Oxygen
-
అనంత దూరంలోని... ఆ గెలాక్సీలో ఆక్సిజన్!
అనంతమైన విశ్వంలో మన భూమిపై తప్ప ఇంకెక్కడా ప్రాణవాయువు(ఆక్సిజన్) ఉండకపోవచ్చని శాస్త్రజు్ఞలు ఇప్పటిదాకా భావించేవారు. కానీ మనకు అత్యంత సుదూరంలో ఉన్న ఒక నక్షత్ర మండలం (గెలాక్సీ)లో ఆక్సిజన్ ఆనవాళ్లను గుర్తించారు. అంతేగాక భారీ లోహాల జాడను సైతం కనిపెట్టారు. ఈ గెలాక్సీ భూమి నుంచి ఏకంగా 1,340 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది! విశ్వం ఏర్పడిన తొలినాళ్లలోనే ఇది ఏర్పడి ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. విశ్వం పుట్టుకకు కారణమైన బిగ్‌బ్యాంగ్ 1,380 కోట్ల ఏళ్ల క్రితం సంభవించిందన్న వాదనలు ఇప్పటికే ఉన్నాయి. ఈ నక్షత్ర మండలానికి జేడ్స్–జీఎస్–జెడ్14–0 అని నామకరణం చేశారు. నిజానికి దీన్ని 2024 జనవరిలోనే ప్రాథమికంగా గుర్తించారు. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఈ గెలాక్సీ ఉనికిని వెలుగులోకి తెచ్చింది. కాకపోతే దానిపై ప్రాణవాయువు ఉన్నట్లు కనిపెట్టడం కీలక పరిణామమని సైంటిస్టులు చెబుతున్నారు. ఆ ఆక్సిజన్ ఏ రూపంలో, ఎంత పరిమాణంలో ఉందన్నది తేల్చడానికి పరిశోధనలు కొనసాగిస్తున్నారు. పరిమాణంలో అత్యంత భారీగా ఉన్న ఈ నక్షత్ర మండలం కాంతివంతమైనది కూడా. మన భూగోళమున్న గెలాక్సీకి సమీపంలో ఇప్పటిదాకా మరో 700 గెలాక్సీలను జేమ్స్ వెబ్ టెలిస్కోప్ గుర్తించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మిలియనీర్ బ్రయాన్ జాన్సన్ యాంటీ ఏజింగ్ పాట్లు..! ఈసారి ఏకంగా..
మిలియనీర్ బ్రయాన్ జాన్స(Bryan Johnson)న్ యాంటీ ఏజింగ్ ప్రయోగాలతో వార్తల్లో నిలిచారు. అందుకోసం కోట్లక్దొదీ డబ్బుని ఖర్చు చేస్తున్న వ్యక్తిగా అందరి దృష్టిని ఆకర్షించారు. అతడు ఆ ప్రయోగాల్లో సక్సెస్ అందుకుంటాడో లేదా గానీ బ్రయాన్ తనపై చేసుకునే ప్రయోగాలు ఊహకందని విధంగా భయానకంగా ఉంటాయి. ఇంతకుముందు ప్లాస్మా, తన కొడుకు రక్తం ఎక్కించుకోవడం వంటి వాటితో హడలెత్తించాడు. ఇప్పుడు స్వచ్ఛమైన ఆక్సిజన్‌తో ఆరోగ్యం తోపాటు వృద్ధాప్యాన్ని తిప్పికొట్టేలా ఏకంగా తన కార్యాలయాన్నే హైపర్బారిక్ ఆక్సిజన్ చాంబర్(Hyperbaric oxygen chamber)గా మార్చేశారు. అసలేంటిదీ అంటే..?మిలియనీర్ బ్రయాన్ జాన్సన తన కార్యాలయాన్ని హైపర్బారిక్ ఆక్సిజన్ చాంబర్లోకి మార్చిన తాజా వీడియోని నెట్టింట షేర్ చేశారు. ఈ వీడియోలో బ్రయాన్ తన నోరు, ముక్కుకి ఆక్సిజన్ మాస్క్ ధరించి కంప్యూటర్‌పై పనిచేస్తున్నట్లు కనిపిస్తుంది. చూడటానికి ఆయన ఒక ఆక్సిజన్ చాంబర్ లోపల బంధించబడినట్లుగా ఆ వీడియోలో కనబడుతుంది. మరో ట్వీట్లో బ్రయాన్ ఆ హైపర్బారిక్ ఆక్సిజన్ థెరపీ (HBOT) అంటే ఏంటో సవిరంగా వివరించారు. ఆ ట్వీట్లో హెచ్‌బీఓటీ( HBOT ) అనేది ఒత్తిడితో కూడిన గదిలో స్వచ్ఛమైన ఆక్సిజన్ని పీల్చుకునే వైద్య చికిత్స అట. ఈ థెరపీ ప్రకారం ఒత్తిడితో కూడిన గదిలో ఊపిరితిత్తులు ఆక్సిజన్ని గ్రహించే సార్థ్యాన్ని పెంచుతుందట. ఫలితంగా శరీరమంత ఆక్సిజన్ స్థాయిలు పెరుగుతాయట. ఈ చికిత్సలో కణజాలాల్లో ఆక్సిజన్ సాంద్రత పెంచడం, సెల్యులార్, వాస్కులరైజేషన్లకి మద్దతు ఇచ్చి, పునరుజ్జీవనాన్ని ప్రోత్సహించడమే లక్ష్యం అని ట్వీట్లో బ్రయాన్ రాసుకొచ్చారు. అయితే నెటిజన్లల్లో ఈ థెరపీపై ఒక ఉత్సుకత తోపాటు అనేక రకాల సందేహాలను లేవెనెత్తింది. ఎందుకంటే అగ్నిప్రమాదం సంభవించే అవకాశం ఉన్నందున ఈ హైపర్బారిక్ చాంబర్లలో ఎలక్ట్రానిక్స్(కంప్యూటర్) అనుమతించే అవకాశం లేదనే సందేహం వెలిబుచ్చగా, మరొకరు వాస్తవాన్ని స్వీకరించి ఆనందంగా బతకడం బెటర్ కదా బ్రో అని మరోకరు సెటైర్లు వేస్తూ పోస్టులు పెట్టారు. నిజానికి బ్రయాన్ ఈ ప్రయోగాల్లో ఎంతవరకు సఫలం అవుతాడో లేదో తెలియదు గానీ..ఒకరకంగా హాయిగా అందిరిలా జీవించే స్వేచ్ఛయుత జీవనాన్ని కోల్పుతున్నాడనేది జగమేరిగిన సత్యం కదూ..!.Moved my office into my hyperbaric oxygen chamber. pic.twitter.com/8TXfpPpICh— Bryan Johnson /dd (@bryan_johnson) February 21, 2025 (చదవండి: పుష్ప 2, ఛావా.. ఈ బ్లాక్‌బస్టర్ విజయాల్లో 'ఆమె'ది కీలక పాత్ర!) -
ఆక్సిజన్ ఛాంబరే అతని ఆఫీస్
వృద్ధాప్య ఛాయలను దరిచేరనీయకుండా నిత్యం యవ్వన కాంతులీనడమే ధ్యేయంగా ప్రతి ఏటా కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్న అమెరికన్ వ్యాపారవేత్త, అత్యంత సంపన్నుడు బ్రియాన్ జాన్సన్ మరో వినూత్న నిర్ణయం తీసుకున్నారు. కలుషిత గాలికి బదులు స్వచ్ఛమైన ఆక్సిజన్ ఎక్కువ మోతాదులో లభ్యమయ్యే ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఆక్సిజన్ ఛాంబర్‌నే తన కార్యస్థలిగా మార్చుకున్నారు.ఆక్సిజన్ సరఫరా ట్యూబ్‌లు పెట్టుకుని డెస్క్ టాప్‌పై పనిచేస్తున్న వీడియోను తాజాగా ‘ఎక్స్’ఖాతాలో షేర్చేశారు. ‘‘హైపర్బారిక్ ఆక్సీజన్ ఛాంబర్లోకి ఆఫీస్‌కు తీసుకొచ్చా’’అని ఆయన రాసుకొచ్చారు. హైపర్బారిక్ ఆక్సిజన్ థెరపీ(హెచ్‌బీఓటీ) తీసుకుంటున్నట్లు చెప్పారు. ‘‘ఊపిరితిత్తుల్లోకి తగు పీడనంతో ఆక్సిజన్ వెళితే అంతర్గత కణజాలం ఏదైనా అతిసూక్ష్మస్థాయి రిపేర్లు ఉంటే వేగంగా చేసుకుంటుంది. హెచ్‌బీఓటీ అనేది ప్రపంచంలోనే చర్మ సంబంధ అత్యంత అధునాతన థెరపీ. ఈ థెరపీతో చర్మంలోని కణజాలం సాంద్రత 12.8 శాతం పెరుగుతుంది. సాగి, మళ్లీ యథాస్థానానికి వచ్చే ఎలాస్టిక్ గుణం 144 శాతం మెరుగుపడుతుంది. చర్మంలో అతిసూక్ష్మ రక్తనాళాల సంఖ్య 40.9 శాతం పెరుగుతుంది. సీడీ31 అనే రక్తనాళం సామర్థ్యం 84.3 శాతం మెరుగవుతుంది. కణక్షీణత 21 శాతం తగ్గుతుంది’’అని బ్రియాన్ చెప్పుకొచ్చారు. సముద్రజలాల్లో 33 అడుగుల లోతులో ఉన్నప్పుడు ఎంత పీడనం అయితే ఉంటుందో అంతే పీడనంతో గాలిని ఈ ఛాంబర్లో పీల్చే వెసులుబాటు ఉంది. ఈ ఛాంబర్లో 95 నుంచి 100 శాతం స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను పీలుస్తా’’అని చెప్పారు. పీడనంతో అంతా సమతుల్యం ‘‘సరైన పీడనంతో ఆక్సిజన్ ఊపిరితిత్తుల్లోకి చేరితే అక్కడి నుంచి అన్ని శరీరభాగాలకు ఖచ్చితమైన సమయానికి ఆక్సీజన్ అందుతుంది. దీంతో అన్ని అవయవాల్లో ఆక్సిజన్ స్థాయిలు సవ్యంగా ఉంటాయి. కణజాలాల్లో ఆక్సీజన్ లభ్యత పెరిగి శరీరం ఏదైనా గాయాలు, రిపేర్లు ఉంటే ఆ పనిని త్వరగా పూర్తిచేస్తుంది. అతిసూక్ష్మ రక్తనాళాలు పాతబడిపోతే వాటి స్థానంలో కొత్త రక్తనాళాలు త్వరగా పుట్టుకొస్తాయి’’అని బ్రియాన్ చెప్పారు.వయసు తగ్గింపు చర్యలపై స్పందించిన నెటిజన్లు 18 ఏళ్ల యువకుడిలా కనిపించేందుకు బ్రియాన్ పడుతున్న తాపత్రయాన్ని చూసి మెచ్చుకునే వాళ్లతోపాటు విమర్శించే వాళ్లూ పెరిగారు. ‘‘వాహనాలు, ఇతర కాలుష్య ఉద్గారాలతో కలుషితమైన గాలితో పోలిస్తే ఇలాంటి ఆక్సిజన్ చాంబర్లో కూర్చుని కాస్తంత స్వచ్ఛమైన గాలి పీల్చడం బాగానే ఉందిగానీ ఇది ఏమంత సురక్షితం కాదు. ఆక్సిజన్ అగ్నిని మరింత రాజేస్తుంది. పూర్తిగా ఎలక్ట్రికల్, ఎల్రక్టానిక్ వైర్లమయమైన ఛాంబర్లో పొరపాటున ఒక్క నిప్పురవ్వ అంటుకున్నా మీకే ప్రమాదం. పైగా వేగంగా వేడెక్కే కంప్యూటర్ వాడుతున్నారు’’అని ఒక నెటిజన్ హెచ్చరించారు. హాలీవుడ్ సినిమా మ్యాడ్మ్యాక్స్లో మృత్యుంజయునిగా ఉండేందుకు తాపత్రయపడే ‘ఇమ్మోరా్టన్ జోయ్’పాత్రధారి వేషంలో బ్రియాన్ భలేగా ఉన్నాడని మరో నెటిజన్ వ్యంగ్య పోస్ట్‌చేశారు. దీనిని నటుడు కీస్ బైర్న్ ఫొటోను జతచేశారు. ‘‘చిన్నతనంలో కార్టూన్ సినిమాలో చూసిన క్యాప్సూల్ లాగా ఈయన గారి ఛాంబర్ ఉంది’’అని ఇంకొకరు వెటకారంగా పోస్ట్‌చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆ చల్లని సముద్రగర్భంలో... ఆక్సిజన్ పుడుతోంది!!
భూమిపై జీవజాలం,(Biome)మనుగడకు (oxygen)ఆక్సిజన్ ప్రాణావసరం. అది తయారవాలంటే వెలుతురు, సూర్యకాంతి తప్పనిసరి. సూర్యకిరణాలతో కిరణజన్య సంయోగ క్రియ ఫలితంగా మొక్కల్లో ఆక్సిజన్ తయారవుతుందని చిన్నప్పుడే చదువుకున్నాం. అలాంటిది, సముద్రగర్భంలో కొన్ని కిలోమీటర్ల లోతులో కటిక చీకటితో కూడిన ప్రదేశాల్లోనూ తొలిసారిగా ఆక్సిజన్ జాడను కనుగొన్నట్టు శాస్త్రవేత్తలు ప్రకటించడం సంచలనంగా మారింది! అక్కడ కాంతితో పని లేకుండానే ఆక్సిజన్ తయారవుతుందని తొలిసారిగా గుర్తించారు. అది కూడా కఠిన శిలల నుంచి ఉద్భవిస్తుండటం శాస్త్రవేత్తలనే అబ్బురపరుస్తోంది. ఇదెలా సాధ్యమవుతోందో తెలుసుకునేందుకు మరింత లోతైన అధ్యయనానికి వాళ్లు నడుం బిగించారు. అనంత విశ్వంలో కాంతిమయ పదార్థం కంటే చీకటిమయమైన డార్క్మ్యాటరే ఎక్కువన్నది తెలిసిందే. ఈ నేపథ్యంలో డార్క్మ్యాటర్లో కూడా ఆక్సిజన్ ఉనికి ఉందని, జీవం మనుగడ సాగిస్తోందని ఎంతోకాలంగా సాగుతున్న వాదనలకు కొత్త బలం చేకూరింది. ఎక్కడ కనిపెట్టారు? బంగాళాదుంపల పరిమాణంలోని ముద్దల్లాంటి శిలల నుంచి స్వల్ప పరిమాణంలో ఆక్సిజన్ తయారవడాన్ని పరిశోధనలో గుర్తించారు. పసిఫిక్ మహాసముద్రంలో క్లారియన్–క్లిప్పర్టన్ జోన్ (సీసీజెడ్)లో 13,100 అడుగుల లోతులో సముద్రగర్భంలో వీటిని గుర్తించారు. ఈ శిలలు ఎలక్ట్రాలసిస్ ప్రక్రియ ద్వారా సముద్ర జలాన్ని ఆక్సిజన్, హైడ్రోజన్‌గా విడగొడుతున్నాయి. కిరణజన్యసంయోగ క్రియ ద్వారా మాత్రమే ఆక్సిజన్ తయారవుతుందన్న సిద్ధాంతాన్ని ఇది పటాపంచలు చేసిందని స్కాటిష్ అసోసియేషన్ ప్రొఫెసర్ ఆండ్రూ స్వీట్మ్యాన్ చెప్పారు. ఇదెలా సాధ్యమవుతోందన్నది తేల్చేందుకు మూడేళ్ల సుదీర్ఘ ప్రాజెక్టుకు తెర తీస్తున్నట్టు ప్రకటించారు. ఇందుకోసం ఏకంగా 36,089 అడుగుల లోతు దాకా తవ్వే రిగ్గులతో రంగంలోకి దిగుతున్నారు! ‘‘ఈ ‘చీకటి ఆక్సిజన్’ కోసం జరిపే అధ్యయనంలో సమాధానాలు దొరికే కొద్దీ కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సీసీజెడ్ మాదిరే సముద్రగర్భంలో ఇతర చోట్లా ఇలా ఆక్సిజన్ తయారవుతోందేమో కనిపెడతాం’’ అని స్వీట్మ్యాన్ చెప్పారు. భూగర్భంలోనూ ఆక్సిజన్...? సముద్ర గర్భంలోని శిలల్లోనే గాక భూమి లోలోపలి పొరల్లోనూ ఆక్సిజన్ సమృద్ధిగా ఉన్నట్టు అమెరికాలో మసాచుసెట్స్‌లోని వుడ్స్ హోల్ మెరైన్ బయోలాజికల్ లేబోరేటరీ సూక్ష్మజీవుల శాస్త్రవేత్త ఎమీల్ రఫ్ ప్రకటించడం విశేషం. కెనడా ప్రియరీ భూముల్లోని అత్యంత లోతుల్లోనూ ఆక్సిజన్ ఉందని చెప్పారాయన. కాల్గరీ వర్సిటీకి చెందిన పలువురు ప్రొఫెసర్లు కూడా దీన్ని ధ్రువీకరించారు. ఈ ఆక్సిజన్ 40 వేల ఏళ్ల క్రితమే భూమి పొరల్లోకి చేరి ఉండాలని ఒక నివేదికలో పేర్కొన్నారు. సూక్షజీవులు కూడా ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తున్నట్టు గుర్తించారు. ‘‘కెనడా భూగర్భ శాంపిళ్లను ల్యాబ్‌లోని ఆక్సిజన్ పాడుచేసింది. అయినా కొత్తగా ఆక్సిజన్ పుట్టుకొచి్చంది. ఎక్కడి నుంచా అని చూస్తే ఆ నీటిలోని సూక్ష్మజీవులు కొత్తగా ఆక్సిజన్‌ను తయారు చేస్తున్నట్లు గుర్తించాం. అవి తన మనుగడ కావాల్సిన శక్తిని సమకూర్చుకోవడానికి ఒక నైట్రోజన్, రెండు ఆక్సిజన్ అణువులను రసాయనిక చర్యల ద్వారా అణుస్థాయి ఆక్సిజన్‌గా మారుస్తున్నాయి. భూగర్భ జలాల్లో ఆక్సిజన్‌పై ఆధారపడి బతికే సూక్ష్మజీవులకు అది ఈ పద్ధతిలోనే అందుతోందని రుజువైంది. మనం అసాధ్యమని అనుకున్నది సుసాధ్యమేనని ప్రకృతి నిరూపిస్తోంది’’ అని రఫ్ అన్నారు.మూడు కి.మీ. లోతులో ‘చీకటి ఆక్సిజన్’ జాడ కనిపెట్టేందుకు రఫ్ బృందం దక్షిణాఫ్రికాలో బంగారం, యురేనియం గనుల్లోకి వెళ్లింది. ఏకంగా 3 కి.మీ. లోతులో 120 కోట్ల ఏళ్ల నాటి శిలల్లో ఆక్సిజన్‌ను కనుగొన్నారు. రేడియోధారి్మక గుణమున్న యురేనియం అక్కడి నీటితో చర్య జరపడం వల్ల ఆక్సిజన్ తయారై ఉంటుందన్న అంచనాకొచ్చారు. నాసా ఆసక్తి కాంతితో నిమిత్తం లేకుండానే ఆక్సిజన్ ఉత్పత్తి సాధ్యమంటున్న తాజా పరిశోధనపై నాసా ఆసక్తి చూపుతోంది. చంద్రుని ఆవలివైపు కాంతి ప్రసారమే ఉండదు. అలాంటి చోట్ల ఈ ‘శిలాజ ఆక్సిజన్’ ద్వారా వ్యోమగాముల అవసరాలు తీర్చవచ్చని నాసా ఆశ పడుతోంది. మంచుతో కూడుకున్న శని, బృహస్పతి ఉపగ్రహాలు ఎన్సిలాడస్, యూరోపాలపై ఏ మేరకు పీడనం పెంచితే ఆక్సిజన్ ఉత్పత్తి చేయొచ్చా అని ఇప్పటినుంచే లెక్కలు వేస్తోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గరం రాజేష్ కొత్త ఆక్సిజన్ బార్
-
చంద్రుని దక్షిణ ధ్రువంపై నాసా గ్యాస్ పైప్‌లైన్!
చంద్రునిపై శాశ్వత మానవ ఆవాసం దిశగా ప్రయత్నాలను నాసా ముమ్మరం చేస్తోంది. ఇందుకు ఉద్దేశించిన ఆర్టెమిస్ ప్రోగ్రాంపై ఇప్పటికే భారీగా ఖర్చు చేసింది కూడా. అందులో భాగంగా దక్షిణ ధ్రువంపై ఆక్సిజన్ గ్యాస్ పైప్‌లైన్ ఏర్పాటు చేయాలని అమెరికా అంతరిక్ష సంస్థ తాజాగా తలపోస్తోంది. దీన్ని ల్యూనార్ సౌత్‌పోల్ ఆక్సిజన్ పైప్‌లైన్ (ఎల్–ఎస్పీఓపీ)గా పిలుస్తున్నారు. చంద్రుని ఉపరితలంపై ఆక్సిజన్ రవాణాకు సంబంధించిన రిస్కులను, ఖర్చులను భారీగా తగ్గించుకోవడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఎందుకంటే చంద్రుని ఉపరితలం మీది రాతి నిక్షేపాల నుంచి ఆక్సిజన్‌ను వెలికితీయాలని నాసా లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే నీటి అవసరాలను చంద్రునిపై అపారంగా పరుచుకున్న మంచుతో తీర్చుకోవాలని యోచిస్తోంది.ఎలా చేస్తారు?చంద్రునిపై ఆక్సిజన్‌ను కంప్రెస్డ్ గ్యాస్, లేదా ద్రవ రూపంలో ట్యాంకుల్లో బాట్లింగ్ చేయా లన్నది నాసా ప్రణాళిక. కాకపోతే వాటి రవాణా పెను సవాలుగా మారనుంది. ఆక్సిజన్‌ను దాని వెలికితీత ప్రాంతం నుంచి సుదూరంలో ఉండే మానవ ఆవాసాలకు తరలించేందుకు అత్యంత వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చని భావిస్తున్నారు. ఇందుకోసం తొలి దశలో కనీసం 5 కి.మీ. పొడవైన పైప్‌లైన్ నిర్మించాలన్నది ప్రాథమిక ప్రణాళిక. దీన్ని చంద్రునిపై అందుబాటులో ఉండే అల్యుమి నియం తది తరాల సాయంతోనే పూర్తి చేయాలని నాసా భావిస్తోంది.→ ఈ పనుల్లో పూర్తిగా రోబోలనే వాడనున్నారు.→ మరమ్మతుల వంటివాటిని కూడా రోబోలే చూసుకుంటాయి→ పైప్‌లైన్ ద్వారా ఆక్సిజన్ గంటకు రెండు కి.మీ. వేగంతో ప్రవహిస్తుంది→ ప్రాజెక్టు జీవితకాలం పదేళ్లని అంచనా – సాక్షి, నేషనల్ డెస్క్ -
మీకు తెలుసా? చెట్లు కూడా శ్వాస తీసుకుంటాయి
మనం శ్వాస తీసుకునే విధంగానే చెట్లు కూడా శ్వాస తీసుకుంటాయి. కానీ మనం ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేస్తే, చెట్లు కార్బన్ డయాక్సైడ్ను తీసుకుని ఆక్సిజన్ ను విడుదల చేస్తాయి. అయితే. ఒక చెట్టు ఎంత ఆక్సిజన్ విడుదల చేస్తుంది అంటే ఖచ్చితంగా చెప్పలేము. ఒక చెట్టు తన జీవితకాలంలో విడుదల చేసే ఆక్సిజన్ పరిమాణం చాలా కారకాలపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా వేర్వేరు రకాల చెట్లు వేర్వేరు పరిమాణాల్లో ఆక్సిజన్ ను విడుదల చేస్తాయి.ఒక చెట్టు వయసు పెరిగే కొద్దీ అది విడుదల చేసే ఆక్సిజన్ పరిమాణం కూడా పెరుగుతుంది. పెద్ద చెట్లు చిన్న చెట్ల కంటే ఎక్కువ ఆక్సిజన్ ను విడుదల చేస్తాయి. వెలుతురు, నీరు, మట్టి నాణ్యత వంటి పరిస్థితులు చెట్టు పెరుగుదలను ప్రభావితం చేస్తాయి. దీనివల్ల ఆక్సిజన్ ఉత్పత్తిపై ప్రభావం పడుతుంది.స్పష్టంగా చె΄్పాలంటే, 50 సంవత్సరాల వయసు ఉన్న ఒక మామిడి చెట్టు తన జీవితకాలంలో 81 టన్నుల కార్బన్ డయాక్సైడ్ను గ్రహిస్తుంది. 271 టన్నుల ఆక్సిజన్ ను విడుదల చేస్తుందని అంచనా. మనకు స్వచ్ఛమైన గాలి కావాలంటే చెట్లు ఎంత అవసరమో దీనిని బట్టి అర్థం అవుతోంది కదా... -
హైదరాబాద్ : ఎల్ బి నగర్ ఆక్సిజన్ పార్క్ (ఫొటోలు)
-
కోవిడ్ సమయంలో ‘ఊపిరి’పోశారు
సాక్షి, అమరావతి: కోవిడ్ నేపథ్యంలో రాష్ట్రంలో ఆక్సిజన్ పడకలను భారీగా పెంచినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2020 ఏప్రిల్ నాటికి రాష్ట్రంలో కేవలం 2,643 ఆక్సిజన్ పడకలు మాత్రమే ఉండగా అనంతరం నాలుగేళ్లలో అదనంగా 15,376 ఆక్సిజన్ పడకలను పెంచినట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి రాష్ట్రంలో ఆక్సిజన్ పడకల సంఖ్య 18,019కి చేరినట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడానికి చాలా వేగంగా ఆక్సిజన్ పడకలను పెంచడంతో పాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలందించడానికి పలు చర్యలను చేపట్టింది. ఆక్సిజన్ పడకల సంఖ్య దేశంలో ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో ఉంది. మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొన్నారు కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు తీసుకుందని నీతి ఆయోగ్ ప్రశంసించింది. వికసిత్ భారత్ నేపథ్యంలో వివిధ రాష్ట్రాలు అనుసరించిన ఉత్తమ ఆచరణలను నీతి ఆయోగ్ వెల్లడించింది. మార్చి 2020లో కోవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి అంటువ్యాధుల చట్టాన్ని అమలులోకి తెచ్చిన మొదటి రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. రాజకీయ నిబద్ధత, వివిధ ఏజెన్సీల మధ్య సమన్వయం, టెలిమెడిసిన్ వంటి డిజిటల్ సాంకేతిక సాధనాల వినియోగం, ఫ్రంట్‌లైన్ కార్మికులకు ముందస్తు శిక్షణ, అవగాహన కోసం కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ప్రచారాలు, నిఘాపై దృష్టి కేంద్రీకరించడం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో మరణాల రేటు తక్కువగా ఉందని నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. రాజకీయ నిబద్ధతతో పాటు అధికారులు, భాగస్వాముల మధ్య సమన్వయం, ముందస్తు స్క్రీనింగ్‌లు, నిఘా, ట్రేసింగ్, టెస్టింగ్, ఐసోలేటింగ్, డిజిటల్ పద్ధతులు ఏపీ ప్రభుత్వం అమలు చేసిందని పేర్కొంది. క్షేత్ర స్థాయి పరిస్థితిని పర్యవేక్షించడానికి జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయడం, ఫ్రంట్‌లైన్ ఆరోగ్య కార్యకర్తలను అవసరమైన సాధనాలతో సన్నద్ధం చేయడం, కమ్యూనిటీలతో నిమగ్నమవ్వడం, ప్రజల మానసిక, సామాజిక అవసరాలను పరిష్కరించడం, అవసరమైన ఆరోగ్య సేవల పంపిణీకి హామీ ఇవ్వడం ద్వారా కోవిడ్ వ్యాప్తిని అదుపులో ఉంచిందని నీతి ఆయోగ్ పేర్కొంది. దేశంలో అత్యధికంగా కోవిడ్ పరీక్షలను ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించినట్లు తెలిపింది. -
ఫహాద్ ఫాజిల్ హీరోగా రెండు తెలుగు సినిమాలు!
మలయాళ స్టార్ హీరోల్లో ఒకరైన ఫహాద్ ఫాజిల్ రెండు తెలుగు చిత్రాలకు పచ్చజెండా ఊపారు. వాటిలో ఒకటి ‘ఆక్సిజన్’ కాగా మరొకటి ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించిన ‘పుష్ప: ది రైజ్’ సినిమాలో ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్ పాత్ర ద్వారా ఫహాద్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ప్రస్తుతం ‘పుష్ప: ది రూల్’ లో నటిస్తున్న ఆయన హీరోగా రెండు తెలుగు చిత్రాల ప్రకటన వచ్చింది. మలయాళ హిట్ మూవీ ‘ప్రేమలు’ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేసి, హిట్ కొట్టిన కార్తికేయ (డైరెక్టర్ రాజమౌళి తనయుడు) ‘ఆక్సిజన్’, ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమాలతో నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఆర్కా మీడియా వర్క్స్‌పై ‘బాహుబలి’ వంటి సెన్సేషనల్ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత శోభు యార్లగడ్డతో కలిసి ఈ సినిమాలను నిర్మించనున్నట్లు కార్తికేయ ప్రకటించారు. ‘ఆక్సిజన్’ చిత్రంతో సిద్ధార్థ్ నాదెళ్ల, ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ మూవీతో శశాంక్ ఏలేటి దర్శకులుగా పరిచయమవుతున్నారు. ఈ రెండు సినిమాలకు ఎస్ఎస్ రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. -
Oxygen-28: కొత్త రకం ఆక్సిజన్‌ను గుర్తించిన శాస్త్రవేత్తలు
టోక్యో: భూగోళంపై ఉన్న కోట్లాది రకాల జీవులు బతకడానికి ప్రాణవాయువు(ఆక్సిజన్) అవసరం. అంతర్జాతీయ భౌతిక శాస్త్రవేత్తల బృందం ప్రకృతిలో కొత్త రకం ఆక్సిజన్‌ను గుర్తించింది. జపాన్‌లోని టోక్యో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన యొషుకే కొండో అనే అణు భౌతిక శాస్త్రవేత్త ఆధ్వర్యంలో భౌతిక శాస్త్రవేత్తల బృందం ‘ఆక్సిజన్–28’ అనే కొత్తరకం ప్రాణవాయువును గుర్తించింది. ఇది ఆక్సిజన్ పరమాణువుకు సంబంధించిన ఒక ఐసోటోప్ అని సైంటిస్టులు వెల్లడించారు. ఈ ఆక్సిజన్–28 ఐసోటోప్ 20 న్యూట్రాన్లు, ఎనిమిది ప్రోటాన్లను కలిగి ఉంటుందని సమాచారం. ఇప్పటిదాకా మనకు అందుబాటులో ఉన్న ఆక్సిజన్ రకాల్లో ఇది పరిమాణంలో భారీగా ఉన్నట్లు తేల్చారు. ఈ ఆక్సిజన్ ఐసోటోప్ కొంత తక్కువ స్థిరత్వాన్ని కలిగి ఉందని గమనించారు. ప్రకృతిలో ఇది అసాధారణమైన ఆక్సిజన్ అని శాస్త్రవేత్తలు అభివరి్ణస్తున్నారు. -
చంద్రుడిపై ఖనిజాలను గుర్తించిన చంద్రయాన్-3
బెంగుళూరు: చంద్రయాన్-3 ల్యాండర్ నుండి కిందికి దిగిన రోవర్ చంద్రుడి ఉపరితలంపై తిరుగాడుతూ పరిశోధనలు కొనసాగిస్తోంది. ఇదే క్రమంలో రోవర్ చంద్రుడిపై పలు ఖనిజాల జాడను కనుగొంది. ఈ విషయాన్ని ఇస్రో అధికారికంగా ధృవీకరించింది. శివ శక్తి పాయింట్ వద్దనున్న ల్యాండర్ నుండి జాబిల్లి నేలపైకి జారుకున్న రోవర్ మరుక్షణం నుంచే కర్తవ్య నిర్వహణలో నిమగ్నమైంది. చంద్రుడి ఉపరితలం యొక్క ఉష్ణగ్రత వివరాలను ఇదివరకే ఇస్రోకు చేరవేసిన రోవర్ ఇప్పుడు చంద్రుడిపై పలు ఖనిజాల జాడను కనుగొంది. ఈ క్రమంలో రోవర్‌లోని లేజర్-ప్రేరిత బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోప్ (LIBS) పరికరం దక్షిణ ధృవంలోని చంద్రుడి ఉపరితలంపై సల్ఫర్ (S) ఉనికి పుష్కలంగా ఉన్నట్లు నిర్ధారించింది. చంద్రుడిపై ఆక్సిజన్ ఆనవాళ్లు కూడా పుష్కలంగా ఉన్నటు గుర్తించింది. అలాగే క్రోమియం(Cr), టైటానియం(Ti), కాల్షియం(Ca), మాంగనీస్(Mn), సిలికాన్(Si), అల్యూమినియం(Al), ఇనుము(Fe) వంటి మరికొన్ని ఖనిజాలు కూడా ఉన్నట్లు గుర్తించింది. హైడ్రోజన్ కోసం ఇంకా రోవర్ పరిశోధిస్తోందని తెలిపింది ఇస్రో. Chandrayaan-3 Mission: In-situ scientific experiments continue ..... Laser-Induced Breakdown Spectroscope (LIBS) instrument onboard the Rover unambiguously confirms the presence of Sulphur (S) in the lunar surface near the south pole, through first-ever in-situ measurements.… pic.twitter.com/vDQmByWcSL — ISRO (@isro) August 29, 2023 ఇది కూడా చదవండి: అది వారికున్న పాత అలవాటే.. జయశంకర్ -
Pudami Sakshiga : భూమ్మీద ఆక్సిజన్ శాశ్వతం కాదా? ఆ తర్వాత అంతమేనా?
ఆక్సిజన్..ప్రాణాలు నిలబెట్టే వాయువు. ఐ–కొలి లాంటి కొన్ని రకాల బ్యాక్టీరియాలు మినహా భూమ్మీద సమస్త జీవజాలాల మనుగడకు ఈ ఆక్సిజన్ అవసరం. అయితే ఈ ప్రాణవాయువుకు జన్మనిచ్చింది ఓ బ్యాక్టీరియా అంటే వింతగా అన్పించినా వాస్తవం. కోటాది కోట్ల సంవత్సరాల క్రితం భూ వాతావరణంలో ఆక్సిజన్ అనేది లేదు. సుమారు 450 కోట్ల సంవత్సరాల క్రితం వాయువులు, దుమ్ము, ధూళి ఒకచోట స్థిరపడి భూగోళం ఏర్పడింది. ఆ తరువాత మరో వంద కోట్ల సంవత్సరాలకు భూమిపై ఏకకణ జీవితో జీవం ఆవిర్భవించింది. అప్పటికి ఇంకా భూమి మీద ఉన్న అనేక రకాల వాయువుల్లో ఆక్సిజన్ లేదు. ఆ కాలంలో ప్రోక్లొరోకాకస్ అనే బ్యాక్టీరియా తన మనుగడ కోసం నీరు, సూర్యరశ్మి, కార్బన్ డైఆక్సైడ్‌ల ద్వారా కిరణజన్య సంయోగ క్రియను జరిగించి అవసరమైన శక్తిని పొందడం మొదలుపెట్టింది. సముద్రంలో ఉండే ఈ బ్యాక్టీరియా నిర్వహించిన కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆక్సిజన్ ఉత్పత్తి అవుతూ వాతావరణంలో కలవడం మొదలయ్యింది. సుమారు 300 కోట్ల సంవత్సరాల క్రితం భూ వాతావరణంలో ఓ మోస్తరు ఆక్సిజన్ లభించడం మొదలయ్యింది. దీన్నే శాస్త్రవేత్తలు గ్రేట్ ఆక్సిడేషన్ ఈవెంట్‌గా అభివర్ణించారు. అలా మొదలైన ఆక్సిజన్ ఇప్పటికి భూమిపై ఉన్న వాతావరణంలో 21 శాతానికి పెరిగింది. కోటాను కోట్ల జీవరాశుల జన్మకు, మనుగడకు కారణమయ్యింది. నైట్రోజన్దే రాజ్యం భూ వాతావరణంలో అత్యధికంగా నైట్రోజన్ 78 శాతం ఉంది. అంటే ఆక్సిజన్, నైట్రోజన్ కలిసి గాలిలో 99 శాతం ఉన్నాయన్నమాట. ఇక ఆగాన్, కార్బన్ డయాక్సైడ్ వంటి వాయువులన్నీ కలిపి ఒక్క శాతం ఉన్నాయి. సౌర కుటుంబంలోని మిగతా గ్రహాల్లో స్వచ్ఛమైన ఆక్సిజన్ దాదాపుగా లేదు. ఒకవేళ ఉన్నా ఇతర వాయువుల సంయోగంలో మాత్రమే ఉంది. ఉదాహరణకు వీనస్ (శుక్రుడు), మార్స్ (అంగారకుడు) గ్రహాల వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ కలిసి 98 శాతం ఆక్రమిస్తున్నాయి. ఈ కారణంగానే ఇతర గ్రహాలతో పాటు వీటిల్లోనూ జీవావిర్భావానికి అనుకూలమైన వాతావరణం లేదు. కిరణాలే జన్మదాతలు భూమ్మీద లభించే ఆక్సిజన్ దాదాపుగా కిరణజన్య సంయోగక్రియ (ఫొటోసింథసిస్) సృష్టించిందే. అయితే కేవలం భూమ్మీది వృక్ష జాతుల్లో జరిగే ఫొటోసింథసిస్ వల్లే మొత్తం ఆక్సిజన్ ఉత్పత్తి అవుతోందనుకుంటే పొరపాటే. సగం సముద్రంలో కూడా పుడుతోంది. సముద్రంలో ఉండే మొక్కలు, నాచు వంటి వృక్ష సంబంధమైనవి కూడా తమకు కావలసిన శక్తి కోసం కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. వీటి మాదిరిగానే ప్రోక్లోరొకాకస్ బ్యాక్టీరియా కూడా ఫొటోసిం«థసిస్ ద్వారా ఆక్సిజన్‌ను సృష్టిస్తోంది. అయితే సముద్రంలో ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్‌లో భూ వాతావరణంలో కలిసేది అత్యల్పమనే చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ ఉత్పత్తి అయిన ఆక్సిజన్ చాలావరకు సముద్ర జీవజాలాల మనుగడకే సరిపోతుంది. కాబట్టి భూమ్మీద మనకు లభ్యమయ్యే ఆక్సిజన్ దాదాపుగా వృక్ష జాతుల పుణ్యమే. ఎంత చెట్టుకు అంత.. ఎదిగిన చెట్టుకు ఆకులు, కొమ్మలు, కాండం, వేర్లు ఉంటాయి. అయితే చెట్టులో ఐదు శాతంగా ఉండే ఆకులు మాత్రమే ఆక్సిజన్‌ను తయారు చేస్తాయి. వేర్ల నుంచి వచ్చే నీరు, సూర్యరశ్మి, వాతావరణంలో ఉండే కార్బన్ డైఆక్సైడ్‌ను ఆకులు గ్రహించి కిరణ జన్య సంయోగక్రియ ద్వారా చెట్టు ఎదుగుదలకు కావలసిన గ్లూకోజ్‌ను తయారుచేస్తాయి. ఈ ప్రక్రియలో ఆక్సిజన్‌ను వాతావరణంలోకి వదిలేస్తాయి. చెట్లు కూడా కొంత ఆక్సిజన్‌ను ఉపయోగించుకుంటాయి కానీ విడుదల చేసే ఆక్సిజన్‌తో పోల్చుకుంటే అది అతిస్వల్పం. ఇలా వాతావరణంలో ఆక్సిజన్ చేరుతూ ఈ రోజు మొత్తం గాలిలో 21 శాతాన్ని ఆక్రమించింది. సమయం, కాలం ఇతర వాతావరణ పరిస్థితుల ఆధారంగా ఒక చెట్టు ఉత్పత్తి చేసే ఆక్సిజన్‌లో హెచ్చు తగ్గులు ఉంటాయి. అలాగే చెట్టు లేదా మొక్క రకాన్ని బట్టి ఆక్సిజన్ ఉత్పత్తి పరిమాణం మారుతూ ఉంటుంది. చాలావరకు మొక్కలు, చెట్లు పగలు మాత్రమే ఆక్సిజన్‌ను విడుదల చేస్తా యి. కొన్ని అరుదైన వృక్ష జాతులే 24 గంటలు ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఉదాహరణకు చాలామంది ఇంట్లో పెంచుకునే తులసి చెట్టు రోజులో 20 గంటల వరకు ఆక్సిజన్‌ను విడుదల చేస్తూనే ఉంటుంది. అలాగే అరెకాపామ్గా పిలిచే పోకచెట్టు 24 గంటల పాటూ ఆక్సిజన్‌ను వాతావరణంలోకి వదులుతూనే ఉంటుంది. ఆరేడు చెట్లు = ఓ మనిషి మనుగడ ఒక అంచనా ప్రకారం ఒక ఆకు గంటకు ఐదు మిల్లీలీటర్ల ఆక్సిజన్‌ను తయారుచేస్తుంది. వంద అడుగుల భారీ వృక్షం ఏడాదికి 6,000 పౌండ్ల ఆక్సిజన్‌ను ఉత్తత్తి చేయగలదు. చిన్నా పెద్ద చెట్లు సగటున 260 పౌండ్లు అంటే సుమారు 120 కిలోల ఆక్సిజన్ని ఏడాదికి సృష్టిస్తాయి. మనిషి సగటున ఏడాదికి 9.5 టన్నుల గాలిని పీల్చుకుంటాడు. అయితే ఇందులో ఆక్సిజన్ 21 శాతమే ఉంటుంది. మనిషి పీల్చుకునే ఆక్సిజన్‌లో కూడా మూడోవంతు మాత్రమే దేహం ఉపయోగించుకుని మిగతాది గాలిలోకి వదిలేస్తుంది. ఈ లెక్కన మనిషి ఏడాదికి 740 కిలోల ఆక్సిజన్‌ను వాడుకుంటాడు. అంటే సగటున ఆరు నుంచి ఏడు చెట్లు ఉత్పత్తి చేసే ఆక్సిజన్ ఓ మనిషి మనుగడకు సరిపోతుందన్నమాట. భూమ్మీద శాశ్వతం కాదా? ఆక్సిజన్ భూమ్మీద శాశ్వతంగా ఉంటుందా అన్నది సందేహాస్పదమేనంటున్నారు సైంటిస్టులు. ఒకప్పుడు భూమిపై ఆక్సిజన్ లేదు కాబట్టి భవిష్యత్తులో మళ్లీ అలాంటి పరిస్థితి ఏర్పడవచ్చునన్నది వారి అభిప్రాయం. నాసాకు చెందిన కజుమి ఒజాకి, క్రిస్టఫర్ రైన్హర్ట్ అనే శాస్త్రవేత్తలు.. ఓ ప్రయోగం ద్వారా ఇంకో వంద కోట్ల సంవత్సరాల తరువాత భూమ్మీద ఆక్సిజన్ శాతం గణనీయంగా పడిపోతుందనే అంచనాకు వచ్చారు. వంద కోట్ల సంవత్సరాల తర్వాత సూర్యుడు మరింత వేడిగా మారడం వల్ల భూమిపై కార్బన్ డైఆక్సైడ్ స్థాయి విపరీతంగా పెరిగి, ఆక్సిజన్ వెళ్లిపోయేలా చేస్తుందనేది వారి అంచనా. 20 వేల టన్నుల సామర్థ్యం కోవిడ్ సమయంలో ఆక్సిజన్ లేక రోగులు పడిన అవస్థలు గుర్తుండే ఉంటాయి. భారతదేశం కోవిడ్ కాలానికి ముందు రోజుకి 6,900 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసేది. అందులో 1,000 టన్నులు మాత్రమే వైద్య అవసరాలకు అందుబాటులో ఉండేది. మొదటి విడత కోవిడ్ సమయంలో దీని అవసరం 3,095 టన్నులకు, రెండో విడత అంటే 2021లో 5,500 టన్నులకు పెరిగిపోయింది. ప్రభుత్వ, ప్రైవేటుపరంగా ప్రస్తుతం మనదేశంలో రోజుకు 20,000 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. కానీ వైద్య పరంగా ఇప్పుడు మనకు సగటున రోజుకు 1,250 టన్నుల ఆక్సిజన్ సరిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక, వైద్య అవసరాల కోసం ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్ ద్వారా 7,054 కోట్ల డాలర్ల వ్యాపారం జరుగుతోంది. -దొడ్డ శ్రీనివాసరెడ్డి -
అవి సాధారణ మరణాలే
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రమైన నెల్లూరులోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ఎంఐసీయూలో చికిత్స పొందుతున్న వారిలో పరిస్థితి విషమించడం వల్లే శుక్రవారం ఆరుగురు మృతి చెందారని సూపరింటెండెంట్ సిద్ధానాయక్, జనరల్ మెడిసిన్ హెచ్ఓడీ డాక్టర్ రామచంద్రరావు స్పష్టం చేశారు. అయితే ఆక్సిజన్ అందకపోవడం, వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందారంటూ ఓ వర్గం మీడియా ప్రచారం చేయడం సరికాదన్నారు. శనివారం వారు మీడియాతో మాట్లాడుతూ.. లిక్విడ్ ఆక్సిజన్ సరఫరా నిరంతరంగా ఉంటుందని తెలిపారు. గూడూరుకు చెందిన కె.సాంబయ్య (55), నెల్లూరుకు చెందిన ఎస్.లలిత ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో, విపరీతంగా మద్యం అలవాటున్న నరుకూరుకు చెందిన పి.రమేష్ (42), నెల్లూరులోని శ్రీనివాసనగర్‌కు చెందిన ఎన్.చలపతి (52) క్లోమ గ్రంధి పాడవ్వడంతో మృతి చెందారని తెలిపారు. నెల్లూరులోని వేదాయపాళెంకు చెందిన సుందరం (70), నెల్లూరులోని పొర్లుకట్టకు చెందిన కె.చెంచమ్మ (70) గుండె సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతూ కోలుకోలేక చనిపోయారన్నారు. ఐదారు రోజులుగా చికిత్స పొందుతున్న వీరంతా శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వేర్వేరు సమయాల్లో మృతి చెందారనే విషయాన్ని గమనించాలన్నారు. ఆరుగురు కూడా దీర్ఘకాలిక రోగులని, ఆస్పత్రిలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని చెప్పారు. ఈ ఘటనపై జిల్లా వైద్యాధికారి పెంచలయ్య విచారణ చేపట్టారు. శనివారం ఆస్పత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించి వైద్య సేవలు బాగున్నాయని చెప్పారు. జిల్లా కలెక్టర్ హరినారాయణన్ కూడా ఎంఐసీయూ వార్డును పరిశీలించారు. రోగులు, వారి బంధువులతో మాట్లాడారు. ఆక్సిజన్ ట్యాంకును, పైపులను టెక్నీషియన్ ద్వారా పరిశీలించారు. ఆస్పత్రి సేవల్లో ఎక్కడా లోపం లేదని చెప్పారు. -
ఆక్సిజన్ అయిపోయింది.. అయిదుగురి ప్రాణాలపై సన్నగిల్లుతున్న ఆశలు
అట్లాంటిక్ మహా సముద్రం గల్లంతైన టైటానిక్ సబ్‌మెరైన్ ఆచూకీ కోసం భారీ ఎత్తున రెస్కూ ఆపరేషన్ కొనసాగుతోంది. అయిదుగురు పర్యాటకులతో ఆదివారం బయల్దేరిన జలంతర్గామి కనిపించకుండా పోయి 96 గంటలు కావొస్తుంది. అయినా దీని ఆచూకీ లభించలేదు. మరో వైపు మినీ సబ్‌మెరైన్‌లోని ఆక్సిజన్ సరఫరా కూడా దగ్గర పడింది. జలాంతర్గామిలో 96 గంటలకు సరిపడా మాత్రమే ఆక్సిజన్ ఉంది. ఆ సమయం కాస్తా గడిచిపోవడంతో సందర్శకుల క్షేమంపై క్షణం క్షణం ఉత్కంఠ కొనసాగుతోంది. ఆక్సిజన్ అయిపోవడంతో వారు ప్రాణాలతో తిరిగొస్తారనే ఆశలు సన్నగిల్లుతున్నాయి. కాగా టైటాన్ జలాంతర్గామి సముద్ర ఉపరితలం నుంచి 12,500 అడుగుల(3,800 మీటర్లు) లోతున ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. దీనిని కనుగునేందుకు యూఎస్ కోస్ట్ గార్డుతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రెస్క్యూసిబ్బంది రంగంలోకి దిగి పెద్ద ఎత్తున గాలిస్తున్నారు. అమెరికా, కెనడాకు చెందిన యుద్ధ విమానాలు, ఉపగ్రహాలు, భారీ నౌకలను రంగంలోకి దించిసముద్రాన్నే జల్లెడ పడుతున్నారు. ఫ్రాన్స్‌కు చెందిన సముద్రపు రోబోలను సైతం మోహరించారు. అయితే గల్లంతైన టైటాన్ సముద్ర గర్భంలో ఏవైనా శకలాల మధ్య చిక్కుకుపోయిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అత్యంత అధునాతన సాంకేతికతతో కూడిన ఈ రోబో జలాంతర్గామి సహాయం తీసుకున్నారు. సముద్రంలో దాదాపు 4 కిలోమీటర్ల లోతు వరకు రెస్క్యూ బృందాలు వెతుకుతున్నాయి. గాలిస్తున్న ప్రాంతం.. అమెరికాలోని ఓ రాష్ట్రంకంటే పెద్దగా ఉంటుందట. అందుకే ఆ ప్రాంతాన్నంతా గాలించడం అత్యంత కష్టంగా మారింది. టైటానిక్ నౌక శిథిలాల ఉన్న ప్రాంతాన్ని మిడ్నైట్ జోన్‌గా పిలుస్తారు. అక్కడ ఉష్ణోగ్రతలు అత్యంత శీతలంగా ఉంటాయి. అంతేగాక పూర్తిగా చీకటి ఉంటుంది. సబ్మెర్సిబుల్లో ఉన్న లైట్లతో కేవలం కొంత దూరం వరకే కనిపిస్తుందని, దాదాపు రెండున్నర గంటల పాటు కటిక చీకల్లో ప్రయాణం చేయాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. చదవండి: ఉడికి ఉక్కిరిబిక్కిరవుతున్న జనం.. మొత్తం 9 దేశాలు.. టాప్‌లో మనమే! మరోవైపు టైటానిక్ నౌక శకలాలు ఉన్న 12వేల అడుగుల లోతున వాతావరణ పీడనం అధికంగా ఉటుందని నిపుణులు చెబుతున్నారు. భూ ఉపరితలంతో పోలిస్తే అక్కడి పీడనం 380 రెట్లు అధికంగా ఉంటుందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక అయిదుగురు వ్యక్తులతో బయల్దేరిన సబ్‌మెరైన్ కేవలం రెండు గంట్లోనే కమ్యూకేషన్ కోల్పోయిన విషయం విదితమే. ఈ మినీ సబ్‌లో పాకిస్థాన్‌కు చెందిన ఇద్దరు సంపన్నులు, బ్రిటన్ బిలియనర్ హమీష్ హార్డింగ్ మరో ముగ్గురు ఉన్నారు. వీరి ఆచూకీ కోసం భారీగా రెస్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. సిబ్బందికి కొన్ని ప్రాంతాల్లో శబ్దాలు వినిపిస్తున్నప్పటికీ అవి కచ్చితంగా ఎక్కుడనుంచి వస్తున్నాయనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. -
యవ్వనానికి ఆక్సిజన్ గది
అమృతం తాగితే జరామరణాలు ఉండవని అంటారు. అయితే, కోల్పోయిన యవ్వనాన్ని తిరిగి పొందటానికి అమృతమే తాగాల్సిన పనిలేదు. ఈ గదిలో రోజుకు ఓ గంట పడుకుంటే చాలు. కేవలం సంపన్నులకు మాత్రమే అందుబాటులో ఉండే ‘హెచ్‌బీఓటీ (హైపర్బ్యారిక్ ఆక్సిజన్ థెరపీ)’ నేడు తక్కువ ధరల్లోనే దొరకనుంది. దీనికోసం అమెరికాకు చెందిన హెచ్ఓబీఓ2 అనే సంస్థ ప్రత్యేకమైన ఓ మెటల్ చాంబర్‌ను రూపొందించింది. సాధారణంగా మన వాతావరణంలో 21 శాతం ఆక్సిజన్, 79 శాతం నైట్రోజన్, ఇతర వాయువులు ఉంటాయి. అదే ఈ చాంబర్లో 95 శాతం స్వచ్ఛమైన ఆక్సిజన్ అందుతుంది. ఇక ఇందులోని ప్రత్యేకమైన కొల్లాజెన్ ఫైబర్స్, లైటింగ్ సిస్టమ్ ముడతలను తొలగించి, చర్మాన్ని కాంతిమంతగానూ, మృదువుగా చేస్తుంది. కావాల్సిన వారు వీరి అధికారిక వెబ్సైట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. అద్దెకు కూడా తీసుకోవచ్చు. నెలకు రూ.80 వేల నుంచి, రూ. లక్ష తీసుకుంటారు. ఒక్క రోజుకు కూడా అద్దెకు ఇస్తారు. అయితే, ప్రస్తుతం విదేశాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. -
ఆక్సిజన్ సపోర్టుపై ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్
ఢిల్లీ మాజీ మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత సత్యేంద్రజౌన్ ఆరోగ్య పరిస్థితి ఆందోళన కరంగా మారింది. ప్రస్తుతం ఆయనకు లోక్ నాయక్ ఆసుపత్రిలో ఆక్సిజన్ సపోర్టుతో వైద్యం అందిస్తున్నారు. కాగా తీహార్ జైల్లో శిక్షననుభవిస్తున్న సత్యేంద్ర జైన్ కొన్ని రోజులుగా అనారోగ్యానికి గురవుతున్నారు. గత సోమవారమే అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన జైన్.. తాజాగా మరోసారి అస్వస్థతకు గురయ్యారు. బుధవారం ఉదయం జైలులోని బాత్రూమ్లో కళ్లు తిరిగి పడిపోయారు. దీంతో ఆయన్ను సిబ్బంది వెంటనే దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పలు వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం మెరుగైన వైద్య సేవల కోసం ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆక్సిజన్ సపోర్టుపై ఉన్నారు. కాగా జైన్ అసుపత్రి పాలవ్వడం గడిచిన వారం రోజుల్లో ఇది రెండోసారి. మే 22న వెన్నెముక సమస్యతో ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం తిరిగి జైలుకు తీసుకువచ్చారు. తీహార్ జైలు డీజీ తెలిపిన వివరాల ప్రకారం.. జైలు ఆవరణలోని సెల్ నంబర్ 7లో ఉన్న సత్యేందర్ జైలు గురువారం ఉదయం దాదాపు 6 గంటలకు వాష్‌రూమ్‌లో పడిపోయాడని పేర్కొన్నారు.అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించామని, అక్కడ అతనికి పలు వైద్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు. సత్యేందర్ జైన్‌కు వెన్నెముకకు శస్త్ర చికిత్స జరగాల్సి ఉందని డీజీ తెలిపారు. ఇదిలా ఉండగా మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన జైన్.. తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే అప్పటి నుంచి ఆయన 35కిలోల బరువు తగ్గిన్నట్లు ఆప్ వర్గాలు ఆరోపిన్నాయి. చదవండి: కారు దొంగతనం.. డ్రైవింగ్ రాక 10 కి.మీ తోసుకెళ్లి... చివరికి! -
కొమ్మలు, ఆకులు లేని చెట్టు.. లిక్విడ్ ట్రీ
చెట్లు అంటే.. పెద్ద కాండం, కొమ్మలు, ఆకులు ఉంటాయి. గాలిలోంచి కార్బన్ డయాక్సైడ్ పీల్చుకుని, మనకు ఆక్సిజన్‌ను అందిస్తాయి. కానీ ఈ చెట్లకు కాండం, కొమ్మలు, ఆకులు వంటివేవీ ఉండవు. అయినా కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుంటాయి, ఆక్సిజన్ ఇస్తాయి. వీటిని ఎక్కడ కావాలన్నా పెట్టేసుకోవచ్చు. ఎన్ని అయినా రెడీ చేసుకోవచ్చు. మరి ఏమిటా చెట్లు? వాటి ప్రత్యేకతలేంటో తెలుసుకుందామా.. కాలుష్యానికి పరిష్కారంగా.. బొగ్గును కలపను మండించడం నుంచి వాహనాల పొగ దాకా వాతావరణం కాలుష్యం ఏటేటా పెరిగిపోతోంది. కార్బన్ డయాక్సైడ్ శాతం పెరగడం వల్ల గ్లోబల్ వార్మింగ్ పరిస్థితి ఏర్పడుతోంది. భారీగా చెట్లను పెంచడం దీనికి పరిష్కారమైతే.. అందుకు విరుద్ధంగా అడవుల నరికివేత విచ్చలవిడిగా కొనసాగుతోంది. ఈ క్రమంలో యూరప్‌లో అత్యంత కాలుష్య దేశాల్లో ఒకటిగా నిలిచిన సెర్బియా శాస్త్రవేత్తలు.. వాతావరణ కాలుష్యానికి పరిష్కారం చూపేలా ‘లిక్విడ్ ట్రీస్’ను రూపొందించారు. ఏమిటీ ‘లిక్విడ్ ట్రీస్’? నీళ్లు, ఒక రకం నాచు (మైక్రో ఆల్గే) నింపి, ప్రత్యేకమైన కాంతి వెలువర్చే విద్యుత్ దీపాలను అమర్చిన ట్యాంకులే ‘నీటి చెట్లు (లిక్విడ్ ట్రీస్)’. సాంకేతికంగా వీటిని బయో రియాక్టర్లు అని పిలుస్తారు.నీటిలోని నాచు కార్బన్ డయాక్సైడ్ పీల్చుకుని.. విద్యుత్ బల్బు నుంచి వెలువడే కాంతి సాయంతో ఫొటో సింథసిస్ (కిరణజన్య సంయోగ క్రియ) జరుపుతుంది. ఈ క్రమంలో స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. ఈ నీటి చెట్ల ట్యాంకులకు ‘లిక్విడ్3’ అని పేరు పెట్టారు. పదేళ్ల వయసున్న రెండు పెద్ద చెట్లతో, లేదా 200 చదరపు మీటర్ల స్థలంలోని గడ్డి, మొక్కలతో సమానమైన స్థాయిలో కార్బన్ డయాక్సైడ్ను ‘లిక్విడ్ 3’ పీల్చుకుంటుందని దీనిని అభివృద్ధి చేసిన బెల్గ్రేడ్ యూనివర్సిటీ మల్టీడిసిప్లీనరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ శాస్త్రవేత్త ఇవాన్ స్పాసోజెవిక్ చెప్తున్నారు. గాలిలో కార్బన్ డయాక్సైడ్ ఎలా తగ్గుతుంది? సాధారణంగా నీటిలో కార్బన్ డయాక్సైడ్, ఆక్సిజన్ వివిధ శాతాల్లో కరిగి ఉంటాయి. ఏదైనా కారణంతో నీటిలో వాటి శాతం తగ్గిన ప్పుడు.. చుట్టూ ఉన్న గాలిలోంచి నీటిలోకి చేరుతాయి. ‘లిక్విడ్ 3’లోని కార్బన్ డయాక్సైడ్ను నాచు పీల్చుకున్నప్పుడు.. చుట్టూ ఉన్న గాలిలోంచి తిరిగి కార్బన్ డయాక్సైడ్ ఆ నీటిలోకి చేరుతుంది. అంటే చుట్టూ ఉన్న గాలిలో కాలుష్యం తగ్గుతుంది. ఉదాహరణకు అక్వేరియంలలోని నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్‌ను చేప పిల్లలు పీల్చుకుంటాయి. ఇలా నీటిలో తగ్గిపోయే ఆక్సిజన్ శాతాన్ని తిరిగి పెంచేందుకే గాలి బుడగలను వెలువర్చే పంపులను అమర్చుతుంటారు. అయితే ‘లిక్విడ్ 3’లో ఇలా కార్బన్ డయాక్సైడ్ తగ్గుతుంటుంది. బెంచ్గా.. చార్జర్‌గా.. సెర్బియాలోని బెల్గ్రేడ్లో మున్సిపాలిటీ ఆఫీసు ముందు మొట్టమొదటి ‘లిక్విడ్ 3’ ట్యాంక్‌ను ఏర్పాటు చేశారు. దీనిని భూమి నుంచి కాస్త లోతుగా ఏర్పాటు చేయడం వల్ల కూర్చునే బెంచ్‌లా ఉపయోగపడుతుంది. పైన సోలార్ ప్యానల్‌తో నీడ అమర్చారు. ఆ ప్యానెల్ నుంచి వచ్చే విద్యుత్‌తోనే ట్యాంకులో బల్బు వెలుగుతుంది. మొబైల్ ఫోన్లు వంటివి చార్జింగ్ చేసుకునే సాకెట్ కూడా ఉంటుంది. ‘ఐక్యరాజ్యసమితి అభివృద్ధి ప్రోగ్రాం (యూఎన్డీపీ)’ కింద ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన 11 ఉత్తమ వినూత్న ఆవిష్కరణల్లో ‘లిక్విడ్ 3’ కూడా చోటు సాధించడం గమనార్హం. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
బీజింగ్‌లో కోవిడ్ బీభత్సం
బీజింగ్: కరోనా చైనాను చిదిమేస్తోంది. బీజింగ్‌లో కోవిడ్ రోగులు వెల్లువలా ఆస్పత్రులకు తరలివస్తున్నారు. నగరంలోని చుయాంగ్‌లియూ ఆస్పత్రిలో పరిస్థితే అక్కడి ఆరోగ్య అత్యవసర పరిస్థితికి దర్పణం పడుతోంది. ఆస్పత్రిలోని బెడ్లు అన్నీ కోవిడ్ వృద్ధ రోగులతో నిండిపోయాయి. అయినా రోగులు వస్తుండటంతో బంధువులు వేచి ఉండే గదుల్లో, కారిడార్లలో వైద్యం చేస్తున్నారు. ఉన్న అన్ని వీల్చైర్లలో రోగులు కూర్చొనే ఆక్సిజన్ వెంటెలేషన్తో శ్వాసిస్తున్నారు. మరింత అత్యవసర వైద్యసేవలు అవసరమైన రోగులకు చికిత్సచేయడంలో వైద్యులు, నర్సులు మునిగిపోయారు. జీరో కోవిడ్ పాలసీతో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు శతథా ప్రయత్నించి చైనా చేతులెత్తేయడంతో దేశంలో వైద్యారోగ్య పరిస్థితి దయనీయంగా తయారైంది. అత్యవసరమైతే తప్ప సొంతూర్లకు రావొద్దని అక్కడి హునాన్ప్రావిన్స్లోని షావోయాంగ్ కౌంటీ, అన్హుయీ ప్రావిన్స్‌లోని షాయూగ్జియాన్ కౌంటీలతోపాటు గన్సు ప్రావిన్స్‌లోని క్వింగ్యాంగ్ తదితర నగర పాలనాయంత్రాంగాలు ప్రజలను హెచ్చరించాయి. చైనాలో వైద్య అత్యయక స్థితిపై వాస్తవిక సమాచారం అందితే ఇతర దేశాలు సరైన విధంగా సమాయత్తం అయ్యేందుకు వీలుంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) అధ్యక్షుడు టెడ్రోస్ బుధవారం హితవుపలికారు. -
ఆక్సిజన్ అంతమైన వేళ...
