khairatabad
-
ఖైరతాబాద్ : జలవిహార్‌లో లో ఘనంగా లోహ్రి మేళా వేడుక (ఫొటోలు)
-
ఖైరతాబాద్‌లో రామ్ చరణ్ సందడి.. కొత్త కారు నంబర్ ఎంతంటే?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో సందడి చేశారు. తన కొత్త కారు రిజిస్ట్రేషన్ కోసం ఆయన రవాణాశాఖ కార్యాలయానికి వచ్చారు. కారు రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన చెర్రీకి అధికారులు నంబర్‌ను కేటాయించారు. ఇటీవల కొనుగోలు చేసిన రోల్స్ రాయిస్ లగ్జరీ కారుకు టీజీ 09 2727 అనే ఫ్యాన్సీ నంబర్ తీసుకున్నారు. ఆర్టీఏ కార్యాలయంలో రామ్ చరణ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. శంకర్ డైరెక్షన్లో వస్తోన్న ఈ పొలిటికల్ యాక్షన్ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాలో చెర్రీ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటించింది. ఇప్పటికే రిలీజైన సాంగ్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనాతో రామ్ చరణ్ జతకట్టనున్నారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది.#GlobalStar @AlwaysRamCharan garu at Khairatabad RTO office for the registration of New Rolls-Royce Car.#GameChanger #Ramcharan #GlobalStarRamCharan pic.twitter.com/1muxaJk3XS— SivaCherry (@sivacherry9) October 22, 2024 -
కేబీఆర్ పార్కులో ‘ప్రజా సంబరాలు’ నగరవాసుల సందడి..(ఫొటోలు)
-
Khairatabad ganesh : ఘనంగా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం (ఫొటోలు)
-
నిఘా నీడలో.. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం
-
మహా గణపతి నిమజ్జనానికి కదలిన భక్తజన సందోహం (ఫొటోలు)
-
ఖైరతాబాద్ గణేష్ వద్దకు భారీగా తరలివచ్చిన భక్తులు (ఫొటోలు)
-
Ganesh immersion: గణేశ్ నిమజ్జనానికి పటిష్ట ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 17న జరిగే గణేశ్ శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమాలు సజావుగా జరిగేందుకు జీహెచ్ఎంసీ సన్నద్ధమవుతోంది. ఎప్పటి మాదిరిగానే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా వివిధ ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పని చేయనున్నాయి. గత సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా జీహెచ్ఎంసీతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, సమాచారం, పౌరసంబంధాలు, పోలీసు, రవాణా, హెచ్ఎండీఏ, వాటర్‌బోర్డు, మెడికల్ అండ్ హెల్త్, ఫైర్‌సరీ్వసెస్, ఆర్టీసీ, ఎస్పీడీసీఎల్, ఇరిగేషన్, ఆర్అండ్బీ, టూరిజం విభాగాలతోపాటు 108 ఈఎంఆర్ఐ విభాగాల ఉన్నతాధికారులు సమన్వయంతో పను లు చేయనున్నారు. జీహెచ్ఎంసీ జోన్లు, సర్కిళ్ల పరిధుల్లోనూ నిమజ్జనాలు జరిగే ప్రాంతాలవారీగా ఆయా విభాగాల అధికారులకు బాధ్యతలు అప్పగించారు. గణేశ్ శోభాయాత్ర, నిమజ్జనాల సందర్భంగా వెలువడే వ్యర్థాలు పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసేందుకు దారి పొడవునా దాదాపు కిలోమీటరుకు ఒక గ్రూపుచొప్పున పారిశుద్ధ్య కార్మికులతో గ్రూపులు ఏర్పాటు చేశారు. గణేశ్ యాక్షన్ టీమ్స్ పేరిట ఇవి మూడు షిఫ్టుల్లో పని చేస్తాయి. ఒక్కో టీమ్‌లో ప్రాంతాన్ని, అవసరాన్ని బట్టి అయిదుగురు నుంచి పన్నెండు మంది వరకు కారి్మకులుంటారు. దాదాపు మూడు వేల మంది పారిశుద్ధ్య కారి్మకులు విధుల్లో పాల్గొంటారు. ఇబ్బందులు తలెత్తకుండా: ఆమ్రపాలి శోభాయాత్ర, నిమజ్జనాల సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. నిమజ్జనాలు ప్రశాంతంగా జరిగేందుకు భక్తులు సహకరించాలని కోరారు. మండపాల నుంచి నిమజ్జనాలు జరిగే చెరువులు, కొలనుల దాకా భక్తులకు సమస్యలు లేకుండా రహదారి మరమ్మతులు, వీధి దీపాలు, చెట్ల కొమ్మల తొలగింపు తదితర పనులకు పోలీసు అధికారులు, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్లు, విద్యుత్ సిబ్బంది, జీవవైవిధ్య విభాగం, ఇంజినీర్లు కమిటీగా ఏర్పడి మండపాల నిర్వాహకుల సూచనల మేరకు తగిన చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. 73 కొలనుల్లో ఏర్పాట్లు.. జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడి ప్రజలక్కడే నిమజ్జనాలు చేసేందుకు వీలుగా 73 కొలనుల్లో నిమజ్జనాలకు ఏర్పాటు చేసినట్లు ఆమ్రపాలి పేర్కొన్నారు. వాటిలో 27 బేబీ పాండ్స్, 24 పోర్టబుల్ పాండ్స్, 22 తాత్కాలిక కొలనులు ఉన్నాయన్నారు. వీటితోపాటు 5 పెద్ద చెరువుల (సరూర్ నగర్, జీడిమెట్ల ఫాక్స్ సాగర్, బహదూర్‌పురా మీరాలం చెరువు, కాప్రా ఊర చెరువు) వద్ద ఏర్పాట్లు చేసినట్లు ఆమె తెలిపారు. నిమజ్జన ప్రదేశాల వద్ద విద్యుత్, 24 గంటల పాటు తాగునీరు అందుబాటులో ఉండేలా, పారిశుద్ధ్య కార్యక్రమాలు కొనసాగేలా అవసరమైన సిబ్బంది, సామగ్రి సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. 140 స్టాటిక్ క్రేన్లు, 295 మొబైల్ క్రేన్లు సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో భోజన సదుపాయాలు కలి్పంచనున్నట్లు పేర్కొన్నారు. నమో.. మహా గణనాథా ఒక్కరోజే 4 లక్షల మంది భక్తులు ఖైరతాబాద్: మహా గణపతి దర్శనానికి శనివారం భక్తులు పోటెత్తడంతో ప్రాంగణమంతా జనసంద్రాన్ని తలపించింది. సుమారు 4 లక్షల మంది భక్తులు తరలివచి్చనట్లు అంచనా. ఖైరతాబాద్ ఎంఎంటీఎస్, మెట్రో స్టేషన్ల నుంచి దర్శనానికి భక్తులు భారీగా తరలిరావడంతో ఖైరతాబాద్ రైల్వేగేట్ రోడ్డంతా కిక్కిరిసిపోయింది. మహా గణపతి నిమజ్జనానికి ఏర్పాట్లు జరుగుతుండటంతో సోమవారం దర్శనం ఉండదని సైఫాబాద్ ఏసీపీ ఆర్.సంజయ్‌కుమార్ తెలిపారు. నిర్వాహకులు మాత్రం సోమవారం భక్తులు మహా గణపతిని దూరం నుంచి దర్శించుకోవచ్చన్నారు.బాలాపూర్ నుంచి.. ట్యాంక్‌బండ్ వరకు నిమజ్జన శోభాయాత్ర మార్గాన్ని పరిశీలించిన డీజీపీ, సీపీలు చాంద్రాయణగుట్ట/పహాడీషరీఫ్: ఈ నెల 17న జరిగే బాలానగర్ వినాయక నిమజ్జన శోభాయాత్రను పురస్కరించుకొని డీజీపీ డాక్టర్ జితేందర్‌తో కూడిన ఉన్నతాధికారుల బృందం శనివారం ప్రధాన మార్గాన్ని పరిశీలించింది. హైదరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు సి.వి.ఆనంద్, సు«దీర్ బాబు, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు సీపీలు (శాంతి భద్రతలు) విక్రం సింగ్, పి.విశ్వప్రసాద్ (ట్రాఫిక్)లు ఇతర శాఖల అధికారులు ఆయన వెంట ఉన్నారు. అంతకుముందు బాలాపూర్ గణనాథుడికి పూజలు చేశారు. అనంతరం నిమజ్జనం రూట్లోని రాయల్ కాలనీ, గుర్రం చెరువు కట్ట, బార్కాస్, కేశవగిరి, చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, ఇంజన్‌లి, శంషీర్‌గంజ్, అలియాబాద్, సయ్యద్ అలీ చబుత్రా, లాల్‌దర్వాజా మోడ్, శాలిబండ, చారి్మనార్, గుల్జార్‌హౌజ్, మదీనా, అఫ్జల్‌గంజ్, మొజంజాహీ మార్కెట్, తెలుగు తల్లి జంక్షన్ మీదుగా ట్యాంక్‌బండ్ వరకు 19 కిలోమీటర్ల రూట్‌ను పరిశీలించారు. అధికారులతో మహేశ్వరం, సౌత్, సౌత్ ఈస్ట్ డీసీపీలు సునీతా రెడ్డి, స్నేహ మెహ్రా, కాంతిలాల్ సుభాష్ పాటిల్, బడంగ్పేట్ మేయర్ చిగిరింత పారిజాత ్డ ఉన్నారు. 25 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని నగర కొత్వాల్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. 👉 రహదారులపై వ్యర్థాలు తొలగించేందుకు గణేశ్ యాక్షన్ టీమ్‌లు 160. 👉 అందుబాటులో ఉంచిన మినీ టిప్పర్లు 102, జేసీబీలు 125. 👉 మొబైల్ టాయ్‌లెట్స్ 309 👉 తాత్కాలిక వీధి దీపాలు 52,270. 👉 రోడ్ల మరమ్మతులు, ప్యాచ్‌వర్క్స్‌కు సంబంధించిన పనులు 172. 👉 వీటికి చేసిన వ్యయం రూ.12.77 కోట్లు. 👉 రవాణాకు సంబంధించిన పనులు 36. వ్యయం రూ.16.35 కోట్లు. పనులన్నీ పూర్తయినట్లు జీహెచ్ఎంసీ చెబుతున్నప్పటికీ, ఇంకా కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై గుంతలు దర్శనమిస్తున్నాయి. ప్యాచ్‌వర్క్ పనులు పూర్తి కాలేదు. -
ఖైరతాబాద్‌లో షీ టీమ్స్ ఫోకస్.. 285 మంది పోకిరీలు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గణపతి నవ రాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలిస్తున్నారు. ఈ క్రమంలో మహిళల పట్ల కొందరు ఆకతాయిలు అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. దీంతో, పోకిరీలకు షీ టీమ్స్ చెక్‌పెడుతున్నాయి. గణేష్ ఉత్సవాల్లో మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన 285 మంది అకతాయిలను షీ టీమ్స్ పట్టుకున్నారు.కాగా, గణేష్ ఉత్సావాల సందర్భంగా ఖైరతాబాద్ బడా గణపతి వద్దకు వేలాది సంఖ్యలో మహిళలు, యువతులు హాజరయ్యారు. ఈ క్రమంలో వారి పట్ల కొందరు ఆకతాయిలు అనుచితంగా ప్రవర్తించారు. గడిచిన ఏడు రోజుల్లో మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన 285 మందిని అరెస్ట్ చేసినట్టు షీ టీమ్స్ తెలిపాయి. ఇక, గణేష్ ఉత్సవాల్లో మహిళల భద్రతపై హైదరాబాద్ పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ సందర్భంగా మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఇది కూడా చదవండి: ఖైరతాబాద్‌లో కిక్కిరిసిన భక్త సందోహం -
ఖైరతాబాద్‌లో కిక్కిరిసిన భక్తులు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఖైరతాబాద్ బడా గణపతి నిమజ్జనం మంగళవారం జరుగనుంది. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ గణపతి దర్శించుకునేందుకు శనివారం భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. భక్తుల తాకిడితో ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.కాగా, ఖైరతాబాద్‌లో బగా గణేష్ దర్శనం భక్తులు బారులు తీరారు. వీకెండ్, నవ రాత్రి ఉత్సవాలు ముగిసే సమయం దగ్గర పడుతుండటంతో గణపతిని దర్శించుకునే వారి సంఖ్య పెరిగింది. శనివారం మధ్యాహ్నం నుంచి గంట గంటకు భక్తుల రద్దీ పెరుగుతూనే ఉంది. భారీ సంఖ్యలో భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. దీంతో, దర్శనానికి వచ్చే భక్తులను కంట్రోల్ చేయడానికి పోలీసులు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు.. విగ్రహం వద్ద భక్తుల సంఖ్య పెరగడంతో కేటుగాళ్లు దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే అనేకమంది సెల్ ఫోన్ పోగుట్టుకున్నారని తెలుస్తోంది. బంగారం, పర్సులు, తమ విలువైన వస్తువులు పోయాయని ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ క్రమంలో దొంగలు సంచరిస్తున్నారని భక్తులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలను పోలీసులు హెచ్చరించారు. ఇక, రేపు ఆదివారం కావడంతో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక, ఖైరతాబాద్ రూట్లో వచ్చే మెట్రో సర్వీసులు కూడా ఫుల్ అయిపోయాయి. మెట్రోలో ప్రయాణీకుల రద్దీ పెరిగింది. ఇది కూడా చదవండి: హైడ్రాపై కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు -
ఖైరతాబాద్ గణేష్ తొలి పూజలో సీఎం రేవంత్ రెడ్డి
-
ఖైరతాబాద్ మహాగణపతి విశేషాలు
-
#VinayakaChavithi : రేపటి నుండి ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం (ఫొటోలు)
-
అడుగుతో మొదలై.. లడ్డూతో ఘనమై.. ఖైరతాబాద్ మహాగణపతికి తుది మెరుగులు (చిత్రాలు)
-
ఖైరతాబాద్ : గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో తెప్పోత్సవం (ఫొటోలు)
-
ఖైరతాబాద్‌లో బీఎండబ్ల్యూ కారు బీభత్సం
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కారు బీభత్స సృష్టించింది. ఖైరతాబాద్ నుంచి బంజారా హిల్స్ వైపు అతి వేగంతో వెళ్తూ.. ఓ బీఎండబ్ల్యూ కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాద సమయంలో కారులో ఇద్దరు యువతులు, ఇద్దరు యువకులు ఉన్నారు. ఇద్దరికి తీవ్రంగా గాయాలు కావటంతో బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రికి తరలించారు. ఉదయం 7.30 గంటలకు ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో కారును జితేష్ బుగాని అనే యువకుడు నడిపినట్లు పోలీసులు తెలిపారు. జితేష్ బుగాని తండ్రి ప్రభుత్వంలో ఒక ఉన్నత అధికారి అని సమాచారం. కేసు నమోదు చేసిన ఖైరతాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మద్యం మత్తులో కారు ప్రమాదం జరిగిందా? లేదా నిర్లక్ష్యమా? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. -
ఖైరతాబాద్ నియోజకవర్గంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు (ఫొటోలు)
-
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానంపై కేసు నమోదు
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–52లోని నందగిరిహిల్స్ హుడా లేఅవుట్లో ప్రభుత్వ స్థలం చుట్టూ నిరి్మంచిన ప్రహరీగోడను పక్కనే ఉన్న గురుబ్రహ్మనగర్ బస్తీవాసులు దౌర్జన్యంగా కూలి్చవేయడం జరిగిందని, ఇందుకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రోత్సాహం ఉందని, ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందిగా హైడ్రా ఎన్ఫోర్స్మెంట్ ఇన్‌ఛార్జి వి.పాపయ్య ఇచి్చన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు దానం నాగేందర్‌పై కేసు నమోదు చేశారు. నందగిరిహిల్స్ లేఅవుట్లో 850 గజాల జీహెచ్ఎంసీ ఓపెన్ స్పేస్ ఉందని, ఇది ప్రభుత్వానికి చెందినదని, దీనిని కాపాడే యత్నంలో భాగంగా చుట్టూ ప్రహరీ నిరి్మంచడం జరిగిందన్నారు. ఈ నెల 10వ తేదీన ఉదయం గురుబ్రహ్మనగర్ బస్తీవాసులు ఇక్కడికి వచ్చి జీహెచ్ఎంసీ స్థలం చుట్టూ నిరి్మంచిన ప్రహరీని కూలి్చవేశారన్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఘటనా స్థలంలోనే ఉండి బస్తీవాసులను ప్రోత్సహించారని, బస్తీ నేతలు గోపాల్‌నాయక్, రాంచందర్‌లను ప్రోత్స హించి ఈ కూలి్చవేతలు చేపట్టినట్లు తెలిపారు. ఈ కూలి్చవేతల వల్ల రూ.10 లక్షల ఆస్తి నష్టం జరిగిందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. వీరిపై చర్యలు తీసుకోవాల్సిందిగా పాపయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే దానం, గురుబ్రహ్మనగర్ బస్తీ నేతలు గోపాల్‌నాయక్, రాంచందర్‌లపై బీఎన్ఎస్ 189 (3), 329 (3), 324 (4), రెడ్‌విత్ 190, సెక్షన్ 3 ఆఫ్ పీడీపీపీ యాక్ట్ కింద కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఖైరతాబాద్‌కు ఉపఎన్నికలొస్తే మనదే గెలుపు: కేటీఆర్
బంజారాహిల్స్: ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తుందని, బీఆర్ఎస్ను గెలిపించేందుకు నేతలు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గ నేతలతో శుక్రవారం ఆయన సమావేశమై దిశానిర్దేశం చేశారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ నియోజకవర్గానికి తప్పనిసరిగా ఉప ఎన్నిక వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకోసం కార్యకర్తలు సమాయత్తం కావాలని సూచించారు. కార్యక్రమంలో మన్నె గోవర్ధన్‌రెడ్డి, జెజొల్ల రాజు ముదిరాజ్, కొమ్ము విజయ్‌కుమార్, విజయ్‌కృష్ణ, అజయ్‌కుమార్ పాల్గొన్నారు. -
70 ఏళ్లు.. 70 అడుగులు
ఖైరతాబాద్ (హైదరాబాద్): ఖైరతాబాద్‌లో 1954లో అడుగు ఎత్తుతో ఏర్పాటు చేసిన మహాగణపతి.. ఈ ఏడాదితో 70 ఏళ్లయిన సందర్భంగా.. 70 అడుగుల ఎత్తున్న విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు మహాగణపతి నమూనాను శుక్రవారం ఆవిష్క రించారు. ‘శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి’గా 70 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో స్వామి దర్శనమివ్వనున్నారు.నిల్చున్న ఆకృతిలో ఉండే గణపతి తలకు ఇరువైపులా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, మహంకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపాలు, రెండు వైపులా 14 చేతులు, కుడివైపు చేతుల్లో చక్రం, అంకుశం, పుస్తకం, త్రిశూలం, కమలం, శంఖం, ఎడమ వైపు రుద్రాక్ష, ఆసనం, పుస్తకం, వీణ, కమలం, గద ఉన్నాయి.మహాగణపతి పక్కన కుడివైపు పది అడుగుల ఎత్తులో ప్రత్యేకంగా బాల రాముడి విగ్రహం, ఎడమవైపు రాహుకేతువుల విగ్రహాలను 9 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేయనున్నారు.వినాయకుడి పాదాల చెంత 3 అడుగుల మేర మూషిక వాహనం ఉంటుంది. మహాగణపతి కుడివైపు 14 అడుగుల ఎత్తులో శ్రీనివాస కల్యాణం, ఎడమవైపు శివపార్వతుల కల్యాణం విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నట్లు శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ తెలిపారు. -
ఖైరతాబాద్ ఫ్లైఓవర్ పై వరుస ప్రమాదాలు
ఖైరతాబాద్: స్నేహితుడిని సొంత ఊరిలో వదిలిపెట్టి సరదాగా గడిపి తిరిగి హైదరాబాద్‌కు ద్విచక్ర వాహనాలపై వస్తుండగా ఖైరతాబాద్ ఫ్లై ఓవర్‌పైకి రాగానే ముందు ఉన్న యాక్టీవా డివైడర్‌కు ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన ఘటన ఖైరతాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మలక్‌పేటలో నివాసముండే సోఫియాన్ అహ్మద్(20), మహ్మద్ సమీ, సయ్యద్ సైఫ్ ముగ్గురు యాక్టివా వాహనంపై, మరో ద్విచక్రవాహనంపై సయ్యద్ నుమాన్, మహ్మద్ అహ్మద్ అలీ, మూడో వాహనంపై మహ్మద్ తాహెర్ అలీ, ఆదిల్ కలిసి సోమవారం ఉదయం 5.30గంటల ప్రాంతంలో మెదక్‌లో ఉండే ఆదిల్‌ను దింపడానికి వెళ్లారు. అతడిని అక్కడ దింపి అక్కడే సరదాగా గడిపి తిరిగి రాత్రి 10.30 గంటలకు నగరానికి బయల్దేరారు. అర్ధరాత్రి 1గంట ప్రాంతంలో వీరి ముగ్గురి ద్విచక్రవాహనాలు ఖైరతాబాద్ చౌరస్తా నుంచి ఫ్లైఓవర్ మధ్యలోకి రాగానే సోఫియాన్ అహ్మద్ నడుపుతున్న యాక్టీవా ఢివైడర్‌కు ఢీ కొట్టింది. ఈ ఘటనలో డివైడర్ మధ్యలో ఉన్న పూలకుండీ బలంగా సోఫియాన్ అహ్మద్‌కు తగిలింది. యాక్టివాపై ఉన్న ముగ్గురు కిందపడిపోయారు. వీరిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. సోఫియాన్ అహ్మద్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతిచెందిన సోఫియాన్ అహ్మద్ పాన్‌షాపు నిర్వహిస్తుండగా వీరిలో మరో ఇద్దరు చదువుకుంటున్నారు. అర్ధరాత్రి వర్షంతో పాటు వాహనం స్పీడ్‌గా ఉండటం వల్లే అదుపు తప్పి ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. సయ్యద్ సైఫ్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ సందీప్‌రెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఖైరతాబాద్ ఫ్లై ఓవర్‌పై ఆదివారం ద్విచక్రవాహనంపై స్పీడ్‌గా వెళ్తూ అదుపుతప్పి ఫుట్‌పాత్‌ను ఢీకొన్న సంఘటనలో ఓ వ్యక్తి చనిపోగా, మరో వ్యక్తి చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే అదే ఫ్లై ఓవర్‌పై మరో ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందడం అందరినీ కలిచివేసింది. -
ఖైరతాబాద్ గణేశ్.. ఈసారి 70 అడుగుల ఎత్తు
సాక్షి,హైదరాబాద్: గణేశ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈసారి 70 అడుగుల వినాయకుడి విగ్రహాన్నిపెట్టనున్నట్లు ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. సోమవారం(జూన్17) గణేశ్ విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన కర్రపూజ పూర్తయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఖైరతాబాద్‌లో పర్యావరణహిత విగ్రహం ఏర్పాటు చేస్తామని తెలిపారు. సంప్రదాయం ప్రకారం కర్రపూజ చేసి విగ్రహ ఏర్పాటు ప్రారంభించామని చెప్పారు. గతంలో కంటే మెరుగ్గా గణేశ్ ఉత్సవాలు నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారన్నారు. ఈసారి ఖైరతాబాద్ గణేశుడిని సందర్శించుకోవడానికి వచ్చిన ప్రతి భక్తుడికి ప్రసాదం ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
రౌడీషీటర్లపై ఉక్కుపాదం
బంజారాహిల్స్: పోలింగ్ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసుకునేందుకు వీలుగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా రౌడీషీటర్ల కదలికలపై పోలీసులు దృష్టిసారించారు. స్వేచ్ఛాయుత వాతావరణానికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీచేస్తూ ప్రతిరోజూ ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. గత మూడు వారాలుగా ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజక వర్గాల పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఏసీపీలు, సీఐలు, ఎస్ఐలు, బీసీ పెట్రోలింగ్ పోలీసులు రౌడీషీటర్ల కదలికలను గమనిస్తూ వారికి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. ఎన్నికల వేళ ఓటర్లను ప్రభావితం చేసే చర్యలకు పాల్పడితే రౌడీషీట్ కొనసాగుతుందని హెచ్చరిస్తున్నారు. వివిధ పారీ్టల అభ్యర్థులతో తిరిగినా, ప్రచారంలో పాల్గొన్నా పరిస్థితి తీవ్రంగా ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు. రౌడీషీటర్లతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా కౌన్సెలింగ్ ఇస్తున్నారు. తమ పిల్లలు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో, రాత్రి పూట ఇంటికి వస్తున్నారో లేదో దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. దీంతో రౌడీషీటర్ల భయంతో వణికిపోతున్నారు. ఖైరతాబాద్ అసెంబ్లీ పరిధిలో... ఖైరతాబాద్ నియోజక వర్గ పరిధిలోని బంజారాహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, నారాయణగూడ, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, సెక్రటేరియట్, దోమల్‌గూడ, సైఫాబాద్, ఆబిడ్స్, మాసబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 45 మంది రౌడీషీటర్ల ఉండగా ఇప్పటికే 100 శాతం బైండోవర్లు పూర్తయ్యాయి. ఇందులో కొందరు జైలులో ఉండగా మిగతావారికి నిత్యం రాత్రివేళల్లో పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహస్తున్నారు. గత ఎన్నికల సమయంలో వివిధ ఘటనలకు పాల్పడిన 182 మందికి కూడా బైండోవర్ పూర్తి చేశారు. జూబ్లీహిల్స్ పరిధిలో.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మధురానగర్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, పంజగుట్ట, సనత్‌నగర్, హుమాయన్‌నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 101 మంది రౌడీషీటర్ల ఉండగా వీరందరికీ 100 శాతం బైండోవర్లు పూర్తి చేసినట్లు నియోజక వర్గ ఎన్నికల నోడల్ అధికారి, జూబ్లీహిల్స్ ఏసీపీ కట్టా హరిప్రసాద్ తెలిపారు. అలాగే గత ఎన్నికల సమయంలో వివిధ నేరాలకు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డ మరో 300 మందిని కూడా బైండోవర్ చేసినట్లు ఆయన వెల్లడించారు. రౌడీïÙటర్లకు నిత్యం కౌన్సెలింగ్ చేస్తున్నట్లు తెలిపారు. -
ఆస్తులకు మించిన అప్పుల్లో ఎమ్మెల్యే దానం
బంజారాహిల్స్: అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బుధవారం నామినేషన్ దాఖలు చేయగా అఫిడవిట్లో తన ఆస్తులను ప్రకటించారు. ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో తన ఆస్తులు, కేసుల వివరాలను వెల్లడించారు. దానం నాగేందర్ పేరిట మొత్తం ఆస్తుల విలువ రూ. 41,33,50,000గా పేర్కొన్నారు. కాగా వివిధ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో 47.63 లక్షలు ఉండగా ఆయన భార్య దానం అనిత పేరు మీద 78.17 లక్షల డిపాజిట్లు ఉన్నాయి. కుమార్తె సాయి ప్రియ పేరిట 9.55 లక్షలు డిపాజిట్లు ఉన్నాయి. ఈక్విటీ షేర్లు, పెట్టుబడుల రూపంలో భాగ్యలక్ష్మి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థలో రూ. 16.16 కోట్ల విలువైన షేర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఎంఎస్పీ. ఇండెన్ సంస్థ నుంచి తనకు రూ. 2.74 కోట్లు రావాల్సి ఉందని పేర్కొన్నారు. తనకు వరంగల్ జిల్లా నిరుకులలో 6.09 ఎకరాలు, కళ్ళం గ్రామంలో 18.29 ఎకరాలు, నల్లగొండ జిల్లా పోచంపల్లి గ్రామంలో 9 ఎకరాలు, జనగాం జిల్లా పల్లగుట్ట గ్రామంలో 16 ఎకరాలు, యాదాద్రి భువనగిరి జిల్లా మల్యాల గ్రామంలో 4.11 ఎకరాలు ఉన్నట్లు వెల్లడించారు. బంజారాహిల్స్ రోడ్ నెం. 3లోని 1432 గజాల్లో ఇల్లు ఉందని దాని ప్రస్తుత మార్కెట్ విలువ రూ. 25 కోట్ల వరకు ఉంటుందని పేర్కొన్నారు. తనకు రూ. 47.55 కోట్ల అప్పులు ఉన్నాయని పేర్కొన్నారు. భార్య పేరిట రూ. 2 కోట్ల అప్పు ఉందని కాగా తన చేతిలో రూ. 1.50 లక్షల నగదు మాత్రమే ఉందని అఫిడవిట్లో పేర్కొనడం గమనార్హం. ఆభరణాల విలువ రూ. 27కోట్లు దానం నాగేందర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యుల పేరిట రూ. 27 కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలు ఉన్నట్లుగా అఫిడవిట్లో పేర్కొన్నారు. వీటిలో దానం పేరిట 1297 క్యారెట్ల వజ్రాలు(రూ.2.99 కోట్లు), 80 తులాల బంగారం(21.6లక్షలు), పది కేజీల వెండి(రూ.4.4 లక్షలు) ఉండగా ఆయన భార్య అనితకు 1350 క్యారెట్ల వజ్రాభరణాలు(3.39కోట్లు), 225 తులాల బంగారం(60.75లక్షలు) ఉన్నాయి. రూ. 10.82 లక్షల విలువైన ఆభరణాలు ఉన్నట్లు పేర్కొన్నారు. -
కలలో కూడా ఈ పరిస్థితి వస్తుందనుకోలేదు: పీవీఆర్
సాక్షి, హైదరాబాద్: పీజేఆర్ కొడుకు, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి ఇంటికి మంత్రి హరీష్‌రావు వెళ్లారు. హైదరాబాద్‌లోని విష్ణు నివాసంలో సోమవారం ఆయన్ను కలిసి బీఆర్ఎస్లో చేరాలని ఆహ్వానించారు. కాగా కాంగ్రెస్ జూబ్లీహిల్స్ టికెట్‌ను తనకు కాకుండా అజారుద్దీన్‌కు ఇవ్వడంతో విష్ణువర్దన్‌రెడ్డి అసహానం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే విష్ణువర్ధన్‌రెడ్డి ఆదివారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసిన విషయం తెలిసిందే. దీంతో విష్ణు బీఆర్ఎస్లో చేరడం లాంఛనంగా మారింది. ఈ సందర్భంగా విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో ఈ పరిస్థితి వస్తుందని కలలోకూడా ఊహించలేదని పేర్కొన్నారు. మా నాన్న(పీజేఆర్) 35 ఏళ్లు, తాను 17 ఏళ్లు కాంగ్రెస్‌కు సేవ చేశామని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో గాంధీభవన్‌ను అమ్మేసే పరిస్థితులు వచ్చాయని విమర్శించారు. అతి త్వరలోనే తాను బీఆర్ఎస్లో చేరనున్నట్లు వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీలో విష్ణుకు సరైన గౌరవం కల్పిస్తామని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన చురుకుగా పాల్గొన్నారని తెలిపారు. విష్ణును బీఆర్ఎస్లోకి ఆహ్వానిస్తున్నామని, ఆయనకు బీఆర్ఎస్ మంచి భవిష్యత్తును ఇస్తుందని చెప్పారు. తెలంగాణ కోసం నిలబడిన వ్యక్తి విష్ణు అని, బీఆర్ఎస్లో చేరేందుకు సుముకుత వ్యక్తం చేశారని తెలిపారు. తాము, విష్ణు అయిదేళ్లు శాసనసభ సభ్యులుగా ఉన్నామని, అనేక ఉద్ధమాల్లో ఆయన తమతో కలిసి పోరాడినట్లు ప్రస్తావించారు. తెలంగాణ వాదులకు, ద్రోహులకు మధ్య యుద్ధం జరుగుతోందని హరీష్ రావు విమర్శించారు. పట్టపగలు డబ్బు కట్టలతో దొరకిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ. 5 కోట్లకు ఒక్కో ఎమ్మెల్యే టికెట్ అమ్ముకుంటున్నారని కాంగ్రెస్ నేతలే చెప్తున్నారని మండిపడ్డారు. పీసీసీ పదవిని కూడా కొనుక్కున్నారని ఆ పార్టీ నేతలే చెప్తున్నారని అన్నారు. కేసీఆర్ పాలనలో హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి జరగుతోందని, సీఎం పాలనలో హైదరాబాద్‌లో తాగునీటి సమస్య లేదని తెలిపారు. -
ముగ్గురూ.. ముగ్గురే..!
