అంశాలపై ఈ రోజు సాయంత్రం 4గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తెలంగాణ సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గత కొన్ని రోజులుగా సినిమా రంగంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు.. మహిళలు ఎదుర్కుంటున్న సమస్యలు వంటి అంశాలపై సినీరంగ ప్రముఖులు, పోలీసు ఉన్నతాధికారులు, కార్మిక శాఖకు సంబంధించిన అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. -
నేడు సినీ పెద్దలతో మంత్రి తలసాని చర్చలు
-
ఫిల్మ్‌ఛాంబర్‌కు ఒక్కరోజు గడువు: పవన్
-
24 గంటల్లో తేల్చండి.. లేకపోతే! : పవన్
సాక్షి, హైదరాబాద్: ఇండస్ట్రీ పెద్దలు, కుటుంబ సభ్యులతో సమావేశం అనంతరం సినీ నటుడు పవన్ కల్యాణ్ ఫిల్మ్ ఛాంబర్ నుంచి వెళ్లిపోయారు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సినీ పెద్దలకు పవన్ ఒకరోజు గడువిచ్చారు. 24 గంటల్లో స్పందించకపోతే భవిష్యత్ కార్యాచరణ చేపట్టనున్నట్లు పవన్ స్పష్టం చేశారు. సుదీర్ఘ చర్చల అనంతరం పవన్‌తో పాటు ఫిల్మ్ ఛాంబర్ బయటకొచ్చిన మెగా ఫ్యామిలీ హీరోలు పోలీసుల సూచనతో ఇంటికి వెళ్లిపోయారు. మెగా ఫ్యామిలీ హీరోలు ఒకే చోటకు చేరడం, మరోవైపు తమ సమస్యపై పోరాడుతుంటే వారికి మద్దతుగా అభిమానులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్న విషయం తెలిసిందే. అయితే మెగా హీరోలు ఛాంబర్ నుంచి బయటకు వస్తున్న సమయంలో కాస్త ఉద్రిక్త వాతావరణం కనిపించింది. దీంతో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని, పోలీసులు కోరడంతో మెగా హీరోలు అక్కడినుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. కొందరు వ్యక్తులు తనపై కక్షగట్టి ఉద్దేశపూర్వకంగా తన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేయించారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు కుట్ర జరుగుతుందంటూ సోషల్ మీడియాలో చేసిన వరుస ట్వీట్లు కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఫిల్మ్ ఛాంబర్‌కు పవన్‌తో పాటు సోదరుడు నాగబాబు వచ్చి సినీ పెద్దలతో తమపై చేస్తున్న ఆరోపణలు, కుట్రలపై సుదీర్ఘంగా చర్చించారు. మెగా ఫ్యామిలీ హీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్‌లతోపాటు అల్లు అరవింద్, దర్శకుడు వీవీ వినాయక్, జీవి, రమేశ్ మెహర్, 'మా' సభ్యులు అక్కడికి చేరుకుని సంఘీభావం తెలిపారు. తొలుత పవన్ దీక్షకు దిగుతారని భావించగా, తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సినీ పెద్దలకు పవన్ ఒకరోజు గడువిచ్చారు. అంతలోపు స్పందించి సమస్య పరిష్కరించపోతే భవిష్యత్ కార్యాచరణ చేపడతానని పవన్ తెలిపారు. పవన్ ఏం చేయబోతున్నారన్న దానిపై ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. -
నా తల్లికి న్యాయం జరిగే వరకు కదలను : పవన్
సాక్షి, హైదరాబాద్ : సినీ పెద్దలు, కుటుంబ సభ్యులతో ఫిల్మ్ ఛాంబర్లో సమావేశమైన పవన్ కల్యాణ్ ‘మా’ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై జరుగుతున్న కుట్రపై స్పందించాలని లేకపోతే దీక్షకు దిగుతానని పవన్ వారితో హెచ్చరించినట్లు సమాచారం. ‘కుట్ర వెనకాల ఉంది ఎవరో చెప్పాను. వారిపై చర్యలు తీసుకోవాలి. ‘మా’ చర్యలు చేపడతుందా? లేదా నేనే కార్యాచరణకు దిగలా? నా తల్లికి న్యాయం జరిగే వరకు ఛాంబర్ విడిచిపోను’ అని పవన్ వారితో ఖరాఖండిగా చెప్పినట్లు తెలుస్తోంది. ఛాంబర్ రెండు వైపులా తలుపులు వేసుకుని లోపల కూర్చున్న పవన్.. నిరసన కొనసాగిస్తూనే చర్చలు కొనసాగిస్తున్నారు. ఫిల్మ్ ఛాంబర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఫిల్మ్ ఛాంబర్లో పవన్ కల్యాణ్.. మెగా ఫ్యామిలీ, కొందరు సినీ ప్రముఖుల భేటీ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పవన్‌కు మద్ధతు తెలపటానికి వచ్చిన ఫ్యాన్స్ ఒక్కసారిగా లోపలికి దూసుకెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో భద్రతా సిబ్బంది వారిని అడ్డుకుంటున్నారు. మరోవైపు పవన్ ఫ్యాన్స్ ‘ఎల్లో మీడియా డౌన్ డౌన్.. లోకేశ్ పప్పు నినాదాలతో’ ఆ ప్రాంతమంతా హోరెత్తించారు. సినీ ప్రముఖులంతా ఒక్కోక్కరుగా పవన్‌కు సంఘీభావం తెలిపేందుకు ఛాంబర్‌కు చేరుకుంటున్నారు. మెగా ఫ్యామిలీ హీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్‌లతోపాటు అల్లు అరవింద్, దర్శకుడు వీవీ వినాయక్, జీవి, రమేశ్ మెహర్, మా సభ్యులు అక్కడికి చేరుకున్నారు. కాసేపట్లో మెగాస్టార్ చిరంజీవి కూడా రావొచ్చని సంకేతాలు అందుతున్నాయి. పవన్ కల్యాణ్‌కు సినీ రంగం బాసటగా నిలుస్తోంది. పూరీ జగన్నాథ్ ఇప్పటికే ట్వీట్ చేయగా.. ఈ వ్యవహారంపై ప్రముఖ నిర్మాత కేఎస్ రామారావు స్పందించారు. వర్మను ఓ వేస్ట్ ఫెలో అంటూ అభివర్ణించిన ఆయన.. మెగా ఫ్యామిలీకి మద్ధతు ఇస్తున్నట్లు ప్రకటించారు. -
పవన్ నిరసన: ఫిల్మ్ ఛాంబర్ వద్ద ఉద్రిక్తత
-
ఫిల్మ్ ఛాంబర్లో పవన్, నాగబాబు
సాక్షి, హైదరాబాద్ : తనకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలను ఖండిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారు. తాజా పరిణామాలపై పవన్.. తన న్యాయవాదులతో ఫిల్మ్ ఛాంబర్లో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక పవన్ వెంటనే సోదరుడు నాగబాబు రాగా.. మా ప్రెసిడెంట్ శివాజీరాజా, రామ్ చరణ్ సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, అల్లు అర్జున్, పరుచూరి వెంకటేశ్వరరావు, మెహర్ రమేష్, నరేష్, హేమ తదితరులు ఫిల్మ్ ఛాంబర్‌కు వచ్చారు. కాసేపట్లో పవన్ మీడియా సమావేశంలో మాట్లాడే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ట్వీటర్ వేదికగా పవన్ గత రాత్రి నుంచి సంచలన వ్యాఖ్యలతో పోస్టులు పెడుతున్న విషయం తెలిసిందే. మరోవైపు పవన్ అభిమానులు భారీగా ఫిల్మ్ ఛాంబర్‌కు చేరుకుంటుండగా.. మా కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శ్రీరెడ్డి వివాదం.. మొత్తం కుట్రకు సూత్రధారి చంద్రబాబే : పవన్ -
వర్మది క్రూయల్ మైండ్