టొరంటో: దాదాపు 50 కోట్ల ఏళ్ల క్రితం. భూమిపై ఆక్సిజన్ ఉన్నట్టుండి ఎవరో పీల్చేసినట్టుగా సంపూర్ణంగా ఆవిరైపోయింది. దాంతో చాలా జీవరాశులూ ఉన్నపళంగా కళ్లు తేలేశాయి. ఉనికినే కోల్పోయాయి. భూగోళంపై తొలి జీవ వినాశనం జరిగిన తీరు ఇదేనని శాస్త్రవేత్తలు తాజాగా కనిపెట్టారు. భూమిపై తొలి జీవ వినాశనం జరిగిన తీరును అర్థం చేసుకునేందుకు, ఫలితంగా పూర్తిగా నశించిపోయిన జీవరాశులు ఎలా ఉండేవో తెలుసుకునేందుకు పరిశోధకులు శిలాజ ముద్రలను అధ్యయనం చేశారు. ఆ వినాశనమే చాలా జంతు జాతులు ఇప్పుడున్న రూపాల్లో వికసించేందుకు పురిగొల్పి ఉంటుందని వారు భావిస్తున్నారు. ఆక్సిజన్ ఏమైపోయింది? ఇందుకు ఫలానా సంఘటనే కారణమని కచ్చితంగా చెప్పలేకపోయినా, అది అప్పట్లో జరిగిన అనేకానేక పరిణామాల ఫలస్వరూపం అయ్యుండొచ్చన్నది పరిశోధక బృందం అభిప్రాయం. ‘‘అగ్నిపర్వతాల పేలుడు, భూ ఫలకాల్లో భారీ కదలికలు, గ్రహశకలాలు ఢీకొనడం వంటివాటి వల్ల భూమిపై ఆక్సిజన్ బాగా తగ్గిపోవడమో, లుప్తం కావడమో జరిగి ఉంటుంది’’ అని అధ్యయనానికి సారథ్యం వహించిన వర్జీనియా టెక్ కాలేజ్ ఆఫ్ సైన్స్‌కు చెందిన పరిశోధకుడు స్కాట్ ఇవాన్స్ అభిప్రాయపడ్డారు. ‘‘గ్లోబల్ వార్మంగ్ వంటివి ఆక్సిజన్ స్థాయిలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇదిలాగే కొనసాగితే మరో సామూహిక జీవ హననం దగ్గర్లోనే ఉంది’’ అని హెచ్చరించారు. -
Benjamin J W Mills: ఆక్సిజన్ ‘స్థాయి’లో మార్పును బట్టి గ్రహాలపై జీవం గుట్టు పట్టేయొచ్చు
లీడ్స్(యూకే): అనంతమైన విశ్వంలో మనమంతా ఒంటరి జీవులమా? లేక ఇతర గ్రహాలపైనా జీవం ఏదైనా ఉందా? మన సౌర కుటుంబానికి అవతల ఉన్న గ్రహాలపై వాతావరణం ఉనికి ఉండే అవకాశం ఉందా? ఈ ప్రశ్నలు శతాబ్దాలుగా మానవులను వేధిస్తూనే ఉన్నాయి. వీటికి సమాధాలు కనిపెట్టేందుకు జిజ్ఞాసులు అలుపెరుగని కృషి సాగిస్తున్నారు. ఇతర గ్రహాలపై జీవం జాడ తెలుసుకొనేందుకు ఎన్నో పరిశోధనలు, అధ్యయనాలు జరుగుతున్నాయి. రహస్యాన్ని ఛేదించే విషయంలో మనం కొంత పురోగతి సాధించినట్లు పరిశోధకులు చెబుతున్నారు. ఇప్పటిదాకా మనకు తెలిసింతవరకూ కేవలం మన భూగోళంపైనే జీవులు ఉన్నాయి. ఇవన్నీ ఆక్సిజన్‌ను శ్వాసిస్తున్నాయి. జీవుల మనుగడకు ప్రాణవాయువు(ఆక్సిజన్) అవసరమన్న సంగతి తెలిసిందే. భూమిపై ఆక్సిజన్ ఎల్లవేళలా ఒకేలా లేదని యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్‌కు చెందిన బయోకెమికల్ మోడలింగ్ అసోసియేట్ ప్రొఫెసర్ బెంజమిన్ జేడబ్ల్యూ మిల్స్ చెప్పారు. కోట్ల సంవత్సరాల నుంచి భూమిపై ఆక్సిజన్ పరిమాణం మారుతూ వచ్చిందని అన్నారు. ఈ మార్పు ఎప్పుడు, ఎలా జరిగిందో, ఆయా సమయాల్లో ఏయే జీవులు పుట్టాయో కచ్చితంగా తెలుసుకుంటే ఇతర గ్రహాలపై ఉన్న వాయువుల పరిమాణం గురించి, తద్వారా అక్కడి జీవజాలం గురించి ఒక అంచనాకు రావొచ్చని వివరించారు. మన గ్రహంపై ఉన్న ఆక్సిజన్ పరిమాణంపై తమ పరిశోధనలో కీలక విషయాలు బహిర్గతమయ్యాయని పేర్కొన్నారు. భూమిపై ఆక్సిజన్, జీవం భూగోళంపై వాతావరణంలో ప్రస్తుతం 21 శాతం ఆక్సిజన్ ఉంది. అయితే, ఇప్పుడున్నంత ఆక్సిజన్ కోట్ల సంవత్సరాల క్రితం లేదు. గతంలోకి.. అంటే 45 కోట్ల సంవత్సరాలు వెనక్కి వెళ్తే.. అక్కడ జీవించడానికి ఆక్సిజన్ ట్యాంకర్లు కూడా వెంట తీసుకొని పోవాల్సిందే. ఎందకంటే అప్పట్లో స్వల్ప పరిమాణంలో ఆక్సిజన్ ఉండేది. జీవులు కూడా ఇంకా పుట్టలేదు. ప్రధానంగా మూడు దశల్లో ఆక్సిజన్ స్థాయిలు భూమిపై పెరిగాయి. మొదటిది ‘గ్రేట్ ఆక్సిడేషన్ ఈవెంట్’. దాదాపు 240 కోట్ల సంవత్సరాల క్రితం ఇది సంభవించింది. భూమిపై వాతావరణం ఏర్పడింది. ఆక్సిజన్ నిల్వలు ప్రారంభమయ్యాయి. రెండోది నియోప్రొటెరోజోయిక్ ఆక్సిజనేషన్ ఈవెంట్ (ఎన్ఓఈ). 80 కోట్ల సంవత్సరాల క్రితం సంభవించింది. భూమిపై ఆక్సిజన్ పరిమాణం పెరిగింది. దాదాపు ఇప్పుడున్న స్థాయికి ప్రాణవాయువు చేరుకుంది. ఆ తర్వాత 20 కోట్ల సంత్సరాలకు భూమిపై తొలితరం జంతువులు పుట్టాయి. మూడోది ‘పాలెజోయిక్ ఆక్సిజనేషన్ ఈవెంట్’.. 42 కోట్ల సంవత్సరాల కిందట ఏర్పడింది. ఆక్సిజన్ ఇప్పుడున్న స్థాయికి పూర్తిగా చేరింది. 75 కోట్ల ఏళ్ల క్రితం భూమి వాతావరణంలో కేవలం 12 శాతం ఆక్సిజన్ ఉండేది. ఇది ఇప్పుడు 21 శాతానికి ఎగబాకింది. ఆక్సిజన్ పరిమాణాన్ని బట్టి కొత్త జీవులు ఉద్భవించడం, పాతవి అంతరించిపోవడం వంటివి జరిగాయని పరిశోధకులు భావిస్తున్నారు. దాదాపు 45 కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై మొక్కలు పుట్టాయి. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ(ఈఎస్ఏ), కెనడియన్ స్పేస్ ఏజెన్సీ(సీఎస్ఏ) భాగస్వామ్యంతో గత ఏడాది జేమ్స్‌వెబ్ స్పేస్ టెలిస్కోప్(జేడబ్ల్యూఎస్‌టీ)ను ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఇది మన సౌర మండలం ఆవల ఉన్న గ్రహాలపై వాతావరణం, వాయువులపై అధ్యయనం చేస్తోంది. అక్కడి వాయువులు, వాటి పరిమాణం గురించి తెలిస్తే జీవం ఉందా? లేదా? అనేది తేల్చవచ్చని పరిశోధకులు పేర్కొంటున్నారు. -
రికార్డులకు అతుక్కుపోతాడు
పిల్లలను ఆడించడానికి రకరకాల వేషాలేస్తారు పెద్దవాళ్లు. అలా కూల్‌డ్రింక్స్ క్యాన్లను అతికించుకుని గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించాడో వ్యక్తి. యూఎస్‌కు చెందిన జామీ కీటన్ది అసాధారణ చర్మం. ఆక్సిజన్ ఎక్కువగా తీసుకునే లక్షణం ఉన్న జామీ చర్మానికి అతుక్కునే గుణం ఎక్కువ. ఏడేళ్ల వయసులోనే ఇది గుర్తించిన జామీ... బొమ్మలు అతికించుకోవడం మొదలుపెట్టాడు. అల్లరివాడు కాబట్టి ఏ చెట్లెక్కి గమ్ అంటించుకున్నాడోనని అతని తల్లిదండ్రులు తేలికగా తీసుకున్నారు. కానీ ఓసారి గుండు చేసుకుని బేస్‌బాల్ ఆడుతున్న టైమ్‌లో తలకు కూల్‌డ్రింక్ టిన్ అతుక్కుపోయింది. పరుగెత్తినా పడిపోలేదు. అలా తనలోని ప్రత్యేకతను తెలుసుకున్నాడు. 2016లో తలకు 8 క్యాన్లను అతికించుకొని గిన్నిస్ రికార్డు నెలకొల్పాడు. ఆ తరువాత 2019లో జపాన్‌కు చెందిన షునుచి కన్నో తొమ్మిది క్యాన్లతో జామీ రికార్డును బ్రేక్ చేశాడు. ఇప్పుడు పది క్యాన్లను తలపై అతికించుకొని ఆ రికార్డును దాటేశాడు జామీ. ఖాళీ క్యాన్లను తలపై అతికించుకోవడమే కాదు.. బరువున్న బాటిల్స్‌ను కూడా క్యారీ చేయగలడు. బాటిల్స్‌ను తలకు అతికించుకుని వాటిలోని డ్రింక్‌ను గ్లాస్ల్లోకి ఒంపే టెక్నిక్‌ను నేర్చుకున్నాడు. తనకున్న ప్రత్యేకతనే బిజినెస్‌గా ఎంచుకుని, పలు కంపెనీలకు మార్కెటింగ్ చేస్తూ.. వీకెండ్స్‌లో 10 నుంచి 20వేల డాలర్లు సంపాదిస్తున్నాడు. ‘సెలబ్రిటీస్‌కు కూడా నేను తెలిసిపోయాను. సాధారణంగా వాళ్లతో ఫొటోలు దిగాలని అందరూ కోరుకుంటారు. కానీ సెలబ్రిటీలే నాతో ఫొటోస్ తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు’అంటున్నాడు జామీ. -
Save Soil: మట్టి ప్రమాదంలో పడింది.. కాపాడుదాం!
మనిషి ఆకాశానికి నిచ్చెనలు వేశాడు. చంద్రమండలం మీద అడుగుపెట్టాడు. గ్రహాలన్నింటినీ అధ్యయనం చేస్తున్నాడు. ఆ గ్రహాల మీద నీరు... మట్టి కోసం అన్వేషిస్తున్నాడు. ప్రాణికోణి నివసించే అవకాశం ఉందా అని పరిశోధిస్తున్నాడు. భూమికి ఆవల ఏముందో తెలుసుకునే ప్రయత్నమిది. అయితే... భూమి ఏమవుతుందోననే స్పృహను కోల్పోతున్నాడు. మన కాళ్ల కింద నేల ఉంది... ఆ నేల మట్టితో నిండినది. ఆ మట్టిని కాపాడుకున్నప్పుడే మనకు మనుగడ. ‘మట్టి ప్రమాదంలో పడింది... మట్టి ఆరోగ్యాన్ని కాపాడుదాం’... ... అని నినదిస్తున్నారు సేవ్ సాయిల్ యాక్టివిస్ట్ ప్రొఫెసర్ జయలేఖ. కేరళలో పుట్టి తెలుగు నేల మీద పెరిగిన ప్రొఫెసర్ జయలేఖ కెరీర్ అంతా హైదరాబాద్‌తోనే ముడివడింది. తండ్రి రైల్వే ఉద్యోగి కావడంతో ఆమె బాల్యం సికింద్రాబాద్‌లో గడిచింది. హైదరాబాద్ లోని రాజేంద్రనగర్‌లోని కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ లో జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్ కోర్సు చేశారు. తొలి ఉద్యోగం ఇక్రిశాట్లో. ఆ తర్వాత బేయర్ మల్టీనేషనల్ కంపెనీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగంలో పనిచేశారామె. పెర్ల్ మిల్లెట్ బ్రీడర్‌గా రిటైర్ అయిన తర్వాత ఆమె పూర్తి స్థాయి సామాజిక కార్యకర్తగా సేవలందిస్తున్నారు. ఆమె చదువు, ఉద్యోగం, అభిరుచి, అభిలాష అంతా నేలతో మమైకమై ఉండడంతో ఆమె ఉద్యమం కూడా నేలతో ముడివడి సాగుతోంది. మట్టికోసం సాగుతున్న ‘సేవ్ సాయిల్ గ్లోబల్ మూవ్మెంట్’లో చురుకైన కార్యకర్త జయలేఖ. ఆమె సాక్షితో మాట్లాడుతూ... ‘నేలను కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైంద’న్నారు. ‘ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్’ ప్రపంచాన్ని నిద్రలేపుతోంది. మట్టి ప్రమాదంలో పడిందని హెచ్చరిస్తోంది. వ్యవసాయ నేలల్లో 52 శాతం నిస్సారమైపోయాయని గణాంకాలు చెప్పింది. ఇప్పుడు కూడా మేల్కొనకపోతే 2050 నాటికి 90 శాతం నేల నిస్సారమవుతుందని, ప్రపంచం ఆకలి కేకలకు దగ్గరవుతుందని ‘యూఎన్‌సీసీడీ’ ఆందోళన చెందుతోంది. ఇప్పటికే వ్యవసాయ ఉత్పత్తులు 30 శాతం పడిపోయాయి. ఇప్పుడు కూడా ఉద్యమించకపోతే... నిర్లిప్తంగా ఉండిపోతే... ఇది నా సమస్య కాదు... ఇందులో నేను చేయాల్సింది ఏమీ లేదు... అని నిమ్మకు నీరెత్తినట్లు ఉంటే... వందేళ్లు మూల్యం చెల్లించాల్సి వస్తోందని కూడా చెప్తోంది. సేవ్ సాయిల్ సామాజికోద్యమం అలా పుట్టిందే’ అని వివరించారు జయలేఖ. చైతన్య యాత్ర పిచ్చుక అంతర్థానమైన తర్వాత పర్యావరణం గురించి ఆలోచించాం. కానీ మట్టి విషయంలో చేతులు కాలిన తర్వాత చేయగలిగిందేమీ ఉండదు. అందుకే ముందుగానే అప్రమత్తం కావాలి. మట్టి ప్రమాదంలో పడిందని ఇప్పటి వరకు తెలిసింది మేధావులకు మాత్రమే. ఈ వాస్తవం సామాన్యుడికి కూడా తెలియాలి. సామాన్యుల్లో చైతన్యం రావాలి. అందుకే ‘మట్టిని రక్షించు’ అని యాత్ర మొదలైంది. కాన్షియస్ ప్లానెట్ చొరవతో మొదలైన సేవ్ సాయిల్ థీమ్ ఇది. ఈశా ఫౌండేషన్, సద్గురు జగ్గీవాసుదేవ్ చేపట్టిన వంద రోజుల బైక్ యాత్ర మార్చి 21న లండన్‌లో మొదలైంది. మే నెల 29 నాటికి మనదేశంలోకి వచ్చిన సేవ్ సాయిల్ యాత్ర... ఐదు రాష్ట్రాలను చుట్టి ‘మట్టిని రక్షించు’ నినాదంతో ఈరోజు హైదరాబాద్‌కు చేరనుంది. ప్రజల్లో అవగాహన కల్పిస్తే ప్రభుత్వాల మీద ఒత్తిడి వస్తుంది. అప్పుడే ప్రభుత్వాలు తమ దేశంలో వాతావరణానికి, నేలతీరుకు అనుగుణంగా పాలసీలను రూపొందించడానికి ముందుకు వస్తాయి. అప్పుడే ఈ బృహత్తర కార్యక్రమం సఫలమవుతుంది. ఆ ఫలితం కోసమే మా ప్రయత్నం’’ అన్నారు జయలేఖ. – వాకా మంజులారెడ్డి మట్టికి ఆక్సిజన్ అందాలి మట్టి చచ్చిపోతోంది... చెట్టు ఎండిపోతోంది. మనిషి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడాల్సిన స్థితి. మట్టి సారం కోల్పోతే సంభవించే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయంటే... ఆహార కొరత, నీటి కొరత, జీవ వైవిధ్యత నశించడం, వాతావరణంలో పెనుమార్పులు, జీవన భద్రత కోల్పోవడం, పొట్ట చేత పట్టుకుని వలసలు పోవడం వంటివన్నీ భవిష్యత్తు మానవుడికి సవాళ్లవుతాయి. ఎంత తెలుసుకున్నప్పటికీ చేయగలిగిందేమిటనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. జీవం కోల్పోతున్న మట్టికి జవజీవాలనందివ్వాలి. వ్యవసాయ నేలలో ఏటా తప్పనిసరిగా యానిమల్ వేస్ట్, ప్లాంట్ డెబ్రిస్ ఇంకిపోవాలి. నేలను బీడు పెట్టకూడదు. చెట్టు పచ్చగా ఉంటే నేల చల్లగా ఉంటుంది. నేల సారవంతంగా ఉంటే చెట్టు ఏపుగా పెరుగుతుంది. ఈ రెండూ గాడిలో ఉన్నప్పుడే మనిషి విశ్వాన్ని జయించగలిగేది. (క్లిక్: మీరూ మీ ఇల్లూ వానలకు రెడీయేనా?) మట్టికి ఏమైంది? మట్టిలో ఉండాల్సిన మైక్రో ఆర్గానిజమ్స్ నశించిపోతున్నాయి. అంటే మట్టిలో ఉండాల్సిన జీవం నిర్జీవం అవుతోంది. దాంతో మట్టిలోని సారం నిస్సారమవుంది. ఈ ఉపద్రవంలో కూడా అగ్రరాజ్యం అమెరికా పాత్ర తొలిస్థానంలో ఉంది. ప్రమాదం ఎంత తీవ్రస్థాయిలో ఉందనేది మనకు తెలియడం లేదు. కానీ ఇది భూగోళానికి మొదటి ప్రమాద హెచ్చరిక వంటిది. నేలలో సేంద్రియ పదార్థాల స్థాయి మూడు నుంచి ఆరుశాతం ఉండాలి. అలాంటిది యూరోపియన్ దేశాల్లో రెండు శాతానికి పడిపోయింది. మన దేశంలో అయితే 0.5 శాతమే ఉంది. ఆఫ్రికాదేశాల్లో మరీ అధ్వాన్నంగా 0.3 శాతం ఉంది. ఇలాంటి గణాంకాలు, నివేదికలు తెలిసిన వెంటనే ఇందుకు రసాయన ఎరువుల వాడకమే కారణం అంటూ... రైతును నిందిస్తుంటారు. అది పూర్తిగా తప్పు. వరదల కారణంగా భూమి కోతకు గురికావడం, అవగాహన లేక పంటలను మార్చకుండా ఒకే పంటను మళ్లీ మళ్లీ వేయడం... భూమిని బీడుగా వదిలేయడం వంటి అనేక కారణాల్లో రసాయన ఎరువులు ఒక కారణం మాత్రమే. అలాగే ఊరికి ఒకరో ఇద్దరో రైతులు ముందడుగు వేస్తే సరిపోదు. ప్రభుత్వాలు ముందుకు వచ్చి పాలసీలు రూపొందించాలి. – ప్రొఫెసర్ ఎ.కె. జయలేఖ, పర్యావరణ పరిరక్షణ ఉద్యమకారిణి, savesoil.org -
పట్టణాలు.. ఇక సహజ అడవులు
సాక్షి, అమరావతి: నగరాలు, పట్టణాల్లో ఎండ వేడిమిని తగ్గించేందుకు.. కాంక్రీట్ జంగిల్స్‌లో ప్రాణవాయువును అధికంగా అందించేందుకు అనువైన పార్కుల రూపకల్పనకు ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ నడుం బిగించింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల్లో (అర్బన్ లోకల్ బాడీస్–యూఎల్బీ) ఏర్పాటు చేయబోయే గ్రీన్ బెల్ట్, పార్కులు, సెంట్రల్ మీడియన్స్ వంటి వాటిలో పచ్చదనం పెంపు వంటి కార్యక్రమాలను ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో విధిగా చేపట్టాలని ఆదేశించడంతో రాష్ట్రంలోని మునిసిపాలిటీలు పట్టణాల పరిధిలో పార్కుల అభివృద్ధిని ఈ సంస్థ ద్వారా చేపడుతున్నాయి. ఆయా యూఎల్బీల్లో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూముల్లో పార్కులు, పట్టణ అడవులను అభివృద్ధి చేస్తున్నారు. ముఖ్యంగా స్థానిక ప్రజల ఆరోగ్యానికి మేలు చేయడంతోపాటు ఆరోగ్యాన్ని పెంచే మొక్కలతో సహజ అడవులను అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా నాలుగు ఆగ్రో క్లైమాటిక్ జోన్లలో నాలుగు పార్కులను (విజయవాడ వాంబే కాలనీ, విశాఖ సమీపంలోని సింహాచలం ఏపీజీ అండ్ బీసీ సెంట్రల్ నర్సరీ, తిరుపతి సమీపంలోని శ్రీకాళహస్తి ఏపీజీ అండ్ బీసీ సెంట్రల్ నర్సరీ, అనంతపురం శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో) పెంచారు. ఈ పార్కుల ఏర్పాటు తర్వాత స్థానికంగా ఉష్ణోగ్రతల్లో తగ్గుదలతోపాటు, ఎక్కువ స్థాయిలో ఆక్సిజన్ ఉత్పత్తి కావడం గమనించిన అధికారులు ఈ తరహాలోనే రాష్ట్రంలోని 124 యూఎల్బీల్లో సహజ అడవుల పెంపకానికి సిద్ధమవుతున్నారు. ఏమిటీ.. మియావాకి అడవులు తక్కువ స్థలంలోనే ఎక్కువ మొక్కలను అడవుల్లా పెంచే జపాన్ విధానాన్ని మియావాకి పద్ధతి అంటారు. ఈ విధానంలో పెంపకం వల్ల మొక్కలు అత్యంత త్వరితంగా పెరగడమే కాకుండా దట్టంగా పచ్చదనం పరుచుకుని వనం మాదిరిగా కనిపిస్తుంది. నగరాల్లో తక్కువ స్థలంలోనే ఎక్కువ పచ్చదనానికి ఎంతో ఉపయుక్తమైన ఈ విధానాన్ని జపాన్‌కు చెందిన వృక్ష శాస్త్రవేత్త అకీరా మియావాకీ కనుగొనడంతో దీనికి ఈ పేరు వచ్చింది. ఈ విధానం నేల, వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పని చేస్తుందని మియావాకీ నిరూపించాడు. పైగా ఇది పట్టణ ప్రాంతాలకు అనువుగా ఉంటూ.. సేంద్రియ పద్ధతిలో పెరిగే అడవి కావడంతో స్థానిక జీవ వైవిధ్యానికి తోడ్పాటునిస్తుంది. ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చి పెంచే మొక్కల కంటే ఈ విధానంలో మొక్కలు 10 రెట్లు వేగంగా పెరగడంతో పాటు 30 రెట్లు దట్టంగా ఉండటం గమనార్హం. మియావాకి అనుసరించిన విధానం నుంచి ప్రేరణ పొంది మన ప్రాంతానికి అనువైన ‘హైడెన్స్ ప్లాంటేషన్’ విధానంలో రాష్ట్రంలో అర్బన్ పార్కులు, మినీ అడవుల పెంపునకు గ్రీనింగ్ కార్పొరేషన్ అధికారులు, ఇంజనీర్లు ప్రాధాన్యం ఇస్తున్నారు. తక్కువ నిర్వహణ వ్యయంతో ఏడాది కాలంలోనే దట్టమైన అడవిగా మారడంతో పాటు వివిధ రకాల పక్షులు, కీటకాల వంటి జీవులకు ఇవి ఆవాసంగా మారుతున్నాయి. విజయవాడలోని వాంబే కాలనీలో ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 150 రకాల వృక్ష జాతులతో మొత్తం 2,600 మొక్కలు ఎంపిక చేసి నాలుగేళ్ల కిందట నాటారు. ఇప్పుడు ఆ ప్రాంతం నివాసాల మధ్య సహజమైన అడవిని తలపిస్తోంది. అనేక పక్షులకు నివాసంగా మారడంతో పాటు జీవవైవిధ్యం పరిరక్షణ, కార్బన్ సీక్వెస్ట్రేషన్ (కర్బనాలను వేరు చేయడం) మెరుగుపడినట్టు గుర్తించారు. ప్లాంటేషన్ అయిన ఎనిమిది నెలల తర్వాత విజయవాడ వాంబే కాలనీలో మియావాకి తరహా అడవులు జీవ వైవిధ్యం, ఆక్సిజన్ పెంపునకు తోడ్పాటు చెట్లను విచక్షణా రహితంగా నరికేస్తూ పట్టణ ప్రాంతాలు వేగంగా విస్తరిస్తున్నాయి. దీనివల్ల ఏటా ఉష్ణోగ్రతలు, రేడియేషన్ పెరిగిపోతున్నాయి. చెట్లు లేకపోవడంతో మనుషులతో మమేకమైన అనేక పక్షి జాతులు కనిపించకుండా పోయాయి. ప్రస్తుత కాంక్రీట్ జంగిల్స్‌లో ప్రజల మనుగడకు అవసరమైన స్వచ్ఛమైన గాలి కూడా కరవవుతోంది. ఈ క్రమంలో జీవరాశి మనుగడకు, అర్బన్ అడవులు తప్పనిసరని భావించిన రాష్ట్ర ప్రభుత్వం వియావాకి పార్కుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోంది. అర ఎకరం విస్తీర్ణంలో రూ.20 లక్షల ఖర్చుతో అద్భుతమైన మియావాకి అర్బన్ పార్కును తయారు చేయవచ్చు. నాటే మొక్కల్లో పళ్ల రకాలు, నీడనిచ్చేవి, ఔషధ రకాల మొక్కలు ఉండటం వల్ల కోతులు వంటి జీవులు, పక్షులకు ఆహారం లభిస్తుంది. తద్వారా అవి పట్టణాలపై దాడి చేయడం నిలిచిపోతుందంటున్నారు. మేం రూపొందించిన 4 మియావాకి పార్కులు మంచి ఫలితాలిచ్చాయి. ప్రభుత్వ భూముల్లో ఇలాంటి పార్కుల రూపకల్పన ఎంతో అవసరం. – పి.సత్యనారాయణ, ప్రిన్సిపల్ ఆర్కిటెక్ట్, ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ -
మీ బాడీలో ఏమున్నాయో తెలుసా? మన బరువులో.. ఏ మూలకం ఎంత?
హైడ్రోజన్, ఆక్సిజన్ కలిస్తే నీళ్లు.. సోడియం, క్లోరిన్ కలిస్తే ఉప్పు.. ఐరన్, కార్బన్ కలిస్తే ఉక్కు.. ఇలా ప్రకృతిలో ఉన్న ప్రతిదీ వివిధ మూలకాల కలయికే. రాళ్లు, రప్పలు, వస్తువులే కాదు.. జీవులన్నీ కూడా రసాయన పదార్థాల సమ్మేళనమే. మరి మనం.. అంటే మనుషులం ఏ మూలకాలతో తయారయ్యాం? ఏమేం ఉంటాయి? ఎంతమేర ఉంటాయో తెలుసుకుందామా.. – సాక్షి సెంట్రల్ డెస్క్ 118 మూలకాలున్నా.. ఇప్పటివరకు భూమ్మీద 118 మూలకాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. అందులో కొన్ని విస్తారంగా ఉంటే.. మరికొన్ని మూలకాలు చాలా అరుదుగా లభిస్తాయి. భూమిపై మట్టి, నీళ్లు, గాలి, చెట్లు, జంతువులు, ఇళ్లు, వాహనాలు, వస్తువులు, మన ఫోన్లు.. ఇలా మనతోపాటు చుట్టూ ఉన్న ప్రతిదీ ఈ 118 మూలకాలతోనే తయారై ఉంటుంది. వేర్వేరు వస్తువుల్లో వేర్వేరు మూలకాలు ఉంటాయి. అదే చెట్లు, జంతువులు, ఇతర జీవజాలంలో మాత్రం ప్రధానంగా ఉండేవి నాలుగు మూలకాలే. మరికొన్ని మూలకాలు నామమాత్రస్థాయిలో ఉంటాయి. (చదవండి: పిల్లులూ పేర్లు గుర్తిస్తాయ్) లెక్కిస్తే.. హైడ్రోజన్ టాప్ మన శరీరంలో బరువుపరంగా ఆక్సిజన్ టాప్ అయినా.. పరమాణువుల సంఖ్య లెక్కన చూస్తే హైడ్రోజన్ శాతం చాలా ఎక్కువ. మన శరీర బరువులో నీటి శాతమే ఎక్కువ. రెండు హైడ్రోజన్, ఒక ఆక్సిజన్ పరమాణువులు కలిస్తే ఒక నీటి అణువు ఏర్పడుతుంది. అంటే ఆక్సిజన్ కంటే హైడ్రోజన్ రెండు రెట్లు ఎక్కువ. ► కానీ హైడ్రోజన్ పరమాణువు బరువు చాలా తక్కువ. 16 హైడ్రోజన్ పరమాణువులు కలిస్తే.. ఒక్క ఆక్సిజన్ పరమాణువు అంత అవుతాయి. నాలుగింటితోనే .. ఆక్సిజన్, కార్బన్, హైడ్రోజన్, నైట్రోజన్.. మన శరీరంలో 97 శాతం బరువు ఈ నాలుగు మూలకాలదే. అందులోనూ సగానికిపైగా బరువు ఒక్క ఆక్సిజన్‌దే కావడం విశేషం. ► నిజానికి మన శరీరంలో 60 శాతం నీళ్లే. ఆక్సిజన్, హైడ్రోజన్ మూలకాలు కలిసి ఏర్పడేవే నీళ్లు. దీనికితోడు శరీరంలోని అన్ని కణాలు, ప్రొటీన్లు, అమైనో ఆమ్లాల్లో ఆక్సిజన్ ఉంటుంది. ఇలా అన్నింటిలో కలిపితే శరీర బరువులో 65 శాతం ఆక్సిజనే. ఏ మూలకం.. ఎందుకోసం? మన శరీరం ప్రధానంగా నాలుగు మూలకాలతోనే నిర్మితమైనా.. మరికొన్ని మూలకాలు కూడా అత్యంత కీలకం. ఉదాహరణకు మన శరీరబరువులో సోడియం ఉండేది 0.2 శాతమే. కానీ అది తగ్గితే శరీరం పనితీరు దెబ్బతిని ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఆక్సిజన్: శరీరంలో ఉండే నీటితోపాటు అన్ని జీవ పదార్థాల్లో (ఆర్గానిక్ కాంపౌండ్స్) ఉంటుంది. శ్వాసక్రియ, శక్తి ఉత్పాదనకు కీలకం. కార్బన్: జీవ పదార్థం, డీఎన్ఏలో కీలక మూలకం ఇది. కార్బోహైడ్రేట్స్, కొవ్వులు, న్యూక్లిక్ ఆమ్లాలు, ప్రొటీన్లు.. ఇలా చాలా వాటిలో ఉంటుంది. అసలు కార్బన్ ఆధారిత పదార్థాల (ఆహారం) నుంచి శరీరంలో శక్తి ఉత్పత్తి అవుతుంది. హైడ్రోజన్: జీవ పదార్థం, డీఎన్ఏలో కీలక మూలకమిది. నీటితోపాటు శరీరంలోని దాదాపు అన్ని ఆర్గానిక్ అణువుల్లో హైడ్రోజన్ ఉంటుంది. నైట్రోజన్: జీవానికి మూలమైన జన్యు పదార్థం (డీఎన్ఏ, ఆర్ఎన్ఏ), ఇతర ఆర్గానిక్ కాంపౌండ్స్, ప్రొటీన్లలో నైట్రోజన్ ఉంటుంది. కాల్షియం: శరీరంలో ఎముకలు, దంతాలు, కణాల మధ్య గోడలు (త్వచాలు) దీనితోనే నిర్మితమవుతాయి. ప్రోటీన్ల ఉత్పత్తికీ ఇది కీలకం. ఫాస్పరస్: ఎముకలు, దంతాలు, డీఎన్ఏ, ఏటీపీ ప్రొటీన్‌లో ఫాస్పరస్ ఉంటుంది. జీవం మనుగడకు కీలకమైన మూలకమిది. కొంచెమే అయినా అత్యవసరం.. నాడీ వ్యవస్థ పొటాషియం, సోడియం కీలకం. కణాలు, అవయవాల నుంచి నాడుల ద్వారా మెదడుకు వీటి అయాన్ల రూపంలోనే సమాచార ప్రసారం జరుగుతుంది. ఇక శరీరంలో ద్రవాల సమతుల్యతకు సోడియం, కండరాలు సరిగా పనిచేసేందుకు పొటాషియం అత్యవసరం. ► అత్యంత కీలకమైన అమైనో ఆమ్లాల్లో సల్ఫర్ ఉంటుంది. వెంట్రుకలు, గోర్లు, చర్మంలోని కెరాటిన్‌లో సల్ఫర్ కీలకం. ► రక్తంలోని హిమోగ్లోబిన్లో ఐరన్.. ప్రొటీన్ల తయారీ, రోగనిరోధకశక్తికి మెగ్నీషియం, జింక్ కీలకం. బంగారమూ ఉంటుంది మన శరీరంలో అతి సూక్ష్మ మొత్తంలో బంగారం కూడా ఉంటుంది. 70 కిలోల బరువున్న మనిషిలో సుమారు 0.2 మిల్లీగ్రాముల పుత్తడి ఉంటుందని.. శరీరంలో ఎలక్ట్రికల్ సిగ్నల్స్ వేగంగా ప్రయాణించడానికి తోడ్పడుతుందని ఆక్స్ఫర్డ్ వర్సిటీ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మొత్తం అణువులెన్నో తెలుసా? సాధారణంగా 70 కిలోల బరువున్న మనిషి శరీరంలో ఏడు ఆక్టేలియన్ల అణువులు ఉంటాయని శాస్త్రవేత్తల అంచనా. (ఒక ఆక్టిలియన్ అంటే పది లక్షల కోట్ల కోట్ల కోట్లు.. సులువుగా చెప్పాలంటే పది పక్కన 27 సున్నాలు పెడితే వచ్చే సంఖ్య) (చదవండి: సమ్మర్ డేస్: చలువ పందిరి జ్ఞాపకం) -
రెండు రోజులకు సరిపడా ఆక్సిజన్ నిల్వచేయండి
న్యూఢిల్లీ: ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్న వేళ కరోనా కేసుల సంఖ్యలో పెరుగుదల వేగం అనూహ్యంగా ఎక్కువైంది. ఈ నేపథ్యంలో ఆస్పత్రిలో కోవిడ్ రోగుల చేరికలు పెరిగే ప్రమాదం మరింతకానుంది. దీంతో ఆస్పత్రుల్లో కనీసం 48 గంటలకు సరిపడా మెడికల్ ఆక్సిజన్ బఫర్ స్టాక్‌ను సిద్ధంగా ఉంచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచనలు చేసింది. ప్రైవేట్ వైద్య కేంద్రాల్లోనూ ఆక్సిజన్ సేవలు అందుబాటులో ఉన్నందున డిమాండ్ ఒక్కసారిగా పెరిగితే అందుకు అనుగుణంగా సరఫరా ఉండేలా కార్యాచరణను అమలుచేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రాసిన లేఖలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ పేర్కొన్నారు. ఇన్–పేషెంట్ ఆస్పత్రులు, ఆక్సిజన్ సేవలందించే కేంద్రాల వద్ద ఆక్సిజన్ బఫర్ స్టాక్‌ను సిద్ధంగా ఉంచాలన్నారు. ద్రవ ఆక్సిజన్ ట్యాంక్‌లను నింపాలని, రీఫిల్లింగ్ కోసం ఇబ్బందులు పడకుండా చూసుకోవాలన్నారు. ఆరోగ్య కేంద్రాల వద్ద అదనపు ఆక్సిజన్ సిలిండర్లు, నిండుకుంటే వెంటనే తెప్పించే ఏర్పాట్లూ చేయాలని పేర్కొన్నారు. కాగా, కోవిడ్ తాజా పరిస్థితిపై గురువారం సాయంత్రం నాలుగున్నరకు ప్రధాని మోదీ సీఎంలతో వర్చువల్ సమీక్ష నిర్వహిస్తారు. కరోనా కేసుల ఉధృతి ఆగటం లేదు. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,94,720 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్‌ను జలుబుగా లెక్కకట్టొద్దు కరోనా కేసుల్లో వారపు పాజిటివిటీ మూడొందలకుపైగా జిల్లాల్లో ఐదు శాతాన్ని మించడంతో ఒమిక్రాన్‌ను సాధారణ జలుబుగా పరిగణించవద్దని, తేలిగ్గా తీసుకోవద్దని, అప్రమత్తంగా ఉండాలని నీతి ఆయోగ్ సభ్యుడు(ఆరోగ్యం) వీకే పాల్ చెప్పారు. -
గాలి పీల్చుకోవడానికి రూ.15 లక్షలు ఖర్చు చేసిన రొనాల్డో
అదేంటీ వాతావరణంలోని పుక్కిడికి దొరికే గాలిని పీల్చుకోవడానికి స్వేచ్ఛ ఉంది కదా! అంతేసి ఖర్చు ఎందుకు? దండగ కాకపోతే.. అనుకుంటున్నారా?. ఆ గాలికి చాలా ప్రత్యేకత ఉంటుంది మరి. ప్యూర్ ఎయిర్‌గా పేరున్న ఈ మెషిన్ కోసం సాకర్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో భారీగానే ఖర్చుపెట్టాడు. ఇంతకీ దాని ఖర్చెంతో.. ప్రత్యేకతలేంటో తెలుసా? హైపర్బారిక్ ఆక్సిజన్ థెరపీ (HBOT) మెషిన్ ఖరీదు 15,000 పౌండ్లు. మన కరెన్సీలో 15 లక్షల రూపాయలపైనే. ఈ డివైజ్ ప్రత్యేకత ఏంటంటే.. ప్యూర్ ఆక్సిజన్‌ను రక్తంలోకి సరఫరా చేస్తుంది. తద్వారా రక్తపు ప్లాస్మాలోని దెబ్బతిన్న కణజాలం క్యూర్ అయిపోతుంది. ఫిట్‌నెస్‌కు మొదటి ప్రాధాన్యత ఇచ్చే 36 ఏళ్ల రొనాల్డో.. ఈ ఛాంబర్‌ను తన జిమ్ రూంలో ఈ మధ్యే ఏర్పాటు చేయించాడు. చిన్నచిన్నగాయాలకు సైతం మ్యాచ్‌లకు దూరం అయ్యే రొనాల్డ్.. ఇలాంటి హైటెక్ చికిత్సల ద్వారా తరచూ ఉపశమనం పొందుతాడట. వాస్తవానికి రొనాల్డో ఇలాంటి ఛాంబర్లను ఉపయోగించడం కొత్తేం కాదు. 2016లో యూరో ఫైనల్లో తగిలిన మోకాలి గాయం తర్వాత స్పానిష్ ఐల్యాండ్ ఇబిజాకు వెళ్లి.. ఇలాంటి ఛాంబర్‌లోనే ట్రీట్మెంట్ తీసుకున్నాడు. కానీ, యూకేలో అలాంటి మెషిన్లు దొరక్కపోవడంతో కొని.. చెషైర్‌లోని తన ఇంట్లో ఇన్స్టాల్ చేయించుకున్నాడు. ఇదిలా ఉంటే.. కిందటి ఏడాది 50 వేల పౌండ్లు ఖర్చు పెట్టి ఐస్ ఛాంబర్‌ను కొన్న విషయం తెలిసిందే. ప్రపంచంలోనే రిచ్చెస్ట్ సాకర్ ప్లేయర్‌గా పేరున్న రొనాల్డోతో మామూలుగా ఉండదు మరి!. ఛాంబర్ ప్రత్యేకతలు చిన్న ఛాంబర్ లాంటి గది ఉంటుంది. డ్రైవింగ్ సంబంధిత సమస్యలు ఉన్నవాళ్ల కోసం రూపొందించినప్పటికీ.. రకరకాల జబ్బులు ఉన్నవాళ్లు తమకు నయం కావడానికి ఈ చికిత్సను ఆశ్రయిస్తుంటారు. ఈ లిస్ట్‌లో సెలబ్రిటీలు కూడా ఎక్కువ!. 1662లో ఓ ఫిజీషియన్ ఈ తరహా ఛాంబర్ ఒకటి స్వచ్ఛమైన ఆక్సిజన్ కోసం నిర్మించినట్లు ప్రచారంలో ఉంది. 1940లో మిలిటరీ డైవర్స్ కోసం అమెరికా దేశం HBOT ఎక్కువ స్థాయిలో తయారు చేయించింది. అనుమతులు పొందాకే వీటిని వాడాల్సి ఉంటుంది. HBOTలతో ఉపయోగాలే కాదు.. సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయట. అందుకే వీటిని వినియోగించేముందు కొన్ని పరీక్షలు కూడా నిర్వహిస్తుంటారు మరి!. ఎక్కువ మంది ఒకేసారి ఈ చికిత్స తీసుకునేందుకు ప్రత్యేక గదులను సైతం ఏర్పాటు చేయిస్తుంటారు. ఈ ట్రీట్మెంట్కు కాస్ట్ ఎక్కువగా ఉంటోంది. చదవండి: రొనాల్డోకు భారత్‌లో అరుదైన గౌరవం -
AP: గాల్లోని ‘ఆక్సిజన్’ను ఒడిసి పట్టారు!
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్రాష్ట్రంలో మెడికల్ ఆక్సిజన్ కొరత రానీయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా 50, అంతకన్నా పడకలు పైబడిన ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలో గాలి నుంచి మెడికల్ ఆక్సిజన్ తయారు చేసే ప్రెజర్ స్వింగ్ అబ్జార్షన్(పీఎస్ఏ) ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 81 సామాజిక, జిల్లా, బోధన ఆస్పత్రుల్లో 92 పీఎస్ఏ ప్లాంట్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. వీటి ఏర్పాటుకు సంబంధించి సివిల్ పనులన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. వచ్చే నెల నుంచి ఇవి అందుబాటులోకి రానున్నాయి. నిమిషానికి 500 లీటర్లు, 700 లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యంతో రెండు రకాల 92 ప్లాంట్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఈ మొత్తం ప్లాంట్ల ఏర్పాటుతో ఆయా ఆస్పత్రుల్లో నిమిషానికి 71,000 లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. దీంతో పుష్కలంగా ప్రాణ వాయువు సమకూరనుంది. కరోనా 3వ దశ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ప్లాంట్ల ఏర్పాటు పనులను అనతి కాలంలో ప్రభుత్వం వేగవంతంగా చేపట్టింది. 92 ప్లాంట్లను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. వీటిలో 61 ప్లాంట్లను ఇప్పటికే ఆస్పత్రుల్లో అమర్చారు. మిగిలిన 31 ప్లాంట్లు నెలాఖరులోగా అమర్చనున్నారు. ప్లాంట్ల ఏర్పాటుతో పాటు ఐసీయూ, నాన్ ఐసీయూ పడకలకు ఆక్సిజన్ సరఫరాకు సంబంధించిన సివిల్ పనులన్నీ పూర్తయ్యాయి. ఆక్సిజన్ ఉత్పత్తి ప్రారంభం 81 చోట్ల 92 పీఎస్ఏ ప్లాంట్ల ఏర్పాటు పనులు దాదాపుగా పూర్తయ్యాయి. డిసెంబర్లో అన్ని ప్లాంట్ల నుంచి ఆక్సిజన్ ఉత్పత్తి ప్రారంభమవుతుంది. – మురళీధర్‌రెడ్డి, ఏపీ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ -
Science Facts: చీమల రక్తం అందుకే ఎర్రగా ఉండదట..!