రాజకీయ పరిపాలనానుభవం పుష్కలం... ప్రజలతో సంబంధాలు మెండు... నిత్యం ప్రజల మధ్యే తిరిగిన అనుభవం... ప్రతి గడపా గుర్తు పట్టేంతగా ముఖపరిచయం... అందరూ విద్యావంతులే... ఇదీ ఖైరతాబాద్ నియోజకవర్గంలో మూడు ప్రధాన పారీ్టల నుంచి పోటీ పడుతున్న ముగ్గురు దిగ్గజ అభ్యర్థుల అనుభవాల పరంపర. బంజారాహిల్స్: ఇప్పటికే ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉన్న బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డితో పాటు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పని చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ వీరికి తోడు 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అనుభవం ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి పి.విజయారెడ్డి ఎవరికి వారే దిగ్గజ రాజకీయ నాయకులుగా నియోజకవర్గ ప్రజల్లో గత రెండు రోజుల నుంచి చర్చనీయాంశంగా మారారు. ఎక్కడ చూసినా ఈ ముగ్గురిపైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది. ►హైదరాబాద్‌లో ఎక్కడా లేని విధంగా ముగ్గురు బలమైన అభ్యర్థులు పోటీ పడుతున్న నియోజకవర్గంగా ఖైరతాబాద్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచింది. ఎవరికి వారే గట్టి అభ్యర్థులు కావడంతో పోటీ తీవ్రంగా ఉంటుందని గెలుపు ఎవరిదో స్పష్టంగా చెప్పలేని పరిస్థితులు ఉత్పన్నమయ్యాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ► కాంగ్రెస్ అభ్యర్థిగా విజయారెడ్డిని ప్రకటించడంతోనే నియోజకవర్గంలో అసలైన కదలిక వచి్చంది. నువ్వా.. నేనా అనే రీతిలో ఈ పోటీ జరగబోతోందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ► విజయారెడ్డి దివంగత జనహృదయ నేత పీజేఆర్ వారసత్వాన్ని పునికిపుచ్చుకొని ప్రస్తుతం పోటీలో ఉండగా అయిదుసార్లు ఎమ్మెల్యేగా తలపడుతున్న దానం నాగేందర్‌కు ఇప్పుడామె సవాల్‌గా నిలిచారు. దీనికి తోడు చాపకింద నీరులా తమ క్యాడర్‌ను విస్తరించుకుంటూ ప్రజల్లోకి గత రెండేళ్లు నుంచి పాతుకుపోయిన బీజేపీ ఈ ఇద్దరు అభ్యర్థులకు గట్టిపోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకోవడానికి నియోజకవర్గంలో సమస్యలు కోకొల్లులుగా ఉన్నాయి. కేసీఆర్ బొమ్మతోనే... ఖైరతాబాద్ నియోజకవర్గంలో అధికార పార్టీ సంక్షేమ పథకాలు ఎప్పుడూ లేని విధంగా లబ్ధిదారులకు అందాయి. కొన్ని చోట్ల అభివృద్ధి ఆగిపోయినా, చాలా చోట్ల దీర్ఘకాలంగా ఉన్న సమస్యలకు పరిష్కారం చూపారు. అయితే కేసీఆర్ బొమ్మతోనే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు బాటలో నిలవాల్సిందేనని నియోజకవర్గ ప్రజలు పేర్కొంటున్నారు. రకరకాల సమస్యలు బీఆర్ఎస్ అభ్యర్థని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగి ఒకసారి రోడ్డు మీదికి వస్తే పరిస్థితులో మార్పు వస్తుందని సర్వత్రా భావిస్తున్నారు. పీజేఆర్ బొమ్మతో... ఖైరతాబాద్ అంటేనే పీజేఆర్... పీజేఆర్ అంటేనే ఖైరతాబాద్... ఇప్పుడు ఈ నినాదాన్ని ఖైరతాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి విజయారెడ్డి ముమ్మరంగా ప్రజల్లోకి తీసుకెళ్లునున్నారు. ఇప్పటికీ పీజేఆర్‌కు అభిమానులు ఎక్కువగానే ఉన్నారు. ఆయన బొమ్మ చూస్తే ఓటర్లలో మార్పు రాకమానదు. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ అంటేనే పీజేఆర్ నరనరాన నిలిచిపోయింది. అదే పార్టీ తరపున ఆయన కూతురు పోటీ చేస్తుండటంతో నియోజకవర్గం ప్రజలు ఇప్పటికే స్వాగతిస్తున్నారు. కొంత కాలంగా ఆమె ప్రజల్లోనే తిరుగుతుండటంతో ఇప్పటికే నియోజకవర్గం మొత్తం ఆమె పరిచయం అయిపోయినట్లే. అధికార పార్టీ వైఫల్యాలే ఎజెండాగా... అయిదు సంవత్సరాల్లో అధికార పార్టీ వైఫల్యాలు తనకు అనుకూలిస్తాయని వాటిని ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లాలని బీజేపీ అభ్యర్ఙి చింతల రామచంద్రారెడ్డ ఎజెండా రూపొందించుకున్నారు. కేవలం ఎన్నికల సమయంలోనే కాకుండా గత నాలుగేళ్లుగా ఆయన ప్రజల చుట్టే తిరుగుతున్నారు కరోనా సమయంలో జనంలో తిరగడంతో అది బాగా కలిసి వస్తుందని ఆయన భావిస్తున్నారు. ముఖ్యంగా అభివృద్ధి చాలా చోట్ల నిలిచిపోవడంతో వాటినే అ్రస్తాలుగా మలుచుకోనున్నారు. -
ఘనంగా బతుకమ్మ వేడుకలు!
సాక్షి, హైదరాబాద్: బతుకమ్మ పండుగ రోజున 'గౌరమ్మను' పసుపు రంగు పూలతో పేర్చి తొమ్మిది రోజుల పండుగను అంగరంగా వైభవంగా జరుపుతారు. ఆటపాటలాడి పూలను నీటిలో వదులుతారు. పార్వతి గురించి పాటలాగా పాడుతూ.. ఆనందంతో బతుకమ్మను జరుపుకుంటారు. ఆడపడచులు, యువకులు, పిల్లలు, పెద్దలు తమ ఆనందాన్ని చూపే కన్నుల పండుగగా.. తెలంగాణ ప్రజలకు ప్రకృతిని అరాధించే పెద్ద పండుగ ఈ బతుకమ్మ. ఈ సందర్భంగా పల్లెలు, పట్టణాల్లో ఆలయాలు, ప్రధాన కూడళ్ల వద్ద బతుకమ్మ ఆడేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో పల్లెలు, పట్టణాలు తీరొక్క పూల శోభ సంతరించుకోనుంది. ఈ క్రమంలో చెరువుల వద్ద నిమజ్జన ప్రదేశాల్లో రంగుల ఆహ్లాదం ఎంతో చూడముచ్చట. పౌష్టికాహారం, చిరుధాన్యాలు, కూరగాయలు, గాజులు, చేతివృత్తులతో తయారు చేసిన బతుకమ్మలు ప్రత్యేక ఆకర్షణీయం. బతుకమ్మ పండుగ కేవలం కటుంబాలకు, ఇంటికే పరిమితం కాదు, తెలంగాణలోని అన్నీ రంగాలవారిగా.. విద్యా, వైద్యా, సాంకేతిక, వివిధ పరిశ్రమల్లో బతుకమ్మ వేడుకల నిర్వహణ ఎంతో కన్నుల పండుగగా చెప్పవచ్చు అనడానికి నిదర్శనంగా.. 'డైరెక్టర్ ఆఫ్ అకౌంట్స్ కార్యాలయంలో' శనివారం బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. 'డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్ విభాగం' డైరెక్టర్ వి ఫణిభూషణ్‌శర్మ ఈ వేడుకలకు హాజరయ్యారు. 'జాయింట్ డైరెక్టర్లు' హెచ్ శైలజారాణి, పి రజిని, తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు. రంగారెడ్డి హైదరాబాద్ 'పే అండ్ అకౌంట్ ఆఫిసర్స్' మహ్మద్ ఆరిఫ్, ఆర్ వి రామగోపాల్ అండ్ స్టాఫ్, ఇతర ఉన్నతాధికారులు, ఉద్యోగ సిబ్బంది, తదితరులు బతుకమ్మ వేడుకల సందర్భంగా హాజరయ్యారు. బతుకమ్మ పర్వదినాన్ని పురస్కరించుకొని మహిళల్ని మరింత ప్రోత్సహించే దిశలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఇలాంటి మరెన్నో పండుగలు జరుపుకోవాలని డైరెక్టర్ కోరుతూ.. అందుకు అందరి ప్రోత్సాహం ఎంతో అవసరమని తెలిపారు. -
కాసేపట్లో గంగ ఒడికి ఖైరతాబాద్ బడా గణేష్
-
Khairatabad Ganesh Nimajjanam 2023: ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర.. నిమజ్జనం (ఫొటోలు)
-
ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం...ఎన్ని గంటలకంటే
-
ఖైరతాబాద్ గణేశుడి చివరి పూజ.. దర్శనం నిలిపివేత..
-
చింతల్‌బస్తీ నాలాలో మొసలి పిల్ల
-
ఖైరతాబాద్‌లో మొసలి పిల్ల కలకలం
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో బుధవారం భారీగా కురిసిన వానకు నాలాలన్నీ పొంగిపొర్లాయి. ఇదే క్రమంలో చింతల్ బస్తీ నాలాలో మొసలి పిల్ల ఒకటి రోడ్డుపైకి కొట్టుకొచ్చింది. చింతల్ బస్తీలో నిర్మాణంలో ఉన్న వంతెన దగ్గర నాలా వద్ద మొసలి పిల్ల ప్రత్యక్షమైంది. వెంటనే భయభ్రాంతులకు గురైన స్థానికులు మొసలిని కర్రలతో బెదిరించే ప్రయత్నం చేశారు. మొసలి పిల్ల అరవడం మొదలుపెట్టడంతో అక్కడివారంతా తలోదిక్కూ పరుగులు తీశారు. అక్కడివారు అప్రమత్తమై అటవీశాఖ అధికారులకు, జీహెచ్ఎంసీ అధికారులకు ఫోన్ చేసి సమాచారమందించారు. భారీగా కురిసిన వర్షానికి రోడ్డు మీదకు వచ్చిన డ్రైనేజీ నీటి ఉధృతికి మొసలి రోడ్డుపైకి కొట్టుకుని వచ్చి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఇది కూడా చదవండి: గణేష్ నిమజ్జనం.. మెట్రో సేవల సమయం పొడిగింపు.. -
ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం ఎన్ని గంటలకంటే..
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్రకు ఉత్సవ సమితి ఏర్పాట్లు చేస్తోంది. ఈ రోజు అర్థరాత్రి చివరి పూజ అనంతరం నిమజ్జనానికి సిద్ధమయ్యారు. చివరి రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. అటు.. రేపు జరగబోయే శోభాయాత్రలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొననున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను ఉత్సవ సమితి చేసింది. ఖైరతాబాద్ వినాయకునికి ఎంతో ప్రాధాన్యత ఉంది. నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. తొమ్మిది రోజులుగా పూజలు నిర్వహించిన ఉత్సవ సమితి నేడు అర్ధరాత్రి ఇక చివరి పూజను నిర్వహించనుంది. అర్ధరాత్రి 1 గంట తర్వాత మహాగణపతిని ఉత్సవ సమితీ కదిలించనుంది. రేపు మధ్యాహ్నం 2 గంటలలోపు మహాగణపతి నిమజ్జనం పూర్తి అయ్యేలా ఏర్పాట్లు చేశారు. శోభాయాత్ర సాగుతుంది ఇలా.. ►ఈ రోజు అర్థరాత్రి 12 గంటలకు మహా గణపతికి చివరి పూజ ►అర్దరాత్రి 1 గంట తర్వాత మహాగణపతిని కదిలించనున్న ఉత్సవ కమిటీ ►రాత్రి 2 నుంచి తెల్లవారుజామున 4 వరకు విగ్రహాలను భారీ టస్కర్ లోకి ఎక్కించనున్న కమిటీ ►ఉదయం 4 నుంచి 7 వరకు మహాగణపతిని భారీ వాహనంపై ఎక్కించి వెల్డింగ్ వర్క్ ►ఉదయం ఎనిమిది గంటల లోపు ప్రారంభం కానున్న మహా గణపతి శోభాయాత్ర ►టెలిఫోన్ భవన్, సెక్రటేరియట్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్ చేరుకోనున్న మహా గణపతి ►ఉదయం 10 గంటల సమయంలో క్రేన్ నెంబర్ 4 వద్ద కు చేరుకునే అవకాశం ►తర్వాత భారీ వాహనంపై మహాగణపతి తొలగింపు కార్యక్రమం ►క్రేన్ నెంబర్ ఫోర్ వద్ద ఉదయం 11 నుంచి 12 గంటల లోపు పూజా కార్యక్రమం ►12 నుంచి హుస్సేన్ సాగర్ లో మహాగణపతి నిమజ్జన కార్యక్రమం షురూ ►మ. 2 గంటల లోపు మహా గణపతి నిమజ్జనం పూర్తి అయ్యేలా ఏర్పాట్లు నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు.. మహాగణపతి నిమజ్జనానికి హైదరాబాద్ సిద్ధమైంది. హుస్సేన్‌సాగర్‌తోపాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 100 చోట్ల నిమజ్జనాలు జరగనున్నాయి. ఇందుకోసం జీహెచ్ఎంసీ క్రేన్లు, జేసీబీలు, టిప్పర్లతోపాటు వేలాదిమంది సిబ్బందిని ఏర్పాటు చేసింది. నిమజ్జనం సందర్భంగా ప్రమాదవశాత్తు ఎవరైనా నీళ్లలో పడిపోతే రక్షించేందుకు 200 మంది గజ ఈతగాళ్లను కూడా సిద్ధం చేసింది. అలాగే, శోభాయాత్ర జరిగే రహదారులపై వైద్య శిబిరాలు, 79 అగ్నిమాపక వాహనాలను అందుబాటులో ఉంచింది. నిమజ్జనానికి తరలివచ్చే వారి కోసం జలమండలి 10 లక్షల నీళ్ల ప్యాకెట్లను రెడీ చేసింది. నిమజ్జనం రోజున ప్రజల సౌకర్యార్థం హుస్సేన్ సాగర్‌కు నగరం నలుమూలల నుంచి 535 బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. అలాగే 29 తెల్లవారుజాము వరకు ఎంఎంటీఎస్ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. మెట్రో రైళ్లు కూడా రేపు అర్ధరాత్రి దాటాక 2 గంటల వరకు నడవనున్నాయి. ఇదీ చదవండి: ప్రతి గణేష్ విగ్రహానికీ క్యూఆర్ కోడ్ -
Khairatabad Ganesh 2023 Photos: ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి పోటెత్తిన భక్తులు (ఫోటోలు)
-
చవితికి రెండ్రోజుల ముందే మహా గణపతి సిద్ధం
హైదరాబాద్: తొలుత ఒక్క అడుగుతో ప్రారంభమైన ఖైరతాబాద్ మహాగణపతి ఒక్కో అడుగు పెంచుకుంటూ 69వ సంవత్సరం శ్రీ దశమహా విద్యాగణపతిగా ఈ సంవత్సరం 63 అడుగుల ఎత్తులో భక్తులకు దర్శనమిచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ప్రారంభమైన కలర్ పనులు మరో రెండు రోజుల్లో పూర్తవుతాయని నిర్వాహకులు తెలిపారు. ఈ సంవత్సరం ఖైరతాబాద్ మహాగణపతికి ఇరువైపులా కుడివైపు పంచముఖ లక్ష్మీనారసిహ స్వామి, ఎడమవైపు శ్రీ వీరభద్ర స్వామి విగ్రహాలను ఏర్పాటు చేశారు. చవితికి రెండు రోజుల ముందే మహాగణపతి పూర్తిస్థాయిలో దర్శనమిచ్చేందుకు సిద్ధమవుతారని తెలిపారు. ► అప్పట్లో స్వాతంత్య్ర సమరయోధులైన సంగరి శంకరయ్య బాల గంగాధర్ తిలక్ స్ఫూర్తితో ఎ. భీమయ్య, జి.సుందర్శనం, రాజారాగం, రాజమణిదేవి, ఎస్.సుదర్శన్, ఎస్.వీరభద్రయ్య, గణేష్‌కుమార్ కలిసి ఈ మహత్ కార్యానికి పూనుకున్నారని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ నేతృత్వంలో విగ్రహ తయారీ పనులు పూర్తియ్యాయని, ఈ నెల 18 వినాయక చవితి నాటికి భక్తులకు సంపూర్ణంగా దర్శనమిచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం ఉత్సవ కమిటి పోలీసు శాఖతో సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు దానం నాగేందర్ పేర్కొన్నారు. ► వినాయక చవితి సందర్భంగా ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డులో నిమజ్జన ఏర్పాట్లను నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్తో కలిసి పరిశీలించారు. పీపుల్స్ ప్లాజా, జలవిహార్ వద్ద వాహనాల పార్కింగ్, బ్రిడ్జి– 2, ఎన్టీఆర్ మార్గ్‌లో ఖైరతాబాద్ మహాగనపతి నిమజ్జన ప్రాంతాలను పరిశీలించారు. వీరితో ట్రాఫిక్ అడిషినల్ కమిషనర్ సుధీర్ బాబు, విక్రమ్ సింగ్ మాన్, జోనల్ కమిషనర్ వెంకటేష్ దోత్రే, ఈఎస్సీ జియావుద్దీన్, జోనల్ ఎస్ఈ రత్నాకర్, హెచ్ఎండీఏ ఎస్ఈ పరంజ్యోతి, అడిషినల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు. -
వచ్చే నెల 19నే వినాయక చవితి: భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది వినాయక చవిత ఉత్సవాలపై భాగ్యనగర్ ఉత్సవ సమితి కీలక ప్రకటన చేసింది. వచ్చే నెల 19వ తేదీన సాంప్రదాయబద్దంగా వినాయక చవిత పండుగ నిర్వహించుకోవాలని సూచించింది. అలాగే, 28వ తేదీన నిమజ్జనం ఉంటుందని స్పష్టం చేసింది. కాగా, భాగ్యనగర్ ఉత్సవ సమితి సభ్యులు సోమవారం భేటీ అయ్యారు. గణేష్ ఉత్సవ ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ఏడాది వినాయక చవితి ఏ రోజున జరుపుకోవాలనే సందేహం చాలా మందిలో ఉంది. అయితే, వచ్చే నెల18వ తేదీన మధ్యాహ్నం చవితి మొదలై 19వ తేదీ మధ్యాహ్నం వరకు ఉంటుంది. సూర్యోదయం తర్వాత వచ్చిన తిథినే పండుగ రోజుగా గుర్తిస్తాం. కాబట్టి 19వ తేదీన సాంప్రదాయబద్దంగా వినాయక చవిత జరుపుతున్నాం. వచ్చే నెల 28వ తేదీన నిమజ్జనం కార్యక్రమం ఉంటుందని స్పష్టం చేశారు. పొలిటికల్ ఫ్లెక్సీలు వద్దు.. గత ఏడాది లాగే ఈసారి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తాం. గణేష్ పూజా విధానం తెలిపే బుక్‌తో పాటు పూజా సామాగ్రిని భక్తులకు ఇవ్వాలిని నిర్ణయించాం. గణేష్ మండపాలకు పోలీసు పర్మిషన్ తప్పనిసరి కాదు. స్థానిక పోలీసు స్టేషన్లో చెబితే సరిపోతుంది. గణేష్ ఉత్సవాల్లో రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు పెడుతున్నారు. సుప్రీంకోర్టు ఇప్పటికే ఫ్లెక్సీలను నిషేధించింది. ఈసారి కూడా రాజకీయ నాయకుల ఫ్లెక్సీలను పెట్టవద్దని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు చెప్పాం. గణేష్ ఉత్సవాలకు సీఎం కేసీఆర్ రావాలని అడిగినట్టు తెలిపారు. పండుగ ఘనంగా నిర్వహిస్తాం.. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ఎంతో ఘనంగా గణేష్ ఉత్సవాలు జరుగుతాయి. 30వేలకు పైగా వినాయక విగ్రహాలు తయారవుతున్నాయి. గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పండుగ సజావుగా జరిగేందుకు కృషి చేస్తారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున గడిచిన తొమ్మిదేళ్లలో అన్ని మతాల పండుగలను ఘనంగా నిర్వహించాం. గణేష్ నిమజ్జన కార్యక్రమం శోభాయమానంగా జరుగుతోంది. వినాయక నిమజ్జనం కోసం తాత్కాలిక చెరువులను ఏర్పాటు చేస్తాం. వినాయక నిమజ్జనం, మిలాద్ ఉన్ నబి ఒకేరోజు వస్తున్నాయి. ఆరోజు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. బడ్జెట్‌తో సంబంధం లేకుండా ఉత్సవాలు నిర్వహిస్తాం. మన తెలంగాణ పండుగ సాంప్రదాయం దేశ విదేశాలకు విస్తరించింది. గణేష్ మండపాల పర్మిషన్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తున్నాం’ అని స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: మొక్కలు రావాలంటే భూమికి తడి తగలాలి..సంస్కృతి నిలబడాలంటే.. -
ఖైరతాబాద్‌లో ఘనంగా గంగ తెప్పోత్సవం బోనాలు (ఫోటోలు)
-
Hyderabad: జెండావిష్కరణలో బీజేపీ నేతల బాహాబాహీ
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా జెండా ఆవిష్కరణ విషయంపై మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, హిమాయత్‌నగర్ కార్పొరేటర్ భర్త గడ్డం రామన్‌గౌడ్ కార్యకర్తల ఎదుట బాహాబాహీకి దిగారు. హిమాయత్‌నగర్ డివిజన్లోని విఠల్‌వాడీలో బీజేపీ కార్యకర్త అనీల్ ఏర్పాటు చేసిన జెండావిష్కరణలో జరిగిన ఘటన చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఇరు వర్గీయులు అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. అనీల్ ఏర్పాటు చేసిన జెండావిష్కరణకు చింతల రామచంద్రారెడ్డి, కార్పొరేటర్ మహాలక్ష్మి గౌడ్‌కు ఆహ్వానం అందింది. మొదట చింతల రాగా, 20 నిమిషాల పాటు కార్పొరేటర్ కోసం వేచి ఉండగా ఆమె రావడం ఆలస్యమైంది. దీంతో చింతల జెండాను ఆవిష్కరించి వెనుదిరిగారు. ఇదే సమయంలో కార్పొరేటర్ మహాలక్ష్మిగౌడ్ ఆమె భర్త రామన్‌గౌడ్ వారి వర్గీయులు వస్తున్నారు. కార్పొరేటర్ వర్గీయుల్లో ఒకరు ‘మేం రాకుండా జెండా ఆవిష్కరిస్తారా? నువ్వు అంత పెద్ద రాజకీయం చేసేవాడివి అయ్యావా? అంటూ’ అనీల్‌ను ప్రశ్నించగా మీరు రావడం ఆలస్యమైంది సార్ ఇంకో చోటకు వెళ్లాల్సి ఉంది అందుకే ఆవిష్కరించారని జవాబిచ్చారు. అంతే. ఇరు వర్గాల వారు ఒకరికొకరు తిట్టుకోవడంలో రెచ్చిపోయారు. అందరి సమక్షంలో బాహాబాహీకి దిగి ఇరు వర్గాల వారు ముష్టికొమ్ములాటకు దిగారు. చదవండి: తలసరి విద్యుత్‌లో తెలంగాణ నెంబర్ 1.. అసలు నిజం ఇదే! -
HYD: ఫ్యాన్సీ క్రేజ్.. ఆ నెంబర్‌కు రూ. 21 లక్షలు!