" నేను ఇండస్ట్రీకి వచ్చి 40 ఏళ్లయ్యింది. మా నాన్నగారు అల్లు రామలింగయ్య, ఆ తర్వాతి తరంలో నేను, చిరంజీవి, ఆ తర్వాతి తరంలో పవన్ కల్యాణ్ నుంచి.. చిత్ర పరిశ్రమలో ఉన్న మాకు ఇండస్ట్రీ అంటే భక్తి, గౌరవం. ఇప్పుడు ఇండస్ట్రీలో జరుగుతున్న బాధాకరమైన విషయాలు మీకు తెలిసినవే. శ్రీరెడ్డిగారు తీసుకొచ్చిన కొన్ని విషయాలపై ఫిల్మ్‌చాంబర్‌లో జరిగిన మీటింగ్స్‌లో ఒక్కదానిలో తప్ప అన్నింటిలో నేనూ ఉన్నా. లైంగిక దాడులకు వ్యతిరేకంగా ఓ కమిటీ పెట్టుకోవాలి. వాటిని అరికట్టడానికి తీసుకోబోతున్న జాగ్రత్తల గురించి త్వరలో ఇండస్ట్రీ చెబుతుంది’’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. గురువారం అల్లు అరవింద్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక మంచి పని చేయబోతోంది. 50 శాతం అవుట్‌సైడర్స్, 50 శాతంæఇండస్ట్రీవాళ్లతో కలిపి ఒక రిడ్రెస్సల్ కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. వేధింపులు ఎదురయ్యాయని ఎవరైనా ఫిర్యాదు చేస్తే 24 క్రాఫ్ట్స్‌లో వారు ఏ విభాగానికి చెందితే అందులోంచి తొలగించాలని ఈ కమిటీ నిర్ణయిస్తుంది. కమిటీలో నేను కూడా ఉండబోతున్నా’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి నేను సీనియర్ మెంబర్ని. నేను టార్గెట్ చేస్తున్నది రామ్‌గోపాల్ వర్మని. రామ్‌గోపాల్‌వర్మ అనే వ్యక్తి గొప్ప సినిమాలు తీసి, పేరు ప్రఖ్యాతులు సంపాదించి ఆల్ ఇండియా డైరెక్టర్‌గా ముంబైలో ఉన్నాడు. ఆయన తెలుగు ఇండస్ట్రీని తల్లిలా భావించాలి. కానీ, అతను ఎంత ద్రోహం చేస్తున్నాడు? ఎంత నికృష్టుడో చెప్పడానికే మీ ముందుకు వచ్చా. ‘బాహుబలి’ తీసింది మేమురా? తెలుగు ఇండస్ట్రీ అని చెప్పుకుని గర్వపడే ఈ సమయంలో ఇలాంటివి ఏంటి? అని బాధపడుతున్న తరుణం. బుధవారం రాత్రి ఓ వీడియో చూశాక రామ్‌గోపాల్ వర్మ‘గారు’ అనే గౌరవం పోయింది. ఒక ఛండాలపు మాటను పవన్ కల్యాణ్‌ని ఉద్దేశించి శ్రీరెడ్డితో నేనే (వర్మ) అనిపించానని, ఇందుకు ఫ్యాన్స్‌కు క్షమాపణ అని రామ్‌గోపాల్ వర్మ చెబుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. ఇంకో వీడియోలో రామ్‌గోపాల్‌వర్మ చెప్పడం వల్లే తాను ఇవన్నీ చేశానని శ్రీరెడ్డి వాయిస్ విన్నాను. ఈ వీడియో బయటకు వస్తుందని సేఫ్‌గా వర్మ ముందే తానే శ్రీరెడ్డితో అలా చెప్పించానని వీడియో రిలీజ్ చేసి, క్షమాపణ చెప్పాడు. నువ్వు (వర్మని ఉద్దేశించి) సురేశ్‌బాబు (నిర్మాత) ఫ్యామిలీతో మాట్లాడి, శ్రీరెడ్డికి 5 కోట్లు ఇప్పించడానికి ట్రై చేశానని చెప్పావు. నేను సురేశ్ ఫ్యామిలీ మెంబÆŠ్సతో మాట్లాడాను. ‘‘లా ఆఫ్ ది ల్యాండ్‌కు మేము లొంగుతాం తప్ప ఇవన్నీ వేస్ట్. ఎంకరేజ్ చేయం’’ అని చెప్పారు. శ్రీరెడ్డికి నువ్వు ఇప్పిస్తానన్న 5 కోట్ల ఆఫర్ నీకు ఇచ్చింది ఎవరు? ఆ అమ్మాయితో ఓ బూతు మాట్లాడించి పవన్ సైజ్ (ఇమేజ్) తగ్గిండానికి నీకు ఫండ్ చేస్తున్నది ఎవరు? దీని వెనకాల ఉన్న కుట్ర ఏంటి? వంటి సందేహాలతో నాకు నిద్ర పట్టలేదు. ఇండస్ట్రీలోని ఒక ఫ్యామిలీపై నీకింత జాగ్రత్త ఉంటే.. మా కుటుంబం మీద లేదా? అంటే.. ఈ కుటుంబంలో చిరంజీవి, పవన్, రామ్‌చరణ్ ఉన్నారు. నీకీ కుటుంబం అంటే దుగ్ధ. సురేశ్ కుటుంబాన్ని కాపాడాలని అలా చేశానని అన్నావు. ఎంత నాటకం? నీ బతుక్కి అవసరమా? నువ్వు తెలివైనవాడివే. కానీ క్రూయల్ మైండ్. వర్మను ఏం చేస్తారనేది ఇండస్రీయే నిర్ణయిస్తుంది. వర్మకు సొసైటీ ఎటువంటి శిక్ష విధించాలి?’’ అన్నారు. -
శ్రీరెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ మాధవి లత మౌనదీక్ష
-
పోలీసుల అదుపులో మాధవి లత
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ ఫిలిం చాంబర్ ఎదుట మౌనదీక్ష చేసిన హీరోయిన్ మాధవి లతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జన సేన అధినేత పవన్ కల్యాణ్‌పై నటి శ్రీరెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ ఆమె ఈ చర్యకు దిగారు. బుధవారం ఉదయమే ఫిలిం చాంబర్ వద్దకు చేరుకున్న మాధవి లత.. తలకు, దుస్తులకు నల్లరంగు రిబ్బన్లు ధరించి కార్యాలయం ముందు బైఠాయించారు. పవన్ అభిమానులు సైతం ఆమెతో కలిసి దీక్షలో కూర్చున్నారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లోని కొందరు సభ్యులు కూడా ఆమెకు మద్దతుపలికినట్లు సమాచారం. పోలీస్ స్టేషన్లోనూ దీక్ష కొనసాగింపు: కొద్ది రోజుల కిందట ఇదే ఫిలిం చాంబర్ ముందు నటి శ్రీరెడ్డి చేసిన అర్ధనగ్న నిరసన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన దరిమిలా నేటి మాధవి లత దీక్షపై చాంబర్ వర్గాలు ఆందోళన చెందినట్లు తెలిసింది. మాధవి మౌనదీక్షకు కూర్చున్న కొద్దిసేపటికే పోలీసులు రంగప్రవేశం చేశారు. మహిళా కానిస్టేబుళ్లు ఆమెను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తనను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెట్టిన హీరోయిన్.. స్టేషన్లోనూ మౌనదీక్ష కొనసాగిస్తానని స్పష్టం చేశారు. శ్రీరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు: కాస్ట్ కౌచింగ్‌పై గళమెత్తి, దానిని చర్చనీయాంశంగా మార్చిన నటి శ్రీరెడ్డి.. ఇటీవలే నటుడు పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత క్షమాపణలు చెప్పడం తెలిసిందే. తమ అభిమాన హీరోను దూషించిన నటి శ్రీరెడ్డిపై పవన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాధవీ లతకు సంఘీభావంగా దీక్షలో కూర్చున్న పవన్ అభిమానులు.. శ్రీరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
ఫిల్మ్ ఛాంబర్ వద్ద దీక్షకు దిగిన మాధవీ లత
-
నటి శ్రీరెడ్డిపై పవన్ కల్యాణ్ ఫిర్యాదు
సాక్షి, సిటీబ్యూరో (హైదరాబాద్): తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖులను కించపరిచే విధంగా వ్యవహరిస్తున్న నటి శ్రీరెడ్డిపై చర్యలు తీసుకోవాలని సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు రెండు రోజుల క్రితం టాలీవుడ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన సైబర్ క్రైమ్ పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. న్యాయ నిపుణుల సలహా మేరకు కేసు నమోదు చేసే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. పలు వార్తా చానళ్లు, యూట్యాబ్ చానళ్లతో మాట్లాడుతూ.. తెలుగు సినిమా ప్రముఖులపై శ్రీరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తెలుగు అమ్మాయిలను తక్కువగా చూస్తున్నారని, అవకాశాలు ఇవ్వడం లేదని వాపోయారు. పరభాషా నటీనటులను ప్రోత్సహిస్తున్నారని, తెలుగువారిని అక్కునచేర్చుకోవడం లేదని ఆమె ఆరోపించారు. -
సినీ ధరల చెల్లింపు వివాదం పరిష్కరిస్తా