Why is Ant’s Blood Not Red Like We Humans Have: చురుక్ మని కుట్టి పుసుక్కున జారుకునే చీమలను... ఒక్కోసారి దొరకపుచ్చుకుని కసితీర నలిపి అవతలేస్తాం కూడా!! కానీ మనుషుల రక్తం తాగే చీమల్లో కూడా రక్తం ఉంటుందా? ఒకవేళ ఉంటే ఏ రంగులో ఉంటుంది? ఇలాంటి అనుమానాలు ఎప్పుడైనా వచ్చాయా? మీ ప్రశ్నలకు సమాధానాలు ఇవిగో.. చీమల్లో రక్తం ఉంటుంది. ఐతే అది ఎరుపు రంగులోకాకుండా పసుపు పచ్చరంగులో ఉంటుంది. దీనిని హేమోలింఫ్ అని అంటారు. మిడతలు, నత్తల వంటి వర్టిబ్రేట్స్ (వెన్నెముక ఉండే జంతువులు - సకశేరుకాలు)లో ఈ విధమైన రక్తం ఉంటుంది. ఈ ద్రవంలో ఎర్ర రక్తకణాలు లేకపోవటం వల్ల తెల్లగా కనిపిస్తుంది. చీమలు వంటి ఇతర కీటకాల్లో అమైనో యాసిడ్స్ అధికంగా ఉండటమే అందుకు కారణమట. చదవండి: Punam Rai: ఆడపిల్లంటే ఇలా ఉండాలి.. సమాజం అంత అందమైనదేం కాదు!! వీటి రక్త ప్రసరణ వ్యవస్థ కూడా భిన్నంగా ఉంటుంది. మనుషుల్లో రక్తం సిరలు, ధమనుల్లో ప్రవహిస్తుంది. ఐతే కీటకాల్లో మాత్రం ధమనులు ఉండవు కానీ శరీరమంతా స్వేచ్ఛగా ఏ దిశలోనైనా రక్తం ప్రవహిస్తుంది. అందువల్లనే చీమలు ఎటువంటి వాతావరణంలోనైనా సులభంగా జీవించగలవు. ఎర్ర రక్త కణాల్లో హిమోగ్లోబిన్ ఉన్నట్లే, హిమోలింఫ్ లోపల హిమోసైనిన్ ఉంటుంది. రక్తం - హిమోలింఫ్ మధ్య గుమనించదగిన ముఖ్యమైన వ్యత్యాసం ఏమిటంటే.. మనుషుల్లోనైతే రక్తం ద్వారా ఆక్సిజన్ శరీరం అంతటా వ్యాపిస్తుంది. కీటకాల్లో ఉండే హేమోలింఫ్ ఆక్సిజన్‌ను శరీరం అంతటా వ్యాపింపచేయదు. వీటి శరీరాలకు స్పిరాకిల్స్ అని పిలువబడే చిన్న చిన్న రంధ్రాల ద్వారా శ్వాస తీసుకుంటాయి. ఈ రంధ్రాలు ఎర్ర రక్త కణాలతో పనిలేకుండా నేరుగా క్రిమి అవయవాలకు ఆక్సిజన్ చేరవేస్తుంటాయి. చదవండి: Viral: తెలుసా! ఈ ఉల్లిని కట్ చేస్తే కన్నీళ్లు రావట..! -
800 కోట్ల మంది లక్ష ఏళ్లు బతకొచ్చు!
లిస్మోర్(ఆస్ట్రేలియా): భూమికి ఉపగ్రహమైన చంద్రుడిపై మానవ మనుగడకు ఆస్కారం ఉందా? అనే అంశంపై దశాబ్దాలుగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. మనిషి జీవించాలంటే శ్వాసించాల్సిందే. అందుకు ప్రాణవాయువు(ఆక్సిజన్) కావాలి. ఆ ప్రాణవాయువు చందమామపై ఇబ్బడిముబ్బడిగా ఉందని ఆస్ట్రేలియా స్సేస్ ఏజెన్సీ చెబుతోంది. అయితే, అది గాలి రూపంలో లేదని, చంద్రుడి ఉపరితలంపై వివిధ రాళ్లు, ఖనిజాల్లో నిక్షిప్తమై ఉన్నట్లు గుర్తించింది. చందమామపై రాళ్లను సేకరించి, వాటినుంచి ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్రక్రియపై ఇప్పుడు ఆస్ట్రేలియా దృష్టి పెట్టింది. ఇందుకోసం ఈ ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియా అంతరిక్ష సంస్థ, అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా ఆస్ట్రేలియా తయారు చేసే రోవర్‌ను చంద్రుడిపైకి పంపిస్తారు. ఈ రోవర్ సాయంతో చంద్రుడిపై రాళ్లను సేకరించి, భూమిపైకి తీసుకొస్తారు. వాస్తవానికి చందమామపై వాతావరణం లేదు. రాళ్లు, దుమ్ము ధూళితోపాటు సిలికా, అల్యూమినియం, ఐరన్, మెగ్నీషియం ఆక్సైడ్ ఉన్నాయి. వీటన్నింటిలో ఆక్సిజన్ సమృద్ధిగా ఉందని ఆస్ట్రేలియా స్పేస్ ఏజెన్సీ పరిశోధకులు చెబుతున్నారు. అది ఎంతమేరకు ఉందన్న దానిపై ఒక అంచనాకొచ్చారు. ఉపరితలం నుంచి కేవలం 10 మీటర్ల లోతులో ఒక క్యూబిక్ మీటర్ రాళ్లలో 630 కిలోల ఆక్సిజన్ ఉందని పేర్కొంటున్నారు. మనిషి ఒకరోజు జీవించాలంటే 800 గ్రాముల ఆక్సిజన్‌ను శ్వాసించాలి. 630 కిలోల ఆక్సిజన్‌తో ఒకరు రెండేళ్లకుపైగానే జీవించవచ్చు. ఈ లెక్కన 800 కోట్ల మంది లక్ష ఏళ్లపాటు జీవించేందుకు అవసరమైన ఆక్సిజన్ చంద్రుడిపై 10 మీటర్ల లోతుదాకా ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. అయితే, చంద్రుడిపై ఉన్న ప్రాణవాయువును ఎంత సమర్థంగా వెలికితీసి, వాడుకుంటామన్న దానిపై ఇదంతా ఆధారపడి ఉంటుంది. -
‘హుస్సేన్‌సాగర్’ ప్రియులకు శుభవార్త.. తగ్గిన కాలుష్యం,పెరిగిన ఆక్సిజన్
సాక్షి, హైదరాబాద్: నగరం నడిబొడ్డున ఉన్న చారిత్రక హుస్సేన్‌సాగర్‌లో ఆక్సిజన్ మోతాదు గణనీయంగా పెరిగింది. పలు రకాల చేపలు, వృక్ష, జంతు ఫ్లవకాల మనుగడకు అత్యావశ్యకమైన కరిగిన ఆక్సిజన్ మోతాదు పెరగడంతో సాగర్‌ను సందర్శించే సిటీజనులు సైతం స్వచ్ఛ ఊపిరి పీల్చుకుంటున్నట్లు కాలుష్యనియంత్రణ మండలి(పీసీబీ) తాజా అధ్యయనంలో తేలింది. పర్యావరణహిత బయోరెమిడియేషన్ విధానం, ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా సాగర జలాలు స్వచ్ఛంగా మారడంతోపాటు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాల మేరకు ఇతక కాలుష్యకాలుండడం ఊరటనిచ్చే అంశం. ప్రధానంగా కరిగిన ప్రాణవాయువు మోతాదు ప్రతి లీటర్ సాగర జలాల్లో 4 మిల్లీ గ్రాములుగా నమోదైనట్లు స్పష్టమైంది. సాగర్‌లో కాలుష్య మోతాదు తగ్గడంతోనే ఆక్సిజన్ శాతం పెరిగినట్లు ఈ అధ్యయనం పేర్కొంది. చదవండి: ఫిట్‌గా ఉన్నా..జిమ్ చేస్తున్నా.. గుండెపోటు ఎందుకు? బయో రెమిడియేషన్‌తో సత్ఫలితాలు సాగర జలాల స్వచ్ఛతను మెరుగుపరిచేందుకు చేపట్టిన పర్యావరణ హిత బయోరెమిడియేషన్ విధానం క్రమంగా సత్ఫలితాన్నిస్తోంది. ఈ విధానంలో బ్యాక్టీరియా నీటిని శుద్ధి చేస్తుంది. ఏడాదిగా ఈ విధానం అమలుతో హుస్సేన్‌సాగర్ నలుమూలల్లోనూ ఆక్సిజన్ మోతాదు గణనీయంగా పెరిగినట్లు ఈ అధ్యయనం తెలిపింది. సుమారు 70 శాతం ఈ విధానం విజయవంతమైందని స్పష్టంచేసింది. గతంలో జలాల్లో ఆక్సీజన్ మోతాదు గణనీయంగా తగ్గుముఖం పట్టిన కారణంగానే ఈ విధానాన్ని ప్రవేశపెట్టిన విషయం విదితమే. పలు అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ విధానం అమల్లో ఉన్నట్లు పీసీబీ అధికారులు ‘సాక్షి’కి తెలిపారు. మన దేశంలో గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనూ ఇటీవలికాలంలో ఈవిధానాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అత్యధిక లేదా అత్యల్ప కరిగిన ఆక్సిజన్ మోతాదు ఉన్న జలాల్లో చేపలు, వృక్ష, జంతు ఫ్లవకాల మనుగడ కష్టాసాధ్యమౌతుందని స్పష్టంచేశారు. చదవండి: కుట్లు వేశారు.. కడుపులో సూది మరిచారు! బీఓడీ అధికంగానే.. సాగర జలాల్లో ఆక్సిజన్ మోతాదు పెరగడం ఊరటనిచ్చినా.. బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ మోతాదు ప్రతి లీటర్ సాగర జలాల్లో 22 మిల్లీగ్రాములుగా నమోదైనట్లు పీసీబీ నివేదిక తెలిపింది. పీసీబీ ప్రమాణాల మేరకు బీఓడీ 3 మిల్లీగ్రాములుగా ఉండాలి. కాగా ఇటీవలి వర్షాలకు కూకట్పల్లి నాలా నుంచి వచ్చి సాగర్‌లో చేరిన జలాల్లో పారిశ్రామిక కాలుష్య ఆనవాళ్లుండడంతో బీఓడీ మోతాదు పెరిగినట్లు పీసీబీ నిపుణులు చెబుతున్నారు. స్వచ్ఛ సాగర్‌ను సాకారం చేయాలి నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్‌ను స్వచ్ఛమైన వర్షపునీరు చేరేలా చర్యలు తీసుకోవాలి. సాగర గర్భంలో దశాబ్దాలుగా పేరుకుపోయి గడ్డకట్టిన వ్యర్థాలను తొలగించాలి. ఆస్ట్రియాలోని డాన్యుబ్ నది తరహాలో సాగర్‌ను ప్రక్షాళన చేయాలి. సాగర్ చుట్టూ వాణిజ్య కార్యకలాపాలను ప్రోత్సహించరాదు. – సజ్జల జీవానందరెడ్డి, పర్యావరణ వేత్త హుస్సేన్‌సాగర్ జలాల నాణ్యత, పలు కాలుష్యకాల మోతాదు ఇలా ఉంది ప్రతి లీటరు నీటిలో మిల్లీగ్రాముల్లో.. ప్రాంతం గాఢత కరిగిన ఆక్సిజన్ బీఓడీ ఎన్‌టీఆర్‌పార్క్ 7.3 4 మి.గ్రా 22 మి.గ్రా లుంబినీపార్క్ 7.4 4 22 బుద్ధవిగ్రహం 7.4 4.2 27 -
రాష్ట్రంలో ఆక్సిజన్ లోటు రాదు: సీఎస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇకపై ఆక్సిజన్ లోటు రాదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ పేర్కొన్నారు. ప్రస్తుతం 300 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తికి రాష్ట్రంలో సౌకర్యం ఉందని తెలిపారు. కరోనా ఇంకా అంతం కాలేదని, అర్హులైన ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో 3 కోట్ల డోసుల పంపిణీ నేపథ్యంలో శుక్రవారం వైద్య, ఆరోగ్య శాఖ కార్యాల యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో సీఎస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, కొవ్వొత్తులు వెలిగించి, గాల్లోకి బెలూన్లు విసిరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ థర్డ్‌వేవ్ వచ్చినా దాన్ని తట్టుకునేలా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. రాష్ట్రంలో కోటి వ్యాక్సిన్లు పంపిణీ చేసేందుకు 169 రోజులు పట్టిందని, ఆ తర్వాత కోటి వాక్సిన్ల పంపిణీకి 81 రోజులు, మూడో కోటి వ్యాక్సిన్ల పంపిణీకి 36 రోజుల సమయం పట్టిందని తెలిపారు. జాతీయ సగటుతో పోలిస్తే వ్యాక్సినేషన్ విషయంలో రాష్ట్రం ముందంజలో ఉంద న్నారు. అనంతరం డీహెచ్ శ్రీనివాసరావు మాట్లాడుతూ డిసెంబర్ నెలాఖరు కల్లా వంద శాతం వ్యాక్సినేషన్ చేసేలా కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలిపారు. -
‘ఆర్టీసీ’ రెఫరల్ బిల్లులు తడిసిమోపెడు
సాక్షి, హైదరాబాద్: తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రిలో కోవిడ్ సెంటర్ ఏర్పాటుకు రూ.2 కోట్లు ఖర్చవుతాయని అధికారులు ఇటీవల అంచనా వేశారు. ఆక్సిజన్ పైపులైన్ ఏర్పాటు చేసి, ఆ తర్వాత చేతులెత్తేశారు. నిధుల సమస్యతో ఆ పని అప్పట్లో ఆగిపోయింది. ఈ ఆస్పత్రిలో వసతులు లేక ముఖ్య చికిత్సలను ఇతర ప్రైవేట్ ఆస్పత్రిలో చేయిస్తున్నారు. దీనికి రెఫరల్ బిల్లులు సగటున నెలకు రూ.2.5 కోట్ల వరకు చెల్లించాల్సి వస్తోంది. అంటే.. ఒక నెల రెఫరల్ బిల్లుతో కోవిడ్ సెంటర్ ఏర్పాటు పనులు పూర్తయి ఉండేవి. ఈ రెఫరల్ బిల్లులే ఆర్టీసీని ఆస్పత్రిని నిలువునా ముంచుతున్నాయి. సగటున సాలీనా రూ.30 కోట్ల వరకు చెల్లించాల్సి వస్తుండటంతో ఆస్పత్రి అభివృద్ధికి విఘాతం ఏర్పడుతోంది. ఒక సంవత్సరం చెల్లించే రెఫరల్ బిల్లులతో ఆస్పత్రిని పూర్తిగా ఆధునికీకరించి అన్ని వసతులు సమకూర్చే అవకాశం ఉంది. వసతులు మెరుగుపరిచాక ఇక ప్రైవేటు ఆస్పత్రులకు రోగులను పంపాల్సిన అవసరం ఉండదు (అత్యవసరమైతే తప్ప). కొత్త ఎండీ సజ్జనార్ ఇటీవల ఆస్పత్రి పరిస్థితిని సమీక్షించినప్పుడు ఈ అనవసర భారం ఆయన దృష్టికొచ్చింది. వెంటనే రెఫరల్ ఖర్చుల పీడ వదిలించాలని నిర్ణయించారు. అది జరిగాక మిగిలే మొత్తాన్ని, ఆర్టీసీ ఉద్యోగుల తల్లిదండ్రులకు కూడా ఈ ఆసుపత్రిలో చికిత్సలు చేయించే వెసులుబాటు కలిగించాలని ఆయన భావిస్తున్నట్లు తెలిసింది. ఇదీ సంగతి.. ఆర్టీసీలో పనిచేసే 49 వేల మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు తార్నాకలో ఉన్న ఆర్టీసీ ఆస్పత్రే ఏకైక దిక్కు. జిల్లాల్లో డిస్పెన్సరీలున్నా.. వాటిల్లో పెద్దపెద్ద చికిత్సలకు వీలులేదు. ఆర్టీసీ ఉద్యోగులకు ఆరోగ్య సమస్య వస్తే తార్నాకలోని ఆస్పత్రికి రావాల్సిందే. దీన్ని గతంలో అన్ని వసతులు ఉండేలా నిర్మించారు. ఇక్కడ మంచి చికిత్స అందుతుందన్న పేరు కూడా ఉంది. కానీ, కొన్నేళ్లుగా దీనిపై దృష్టి సారించకపోవడం, అవసరమైన మార్పులు చేయకపోవడం, చాలినన్ని నిధులు కేటాయించకపోవటంతో అది క్రమంగా కొరగాకుండా పోతూ వచ్చింది. చివరకు మందుల కొనుగోలుకు కూడా కొరత ఏర్పడే దుస్థితిలోకి చేరింది. ఇక ఆస్పత్రి నిర్వహణ సాధ్యం కాదని ఆర్టీసీ చేతులెత్తేసి దాన్ని వదిలించుకునే ఆలోచనకు రావాల్సి వచ్చింది. ఇక్కడ గుండె సంబంధిత వ్యాధులకు చికిత్స చేసే వీలు లేకుండా పోయింది. సంబంధిత వైద్యులు లేరు. దంత, కంటి, ఆర్థో, జనరల్ ఫిజీషియన్, సర్జరీ విభాగాల్లో కూడా వైద్యులు చాలినంత మంది లేరు. దీంతో రోగులను ఇతర ప్రైవేటు ఆస్పత్రులకు తరలించి చికిత్స చేయించాల్సి వస్తోంది. ఈ మేరకు గతంలో 20 ప్రైవేటు ఆస్పత్రులతో ఆర్టీసీ అవగాహన కుదుర్చుకుంది. ఇలా చూస్తుండగానే ఏడాదికి రూ.30 కోట్ల మేర రెఫరల్ బిల్లులు చెల్లించాల్సి రావటంతో అది ఆర్టీసీ సంస్థకు పెద్ద భారంగా మారి సకాలంలో చెల్లించకుండా బకాయి పెడుతూ వస్తోంది. ఇప్పటికీ దాదాపు రూ.50 కోట్ల వరకు బకాయిలున్నాయి. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి చూసి కొన్ని ఆస్పత్రులు ఈ ఒప్పందం నుంచి తప్పుకున్నాయి. చివరకు ఇక్కడ కొన్ని రకాల వైద్య పరీక్షలకు కూడా వసతులు లేక ప్రముఖ ల్యాబ్‌లతో కూడా ఒప్పందం కుదుర్చుకుంది. బిల్లు బకాయిలతో ఇటీవలే ఓ ప్రముఖ ల్యాబ్ తప్పుకుంది. ఉద్యోగుల తల్లిదండ్రులకూ... ఈ మొత్తం వ్యవహారంపై కొత్త ఎండీ సజ్జనార్ ఇటీవల వివరాలు తెప్పించుకుని అధికారులతో చర్చించారు. ఆస్పత్రిలో వసతులు మెరుగుపరిచేందుకు ఆయన తొలినుంచి దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఎండీగా బాధ్యతలు స్వీకరించిన రెండో రోజే ఆయన ఆస్పత్రిని సందర్శించారు. ఆ తర్వాత పది రోజుల్లో మూడు పర్యాయాలు ఆస్పత్రికి వెళ్లారు. ఇప్పుడు రెఫరల్ బిల్లు బెడద వదిలించుకునే దిశలో చర్యలు ప్రారంభించారు. ఆస్పత్రిలో వసతులు మెరుగుపరిస్తే వీటి అవసరం ఉండదని నిర్ధారణకు వచ్చి ఆయన అందుకు సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నారు. నిధులు సమకూర్చే విషయంలో ఇంకా స్పష్టత రానప్పటికీ, త్వరలో కొలిక్కి రావటం ఖాయంగా కనిపిస్తోంది. రెఫరల్ బిల్లుల చెల్లింపు అవసరం లేకుంటే సాలీనా రూ.30 కోట్ల వరకు ఆదా అవుతుంది. అప్పుడు ఆ మొత్తంతో ఉద్యోగుల తల్లిదండ్రులకు కూడా ఆస్పత్రి సేవలు అందించేలా చేయాలని ఆయన యోచిస్తున్నారు. అది చికిత్సల వరకు ఉంటుందా, వైద్య పరీక్షలకు పరిమితమవుతుందా అన్న విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. -
గాలి నుంచి ఆక్సిజన్ వచ్చేదెలా?
సాక్షి సెంట్రల్ డెస్క్: భూమ్మీద జీవులకు ఆక్సిజనే కీలకం. ఆక్సిజన్ అందకుండా కొన్ని నిమిషాల పాటు కూడా బతకలేం. మనం ఊపిరితిత్తుల ద్వారా ఆక్సిజన్‌ను సంగ్రహించి, శరీరంలో ఉత్పత్తి అయిన కార్బన్ డయాక్సైడ్ను వదిలేస్తుంటాం. కానీ ఊపిరితిత్తులు దెబ్బతిన్నప్పుడు.. శరీరానికి ఆక్సిజన్ సరిగా అందక, ప్రత్యేకంగా అందించాల్సి వస్తుంది. గాలిలో ఆక్సిజన్ ఉండగా మళ్లీ ఎందుకు అందించడం అనే సందేహాలు రావొచ్చు. మనం పీల్చే గాలిలో 78శాతం నైట్రోజన్, 21 శాతం ఆక్సిజన్, 0.9శాతం ఆర్గాన్, మిగతా 0.1 శాతం ఇతర వాయువులు ఉంటాయి. మనం శ్వాసించినప్పుడు ఊపిరితిత్తుల్లోకి వెళ్లే 21%ఆక్సిజన్‌నే గ్రహించాల్సి ఉంటుంది. అదే 90 శాతానికిపైగా ఆక్సిజన్ ఉంటే.. మరింత మెరుగ్గా శరీరానికి అందుతుంది. శ్వాస సరిగా ఆడనివారికి ఆక్సిజన్ పెట్టడానికి కారణమిదే. సాధారణ గాలిలో నుంచి నైట్రోజన్ వాయువును తొలగించేస్తే.. మిగిలే గాలిలో 90 శాతానికిపైగా ఆక్సిజన్ ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న ఆక్సిజన్ ప్లాంట్లు ఇదే పనిచేస్తాయి. ఈ సాంకేతికతను ‘ప్రెషర్ స్వింగ్ అడ్సార్ప్షన్ (పీఎస్ఏ)’గా పిలుస్తారు. పీఎస్ఏ ప్లాంట్లు పనిచేసేదిలా.. 1. సాధారణ గాలిని ప్రత్యేక పరికరాల ద్వారా సేకరిస్తారు. 2. గాలిని తీవ్ర ఒత్తిడికి లోను చేస్తారు. అందులో తేమను తొలగిస్తారు. 3. దుమ్ము, ధూళి లేకుండా ఫిల్టర్ చేస్తారు. 4. ఒక చిన్నపాటి ట్యాంకు (ఎయిర్ బఫర్) మీ దుగా అడ్సార్ప్షన్ ట్యాంకులకు పంపుతారు. 5. అడ్సార్ప్షన్ స్టేజీలో రెండు ట్యాంకులు ఉంటాయి. వాటిల్లో జియోలైట్గా పిలిచే ప్ర త్యేక పదార్థాన్ని నింపి ఉంచుతారు. వేర్వేరు వాయువులను పీల్చుకునేందుకు వేర్వేరు జియోలైట్లు ఉంటాయి. నైట్రోజన్‌ను పీల్చేం దుకు ‘జియోలైట్ 13’ను వాడుతారు. ముం దుగా ఒక ట్యాంకు (ఏ)లోకి తీవ్ర ఒత్తిడితో ఉన్న గాలిని పంపుతారు. అందులోని జియోలైట్ నైట్రోజన్‌ను పీల్చుకుంటుంది. 93–95 శాతం ఆక్సిజన్‌తో కూడి న గాలి మిగులుతుంది. దీనిని ఆక్సిజన్ ట్యాంకుకు పంపుతారు. తర్వాత ట్యాంకు (ఏ)లో నుంచి వృధా నైట్రోజన్‌ను బయటికి వదిలేస్తారు. ఇదే సమయంలో మరో ట్యాంకు (బి)లో నైట్రోజన్ పీల్చుకునే ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఇలా ఒకదాని తర్వాత మ రో ట్యాంకులో ఉత్పత్తవుతూ ఉండటం వల్ల.. నిరంతరంగా ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. 6. ఉత్పత్తి అయిన ఆక్సిజన్‌ను వార్డులకు సరఫరా చేస్తారు. 7. వృధా నైట్రోజన్‌ను బయటికి వదిలేస్తారు. -
భారీగా వైద్య ఉపకరణాల కొనుగోలు
సాక్షి, అమరావతి: కరోనా థర్డ్‌వేవ్‌ను దృష్టిలో ఉంచుకుని అత్యవసర వైద్య ఉపకరణాల కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఆర్డర్లు ఇచ్చింది. ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ముందస్తు కొనుగోళ్లకు చర్యలు ప్రారంభించింది. ముఖ్యంగా చిన్నారులను దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేస్తున్నారు. 28 రోజుల్లోపు వయసున్న వారిని నియోనేటల్ అంటారు. ఇలాంటి వారికి కోవిడ్ సోకితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనే అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు. పదేళ్లలోపు చిన్నారులు కూడా శ్వాసకోశ ఇబ్బందులకు గురైన సందర్భాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అప్రమత్తమయ్యారు. దీనికోసమే ఎప్పుడూ లేనంతగా 300 నియోనేటల్ వెంటిలేటర్లను కొనుగోలు చేశారు. వీటిలో ఇప్పటికే 110 వెంటిలేటర్లు రాష్ట్రానికి చేరుకోగా, ఈనెల 15లోగా మిగతావి రానున్నాయి. 20 వేల ఆక్సిజన్ మాస్కులు వెంటిలేటర్ లేదా ఆక్సిజన్ పడకల మీద వైద్యం పొందుతున్నప్పుడు ఆక్సిజన్ మాస్కులు అత్యవసరం. అందుకే 20 వేల మాస్కులు కొనుగోలు చేశారు. ఇవి ఇప్పటికే సరఫరా అయ్యాయి. చిన్నారులకు ఇచ్చే ఇమ్యునోగ్లోబిలిన్ ఇంజెక్షన్లు 10 వేలు ఆర్డరు ఇవ్వగా, 1,750 సరఫరా అయ్యాయి. మిగతావి నెలాఖరుకు వచ్చే అవకాశం ఉంది. ఇబూప్రొఫిన్ సిరప్, అజిత్రోమైసిన్ ఓరల్, పారాసిటమాల్ ఓరల్, ప్రోబయోటిక్ సాచెట్స్ వంటివన్నీ కొనుగోలు చేస్తున్నారు. ఇవన్నీ ఈనెల 15లోగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఉన్న సెంట్రల్ డ్రగ్‌స్టోర్‌లకు చేరుకోనున్నాయి. ఈ నెలాఖరుకు రాష్ట్రవ్యాప్తంగా పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్లు కూడా పూర్తవుతాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో పడకల ఏర్పాట్లు కూడా చురుగ్గా సాగుతున్నాయి. రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి. -
ఆవు మాత్రమే అలా చేయగలదు: అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యలు
అలహాబాద్: ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని వ్యాఖ్యలు చేసిన అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ శేఖర్ కుమార్ మరోమారు ఆవుపై వ్యాఖ్యలు చేశారు. అన్ని జంతువుల్లోనూ కేవలం ఆవు మాత్రమే ఆక్సిజన్ పీల్చి ఆక్సిజన్‌ను వదులుతుందని సైంటిస్టులు నమ్ముతారన్నారు. ఆవు పాలు, పెరుగు, నెయ్యి, మూత్రం, పేడ ద్వారా మందు లేని పలు జబ్బులు కూడా నమయవుతాయని చెప్పారు. ఆవును దొంగలించి చంపిన కేసును విచారిస్తున్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సాంభల్ జిల్లాకు చెందిన జావెద్ గతంలోనూ పలు మార్లు ఆవులను దొంగలించి చంపాడని, బెయిల్ ఇస్తే మళ్లీ అలాంటి చర్యలకు పాల్పడతాని వ్యాఖ్యానిస్తూ బెయిల్ నిరాకరించారు. హిందూ పురాణాల ప్రకారం ఆవులో 33 కోట్ల మంది దేవుళ్లు, దేవతలు నివాసముంటారన్నారు. అందుకే గోవధకు హిందువులు వ్యతిరేకమన్నారు. -
కరోనా థర్డ్‌వేవ్: ముందస్తు చర్యల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజ
సాక్షి, అమరావతి: థర్డ్ వేవ్‌లో కరోనాను ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆక్సిజన్ పడకలకు ఎలాంటి కొరత తలెత్తకుండా ఉండేందుకు వీలుగా అధికారులు అటు ప్రైవేట్, ఇటు ప్రభుత్వాస్పత్రుల్లో వాటి సంఖ్యను గణనీయంగా పెంచుతున్నారు. ఇందులో భాగంగా.. గడిచిన రెండు నెలలుగా సాధారణ పడకలకు మూడు రెట్లు ఎక్కువగా ఆక్సిజన్ పడకలు ఏర్పాటుచేస్తున్నారు. అదే సమయంలో ఐసీయూ పడకలను పెంచేందుకూ చర్యలు తీసుకుంటున్నారు. 25 వేల నుంచి 37 వేలకు.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో 25,198 ఆక్సిజన్ పడకలున్నాయి. వీటిని 37,136కు పెంచనున్నారు. థర్డ్ వేవ్ సన్నాహాల్లో భాగంగా సాధారణ పడకల్లో ఎక్కువ భాగం ఆక్సిజన్ పడకలుగా మారుస్తున్నారు. విశాఖపట్నం లాంటి పెద్ద నగరాల్లో భారీగా ఏర్పాట్లుచేస్తున్నారు. ప్రస్తుతం 17,178 సాధారణ పడకలుండగా, అవి 10,186కి తగ్గుతాయి. అంటే 6,992 పడకలను సాధారణ పడకల నుంచి ఆక్సిజన్ పడకలుగా మార్చనున్నారు. అదనంగా మరో 877 మంది పీడియాట్రిక్ వైద్యులు అలాగే, రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో 722 మంది చిన్నపిల్లల వైద్యులున్నారు. వీరుకాకుండా మరో 877 మంది పీడియాట్రిక్ వైద్యులను కోవిడ్ సేవలకు వినియోగించుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందులో ఇప్పటివరకూ 246 మందిని నియమించారు. ఇక స్టాఫ్ నర్సులు 8,053 మంది ఉండగా అదనంగా మరో 1,434 మందిని నియమిస్తారు. సహాయక సిబ్బంది కూడా ఇప్పుడున్నది 5,328 కాగా.. మరో 1,382 మందిని నియమిస్తారు. దీంతో బాధితులకు మెరుగైన సేవలందించే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది భారీగా నియామకాలు ఇక రాష్ట్రంలో కోవిడ్ సేవల కోసం 2021లో ఇప్పటివరకు భారీగా నియామకాలు జరిగాయి. కేవలం జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లే 3,997 మంది నియమితులయ్యారు. స్టాఫ్ నర్సులు 6,306 మంది, స్పెషలిస్టు డాక్టర్లు 127, నర్సింగ్ ఆర్డర్లీ 5,668, నాల్గవ తరగతి ఉద్యోగులు 3,049, డేటా ఎంట్రీ ఆపరేటర్లు 1,131 మందిని నియమించారు. ఇవికాకుండా జాతీయ హెల్త్ మిషన్ పరిధిలో 2,964 పోస్టులను నిర్ధారించగా, ఇప్పటివరకూ 2,671 మందిని నియమించారు. పనులు ముమ్మరంగా.. థర్డ్‌వేవ్‌కు ముందస్తు చర్యల్లో భాగంగా ఆక్సిజన్ ప్లాంట్లు, పడకల ఏర్పాటు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. సెప్టెంబర్ నాటికి ఆక్సిజన్ ప్లాంట్లు పూర్తవుతాయి. పీహెచ్సీ, సీహెచ్‌సీ స్థాయిలో పడకల ఏర్పాటూ కొనసాగుతోంది. ఏర్పాట్లలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మనం ముందంజలో ఉన్నాం. – మురళీధర్‌రెడ్డి, ఎండీ, ఏపీఎంఎస్ఐడీసీ (రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ) -
అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..
న్యూఢిల్లీ: రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీయేతర ప్రభుత్వాలు తమ ప్రాంతాల్లో ఆక్సిజన్ అందకపోవడం వల్ల ఎవరూ చనిపోలేదని కోర్టుల్లో చెప్పాయని, కానీ ఇప్పుడు దానిపై రాజకీయాలు చేస్తున్నాయని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర విమర్శించారు. బుధవారం ఆయన ప్రతిపక్ష పార్టీల తీరు గురించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆక్సిజన్ అందకపోవడం వల్ల ఏ ఒక్కరూ చనిపోలేదని రాష్ట్రాలు కోర్టులకు లిఖిత పూర్వక సమాచారం ఇచ్చాయని అన్నారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఇచ్చిన సమాచారాన్నే కేంద్ర ప్రభుత్వం వెల్లడించిందని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌లు ఈ విషయంపై రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. దేశంలో ఒకానొక పెద్ద పార్టీకి అధ్యక్షుడిగా పని చేసిన రాహుల్.. ట్విట్టర్లో రెండు లైన్ల అబద్ధాలను ప్రచారం చేశారని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ ట్విట్టర్లో అలాంటి వ్యాఖ్యలు చేయడం కంటే వారి పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రప్రభుత్వాలతో మాట్లాడితే మంచిదని సూచించారు. ఢిల్లీ, మహారాష్ట్రలు తమ ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో ఆక్సిజన్ అందక మరణించారని ఆరోపణలు వచ్చిన కేసులపై అలాంటిదేమీ జరగలేదని ఢిల్లీ హైకోర్టు, బాంబే హైకోర్టుల్లో చెప్పాయన్నారు. కోవిడ్ సెకండ్ వేవ్‌లో ఆక్సిజన్ కొరత కారణంగా ఏ ఒక్కరూ మరణించలేదని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో మంగళవారం వెల్లడించింది. అందుకే మరణాలు: ప్రియాంక కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ లేమి కారణంగా ఎవరూ చనిపోలేదని కేంద్ర ప్రభుత్వం చెప్పడంపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ మండిపడ్డారు. కరోనా సెకండ్ వేవ్ ఉధృతి మొదలైన సమయంలోనే కేంద్ర ప్రభుత్వం భారీగా ఆక్సిజన్‌ను ఇతర దేశాలకు ఎగుమతి చేసిందని, దీంతో ఆక్సిజన్ లేమి ఏర్పడిందని అన్నారు. అంతేగాక ఆక్సిజన్‌ను తరలించేందుకు ట్యాంకర్లను ఏర్పాటు చేయలేదని.. ఈ కారణాల వల్లే సెకండ్ వేవ్‌లో మరణాలు సంభవించాయని ఆమె చెప్పారు. ఈ ఏడాది కరోనా సమయంలో ఆక్సిజన్ ఎగుమతిని కేంద్రం ఏకంగా 700 శాతం పెంచిందని గుర్తు చేశారు. ఈ వ్యవహారంపై పార్లమెంటరీ కమిటీ ఇచ్చిన సూచనలను కేంద్రం ఏ మాత్రం పట్టించుకోలేదని చెప్పారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లను నిర్మించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె విమర్శించారు. సెకెండ్‌వేవ్‌లో ఆక్సిజన్ అందక పలువురు మరణించారని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా చెప్పారు. ఆయా మరణాలను గుర్తించేందుకు తమ ప్రభుత్వం ఓ ప్యానెల్‌ను ఏర్పాటు చేసే ప్రయత్నం చేసిందన్నారు. -
మహారాష్ట్రలో తొలి డెల్టా ప్లస్ వేరియంట్ మరణం
ముంబై: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి తగ్గుతున్న సమయంలో డెల్టా ప్లస్ వేరియంట్ తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.ఇటువంటి ఆందోళనల మధ్య మహారాష్ట్రలో తొలి డెల్టా ప్లస్ వేరియంట్ మరణం నమోదైంది. రత్నగిరి జిల్లాలోని సంగమేశ్వర్ ప్రాంతంలో డెల్టా ప్లస్ వేరియంట్ తో 80 ఏళ్ల వృద్ధురాలు మరణించిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా మహారాష్ట్రలో ఇంతవరకు 21 డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. వాటిలో రత్నగిరిలో తొమ్మిది, జల్గావ్లో ఏడు, ముంబైలో రెండు, పాల్ఘర్, థానే, సింధుదుర్గ్ జిల్లాల్లో ఒక్కొక్కటిగా ఉన్నాయి. మహారాష్ట్రలో ఆక్పిజన్ కొరత తీవ్రంగా ఉంది. పొంచి ఉన్న థర్డ్ వేవ్‌ను దృష్టిలో ఉంచుకుని రోజుకు 3వేల టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (ఎల్ఎంఓ) ఉత్పత్తిని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే లక్ష్యంగా నిర్దేశించారు. ప్రస్తుతం రాష్ట్ర ఎల్ఎంఓ ఉత్పత్తి 1,300 టన్నులు మాత్రమే ఉంది. ఆక్సిజన్ ఉత్పత్తి, నిల్వ సామర్థ్యాన్ని పెంచాల్సిందిగా ఆక్సిజన్ ఉత్పత్తిదారులను సీఎం కోరారు. థర్డ్ వేవ్ విజృంభిస్తుందోన్నఆందోళనల నేపథ్యంలో కరోనా వైరస్ కొత్త వేరియంట్‌ను కనుగొన్నామని థాకరే చెప్పారు. చదవండి: ట్విటర్ ఖాతా బ్లాక్... కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆగ్రహం -
ఏపీ: కోవిడ్ నివారణ చర్యల కోసం యూనిసెఫ్ సాయం
సాక్షి, అమరావతి: కోవిడ్ నివారణ చర్యల కోసం యూనిసెఫ్ సాయం అందించింది. గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసిన యూనిసెఫ్ ప్రతినిధులు.. కోవిడ్ బాధితుల కోసం ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను అందజేశారు. వారి వెంట డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పి.గౌతమ్‌రెడ్డి ఉన్నారు. కోవిడ్ నివారణ కోసం సీఎం జగన్ ఎంతో శ్రమిస్తున్నారు.. ఈ సందర్భంగా ఏపీఎస్ఎఫ్ఎల్ ఛైర్మన్ గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ, కోవిడ్ నివారణ కోసం సీఎం జగన్ ఎంతో శ్రమిస్తున్నారన్నారు. యూనిసెఫ్ లాంటి సంస్థలు ముందుకొచ్చి తమ వంతు సాయం చేస్తున్నాయని పేర్కొన్నారు. మరో 50 లక్షల ఎన్-95 మాస్కులను కూడా అందించారని ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో 3 ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారని గౌతమ్‌రెడ్డి తెలిపారు. చదవండి: కేంద్రమంత్రి రవిశంకర్‌ప్రసాద్‌తో మంత్రి బుగ్గన భేటీ రూ.34 వేల కోట్లతో జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు: సీఎం జగన్ -
ఆక్సిజన్ సపోర్టు అవసరాన్ని గుర్తించే సాఫ్ట్వేర్
న్యూఢిల్లీ: కరోనా వైరస్ బారినపడిన బాధితుల్లో వెంటిలేటర్ సపోర్టు అవసరమైన వారిని గుర్తించేందుకు కోవిడ్ సీవియారిటీ స్కోర్ (సీఎస్ఎస్) పేరిట కొత్త సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసినట్లు కేంద్ర ప్రభుత్వం శనివారం వెల్లడించింది. ఎమర్జెన్సీ కేసులు, ఐసీయూ సేవలు అవసరమైన వారిని ఈ సాఫ్ట్వేర్ ద్వారా గుర్తించవచ్చని పేర్కొంది. ఆసుపత్రుల్లో అత్యవసర సేవలు అవసరం లేని కోవిడ్ బాధితులను ముందే గుర్తించవచ్చు. దీంతో అవసరమైన వారికి పడకలు అందుబాటులోకి వస్తాయని సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ తెలియజేసింది. బాధితుల్లో కనిపిస్తున్న లక్షణాలు, ఇతర ఆనవాళ్లు, వారి ఆరోగ్య చరిత్ర ఆధారంగా సీఎస్ఎస్ సాఫ్ట్వేర్ ఫలితాన్ని తేలుస్తుందని పేర్కొంది. సాఫ్ట్‌వేర్‌ను కోల్‌కతాలోని ఫౌండేషన్ ఫర్ ఇన్నోవేషన్స్ ఇన్ హెల్త్, సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్టుమెంట్ పరిధిలోని సైన్స్ ఫర్ ఈక్విటీ, ఎంపవర్మెంట్ అండ్ డెవలప్మెంట్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఇక్కడ చదవండి: డెల్టా స్ట్రెయిన్ ఎంత ప్రమాదకరమంటే...! -
సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన సిక్మా ప్రతినిధులు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మంగళవారం తన క్యాంప్ కార్యాలయంలో సౌత్ ఇండియన్ సిమెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (సిక్మా) ప్రతినిధులు కలిశారు. కరోనా నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం సీఎం సహాయనిధికి రూ.2 కోట్ల విలువైన 200 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందజేశారు. ఒక్కొక్కటి 10 లీటర్ల కెపాసిటీ ఉన్న కాన్సంట్రేటర్లను విరాళంగా ఇచ్చారు. సీఎం వైఎస్ జగన్‌ను కలిసి వివరాలు అందజేసిన వారిలో ఎం.రవీందర్ రెడ్డి (డైరెక్టర్, మార్కెటింగ్, భారతీ సిమెంట్స్), డాక్టర్ ఎస్.ఆనంద్ రెడ్డి (ఎండీ, సాగర్ సిమెంట్స్), ఇంజేటి గోపినాథ్ (సీఈవో, సిక్మా) ఉన్నారు. చదవండి: ‘దేవుడు ఎలా ఉంటారో తెలీదు.. మీరు ప్రత్యక్ష దైవం అన్నా’ థర్డ్‌వేవ్ హెచ్చరికలు: ఏపీ సర్కార్ ముందస్తు ప్రణాళిక -
‘మేఘా’ 75 ఎంటీల మెడికల్ ఆక్సిజన్ వితరణ
ముత్తుకూరు: కరోనా బాధితులకు వైద్య చికిత్స కోసం మేఘా ఇంజనీరింగ్ సంస్థ సీఎస్సార్ ఫండ్స్‌తో రూ.1.65 కోట్ల విలువైన 75 ఎంటీ (మెట్రిక్ టన్ను)ల మెడికల్ ఆక్సిజన్‌ను జిల్లాకు అందించినట్లు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబు తెలిపారు. మేఘా సంస్థ ద్వారా శుక్రవారం ఒక్కోటి 25 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కలిగిన మూడు ట్యాంకర్లు రైలు మార్గంలో అదాని కృష్ణపట్నం పోర్టుకు చేరాయి. వీటికి కలెక్టర్ చక్రధర్‌బాబు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కలెక్టర్ మేఘా సంస్థను అభినందించారు. సీఎం వైఎస్ జగన్ తీసుకొన్న ప్రత్యేక శ్రద్ధతో ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత తీరిందన్నారు. ఈ కార్యక్రమంలో జేసీలు హరేంద్రప్రసాద్, బాపిరెడ్డి, పోర్టు సీఈవో సతీష్ చంద్రరాయ్, మేఘా ప్రతినిధులు నారాయణ, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
oxygen concentrator: పుణే సంస్థ కొత్త డిజైన్
సాక్షి, ముంబై: కరోనా వైరస్ రెండో దశలో ప్రజలు వణించింది. ముఖ్యంగా కేసుల ఉధృతి ఆక్సిజన్‌కు డిమాండ్ పెరగడంతో ఆక్సిజన్ కొరతతో చాలామంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో పుణేకు చెందిన ఒక ఇంజనీరింగ్ సంస్థ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లకోసం ఒక కొత్త డిజైన్‌ను అభివృద్ధి చేసింది. కరోనావైరస్ బాధితులకు ఉపయోపడేలా డూ-ఇట్-యువర్ సెల్ఫ్( డీఐవై) అనే డిజైన్‌ను రూపొందించింది. భారతీయ పరిస్థితులకు అనుగుణంగా దీన్ని తయారు చేశామని అనాశ్వర్ టెక్నాలజీస్ డైరెక్టర్ కరణ్ తారాడే ప్రకటించారు. ఈ మొత్తం ప్రాజెక్ట్ భారతదేశంలో, భారతీయుల కోసం భారతీయులచే అభివృద్ధి చేసినట్టు చెప్పుకొచ్చారు. డిజైన్‌ను సరళంగా, సాధ్యమైనంత చౌక ధరలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. కంపెనీ ఇంజనీర్లు ఇంటర్నెట్లో 'ఆక్సికిట్' ద్వారా గాలి నుంచి ఆక్సిజన్ సేకరిస్తున్న తీరు బాగా ఉన్నప్పటికీ ఓపెన్ సోర్స్‌లో, స్వల్పంగా మార్పులతో దీన్నితయారు చేసినట్టు చెప్పారు. ప్రస్తుతం 1970 లలో కనుగొన్న విదేశీ ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను చాలా కుటుంబాలు వినియోగిస్తున్నాయని తారాడే చెప్పారు. అలాగే కరోనా మూలంగా దాదాపు ప్రతీ పౌరుడు ప్రభావితమవుతున్నారు. అందుకే తమ ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రతిఒక్కరికీ అందుబాలోకి ఉండాలని బావిస్తున్నామని తరాడే చెప్పారు. ఆక్సిజన్ ఎనలైజర్‌ను కూడా తయారు చేశాం కానీ చాలా ఖరీదైంది కావడంతో కాలామందికి అందుబాటులో లేదన్నారు. ఈ డిజైన్‌ను యూట్యూబ్ వీడియోలు, గితుబ్రిపోజిటరీ ఉపయోగించి అభివృద్ధి చేశామని తెలిపారు. 'ఆక్సికిట్' టెక్నాలజీలో భారతీయ అవసరాలనకనునుగుణంగా మార్పులతో తీర్చిదిద్దామన్నారు. ముఖ్యంగా నిమిషానికి 15 లీటర్ల (ఎల్పిఎం)ఆక్సిజన్ కోసం 'డూ ఇట్ యువర్ సెల్ఫ్' డిజైన్‌ను అభివృద్ధి చేశామనీ, 90 శాతానికి పైగా స్వచ్ఛతను అందించే 20 ఎల్పిఎం మోడల్‌పై కూడా పని చేస్తున్నామన్నారు. అంతేకాదు వీటిపై ప్రాథమిక పరిజ్ఞానంతో ఎవరైనా దీన్ని చేయగలుగుతారని కూడా ఆయన చెప్పారు. మెకానికల్ ఇంజనీర్ అయిన తారాడే తన అల్ట్రా-పోర్టబుల్ వాటర్ క్రిమిసంహారక వ్యవస్థ ప్రాజెక్ట్ కోసం 2018 లో నీతి అయోగ్ 'స్మార్ట్ ఇండియా హాకథాన్'లో మొదటి బహుమతిని గెలుచుకోవడం విశేషం. చదవండి: యూపీలో దారుణం: ఆక్సిజన్ నిలిపివేసి మాక్ డ్రిల్ Samsung స్మార్ట్‌టీవీ: అద్భుత ఫీచర్లు -
కరోనా రోగులకు ఇక సహజ వాయువే!