హైదరాబాద్: ఫ్యాన్సీ నెంబర్లకు ఉండే డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. పైగా ఖరీదైన వాహనాలకూ నెలవైన హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల్లో అది ఇంకా ఎక్కువే కనిపిస్తుంటుంది కూడా. సెంటిమెంట్, ఇష్టమైన నంబర్‌ను దక్కించుకునేందుకు వాహనాల యజమానులు ఎంతదాకా అయినా ఖర్చు చేసిన సందర్భాలు చూశాం. ఈ క్రమంలో ఫ్యాన్సీ నెంబర్ల వేలంతో.. ఇవాళ ఒక్కరోజే ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో కాసుల వర్షం కురిసింది. ఫ్యాన్సీ నంబర్లతో ఒక్క రోజే రూ. 53.34 లక్షల ఆదాయం సమకూరింది. అధికంగా టీఎస్ 09 జీసీ 9999 అనే నంబర్‌కు రూ. 21.60 లక్షలు పలుకగా, ఫ్యాన్సీ నెంబర్ పోటీలో అతి తక్కువగా టీఎస్ 09 జీడీ 0027 నంబర్‌కు రూ. 1.04 లక్షలు పలికింది. ఫ్యాన్సీ నంబర్లు – రేటు – సంస్థలు టీఎస్ 09 జీసీ 9999 – రూ. 21.60 లక్షలు – ప్రైమ్ సోర్స్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ టీఎస్ 09 జీడీ 0009 – రూ. 10.50 లక్షలు – మెఘా ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ టీఎస్ 09 జీడీ 0001 – రూ. 3 లక్షలు – ఆంధ్రా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ టీఎస్ 09 జీడీ 0006 – రూ. 1.83 లక్షలు – గోయజ్ జ్యువెలరీ టీఎస్ 09 జీడీ 0019 – రూ.1.70 లక్షలు – సితారా ఎంటర్టైన్మెంట్స్ టీఎస్ 09 జీడీ 0045 – రూ.1.55 లక్షలు – సాయి పృథ్వీ ఎంటర్ప్రైజెస్ టీఎస్ 09 జీడీ 0007 – రూ. 1.30 లక్షలు – ఫైన్ ఎక్స్పర్ట్స్ అడ్వైజరీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ టీఎస్ 09 జీడీ 0027 – రూ. 1.04 లక్షలు – శ్రీనివాస్ కన్స్ట్రక్షన్స్ -
ఖైరతాబాద్ నుంచి పోటీ చేస్తా: ఇంద్రసేన్‌రెడ్డి
హైదరాబాద్: ప్రజల ఆశీస్సులతో వచ్చే ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని నియోజకవర్గ బీజేపీ నేత బొల్లంపల్లి ఇంద్రసేన్‌రెడ్డి వెల్లడించారు. సోమవారం జూబ్లీహిల్స్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... తన తండ్రి జస్టిస్ బి.సుభాషిణ్‌రెడ్డి మెమోరియల్ ఫౌండేషన్ ద్వారా కొన్నేళ్లుగా పౌరులకు ఉచిత న్యాయసేవలు అందిస్తున్నాని అన్నారు. ఇప్పుడు అదే ఫౌండేషన్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు విస్తృతం చేస్తానన్నారు. ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారి సమస్యలు వింటుంటే ఎంతో బాధేస్తుందన్నారు. ఇటీవల జూబ్లీహిల్స్ డివిజన్ ఫిలింనగర్ బస్తీల్లో పర్యటించినప్పుడు ప్రజలు తనకు ఘన స్వాగతం పలికారని వారి సమస్యలను తెలుసుకున్నాననిన్నారు. కలుషిత నీటి సమస్య అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించామన్నారు. వేళాపాళా లేకుండా నీరు వస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కొత్త పైప్‌లైన్ వేసి ప్రెషర్ పెంచితే సమస్య తగ్గుతుందని అధికారులకు సూచించామన్నారు. పింఛన్లు, రేషన్ కార్డుల కోసం జనం ఎదురు చూస్తున్నారన్నారు. వివిధ ప్రభుత్వ పథకాలకు జతపరిచే ధ్రువీకరణ పత్రాలు సకాలంలో అందడం లేదన్నారు. -
దానం బదులు.. పీఏ చంద్రశేఖర్.. ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఎవరు?
బంజారాహిల్స్: బీఆర్ఎస్లో గ్రూపు తగాదాలను నివారించి నేతలు, కార్యకర్తల మధ్య సమన్వయం చేసుకుంటూ రానున్న అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేసే దిశలో అధిష్టానం ఓ బృహత్తర పథకాన్ని ఆత్మీయ సమ్మేళనాల పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఏ గ్రూపు తగాదాలను నివారించాలని ఈ కార్యక్రమం తలపెట్టారో ఆ గ్రూపు తగాదాలతోనే ఖైరతాబాద్ నియోజకవర్గంలో కొన్ని డివిజన్లలో ఇప్పటి వరకు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించలేక ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేతులెత్తేశారు. ► కొన్ని డివిజన్లలో ఎమ్మెల్యేకు, కార్పొరేటర్లకు పొసగక, మరికొన్ని డివిజన్లలో నేతల మధ్య విభేదాలు, ఇంకొన్ని చోట్ల ఎమ్మెల్యేలకు సానుకూల వాతావరణం లేకపోవడంతో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించలేదు. ► బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ, సోమాజిగూడ, ఖైరతాబాద్, హిమాయత్‌నగర్ డివిజన్లు ఉండగా ప్రతి డివిజన్లో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ► బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ డివిజన్లలో ఇప్పటిదాకా వాటి ఊసే ఎత్తడం లేదు. ► ఇప్పటి వరకు కొన్ని డివిజన్లలో జరిగిన ఆత్మీ య సమ్మేళనాలు అంతగా విజయవంతమైనట్లుగా కనిపించడం లేదు. ఎప్పటికప్పుడు ఆత్మీయ సమ్మేళనాలపై నియోజకవర్గాలు ప్రభుత్వానికి నివేదిక అందిస్తుండగా ఖైరతాబాద్‌లో ఈ సమ్మేళనం అంత ఉత్సాహంగా, సానుకూల వాతావరణంలో జరగలేదని మంత్రి కేటీఆర్‌కు నివేదికలు వెళ్లాయి. ఇంకా రెండు డివిజన్లలో నిర్వహించాల్సిన సమ్మేళనాలు అటకెక్కాయి. ► బంజారాహిల్స్‌లో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కార్పొరేటర్‌గా ఉన్నారు. ఇక్కడ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయలేదు. ► జూబ్లీహిల్స్ డివిజన్లో మూడు, నాలుగు గ్రూపులు బీఆర్ఎస్లో వేరు కుంపట్లు పెట్టాయి. ఇక్కడ ఆత్మీయ సమ్మేళనం అంటే అంత తేలిక కాదని నిర్ణయించుకున్న ఎమ్మెల్యే దాని ఊసే ఎత్తడం లేదు. ప్రతి డివిజిన్‌లోనూ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య సఖ్యత కుదరడం లేదు. ► ఇప్పటికే ఇద్దరు, ముగ్గురు రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు తమదేనంటూ ప్రచారం చేసుకుంటుండటంతో కార్యకర్తలు ఎవరిని నమ్మాలో తెలియకుండా ఉంది. ► పార్టీ శ్రేణులు అన్నింటినీ కలుపుకొని పోవాల్సిన ఎమ్మెల్యే దానం ఆ దిశలో పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ► నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో అధిషానం తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు కూడా విశ్వసనీయ సమాచారం. ఈ వర్గ విభేదాలు ఎన్నికల నాటికి సమసిపోకపోతే ఈ అవకాశాన్ని కాంగ్రెస్, బీజేపీలు సద్వినియోగం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాయని స్వయంగా బీఆర్ఎస్ కార్యకర్తలే వాపోతున్నారు. ఎమ్మెల్యే సారు బిజీగా ఉన్నారు... హిమాయత్‌నగర్: ‘ఎమ్మెల్యే దానం నాగేందర్ సార్ చాలా బిజీగా ఉన్నారు. అందుకే డివిజన్ పర్యటనకు నేను హాజరయ్యాను’ అని ఎమ్మెల్యే పీఏ చంద్రశేఖర్ అన్నారు. పీఏ చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలపై స్థానికులు అవాక్కయ్యారు. బుధవారం హిమాయత్‌నగర్ డివిజన్లోని పలు ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు యాదగిరి నేతృత్వంలో జీహెచ్ఎంసీ ఈఈ పేర్రాజుతో కలసి పీఏ చంద్రశేఖర్ పర్యటించారు. స్ట్రీట్ నెంబర్–2లో డ్రైనేజీ సమస్య ఉండటంతో ఇక్కడ పైప్‌లైన్ మంజూరైంది. ఈ పైప్‌లైన్ పనులు చేసేందుకు కాంట్రాక్టర్ ముందుకు రాకపోవడంతో పీఏకు స్థానికులు ఫిర్యాదు చేశారు. ఇదే ప్రాంతంలో కరెంట్ పోల్‌ను రీప్లేస్ చేయాలని కోరారు. భగ్గీఖానా, స్ట్రీట్ నెంబర్–4లోని పూర్తిగా ధ్వంసమైన రోడ్లను త్వరితగతిన మరమ్మతులు చేయాలని ఈఈ పేర్రాజును పీఏ చంద్రశేఖర్ కోరారు. స్థానికులు, నాయకులు తన దృష్టికి తెచ్చిన ప్రతి సమస్యనూ ఎమ్మెల్యే దానంకు వివరించి సత్వరమే పరిష్కరించేలా కృషి చేస్తానంటూ పీఏ చంద్రశేఖర్ హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే దానం రావాల్సిన పర్యటనలో ఆయన పీఏ రావడం సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. -
ఖరీదైన కారు కొన్న మాస్ మహారాజా.. ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
మాస్ మహారాజా రవితేజ హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో సందడి చేశారు. ఇటీవలే ఆయన కొత్తగా ఖరీదైన ఎలక్ట్రిక్ కారు(ఈవీ)ని కొనుగోలు చేశారు. ఈ మేరకు తన వాహనం రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లారు. దాదాపు రూ.34.5 లక్షలతో కారు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా టీఎస్09 జీబీ2628 అనే ఫ్యాన్సీ నంబర్‌ను 17,628 రూపాయలకు వేలంలో దక్కించుకున్నారు. కారు ప్రత్యేకతలు ఇవే రవితేజ తాజాగా కొనుగోలు కారులో ప్రత్యేకమైన సదుపాయాలు ఉన్నాయి. చైనాకు చెందిన ఈ కారు అత్యంత సురక్షితమైందిగా 5 స్టార్ రేటింగ్ కలిగి ఉంది. ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో 12.8 ఇంచెస్ సెంట్రల్ స్క్రీన్ ఉంటుంది. ఇది ఆపిల్ కార్ప్లే , ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. అంతే కాకుండా ఇందులో ఒక పనోరమిక్ సన్‌రూఫ్, పవర్డ్ టెయిల్‌గేట్, వైర్లెస్ ఫోన్ ఛార్జర్, సింథటిక్ లెదర్ అపోల్స్ట్రే, పవర్డ్ ఫ్రంట్ డ్రైవర్, ప్యాసింజర్ సీట్లు, 5 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మొదలైనవి ఉన్నాయి. అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో ఒకటిగా దీనికి పేరుంది. కాగా.. రవితేజ ఇటీవలే రావణాసుర సినిమాతో అభిమానులను అలరించాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌తో కలిసి రవితేజ ప్రొడక్షన్ నిర్మించిన ఈ సినిమాలో అను ఇమ్మానుయేల్, ఫరియా అబ్దుల్లా సహా ఐదుగురు హీరోయిన్స్ నటించారు. ఈ సినిమా ఏప్రిల్ 7న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రవితేజ నెగెటివ్ పర్ఫార్మెన్స్కు మంచి మార్కులు పడుతున్నప్పటికీ.. మూవీకి మాత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ వచ్చింది. -
మహిళల నైపుణ్యం అద్భుతం
ఖైరతాబాద్: చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు దేశానికి వెన్నెముకలాంటివని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. శుక్రవారం అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా (ఎలిప్) ఆధ్వర్యంలో నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటుచేసిన ‘ఎలిప్ వికార్డ్’ ఎగ్జిబిషన్‌ను గవర్నర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె స్టాళ్లలో అమ్మకానికి ఉంచిన ఉత్పత్తులను పరిశీలించి, మహిళలతో మాట్లాడారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, వారు ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొని ముందుకు సాగుతారన్నారు. మహిళలు ఎంతో నైపుణ్యంతో తయారు చేసిన ఉత్పత్తులను ఒక్కచోటకు చేర్చి ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ ఉత్పత్తులన్నీ అద్భుతంగా ఉన్నాయన్నారు. ఎంఎస్ఎంఈకి అన్నివేళలా అండగా ఉంటామని, కోవిడ్ సమయంలోనూ ఎంఎస్ఎంఈ రుణాలను చెల్లించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఎలిప్ ఉపాధ్యక్షురాలు దుర్గాభవాని, కార్యదర్శి వి.శ్రీదేవి, సహాయ కార్యదర్శి పల్లవి జోషి, కోషాధికారి మహాలక్ష్మి, ఎగ్జిబిషన్ చైర్పర్సన్ శైలజ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రదర్శన ఈ నెల 26 వరకు అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. -
మమ్మల్ని కలపండి సారూ
సాక్షి, హైదరాబాద్, ఖైరతాబాద్: తమ పిల్లలతో సహా ఉపాధ్యాయ దంపతుల ఆందోళన, దీక్ష,.. ప్రతిగా పోలీసుల అరెస్టులు.. తల్లిదండ్రులను ఎక్కడికి తీసుకువెళ్తున్నారో.. ఏం జరుగుతోందో తెలియక చిన్నారుల రోదనలు.. వెరసి శనివారం హైదరాబాద్‌లో స్పౌజ్ ఫోరం ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దంపతులు నిర్వహించిన ధర్నాలో ఉద్విగ్న వాతావరణం చోటుచేసుకుంది. 13 జిల్లాలకు చెందిన వందలాది మంది ఉపాధ్యాయ దంపతులు తమ పిల్లలతో కలిసి వచ్చి బదిలీలకు సంబంధించిన జీవో 317కి వ్యతిరేకంగా పాఠశాల డైరెక్టర్(డీఎస్సీ) కార్యాలయం ముందు మౌనదీక్ష నిర్వహించారు. ‘ఉద్యోగ దంపతుల్ని కలపండి... ముఖ్యమంత్రి మాటను నిలపండి’... ‘భార్యా భర్తలను, పిల్లలను విడదీయకండి’... ‘అమ్మ అటు ... నాన్న ఇటు.. మరి నేను ఎవరివైపు???’అంటూ ధర్నాలో ప్లకార్డులు ప్రదర్శించారు. భార్య ఒకచోట, భర్త ఒక చోట ఉద్యోగం చేసే పరిస్థితికి స్వస్తి చెప్పి, ఒకే దగ్గర కలిసి ఉండేలా స్పౌస్ బదిలీలు నిర్వహించాలని ఆందోళన వ్యక్తం చేశారు. గడిచిన సంవత్సరంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని, ప్రతి స్పౌస్ బాధితుడికి న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. 2100 మంది బాధితులు... 615 మందికే స్పౌస్ బదిలీ! దంపతుల బదిలీలను బ్లాక్ చేసిన 13 జిల్లాల్లో 2100 మంది బాధితులు ఉండగా, అందులో 615 మందికి మాత్రమే స్పౌజ్ బదిలీలు జరుగుతున్నాయని నిరసన దీక్ష సందర్భంగా ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేశారు. 30 శాతం మందికే దంపతుల బదిలీలు చేపట్టి, పూర్తిగా అవకాశం ఉన్న క్యాడర్లను పక్కకు పెట్టడంతో స్పౌజ్ బదిలీల కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలలో ఆవేదన మిగిలిందని వాపోయారు. రసాభాసగా మౌనదీక్ష ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేసే క్రమంలో పరిస్థితి రసాభాసగా మారింది. తల్లిదండ్రులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేస్తుండటంతో పిల్లలకు అక్కడ ఏం జరుగుతోందో తెలియక విలపిస్తూ ఉండిపోయారు. దీంతో తల్లులు ఒక్కసారిగా భావోద్వేగానికి గురై కంటతడి పెట్టడంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. తల్లుల, పిల్లల రోదనలతో కొద్దిసేపు ఉద్విగ్న వాతావరణం నెలకొంది. వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన 513మంది ఉపాధ్యాయులను అరెస్టు చేసి నాంపల్లి, చిక్కడపల్లి, గాంధీనగర్, ముషీరాబాద్, బేగం బజార్, నారాయణగూడ పోలీస్ స్టేషన్లకు తరలించారు. కాగా, నిరసన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని నేతలు వివేక్, కాదర్, కృష్ణ, నరేష్, మమత, త్రివేణి, సుజాత స్పష్టం చేశారు. పోలీసుల అరెస్టులను తెలంగాణ ప్రాథమిక ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు సయ్యద్ షౌకత్ ఆలీ ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. అరెస్టు చేసిన వారందరినీ వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అందరికీ ఇచ్చే అవకాశం ఉన్నా ... సంగారెడ్డి జిల్లాలో ఎస్జీటీ కేడర్ లో ముగ్గురు ఉపాధ్యాయులు మాత్రమే స్పౌజ్ బదిలీ కోసం దర ఖాస్తు చేసుకున్నారు. ఆ జిల్లాలో 362 ఎస్జీటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే సూర్యాపేటలో 252 ఎస్జీటీ పోస్టులు ఖాళీగా ఉంటే... 28 మంది ఎస్జీటీలు మాత్రమే బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఖమ్మం జిల్లాలో కూడా 40 మంది ఎస్జీటీ దంపతులు బదిలీల కోసం అర్జీ పెట్టుకోగా, 341 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం నిర్వహించనున్న ప్రమోషన్ల ప్రక్రియ ద్వారా కూడా వందల సంఖ్యలో ఖాళీలు ఏర్పడనున్నాయి. ఒకటి రెండు క్యాడర్ల మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ స్పౌజ్ అప్పీళ్ళు అన్నిటినీ క్లియర్ చేసే అవకాశం ఉందని ఉపాధ్యాయుల వాదన. సీఎం కేసీఆర్ వెంటనే తమ సమస్యకు పరిష్కారం చూపాలని వేడుకున్నారు. -
కేన్సర్‌పై అవగాహన రన్
ఖైరతాబాద్: కేన్సర్‌పై అవగాహన కల్పిస్తూ ఆదివారం నెక్లెస్ రోడ్డులో సూరజ్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో వాక్ పర్ హోప్ పేరుతో 5కే రన్ నిర్వహించారు. ఎంఎన్‌జే కేన్సర్ హాస్పిటల్ వైద్యులు, బసవతారకం కేన్సర్ హాస్పిటల్, గాంధీ, ఉస్మానియా, కిమ్స్, నిమ్స్, అపోలో హాస్పిటల్స్ వైద్యులతో పాటు వివిధ విభాగాల ఉన్నత స్థాయి ఇంజనీరింగ్, సామాజిక వాదులు కుటుంబ సమేతంగా రోజు రోజుకు పెరుగుతున్న కేన్సర్‌కి ప్రధాన కారణం అవగాహన లేకపోవడమేనన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజ్‌కుమార్ మాట్లాడుతూ మొదటి దశలో కేన్సర్‌ను గుర్తించి సరైన చికిత్స అందిస్తే మహమ్మారి నుంచి పూర్తిగా తప్పించుకోవచ్చన్నారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకే రన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రన్లో డాక్టర్లు మధుసూదన్, డాక్టర్ విశాల్, డాక్టర్ పల్లవి, డాక్టర్ అశ్విని, సత్యనారాయణ, శ్యాంనాయక్, జగన్ యాదవ్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. -
స్వయం సహాయక సంఘాల బలోపేతానికి కృషి: ఎర్రబెల్లి
ఖైరతాబాద్: స్వయం సహాయక సంఘాల మహిళలను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. పేదరిక నిర్మూలన సంస్థ ‘సెర్ప్’ ఆధ్వర్యంలో గురువారం నెక్లెస్‌రోడ్డు పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటుచేసిన సరస్ –2022 ఎగ్జిబిషన్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలోనే కాకుండా ప్రతి మండలంలో, జిల్లా కేంద్రాలలో ఇలాంటి ప్రదర్శనలు ఏర్పాటు చేసి మహిళల ఉత్పత్తులను మరింత ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ నెల 28 వరకు కొనసాగనున్న ఈ ప్రదర్శనలో 32 జిల్లాలతో పాటు దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాలకు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళలు ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు. ఇందుకుగాను ప్రభుత్వం 300 స్టాల్స్‌ను ఏర్పాటు చేసింది. కార్యక్రమంలో సెర్ప్ సీఈఓ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ సుశీల తదితరులు పాల్గొన్నారు. -
బస్స్టేషన్లలోని మరుగుదొడ్లలో ఉచితంగా శానిటరీ ప్యాడ్స్: సజ్జనార్
ఖైరతాబాద్: గౌలిగూడ మహాత్మాగాంధీ, సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ల లో ఉచితంగా మరుగుదొడ్ల సౌకర్యంతో పాటు శానిటరీ ప్యాడ్ బాక్స్‌లు కూడా ఏర్పా టు చేయనున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని బస్ స్టేషన్లలో నవంబర్‌లోగా ఈ సౌకర్యం కల్పించనున్నట్లు చెప్పారు. బాలికా విద్య, మహిళలు రుతు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ పీపుల్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ ఎడ్యుకేషన్ (ప్యూర్) స్వచ్ఛంద సంస్థ ‘ప్యూరథాన్’ నిర్వహించింది. నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్‌ప్లాజా వేదికగా ఆదివారం ఉదయం జరిగిన 2కె, 5కె రన్, వాక్‌ను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌లు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల మహిళల్లో శానిటరీ ప్యాడ్స్ గురించి మరింత అవగాహన కల్పించాలని, ఇందుకోసం ఆర్టీసీ తోడ్పాటు అందిస్తుందని తెలిపారు. కొందరు రుతుక్రమం గురించి మాట్లాడేందుకు సిగ్గుపడతారని, ఇది ప్రకృతి సహజమైనదని అన్నారు. ప్యాడ్స్ సౌకర్యం లేకపోవడం వల్ల విద్యార్థినులు పాఠశాలల నుంచి డ్రాపవుట్ అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రుతుక్రమంపై ముఖ్యంగా మగవారిలో మరింత అవగాహన రావాల్సిన అవసరం ఉందని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్, సినీ నటుడు సత్యదేవ్ అన్నారు. జ్వరం, జలుబు వస్తే ఎలా మెడికల్ షాప్‌కు వెళ్లి మందులు కొనుగోలు చేస్తారో అలాగే ప్యాడ్లను కొనుగోలు చేసేలా మహిళలు, యువతులు, బాలికల్లో ధైర్యం పెంచేందుకు ఈ పరుగును నిర్వహించినట్లు ప్యూర్ సంస్థ ఎండీ శైలా తాళ్లూరి తెలిపారు. కార్యక్రమంలో సినీ దర్శకుడు రమేష్, సినీనటి దివి, మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, గాయని గీతా మాధురి తదితరులు పాల్గొన్నారు. మహిళలు, యువతులు, బాలికలు పెద్ద ఎత్తున ఉత్సాహంగా రన్లో పాల్గొన్నారు. -
డిసెంబర్ నాటికి అంబేడ్కర్ విగ్రహ పనులు పూర్తి
ఖైరతాబాద్: నగరంలో ఎన్టీఆర్ గార్డెన్ సమీపంలో నిర్మించ తలపెట్టిన డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహ తయారీ పనులను సంక్షేమ శాఖామంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో శాసన సభ్యుల బృందం బుధవారం పరిశీలించింది. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేడ్కర్ 125వ జయంతికి ముఖ్యమంత్రి కేసీఆర్ అందించనున్న గౌరవమన్నారు. డిసెంబర్ నాటికి విగ్రహ తయారీ పనులు పూర్తవుతాయన్నారు. నూతన పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలన్న ప్రతిపాదన అభినందనీయమన్నారు. అందుకు అనుకూలంగా తెలంగాణ శాసనమండలి తీర్మానం హర్షనీయమన్నారు. పార్లమెంట్‌కు అంబేద్కర్ పేరు పెట్టే విషయంపై బీజేపీ క్లారిటీ ఇవ్వాలన్నారు. ఇదే అంశంపై బీజేపీ పాలిత రాష్ట్రాల వైఖరిని వెల్లడించాలన్నారు. రాష్ట్రానికి వచ్చిన బీజేపీ కేంద్ర మంత్రులు తమ వెంట తెచ్చుకున్న ఆహారం తిన్నారు తప్పితే దళితుల ఇంట్లో అన్నం తినలేదని ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలిపారు. రాష్ట్రంలో ఇతర పార్టీల నేతలు అంబేద్కర్ విగ్రహానికి దండలు వేయడం తప్ప దళిత వర్గాలకు చేసింది ఏమీ లేదన్నారు. కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ విప్‌లు బాల్క సుమన్, గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు డాక్టర్ టి.రాజయ్య, చిరుమర్తి లింగయ్య, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
ఒక్క రోజే 98 సెల్ఫోన్లు మిస్సింగ్
ఖైరతాబాద్: ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన ఊరేగింపులో పాల్గొనేందుకు లక్షలాదిగా భక్తులు బారీగా తరలిరావడంతో శుక్రవారం ఒక్క రోజే 98 సెల్ పోన్లు మిస్సైనట్లు సైపాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు అందాయి. భారీగా తరలివచ్చిన భక్తులతో కింద పడిన సెల్‌ఫోన్‌ను కూడా వంగి తీసుకోలేకపోవడం, భక్తులు కిక్కిరిసి ఉండటంతో 98 సెల్ఫోన్లు ఒక్క రోజే పోయినట్లు ఫిర్యాదు అందాయి. (చదవండి: రైళ్లిక రయ్!) -
ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం (ఫొటోలు)
-
ఖైరతాబాద్ మహా గణపతి దర్శనం.. మెట్రో కిటకిట
సాక్షి, హైదరాబాద్: గణపతి నవరాత్రోత్సవాల్లో ఐదవ రోజు... ఆదివారం కావడంతో నగరం ‘గణేష్ మహరాజ్ కీ జై’ నినాదాలతో మార్మోగింది. ఎక్కడ చూసినా సందడి వాతావరణం నెలకొంది. కొన్నిచోట్ల నిమజ్జనాలు.. మరికొన్నిచోట్ల ప్రత్యేక పూజలు, లడ్డూల వేలం పాటలతో కోలాహలం నెలకొంది. ముఖ్యంగా ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకునేందుకు లక్షలాది జనం తరలివచ్చారు. ఉదయం ఆరు గంటల నుంచే భారీ క్యూలైన్లు కన్పించాయి. ఖైరతాబాద్‌కు తండోపతండాలుగా తరలివస్తున్న భక్తులను కంట్రోల్ చేసేందుకు పోలీసులు నానా ఇబ్బందులు పడ్డారు. మింట్ కాంపౌండ్, ఖైరతాబాద్ చౌరస్తా, లక్డీకాపూల్, టెలిఫోన్ భవన్ రోడ్లపై ట్రాఫిక్‌జామ్‌తో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక ఈ ప్రాంతానికి వచ్చే సిటీ బస్సులు, మెట్రో రైళ్లు సైతం జనంతో కిటకిటలాడాయి. నగరం నలు మూలల నుంచి భక్తులు పోటెత్తడంతో ఆదివారం ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ కిటకిటలాడింది. ఎంట్రీ, ఎగ్జిట్ గేట్ల వద్ద భక్తులు బారులు తీరారు. ఈ మార్గంలో ఉదయం నుంచి రాత్రి వరకు మెట్రో రైళ్లు అత్యంత రద్దీగా కనిపించాయి. ఖైరతాబాద్ స్టేషన్లో ప్రయాణికుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు పోలీసులు, మెట్రో సిబ్బంది అవస్థలు పడ్డారు. ఆదివారం మూడు మెట్రో మార్గాల్లో రద్దీ నాలుగు లక్షల మార్కు దాటిందని మెట్రో అధికారులు తెలిపారు. (క్లిక్: కౌంటర్ టికెట్లకూ ఆన్లైన్ రద్దు సదుపాయం) -
పూజలు సేయ తరలివచ్చారు.. మహాగణపతి సేవలో ప్రముఖులు
ఖెరతాబాద్: ఖైరతాబాద్‌లో కొలువైన 50 అడుగుల మట్టి మహాగణపతి సేవకు ప్రముఖులు క్యూ కట్టారు. పంచముఖ మహాలక్ష్మీ గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయక చవితి సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం ఉదయం తొలిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఖైరతాబాద్‌లో కొలువుదీరిన శ్రీ పంచముఖ మహాలక్ష్మీ గణపతి అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పూజలు నిర్వహించారు. అన్ని శాఖల సమన్వయంతో గణేష్ ఉత్సవాలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహిస్తామని ఆయన చెప్పారు. హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి జవదేకర్, డీజీపీ మహేందర్‌రెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేష్, ఉత్సవ కమిటీ చైర్మన్ సింగరి సుదర్శన్ తదితరులు మహాగణపతిని దర్శించుకున్నారు. మహాగణపతిని తొలిరోజు 2 లక్షలమందికి పైగా భక్తుల దర్శించుకున్నట్లు అంచనా. పోటెత్తిన భక్తులు జంధ్యం, కండువా సమర్పణ పంచముఖ మహా లక్ష్మీ గణపతికి పద్మశాలి సంఘం తరఫున 60 అడుగుల కండువా, గరికమాల, జంధ్యం, పట్టు వస్త్రాలను సమర్పించారు. తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ జనరల్ బండా శివానంద ప్రసాద్, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్, హైదరాబాద్ జిల్లా అడిషినల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, గాంధీ హాస్పిటల్ డిప్యూటీ సూపరిండెంట్ డాక్టర్ నర్సింహారావులు ఉన్నా రు. కార్యక్రమంలో ఖైరతాబాద్ పద్మశాలి సంఘం సభ్యులు శ్రీధర్, ఏలే స్వామి, గుర్రం కొండయ్య పాల్గొన్నారు. -
Khairtabad: మహాగణపతికి తొలిపూజ నిర్వహించిన మంత్రి తలసాని
-
వినాయకచవితికి సిద్ధమైన ఖైరతాబాద్ విఘ్నేషుడు
-
నేటినుంచి భక్తులకు ఖైరతాబాద్ గణేశుడు దర్శనం
-
మహాగణపతికి కంటిపాప అమరిక
ఖైరతాబాద్: ఖైరతాబాద్ శ్రీ పంచముఖ లక్ష్మీ మహాగణపతికి ఆదివారం ఉదయం దివ్యజ్ఞాన సిద్ధాంతి విఠలశర్మ సూచించిన ముహూర్తంలో కంటిపాప (నేత్రోనిలనం)ను శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ అమర్చారు. 50 అడుగుల విగ్రహానికి కంటిపాపను అమర్చడం ద్వారా విగ్రహానికి ప్రాణం పోసినట్లు అవుతుందని శిల్పి తెలిపారు. విగ్రహ పనులన్నీ పూర్తికావడంతో సోమవారం సాయంత్రం వరకు కర్రలను పూర్తిగా తొలగిస్తామని, ఆ తర్వాత మహాగణపతి భక్తులకు సంపూర్ణ దర్శనం ఇస్తారని తెలిపారు. మహాగణపతి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు. -
Hyderabad: 9న గణేష్ నిమజ్జనం.. ఉచితంగా 6 లక్షల విగ్రహాల పంపిణీ
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 31న గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయని, వచ్చే నెల సెప్టెంబరు 9న గణేష్ నిమజ్జనం నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. గణేష్ ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై మంగళవారం జూబ్లీహిల్స్‌లోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 4 లక్షలు, పీసీబీ ఆధ్వర్యంలో లక్ష, హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో లక్ష చొప్పున మొత్తం 6 లక్షల గణేష్ విగ్రహాలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఖైరతాబాద్ గణేష్‌ను దర్శించుకునేందుకు వచ్చే భక్తులు ఇబ్బందులకు గురి కాకుండా ఆర్అండ్బీ ఆధ్వర్యంలో బారికేడ్లు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ నెల 24న అధికారులతో కలిసి ఖైరతాబాద్ గణేష్ మండపాన్ని సందర్శిస్తామన్నారు. విగ్రహాల నిమజ్జనం కోసం నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 25 పాండ్లకు అదనంగా మరో 50 పాండ్‌ను నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. విగ్రహాల ఊరేగింపు రహదారుల్లో అవసరమైన చోట్ల మరమ్మతులు, అభివృద్ధి పనులు చేపడతామన్నారు. సెప్టెంబరు 9న నిర్వహించే గణేష్ నిమజ్జనానికి సుమారు 8 వేల మంది జీహెచ్ఎంసీ సిబ్బంది మూడు షిఫ్ట్‌ల్లో విధుల్లో ఉంటారని చెప్పారు. గణేష్ నవరాత్రులను ప్రశాంతంగా నిర్వహించేలా సహకరించాలన్నారు. (క్లిక్: కోట్ల గొంతుకలు.. ఒక్క స్వరమై) సమావేశంలో హోంమంత్రి మహమూద్ అలీ, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ ప్రభాకర్‌రావు, విద్యుత్ శాఖచీఫ్ సెక్రటరీ సునీల్ శర్మ, ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవిగుప్తా, అదనపు డీజీపీ జితేందర్, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్, పీసీసీబీ మెంబర్ సెక్రటరీ నీతూ కుమారి ప్రసాద్, పోలీస్ కమిషనర్లు సీవీ ఆనంద్, మహేష్ భగవత్, స్టీఫెన్ రవీంద్ర, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, కలెక్టర్ అమయ్ కుమార్, టీఎస్ఎస్పీడీసీఎల్ అధికారి రఘోత్తంరెడ్డి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు భగవంతరావు, రాఘవరెడ్డి, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధి సుదర్శన్, సికింద్రాబాద్, గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. (క్లిక్: సందడిగా మెగా రికార్డ్స్ అవార్డుల ప్రదానోత్సవం) -
అనుమతి లేని మసాజ్ సెంటర్‌పై దాడి
హైదరాబాద్: లక్డీకాపూల్‌లోని ది సెంట్ హోటల్లో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న మసాజ్ సెంటర్‌పై సైఫాబాద్ పోలీసులు దాడి చేశారు. నిర్వాహకులతో పాటు మేనేజర్‌ను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. -
తెలంగాణ: కాంగ్రెస్‌కు దాసోజు శ్రవణ్ గుడ్‌బై?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజ్‌గోపాల్‌రెడ్డి ఎపిసోడ్ ముగియకముందే.. కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగలనుందా?. కాంగ్రెస్ పార్టీకి వీడేందుకు ముఖ్యనేత దాసోజు శ్రవణ్ నిర్ణయించుకున్నట్లు ప్రచారం ఊపందుకుంది. ప్రస్తుతం ఏఐసీసీ అధికార ప్రతినిధిగా ఉన్న దాసోజు శ్రవణ్.. గత ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి పోటీ కూడా చేసి ఓడిపోయారు. అయితే.. పీజేఆర్ కూతురు విజయారెడ్డి ఈ మధ్యే కాంగ్రెస్ గూటికి చేరారు. ఈ పరిణామంపై దాసోజు శ్రవణ్ అసంతృప్తితో రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సాయంత్రం ప్రెస్ మీట్ నిర్వహించి.. తన రాజీనామా నిర్ణయాన్ని దాసోజు శ్రవణ్ ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: మునుగోడు పోరు రసవత్తరం.. కాంగ్రెస్‌లో చేరిన చెరుకు సుధాకర్ -
తొలిసారి మట్టితో మహా గణపతి.. ప్రత్యేకతలివే..