సాక్షి, హైదరాబాద్: క్యూబ్/యూఎఫ్‌వో సంస్థల నిర్వాహకులకు, సినీ ఎగ్జిబిటర్లకు ధరల చెల్లింపు వివాదాన్ని ఇరుపక్షాలతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ హామీ ఇచ్చారు. బుధవారం సచివాలయంలో ఎఫ్డీసీ చైర్మన్ రాంమోహన్‌రావు ఆధ్వర్యంలో సౌత్ ఇండియా ఫిలిం చాంబర్, తెలుగు ఫిలిం చాంబర్, తెలంగాణ ఫిలిం చాంబర్ ప్రతినిధులు మంత్రిని కలిశారు. ప్రస్తుతం థియేటర్లలో సినిమాలను ప్రదర్శిస్తున్న క్యూబ్/యూఎఫ్‌వో సంస్థలు ధరలు పెంచడాన్ని నిరసిస్తూ ఈ నెల 2 నుంచి దక్షిణ భారతదేశంలో సినిమాల ప్రదర్శనను నిలిపివేయనున్నట్లు వారు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. తెలుగు, హిందీ సినిమాల పట్ల ఒకలా, హాలీవుడ్ చిత్రాల పట్ల మరోలా క్యూబ్ నిర్వాహకులు వ్యవహరిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం ఎగ్జిబిటర్ల స్థితిగతులు అంతంతమాత్రంగానే ఉన్నాయని.. ఇలాంటి పరిస్థితుల్లో ధరలు పెంచితే తీరని నష్టం వాటిల్లుతుందని చెప్పారు. దీనిపై ప్రభుత్వం జోక్యం చేసుకుని ధరల విషయంలో కచ్చితమైన ఆదేశాలు ఇచ్చేలా తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చలనచిత్ర పరిశ్రమకు కేసీఆర్ హయాంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ సినీ రంగ పరిశ్రమ పురోభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తలసాని వారికి తెలిపారు. సింగిల్ విండో విధానం, ఆన్లైన్ టికెటింగ్, పరిశ్రమలోని కార్మికులకు ఇళ్ల నిర్మాణంతోపాటు పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని మంత్రి గుర్తుచేశారు. మంత్రిని కలసిన వారిలో ఫిల్మ్ చాంబర్స్ అధ్యక్షుడు మురళీమోహన్, సౌత్ ఇండియా నిర్మాతల సంఘం కార్యదర్శి సి.కళ్యాణ్, తెలుగు ఫిలిం చాంబర్ అధ్యక్షులు జెమిని కిరణ్, దామోదర్‌ప్రసాద్ తదితరులు ఉన్నారు. -
మార్చి1 నుంచి సినీ పరిశ్రమ బంద్
సాక్షి, చెన్నై: డిజిటల్ విధానాన్ని వ్యతిరేకిస్తూ మార్చి1 నుంచి చిత్ర పరిశ్రమ బంద్ చేపడుతున్నట్టు తమిళ నిర్మాతల మండలి ప్రకటించింది. ఈ నేపథ్యంలో షూటింగ్‌లు, సినిమాల విడుదలను నిలిపి వేయాలని నిర్ణయం తీసుకుంది. డిజిటల్ విధానానికి వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సోమవారం మండలి సభ్యులు ప్రటించారు. కాగా, డిజిటల్ ప్రొవైడర్ల విధానాల కారణంగా నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు తీవ్రంగా నష్టపోతున్నారని వారు మండిపడ్డారు. కేవలం తమ లాభాలనే దృష్టిలో పెట్టుకుని తీసుకుంటున్న ఏక పక్ష నిర్ణయాలు సినీ పరిశ్రమలో అందరికీ నష్టాలను మిగులుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అందరికీ ఆమోదయోగ్యమైన చార్జీలను వసూలు చేయాలని దక్షిణాది ఫిల్మ్ ఛాంబర్స్ పలుసార్లు డిజిటల్ ప్రొవైడర్లను కోరినా ఎలాంటి స్పందన రాలేదు. దీంతో చిత్ర పరిశ్రమ బంద్‌కు పిలుపునిచ్చారు. -
ఫిల్మ్ ఛాంబర్ కి వర్మ బహిరంగ లేఖ
ఇటీవల డ్రగ్స్ కేసుకు సంబంధించిన ఫిలిం ఛాంబర్ ప్రముఖులు రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన బహిరంగ లేఖపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఘాటుగా స్పందించారు. ఇండస్ట్రీ పెద్దలు ప్రభుత్వానికి క్షమాపణ చెప్పిన విదానాన్ని ఆయన తప్పుపట్టారు. ఫిల్మ్ ఛాంబర్ కి నా బహిరంగ లేఖ అంటూ సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు. ' సినీ పరిశ్రమ నిజంగా సిగ్గు పడాల్సిన విషయం, డ్రగ్ స్కాండల్ కాదు..ఆ డ్రగ్ స్కాండల్ కి సంబంధించి ఫిల్మ్ ఛాంబర్ ఒక బహిరంగలేఖతో తెలుగు సినీ పరిశ్రమకు తలవంపులు తెచ్చే విధంగా అవసరం లేని క్షమాపణ చెప్పి ప్రాధేయపడిన విధానం ఫిల్మ్ ఛాంబర్ గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే నోటీసులు అందుకుని విచారణకి హాజరైన వారిలో ఏ ఒక్కరూ కూడా తాము తప్పు చేసామని బహిరంగంగా చెప్పడం కానీ, వారిలో ఫలానా వారి తప్పు నిరూపించబడింది అని అధికారులు చెప్పడం గాని ఇంతవరకు జరగలేదు. ఈ రెండూ జరగనప్పుడు ఏ కారణానికి అపాలజీ చెప్పినట్టు? అపాలజీ లెటర్ లో ఒక వాక్యం "అతికొద్దిమంది చేసిన పొరపాట్లకి ఒక పరిశ్రమ తలవంచుకోవాల్సిన పరిస్థితి రావడం చాలా బాధాకరం"- ఏమిటిది? ఎవరు చెప్పారు మీకు ఎవరు పొరపాట్లు చేసారో? అసలు వాళ్లు చేసిన నేరమేమిటో, దానికి సంబంధించిన ఆధారాలు ఏమిటో కూడా చెప్పకుండా వాళ్లు అప్పుడే ఏదో మహా నేరం చేసినట్టు కలర్ ఇచ్చిన అధికారులపై ఆగ్రహించాల్సింది పోయి ఆల్రెడీ నేరం ఋజువైందనే ధోరణిలో క్షమాపణలేఖ పంపించడంలో అర్థం ఏమిటి? అలాగే నోటీసులు అందుకున్న వారికి నా విన్నపం "మీలో ఏ మాత్రం పౌరుషం ఉన్నా, మీ పైన వచ్చిన ఆరోపణల మూలాన మీ కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు పడిన మానసికవేదనపై మీరు ఏ మాత్రం నైతిక బాధ్యత ఫీల్ అవుతున్నా,జరిగిన ఆరోపణలపై నోరు విప్పి మీరు కూడా బహిరంగ లేఖలు రాయాలి. విషయం కోర్టులో ఉంటే మాట్లాడకూడదనే ఆలోచన సరైనది కావచ్చేమో కానీ, అసలు చార్జెస్ కూడా ఫైల్ అవ్వని ఇలాంటి సందర్భంలో నిజం మాట్లాడే హక్కు రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడికీ వుంది. ఒకవేళ అలా మాట్లాడడం వల్ల చెయ్యని తప్పులని నిజం చేసి, అన్యాయంగా కేసులు బనాయించి చట్టం చట్రంలో మరింత బలంగా బిగిస్తారేమో అనే భయంతో మాట్లాడలేకపోతే అంతకు మించిన పిరికితనం మరొకటి ఉండదు. అది ప్రజాస్వామ్యానికే అవమానం". అలాగే రేపు ఫైనల్ గా ఈ కేసులో వీళ్ల తప్పు లేదని తెలిస్తే ఛాంబర్ కి ఏ మాత్రం విచక్షణ వున్నా అధికారులకి బహిరంగ క్షమాపణలేఖ రాసినట్టే ఆరోపణలు ఎదుర్కున్న వాళ్లందరికీ బహిరంగ లేఖ ద్వారా క్షమాపణ చెప్పాలి. ఇలా చెయ్యని పక్షంలో భావి చరిత్రలో వీళ్లందరూ నిజంగా నేరస్థులేనని... కాని ఫిల్మ్ ఛాంబర్ చెప్పిన క్షమాపణ మూలానే క్షమించి వదిలేసారనే అబద్ధం నిజంగా నిలిచిపోతుంది..ఆ అబద్ధం నిజం కాకుండా చూడాల్సిన నైతిక బాధ్యత ఫిల్మ్ ఛాంబర్ కి ఉందని గౌరవపూర్వకంగా తెలియచేసుకుంటున్నాను.' అంటూ ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు వర్మ. -
ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన దర్శకుడు
హైదరాబాద్: చిన్న సినిమాలను బతికించాలని కోరుతూ సినీ రచయిత, దర్శకుడు రాజేష్ సాయి ఫిలింనగర్‌లోని ఫిలిం చాంబర్ ఎదుట చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజుకు చేరింది. మంగళవారం ఉదయం ఆయన దీక్షా శిబిరంలో విలేకరులతో మాట్లాడుతూ.. ప్రస్తుతం చిన్న సినిమా చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.వంద కోట్లతో నిర్మితమవుతున్న సినిమాల్లాగే కోటి రూపాయలతో తీసిన చిన్న సినిమాలు కూడా లొకేషన్ చార్జీలు, పబ్లిసిటీ చార్జీలు చెల్లిస్తున్నాయని, అయితే థియేటర్లు దొరకక విడుదలకు నోచుకోని దుస్థితిలో ఉన్నాయన్నారు. పెద్ద సినిమా వచ్చిందంటే చాలు.. చిన్న సినిమా బాగా ఆడుతున్నా కూడా పక్కకు నెట్టేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 50 థియేటర్లను ప్రభుత్వం అధీనంలో ఉంచుకోవాలని వాటిని చిన్న సినిమాలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చిన్న సినిమా విడుదలకు ఎదురవుతున్న థియేటర్ల సమస్యను ప్రభుత్వం పరిష్కరించే వరకు దీక్ష కొనసాగిస్తానని చెప్పారు. -