హైదరాబాద్: లిక్విడ్ ఆక్సిజన్‌ను అతి తక్కువగా వినియోగిస్తూ.. సహజ పద్ధతిలో ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్‌ను కోవిడ్ రోగుల కోసం వాడేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ‘డిఫెన్స్ రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజషన్’(డీఆర్డీఓ) శాఖ వారు కింగ్‌కోఠి జిల్లా ఆసుపత్రిలో ప్రత్యేకంగా ‘ఆక్సిజన్ జనరేటర్ ప్లాంట్’ను ఏర్పాటు చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో ఇది రోగులకు అందుబాటులోకి రానుంది. ఐదు దశల్లో ప్రాసెస్.. ఇక్కడ నిరి్మస్తున్న ఆక్సిజన్ జనరేటర్ ప్లాంట్‌లో ప్రధానంగా ఐదు దశలు..అంటే ఎయిర్ కంప్రెజర్, ఎయిర్ డ్రయ్యర్, ఎయిర్ ట్యాంక్, ఆక్సిజన్ జనరేటర్, ఆక్సిజన్ ట్యాంక్ ఉంటాయి. తొలుత వాతావరణం నుంచి సహజంగా వస్తున్న వాయువును ఇందులోని ఎయిర్ కంప్రెజర్ తీసుకుంటుంది. తర్వాత ఆ వాయువును ఎయిర్ డ్రయ్యర్‌లోకి పంపుతుంది. అక్కడ నుంచి ఎయిర్ ట్యాంక్‌లోకి వెళ్తుంది. దీని నుంచి ఆక్సిజన్ జనరేటర్‌కు వెళ్లి ఆక్సిజన్ ట్యాంక్‌లోకి చేరుతుంది. ఇలా ఐదు దశల్లో సహజ వాయువును ప్రాసెస్ చేసి ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తారు. ఇలా నిమిషానికి 960 కిలోల ఆక్సిజన్‌ను సాధారణ వాయువు నుంచి ఉత్పత్తి చేస్తారు. లిక్విడ్ ఆక్సిజన్ వాడకాన్ని తగ్గించే ప్రయత్నం ప్రస్తుతం కింగ్‌కోఠి జిల్లా ఆసుపత్రిలో 13 వేల కిలోలీటర్ల ఆక్సిజన్ సామర్థ్యం కలిగిన లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంక్ ఉంది. దీనిని నింపేందుకు ప్రతిరోజూ జడ్చర్ల నుంచి ఓ లారీ వస్తుంది. లిక్విడ్ ఆక్సిజన్‌ను కోట్లాది రూపాయిలు పెట్టి కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రధాన ఆసుపత్రుల్లో ఆక్సిజన్ జనరేటర్లను నిర్మించుకునేందుకు బడ్జెట్ కేటాయించింది. దీంతో డీఆర్డీఓ శాఖ ఈ ఆక్సిజన్ జనరేటర్ ప్లాంట్స్ తయారీని టాటా కంపెనీకి అప్పచెప్పింది. జనరేటర్ సమస్య వస్తే సిలిండర్లలోకి ఆక్సిజన్ ఇక్కడ ఉత్పత్తి కోసం నిర్మించిన ఆక్సిజన్ జనరేటర్‌కు ఏదైనా టెక్నికల్ సమస్య వచ్చి ఉత్పత్తి ఆగిపోతే..అప్పటి వరకు ఉత్పత్తి అయిన ఆ ఆక్సిజన్‌ను 5, 10, 20, 30, 72 కేజీల సిలిండర్లలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తారు. దీంతో పాటు ఆక్సిజన్ జనరేటర్ అవసరం లేకుండా సహజంగా వచ్చే గాలిని కూడా సిలిండర్లలోకి ఆక్సిజన్‌గా మార్చేలా టాటా కంపెనీ వినూత్నమైన రీతిలో ప్రయోగాలు చేపడుతోంది. దీంతో ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత తీరనుంది. రెండు రోజుల్లో అందుబాటులోకి గత వారం రోజులుగా ఇక్కడ ‘ఆక్సిజన్ జనరేటర్ ప్లాంట్’ పనులు జరుగుతున్నాయి. దాదాపు పని పూర్తి అయ్యింది. మరో రెండు రోజుల్లో సహజంగా తయారైన ఆక్సిజన్‌ను రోగులకు అందిస్తాం. ఈ ప్లాంట్..సహజ సిద్ధమైన వాయువు నుంచి నుంచి నిమిషానికి 960 కిలోల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఎంతగానో ఉపయోగకరం. – డాక్టర్ రాజేంద్రనాధ్, కింగ్‌కోఠి ఆసుపత్రి సూపరింటెండెంట్ -
కరోనా: రిలయన్స్ మరో సంచలన నిర్ణయం
సాక్షి, ముంబై: కరోనా సెకండ్ వేవ్‌తో అల్లాడిపోతున్న దేశాన్ని ఆదుకునేందుకు ఆసియా బిలియనీర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ ముందుకు వచ్చారు. కరోనా చికిత్సలో కొత్త ఔషధాన్ని లాంచ్ చేసే ప్రయత్నల్లో రిలయన్స్ బిజీగా ఉంది. అలాగే చౌక కరోనా టెస్టింగ్ కిట్‌ను కూడా లాంచ్ చేయనుంది. కోవిడ్-19కు నివారణగా నిక్లోసామైడ్ (టేప్‌వార్మ్ డ్రగ్) ఔషధాన్ని రియలన్స్ ముందుకు తీసుకు రానుంది. రిలయన్స్ తయారు చేసిన డయాగ్నొస్టిక్ కిట్లు - ఆర్-గ్రీన్, ఆర్-గ్రీన్ ప్రో లకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) నుండి అనుమతి లభించింది. అంతేకాదు మార్కెట్ ధరలతో పోలిస్తే ఐదో వంతు తక్కువ ధరకే శానిటైజర్లను తయారుచేసే ప్రణాళికను కూడా రూపొందించింది. ఖరీదైన టెస్టింగ్ కిట్స్, ప్రైవేటు ఆసుపత్రులు వసూలు చేస్తున్న లక్షల కొద్దీ బిల్లులతో బెంబేలెత్తిపోతున్న ప్రజలకు రిలయన్స్ ప్రయత్నాలు మంచి ఊరటనివ్వనున్నాయని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. దేశీయ ఆసుపత్రులను వేధిస్తున్న వెంటిలేటర్ల కొరతను తీర్చడానికి మరింత కృషి చేస్తోంది. ఇందుకుగాను రిఫైనింగ్-టు-రిటైల్ గ్రూప్ 3డీ టెక్నాలజీ "స్పెషల్ స్నార్కెలింగ్ మాస్క్" వినియోగిస్తోందని బ్లూం బర్గ్ నివేదించింది. నిమిషానికి 5-7 లీటర్ల సామర్థ్యం కలిగిన గ్రేడ్ ఆక్సిజన్ జనరేటర్లను డిజైన్ చేస్తోందట. కాగా కరోనాపై పోరులో భాగంగా 2020 లో రిలయన్స్ ఫ్రంట్-లైన్ ఆరోగ్య కార్యకర్తల కోసం వ్యక్తిగత రక్షణ పరికరాల (పీపీఈ) కిట్లను తయారు చేయడానికి ఒక యూనిట్‌ను ఏర్పాటు చేసింది. గత ఏడాది పీఎం కేర్స్ ఫండ్‌కు రూ .500 కోట్లు, మహారాష్ట్ర, గుజరాత్ సీఎం రిలీఫ్ఫం డ్కు కోటి రూపాయల విరాళం ప్రకటించింది. అలాగే రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 875 పడకలను అందించింది. సెకండ్ వేవ్‌లో దేశవ్యాప్తంగా మెడికల్-గ్రేడ్ లిక్విడ్ ఆక్సిజన్ సరఫరాకు రిలయన్స్ చురుకుగా సహాయం చేస్తోంది. బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్‌తో కలిసి కరోనా బాధితులకు ఉచిత చికిత్స అందించేలా సెవెన్ హిల్స్ హాస్పిటల్లో 225 పడకల సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లోని రిఫైనరీ-కమ్-పెట్రోకెమికల్ ఫ్యాక్టరీలో దేశంలోని మొత్తం మెడికల్-గ్రేడ్ లిక్విడ్ ఆక్సిజన్ ఉత్పత్తిలో రిలయన్స్ 11 శాతం ఉత్పత్తి చేస్తుంది. ఏప్రిల్‌లో 15,000 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను ఉచితంగా సరఫరా చేసింది. సౌదీ అరేబియా, థాయ్‌లాండ్, బెల్జియం, నెదర్లాండ్స్ , జర్మనీ నుంచి 24 ఐఎస్వో కంటైనర్లను విమానంలో రప్పించిన సంగతి తెలిసిందే. చదవండి : vaccine: మినహాయింపులపై సీరం కీలక వ్యాఖ్యలు Vaccination: ఊరట, త్వరలో మరో స్వదేశీ వ్యాక్సిన్ -
చంద్రగిరి నియోజక వర్గం లో ఆక్సిజన్ కోవిడ్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి
-
కరోనా రోగులకు ఊపిరి అందిస్తున్న కొత్త మాస్క్
-
సేవలో ‘అగర్వాల్ బంధు’
హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి సెకండ్ వేవ్‌లో ఆక్సిజన్ సమస్యలు బాధితులను ఎక్కువగా బాధించాయి. ఇంకా అక్కడక్కడ ఆక్సిజన్ అందక ఇబ్బందులకు గురవుతున్నారు. ఎక్కడ చూసినా ఆక్సిజన్ లభించక ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు చాలా జరిగాయి. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఎక్కువగా ఉండడంతో వాటిని బాధితులకు అందజేయడానికి కొంత మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన సేవలు అందజేస్తున్నారు. మేమున్నామంటూ... గతంలో స్వచ్ఛంద సంస్థలు విరివిగా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనగా.. ఈసారి కొంత మంది స్నేహితులు ఒక చోట చేరి మేమున్నామంటూ కోవిడ్ బాధితులను ఆదుకుంటున్నారు. కరోనా వైరస్ సోకి ఇళ్లల్లో హోం ఐసోలేషన్‌లో ఉన్న వారికి ఆక్సిజన్ అందజేయడానికి ముందుకు వచ్చారు. ఆసుపత్రులతో పాటు ఇళ్లల్లో చికిత్స పొందుతున్న వారికి అత్యవసరంగా ఆక్సిజన్ అవసరం ఏర్పడినప్పడు.. వారికి ఉచితంగా ఆక్సిజన్ సిలిండర్స్తో పాటు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను అందించడానికి పాతబస్తీకి చెందిన పంకజ్‌కుమార్ అగర్వాల్ తన స్నేహితులను ఒక ఫ్లాట్ ఫాంగా మార్చుకుని ఆక్సిజన్ సిలిండర్లను అందజేసే కార్యక్రమాలను ప్రారంభించారు. నెల రోజుల క్రితం ప్రారంభమైన ఈ సేవలను ‘ప్రాణ వాయు సేవ’గా నామకరణం చేసి ఆక్సిజన్ సిలిండర్లను ఉచితంగా అందజేస్తూ.. పలువురి ప్రశంసలు పొందుతున్నారు. పాతబస్తీ ఘాంసీబజార్‌కు చెందిన హైదరాబాద్ కుంభ మేళా అగర్వాల్ బంధు అధ్యక్షుడు, అశోక్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పంకజ్ కుమార్ అగర్వాల్ ఆధ్వర్యంలో ఉచిత ఆక్సిజన్ సేవలను ప్రారంభించారు. ‘ప్రాణ వాయు సేవ’మొదలైందిలా... పంకజ్‌కుమార్ అగర్వాల్‌కు చెందిన ఓ బంధువుల కుటుంబంలో కోవిడ్–19 వ్యాధితో బాధపడుతూ నలుగురు మృతి చెందారు. ఈస్ట్ చార్మినార్ ప్రాంతానికి చెందిన అశోక్‌కుమర్ అగర్వాల్, సునీల్‌కుమార్ అగర్వాల్‌లతో పాటు మరో ఇద్దరూ అన్నదమ్ములు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. కోవిడ్‌తో బాధపడుతూ ఆక్సిజన్ అందక మృతి చెందారు. ఈ సంఘటనలు పంకజ్‌కుమార్‌కు తీవ్ర మనోవేధనకు గురి చేసింది. కేవలం ఆక్సిజన్ అందక మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుండడంతో.. అవసరమైన బాధితులకు ఆక్సిజన్ సిలిండర్లను అందజేయడానికి తన భార్య ప్రియాంక్‌తో కలిసి నిర్ణయం తీసుకున్నారు. వెంటనే తమ సమాజానికి చెందిన తరుణ్ అగర్వాల్, అనూప్ అగర్వాల్, బ్రిజ్మోహన్, రవీందర్, గోపాల్ దాస్ తదితరులను సంప్రదించి ఈ నెల మొదటి వారం నుంచి ఉచితంగా ఆక్సిజన్ సిలిండర్లతో పాటు అత్యవసరమైన వారికి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను అందజేయడానికి కార్యాచరణ రూపొందించుకున్నారు, అనుకున్నదే తడవుగా ఇప్పటి వరకు 100 మంది వరకు బాధితులకు ఉచితంగా ఆక్సిజన్ సిలిండర్లను అందజేశారు. అలాగే ఎమర్జెన్సీ కింద ఎలాంటి రుసుం వసూలు చేయకుండా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను అందజేస్తున్నారు. అంతేకాకండా అవసరమైన బాధితులకు ఆహార పదార్థాలను అందజేస్తున్నారు. ఆక్సిజన్ సిలిండర్ సకాలంలో అందడంతో.. కోవిడ్–19తో బాధపడుతున్న మా అమ్మ శోభారాణి సోదరుడైన అజయ్‌కుమార్ అగర్వాల్‌తో పాటు ఆయన భార్య కవిత అగర్వాల్ ప్రాణాపాయం నుంచి బతికి బయట పడ్డారు. ఎన్నో ఆసుపత్రులు తిరిగినా.. ఆక్సిజన్ అందుబాటులో లేదని పంపించారు. దీంతో పంకజ్‌కుమార్ అగర్వాల్ ఆక్సిజన్ సిలిండర్ సరఫరా చేస్తున్నట్లు తెలుసుకుని తెచ్చుకున్నాం. సకాలంలో ఆక్సిజన్ లభించడంతో ఇరువురు కోలుకున్నారు. – యోగేష్ కుమర్ అగర్వాల్, వ్యాపారి, చార్మినార్ కోవిడ్ బాధితులకు ఉచితంగా.. కోవిడ్ బాధితుల సౌకర్యార్థం ఆక్సిజన్ సిలిండర్లను అందిజేస్తున్నాం. అత్యవసరంగా ఆక్సిజన్ లభించకపోతే.. 9246550088లో సంప్రదించాలి. రీ–ఫిలింగ్తో పాటు కొత్తగా కూడా సిలిండర్లను రిఫరెన్స్‌తో అందజేస్తున్నాం. అవసరమైన వారికి ఉచితంగా ఆక్సిజన్ సిలిండర్లను అందజేస్తున్నాం. – రవీందర్ నార్నూలీ, అగర్వాల్ బంధు ప్రతినిధి డిపాజిట్లు.. రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు.. ఆక్సిజన్ సిలిండర్‌తో పాటు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ అవసరమైన వారు మమ్మల్ని సంప్రదిస్తే వెంటనే స్పందిస్తున్నాం. ఎలాంటి డిపాజిట్లు కానీ, డబ్బులు కానీ చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం తెలిసిన వారి సిఫారసు ఉంటే చాలు. మాకు ఫోన్ చేసిన వెంటనే పాతబస్తీలోని ఘాన్సీబజార్‌కు పిలిపించి ఆక్సిజన్ సిలిండర్లను అందజేస్తున్నాం. – పంకజ్ కుమార్ అగర్వాల్, అగర్వాల్ బంధు అధ్యక్షుడు -
కోవిడ్ రోగులకు ప్రాణవాయువు అందించేందుకు ఏపీఎస్ఆర్టీసీ చర్యలు
-
అదనంగా 400 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్
-
కోవిడ్ పేషెంట్ల కోసం ఆక్సిజన్ బస్సులు
-
దేశం లో ఆక్సిజన్, బెడ్స్ కొరతలేదు
-
ఏపీ: కోవిడ్ పేషెంట్ల కోసం ఆక్సిజన్ బస్సులు
సాక్షి, అమరావతి: కోవిడ్ పేషెంట్లకు ఆక్సిజన్ అందించేందుకు ఏపీఎస్ ఆర్టీసీ చర్యలు చేపట్టింది. వెన్నెల స్లీపర్, ఏసీ బస్సుల్లో ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆస్పత్రుల్లో బెడ్లు కొరత ఉన్న ప్రాంతాల్లో కోవిడ్ పేషెంట్లకు బస్సుల్లోనే వైద్యసేవలు అందించాలని నిర్ణయం తీసుకుంది. ప్రయోగాత్మకంగా వెన్నెల బస్సులో 10 ఆక్సిజన్ బెడ్లు ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఒక్కో ఆర్టీసీ స్లీపర్ బస్సులో 10 మంది పేషెంట్లకు చికిత్స అందిస్తామని రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఆస్పత్రులు అందుబాటులోలేని ప్రాంతాల్లో ఆక్సిజన్ బస్సులు ద్వారా సేవలు అందిస్తామని మంత్రి వెల్లడించారు. చదవండి: ఏపీలో టెన్త్ పరీక్షలు వాయిదా ఆనందయ్య మందుపై కేంద్రం అభిప్రాయం ఏంటో?: ఏపీ హైకోర్టు -
కరోనా: తమిళనాడుకు మేఘా సహాయం
దేశంలో వివిధ రాష్ట్రాల్లో కరోనా పేషంట్లను ఆదుకునేందుకు వివిధ ప్రభుత్వాలకు సహాయసహకారాలు అందిస్తున్న విధంగానే హైదరాబాద్‌కు చెందిన మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) సంస్థ. తాజాగా తమిళనాడు వ్యాప్తంగా ఉచితంగా 2500 ఆక్సిజన్ బెడ్లను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా మదురైలో కేవలం 72 గంటల్లోనే 500 ఆక్సిజన్ బెడ్లను సిద్ధం చేసింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు ఆక్సిజన్ ట్యాంకర్లను, బెడ్స్‌ను, ఆస్పత్రులకు వివిధ మౌళిక సదుపాయాలను కల్పించిన ఎంఈఐఎల్, తమిళనాడు వ్యాప్తంగా కరోనా బాధితుల కోసం ఉచితంగా ఆస్పత్రులలో ఆక్సిజన్ బెడ్స్‌ను ఏర్పాటు చేస్తోంది. మేఘా ఇంజనీరింగ్ తో పాటు తమిళనాడుకు చెందిన క్రెడాయ్, జి రియల్టర్స్ సంస్థ ఇందులో భాగస్తులయ్యాయి. ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ ఈ కార్యక్రమాన్ని నేరుగా పర్యావేక్షిస్తున్నారు. చెన్నైలో 1070 ఆక్సిజన్ బెడ్లు గ్రేటర్ చెన్నై పరిధిలోని ఆసుపత్రులలో 1070 ఆక్సిజన్ బెడ్ల ను మేఘా ఇంజనీరింగ్ సంస్థ యుద్ధపాత్రిపదికన పనులు చేస్తోంది. వీటితో పాటు ఇరోడ్ జిల్లాలో 200, వెల్లూరు 250, అంబూరు 100, నట్టారం వళ్లి 100, మెలిశ్వరం 100, అయ్యపాకం 200, శోలింగార్ 50, వనియంబాడిలో 100, వల్లఝాలో 100 ఆక్సిజన్ పడకల ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే 660 బెడ్లను సిద్ధం చేసిన ఎంఈఐఎల్ రాబోయే రోజుల్లో 2500 బెడ్ల ఏర్పాటు చేయబోతోంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న మేఘా ఇంజనీరింగ్ సంస్థ (ఎంఈఐఎల్) తనవంతు సహాయంగా తమిళనాడుకు ఆక్సిజన్ బెడ్లను అందిస్తోంది. ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 20 దేశాల్లో తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది. మేఘాకు సేవల్లో పాలు భాగస్తులైన క్రెడాయ్, జి రియల్టర్స్ మధురై ప్రభుత్వ ఆసుపత్రి (తోప్పూర్ జిహెచ్) లో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం. కె. స్టాలిన్ 500 స్కేలబుల్ ఆక్సిజనేటెడ్ బెడ్ సౌకర్యాలను మే 21 ప్రారంభించారు. ఇందులో 200 ఆక్సిజన్ పడకలు అందుబాటులోకి వచ్చాయి. మిగిలిన 300 పడకలు త్వరలో ప్రజల ఉపయోగం కోసం అందుబాటులో ఉంచనున్నారు. మేఘా సంస్థ చొరవతో ప్రజలకు ఉచిత చికిత్సను అందిస్తున్నారు. జి స్క్వేర్ రియల్టర్స్, మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, క్రెడాయి మదురై జిహెచ్ వద్ద 72 గంటల రికార్డు సమయంలో 500 ఆక్సిజన్ బెడ్ సౌకర్యాలను ఏర్పాటు చేశాయి. జి స్క్వేర్ రియల్టర్ తో కలిసి మేఘా ఇంజనీరింగ్ సంస్థ చెన్నై అన్నా నగర్ ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ఒమాండురార్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక్కొక్కటి 100 ఆక్సిజనేటెడ్ పడకలను ఏర్పాటు చేశారు. కరోనా సంక్షోభం తీవ్ర రూపం దాల్చి ఆక్సిజన్ కొరత అధికమవుతున్నప్పటి నుంచి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు ఉచితంగా ఆక్సిజన్ సరఫరా చేసేందుకు మేఘా యాజమాన్యం కృషి చేస్తోంది. అందులో భాగంగానే సంస్థ ఉన్నతస్థాయి యాజమాన్యమే కాకుండా మొత్తం యంత్రాంగం ఇదే పనిలో నిమగ్నమయ్యింది. కరోనా సమయంలో తమ వంతుగా దేశానికి సేవ చేయడం బాధ్యతగా భావిస్తున్నామని ఎంఈఐఎల్ డైరెక్టర్ బి. శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కోవిడ్ రోగులను ఆదుకునేందుకు ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించడం కోసం ప్రత్యేకంగా ఒక బృందం పనిచేస్తోందని ఆయన తెలిపారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎంఈఐఎల్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణా రెడ్డి పర్యవేక్షిస్తున్నారన్నారు. క్రెడాయ్ తమిళనాడు అధ్యక్షుడు సురేష్ కృష్ణ మాట్లాడుతూ, “సిఎస్ఆర్ పథకంలో భాగంగా మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, లైఫ్ స్టైల్ (చెన్నై), ఒలింపియా, టిఎన్ ఇస్పాట్ పరిషత్ లిమిటెడ్, తిరుపూర్ ఎగుమతిదారుల సంఘం వంటి అనేక సంస్థలు తమిళనాడు ప్రజల కోసం ఆస్పత్రుల్లో సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాయన్నారు. కేవలం 72 గంటల తక్కువ వ్యవధిలో మేఘా సంస్థ పూర్తి చేయడం చాలా సంతోషంగా ఉంది” జి స్క్వేర్ రియల్టర్స్ ప్రమోటర్ బాలా మాట్లాడుతూ, “మానవ జీవితం కంటే మరేమీ ముఖ్యమైనది కాదు. మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ర్టక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) - జి స్క్వేర్ సంస్థలు కలిసి ప్రభుత్వానికి అండగా నిలబడడం గర్వంగా ఉందన్నారు. ఈ ఆసుపత్రులను తమిళనాడు అంతటా ఏర్పాటు చేయడానికి గౌరవ ఆరోగ్య మంత్రి, తమిళనాడు ప్రభుత్వ ఆరోగ్య కార్యదర్శి తమ పూర్తి సహకారాన్ని అందిస్తున్నాయన్నారు” బాధ్యతగా కోవిడ్ బాధితులను ఆదుకుంటున్నాం: బి. శ్రీనివాస్ రెడ్డి నిర్మాణ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాజెక్ట్ లను సకాలంలో పూర్తి చేసి గుర్తింపు పొందిన మేఘా ఇంజనీరింగ్ ఇన్ ఫ్రాస్ర్టక్చర్ సంస్థ కోవిడ్ కష్టకాలంలో ప్రజలను ఆదుకునేందుకు బాధ్యతగా ముందుకు వచ్చిందని ఆ సంస్థ డైరెక్టర్ బి. శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఆదేశాల మేరకు రాష్ర్టంలో 2500 పడకల ఆక్సిజన్ బెడ్ల ఆసుపత్రులను యుద్ధ ప్రతిపాదికన ఏర్పాటు చేస్తున్నామన్నారు. మదురైలో కేవలం 72 గంటల్లోనే 200 పడకల ఆక్సిజన్ బెడ్స్ ఆసుపత్రిని నిర్మించి ప్రభుత్వానికి అందచేశామన్నారు. ఈ కార్యక్రమంలో తమిళనాడుకు చెందిన క్రెడాయ్, జి రియల్టర్స్ సహాయ సహకారాలు అందిస్తున్నట్లు వివరించారు. దేశంలో ఆక్సిజన్ కొరతను నివారించడానికి 200 పి.ఎస్.ఏ ప్లాంట్లు ఏర్పాటు చర్యలు ప్రారంభించినట్లు బి.శ్రీనివాస్ రెడ్డి తెలియజేశారు. అలాగే క్రయోజనిక్ ట్యాంకుల తయారీ కూడా ప్రారంభించినట్లు చెప్పారు. ఇందుకు డిఆర్డీవో, పెట్రోలియం మంత్రిత్వ శాఖలు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నట్లు ఆయన వివరించారు. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు ఉచితంగా ఆక్సిజన్ సరఫరా చేస్తున్న సంగతిని గుర్తు చేశారు. తొలిసారిగా తెలంగాణకు థాయిలాండ్ నుంచి 11 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు దిగుమతి చేసి ఉచితంగా ఇస్తున్నట్లు తెలిపారు. చదవండి: జయలలిత చివరి రోజుల్లో తీసుకున్న నిర్ణయాలపై రహస్య విచారణ -
ఆక్సిజన్ సగమే చాలు: కరోనా పేషెంట్లకు నేవీ ‘ఓఆర్ఎస్’
సెంట్రల్ డెస్క్, సాక్షి: కరోనా విజృంభణతో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు వస్తున్నాయి. శ్వాస సమస్యలు తలెత్తడంతో వేలాది మందికి ఆక్సిజన్ అవసరం పడుతోంది. ఇది తీవ్ర కొరతకు దారి తీసింది. ఇలాంటి సమయంలో ఆక్సిజన్‌ను రీసైకిల్ చేస్తూ, ఎక్కువ సేపు వినియోగించుకునేలా భారత నావికా దళం ‘ఆక్సిజన్ రీసైక్లింగ్ సిస్టం (ఓఆర్ఎస్)’ను అభివృద్ధి చేసింది. కరోనా పేషెంట్లకు మాత్రమే కాదు.. ఆక్సిజన్ అవసరమైన అందరికీ ప్రయోజనం కలిగించే ఈ ఓఆర్ఎస్ విశేషాలు ఏమిటో తెలుసుకుందామా? వృథాను అరికడుతూ.. సాధారణంగా మనం పీల్చే గాలి నుంచి కొంత ఆక్సిజన్‌ను మాత్రమే ఊపిరితిత్తులు పీల్చుకుంటాయి. మిగతా ఆక్సిజన్, ఇతర వాయువులకు కార్బన్డయాక్సైడ్ అదనంగా తోడై బయటికి వెళ్లిపోతాయి. అంటే చాలా వరకు ఆక్సిజన్ వృథా అవుతున్నట్టే. ఈ వృథాను అరికట్టేలా ‘ఓఆర్ఎస్’ను రూపొందించారు. ఓఆర్ఎస్ వ్యవస్థతో వినియోగిస్తే.. ప్రస్తుతమున్న మెడికల్ ఆక్సిజన్ సిలిండర్లనే రెండు నుంచి నాలుగు రెట్లు ఎక్కువ సమయం పాటు వాడుకోవచ్చు. డిజైన్ చేసింది ఎవరు? నావికా దళంలో.. నీటిలోకి లోతుగా వెళ్లి, ఎక్కువసేపు మునిగి ఉండటం (డైవింగ్)పై శిక్షణ ఇచ్చే నేవీ డైవింగ్ స్కూల్‌కు చెందిన లెఫ్టినెంట్ కమాండర్ మయాంక్ శర్మ ‘ఓఆర్ఎస్’ను డిజైన్ చేశారు. దీనిపై నేవీ పేటెంట్ కూడా పొందింది. ఈ ఏడాది ఏప్రిల్ 22న ఈ పరికరం ఆపరేషనల్ ప్రొటోటైప్ (పూర్తిస్థాయిలో పనిచేయగల తొలి నమూనా)ను రూపొందించారు. తర్వాత పలు మార్పులతో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశారు. ఎలా పనిచేస్తుంది? పేషెంట్లు ఆక్సిజన్‌ను శ్వాసించి వదిలినప్పుడు అందులో కొంత మాత్రమే వినియోగం అవుతుంది. మిగతా ఆక్సిజన్, శరీరంలో ఉత్పత్తయ్యే కార్బన్డయాక్సైడ్ బయటికి వెళ్లిపోతాయి. వీటిలో ఆక్సిజన్‌ను తిరిగి వినియోగించుకుని, కార్బన్ డయాక్సైడ్ను మాత్రం బయటికి పంపడమే ‘ఓఆర్ఎస్’ వ్యవస్థ చేసే పని. ‘ఓఆర్ఎస్’లో పేషెంట్లకు అమర్చే మాస్కుకు మరో పైపును అదనంగా ఏర్పాటు చేశారు. దానికి ఒక తక్కువ ప్రెషర్ ఉండే మోటార్‌ను అమర్చారు. పేషెంట్లు శ్వాసించి వదిలిన గాలిని ఆ మోటార్ లాగేస్తుంది. అందులో కార్బన్‌డయాక్సైడ్‌ను తొలగించి, ఆక్సిజన్‌ను తిరిగి వినియోగించేలా ఏర్పాటు ఉంటుంది. ఎలా పరీక్షించారు? నేవీ అధికారులు 250 లీటర్ల ద్రవ ఆక్సిజన్ సిలిండర్‌కు ప్రత్యేకంగా రూపొందించిన వేపరైజర్ను, ఆక్సిజన్‌ను నేరుగా పేషెంట్లకు వినియోగించగలిగేలా ప్రెషర్ వాల్వులు, లీక్ ప్రూఫ్ పైపులతో కూడిన ఔట్‌లెట్‌ను అమర్చారు. అంటే నేరుగా ద్రవ ఆక్సిజన్ సిలిండర్ నుంచే ఆక్సిజన్ పీల్చుకునేలా ఏర్పాటు ఉంటుంది. సాధారణంగా ద్రవ ఆక్సిజన్‌ను నేరుగా వినియోగించడానికి వీలు ఉండదు. దానిని వేపరైజర్, ఇతర పరికరాలతో ఇతర ట్యాంకుల్లో నింపుతారు. వాటి నుంచి పైపులు అమర్చి వినియోగిస్తారు. నేవీ చేసిన ఏర్పాటులో.. ద్రవ ఆక్సిజన్ సిలిండర్ నుంచే నేరుగా వాడుకోవచ్చు. తయారీకి ఖర్చు పది వేలే.. నేవీ తయారు చేసిన ‘ఓఆర్ఎస్’ ప్రాథమిక నమూనాకు అయిన ఖర్చు రూ.10 వేలు మాత్రమే. దీనిని అమర్చి, ఆక్సిజన్‌ను రీసైకిల్ చేయడం ద్వారా.. సుమారు రోజుకు రూ.3 వేల వరకు ఆదా చేయవచ్చని అంచనా. అంటే పేషెంట్లపై గణనీయ స్థాయిలో ఖర్చు తగ్గుతుంది. ఎన్నో రంగాలకు ప్రయోజనం ‘ఓఆర్ఎస్’ పరికరంతో కేవలం ఆక్సిజన్ అవసరమైన పేషెంట్లకు మాత్రమే కాకుండా ఎన్నో రంగాల వారికి ప్రయోజనం కలుగనుంది. హిమాలయాలు వంటి పర్వతాలను అధిరోహించేవారు, ఎత్తైన ప్రాంతాల్లో పనిచేసే సైనికులు, జలంతర్గాముల్లో, సముద్రాల లోతుల్లో అన్వేషణలు జరిపేవారు.. ఇలా చాలా మందికి ఆక్సిజన్ అవసరం ఉంటుంది. ఇందుకోసం వారు బరువైన సిలిండర్లను భుజాన మోయాల్సి వస్తుంది. నేవీ పరికరంతో అలాంటి వారికి సిలిండర్ల బరువు, ఆక్సిజన్ ఖర్చు తగ్గిపోనుంది. చదవండి: 4 గంటలు శ్రమించి.. బ్లాక్ ఫంగస్ తొలగించి.. -
Photo Feature: కోవిడ్ పిడుగు.. ఆగని ఆంక్షలు
కరోనా విలయానికి చేతివృతుల సడుగులు విరిగిపోయాయి. చేతివృతులపై ఆధారపడి జీవిస్తున్న వారందరిపై కోవిడ్ పిడుగులా పడింది. మరోవైపు కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు దేశమంతా కఠినంగా ఆంక్షలు అమలుచేస్తున్నారు. సముద్ర మార్గాల్లో ప్రమాదాలు భయాందోళన కలిగిస్తున్నాయి. తాజాగా గుజరాత్ నుంచి కొలంబో పోర్ట్‌కు వెళ్తున్న సరకు రవాణా నౌక ప్రమాదానికి గురైంది. -
మరోసారి దాతృత్వాన్ని చాటుకున్న మెగాస్టార్
-
తప్పిన ప్రమాదం: ఆక్సిజన్ ట్యాంకర్ లీక్
రాయగడ: స్థానిక రైల్వేస్టేషన్లో ఆగిఉన్న గూడ్సు వ్యాగన్‌లోని ఓ ఆక్సిజన్ ట్యాంకర్ నుంచి ఆక్సిజన్ లీక్ అయింది. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. దీంతో హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది అతికష్టం మీద ఆక్సిజన్ లీకేజీని అదుపుచేశారు. రౌర్కెలా నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న గూడ్సు స్థానిక రైల్వేస్టేషన్‌కి చేరుకోగానే సిగ్నల్స్ ఇవ్వకపోవడంతో అక్కడే కాసేపు దానిని నిలపాల్సి వచ్చింది. అయితే అదే సమయంలో ఆక్సిజన్ ట్యాంకర్ నుంచి వాయువు బయటకు వచ్చినట్లు అక్కడి వారు గుర్తించారు. -
ఆటంకం లేకుండా ఆక్సిజన్
విద్యుత్తు.. ఆక్సిజన్ కీలకం ‘‘తుపాను కారణంగా తలెత్తే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలి. తుపాను వల్ల ఒడిశా ప్లాంట్ల నుంచి ఆక్సిజన్ సేకరణకు ఇబ్బందులు తలెత్తితే ముందే ప్రత్యామ్నాయాలు సిద్ధం చేసుకోవాలి. ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తున్న ప్లాంట్లకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆస్పత్రులకు కరెంటు సరఫరాలో సమస్యలు లేకుండా డీజిల్ జనరేటర్లు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా విద్యుత్ సిబ్బందిని కేటాయించాలి. తుపాను ప్రభావిత సమయాల్లో ఆక్సిజన్ కొరత రాకుండా అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి’’ – ముఖ్యమంత్రి జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 50 పడకలు దాటిన ప్రతి ఆస్పత్రిలో కచ్చితంగా ఆక్సిజన్ సౌకర్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఈ ఏడాది ఆగస్టు చివరి కల్లా ఆస్పత్రుల్లో పీఎస్ఏ ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటు పూర్తి కావాలని స్పష్టం చేశారు. ఆయా ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు కూడా ఉండాలన్నారు. సొంతంగా పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్లు నెలకొల్పే ప్రైవేట్ ఆస్పత్రులకు 30 శాతం ఇన్సెంటివ్ ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకల సామర్థ్యానికి తగినట్లుగా ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు నెలకొల్పాలని సూచించారు. ఆక్సిజన్ ఉత్పత్తిపై దృష్టి పెట్టడం ద్వారా భవిష్యత్తులో ఎలాంటి మహమ్మారులనైనా ఎదుర్కోవచ్చన్నారు. రాష్ట్రంలో కోవిడ్, తుపాన్ పరిస్థితులపై ముఖ్యమంత్రి జగన్ సోమవారం ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. ‘యాస్’ తుపాను వల్ల ఆక్సిజన్ సరఫరాకు ఎలాంటి అంతరాయాలు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, రోజువారీ సరఫరా, నిల్వలపై దృష్టి పెట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తుపాను కారణంగా ఉత్పన్నమయ్యే పరిస్థితులకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవడంతో పాటు ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వీలుగా సీఎం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్‌దాస్ విశాఖపట్నం వెళ్లారు. సీఎం వైఎస్ జగన్ సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ... కోవిడ్, తుపాన్ పరిస్థితులపై నిర్వహించిన సమీక్షలో సీఎం జగన్, మంత్రి ఆళ్ల నాని తదితరులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయండి.. తుపాన్ నేపథ్యంలో రోజువారీ అవసరమైన ఆక్సిజన్ సరఫరాతో పాటు నిల్వల వివరాలు పరిశీలిస్తూ అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఆస్పత్రుల్లో కోవిడ్ రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. 15 వేల ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను రప్పిస్తున్నందున నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోవాలి. అవి సక్రమంగా పని చేసేలా తగిన వ్యవస్థ ఉండాలి. కోవిడ్ బాధితుల తరలింపులో జాగ్రత్త.. యాస్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఆస్పత్రుల నుంచి కోవిడ్ రోగుల తరలింపుపై తగిన చర్యలు తీసుకోవాలి. ఎక్కడెక్కడి నుంచి తరలించాలో గుర్తించి తుపాను ప్రభావం మొదలు కాక ముందే వారిని జాగ్రత్తగా తరలించాలి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో కోవిడ్ పేషెంట్ల తరలింపు అవసరం అనుకుంటే ఇప్పుడే ఆ పని చేయాలి. శ్రీకాకుళం జిల్లాలో లోతట్టు ప్రాంతాల ప్రజల తరలింపు వెంటనే ప్రారంభం కావాలి. సహాయ శిబిరాల్లో నిత్యావసరాలు మొదలు అన్ని సదుపాయాలు కల్పించాలి. విద్యుత్ పంపిణీ వ్యవస్థను సమీక్షించుకుని తగిన విధంగా చర్యలు తీసుకోవాలి. మెడికల్ కాలేజీలు – టెండర్లు.. పాడేరు, మచిలీపట్నం, పిడుగురాళ్ల, పులివెందులలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి టెండర్లు పూర్తి చేయాలి. జూన్ 10 కల్లా మిగిలిన కాలేజీల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి కావాలి. జులై నుంచి మెడికల్ కాలేజీల పనులు ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకోవాలి. విమ్స్, విక్టోరియాలో చురుగ్గా నాడు – నేడు ఇప్పుడున్న 11 మెడికల్ కాలేజీలతో పాటు అదనంగా విశాఖలోని విమ్స్, విక్టోరియా ఆస్పత్రుల్లో నాడు–నేడు పనులకు చురుగ్గా టెండర్ల ప్రక్రియ చేపట్టాలి. ఆగస్టు నెలాఖరు కల్లా పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలి. అనుకున్న సమయానికి పనులు ప్రారంభం కావాలి. కార్పొరేట్ స్థాయిలో బోధనాస్పత్రుల నిర్వహణ.. కార్పొరేట్ ఆస్పత్రుల మాదిరిగానే బోధనాసుపత్రుల నిర్వహణ కూడా ఉండాలి. రోగులకు ఇచ్చే ఆహారం నుంచి పారిశుద్ధ్యం వరకూ అన్నీ నాణ్యంగా ఉండాలి. పది కాలాల పాటు రోగులకు మంచి సేవలు అందించేలా అన్ని బోధనాసుపత్రులు ఉండాలి. ఈ ఆస్పత్రులను ఏ విధంగా నిర్వహిస్తారన్న దానిపై ఓ ప్రణాళికను రూపొందించండి. కోవిడ్ లాంటి మహమ్మారులను ఎదుర్కొనేందుకు ఆస్పత్రులను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా కరోనా బాధితులపై బ్లాక్ ఫంగస్‌తోపాటు కొత్తగా వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్‌లు పంజా విసురుతున్నట్లు సమాచారం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలి. తగినన్ని ఇంజెక్షను తెప్పించుకోవడంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. ఆ చిన్నారుల పేరుతో రూ.10 లక్షలు డిపాజిట్ కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన 34 మంది చిన్నారులను ఇప్పటివరకు గుర్తించినట్లు అధికారులు తెలియచేయడంతో ఆర్థిక అవసరాలు తీర్చేలా వెంటనే వారందరి పేరు మీద రూ.10 లక్షల చొప్పున డిపాజిట్ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. 18,763 మంది సిబ్బంది నియామకం రాష్ట్రంలో ప్రస్తుతం 36,475 మంది కోవిడ్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని, ఇప్పటివరకు 18,763 మంది వైద్య సిబ్బంది, పారా మెడికల్ సిబ్బందిని నియమించామని సమావేశంలో అధికారులు వెల్లడించారు. రాష్ట్రానికి 590 టన్నుల ఆక్సిజన్ కేటాయింపులు ఉండగా ప్రస్తుతం రోజూ దాదాపు 640 టన్నుల ఆక్సిజన్ అవసరం అవుతోందని తెలిపారు. సీఎం నిర్వహించిన సమీక్ష సమావేశాల్లో డిప్యూటీ సీఎం (వైద్య ఆరోగ్య శాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని), హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్, కోవిడ్ కమాండ్ కంట్రోల్ ఛైర్మన్ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, కోవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ ఛైర్మన్ ఎంటీ కృష్ణబాబు, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్ మేనేజ్మెంట్, వ్యాక్సినేషన్) ఎం.రవిచంద్ర, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ కాటమనేని భాస్కర్, విపత్తు నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి, ఇంధన శాఖ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్, విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు, 104 కాల్ సెంటర్ ఇన్చార్జ్ ఏ.బాబు, ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్ ఏ.మల్లికార్జున్, ఏపీఎంఎస్ఐడీసీ వీసీ అండ్ ఎండీ వి.విజయరామరాజుతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
గిరాకీ కోసం ప్రైవేటు అంబులెన్స్ డ్రైవర్ల దుర్మార్గం
-
ఫోన్లోనే శరీరంలోని ఆక్సిజన్ స్థాయి తెలుసుకోండిలా!
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కరోనా మహమ్మరి మన దేశాన్ని వణీకిస్తుంది. ఫస్ట్ వేవ్‌తో పోలిస్తే మరణాల రేటు అధికంగా ఉంది. దీనికి ప్రధాన కారణం శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడమే. అందుకే మన శరీరంలోని ఆక్సిజన్ స్థాయిలు తెలిపే పల్స్ ఆక్సీమీటర్లు, స్మార్ట్ వాచ్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. దీంతో అమాంతంగా వాటి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ ఇబ్బందులేవీ లేకుండా ఉచితంగా మన దగ్గర ఉన్న ఫోన్లోని ఒక యాప్ ద్వారా శరీరంలోని ఆక్సిజన్ స్థాయి, పల్స్, శ్వాసక్రియల రేట్లు తెలిసేలా ఉంటే బావుంటుంది కదా!? అనే ఆలోచన నుంచి వచ్చిందే ‘కేర్‌ప్లిక్స్ వైటల్స్ యాప్’. ఎలా పనిచేస్తుంది? మన దేశంలోని కోల్‌కతాకు చెందిన ‘కేర్ నౌ హెల్త్‌కేర్’ అనే స్టార్టప్ సంస్థ ఈ స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ 'కేర్‌ప్లిక్స్ వైటల్స్'ను అభివృద్ధి చేసింది. ఇక్కడ చేయాల్సిందల్లా ఈ యాప్ ఓపెన్ చేసి స్మార్ట్‌ఫోన్ వెనుక కెమెరా ఉన్న ఫ్లాష్‌లైట్ ఆన్ చేసి దాని మీద వేలు పెట్టిన తర్వాత స్కాన్ అనే బటన్‌ను నొక్కగానే నలభై సెకన్లలో ఆక్సిజన్ స్థాయి(SpO2), పల్స్, శ్వాసక్రియ రేట్లను చూపిస్తుంది. ఫోటో ప్లెథిస్మోగ్రఫీ టెక్నాలజీ, కృత్రిమ మేధ సాయంతో కేర్‌ప్లిక్స్ వైటల్స్ యాప్ పనిచేస్తుంది. ఈ ఏడాది ప్రారంభంలోనే దీనిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించినట్లు కేర్‌నౌ హెల్త్‌కేర్ సహవ్యవస్థాపకుడు శుభబ్రాతా పాల్ తెలిపారు. ట్రయిల్స్ లో ఈ యాప్ 96 శాతం సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ఈ యాప్ ప్రస్తుతం ఐవోఎస్ వినియోగదారుల కోసం యాప్‌స్టోర్‌లో, ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. టెస్ట్ నిర్వహించడానికి మంచి ఇంటర్నెట్, హై ఎండ్ స్మార్ట్‌ఫోన్ ఉండాలి అప్పుడే కచ్చితమైన ఫలితాలు వస్తాయి. ప్రస్తుతం సింగిల్ యూజర్ వినియోగం కోసం ఉచితంగా అందిస్తున్నారు. అంతకుమించి సేవలు కావాలంటే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. మిగతా వివరాలు కేర్‌నౌ వెబ్సైట్లో ఉన్నాయి. చదవండి: ఐసీఎంఆర్ సీరో సర్వేలో కరోనాపై షాకింగ్ విషయాలు వెల్లడి -
దీన్ని ప్రేమంటారా? సిగ్గుపడండి: నిర్మాత ఫైర్
కరోనా స్వల్ప లక్షణాలతో బాధపడేవారు ఇంట్లో స్వీయనిర్బంధంలో ఉంటూ తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఆ మహమ్మారిని జయిస్తున్నారు. ఇదివరకే అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం కోవిడ్ పాజిటివ్ అని తేలగానే ఆస్పత్రుల వెంట పరుగులు తీస్తున్నారు. ఈ క్రమంలో బెడ్లు దొరక్క, ఆక్సిజన్ అందక, సకాలంలో వైద్యం చేయించుకోలేక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే వీటన్నింటితో పాటు కరోనా రోగులకు ప్రధానంగా కావాల్సింది మానసిక ధైర్యం. హత్తుకుని మాట్లాడకపోయినా హద్దుల్లో ఉండి వారికి అండగా, తోడుగా నిలిస్తే అదే పదివేలు. కానీ ఇక్కడో వ్యక్తి మాత్రం అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి వంటింట్లో కష్టపడుతుంటే అమ్మ ప్రేమ అని డైలాగులు వల్లె వేస్తున్నాడు. ఆమెకు ఆసరాగా ఉండాల్సింది పోయి అద్భుతంగా పని చేస్తున్నావని కీర్తించాడు. 'అనంతమైన ప్రేమనిచ్చేది అమ్మ మాత్రమే. తనెప్పుడూ తన విధిని నిర్వర్తించడం మానదు' అన్న క్యాప్షన్‌తో దీనికి సంబంధించిన ఫొటోను కూడా షేర్ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. సరిగ్గా ఊపిరాడక ఆక్సిజన్ మాస్క్ పెట్టుకున్న తల్లితో వంట చేయిస్తున్నారా? అని మండిపడుతున్నారు. This is not love. This is slavery in the name is social structure. இதுக்கு நாம வெக்கப்படணும் சென்றாயன் pic.twitter.com/W72ZdlEhtc — Naveen Mohamedali (@NaveenFilmmaker) May 21, 2021 గ్యాస్ స్టవ్ దగ్గర్లో ఆక్సిజన్ సిలిండర్ ఉండటం చాలా ప్రమాదకరం అని మరికొందరు హెచ్చరిస్తున్నారు. ఆ తల్లి ఆక్సిజన్ మెషీన్ మీద బతుకుతున్నప్పుడు కూడా ఆమె కోసం కుటుంబ సభ్యులెవరూ వంట చేయకపోవడం విషాదకరం అని కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ పోస్ట్ చూసిన తమిళ నిర్మాత నవీన్ సైతం దీని మీద విమర్శలు గుప్పించాడు. 'ఇది ప్రేమ కాదు, బానిసత్వం.. ఇలాంటి పని చేయిస్తున్నందుకు సిగ్గుపడండి' అని ట్విటర్లో రాసుకొచ్చాడు. చదవండి: డబ్బులిచ్చి మరీ హెయిర్ స్టయిలింగ్ చేసేదాన్ని: కాజల్ -
భారత్‌కు మరో 11 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు
సాక్షి, హైదరాబాద్: భారత్‌కు థాయ్‌లాండ్ నుంచి మరో 11 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు రానున్నాయి. యుద్ధ ప్రతిపాదికన ట్యాంకుల దిగుమతికి అధికారులు చర్యలు చేపట్టారు. ఒక్కో క్రయోజినిక్ ట్యాంకర్లో 1.40 లక్షల (కోటీ నలభై లక్షల ) లీటర్ల ఆక్సిజన్ వుంటుంది. దేశంలో తొలిసారిగా అధిక సంఖ్యలో దిగుమతి చేస్తున్నారు. సామాజిక సేవ బాధ్యతలో భాగంగా మేఘా ఇంజనీరింగ్ సంస్థ(ఎంఈఐఎల్) థాయ్‌లాండ్ నుండి ఆక్సిజన్ టాంకర్లను భారత్‌కు దిగుమతి చేస్తోంది. తొలి విడతగా ఆర్మీ విమానంలో మూడు ట్యాంకులు శనివారం హైదరాబాద్ చేరుకున్నాయి. బేగంపేట్ ఎయిర్ పోర్ట్‌కు ప్రత్యేకంగా డిఫెంస్ ఎయిర్ క్రాఫ్ట్ లో ఆక్సిజన్ ట్యాంకర్లను రప్పించారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వానికి ఈ ఆక్సిజన్ ట్యాంకర్లను మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఉచితంగా ఇవ్వనుంది. భవిష్యత్తులో ఆక్సిజన్ కొరత నివారణే లక్ష్యమని మేఘా ఇంజనీరింగ్ సంస్థ పేర్కొంది. చదవండి: మరో కీలక కిట్‌ను అభివృద్ధి చేసిన డీఆర్డీఓ Corona: వ్యాక్సిన్ కోసం వేరే దేశాలకు! -
కృష్ణపట్నం చేరుకున్న ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): విజయవాడ డివిజన్ కృష్ణపట్నం పోర్టుకు శుక్రవారం ఒడిశా నుంచి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ వచ్చింది. ఈ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ ద్వారా రెండు ట్యాంకర్లలో నింపిన 60.66 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌ను ఒడిశాలోని రూర్కెలా నుంచి రాష్ట్రానికి తరలించారు. ఈ రైలు 1,305 కిలోమీటర్ల దూరాన్ని 22 గంటల వ్యవధిలో ప్రయాణించి కృష్ణపట్నం పోర్టుకు చేరుకుంది. ఇప్పటివరకు విజయవాడ డివిజన్‌కు వచ్చిన ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లలో ఇది నాలుగోది. ఈ నాలుగు ప్రత్యేక రైళ్ల ద్వారా వివిధ రాష్ట్రాల నుంచి మొత్తం 275 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రాష్ట్రానికి దిగుమతి జరిగింది. ఈ సందర్భంగా డీఆర్ఎమ్ పి.శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, గ్రీన్ కారిడార్లను ఏర్పాటు చేసి అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది సమన్వయంతో నిర్దేశించిన గడువులోగా ఇవి గమ్యస్థానాలకు చేరుకునేలా కృషి చేస్తున్నామని తెలిపారు. -
రాష్ట్రానికి చేరుకున్న వెంటిలేటర్లు, లైఫ్ సపోర్ట్ పరికరాలు
విమానాశ్రయం (గన్నవరం): రాష్ట్రంలోని కోవిడ్ ఆస్పత్రుల్లో రోగుల అవసరాల నిమిత్తం 70 వెంటిలేటర్లు, లైఫ్ సపోర్ట్ పరికరాలు బుధవారం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాయి. న్యూఢిల్లీ నుంచి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఏఎన్ 32 కార్గో విమానంలో ఇక్కడికి తీసుకొచ్చారు. విమానాశ్రయం నుంచి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు లారీలో విజయవాడకు తరలించారు. కాగా, ఆక్సిజన్ దిగుమతి కోసం బుధవారం మరో రెండు ఖాళీ ట్యాంకర్లను ఐఏఎఫ్ సీ–17 కార్గో విమానంలో భువనేశ్వర్ విమానాశ్రయానికి అధికారులు తరలించారు. -
ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీకి అడ్డుకట్ట వేయాలి
సాక్షి, అమరావతి: కోవిడ్ రోగుల నుంచి భారీ ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని హైకోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. చికిత్స నిమిత్తం కోవిడ్ రోగులు చెల్లించే మొత్తాలను ఇకపై ప్రతి కోవిడ్ ఆస్పత్రిలో ఉండే నోడల్ అధికారి లేదా హెల్ప్ డెస్క్ మేనేజర్ ద్వారా చెల్లింపులు చేసే విషయాన్ని పరిశీలించాలని కోరింది. ఇందుకు తగిన విధివిధానాలు ఖరారు చేయాలని అధికారులను ఆదేశించింది. రోగి లేదా అతని అటెండెంట్ లేదా డబ్బు చెల్లించిన వ్యక్తి నుంచి తగిన అక్నాలడ్జ్మెంట్ తీసుకోవాలంది. దీనివల్ల డబ్బు చెల్లిస్తే తప్ప మృతదేహాలను అప్పగించేది లేదని ఆస్పత్రులు చెప్పేందుకు అవకాశం ఉండదని తెలిపింది. దుకాణాల ముందు ఓ కానిస్టేబుల్‌ను ఉంచి, జనం భౌతిక దూరం, మాస్కులు ధరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. అదేవిధంగా కోవిడ్ కేర్ కేంద్రాలను పట్టణాల్లోనే ఏర్పాటు చేసే విషయాన్ని అధికారులతో చర్చించాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్‌కు సూచించింది. కోవిడ్ కేసులు ఎక్కువగా ఉన్న దృష్ట్యా ఏపీకి ఆక్సిజన్ కేటాయింపులను పెంచాలని కేంద్రాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేస్తూ న్యాయమూర్తులు జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్, జస్టిస్ కన్నెగంటి లలితలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. కోవిడ్ విషయంలో పలు అభ్యర్థనలతో హైకోర్టులో పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే. 90 వేల వయల్స్ మాత్రమే వచ్చాయి.. కేంద్ర ప్రభుత్వం తరపున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఎన్.హరినాథ్ వాదనలు వినిపిస్తూ.. ఈ నెల 6 వరకు ఏపీకి 450 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా చేస్తూ వచ్చామని, తర్వాత దీన్ని 580 మెట్రిక్ టన్నులకు పెంచామని చెప్పారు. ఈ నెల 16 వరకు 2,81,257 రెమిడెసివిర్ వయల్స్‌ను ఏపీకి సరఫరా చేశామని తెలిపారు. దీంతో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సుమన్ విభేదించారు. కేవలం 90 వేల వయల్స్ మాత్రమే రాష్ట్రం అందుకుందన్నారు. 3.75 లక్షల ఇంజక్షన్లు ఇస్తామని కేంద్రం నుంచి ఇటీవలే రాష్ట్రానికి లేఖ అందిందని తెలిపారు. జిల్లా, మండల స్థాయిలో బెడ్ల ఖాళీల వివరాలను తెలియచేసే వ్యవస్థను త్వరలో అమల్లోకి తీసుకొస్తామని చెప్పారు. మరో న్యాయవాది జీఆర్ సుధాకర్ జోక్యం చేసుకుంటూ.. రాష్ట్రానికి 50 క్రయోజనిక్ ట్యాంకర్లు, 10 ఆక్సిజన్ ట్యాంకర్లు ఇవ్వాలని కేంద్రానికి రాష్ట్రం విజ్ఞప్తి చేసిందని, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో తదుపరి విచారణ సమయంలో ఈ వివరాలను తమ ముందుంచాలని కేంద్రాన్ని ధర్మాసనం ఆదేశించింది. -
పేదలకు ప్రభుత్వం మెరుగైన వైద్యం అందిస్తోంది
-
కరోనా కట్టడికి చర్యలు: ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్
-
నెల్లూరు జిల్లాలో ఆక్సిజన్ కొరతకు చర్యలు తీసుకుంటున్న అధికారులు
-
ఆక్సిజన్ లెవల్స్ 90 ఉన్నవారు ఇంట్లో ఆక్సిజన్ కాన్సంట్రేటర్ వాడొచ్చు
-
oxygen concentrator: దేశంలో కోవిడ్ దృష్ట్యా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లకు భారీగా డీమాండ్
-
గుంటూరు చేరుకున్న ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్
-
అత్యాధునిక వసతులతో 250 పడకల కోవిడ్ కేర్ సెంటర్
తిరుపతి రూరల్: చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలోని తొండవాడలో హీరా కళాశాలకు చెందిన ఐదు అంతస్తుల భవనంలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో 250 పడకల కోవిడ్ కేర్ సెంటర్‌ను ప్రభుత్వ విప్, తుడా చైర్మన్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. బాధితులకు మెరుగైన వసతి, వైద్య సౌకర్యాలు కల్పించేందుకు ఎమ్మెల్యే సొంత నిధులను వెచ్చించారు. అత్యవసర వైద్యం కోసం 10 ఆక్సిజన్ బెడ్లు అందించారు. అక్కడ పనిచేస్తున్న 101 మంది సిబ్బందికి ప్రభుత్వం అందించే గౌరవ వేతనాలకు తోడు ప్రతి ఒక్కరికీ ప్రతి నెలా అదనంగా రూ. 2,500ను అందిస్తామని ప్రకటించారు. అంటే ప్రతి నెలా రూ. 2.52 లక్షలను చెల్లించనున్నారు. రోగులకు పౌష్టికాహారం కోసం బుధవారం చేపలు, ఆదివారం చికెన్‌తో కూడిన భోజనం కూడా అందించనున్నారు. అలాగే వారికి పేస్ట్, బ్రెష్, దుప్పటి, మెడికల్ కిట్ తదితర 34 వస్తువులతో కూడిన ప్రత్యేక కిట్లను ఇస్తున్నారు. ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు చెస్, క్యారమ్స్ వంటి గేమ్స్‌తో కూడిన రిక్రియేషన్ సెంటర్, ఆధ్యాత్మిక, సామాజిక గ్రంథాలతో కూడిన గ్రంథాలయాన్ని సిద్ధం చేశారు. ప్రతి గదిలో టీవీలు ఏర్పాటుచేసి రోజుకు రెండు చిత్రాలను ప్రదర్శించనున్నారు. ప్రతి ఫ్లోర్లో వేడి నీరు, చల్లని నీరు వచ్చేలా ఏర్పాట్లు చేశారు. 24 గంటలు వైద్య సేవలు అందించేందుకు షిప్ట్‌కు ఇద్దరు చొప్పన వైద్యులు అందుబాటులో ఉంటారు. కోవిడ్ కేర్ సెంటర్లోని ప్రతి ఫ్లోర్‌కు ఇన్చార్జిలను నియమించారు. ఆ ఫ్లోర్లో ఉండే బాధితులతో వాట్సాప్ గ్రూప్‌ను క్రియేట్ చేయించారు. తమ సమస్యలను బాధితులు వాట్సాప్ ద్వారా తెలిపితే వాటిని సత్వరమే పరిష్కరిస్తారు. గతంలో తిరుచానూరు వద్ద ఏర్పాటు చేసిన పద్మావతి కోవిడ్ కేర్ సెంటర్లో చెవిరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని ఏర్పాటు చేసిన వసతులు, నాణ్యమైన భోజనం వల్ల దేశవ్యాప్తంగా సెంటర్‌కు మంచి పేరు వచ్చింది. -
పేదల ఆరోగ్యం కోసం ఖర్చుకు వెనుకాడం
ఒంగోలు టౌన్: పేదల ఆరోగ్యం కోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడబోమని రాష్ట్ర విద్యుత్, అటవీశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు. కరోనా బారినపడిన వారంతా ఆరోగ్యంగా ఇంటికి వెళ్లాలన్నదే తన ముందున్న బాధ్యత అని పేర్కొన్నారు. సొంత నిధులు రూ.35 లక్షలతో ఒంగోలు జీజీహెచ్‌లో బాలినేని కోవిడ్ కేర్ సెంటర్ కింద ఆక్సిజన్‌తో కూడిన 100 పడకలతో ఏర్పాటుచేసిన జర్మన్ షెడ్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జీజీహెచ్ పైఅంతస్తులో ఏర్పాటు చేయనున్న 100 పడకలకు అవసరమైన ఆక్సిజన్ వంటివి అమర్చేందుకు తన సొంత నిధులు రూ.15 లక్షలు ఇస్తున్నట్లు చెప్పారు. బాలినేని ఉచిత కోవిడ్ కేర్ సెంటర్లో ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్స్‌తో ఏర్పాటు చేసిన బెడ్స్ తన కుటుంబంలోనూ కరోనా వచ్చిందన్నారు. తమ కుటుంబమంతా ఆలోచించి కరోనా బాధితులకు సేవచేసేందుకు ఎంత ఖర్చుకైనా వెనకాడకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. పేదలకు సేవచేసేందుకు జిల్లాలో కోటీశ్వరులు ముందుకు రావాలన్నారు. పేదలకు రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను ఉచితంగా ఇస్తానని, ఎవరికైనా ఇబ్బంది కలిగితే ఆదుకుంటానని చెప్పారు. ఇందుకోసం తన కార్యాలయంలో ఐదుగురిని నియమించినట్లు తెలిపారు. కరోనా వైద్యం విషయంలో సమస్యలు వస్తే తన దృష్టికి లేదా, కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని సూచించారు. మంత్రి వెంట కలెక్టర్ పోల భాస్కర్, జేసీ చేతన్, నగర మేయర్ సుజాత ఉన్నారు. -
Photo Feature: జనులారా! జర సోచో..