సాక్షి, ఖైరతాబాద్: ఒక్క అడుగుతో మొదలైన ఖైరతాబాద్ మహా గణపతి ప్రస్థానం ఇంతింతై వటుడింతై అన్న చందంగా ఏడాదికో అడుగు పెరుగుతూ ప్రపంచ స్థాయి గుర్తింపు పొందాడు. ఈసారి 68వ సంవత్సం సందర్భంగా శ్రీ పంచముఖ మహా లక్ష్మీ గణపతిగా 50 అడుగుల ఎత్తుతో భక్తులకు దర్శనమివ్వనున్నాడు. విగ్రహ తయారీ పనులను ఉత్సవ కమిటీ సభ్యులు ప్రారంభించారు. ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉండాలని శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ నేతృత్వంలో రూపు దిద్దుకోనున్న మహాగణపతి నమూనాను సోమవారం సాయంత్రం స్థానిక కార్పొరేటర్ విజయారెడ్డి, వీణామాధురి, ఉత్సవ కమిటీ చైర్మన్ సింగరి సుదర్శన్‌లతో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో సందీప్‌రాజ్, రాజ్‌కుమార్, మహేష్‌యాదవ్, బిల్డర్ రమేష్‌లతో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు. ప్రత్యేకతలివే.. ► తొలిసారిగా 50 అడుగుల ఎత్తు మేర మట్టితో తయారుచేస్తున్న శ్రీ పంచముఖ మహా లక్ష్మీ గణపతి నిల్చున్న ఆకారంలో ఉంటాడు. ► పాముపై కమలం పువ్వులో నిలబడి ఉన్న మహాగణపతి పక్కనే కుడివైపు లక్ష్మీదేవి అమ్మవారు మరో పక్క మూషికం ఉంటాయి. ► అయిదు తలలపై పాము పడగ, ఆరు చేతులతో అద్బుతంగా దర్శనమిచ్చేవిధంగా డిజైన్ చేశారు. ► మహాగణపతికి కుడివైపు శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి, ఎడమవైపు శ్రీ త్రిశక్తి మహా గాయత్రీదేవి అమ్మవార్ల విగ్రహాలు దర్శనమివ్వనున్నాయి. ► గతంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారయ్యే గణపతిని.. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈసారి మట్టితోనే మహాగణపతిని తయారుచేస్తున్నారు. ► ఈ నెల 10న కర్రపూజ తర్వాత మహాగణపతి విగ్రహ తయారీపనులు ప్రారంభమయ్యాయి. ► మొదట ఐరన్ ఫ్రేమ్‌తో అవుట్‌లైన్ తయారు చేస్తారు. అనంతరం దానిపై గడ్డిని మట్టితో కలిపి నారలాగా తయారుచేసి ఐరన్ చుట్టూ ఔట్ లుక్ కోసం అంటిస్తారు. దానిపై టన్నుకు పైగా సుతిలి తాడును చుడతారు. దానిపై మట్టితో రూపు రేఖల్ని తీర్చి దిద్దుతారు. ► ఆ తర్వాత గాడా క్లాత్‌పై పల్చటి మట్టిని పూసి ఫినిషింగ్ పనులు పూర్తి చేసి.. వాటర్ పెయింట్స్ వేయడంతో మట్టి వినాయకుడు పూర్తిస్థాయిలో పూర్తవుతుంది. విగ్రహాన్ని నిమజ్జనం చేయడంలోనూ ఇబ్బందులు తలెత్తవని శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ తెలిపారు. -
భార్యను కడతేర్చి బకెట్లో పెట్టి.. ఆపై నాంపల్లికి వెళ్లి..
సాక్షి,హైదరాబాద్: ఏం జరిగిందో ఏమోగానీ నిండు నూరేళ్లు తోడుగా కలిసి ఉంటానని చెప్పిన భర్తే చివరికి ఆమె పాలిట యముడిగా మారాడు, ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రేమ్ నగర్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అస్సాం రాష్ట్రానికి చెందిన మహానంద బిశ్వాస్ (24), పంప సర్కార్ (22) జీవనోపాధి కోసం నగరానికి వచ్చి ప్రేమ్ నగర్ లో నివాసం ఉంటూ జీవీకే మాల్ లో సెక్యూరిటీ గార్డ్ గా విధులు నిర్వహిస్తున్నారు. మూడు రోజులుగా భార్య భర్తల మధ్య తగాదాలు జరుగుతుండగా నిన్న(సోమవారం) మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో భార్యను నీళ్లతో ఉన్న బకెట్లో ముంచి హత్య చేసి అనంతరం సోమవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో నాంపల్లి రైల్వే స్టేషన్లో రైలు కిందపడి మృతిచెందాడు. రైల్వే పోలీసులు గమనించి మృతదేహాన్ని పోస్టమార్టం తరలించే సమయంలో అతని వద్ద ఉన్న చిన్న డైరీలో భార్యను చంపి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు రాసుకున్నాడు. దీంతో నాంపల్లి రైల్వే పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు పంజాగుట్ట పోలీసులు ప్రేమ్ నగర్ లోని వారి నివాసం ఉంటున్న గదికి తాళం వేసి ఉండగా తాళాలు పగలగొట్టి భార్య మృతదేహానికి పోస్టమార్టం జరిపించారు. అనంతరం క్లూస్ టీంను రప్పించి పూర్తిస్థాయిలో వివరాలు సేకరించారు. చదవండి: ఉద్యోగం మానేసి మరీ ప్రియుడికి దగ్గరైన సారిక.. -
Khairatabad Ganesh 2022 New Poster: ఖైరతాబాద్ భారీ గణనాథుని రూపం ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ మహా గణపతి విగ్రహ నమూనాను ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఆవిష్కరించారు. 50 అడుగుల భారీ మట్టి విగ్రహ రూపాన్ని ఈ ఏడాది ఆవిష్కరించారు. తొలిసారి మట్టితో ఖైరతాబాద్ మహా గణపతిని తయారు చేయనున్నారు. ఈ ఏడాది ఖైరతాబాద్ భారీ గణేశుడు పంచముఖ లక్ష్మీగణపతి అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నాడు. గణనాథునికి ఎడమ వైపు త్రిశక్తి మహాగాయత్రి దేవి, కుడి వైపు సుబ్రమణ్యస్వామి ప్రతిమ ఉండనుంది. నిమజ్జనానికి తరలివెళ్లేలా మట్టి విగ్రహాన్ని తయారు చేయనున్నారు. -
ఖైరతాబాద్ ఎమ్మెల్యే కార్లపై 66 చలాన్లు.. రూ. 37, 365 చెల్లించి..
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు చెందిన అయిదు కార్లకు పెండింగ్ చలాన్లను ఆదివారం క్లియర్ చేశారు. కొంత కాలంగా ఆయనకు చెందిన టీఎస్ 09 ఎఫ్ఏ 0999తోపాటు మరో నాలుగు కార్లకు 66 చలానాలు పెండింగ్‌లో ఉన్నాయి. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ తిరుగుతున్న ఈ వాహనాలపై బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో పెండింగ్ చలాన్ల జాబితా గుట్టురట్టైది. దీంతో 66 చలానాలకుగాను రూ. 37365లను ఎమ్మెల్యే చెల్లించారు. ఈ మేరకు బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు ఒక ప్రకటన విడుదల చేస్తూ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు చెందిన అయిదు కార్లకు చెందిన చలానాలు క్లియర్ అయినట్లు తెలిపారు. చదవండి: బంజారాహిల్స్: ఖరీదైన కార్లే లక్ష్యంగా ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు -
కాంగ్రెస్ పార్టీ రాజ్ భవన్ ముట్టడిలో ఉద్రిక్తత
-
ఎస్ఐ కాలర్ పట్టుకున్నరేణుకా చౌదరి
-
పువ్వాడ అజయ్ పై రేణుక చౌదరి దారుణ వ్యాఖ్యలు
-
పుట్టిన రోజున ముస్తాబై.. సాయంత్రం బర్త్ డే పార్టీ ఇస్తానని..
సాక్షి, హైదరాబాద్: తన పుట్టిన రోజున ఎంతో సంతోషంతో ఇంట్లో ముస్తాబై సెల్ఫోన్లో ఫొటో దిగింది. ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత తండ్రికి, తమ్ముడికి సాయంత్రం బర్త్ డే పార్టీ ఇస్తానని చెప్పింది. డ్యూటీకి వెళ్తున్నానంటూ చెప్పి బయల్దేరిన కొద్ది నిమిషాలకే ఆమెను మృత్యువు కబళించింది. ఎంఎంటీఎస్ రైలు వేగం ధాటికి ఎగిరికింద పడిన ఓ మహిళ మృతి చెందిన విషాద ఘటన ఖైరతాబాద్ రైల్వేస్టేషన్ వద్ద బుధవారం ఉదయం చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. మహారాష్ట్ర షోలాపూర్‌నకు చెందిన లావణ్య తండ్రి, సోదరుడు, ఇద్దరు కూతుళ్లతో కలిసి కొన్నాళ్ల క్రితం నగరానికి వచ్చారు. తుమ్మలబస్తీలో ఉంటున్నారు. లావణ్య ఖైరతాబాద్‌లో టెలీకాలర్‌గా పని చేస్తోంది. ఈ క్రమంలో ఆమె బుధవారం తుమ్మల బస్తీ నుంచి ఎంఎంటీఎస్ రైల్వేస్టేషన్ సమీపంలోని పట్టాలు దాటి ఖైరతాబాద్‌కు వచ్చే క్రమంలో హైదరాబాద్ నుంచి లింగంపల్లి వెళ్లే ఎంఎంటీఎస్ రైలు స్పీడ్‌కు ఒక్కసారిగా ఎగిరి కిందపడి తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆమె మృతి చెందింది. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (భువనగిరిలో కిడ్నాప్.. సింగరాయకొండలో పట్టివేత) -
ఖైరతాబాద్ ఫ్లైఓవర్‌పై కారు బీభత్సం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ ఫ్లైఓవర్‌పై కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. కారులోని యువకులు సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు డ్రైవర్ అదుపులోకి తీసుకుని, కారు సీజ్ చేశారు. సీట్ బెల్ట్ పెట్టుకోవడంతో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావటంతో డ్రైవర్‌తో పాటు పక్కన కూర్చున్న యువకులు సురక్షితంగా బయటపడ్డారు. -
సౌరశక్తిపై అవగాహనకు బస్సుయాత్ర
ఖైరతాబాద్: గ్లోబల్ వార్మింగ్ చేరుకోవడానికి ఇంకా 8–10 సంవత్సరాలు మాత్రమే ఉందని, అందువల్ల వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడానికి తీవ్రమైన తక్షణ చర్యలు అవసరమని సోలార్ ఎనర్జీ బ్రాండ్ అంబాసిడర్ డాక్టర్ చేతన్ సింగ్ సోలంకి అన్నారు. ఆదివారం ఖైరతాబాద్ విశ్వేశరయ్య భవన్లో సోలార్ ఎనర్జీపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి చేపట్టిన బస్సు యాత్రను ఆదివారం ప్రారంభించారు. ఈ యాత్ర మొత్తం బస్సులోనే నిర్వహించే విధంగా రూపొందిన బస్సులో 3.2 కిలోవాట్స్ సోలార్ ప్యానల్స్, ఆరు కిలోవాట్ల బ్యాటరీ స్టోరేజీ అమర్చారు. ఇది సౌరశక్తితో పేనిచేసే మూడు కిలోవాట్ల ఇన్వర్టర్‌ని కలిగి ఉంటుంది. లైట్లు, ఏసీ, కుక్‌స్టవ్, టీవీ, ఏసీ, ల్యాప్‌టాప్ మరియు బస్సులోపల అన్ని చార్జ్ అవుతాయి. సుదీర్గ ప్రయాణంలో భాగంగా ఎనర్జీ స్వరాజ్ బస్సు యాత్రను ప్రారంభిస్తున్నట్లు చేతన్ సింగ్ సోలంకి తెలిపారు. ఎనర్జీ స్వరాజ్ బస్సు రెండు రోజుల పాటు ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్లో సందర్శకుల కోసం అందుబాటులో ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఐఈఐ చైర్మన్ బ్రహ్మారెడ్డి, డాక్టర్ వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. (చదవండి: జాలీ జర్నీ...మళ్లీ రానున్న డబుల్ డెక్కర్ బస్సులు!) -
మహిళల ఆత్మబంధువు సీఎం కేసీఆర్
ఖైరతాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆదివారం పీపుల్స్ ప్లాజాలో ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో మహిళా బంధు పేరుతో ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ మాట్లాడుతూ.. మహిళలు లేనిదే ప్రపంచమే లేదన్నారు. మహిళలకు సీఎం కేసీఆర్ ఆత్మబంధువుగా మారారని కొనియాడారు. పలు రంగాల్లో ఉత్తమ సేవలందించిన మహిళలను సత్కరించారు. ఈ సందర్బంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కార్పొరేటర్లు మన్నె కవిత, సంగీతా యాదవ్‌తో పాటు ఆశా, పారిశుద్ధ్య కార్మికులు కేసీఆర్ చిత్రపటానికి రాఖీలు కట్టారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతా శోభన్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు ఎస్.కె.హైమద్, సలావుద్దీన్, వనం శ్రీనివాస్ యాదవ్, ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
చేనేతపై జీరో జీఎస్టీ కోసం హ్యాండ్లూమ్ మార్చ్
ఖైరతాబాద్: చేనేత ఉత్పత్తులపై జీరో జీఎస్టీ చేసేవరకు కేంద్ర ప్రభుత్వంపై పోరాటం కొనసాగుతుందని ఎమ్మెల్సీ ఎల్.రమణ తెలిపారు. అఖిల భారత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పీపుల్స్ ప్లాజా వేదికగా చేనేతపై జీరో జీఎస్టీ డిమాండ్ చేస్తూ హ్యాండ్లూమ్ మార్చ్ బుధవారం నిర్వహించారు. సినీ నటి పూనంకౌర్‌తో కలిసి... ఎల్.రమణ హ్యాండ్లూమ్‌మార్చ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేతపై 5శాతం పన్నును యథావిధిగా కొనసాగిస్తామని కేంద్రం ప్రకటించడం కంటితుడుపు చర్య మాత్రమేనన్నారు. జీఎస్టీ తొలగించాలని రాష్ట్ర మంత్రి కేటీఆర్, హరీశ్‌రావులు వివిధ సందర్భాల్లో జీఎస్టీ కౌన్సిల్‌కు లేఖలు రాశారని, చేనేతపై జీరో జీఎస్టీ ఉండాలని ఉద్యమం చేస్తుంటే... కేంద్ర ప్రభుత్వం 5శాతం జీఎస్టీ విధించి, దాన్ని 12శాతానికి పెంచి అన్యాయం చేసిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత పద్మశాలి సంఘం ఉపాధ్యక్షుడు స్వామి, ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాథం, చేనేత విభాగం జాతీయ అధ్యక్షుడు ఎర్రమాద వెంకన్న, యువజన నేత గుండేటి శ్రీధర్, తెలంగాణ పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేడం రాంబాబుతో పాటు వివిధ చేనేత సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
విదేశాల్లో చదువుకు తెలంగాణ ప్రభుత్వం 20 లక్షలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి
సాక్షి, హైదరాబాద్: ఉన్నత చదువులంటే గతంలో డిగ్రీ, పీజీ మాత్రమే. ఇక విదేశీ విద్య అంటే అది అందని ద్రాక్షగా ఉండేది. కేవలం సంపన్నులకు మాత్రమే విదేశాలకు వెళ్లి చదివే స్థోమత ఉండేది. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ప్రతిభ ఉంటే చాలు సామాన్యులు కూడా విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించవచ్చు. ఆ విధంగా అవకాశాలు ఇంటి ముంగిట్లోకి వచ్చేశాయి. ఐటీ రంగం బాగా వ్యాప్తి చెందడంతో అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తదితర దేశాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. ఇది కూడా విదేశీ చదువులపై విద్యార్థులు మక్కువ చూపేందుకు కారణమైంది. చదువుల్లో అత్యుత్తమ మార్కులు సాధించి విదేశీ వర్సిటీల్లో సీటు పొందిన వారికి తెలంగాణ ప్రభుత్వం విదేశీ విద్యానిధి పథకం కింద ఆర్థిక చేయూతను అందిస్తున్నది. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతున్నదని సంబంధిత అధికారులు వెల్లడించారు. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల పరిధిలో అర్హత గల సుమారు 50 వేల మంది విద్యార్థులకు ఈ పథకం విశేషంగా దోహదపడునున్నది. చదవండి: ప్రేమ పేరుతో మోసం.. శారీరకంగా లొంగదీసుకొని.. చివరకు దరఖాస్తు కోసం ఏం చేయాలి విదేశీ విద్యకోసం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం విదేశీ విద్యానిధి వెబ్సైట్లో చూడవచ్చు. ఇతర సామాజిక వర్గాల నుంచి దరఖాస్తుల స్వీకరణకు ఇంకో అవకాశం కల్పించనున్నారు. ఇవీ అర్హతలు ► విద్యార్థులు ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారై ఉండాలి. ► వయస్సు 35 ఏళ్లలోపు ఉండాలి. ► తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.5 లక్షల లోపు ఉండాలి. ► డిగ్రీ, ఇంజనీరింగ్‌లలో 60 శాతం మార్కులు తప్పనిసరి. అర్హత సాధిస్తే రూ.20 లక్షలు మంజూరు విదేశీ విద్యానిధి పథకం కింద ప్రభుత్వం రూ.20 లక్షలు మంజూరు చేస్తుంది. వీసా వచ్చిన తర్వాత రూ.10 లక్షలు అక్కడి ఖర్చుల నిమిత్తం రూ.10 లక్షలు చెల్లిస్తుంది. విద్యార్థులు ఏదైనా జాతీయ బ్యాంకు నుంచి వడ్డీ కింద అదనంగా రూ.10 లక్షల విద్యారుణం తీసుకోవచ్చు. విమాన టిక్కెట్‌కు డబ్బులు ప్రభుత్వమే చెల్లిస్తుంది. జత చేయాల్సిన పత్రాలు ► పదో తరగతి ఇంటర్, డిగ్రీ, బీటెక్ ధ్రువీకరణ పత్రాలు ►ఆదాయ, నివాస, కుల ధవీకరణ పత్రాలు ► పాస్‌పోర్ట్, వీసా ►యూనివర్సిటీ అనుమతి పొందిన ఎఫ్–1 కాపీ ► జీఆర్ఈ, జీమాట్, టోఫెల్, ఐఎఫ్ఎల్టీఎస్ వివరాలు ►బ్యాంకు ఖాతా సమాచారం వెలువడిన ప్రకటన విద్యానిధి పథకానికి సంబంధించిన ప్రకటన వెలువడింది. ఎస్సీ, ఎస్టీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు గాను ఇప్పటికే అన్ని కళాశాలల విద్యార్థులకు ఆయా శాఖల కమిషనర్లు అవగాహన కల్పించారు. స్థానిక ప్రజాప్రతినిధులకు సైతం పథకం వివరాలను అందజేశారు. దేశాలు.. కోర్సులు అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా, సింగపూర్, జర్మని, న్యూజిలాండ్, జపాన్, ఫ్రాన్స్ తదితర దేశాల్లో ఈ పథకం కింద చదువుకునేందుకు అవకాశం కల్పించారు. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, సైన్స్, అగ్రికల్చర్ సైన్స్, మెడిసిన్, నర్సింగ్, సోషల్ సైన్సెస్, పీజీ, పీహెచ్డీ కోర్సుల్లో చేరేందుకు ఈ పథకం వర్తిస్తుంది. ఎంపిక ఇలా.. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి కమిటీ ఎంపిక చేస్తుంది. కమిటీ చైర్మన్‌గా ఎస్సీ, ఎస్టీ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారు. ఉన్నత విద్యాశాఖ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, జేఎన్టీయూ వైస్ చాన్స్‌లర్, ఎస్సీ కమిషనర్, టెక్నికల్ ఎడ్యుకేషనల్ కమిషనర్, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్, విదేశీ విద్యలో ఒక అనుభవజ్ఞుడు ఉంటారు. -
వారికి వెంటనే ఉద్యోగాలివ్వాలి: ఆర్ కృష్ణయ్య
ఖైరతాబాద్(హైదరాబాద్): కస్తూర్బా గాంధీ పాఠశాల ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన పాఠశాల విద్యాశాఖ కార్యాలయ ముట్టడిలో పాల్గొని ఆయన మాట్లాడారు. 2018లో పరీక్షలు రాసిన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను 2020లో కరోనా కారణంగా అర్ధంతరంగా వాయిదా వేశారని తెలిపారు. కొన్ని జిల్లాల్లోనే అభ్యర్థులకు పోస్టింగ్ ఇచ్చారన్నారు. పెండింగ్‌లో ఉన్న అభ్యర్థులకు పోస్టింగ్ ఇవ్వకుండా మళ్లీ ఇప్పుడు కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రతిపాదనలు చేస్తున్నారని విమర్శించారు. ఇది సరైంది కాదని, గతంలో ఎంపికైన వారికే ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. విద్యారంగంపై ముఖ్యమంత్రి దృష్టిసారించి ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయాలని కోరారు. -
స్కూటీతో పాటు మహిళను ఈడ్చుకెళ్లిన దున్నపోతు
-
సదర్ ఉత్సవాలు: స్కూటితో పాటు మహిళను ఈడ్చుకెళ్లిన దున్నపోతు
సాక్షి, హైదరాబాద్: సదర్ ఉత్సవాలకు సిద్ధమవుతున్న భాగ్యనగరంలో విషాదం చోటు చేసుకుంది. దున్నపోతు హల్చల్ చేసింది. రోడ్డుమీదకు వచ్చిన దున్నపోతు కనిపించిన వారిని కనిపించినట్లు కుమ్మేయసాగింది. ఆ వివరాలు.. (చదవండి: గాంధీభవన్‌లో ‘సదర్’ వేడుకలు) ఖైరతాబాద్ చింతల్‌బస్తీలో ఈ సంఘటన చోటు చేసుకుంది. రోడ్డు మీదకు వచ్చిన దున్నపోతు బీభత్సం సృష్టించింది. దానికి ఎదురుగా కనిపించిన వారి మీదకు పరిగెత్తింది. దున్నపోతును కట్టడి చేయడానికి ప్రయత్నించినప్పటికి వీలు కాలేదు. ఈ క్రమంలో దున్నపోతు స్కూటీతో పాటు మహిళను ఈడ్చుకెళ్లింది. దున్నపోతు దాడిలో మరో ఇద్దరికి గాయాలయ్యాయి. చివరకు కొందరు యువకులు ఖైరతాబాద్ చౌరస్తాలో దున్నపోతును పట్టుకున్నారు. చదవండి: ఊపిరి.. ఉక్కిరిబిక్కిరి.. -
దంపతుల కాళ్లు, చేతులు కట్టేసి.. రూ.85 లక్షలతో పరార్