తెలంగాణ మూవీ-టీవీ ఆర్టిస్ట్స్అధ్యక్షునిగా శివశంకర్
తెలంగాణ మూవీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ యూనియన్ ఎన్నికలు హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో జరిగాయి. అధ్యక్షునిగా శివశంకర్, సహాయ అధ్యక్షులుగా శ్రీమతి ఆషా, లక్ష్మీ శ్రీకాంత్, కార్యదర్శిగా రాంబాబు కంచర్ల, ఉమ్మడి కార్యదర్శులుగా శ్రీమతి సరోజ, ఎస్.జె. సైదులు, కోశాధికారిగా ఉమా మహేశ్వరరావు, కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉంగరాల వెంకటేశ్వరరావులు ఎన్నికయ్యారు. -
అమరావతిలో ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్
గుంటూరు: సినీ కళాకారులు, చిన్న నిర్మాతల మనుగడ కోసమే నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిలో ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ను ఏర్పాటు చేయనున్నట్లు చాంబర్ ఉపాధ్యక్షురాలు, సినీ నటి డి.కవిత చెప్పారు. ఏపీలో చాంబర్ రిజిస్ట్రేషన్ చేసిన సందర్భంగా మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. పెద్ద నిర్మాతల వల్ల హైదరాబాద్ లో సినీ పరిశ్రమ అంతరించిపోతోందని అభిప్రాయపడ్డారు. పరిశ్రమలోని కొందరు పెద్దలు పెత్తనం చలాయిస్తూ ఇతర రాష్ట్రాల నుంచి కళాకారులను తీసుకురావడం వల్ల స్థానికంగా ఉన్న కళాకారులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం హైదరాబాద్ లోని తెలుగు ఫిలిం చాంబర్‌ను వాడుకుంటున్నారని విమర్శించారు. వైజాగ్‌లో ఫిలిం చాంబర్‌ను ఏర్పాటు చేయకుండానే ఫిలిం క్లబ్ నిర్మిస్తామని.. ప్రభుత్వాన్ని భూములను కోరడం వారి స్వార్థానికి నిదర్శనమని అన్నారు. నవ్యాంధ్రలో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలంటే పెద్ద నిర్మాతలు వారి సొంత సొమ్ముతోనే నిర్మాణాలు చేపట్టాలన్నారు. అధ్యక్షుడు, సినీ నిర్మాత ఎస్.వి.ఎన్.రావ్ మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటు చేసిన తమ చాంబర్ ద్వారా స్థానిక కళాకారులు, నిర్మాతలను ప్రోత్సహిస్తామని తెలిపారు. కార్యాలయాన్ని లక్ష్మీపురంలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో కార్యదర్శి సాయిప్రసాద్, ట్రెజరర్ ఎస్.వి.తిరుమలరావ్, సభ్యులు డి.విజయభాస్కరరెడ్డి, తోట కృష్ణ, కె.త్రినాథ్, డి.రవికుమార్ పాల్గొన్నారు. -
కో ఆప్టెక్స్ ఎగ్జిబిషన్ సేల్ ప్రారంభం
విజయవాడ(గాంధీనగర్): చేనేత కార్మికుల ఉత్పత్తులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు ఇన్చార్జి జిల్లా పౌరసంబంధాల అధికారి ఎస్వీ మోహన్‌రావు చెప్పారు. స్థానిక ఫిలిం చాంబర్ హాలులో కో ఆప్టెక్స్ దీపావళి ప్రత్యేక ఎగ్జిబిషన్ సేల్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత ఉత్పత్తులకు సహాయ, సహకారాలు అందిస్తున్నాయన్నారు. దీపావళిని పురస్కరించుకుని తమిళనాడు హ్యాండ్లూమ్ వీవర్స్ చేనేత కార్మికులు రూపొందించిన ఉత్పత్తులను 30 శాతం ప్రత్యేక రిబేట్‌పై అందిస్తున్నామన్నారు. రీజినల్ మేనేజర్ ఎల్ శేఖర్ మాట్లాడుతూ ఎగ్జిబిషన్ సేల్‌ను ఈనెల 27వరకు నిర్వహిస్తామన్నారు. కాంచీపురం ఫ్యూర్ సిల్క్, ఆర్నీ, సాఫ్ట్ సిల్క్, తక్కువ ధరల్లో నాణ్యమైన సిల్కు చీరలు అందిస్తున్నట్లు చెప్పారు. కోయంబత్తూరు, సేలం, మధురై, కేరళ కొట్టాయంలకు చెందిన కాటన్ చీరలు, కోర శారీస్, దుప్పట్లు, టవల్స్, లుంగీలు, దోతీలు, డ్రెస్‌మెటీరియల్, డోర్‌మ్యాట్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. డిస్కౌంట్ అన్ని కో ఆప్టెక్స్ షాపులలో జనవరి 31 వరకు అందిస్తామన్నారు. కార్యక్రమంలో మేనేజర్ ఎం.జగన్నాథన్, డీఆర్ఎం కె.చంద్రశేఖర్, మార్కెటింగ్ మేనేజర్ కె.యువరాజ్, డి రమణ, ఎ.రాజేశ్వర్ పాల్గొన్నారు. -
హీరో నిరాహార దీక్ష
లాహిరి లాహిరి లాహిరిలో సినిమాతో కథానాయకుడిగా తెలుగు తెరకు పరిచయం అయిన ఆదిత్య ఓం దర్శకుడిగా మారి తెరకెక్కించిన సినిమా 'ఫ్రెండ్ రిక్వెస్ట్'. ఈ శుక్రవారం విడుదల అయిన ఈ సినిమాకు అవసరం మేర థియేటర్లు కేటాయించనందుకు నిరసనగా ఆదిత్య ఓం, సహ నిర్మాత విజయ్ వర్మ చిత్రబృందంతో నిన్న ఫిలిం చాంబర్ ఎదుట నిరాహార దీక్ష చేపట్టారు. వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో 150 థియేటర్లలో రిలీజ్ ప్లాన్ చేశామన్నారు. అయితే నైజాంలో బిందు పిక్చర్స్ శ్రీనివాస్ 30 థియేటర్లలో రిలీజ్ చేస్తామని చెప్పి కేవలం ఒక్క థియేటర్లో.. అది కూడా రెండు షోస్ మాత్రమే వేస్తామని చివరి నిమిషంలో చెప్పారన్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో అమలు చేస్తున్నట్టుగా ప్రాంతీయ చిత్రాలకు థియేటర్ల కేటాయింపు పద్దతిని ఇక్కడ కూడా అమలు చేసేవరకు పోరాటం చేస్తామని ప్రకటించారు. వీరికి భారత్ ఏక్తా ఆందోళన్ నేషనల్ కన్వీనర్ మల్లు రమేష్, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కె సురేష్ బాబు, మోహన్ గౌడ్లు మద్దతు పలికారు. ఫిలిం చాంబర్ ఈసీ మెంబర్ అశోక్ కుమార్, జనరల్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. -
ఫిలింఛాంబర్ దగ్గర హీరో నిరాహార దీక్ష
-
రంగనాథ్ భౌతికకాయానికి పోస్టుమార్టం పూర్తి
-
'రంగనాథ్ ఆత్మహత్య చేసుకుంటాడనుకోలేదు'
హైదరాబాద్: సినీ నటుడు రంగనాథ్ ఆత్మహత్య చేసుకుంటాడని తాము ఊహించలేదంటూ ఆయన బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు. ప్రశాంతంగా ఉండాలని రంగనాథ్ ఒంటరిగా ఉండేవారని చెప్పారు. రంగనాథ్ శనివారం ఆయన నివాసంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతిచెందిన సంగతి తెలిసిందే. రంగనాథ్‌కు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఆరేళ్ల క్రితం భార్య మరణించాక ఒంటరిగా ఉంటున్న రంగనాథ్.. ఒంటరి తనం, ఆర్థిక ఇబ్బందులతోనే మరణించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. రంగనాథ్ భౌతికకాయానికి గాంధీ ఆస్పత్రిలో ఆదివారం ఉదయం పోస్టుమార్టం పూర్తియినట్టు పోలీసులు తెలిపారు. అనంతరం ఆయన భౌతికకాయాన్ని ఫిలించాంబర్‌కు తరలించనున్నట్టు సమాచారం. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు బన్సీలాల్ పేటలో రంగనాథ్‌కు అంత్యక్రియలు జరుగనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. -
ప్రోత్సహించకపోతే... గద్దెదింపుతాం...