కరోనా కష్టకాలంలోనూ చాలా మంది బాధ్యతారహితంగా వ్యవహరిస్తుంటే ఫ్రంట్‌లైన్ వారియర్స్ మాత్రం పండగలు పబ్బాలు లేకుండా అహోరాత్రులు విధుల నిర్వహణలో నిమగ్నమవుతున్నారు. విధుల నిర్వహణే పండగలా భావిస్తున్నారు. మరోవైపు కరోనా బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వాలు రైలు మార్గాల ద్వారా ప్రాణవాయువును ఆగమేఘాల మీద తరలిస్తున్నాయి. కరోనా జాగ్రత్తలను పాటించేందుకు కొంత మంది వినూత్న పద్ధతులు అవలంభిస్తున్నారు. ఇదిలావుంటే నగరాల నుంచి సొంతూళ్లకు వెళ్లేందుకు వలస కార్మికులు పడుతున్న కష్టాలు గుండెలను పిండేస్తున్నాయి. -
అనంతపురం : ఎస్పీ చొరవతో సకాలంలో చేరిన ఆక్సిజన్ ట్యాంకర్
-
విశాఖలో మరో 300 ఆక్సిజన్ బెడ్లు సిద్ధం
-
రోగులకు బెడ్ లేదనే సమాధానం రాదు: మంత్రి అవంతి
సాక్షి, విశాఖపట్టణం: రోగులకు బెడ్ లేదు అనే సమాధానం లేకుండా వైద్యం అందిస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. జిల్లాల్లో 79 కోవిడ్ ఆసుపత్రుల్లో 5,700 మందికి వైద్యం అందిస్తున్నట్లు వెల్లడించార. సిబ్బంది కొరత ఉంటే వెంటనే నియమించుకునే అధికారం జిల్లా అధికారాలకు కల్పించినట్లు గుర్తుచేశారు. ఆక్సిజెన్ కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కరోనా వైరస్‌పై గురువారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘1,443 ఆరోగ్య శ్రీ బెడ్లు ఉండగా వీటిని పెంచే యోచనలో ఉన్నాం. హెల్త్ కేర్ వర్కర్స్ అందరికీ పీపీ కిట్, ఎన్-95 మాస్కులు అందిస్తున్నాం. ఈ విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు.. విమర్శలకు తావులేకుండా సమష్టిగా పనిచేయాలి. కేంద్రం నుంచి దశల వారీగా వ్యాక్సిన్ వస్తోంది. అందరికీ వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. జిల్లాలో 46 వేల మంది ఇటీవల కోవిడ్‌తో చేరగా అందులో 26 వేల మంది డిశ్చార్జ్ అయ్యారు. మిగిలిన వ్యక్తులు కోలుకుంటున్నారు.’ అని మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు. చదవండి: కంగారొద్దు.. రెమిడిసివిర్ కొరత లేదు చదవండి: ‘కోవిషీల్డ్’ డోసులలో కీలక మార్పులు -
ఢిల్లీకి ‘ఊపిరి’: ఆక్సిజన్‌పై కీలక ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుతం ఢిల్లీ ఊపిరి పీల్చుకుంటోంది. కరోనా మహమ్మారి విజృంభణ కొంత తగ్గుముఖం పట్టగా.. ఆస్పత్రుల్లో బెడ్లు ఖాళీ అవుతున్నాయి. ఆక్సిజన్ డిమాండ్ కూడా తగ్గింది. ఈ సందర్భంగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘ఆక్సిజన్ డిమాండ్ తగ్గింది. మిగులు ఆక్సిజన్‌ను అవసరమైన ఇతర రాష్ట్రాలకు ఇచ్చుకోవచ్చు. కరోనా వైరస్ కేసులలో తగ్గుదల వచ్చింది. ఆసుపత్రి పడకలు ఖాళీ అవుతున్నాయి. కోవిడ్ తీవ్రంగా ఉన్న సమయంలో (15 రోజుల కిందట) మాకు 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరమైంది. పడకల ప్రకారం ఢిల్లీ ఆక్సిజన్ డిమాండ్ రోజుకు 582 మెట్రిక్ టన్నులకు పడిపోయింది." "మేం కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశాం. రోజుకు 582 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌తో మా పని జరుగుతోందని, ఢిల్లీ కోటా నుంచి మిగులు ఆక్సిజన్‌ను ఇతర రాష్ట్రాలకు ఇవ్వండి అని విన్నవించాం" అని సిసోడియా చెప్పారు. మహమ్మారి రెండో దశలో కరోనా కేసుల సంఖ్య పెరగడంతో వారు బాధలో ఉన్నప్పుడు ఢిల్లీ ప్రజల సహాయానికి వచ్చినందుకు కేంద్రానికి, ఢిల్లీ హైకోర్టుకు ఈ సందర్భంగా సిసోడియా కృతజ్ఞతలు తెలిపారు. తాజాగా ఢిల్లీలో ఒక్క రోజులో కొత్తగా 10,400 కేసులు నమోదయ్యాయి. ఇవి గతానికి కంటే చాలా తక్కువ. ‘నిన్నటి గణాంకాల కంటే 21 శాతం తక్కువ. పాజిటివిటీ రేటు 14 శాతానికి పడిపోయింది’ అని సిసోడియా వెల్లడించారు. కరోనా కట్టడికి ఢిల్లీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని అమలు చేయడంతో ఇది సాధ్యమైందని సిసోడియా తెలిపారు. కరోనా చైన్ తెంపేందుకు ఢిల్లీ ప్రభుత్వం లాక్డౌన్, తీవ్ర ఆంక్షలతో కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పరిస్థితి కొంత అదుపులోకి వస్తోంది. చదవండి: ‘కోవిషీల్డ్’ డోసుల వ్యవధిలో కీలక మార్పులు చదవండి: కంగారొద్దు.. రెమిడిసివిర్ కొరత లేదు -
గరుడవేగ ఆక్సిజన్ కాన్సంట్రేటర్ షిప్పింగ్ సర్వీసెస్
హైదరాబాద్: కరోనా విపత్కర పరిస్థితుల్లో తనవంతు సాయం చేయటానికి గరుడవేగ సంస్థ ముందుకు వచ్చింది. ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఎక్కడ కొనుగోలు చేసినా వాటిని ఇండియాలోని తమ వారికి వాటిని నేరుగా అందిచాలని అనుకుంటే, వెంటనే తమను సంప్రదించాలని (www.garudavega.com) గరుడవేగ సంస్థ ప్రకటించింది. ఏ విధమైన లాభాలు ఆశించకుండా, ఆ సిలెండర్లు పంపటానికి ఎంత ఖర్చు అవుతుందో, అంతే సొమ్ము తీసుకుని, మీవారికి ఆ సిలెండర్లు అందిస్తామని గరుడవేగ తెలిపింది. పేలెట్ కార్గో/కమర్షియల్ షిప్మెంట్లు చేయదలుచుకున్నవారు oxygen@garudavega.comకు ఈమెయిల్ చెయవచ్చు. గరుడవేగ కొత్తగా రూపొందించిన వెబ్ పోర్టల్ ద్వారా అమెరికా నుంచి ఎక్కడికైనా, లేదా అమెరికాలోని వివిధ ప్రాంతాలకు మీరు పంపదలుచుకున్నవి షిప్ చేయవచ్చు. ఇతర షిప్మెంట్ సంస్థలతో పోలిస్తే, మీకు 50 నుంచి 60 శాతం తక్కువ ధరకు తమ సేవలు అందుతాయని గరుడవేగ తెలిపింది. డ్రాప్ ఆఫ్ సర్వీస్, ఫ్రీ పికప్ సర్వీసుతో పాటు మీరే లేబుల్ ప్రింట్ చేసుకునే సదుపాయం.. కార్పొరేట్ సంస్థలకు డిస్కౌంట్లు కూడా ఉన్నాయని వెల్లడించింది. ఇండియా నుంచి అమెరికా, ఇంగ్లాండు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఎమిరేట్స్, మిడిల్ ఈస్ట్ తో బాటు, రెండువందల దేశాలకు షిప్పింగ్ సేవలు అందిస్తున్నట్టు గరుడవేగ తెలిపింది. ఢిల్లీ, ముంబై, కోల్ కత్తా, ఒరిస్సా, చండీఘర్, మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానా, కేరళ ఇలా ఇండియాలో 250 ప్రదేశాలలో తమ సేవలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. -
తిప్పతీగ కషాయం తో పెరుగనున్న రోగ నిరోధక శక్తి
-
గ్రీన్ చానెల్లో ఆక్సిజన్ ట్యాంకర్
అనంతపురం: ఆక్సిజన్ నిల్వల విషయంలో అధికార యంత్రాంగం ముందు జాగ్రత్త చర్యలు చేపడుతోంది. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, కేన్సర్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ నిల్వలపై ఓ అంచనాకు వచ్చిన అధికారులు కర్ణాటక నుంచి ఆగమేఘాలపై ఆక్సిజన్ ట్యాంకర్ తెప్పించారు. కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లాలోని తోర్నకల్ జిందాల్ ఫ్యాక్టరీ నుంచి జిల్లా కేంద్రానికి 16 టన్నుల (13 కిలోలీటర్లు) ఆక్సిజన్ ట్యాంకరు రావాల్సి ఉండగా.. ఎస్పీ సత్య ఏసుబాబు ఆదేశాల మేరకు అనంతపురం డీఎస్పీ వీర రాఘవరెడ్డి నేతృత్వంలో బుధవారం గ్రీన్‌చానెల్ ద్వారా ట్యాంకర్‌ను తీసుకురావడం విశేషం. దాదాపు 160 కిలోమీటర్ల దూరం ఉన్న జిందాల్ నుంచి ట్యాంకర్ ఇక్కడికి రావాలంటే సుమారు ఐదు గంటలు పడుతుంది. అయితే ఎక్కడా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడకుండా గ్రీన్‌చానెల్ ద్వారా కేవలం 3 గంటల్లోపే అనంతపురానికి చేర్చారు. తెల్లవారుజామున 5.50 గంటలకు బయలుదేరిన వాహనం 9 గంటలకంతా ఇక్కడికి వచ్చేసింది. కరోనా నేపథ్యంలో కర్ఫ్యూ అమలవుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే వాహనాలకు అనుమతి ఉంటుంది. ఈ కారణంగా ఉదయం పూట ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది. అయినా ఎక్కడా ఇబ్బంది లేకుండా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. చెక్‌పోస్టు వద్ద కూడా ఆక్సిజన్ ట్యాంకరుకు ఆటంకం కలగకుండా జాగ్రత్తపడ్డారు. -
సికింద్రాబాద్ లో ఆక్సిజన్ ట్యాంకర్ బ్రేక్ డౌన్
-
తిరుపతి రుయా ఘటనపై సీఎం వైఎస్ జగన్ దిగ్బ్రాంతి
-
ఈ యాప్ యూజర్లకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఫ్రీ
బెంగళూరు: భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి భారత ప్రజలు ఈ వైరస్ దెబ్బకు అల్లాడిపోతున్నారు. ఆరోగ్యపరంగానే ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పలువురు సెలబ్రిటీలు, సంస్థలు, అంతేందుకు సామాన్యులు సైతం తమకు తోచిన విధంగా కరోనా బాధితులకు సాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో రైడింగ్ యాప్ ఓలా ఔదార్యం చాటుకుంది. తమ యూజర్ల ముంగిటకు ఆక్సిజన్కాన్సన్ట్రేటర్లను ఉచితంగా అందించాలని నిర్ణయించుకుంది. మా యూజర్లకు ఫ్రీగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు ప్రతీ రోజు పెరగడం, అందులో ఎక్కువ మంది ఆక్సిజన్ అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. కొందరికి సకాలంలో ఆక్సిజన్ అందక ప్రాణాలు కూడా విడిచారు. దీంతో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లకు డిమాండ్ పెరిగింది. ఈ కారణంగా ఓలా సంస్థ తమ యూజర్లకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను ఉచితంగా అందించడానికి ముందుకువచ్చింది. ఇందుకు చేయాల్సిందల్లా అవసరమైన వారి కనీస వివరాలు ఓలా యాప్‌లో నింపాల్సి ఉంటుంది. తరువాత అవసరమైన వారి ఇంటి ముందుకే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను ఉచితంగా తీసుకునేలా ఓలా ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమాన్ని గివ్ ఇండియాతో భాగస్వామ్యం ద్వారా ఓలా ఫౌండేషన్ చేయనుంది. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లకు, వాటి రవాణా చార్జీల కింద ఓలా తమ యూజర్ల నుంచి ఎలాంటి మొత్తం వసూలు చేయదు. ప్రారంభంగా 500 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను ఈ వారం నుంచి బెంగళూరు నగరంలో ప్రారంభించనుంది. రాబోయే వారాల్లో 10,000 వరకు దేశవ్యాప్తంగా వీటి సరఫరా జరిగేలా అమలు చేస్తామని ఓలా సహ వ్యవస్ధాపకులు భవీష్ అగర్వాల్ వెల్లడించారు. అసాధారణ పరిస్థితుల్లో ప్రజలకు సాయం చేసేందుకు తాము ఓ2ఫర్ఇండియా కార్యక్రమాన్ని చేపట్టామని ఆయన ప్రకటించారు. ( చదవండి: మద్యం ప్రియులకు శుభవార్త.. ఇకపై హోం డెలివరీ ) -
‘మావల్ల కాదు.. మేం పంపలేం’ ప్రధానికి సీఎం లేఖ
తిరువనంతపురం: ‘ప్రస్తుతం మా రాష్ట్రంలో కరోనా తీవ్రంగా వ్యాపిస్తోంది. పెద్ద ఎత్తున కరోనా బాధితులు చేరుతుండడంతో అవసరమైన వారికి ఆక్సిజిన్ అందించే పరిస్థితి ఇప్పుడు లేదు. మాకే కొరతగా ఉంది.. ఇక ఇతరులకు మేం పంపలేం’ అని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ సందర్భంగా కేరళలో నెలకొన్న కరోనా పరిస్థితులను లేఖలో సీఎం పినరయి వివరించారు. ‘ఆక్సిజన్ నిల్వలతో పాటు పలు విషయాలపై సోమవారం సీఎం పినరయి విజయన్ ప్రధానికి లేఖ రాశారు. రాష్ట్రంలో 219 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం ఉంది. ఇన్నాళ్లు ఇతర రాష్ట్రాలకు పంపాం. ప్రస్తుత పరిస్థితుల్లో ఆక్సిజన్ ఇతరులకు పంపలేం. ఆక్సిజన్ నిల్వలు 450 టన్నుల నుంచి 80 టన్నులకు చేరింది. ఇకపై తమిళనాడు, కర్నాటకకు ఆక్సిజన్ పంపడం కుదరదు. మీరే ఆక్సిజన్ విషయంలో కేరళకు సహాయం చేయాలి. ద్రవ పదార్థ ఆక్సిజన్ సరఫరా కోసం క్రయోజనిక్ ట్యాంకర్లు పంపండి. ప్రస్తుతం కేరళలో నాలుగు లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. భవిష్యత్‌లో అవి మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ సరఫరా కుదరదు.’ చదవండి: రాజకీయాల్లో చిచ్చురేపిన అల్లుడి పెళ్లి బరాత్ చదవండి: గంగానదిలో తేలిన కరోనా మృతదేహాలు -
విశాఖ చేరుకున్న ఐఎన్ఎస్ ఐరావత్
-
ఆక్సిజన్ పంపిణీలో విశేష సేవలు అందిస్తున్న కార్మికులు
-
ఆక్సిజన్ కోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
-
విదేశాల నుంచి ఆక్సిజన్ కొనుగోలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్ బాధితులకు ఆక్సిజన్ కొరత లేకుండా విదేశాల నుంచి లిక్విడ్ ఆక్సిజన్ కొనుగోలు చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ వెల్లడించారు. ఏ దేశంలో లిక్విడ్ ఆక్సిజన్ అందు బాటులో ఉన్నా తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నా మని నేవీ అధికారులు చెప్పారన్నారు. శనివారం ఆయన మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మీడియాతో మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్, నేవీ (తూర్పు నౌకాదళం) కోవిడ్ కష్టకాలంలో రాష్ట్రానికి అండగా నిలిచాయని తెలిపారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సరఫరాలో తలెత్తే లోపాలను సరిదిద్దడానికి నేవీ అధికారులు నాలుగు స్పెషలిస్టు బృందాలను ఏర్పాటు చేశారన్నారు. ఇప్పటికే విశాఖ ఉక్కు యాజమాన్యం వెయ్యి ఆక్సిజన్ పడకలు ఇస్తామని తెలిపిందని, అందులో ఇప్పటికే 50 అప్పగించా రని, మరో 150 పడకలు మే 15 నాటికి ఇస్తారని చెప్పారు. నేవీ అధికారులు సైతం 200 పడకలు ఇవ్వ డానికి ముందుకొచ్చారని తెలిపారు. ఆ బెడ్లకు మెడికల్, పారామెడికల్ సిబ్బందిని విశాఖ జిల్లా కలెక్టర్ నియమిస్తారన్నారు. మరో 3 వారాల్లోగా రాష్ట్రం కొనుగోలు చేస్తున్న 25 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఆయన ఏమన్నారంటే.. ప్రైవేటు ఆస్పత్రుల అక్రమాలపై కేసులు ప్రతి జిల్లాలోనూ ఐదారు ఆస్పత్రులను క్లస్టర్‌గా విభజించి ఫ్లయింగ్ స్క్వాడ్ ఆకస్మిక తనిఖీలు చేస్తోంది. నిబంధనలు ఉల్లంఘించిన యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు పెడుతున్నాం. నకిలీ రెమ్‌డెసివర్ కలిగి ఉన్నవారిపై చర్యలు తీసుకుంటున్నాం. ముందుగా సెకండ్ డోస్ వారికే ప్రాధాన్యం రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా కొనుగోలు చేస్తున్న వ్యాక్సిన్ సరఫరా ప్రారంభమైంది. వ్యాక్సిన్ మొదటి డోసు పంపిణీలో ఎవరూ ముందుకు రాకపోవడంతో, వార్డు/గ్రామ సచివాలయాల పరిధిలో ఉన్న వారిని చైతన్య పరిచి టీకా వేశాం. ఇప్పుడు అందరూ ఒకేసారి టీకా కావాలని అంటున్నారు. కేంద్రం ఇచ్చే వ్యాక్సిన్ సెకండ్ డోస్‌కు సరి పోతుంది. దానివల్ల కొత్తవారికి ఇవ్వలేకపోతున్నాం. ఈ విషయాన్ని కేంద్రానికి చెప్పాం. వ్యాక్సిన్ కోసం కేంద్రం రూపొందించిన కోవిన్ అప్లికేషన్లో మార్పు చేయాలని, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన యాప్ ద్వారా టీకా పంపిణీ చేస్తామని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశాం. ఇస్రో వద్ద 100 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్.. గడిచిన 24 గంటల్లో 491 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను ఆస్పత్రులకు సరఫరా చేశాం. కేసులు పెరుగుతున్న కారణంగా ఆక్సిజన్ కేటాయింపులు పెంచాలని, చెన్నై, బళ్లారి ప్లాంట్ల నుంచి సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరాం. ఇక్కడ నుంచి అయితే రవాణా సమయం కలిసొస్తుందని కేంద్రానికి తెలియజేశాం. నెల్లూరులోని సతీష్ ధావన్ (శ్రీహరికోట) అంతరిక్ష ప్రయోగశాలలో 90 నుంచి 100 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉన్నట్టు సమాచారం ఉంది. వాటిని కేటాయిస్తే నెల్లూరు జిల్లాకు మేలు జరుగుతుంది. ఆక్సిజన్ ప్లాంట్ల బాధ్యత నౌకాదళానికి.. సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, బోధనాసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణ బాధ్యతను తూర్పు నౌకాదళానికి (ఈఎన్సీ) అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అన్ని ఆస్పత్రుల్లో ఆక్సిజన్ నిల్వలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, సరఫరా బాధ్యతను ఈఎన్సీ తీసుకోనుంది. ఈ మేరకు స్టీల్‌ప్లాంట్, తూర్పు నౌకాదళాధికారులతో రాష్ట్ర ప్రభుత్వ రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.టి.కృష్ణబాబు శనివారం భేటీ అయ్యారు. ముందుగా స్టీల్‌ప్లాంట్‌లోని ఆక్సిజన్ యూనిట్లను పరిశీలించారు. అనంతరం తూర్పు నౌకాదళం ప్రధాన కేంద్రంలో ఈఎన్సీ చీఫ్ వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్‌తో భేటీ అయ్యారు. స్టీల్‌ప్లాంట్‌లో ఆక్సిజన్ యూనిట్స్‌ను పరిశీలిస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు ముఖ్యంశాలివీ.. ► ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, బోధనాస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణ బాధ్యత ఈఎన్సీ నిర్వహించనుంది. ► ఆక్సిజన్ ప్లాంట్లలో లీకేజీ సమస్యల పరిష్కారం, ప్లాంట్ల పర్యవేక్షణ, అక్కడ తీసుకోవాలి్సన బాధ్యతల్ని నౌకాదళం నిర్వర్తించనుంది. ► ఇందుకోసం తూర్పు నౌకాదళం నాలుగు బృందాలు ఏర్పాటు చేయనుంది. ఒక్కో బృందం 3 నుంచి 4 జిల్లాల్ని పర్యవేక్షిస్తుంది. ► అత్యవసరమైతే ఈ బృందాల సహకారంతో యుద్ధ విమానాలు, నేవల్ హెలికాప్టర్లను కూడా ఆక్సిజన్ సరఫరాకు వినియోగించనున్నారు. ► సింగపూర్, థాయ్‌లాండ్, మలేషియా మొదలైన దేశాల నుంచి వస్తున్న 25 క్రయోజనిక్ ఆక్సిజన్ సిలిండర్లను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు రవాణా చేసే బాధ్యత తీసుకునేందుకు ఈఎన్సీ అంగీకరించింది. ► లిక్విడ్ ఆక్సిజన్ కంటైనర్లతో పాటు డీ–టైప్ ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, కోవిడ్ సంబంధిత వైద్య పరికరాలు, మందులు సరఫరా చేసేందుకు నౌకాదళ వాహనాలు వినియోగించాలని నిర్ణయించారు. ► విశాఖలోని ఐఎన్ఎస్ కళింగ ఆస్పత్రిలో కోవిడ్ చికిత్స కోసం 10 ఆక్సిజన్ బెడ్స్‌తో పాటు 60 సాధారణ పడకలు ఏర్పాటు చేసేందుకు తూర్పు నౌకాదళాధికారులు అంగీకరించారు. ► విశాఖలోని కంచరపాలెం సమీపంలో ఉన్న నేవీ షెడ్లో 150 పడకల తాత్కాలిక కోవిడ్ హాస్పిటల్ ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని నేవీ స్పష్టం చేసింది. ► కోవిడ్ పేషెంట్లకు ఇబ్బందులు తలెత్తకుండా 200 డీ–టైప్ ఆక్సిజన్ సిలెండర్లను సరఫరా చేయనున్నారు. స్టీల్‌ప్లాంట్‌లో ఆక్సిజన్‌తో 50 పడకలు.. ► కోవిడ్ మహమ్మారిని కట్టడి చేసేందుకు స్టీల్‌ప్లాంట్ అధికారులు కూడా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు అంగీకరించారు. ► స్టీల్‌ప్లాంట్‌లోని గురజాడ కళాక్షేత్రంలో ఆక్సిజన్ సౌకర్యంతో 50 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేసేందుకు విశాఖ ఉక్కు కర్మాగారం అధికారులు అంగీకరించారు. ► మే 15 నాటికి అదనంగా 150 పడకలు, 30 నాటికి 250, జూన్ నాటికి 600 పడకలు అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు. -
180 జిల్లాల్లో కనిపించని వైరస్ జాడ
సాక్షి, న్యూఢిల్లీ: వారం రోజులుగా దేశవ్యాప్తంగా 180 జిల్లాలు, 14 రోజులలో 18 జిల్లాలు, 21 రోజులుగా 54 జిల్లాలు, 28 రోజుల్లో 32 జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు కొత్తగా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. కోవిడ్ బాధితుల్లో పరిస్థితి క్లిష్టంగా ఉండి ఐసీయూలో 4,88,861 మంది, వెంటిలేటర్ సపోర్ట్‌పై 1,70,841 మంది, ఆక్సిజన్ సపోర్ట్‌పై 9,02,291 మంది ఉన్నారని వెల్లడించారు. మొత్తం బాధితుల్లో 1.34% మంది ఐసీయూలో, 0.39% వెంటిలేటర్లపై, 3.70% మంది ఆక్సిజన్ సపోర్ట్‌పై ఉన్నారని ఆయన తెలిపారు. శనివారం జరిగిన ఉన్నత స్థాయి మంత్రుల బృందం 25వ సమావేశానికి మంత్రి హర్షవర్ధన్ అధ్యక్షత వహించారు. మూడు రోజుల్లో 53 లక్షల డోసుల టీకా వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం ఇప్పటివరకు 17,49,57,770 డోస్‌లను రాష్ట్రాలకు పంపిణీ చేయగా, అందులో 16,65,49,583 డోస్‌ల వినియోగం జరిగిందని మంత్రి తెలిపారు. ఇంకా 84,08,187 డోస్‌లు ఇప్పటికీ రాష్ట్రాల వద్ద అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. మొత్తం 53,25,000 వ్యాక్సిన్ డోస్‌లు సిద్ధంగా ఉన్నాయనీ, రానున్న మూడు రోజుల్లో రాష్ట్రాలకు సరఫరా చేయనున్నట్లు మంత్రి తెలిపారు. కోవిడ్–19 నుంచి పూర్తి రక్షణను పొందేందుకు, రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ప్రజలందరూ వ్యాక్సిన్ రెండు డోస్‌లను పొందాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. పెరిగిన పరీక్షల సామర్థ్యం దేశం రోజుకు 25 లక్షల టెస్ట్‌ల పరీక్షా సామర్థ్యాన్ని చేరుకుందని తెలిపారు. దేశంలో ఇప్పటివరకు మొత్తం 30,60,18,044 పరీక్షలు జరిగాయని, ఇందులో గత 24 గంటల్లో 18,08,344 పరీక్షలు ఉన్నాయని అన్నారు. అంతేగాక గతంలో పుణేలోని ఎన్ఐవీ కేవలం ఒక ల్యాబ్ ఉన్న పరిస్థితి నుంచి, ప్రస్తుతం దేశంలో 2,514 ల్యాబ్‌ల ద్వారా సేవలు అందించే స్థాయికి చేరుకున్నామన్నారు. దేశంలో ప్రస్తుతం పెరుగుతున్న కేసుల నేపథ్యంలో టైర్ –2, టైర్–3 నగరాల్లో టెస్టింగ్ సెంటర్లు, ఆసుపత్రి మౌలిక సదుపాయాలను గణనీయంగా పెంచే అవసరం, ప్రాముఖ్యత ఉందని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ డైరెక్టర్ డాక్టర్ సుజీత్ కుమార్ సింగ్ స్పష్టంచేశారు. గత ఏడు రోజుల్లో సంక్రమణ కేసులు మహారాష్ట్ర (1.27%), కర్ణాటక (3.05%), కేరళ (2.35%), ఉత్తరప్రదేశ్ (2.44%), తమిళనాడు (1.86%), ఢిల్లీ (1.92%), ఆంధ్రప్రదేశ్ (1.90%), పశ్చిమ బెంగాల్ (2.19%), ఛత్తీస్‌గఢ్(2.06%), రాజస్తాన్ (2.99%), గుజరాత్ (2.40%), మధ్యప్రదేశ్ (2.24%) రాష్ట్రాల్లో అధికంగా నమోదయ్యాయని తెలిపారు. బెంగళూరు (అర్బన్), గంజాం, పుణే, ఢిల్లీ, నాగపూర్, ముంబై, ఎర్నాకులం, లక్నో, కోజికోడ్, థానే, నాసిక్, మలప్పురం, త్రిస్సూర్, జైపూర్, గురుగ్రామ్, చెన్నై, తిరువనంతపురం, చంద్రాపూర్, కోల్‌కతా, పాలక్కడ్ జిల్లా/ మెట్రో నగరాల్లో యాక్టివ్ కేసులు అధికంగా ఉన్నాయని వివరించారు. వర్చువల్‌గా జరిగిన ఈ సమావేశంలో కేంద్రమంత్రులు ఎస్.జైశంకర్, హర్దీప్ సింగ్ పూరి, మన్సుఖ్ మాండవీయ, నిత్యానంద్ రాయ్, అశ్విని కుమార్ చౌబే, నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వినోద్ పాల్ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అమెరికా ఆరోగ్య మంత్రితో హర్షవర్ధన్ చర్చలు కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్థన్ శనివారం అమెరికా ఆరోగ్య మంత్రి జేవియర్ బెసెర్రాతో ఫోన్లో మాట్లాడారు. ఈ క్లిష్ట సమయంలో భారత్‌కు అమెరికా అండగా నిలుస్తుందని బెసెర్రా ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా, కోవిడ్ వ్యాక్సిన్లపై మేథో హక్కులను తాత్కాలికంగా రద్దు చేయడంతోపాటు మున్ముందు ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో)తో జరిగే చర్చల్లో ఇదే విధమైన వెసులుబాటు కల్పిస్తామన్నారు. కోవిడ్‌పై పోరాటంలో భారత్‌కు సహకరించడానికి అధ్యక్షుడు బిడెన్ కూడా కట్టుబడి ఉన్నారని బెసెర్రా తెలిపారని హర్షవర్ధన్ ఒక ప్రకటనలో వెల్లడించారు. -
ఆక్సిజన్ కాన్సంట్రేట్ మెషిన్‌కి భారీగా డిమాండ్
-
గూగుల్‌లో ఈ పదాల కోసం తెగ వెతుకుతున్న తెలుగు ప్రజలు
సాక్షి, హైదరాబాద్: ఇదివరకు గూగుల్‌లో సెర్చింగ్ అంటే.. హీరోలు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు లేదా క్రికెట్ ఆటగాళ్ల గురించి తెలుసుకోవడానికి చూసే వాళ్లం. కానీ దేశంలో కరోనా సంక్షోభం మొదలైనప్పటి నుంచి ప్రజల అలవాట్లే కాదు గూగుల్‌లో సెర్చ్ చేసే పదాలను కూడా కరోనా మార్చేసిందనే చెప్పాలి. ఈ క్రమంలోనే గత వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల ప్రజలు రెమిడెసివిర్ ఇంజక్షన్ గురించి గూగుల్‌లో తెగ గాలిస్తున్నారు. రెమిడెసివిర్నే ఎందుకు వెతుకుతున్నారు కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో రెమిడెసివిర్ వైరస్ పై ప్రభావం చూపిస్తుందని డాక్టర్లు తెలిపారు. ఇక అప్పటి నుంచి మార్కెట్లో ఈ ఇంజక్షన్ కు విపరీతమైన డిమాండ్ వచ్చేసింది. ప్రస్తుతం ఈ ఇంజక్షన్ బహిరంగ మార్కెట్లో దొరక్క బ్లాక్ మార్కెట్లో వేలు పోసి కొంటున్నారు. బయట అందుబాటులో లేకపోవడం, ఎక్కడా చూసినా ఈ ఇంజక్షన్ పేరే వినపడడంతో దీని గురించి తెలుసుకోవడానికి గూగుల్‌లో ఇలా గాలిస్తున్నారు. రాష్ట్రాల పరంగా చూస్తే.. కర్ణాటక, ఢిల్లీ టాప్ రెండు స్థానాల్లో ఉండగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు మూడు,నాలుగు స్థానాల్లో ఉన్నాయి. నగరాల పరంగా .. కర్ణాటకలోని విజయపురా, బీదర్, హసన్, కాలాబురగి, బెంగళూరు.. తెలంగాణలో ఖమ్మం, వరంగల్, కరీంనగర్ ఉన్నాయి. ఇక ఆంధ్రా లో గుంటూరు, విజయవాడ, ఓంగోలు, విజయనగరం ఉన్నాయి. రెమిడెసివిర్ ఇంజక్షన్ల కొరత వలనే ప్రజలు ఇంతలా వాటి కోసం గూగుల్ లో చూస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇక విపరీతంగా గూగుల్‌లో చూస్తున్న రెండో పదంగా ఆక్సిజన్ ఉంది. కరోనా వీర విహారం చేస్తున్న నేపథ్యంలో దేశంలో ఆక్సిజన్ సిలిండర్లు కొరతతో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం సహజంగా ఆక్సిజన్ లెవల్స్ ఎలా పెంచుకోవాలో అనే విషయంపై తెగ వెతుకుతున్నారు. ఇందులో ఢిల్లీ టాప్‌లో ఉండగా హర్యానా, యూపీ, గోవా,కర్ణాటక వరుసగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఏడో స్థానంలో ఉంది. ( చదవండి : కరోనా డాక్టర్ల కాసుల దందా.. బ్లాక్ మార్కెట్లో రెమిడెసివర్ ) -
పోలీసుల స్పందనతో 693 మందికి ఊపిరి
సాక్షి, అమరావతి/సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్ర పోలీసులు సకాలంలో.. వేగంగా స్పందించి 693 మందికి ఊపిరి అందేలా చేశారు. విజయవాడ గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్)లో ఆక్సిజన్ విభాగంలో చికిత్స పొందుతున్న 693 మందికి ముప్పు తప్పించారు. ఆక్సిజన్ ట్యాంకర్‌ను వేగంగా రప్పించి వారిని ఆదుకున్నారు. ఈ ఆస్పత్రికి 18 టన్నుల ఆక్సిజన్‌తో ఒడిశాలోని జిందాల్ స్టీల్ అండ్ పవర్ ఫ్యాక్టరీ నుంచి వస్తున్న ట్యాంకర్‌కు గురువారం అర్ధరాత్రి దాటాక ట్రాకింగ్ వ్యవస్థతో సంబంధాలు తెగిపోయాయి. ట్యాంకర్ సకాలంలో రాకపోతే ఆస్పత్రిలోని 693 మందికి ప్రాణాపాయమని కలవరపడిన వైద్యులు.. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ బి.శ్రీనివాసులుకు సమాచారం అందించారు. వెంటనే ఆయన ఒడిశా నుంచి విజయవాడ వరకు అన్ని జిల్లాల ఎస్పీలను అప్రమత్తం చేశారు. ఒడిశా నుంచి వస్తున్న ఆక్సిజన్ ట్యాంకర్ తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు సమీపంలోని ధర్మవరం వద్ద ఓ దాబాలో ఉన్నట్టు ఆ జిల్లా పోలీసులు గుర్తించారు. ఇక్కడ ఎందుకు ఆపేశావని ట్యాంకర్ డ్రైవర్‌ను ప్రశ్నించారు. తాను బయలుదేరిన చోటునుంచి విజయవాడ దాదాపు 878 కిలోమీటర్ల దూరం ఉందని, ఏకధాటిగా డ్రైవింగ్ చేయడం వల్ల తీవ్రంగా అలసిపోయి ఆపినట్లు డ్రైవర్ తెలిపారు. అరక్షణం ఆలస్యం చేయకుండా మెరుపువేగంతో స్పందించిన పోలీసులు డ్రైవింగ్ అనుభవం ఉన్న హోంగార్డుతో ట్యాంకర్‌ను అక్కడి నుంచి విజయవాడకు పంపించారు. ఆ ట్యాంకర్ సకాలంలో విజయవాడ చేరుకునేలా తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో పోలీసులు ప్రత్యేక బందోబస్తుతో గ్రీన్‌చానల్ ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ట్యాంకర్ విజయవాడ చేరుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సకాలంలో స్పందించి ఆక్సిజన్ ట్యాంకర్ వేగంగా వచ్చేలా చేసి వందలమంది ప్రాణాలు కాపాడిన పోలీసులకు సెల్యూట్ చేస్తున్నట్లు డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ చెప్పారు. రాష్ట్ర పోలీసులు కోవిడ్ ఆస్పత్రులకు సకాలంలో ఆక్సిజన్ అందేలా గ్రీన్ చానల్ ఏర్పాటు, ఎస్కార్ట్ వంటి సేవల్ని అందిస్తున్నారని అభినందించారు. -
ఏపీకి 25 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లు
సాక్షి, అమరావతి: కోవిడ్‌తో చికిత్స పొందుతున్న బాధితులకు సకాలంలో ఆక్సిజన్ అందించేందుకు 25 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లను కొనుగోలు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. ఒక్కో ట్యాంకర్ సామర్థ్యం 20 టన్నులు ఉంటుందని, వీటి ద్వారా మొత్తం 500 టన్నుల ఆక్సిజన్ సరఫరా లేదా స్టోరేజీ కెపాసిటీ సమకూరుతుందని చెప్పారు. ఇందుకోసం సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే అనుమతి ఇచ్చారని తెలిపారు. కోవిడ్ కేర్ సెంటర్ల వద్ద వినియోగించేందుకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు కొనుగోలు చేస్తున్నామన్నారు. గురువారం ఆయన మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మీడియాతో మాట్లాడారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కోవిడ్ చికిత్స అందిస్తున్న ఆరోగ్యశ్రీ ఎంప్యానల్(నెట్వర్క్) ఆస్పత్రులు, తాత్కాలికంగా 3 నెలలకు ఆరోగ్యశ్రీ కింద అనుమతి పొందిన ఆస్పత్రులన్నీ 50 శాతం పడకలను తప్పనిసరిగా కోవిడ్ బాధితులకు ఇవ్వాలని సింఘాల్ పేర్కొన్నారు. 50 శాతం పడకలు ఆరోగ్యశ్రీకి.. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు ప్రస్తుతం 349 ఉండగా వీటిలో 25,058 పడకలున్నాయి. తాత్కాలిక ఎంప్యానెల్మెంట్ పరిధిలో 47 ఆస్పత్రులు ఉండగా ఇందులో 1,949 పడకలున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు వీటిలో సగం పడకలు ఆరోగ్యశ్రీ పేషెంట్లకు ఇవ్వాల్సిందే. వారికి సంబంధించిన ఖర్చును ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ఆస్పత్రులకు చెల్లిస్తాం. పడకలు పూర్తిగా కేటగిరీల వారీగా విభజిస్తున్నాం. ఈ వివరాలన్నీ 104 కాల్‌సెంటర్ వద్ద, జిల్లా కలెక్టర్ల వద్ద ఉంటాయి. దీని ప్రకారం పడకల కేటాయింపు సులభమవుతుంది. వివరాలన్నీ వీలైనంత త్వరగా సేకరించాలని కలెక్టర్లను కోరాం. ఆరోగ్యశ్రీ బాధితులకు ఇచ్చే పడకలు నిండిన తరువాత ఖాళీగా ఉంటే పేషెంటును కాదనకుండా ఇవ్వాలి. ప్రస్తుతం 108 ప్రభుత్వ ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్స జరుగుతోంది. ఇందులో 16,962 పడకలున్నాయి. ఇప్పటివరకూ నెట్వర్క్ ఆస్పత్రుల్లో 16,871 మంది చేరగా 8,647 మంది ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందారు. ఆక్సిజన్‌కు ఇబ్బంది లేకుండా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నాం. భవిష్యత్తులో సరఫరా సమస్యలు తలెత్తకుండా ఆక్సిజన్ పీఏఎస్‌లు ఏర్పాటవుతాయి. 3 నెలల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని అంచనా వేశాం. ఇప్పటికే టెండర్లు పిలిచాం. మరోవైపు థర్డ్‌వేవ్ గురించి మాట్లాడుతున్నారు. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. అందుకే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్కడా సమస్యలు లేకుండా ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నాం. 104కు ఒక్కరోజే 17,649 కాల్స్ గురువారం ఒక్కరోజే 104 కాల్‌సెంటర్‌కు 17,649 ఫోన్ కాల్స్ వచ్చాయి. ఇప్పటివరకూ 3,365 మంది డాక్టర్లు రిజిస్టర్ చేసుకోగా వీరిలో 608 మంది స్పెషలిస్టులున్నారు. ఆస్పత్రి దగ్గరే కోవిడ్ కేర్ సెంటర్ ఆస్పత్రుల ఆవరణలోని ఖాళీ స్థలాల్లో జర్మన్ హ్యాంగర్ టెక్నాలజీతో వీలును బట్టి 100 నుంచి 200 పడకలతో కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ కూడా ఆక్సిజన్ బెడ్లు ఉంటాయి. కోవిడ్ కేర్లా ఉపయోగపడుతుంది, ఆస్పత్రిలాగా కూడా ఉంటుంది. వీలైనంత త్వరలో వీటిని ఏర్పాటు చేయాలని రోడ్లు భవనాల శాఖను కోరాం. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం గురువారం రూ.100 కోట్లు ఇచ్చింది. వ్యాక్సిన్ కోసం మరో రూ.45 కోట్లు విడుదల చేసింది. చదవండి: ఎన్440కె ఏపీలో వచ్చిన వేరియంట్ కాదు.. సీసీ ఫుటేజ్‌లో దృశ్యాలు: పావు గంటలో.. పని కానిచ్చేశారు! -
మరోసారి దాతృత్వాన్ని చాటుకున్న ఎంపీ మిథున్‌రెడ్డి
పుంగనూరు (చిత్తూరు జిల్లా): కరోనా తీవ్రమవుతున్న తరుణంలో పుంగనూరు నియోజకవర్గ ప్రజలకు అవసరమైన మందులు, ఆక్సిజన్ కొనుగోలు చేసేందుకు లోక్ సభ ప్యానెల్ స్పీకర్, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి తన సొంత నిధులు కోటి రూపాయలు విరాళం చెక్కును జిల్లా కలెక్టర్ హరినారాయణ్‌కు అందజేశారు. గురువారం పుంగనూరు ఆర్టీసీ డిపోను సీఎం వైఎస్ జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్చువల్ విధానం ద్వారా అమరావతి నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్యేలు ద్వారకనాథరెడ్డి, నవాజ్‌బాషా, సబ్ కలెక్టర్ జాహ్నవితో కలసి ఎంపీ మిథున్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి సూచనల మేరకు పుంగనూరు నియోజకవర్గ ప్రజలకు కరోనా సమయంలో మెరుగైన వైద్యసేవలు అందించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఆక్సిజన్‌తో పాటు మందులను కొనుగోలు చేసి, అన్ని రకాల వైద్య సదుపాయాలు అందించేలా జిల్లా కలెక్టర్‌ను కోరామన్నారు. పుంగనూరు ప్రజలకు ఏ సమస్య ఎదురైనా తమ కుటుంబం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజలు కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుని ప్రతి ఒక్కరు ఇంటికే పరిమితం కావాలన్నారు. చదవండి: YS Jagan: అత్యధిక పరీక్షలు, ఉచిత వైద్యం.. ప్రజలకు అండగా.. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ -
గురుగ్రామ్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఘోరం
-
జలమార్గంలో చేరుకున్న ఆక్సిజన్ ట్యాంకర్లు
సాక్షి, విశాఖపట్నం: దేశంలో విజృంభిస్తున్న కోవిడ్–19 సెకండ్ వేవ్‌పై జరుగుతున్న సమరంలో భారత నౌకాదళం ఓ అడుగు ముందుకేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో దేశాన్ని పట్టి పీడిస్తున్న ఆక్సిజన్ కొరతని అధిగమించేందుకు తన వంతు ప్రయత్నం ప్రారంభించింది. సముద్రసేతు–2లో భాగంగా సింగపూర్ నుంచి ఆక్సిజన్ని తీసుకొచ్చింది. ఈ నెల 2న సింగపూర్ చేరుకున్న ఐఎన్ఎస్ ఐరావత్, ఐఎన్ఎస్ తల్వార్ యుద్ధ నౌకల ద్వారా పెద్ద ఎత్తున మెడికల్ ఆక్సిజన్ నిల్వల్ని తూర్పు నౌకాదళ ప్రధాన స్థావరం విశాఖకు బుధవారం తీసుకొచ్చాయి. ముందుగా ఐఎన్ఎస్ తల్వార్ బుధవారం ఉదయం 54 టన్నుల ద్రవపు ఆక్సిజన్‌తో విశాఖ తీరానికి చేరుకుంది. అనంతరం.. అతి పెద్ద ల్యాండింగ్ షిప్ ఐఎన్ఎస్ అవతార్ భారీ స్థాయిలో ఆక్సిజన్ని సింగపూర్ నుంచి తీసుకొచ్చింది. 27 టన్నుల సామర్థ్యం ఉన్న 8 ఆక్సిజన్ ట్యాంకర్లతో పాటు 3,600 ఆక్సిజన్ సిలిండర్లు, పెద్ద ఎత్తున కోవిడ్–19కి సంబంధించిన మెడికల్ సామగ్రిని తీసుకొచ్చింది. ఆక్సిజన్ కోసం విమానాల్లో ట్యాంకర్ల తరలింపు ఒడిశాకు 4 ట్యాంకర్లు గన్నవరం: ఒడిశా నుంచి రాష్ట్రానికి ఆక్సిజన్ దిగుమతి చేసుకునేందుకు బుధవారం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానంలో నాలుగు ఖాళీ ట్యాంకర్లను భువనేశ్వర్‌కు పంపించారు. తొలుత తెల్లవారుజామున 3 గంటలకు వచ్చిన ఐఏఎఫ్ సీ–17 కార్గో విమానంలో రెండు ట్యాంకర్లను, భువనేశ్వర్ నుంచి మధ్యాహ్నం వచ్చిన మరో విమానంలో రెండు ట్యాంకర్లను తరలించారు. ఒడిశాలోని టాటా స్టీల్, ఏఎస్‌డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ల నుంచి అంగూరులోని ఫిల్లింగ్ స్టేషన్ ద్వారా ట్యాంకర్లలో మెడికల్ ఆక్సిజన్ లోడ్ చేయనున్నారు. అనంతరం ఈ ట్యాంకర్లు రోడ్డు మార్గంలో గ్రీన్‌చానల్ ద్వారా విజయవాడకు చేరుకుంటాయని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు. సాధారణంగా ట్యాంకర్లను అంగూరు పంపించేందుకు మూడు నుంచి 4 రోజుల సమయం పడుతుందని చెప్పారు ట్యాంకర్లను విమానాల్లో పంపించడం ద్వారా గంటన్నర వ్యవధిలోనే అక్కడికి చేరుకుని ఆక్సిజన్‌ను తక్కువ సమయంలో రాష్ట్రానికి తీసుకువస్తాయని తెలిపారు. ట్యాంకర్ల తరలింపు ఏర్పాట్లను ఎయిర్పోర్ట్ డైరెక్టర్ జి.మధుసూదనరావు పర్యవేక్షించారు. -
దీదీ సంచలన నిర్ణయం.. పాతవారికే బాధ్యతలు
కోల్‌కతా: టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన గంటల వ్యవధిలోనే సంచలన నిర్ణయం తీసుకున్నారు. బెంగాల్ డీజీపీ నీరజ్ నయన్‌ను బదిలీ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పాత డీజీపీ వీరేంద్రను తిరిగి బెంగాల్ డీజీపీగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల ఫలితాల అనంతరం బెంగాల్లో హింస చెలరేగింది అంటూ బీజేపీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కాషాయ పార్టీ వ్యాఖ్యలపై దీదీ స్పందించారు. రాష్ట్రంలో చెలరేగిన హింసకు ఎన్నికల కమిషనే కారణమని ఆరోపించారు. ఇక మీదట రాష్ట్రంలో శాంతిభద్రతలను తానే పర్యవేక్షిస్తానని తెలిపారు. ఇక ఎన్నికల అనంతరం రాష్ట్రంలో చెలరేగిని ఘర్షణలకు సంబంధించి గవర్నర్ డీజీపీని పిలిచి మాట్లాడారు. దీనిపై నివేదిక ఇవ్వాలని కోరారు. కేంద్ర హోం శాఖ కూడా దీనిపై నివేదిక కోరిన సంగతి తెలిసిందే. కేంద్రానికి దీదీ లేఖ సీఎం ప్రమాణం చేసిన అనంతరం మమతా బెనర్జీ తన తొలి ప్రాధాన్యత కోవిడ్ కట్టడే అని స్పష్టం చేశారు. ఈ మేరకు చర్యలు ప్రారంభించారు. రాష్ట్రానికి సరిపడా ఆక్సిజన్ పంపాలని కోరుతూ దీదీ కేంద్రానికి లేఖ రాశారు. -
అనవసర వివాదం
సంక్షోభకాలంలో సంయమనం పాటించడం, దాన్నుంచి గట్టెడానికి అవసరమైన కార్యాచరణను రూపొందించటంలో నిమగ్నం కావడం కీలకం. అనవసర వివాదాల్లో తలదూర్చి వాటికోసమే శక్తి యుక్తుల్ని వెచ్చిస్తే అందువల్ల ఒరిగేదేమీ వుండదు సరికదా...నష్టపోతాం. ఈమధ్య ఢిల్లీలో కరోనా వైరస్ బారినపడినవారికి యువజన కాంగ్రెస్ ఆక్సిజన్ అందించే కార్యక్రమాన్ని మొదలెట్టింది. పలు ఇతర సంస్థలు కూడా ఈ విషయంలో శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాయి. పలుకుబడిగల కొందరు వ్యక్తులు సైతం రోగులను ఆదుకుంటున్నారు. సామాజిక మాధ్యమాలన్నిటా ఈ భోగట్టా కనబడుతూనేవుంది. ఇలాంటి సంస్థలనూ, వ్యక్తులనూ అందరూ ప్రశంసించాల్సిందే. ఎందుకంటే కష్టకాలంలో కేవలం ప్రభుత్వాలే అన్నీ చేయాలంటే సాధ్యం కాదు. సమాజంలో చొరవ, స్థోమత వున్న ప్రతి ఒక్కరూ పూనుకున్నప్పుడే సంక్షోభాల నుంచి సురక్షితంగా బయటపడగలం. కానీ నాలుగైదు రోజులనాడు కేంద్రానికీ, కాంగ్రెస్‌కూ మధ్య జరిగిన చిన్నపాటి వివాదం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమై మన దేశం ప్రతిష్టను మసకబార్చింది. ఢిల్లీలోని ఫిలిప్పీన్స్ రాయబార కార్యాలయం తమకు ఆక్సిజన్ సిలెండర్ అవసరమైందంటూ ట్విటర్ ద్వారా యువజన కాంగ్రెస్‌ను కోరడంతో ఈ వివాదం మొదలైంది. ఆ విభాగం అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్ బృందం వెంటనే కదిలి ఆ కార్యాలయానికి సిలెండర్ అందించింది. సహజంగానే కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ కేంద్రాన్ని ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు. విదేశీ రాయబార కార్యాలయాల నుంచి వచ్చిన అత్యవసర సందేశానికి విపక్ష విభాగం వెనువెంటనే స్పందిస్తుంటే, విదేశాంగ శాఖ కార్యాలయం నిద్రపోతోందా అని ఆయన ప్రశ్నించారు. ఎప్పుడూ సౌమ్యంగా కనిపించే... మృదువుగా మాట్లాడే విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ ఎందుకనో దీనిపై తీవ్రంగా స్పందించారు. ఇది అయాచితంగా చేసిన సాయమంటూ చురక అంటించారు. దాంతో ఆగక ఆ రాయబార కార్యాలయాన్ని తాము సంప్రదించామని, వారివద్ద కరోనా కేసులే లేవని వెల్లడైందంటూ ముక్తాయించారు. నగరంలో అనేకమంది పౌరులు ఆక్సిజన్ కోసం ఆత్రపడుతున్న తరుణంలో చవకబారు ప్రచారం కోసం ఫిలిప్పీన్స్ కార్యాలయం కోరకుండానే సిలెండర్ ఇచ్చారని ఎద్దేవా చేశారు. యువజన కాంగ్రెస్ ఊరుకోలేదు. అడిగాకే ఇచ్చామంటూ ఈ విషయంలో జరిగిన సంభాషణల ట్వీట్లను విడుదల చేసింది. స్విట్జర్లాండ్ దౌత్య కార్యాలయం కూడా ఆ మాదిరే అడిగింది. కానీ జరుగుతున్న జగడాన్ని చూసి చడీచప్పుడూ లేకుండా తన ట్వీట్‌ను తొలగించి సారీ చెప్పింది. ఆక్సిజన్ అవసరమై ‘అన్ని విధాలా’ తాము ప్రయత్నించామని, దీనికి పెడర్థాలు తీయడం వల్ల ఉపసంహరించుకుంటు న్నామని తెలిపింది. నిజానికి వివాదం అయింది ఫిలిప్పీన్స్ విషయంలో మాత్రమే. కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చిన వేళ ఉద్వేగాలు పెరగడం సహజం. దేశ పౌరులకే ఆక్సిజన్ విషయంలో రకరకాల అనుభవాలు ఎదురవుతుంటే, వేరే దేశాలవారికి ఎలాంటి భయాలుంటాయో సులభంగానే గ్రహించవచ్చు. కరోనా బారిన పడుతున్న సహచరులకు వైద్యసాయం అందించ డానికి వారు ఆత్రపడటాన్ని అర్థం చేసుకోవచ్చు. టాంజానియా హైకమిషన్‌లోని కల్నల్ మోజెస్ బీటస్ మ్లూలా గత నెల 28న ఢిల్లీ ఆసుపత్రిలో మరణించాక దౌత్య కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందిలో ఆందోళన బయల్దేరింది. అమెరికా, జర్మనీ, ఇజ్రాయెల్, బంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్తాన్, స్వీడన్, నేపాల్ దౌత్య కార్యాలయాలల్లో పనిచేసేవారిలో ఈమధ్య కరోనా కేసులు బయటపడ్డాయి. అమెరికా రాయబార కార్యాలయంలో సిబ్బంది, వారి బంధువులతోసహా వందమందికి కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే మన పౌరుల్లా వారు బాహాటంగా అన్నీ బయటకు చెప్పలేరు. సమస్యలెదురైనా దౌత్యపరమైన మార్గాల్లో ప్రయత్నిస్తారు. విదేశాంగ శాఖలో వుండే ప్రోటోకాల్ చీఫ్, వివిధ దేశాల దౌత్య సిబ్బంది వ్యవహారాలను చూసే డివిజన్ల చీఫ్‌లు అనారోగ్య సమస్యల విషయంలో చురుగ్గా స్పందిస్తారు. వారిని ఆసుపత్రుల్లో చేర్చే బాధ్యతను కూడా తీసుకుంటారు. ఇదంతా సక్రమంగా జరిగితే దౌత్య కార్యాలయాల్లోని సిబ్బందిలో కరోనా తలెత్తిందన్న విషయం కూడా బయటకు తెలిసే అవకాశం వుండదు. అయితే ఈ క్రమంలో ఎక్కడో ఏర్పడిన లోపంవల్ల ఫిలిప్పీన్స్ దౌత్య కార్యాలయం యువజన కాంగ్రెస్‌ను సంప్రదించివుండొచ్చు. కాంగ్రెస్ నేతలు ఈ విషయంలో ఎలా స్పందించినా ప్రభుత్వం అక్కడితో దాన్ని వదిలి, లోటుపాట్లేమైనా వుంటే సరిదిద్దుకుని వుంటే బాగుండేది. అందుకు భిన్నంగా బహిరంగ వేదికలపై అధికార, విపక్షాలు పరస్పరం విమర్శలు చేసుకోవటంతో రచ్చ అయింది. స్విట్జర్లాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ కూడా ఈ విషయంలో స్పందించక తప్పలేదు. తమ దౌత్య సిబ్బందిలో ఒకరు కరోనా బారిన పడిన విషయం నిజమేనని తెలిపారు. మావాళ్లు సరైనమార్గంలో ప్రయత్నించలేదని, అందుకు క్షమాపణ చెప్పారని అన్నారు. ఆమె ఇతరత్రా అంశాల జోలికి పోకుండా ఒక్కమాటలో ముగించారు. సాధా రణ సందర్భాల్లో అయితే దౌత్యంలో తలపండిన జయశంకర్ కూడా ఇలాగే మాట్లాడేవారు. కానీ ఆయన నోరు జారి అంతా అబద్ధమని, చవకబారు ప్రచారయావ మాత్రమేనని కొట్టిపారేసే ప్రయత్నం చేసి వివాదాన్ని పెంచారు. సామాజిక మాధ్యమాల ప్రాముఖ్యత పెరిగిన ప్రస్తుత దశలో ప్రతిదీ రచ్చకెక్కి మనల్ని నలుగురిలో పలుచన చేస్తుందని అందరూ గుర్తించడం మంచిది. ఇలాంటి సంక్షోభ సమయాల్లో సంయమనం పాటించటం చాలా అవసరం. -
భారత్‌కు ఈయూ చేయూత
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ఉధృతితో అల్లాడిపోతున్న భారత్‌కు విదేశాలు బాసటగా నిలుస్తున్నాయి. అత్యవసర ప్రాణాధార ఔషధాలను, ఆక్సిజన్ ఉత్పత్తి పరికరాలను పంపిస్తున్నాయి. ఇటలీ సోమవారం ఒక నిపుణుల బృందాన్ని, వైద్య పరికరాలను భారత్‌కు పంపింది. ఇక యునైటెడ్ కింగ్డమ్(యూకే) నాలుగో దశ సాయం అందించింది. ఇందులో 60 వెంటిలేటర్లు, ఇతర పరికరాలు ఉన్నారు. ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్‌ను కూడా అందించింది. ఈ ప్లాంట్ ద్వారా ఒక ఆసుపత్రికి అవసరమైన ప్రాణ వాయువును ఉత్పత్తి చేయొచ్చు. దీన్ని గ్రేటర్ నోయిడాలోని ఐటీబీపీ ఆసుపత్రిలో నెలకొల్పనున్నారు. ఇటలీ నుంచి వచ్చిన బృందానికి ఇండియాలోని ఆ దేశ రాయబారి విన్సెంజో డి లూకా స్వాగతం పలికారు. ఇక యూరోపియన్ యూనియన్(ఈయూ) అదనంగా అత్యవసర వైద్య సాయాన్ని భారత్‌కు అందిస్తామని ప్రకటించింది. తన సభ్యదేశాలైన డెన్మార్క్, స్పెయిన్, నెదర్లాండ్స్ నుంచి సాయాన్ని భారత్‌కు అందిస్తామంది. కరోనాపై పోరాటంలో భారత్ వెంట నిలుస్తామని డి లూకా చెప్పారు. ఈ వైరస్ ప్రపంచానికే ఒక సవాలు అని అన్నారు. అందరం కలిసికట్టుగా ఎదిరించాలని పిలుపునిచ్చారు. భారత్‌కు అవసరమైన సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఉద్ఘాటించారు. భారత్‌కు అండగా నిలుస్తున్న యూకేకు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. డెన్మార్క్ నుంచి 53 వెంటిలేటర్లు, స్పెయిన్ నుంచి 119 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, 145 వెంటిలేటర్లు పంపుతున్నట్లు ఈయూ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇక నెదర్లాండ్స్ నుంచి 100 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, 30 వేల డెమ్‌డెసివిర్ వయల్స్, 449 వెంటిలేటర్లు పంపిస్తామని పేర్కొంది. జర్మనీ కూడా 15 వేల యాంటీ వైరల్ డ్రగ్స్ వయల్స్ పంపింది. అలాగే 516 ఆక్సిజన్ సిలిండర్లు అందజేసింది. -
ఇంటి లోపల ఆక్సిజన్‌ను శుద్ధి చేసే మొక్కలు
ఈ కరోనా కాలంలో ఆక్సిజన్ గురించిన మాటలు తరచూ వింటున్నాం. ఇంట్లో మన చుట్టూ గాలి స్వచ్ఛంగా ఉండాలంటే అదనపు ప్రయత్నాలు తప్పనిసరి. అదీ సహజమైన రీతిలో. అందుకే ఇంటి లోపల ఆక్సిజన్‌ను శుద్ధి చేసే మొక్కల ఏర్పాట్లపై చాలా మంది దృష్టి సారిస్తున్నారు. ఏయే మొక్కలు విషయవాయువులను తొలగిస్తాయి, గాలిని శుద్ధి చేస్తాయో తెలుసుకుందాం. ఎరికా పామ్ ఈ మొక్క కార్బన్ మోనాక్సైడ్ వంటి విష వాయువులను తొలగించడంతో పాటు గాలిని శుద్ధి చేస్తుంది. పామ్ ఆకులపైన దుమ్ము త్వరగా పేరుకుపోతుంది, కాబట్టి దానిని రోజూ మెత్తని క్లాత్‌తో శుభ్రం చేయాలి. ఈ మొక్కను 45 రోజులకు ఒకసారి ఎండలో ఉంచాలి. నేల పొడిగా కనిపించినప్పుడు మాత్రమే కొద్దిగా నీళ్లు పోయాలి. పెంపుడు జంతువులు ఈ మొక్కను తిన లేవు. అయినప్పటికీ వాటిని దూరంగా ఉంచడం మంచిది. సాన్సేవిరియా దీనిని స్నేక్ ప్లాంట్ అని కూడా అంటారు. ఈ మొక్క రాత్రిపూట కార్బన్‌డయాక్సైడ్‌ను తొలగించి ఆక్సిజన్‌గా మారుస్తుంది. ఇది ఎక్కువ సేపు కూర్చునే లివింగ్ రూమ్ వంటి గదుల్లో ఏర్పాటు చేసుకోవడం మంచిది. బాల్కనీలోని నీడలో కూడా బాగుంటుంది. తద్వారా గాలి శుద్ధి అవుతుంది. ఇది తక్కువ నీటిలో, తక్కువ సూర్యకాంతిలో ఆకుపచ్చగా ఉంటుంది. ఈ మొక్క పిల్లలకు, పెంపుడు జంతువులకు అందనంత ఎత్తులో ఏర్పాటు చేసుకోవడం శ్రేయస్కరం. రబ్బరు మొక్క స్టడీ లేదా ఆఫీసు వర్క్ చేసుకునే అంటే మూసివేసినట్టుగా ఉండే గది శుభ్రంగా ఉంచాలంటే రబ్బరు మొక్క ఉన్న కుండీని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మొక్కకు తక్కువ సూర్యకాంతి సరిపోతుంది. నేల తేమగా ఉండేంత నీళ్లు చాలు. ఎక్కువ నీళ్లు పోస్తే వేళ్లు కుళ్లిపోతాయి. ఈ మొక్క ప్రత్యేక లక్షణం పెయింట్స్, గ్రీజు, లాండ్రీ సబ్బులలో ఉండే ఫార్మాల్డిహైడ్ వంటి రసాయనాలను తొలగిస్తుంది. ఈ మొక్కను పిల్లలు, పెంపుడు జంతువులకు దూరంగా ఉంచడం మంచిది. బోస్టన్ ఫెర్న్ ఈ మొక్క ఇంటిలోపలి గాలిలో పొగ, పెయింట్, పెర్ఫ్యూమ్, ఇతర సౌందర్య ఉత్పత్తుల నుండి విడుదలయ్యే ఫార్మాల్డిహైడ్‌ను గ్రహిస్తుంది. కిటికీ గుండా లోపలికి సూర్యకిరణాలు పడే చోట ఈ మొక్క ఉన్న కుంyీ ని ఉంచాలి. బాల్కనీలలో ఈ మొక్క కుండీలను వేలాడదీయవచ్చు. ఎందుకంటే మొక్క గుబురు గడ్డిలా కనిపిస్తుంది, కాబట్టి వేలాడుతున్నప్పుడు ఇది చాలా అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. నీళ్లు ఎక్కువ అవసరం లేదు. వేళ్లు తేమగా ఉండేలా జాగ్రత్తపడితే చాలు. -
ఆక్సిజన్ అవసరంపై అనుమానాలు.. సమాధానాలు ఇవిగో..