ఖైరతాబాద్: నమ్మకంగా వాచ్‌మన్‌గా చేరిన దంపతులు అర్ధరాత్రి వృద్ధ దంపతులను బంధించి రూ.85 లక్షలు విలువచేసే నగదు, నగలు, డైమండ్ ఆభరణాలతో పరారయ్యారు. ఈ ఘటన సైఫాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వస్త్ర వ్యాపారం చేసే ఓం ప్రకాష్ ఆగర్వాల్, అతని భార్య సంతోష్ ఆగర్వాల్ చింతలబస్తీ, హిల్ కాలనీలో శ్రీవీన్ హౌస్‌లో నివాసముంటున్నారు. ఇదే అపార్ట్మెంట్లో వీరి కోడలు, మనవడు స్వప్న, యజ్ఞ ఉంటుండగా, కొడుకు విదేశాల్లో ఉంటున్నారు. 15 రోజుల క్రితం నేపాల్‌కు చెందిన దంపతులు దీపేష్(23), అనిత శశి అలియాస్ నిఖిత(21).. వీరి అపార్ట్‌మెంట్‌కు వాచ్‌మన్‌గా చేరారు. అప్పటి నుంచి వీరి కదలికలను పక్కగా గమనించిన వాచ్‌మన్ దంపతులు శుక్రవారం అర్ధరాత్రి తరువాత పథకం ప్రకారం 4వ అంతస్తులో పడుకున్న వృద్ధ దంపతులు ప్రకాష్, సంతోష్ ఆగర్వాల్ వద్దకు వెళ్లారు. వారిని నిద్రలేపి లోపలికెళ్లి కాళ్లు, చేతులు కట్టేసి ఇనుప రాడ్‌తో దాడిచేశారు. బీరువా తాళాలు తీసుకొని నగదు, బంగారు, డైమండ్ ఆభరణాలు తీసుకుని పారిపోయారు. ఆ తర్వాత కట్లను విడిపించుకున్న సంతోష్ అగర్వాల్ ఐదో అంతస్తులో నిద్రిస్తున్న యజ్ఞను లేపి విషయం చెప్పింది. దీంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రూ.40 లక్షలు విలువచేసే డైమండ్ జ్యువెలరీ, 40 లక్షల విలువైన బంగారు, సిల్వర్ ఆభరణాలతోపాటు 5 లక్షల నగదు దోచుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. సైఫాబాద్ డీఐ రాజునాయక్ సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి.. బయటి వ్యక్తులు మరో నలుగురు ఈ చోరీలో పాల్గొన్నట్లు గుర్తించారు. -
ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం ఫొటోలు
-
Ganesh: జజ్జనకరి జనారే.. నిమజ్జన హుషారే
సాగరం సన్నద్ధమైంది. గణనాథుడికి ఘనమైన స్వాగతం చెప్పేందుకు అలలు ఉవ్విళ్లూరుతున్నాయి. మరి కొద్ది సేపట్లో ప్రారంభం కానున్న మహా ‘గణ’ ప్రభంజనానికి సకల ఏర్పాట్లు పూర్తయ్యాయి. నగరంలో వందేళ్ల క్రితమే మొదలైన వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు అంచెలంచెలుగా మహానగరమంతా విస్తరించుకున్నాయి. గతేడాది కోవిడ్ కారణంగా దేవదేవుడికి సాదాసీదాగా పూజలు చేసిన భక్తజనం ఈసారి ఘనంగా వేడుకలు నిర్వహించింది. నగరమంతటా వేలాది విగ్రహాలను ప్రతిష్టించారు. ఇష్టదైవాన్ని ఆనందోత్సాహాలతో కొలిచి మొక్కారు. ‘కరోనా వంటి మహమ్మారులు మరోసారి ప్రబలకుండా మమ్మల్ని కాపాడవయ్యా బొజ్జ గణపయ్యా’ అంటూ భక్తులు వేడుకున్నారు. మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానున్న లంబోదరుడి నిమజ్జన శోభాయాత్రతో భక్తజన సాగరం కనువిందు చేయనుంది. మహాగణపతి క్రేన్ నంబర్–4 ► ఖైరతాబాద్ శ్రీ పంచముఖ రుద్ర మహా గణపతి నిమజ్జనం క్రేన్ నంబర్–4 వద్ద జరిగేలా ఏర్పాట్లు చేశారు. ► 2.5 కి.మీ. మేర సాగే ఖైరతాబాద్ వినాయక నిమజ్జన ప్రక్రియ మొత్తం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటలోగా పూర్తి చేయాలని పోలీసులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ► బెంగళూరు నుంచి ప్రత్యేక భారీ వాహనాన్ని తీసుకొచ్చారు. ► ఉదయం 7 గంటలకు ఖైరతాబాద్ మండపం నుంచి శోభాయాత్ర ప్రారంభమవుతుంది. ► 11 గంటల మధ్య ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నెం.4 వద్దకు చేరుకోగానే 12 గంటల నుంచి 1 గంట మధ్య నిమజ్జనం పూర్తి చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. రూట్ మ్యాప్ ఇలా... మహాగణపతి మండపం నుంచి శోభాయాత్ర ప్రారంభమై సెన్షేషన్ థియేటర్, రాజ్ దూత్ చౌరస్తా మీదుగా టెలిఫోన్ భవన్, ఎక్బాల్ మినార్, తెలుగుతల్లి చౌరస్తా నుంచి ఎన్టీఆర్ మార్గ్ గుండా క్రేన్ నెం.4 వద్దకు చేరుకుంటుంది. బాలాపూర్ గణేష్ ఎటు వైపు నుంచి? బాలాపూర్ నుంచి హుస్సేన్‌సాగర్ వరకు 17 కి.మీ. గణేష్ శోభాయాత్రకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ మార్గంలోని ఫలక్‌నుమా బ్రిడ్జి నిర్మాణంలో ఉంది. శనివారం రాత్రి వరకు కొంత పూర్తయ్యే అవకాశం ఉందని..రాత్రి సమయంలో ట్రయల్ రన్ వేసి..సజావుగా సాగితే బాలాపూర్ గణేష్‌తో పాటు 15 అడుగులకు మించిన మూడు నాలుగు విగ్రహాలను కూడా ఇదే బ్రిడ్జి మీదుగా అనుమతిస్తామని సీపీ తెలిపారు. ట్రయల్ రన్లో విఫలమైతే కందికల్ గేట్ నుంచి లాల్‌దర్వాజా మీదుగా సాగర్ వైపు మళ్లిస్తామని చెప్పారు. ► కేశవగిరి నుంచి ప్రారంభమయ్యే ఊరేగింపు విగ్రహాలు పాత చాంద్రాయణగుట్ట పీఎస్– చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్– నల్లవాగు–కందికల్‌గేట్ ఫ్లైఓవర్– ఓపీ ఛత్రినాక– లాల్దర్వాజాగుడి–నాగుల్చింత–చార్మినార్–మదీనా–అఫ్జల్‌గంజ్– ఎస్బజార్–ఎంజేమార్కెట్– అబిడ్స్–బషీర్‌బాగ్–లిబర్టీ–అంబేద్కర్ విగ్రహం నుంచి ఎన్టీఆర్ మార్గ్, (నెక్లెస్ రోడ్) లేదా ఎగువ ట్యాంక్‌బండ్ వెళ్తాయి. ► సికింద్రాబాద్ మీదుగా వచ్చే ఊరేగింపు విగ్రహాలు ఆర్పీ రోడ్ నుంచి ఎంజీ రోడ్–కర్బాలా మైదాన్– కవాడిగూడ– ముషీరాబాద్ క్రాస్ రోడ్– ఆర్టీసీ క్రాస్‌రోడ్– నారాయణగూడ క్రాస్ రోడ్– హిమాయత్‌నగర్ వై జంక్షన్ నుంచి లిబర్టీలో ప్రధాన మార్గంలో కలవాలి. ► చిలకలగూడ క్రాస్‌రోడ్ నుంచి వచ్చే వాహనాలు గాంధీ ఆసుపత్రి మీదుగా ముషీరాబాద్ క్రాస్ రోడ్లో కలవాలి. ► ఉప్పల్ నుంచి వాహనాలు రామంతాపూర్– 6 నంబర్ జంక్షన్ అంబర్‌పేట– శివంరోడ్– ఎన్సీసీ– దుర్గాభాయి దేశ్‌ముఖ్ ఆసుపత్రి– హింది మహావిద్యాలయ్ క్రాస్‌రోడ్– ఫీవర్ ఆసుపత్రి– బర్కత్‌పుర క్రాస్ రోడ్– నారాయణగూడ క్రాస్‌రోడ్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి వచ్చే మార్గంలో కలవాలి. ► దిల్సుఖ్నగర్ నుంచి వచ్చే వాహనాలు ఐఎస్ సదన్– సైదాబాద్– చంచల్‌గూడ నుంచి ముసారాంబాగ్ మీదుగా అంబర్‌పేట మార్గంలో కలవాలి. ► తార్నాక నుంచి వచ్చే విగ్రహాలు ఓయూ దూరవిద్యా కేంద్ర రోడ్ నుంచి అడిక్‌మెట్ నుంచి విద్యానగర్ మీదుగా ఫీవర్ ఆసుపత్రి మార్గంలో కలవాలి. ► టోలిచౌకి, రేతిబౌలి, మెహదీపట్నం నుంచి వచ్చే వాహనాలు మాసబ్‌ట్యాంక్ మీదుగా అయోధ్య జంక్షన్– నిరంకారీ భవన్– పాత సైఫాబాద్ పీఎస్– ఇక్బాల్ మినార్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపు మళ్లాలి. ► ఎర్రగడ్డ నుంచి వచ్చే వాహనాలు ఎస్ఆర్నగర్– అమీర్‌పేట–పంజగుట్ట–వీవీ విగ్రహం నుంచి మెహదీపట్నం మీదుగా నిరంకారీ భవన్ వైపు మళ్లాలి. ► టపాచబుత్ర, ఆసిఫ్‌నగర్ మీదుగా వచ్చే వాహనాలు సీతారాంబాగ్– బోయిగూడ కమాన్– వౌల్గా హోటల్– గోషామహల్ బారాదరి– అలాస్కా మీదుగా ఎంజే మార్కెట్ ప్రధాన మార్గంలో కలవాలి. ఇక్కడ్నుంచి అబిడ్స్ మీదుగా బషీరాబాగ్–లిబర్టీ– అంబేద్కర్ విగ్రహం– ఎన్టీఆర్ మార్గ్– పీవీఎన్ఆర్ మార్గ్ మీదుగా ఎగువ ట్యాంక్‌బండ్‌కు చేరుకోవాలి ► సుమారు 27 వేల మంది పోలీసు సిబ్బందితో బందోబస్త్‌ను ఏర్పాటు చేశారు. హోంగార్డ్లు, స్పెషల్ ఆఫీసర్స్, ఫారెస్ట్, ఎక్సైజ్, ఎస్పీఎఫ్, క్విక్ రెస్పాన్స్ టీమ్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, గ్రేహౌండ్స్, ఆక్టోపస్ పోలీసులు ఉన్నారు. ► సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలు, జంక్షన్లలో వజ్ర వాహనాలను, గ్యాస్ ఎస్కార్ట్, వాటర్ వెహికిల్స్, అగ్నిమాపక వాహనాలను సిద్ధం చేశారు. 19 సైబర్ ట్యాచ్ టీమ్, బాంబ్ డిస్పోజ్ టీమ్‌ను ఏర్పాటు చేశారు. 24 స్నిపర్ డాగ్స్ కూడా బందోబస్త్‌లో పాల్గొంటున్నాయి. ► రైల్వే స్టేషన్లు, బస్స్టాండ్లు, సాపింగ్ మాల్స్, సినిమా హాల్స్, హోటల్స్, రెస్టారెంట్స్‌పై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. వేగవంతమైన కమ్యూనికేషన్ కోసం ఇప్పటికే పోలీసులు వద్ద ఉన్న 2,700 వైర్లెస్ సెట్స్‌తో పాటు అదనంగా 475 సెట్లను అందించారు. ► హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఇరిగేషన్, మెట్రో, ట్రాన్స్పోర్ట్ విభాగాలలతో కూడిన జాయింట్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. 24 గంటల పాటు అన్ని శాఖల అధికారులు పర్యవేక్షిస్తుంటారు. ► సుప్రీంకోర్టుకు చేసిన విజ్ఞప్తి కనుగుణంగా చెరువులు, కొలనులు కలుషితంకాకుండా విగ్రహాలు వేసిన వెంటనే తొలగించేందుకు ఏర్పాట్లు. ► హుస్సేన్‌సాగర్ ప్రాంతంలో కోవిడ్ నిరోధక ఉచిత వ్యాక్సినేషన్ శిబిరం. సోమవారం ఉదయం లోపే పూర్తి.. గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. అవసరమైన మేర పోలీసు బలగాలు విధుల్లో ఉంటాయి. మూడు కమిషనరేట్లతో పాటు చుట్టు పక్కల జిల్లాల నుంచి కూడా హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనానికి విగ్రహాలు తరలివస్తాయి. సుమా రు 50 వేల విగ్రహాలు నిమజ్జనం అవుతాయని అంచనా వేస్తున్నాం. సోమ వారం ఉదయం 5:30 వరకు నిమజ్జనం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. – అంజనీ కుమార్, హైదరాబాద్ సీపీ కోవిడ్ నిబంధనలు పాటించాలి వినాయక నిమజ్జనం చూసేందుకు తరలివచ్చే భక్తులు, నిర్వాహకులు అందరూ కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలి. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి. నిమజ్జనానికి వచ్చే మార్గాలలో ఎలాంటి వాహనాలు, నిర్మాణ సామగ్రి వంటివి నిలిపి ట్రాఫిక్ జామ్‌లకు గురిచేయకూడదు. ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరిగేలా ప్రజలు సహకరించాలి. – మహేశ్ ఎం. భగవత్, సీపీ, రాచకొండ వదంతుల్ని ఫార్వర్డ్ చేయొద్దు భక్తులు తమ పిల్లల్ని, వెంట తెచ్చుకునే వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి. ఎలాంటి వదంతుల్ని నమ్మొద్దు. వాట్సాప్ గ్రూప్‌లకు అనవసర మెసేజ్‌లను ఫార్వర్డ్ చేయొద్దు. ఎవరైనా అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే డయల్ 100కు గానీ 94906 17444 వాట్సాప్‌లో గానీ ఫిర్యాదు చేయాలి. మహిళలపై ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే 94936 22395 నంబరులో ఫిర్యాదు చేయాలి. – స్టీఫెన్ రవీంద్ర, సీపీ, సైబరాబాద్ -
మహాగణపతికి 60 అడుగుల కండువా
సాక్షి, ఖైరతాబాద్(హైదరాబాద్): ఖైరతాబాద్ మహాగణపతికి ఈసారి కూడా 60 అడుగుల కండువా, జంధ్యం, పట్టు వస్త్రాలను అందజేయనున్నట్లు ఖైరతాబాద్ పద్మశాలి సంఘం అధ్యక్షులు శ్రీధర్, గౌరవ అధ్యక్షులు కొండయ్య, ప్రధాన కార్యదర్శి ఏలె స్వామిలు తెలిపారు. బుధవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. 40 రోజుల పాటు నైపుణ్యం కలిగిన కళాకారుల చేత వీటిని తయారుచేయించినట్లు తెలిపారు. వినాయకచవితి రోజు ఉదయం 7 గంటలకు రాజ్‌దూత్ చౌరస్తా నుంచి కళాకారుల బృందంతో ఊరేగింపుగా వచ్చి స్వామివారికి సమర్పించనున్నట్లు వారు తెలిపారు. ఇదీ చదవండి: మా మట్టి గణపయ్య సాక్షి, హైదరాబాద్:వినాయక చవితి సమీపిస్తుండడంతో నగరంలో విగ్రహాల విక్రయాలు ముమ్మరంగా సాగుతున్నాయి. పాతబస్తీలోని ధూల్‌పేటతోపాటు కూకట్పల్లి, మూసాపేట, ఉప్పల్, ఎల్బీనగర్, హయత్‌నగర్, పెద్ద అంబర్‌పేట ప్రాంతాల్లో రోడ్లకు ఇరువైపులా పెద్ద సంఖ్యలో విగ్రహాలు లభిస్తున్నాయి. ఈసారి మట్టివిగ్రహాలు కూడా పెద్ద సంఖ్యలో తయారు చేశారు. కొత్తపేట చౌరస్తాలో ఇలా రోడ్డు పక్కన మట్టివిగ్రహాలు ఉంచి విక్రయిస్తున్నారు. చదవండి: Hyderabad: ‘కార్లలో తిరిగితే బాగానే కనిపిస్తుంది.. మోటార్ సైకిళ్లపై తిరగండి’ -
నేడు ఖైరతాబాద్ మహా గణపతికి నేత్రోత్సవం
-
నేడు ఖైరతాబాద్ మహా గణపతికి నేత్రోత్సవం
శ్రీ పంచముఖ రుద్ర మహాగణపతిగా రూపుదిద్దుకున్న ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ తయారీ పనులు చకచకా నడుస్తున్నాయి. ఈ నెల 10న వినాయక చవితికి నాలుగైదు రోజుల ముందే పనులు పూర్తయ్యేలా ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. గత సంవత్సరం కరోనా వైరస్ కారణంగా 11 అడుగులకే పరిమితమైన మహాగణపతి విగ్రహ ఎత్తును ఈసారి 40 అడుగులకు పెంచారు. దివ్యజ్ఞాన సిద్ధాంతి విఠల శర్మ సూచన మేరకు కరోనా వైరస్ వ్యాప్తి నుంచి ప్రజలను కాపాడేందుకు శివుడి రుద్ర అవతారమైన పంచముఖ రుద్ర మహాగణపతిగా నామకరణం చేశారు. (చదవండి: పాము, విభూతి, భస్మంతో బురిడీ, రూ.62 లక్షలు గోవిందా!) మహాగణపతి కుడివైపు కృష్ణకాళి అమ్మవారు, ఎడమవైపు కాల నాగేశ్వరి అమ్మవార్ల విగ్రహాలను ఏర్పాటుచేశారు. కాగా మహా గణపతికి శనివారం ఉదయం 11.30 గంటలకు నేత్రోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు శిల్పి రాజేంద్రన్ తెలిపారు. మహాగణపతికి కంటి పాపను పెట్టడం ద్వారా మహాగణపతికి ప్రాణం పోసినట్లు అవుతుందని శిల్పి తెలిపారు. –సాక్షి, ఖైరతాబాద్ -
వామ్మో ఖైరతా‘బాధ’.. నేనక్కడ పనిచేయను నాయనో!
సాక్షి, బంజారాహిల్స్ (హైదరాబాద్): ఖైరతాబాద్.. హైదరాబాద్ నగరంలో వీవీఐపీలు నివాసముండే ప్రాంతం..అటువంటి ప్రాంతంలో తహసీల్దార్‌గా పనిచేయాలంటే కత్తిమీద సాములాంటిదే.. అందరికీ అనుకూలంగా ఉండాలి..అందరికీ అందుబాటులో ఉండాలి..అందరికీ పనులు చేసిపెట్టాలి.. అయితే నిబంధనలు అనేవి ఉంటాయి కదా.. అధికారులు వాటినే ఫాలో అవుతారు.. అవి నాయకులకు పట్టవు కదా..ఇవి కొందరికి నచ్చకపోవచ్చు..దీంతో తహసీల్దార్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం.. ఆ తరువాత బదిలీ అస్త్రం వారిపై ప్రయోగించడం జరిగిపోవడం మామూలే.. ఇదీ ఖైరతాబాద్ మండలంలో నిత్యం జరుగుతున్న తంతు. ► ఖైరతాబాద్ మండలంలో తహసీల్దార్లు పట్టుమని పది నెలలు కూడా పని చేయకుండానే బదిలీ అవుతున్నారు. వివిధ కారణాలతో బదిలీ అవుతుండటంతో మండల పరిధిలో పాలన అధ్వానంగా మారుతోంది. ► బదిలీల వెనుక కొందరి ఫిర్యాదులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మండల పరిధిలో సోమాజిగూడ, ఖైరతాబాద్, బోరబండ, ఎర్రగడ్డ, వెంగళరావునగర్, రహ్మత్‌నగర్, యూసుఫ్‌గూడ డివిజన్లు వస్తాయి. అ మండలాన్ని ఎల్లారెడ్డిగూడ, ఖైరతాబాద్ యూసూఫ్‌గూడ విలేజ్ల పేరుతో విభజించి పాలన అందిస్తున్నారు. ► 2011 నుంచి రికార్డులు తీసుకుంటే ఒకే సంవత్సరంలో ముగ్గురు తహసీల్దార్లకు స్థాన చలనం కలిగింది.కొందరైతే నెల రోజులకే బదిలీ అయ్యారు. ► ఇటీవల బదిలీ అయిన జుబేద అనే తహసిల్దార్ ఆ పదవిలో పట్టుమని ఏడు నెలలు కూడా ఉండలేకపోయారు. అంతకుముందు పని చేసిన తహసిల్దార్ హసీనా ఏడాది గడువు పూర్తి చేసుకోకుండానే ట్రాన్స్ఫర్ అయ్యారు. ► దీంతో రెండు, మూడు నెలలకు, అయిదారు నెలలకు ఒకసారి తహసిల్దార్లు బదిలీలు ఎందుకు అవుతున్నారో ఇటీవల జిల్లా కలెక్టర్ ఆరా తీసినట్లు కూడా తెలిసింది. పని ఒత్తిడి కూడా కారణమా..! ఖైరతాబాద్ మండల పరిధిలో ప్రముఖుల ఘాట్లు ఉన్నాయి. నెక్లెస్ రోడ్డుతో పాటు ఎన్టీఆర్ మార్గ్, ఇతరత్రా వీవీఐపీ ప్రాంతాలు కూడా అధికంగా ఉన్నాయి. వివిధ కార్యక్రమాల సందర్భంగా తహసీల్దార్లు నాలుగైదు రోజుల పాటు అక్కడే విధులు నిర్వహించాల్సి ఉంటుంది. దీంతో చాలా మంది ఇక్కడ ఉండేందుకు మొగ్గు చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటు పౌరుల సమస్యలతో పాటు అటు వీవీఐపీల కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు తెలుస్తోంది. ► ఇటీవల ఓ తహసిల్దార్‌ను జిల్లా కలెక్టర్ ఆమె చేసిన నిర్వాకాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డట్లుగా తెలిసింది. ప్రజలకు సంతృప్తికరమైన సేవలు అందించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇవీ బదిలీలు.. ► 2011 జనవరి 3న పి.లీల ఖైరతాబాద్ మండల తహసీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించి అదే ఏడాది మే 28న బదిలీ అయ్యారు. ఆమె ఆ పదవిలో నాలుగు నెలలు కూడా ఉండలేదు. ► జె. శ్రీనివాస్ 2011 మే 29న బాధ్యతలు స్వీకరించగా రెండు నెలలు గడవకుండానే అదే ఏడాది జూలై 6వ తేదీన బదిలీ అయ్యారు. ► ఎం. కృష్ణ జూలై 7న బాధ్యతలు స్వీకరించి 2012 జూలై 24న బదిలీ అయ్యారు. ► జె.శ్రీనివాస్ జూలై 25న బాధ్యతలు స్వీకరించి కేవలం ఒక్క రోజులోనే అంటే జూలై 26న బదిలీ అయ్యారు. ► వి. అనురాధ జూలై 27న బాధ్యతలు స్వీకరించగా 2013 జూన్ 6న బదిలీ అయ్యారు. ► సునీత 2013 జూన్ 7న బాధ్యతలు స్వీకరించి 20 రోజులు తిరగకముందే అదే ఏడాది 25వ తేదీన బదిలీ అయ్యారు. ►కె. వేణుగోపాల్‌రెడ్డి 2013 జూన్ 26న బాధ్యతలు స్వీకరించి నెలన్నర తిరక్కుండానే ఆగస్టు 31న బదిలీ అయ్యారు. ► వంశీకృష్ణ 2013 సెప్టెంబర్ 1వ తేదీన బాధ్యతలు స్వీకరించి అయిదు నెలలు తిరగకుండానే 2014 ఫిబ్రవరి 11వ తేదీన బదిలీ అయ్యారు. ► ఎం. శ్రీనివాసరావు 2014 ఫిబ్రవరి 10వ తేదీన బాధ్యతలు స్వీకరించగా నాలుగు నెలలు తిరగకుండానే అదే ఏడాది జూన్ 3వ తేదీన బదిలీ అయ్యారు. ► ఎన్.శ్రీనివాస్‌రెడ్డి 2014 జూన్ 4వ తేదీన బాధ్యతలు స్వీకరించగా 2015 సెప్టెంబర్ 10న బదిలీ అయ్యారు. ఈయన ఒక్కరే ఏడాది కాలం పూర్తి చేసుకున్న తహసిల్దార్. ► టి.సైదులు 2015 సెప్టెంబర్ 11వ తేదీన బాధ్యతలు స్వీకరించి రెండున్నరేళ్ళ పాటు సేవలు అందించి 2018 ఆగస్టు 17వ తేదీన బదిలీ అయ్యారు. ► కె. జానకి 2018 ఆగస్టు 18న బాధ్యతలు స్వీకరించి నెలన్నర తిరగకుండానే 2018 అక్టోబర్ 16న బదిలీ అయ్యారు. ► పి. కృష్ణకుమారి 2018 అక్టోబర్ 17వ తేదీన బాధ్యతలు స్వీకరించి ఏడాది తిరగకుండానే 2019 జూన్ 16న బదిలీ అయ్యారు. ► హసీన 2019 జూన్ 19న బాధ్యతలు స్వీకరించి ఏడాది తిరగకుముందే 2020 నవంబర్ 3న బదిలీ అయ్యారు. ► జుబేదా 2020 నవంబర్ 4న బాధ్యతలు స్వీకరించి 2021 ఆగస్టు 1వ తేదీన బదిలీ అయ్యారు. ఆమె తొమ్మిది నెలలు మాత్రమే విధుల్లో ఉన్నారు. ► ప్రస్తుత అన్వర్ ఖైరతాబాద్ మండల తహసిల్దార్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈయన ఆగస్టు 2న బాధ్యతలు స్వీకరించారు. -
ఖైరతాబాద్ గణేష్ చిత్రపట ఆవిష్కరణ కార్యక్రమంలో ఉద్రిక్తత
-
చివరి శ్వాస ఉన్నంత వరకూ టీఆర్ఎస్తోనే: దానం
సాక్షి, హైదరాబాద్: ‘చివరి శ్వాస ఉన్నంత వరకు టీఆర్ఎస్తోనే ఉంటా. విధేయతతో కేసీఆర్, కేటీఆర్ నాయకత్వం కిందే పనిచేస్తా. నా ఇంటికి ఎవరు వచ్చినా టీఆర్ఎస్ కండువా కప్పుకుని రావాల్సిందే’ అని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఆయన పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తూ శుక్రవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్లో చిచ్చు పెట్టేవారికి పుట్టగతులు ఉండవని మండిపడ్డారు. తాను పార్టీ మారుతున్నట్లు ప్రచారం చేస్తున్న వారిపై ఇప్పటికే సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేశానని వెల్లడించారు. డబ్బులు పెట్టి పీసీసీ పదవి తెచ్చుకున్న వారు ఎలా పనిచేస్తారో అందరికీ తెలుసన్నారు. రేవంత్ నాయకత్వంలో ఎలా పనిచేస్తారో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆలోచించుకోవాలన్నారు. కాంగ్రెస్‌లో తనకు చాలా అవమానాలు జరిగాయన్నారు. కాంగ్రెస్‌లో కంటే టీఆర్ఎస్లో నాకు పదింతలు గౌరవం దొరుకుతోందన్నారు. ఉమ్మడి ఏపీలో అభివృద్ధి జరగనందునే ఆత్మ పరిశీలనతో టీఆర్ఎస్ చేరి ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నామన్నారు. బంగారు తెలంగాణ సాధనలో భాగస్వాములయ్యేందుకు కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్లో చేరాలన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు తెలంగాణలో భవిష్యత్తు లేదన్నారు. తాను సీఎం కేసీఆర్‌ను మంత్రి పదవి అడగలేదని ఇకముందు కూడా అడగని స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టులపై నిర్మాణాత్మకంగా వ్యవహరించాల్సిన ప్రతిపక్షాలు అదే పనిగా విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. -
ఖైరతాబాద్: తిమింగలం వాంతి పేరుతో మోసం..