తెలంగాణకు చెందిన సినీ కార్మికులు, చిన్న నిర్మాతలు, కళాకారులను ప్రభుత్వం ప్రోత్సహించకపోతే పోరాటం చేసి ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని తెలంగాణ ఫిల్మ్‌చాంబర్ ఆఫ్ కామర్స్ హెచ్చరించింది. సోమవారం క్లాక్‌టవర్ ప్రాంతంలోని ఫిల్మ్ చాంబర్ కార్యాలయంలో తెలంగాణ సినీ నటుడు దాదాపాల్కే అవార్డు గ్రహీత పైడి జయరాజ్ జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫిల్మ్ జేఏసీ చైర్మన్ జైహింద్‌గౌడ్, చాంబర్ చైర్మన్ అమ్రిష్‌కుమార్, చాంబర్ మాజీ అధ్యక్షులు విజయేందర్రెడ్డిలు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం వస్తే రాష్ట్రానికి చెందిన కార్మికులకు, కళాకారులకు, పరిశ్రమకు ప్రోత్సాహం లభిస్తుందనుకుంటే పరిస్థితి మారకపోగా ఇంకా అన్యాయం కొనసాగుతూనే ఉందన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం తాము కూడా ఉద్యమాల్లో పాల్గొన్నామని తెలిపారు. తెలంగాణకు చెందిన సినీ పరిశ్రమ గురించి ప్రభుత్వం నుంచి ఒక్క ప్రకటన కూడా వెలువడలేదని వాపోయారు. చౌటుప్పల్ ప్రాంతంలో చేపట్టే తెలంగాణ ఫిల్మ్‌సిటీ కి పైడి జయరాజ్ పేరు పెట్టాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణకు చెందిన చిన్న నిర్మాతలను ఆదుకునేలా రాయితీలు అందించాలని, మంచి సినిమా తీసిన వారికి రూ.5 కోట్ల బహుమానం అందించాలని సూచించారు. -
తెలుగు ఫిల్మ్‌చాంబర్ అధ్యక్షుడిగా సురేశ్‌బాబు
ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ డి. సురేశ్‌బాబు తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలికి అధ్యక్షుడయ్యారు. ఫిల్మ్ చాంబర్ ఎన్నికలు ఆదివారం హైదరాబాద్‌లో జరిగాయి. చాంబర్లో భాగమైన నిర్మాణ, పంపిణీ, ప్రదర్శన, స్టూడియో - నాలుగు విభాగాల సభ్యులు ఈ ఎన్నికల్లో పాల్గొన్నారు. ఈ నాలుగు సెక్టార్ల ఎన్నికలకు నిర్మాతలు - ఎగ్జిబిటర్లైన డి. సురేశ్‌బాబు, దిల్ రాజుల సారథ్యంలోని ఒక ప్యానెల్, నిర్మాతలు నట్టికుమార్, టి. ప్రసన్నకుమార్ల నేతృత్వంలోని మరో ప్యానెల్ పోటీపడ్డాయి. మొత్తం 48 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్స్‌ను ఈ ఎన్నికల్లో ఎన్నుకున్నారు. సురేశ్‌బాబు ప్యానెల్ సభ్యులు ఎక్కువ సంఖ్యలో విజయం సాధించారు. ఈ ఎన్నికైన సభ్యులు నాలుగు విభాగాల చైర్మన్లనూ ఎంపిక చేసుకున్నారు. పంపిణీదారుల విభాగానికి భరత్ చౌదరి, ప్రదర్శనదారుల విభాగానికి నారాయణబాబు, నిర్మాతల సెక్టార్‌కు ఆర్.కె. గౌడ్, స్టూడియో సెక్టార్‌కు నాగినీడు చైర్మన్లు అయ్యారు. ఇక, ఫిల్మ్ చాంబర్ అధ్యక్ష పదవి రొటేషన్ పద్ధతిలో ఎగ్జిబిటర్ల విభాగానికి దక్కాలి. దాన్ని అనుసరించి తెలుగు ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడిగా డి. సురేశ్‌బాబు ఏకీగ్రవంగా ఎంపికయ్యారు. ఉపాధ్యక్షులుగా ‘ఆనంద్ సినీ సర్వీసెస్’ కిరణ్, ‘దిల్’ రాజు, రమేష్, కార్యదర్శిగా దామోదర ప్రసాద్, సంయుక్త కార్యదర్శులుగా శ్రీనివాస్, రాందాస్, సురేందర్‌రెడ్డి, కోశాధికారిగా కొడాలి వెంకటేశ్వర రావు ఎన్నికయ్యారు. -
ఫిలిం ఛాంబర్లో ఘనంగా మేడే వేడుకలు
-
ఫలితాల పై సినీ ఇండస్ట్రీలో ఉత్కంఠ
-
మలేరియా ఇలా ప్రాణం తీస్తుందనుకోలేదు..
-
మల్టీ ఆర్గాన్స్ పని చేయకపోవటం వల్లే..
హైదరాబాద్ : ఎంఎస్ నారాయణ అంత్యక్రియలు శనివారం జరగనున్నాయి. అభిమానుల సందర్శనార్థం ఈరోజు మధ్యాహ్నం 1 గంటల నుంచి నాలుగు గంటల వరకూ ఎంఎస్ నారాయణ భౌతికకాయాన్ని ఫిల్మ్‌ఛాంబర్‌లో ఉంచుతారు. అనంతరం ఆయన నివాసానికి తరలిస్తారు. కాగా ఎంఎస్ నారాయణ అంత్యక్రియలు ఎక్కడ జరిపేది ఈరోజు సాయంత్రం ఆయన కుటుంబసభ్యులు నిర్ణయిస్తామని నటుడు అనంత్ తెలిపారు. మరోవైపు ఎంఎస్ మృతిపై కొండాపూర్ కిమ్స్ వైద్యులు శుక్రవారం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. మధుమేహం, గుండెపోటుతో ఎంఎస్ ఆస్పత్రిలో చేరారని, గుండె, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు పని చేయకపోవటంతో ఆయన మరణించారని వైద్యులు తెలిపారు. ఉదయం 9.40 నిమిషాలకు ఎంఎస్ తుదిశ్వాస విడిచినట్లు కిమ్స్ వైద్యులు వెల్లడించారు. -
సినిమా రంగాన్ని ఇంకా అభివృద్ధి చేస్తాం
- సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ‘‘హైదరాబాద్‌లో అద్భుతమైన లొకేషన్లు ఉన్నాయి. ప్రతి ఏటా రెండువందలకు పైగా సినిమాలు ఇక్కడ షూటింగ్ జరుపుకుంటున్నాయి. సినిమా రంగానికి ఉన్న సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాం. సినిమా రంగాన్ని ఇంకా అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. మేమందరం కూడా అదే ప్రయత్నంలో ఉన్నాం’’ అని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ చెప్పారు. సోమవారం పలువురు చిత్రరంగ ప్రముఖులు ఆయన్ను కలిసి అభినందించారు. ఈ సందర్భంగా చిత్రపరిశ్రమలో ఉన్న సమస్యలను మంత్రికి వివరించారు. ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఎన్వీ ప్రసాద్, ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ సి.కల్యాణ్, నిర్మాతల మండలి అధ్యక్షులు బూరుగపల్లి శివరామకృష్ణ, తెలంగాణ ఫిలిం చాంబర్ అధ్యక్ష, కార్యదర్శులు విజయేంద్రరెడ్డి, మురళీమోహన్‌లతో పాటు కేయస్ రామారావు, డి. సురేశ్‌బాబు, కొడాలి వెంకటేశ్వరరావు, కాజా సూర్యనారాయణ, సురేశ్ కొండేటి, మహర్షి రాఘవ తదితరులు పాల్గొన్నారు. -
నీ మరణం సినీ జగత్తుకు తీరనిలోటు..