ప్రశ్న: కోవిడ్ భయంతో చాలామంది ముందుగానే ఆక్సిజన్ సిలిండర్లు కొని ఉంచుకుంటున్నారు.. ఇది కరెక్టేనా? ఈ విషయంలో అనవసర భయాలు ఎక్కువయ్యాయని వైద్యులంటున్నారు.. ఏమిటవి? జవాబు: వైరస్ సోకగానే భయపడకూడదు. ఏదో అయిపోతుందని చాలామంది భయపడుతున్నారు. అనవసరంగా భయపడటం వల్లనే ప్రాణాంతకంగా మారుతోంది. ఆక్సిజన్ పెట్టుకోవాల్సి వస్తే శరీరంలోని లెవెల్స్‌ను పరిగణనలోకి తీసుకొని ఉపయోగించాలి. అంతేకానీ వైద్యుడి పర్యవేక్షణ లేకుండా ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు ఆక్సిజన్ పెట్టుకోవడం సరికాదు. మార్కెట్లో కొరత ఉందని ఆక్సిజన్ సిలిండర్లు ముందుగా కొనుగోలు చేసుకొని ఉంచుకోవడం సరికాదు. దీనివల్ల నిజంగా అవసరమైన వారికి దొరకక పోవచ్చు. ధైర్యంగా ఉంటూ చికిత్స తీసుకుంటే కోవిడ్ నుంచి త్వరగా కోలుకోవచ్చు. ఆక్సిజన్ థెరపీ అంటే ఏమిటి? దీనివల్ల ఏమిటి ఉపయోగం? మనిషిని బోర్లా పడుకోబెట్టి మసాజ్ చేయడం, చిన్న చిన్న ఎక్సర్సైజ్ల ద్వారా ఆక్సిజన్‌ను శరీరంలోని అన్ని భాగాలకు పంపించే ప్రయత్నాన్ని ఆక్సిజన్ థెరపీ అంటారు. మనిషికి శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ తగ్గినప్పుడు ఆయాసం రావడం, చెమటలు రావడం వంటివి జరుగుతాయి. ఆ సమయంలో యోగా, ఇతర ఎక్సర్సైజ్లు తెలిసినవారు కొన్ని జాగ్రత్తలతో ఆక్సిజన్ థెరపీ ఇస్తారు. దీనివల్ల ఎంతవరకు ఆక్సిజన్ సమకూరుతుంది అనేది కచ్చితంగా చెప్పలేము. కాబట్టి ఈ ఆపద సమయంలో సొంత ప్రయోగాలు మానుకోవడం మంచిది. ఫస్ట్ వేవ్ లో కన్నా, సెకండ్ వేవ్‌లో ఆక్సిజన్ తగ్గుదల కేసులు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఒక్కరోజులోనే సీరియస్ అవుతోందని కూడా వినిపిస్తోంది.. నిజమేనా? సెకండ్ వేవ్‌లో వైరస్ జన్యుమార్పిడి వల్ల రూపాంతరం చెందింది. దీనివల్లే కావొచ్చు.. ఫస్ట్ వేవ్‌లో కన్నా సెకండ్ వేవ్‌లో రోగుల శరీరంలో ఆక్సిజన్ వేగంగా తగ్గుతోందనే మాట నిజం. ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇన్ఫెక్షన్ వేగంగా పెరుగుతుండటంతో ప్రాణాపాయ స్థితిలోకి వెళ్తున్నారు. ఫస్ట్ వేవ్‌లో భయం ఎక్కువగా ఉన్నప్పటికీ వైరస్ ప్రభావం ఇంతగా కనిపించలేదు. హ్యాపీ హైపోక్సియా అంటే ఏమిటి? ఈ పరిస్థితుల్లో ఆక్సిజన్ లెవల్స్ తగ్గుతున్నట్టుగా తెలియదట.. నిజమేనా? కరోనా పాజిటివ్ వచ్చిన కొంతమందిలో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నప్పటికీ తెలియదు. శ్వాస తీసుకోవడంలో పెద్దగా ఇబ్బంది లేకపోవడంతో అంతా బాగానే ఉందనుకుంటారు. దీనినే హ్యాపీ హైపోక్సియా అంటారు. రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉన్నవారిలో ఇలా జరుగుతుంది. మిగతా వారికి ఆక్సిజన్ లెవల్స్ పడిపోయినప్పుడు శ్వాస సరిగా ఆడక పోవడం, దమ్ము రావడం, కొద్ది దూరం నడిస్తే ఆయాసం రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీరు జాగ్రత్త పడేందుకు అవకాశం ఉంటుంది. కానీ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయినప్పటికీ తెలియక పోవడం వల్ల.. ఒక్కసారిగా పరిస్థితి తీవ్రంగా మారొచ్చు. అయితే కేవలం 4% రోగుల్లో మాత్రమే ఇలా జరిగేందుకు అవకాశం ఉంటుంది. కర్పూరం, తదితరాలు కలిపి వాసన పీల్చడం వల్ల ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఎంత? కర్పూరం తదితరాలతో ఆక్సిజన్ మెరుగుపడుతుందనే అంశం ఇప్పటివరకు సైంటిఫిక్‌గా నిర్ధారణ కాలేదు. ప్రజలకు కోవిడ్‌పై సరైన అవగాహన లేకపోవడంతో భయపడుతున్నారు. ఈ సమయంలో ఎవరే చిన్న విషయం చెప్పినా నమ్ముతున్నారు. ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నారు. నిజానికి కోవిడ్ పాజిటివ్ బాధితులందరికీ ఆక్సిజన్ అవసరం లేదని ప్రభుత్వ ఆస్పత్రుల్లోని వైద్యులు చెçబుతున్నారు. కానీ కార్పొరేట్ ఆస్పత్రుల్లో కొందరు చెప్పడం లేదు. ఫలితంగా ఆక్సిజన్ కొరత ఏర్పడుతోంది. మరోవైపు ఆక్సిజన్ పెట్టాలని, రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ ఇవ్వాలని వైద్యుల కంటే ముందే రోగి బంధువులు ఒత్తిడి చేస్తున్నారు. కొంత మందైతే ఏకంగా ఆక్సిజన్ సిలిండర్లు కొని ఇంట్లో నిల్వ ఉంచుతున్నారు. దీంతో ఆక్సిజన్ కొరత ఏర్పడి అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి అందకుండాపోతోంది. అసలు ఎవరికి ఆక్సిజన్ అవసరం? ఏ స్థాయిలో అవసరం..? రక్తంలో ఆక్సిజన్ లెవల్స్‌ను పల్స్ ఆక్సిమీటర్ ద్వారా పరిశీలిస్తాం. ఎస్పీఓ2 (ఆక్సిజన్) సాధారణంగా 95 నుంచి 100 మధ్య ఉండాలి. దీనిని ఆక్సిజన్ సాచురేషన్గా పిలుస్తాం. ఇది 95 కంటే తక్కువగా ఉంటే ఆక్సిజన్ అవసరం ఉంటుంది. సిలిండర్ ద్వారా 1నుంచి 15 లీటర్ల ఆక్సిజన్ ఇవ్వొచ్చు. అంతకంటే ఎక్కువగా అవసరం ఉంటే పరికరాల ద్వారా ఇవ్వాల్సి వస్తుంది. 15 లీటర్ల కన్నా ఎక్కువ అవసరముంటే నాజల్ క్యాన్లా అనే పరికరం ద్వారా ఇవ్వొచ్చు. దాదాపు 100 శాతం ఇవ్వొచ్చు. నెబులైజర్‌తో ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయని ప్రచారం సాగుతోంది. ఇందులో వాస్తవమెంత? ఎంతమాత్రం వాస్తవం కాదు. నెబులైజర్ అనేది పూర్తిగా ఆస్తమా రోగులకు, అయాసంతో బాధపడే వారికి.. ఊపిరితిత్తుల్లో గొట్టాలు తెరుచుకోవడానికి, లోపల ఇన్ఫ్లమేషన్ తగ్గడానికివాడే పరికరం. నెబులైజర్ శ్వాసకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉపయోగించే పరికరం. అంతేకానీ దీంతో ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయనేది ఎక్కడా లేదు. అస్తమా రోగులకు కరోనా సోకితే పరిస్థితి ఏమిటి? అస్తమా రోగులు కోవిడ్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వారికి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వారు సాధారణంగా వాడే మందులు క్రమం తప్పకుండా వాడుతూ జాగ్రత్తగా ఉండాలి. కొందరు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ముందే కొని పెట్టుకుంటున్నారు? దీనివల్ల ఉపయోగం ఉంటుందా? ఉపయోగమే. ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందుబాటులో ఉన్నాయి. కోవిడ్ నుంచి బయటపడిన రోగులకు ఆక్సిజన్ అవసరం ఉంటే ఈ పరికరం ఉపయోగపడుతుంది. సాధారణంగా 8 నుంచి 10 లీటర్ల వరకు ఆక్సిజన్ అవసరం ఉన్న వారికి ఈ పరికరం సరిపోతుంది. అయితే లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ ద్వారా సరఫరా అయ్యే ప్రెషర్ దీని ద్వారా రాదు. ఇది ఇంట్లో తప్పనిసరిగా ఆక్సిజన్ వాడాల్సిన వారికి మాత్రమే ఉపయోగకరం. న్యూమోనియా, ఊపిరితిత్తులో ఇన్ఫెక్షన్ ఉన్న రోగులకు మాత్రమే అవసరం. ఏదైనా వైద్యుల సలహా మేరకు ఉపయోగించాల్సి ఉంటుంది. అరచేయి మీద అక్యుప్రెషర్ చేయడం ద్వారా ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయి అంటున్నారు.. వాస్తవమేనా? అవాస్తవం. ఇది అపోహా మాత్రమే. ఆక్సిజన్ లెవల్స్ అనేవి ఊపిరితిత్తుల్లో సమస్య ఉంటే తగ్గుతాయి. యోగ, ఫిజియోథెరపీ, శ్వాసకు సంబంధించిన వ్యాయామాల ద్వారా మాత్రమే ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయి. Corona: రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గుతున్నాయా? ఈ టెక్నిక్ ఫాలో అవండి -
ఏపీలో ఆక్సిజన్ కొరత లేకుండా ఏర్పాట్లు: కృష్ణబాబు
-
కరోనా నివారణ చర్యలపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
-
ఇష్టమైన బైక్‌ను అమ్మకానికి పెట్టిన 'ఫిదా' నటుడు
ఆక్సిజన్ అందక నరకయాతన అనుభవిస్తున్న కోవిడ్ పేషెంట్లు ఎంతమందో.. అలాంటి వారికి తనవంతు సాయం చేయాలని ముందుకొచ్చాడు ఓ నటుడు. ఇందుకోసం ఏకంగా తన బైక్‌ను అమ్మకానికి పెట్టడం గమనార్హం. తన బైక్‌ను తీసుకొని ఆక్సిజన్‌ను ఇవ్వండని, అవసరమైన పేషెంట్లకు దాన్ని అందిస్తానని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. ఎంతో ప్రేమగా చూసుకునే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌ను తనే స్వయంగా శుభ్రం చేస్తున్న ఫొటోలతో పాటు దానిపై చక్కర్లు కొట్టిన ఫొటోలను సైతం షేర్ చేశాడు. ఈ నటుడు తీసుకున్న నిర్ణయం గురించి తెలుసుకున్న జనాలు అతడిని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. కాగా అతడు గతేడాది అక్టోబర్‌లో కరోనా బారిన పడి అనంతరం ఆ మహమ్మారిని జయించాడు. ఇదిలా వుంటే వరుణ్‌తేజ్, సాయి పల్లవి జంటగా నటించిన ఫిదా సినిమాలో హర్షవర్ధన్ ఓ ముఖ్యపాత్రలో నటించిన విషయం తెలిసిందే. దీంతో పాటు తకిట తకిట, నా ఇష్టం, కవచం వంటి పలు సినిమాలు చేశాడు. బాలీవుడ్‌లోనూ సనమ్ తేరీ కసమ్ వంటి అడపాదడపా చిత్రాల్లో నటించాడు. ఇటీవలే ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ 5లో రిలీజైన తైష్ సినిమాలోనూ కనిపించాడు. View this post on Instagram A post shared by Harshvardhan Rane (@harshvardhanrane) చదవండి: విషాదం: టాలీవుడ్ యువ దర్శకుడు కరోనాతో మృతి అక్కడ బోల్తా పడినా ఓటీటీలో మాత్రం సూపర్ హిట్ -
ఒడిశా నుంచి 120 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్
కాకినాడ సిటీ: ఒడిశాలోని అంగూల్ నుంచి రాష్ట్రానికి 120 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను విమానాల ద్వారా తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఉప ముఖ్యమంత్రి, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్(నాని) తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర స్థాయిలో దాదాపు 25 శాతం మేర మెడికల్ ఆక్సిజన్ వృథా అవుతున్నట్లు తెలిసిందన్నారు. దీనిని అరికట్టేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆక్సిజన్ పైపుల మరమ్మతులకు రూ.30 కోట్లు కేటాయించామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి రెవెన్యూ డివిజన్‌కు ఒక కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. వీటి వల్ల కోవిడ్ ఆస్పత్రులపై ఒత్తిడి తగ్గుతుందన్నారు. ఫీజుల విషయంలో ఉల్లంఘనకు పాల్పడిన ప్రైవేటు ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ఆక్సిజన్ కోసం ఒడిశాకు ట్యాంకర్లు
సాక్షి, అమరావతి/విమానాశ్రయం(గన్నవరం): రాష్ట్రంలోని కోవిడ్ ఆస్పత్రుల కోసం ఒడిశాలోని అంగూల్ నుంచి ఆక్సిజన్ దిగుమతి చేసుకునేందుకు శనివారం రెండు ఖాళీ ట్యాంకర్లను రాష్ట్ర ప్రభుత్వం కార్గో విమానంలో భువనేశ్వర్‌కు పంపించింది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సీ–17 విమానం గన్నవరం నుంచి ఖాళీ ట్యాంకర్లతో మధ్యాహ్నం బయల్దేరి వెళ్లింది. ఈ ఏర్పాట్లను రాష్ట్ర కోవిడ్ కేర్ సెంటర్స్ ప్రత్యేకాధికారి, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఆక్సిజన్ అవసరాలు తీర్చేందుకు సీఎం వైఎస్ జగన్.. కేంద్రంతో మాట్లాడి మిలట్రీకి చెందిన కార్గో విమానాలను రాష్ట్రానికి రప్పించారని చెప్పారు. మన రాష్ట్రానికి 470 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను కేంద్రం కేటాయించిందని తెలిపారు. చెన్నై, బళ్లారి, ఒడిశా, విశాఖతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఏజెన్సీల నుంచి ఆక్సిజన్‌ను సమకూరుస్తున్నట్లు వివరించారు. రోజుకు రెండు ట్యాంకర్లు గానీ లేదంటే రెండు రోజులకు 4 ట్యాంకర్లను గానీ విమానాల ద్వారా పంపించి ఆక్సిజన్‌ను రాష్ట్రానికి తీసుకువస్తామని చెప్పారు. శనివారం పంపించిన రెండు ట్యాంకర్ల మొత్తం కెపాసిటీ 46 మెట్రిక్ టన్నులని తెలిపారు. ఒడిశాలో నింపిన ఆక్సిజన్ ట్యాంకర్లను తిరిగి రాష్ట్రానికి గ్రీన్ చానల్ ద్వారా తీసుకువస్తామన్నారు. కాగా, ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి షన్‌మోహన్‌తోపాటు ఎయిర్‌పోర్టు అథారిటీ డైరెక్టర్ జి.మధుసూదనరావు, ఆపరేషన్ మేనేజర్ అంకిత్ జైస్వాల్ పాల్గొన్నారు. -
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో మరో ఆక్సిజన్ యూనిట్ సిద్ధం
సాక్షి, విశాఖపట్నం: కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రాణవాయువు ఉత్పత్తికి అత్యంత ప్రాధాన్యం పెరిగింది. ఈ నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఎనిమిదేళ్లుగా అసంపూర్తిగా ఉన్న ఆక్సిజన్ యూనిట్ పనులు పూర్తి చేసేందుకు ఫ్రెంచ్ సంస్థ.. ఎయిర్ లిక్విడ్ ఇండియా హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏఎల్‌ఐహెచ్) అంగీకరించింది. రూ.85 కోట్లతో ప్లాంట్ నుంచి ఆక్సిజన్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించింది. దీంతో మరో ఆక్సిజన్ యూనిట్ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే స్టీల్ ప్లాంట్‌లో ఐదు ఆక్సిజన్ యూనిట్లు ఉన్నాయి. పదేళ్ల క్రితం ఫ్రెంచ్ సంస్థ.. స్టీల్‌ప్లాంట్‌లో రోజుకు 850 టన్నులు ఉత్పత్తి చేసేలా ఆక్సిజన్ యూనిట్ నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో 100 టన్నుల మెడికల్ ఆక్సిజన్‌కు సంబంధించి 2013 ఫిబ్రవరిలో పనులు ప్రారంభమయ్యాయి. 2016 నాటికి 90 శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు పూర్తి చేసేందుకు రూ.750 కోట్లు చెల్లించాలని స్టీల్‌ప్లాంట్‌ను ఏఎల్‌ఐహెచ్ డిమాండ్ చేసింది. దీనికి అంగీకరించని స్టీల్‌ప్లాంట్ 2017 అక్టోబర్‌లో ఆర్బిట్రల్ ట్రిబ్యునల్‌కు వెళ్లింది. దీనిపై పలుమార్లు విచారణ చేపట్టిన ట్రిబ్యునల్ మే 1లోపు పనులు ప్రారంభించాలని ఏఎల్ఐహెచ్ను ఆదేశించింది. అంతేకాకుండా ఒప్పందం చేసుకున్న సమయంలో ఉన్న బుక్ వాల్యూ ప్రకారమే ప్లాంట్‌ని స్టీల్‌ప్లాంట్‌కు అప్పగించాలని స్పష్టం చేసింది. అయితే.. ఇతర పనులు పూర్తి చేసేందుకు స్టీల్ ప్లాంట్ తమకు రూ.85 కోట్లు చెల్లించాలని ఏఎల్‌ఐహెచ్ కోరగా ట్రిబ్యునల్ అంగీకరించింది. ఈ నేపథ్యంలో దశలవారీగా రూ.85 కోట్లు చెల్లించనున్నామని స్టీల్‌ప్లాంట్ వర్గాలు వెల్లడించాయి. రెండు రోజుల్లో ఫ్రెంచ్ కంపెనీ ప్రతినిధులు విశాఖ స్టీల్‌ప్లాంట్‌ని సందర్శించనున్నారని అధికారులు తెలిపారు. మే మొదటి వారంలో పనులు పూర్తి చేసి ఆక్సిజన్ ఉత్పత్తి ప్రారంభిస్తామన్నారు. 2 వేల టన్నుల ఆక్సిజన్ సరఫరా.. కోవిడ్ నేపథ్యంలో స్టీల్‌ప్లాంట్ నుంచి ఆక్సిజన్ సరఫరా ప్రారంభించారు. ఇటీవలే 103 టన్నుల మెడికల్ ఆక్సిజన్ని మహారాష్ట్రకు పంపారు. స్టీల్‌ప్లాంట్ నుంచి ఇప్పటివరకు మొత్తం 2 వేల టన్నుల ఆక్సిజన్ని సరఫరా చేశారు. తాజాగా కర్ణాటకకు 27 టన్నులు అందించారు. మొత్తం 5 యూనిట్లలో మూడింటి నుంచి రోజుకు 1,500 టన్నులు, రెండు యూనిట్ల నుంచి 1,200 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తవుతోందన్నారు. ఇందులో 2,600 టన్నులు ఆక్సిజన్ గ్యాస్ ఉత్పత్తవుతుండగా 100 టన్నులు 99.9 శాతం స్వచ్ఛమైన ద్రవ మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తున్నట్లు వివరించారు. ఉత్పత్తిలో సింహభాగం రాష్ట్ర అవసరాలకే వినియోగిస్తున్నట్లు తెలిపారు. -
కరోనా సోకిన వెంటనే ఆస్పత్రిలో చేరాలా?
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ బారిన పడిన వెంటనే ఆస్పత్రిలో చేరాలా అంటే అవసరం లేదు అంటున్నారు నిపుణులు. కోవిడ్ కేసులను మైల్డ్, మోడరేట్, సీరియస్ అంటూ మూడు రకాలుగా విభజించారు. సాధారణంగా మనిషి రక్తంలో ఆక్సిజన్ శాచురేషన్ 99 నుంచి 100 శాతం ఉంటుంది. ఆక్సిజన్ లెవల్స్ 95కు పైన ఉండి, పెద్దగా కరోనా లక్షణాలు లేనివారిని మైల్డ్ కేసులుగా పరిగణిస్తారు. వీరికి ఆస్పత్రిలో చికిత్స అవసరం లేదు. ఇంట్లోనే ఉండి, వైద్యులు సూచించే మందులు వాడితే సరిపోతుంది. ప్రస్తుతం 85 శాతం నుంచి 90 శాతం మంది హోం ఐసోలేషన్‌లోనే ఉండి కోలుకుంటున్నారు. ఇక ఆక్సిజన్ శాచురేషన్ 94 శాతంకన్నా తక్కువగా, రెస్పిరేటరీ రేట్ 24–25 శాతం ఉన్నవారు, శరీర ఉష్ణోగ్రత 101 ఫారన్‌హీట్‌కి పైగా ఉన్నవారు మాత్రమే ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకోవాలి. వీరిలో 10-15 శాతం మందికి మాత్రమే రెమిడెసివిర్, ప్లాస్మా థెరపీ వంటి చికిత్సలు అవసరమవుతాయి. మిగతావారు సాధారణ చికిత్సతోనే కోలుకుంటారు. ఆక్సిజన్ లెవల్స్ 80 శాతాని కంటే తగ్గి.. ఊపిరాడని పరిస్థితుల్లో ఉన్నవారిని సీరియస్ కేసులుగా భావిస్తారు. అలాంటి వారు మొత్తం పాజిటివ్ వారిలో 5 శాతం కంటే తక్కువే ఉంటారు. వీరికి ఖరీదైన మందులు, వెంటిలేటర్ చికిత్సలు అవసరం. డా.భాస్కర్‌రావు, తెలంగాణసూపర్ స్పెషాలిటీహాస్పిటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చదవండి: కరోనా: బాధను పంచుకుంటే తప్పేంటి? సుప్రీం ఫైర్ -
తల్లి ప్రాణం కోసం కుమారుడి తాపత్రయం
-
‘‘ప్లీజ్ సార్ అలా చేయకండి.. మా అమ్మ చనిపోతుంది’’
లక్నో: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. ప్రతి రోజు మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఆస్పత్రల్లో బెడ్లకు, ఆక్సిజన్‌కు తీవ్ర కొరత ఏర్పడింది. ప్రాణవాయువు కోసం పలువురు సోషల్ మీడియా వేదికగా విన్నవిస్తున్నారు. దేశంలో ఆక్సిజన్ కొరతకు అద్దం పట్టే దృశ్యానికి సంబంధించిన వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీనిలో పీపీఈ కిట్ ధరించి.. పోలీసుల ఎదుట మోకాళ్ల మీద కూర్చున్న ఓ వ్యక్తి.. ఆక్సిజన్ సిలిండర్ తొలగించవద్దని.. అలా చేస్తే తన తల్లి మరణిస్తుందని.. దయచేసి సిలిండర్ తొలంగించొద్దని వేడుకుంటున్న హృదయవిదారక దృశ్యాలు అందరినీ కలచివేస్తున్నాయి. ఆ వివరాలు.. ఆగ్రాకి చెందిన మహిళకు కరోనా సోకగా ఆమె కుమారుడు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాడు. అయితే బాధితురాలికి ఊపిరాడక ఆక్సిజన్ అవసరం ఏర్పడింది. ఈ క్రమంలో ఆమె కుమారుడు ఆక్సిజన్ సిలిండర్ కోసం ఆస్పత్రిలో ఆరా తీసినా ప్రయోజనం లేకుండా పోయింది. అయితే అదే సమయంలో సదరు ప్రైవేట్ ఆస్పత్రి నుంచి పోలీసుల ఆధ్వర్యంలో సిలిండర్లను అంబులెన్స్ లోకి తరలిస్తుండగా ఆ వ్యక్తి పోలీసుల దగ్గరకు వెళ్లి 'సార్ ప్లీజ్ నా తల్లి చనిపోతుంది. దయచేసి ఆక్సిజన్ సిలిండర్లను తీసివేయవద్దు. మీరు నా తల్లిని బ్రతికిస్తే ఎక్కడి నుంచైనా ఆక్సిజన్ సిలిండర్లను తీసుకొస్తాను. కరోనా సోకి ఆస్పత్రిలో జాయిన్ అయిన మా అమ్మను ఆరోగ్యంగా ఇంటికి తీసుకొస్తానని కుటుంబసభ్యులకు మాటిచ్చాను’’ అంటూ మోకాళ్లపై కూర్చొని పోలీసుల్ని అర్థించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వ్యక్తి అంతలా ప్రాధేయపడినా పోలీసులు అతడి అభ్యర్థనను పట్టించుకోకుండా సిలిండర్లను తరలించే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోని యూత్ కాంగ్రెస్ తన ట్విట్టర్లో షేర్ చేయయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఇక పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా ఆగ్రా ఎస్పీ మాట్లాడుతూ.. 'ఆగ్రాలో ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఎక్కువగానే ఉంది. కాబట్టే ప్రజలు తమ వ్యక్తిగత సిలిండర్లను ఆస్పత్రికి అందించారు. వీడియోలో కనిపిస్తున్నట్లు అవి ఆక్సిజన్ ఉన్న సిలిండర్లు కాదు. ఖాళీవి. వాటిని తరలించే సమయంలో ఆ యువకుడు ఆక్సిజన్ కావాలని పోలీసుల్ని అభ్యర్ధించాడు' అంటూ ఆగ్రా ఎస్పీ మీడియా సమావేశంలో వెల్లడించారు. కరోనా బాధితుల్ని ఇలానే ట్రీట్ చేస్తారా యోగీ.. ఆగ్రా ఆస్పత్రి ఘటనపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘తన తల్లిని బ్రతికించుకునేందుకు కొడుకు ఆక్సిజన్ సిలిండర్ల కోసం ప్రాధేయపడుతుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారు. నిజంగా ఇది అమానవీయ చర్య. సీఎం యోగి కరోనా బాధితుల్ని ఇలాగే ట్రీట్ చేస్తారా’’ అంటూ రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఆస్పత్రుల్లో సరిపడా పడకల్లేక.. ఆక్సీజన్ సిలిండర్లు లేక కరోనా బాధితులు పడుతున్న వెతలు అన్నీ ఇన్నీ కావు. రెండు రోజుల క్రితం ఉత్తర్ ప్రదేశ్ ఆగ్రాకు చెందిన రేణు సింఘాల్ కరోనా సోకిన తన భర్త రవి సింఘాల్ కు నోటితో ఊపిరి అందించే ప్రయత్నించారు. ఆ ఊపిరి అందేలోపే భర్త ప్రాణాలు పోయాయనని కన్నీరుమున్నీరుగా విలపించిన సంగతి తెలిసిందే. -
‘నా భార్యకు గుక్కెడు నీళ్లవ్వలేదు.. వాళ్లే చంపేశారు’
లక్నో: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వల్ల నా భార్య చనిపోలేదు సార్. డాక్టర్లే నా భార్యను చంపేశారు. 50 సార్లు ఆస్పత్రి సూపరిటెండెంట్ దగ్గరికి వెళితే పట్టించుకోలేదు. చివరికి తాగడానికి గుక్కెడు మంచి నీళ్లు లేక తను మరణించిందంటూ భార్యను కోల్పోయిన ఓ ఎస్సై కన్నీరుమున్నీరవుతున్నాడు. ప్రస్తుతం ఈ హృదయవిదారకర ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నేషనల్ మీడియా కథనం ప్రకారం.. ఉత్తర ప్రదేశ్‌లో ఓ స్టేషన్ ఎస్సైగా పనిచేస్తున్న భిక్ చంద్ భార్య రూపమతికి కరోనా సోకింది. దీంతో భిక్ చంద్ అత్యవసర చికిత్స కోసం భార్యను ముజఫర్ నగర్ ప్రాంతానికి చెందిన ప్రభుత్వాసుపత్రికి తరలించాడు. ఆస్పత్రిలో జాయిన్ అయిన రెండు రోజుల తరువాత ఆమె మరణించింది. అయితే ఆమె మరణానికి కరోనా కారణం కాదని, డాక్టర్ల నిర్లక్ష్యమేనంటూ ఎస్సై భిక్ చంద్ సోషల్ మీడియాలో వాపోయాడు. ‘‘నా భార్యకు కనీసం తాగడానికి గుక్కెడు మంచి నీళ్లవ్వలేదు.. వైద్యులు ఎవరు ఆమెను పట్టించుకోలేదు. చివరికి మరణించింది. నా భార్యను చంపింది కరోనా కాదు.. వైద్యులు.. వారి నిర్లక్షమే’’ అంటూ ఈ వైరల్ వీడియోలో ఎస్సై భిక్ చంద్ తన భార్య విషయంలో జరిగిన అన్యాయాన్ని వివరించే ప్రయత్నం చేశాడు. ‘‘నా భార్యకు ఊపిరి ఆడలేదు. ఆక్సిజన్ ఇవ్వాల్సిందిగా వైద్యులను అభ్యర్థించాను. ట్యాబ్లెట్స్ ఇవ్వలేదు. నేను సూపరిటెండెంట్‌ను 50 సార్లు కలిశా. నేను ఎస్సై అని చెప్పినా కూడా ఫలితం లేకపోయింది.. చివరికి ప్రాణాల్ని కోల్పోయింది. తనకు సరైన ట్రీట్మెంట్ ఇవ్వలేదు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే నాభార్య చనిపోయింది’’ అంటూ వాపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవ్వడంతో సదరు ఆస్సత్రి సిబ్బందిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ముజఫర్ నగర్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ బ్రిగేడియర్ జిఎస్ మంచంద మాట్లాడుతూ ‘‘ఎస్పై భార్యకు ఊపిరితిత్తులు పాడయ్యాయి, టైప్ డయాబెటిస్, రక్తపోటు సమస్యలున్నాయి. దీంతో పాటు తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఉంది. పరిస్థితి విషమించడంతో ఆమె మరణించింది. ట్రీట్మెంట్ విషయంలో ఆమె పట్ల ఎవరు నిర్లక్ష్యం వహించలేదు’’ అని తెలిపాడు. చదవండి: వైరల్: ‘కరోనా కాదు.. ఫ్యాన్ చంపేసేలా ఉంది’ -
సత్వర కరోనా సేవలే లక్ష్యంగా ఎమ్మెల్యే చెవిరెడ్డి ముందడుగు
-
ఆక్సిజన్ కోసం అర్థిస్తే.. అరెస్ట్ చేశారు
లక్నో: దేశప్రజలంతా కోవిడ్ బారిన అల్లాడుతున్నారు. ముఖ్యంగా సెకండ్ వేవ్‌లో మహమ్మారి విజృంభణ ఉధృతంగా ఉంది. ఈ సారి ఆక్సిజన్, బెడ్ల కొరత అధికంగా ఉంది. ఏ హాస్పిటల్ ముంద చూసినా ప్రాణవాయువు కోసం అర్థిస్తూ.. ఆస్పత్రుల్లో చేర్చుకోమంటూ వేడుకునే జనాలకు సంబంధించిన దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో కొందరు సోషల్ మీడియా వేదికగా తమ సమస్యను తెలియజేస్తూ.. సాయం అర్దిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ కోరుతూ ట్వీట్ చేసినా ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ లోపు సదరు వ్యక్తి కుటుంబ సభ్యుడు మరణించాడు. ఆ వివరాలు.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన శశాంక్ యాదవ్ అనే వ్యక్తి ట్విట్టర్ వేదికగా.. తన తాత ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.. తనకు ఆక్సిజన్ సిలిండర్ అత్యవసరం అంటూ ట్వీట్ చేస్తూ నటుడు సోనూ సూద్‌ని ట్యాగ్ చేసి సాయం చేయాల్సిందిగా కోరాడు. శశాంక్ స్నేహితుడు అంకిత్ ఈ మెసేజ్‌ను ఓ జర్నలిస్ట్‌కు సెండ్ చేసి తన ఫ్రెండ్‌కి సాయం చేయాల్సిందిగా అభ్యర్థించాడు. సదరు రిపోర్టర్ ఈ మెసేజ్‌ను షేర్ చేస్తూ స్మృతి ఇరానీని ట్యాగ్ చేశారు. అయితే ఈ మెసేజ్‌లలో ఎక్కడా కూడా శశాంక్ తాత కోవిడ్‌తో బాధపడుతన్నట్లు వెల్లడించలేదు. ఈ మెసేజ్ చూసిన స్మృతి ఇరానీ శశాంక్‌కు సాయం చేద్దామని భావించి అతడికి 3 సార్లు కాల్ చేసినప్పటికి.. ఎలాంటి స్పందన లేదని తెలిసింది. దాంతో స్మృతి ఇరానీ ఈ మెసేజ్‌ను అమేథీ జిల్లా మెజిస్ట్రేట్, పోలీసు ఉన్నతాధికారికి సెండ్ చేసి.. వివరాలు కనుక్కోమని ఆదేశించారు. ఇదిలా ఉండగానే శశాంక్ తాత చనిపోయినట్లు తెలిసింది. దాంతో స్మృతి ఇరానీ సంతాపం తెలిపారు. ‘‘శశాంక్ తన ట్వీట్లో షేర్ చేసిన నంబర్‌కు మూడు సార్లు కాల్ చేశాను. కానీ ఎలాంటి రెస్పాన్స్ లేదు. దాంతో అమేథీ డిస్ట్రిక్ మెజిస్ట్రేట్, పోలీసులకు అతడి గురించి కనుక్కోని సాయం చేయాల్సిందిగా ఆదేశించాను’’ అంటూ స్మృతి ఇరానీ ట్వీట్ చేశారు. Called Shashank thrice .. no response on the number shared by you in your tweet. Have alerted office of @DmAmethi & @amethipolice to find and help the person in need. https://t.co/4D3Nfe2Nue — Smriti Z Irani (@smritiirani) April 26, 2021 ఈ క్రమంలో అమేథీ పోలీసులు శశాంక్ వివరాలు తెలుసుకుని అతడిని అరెస్ట్ చేశారు. ఎందుకంటే శశాంక్ తాత కోవిడ్ బారిన పడలేదు. ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. ‘‘అతడి తాత కోవిడ్ బారిన పడలేదు. అసలే బయట జనాలు ఆక్సిజన్ కొరతతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సమయంలో శశాంక్ తన సోషల్ మీడియాలో జనాలను భయపెట్టేలా ఇలా ట్వీట్ చేయడం సరైంది కాదు. పైగా అతను బయట ఎక్కడా ఆక్సిజన్ సిలిండర్ కోసం ప్రయత్నించలేదు. డైరెక్ట్‌గా యాక్టర్ సోనూ సూద్‌నే తనకు సాయం చేయమని కోరాడు. తప్పుడు సమాచారం షేర్ చేసినందుకు అతడిని అరెస్ట్ చేశాం’’ అన్నారు. कोविड-19 के समय में शशांक यादव द्वारा किये गये ट्वीट तथा सोशल मीडिया प्लेटफॉर्म पर भ्रामक तथ्य व अफवाह न फैलाने के संबंध में #SP_अमेठी श्री दिनेश सिंह द्वारा की गई अपील @Uppolice @dgpup @adgzonelucknow @igrangeayodhya @PrashantK_IPS90 @CMOfficeUP @ChiefSecyUP pic.twitter.com/6pYsj7MVIi — AMETHI POLICE (@amethipolice) April 28, 2021 చదవండి: వైరల్: భర్తకు కోవిడ్.. నోటి ద్వారా శ్వాస అందించిన భార్య ఢిల్లీ సర్కార్ ఆక్సిజన్ ‘యాక్షన్ ప్లాన్ ’ -
పాజిటివ్ వచ్చినంత మాత్రాన అందరికీ ఆక్సిజన్ అవసరం ఉండదు
-
ఢిల్లీ సర్కార్ ఆక్సిజన్ ‘యాక్షన్ ప్లాన్ ’
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కొద్ది రోజులుగా కరోనా విజృంభణతో ఆసుత్రుల్లో పడకలు, ఆక్సిజన్ కొరతను తీర్చేందుకు కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆక్సిజన్ లభ్యత లేని కారణంగా కరోనా రోగులు ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో రాష్ట్రంలో నెలలోగా ఢిల్లీలోని వేర్వేరు ఆస్పత్రల్లో మొత్తంగా 44 ఆక్సిజన్ ప్లాంట్లను సిద్ధం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మంగళవారం ఉన్నతాధికారులతో సమీక్ష అనంతరం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాష్ట్రంలోని తాజా పరిస్థితులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికలను మీడియా సమావేశంలో వెల్లడించారు. ఢిల్లీలో 44 ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు రాబోయే నెలలోగా 44 ఆక్సిజన్ ప్లాంట్లను ఢిల్లీలో ఏర్పాటు చేయబోతున్నామని, ఇందులో 8 ప్లాంట్లను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందన్నారు. ఈ నెల 30వ తేదీ నాటికి 8 ప్లాంట్లు సిద్ధంగా ఉంటాయి. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం 36 ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయనుందని తెలిపారు. వాటిలో 21 ప్లాంట్లను ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకోనుండగా, మిగిలిన 15 ప్లాంట్లు భారత్‌కు చెందిన సంస్థల నుంచి పొందనున్నారు. ఈ ఆక్సిజన్ ప్లాంట్లను వేర్వేరు ఆసుపత్రులలో ఏర్పాటుచేస్తారు. దీంతో ఆస్పత్రులలో ఆక్సిజన్ కొరతను అధిగమించడానికి ఇవి సహాయపడతాయి. అత్యవసరంగా ఆక్సిజన్ కావాల్సి ఉన్నందున బ్యాంకాక్ నుంచి 18 ఆక్సిజన్ ట్యాంకర్లను దిగుమతి చేసుకోవాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. థాయిలాండ్ నుంచి ఆక్సిజన్ తెచ్చేందుకు వైమానికదళానికి చెందిన విమానాలను ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించామని, ఈ అంశంలో కేంద్రం సానుకూలంగా ఉందని తెలిపారు. మే 10 నాటికి మరో 1,200 ఐసీయూ పడకలు 5 రోజుల్లో దేశంలోని చాలా మంది పారిశ్రామిక వేత్తలకు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సహాయం కోసం రాసిన లేఖలకు అద్భుతమైన స్పందన లభిస్తోందని కేజ్రీవాల్ అన్నారు. వారిలో చాలామంది సహాయం చేస్తున్నారని, ఢిల్లీ ప్రభుత్వానికి సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఐసీయూ పడకలను సిద్ధం చేస్తోంది. మంగళవారం ఉదయం కేజ్రీవాల్, రాష్ట్ర ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ ప్రత్యేక కోవిడ్ కేర్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ కోవిడ్ కేర్ కేంద్రాన్ని గురు తేజ్ బహదూర్ ఆసుపత్రి సమీపంలో నిర్మిస్తున్నారు. ఎల్ఎన్జేపీ ఆసుపత్రిని సందర్శించారు. ఎల్ఎన్జేపీ ముందు రామ్‌లీలా మైదానంలో 500 ఐసీయూ పడకలను, జీటీబీ ఆస్పత్రి సమీపంలో 500 ఐసీయూ పడకలను ఏర్పాటు చేస్తున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు. రాధాస్వామి క్యాంపస్‌లో 200 ఐసీయూ పడకలు ఉన్నందున, మే 10 నాటికి ఢిల్లీలో 1,200 ఐసీయూ పడకలు అదనంగా ప్రజలకు సిద్ధంగా ఉంటాయయని సీఎం పేర్కొన్నారు. 70 టన్నుల ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రాక ఢిల్లీ ఆస్పత్రుల మెడికల్ ఆక్సిజన్ అవసరాలు తీర్చేందుకు 70 టన్నుల ఆక్సిజన్‌తో నిండిన ‘ఆక్సిజన్’ఎక్స్‌ప్రెస్ రైలు మంగళవారం తెల్లవారుజామున ఢిల్లీకి చేరుకుంది. ఇందులోని ఆక్సిజన్‌ను ఢిల్లీలోని వేర్వేరు ప్రాంతాల్లోని ఆస్పత్రులకు తరలించేందుకు ఆక్సిజన్ ట్యాంకర్లను ఢిల్లీ సర్కార్ సిద్ధంచేసింది. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ నుంచి ఎక్స్‌ప్రెస్ రైలులో ఈ ఆక్సిజన్‌ను ఢిల్లీకి తీసుకొచ్చారని రైల్వే మంత్రి పియూశ్ గోయల్ ట్వీట్ చేశారు. మెడికల్ ఆక్సిజన్‌కు తీవ్ర కొరత ఏర్పడిన నేపథ్యంలో ఢిల్లీ కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ నుంచి ఆస్పత్రులకు పోలీసు రక్షణ మధ్య ఆక్సిజన్ ట్యాంకర్ తరలింపు -
ఉత్పత్తికి ఊపిరి: రెండు ఆక్సిజన్ ప్లాంట్లకు జవసత్వాలు
జిల్లాలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆక్సిజన్ డిమాండ్‌కు అనుగుణంగా కలెక్టర్ చర్యలకు ఉపక్రమించారు. మూతపడిన ఆక్సిజన్ ఉత్పత్తి పరిశ్రమలపై దృష్టి సారించి ప్రభుత్వంతో చర్చించారు. వెనువెంటనే అనుమతులను మంజూరు చేయించి ఉత్పత్తికి మార్గం సుగమం చేశారు. ఇదే సమయంలో ప్రభుత్వం దూరదృష్టితో ఆక్సిజన్ నిల్వ ప్లాంటుతో పాటు ఆక్సిజన్ సరఫరా పైపులైన్లను ఇదివరకే ఏర్పాటు చేయడంతో ‘సెకెండ్ వేవ్’ను సమర్థంగా ఎదుర్కొనే అవకాశం ఏర్పడటం విశేషం. సాక్షి ప్రతినిధి, అనంతపురం: కోవిడ్ ఉగ్రరూపం దాలుస్తున్న నేపథ్యంలో ఆక్సిజన్ కొరత దేశ వ్యాప్తంగా వణుకు పట్టిస్తున్నా.. జిల్లాలో అధికార యంత్రాంగం చేపట్టిన ముందుజాగ్రత్త చర్యలు ఫలితాలనిస్తోంది. శింగనమలలోని లైఫ్ ఆక్సిజన్ ప్లాంటుతో పాటు హిందుపురం నియోజకవర్గంలో తూముకుంట వద్ద ఉన్న సాయికృష్ణ ఆక్సిజన్ గ్యాసెస్ ప్లాంటులో ఆక్సిజన్ ఉత్పత్తికి అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు గుర్తించారు. అయితే ఈ రెండు ప్లాంట్లలో ఉత్పత్తికి ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆగమేఘాల మీద అనుమతులు మంజూరు చేయించారు. తద్వారా ఈ రెండు ప్లాంట్లలో ఏకంగా ప్రతి రోజూ 700 సిలిండర్ల మేర ఆక్సిజన్ ఉత్పత్తికి అవకాశం ఏర్పడిందని కలెక్టర్ గంధం చంద్రుడు ‘సాక్షి’కి తెలిపారు. ఉత్పత్తి ప్లాంట్ల సమస్యలకు పరిష్కారం వాస్తవానికి ఏదైనా ప్లాంటులో ఆక్సిజన్ ఉత్పత్తి కోసం ఔషధ నియంత్రణ శాఖ నుంచి అనుమతి(ఫారం–25) అవసరం. అంతేకాకుండా ఆక్సిజన్ రవాణా కోసం కూడా అదే శాఖ నుంచి అనుమతి తప్పనిసరి. అయితే శింగనమలలోని లైఫ్ ఆక్సిజన్ ప్లాంటుకు ఈ అనుమతులు లేవు. ఫలితంగా సదరు కంపెనీ ఆక్సిజన్ ఉత్పత్తిని నిలిపేసింది. విషయం తెలుసుకున్న కలెక్టర్ గంధం చంద్రుడు వెంటనే ఔషధ నియంత్రణశాఖ అధికారులతో మాట్లాడటంతో పాటు అనుమతుల కోసం సదరు కంపెనీతో ఆన్లైన్లో దరఖాస్తు చేయించారు. వెంటనే అనుమతులు వచ్చేలా కృషి చేశారు. ఆ మేరకు ప్లాంటులో 300 సిలిండర్ల మేర ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్‌లో 150 నుంచి 200 సిలిండర్లు జిల్లా ఆసుపత్రులకు సరఫరా చేసేందుకు కంపెనీ అంగీకరించింది. ఇక తూముకుంట వద్దనున్న సాయికృష్ణ ఆక్సిజన్ గ్యాసెస్ కంపెనీ చెల్లించాల్సిన విద్యుత్ బకాయిల వల్ల ఈ ప్లాంటులో ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ కంపెనీ చెల్లించాల్సిన సుమారు రూ.19 లక్షల విద్యుత్ బకాయిలను 18 నెలల పాటు వాయిదా వేయాలని సదరు కంపెనీ అభ్యర్థించింది. దీనిపై వెంటనే ఎస్పీడీసీఎల్ సీఎండీతో కలెక్టర్ మాట్లాడారు. అంతేకాకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ప్రభుత్వం కాస్త సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. ఇక్కడ రోజుకు 500 సిలిండర్ల మేర ఆక్సిజన్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు. అంటే మొత్తంగా ప్రతి రోజూ జిల్లాలోనే ఏకంగా 700 సిలిండర్ల మేర ఆక్సిజన్ అందుబాటులోకి రానుంది. ఇది కాస్తా జిల్లా ప్రస్తుత అవసరాల్లో సగం మేర ఉంటుంది. దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత వేధిస్తున్న నేపథ్యంలో జిల్లాలోనే ఆక్సిజన్ ఉత్పత్తికి అవకాశాలను గుర్తించి చర్యలు తీసుకుంటున్న జిల్లా యంత్రాంగంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రభుత్వ ముందుచూపుతో.. వాస్తవానికి కోవిడ్ కంటే ముందు జిల్లాలోని ప్రధాన ఆసుపత్రితో పాటు ఎక్కడా కూడా ప్రత్యేకంగా ఆక్సిజన్ నిల్వ కోసం ప్లాంటు లేదు. సరైన ఆక్సిజన్ పైపులైన్లు కూడా లేని దుస్థితి. ఈ పరిస్థితిని గమనించిన ప్రభుత్వం ఆక్సిజన్ నిల్వ ప్లాంటుతో పాటు రోగులకు నేరుగా ఆక్సిజన్ సరఫరా పైపులైన్ల ఏర్పాటుకు ఆగమేఘాల మీద చర్యలు తీసుకుంది. ఇలా ఏకంగా రూ.5 కోట్లకుపైగా నిధులను మంజూరు చేసింది. ఈ నిధులతో జిల్లాలోని అన్ని ఆసుపత్రుల్లో ఆక్సిజన్ నిల్వ ప్లాంటుతో పాటు పైపులైన్లను ఏర్పాటు చేశారు. మరో 100 టన్నుల ఆక్సిజన్ జిల్లాలో అర్జాస్ స్టీల్ కంపెనీ ఉంది. తన పరిశ్రమ అవసరాల కోసం ఈ కంపెనీ ఆక్సిజన్‌ను నిల్వ ఉంచుకుంది. ఇక్కడ సుమారు 100 టన్నుల ఆక్సిజన్ నిల్వ ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై కూడా జిల్లా కలెక్టర్ ఆరా తీసినట్టు సమాచారం. ఈ ఆక్సిజన్‌ను కూడా ప్రజల అవసరాల కోసం వినియోగించుకునేందుకు ప్రభుత్వం చర్యలను ప్రారంభించింది. రెండు, మూడు రోజుల్లో ఈ ఆక్సిజన్ నిల్వలు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సగం ఆక్సిజన్ ఇక్కడి అవసరాలకే.. జిల్లాలో ఆక్సిజన్ ఉత్పత్తికి అవకాశం ఉన్న ప్లాంట్లను గుర్తించాం. రెండు ప్లాంట్లపై దృష్టి సారించాం. అవసరమైన అనుమతుల కోసం ప్రభుత్వాన్ని సంప్రదించాం. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంది. ఈ రెండు ప్లాంట్లలో ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్‌తో జిల్లాలో ప్రస్తుత ఆక్సిజన్ అవసరాల్లో సుమారు సగం మేర తీరే అవకాశం ఉంది. – గంధం చంద్రుడు, కలెక్టర్ చదవండి: అంతా మా ఇష్టం: అక్కడ అన్నీ ‘వెలగపూడి’ ఫుడ్‌కోర్టులే.. ఏళ్ల తరబడి తిష్ట: కదలరు.. వదలరు! -
యువత రక్షణే తక్షణ బాధ్యత!