సాక్షి, హైదరాబాద్: సుగంధ ద్రవ్యాల్లో వాడే అంబర్గ్రిస్(తిమింగళం వాంతి) పేరుతో మోసాలకు పాల్పడున్న ముఠాను ఖైరతాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అంబర్గ్రిస్ పేరుతో నకిలీ పదార్థం అమ్మేందుకు యత్నించిన ఏడుగురు సభ్యుల గల ముఠాను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఎలక్ట్రానిక్స్‌లో అతికించేందుకు వాడే గమ్ లాంటి పదర్థాన్ని అంబర్‌గ్రిస్‌గా చూపుతూ ఈ గ్యాంగ్ మోసాలకు తెగబడుతుంది. ఖైరతాబాద్‌లోని ఎస్బీఐ వీధిలో ఓ గదిని కార్యాలయంగా మార్చుకుని వీరు మోసాలకు పాల్పడుతున్నారు. మొత్తం ఏడుగురు నిందితులను సైఫాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షకీర్ అలీ, షేక్ అలీ, మహమ్మద్ ఆరిఫ్ మహమ్మద్ నజీర్, మోహన్‌లాల్ యాదవ్, మహమ్మద్ అజారుద్దీన్, మహమ్మద్ హుస్సానుద్దీన్లు గ్యాంగ్‌గా ఏర్పడి.. ఈ తరహా మోసాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వారి నుంచి నకిలీ సామగ్రిని స్వాధీనం చేసుకుని.. దర్యాప్తు జరుపుతున్నారు. చదవండి: కాలికి తగిలిన అదృష్టం.. ఏకంగా రూ.1.8 కోట్లు -
నాకు బతకాలని లేదంటూ భార్య మెసేజ్.. అదృశ్యం
సాక్షి, ఖైరతాబాద్( హైదరాబాద్): ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నానని చెప్పిన మహిళ తనకు బతకాలని లేదంటూ ఆమె భర్తకు మెసేజ్ చేసి అదృశ్యమైన సంఘటన సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం... బాచుపల్లిలో నివాసముండే రాజ్‌కుమార్ ఓ చర్చ్ పాస్టర్. గురువారం ఇతడి భార్య కిషోరి(66) ఇంటి నుంచి బయటకు వెళ్తున్నాని చెప్పి వెళ్లింది. మధ్యాహ్నం తరువాత నాకు బతకాలని లేదంటూ ఫోన్ ద్వారా మెసేజ్ చేసింది. మెసేజ్ చేసిన కొంత సమయానికి సుమారు 3 గంటల ప్రాంతంలో ఆమె భర్త మెసేజ్ చూసుకొని ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చిందని, వెంటనే ఆటోలో వెళ్లిన డ్రైవర్‌ను విచారించగా సచివాలయం గేట్ నెం.1 వద్ద దింపినట్లు తెలుపడంతో భర్త గురువారం రాత్రి సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: స్మార్ట్‌ఫోన్ కొనివ్వలేదని ఒకరు.. ఫోన్ నాకే కావాలంటు మరొకరు -
ఖైరతాబాద్ ఫ్లైఓవర్ పైనుంచి దూకి మహిళ ఆత్మహత్యాయత్నం
ఖైరతాబాద్: ఖైరతాబాద్ ఫ్లై ఓవర్‌పై నుంచి లేక్‌వ్యూ పార్క్‌లో దూకి ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సంఘటన సైఫాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల సమాచారం మేరకు... జీడిమెట్ల పరిధిలోని సూరారంలో నివాసముండే కోమటి చందన(20) పీజీ పూర్తిచేసింది. రెండేళ్ల క్రితం స్థానికంగా ఉండే బి.నరే‹Ùను ప్రేమ వివాహం చేసుకుంది. ఆదివారం జీడిమెట్లలో బస్సు ఎక్కి ఖైరతాబాద్ చౌరస్తాలో ఉదయం 9.30 గంటలకు దిగింది. ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ మీదుగా ట్యాంక్‌బండ్ వైపునకు నడుచుకుంటూ వెళ్తూ ఫ్లై ఓవర్ మధ్యలోకి వెళ్లగానే ఫ్లై ఓవర్ ఫుట్‌పాత్‌పైకి ఎక్కి పక్కనే ఉన్న లేక్‌వ్యూ పార్క్‌లో దూకింది. ఈ సంఘటను చూసిన స్థానికులు వెంటనే 100కు ఫోన్ చేయడంతో అక్కడికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది ఆమెను హుటాహుటిన సోమాజిగూడలోని ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించారు. పైనుంచి దూకడంతో కుడి కాలు ప్రాక్చర్కాగా, వెన్నెముకకు గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించే ఆమె తన వల్ల ఎవరూ సంతోషంగా లేరని భావించి... తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాని తెలిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఖైరతాబాద్: మసాజ్ సెంటర్ పేరుతో వ్యభిచారం
ఖైరతాబాద్: మసాజ్ సెంటర్ పేరుతో కొనసాగుతున్న వ్యభిచార గృహంపై సైఫాబాద్ పోలీసులు దాడులు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖైరతాబాద్ షాదన్ కళాశాల ఎదురుగా చింతలబస్తీ మార్గంలో ‘టీఎనీ్టఏ బ్యూటీ పార్లర్ అండ్ స్పా’ సెంటర్ నడుస్తోంది. ఈ సెంటర్‌కు మసాజ్ కోసం వచ్చిన వారిని వ్యభిచారంలోకి దింపుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆదివారం రాత్రి 11:30 గంటల సమయంలో విధుల్లో ఉన్న రాంగోపాల్‌పేట ఇన్స్పెక్టర్ చంచల్ బాబు, సైఫాబా ద్‌కు చెందిన ఇద్దరు ఎస్ఐలు, పలువురు సిబ్బందితో ప్రణాళిక సిద్ధం చేశారు. తొలుత ఓ కానిస్టేబుల్‌ను పంపి బేరం కుదుర్చుకున్నాక అతను సమాచారం ఇవ్వడంతో పోలీసులు దాడులు చేశారు. అక్కడ నిర్వాహకులు హీనా తబస్సుమ్, జైనబ్ తబస్సుమ్‌తో పాటు విటులు మొయినుద్దీన్, పుర్కాన్‌అలీ, సాజిద్‌ఆలీ, మొయిన్ మహబూబ్ హుస్సేన్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారితో ముగ్గురు యువతులు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పీటా చట్టం కింద నిర్వాహకులు, విటులపై కేసు నమోదు చేసి అరెస్టు చేసిన్నట్లు పోలీసులు తెలిపారు. (చదవండి: గచ్చిబౌలి హోటల్లో వ్యభిచారం... ఆరుగురి అరెస్టు) -
సెల్‌ఫోన్ ద్వారా మెసేజ్.. ‘నేను చనిపోతున్నా’
సాక్షి, ఖైరతాబాద్: అర్ధరాత్రి అందరూ నిద్రించిన సమయంలో యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖైరతాబాద్ డివిజన్ ఇందిరానగర్‌లో కుటుంబ సభ్యులతో కలిసి నివాసముండే కె.శివకుమార్(30) ప్రైవేటు ఉద్యోగి. ఆదివారం అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో పెద్ద కుమారుడు విషాల్ నీళ్లు తాగేందుకు లేచి చూడగా మద్య గదిలో చీరతో ఉరివేసుకొని ఉండటంతో వెంటనే కుటుంబ సభ్యులతో కలిసి కిందకు దింపి చూడగా అప్పటికే మృతిచెందాడు. మృతుడు చనిపోయే ముందు ‘నేను చనిపోతున్నా.. నా చావుకు ఎవ్వరూ కారణం కాదు..’ అని సెల్‌ఫోన్ ద్వారా మెసేజ్ పంపి మృతిచెందినట్లు పోలీసులు గుర్తించారు. మృతుడి చెల్లెలు శ్రీలత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: పోలీస్ వాహన్నాన్నే ఢీ కొట్టిన మందుబాబులు -
ఐపీఎల్ మ్యాచ్‌లను అడ్డుకుంటాం: టీఆర్ఎస్ ఎమ్మెల్యే
బంజారాహిల్స్: ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు తెలంగాణకు చెందిన ఒక్క క్రీడాకారుడిని కూడా ఎంపిక చేయకపోవడం పట్ల ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎందరో క్రీడాకారులను అందించిన హైదరాబాద్ నుంచి క్రికెట్‌కు ఆటగాడిని ఎంపిక చేయకపోవడం పట్ల ఆ జట్టు యాజమాన్యాన్ని దుయ్యబట్టారు. హైదరాబాద్‌కు చెందిన ఆటగాడు లేకుండా అది హైదరాబాద్ జట్టు ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా పునరాలోచించి స్థానిక క్రికెటర్లను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఎంపిక చేయకపోతే త్వరలో ఉప్పల్‌లో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్‌లను అడ్డుకుంటామని హెచ్చరించారు. మిగతా అన్ని జట్లు తమ ప్రాంతం వారికి అవకాశం కల్పిస్తే ఎస్ఆర్హెచ్ మాత్రమే విదేశీ, ఇతర రాష్ట్రాల ఆటగాళ్లకు అవకాశం ఇచ్చిందని, ఇది చాలా బాధాకరమన్నారు. చదవండి: ఆ రికార్డుకు ఆరు వికెట్ల దూరంలో.. -
‘ఓట్ల కోసం ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు’
సాక్షి, హైదరాబాద్: విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయని మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు (కేటీఆర్) మండిపడ్డారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో ఆదివారం నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. జహీరానగర్ చౌరస్తాలో కేటీఆర్ మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదంతోనే గత ఎన్నికల్లో 99 సీట్లు గెలిచామని, టీఆర్ఎస్ పాలనలో బస్తీలు అభివృద్ధి చెందాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో మంచినీటి సమస్యను పరిష్కరించామని తెలిపారు. (చదవండి: ‘వరద సాయాన్ని వారే మింగేశారు..!’) కేంద్రంపై ఛార్జ్షీట్లు వేయాల్సి వస్తే.. బీజేపీపై 132 కోట్ల ఛార్జ్షీట్లు వేయాలని కేటీఆర్ అన్నారు. ‘‘ఓట్ల కోసం ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయి. తెలంగాణలో అమలవుతున్న పథకాలు బీజేపీ పాలిత ప్రాంతాల్లో అమలవుతున్నాయా?. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో చిచ్చుపెట్టేందుకు యత్నిస్తున్నారు. బీజేపీ నేతల వల్లే వరద సాయం ఆగిపోయింది. అర్హులందరికీ వరద సాయం అందిస్తాం. జీహెచ్ఎంసీలో 100 సీట్లు గెలిచి ప్రతిపక్షాలకు బుద్దిచెప్పాలని’’ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. (చదవండి: ‘రెండు నెలల్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేయగలం’) -
టికెట్ దక్కలేదని ఆత్మహత్యాయత్నం
సాక్షి, హైదరాబాద్: టిక్కెట్ దక్కలేదని మనస్థాపానికి గురైన బీజేపీ నాచారం డివిజన్ ఆశావాహురాలు అనుముల అశ్వత్థామరెడ్డి భార్య విజయలతారెడ్డి నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. విషయాన్ని గ్రహించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. విజయలతారెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. విజయలతారెడ్డి 2016లో బీజేపీ అభ్యర్థిగా నాచారం డివిజన్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైంది. మాజీ ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్.ఎస్.ప్రభాకర్ టిక్కెట్ ఇవ్వకుండా మోసం చేశారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. (అల రాజకీయ ప్రయాణంలో..) కన్నీటి పర్యంతమైన మాజీ కార్పొరేటర్ వఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలోని వెంకటేశ్వరకాలనీ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థిగా తనకు అవకాశం లభిస్తుందని కోటి ఆశలతో ఎదురు చూసిన మాజీ కార్పొరేటర్ బి.భారతికి నిరాశే ఎదురైంది. పనితీరుతో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మన్ననలు అందుకున్న సిట్టింగ్ కార్పొరేటర్ మన్నె కవిత అభ్యర్థిత్వంవైపే అధిష్టానం మొగ్గుచూపింది. దీంతో భారతికి టిక్కెట్ దక్కలేదు. బుజ్జగింపు పర్వంలో భాగంగా గురువారం ఎమ్మెల్యే దానం నాగేందర్, అభ్యర్థి మన్నె కవిత, ఇన్చార్జి ఎమ్మెల్సీ భానుప్రసాద్‌లు భారతి ఇంటికి చేరుకొని ఆమెను బుజ్జగించారు. ఈ సందర్భంగా ఆమె కన్నీరు పెట్టుకున్నారు. తమ నేత దానం నాగేందర్ ఎలా చెబితే అలా నడుచుకుంటామని, కవితకు సంపూర్ణ సహకారం అందిస్తామని ఈ సందర్భంగా భారతి స్పష్టం చేశారు. -
ప్రైవేట్ ఫైనాన్సర్ల వేధింపులకు నిరసన
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ ఫైనాన్సర్ల వేధింపులకు నిరసనగా ఆటో డ్రైవర్లు గురువారం ఖైరతాబాద్‌లోని కుషాల్ టవర్స్ ఎదుట ధర్నాకు దిగారు. ప్రైవేటు ఫైనాన్సర్లలో దోపిడీ అరికట్టాలంటూ బాధితులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఆరు నెలలుగా ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లను ఫైనాన్సర్లు తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపారు. వేలకు వేలు అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లకు రూ.10 వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ఓ ఆటో డ్రైవర్‌పై ఫైనాన్సర్లు దాడి చేసినా పోలీసులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ ఫైనాన్సర్లపై పోలీసులు చట్టరీత్య చర్యలు తీసుకోవాలని కోరారు. లైసెన్స్ లేని ప్రైవేట్ ఫైనాన్సర్లు దోపిడీ దందా చేస్తున్నారని మండిపడ్డారు. -
దేశాభివృద్ధిలో ఇంజనీర్ల పాత్ర కీలకం
ఖైరతాబాద్ (హైదరాబాద్): ఏ దేశమైనా అభివృద్ధి పథంలో సాగాలంటే ఇంజనీర్ల పాత్ర కీలకమని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. భారతరత్న, సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఏటా నిర్వహించే ఇంజనీర్స్ డే వేడుకలు మంగళవారం ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్లో వెబినార్ ద్వారా జరిగాయి. ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్(ఐఈఐ)–తెలంగాణ స్టేట్ సెంటర్ ఆధ్వ ర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో గవర్నర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను యువ ఇంజనీర్లు ఆదర్శంగా తీసుకోవాలని ఆమె సూచించారు. ప్రధాని మోదీ దేశాభివృద్ధి కోసం తీసుకొచ్చిన ‘మేకిన్ ఇండియా’ పథకాన్ని యువ ఇంజనీర్లు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం అవార్డు గ్రహీతలు, ఐఈఐ సభ్యులను గవర్నర్ అభినందించారు. అంతకుముందు ఉదయం ఐఈఐ చైర్మన్ డాక్టర్ రామేశ్వర్రావు ఆధ్వర్యంలో ఖైరతాబాద్ చౌరస్తాలోని విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాల వేశారు. కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా ప్రభుత్వ కార్యదర్శి కె.ఎస్.శ్రీనివాసరాజు, ఐఈఐ చైర్మన్ డాక్టర్ జి.రామేశ్వర్రావు, కార్యదర్శి టి.అంజయ్య, ఐఈఐ మాజీ చైర్మన్ డాక్టర్ ఎస్.సత్యనారాయణ, డాక్టర్ జి.హనుమంతాచారి తదితరులు పాల్గొన్నారు. అవార్డు గ్రహీతలు వీరే.... ఏటా ఇంజనీర్ల దినోత్సవం పురస్కరించుకొని నైపుణ్యమున్న ఇంజనీర్లను ప్రోత్సహించేందుకు వివిధ అవార్డులను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇచ్చే సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అవార్డును ఈసారి నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్ఐటీ) వరంగల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్వీ రమణారావు, డీఆర్డీఎల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ జైతీర్థ్ ఆర్.జోషి దక్కించుకున్నారు. ‘ఇంజనీర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును ఉస్మానియా యూనివర్సిటీ, సివిల్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ కాలేజ్ ప్రొఫెసర్ ఎం.గోపాల్ నాయక్, డీఆర్డీవో అడ్వాన్స్డ్ సిస్టమ్ లేబొరేటరీ ప్రాజెక్ట్ డైరెక్టర్, శాస్త్రవేత్త ఎన్.కిశోర్‌నాథ్, బీహెచ్ఈఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ డాక్టర్ ఎం. మోహన్‌రావు అందుకున్నారు. ‘యంగ్ ఇంజనీర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును శాస్త్రవేత్త అల్కా కుమారి, బీహెచ్ఈఎల్ మెటలర్జీ డిపార్ట్మెంట్ డిప్యూటీ మేనేజర్ డాక్టర్ పవన్ ఆళ్లపాటి వెంకటేశ్‌కు అందజేశారు. -
ఖైరతాబాద్‌లో ప్రత్యక్షమైన ప్రభాస్
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సందడి చేశారు. తన కొత్త కారు రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ప్రభాస్ ఆర్టీఏ ఆఫీసుకు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు డార్లింగ్‌ను చూసేందుకు భారీగా తరలి వచ్చారు. ఆఫీసులో ఉన్న కొంతమంది ఉద్యోగులు, సందర్శకులు సైతం ప్రభాస్‌తో సెల్ఫీలు, ఫొటోలు దిగారు. కరోనా టైమ్ కాబట్టి ప్రభాస్ మాస్కు ధరించే బయటకు వచ్చారు. దీంతో మాస్కులో ఉన్న హీరోతో ఫొటోలు దిగేందుకు అక్కడి జనం ఉత్సాహం ప్రదర్శించడంతో వారిని నొప్పించడం ఇష్టం లేని డార్లింగ్ ఫొటోలకు పోజిచ్చారు. ఇదిలా వుండగా ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధేశ్యామ్’ సినిమా చేస్తున్నారు. ఇందులో బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్నారు. తన 21వ చిత్రాన్ని 'మహానటి' ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేయనున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే జోడీగా నటించనున్నారు. (దీపిక రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?) -
ఎమ్మెల్యే దానంపై పోలీసులకు ఫిర్యాదు
-
వైరల్: ‘బెదిరింపులకు దిగిన ఎమ్మెల్యే దానం’
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్‌కు చెందిన ఓ స్థల వివాదంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బ్యాంక్ అధికారులతో వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. ఎమ్మెల్యే తమను బెదిరించారంటూ బ్యాంక్ అధికారులు పోలీసులను ఆశ్రయించారు. చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. 10 ఏళ్ల క్రితం ఖైరతాబాద్‌లోని ఓ స్థలంపై ఓ వ్యక్తి లోన్ తీసుకున్నాడు. డబ్బులు తిరిగి కట్టకపోవడంతో ఆ స్థలాన్ని బ్యాంక్ బహిరంగ వేలానికి పెట్టారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న దానం నాగేందర్ బ్యాంక్ అధికారుల విధులకు అడ్డుతగిలారు. ఎమ్మెల్యే తన అనరుచరులతో కలిసి వేలాన్ని అడ్డుకున్నారని బ్యాంక్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే తమపై దౌర్జన్యం చేశారని, బెదిరింపులకు దిగారని తెలిపారు. ఆయన అనుచరులు దూషించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. (‘సాఫ్ట్వేర్ శారద’ కథనంపై స్పందించిన ఎంపీ) -
27 అడుగులతో ఖైరతాబాద్ వినాయకుడి దర్శనం
-
మహాగణపతి 11 అడుగుల్లోపే!