-
చెరగని ‘చక్రి’ జ్ఞాపకాలు
మెతుకుసీమతో ప్రత్యేక అనుబంధం గుర్తుచేసుకుంటున్న జిల్లావాసులు సంగారెడ్డి క్రైం: ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి హఠాన్మరణం జిల్లా వాసులను తీవ్రంగా కలచివేసింది. ఆయన మరణవార్త విని జిల్లాలోని సంగీత ప్రియులు, వివిధ సంఘాల నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లాతో ఆయనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, చక్రి ప్రజా సేవలో ముం దుండే వారనీ, జిల్లాతో ఆయన ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. పటాన్చెరు మండలం అమీన్పూర్ ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయడంతో పాటు జిన్నారంలో ఎస్సీ,ఎస్టీ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు దుస్తులు, షూ పంపిణీ చేసిన సంగతి గుర్తు చేసుకున్నారు. సినిమాల్లో బీజీగా ఉన్నప్పటికీ స్థానిక ఫొటోగ్రాఫర్ల కోరిక మేరకు సంగారెడ్డిలో 2012 ఆగస్టు 19న జరిగిన ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవంలో చక్రి పాల్గొన్న విషయా న్ని పలువురు గుర్తు చేసుకున్నారు. జహీరాబాద్‌లో నిర్వహించిన పలు సామాజిక కార్యక్రమాల్లో కూడా చక్రి పాల్గొన్నారని గుర్తు చేశారు. ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఓ చిన్న సామాజిక కార్యక్రమానికి ఆహ్వానించినా తప్పకుండా పాల్గొనేవారని చక్రి సామాజిక సేవను కొనియాడారు. చక్రి మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా ఫొటోగ్రాఫర్ల, వీడియోగ్రాఫర్ల సంఘం అధ్యక్షుడు జగన్, అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.విజయరావు, సామాజిక సమ్రత రాష్ట్ర కార్యదర్శి పి.దుర్గాప్రసాద్, తెలంగాణ క్రిష్టియన్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.విల్సన్‌లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆగిన సంగీత చక్రం పిన్నవయసులోనే తెలుగు సినీసంగీత సామ్రాజ్యంలో తనదైన ముద్రవేసిన ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి సోమవారం కన్నుమూశారు. ఆయన మృతి చిత్రపరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. సంగీత ‘చక్రం’ ఆగిపోయిందంటూ పలువురు సినీ ప్రముఖులు కంటతడిపెట్టారు. ఉదయం అపోలో ఆస్పత్రి నుంచి చక్రి పార్థివ దేహాన్ని ఫిలించాంబర్‌కు తరలించారు. పలువురు సినీ ప్రముఖులు, సంగీత దర్శకులు, గాయకులు, ఆయన అభిమానులు అక్కడికి చేరుకొని నివాళులు అర్పించారు. సాయంత్రం చక్రి అంత్యక్రియలు పంజగుట్ట హిందూ శ్మశానవాటికలో ముగిశాయి. -
జానకిరామ్ సంతాప సభ
-
సమ్మె విరమించిన సినీ కార్మికులు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ చలన చిత్ర కార్మికులు సమ్మె విరమించారు. నిర్మాతలతో శుక్రవారం జరిపిన చర్చలు సఫలం కావడంతో ఏడు రోజులుగా చేస్తున్న సమ్మె విరమించారు. రేపటి నుంచి మళ్లీ సినిమా షూటింగ్ ల్లో పాల్గొంటామని ఏ.పి. చలన చిత్ర కార్మికుల సమాఖ్య అధ్యక్షులు కొమర వెంకటేశ్ తెలిపారు. తమ డిమాండ్లు అంగీకరించినందుకు ఫిలిం ఛాంబర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఏడు రోజులుగా సినీ కార్మికులు సమ్మె చేస్తుండడంతో షూటింగ్ లో ఆగిపోయాయి. ఫలితంగా పలు సినిమాల విడుదల వాయిదాపడే అవకాశాలు కన్పిస్తున్నాయి. -
నేటి నుంచి సినిమా షూటింగ్‌లు బంద్
-
నేటి నుంచి సినిమా షూటింగ్‌లు బంద్
హైదరాబాద్: నగరంలో గురువారం నుంచి సినిమా షూటింగ్‌లు బంద్కానున్నాయి. ఫిల్మ్‌ఛాంబర్ కొత్త నిర్ణయాలకు వ్యతిరేకంగా సినీ కార్మిక సమాఖ్య బంద్‌కు పిలుపునిచ్చింది. దాంతో ఎక్కడికక్కడ సినిమా షూటింగ్‌లు నిలిచిపోయాయి. సినీ కార్మిక సమ్మెలో దాదాపు 15వేల మంది కార్మికులు పాల్గొన్నారు. ఒక్కసారిగా సినీ కార్మికులు సమ్మెకు దిగడంతో నిర్మాణంలో ఉన్న పెద్దహీరోల సినిమాలు సైతం నిలిచిపోయాయి. అయితే వేతనాలు పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా, తమకు వ్యతిరేకంగా ఇతరులు సినిమా షూటింగ్‌ల్లో పాల్గొంటే సహించమని ఫిల్మ్ ఫెడరేషన్ హెచ్చరించింది. -
ఫిల్మ్ ఛాంబర్ వద్ద స్వల్ప ఉద్రిక్తత
-
ఫిల్మ్ ఛాంబర్ వద్ద స్వల్ప ఉద్రిక్తత
హైదరాబాద్ : హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ వద్ద శుక్రవారం స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఫిల్మ్ ఛాంబర్‌ను ముట్టడించేందుకు నిర్మాత రామకృష్ణ గౌడ్ మద్దతుదారులు యత్నించారు. ఈ నేపథ్యంలో ఫిల్మ్ ఛాంబర్ అద్దాలు ధ్వంసం అయ్యాయి. చిన్న సినిమాల పాలిట శాపంగా మారిన థియేటర్ల లీజు విధానాన్ని రద్దు చేయాలనే డిమాండ్‌తో తెలంగాణ ప్రొడ్యూసర్స్ గిల్డ్ రామకృష్ణ గౌడ్ శనివారం నుంచి ఫిలిం చాంబర్ ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. అయితే దీక్షపై ఎవరూ స్పందించకపోవటంతో రామకృష్ణ గౌడ్ మద్దతుదారులు ఆందోళనకు దిగారు. మరోవైపు ఫిల్మ్ ఛాంబర్ వద్ద ఆందోళన చేస్తున్నవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
కమల్‌ను సత్కరించిన తమిళ ఫిల్మ్‌ఛాంబర్
-
తెలంగాణ శకుంతలకు సినీ ప్రముఖుల నివాళి
-
రాష్ట్రం విడిపోయాక పరిశ్రమ కలిసుండడం అసాధ్యం