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తివల్ల కలిగే ఉపద్రవంకన్నా కంగారు పర్చే వార్తలను నిత్యం ప్రచారంలో పెట్టడం ప్రజలలో తీవ్ర ఆందోళనలకు కారణ మవుతోంది. ఈ భయాందోళనలు ఏ స్థాయికి చేరాయంటే నిజమైన రోగులు మరణించిన వార్త విన్న వెంటనే కుప్పకూలి అక్కడికక్కడ చనిపోయిన ఉదంతాలు కోకొల్లలు. పైగా కోవిడ్–19 రెండవసారి ఉధృతితో వైరస్‌కి యువకులు ఎక్కువగా గురవుతున్నారు. నేడు ఆసుపత్రుల్లో ఊపిరి కోసం వెంటి లేటర్స్‌పై ఉన్నవాళ్లలో 30 శాతం యువకులే, వీరు 30–45 ఏళ్లవాళ్లే. ఆరోగ్య సమస్యల కారణంగా తలెత్తిన ప్రాణవాయువు పుష్కలంగా అందించలేని దుస్థితికి దేశం చేరిందంటే– నిస్సందేహంగా పాలకుల అలసత్వమే కారణం, ఈ దశలో జాతి కుసుమాలుగా ఉన్న యువత రక్షణ మన తక్షణ బాధ్యత! ‘‘నేడు ఆసుపత్రుల్లో ఊపిరి కోసం వెంటి లేటర్స్‌పై ఉన్నవాళ్లలో 30 శాతం యువకులే, వీరు 30–45 ఏళ్లవాళ్లే. కోవిడ్–19 రెండవసారి ఉధృతితో విషక్రిమి (వైరస్)కి యువకులు ఎక్కువగా గురవుతున్నారు. మూడు వారాల్లో వైరస్ తగ్గుముఖం పడుతుందని ఆశిస్తున్నాం’’. – డాక్టర్ రాజారావు, గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ‘‘కోవిడ్–19 నీరెండలాంటి సాత్వికమైన రోగం. దానికి ఎవరూ కంగారుపడాల్సిన పనిలేదు. ఈ కంగారులో ఇంజెక్షన్లను, మందుల్ని, ఆక్సిజన్ సిలిండర్లను ఇళ్లలో దాచేసుకుంటున్నారు. ఇది అనవసర భయం. ఎందుకంటే కోవిడ్ అనేది సాధారణ రోగం. ఇది తాకితే లేదా స్పర్శ తగిలితే వచ్చేది కాదు. ఇది సాధారణ రోగం. ఇది వచ్చిన వారిలో 85–90 శాతానికి జ్వరం, జలుబు, ఒంటినొప్పులు, దగ్గు, తలనొప్పి ఉండటం సహజం. సాధారణ మందుల తోనే మీరు యోగా తదితర శారీరక ఎక్సర్సైజెస్ ద్వారా వారం పదిరోజుల్లోనే మామూలు స్వస్థతకు చేరుకుంటారు. ఈ మాత్రానికే మీరు ఇళ్లలో రెమిడెసివిర్‌లు, ఆక్సిజన్ సిలెండర్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు’’. – డాక్టర్ రణదీప్ గులేరియా, ఎయిమ్స్ డైరెక్టర్ ప్రకటన ప్రజా బాహుళ్యాన్ని సర్వత్రా కంగారుపరిచే విధంగా రకరకాల ప్రచా రాలతో ప్రసార మాధ్యమాలు సహా రకరకాల వార్తలను ఒక మేరకు అదుపు తప్పి మరీ ప్రచారంలో పెట్టడంవల్ల కూడా దేశంలో వ్యాధి వ్యాప్తివల్ల కలిగే ఉపద్రవంకన్నా ప్రజలలో తీవ్ర భయాందోళనలకు కారణమవుతోంది. దీనికితోడు కేంద్ర ప్రభుత్వపరంగా కనీసం ప్రాణ రక్షణకు అవసరమైన కనీస ఆక్సిజన్ సిలిండర్ల ఉత్పత్తి పంపిణీలపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోనందువల్ల కోవిడ్–19కి సంబంధించి ప్రజల్లో భయాందోళనలు మరింతగా పెచ్చరిల్లుతున్నాయి. ఇవి ఏ స్థాయికి చేరాయంటే నిజమైన రోగులైన తమవాళ్లు మరణించిన వార్త విన్న మరుక్షణంలోనే కుప్పకూలి అక్కడికక్కడనే చనిపోయిన ఉదం తాలు, కరోనాని అంటురోగంగా భావించినందున కుటుంబంలోని ఎవరైనా సాధారణంగా మరణించినా వారి దగ్గరకు వెళ్లలేక భీతావ హులైపోయి రోగగ్రస్థులవుతున్న దశలో ఇప్పుడు మనం ఉన్నాం. వైద్య నిపుణులు, రోగ నిరోధక శాస్త్ర నిపుణులు, క్రిమి శాస్త్ర ఆచా ర్యులు తదితర ఉద్దండులు భరోసా ఇస్తూ పాటించవలసిన జాగ్రత్త లను పదే పదే సూచించి చైతన్యవంతుల్ని చేయడానికి విశ్వప్రయత్నం చేస్తున్నా– మన రాజకీయ నాయకులు కోవిడ్‌పై శాస్త్రీయ పద్ధతుల్లో సరైన అవగాహన కల్పించడంలో ఘోరంగా విఫలమయ్యారు. ఈ ప్రస్తుత దుస్థితిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, యువ నాయ కుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, తెలంగాణ ఆరోగ్య శాఖామంత్రి ఈటల రాజేందర్ పలుసార్లు వివరించారు. ప్రజా బాహుళ్యాన్ని చైత న్యవంతం చేయడంలో కోవిడ్ రోగాన్ని ‘వస్తుంది, పోతుంది’ మన జాగ్రత్తతో మనం ఉండటమే పరిష్కారంగా వర్ణించి భయాందోళ నలు తొలగించడానికి ప్రయత్నిస్తూ వచ్చారు. కాగా, దేశంలో రాజ కీయ పాలకుల, నాయకుల పనితీరు, ప్రవర్తన గురించి తెలంగాణ ఆరోగ్యమంత్రి ఈటల ఇలా ఎండగట్టవలసి వచ్చింది: ‘‘గతంలో రాజ కీయ నాయకులు అంటే సమాజంలో గొప్ప గౌరవ భావముండేది, విలువలు, విశ్వాసం ఉండేవి. కానీ రాన్రానూ నాయకుల మీద, రాజ కీయ నాయకులమీద ఎలాంటి భావన వస్తూందో చెప్పాల్సిన అవసరం లేదు’! ఈ భావన జనంలో పెరగడానికి తాజా ఉదాహరణ. ఇనుము, ఉక్కు పరిశ్రమలకు, సంబంధిత ఖనిజ సంపదకు ప్రపం చంలోనే శతాబ్దాల నాడే కీర్తి ప్రతిష్టలు పొందిన భారతదేశానికి నేడు దేశ ప్రజలకు ఆరోగ్య సమస్యల కారణంగా తలెత్తిన ప్రాణ వాయువు పుష్కలంగా అందించ లేని దుస్థితికి చేరిందంటే– నిస్సందేహంగా పాలకుల అలసత్వం, విధాన నిర్ణయాలలో దేశ పాలనా నిర్వహణలో ప్రజాబాహుళ్య ప్రయోజనాలపట్ల పాటించి తీరాల్సిన ప్రాధాన్యతల క్రమానికి అంతరాయం ఏర్పడటమే కారణం. దేశ రాజ్యాంగ లక్ష్యాలతో, ప్రకటిత ప్రాధాన్యతలతో నిమిత్తం లేకుండా, పేద, దళిత, మధ్యతరగతి ప్రజా బాహుళ్యం బాగోగులకే ప్రాధాన్యం ఇవ్వాలన్న రాజ్యాంగ ఆదేశిక సూత్రాల విస్పష్ట ప్రకట నను విరుద్ధంగా నేటి బీజేపీ పాలనా వ్యవస్థ ముందుకు సాగుతోంది. దాని ఫలితమే వరుసగా రాజ్యాంగ లక్ష్యాలకు పరమ విరుద్ధంగా, బాహాటంగా– దేశంలోని ప్రభుత్వరంగ పరిశ్రమలను, బ్యాంకులను ఒక్కొటొక్కటిగా ‘రద్దుల పద్దు’లోకి నెట్టేశారు పాలకులు. ఈ స్థితిలో ప్రజారోగ్య రక్షణకు కనీస అవసరమైన ఆక్సిజన్ ఉత్పత్తి చేసుకోగల అవకాశాలు దేశంలో పుష్కలంగా ఉన్నా ‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ లాగా పాలనా వ్యవస్థ వ్యవహరిస్తోంది. ఫలితంగానే నేడు దేశ దేశాలవద్ద స్వతంత్ర భారతం అస్వతంత్ర శిశువుగా అంగలార్చవలసి వస్తోంది. ఇప్పుడుగాదు, నేటికి అయిదు మాసాలనాడే పార్లమెంటరీ ఉపసంఘం కోవిడ్ ఉధృతి దృష్ట్యా దేశ ఆక్సిజన్ అవసరాల గురించి ప్రస్తావించి, తక్షణ ఆక్సిజన్ ఉత్పత్తికి యూనిట్లను నిర్మించాలని కేంద్ర పాలకులకు సూచించింది. కానీ ఆ ప్రతిపాదనను విస్మరించిన కేంద్రం నేడు విదేశాలవైపు అంగలార్చవలసి వస్తోంది. ఈ దుస్థితి చివరికి ఏ స్థాయికి చేరిందంటే ఇంజెక్షన్ల ఉత్పత్తికి అవసరమైన ఫార్మా కంపె నీల ముడిసరుకు కోసం కూడా విదేశాలపై ఆధారపడి రావలసి రావడం. ఈ ముడి సరుకును భారత్–చైనాల మధ్య సరిహద్దు వివా దాల వల్ల అంతకుముందు ఇరుగుపొరుగు చైనా నుంచి దిగుమతి చేసుకునేవాళ్లం. అదీ ఆగిపోయింది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఒకప్పుడు ఫ్రాన్స్‌లో నెపోలియన్ అనుసరించిన ప్రత్యేక ప్రజా వ్యతిరేక, వినాశకర నిబంధనావళి (నెపోలియన్ కోడ్) గుర్తుకు వస్తోంది: ఫ్రాన్స్‌లోని పేద రైతాంగ, సన్నకారు, చిన్నవ్యాపారుల అధీనంలో సువిశాలమైన సుక్షేత్రాలుగా ఉన్న భూములన్నిటినీ గుంజేసి, ఫ్రాన్స్‌లోని మోతుబరులైన భూస్వా ములకు, సంపన్న పారిశ్రామికవేత్తలకు వాటిని ధారాదత్తం చేశాడు. ఇలాంటి పరిణామాన్నే భారత జాతీయోద్యమ తొలితరం విశిష్ట నాయకుడైన దాదాభాయి నౌరోజీ భారత సంపదను బ్రిటిష్ వలస పాలకులు ఎలా దోచుకుపోతూ దేశీయ రైతు, వ్యవసాయ కార్మికుల్ని బికారులుగా చేస్తున్నారని గొంతెత్తి నిరసించాడు. అలాగే, ఇంగ్లండ్‌లో పారిశ్రామిక విప్లవం తర్వాత టెక్నాలజీ పేరిట పరిశ్రమలకు హంగులు ఏర్పరిచే పేరిట భారీ ఎత్తున నిరుద్యోగ పర్వానికి తెరతీసిన పరిస్థితుల్లో ఇంగ్లండ్ మహాకవి షెల్లీ చిక్కుబడిపోయిన శ్రామిక వర్గాన్ని ఉద్బోధిస్తూ ‘ఇంగ్లండ్ ప్రజలకు’ (టు ది మెన్ ఆఫ్ ఇంగ్లండ్) ఒక పాటను సందేశంగా విడుదల చేశాడు. అది విశ్వవ్యాపిత కావ్యంగా ప్రఖ్యాతిగాంచింది. చదవండి! ‘విత్తనం నాటింది నువ్వు, దోచుకుపోయేది మరొకడు సంపద సృష్టి నీవంతు, దాన్ని అనుభవించేది మరొకడు బట్టలు నేయడం నీవంతు, తేరగా అనుభవించేది ఇంకొకడు ఆయుధాల తయారీ నీవంతు, వాటిని ఉపయోగించేది మరొకడు కానీ.. ఒక్క మాట సుమా! విత్తనం నీవే నాటు–ఏ నిరంకుశుడికీ దాన్ని దక్కనివ్వకు సంపద సృష్టించు–కానీ మరొకడికి పంట దక్కనివ్వొద్దు బట్టలు నేస్తూనే ఉండు–కానీ సోమరిపోతులకు అందనివ్వకు ఆయుధాలు తయారుచేస్తూ – వాటిని నీ రక్షణకు మాత్రమే ఉపయోగించు’! ఇంతకూ ‘కోవిడ్’ చాటున రకరకాల ‘వ్యాక్సిన్’ల పేరిట బడా ఫార్మా కంపెనీలు ఎన్ని రూ. లక్షల కోట్లకు మోసులెత్తి ఉంటారో సామాన్యుల ఊహకి అందని అంచనా. ఈ దశలో కంగారులో ఉన్న మన జాతి కుసుమాలుగా ఉన్న యువత రక్షణ మన తక్షణ బాధ్యత! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
మరో హీరో: ఒక్క రూపాయికే ఆక్సిజన్ సిలిండర్
లక్నో: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ సమయంలో అందరూ ఆక్సిజన్ పంపండి అన్ని చాలా రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలను విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ క్రమంలో కొందరు తమకు తోచిన విధంగా సాయం చేస్తున్నారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు కేవలం ఒక్క రూపాయికే ఆక్సిజన్ సిలిండర్ అందిస్తున్నాడు. ఆక్సిజన్ సిలిండర్లు రీఫిల్లింగ్ చేయడానికి ఒక్క రూపాయి తీసుకుని ఏకంగా వెయ్యి సిలిండర్లను రీఫిల్ చేశారు. ఆయనే ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌కు చెందిన మనోజ్ గుప్తా రిమ్జిమ్ ఇస్పాత్ పరిశ్రమ నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. ఈ క్రమంలో ప్రజలను ఆదుకునేందుకు మనోజ్ ముందుకు వచ్చాడు. ఆ కంపెనీ ఎండీ యోగేశ్ అగర్వాల్‌తో కలిసి ఆక్సిజన్‌ను సరఫరా చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ సందర్భంగా రూపాయి తీసుకుని ఆక్సిజన్ సిలిండర్లు నింపి ఇచ్చారు. ‘సాధారణంగా స్టీల్ పరిశ్రమలో ఆక్సిజన్ వినియోగిస్తాం.. ప్రస్తుతం కరోనా వ్యాప్తి నేపథ్యంలో రోగులు ఆక్సిజన్ లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో వారికి సేవ చేయాలని నిర్ణయించుకున్నా. అందుకే ఆక్సిజన్ అందించాలని డిసైడ్ అయ్యా’ అని మనోజ్ గుప్తా తెలిపారు. ఎక్కడెక్కడి నుంచో ఆక్సిజన్ కోసం వస్తున్నారు. వారికి ఉచితంగా ఇవ్వకుండా కేవలం ఒక్క రూపాయికే సిలిండర్ రీఫిల్ చేస్తున్నట్లు చెప్పారు. రూపాయికే ఆక్సిజన్ అందిస్తున్న విషయం తెలుసుకుని మనోజ్ గుప్తా వద్దకు అలీఘర్, నోయిడా, లక్నో, బనారస్ నుంచి పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారు. చదవండి: మా రాష్ట్రంలో లాక్డౌన్ పెట్టబోం చదవండి: కేంద్రం ఇవ్వకున్నా మేమిస్తాం: 23 రాష్ట్రాలు -
ఆక్సిజన్ వచ్చేసింది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా రోగుల కు అవసరమైన ఆక్సిజన్ కొరత లేకుండా చేసే దిశగా ప్రభుత్వ యత్నాలు ఫలించాయి. ఒడిశా నుంచి రాష్ట్రానికి తొలిదఫా 6 ట్యాంకర్లలో 110 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ చేరుకుంది. ట్యాంకర్లు రోడ్డు మార్గాన ఒడిశాలోని అం గూల్ ప్లాంట్‌కు వెళ్లి, తిరిగి వచ్చేందుకు వారం రోజులకుపైగా సమయం పట్టే అవకాశం ఉండటంతో.. వేగంగా ఆక్సిజన్ రప్పించేందుకు ఖాళీ ట్యాంకర్లను ఎయిర్‌ఫోర్స్ విమానంలో ఒడిశాకు తరలించిన విషయం తెలిసిందే. ఆక్సిజన్ నింపుకొని రాష్ట్రానికి చేరుకున్న ట్యాం కర్లను రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు పంపించినట్టు ఈ అంశాన్ని పర్యవేక్షిస్తున్న ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో.. రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడం, ఆక్సిజన్ కొరత మొదలయ్యే పరిస్థితిలో వెంటనే ఎయిర్‌ఫోర్స్ సహాయంతో ఆక్సిజన్ తెప్పించాలని సీఎం నిర్ణయించారు. సీఎం ఆదేశాల మేరకు ఈ విషయంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టిన రాష్ట్ర అధికారులు.. ఎయిర్‌ఫోర్స్ అధికారులతో మాట్లాడారు. దేశంలోనే తొలిసారిగా ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సి–17 విమానాల్లో తొమ్మిది ఖాళీ ట్యాంకర్లను ఈ నెల 23న హైదరాబాద్ నుంచి ఒడిశాలోని అంగూల్ ప్లాంట్‌కు పంపారు. ఈ ట్యాంకర్లు అక్కడ ఆక్సిజన్ నింపుకొని రోడ్డు మార్గంలో రాష్ట్రానికి బయలుదేరాయి. సోమవారం రాష్ట్రానికి చేరుకున్నాయి. మొదట్లో రూర్కెలా, అంగూల్ రెండు ప్లాంట్ల నుంచీ ఆక్సిజన్‌ను దిగుమతి చేసుకోవాలని భావించినా.. రూర్కెలా ప్లాంట్ అక్కడి విమానాశ్రయానికి మరీ దూరంగా ఉండడంతో.. ప్రస్తుతానికి అంగూల్ ప్లాంట్ నుంచి ఆక్సిజన్‌ను తెప్పిస్తున్నట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 350 టన్నుల మేర ఆక్సిజన్ అవసరమని చెప్పారు. వంద టన్నుల మేర ఇక్కడ ఉత్పత్తి అవుతోందని, మరో 300 టన్నుల మేర దిగుమతి చేసుకోవాల్సి ఉందని వివరించారు. కేంద్రం ఒడిశా నుంచి రాష్ట్రానికి 250 టన్నుల ఆక్సిజన్ కేటాయించిందని, ఆ మేరకు దిగుమతి చేసుకుంటున్నామని తెలిపారు. ఆస్పత్రులకు ఆక్సిజన్.. రాష్ట్రానికి చేరుకున్న ఆక్సిజన్‌ను అవసరమైన ఆస్పత్రులకు పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ట్యాంకర్లలో ఒకదానితో గచ్చిబౌలిలోని టిమ్స్, ఛాతీ వైద్యశాల, కింగ్ కోఠి ఆస్పత్రులకు ఆక్సిజన్ అందించారు. ఆయా ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత కారణంగా పరిస్థితి చేయి దాటుతుండడంతో.. అక్కడి రోగులను, కరోనా బాధితులను గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడా ఆస్పత్రుల్లో పరిస్థితి చక్కబడనుంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు ప్రైవేట్ ఆస్పత్రులు కూడా ఆక్సిజన్ కొరతతో ఇబ్బంది పడకుండా.. అవసరాల మేరకు సరఫరా చేయనున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. నేడు మరో ఎనిమిది ట్యాంకర్లు అంగూల్‌కు.. మంగళవారం మరో ఎనిమిది ఖాళీ ట్యాంకర్లను విమానాల ద్వారా ఒడిశాలోని అంగూల్ ప్లాంట్‌కు తరలించనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ ట్యాంకర్లు ఆక్సిజన్ నింపుకొని ఈ నెల 30వ తేదీ నాటికి తిరిగి రాష్ట్రానికి చేరుకుంటాయని వెల్లడించాయి. వాటిలో సుమారు 120 టన్నుల ఆక్సిజన్ వస్తుందని వివరించాయి. కరోనా రోగుల సంఖ్య పెరుగుతుండటంతో ఆక్సిజన్‌కు డిమాండ్ పెరుగుతోందని, ఈ మేరకు కొరత తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నాయి. ‘ఆక్సిజన్’ రథసారథులు ఆర్టీసీ డ్రైవర్లే ఒడిశాలోని అంగూల్‌లో ఆక్సిజన్ నింపుకొన్న ట్యాంకర్లను వందల కిలోమీటర్ల దూరం నడిపి భద్రంగా రాష్ట్రానికి తీసుకొచ్చింది ఆర్టీసీ డ్రైవర్లే. ఈ నెల 23న ఎయిర్‌ఫోర్స్ విమానంలో ఖాళీ ట్యాంకర్లను ఒడిశాకు పంపిన విషయం తెలిసిందే. మండే స్వభావమున్న ఆక్సిజన్‌ను అంత దూరం నుంచి తరలించడం కత్తిమీద సాము వంటిది. ట్యాంకర్లను నిర్దేశిత వేగంతో జాగ్రత్తగా నడపాలి. ఇందుకోసం డ్రైవింగ్‌లో మంచి నైపుణ్యం ఉన్న సీనియర్లు కావాలని రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీని కోరింది. ఈ మేరకు ఆర్టీసీ 20 మంది డ్రైవర్లను ఎంపిక చేసింది. అందులో 10 మంది డ్రైవర్లు ఖాళీ ట్యాంకర్లతో విమానంలో ఒడిశాకు వెళ్లారు. విమానాశ్రయం నుంచి అంగూల్ ప్లాంట్‌కు ట్యాంకర్లతో వెళ్లి.. ఆక్సిజన్ నింపుకొని రాష్ట్రానికి తీసుకువచ్చారు. మంగళవారం ఎయిర్‌ఫోర్స్ విమానంలో ఖాళీ ట్యాంకర్లతో మరికొందరు ఆర్టీసీ డ్రైవర్లు ఒడిశాకు వెళ్తున్నారు. చదవండి: మా రాష్ట్రంలో లాక్డౌన్ పెట్టబోం చదవండి: కేంద్రం ఇవ్వకున్నా మేమిస్తాం: 23 రాష్ట్రాలు -
మీ శరీరంలో ఆక్సిజన్ స్థాయి ఎంత ఉందో తెలుసుకోవాలా?
ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మరీ వల్ల మృతుల సంఖ్య రోజు రోజుకి విపరీతంగా పెరుగుతుంది. కరోనా భారీనా పడినవారు చనిపోవడానికి ముఖ్యకారణం ఆక్సిజన్ లభ్యత సరిపడినంత లేకపోవడమే. చాలా మందికి ఈ మహమ్మారి సమయంలో శరీరంలో ఆక్సిజన్ స్థాయి(SpO2) ఎంత ఉంది అనేది తెలుసుకోవడం కీలకంగా మారింది. ప్రస్తుతం మార్కెట్లో బ్లడ్ లో ఆక్సిజన్ స్థాయిని గుర్తించే స్మార్ట్ వాచ్, ఫిట్ నెస్ పరికరాలు చాలా వరకు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఆపిల్, శామ్ సంగ్, షియోమీ, రియల్ మీ వంటి అనేక కంపెనీలు ఆక్సిజన్ స్థాయిని గుర్తించే పరికరాలను తయారు చేస్తున్నాయి. కాబట్టి, మీరు స్మార్ట్ వాచ్ లేదా ఫిట్నెస్ బ్యాండ్‌ను కలిగి ఉంటే అందులో బ్లడ్ లో ఆక్సిజన్ స్థాయిని కొలిచే ఫీచర్ అందుబాటులో ఉంది. SpO2 లెవల్‌ను కొలిచేటప్పుడు గుర్తించుకోవలసిన అంశాలు: మీ చేతికి వాచ్ లేదా బ్యాండ్ సరిగ్గా అమర్చారో లేదో చూసుకోండి. SpO2 స్థాయిని కొలిచేటప్పుడు ఎల్లప్పుడూ మిమ్మల్ని, మీ చేతిని అలాగే ఉంచండి. మంచి ఫలితాల కోసం మీ చేతిని చదునైన ఉపరితలంపై ఉంచండి. మీ చేతిపై ఉండే వెంట్రుకలు, పచ్చబొట్లు, చెయ్యి వణకడం, సక్రమంగా ధరించకపోవడం వంటివి ఫలితాలను ప్రభావితం చేస్తాయి. ఆపిల్ వాచ్ సిరీస్ 6 మీ ఐఫోన్లో హెల్త్ యాప్‌ను సెటప్ చేసుకొని, బ్రౌజ్ ట్యాబ్‌పై క్లిక్ చేయండి. తర్వాత రెస్పిరేటరీ నావిగేట్ ఆన్ చేయండి. ఆ తర్వాత బ్లడ్ ఆక్సిజన్ ఆప్షన్‌లోకి వెళ్లి బ్లడ్ ఆక్సిజన్ సెటప్ చేసుకోండి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత, ఆపిల్ వాచ్ యాప్‌లో వెళ్లి SpO2 లెవన్‌ను కొలవండి. ఒకవేళ మీ యాపిల్ వాచ్‌లో బ్లడ్ ఆక్సిజన్ యాప్ లేకపోతే, యాప్ స్టోర్‌లోకి వెళ్లి డౌన్లోడ్ చేసుకోండి. అమేజ్‌ఫిట్ మీ అమేజ్‌ఫిట్ యాప్‌లోని లిస్ట్‌ను ఓపెన్ చేయడానికి డయల్ ఇంటర్ఫేస్ను ఎడమవైపు స్వైప్ చేయండి. బ్లడ్ ఆక్సిజన్ శాచురేషన్ను కొలవడానికి బ్లడ్ ఆక్సిజన్ యాప్‌ను ఎంచుకోండి. రియల్‌మి వాచ్ యూజర్లు రియల్‌మి వాచ్‌లోని ఆక్సిజన్ శాచురేషన్ (SpO2) పేజీకి వెళ్లాలి. SpO2 లెవల్‌ను కొలవడానికి SpO2 ఎంపికపై నొక్కండి. 30 సెకన్లలో ఫలితం మీకు కనిపిస్తుంది. శామ్సంగ్ గెలాక్సీ వాచ్ 3 శామ్సంగ్ గెలాక్సీ వాచ్ 3లో మాత్రమే ఆక్సిజన్ లెవల్‌ను గుర్తించవచ్చు. ఈ వాచ్‌లో SpO2 ను కొలవడానికి, మీ స్మార్ట్‌ఫోన్‌లో శామ్సంగ్ హెల్త్ యాప్‌ను ఓపెన్ చేసి మీ గెలాక్సీ వాచ్ 2ను జత చేయండి. ఇప్పుడు, గెలాక్సీ వాచ్ 3లో గెలాక్సీ హెల్త్ యాప్ ఓపెన్ చేసి స్ట్రెస్ ఆప్షన్‌ను క్లిక్ చేయండి. SpO2 లెవల్‌ను పొందడానికి మెజర్ బటన్‌పై క్లిక్ చేయండి. చదవండి: వ్యాక్సిన్ కావాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి! -
కరోనా నివారణ చర్యలపై మంత్రి ఆళ్ల నాని సమీక్ష
-
వైరల్: భర్తకు కోవిడ్.. నోటి ద్వారా శ్వాస అందించిన భార్య
లక్నో: దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తుంది. గతంతో పోలిస్తే ఈ సారి ఆక్సిజన్ వినియోగం భారీగా పెరిగింది. కానీ అవసరానికి సరిపడా ప్రాణవాయువు నిల్వలు లేక చాలా మంది మరణిస్తున్నారు. ఆస్పత్రుల్లో బెడ్స్ సమస్య ఎంత తీవ్రంగా ఉందో తెలియజేప్పే ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కోవిడ్ బారిని పడిన భర్త శ్వాస తీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. అయితే బెడ్లు ఖాళీ లేవని వారిని ఏ ఆస్పత్రిలో కూడా చేర్చుకోలేదు. ఈ లోపు బాధితుడి పరిస్థితి విషమించసాగింది. దాంతో ప్రమాదం అని తెలిసి కూడా భార్య తన నోటి ద్వారా భర్తకు శ్వాస అందించే ప్రయత్నం చేసింది. అయితే ఆమె ప్రయత్నం వృథా అయ్యింది. చివరకు ఆ వ్యక్తి భార్య ఒడిలోనే కన్నుమూశాడు. ఈ హృదయవిదారక ఘటనకు సంబంధించిన ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఆ వివరాలు.. ఆగ్రా వికాస్ సెక్టార్ 7కు చెందిన రవి సింఘాల్ కోవిడ్ బారిన పడ్డాడు. దాంతో అతడి భార్య రేణు సింఘాల్, రవి సింఘాల్‌ను స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లింది. కానీ బెడ్స్ ఖాళీగా లేకపోవడంతో అతడిని ఆస్పత్రిలో చేర్చుకోవడానికి సిబ్బంది నిరాకరించారు. ఈలోపు రవి సింఘాల్‌కు ఊపిరి తీసుకోవడంలో సమస్య తలెత్తింది. దాంతో రేణు సింఘాల్ అతడిని సరోజిని నాయుడు మెడికల్ కాలేజీకి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యింది. ఆటోలో ఎక్కి ఆస్పత్రి వెళ్తుండగా అతడి పరిస్థితి చేయి దాటిపోసాగాంది. ఊపిరి తీసుకోవడానికి చాలా కష్టపడసాగాడు. దాంతో ప్రమాదం అని తెలిసి కూడా రేణు సింఘాల్ అతడికి నోటి ద్వారా శ్వాస అందించే ప్రయత్నం చేసిది. కానీ అవేవి ఫలించలేదు. ఆస్పత్రికి చేరుకునేలోగానే అతడు ఆటోలోనే భార్య ఒడిలో కన్ను మూశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. తనకు ప్రమాదం అని తెలిసి కూడా భర్త ప్రాణాల కోసం రేణు సింఘాల్ చేసిన సాహసం ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. ఆమె భర్త బతికి ఉంటే బాగుండు అని వాపోతున్నారు. ఇక ఆగ్రాలో చాలా ఆస్పత్రుల్లో బెడ్స్ కొరత తీవ్రంగా ఉంది. ఆక్సిజన్ నిల్వలు అయిపోవడంతో పలువురు మరణించారు. ఈ పరిస్థితులపై జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలకు ప్రజల కష్టాలు పట్టవా అని విమర్శిస్తున్నారు. ఇక భారతదేశంలో సోమవారం మూడున్నర లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇక గడిచిన 24 గంటల్లో 2,812 మంది కోవిడ్ పేషెంట్లు మృతి చెందారు. -
ప్రభుత్వాస్పత్రుల్లో ‘రెమిడెసివర్’ కొరత లేదు: ఆళ్ల నాని
సాక్షి, గుంటూరు: ఆక్సిజన్ వృథా కాకుండా మెడికల్ ఆఫీసర్లు దృష్టి పెట్టాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు. సోమవారం ఆయన కరోనా నివారణ చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వాస్పత్రుల్లో రెమిడెసివర్ ఇంజక్షన్ల కొరత లేదని స్పష్టం చేశారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో రెమిడెసివర్ కొరత లేకుండా చూస్తామని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. 40 బెడ్స్ ఉన్న ఆస్పత్రులను కోవిడ్ సెంటర్లుగా అనుమతిస్తామని ఆయన వెల్లడించారు. ప్రైమరీ కాంటాక్ట్ అందరికీ పరీక్షలు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. కోవిడ్ టెస్టుల ఫలితాలు 24 గంటల్లో వచ్చేలా చర్యలు చేపట్టామన్నారు. 104కు కాల్ చేసిన మూడు గంటల్లో బెడ్ కేటాయించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు. ఆక్సిజన్ ఆడిటింగ్ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం ఆస్పత్రుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆక్సిజన్ ఆడిటింగ్ ప్రారంభించింది. ఆస్పత్రుల వారీగా సరఫరా అయ్యే ఆక్సిజన్ లెక్కలు తీయాలని నిర్ణయించింది. రోజువారీ వినియోగం, ఆక్సిజన్ పడకలపై ప్రభుత్వం ఆరా తీసింది. ఆస్పత్రిలో ఎన్ని ట్యాంకుల ఆక్సిజన్ వాడారనే దానిపై ఆడిటింగ్‌కు ఆదేశాలు జారీ చేసింది. రోజువారీ అవసరాలకు 330 టన్నుల ఆక్సిజన్ కావాలని.. ప్రస్తుతం 290 టన్నుల ఆక్సిజనే అందుబాటులో ఉందని వైద్యశాఖ తెలిపింది. ఆక్సిజన్ సరఫరా మెరుగుపరిచేందుకు ప్రత్యేక అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఆక్సిజన్ సిలిండర్లు, నెట్రోజన్ ట్యాంకర్లను ప్రభుత్వం మార్పులు చేస్తోంది. రాష్ట్రంలోని 42 ఆక్సిజన్ ఫిల్లింగ్ స్టేషన్ల నుంచి ఆస్పత్రులకు సరఫరా జరుగుతుంది. ఆక్సిజన్ సరఫరాకు ఇప్పటికే ప్రభుత్వం జిల్లాస్థాయిలో జేసీకి బాధ్యతలు అప్పగించింది. భువనేశ్వర్, బళ్లారి, విశాఖ నుంచి రాష్ట్రానికి ఆక్సిజన్ సరఫరా జరుగుతుంది. సాంకేతిక లోపం వల్లే..: మంత్రి బొత్స విజయనగరం: మహారాజా ఆస్పత్రిలో ఆక్సిజన్ సరఫరా పునరుద్ధరించామని.. సాంకేతిక లోపం వల్లే సరఫరాలో అంతరాయం ఏర్పడిందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీలో రెండు ప్లాంట్లు నిర్వీర్యంగా ఉన్నాయని.. పునరుద్ధరించేందుకు సీఎం కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఒడిశా, కర్ణాటక నుంచి ఆక్సిజన్ రప్పిస్తున్నామని మంత్రి వెల్లడించారు. అందరికీ వ్యాక్సిన్ ఇచ్చేలా చర్యలు చేపడుతున్నామని మంత్రి బొత్స పేర్కొన్నారు. చదవండి: ఏపీ: అందుబాటులో 33 వేల బెడ్స్: కృష్ణబాబు ఆక్సిజన్ అందక ఎవరూ చనిపోలేదు: విజయనగరం కలెక్టర్ -
ఏపీ, తెలంగాణలకు ఆక్సిజన్ సరఫరాను నిలిపివేయండి
చెన్నై: తమిళనాడులోని శ్రీపెరంబుదూర్ ప్లాంట్ నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు మెడికల్ ఆక్సిజన్ కేటాయింపును తక్షణమే రద్దు చేయాలని ప్రధాని మోదీని తమిళనాడు సీఎం పళనిస్వామి కోరారు. రాష్ట్రంలో మెడికల్ ఆక్సిజన్ అవసరమున్న కరోనా పేషెంట్లు ఎక్కువైనందున, నిల్వలను అందుబాటులో ఉంచాలన్నారు. జాతీయ ప్రణాళిక అనుసరించి ఏపీ, తెలంగాణలకు 80 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ తరలిస్తున్న కారణంగా తమిళనాడులో సంక్షోభం తలెత్తే అవకాశముందన్నారు. ఇప్పటికే 310 టన్నుల ఆక్సిజన్‌ను ఆస్పత్రుల్లో వినియోగిస్తుండగా 220 మెట్రిక్ టన్నులే కేటాయించారని తెలిపారు. మహమ్మారి తీవ్రతను బట్టి రాష్ట్రానికి 450 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. తూత్తుకుడి స్టెరిలైట్ ప్లాంట్‌ను తిరిగి ప్రారంభించనున్నట్లు తమిళనాడు ప్రభుత్వం పేర్కొంది. పర్యావరణ కాలుష్యంపై వివాదంతో 2018, మేలో మూతపడిన వేదాంత స్టెరిలైట్ యూనిట్‌ను ఆక్సిజన్ ఉత్పత్తి కోసం తిరిగి తెరవలని నిర్ణయించింది. అలాగే, చెన్నై నగరానికి ఆక్సిజన్ సరఫరా చేసే శ్రీపెరంబుదూరు లోని ప్లాంట్ నుంచి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు 80 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మళ్లింపును రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మా రాష్ట్రంలో గత కోవిడ్ సమయంలో 58 వేల యాక్టివ్ కేసులు ఉండగా అవి ఇప్పుడు లక్షకు పెరిగిపోయాయని పళనిస్వామి వెల్లడించారు. చదవండి: వ్యాక్సిన్ కావాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి! -
ఆక్సిజన్ కొరత: సింగపూర్ భారీ సాయం
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి విజృంభణలో తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. సోమవారం నాటి గణాంకాల ప్రకారం గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో మూడున్నర లక్షలకుపైగా కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో 2812 మరణాలు సంభవించాయి. మరోవైపు ప్రపంచ దేశాలు భారత్‌కు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నాయి. ఆక్సిజన్ కొరత సంక్షోభ సమయంలో బ్రిటన్, అమెరికా, సింగపూర్, సౌదీ అరేబియగా తదితర దేశాలు భారత్‌కు అండగా నిలిచేందుకు రంగంలోకి దిగాయి. ఈ నేపథ్యంలో సింగపూర్ నుండి 500 బైపాప్ పరికరాలు , 250 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు, ఇతర వైద్య సామాగ్రి ఎయిర్ ఇండియా విమానం ద్వారా ఆదివారం రాత్రి ముంబైకు చేరుకున్నాయి. మరోవైపు 318 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లతో అమెరికాలోని జెఎఫ్‌కె విమానాశ్రయం నుంచి ఎయిరిండియా విమానం ఢిల్లీకి బయలు దేరింది. అటుసౌదీ అరేబియా 80 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్‌ను భారత్‌కు అందించనున్నట్టు ఇప్పటికే ప్రకటించింది. 318 Oxygen Concentrators loaded by Air India at JFK Airport in the US, on their way to Delhi.#COVID19 pic.twitter.com/PB0CRjk5qf — ANI (@ANI) April 26, 2021 #WATCH | An Air India flight, carrying 500 BiPAPs, 250 oxygen concentrators & other medical supplies from Singapore, landed in Mumbai last night.#COVID19 pic.twitter.com/9S5G8ASE9S — ANI (@ANI) April 26, 2021 చదవండి : కోవిడ్ సంక్షోభం: సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల సాయం పీరియడ్స్ టైంలో మహిళలు వ్యాక్సిన్ తీసుకోవచ్చా? -
కోవిడ్ సంక్షోభం: సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల సాయం
సాక్షి,న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సీఈఓ భారత సంతతికి టెక్ దిగ్గజాలు స్పందించారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, అల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ భారత్‌కు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. దేశంలోని ప్రస్తుత పరిస్థితులు తనకుచాలా బాధకలిగించామంటూ సత్య నాదెళ్ల సోమవారం ట్వీట్ చేశారు. రోజులకు మూడు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్న తరుణంలోముఖ్యంగా తీవ్ర ఆక్సిజన్ కొరత నేపథ్యంలో దేశానికి సహాయం అందించనుట్టు ప్రకటించారు. సహాయ ఉపశమన ప్రయత్నాలు, సాంకేతిక పరిజ్ఞానం,ఇతర వనరుల ద్వారా నిరంతర మద్దతుతో పాటు కీలకమైన ఆక్సిజన్ సాంద్రత పరికరాల కొనుగోలుకు కంపెనీ మద్దతు ఇవ్వనున్నట్టు ఆయన ప్రకటించారు. అలాగే ఈ సందర్బంగా భారత్‌కు సాయం అందించేందుకు ముందుకొచ్చిన అమెరికా ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కూడా స్పందించారు. భారతదేశంలో తీవ్రయవుతున్నకోవిడ్ సంక్షోభం చూసి తల్లడిల్లిపోతున్నట్టు చెప్పారు. గూగుల్ సంస్థ, ఉద్యోగులు కలిసి భారత ప్రభుత్వానికి రూ.135 కోట్ల నిధులను, వైద్యసామాగ్రి కోసం యునిసెఫ్, హై-రిస్క్ కమ్యూనిటీలకు మద్దతు ఇవ్వడంతోపాటు, క్లిష్టమైన సమాచారాన్ని అందించేందుకు సహాయ పడేలా నిధులను అందిస్తున్నామని సుందర్ పిచాయ్ వెల్లడించారు. కాగా గత 24 గంటల్లో దేశంలో రికార్డుస్తాయిలో 3.52 లక్షలకు పైగా కొత్త కోవిడ్-19 కేసులు కాగా 2812 మరణాలు నమోదైనాయి. మొత్తం 2,19,272 బాధితులు ఆసుపత్రినుంచి డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో కరోనా పరిస్థితులు, ఆక్సిజన్, నిత్యావసర మందుల సరఫరా కొరత నేపథ్యంలో బ్రిటన్, అమెరికా, సౌదీ అరేబియా, సింగపూర్ లాంటి దేశాలు ఇప్పటికే తమ సాయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సింగపూర్ నుండి 500 బైపాప్‌లు, 250 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు, ఇతర వైద్య సామాగ్రితో ఎయిర్ ఇండియా విమానం ఆదివారం రాత్రి ముంబైలో ల్యాండ్ అయింది. I am heartbroken by the current situation in India. I’m grateful the U.S. government is mobilizing to help. Microsoft will continue to use its voice, resources, and technology to aid relief efforts, and support the purchase of critical oxygen concentration devices. — Satya Nadella (@satyanadella) April 26, 2021 -
భారత్‌కు సౌదీ నుంచి 80 టన్నుల ఆక్సిజన్
దుబాయ్: తీవ్ర ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటున్న భారత్‌కు సౌదీ అరేబియా 80 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్‌ను పంపుతోంది. అదానీ గ్రూపు, ఆక్సిజన్ ఉత్పత్తిదారు లిండే కంపెనీ సహకారంతో 80 టన్నుల ఆక్సిజన్‌ను పంపుతున్నట్లు రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ‘రియాద్‌లో భారత రాయబార కార్యాలయానికి కృతజ్ఞతలు. ప్రపంచం నలుమూలల నుంచి ఆక్సిజన్‌ను భారత్‌కు తరలించే మిషన్‌లో నిమగ్నమయ్యాం. 80 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్‌తో 4 క్రయోజనిక్ ట్యాంకులు నౌకలో దమ్మామ్ నుంచి ముంద్రా పోర్టుకు బయలుదేరాయి’ అని అదానీ గ్రూపు చైర్మన్ గౌతమ్ అదానీ ట్వీట్ చేశారు. Thank you @IndianEmbRiyadh. Indeed, actions speak louder than words. We are on an urgent mission to secure oxygen supplies from across the world. This first shipment of 4 ISO cryogenic tanks with 80 tons of liquid oxygen is now on its way from Dammam to Mundra. (1/3) https://t.co/BLZ0SbQ499 pic.twitter.com/lFKnx0hIhX — Gautam Adani (@gautam_adani) April 24, 2021 -
ఆసుపత్రిలో బెడ్లు లేక కరోనా రోగుల అగచాట్లు
-
కరోనాతో కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యే మృతి
భోపాల్: దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. బీద, ధనిక, సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా చూపడం లేదు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కేసీఆర్, యోగి ఆదిత్యనాథ్ మొదలు రాహుల్ గాంధీ వరకు పలువురు రాజకీయ నాయకులు కూడా కోవిడ్ బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా కరోనాతో కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యే ఒకరు మృతి చెందారు. మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్ జిల్లా జోబట్ నియోజకవర్గ ఎమ్మెల్యే కళావతి భూరియా కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆమె ఇండోర్‌లోని షాల్బీ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ 12 రోజుల అనంతరం ఆమె ప్రాణాలు విడిచారు. ఆస్పత్రిలో చేరిన నాటికి కళావతి భూరియా ఊపరితిత్తులు 70 శాతం వరకూ పాడయ్యాయని.. ఆక్సిజన్ లెవెల్స్ కూడా దారుణంగా పడిపోయాయని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వివేక్ జోషి తెలిపారు. ఆక్సిజన్ లెవెల్స్ కేవలం 82 శాతం ఉన్నాయని చెప్పారు. ఆమెను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించామని.. కానీ కాపాడలేకపోయామని ఆయన వెల్లడించారు. 2018లో జోబాట్ నియోజకవర్గం నుంచి కళావతి భూరియా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. కేంద్ర మాజీ మంత్రి కాంతిలాల్ భూరియాకి కళావతి మేనకోడలు. ఎమ్మెల్యే మరణంపై కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్ చీఫ్ కమల్‌నాథ్ సంతాపం వ్యక్తం చేశారు. కళావరి మరణం భాధాకరమని, తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. కష్టపడే స్వభావం, చాలా యాక్టివ్‌గా ఉండే ఎమ్మెల్యే అని గుర్తుచేసుకున్నారు. ఎంపీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ సంతాపం తెలిపారు. చదవండి: అవమానాలు భరించలేం, పార్టీలో నుంచి వెళ్లిపోదామా? -
కోవిడ్ విజృంభణ: కేంద్రం కీలక ప్రకటన
న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాక్సిన్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలకు టీకాలను ఉచితంగా సరఫరా చేస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం ప్రకటించింది. ఉత్పత్తి సంస్థల నుంచి ఒక్కో డోస్‌ను 150 రూపాయలకు కేంద్రం కొనుగోలు చేస్తున్నట్టు ఈ మేరకు ఆరోగ్య శాఖ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఈ టీకాలకు రాష్ట్రాలకు అందజేస్తామని పేర్కొంది. దేశంలో కరోనా విశ్వరూపం దాల్చడంతో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా టీకా తయారీ సంస్థల నుంచి నేరుగా రాష్ట్రాలు వ్యాక్సిన్లు కొనుగోలుకు అవకాశం కల్పించింది. #Unite2FightCorona It is clarified that Govt of India’s procurement price for both #COVID19 vaccines remains Rs 150 per dose. GOI procured doses will continue to be provided TOTALLY FREE to States.@PMOIndia @drharshvardhan @AshwiniKChoubey @DDNewslive @PIB_India @mygovindia https://t.co/W6SKPAnAXw — Ministry of Health (@MoHFW_INDIA) April 24, 2021 వ్యాక్సిన్ తయారీ సంస్థలు సగం డోసులను కేంద్రానికి, మిగిలిన డోసులను రాష్ట్ర ప్రభుత్వాలకు, ఓపెన్ మార్కెట్లో విక్రయించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో కోవిషీల్డ్ ధరలను సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఒక్కో డోస్ ధర కేంద్రానికి రూ.150, రాష్ట్ర ప్రభుత్వాలకు 400 రూపాయలు, ప్రయివేట్ ఆస్పత్రులకు 600 రూపాయలుగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ ధరల్లో వ్యత్యాసంపై విపక్షాలు విరుచుకుపడ్డాయి. ఒకే దేశం, ఒకే పార్టీ నినాదం ఎత్తుకున్న బీజేపీ.. టీకా ధరల్లో ఎందుకంత వివక్ష చూపుతోందని ఎదురుదాడి చేశాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ ప్రకటన చేసింది. వ్యాక్సిన్, ఆక్సిజన్ దాని సంబంధిత పరికరాలపై పన్ను మాఫీ దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఈ సారి ఆక్సిజన్ వినియోగం భారీగా పెరగడంతో దేశవ్యాప్తంగా పలు ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌కు తీవ్ర కొరత ఏర్పడింది. ఈ పరిస్థితులపై ఢిల్లీ హైకోర్లు, దేశ అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రానున్న మూడు నెలల పాటు కోవిడ్ వ్యాక్సిన్ల దిగుమతిపై కస్టమ్స్ డ్యూటీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అలానే ఆక్సిజన్ తయారు చేసే పరికరాలపై కస్టమ్స్ డ్యూటీ, హెల్త్ సెస్‌ను మాఫీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. కోవిడ్ కేసులు పెరుగుతుండటం.. ఆక్సిజన్ కొరతపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో.. ఆక్సిజన్ సరఫరాను మెరుగు పర్చడం కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆక్సిజన్, దాని సంబంధిత పరికరాలు, కోవిడ్ వ్యాక్సిన్లపై కస్టమ్స్ పన్ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు మోదీ ట్వీట్ చేశారు. At the high-level meeting, key decisions of waiving customs duty on oxygen and oxygen related equipment & COVID-19 vaccines were taken. https://t.co/TgorIafqw6 — Narendra Modi (@narendramodi) April 24, 2021 చదవండి: కరోనా సెకండ్‌వేవ్: ప్రజలకు కేంద్రం తీపికబురు! -
అలాంటి వారిని ఉరి తీస్తాం: హైకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది. రోజువారీగా నమోదవుతున్న కేసులు మూడు లక్షలకు పైగానే ఉంటున్నాయి. ఫస్ట్ వేవ్‌తో పోలిస్తే.. ఈ సారి ఆక్సిజన్ వినియోగం అత్యధికంగా ఉంది. చాలా ఆస్పత్రుల్లో ఆక్సిజన్ నిల్వలు దగ్గరపడుతుండటంతో కొత్త వారిని చేర్చుకోవడం లేదు. ఇక ఢిల్లీ, రాజస్తాన్ వంటి చోట్ల ఆక్సిజన్ కొరతతో పలువురు ప్రాణాలు వదిలిన సంగతి తెలిసిందే. పరిస్థితి విషమిస్తుండటంతో ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆక్సిజన్ సప్లైని అడ్డుకునే వారిని ఉరి తీస్తామని హెచ్చరించింది. ఆక్సిజన్ కొరతపై రాష్ట్రంలోని మహారాజ అగ్రసేన్ ఆస్పత్రి దాఖలు చేసిన పిటిషన్‌పై విపిన్ సంఘి, రేఖ పల్లి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ క్రమంలో ఆక్సిజన్ సరఫరా అడ్డుకునే వారికి సంబంధించి ప్రభుత్వం ఎవరిమీద అయినా తమకు ఫిర్యాదు చేస్తే.. కోర్టు సదరు వ్యక్తిని తప్పక ఉరి తీస్తుంది అని తెలిపింది. ప్రజల ప్రాణాలకు సంబంధించిన ఈ విషయంలో ఎంత పెద్ద అధికారి అయినా సరే.. తప్పు చేస్తే వారికి శిక్ష తప్పదని కోర్టు హెచ్చరించింది. అంతేకాక ఇలాంటి అధికారుల గురించి కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా కోర్టు ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్రం వారి వారి మీద తగిన చర్యలు తీసుకుంటుందని కోర్టు వెల్లడించింది. చదవండి: వ్యవస్థ ఇలా నాశనమవుతోంది: సుప్రీంకోర్టు -
కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు
-
ఆక్సిజన్ కొరతతో అల్లాడుతున్న ఢిల్లీ ఆస్పత్రులు
-
వ్యవస్థ ఇలా నాశనమవుతోంది: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: కోవిడ్–19పై జాతీయవిధానం రూపొందించేందుకు సుమోటోగా తీసుకున్న కేసుపై కొందరు లాయర్లు విమర్శలకు దిగడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వ్యవస్థ ఇలా నాశనమవుతోందంటూ వ్యాఖ్యానించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం బార్ అసోసియేషన్‌లోని కొందరు సీనియర్ సభ్యుల తీరుపై విచారం వ్యక్తం చేసింది. ‘మా ఉత్తర్వులను మీరు చదివారు. కోవిడ్ సంబంధిత కేసులన్నిటినీ ట్రాన్స్ఫర్ చేసుకునే ఉద్దేశం అందులో మీకు కనిపించిందా? ఆదేశాలను చూడకుండానే, అందులో లేని విషయాలపై విమర్శలకు దిగారు. ఈ వ్యవస్థ ఇలా నాశనమవుతోంది’అంటూ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వికాస్ సింగ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. కోవిడ్ సంబంధిత కేసుల విచారణ చేపట్టకుండా హైకోర్టులను తామెన్నడూ అడ్డుకోలేదని పేర్కొంది. అలాగే, జస్టిస్ బాబ్డేకు స్కూల్, కాలేజీ డేస్ స్నేహితులనే ముద్రను తనపై తొలగించుకునేందుకు ఈ కేసులో అమికస్ క్యూరీ బాధ్యతల నుంచి తప్పుకునే అవకాశం కల్పించాలన్న సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వినతిని ధర్మాసనం ఆమోదించింది. కోవిడ్‌పై జాతీయ విధానం రూపొందించే విషయం లో కేంద్రం సమాధానం కోరుతూ ధర్మాసనం తదు పరి విచారణను 27వ తేదీకి వాయిదా వేసింది. వేదాంత నుంచి ఆక్సిజన్ ఉత్పత్తి చేయండి ప్రస్తుతం దేశంలో ఆక్సిజన్ అవసరం చాలా ఉందని, అందువల్ల తమిళనాడులోని వేదాంత స్టెర్లైట్ యూనిట్ నుంచి ఆక్సిజన్ ఉత్పత్తి చేయాలంటూ సుప్రీంకోర్టు తమిళనాడును కోరింది. ఆ యూనిట్ 2018 నుంచి మూతబడి ఉంది. అధిక వ్యర్థాలను విడుదల చేస్తోందన్న కారణంతో దాన్ని మూసేశారు. అయితే దాన్ని ప్రభుత్వం అదుపులోకి తీసుకొని అయినా ఆక్సిజన్ ఉత్పత్తి చేయాలని సూచించింది. ఈ కేసు వాదనలో పాల్గొన్న వేదాంత కంపెనీ సైతం.. తమ ప్లాంట్ తెరిస్తే వేలాది టన్నులను ఉచితంగా ఉత్పత్తి చేస్తామని ప్రకటించింది. అయితే ప్లాంట్ కారణంగా స్థానికంగా శాంతి భద్రతల సమస్య లు తలెత్తే సమస్య ఉందని ప్రభుత్వం వాదించింది. దీనిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ.. ‘ఆ ప్లాంట్‌ను ఎవరు నడిపిస్తారన్నది మాకు అనవసరం. కానీ దాని నుంచి ఆక్సిజన్ మాత్రమే కావాలి. దేశ ప్రజలకు ఇది అత్యవసరం’ అని వ్యాఖ్యానించింది. కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ( చదవండి: సుప్రీంకు అమెజాన్–ఫ్యూచర్ వివాదం ) -
ఆక్సిజన్ కోసం సీ-17 ఎయిర్‌క్రాఫ్ట్ ఒడిశాకు పంపిన తెలంగాణ ప్రభుత్వం
-
కరోనాపై అనవసర భయమొద్దు
సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్‌పై మరీ భయాందోళన పడాల్సిన అవసరం లేదని, 85% మందికి ఇంట్లోనే నయమైపోతుందని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా స్పష్టం చేశారు. అనవసరంగా రెమిడెసివిర్ వంటి మందులు, ఆక్సిజన్‌ను వినియోగించి కొరతకు కారణం కావొద్దని సూచించారు. బుధవారం ఆయన నారాయణ హెల్త్ చైర్మన్ డాక్టర్ దేవిశెట్టి, మేదాంత చైర్మన్ నరేశ్ ట్రెహాన్‌తో కలిసి ఓ వీడియో చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గులేరియా పలు అంశాలను వివరించారు. ఆయా అంశాలు రణ్‌దీప్ గులేరియా మాటల్లోనే.. ‘‘కోవిడ్ మహమ్మారి ప్రస్తుత స్థితిని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనకు తగినంత డేటా ఉంది. కోవిడ్ బాధితుల్లో 85 శాతం మంది ఎలాంటి ప్రత్యేక చికిత్స.. అంటే రెమిడెసివిర్ లేదా స్టెరాయిడ్స్, ఇతర డ్రగ్స్ లేకుండానే కోలుకున్నారు. సాధారణ జలుబు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, గ్యాస్ట్రిక్ ఇబ్బందులు వంటి లక్షణాలు ఉంటాయి. వాటిని బట్టి సాధారణ చికిత్స తీసుకుంటే.. ఐదు నుంచి ఏడు రోజుల్లో కోలుకుంటారు. అనవసరంగా ఆస్పత్రులకు పరుగెత్తడం ద్వారా.. బెడ్ అవసరమైన మరొకరికి అన్యాయం చేసినట్టు అవుతుంది. మరో 15 శాతం మందికి వ్యాధి తీవ్రత కొద్దిగా ఎక్కువగా ఉండొచ్చు. అంటే ఆక్సిజన్ సాచురేషన్ స్థాయి తగ్గడం, హైగ్రేడ్ ఫీవర్ వంటివి రావొచ్చు. మరీ తీవ్రత పెరిగితేనే రెమిడెసివిర్, స్టెరాయిడ్స్, యాంటీ కాగ్నెంట్స్ అవసరమవుతాయి. కొన్ని సందర్భాల్లో కన్వల్జెంట్ ప్లాస్మా ఇవ్వొచ్చు. ముఖ్యమైన విషయం ఏమిటంటే.. అనవసరంగా భయాందోళనకు గురవ్వొద్దు. రెమిడెసివిర్ వంటివి అతికొద్ది మందికి మాత్రమే అవసరం పడుతుంది. అసలు రెమిడెసివిర్ ప్రాణాలు కాపాడినట్టు, ప్రాణ నష్టం తగ్గించినట్టుగా డేటా ఏమీ లేదు. దీనిని ఒక మ్యాజిక్ బుల్లెట్‌గా పరిగణనలోకి తీసుకోవద్దు. అనవసరంగా ఆక్సిజన్ వాడొద్దు ఊపిరితిత్తులకు సంబంధించి న్యుమోనియా, క్రానిక్ లంగ్ డిసీజ్ ఉన్నప్పుడు, ఆక్సిజన్ లెవల్స్ తగ్గినప్పుడు మాత్రమే ఆక్సిజన్ ఇవ్వాల్సి వస్తుంది. కొన్నిసార్లు స్వల్ప సమయం, కొన్నిసార్లు ఎక్కువ సమయం ఇవ్వాల్సి వస్తుంది. కానీ అనవసరంగా ఆక్సిజన్ తీసుకోవడం వృథా. ఆక్సిజన్ లెవల్స్ బాగానే ఉండి కూడా.. ఓ అరగంటో, గంటపాటో ఆక్సిజన్ తీసుకుంటే ఇంకా బాగుంటామని భావించడం సరికాదు. అది ఆరోగ్యానికి సాయపడుతుందనే డేటా ఏదీ ఇప్పటివరకు లేదు. చాలా మంది పేషెంట్లు ఇండ్లలో ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకుని.. రోజూ అరగంట, గంట, రెండు గంటలపాటు తీసుకుంటున్నారు. అలా చేస్తే వాస్తవంగా అవసరమైన వారికి ఆక్సిజన్ అందుబాటులో లేకుండా చేసిన వారవుతారు. సాచురేషన్ స్థాయిలో గమనించాల్సిందేంటి? రక్తంలో ఆక్సిజన్ సరఫరా అయ్యే లెవల్స్‌ను ఆక్సిజన్ సాచురేషన్ అంటాం. ఇది కచ్చితంగా 98, 99 శాతం ఉండాల్సిన పనిలేదు. 92 నుంచి 98 మధ్య స్థిరంగా ఉన్నా ఫర్వాలేదు. సాచురేషన్ 95పైన ఉంటే ఆక్సిజన్ అవసరం లేదు. 94 కంటే తక్కువగా ఉన్నప్పుడు కాస్త పరిశీలన పెట్టాలి. ఆరోగ్యవంతుల్లో అప్పటికీ ఆక్సిజన్ అవసరం రాకపోవచ్చు. గుండె, ఊపిరితిత్తుల జబ్బులున్న వారికి మాత్రమే ఆక్సిజన్ అవసరం రావొచ్చు. 90-92 మధ్య ఉంటే డాక్టర్‌ను సంప్రదించాలి. అంతేతప్ప ఆక్సిజన్ సాచురేషన్ 97- 98 శాతం ఉండాలన్న కంగారు పనికిరాదు. ఆక్సిజన్ అయినా, రెమిడెసివిర్ అయినా అవసరం ఉన్నవారికి అందేలా అందరూ సహకరించాలి. వాక్సిన్ వేయించుకున్నా కోవిడ్ వస్తుంది వాక్సిన్ వేసుకున్నాక కూడా కోవిడ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. వాక్సినేషన్ అనారోగ్యం నుంచి కాపాడుతుందే తప్ప ఇన్ఫెక్షన్ నుంచి కాదు. అంటే.. వాక్సినేషన్ చేయించుకున్న తర్వాత కూడా కోవిడ్ సోకవచ్చు. మన ద్వారా ఇంకొకరికి వ్యాపించవచ్చు. కానీ మనం తీవ్ర అనారోగ్యం బారిన పడకుండా రక్షణ ఉంటుంది. వాక్సిన్‌తో శరీరంలో యాంటీ బాడీలు ఉత్పత్తి అయి రక్షణ లభిస్తుంది. అందువల్ల వాక్సిన్ తీసుకున్నా కూడా.. కరోనా మీకు సోకకుండా, మీ నుంచి మరొకరికి వ్యాపించకుండా మాస్క్, భౌతిక దూరం వంటివి తప్పనిసరిగా పాటించాలి. మున్ముందు అసలు కోవిడ్ సోకకుండా ఉండే వాక్సిన్ రావొచ్చు. జాగ్రత్తపడటమే మేలు వైరస్ వ్యాప్తి చైన్‌ను తెంపడం ద్వారా విస్తృతిని తగ్గించవచ్చు. మాస్క్‌ను సరైన రీతిలో ధరించడం, భౌతిక దూరం, తరచుగా చేతులు కడుక్కోవడం వంటివి చేయాలి. వెంటిలేషన్ సరిగ్గా ఉన్న గదుల్లో ఉండాలి. సమూహాలకు దూరంగా ఉండాలి. స్నేహితులు, బంధువులే కదా. ఏమీ కాదనుకోవద్దు. లక్షణాలు లేకుండా ఉన్న పాజిటివ్ వ్యక్తులు మనచుట్టూ ఉండొచ్చు. అందువల్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి’ -
ఆక్సిజన్ అందక.. ఊపిరి ఆగింది!