ఖైరతాబాద్: ఈ యేడు ఖైరతాబాద్ మహా గణపతి.. 11 అడుగుల్లోపే ఎత్తుతో మట్టి ప్రతిమగా సాక్షాత్కరించనున్నాడు. కరోనా వైరస్ కారణంగా ఈసారి 11 అడుగుల్లోపు ఎత్తులోనే రూపొందించాలని మంగళవారం నిర్వాహకులు నిర్ణయించారు. వాస్తవానికి ఈ యేడు 66 అడుగుల ఎత్తు, 18 తలలతో విశ్వరూప మహాగణపతిని నిర్మించేందుకు ఈ నెల 18 తొలి ఏకాదశి రోజున కర్రపూజ నిర్వహిం చాలని భావించారు. అయితే అధికారులు, నిర్వాహకులు ప్రస్తుత కరోనా పరిస్థితి, భౌతిక దూరం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని 11 అడుగులలోపు మట్టి గణపతిని రూపొందించాలన్న నిర్ణయానికి వచ్చారు. -
గిరిజా క్షమించు.. అమృత అమ్మ దగ్గరకు రా
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు ఆత్మహత్య కేసులో కొత్త అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మారుతీరావు ఇటీవలే వీలునామా మార్చడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అమృత భర్త ప్రణయ్ హత్యకు ముందే మారుతీరావు తన ఆస్తిని మొత్తం సోదరుడి పేరున వీలునామా రాశారు. అయితే ఇటీవలే వీలునామా నుంచి సోదరుడి పేరు తీసేసి ..తిరగరాశారు. కాగా జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మారుతీరావు తన కుమార్తె అమృతతో సయోధ్యకు ప్రయత్నిస్తున్నారు. (అమృతా ప్రణయ్ తండ్రి ఆత్మహత్య..!) అయితే రెండు రోజుల క్రితం మారుతీరావుతో బంధువులు, సోదరులు గొడవ పడినట్లు తెలుస్తోంది. అతడి వల్ల తమ కుటుంబం పరువు పోయిందని వారు ఘర్షణ పడినట్లు సమాచారం. మారుతీరావు వల్ల తమ కొడుకులకు వివాహాలు కావడం లేదని, ఎవరూ పిల్లను ఇవ్వడానికి ఎవరూ ముందు రావడం లేదని గొడవ పడినట్లు భోగట్టా. ఓ వైపు కుటుంబ సభ్యులతో వివాదాలు, మరోవైపు ప్రణయ్ హత్యకేసు విచారణ చివరి దశకు రావడంతో తీవ్ర మనస్తాపం చెందినట్లు తెలుస్తుంది. సూసైడ్ నోటులో ‘గిరిజా క్షమించు... అమృత అమ్మ దగ్గరకు రా’ అని రాశారు. ఆ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. (మారుతీరావు సూసైడ్ నోట్! ఆ నోట్లో.. ) మీడియా ఊహించి రాయొద్దు.. మారుతీరావు ఆత్మహత్యపై మీడియాలో వస్తున్న వార్తలను ఆయన సోదరుడు శ్రవణ్ ఖండించారు. తన అన్నతో ఎలాంటి విభేదాలు లేవని తెలిపారు. విబేధాలు ఉన్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని, అదంతా అవాస్తవమని కొట్టిపారేశారు. అయితే ప్రణయ్ హత్యకేసుతో తనకు ఎలాంటి సంబంధం లేకున్నా.. అనవసరంగా కేసులో ఇరుక్కున్నాననే నేపథ్యంలోనే సోదరుడితో మాట్లాడటం లేదన్నారు. దీంతో తన తన కుటుంబం ఇబ్బందుల పాలైందన్న ఆగ్రహంతో మారుతీరావుతో గత ఏడాది మే 15 నుంచి మాట్లాడటం లేదని తెలిపారు. మీడియా ఊహించి రాయొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. అన్న ఆత్మహత్య విషయం తెలియగానే తన వదినను తీసుకుని హైదరాబాద్ వచ్చినట్లు చెప్పారు. సూసైడ్ నోట్లో ఏముందో తెలియదని, ఆస్తికి సంబంధించిన వీలునామా రాశారో లేదా అనేది కూడా తనకు ఏమీ తెలియదని శ్రవణ్ పేర్కొన్నారు. మారుతీరావు మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి ఖైరతాబాద్ ఆర్యవైశ్య భవన్లో విషంతాగి ఆత్మహత్య చేసుకున్న తిరునగరి మారుతీరావు మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు పోస్ట్‌మార్టం పూర్తి చేశారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. కుటుంబసభ్యులు రేపు (సోమవారం) మిర్యాలగూడలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా మారుతీరావు నిన్నరాత్రి ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్లో బస చేశారు. ఉదయాన్నే తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది.. ఆయన గది తలుపులు బలవంతంగా తీసి చూడగా మంచంపై అచేతనంగా పడి ఉన్నారు. (అందుకే నాన్న ఆత్మహత్య చేసుకుని ఉంటాడు) విషం తాగినట్లు గుర్తించిన సిబ్బంది అప్పటికే ఆయన చనిపోయినట్లు నిర్ధారించుకుని పోలీసులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని అనంతరం ఆయన మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆయనది ఆత్మహత్యా? లేక సాధారణ మరణమా? అన్న కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. ఆర్యవైశ్య భవన్ సిబ్బందిని, మారుతీరావు కారు డ్రైవర్‌ను ప్రశ్నిస్తున్నారు. మారుతీరావు మృతితో అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. (అమృత తండ్రి షెడ్డులో ఆ మృతదేహం ఎవరిది?) ఆ మృతదేహం ఎవరిది? తన కుమార్తె అమృత ప్రేమించి పెళ్లిచేసుకుందన్న అక్కసుతో 2018 సెప్టెంబర్ 14న మిర్యాలగూడలోని ఓ ఆసుపత్రి వద్ద ఆమె భర్త ప్రణయ్‌ను కిరాయి హంతకులతో మారుతీరావు హత్య చేయించాడని కేసు నమోదయ్యింది. ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేయడంతో 7నెలలపాటు జైలు జీవితం గడిపారు. అనంతరం బెయిల్‌పై బయటికి వచ్చారు. ఈ కేసులో మారుతీరావుతోపాటు ఆయన సోదరుడు శ్రవణ్‌కుమార్, మరో వ్యక్తిపైనా పోలీసులు పీడీ యాక్టు కింద కేసు నమోదుచేసి అరెస్టు చేశారు. ఇటీవల మిర్యాలగూడలోని మారుతీరావు షెడ్డులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమవడం కూడా కలకలం రేపింది. ఆ మృతదేహం ఎవరిది? ఆ షెడ్డులోకి ఎలా వచ్చింది? అన్నది ఇంతవరకు తేలలేదు. ఈ తరుణంలోనే మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడటం సంచలనం రేపుతోంది. (అమృత ఫిర్యాదుతో మారుతీరావు అరెస్ట్) -
ఎల్బీనగర్-మియాపూర్ మెట్రోలో ప్రమాదం
సాక్షి, హైదరాబాద్ : మెట్రో ప్రయాణం అత్యంత సురక్షితం అన్న అధికారుల మాటలు నమ్మేలా కనిపించడం లేదు. ఇటీవల అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ వద్ద పెచ్చులూడి తలపై పడటంతో ఓ యువతి మరణించిన ఘటన మరువకముందే.. ఎల్బీనగర్-మియాపూర్ మెట్రోలో శుక్రవారం స్వల్ప ప్రమాదం చోటుచేసుకుంది. డోర్‌పైనున్న క్యాబిన్ ఊడి ప్రయాణికులపై పడింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కానప్పటికీ ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రైలు ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ వద్దకు చేరుకున్నసమయంలో ఈ ప్రమాదం సంభవించింది. ఇదిలాఉండగా.. గత 14 రోజులుగా టీఎస్ ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుండటంతో హైదరాబాద్ మెట్రో సర్వీసులకు జనం తాకిడి ఎక్కువైంది. ఈ నేపథ్యంలోనే ప్రయాణికులు పట్టుకుని నిల్చునే డోర్‌పైనున్న క్యాబిన్ ఊడిపోయినట్టు పలువురు చెప్తున్నారు. (చదవండి : మెట్రో పిల్లర్ కాదు.. కిల్లర్) -
గాంధీ కలలను సాకారం చేద్దాం
ఖైరతాబాద్: గాంధీ 150వ జయంతి సందర్భంగా కేంద్ర హోం శాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి ఖైరతాబాద్ నుంచి గాంధీ సంకల్ప యాత్రను ప్రారంభిం చారు. పలు సామాజిక సంస్థల సమన్వయంతో ఏర్పాటు చేసిన ఈ యాత్ర ఖైరతాబాద్ మహాగణపతి మండపం నుంచి ప్రారంభమైంది. ఓల్డ్ సీఐబీ క్వార్టర్స్, మారుతీ నగర్, బీజేఆర్ నగర్, మహాభారత్ నగర్, చింతల్‌బస్తీ తదితర ప్రాంతాల మీదుగా సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆనాడు స్వాతంత్య్రం కావాలా? స్వచ్ఛ భారత్ కావాలా? అన్నప్పుడు స్వాతంత్య్రం ఎలాగూ వస్తుంది, స్వచ్ఛ భారత్ కావాలన్న గాంధీ అడుగు జాడల్లో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అదే స్పూర్తితోనే ప్రధాని నరేంద్రమోదీ స్వచ్ఛ భారత్‌కు శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. -
ఖైరతాబాద్ గణేశ్ శోభాయాత్ర
-
ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకున్న గవర్నర్
-
శ్రీ ద్వాదశాదిత్య రూపుడిగా ఖైరతాబాద్ మహాగణపతి
-
ఖైరతాబాద్‌లో కొలువుదీరిన భారీ గణనాథుడు
-
రోడ్డు భద్రత, ట్రాఫిక్ మెరుగుదలపై సమీక్ష
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్‌లోని ‘ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ భవన్’లో సోమవారం రోడ్డు భద్రత, ట్రాఫిక్ మెరుగుదలపై ఒక రోజు సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో ‘రోడ్ సేఫ్టీ ఆడిట్ ఫర్ ఇంప్రూవ్ మెంట్ ఆఫ్ ట్రాఫిక్ సేఫ్టీ’ అనే అంశంపై సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం నగరం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యల్లో ట్రాఫిక్ ఒకటి. రోజురోజుకు పెరిగిపోతున్న వాహనాలకు తగ్గట్లు రహదారులు పెరగకపోవడం, చాలాచోట్ల రోడ్లపై అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగడంతో నగరవాసులకు రద్దీ ప్రాంతాల్లో ప్రయాణం నరకప్రాయంగా మారింది. దీంతో ట్రాఫిక్ కట్టడితో పాటు ప్రమాదాలకు చెక్ పెట్టడానికి అధికారులు సమావేశమయ్యారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రోడ్లు రవాణా భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. అంతేకాక విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, ఆర్అండ్బీ ఇంజనీర్ ఇన్ చీఫ్ గణపతి రెడ్డి, రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్, డీజీపీ కృష్ణ ప్రసాద్, పలువురు ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. -
రంగు పడుద్ది
ఇంటి గుమ్మానికి ఎరుపు రంగు గుర్తు.. డేంజర్ అనడానికి సిగ్నల్లాగ.. ఎదురింటికి ఆరెంజ్ గుర్తు.. ఆ పక్క ఇంటికి గ్రీన్.. ఇంకో ఇంటికి బ్లూ.. అంతేకాదు.. మనం మారితే.. ఆ రంగు కూడా మారుతుందట! ప్రస్తుతం ఖైరతాబాద్‌లోనే.. రేప్పొద్దున్న సిటీ అంతా ఈ రంగులు వస్తాయట.. ఈ కలర్ కోడ్ మీద కేంద్ర ప్రభుత్వ అధికారులు కూడా ఆసక్తి కనబరుస్తున్నారట.. ఇంతకీ ఈ రంగుల వెనకున్న కథ ఏంటి? గ్రేటర్ హైదరాబాద్‌లో జలమండలి, బల్దియా ఆధ్వర్యంలో మహోద్యమంగా చేపడుతోన్న జలనాయకత్వం.. జలసంరక్షణ (వాక్) ఉద్యమంలో భాగంగా సిటీలో ఇంటింటికీ రంగుల గుర్తులను వేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది.. ఇంట్లో జరుగుతున్న నీటి వృథా లేదా సంరక్షణను బట్టి రంగులను వేస్తారు. ప్రస్తుతం ఖైరతాబాద్ డివిజన్లోని మాతానగర్ బస్తీలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. నీటివృథా, సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై ఇంటి యజమానులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇంట్లో నీటి వృథా తగ్గితే.. ఇంటికి వేసే రంగు గుర్తు మారుస్తారు. ఈ వినూత్న విధానంపై కేంద్ర జలశక్తి అభియాన్ ప్రతినిధులు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి ప్రయోగాన్ని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రవేశపెడితే విలువైన తాగునీటిని సంరక్షించవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. శాస్త్రీయంగా లెక్కేస్తారు.. జలమండలి పరిధిలో ప్రతీ కాలనీ, బస్తీలకు తాగునీటిని సరఫరా చేసే పైపులైన్లకున్న వాల్‌్వను తిప్పినపుడు ఆ నీరు ఎన్ని ఇళ్లకు..ఏ మోతాదులో సరఫరా అవుతోంది...సరఫరా జరిగిన నీటికి సంబంధించి శాస్త్రీయంగా బిల్లింగ్ జరుగుతుందా అన్న విషయాలను సైతం లెక్కేస్తారు. దీని వల్ల ఆ వీధిలో ఏ ఇంట్లోనైనా నీటి వృథా అధికంగా ఉందా? లేదా అన్న అంశాన్ని ప్రయోగాత్మకంగా తెలుసుకోనున్నారు. నగరంలో నిత్యం వృథా అవుతోన్న 50 మిలియన్ గ్యాలన్ల తాగునీటితో చెన్నై మహానగరం నీటి కొరతను తీర్చవచ్చు. అందుకే ప్రస్తుతం 40 శాతం మేర ఉన్న నీటి వృథాను 20 శాతానికి తగ్గించేందుకు జలసంరక్షణ.. జలనాయకత్వం ఉద్యమాన్ని చేపట్టాము. ఇందులో స్వయం సహాయక బృందాల మహిళలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతోపాటు బల్దియా, జలమండలికి సంబంధించి అన్ని స్థాయిల అధికారులు పాల్గొంటున్నారు. ఈ అంశంపై ఈనెల 19న కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో విజ్ఞాన్ భవన్లో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నాము. - ఎం.దానకిశోర్, జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఎరుపు - జలమండలి సరఫరా చేస్తున్న తాగు నీటి వృథా అత్యధికంగా ఉన్నట్లు లెక్క. - వర్షపు నీటిని ఒడిసిపట్టే ఇంకుడు గుంత లేకపోవడం, నల్లా నీళ్లతో ఫ్లోర్ క్లీనింగ్, జంతువులు, కార్లు, ద్విచక్రవాహనాలను కడగడం వంటివి చేస్తే... - పైపులు, మోటార్లు, వాల్‌్వలు, మీటర్ చాంబర్లలో నీటి వృథా అధికంగా ఉండడం, మీ ఇంట్లోని సంప్ నిండి.. వీధిలోకి నీళ్లు వృథాగా పొంగి పొర్లడం - మీ సంప్ నుంచి ఓవర్‌హెడ్ ట్యాంక్‌కు నీటిని మళ్లించే పైపులైన్లలో లీకేజీ ఉండడం వంటివి.. కాషాయం పైన చెప్పిన విధంగా తొమ్మిది రకాల వృథా కాకుండా.. అందులో ఏ ఐదు రకాల వృథా జరిగినా ఈ గుర్తు పడుతుంది.. పచ్చ మీ ఇంట్లో నీటి వృథాను అరికట్టేందుకు పైన పేర్కొన్న అంశాలను తక్కువ సమయంలో కట్టడి చేయడంతోపాటు ఇంట్లో ఇంకుడు గుంత ఉంటే.. ఈ రంగు వేస్తారు. నీలం నీటి వృథా అస్సలు లేదు.. పైగా.. మీ ఇంటి పైకప్పుపై పడిన వర్షపు నీటిని జాగ్రత్తగా ఒడిసిపట్టేందుకు ఇంకుడు గుంత ఉంటే.. ఇంటికి నీటి బిందువును ప్రతిబింబించేలా నీలం గుర్తు వేస్తారు. - సాక్షి, హైదరాబాద్ -
ఖైరతాబాద్‌లో ఆర్టీఏ అధికారుల తనిఖీలు
-
నాడు శత్రువులు.. నేడు మిత్రులు
బంజారాహిల్స్: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు/శత్రువులు ఉండరు. అందుకు ఈ రెండు ఉదంతాలే నిదర్శనం. 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా మాజీ సీబీఐ డైరెక్టర్ విజయరామారావు టీడీపీ నుంచి ఖైరతాబాద్ నియోజకవర్గంలో బరిలోకి దిగారు. ఆయనకు ప్రత్యర్థిగా కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఇద్దరూ పార్టీల పరంగా బద్ధ శత్రువులు. మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఇప్పుడు వారిద్దరినీ టీఆర్ఎస్ ఒక్కటి చేసింది. ఇటీవల టీఆర్ఎస్లో చేరిన దానం నాగేందర్‌కు ఖైరతాబాద్ టిక్కెట్ కేటాయించగా టీఆర్ఎస్లోనే ఉన్న విజయరామారావు మద్దతు కావల్సి వచ్చింది. దీంతో నాగేందర్ శనివారం విజయరామారావు ఇంటికి వెళ్లి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. 2009లో ఇద్దరూ పోటీపడ్డ విషయాన్ని సరదాగా గుర్తుచేసుకున్నారు. ఇక 2014 ఎన్నికల్లో వైస్సార్సీపీ అభ్యర్థిగా విజయారెడ్డి పోటీ చేశారు. ఆమెపై కాంగ్రెస్ అభ్యర్థిగా దానం నాగేందర్ బరిలో నిలిచారు. ఈ ఇద్దరు హోరాహోరీ తలపడ్డారు. ఈ ఎన్నికల అనంతరం విజయారెడ్డి టీఆర్ఎస్లో చేరి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఖైరతాబాద్ కార్పొరేటర్‌గా గెలిచారు. ఇటీవలే టీఆర్ఎస్లో చేరిన దానం నాగేందర్‌కు ప్రస్తుతం ఖైరతాబాద్ టిక్కెట్ దక్కడంతో.. నాడు పోటీలో నిలిచి ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్న విజయారెడ్డి వద్దకు వెళ్లి ఆమె మద్దతు కోరారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరని ఈ రెండు సంఘటనలు కళ్లకు కట్టాయి. తొలి మహిళా మంత్రి హైదరాబాదీ పరదా ధరించే సంప్రదాయం.. మగవాళ్ల మధ్యలోకి రావద్దంటూ ఆంక్షలు..ఆపై రజాకార్ల ఆగడాలు.. ఇంతటి ఆంక్షల చట్రంలోనూ ఉన్నత చదువులు పూర్తిచేసి, సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి మహిళా మంత్రిగా చరిత్ర పుటల్లోకి ఎక్కారు మాసుమా బేగం! హైదరాబాదీ అయిన మాసుమా బేగం చిన్నప్పట్నుంచే సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. తల్లి ద్వారా సరోజిని నాయుడుతో పరిచయం ఏర్పడింది. 1928లో బొంబాయిలో తొలిసారిగా నిర్వహించిన మహిళా సదస్సులో పాల్గొన్నారు. హైదరాబాద్ స్టేట్‌లో 1952లో జరిగిన ఎన్నికల్లో శాలిబండ నియోజకవర్గం నుంచి పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈ ఎన్నికల్లో తెలంగాణ సాయుధ పోరాటంలో కీలకంగా వ్యవహరించిన కమ్యూనిస్టు యోధుడు మఖ్దూం మొహియుద్దీన్పై 780 ఓట్ల తేడాతో ఆమె విజయం సాధించారు. మొహియుద్దీన్ పీడీఎఫ్ టికెట్‌పై.. మాసుమా బేగం కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేశారు. హైదరాబాద్ రాష్ట్రానికి బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాసుమా బేగం డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా పని చేశారు. ఆంధ్ర, హైదరాబాద్ రాష్ట్రాల విలీనం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికల్లో çఫత్తర్‌గట్టి నుంచి శాసనసభ్యురాలిగా విజయం సాధించారు. 1960లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ప్రభుత్వంలోనూ మాసుమా బేగం మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. -
టికెట్ ఎవరికిచ్చినా మద్దతిస్తా: దానం
హైదరాబాద్: ఖైరతాబాద్ అసెంబ్లీ టికెట్‌పై రెండు మూడు రోజుల్లో నిర్ణయం రానుందని, టీఆర్ఎస్ తరపున ఖైరతాబాద్ టిక్కెట్ ఎవరికిచ్చినా తన మద్దతు ఉంటుందని మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత దానం నాగేందర్ తెలిపారు. హైదరాబాద్‌లో దానం విలేకరులతో మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేసిందని ఆరోపించారు. పొన్నాల లాంటి సీనియర్ నేతను బలి పశువును చేశారని విమర్శించారు. బీసీ నాయకులను రోడ్డున పడేసి.. ఏసీ రూముల్లో మీటింగ్‌లు పెట్టుకున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌లో బీసీలకు అన్యాయం జరుగుతుందని తాను మొదటి నుంచి చెబుతూనే ఉన్నానని తెలిపారు. కాంగ్రెస్‌లో అన్యాయం జరిగిన వాళ్లు కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లోకి రావాలని ఆహ్వానిస్తున్నానని, కేసీఆర్ అన్ని వర్గాలకు వారికి న్యాయం చేస్తారని హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌లో ఒకరి తోక మరొకరు కట్ చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. -
రేపే మహా గణపయ్య నిమజ్జనం
సాక్షి, హైదరాబాద్ : సోమవారం ఉదయం 10 గంటలకల్లా నగరంలోని అన్ని వినాయక నిమజ్జనాలు పూర్తి చేయిస్తామని సిటీ కమిషనర్ అంజనీకుమార్ వెల్లడించారు. నిమజ్జనాల సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. 19వేల మంది పోలీసులు, 2 లక్షలకుపైగా సీసీ కెమెరాల సేవలు వినియోగించుకోనున్నామని తెలిపారు. సెంట్రల్ సెక్కురిటీ ఫోర్స్, షీ టీమ్స్, సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ ఫోర్స్ సేవలు కూడా అందుబాటులో ఉంటాయని అన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 8 వేల వినాయక విగ్రహాలు నిమజ్జనం అయ్యాయనీ, మరో 14 వేల విగ్రహాలు నిమజ్జనం కానున్నాయని తెలిపారు. రాచకొండ, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల భద్రతా పర్యవేక్షణ వ్యవస్థలను అనుసంధానం చేసినట్టు వెల్లడించారు. నగర వ్యాప్తంగా 125 ప్రధాన స్థావరాల నుంచి నిమజ్జనానికై వినాయకులు తరలిరానున్నట్టు తెలిపారు. ఖైరతాబాద్ మహా గణపయ్య నిమజ్జనం ఖైరతాబాద్‌లో కొలువైన మహా గణపతి నిమజ్జనం రేపు మధ్యాహ్నం 12 గంటలకు పూర్తవుతుందని కమిషనర్ అంజనీకుమార్ వెల్లడించారు. మహాగణపయ్య శోభాయాత్ర సాగే రూట్ మాప్లో భద్రతా చర్యలు చేపట్టామని తెలిపారు. ఎన్టీఆర్ మార్గ్‌లోని 6వ నెంబర్ క్రేన్ పాయింట్ వద్ద ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం జరుగుతుందని వివరించారు. బాలాపూర్ గణేషుని శోభాయాత్ర ట్యాంక్‌బండ్ వరకు 18 కిలోమీటర్లు కొనసాగనుందని అన్నారు. -
ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం మ.12గం.ల పూర్తి చేస్తాం
-
టికెట్‌పై సస్పెన్స్: ఎట్టకేలకు మౌనం వీడిన దానం
సాక్షి, హైదరాబాద్ : ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లో చేరిన సీనియర్ నేత దానం నాగేందర్‌కు గులాబీ అధినేత కేసీఆర్ ఇంకా టికెట్ ఖరారు చేయని సంగతి తెలిసిందే. దానం నాగేందర్ ఖైరతాబాద్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తుండగా.. గోషామహల్ నుంచి పోటీచేయాల్సిందిగా ఆయనను టీఆర్ఎస్ అధిష్టానం ఆదేశించినట్టు కథనాలు వస్తున్నాయి. టికెట్ ఖరారు చేయకపోవడంతో దానం అసంతృప్తిగా ఉన్నారని వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన సోమవారం ఎట్టకేలకు మౌనం వీడారు. తాను పార్టీ మారబోతున్నట్టు వస్తున్న కథనాలు అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. తనకు టికెట్ ఇచ్చినా.. ఇవ్వకపోయినా టీఆర్ఎస్లోనే కొనసాగుతానని దానం చెప్పారు. పార్టీ మారాలనుకున్న నాయకులు ‘వెళ్ళిపోతే... వెళ్లిపోవాలి’ తప్ప ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొన్నారు. టీఆర్ఎస్లో కేటీఆర్ కోటరీ ఉంది అనడం తప్పు అని మీడియాతో చెప్పారు. తరచూ పార్టీలు మారడానికి తానేమీ గంగిరెద్దును కాదని వ్యాఖ్యానించారు. ఎలాంటి ఒప్పందం లేకుండానే తాను టీఆర్ఎస్లో చేరానని చెప్పారు. -
హైదరాబాద్‌లో తృటిలో తప్పిన పెను ప్రమాదం
-
మొదలైన ఖైరతాబాద్ గణేశుడి విగ్రహ ఏర్పాట్ల పనులు
-
9999 @ రూ.10 లక్షలు
సాక్షి, సిటీబ్యూరో: ఆర్టీఏ ఫ్యాన్సీ నంబర్లపై వాహనదారులు మరోసారి తమ క్రేజ్‌ను చాటుకున్నారు. మంగళవారం ఖైరతాబాద్ ఆర్టీఏలో ప్రత్యేక నంబర్లకు నిర్వహించిన వేలానికి వాహనదారుల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. ప్రతి ఒక్కరూ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ‘టీఎస్ 09 ఈజడ్ 9999’ నంబర్ కోసం ఓ వ్యక్తి రూ.10.46 లక్షలు చెల్లించి సొంతం చేసుకున్నారు. బాగా డిమాండ్ ఉండే ‘ఆల్ నైన్స్కు’ రూ.10 లక్షలు చెల్లించడం ఇదే మొట్టమొదటిసారి. గతంలో ఈ నంబర్ కోసం రూ.9 లక్షల వరకు చెల్లించి దక్కించుకున్నావారు ఉన్నారు. కానీ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ తమ రూ.1.04 కోట్ల ఖరీదైన రేంజ్‌రోవర్ కారు కోసం ఆల్ నైన్స్ నంబర్‌ను వేలంలో రూ.10,46,722 చెల్లించి సొంతం చేసుకుంది. ‘టీఎస్ 09 ఎఫ్ఏ 0009’ నంబర్ కోసం గంగవరం పోర్టు సంస్థ రూ.5,01,000కు దక్కించుకుంది. రూ.1.41 కోట్ల ఖరీదైన బీఎండబ్ల్యూ కారు కోసం ఈ నంబర్ తీసుకున్నారు. అలాగే ‘టీఎస్ 09 ఎఫ్ఏ 0005’ నెంబర్ కోసం కూనం ఈశ్వరమ్మ రూ.2,51,000 చెల్లించారు. తమ వోల్వో ఎక్స్‌సి కారు కోసం ఈ నెంబర్ తీసుకున్నారు. ప్రత్యేక నెంబర్లకు మంగళవారం నిర్వహించిన వేలం పాటల్లో ఆర్టీఏకు మొత్తం రూ.26,55,243 లభించినట్లు ఖైరతాబాద్ ప్రాంతీయ రవాణా అధికారి సి.రమేష్ తెలిపారు. -
నెత్తుటి మరకలు..ఖైరతాబాద్‌లో యువకుడిని..
నగరంలో శనివారం రాత్రి ఒకే రోజు మూడు హత్యలు చోటు చేసుకున్నాయి. రసూల్‌పురా పరిధిలో ఓ ఇంట్లో కేర్‌టేకర్‌గా పని చేస్తున్న యువకుడు ఇంటి యజమానురాలిని దారుణంగా హత్యచేసి నగలతో పరారయ్యాడు. హిమాయత్ నగర్లో ఓ సెక్యురిటీ గార్డును గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఖైరతాబాద్ ప్రాంతంలో ఓ యువకుడిని పాత గొడవల నేపథ్యంలో పథకం ప్రకారం వెంటాడి వేటాడారు.. వివరాల్లో వెళితే.. పని విషయమై గొడవ జరగడంతో.. రసూల్‌పురా : వృద్ధురాలిని ఓ కేర్‌టేకర్ హత్య చేసి నగలతో ఊడాయించిన సం ఘటన తిరుమలగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. నార్త్‌జోన్ డీసీపీ సునీత కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఏడబూŠల్య్హెచ్ఓ వేదవిహార్ కాలనీలోని కమలా ఎన్‌క్లేవ్‌లో వ్యవసాయశాఖ రిటైర్డ్ ఉద్యోగి కాంతారావు, సులోచన దంపతులు నివాసం ఉంటున్నారు. వీరి కుమారుడు ఫణికృష్ణ మణికొండలో ఉంటుండగా, కుమార్తె కూకట్‌పల్లిలో నివాసం ఉంటోంది. కొద్దిరోజులుగా కాంతారావుకు పక్షవాతంతో బాధపడుతుండటంతో కుటుంబసభ్యులు అతడి ఆలనాపాలన చూసేందుకు బోడుప్పల్‌లోని సుధా కేర్సేంటర్ను సంప్రదించగా, వారు ఈ నెల 7న వరంగల్‌కు చెందిన అరుణ్‌ను నియమించారు. పదిరోజుల పాటు పనిచేసిన అరుణ్ ఊరికి వెళుతున్నానంటూ సెలవుపై వెళ్లి శనివారం తిరిగి వచ్చి పనిలో చేరాడు. ఈ సందర్భంగా సులోచనకు అరుణ్‌కు పని విషయమై గొడవ జరగడంతో కోపోద్రిక్తుడైన అరుణ్ దిండుతో సులోచన(68)ను ఊపిరి ఆడకుండా చేసి హత్యచేశాడు. చనిపోలేదనే అనుమానంతో కత్తితో గొంతు కోశాడు. అనంతరం ఆమె మెడలో ఉన్న 4 తులాల మంగళసూత్రం, చేతి రింగు, కమ్మలు, పదితులాల వెండి గొలుసులు, బంగారు పల్లెం తీసుకుని ఊడాయించాడు. ఆదివారం ఉదయం పనిమనిషి తలుపులు తెరచి ఉండటాన్ని గుర్తించి లోపలికి వెళ్లి చూడగా సులోచన విగతజీవిగా కనిపించింది. మొదటి అంతస్తులో ఉన్న వారికి సమాచారం ఇవ్వడంతో వారు పోలీసులు, కుమారుడు ఫణికృష్ణకు సమాచారం అందించారు. పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలించగా అరుణ్ బ్యాగ్‌తో వెళుతున్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బేగంపేట ఏసీపీ, సీఐ రాజేశ్వర్‌రావు, క్లూస్‌టీం సంఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. సెక్యురిటీ గార్డు దారుణ హత్య హిమాయత్‌నగర్ : సెక్యురిటీ గార్డుగా పని చేస్తున్న ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన హిమాయత్‌నగర్‌లో ఆదివారం చోటు చేసుకుంది. ఏసీపీ భిక్షంరెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా, సామర్లకోటకు చెందిన మునిస్వామి(35) భార్య సత్యవేణి, ముగ్గురు పిల్లలతో కలిసి హిమాయత్‌నగర్ స్ట్రీట్‌నెంబర్–1లోని సుకన్య సదన్‌లో ఉంటూ సోమాజిగూడలోని ఓ ప్రైవేటు కంపెనీలో సెక్యురిటీగార్డుగా పనిచేస్తున్నాడు. అతని భార్య సత్యవేణి ఇళ్లల్లో పనిచేసేది. భార్య పిల్లలతో కలిసి పదిరోజుల క్రితం సామర్లకోటకు వెళ్లగా, తండ్రి రమణ, మునిస్వామి మాత్రమే ఉన్నారు. ఆదివారం ఉదయం వాటి ఇంట్లో నుంచి రక్తం వస్తున్నట్లు గుర్తించిన పక్కింటివారు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మునిస్వామి తలపై బలమైన ఆయుధంతో మోది హత్య చేసినట్లు గుర్తించారు. క్లూస్‌టీం ఆధారాలు సేకరించి. కేసును త్వరలోనే చేధించి నిందితులను పట్టుకుంటామని ఏసీపీ తెలిపారు. అర్ధరాత్రి అరాచకం ఖైరతాబాద్ : పాత గొడవల నేపథ్యంలో ఓ యువకుడిని కొందరు వ్యక్తులు పథకం ప్రకారం దాడి చేసి హత్య చేసిన సంఘటన శనివారం రాత్రి ఖైరతాబాద్ ప్రాంతంలో చోటు చేసుకుంది. వివరాల్లోకివ వెళితే..కర్నూలు జిల్లా, నందికొట్కూరుకు చెందిన గంగుల శివకిరణ్(33) అలియాస్ కిరణ్ బోరబండలో ఉంటున్నాడు. నేరాలకు అలవాటు పడిన శివకిరణ్పై గోపాల్పురం పోలీస్‌స్టేషన్‌లో పీటా కేసులు, 2014లో కూకట్పల్లి పోలీస్‌స్టేషన్‌లో హత్య కేసు, పంజగుట్ట పీఎస్‌లో రెండు కేసులు ఉన్నాయి. 2016లో గోపాల్పురం పోలీసులు అతడిని పీడి యాక్ట్‌పై అరెస్టు చేసి జైలుకు పంపారు. మద్యం మత్తులో జరిగిన గొడవ నేపథ్యంలో..... ఈ నెల 16న శివకిరణ్ మరికొందరు యువకులతో కలిసి దూల్పేట్లో మద్యం సేవిస్తుండగా కన్నా, ఖైరతాబాద్ మహాభారత్‌నగర్‌కు చెందిన రహమాన్ మధ్య గొడవ జరిగింది. ఈ సందర్భంగా రహమాన్ కత్తితో దాడి చేయడంతో కన్నా చేతికి గాయాలయ్యాయి. ఈ విషయంలో జోక్యం చేసుకున్న శివకిరణ్ గొడవలు వద్దని కేసు లేకుండా చేసేందుకు రూ.10వేలు వైద్యం ఖర్చుల కోసం ఇవ్వాలని రహమాన్‌కు సూచించాడు. ఆ తర్వాత పలు మార్లు ఫోన్ చేసి డబ్బులు ఇవ్వకుంటే చంపేస్తానని రహమాన్‌ను బెదిరించాడు. శనివారం సాయంత్రం శివకిరణ్ తన రెండో భార్య సంగు లక్ష్మితో ఐమాక్స్‌లో సినిమా చూసి వస్తుండగా ఫోన్ చేసిన రహమాన్ రూ.3000 ఇస్తానని చెప్పి అతడిని మహాభారత్‌నగర్‌కు పిలిపించాడు. అప్పటికే పథకం ప్రకారం ఇందిరానగర్‌కు చెందిన భరత్ అలియాస్ చాప, మక్తాకు చెందిన అజ్జు, జావెద్, మహ్మద్ మోయిఉద్దీన్లకు అక్కడికి రప్పించాడు. బైక్‌పై అక్కడికి వచ్చిన శివకిరణ్ రహమాన్‌ను డబ్బులు అడగడంతో తన వద్ద రూ. వెయ్యి మాత్రమే ఉన్నట్లు చెప్పడంతో శివకిరణ్ అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో రహమాన్ కత్తితో అతడిపై దా డికి దిగాడు. తప్పించుకుని వెళ్తున్న శివకిరణ్‌ను బీజేఆర్నగర్ రోడ్డులో మరో ముగ్గురు కిందపడేసి పట్టుకోగా, రహæమాన్, భరత్ కత్తులతో దాడి చేసి హత్య చేశారు. 12గంటల్లో నిందితుల పట్టివేత? హత్యకేసులో నిందితులను సైఫాబాద్ పోలీసులు 12గంటల్లోపే అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. శివకిరణ్ స్నేహితుడు దుర్గాప్రసాద్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. శివకిరణ్ మొదటి భార్య శారద స్వగ్రామం నుంచి తిరిగివచ్చిన అనంతరం అతడి మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించినట్లు తెలిపారు. -
హోంగార్డుల ఆందోళనతో భారీ ట్రాఫిక్ జామ్
-
ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో అగ్నిప్రమాదం
-
మా ఇష్టం.. ఆపేదెవరు?