‘‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో.. తెలంగాణ సినిమాను ప్రోత్సహించడానికి, తెలంగాణ సినీ కళాకారులకు చేయూతనివ్వడానికి హైదరాబాద్‌లోని ఏపి ఫిలిం ఛాంబర్ కార్యాలయంలోని ఓ భాగాన్ని తెలంగాణ ఫిలిం ఛాంబర్ కార్యాలయానికి తక్షణం కేటాయించాలి’’ అని తెలంగాణ నిర్మాతల మండలి అధ్యక్షుడు సానా యాదిరెడ్డి ఉద్ఘాటించారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘అన్ని రంగాల్లో జరిగినట్లే సినీరంగంలో కూడా తెలంగాణ వారికి అన్యాయం జరుగుతూనే ఉంది. ఇటీవలే ఫిలిం ఛాంబర్ పెద్దలు తెలంగాణ సినిమాను ప్రాంతీయ భాషా సినిమాగా వేరు చేసి చూపించారు. దీనిలోని ఆంతర్యమేంటో బయటపెట్టాలి. ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తర్వాత కూడా ఈ వివక్ష తగదు. ఇక్కడి నిర్మాతల సంఖ్య పెంచుకోవడం కోసం, తెలంగాణ సినిమాను అభివృద్ధి చేసుకోవడం కోసం ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు, సబ్సిడీలు కల్పించాలి’’ అని కోరారు. తెలంగాణ నేలపై సినిమాలు తీస్తూ, తెలంగాణవారి సినిమాను ఓ ప్రాంతీయ సినిమాగా అభివర్ణించడం సరికాదని, ఇలాంటి చర్యలు తక్షణం విడనాడి తెలంగాణ సినిమాలను ప్రత్యేకంగా గుర్తించి, గౌరవించాలని తెలంగాణ దర్శకుల సంఘం అధ్యక్షుడు అల్లాణి శ్రీధర్ పేర్కొన్నారు. ఈ విషయంపై తెలంగాణ దర్శక, నిర్మాతలు ఐక్యంగా పోరాటం సాగించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుపై ట్విట్టర్ ద్వారా అనుచిత వ్యాఖ్యలు చేసిన దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ తక్షణం తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని శ్రీధర్ డిమాండ్ చేశారు. రాష్ట్రం విడిపోయాక సినీ పరిశ్రమ కలిసి ఉండటం అసాధ్యమని సంగిశెట్టి దశరథ పేర్కొన్నారు. ఇంకా ప్రేమ్‌రాజ్, కుమార్ మాట్లాడారు. -
నేడు ఫిల్మ్ చాంబర్లో తెలంగాణ సంబరాలు
వెంగళరావునగర్, న్యూస్‌లైన్: తెలంగాణ టెలివిజన్ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ ఫిల్మ్ చాంబర్, సినీ దర్శకుల సం ఘం, సినీ నిర్మాతల మండలి, కార్మికుల సమా ఖ్య సంయుక్త సౌజన్యంతో శనివారం ఫిలింనగర్‌లోని ఫిల్మ్ చాంబర్లో తెలంగాణ సంబరాలను నిర్వహించనున్నట్టు ఫోరం కన్వీనర్ నాగబాల సురేశ్‌కుమార్ తెలిపారు. వెంగళరావునగర్ డివిజన్ పరిధిలోని మధురానగర్‌కాలనీలో ఉన్న తెలంగాణ టీవీ డెవలప్మెంట్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంబరాల విశేషాలను వివరించారు. ఎమ్మెల్యేలుగా గెలిచిన బాబూమోహన్, రసమయి బాలకిషన్‌తోపాటు తెలంగాణ ప్రభుత్వ లోగోను తయారు చేసిన లక్ష్మణ్ ఏలేను ఘనంగా సత్కరిస్తామన్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. నాటికలు, పద్యాలు, పాటలు, భజనలు, తెలంగాణ ధూంధాం తదితర కార్యక్రమాలను భారీ ఎత్తు న నిర్వహిస్తామని తెలిపారు. తెలంగాణ ఫిల్మ్ కళాకారులు, టెక్నీషియన్లు పెద్ద ఎత్తున ఈ వేడుకలకు హాజరుకావాలని కోరారు. విలేకరు ల సమావేశంలో ఫోరం కన్వీనర్లు యాటా సత్యనారాయణ, టీవీ చౌదరి, డి.రామకృష్ణ, వైభవ్ సూర్య, రాజేంద్రరాజు పాల్గొన్నారు. -
ముగిసిన ఫిలిం చాంబర్ ఎన్నికలు
తమిళ సినిమా, న్యూస్‌లైన్ : దక్షిణ భారత చలన చిత్ర వాణిజ్య మండలి (ఫిలిం చాంబర్) ఎన్నికలు ఆదివారం చెన్నైలో భారీ పోలీసు బందోబస్తు మధ్య ప్రశాంతంగా ముగిశాయి. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న సి.కల్యాణ్ కార్యవర్గం పదవీ కాలం ముగియడంతో ఈ ఎన్నికలు నిర్వహించారు. స్థానిక రాయపేటలోని ఉడ్‌లాండ్స్ థియేటర్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు ఎన్నికలు జరిగాయి. ఫిలిం చాంబర్ కార్యవర్గం పదవీ కాలం రెండేళ్లుగా నిర్ణయించారు. ఒక్కోసారి ఒక్కో రాష్ట్రానికి చెందిన వారు అధ్యక్ష పదవి బాధ్యతలను చేపట్టాలనేది నిబంధన. ఈ సారి కేరళకు చెందిన వారు చాంబర్ అధ్యక్ష పదవిని చేపట్టాల్సి ఉంది. ఈ పదవికి కేరళ చిత్ర పరిశ్రమకు చెందిన పి.శశికుమార్, జి.పి.విజయకుమార్ పోటీ పడటం గమనార్హం. అదేవిధంగా ఉపాధ్యక్షత పదవికి నిర్మాత కె.రాజన్, పి.విజయకుమార్, కోశాధికారి పదవికి బాబు గణేశన్, మురళీధరన్, ఎ.జి.సుబ్రమణి, వెంకటేశ్ పోటీకి దిగారు. వారితోపాటు కార్యవర్గ సభ్యులు పదవికి 40 మంది పోటీ చేశారు. తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు కేఆర్.వర్గం ఫిలిం చాంబర్ ఎన్నికలను బహిష్కరించడంతో చాంబర్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న జి.పి.విజయకుమార్‌తోపాటు ఉపాధ్యక్ష పదవికి బరిలో ఉన్న కె.రాజన్ పోటీ నుంచి తప్పుకుంటామని ప్రకటించారు. ఈ విషయాన్ని వారు ఎన్నికల అధికారికి రాత పూర్వకంగా తెలియజేయలేదు. దక్షిణ భారత చలన చిత్ర వాణిజ్య మండలిలో సినీ నిర్మాతలు, పంపిణీదారులు, థియేటర్ యాజమాన్యాలకు చెందిన 2,085 మంది సభ్యులుగా ఉన్నారు. నిర్మాతల మండలి అధ్యక్షుడు కేఆర్తోపాటు కొంత మంది చాంబర్ ఎన్నికలను బహిష్కరించడం వల్ల బందోబస్తు ఏర్పాటు చేశారు. హైకోర్టు న్యాయమూర్తి ఉత్తర్వుల మేరకు ఆదిశేషన్ ఎన్నికల అధికారిగా వ్యవహరిం చారు. లెక్కింపు ఆదివారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. చాంబర్ అధ్యక్షుడిగా శశికుమార్ (కేరళ), ఉపాధ్యక్షుడిగా విజయ కుమార్ (కర్ణాటక), కోశాధికారిగా మురళీధర్(తమి ళ్), సంయుక్త కార్యదర్శులు కాట్రగడ్డ ప్రసాద్ (తెలుగు), పిఎం అరుళ్‌పతి (తమిళ్) ఎన్నికైనట్లు ప్రకటించారు. -
ఫిలించాంబర్స్ లో అక్కినేని సంతాప సభ
-
అక్కినేని అంతిమ యాత్ర
-
ఫిలిం చాంబర్‌కు అక్కినేని పార్థీవదేహం
-
ఫిల్మ్ చాంబర్కి అక్కినేని పార్థివదేహం
హైదరాబాద్ : నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు పార్థీవ దేహాన్ని ఆయన కుటుంబ సభ్యులు అన్నపూర్ణ స్టూడియో నుంచి ఫిల్మ్ ఛాంబర్‌కు తరలిస్తున్నారు. భౌతికకాయన్ని తరలిస్తు కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. 12.30 గంటలకు ఫిలిం చాంబర్ నుంచి అక్కినేని అంతిమ యాత్ర మొదలవుతుంది. జూబ్లీ హిల్స్ చెక్‌పోస్ట్ మీదగా ఈ యాత్ర అన్నపూర్ణ స్టూడియోకు చేరుతుంది. అన్నపూర్ణ స్డూడియోలోనే నాగేశ్వరరావుకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అక్కినేని నాగేశ్వరరావు బుధవారం తెల్లవారుజామున మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణవార్త తెలియగానే సినీ పరిశ్రమ, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. రాజకీయ, చలనచిత్ర, వ్యాపార రంగ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి అక్కినేనికి నివాళులు అర్పించారు. రెండో రోజు కూడా అక్కినేనిని కడసారి దర్శించుకునేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు. -
ఉదయ్ కిరణ్ భౌతికకాయానికి సినీ ప్రముఖులు నివాళులు
-
మచ్చుకైనా లేదు మానవత్వం!