సాక్షి, చిలకలగూడ: ఆక్సిజన్ అందక మహిళ మృతి చెందింది. ఆరు ఆస్పత్రులు తిరిగినా ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడంతో అంబులెన్స్‌లోనే తుది శ్వాస విడిచింది. ఈ ఘటన సికింద్రాబాద్ సీతాఫల్మండిలో జరిగింది. సీతాఫల్మండి బ్రాహ్మణబస్తీకి చెందిన శేషాచార్యులు, పుష్పవల్లి దంపతులకు ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు. మూడో కుమార్తె అనితకుమారి (48) భర్త వేణుగోపాల్‌తో కలసి బెంగళూర్‌లో నివసిస్తున్నారు. అనితకుమారి స్వల్ప అస్వస్థతకు గురికావడంతో కరోనా నిర్ధారణ పరీక్ష చేయించగా నెగెటివ్ వచ్చింది. ఈనెల 21న కారులో బెంగళూర్ నుంచి తల్లి గారింటికి వచ్చింది. 22 సాయంత్రం శ్వాస తీసుకోవడంలో సమస్య తలెత్తడంతో అంబులెన్స్‌లో ఆస్పత్రికి బయల్దేరారు. కమల ఆస్పత్రి, యశోద, ఓమ్ని, గ్లోబల్, నక్షత్ర ఆస్పత్రులకు వెళ్లగా, ఆక్సిజన్ కొరత ఉందని, పడకలు ఖాళీ లేవని అడ్మిట్ చేసుకోలేదు. ఎల్బీనగర్ సమీపంలోని ఓజోన్ ఆస్పత్రిలో ఆక్సిజన్, బెడ్లు అందుబాటులో ఉన్నాయని తెలుసుకుని అక్కడికి చేరుకున్నారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు అప్పటికే అనితకుమారి మృతి చెందినట్లు ధ్రువీకరించారు. వారం రోజుల క్రితమే సోదరి మృతి... అనితకుమారి సోదరి కల్యాణి (51) వారం రోజుల కింద ఇలాగే మృతి చెందడం గమనార్హం. మియాపూర్‌లో నివసిస్తున్న కల్యాణి ఈనెల 16న స్వల్ప అస్వస్థతకు గురైంది. కరోనా టెస్ట్‌లో నెగెటివ్ వచ్చింది. సాయంత్రం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడింది. పలు ఆస్పత్రులకు తిరిగినా బెడ్లు ఖాళీ లేవని చెప్పడంతో తిరిగి ఇంటికి తీసుకువెళ్లారు. అదే రోజు రాత్రి కల్యాణి మృతి చెందింది. వారం రోజుల వ్యవధిలో అక్కాచెల్లెళ్లు మృతి చెందడంతో బ్రాహ్మణబస్తీలో విషాదఛాయలు అలుముకున్నాయి. వీరి ఇద్దరి మృతికి ప్రభుత్వ వైఫల్యాలే కారణమని మృతుల సోదరులు విజయసారథి, వేణుగోపాల్ ఆరోపించారు. -
రూపాయికే ఆక్సిజన్ సిలిండర్.. ఎక్కడంటే
లక్నో: కోవిడ్ మహమ్మారి దేశాన్ని కకావికలం చేస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. దాంతో ఆస్పత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్ కొరత ఏర్పడుతోంది. ప్రాణవాయువు నిల్వలు అయిపోవడంతో ఢిల్లీలోని ఓ వ్రైవేట్ ఆస్పత్రిలో 24 గంటల వ్యవధిలో 25 మంది కోవిడ్ రోగులు కన్నుమూసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశంలో ఆక్సిజన్‌కు భారీ ఎత్తున డిమాండ్ ఏర్పడింది. దాంతో అక్రమార్కులు బ్లాక్‌లో ఆక్సిజన్ సిలిండర్లను అధిక ధరలకు విక్రయిస్తూ భారీగా లాభాలు ఆర్జిస్తున్నారు. ఇంత ధర చెల్లించలేని వారు ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యాపారి పెద్ద మనసుతో ముందుకొచ్చాడు. కేవలం ఒక్క రూపాయికే ఆక్సిజన్ సిలిండర్‌ని రిఫిల్ చేస్తున్నాడు. ఆ వివరాలు.. యూపీకి చెందిన వ్యాపారవేత్త మనోజ్ గుప్తా.. హమీర్పూర్ జిల్లాలోని సుమెర్పూర్ ఇండస్ట్రియల్ ఏరియాలో రిమ్జిమ్ ఇస్పాత్ ఫ్యాక్టరీ నడుపుతున్నాడు. ఈ క్రమంలో కరోనా వైరస్ బాధితుల కోసం కేవలం రూపాయికే ఆక్సిజన్ సిలిండర్లు రిఫిల్ చేసి ఇస్తున్నాడు. ఇప్పటివరకు గుప్తా సుమారు వెయ్యికి పైగా ఆక్సిజన్ సిలిండర్లను రిఫిల్ చేశారు. వందకు పైగా కోవిడ్ బాధితుల ప్రాణాలు కాపాడాడు. ఈ సందర్భంగా గుప్తా మాట్లాడుతూ.. ‘‘2020లో నేను కోవిడ్ బారిన పడ్డాను. అప్పుడు నేను కూడా ఆక్సిజన్ సమస్య ఎదుర్కొన్నాను. నా బాటిల్ ప్లాంట్‌కు రోజుకు వెయ్యి ఆక్సిజన్ సిలిండర్లను రిఫిల్ చేసే సామర్థ్యం ఉంది. దాంతో ఆక్సిజన్ కావాల్సిన సామాన్యుల కోసం ఇలా ఒక్క రూపాయికే సిలిండర్ రిఫిల్ చేసి ఇస్తున్నాను. ఇందుకుగాను హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న బాధితుల కుటుంబికులు ఆర్టీ-పీసీఆర్ రిపోర్ట్, డాక్టర్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు చూపిస్తే.. వారికి ఒక్క రూపాయికే సిలిండర్ అందిస్తున్నాను’’ అని తెలిపాడు. ఈ సమాచారం తెలియగానే ఝాన్సీ, బందా, లలిత్పూర్, కాన్పూర్, ఓరాయ్ తదితర జిల్లాల నుంచి కూడా కరోనా బాధితుల కుటుంబికులు గుప్తా ప్లాంట్ వద్ద క్యూ కడుతున్నారు. ఇక మనోజ్ గుప్తాపై నెటిజనుల ప్రశంసలు కురిపిస్తున్నారు. చదవండి: కోవిడ్ బాధితులకు ఆహారం ఫ్రీ.. ఎక్కడంటే.. -
ఎన్నికల ర్యాలీలకు అనుమతివ్వడమేంటి?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా భారీగా కరోనా కేసులు నమోదవుతున్నా, పెద్ద సంఖ్యలో రోగులు చనిపోతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోం దని హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో వందల మందితో ఎన్నికల ప్రచార ర్యాలీలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వడం ఏమిటని ప్రశ్నిం చింది. కోవిడ్ ఆంక్షలను తప్పనిసరిగా పాటించాలన్న కేంద్రం, ఐసీఎంఆర్ ఆదేశాలకు ఎన్నికల ర్యాలీలు అతీతమా అని నిలదీసింది. ఎన్నికల ర్యాలీల కట్టడికి వెంటనే చర్యలు తీసుకోవాలని.. పబ్బులు, బార్లు, క్లబ్స్, ఫంక్షన్ హాల్స్, సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్ వంటి జనం గుమిగూడే చోట్ల 50 శాతం కన్నా తక్కువ ఆక్యుపెన్సీనే అనుమతించాలని ఆదేశించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, గతంలో, ప్రస్తుతం తాము ఇచ్చిన ఆదేశాల అమలుపై పూర్తి వివరాలతో సోమవారం (27వ తేదీ)నాటికి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. కరోనా నియంత్రణకు తగిన చర్యలు తీసుకునేలా రాష్ట్ర సర్కారును ఆదేశించాలంటూ దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాలను ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా వైద్యారోగ్య శాఖ కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ, ప్రజారోగ్య విభాగం డైరెక్టర్ శ్రీనివాసరావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్, న్యాయవాదులు వసుధా నాగరాజ్, చిక్కుడు ప్రభాకర్, సి.నరేశ్‌రెడ్డి, జి.పూజిత, కె.పవన్‌కుమార్, ఎం.రంగయ్య తదితరులు పలు సూచనలు చేశారు. వాటిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వానికి పలు ఉత్తర్వులు జారీచేసింది. మృతుల లెక్కలపై అనుమానాలు రాష్ట్రంలో కరోనా మృతుల లెక్కలపై ధర్మాసనం అనుమానాలు వ్యక్తం చేసింది. ‘‘ఏప్రిల్ 1 నుంచి 21వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 199 మంది చనిపోయారని, అందులో హైదరాబాద్ వారు 64 మంది ఉన్నారని నివేదికలో పేర్కొన్నారు. ఈ లెక్కలపై అనుమానాలున్నాయి. మృతదేహాలను వారి సంప్రదాయాలకు విరుద్ధంగా మూకుమ్మడిగా దహనం చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఎందరు కరోనా బాధితుల మృతదేహాలను ఖననం చేస్తున్నారన్న వివరాలు స్మశానాల వద్ద కనిపించేలా ఏర్పాటు చేయండి’’ అని ఆదేశించింది. ఆక్సిజన్, రెమిడెసివిర్పై స్పష్టత ఇవ్వండి కరోనా రోగులకు అవసరమైన ఆక్సిజన్ విషయంగా అధికారులు చెప్తున్న మాటలు వేర్వేరుగా ఉన్నాయని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘ఆక్సిజన్ నిల్వలు తక్కువగా ఉన్నాయని ఆరోగ్య మంత్రి మీడియాతో చెప్పారు. 350 టన్నుల ఆక్సిజన్ కావాల్సి ఉండగా.. 200 టన్నులు మాత్రమే వస్తోందన్నారు. వైద్యారోగ్య శాఖ కార్యదర్శి హైకోర్టుకు ఇచ్చిన నివేదికలో మాత్రం ఆక్సిజన్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని అంటున్నారు. ఈ లెక్కలపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి..’’ అని ఆదేశించింది. కరోనా రోగులకు ప్రాణాధారమైన రెమిడెసివిర్ ఇంజక్షన్స్‌ను తెలంగాణలోనే తయారు చేస్తున్నా ఇక్కడి రోగులకు అందని పరిస్థితి ఏర్పడిందని ధర్మాసనం పేర్కొంది. ఏ ప్రభుత్వ ఆస్పత్రిలో కూడా ఈ ఇంజక్షన్ అందుబాటులో లేదని, తాము ప్రయత్నించినా దొరికే పరిస్థితి లేదని వ్యాఖ్యానించింది. ఇక్కడి ప్రజల అవసరాల తర్వాతే ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయాలని పేర్కొంది. అసలు రాష్ట్రానికి ఎంత ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు, రెమిడెసివిర్ ఇంజక్షన్స్‌ను ఏ మేరకు కేటాయిస్తున్నారో నివేదిక సమర్పించాలని ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది. సాధారణ బెడ్స్‌ను ఆక్సిజన్ బెడ్స్‌గా మార్చాలి గాంధీ ఆస్పత్రిలో 650 సాధారణ బెడ్స్ ఖాళీగా ఉన్నాయని ఆరోగ్య శాఖ నివేదికలో పేర్కొందని.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వాటిని ఆక్సిజన్ బెడ్స్‌గా మార్చేందుకు చర్యలు తీసుకోవాలని ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ‘‘అనాధలు, వృద్ధులు, వికలాంగులు, అంధుల వసతి గృహాల్లో ఉన్న వారికి వెంటనే వ్యాక్సిన్ ఇచ్చే ఏర్పాట్లు చేయాలి. లాక్డౌన్ పెడతారనే భయంతో కార్మికులు స్వస్థలాలకు వెళ్లిపోతున్నారు. వారికి భరోసా ఇవ్వండి. నివాసం లేని వారికోసం నైట్ షెల్టర్స్ ఏర్పాటు చేసి భోజన సౌకర్యం కల్పించండి..’’ అని ధర్మాసనం సూచించింది. ఈ సందర్భంగా పలు అంశాలపై పూర్తి వివరాలు అందజేయాలని ఆదేశించింది. ‘108, 104 కాల్ సెంటర్స్‌కు రోజూ ఎన్ని కాల్స్ వస్తున్నాయి, ఎందరు రోగులను 108 అంబులెన్స్‌ల ద్వారా ఆస్పత్రిలో చేరుస్తున్నారు, కంటైన్మెంట్ జోన్లలో కరోనా రోగులు తిరగకుండా ఏం చర్యలు తీసుకున్నారు, కుంభమేళా నుంచి వచ్చిన యాత్రికులను హోం క్వారంటైన్ చేసేలా ఏం చర్యలు తీసుకున్నారు, స్వల్ప లక్షణాలున్న వారిని కోవిడ్ కేర్ సెంటర్లలో చేర్చే దిశగా తీసుకున్న చర్యలు ఏమిటి?’..తదితర వివరాలు సమర్పించాలని ఆదేశించింది. విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది. ‘ఆర్టీపీసీఆర్’ రిపోర్టు లేకున్నా చేర్చుకోవాలి ఆర్టీపీసీఆర్ పరీక్ష రిపోర్టు ఉంటేనే కొన్ని ఆస్పత్రుల్లో రోగులను చేర్చుకుంటున్నారని, లేని వారిని చేర్చుకోకుండా నిరీక్షించేలా చేస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని హైకోర్టు పేర్కొంది. ‘‘ఆర్టీపీసీఆర్ రిపోర్టు లేకున్నా కరోనా లక్షణాలతో వచ్చే రోగులను వెంటనే చేర్చుకోవాలని ప్రభు త్వ, ప్రైవేటు ఆస్పత్రులను ఆదేశిస్తున్నాం. వ్యాక్సినేషన్ నిర్వహణ కోసం, ఆస్పత్రుల్లో మందుల సరఫరాకు అంత రాయం లేకుండా, రోగులకు సాయం చేసేందుకు వీలుగా ప్రభు త్వం అన్ని జిల్లాల్లో 24 గంటల్లోగా నోడల్ ఆఫీ సర్లను నియమించి కేంద్రానికి తెలియజేయాలి. అడ్వైజరీ కమిటీ ఏర్పాటు దిశగా ఏం చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలోని ఎక్స్పర్ట్ కమిటీ ఎన్ని పర్యాయా లు సమావేశమైంది? కరోనా కేసుల నియంత్రణ దిశగా ఏం చర్యలు తీసుకుంది? తెలియజేయాలి. రోజూ 40 వేలదాకా ఆర్టీపీసీ ఆర్ పరీక్ష లు చేసే సామర్ధ్యం రాష్ట్రంలో ల్యాబ్స్‌కు ఉన్నా.. 20 రోజుల్లో 3.47 లక్షల పరీక్షలే చేశా రు. ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్యను గణనీయం గా పెంచాలి’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. -
ప్రాణవాయువు పంపిస్తాన్న హీరోయిన్.. నెటిజన్స్ ట్రోల్స్
దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా రోజుకి మూడు లక్షలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. వేలాది మంది మృత్యువాత పడుతున్నారు. కేసుల సంఖ్య పెరగడంతో పలు ఆస్పత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్ సిలిండర్లు దొరకడం లేదు. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ, ముంబైల్లో కరోనా ధాటికి జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇలాంటి కష్ట సమయంలో సాయం చేయడానికి పలువు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. తాజాగా మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ సీనియర్ నటి సుస్మితాసేన్ కరోనా రోగులకు సాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఢిల్లీలోని శాంతి ముకుంద్ ఆసుపత్రికి ఆక్సిజన్ సిలిండర్లు అందజేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ ట్వీట్ చేసింది. ఇటీవపల ఢిల్లీలోని శాంతి ముకుంద్ ఆసుపత్రి సీఈఓ సునీల్ సాగర్ ఓ ఇంటర్వ్యూలో ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత ఎక్కువగా ఉందని చెప్పారు. ఆ వీడియో చూసిన సుస్మితా.. ‘హృదయ విదారకమైన పరిస్థితి ఇది. దేశంలో ఎక్కడ చూసినా ఆక్సిజన్ కొరత ఉంది. ఈ ఆస్పత్రికి కొన్ని ఆక్సిజన్ సిలీండర్లను నేను అందించగలను. కానీ ముంబయి నుంచి ఢిల్లీకి వాటిని ఎలా పంపించాలో అర్థం కావడం లేదు. దయచేసి వాటి రవాణాలో నాకు కొంచెం సాయం చేయగలరు’ అని ట్వీట్ చేశారు. కాగా, సుస్మిత సేన్ సాయాన్ని కూడా ఓ నెటిజన్ అవహేళన చేశాడు. ‘దేశమంతా ఆక్సిజన్ కొరత ఉన్నప్పుడు ముంబైలో కాకుండా ఢిల్లీలోని ఆస్పత్రులకు మాత్రమే ఎందుకు సాయం చేస్తున్నారు’అని ప్రశ్నించారు. దీంతో అసహనానికి గురైన సుస్మితా.. ఆ నెటిజన్‌కు ఘాటు రిప్లై ఇచ్చింది. ‘ఢిల్లీకి ఎందుకు సాయం చేస్తున్నానంటే.. ముంబైలో ఆక్సిజన్ కొరత పెద్దగా లేదు. ప్రస్తుతం ఢిల్లీలోని ఎన్నో ఆస్పత్రులకు ఆక్సిజన్ సిలీండర్ల కొరత ఏర్పడింది. ముఖ్యంగా చిన్న చిన్న ఆస్పత్రులకు ప్రాణవాయువు సిలిండర్లు లభించడంలేదు. అందుకే సాయం చేస్తున్నా. వీలైతే మీరు సాయం చేయండి’అని ఘాటైన సమాధానం ఇచ్చింది. This is deeply heart breaking...oxygen crisis is everywhere. I have managed to organise a few oxygen cylinders for this hospital but have no way to transport it to Delhi from Mumbai...please help me find a way🙏 https://t.co/p8RWuVQMrO — sushmita sen (@thesushmitasen) April 22, 2021 చదవండి: మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్‌కు కోవిడ్ ఎలా సోకిందంటే.. -
ఆక్సిజన్ కొరత: ప్రోనింగ్ చేయమంటున్న కేంద్రం
న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోతుంది. కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్యకు అనుగుణంగా ఆస్పత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ నిల్వలు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత వారం రోజులుగా దేశవ్యాప్తంగా చాలా ఆస్పత్రుల్లో ఆక్సిజన్ నిల్వలు అయిపోవడటంతో కోవిడ్ రోగులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఇలాంటి సమయంలో కోవిడ్ పేషెంట్లకు కేంద్ర ఆరోగ్య శాఖ కొన్ని సూచనలు జారీ చేసింది. శ్వాసను మెరుగుపరుచుకోవడానికి, ఆక్సిజనేషన్ కోసం ప్రోనింగ్ చేయమని సలహా ఇచ్చింది. ముఖ్యంగా స్వల్ప లక్షణాలతో ఇంట్లోనే చికిత్స పొందుతూ.. శ్వాస సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ఇది చాలా ఉపయోగపడుతుందని ఆరోగ్య శాఖ తెలిపింది. ఏంటి ప్రోనింగ్... ప్రోనింగ్ అనే ప్రక్రియ వల్ల సౌకర్యంగా శ్వాస తీసుకోవడం, ఆక్సిజనేషన్ని మెరుగుపరుస్తుందని మెడికల్‌గా నిరూపితమైనట్లు కేంద్రం తెలిపింది. ఇక ఉదరభాగంపై బరువు వేసి బోర్లా పడుకోవడమే ఈ టెక్నిక్. దీనినే ప్రోనింగ్ పొజిషన్ అంటారు. ఇది వెంటిలేషన్‌ను మెరుగుపరుస్తుంది. రక్తంలో ఆక్సిజన్ లెవల్ 94 శాతం కంటే దిగువకు పడిపోయినప్పుడే ఈ పని చేయాలని ఆరోగ్య శాఖ సూచించింది. హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న వాళ్లు ఎప్పటికప్పుడు ఆక్సిజన్ లెవల్స్‌ను పరిశీలిస్తుండటం, ఉష్ణోగ్రత, రక్తంలో చక్కెర స్థాయిలను చూసుకుంటూ ఉండాలని స్పష్టం చేసింది. సరైన సమయంలో ప్రోనింగ్ చేస్తే ఎన్నో ప్రాణాలు నిలుపుకోవచ్చని కూడా తెలిపింది. #Unite2FightCorona Proning as an aid to help you breathe better during #COVID19 pic.twitter.com/FCr59v1AST — Ministry of Health (@MoHFW_INDIA) April 22, 2021 ఎలా చేయాలో వివరించింది.. ప్రోనింగ్ ఎలా చేయాలో కూడా చెబుతూ.. వాటిని వివరించే కొన్ని ఫోటోలను కేంద్రం ట్వీట్ చేసింది. ప్రోనింగ్ చేయడానికి మొత్తం ఐదు తలగడలు అవసరం అవుతాయి. వీటిలో ఒకదాన్ని (తలగడ) మెడ కింద, మరొకటి లేదా రెండు ఛాతీ నుంచి తొడల వరకు, మరో రెండు మోకాళ్ల కింద పెట్టుకోవాలని సూచించింది. అంతేకాక ఈ ప్రక్రియలో రోగిని సాధారణ బెడ్, చదరంగా ఉన్న షీట్ మీద పడుకోబెట్టాలని వెల్లడించింది. దూరంగా ఉండాల్సిన వారు... ఇక గర్భవతులు, గుండె సంబంధిత సమస్యలు ఉన్న వాళ్లు, వెన్నెముకకు గాయమైన వాళ్లు దీనికి దూరంగా ఉంటే మంచిదని కేంద్రం స్పష్టం చేసింది. భోజనం చేసిన తర్వాత కూడా ప్రోనింగ్ ప్రక్రియ చేయకూడదని తెలిపింది. చదవండి: ప్రాణం తీస్తున్న ‘ఆక్సిజన్’: 25 మంది మృతి -
ప్రాణం తీస్తున్న ‘ఆక్సిజన్’: 25 మంది మృతి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో నిండుకుంటున్న ఆక్సిజన్ నిల్వలు కోవిడ్ రోగులతో పాటు.. వారి కుటుంబసభ్యులను కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. దేశ రాజధానిలో పరిస్థితి మరీ భయంకరంగా ఉంది. ఢిల్లీలో ప్రసిద్ధి చెందిన సర్ గంగా రాం ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరతతో గడిచిన 24 గంటల్లో కోవిడ్‌తో తీవ్రంగా బాధపడుతున్న 25 మంది రోగులు మృతి చెందారని హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి. అంతేకాక ‘‘ఆస్పత్రిలో కేవలం మరో రెండు గంటలకు సరిపడా మాత్రమే ఆక్సిజన్ నిల్వలు ఉన్నాయి.. సుమారు 60 మంది రోగులు పరిస్థితి విషమంగా ఉంది. ఆక్సిజన్ అత్యవసరం’ అంటూ ఆస్పత్రి వర్గాలు ట్వీట్ చేశాయి. అంతేకాక ఢిల్లీ ప్రభుత్వానికి ఎస్ఓఎస్ పంపాయి. ఒకే రోజు 25 మంది మరణించడం ఆస్పత్రి చరిత్రలో ఇదే ప్రథమం అని యాజమాన్యం వెల్లడించింది. సర్ గంగా రాం హాస్పిటల్ యాజమాన్యం ఎస్ఓఎస్ పంపిన 2 గంటల వ్యవధిలో ఆక్సిజన్ ట్యాంకర్ ఆస్పత్రి వద్దకు చేరుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ ట్విట్టర్లో షేర్ చేసింది. సర్ గంగా రాం ఆస్పత్రి ఢిల్లీలో ప్రసిద్ది చెందిన ప్రైవేట్ హాస్పిటల్. ఇక్కడ 500 మంది కంటే ఎక్కువ మంది కోవిడ్ రోగులు చికిత్స పొందుతున్నారు. వీరిలో 142 మందికి ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ అవసరం ఉన్నట్లు సమాచారం. 25 sickest patients have died in last 24 hrs at the hospital. Oxygen will last another 2 hrs. Ventilators & Bipap not working effectively. Need Oxygen to be airlifted urgently. Lives of another 60 sickest patients in peril: Director-Medical, Sir Ganga Ram Hospital, Delhi — ANI (@ANI) April 23, 2021 గత మూడు రోజులుగా పలు ఆస్పత్రులు ఆక్సిజన్, బెడ్ల కొరతతో ఇబ్బంది పడుతున్నాయి. దాంతో పలువురు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో కోర్టు ‘‘ముందు ఆడగండి.. లేదంటే అప్పుగా పొందండి.. అది కూడా కుదరకపోతే దొంగతనం చేయండి’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. కోవిడ్ రోగుల పరిస్థితి రోజురోజుకీ విషమిస్తుండడంతో ఆక్సిజన్ అవసరమూ ఎక్కువవుతోంది. మరోవైపు కరోనా తీవ్రత తర్వాత కేంద్రం ఆక్సిజన్ సరఫరాను స్వయంగా చేపట్టింది. నేరుగా దిగుమతి చేసుకునేందుకు వీల్లేకుండా ఆయా రాష్ట్రాల అవసరాల మేరకు కేటాయింపులు జరుపుతోంది. ఇందులో భాగంగా గురువారమే ఢిల్లీలోని ఆస్పత్రులకు కేంద్రం ఆక్సిజన్ సిలిండర్లు పంపింది. కానీ, ఆ నిల్వలు నేటితోనే పూర్తయ్యాయి. మరోవైపు హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్ తమకు స్థానికంగా అవసరాలున్నాయని తమ రాష్ట్రం నుంచి ఆక్సిజన్ ఇచ్చేది లేదని తేల్చిచెబుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఢిల్లీ ప్రభుత్వం ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. చదవండి: ఆక్సిజన్ ట్యాంకర్ మిస్సింగ్ కలకలం -
ఆక్సిజన్ ట్యాంకర్ మిస్సింగ్ కలకలం
హరియాణా: కరోనా విలయంతో దేశమంతా అతలాకుతలమవుతోంది. కరోనా వైరస్ కేసుల ఉధృతి నేపథ్యంలో పలు ఆసుపత్రులలో మెడికల్ ఆక్సిజన్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. అయితే తగినన్ని ఆక్సిజన్ సిలిండర్లు లేక రోగులు అల్లాడిపోతున్నారు. ఇది ఇలా ఉంటే ఆక్సిజన్ తీసుకెళతుఉన్న ట్యాంకర్ తప్పి పోవడం కలకలం రేపింది. హర్యానాలోని పానిపట్ నుండి సిర్సాకు ప్రయాణిస్తున్న లిక్విడ్ ఆక్సిజన్ తీసుకెళ్తున్న ట్యాంకర్ తప్పిపోయింది. దీనిపై హతాశులైన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పానిపట్ ప్లాంట్ నుండి ద్రవ ఆక్సిజన్‌తో నిండిన తరువాత, ట్రక్ సిర్సాకు బుధవారం బయలుదేరింది. కానీ నిర్దేశిక సమయానికి గమ్యస్థానానికి చేరుకోలేదు. ఈ విషయాన్ని స్థానిక పోలీసు అధికారి మంజీత్ సింగ్ ధృవీకరించారు. జిల్లా డ్రగ్ కంట్రోలర్ ఫిర్యాదుపై శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. కాగా మరో ఘటనలో హర్యానా మంత్రి అనిల్ విజ్ పానిపట్ నుండి ఫరీదాబాద్‌కు వెళుతున్న మెడికల్ ఆక్సిజన్ ట్యాంకర్‌ను ఢిల్లీ ప్రభుత్వం దోపిడీ చేసిందని బుధవారం ఆరోపించిన సంగతి విదితమే. చదవండి : కోవిడ్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం: 13 మంది మృతి షాకింగ్: గుండెపోటుతో పాపులర్ యాక్టర్ మృతి -
ఢిల్లీలో ఆక్సిజన్ ఎమర్జెన్సీ: అరవింద్ కేజ్రివాల్
-
మహారాష్ట్రకు 103 టన్నుల ఆక్సిజన్..
సాక్షి విశాఖపట్నం/తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): కోవిడ్ బాధితుల ప్రాణాలు నిలబెట్టే ఆక్సిజన్ నింపిన ట్యాంకర్లతో ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైలు గురువారం రాత్రి విశాఖపట్నం నుంచి మహారాష్ట్రకు బయలుదేరింది. 7 ట్యాంకర్లలో 103 టన్నుల ఆక్సిజన్‌ను పంపించారు. మహారాష్ట్ర నుంచి 7 ఖాళీ ట్యాంకర్లతో వచ్చిన ఈ రైలు గురువారం తెల్లవారుజామున 4 గంటలకు స్టీల్‌ప్లాంట్‌కు చేరింది. రైలుపై ఉన్న ట్యాంకర్లు రోడ్డు మార్గం ద్వారా ఆక్సిజన్ ప్లాంట్‌కు చేరుకున్నాయి. అప్పటికే మైనస్ 183 డిగ్రీల వద్ద నిల్వచేసిన లిక్విడ్ ఆక్సిజన్‌ను ట్యాంకర్లలో నింపే ప్రక్రియ ప్రారంభించారు. వాల్తేరు డీఆర్ఎం చేతన్‌కుమార్ శ్రీవాత్సవ, స్టీల్‌ప్లాంట్ సీఎండీ పీకే రథ్ పర్యవేక్షణలో 80 మందికి పైగా కార్మికులు, ఉద్యోగులు ట్యాంకర్లలో ఆక్సిజన్ నింపే పనులు పూర్తిచేశారు. ఆక్సిజన్ నింపిన తరువాత ట్యాంకర్లను మళ్లీ రైలుపైకి తీసుకెళ్లారు. ఈ ప్రక్రియ 18 గంటల్లో పూర్తయింది. రైలు పైకి ఎక్కించిన తరువాత ట్యాంకర్ల టైర్ల నుంచి గాలి తీసేశారు. రైలు వేగంగా వెళ్తున్నప్పుడు టైర్లలో గాలి ఉంటే కదిలే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్తగా గాలి తీసేశారు. రాత్రి 9.30 గంటలకు ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైలు విశాఖ స్టీల్‌ప్లాంట్ నుంచి మహారాష్ట్ర బయలుదేరింది. రైల్వేశాఖ గ్రీన్ చానల్ ఏర్పాటు చేసినందున ఈ రైలు త్వరితగతిన మహారాష్ట్ర చేరుకుంటుందని అధికారులు చెబుతున్నారు. చదవండి: కంప్యూటర్స్ చదివి.. మోసాలలో ఆరితేరి.. సంక్షేమ పథకాల మొత్తం లబ్ధిదారులకు ఇవ్వాల్సిందే.. -
8 ట్యాంకుల ద్వారా రాష్ట్రానికి ఆక్సిజన్ :ఈటల రాజేందర్
-
వెంటిలేటర్‌పై 30% యువకులే.. జాగ్రత్త
రోనా బారిన పడిన అందరికీ ఆక్సిజన్ అవసరం పడదు. కానీ అనేక మంది భయంతో అనవసరంగా వాడుతున్నారు. మా వద్దకు వచ్చే రోగుల్లో 30 శాతం మంది అవసరం లేకపోయినా ఆక్సిజన్ కోసం వస్తున్నారు. అందువల్లనే అవసరమైన వారికి కూడా ఆక్సిజన్ దొరకని పరిస్థితి. గాంధీలో వెంటిలేటర్‌పై ఉన్న వారిలో 30% మంది యువకులే ఉన్నారు. అంటే 30–45 ఏళ్ల వయస్సు వారన్నమాట. సెకండ్ వేవ్‌లో యువకులు కూడా ఎక్కువగా వైరస్ బారినపడుతున్నారు. అలాగే చిన్నపిల్లల ద్వారా పెద్దలకు సోకుతోంది. పిల్లలకు వైరస్ కనిపించదు కానీ వారు పెద్దలకు వ్యాపింపజేస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: రెమిడెసివిర్, తుసిలిజు మాబ్... ఇప్పుడు వీటికున్న క్రేజే వేరు. వీటిని కరోనా రోగులపాలిట అపర సంజీవనిగా అందరూ భావి స్తున్నారు. ఇదే కరోనా సీరియస్ రోగులను కాపాడే గొప్ప మందుగా తలపోస్తున్నారు. కానీ ఇలాంటి యాంటీ వైరల్ డ్రగ్స్‌తో ప్రాణాలు నిలపడం సాధ్యం కాదని, వాటిని వాడాల్సిన అవసరమే లేదని తేల్చి చెబుతున్నారు హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు. వాటికోసం పిచ్చెక్కినట్లు బ్లాక్‌లో కొంటూ వేలు లక్షల రూపాయలు వృథా చేసుకుంటున్నారని అంటున్నారు. సెకండ్ వేవ్‌లో పిల్లలతోపాటు యువకులు కూడా ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారని చెప్పారు. గాంధీలో 30 శాతం మంది యువకులే వెంటిలేటర్‌పై ఉన్నారన్నారు. కరోనా చికిత్సకు సంబంధించి వివిధ అంశాలపై ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే... అవసరం లేకున్నా భయంతో ఆక్సిజన్... కరోనా బారిన పడిన అందరికీ ఆక్సిజన్ అవసరం పడదు. అనేక మంది భయాందోళనతో అనవసరం గా వాడుతున్నారు. మా వద్దకు వచ్చే రోగుల్లో 30 శాతం మంది అవసరం లేకపోయినా ఆక్సిజన్ కోసం వస్తున్నారు. వాస్తవంగా ఆక్సిజన్ శాచురేషన్ స్థాయిలను బట్టి వాడాలా లేదా అనే నిర్ధారణకు వస్తాం. ఆక్సిజన్ శాచురేషన్ లెవెల్స్ 85 శాతం కంటే తక్కువగా ఉంటే అత్యంత విషమమైన పరి స్థితుల్లో రోగి ఉన్నట్లు లెక్క. 85–89 మధ్య ఉంటే విషమం, 90–93 శాతం శాచురేషన్ ఉంటే మధ్య స్థాయి, 93–95 వరకు ఉంటే మైల్డ్‌గా ఉన్నట్లు లెక్క. 95 అంతకంటే ఎక్కువగా శ్యాచురేషన్ ఉంటే సాధారణం కింద లెక్క. కానీ శాచురేషన్ స్థాయి 100 శాతం రావడంలేదని, 95 మాత్రమే ఉందని.. ఆక్సిజన్ పెట్టాలని అనేక మంది ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. అందువల్లనే అవసర మైన వారికి కూడా ఆక్సిజన్ దొరకని పరిస్థితి. చాలామంది దమ్ము అని ఆస్పత్రికి వస్తుంటారు.. కానీ వారిని చూస్తే సాధారణంగానే ఉంటారు. వెంటిలేటర్‌పై 30 శాతం మంది యువకులే... గాంధీలో వెంటిలేటర్‌పై ఉన్న వారిలో 30 శాతం మంది యువకులే ఉన్నారు. అంటే 30–45 ఏళ్ల వయస్సు వారన్నమాట. సెకండ్‌వేవ్‌లో యువకులు కూడా ఎక్కువగా వైరస్ బారినపడుతున్నారు. ఇక గతం కంటే ఇప్పుడు డాక్టర్లు ఎక్కువగా వైరస్‌కు గురవుతున్నారు. అలాగే చిన్నపిల్లల ద్వారా పెద ్దలకు సోకుతోంది. పిల్లలకు వైరస్ కనిపించదు కానీ వారు పెద్దలకు వ్యాపింపజేస్తున్నారు. అందుకే ప్రభుత్వం పాఠశాలు, కాలేజీలను మూసేసింది. సీరియస్ కేసులను తగ్గించలేదు రెమిడెసివిర్, తుసిలిజుమాబ్, ప్లాస్మాలు వాడితే కరోనా తగ్గుతుందన్న రుజువు లేనేలేదు. రెమిడెసివిర్‌ను వాడాల్సిన అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చెప్పింది. సీరియస్ రోగులను అది ఏమాత్రం సాధారణ స్థితికి తీసుకురాలేదు. రెమిడెసివిర్ కావాలని రోగులే ఎక్కువగా అడుగుతున్నారు. అది ఇస్తేనే సరైన వైద్యంగా భావిస్తున్నారు. దీనిపై జనాల్లో పిచ్చి అభిప్రాయాలు ఉన్నాయి. ఈ ఇంజెక్షన్ ప్రాణాలను ఏమీ కాపాడదు. యాంటీ వైరల్ డ్రగ్స్ అయిన రెమిడెసివిర్, తుసిలిజుమాబ్, ఫావిపిరావిర్‌లతో ప్రయోజనం లేదు. తుసి లిజుమాబ్‌ను డాక్టర్ నిర్ణయం మేరకు అత్యంత అరుదైన కేసుల్లోనే వాడాలి. ఈ మందు ఒక శాతం మందిలో కూడా అవసరం పడదు. అయితే రోగుల సంతృప్తి కోసం మాత్రమే ఇస్తున్నారు. సివియర్ కేసుల్లో స్టెరాయిడ్ చికిత్స... కరోనా లక్షణాలను బట్టే చికిత్స ఉంటుంది. సాధారణ కేసుల్లో డాక్టర్ సూచనల మేరకు మందులు వాడితే సరిపోతుంది. సీరియస్ కేసుల్లో స్టెరాయిడ్స్, యాంటీ ప్లేట్లెట్ డ్రగ్స్, యాంటీ కోయాగ్లెన్స్ మందులు అవసరాన్ని బట్టి వాడాలి. ఏ సమయంలో ఇవ్వాలో వాటిని అప్పుడు ఇస్తేనే సరిగా పనిచేస్తాయి. సెకండ్ వేవ్‌లో వైరస్ విజృంభణ అధికం... మొదటి వేవ్ కంటే సెకండ్ వేవ్ తీవ్రంగా ఉంది. ట్రిపుల్ మ్యుటేషన్ రాష్ట్రంలో గుర్తించలేదు. డబుల్ మ్యుటెంట్ వైరస్‌లైతే ఉన్నాయి. దీంతో వైరస్ ఇన్ఫెక్షన్ రేటు అధికంగా ఉంది. కుటుంబంలో ఒకరికి వస్తే ఇతరులకు వేగంగా వ్యాపిస్తుంది. దీంతో చాలామంది వైరస్ బారిన పడుతున్నారు. వందలో 80 మందికి ఇంట్లోనే రికవరీ అవుతుంది. మిగిలిన వారిలో ఐదుగురికి మాత్రమే ఆక్సిజన్ అవసరం పడుతుంది. వైరస్ విజృంభణ వల్ల అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ ఇప్పుడు కరోనా చికిత్సలకు అనుమతి వచ్చింది. కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు పడకలు నిండుతున్నాయి. కేసుల సంఖ్య ఎక్కువుంది కాబట్టి అందులో సివియర్ కేసులు కూడా ఎక్కువగానే ఉన్నాయి. మూడు వారాల్లో వైరస్ తగ్గుముఖం పడుతుందని భావిస్తున్నాం. టీకా వేసుకోండి... జాగ్రత్తలు పాటించండి అనవసరంగా బయటకు పోవద్దు. సినిమాలు, పబ్స్, రెస్టారెంట్లు, బార్లకు వెళ్లొద్దు. అత్యవసరమైతే తప్ప శుభకార్యాలకు వెళ్లొద్దు. బర్త్‌డే పార్టీలు చేసుకోవద్దు. పండుగలను తక్కువ మందితో జాగ్రత్తలు తీసుకొని చేసుకో వాలి. ముక్కు, నోరు పూర్తిగా మూసుకునేలా మాస్క్ పెట్టుకోవాలి. తరచుగా చేతులు శుభ్రం చేసుకోవాలి. ఏ కంపెనీ వ్యాక్సిన్ అని చూడకుండా ఏది అందుబాటులో ఉంటే దాన్ని వేసుకోవాలి. కరోనా నియంత్రణలో ఇవే కీలకమైన అంశాలు. -గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావుతో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