
సాక్షి, అమరావతి: కోవిడ్ పేషెంట్లకు ఆక్సిజన్ అందించేందుకు ఏపీఎస్ ఆర్టీసీ చర్యలు చేపట్టింది. వెన్నెల స్లీపర్, ఏసీ బస్సుల్లో ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆస్పత్రుల్లో బెడ్లు కొరత ఉన్న ప్రాంతాల్లో కోవిడ్ పేషెంట్లకు బస్సుల్లోనే వైద్యసేవలు అందించాలని నిర్ణయం తీసుకుంది. ప్రయోగాత్మకంగా వెన్నెల బస్సులో 10 ఆక్సిజన్ బెడ్లు ఆర్టీసీ ఏర్పాటు చేసింది.
ఒక్కో ఆర్టీసీ స్లీపర్ బస్సులో 10 మంది పేషెంట్లకు చికిత్స అందిస్తామని రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఆస్పత్రులు అందుబాటులోలేని ప్రాంతాల్లో ఆక్సిజన్ బస్సులు ద్వారా సేవలు అందిస్తామని మంత్రి వెల్లడించారు.
చదవండి: ఏపీలో టెన్త్ పరీక్షలు వాయిదా
ఆనందయ్య మందుపై కేంద్రం అభిప్రాయం ఏంటో?: ఏపీ హైకోర్టు
Comments
Please login to add a commentAdd a comment