మాయమైపోతున్నడమ్మ మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు.. మానవత్వం ఉన్నవాడు అన్న కవి మాటలు నిజమవుతున్నాయి. ఆధునిక మానవుల్లో మంచితనం కొడిగడుతోంది. సంకుచిత ధోరణితో మనిషి కుంచించుకుపోతున్నాడు. విజ్ఞానశాస్త్రంలో శిఖరస్థాయికి చేరినా విలువలు పరంగా దిగజారిపోతున్నాడు. ఆధునికుడిగా పరిణామం చెందినా మూఢవిశ్వాసాలతో అంధయుగ ఆనవాళ్లు కొనసాగిస్తున్నాడు. ఆపదలో ఉన్న వాడిని ఆదుకునేందుకు సంశయిస్తున్నాడు. సహాయ చింతన మరిచి సంచరిస్తున్నాడు. యువ నటుడు ఉదయ్ కిరణ్ ఆత్మహత్యోదంతమే ఇందుకు తిరుగులేని రుజువు. తెలుగు తెరపై ఒక వెలుగు వెలిగిన ఉదయ్ కిరణ్ అనూహ్యంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సక్సెస్ పరుగులు తీసే సినిమా జనం ఈ వార్త తెలిసినా పెద్దగా స్పందించలేదు. ప్రతి చిన్న విషయానికి హడావుడి చేసే సినిమా పెద్దలు ఉదయ్ కిరణ్ మరణాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఫిలిమ్ ఛాంబర్‌కు తరలించేవరకు అతడి భౌతిక కాయాన్ని సందర్శిన పాపాన పోలేదు. ఇక సినిమా పరిశ్రమను శాసిస్తున్న కొన్ని కుటుంబాలైతే ఆ ఛాయలకే రాలేదు. తోటి నటుడిగా కూడా అతడి పట్ల సానుభూతి వ్యక్తం చేయలేకపోయాయి. ఇక రాజకీయ నాయకులు, కుల సంఘాల పెద్దల హంగామా సరేసరి. తోటి మనుషులు కూడా మానవత్వం లేకుండా ప్రవరిస్తుండడమే విస్తుగొలుపుతోంది. నిన్నటివరకు తమ కళ్లెదుటే తిరిగిన మనిషి మరణిస్తే కనీస కనికరం చూపడం లేదు. అతడుంటున్న అపార్ట్మెంట్ యజమాని ఉదయ్ కిరణ్ మృతదేహాన్ని తీసుకునేందుకు అంగీకరించలేదు. అటు సినిమా పరిశ్రమ వారు పట్టించుకోలేదు. కన్నతండ్రి, భార్య తరపువారు ఏవో సాకులు చెప్పి తప్పించుకున్నారు. చివరకు నిమ్స్ ఆస్పత్రిలో భౌతిక కాయాన్ని భద్రపరిచారు. అందరూ ఉన్నా అనాథలా అతడి మృతదేహాన్ని ఆస్పత్రిలో దాచాల్సివచ్చింది. మనిషి ఎలాంటివాడైనా చనిపోయిన తర్వాత ఘనంగా సాగనంపాలనేది మన సంప్రదాయం. కానీ మనిషి చనిపోవడమే పాపం అన్నట్టుగా ఆధునికులు వ్యవహరిస్తుండడం సమాజంలో లుప్తమవుతున్న విలువలకు అద్దం పడుతోంది. అద్దె ఇళ్లలో ఉంటున్నవారి 'చావు' కష్టాలు చెప్పనలవి కాదు. తమ వారెవరైనా చనిపోయితే మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చే వీలుండదు. తమ ఇల్లు మైలపడిపోతుందనే ఉద్దేశంతో శవాన్ని గుమ్మం ఎక్కనివ్వని యజమానులే ఎక్కువ. మైలు పేరుతో నిర్ధాక్షిణ్యంగా ఇళ్లు ఖాళీచేయించే మహానుభావులు ఉన్నారంటే అర్థమవుతుంది మనమెంత ముందుకు పోయామో. చాలా విషయాల్లో ఇలాగే జరుగుతోంది. నమ్మకాలను ఎవరూ కాదనరు. కానీ మూఢ విశ్వాసాలతో మానవత్వాన్ని మంటగలపడమే అసలైన విషాదం. -
'ఎవరి బతుకు వారిని బతకనీయండి'
హైదరాబాద్: యువ నటుడు ఉదయ్ కిరణ్ మరణంపై విచారణ జరిపించాలని టీడీపీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి డిమాండ్ చేశారు. ఉదయ కిరణ్ ఎలా మరణించాడనేది బాహ్య ప్రపంచానికి తెలియాలని అన్నారు. ఫిల్మ్ ఛాంబర్లో ఉదయ్ కిరణ్ భౌతిక కాయానికి ఆమె నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... స్వశక్తితో పైకొచ్చిన కుర్రాడి జీవితం ఇలా ముగియం బాధాకరమని పేర్కొన్నారు. ఉదయ్ కిరణ్ మరణం కలచివేసిందదన్నారు. సినిమా పరిశ్రమలో ఉన్న పెద్దలు వర్థమాన నటులను అగణదొక్కడం మానుకోవాలని హితవు పలికారు. ఎవరి బతుకు వారిని బతకనీయండి అంటూ నన్నపనేని రాజకుమారి అన్నారు. ఉదయ్ కిరణ్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆమె కోరుకున్నారు. -
ఉదయ్ కిరణ్ కి ప్రముఖుల నివాళులు
-
ఉదయ్ కిరణ్ భౌతికకాయానికి ప్రముఖుల నివాళి
హైదరాబాద్ : నటుడు ఉదయ్ కిరణ్ భౌతికకాయానికి పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అభిమానుల సందర్శనార్థం ఫిల్మ్ ఛాంబర్లోని అతని పార్థివదేహాన్ని ఉంచారు. తమ అభిమాన నటుడిని కడసారి చూసేందుకు అభిమానులు తరలి వచ్చారు. దర్శకుడు దాసరి నారాయణరావు, తనికెళ్ల భరణి, తమ్మారెడ్డి భరద్వాజ, చలపతిరావు, నటి జయసుధ, అశోక్ కుమార్, వరుణ్ సందేశ్, ఎంఎస్ రాజు, పరుచూరి వెంకటేశ్వరరావు, పరుచూరి గోపాలకృష్ణ, వెంకటేష్, సురేష్ బాబు, రామానాయుడు, శ్రీకాంత్, శివాజీ రాజా, దర్శకుడు సముద్ర, అనూప్ రూబెన్స్, కాదంబరి కిరణ్ కుమార్, బెనర్జీ తదితరులు ఉదయ్ కిరణ్‌కు నివాళులు అర్పించినవారిలో ఉన్నారు. -
ఫిలిం చాంబర్లో సీబీఐ దాడులు
ఐపీ పెట్టిన నలుగురు నిర్మాతల రికార్డుల తనిఖీ హైదరాబాద్, న్యూస్‌లైన్: హైదరాబాద్ ఫిలింనగర్‌లోని ఫిలిం చాంబర్లో సీబీఐ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. సినిమా నిర్మాణం కోసం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఐపీ పెట్టిన నలుగురు నిర్మాతలకు సంబంధించి రికార్డులను సీబీఐ డీఎస్పీతోపాటు మరో ముగ్గురు అధికారులు తనిఖీ చేశారు. ఆడిటర్, నిర్మాత భాస్కర్‌రెడ్డి, ‘మేడిన్ వైజాగ్’ నిర్మాత ఉదయ్‌కుమార్, ‘సిక్స్టీన్స్’ సినిమా నిర్మాత కృష్ణ తదితరులు సికింద్రాబాద్‌లోని ఐఓబీ నుంచి రూ.20 కోట్లు రుణంగా తీసుకుని ఐపీ పెట్టారు. ఈ నేపథ్యంలో బ్యాంకు అధికారులు సీబీఐని ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ.. సదరు నిర్మాతల సినిమాలకు సంబంధించిన వివరాలతో పాటు రికార్డులను సేకరించి విచారణ చేపట్టింది. వీరికి ఇద్దరు ప్రముఖ నిర్మాతలు ష్యూరిటీలు ఇచ్చినట్లు విచారణలో వెల్లడైంది. వారిని కూడా విచారించాలని అధికారులు నిర్ణయించారు. ఫిలిం చాంబర్లో సీబీఐ అధికారులు దాడులు చేస్తున్నట్లు బయటకు పొక్కడంతో పలువురు నిర్మాతలు భయాందోళనకు గురయ్యారు. -
ఫిల్మ్ ఛాంబర్లో ఏవీఎస్ భౌతికకాయం
హైదరాబాద్ : అభిమానుల సందర్శనార్థం ప్రముఖ హాస్యనటుడు ఏవీఎస్ భౌతిక కాయాన్ని ఫిల్మ్ ఛాంబర్లో ఉంచారు. ఈరోజు మధ్యాహ్నం పంజాగుట్ట స్మశాన వాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి. సినీనటులు కోట శ్రీనివాసరావు, పరుచూరి వెంకటేశ్వరరావు, టీడీపీ ఎంపీలు నామా నాగేశ్వరరావు, సుజనా చౌదరి .... తదితరులు ఏవీఎస్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఏవీఎస్ శుక్రవారం రాత్రి తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. కొంతకాలంగా కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయనను పది రోజుల కిందట చికిత్స కోసం గ్లోబల్ ఆస్పత్రిలో చేర్పించారు. కాలేయంలో తీవ్ర ఇన్ఫెక్షన్తో పాటు మూత్రపిండాలు పాడైపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. పది రోజుల నుంచి ఏవీఎస్‌కు ఐసీయూలో ఉంచి చికిత్స అందించినా ఫలితం లేకపోవటంతో నిన్న సాయంత్రం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఏవీఎస్ తన స్వగృహంలో రాత్రి 8.05 నిమిషాల ప్రాంతంలో కన్నుమూశారు.