ముగ్గురు వ్యక్తులు పాతకాలం నాటి స్కూటర్లను బయటకు తీశారు. ఒక్కదానికీ నెంబర్ ప్లేట్ లేదు. ఒక్కరూ హెల్మెట్ కూడా ధరించలేదు. పైగా బరువైన బస్తాలతో దూసుకెళుతున్నారు. పోలీసులు సాధారణ వాహనదారులను రకరకాల కారణాలతో నిలపడమో.. హెల్మెట్ లేకుంటే చలాన్ విధించడమో చేస్తారు. లేదంటే వేగంగా వెళ్లేవారిని ఫొటో తీసి ఆన్లైన్లో చాలాన్ పంపిస్తారు. వీరు వెళ్లే మార్గంలో అనేక ట్రాఫిక్ సిగ్నళ్లు ఉన్నాయి.. అక్కడ పోలీసు సిబ్బందీ ఉన్నారు. కానీ ఒక్కరూ నిలువరించలేదు. ఇదేంటని అడగనూ లేదు. ఖైరతాబాద్ ఫ్లై ఓవర్‌పై కనిపిందీ దృశ్యం. – ఫొటో: గడిగె బాలస్వామి -
మహాగణపతి శోభాయాత్ర ప్రారంభం
-
శోభాయాత్రకు సిద్ధమైన ఖైరతాబాద్ గణేశుడు
-
భక్తులతో జనసంద్రాన్ని తలపిస్తున్న ఖైరతాబాద్
-
రహదారి భద్రత అందరి బాధ్యత
⇒ ‘మన టీవీ’ సీఈవో శైలేష్‌రెడ్డి ⇒ హెల్మెట్, సీట్‌బెల్ట్ మరిచిపోవద్దు ⇒ జర్నలిస్టుల లెర్నింగ్ లైసెన్స్ మేళాకు అనూహ్య స్పందన సిటీబ్యూరో: రోడ్డు నిబంధనల పట్ల శాస్త్రీయమైన అవగాహనతో వాహనాలు నడిపినప్పుడే ప్రమాదా లను పూర్తిస్థాయిలో నివారించగలమని పలువురు వక్తలు సూచించారు. డ్రైవింగ్ సమయంలో రహదారి భద్రత సంకేతాలను, జాగ్రత్తలను కచ్చితంగా పాటిం చాలన్నారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్, ఆర్టీఏ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఖైరతాబాద్‌లో నిర్వహించిన జర్నలిస్టుల లెర్నింగ్ లైసెన్స్ మేళాకు అనూహ్య స్పందన లభించింది. ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాకు చెందిన వందలాది మంది పాత్రికేయులు, ఫొటో జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు ఈ మేళాలో పాల్గొన్నారు. కార్యక్రమానికి మన టీవీ సీఈవో శైలేష్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఖైరతాబాద్ ప్రాంతీయ రవాణా అధికారి జీపీఎన్ ప్రసాద్, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రాజమౌళిచారి, ప్రధాన కార్యదర్శి శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శైలేష్ రెడ్డి మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల కారణంగా ఏ ఒక్క వ్యక్తికి ప్రాణనష్టం జరిగినా అది అతడి కుటుంబానికి నష్టమేనని, పత్రికా రంగంలో రేయింబంవళ్లు విధులు నిర్వహించే జర్నలిస్టులు రహదారి భద్రత పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ‘హెల్మెట్, సీట్ బెల్ట్ పట్ల కొందరిలో వ్యతిరేకత ఉంది. అది ఏ మాత్రం మంచి పద్ధతి కాదు. నా తల నా ఇష్టం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మీ విలువైన ప్రాణం కేవలం మీ ఒక్కరిదే కాదు. అది సామాజిక సంపద’ అని పేర్కొన్నారు. లెర్నింగ్ లైసెన్స్ మెళాకు నేతృత్వం వహించిన ఖైరతాబాద్ ప్రాంతీయ రవాణా అధికారి జీపీఎన్ ప్రసాద్ మాట్లాడుతూ.. వాహనాలు నడపాలంటే తప్పనిసరిగా రోడ్డు సెన్స్ ఉండితీరాలన్నారు. డ్రైవింగ్ చేసే సమయంలో కారు సీటు బెల్టు ధరించడంతో పాటు ఏకాగ్రతతో వాహనం నడపాలన్నారు. కారు నడిపేటప్పుడు ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్లు భరత్‌సింగ్, లావణ్య, టీఎన్జీవోస్ రవాణా విభాగం ప్రధాన కార్యదర్శి సామ్యూల్ పాల్, ఆర్టీఏ మినిస్టీరియల్ ఉద్యోగులు పాల్గొని జర్నలిస్టుల లైసెన్స్ మేళాను విజయవంతం చేశారు. -
ఖైరతాబాద్‌లో ఘోర ప్రమాదం
హైదరాబాద్: నగరంలోని ఖైరతాబాద్ సర్కిల్ బైపాస్ రోడ్డులో మంగళవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా రాంగ్ రూట్లో వస్తున్న బెంజి కారు అదుపు తప్పి పల్టీలు కొట్టినట్లు తెలుస్తోంది. కారు నెంబర్‌కు ప్రకారం అడ్వెంచరస్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద రిజిష్టరై ఉన్నట్లు ఎంఆర్టీహెచ్/ఎన్ఐసీ వివరాల్లో ఉంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. -
ఆటోలో చెలరేగిన మంటలు
-
ఖైరతాబాద్ ఫ్లైఓవర్‌పై కారు బోల్తా
హైదరాబాద్: నగరంలోని ఖైరతాబాద్ ఫ్లైఓవర్‌పై శుక్రవారం రాత్రి అదపుతప్పి ఓ కారు బోల్తా పడింది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో కారులోని ఎయిర్‌బ్యాగ్స్ ఓపెన్ కావడంతో.. ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇది గుర్తించిన పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఎయిర్‌బ్యాగ్స్ ఓపెన్ కావడం వల్లే ప్రాణాపాయం తప్పిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో నలుగురు ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
మధ్యాహ్నంలోపే మహాగణపతి నిమజ్జనం
-
ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర ప్రారంభం
-
మహా గణపతి నేత్ర దర్శనం
ఖైరతాబాద్: శ్రీ శక్తిపీఠ శివనాగేంద్ర మహా గణపతి రూపంలో దర్శనమివ్వనున్న ఖైరతాబాద్ మహాగణపతికి శుక్రవారం సాయంత్రం 4.40 గంటలకు శిల్పి రాజేంద్రన్ కంటి పాపను దిద్దారు. విఠల శర్మ సిద్ధాంతి నిర్ణయించిన ముహూర్తం మేరకు మహా గణపతికి దిష్టితీసి, కొబ్బరి కాయలు కొట్టి కంటి పాపను తీర్చిదిద్దారు. 58 అడుగుల ఎత్తులో మహాగణపతి అద్భుత రూపంలో భక్తులకు దర్శనమిస్తారని శిల్పి తెలిపారు. ఇప్పటికే రంగులు వేసే కార్యక్రమం దాదాపు పూర్తయిందని... శనివారం కర్రలు విప్పుతామని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్ తెలిపారు. -
మహాగణపతి పూజకు మొదటి ఆహ్వానం
ఖైరతాబాద్: ఖైరతాబాద్ మహాగణపతి తొలి పూజకు గవర్నర్ దంపతులను ఆహ్వానిస్తూ గురువారం ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్‌లు ఆహ్వాన పత్రికను అందజేశారు. వినాయక చవితి సందర్భంగా 5వ తేదీ ఉదయం 9.30 గంటలకు గవర్నర్ దంపతులు మహాగణపతికి తొలి పూజ నిర్వహించేందుకు ఆహ్వానించినట్లు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్ తెలిపారు. ముఖ్యమంత్రిని కేసీఆర్‌నూ ఆహ్వానిస్తామని తెలిపారు. రాష్ట్ర మంత్రులందరికీ ఆహ్వాన పత్రికలను అందజేస్తున్నట్లు తెలిపారు. గవర్నర్‌ను కలిసిన వారిలో ఎన్.ప్రేమ్‌రాజ్, నగేష్, వంశీ తదితరులు ఉన్నారు. -
దేవదేవుడికి రంగులు
ఖైరతాబాద్: ఖైరతాబాద్ మహాగణపతి తయారీ పనులు దాదాపు పూర్తయ్యాయి. రంగులు వేసే పనులకు మంగళవారం శ్రీకారం చుట్టినట్లు శిల్పి రాజేంద్రన్ తెలిపారు. కాకినాడకు చెందిన సత్య ఆర్ట్స్ భీమేశ్ ఆధ్వర్యంలో 15 మంది బృందం దేవదేవుడికి రంగులు అద్దనుంది. 300 లీటర్ల రంగులను మహాగణపతికి ఉపయోగిస్తున్నట్లు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్ చెప్పారు. -
ప్రాణాలు పోయినా మారరా?
ఖైరతాబాద్: ప్రభుత్వ పెద్దల మాటలు నీటి మూటలవుతున్నాయి. నిబంధనలు మురుగులో కొట్టుకుపోతున్నాయి. కార్మికుల ప్రాణాలు గాలిలో దీపాలవుతున్నాయి. ఇటీవల నగరంలో మ్యాన్‌హోల్‌లో దిగి... కార్మికులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ దుర్ఘటన నేపథ్యంలో 15 అడుగుల లోతు ఉన్న మ్యాన్‌హోల్స్‌ను యంత్రంతోనే శుభ్రం చేయాలని ప్రభుత్వ పెద్దలు స్పష్టం చేశారు. అధికారులూ ఆచరిస్తున్నట్టు చెబుతున్నారు. కానీ వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంటోంది. మంగళవారం ఖైరతాబాద్ డివిజన్లో కాంట్రాక్టర్ మరోసారి మ్యాన్‌హోల్‌ను సిబ్బందితో శుభ్రం చేయించారు. యంత్రం మాట పక్కన పెట్టేశారు. -
నగరంలో అజహరుద్దీన్
సాక్షి, సిటీబ్యూరో: మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ గురువారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ కోసం వచ్చిన ఆయనను జేటీసీ రఘునాథ్ సాదరంగా ఆహ్వానించారు. నిబంధనలకు అనుగుణంగా అధికారులు వేలిముద్ర, ఫొటో, డిజిటల్ సంతకం తీసుకొని ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్‌ను అందజేశారు. జేటీసీతో పాటు ఆర్టీఓలు జీపీఎన్ ప్రసాద్, లక్ష్మి తదితరులు ఉన్నారు. -
పేరు వెనుక కథ..
నగర వాసులు రోజూ ఎన్నో ఏరియాలుచుట్టేస్తుంటారు. సంవత్సరాలుగా ఆ ప్రాంతాల్లో ఉంటున్నా.. దానికి ఆ పేరెలా వచ్చిందో తెలియదు. తెలుసుకోవాలనిపించినా చరిత్ర తిరగేసే అవకాశం, ఓపిక ఉండదు. జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ నగరంలోని కొన్ని ముఖ్య ప్రాంతాల ‘పేరు వెనుక కథ’ తెలుసుకుందాం. - సాక్షి, సిటీబ్యూరో ఖైరతాబాద్ రాకుమారి ‘ఖైరియాటున్నిసా’ పేరు మీదుగా ఖైరతాబాద్ వచ్చింది. ఆమె ఇబ్రహీం కులీ కుతుబ్ షా (1518-80) కుమార్తె. ఖైరియా తరచూ అనారోగ్యంతో ఇబ్బంది పడేది. దీంతో ఆహ్లాదకర వాతావరణంలో ఉంచితే నయమవుతుందని వైద్యులు సూచించారట. దీంతో కుతుబ్‌షా అల్లుడు, ఇంజినీర్ అయిన హజ్రత్ హుస్సేన్ షా వలిని రాకుమారి కోసం ప్యాలెస్, మసీదు, గార్డెన్, చెరువు నిర్మించమని సూచించాడు. సుల్తాన్ ఆజ్ఞ మేరకు ‘హుస్సేన్‌సాగర్’ తవ్వించాడు వలి. రాజకుమారి పేరుమీదుగా కాలక్రమంలో ‘ఖైరతాబాద్’గా ఈ ప్రాంతానికి పేరు స్థిరపడింది. సుల్తాన్‌బజార్ నిజాం హయాంలో ఇది ప్రముఖ వాణిజ్య కేంద్రం. 1933 వరకూ ఈ ప్రాంతం బ్రిటిష్ రెసిడెన్సీ పరిధిలో ఉండేది. జూన్ 14, 1933లో దీన్ని నిజాంకు అప్పగించారు. మొదట్లో రెసిడెన్సీ బజారని పిలిచినా.. నిజాం ఆదేశాల మేరకు సుల్తాన్ బజార్‌గా మార్చారు. అప్పట్లో ఇక్కడ ఎక్కువశాతం మరాఠీలు ఉండేవారు. సోమాజిగూడ ‘సోనాజీ’ అనే పండిట్ పేరు నుంచి సోమాజిగూడ పేరు వచ్చింది. 1853 ప్రాంతంలో సోనాజీ.. నిజాం రెవిన్యూ విభాగంలో పనిచేసేవాడు. ఆయన నివసించిన భవంతి ఆ కాలంలో ఎంతో పేరుపొందింది. ఆయన మరణం తర్వాత ఆ ప్రాంతాన్ని సోనాజీగా పిలిచేశారు. కాలక్రమంలో సోమాజీగా మారింది. బషీర్‌బాగ్.. పాయిగా నవాబు అస్మన్జా బషీరుద్దౌలా బహదూర్. ఈ ప్రాంతంలో కళ్లుచెదిరే ప్యాలెస్, పార్కును కట్టించాడు. ఈ రాజభవనం చరిత్రలో కనుమరుగైనా.. పాయిగా ప్రభువు ‘బషీరుద్దౌలా’ పేరు మాత్రం ‘బషీర్‌బాగ్’గా నిలిచిపోయింది. తార్నాక.. నిజాంల హయాంలో ఈ ప్రాంతం మామిడి తోటలతో ఉండేది. వీటి రక్షణకు ముళ్లకంచె వేసి కాపలా కోసం, పహారా కాసేందుకు నిజాంలు కొందరిని నియమించారు. భద్రతా సిబ్బంది కోసం అవుట్‌హౌస్ సైతం కట్టించారు. ఉర్దూలో ‘తార్’ అంటే ‘వైరు’ అని, ‘నాకా’ అంటే ‘రక్షకభటుడి గది’ అని అర్థం. అలా తార్నాక పేరు స్థిరపడింది. -
ఖైరతబాద్‌లో రైల్వే గేట్ సమస్య
-
మక్తాలో పోలీసుల కార్డన్ సెర్చ్
-
ఆర్టీఏ కార్యాలయంలో వెంకీ
ప్రముఖ సినీనటుడు వెంకటేష్ సోమవారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. డ్రైవింగ్ లెసైన్సు రెన్యువల్ కోసం రావడంతో హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ రఘునాథ్, ఆర్టీఓలు దశరథం, జీపీఎన్ ప్రసాద్‌లు సాదరంగా ఆహ్వానించి డ్రైవింగ్ లెసైన్స్ రెన్యువల్ ప్రక్రియను పూర్తి చేశారు. - సాక్షి,సిటీబ్యూరో -
సదరోత్సాహం..
-
ఖైరతాబాద్-పంజాగుట్ట: బస్సుల మళ్లింపు
హైదరాబాద్: మెట్రోరైలు నిర్మాణ పనుల దృష్ట్యా పంజాగుట్ట - ఖైరతాబాద్ మార్గంలో ఆర్టీసీ బస్సులను దారి మళ్లించనున్నారు. ఈ మేరకు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఈడీ పురుషోత్తమ్ నాయక్ సోమవారం వివరాలను వెల్లడించారు. ఖైరతాబాద్ నుంచి పంజాగుట్ట వైపు వెళ్లే కొన్ని బస్సులను రాజ్‌భవన్, యశోద హాస్పిటల్, సోమాజీగూడ క్రాస్‌రోడ్స్, పంజాగుట్ట క్రాస్‌రోడ్స్ మీదుగా అమీర్‌పేట వైపు మళ్లిస్తారు. మరికొన్ని బస్సులను ఖైరతాబాద్, ఆర్టీఏ కార్యాలయం, తాజ్‌బంజారా, జీవీకే మాల్, నిమ్స్ వెనుక గేట్, నాగార్జున సర్కిల్, పంజాగుట్ట క్రాస్‌రోడ్స్ మీదుగా అమీర్‌పేట వైపు మళ్లించనున్నట్టు తెలిపారు. ఈ నెల 20వ తేదీ నుంచి 25 వరకు ఈ మార్పులు అమల్లో ఉంటాయని.. ప్రయాణీకులు సహకరించాలని కోరారు. -
మహా పోటీ
-
ఖైరతాబాద్‌లో తొక్కిసలాట : భక్తులకు గాయాలు
హైదరాబాద్ : ఖైరతాబాద్ మహాగణపతి లడ్డూ ప్రసాదం పంపిణీ సందర్భంగా శుక్రవారం భక్తుల మధ్య తోపులాట జరిగింది. దీంతో పలువురు భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. 11 రోజుల పాటు ఖైరతాబాద్ మహాగణపతి చేతిలో విశేష పూజలందుకున్న మహాలడ్డూ ప్రసాదాన్ని ఈ నెల 30న పంపిణీ చేయాల్సి ఉంది. కానీ పోలీస్ బందోబస్తుకు వీలు కాకపోవడంతో ఆక్టోబర్ 2వ తేదీ పంపిణీ చేస్తామని నిర్వాహకులు ప్రకటించారు. దీంతో ప్రసాదం కోసం భక్తులు శుక్రవారం అధిక సంఖ్యలో ఖైరతాబాద్ తరలివచ్చారు. మింట్ కాంపౌండ్‌వైపు ఉన్న మహిళా క్యూ లైన్, రైల్వేగేటు వైపు ఉన్న పురుషుల క్యూలైన్ బారీగా జనంతో నిండిపోయారు. ఉదయం 7 గంటలకు లడ్డూ దాత, సురుచీఫుడ్స్ నిర్వాహకుడు మల్లిబాబు పూజలు చేశారు. ఆ తరువాత ఆనవాయితీ ప్రకారం మల్లిబాబుకు లడ్డూలో 50 శాతం ఇచ్చేందుకు ప్రయత్నిస్తుండగా స్థానిక నాయకులు అడ్డుకున్నారు. 50 శాతం ఇచ్చేది లేదని ఖరాఖండిగా చెప్పారు. దీంతో మల్లిబాబుకు స్థానిక నాయకుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకొని మల్లిబాబుకు 15 శాతం లడ్డూను ఇచ్చి పంపించేశారు. అనంతరం భక్తులకు ప్రసాద పంపిణీ ప్రారంభమైంది. ప్రసాదం కోసం ఒక్కసారిగా అందరూ ముందుకు తోసుకురావడంతో తోపులాట జరిగింది. దీంతో స్థానిక బీజేపీ నాయకుడికి తలకు తీవ్రగాయమైంది. మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. భక్తుల రద్దీ పెరుగుతుండటంతో అదుపు చేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్‌రెడ్డితో పాటు పలువురు పోలీసులు రంగప్రవేశం చేశారు. ప్రసాద పంపిణీని నిలిపివేశారు. ప్రసాద పంపిణీ పూర్తయిందని మెగాఫోన్‌లో ప్రకటించారు. భద్రత నడుమ మిగిలిన లడ్డూను వాహనంలో తరలించారు. -
తెల్లవారుజామున ఖైరతాబాద్ గణపతి శోభాయాత్ర
-
ఆలస్యం కానున్న ఖైరతాబాద్ గణపతి శోభాయాత్ర
-
మరికాసేపట్లో ఖైరతాబాద్ గణపతి శోభాయాత్ర
-
ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి పోటెత్తిన భక్తులు
-
మహా సన్నాహం
ఖైరతాబాద్‌లోని మహాగణపతి దర్శనానికి భక్తులు పోటెత్తారు. శుక్రవారం ఒక్క రోజే సుమారు 3 లక్షల మంది దర్శించుకున్నారు. గణనాథుడి నిమజ్జన వేడుకలకు భాగ్యనగరం సిద్ధమవుతోంది. ఆదివారం నిర్వహించనున్న వినాయకుని శోభాయాత్రలో అన్ని ప్రభుత్వ విభాగాలు పాలు పంచుకుంటున్నాయి. హుస్సేన్ సాగర్‌తో పాటు నగరంలోని వివిధ పెద్ద చెరువుల్లో చిన్నవి, పెద్దవి కలిపి సుమారు లక్ష విగ్రహాలు నిమజ్జనం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రూ.10 కోట్లు కేటాయించారు. వేడుకలు తిలకించేందుకు వెళ్లే వారి కోసం గ్రేటర్ ఆర్టీసీ 400 ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఆదివారం ఉదయం 6 నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు వివిధ ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నారు. భారీ వాహనాలు నగరంలోకి ప్రవేశించకుండా నిరోధిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. సిటీబ్యూరో: మహానగరంలో అంగరంగ వైభవంగా జరిగే గణనాథుడి నిమజ్జన వేడుకలకు భాగ్యనగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఆదివారం జరిగే గణేష్ శోభాయాత్రకు అన్ని ప్రభుత్వ విభాగాలు ఏర్పాట్లు పూర్తిచేశాయి. జీహెచ్ఎంసీ, పోలీసు, పీసీబీ, జలమండలి, ఆర్టీసీ, రవాణా, వైద్య ఆరోగ్యశాఖ, రెవెన్యూ శాఖలు ఏర్పాట్లలో ఎక్కడా ఆటంకం తలెత్తకుండా సన్నాహాలు చేశాయి. కాగా ఈసారి హుస్సేన్‌సాగర్‌తోపాటు నగరం నలుమూలల ఉన్న 24 చెరువుల్లో సుమారు లక్ష వరకు భారీ,చిన్న గణేష్ ప్రతిమలు నిమజ్జనం జరిగే అవకాశాలున్నట్లు పీసీబీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆయా విభాగాల ఆధ్వర్యంలో పూర్తిచేసిన ఏర్పాట్లు ఇలా ఉన్నాయి. పీసీబీ... హైకోర్టు ఆదేశాల ప్రకారం హుస్సేన్‌సాగర్‌తో పాటు నిమజ్జనం జరిగే మరో పది పెద్ద చెరువుల్లో కాలుష్య మోతాదును అంచనా వేసేందుకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నడుం బిగించింది. ఆయా జలాశయాల్లో నిమజ్జనానికి ముందు, నిమజ్జనం జరిగిన రోజులు, నిమజ్జనం తర్వాత నీటిలో పెరిగే కాలుష్య ఆనవాళ్లను వేర్వేరుగా లెక్కించాలని నిర్ణయించింది. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి నిమజ్జనానికి వచ్చే భక్తుల కోసం గ్రేటర్ ఆర్టీసీ 400 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటీవ్ డెరైక్టర్ ఎ.పురుషోత్తమ్ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. బషీర్‌బాగ్-కాచిగూడ, బషీర్‌బాగ్-రాంనగర్, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్ట్-దిల్‌షుఖ్‌నగర్, వనస్థలిపురం, మిధాని తదితర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడుపుతారు. ఉప్పల్, సికింద్రాబాద్, రిసాలాబజార్, ఈసీఐఎల్, మల్కాజిగిరి, జామై ఉస్మానియా స్టేషన్ల నుంచి ఇందిరాపార్కు వరకు బస్సులు అందుబాటులో ఉంటాయి. బీహెచ్ఈఎల్, కొండాపూర్, రాజేంద్రనగర్,టోలిచౌకి,జీడిమెట్ల,జగద్గిరిగుట్ట,గాజుల రామారం, బోరబండ, కూకట్‌పల్లిహౌసింగ్‌బోర్డు, లింగంపల్లి, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల నుంచి లక్డికాఫూల్/ఖైరతాబాద్ వరకు, కోఠి నుంచి ఆల్ ఇండియా రేడియో వరకు బస్సులు నడుపుతారు. అదేవిధంగా బస్సులను సమర్ధవంతంగా నడిపేందుకు అన్ని చోట్ల డిపోమేనేజర్లు, డీవీఎంలు, సూపర్వైజర్లు, మెకానిక్‌లు విధులు నిర్వహిస్తారు. భారీ గణనాథుల తరలింపునకు 5000లకు పైగా వాహనాలు... వినాయక నిమజ్జనం కోసం రవాణా శాఖ 5000లకు పైగా వాహనాలను సిద్ధం చేసింది. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి డిమాండ్‌కు అనుగుణంగా లారీలు, ట్రేలర్లు అందజేయనున్నట్లు హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ టి.రఘునాథ్ చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని ఆర్టీఏ కార్యాలయాల వద్ద సంబంధిత అధికారుల నుంచి భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రతినిధులు వాహనాలను పొందవచ్చన్నారు. మరోవైపు హయత్‌నగర్, ఆరాంఘర్, పటాన్‌చెరులలో మరిన్ని వాహనాలను సేకరించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఇందు కోసం వంద మంది ఎంవీఐలు పని చేస్తున్నారని తెలిపారు. వాహనాల అద్దెలు.... ట్రేలర్లకు రూ.18,700, భారీ వాహనాలకు రూ.3,630, ఆరు టైర్ల లారీలకు రూ.2,200 చొప్పున, డీసీఎం స్థాయి వాహనాలకు రూ.1430,లైట్‌గూడ్స్ వెహికిల్స్‌కు రూ.1210, టాటా ఏస్‌లకు రూ.820 చొప్పున అద్దె నిర్ణయించినట్లు తెలిపారు. డ్రైవర్, క్లీనర్లకు బత్తా అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. -
అదిగో గగనరూపుడు